ములుగు: మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగు వెనుకభాగం (ఊరట్టం నుంచి గద్దెలకు వెళ్లే మార్గం మధ్యలో) సుమారు 100 గుడారాలను ఏర్పాటు చేశారు. ఒక్కో గుడారంలో ఫైర్‌సెప్టీ కవర్స్, లైటింగ్, వాటర్, షాంపులు, సబ్బులు, ఒక బెడ్ అందుబాటులో ఉంచుతారు. ప్రతి 10 గుడారాలకు ఒక మొబైల్ టాయిలెట్, ఆరు గుడారాలకు ప్రత్యేక గార్డును నియమిస్తారు.
మహా జాతరకు వచ్చే భక్తులు ఈ గుడారాలను బుకింగ్ చేసుకోవడానికి అటవీశాఖ, ఎకో టూరిజం అదికారులు ప్రత్యేక పేటీఎం నంబర్‌ను కేటాయించారు. 12 గంటల పాటు బస చేయడానికి రూ.1000, 24 గంటల పాటు బస చేయడానికి రూ.2 వేల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఒక్కో గుడారంలో సుమారు ఐదుగురు సభ్యులు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. బుకింగ్ చేసుకోవల్సిన భక్తులు పేటీఎం నంబర్ 9553142346కు చెల్లింపులు చేయవల్సి ఉంటుంది. మిగతా వివరాలకు 8096210513, 9989585287 నంబర్లను సంప్రదించాలి. బుకింగ్ పూర్తయిన సమయంలో పేటీఎం నెంబర్‌కు చెల్లింపులు నిలిపివేయనున్నట్లు ఏకో టూరిజం జిల్లా కో ఆర్డినేటర్ కల్యాణపు సుమన్ , తాడ్వాయి అటవీశాఖ రేంజ్ అధికారి అల్లెం గౌతమ్ తెలిపారు.
భక్తుల తర్జనభర్జన
ఏకోటూరిజం తరఫున ఏర్పాటు చేసిన గుడారాల బుకింగ్ విషయంలో భక్తులు తర్జన భర్జన పడుతున్నారు. అధికారులు పేటీఎం ద్వారా చెల్లింపులు చేయాలని ప్రకటించారు. అయితే ఎన్ని గుడారాలు అందుబాటులో ఉన్నాయనే విషయంపై పేటీఎం ద్వారా పూర్తి సమాచారం భక్తులకు అందే పరిస్థితి లేకుండా పోయింది. శాఖ తరుఫున ప్రత్యేక ఆన్‌లైన్ చెల్లింపులు, రోజు ఖాళీగా ఉండే గుడారాల సంఖ్య బుకింగ్ సమయంలో తమ కేటాయించే గుడారాల నంబర్లను అందుబాటులో ఉంచితే బాగుంటుందని భక్తులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment