
గ్రహం అనుగ్రహం, శనివారం, జనవరి 2, 2016
గ్రహం అనుగ్రహం శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువుమార్గశిర మాసం
తిథి బ.అష్టమి రా.11.04 వరకు
నక్షత్రం హస్త రా.10.54 వరకు
వర్జ్యం ఉ.5.40 నుంచి 7.25 వరకు
దుర్ముహూర్తం ఉ.6.34 నుంచి 8.01 వరకు
అమృతఘడియలు ప.4.19 నుంచి 6.00 వరకు
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం
తిథి బ.అష్టమి రా.11.04 వరకు
నక్షత్రం హస్త రా.10.54 వరకు
వర్జ్యం ఉ.5.40 నుంచి 7.25 వరకు
దుర్ముహూర్తం ఉ.6.34 నుంచి 8.01 వరకు
అమృతఘడియలు ప.4.19 నుంచి 6.00 వరకు
భవిష్యం
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
వృషభం: మిత్రులతో మాటపట్టింపులు. ధన వ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
మిథునం: చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
కర్కాటకం: శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత నెలకొంటుంది.
సింహం: కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
కన్య: దూరపు బంధువులను కలుసుకుంటారు. విందువినోదాలు. కార్యజయం. వస్తులాభాలు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
తుల: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవరోధాలు కలగవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
ధనుస్సు: బంధువులతో సఖ్యతగా మెలగుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ముందడుగు.
మకరం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధువులు, మిత్రులతో వైరం రావచ్చు. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కుంభం: కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. దుబారా ఖర్చులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగప్రాప్తి. ధనలాభం. యత్నకార్యసిద్ధి కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు.
- సింహంభట్ల సుబ్బారావు