మామను కిడ్నాప్ చేసిన అల్లుడు | youth kidnaps father in law, gets arrested | Sakshi
Sakshi News home page

మామను కిడ్నాప్ చేసిన అల్లుడు

Published Sat, Oct 29 2016 2:18 PM | Last Updated on Sun, Sep 2 2018 4:41 PM

youth kidnaps father in law, gets arrested

తన మీద గృహహింస కేసు పెట్టించారన్న కోపంతో మామను కిడ్నాప్ చేశాడో అల్లుడు. కిడ్నాపైన రమేష్ సింగ్ సోలంకిని పోలీసులు రక్షించి, అతడి అల్లుడు భవానీసింగ్ రాజ్పుత్ను అరెస్టుచేశారు. అతడితో పాటు అతడికి సాయం చేసిన శ్రవణ్ సింగ్ రాజ్పుత్, నాథూరామ్ సుతార్ అనే ఇద్దరిని కూడా అరెస్టుచేశారు. నిందితుడు భవానీసింగ్ సోదరిని రమేష్ సోదరుడు హర్మీత్ సింగ్ సోలంకి పెళ్లి చేసుకోగా.. రమేష్ కూతురు భన్వర్ను భవానీసింగ్ పెళ్లి చేసుకున్నాడు.

కొన్నాళ్ల క్రితం భవానీసింగ్ సోదరి హర్మీత్, అతడి కుటుంబ సభ్యులపై గృహహింస చట్టం కింద రాజస్థాన్లో కేసు పెట్టింది. దీంతో హర్మీత్, రమేష్ కలిసి భవానీసింగ్పై భన్వర్తో అలాంటి కేసే పెట్టించారు. దీంతో కోసం వచ్చిన భవానీసింగ్.. శుక్రవారం సాయంత్రం రమేష్ సింగ్ను అతడి ఇంటివద్ద నుంచి కారులో కిడ్నాప్ చేశాడు. విషయం తెలిసిన క్రైం బ్రాంచి పోలీసులు భవానీసింగ్ సెల్ఫోన్ సిగ్నళ్ల ద్వారా అతడు ఎక్కడ ఉన్నదీ తెలుసుకున్నారు. ఎక్స్ప్రెస్ వే సమీపంలో నిందితుడిని అతడు ఉపయోగించిన కారుతో సహా పట్టుకున్నారు. అతడిని, కిడ్నాప్నకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టుచేసి, రమేష్సింగ్ను విడిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement