మీడియాపై గంగూలీ చిందులు!
Published Fri, Dec 6 2013 4:39 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీ సహనం కోల్పోయి మీడియాపై చిందులు వేశారు. ఈ కేసులో మీడియా ఆయన స్పందనను కోరగా ఆగ్రహంతో ఊగిపోయారు. 'నన్ను డిస్టర్బ్ చేయకండి', 'నన్ను డిస్టర్బ్ చేయకండి' ఇక చాలు నేను చాలా ఓపికపట్టాను అంటూ మీడియాను ఉద్దేశించి మీడియా రిపోర్టర్లపై ఆయ నివాసంలో మండిపడ్డారు.
లైంగిక ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిలు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. లీ మెరిడియన్ హోటల్ గదిలో తన జూనియర్ లాయర్ తో ఏకే గంగూలీ అనుచితంగా ప్రవర్తించారని వాగ్మూలాన్ని సేకరించారు.
ఈ ఘటన 2012 సంవత్సరం డిసెంబర్ 24 తేదిన జరిగింది. ఏకే గంగూలీ నేరారోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. అనుచితంగా ప్రవర్తించిన గంగూలీపై తగిన చర్యను తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మమతా బెనర్జీ లేఖ రాశారు. అంతేకాక పశ్చిమ బెంగాల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పదవి నుంచి తప్పుకోవాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
Advertisement