
మూన్‌లైట్ డిన్నర్.. అంటే చాలామంది జంటలకు ఓ మరపురాని అనుభూతి.. అలా ఆకాశంలో చంద్రుడిని చూసుకుంటూ.. ఒకరినొకరు చూసుకుంటూ భోజనం చేస్తే ఆ మజానే వేరు..! ఇంతకంటే ప్రత్యేకంగా.. విభిన్నంగా.. అంతరిక్షంలో డిన్నర్‌కి వెళ్తే.. అక్కడ డిన్నర్ ఎలా చేస్తారు.. హోటల్ ఏమన్నా ఉందా అక్కడ అనే ప్రశ్నలు వేసుకుంటున్నారా..? అవును అక్కడ నిజంగా ఓ హోటల్‌ను కట్టనున్నారు. 2021 నాటికి హోటల్ పూర్తిగా సిద్ధం కాబోతోంది. 2022 నాటికి మీరు కూడా ఆ హోటల్‌కు వెళ్లి హాయిగా గడిపిరావొచ్చు.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓరియాన్ స్పాన్ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలి ‘స్పేస్ హోటల్’ నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. భూమి చుట్టూ ఈ హోటల్ తిరుగుతూ ఉంటుందట. అక్కడి నుంచి సున్నా గురుత్వాకర్షణ శక్తిలో భూమి అందాలను వీక్షించొచ్చు. అయితే 12 రోజుల పాటు అక్కడ బస చేసేందుకు ఎంతో తెలుసా.. రూ.61 కోట్లు మాత్రమే. సిబ్బంది సహా ఒకేసారి ఆరుగురు వెళ్లిరావొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment