దుబాయ్లో సంక్రాంతి సంబరాలు | Sankranthi Celebrations in UAE | Sakshi
Sakshi News home page

దుబాయ్లో సంక్రాంతి సంబరాలు

Published Tue, Jan 19 2016 6:01 PM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

దుబాయ్లో సంక్రాంతి సంబరాలు - Sakshi

దుబాయ్లో సంక్రాంతి సంబరాలు

దుబాయ్: తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో యు.ఎ.ఇ.లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంగ రంగ వైభవంగా జరిగాయి. రస్ అల్ఖైమా నగరంలో జాతీయ గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు హరిదాసుల సందడి, రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి పళ్లు, బొమ్మల కొలువులతో పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ సంక్రాంతి పండుగను ఆనందోత్సాహలతో జరుపుకున్నారు.


శ్రీ గోదా రంగనాధుల కళ్యాణ మహోత్సవం, సామూహిక విష్ణ సహస్ర నామార్చన కన్నుల పండుగగా జరిగింది. సుమారు వెయ్యి మంది తెలుగు వారు ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. సంస్కృతీ సంప్రదాయాలపై చిన్న పిల్లలకు నిర్వహించిన క్విజ్‌, అన్నమయ్య కీర్తనలు, కూచిపూడి నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు తరంగిణి ప్రెసిడెంట్ సురేష్, వైస్ ప్రెసిడెంట్ మోహన్, కార్యవర్గ సభ్యుల నేతృత్వంలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. చివరలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement