
ఇండోనేషియా: పెళ్లి పత్రికలో ఒక వధువు, ఒక వరుడు పేర్లు ఉండటం కామన్. కానీ ఒక పెళ్లి కొడుకు, ఇద్దరు పెళ్లి కూతుళ్ల పేర్లు ఉన్న శుభలేఖ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని దక్షిణ సుమత్ర దీవుల్లోని తెలుక్ కిజింగ్ గ్రామానికి చెందిన చింద్ర అనే యువకుడు ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నాడు. వారిద్దరి పేర్లనూ జోడిస్తూ వధువులతో విడివిడిగా దిగిన ఫొటోలతో ఒకే పెళ్లి శుభలేఖను ప్రింట్ చేయించి అందరికీ పంచేశాడు. దీనిని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇప్పటికే ఇద్దరు కంటే ఎక్కువ మంది భార్యలున్న వారు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. సాధారణంగా ఇండోనేషియాలో బహుభార్యత్వం తప్పు కాదు. అయితే వారి సంప్రదాయం ప్రకారం రెండో వివాహానికి ముందు కేవలం ఒక భార్య మాత్రమే ఉండాలి.
దీనిపై స్థానిక వెబ్‌సైట్ ఒకటి.. ఎంక్వైరీ చేసి ఈ పెళ్లి పత్రిక నిజమేనని తేల్చింది. ఈ పెళ్లి ఆచార సంప్రదాయాల ప్రకారమే జరుగుతోందని అన్నారు ఓ గ్రామ పెద్ద. ఇద్దరి పెళ్లి కూతుళ్లతో ఇందాహ్ లెస్తారిని నవంబర్ 5న, పెరావతిని నవంబర్ 8న వరుడు చింద్ర వివాహం చేసుకోబోతున్నాడని వివరించారు. రెండు వివాహాల మధ్య గడువు రెండు రోజులే ఉండటం వల్ల వేర్వేరు శుభలేఖలు ముద్రించడం వృథా అనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment