tents
-
అన్నేశ్వరమ్మ గుట్టపై గుడిసెలు వేసేందుకు యత్నం
నల్లగొండ: నల్లగొండ పట్టణ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలో ఉన్న అన్నేశ్వరమ్మ గుట్టపై గుడిసెలు వేసేందుకు కొందరు పేదలు యత్నించారు. సుమారు 500 మంది మహిళలు గుట్ట చుట్టూ చేరి తమకు నచ్చిన ప్రాంతంలో ప్లాట్లను ఏర్పాటు చేసుకునేందుకు కర్రలు పాతి చీరలు కట్టి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వారికి అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా మహిళలు అక్కడే కూర్చున్నారు. దీంతో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గుట్టపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చేసేదేమీ లేక పోలీసులు మహిళలను వాహనంలో ఎక్కించి నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టారు. -
శ్రీలంకలో కీలక పరిణామం.. 4 నెలల తర్వాత అలా!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతోంది శ్రీలంక. నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అధ్యక్షుడు, ప్రధాని భవనాలను వేలాది మంది ముట్టడించటంతో అప్పటి ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడి భవనం సమీపంలోని ప్రధాన నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు నిరసనకారులు. దేశ రాజధాని, గాలేఫోస్ సీఫ్రంట్‌లోని టెంట్లను తొలగిస్తున్నట్లు యూనివర్సిటీ విద్యార్థులు, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని బృందం తెలిపింది. స్థానిక హోటళ్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, టెంట్లను తొలగించాలని పోలీసులు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన 4 పిటిషన్లను సైతం ఉపసంహరించుకుంటున్నట్లు నిరసనకారుల ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే నిరసనకారుల టెంట్లను తొలగిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాలు, ఇంధనం, ఆహార కొరత ఏర్పడటంతో ఏప్రిల్ 9న నిరసనలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఉద్యమం ఉధృతంగా మారింది. జులై 9న అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంలోకి వందల మంది నిరసనకారులు చొరబడ్డారు. దాంతో గొటబయ దేశం విడిచి పారిపోయారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధ్యక్ష భవనం, నివాసాలను నిరసనకారులు ఖాళీ చేశారు. పోలీసుల దాడుల్లో సుమారు 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆందోళనకారులు అరెస్టయ్యారు. అంతర్జాతీయంగా వచ్చిన వ్యతిరేకతో వాణిజ్యం సంఘం అగ్రనేత జోసెఫ్ స్టాలిన్‌ను గత సోమవారం విడుదల చేశారు. మరోవైపు.. గొటబయ రాజపక్స వారసుడిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు రణీల్ విక్రమ సింఘే. దేశంలో మళ్లీ నిరసనలు జరగకుండా అత్యవసర పరిస్థితి విధించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదీ చదవండి: Gotabaya Rajapaksa: థాయ్‌లాండ్ చెక్కేసిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు -
అరకులోయ టెంట్లలో ఏం జరుగుతోంది?
విశాఖపట్నం,అరకులోయ: పర్యాటక ప్రాంతమైన అరకులోయలో ఎలాంటి అనుమతులు లేకుండానే రెంట్‌కు ఇచ్చే టెంట్లు అధికంగా వెలిశాయి. సుంకరమెట్ట రోడ్డులో సిమిలిగుడ జంక్షన్,రవ్వలగుడ,పద్మాపురం జంక్షన్ ప్రాంతాలలో కొంతమంది వ్యాపారులు టెంట్లను వేసి, పర్యాటకులకు రోజువారీ చొప్పున అద్దెకు ఇస్తున్నారు. ఒక్కొక్కరికి వద్ద నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు అద్దె తీసుకుంటూ ఈటెంట్‌ల్లో బసకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అరకులోయ ప్రాంతంలో రెంట్ ఫర్ టెంట్లు ఈఏడాది అధికమయ్యాయి. టెంట్లను ఏర్పాటు చేసి,అద్దెకు ఇవ్వడం చట్టరీత్య నేరమని, వీటిని వెంటనే తొలగించాలని ఇటీవల పాడేరు సబ్‌కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు.అయితే స్థానిక రెవెన్యూ అధికారులు సబ్‌కలెక్టర్ ఆదేశాలను ఆమలుజేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ టెంట్లలో అసాంఘిక కార్యకలపాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెంట్ ఫర్ టెంట్లలో రేవు పార్టీలు కూడా జోరందుకున్నాయని ప్రచారం జరుగుతోంది.లాడ్జిలు,రెస్టారెంట్లు,రిసార్ట్లు నిర్మించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది.అయితే టెంట్ల ఏర్పాటు విషయంలో మాత్రం అనుమతులు లేకుండానే ఖాళీ జాగా ఉంటే, గిరిజనులను మచ్చిక చేసుకుని టెంట్లు వేస్తున్న మైదాన ప్రాంత వ్యాపారులు అధికమయ్యారు.పర్యాటకులు కూడా ఈటెంట్‌లను ఆశ్రయించి నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఈ టెంట్లను తొలగించాలని పాడేరు సబ్‌కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను స్థానిక రెవెన్యూ అధికారులు,పోలీసు యంత్రాంగం కచ్చితంగా ఆమలుజేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రయత్నం.. మిశ్రమ ఫలితం
అమ్మల చెంత కిక్కిరిసి జనం మొక్కులు చెల్లించి తరించారు.. ఈ భక్తప్రవా హానికి తగిన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర టూరిజం, ఎకో టూరిజం, అటవీశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలు అందరిని ఆకట్టుకున్నాయి. వాటిలో సేదతీరిన వీఐపీ భక్తులు టూరిజం శాఖ సేవలు భేష్ అని, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలు ఇబ్బందికరంగా ఉన్నాయని మిశ్రమ స్పందనను వెలిబుచ్చారు. ములుగు: మేడారం మహా జాతరకు రెండురోజుల ముందు నుంచి టూరిజం శాఖ ఆన్లైన్ పద్ధతిన అటవీశాఖ ఏకోటూరిజం సెల్‌ఫోన్ నంబర్ ద్వార బుకింగ్ ఆహ్వానించారు. తెలంగాణ టూరిజం తరఫున ఏర్పాటు చేసిన లగ్జరీ గుడారాలకు సౌకర్యాల విషయంలో మంచి స్పందన వచ్చింది. ఏకో టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. మొత్తానికి టూరిజం శాఖ భళా..అనిపించుకోగా, ఏకో టూరిజం శాఖ తరఫున ఏర్పాటు చేసిన గుడారాలు ఢీలా పడ్డాయి. ప్రత్యేక ఆకర్షణగా టూరిజం గుడారాలు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల, గిరిజన ఆదివాసీ మ్యూజియంల మధ్యలో ఈ జాతరలో భాగంగా 47 గుడారాలను ఏర్పాటు చేశారు. ఇందులో 20 లగ్జరీ గుడారాలు, 10 వీఐపీ, మరో 10 వీవీఐపీ గుడారాలు ఉన్నాయి. బుధవారం– 27, గురువారం –32, శుక్రవారం –44, శనివారం–45 గుడారాలు బుకింగ్ అ య్యా యి. ఇందులో రెండు లగ్జరీ గుడారాలను ఇంటర్నేషనల్ ప్రిలాన్స్ మీడియాకు కేంద్రం తరుపున బుకింగ్ చేయించారు. గుడారాల్లో ఏర్పాటు చేసిన బెడ్లు, ఫ్యాన్, కూలర్ల సౌకర్యాలు బాగున్నాయని వీవీఐపీ భక్తులు తెలిపారు. ఈ గుడారాలు మేడారం సమ్మక్క–సారమ్మల గద్దెలకు దగ్గరగా ఉండడంతో వీఐపీల దర్శనం సులువుగా మారింది. పైగా బుకింగ్ చేసుకున్న భక్తుల వాహనాలను నేరుగా గుడారాల వద్దకు పార్కింగ్ చేసుకునే విధంగా టూరిజంశాఖ తగిన ఏర్పాట్లు చేసింది. భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో సఫలమయింది. అటవీశాఖకు ఆదరణ కరువు అటవీశాఖ ఏకోటూరిజం ఆధ్వర్యంలో జంపన్నవాగు వెనుక భాగంలో 100 గుడారాలను ఏర్పాటు చేశారు. 12 గంటల సమయానికి రూ.800, 24 గంటల పాటు ఉండడానికి రూ.1500లను కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా బుకింగ్‌కు ఆహ్వానించారు. గుడారాలను ఏర్పాటు చేసిన రెండోరోజు నుంచి బుకింగ్ ప్రారంభమైనా భక్తుల నుంచి ఆదరణ కరువైంది. కేవలం ఫోన్‌నెంబర్ల ఆధారంగా మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండడంతో అధికారుల ప్రయత్నం విఫలమైనట్లు తెలిసింది. జాతర జరిగిన బుధవారం–27, గురువారం–,80 శుక్రవారం–60 శనివారం– 30 గుడారాలు మాత్రమే బుకింగ్ అయినట్లు సంబంధిత శాఖ సిబ్బంది తెలిపారు. గుడారాల్లో రాత్రి పూట పడుకునే సమయంలో పొలాల్లోని మట్టిపెళ్లలు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డామని, ఆలయానికి సుదూరంగా గుడారాలను ఏర్పాటు చేయడంతో దర్శనం విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని భక్తులు వాపోతున్నారు. పైగా జంపన్నవాగు సమీపంలో ఏర్పాటు చేయడంతో దర్శనానికి సాధారణ భక్తులతో పాటు కిలో మీటరుకు పైగా కాలినడకన వెళ్లాల్సి వచ్చిందని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి.. భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఫొటో షూట్ చేసి అంతర్జాతీయ మీడియాకు అందిస్తున్నాం. మేడారంలో జాతర జరుగుతుందని తెలిసి అంతర్జాతీయ మీడియా తరుపున గత నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. టూరిజం శాఖ తరుపున కేటాయించిన లగ్జరీ గుడారాలు బాగున్నాయి. రెండు బెడ్లు, ఫ్యాన్, కూలర్లు సౌకర్యంగా ఉన్నాయి. మరుగుదొడ్ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. టూరిజం గుడారాలు ఏర్పాట్లు పూర్తిగా నచ్చాయి. – క్రిస్టియానా, జూలియట్ (బ్రెజిల్, జర్మనీ వాసులు) ఇబ్బందులు పడ్డాం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో 12 గంటల పాటు ఉండడానికి రూ.1000 చెల్లించి బుకింగ్ చేసుకున్నాం. వీఐపీ భక్తులుగా బుక్ చేసుకున్నా వాహనాలు కన్నెపల్లి పార్కింగ్ ప్రాంతంలోనే నిలిపివేశారు. అక్కడి నుంచి గుడారాలకు సామగ్రిని మోసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డాం. టూరిజం శాఖ తరుపున బుకింగ్ చేసుకున్న వారికి గుడారాల వరకు అనుమతి ఇచ్చిన అధికారులు, ఏకో టూరిజం గుడారాలను బుకింగ్ చేసుకున్న మాకు అనుమతి ఇవ్వలేదు. – జీవన్ కుమార్, వరంగల్ పరుపులు లేక ఇబ్బంది పడ్డాం అటవీశాఖ తరుపున గుడారాలను ఏర్పాటు చేశారని తెలిసి 24గంటల పాటు ఉండడానికి రూ.1500 చెల్లించి ప్రకటించిన ఫోన్ నెంబర్ అధారంగా గుడారాన్ని బుకింగ్ చేసుకున్నాం. గుడారంలో ఎనిమిదిమంది పడుకునే విధంగా సౌకర్యం ఉంది. కాకపోతే పడుకోవడానికి వీలుగా గుడారంలో పరుపులు ఏర్పాటు చేస్తే బాగుండేది. పొలాల్లో గుడారాలు ఉండడంతో మట్టిపెళ్లలు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డాం. – గడ్డం శ్రీనివాస్,కొత్తగూడెం -
మేడారంలో అటవీశాఖ గుడారాలు
ములుగు: మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగు వెనుకభాగం (ఊరట్టం నుంచి గద్దెలకు వెళ్లే మార్గం మధ్యలో) సుమారు 100 గుడారాలను ఏర్పాటు చేశారు. ఒక్కో గుడారంలో ఫైర్‌సెప్టీ కవర్స్, లైటింగ్, వాటర్, షాంపులు, సబ్బులు, ఒక బెడ్ అందుబాటులో ఉంచుతారు. ప్రతి 10 గుడారాలకు ఒక మొబైల్ టాయిలెట్, ఆరు గుడారాలకు ప్రత్యేక గార్డును నియమిస్తారు. మహా జాతరకు వచ్చే భక్తులు ఈ గుడారాలను బుకింగ్ చేసుకోవడానికి అటవీశాఖ, ఎకో టూరిజం అదికారులు ప్రత్యేక పేటీఎం నంబర్‌ను కేటాయించారు. 12 గంటల పాటు బస చేయడానికి రూ.1000, 24 గంటల పాటు బస చేయడానికి రూ.2 వేల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఒక్కో గుడారంలో సుమారు ఐదుగురు సభ్యులు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. బుకింగ్ చేసుకోవల్సిన భక్తులు పేటీఎం నంబర్ 9553142346కు చెల్లింపులు చేయవల్సి ఉంటుంది. మిగతా వివరాలకు 8096210513, 9989585287 నంబర్లను సంప్రదించాలి. బుకింగ్ పూర్తయిన సమయంలో పేటీఎం నెంబర్‌కు చెల్లింపులు నిలిపివేయనున్నట్లు ఏకో టూరిజం జిల్లా కో ఆర్డినేటర్ కల్యాణపు సుమన్ , తాడ్వాయి అటవీశాఖ రేంజ్ అధికారి అల్లెం గౌతమ్ తెలిపారు. భక్తుల తర్జనభర్జన ఏకోటూరిజం తరఫున ఏర్పాటు చేసిన గుడారాల బుకింగ్ విషయంలో భక్తులు తర్జన భర్జన పడుతున్నారు. అధికారులు పేటీఎం ద్వారా చెల్లింపులు చేయాలని ప్రకటించారు. అయితే ఎన్ని గుడారాలు అందుబాటులో ఉన్నాయనే విషయంపై పేటీఎం ద్వారా పూర్తి సమాచారం భక్తులకు అందే పరిస్థితి లేకుండా పోయింది. శాఖ తరుఫున ప్రత్యేక ఆన్లైన్ చెల్లింపులు, రోజు ఖాళీగా ఉండే గుడారాల సంఖ్య బుకింగ్ సమయంలో తమ కేటాయించే గుడారాల నంబర్లను అందుబాటులో ఉంచితే బాగుంటుందని భక్తులు సూచిస్తున్నారు. -
పీఠభూమిపై పీటముడి
- డోక్లామ్‌లో భారత సైన్యం మకాం - తామూ వెనక్కి తగ్గబోమన్న చైనా - చర్చలపై నీలినీడలు న్యూఢిల్లీ: భారత్, భూటాన్, చైనాల మధ్య కూడలిగా పిలిచే ‘ట్రై జంక్షన్’ వివాదం మరింత ముదిరింది. మూడు వారాల నుంచి దీనిపై ఇరు దేశాలూ పట్టు వీడటం లేదు. సమస్యాత్మక ప్రాంతమైన డోక్లామ్ పీఠభూమిని ఎట్టిపరిస్థితుల్లోనూ వీడకూడదని భారత్ నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ చైనా చేసిన హెచ్చరికలను భారత్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక్కడ కొనసాగేందుకే మొగ్గు చూపింది. సైనికులు డోక్లామ్‌లోనే గుడారాలను ఏర్పాటు చేసుకుని మకాం వేశారు. ఈ చర్య చైనా బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని భారత్ సంకేతాలు పంపింది. మరోవైపు జవాన్లకు అవసరమైన సరఫరాలు సాగుతున్నాయని సీనియర్ సైన్యాధికారి ఒకరు తెలిపారు. డోక్లామ్ పీఠభూమి ప్రాంతం సిక్కిం నుంచి దాదాపు 10 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విషయంలో రాజీ ప్రసక్తి లేదని.. బంతి ప్రస్తుతం భారత కోర్టులో ఉందని చైనా స్పష్టం చేసింది. భూటాన్‌కు ఉత్తర భాగంలోని జకర్లంగ్, పసమ్‌లంగ్ లోయలతో పాటు తూర్పు భాగంలోని డోక్లామ్ పీఠభూమిపై చైనాతో వివాదం ఉంది. వీటిల్లో డోక్లామ్ అత్యంత కీలకమైన ప్రాంతం. దీంతో దీన్ని సొంతం చేసుకోవాలని చైనా దుష్టపన్నాగం పన్నుతోంది. భారత్, భూటాన్, చైనా దేశాల మధ్య కూడలిగా ఉన్న ఈ ప్రాంతం చైనా ఆర్మీ ఆధీనంలోకి వెళితే ఆ దేశానికి ఎనలేని ప్రయోజనాలుంటాయి. అయితే ఇలాంటి సరిహ ద్దు సమస్యలను వివిధ స్థాయిల్లో చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని 2012లోనే రెండు దేశాలు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుత సమస్య విషయంలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి చర్చల దిశగా చైనా ముందడుగు వేయలేదు. భారత్–పాక్ సరిహద్దుల్లోనూ అదే పరిస్థితి శ్రీనగర్: భారత్–పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఓ సైనిక బంకర్‌ను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సరిహద్దులో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా ఒక జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. నియంత్రణ రేఖ సమీపంలోని పాక్ ఆర్మీ పోస్ట్‌ను భారత బలగాలు పేల్చి వేశాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దులోని సాధారణ పౌరులపై పాకిస్థాన్ గత కొన్ని రోజులుగా అకారణంగా కాల్పులకు పాల్పడుతోంది. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామ ప్రజలపై కాల్పులు జరుపుతున్న పాక్ సైనిక బంకర్‌ను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పాక్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు శనివారం సీఆర్పీఎఫ్ సైనికులపై ట్రాల్ ప్రాంతంలో గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక జవాను మరణించాడని సీఆర్పీఎఫ్ ప్రకటించింది. మరోసారి భారత దౌత్యాధికారికి సమన్లు ఇస్లామాబాద్: సరిహద్దుల్లో భారత సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఇస్లామాబాద్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌కు ఆదివారం సమన్లు జారీ చేసింది. భారత దళాలు జరిపిన కాల్పుల వల్ల పలువురు పాక్ పౌరులు మరణించారని ఆరోపించింది. భారత చర్యను ఖండించి, నిరసన వ్యక్తం చేయడానికే సమన్లు జారీ చేశామని తెలిపింది. చిరికోట్, సత్వాల్ సెక్టార్లలో భారత సైనికులు శనివారం కాల్పులు జరపడంతో మొత్తం ఐదుగురు మరణించారని పాక్ ఆరోపించింది. అయితే సింగ్ ఈ విషయమై శనివారం ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ అధికారులతో చర్చించారు. పాక్ సైనికులే కవ్వింపు చర్యలకు దిగి కాల్పులు జరపడంతో తమ పౌరులు ఇద్దరు మరణించారని తెలిపారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు - ఆంక్షలను తొలగించిన అధికారులు - పాక్‌పై మండిపడ్డ భారత్ శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఆదివారం తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఏడాది క్రితం చనిపోయిన హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ కమాండర్ బుర్హాన్ వనీ తొలి వర్థంతి సందర్భంగా ముందుజాగ్రత్తగా సంబంధిత అధికారులు రెండురోజుల క్రితం ఆంక్షలు విధించడం తెలిసిందే. పౌరుల కదలికలతోపాటు గుమికూడడంపైనా ఎటువంటి ఆంక్షలు లేవని సంబంధిత అధికారులు తెలిపారు. వనీ వర్థంతి సందర్భంగా శనివారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడం, పూర్తిస్థాయిలో ప్రశాంత వాతావరణం కనిపించడంతో ఆంక్షలను ఎత్తివేశారు. శనివారం కొన్నిచోట్ల రాళ్లు విసురుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయని, అయినప్పటికీ శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ఇదిలా ఉంటే,∙హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని వీరుడిగా కీర్తిస్తూ పాకిస్థాన్ శనివారం చేసిన ప్రకటనపై భారత్ మండిపడింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా రాసిచ్చిన ప్రకటననే పాక్ చదివి వినిపించిందని ఆరోపించారు. వనీ ఎన్కౌంటర్ తరువాత కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున హింస జరిగిన సంగతి తెలిసిందే. పాక్ విదేశాంగ కార్యాలయం చేసిన ప్రకటన లష్కరే ప్రకటన మాదిరే ఉందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానాల ని పొరుగుదేశానికి సూచించారు. పాక్ సైన్యాధ్యక్షుడు జావెద్ బజ్వా సైత్యం వనీని అమరుడు అంటూ కీర్తించారు. కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికారం ఉందని వాదించారు. పాక్ ప్రధాని నవా జ్ షరీఫ్ కూడా వనీకి నివాళులు అర్పించారు.