డబ్యూబీహెచ్ఆర్సీ పదవికి గంగూలీ రాజీనామా | justice ak ganguly resigns chairman of WHRC post | Sakshi
Sakshi News home page

డబ్యూబీహెచ్ఆర్సీ పదవికి గంగూలీ రాజీనామా

Published Mon, Jan 6 2014 7:18 PM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM

డబ్యూబీహెచ్ఆర్సీ పదవికి గంగూలీ రాజీనామా - Sakshi

డబ్యూబీహెచ్ఆర్సీ పదవికి గంగూలీ రాజీనామా

కోల్కతా: న్యాయ శాస్త్ర విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గంగూలీ పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిటీ చైర్మన్(డబ్యూబీహెచ్ఆర్సీ) పదవికి రాజీనామా చేశారు.ఈ రోజు రాష్ట్ర గవర్నర్ ను కలిసిన ఆయన రాజీనామా లేఖను సమర్పించారు.  నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్ లో గౌరవ ప్రొఫెసర్ పదవికి శుక్రవారం రాజీనామా చేసిన ఆయన మానవ హక్కుల చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఏకే గంగూలీ ప్రవర్తన అనుచితమైనదేనని, లైంగిక స్వభావం కలిగి ఉన్నదని  సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అభిశంసించడానికి కారణమైన ఫిర్యాదును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో గంగూలీ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement