రత్నాకర్ ఫ్యామిలీకి నాట్స్ 13 వేల డాలర్ల సాయం | NATS raise funds and helps to Ratnakar Shettipally family | Sakshi
Sakshi News home page

రత్నాకర్ ఫ్యామిలీకి నాట్స్ 13 వేల డాలర్ల సాయం

Published Tue, Jun 6 2017 4:39 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

రత్నాకర్ ఫ్యామిలీకి నాట్స్ 13 వేల డాలర్ల సాయం

రత్నాకర్ ఫ్యామిలీకి నాట్స్ 13 వేల డాలర్ల సాయం

డల్లాస్: గత నవంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రత్నాకర్ శెట్టిపల్లి, అతని కుటుంబ సభ్యుల వైద్య సహాయం కొరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 13 వేల డాలర్ల (భారత కరెన్సీలో రూ.8.37 లక్షలు ) నిధులను సమీకరించింది. ఈ మేరకు ఆదివారం ఇర్వింగ్ నగరంలోని 'బిర్యానీ అండ్ మోర్'  రెస్టారెంట్లో చెక్ ను నాట్స్ హెల్ప్ లైన్ టీం స్థానిక టెక్సాస్ స్టేట్ హౌస్ ప్రతినిధి, మాట్ రినాల్డి సమక్షంలో రత్నాకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

రత్నాకర్, అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. నాట్స్ అండతో తమ కుటుంబం కొంత కోలుకునే అవకాశం లభించిందని, వారు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ హౌస్ రెప్రజంటేటివ్ మాట్ రినాల్డి మాట్లాడుతూ.. నాట్స్ సంస్థ తన హెల్ప్ లైన్ ద్వారా చేస్తున్న సేవలను కొనియాడారు. రత్నాకర్ కుటుంబానికి జరిగిన నష్టం చాలా  బాధాకరమని, వారికి నాట్స్ సంస్థ ఎలాంటి సహాయం కావాల్సిన  అండగా ఉంటుందని నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డు డైరెక్టర్స్ డాక్టర్ చౌదరి ఆచంట, రాజేంద్ర మాదాల, నాట్స్ హెల్ప్ లైన్ ముఖ్య కార్యకర్తలు ఆది గెల్లి,  బాపు నూతి, డల్లాస్ చాప్టర్ కో-ఆర్డినేటర్ రామకృష్ణ మార్నేని, మహిళా విభాగం కోఆర్డినేటర్ జ్యోతి వనం, నాట్స్ డల్లాస్ ముఖ్య సభ్యులు కిషోర్ వీరగంధం, రాజా మాగంటి, రవి బొజ్జురి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement