న్యూజిలాండ్‌లో బతుకమ్మ
హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగ న్యూజిలాం డ్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ, న్యూజిలాండ్ తెలంగాణ సంఘం ఆదివారం ఆక్లాండ్ సిటీలో సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బతుకమ్మలను పేర్చే కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కవిత పాడిన బతుకమ్మ పాటలకు వారంతా కోరస్ ఇచ్చారు. కవిత ఆక్లాండ్‌కు రావడం సంతోషంగా ఉందని పలువురు ప్రవాస తెలంగాణ మహిళలు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూజిలాండ్ తెలంగాణ సంఘం అధ్యక్షుడు కల్యాణ్‌రావు కానుగంటి, ప్రధాన కార్యదర్శి దయాకర్ బచ్చు, కోశాధికారి దయానంద్ కటకం తదితరులు పాల్గొన్నారు.