chats
-
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు .. తెలిస్తే ఫుల్ ఖుషీ అవ్వాల్సిందే!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇప్పటికే వినియోగదారులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్న వాట్సాప్ తాజాగా సీక్రెట్ కోడ్‌తో పాటు ఇతర ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ కొత్త ఫీచర్లు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో తెలుసా? వాట్సాప్ త్వరలో సీక్రెట్ కోడ్ ఫీచర్, సెర్చ్ ఫీచర్ ఫర్ అప్డేట్ ట్యాబ్, పిన్న్డ్ మెసేజెస్,రీడైజన్చాట్, ఐపీ ప్రైవసీ ఫీచర్లపై పనిచేస్తుంది. మరికొద్ది రోజుల్లో సీక్రెట్ కోడ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మిగిలిన ఫీచర్లు అప్డేట్ కానున్నాయి. వాట్సాప్ అప్డేట్లను అందిచే వీబీటా ఇన్ఫో తాజాగా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లోని ఐదు ఫీచర్ల వివరాల్ని వెలుగులోకి తెచ్చింది. సీక్రెట్ కోడ్ ఫీచర్ ఫోన్లో మెయిన్ పాస్వర్డ్ ఎలా ఉందో.. ఇప్పుడు వాట్సాప్‌లోని చాట్లకు పిన్, బయోమెట్రిక్ అథంటికేషన్‌ను అందుబాటులోకి తేనుంది. తద్వారా, ఫోన్లో మీరు చేసిన పర్సనల్ చాటింగ్, ఫోటోలు, వీడియోలు ఇతరులు చూసే వీలుండదు. అంతేకాదు, మీరు లాక్ చేసిన ఆ చాటింగ్ సమాచారం అంతా సపరేట్ సెక్షన్లో కనిపించనుంది. ఒకవేళ అగంతకులు ఆ చాట్‌ను ఓపెన్ చేసి చూడాలంటే మీరు ఎంటర్ చేసిన పిన్ లేదంటే బయో మెట్రిక్ అథంటికేషన్ ఇవాల్సి ఉంటుంది. సెర్చ్ ఫీచర్ ఈ ఫీచర్ ఇప్పటికే ఎంపిక చేసిన యూజర్లు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. తర్వలోనే అందరికి అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సాయంతో మీరు ఫాలో అయ్యే వాట్సాప్ ఛానెల్స్, వెరిఫైడ్ చానెల్స్‌లో ఎవరెవరు ఏం స్టేటస్ పెట్టారో సెర్చ్ బటన్ ఫీచర్లో పేరు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. పిన్న్డ్ మెసేజెస్ పిన్న్డ్ మెసేజెస్ ఈ ఫీచర్‌తో సాయంతో ముఖ్యమైన మెసేజ్‌లను చాట్ కన్వర్షన్లో మీకు కనపడేలా పిన్ చేయొచ్చు. రీడిజైన్ చాట్ అటాచ్మెంట్ ఈ రీడిజైన్ చాట్ అటాచ్మెంట్ అప్డేట్తో వాట్సాప్ ఫ్రెష్‌లుక్‌తో కనిపించనుంది. వాట్సాప్‌లో వీడియో, కంటెంట్, ఆడియో ఫైల్స్ షేరింగ్ చేసే విధానం మారనుంది. ఐపీ అడ్రస్‌ను కనిపెట్టలేరు అగంతకులు మీ వాట్సాప్ ఐపీ అడ్రస్ ఏంటనేది కనిపెట్టలేరు. యూజర్ల సాధారణంగా ఐపీ అడ్రస్‌తో వాట్సాప్‌లో మనం చేసే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఇతర వివరాల్ని సేకరించవచ్చు. అయితే తాజాగా అప్డేట్తో ఐపీ అడ్రస్ గుర్తించలేని విధంగా సెక్యూరిటీ ఫీచర్‌ను అప్డేట్ చేయనుంది. -
లిక్కర్ స్కాం లో మరో సంచలన లేఖ విడుదల చేసిన సుకేష్
-
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్ బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు కొత్త అప్ డేట్ అందించింది. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ తోఎప్పటికీ మ్యూట్ చేసే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్ లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని ట్వీట్ చేసింది. వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ ఫీచర్‌ను చివరకు లాంచ్ చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ క్రొత్త ఫీచర్ ప్రజలు ఆ ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపులనుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇదిసహాయపడుతుంది. చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపులనుంచి నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు. అవసరమైతే దీన్ని అన్‌మ్యూటింగ్ అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. You can now mute a chat forever 🤫 pic.twitter.com/DlH7jAt6P8 — WhatsApp Inc. (@WhatsApp) October 23, 2020 -
మన వాట్సాప్ చాట్ సురక్షితమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు మాదక ద్రవ్యాల కేసుగా మారడం, ఇందులో వాట్సాప్ చాట్ కీలకంగా మారిన నేపథ్యంలో సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ స్పందించింది. ఆపరేటింగ్ సిస్టమ్ తయారీదారులు అందించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని, దీంతో యూజర్ల భదత్రకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది. వాట్సాప్ మెసేజ్ లు పూర్తిగా సురక్షితమని, ధర్డ్ పార్టీలు వాటిని యాక్సెస్ చేయలేవంటూ యూజర్లకు భరోసా ఇస్తోంది. ఈ మేరకు వాట్సాప్ ఒక ప్రకటన విడుదల చేసింది. (డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) వాట్సాప్ సందేశాలకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ అందిస్తున్నామని తద్వారా మీరు, మీరు కమ్యూనికేట్ చేస్తున్నవ్యక్తి మాత్రమే ఆయా సందేశాలను చదవగలరు. తప్ప, మధ్యలో ఎవరూ దీన్ని యాక్సెస్ చేయలేరని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్‌ను మాత్రమే వాట్సాప్‌లో ఉపయోగిస్తారు కనుక మిగతా సమాచారం లీక్ అయ్యే అవకాశం లేదని వాట్సాప్ ప్రతినిది ఒకరు తెలిపారు. అలాగే ఫోన్ డాటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా బలమైన పాస్వర్డ్లు లేదా బయోమెట్రిక్ ఐడీలు వంటి అన్ని భద్రతా ఫీచర్లను సద్వినియోగం చేసుకోవాలని యూజర్లకు విజ్ఞప్తి చేశారు. కాగా సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తోపాటు, టాలెంట్ ఏజెంట్ జయ సాహా సెల్‌ఫోన్ నుంచి సేకరించిన 2017 నాటి వాట్సాప్ చాట్ వ్యవహాం హాట్ టాపిక్ గా మారింది. ఈ చాట్ల ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్ హీరోయిన్స్ సారా ఆలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి నటులకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఈ ప్రకటన జారీ చేసింది. -
వాట్సాప్ యూజర్లకు నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ మెసేజింగ్ ను వాడుతున్నారా..? అయితే ఈ ప్లాట్‌ఫామ్‌పై సందేశాలు పంపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలంటున్నారు సెక్యురిటీ నిపుణులు. డిజిటల్ సందేశాల ప్రైవేసీ కోసం వాట్సాప్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొచ్చినా అది కేవలం మూడో వ్యక్తి బారినుంచే కాపాడుతుందట. పూర్తిగా మెసేజ్‌ల ప్రొటెక్షన్ కు ఉపయోగపడదంట. యూజర్లు డిలీట్ చేసిన మెనేజ్‌లు వెంటనే తమ ఫోన్లనుంచి తొలిగిపోవని యాపిల్ ఐఓఎస్ సెక్యురిటీ నిపుణుడు జోనాథన్ ఓ సంచలన వార్తను తెలియజేశారు. స్క్రీన్‌పై వెంటనే కనిపించకుండా పోయినా.. యూజర్ల స్మార్ట్‌ఫోన్ లో అవి అలానే సేవ్ అయి ఉంటాయని వెల్లడించారు. యాప్ తాజా వెర్షన్ లో డిలీట్, క్లియర్, ఆర్కైవ్ చేసిన , క్లియర్ ఆల్ చాట్స్ అన్న పర్మినెంట్‌గా డిలీట్ కావని పేర్కొన్నారు. అలా చేసిన మెసేజ్‌లను ఫోరెన్సిక్ ద్వారా గుర్తించి టెస్ట్ కూడా చేశామన్నారు. ఫోరెన్సిక్, రికవరీ సాప్ట్వేర్ ద్వారా డేటాను రికవరీ చేసుకోవచ్చన్నారు. ఎస్క్యూ లైట్ లైబ్రరీని తాజా యాప్ కోడ్ కోసం వాట్సాప్ వాడుతుందని, ఆ లైబ్రరీ వాట్సాప్ చాట్ ను పూర్తిగా డిలీట్ కాకుండా చూస్తుందన్నారు. వాట్సాప్ చాట్ మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేయాలంటే, వాట్సాప్‌ను ఫోన్ నుంచి పూర్తిగా తొలగించే మార్గమమే ఉత్తమని ఆయన సూచించారు. అప్పుడైతేనే యూజర్లు డిలీట్ చేసిన చాట్స్ అన్నీ పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు.