వాట్సాప్ యూజర్లకు నిపుణుల హెచ్చరిక | Your WhatsApp chats never get deleted actually | Sakshi
Sakshi News home page

వాట్సాప్ యూజర్లకు నిపుణుల హెచ్చరిక

Published Sat, Jul 30 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

వాట్సాప్ యూజర్లకు నిపుణుల హెచ్చరిక

వాట్సాప్ యూజర్లకు నిపుణుల హెచ్చరిక

న్యూఢిల్లీ : కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ మెసేజింగ్ ను వాడుతున్నారా..? అయితే ఈ ప్లాట్ఫామ్పై సందేశాలు పంపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలంటున్నారు సెక్యురిటీ నిపుణులు. డిజిటల్ సందేశాల ప్రైవేసీ కోసం వాట్సాప్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొచ్చినా అది కేవలం మూడో వ్యక్తి బారినుంచే కాపాడుతుందట. పూర్తిగా మెసేజ్ల ప్రొటెక్షన్ కు ఉపయోగపడదంట. యూజర్లు డిలీట్ చేసిన మెనేజ్లు వెంటనే తమ ఫోన్లనుంచి తొలిగిపోవని  యాపిల్ ఐఓఎస్ సెక్యురిటీ నిపుణుడు జోనాథన్ ఓ సంచలన వార్తను తెలియజేశారు. స్క్రీన్పై వెంటనే కనిపించకుండా పోయినా.. యూజర్ల స్మార్ట్ఫోన్ లో అవి అలానే సేవ్ అయి ఉంటాయని వెల్లడించారు.

యాప్ తాజా వెర్షన్ లో డిలీట్, క్లియర్, ఆర్కైవ్ చేసిన , క్లియర్ ఆల్ చాట్స్ అన్న పర్మినెంట్గా డిలీట్ కావని పేర్కొన్నారు. అలా చేసిన మెసేజ్లను ఫోరెన్సిక్ ద్వారా గుర్తించి టెస్ట్ కూడా చేశామన్నారు. ఫోరెన్సిక్, రికవరీ సాప్ట్వేర్ ద్వారా డేటాను రికవరీ చేసుకోవచ్చన్నారు. ఎస్క్యూ లైట్ లైబ్రరీని తాజా యాప్ కోడ్ కోసం వాట్సాప్ వాడుతుందని, ఆ లైబ్రరీ వాట్సాప్ చాట్ ను పూర్తిగా డిలీట్ కాకుండా చూస్తుందన్నారు.  వాట్సాప్ చాట్ మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేయాలంటే, వాట్సాప్ను ఫోన్ నుంచి పూర్తిగా తొలగించే మార్గమమే ఉత్తమని ఆయన సూచించారు. అప్పుడైతేనే యూజర్లు డిలీట్ చేసిన చాట్స్ అన్నీ పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement