ముంబై: లోకేష్ మెషీన్స్ ప్రిఫరెన్షియల్ షేర్లు, వారెంట్లు జారీ చేయడం ద్వారా సుమారు రూ. 20 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. రూ. 50 ధరకి 10 లక్షలు ప్రిఫరెన్షియల్ షేర్లు, 31 లక్షల వారెంట్లను ఒకేసారీ లేదా విడతల వారీగా జారీ చేయడం ద్వారా నిధులు సేకరించడానికి ఈజీఎం ఆమోదం తెలిపింది. ఈ నిధులతో రుణ భారం తగ్గించుకునే యోచనలో కంపెనీ ఉంది.