అంతరిక్ష శోధనకు అమెరికా అండ | america helps indian space reasearch | Sakshi
Sakshi News home page

అంతరిక్ష శోధనకు అమెరికా అండ

Published Fri, Mar 4 2016 12:39 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అంతరిక్ష శోధనకు అమెరికా అండ - Sakshi

అంతరిక్ష శోధనకు అమెరికా అండ

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ‘అమెరికన్లుగా భారత్ సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. అలాగే భారతీయులపై కూడా. మీకు స్నేహితులుగా ఉండటం మాకు గర్వకారణం. మీ కలల దేశాన్ని నిర్మించుకునే క్రతువులో భాగస్వాములమైనందుకూ మేము గర్వంగానే భావిస్తాం’ అన్నారు. అమెరికా, భారత్‌ల సంబంధాలు ఈ శతాబ్ది గతిని నిర్దేశించేవని ఒబామా ఇప్పటికే స్పష్టం చేశారు. గత ఏడాది పర్యటనలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ఉన్న సారూప్యాలను కూడా ఆయన విపులీకరించారు. రెండు దేశాలూ విజ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని ఆస్వాదిస్తాయని చెప్పారు.

 ‘భారత దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఒక ప్రాజెక్టు విజయవంతమైన ప్రతిసారి ‘వాట్ నెక్స్‌ట్?’ అని ప్రశ్నించేవారు. భారత్, అమెరికా అంతరిక్ష సహకారం విషయంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే... కలలను సాకారం చేసుకోవడం అని చెప్పాలి. ఇరుదేశాల భాగస్వామ్యం అంగారకుడిని జయించడంతో ఆగిపోదు... అంతకంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలదు.’

 నాసా (అమెరికా) డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ దావా న్యూమ్యాన్ చెప్పిన మాటలివి. 2030 నాటికల్లా అరుణ గ్రహంపైకి వ్యోమగామిని పంపేందుకు సిద్ధమవుతున్న అమెరికా ఇందుకోసం భారత్‌తో కలిసి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇటీవల భారత్ పర్యటన సందర్భంగా డాక్టర్ దావా న్యూమ్యాన్ ఈ అంశాలను వివరించారు. అవి ఆమె మాటలలోనే:
 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మంగళ్‌యాన్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పంపిన మేవెన్‌లు 2014 సెప్టెంబరులో రెండురోజుల తేడాతో ఆ గ్రహపు కక్ష్యలో విజయవంతంగా తిరుగుతున్న విషయం తెలిసిందే. అంగారకుడి మీది వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు ఈ రెండు ఉపగ్రహాలు పని చేస్తూ ఇరుదేశాల అంచనాలు, ఆకాంక్షలను పూర్తి చేస్తున్నాయి. అంతేకాదు... ఇస్రో, నాసాల మార్స్ వర్కింగ్ గ్రూప్ కూడా చాలా చురుకుగా పనిచేస్తోంది. బెంగళూరులో ఇటీవల ఈ రెండు బృందాలు ముఖాముఖి కలుసుకున్నాయి కూడా. భవిష్యత్తులో మామ్, మేవెన్‌లతోపాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో ఎలా ఒకరికొకరు సహకరించుకోవాలన్న అంశంపై వీరు చర్చలు జరిపారు.

 ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టడంతోపాటు ప్రపంచ ఆహార భద్రత, ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో ఉపయోగపడగల నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (నిసార్) ప్రయోగానికి ఇరుదేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇరుదేశాలకూ ఇది చాలా ప్రాముఖ్యం కలిగిన ప్రాజెక్టు. భారత్, అమెరికాలు రెండూ తమ శక్తిసామర్థ్యాల మేరకు ఈ ప్రాజెక్టు విజయవంతం చేయడానికి ప్రయత్నం సాగిస్తున్నాయి. కలలను సాకారం చేసుకోవడం అంటే ఇదే. ఇదొక్కటే కాదు... రెండు దేశాలు కలసికట్టుగా చేపడుతున్న ప్రాజెక్టుల జాబితా చాలానే ఉంది. ఇరుదేశాల పరిశోధకుల ఎక్స్ఛేంజి ప్రోగ్రామ్ వీటిల్లో ఒకటైతే... వీరిద్దరూ నాసా విజిబుల్/ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ ఇన్‌స్ట్రుమెంట్‌ను ఇస్రో విమానంలో తీసుకెళ్లి భారత్‌లోని పలు ప్రదేశాలపై పరిశీలనలు జరపడం మరొకటి. గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వచ్చే నెల వరకూ కొనసాగనుంది.

 అంతరిక్ష రంగంలో భారత్, అమెరికాల సహకారానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. నాసా, ఇస్రోలు రెండూ ఈ దిశగా ఎంతో పురోగతి సాధించాయని చెప్పకతప్పదు. తాము చేపట్టబోయే కొన్ని ప్రయోగాల గురించి ముందుగానే సమాచారం అందించడం, ఆయా ప్రాజెక్టుల్లో ఉమ్మడి ప్రయోజనాలు గుర్తించడం, సహకారానికి అవకాశమున్న అంశాల పరిశీలన కూడా జరుగుతోంది. అన్ని స్థాయిల్లోనూ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా, పోటీతత్వంతో పనిచేస్తూ ఇరుదేశాలూ అసలు సిసలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.
 అంతరిక్ష రంగంలో భారత్ అమెరికాల మధ్య సంబంధాలు ఈనాటివి కావు. 1963లో నాసాకు చెందిన నైక్ అపాచే సౌండింగ్ రాకెట్‌ను భారత్ భూభాగం నుంచి ప్రయోగించినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది.

భవిష్యత్తు లోనూ ఎర్త్, స్పేస్ సెన్సైస్, డీప్ స్పేస్ కమ్యూనికేషన్స్ రంగా లతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల విషయంలోనూ పరస్పర సహకారానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయనే మా నమ్మకం. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషన్‌ల వేవ్ అబ్జర్వేటరీ నిర్మిస్తా మని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలి ప్రకటన మాకు ఎంతో ఆసక్తిని కలిగించింది. ఈ శతాబ్దపు ఆవిష్కరణ గురుత్వ తరంగాలపై విస్తృత అధ్యయనానికి కలసికట్టుగా పనిచేసే మరో అవకాశం ఇది. ఐన్‌స్టీన్ వందేళ్ల క్రితం కన్నకల ఇలా సాకారమవుతోందన్న మాట. ఇందులో భారత్ అమెరికా శాస్త్రవేత్తలు పాలుపంచుకోవడం... మనం కలసికట్టుగా ఎలాంటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సమాధానాలు వెతకగల మన్న విశ్వాసాన్ని కల్పిస్తుంది.

 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ‘అమెరికన్లుగా భారత్ సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. అలాగే భారతీ యులపై కూడా. మీకు స్నేహితులుగా ఉండటం మాకు గర్వకారణం. మీ కలల దేశాన్ని నిర్మించుకునే క్రతువులో భాగస్వాములమైనందుకూ మేము గర్విస్తాం’ అన్నారు. అమెరికా, భారత్‌ల సంబంధాలు ఈ శతాబ్ద గతిని నిర్దేశించేవని ఒబామా ఇప్పటికే స్పష్టం చేశారు. గత ఏడాది పర్యటనలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ఉన్న సారూప్యాలను కూడా ఆయన విపులీకరించారు. రెండు దేశాలూ విజ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని ఆస్వాదిస్తాయని చెప్పారు. ఇరువురూ చేతులు కలిపితే అంతరిక్ష రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు సాధ్యమని చంద్ర, అంగారక గ్రహాలకు ఆవలి విశ్వ రహస్యాలను ఛేదించడమూ వీలవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో కలసి జారీ చేసిన ఉమ్మడి ప్రకటనలో కూడా అంతరిక్ష రంగంలో సహకారాన్ని, వాణిజ్య సంబం ధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తాలూకు ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. నాసా తరఫున నేను ఇటీవలే భారత్‌లో పర్యటించగా... మరికొన్ని నెలల్లో నాసా అడ్మిని స్ట్రేటర్ చార్లెస్ బౌల్డెన్ ఆసియా పసిఫిక్ రిమోట్ సెన్సింగ్ సింపోజియంలో పాల్గొనేందుకు రానున్నారు. గత ఏడాది సెప్టెంబరులో అమెరికా, భారత్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం సరైన దిశలోనే ఉన్నదనేందుకు మా పర్యటనలే నిదర్శనం.
 గిళియార్ గోపాలకృష్ణ మయ్యా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement