కత్తి పట్టిన హీరోయిన్‌.. | Shruti Haasan play main role in sanghamitra movie | Sakshi
Sakshi News home page

కత్తి పట్టిన హీరోయిన్‌..

Published Wed, Apr 19 2017 6:22 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

కత్తి పట్టిన హీరోయిన్‌..

కత్తి పట్టిన హీరోయిన్‌..

చెన్నై: ప్రముఖ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ కత్తి చేత పట్టారు. ఇప్పటి వరకూ హీరోలతో డ్యూయెట్లు పాడడం, అందాలు ఆరబోయడం వరకే పరిమితం అనుకున్న వారికి తాజాగా తన కత్తిలాంటి నటనతో బదులు చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. యుద్ధభూమిలో వీరవిహారం చేసే వీరనారిగా కనిపించనున్నారు. పోరు భూమిలో పోరాడి గెలవాలంటే కత్తి చేతపట్టాలి. కత్తి ఝళిపించటానికి మాత్రం కచ్చితంగా శిక్షణ అవసరం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అదే చేస్తున్నారు. అదీ ఆషామాషీగా కాదు.

ఒక కత్తిసాము నిపుణుడి వద్ద లండన్‌లో శిక్షణ పొందుతున్నారు. ఇదంతా తాను నటించనున్న భారీ చారిత్రక కథా చిత్రం కోసమే. శ్రుతిహాసన్‌ సుందర్‌.సి దర్శకత్వంలో ‘సంఘమిత్ర’ అనే చిత్రంలో యువరాణిగా నటించునున్న విషయం తెలిసిందే. జయం రవి, ఆర్య కథానాయకులుగా నటించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది. ఇందులో పాత్రకు న్యాయం చేయడానికి నటి శ్రుతిహాసన్‌ చాలానే శ్రమిస్తున్నారు. లండన్‌లో కత్తి సాములో శిక్షణ పొందుతున్నారు.

ఈ అందాలభామ కత్తి విన్యాసాలు సంఘమిత్ర చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయన్న మాట. ఆ మధ్య రుద్రమదేవి చిత్రం కోసం నటి అనుష్క కత్తిసాము కోసం కసరత్తులు చేసి వెండితెరపై అలరించారు. తాజాగా నటి శ్రుతి అలా కత్తి చేత పట్టి రణభూమిలో కదం తొక్కనున్నారన్నమాట. కాగా, ప్రస్తుతం తన తండ్రితో కలిసి శభాష్‌నాయుడు చిత్రంతో పాటు, ఒక హిందీ చిత్రాన్ని శ్రుతి పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement