
గ్రహం అనుగ్రహం శుక్రవారం, 01 జనవరి 2016
మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం
మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి బ.సప్తమి రా.8.54 వరకు
నక్షత్రం ఉత్తర రా.8.20 వరకు
వర్జ్యం ..లేదు
దుర్ముహూర్తం ఉ.8.50 నుంచి 9.38 వరకు
తదుపరి ప.12.31 నుంచి 1.21 వరకు
అమృతఘడియలు ప.1.02 నుంచి 3.12 వరకు
సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం : 5.33
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందువినోదాలు. కార్యజయం. ఉద్యోగులకు శుభవార్తలు. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారవృద్ధి.
వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కొత్త ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత వరకూ అనుకూలిస్తాయి.
మిథునం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ధన వ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులుండొచ్చు.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతనోత్సా హంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం అందుతుంది.
సింహం: కొన్ని పనులు నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, సోదరీలతో వివాదాలు కొంతవరకూ తీరతాయి. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు,ఉద్యోగాలు సామాన్యం.
కన్య: దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
తుల: దూరప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ధనలబ్ది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృశ్చికం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి సాధిస్తారు.
మకరం: రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. చేసే వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులుంటాయి. దూరపు బంధువుల కలయిక. వస్తులాభాలు.
కుంభం: పనులు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మీనం: శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం. కార్యసిద్ధి. ఉద్యోగయత్నాలు కలసి వస్తాయి. నూతన వ్యక్తుల పరిచయమవుతారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నూతనోత్సాహం.
- సింహంభట్ల సుబ్బారావు