Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

KSR Comment: How Kutami Prabhutvam Increase YS Jagan Charisma1
జగన్‌ చరిష్మాను మరింత పెంచుతున్న కూటమి సర్కారు!

మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించినట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత.. కచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లుంది. బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ద దేనిమీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డ్‌కు వెళుతున్నారే! ఈ సమస్య ప్రజలలోకి బాగా వెళ్లిపోతుందే! అన్న గొడవ తప్ప, రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు!. పైగా జగన్ టూర్‌ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రూ.260 కోట్లు ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక, ధరలు దారుణంగా పడిపోయి రెండు నెలలుగా రైతులు నానా బాధలు పడుతున్నారు. మామిడి పండ్లతో రైతులు రోజుల కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా!. ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?. కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలకు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక, పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా?అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోంది. టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని, జగన్నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ, తమ అక్కసు తీర్చుకున్నాయి. జగన్‌కు మద్దతుగా కాని, తమ బాధలు చెప్పుకోవడానికి గాని రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం. టమోటాలు, ఇతర ఉత్పత్తులకు సరిగా ధర లేకపోతే రైతులు పలు సందర్భాల్లో కింద పారబోసి నిరసనలు తెలిపిన ఘటనలు ఎన్ని జరగలేదు? అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది! ఎన్ని ఆంక్షలు పెట్టింది!.. ఎక్కడైనా ఇంతమందే రావాలని చెబుతారా? ఒకవేళ స్థలాభావం ఉంటే దానిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, ఐదుగురితోనే మాట్లాడాలని, రైతులను ఆటోలలో ఎక్కించుకోకూడదని, మోటార్ బైక్‌లకు పెట్రోల్ పోయరాదని.. ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున మూడు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. సుమారు రెండువేల మందిని నియమించారట. వీరు జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా, ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాట్లు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా పాతిక చెక్ పోస్టులు పెట్టారట. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనపర్తి వద్ద భద్రతాకారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోకపోతే, మద్దతు దారులను వెంట బెట్టుకుని నడుచుకుంటూ వెళ్లారే? అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే! చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు. అదే.. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే, డ్రైవరుతోపాటు జగన్‌, ఇతర ప్రయాణీకులపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందింది. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించి జగన్‌కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా! జగన్నాధ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా? అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడినదని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలో డబుల్ టాక్ చేయడం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏమి విలువ పెరుగుతుందో తెలియదు. బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పోలీసులు లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతనిని పరామర్శకు కూడా జగన్‌ కారు దిగడానికి పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో రూ.16లకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే, ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా? అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు రూ.నాలుగు సబ్సిడీని కేంద్రం భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప, వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వెళ్లుతున్నారు అన్నప్పుడుగాని వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్‌గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా! ఇదే కదా ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా, తన వెంట జనం ఉన్నారని జగన్ పదే, పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. కాని ప్రజాస్వామ్యంలో అణచివేత విధానాల వల్ల ఉపయోగం ఉండదని అనుభవ పూర్వకంగా తెలియ చేసినట్లయింది. బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే, అంతే వేగంగా అది పైకి లేస్తుందన్న సంగతి మరోసారి స్పష్టమైంది. పోలీసులు మెయిన్ రోడ్డుపై ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు, గుట్టలు దాటుకుంటూ, అడవుల గుండా కూడా తరలిరావడం కనిపించింది. కొందరు యువకులు మోటార్ సైకిళ్తపై చిన్న, చిన్న డొంకల ద్వారా తరలివచ్చిన తీరుకు సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షించాయి. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అదే తీరుగా ఉంది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికలలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావన. అందుకే కూటమి సూపర్ సిక్స్‌తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకు రావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. వైయస్సార్‌సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలి. జగన్‌కు టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను ప్రభుత్వమే రోజురోజుకు మరింతగా పెంచుతున్నందుకు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Pak Balochistan Province Bus Passengers Incident2
బలూచిస్తాన్‌: ఐడీ కార్డు చూసి ప్రయాణికుల్ని కాల్చేశారు!

బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. బస్సుల్లో వెళ్తున్న కొందరిని తుపాకులతో వచ్చిన దుండగులు అపహరించారు. ఆపై సమీపంలోని కొండల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు తనిఖీలు చేసి మరీ కిరాతకంగా కాల్చి చంపారు.బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో దారుణం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పలు బస్సుల నుంచి ప్రయాణికులను తుపాకులు చూపించి బెదిరించి ఎత్తుకెళ్లారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు పరిశీలించి కాల్చి చంపారు. శరీరం నిండా తుట్లతో 9 మంది ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారి ఒకరు ప్రకటించారు. ఘటనకు కారకులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. పాక్‌ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది. దుండగుల కోసం భద్రతాల బలగాలు రంగంలోకి దిగాయి.ఇదిలా ఉంటే.. బలూచ్‌ వేర్పాటువాద మిలిటెంట్‌ గ్రూపులు గతంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాయి. ఇందులో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(BLA) అత్యంత బలమైంది. అఫ్గనిస్తాన్‌-ఇరాన్‌ సరిహద్దుల గుండా ఇది స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే పాక్‌ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. Pakistan Bus Attack: Gunmen Kill 9 Punjabi Passengers in Balochistan After Checking ID Cards#Balochistan #Pakistan https://t.co/seQhPWzqLJTo get epaper daily on your whatsapp click here: https://t.co/Y9UVm2LHAx— Free Press Journal (@fpjindia) July 11, 2025బలూచిస్తాన్‌ అత్యంత అరుదైన ఖనిజాలకు మూలం. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ వనరులను పంజాబ్‌ ప్రావిన్స్‌కు దోచిపెడుతోందని బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌ ప్రావిన్స్‌ నుంచి వాహనాలను, ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తూ వస్తోంది.గత కొన్ని నెలలుగా బలూచిస్తాన్‌లో వరుస హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ గురైంది. బొలాన్ జిల్లాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ సుమారు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును హైజాక్‌ చేసింది. అందులో 30 మందిని కాల్చి చంపింది. మరో 215 మందిని బందీలుగా తీసుకుంది. బందీలలో ఎక్కువ మంది సైనికులు, పోలీసు, ISI, యాంటీ టెర్రరిజం ఫోర్స్ సభ్యులుగా ఉండడం గమనార్హం. పాక్ సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి.. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా దాడులు జరిపింది. అంతకు ముందు.. 2024 ఆగస్టులో ముసాఖేల్ జిల్లాలో 23 మంది ప్రయాణికులను ఐడెంటిటీ కార్డులు అడిగి కాల్చి చంపింది బీఎల్‌ఏ.

what is bitchat,Jack Dorsey new messaging app functions without Internet3
వాట్సప్‌కు పోటీగా త్వరలో బిట్‌చాట్‌

ట్విటర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్స్‌ టెక్‌ ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు. సోషల్‌ మీడియా మెసేజింగ్‌ యాప్‌ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వాట్సప్‌ తరహా మెసేజింగ్‌ యాప్‌ను.. అందునా ఆఫ్‌లైన్‌లో పనిచేసేలా త్వరలో జనాలకు అందుబాటులోకి తేనున్నారు. దీనిపేరు.. బిట్‌చాట్‌. ఇంటర్నెట్‌తో అవసరం లేకుండా మెసేజ్‌లు పంపించుకునే ఈ యాప్‌ ఎలా పని చేస్తుందో ఓ లుక్కేద్దాం..బిట్‌చాట్‌ అంటే అనే బ్లూటూత్‌తో పనిచేసే పీర్-టు-పీర్ వ్యవస్థ. సర్వర్లతో దీనికి పని ఉండదు. బ్లూటూత్‌ ఆన్‌లో ఉంటే సరిపోతుంది. బిట్‌చాట్‌ యూజర్లు ఏదైనా మెసేజ్‌ చేయాలంటూ బ్లూటూత్‌ ఆన్‌ చేసి మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ సమస్యలు, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఘర్షణ వాతావారణ నెలకొన్న సమయాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. సర్వర్లు, అకౌంట్లు, ట్రాకింగ్ విధానాలు ఇందులో లేకపోవడంతో.. యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవచ్చనే అంచనా వేస్తున్నారు.ప్రైవసీకి ది బెస్ట్‌?బిట్‌చాట్‌ అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆఫ్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌లో యూజర్లు అవతల వ్యక్తికి పంపే ప్రతి మెసేజ్‌ ఎన్క్రిప్ట్ అవుతుంది. మెసేజ్‌ టూ మెసేజ్‌ మధ్యలో ఎలాంటి సర్వర్‌ వ్యవస్థ ఉండదు కాబట్టి యూజర్లకు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని డోర్స్‌ అంటున్నారు. సింపుల్‌గా.. డివైజ్‌ టూ​ డివైజ్‌ కనెక్షన్‌. ఫోన్‌లో బ్లూటూత్‌ ద్వారా బిట్‌చాట్‌ పనిచేస్తోంది నో సెంట్రల్‌ సర్వర్‌: వాట్సప్‌,టెలిగ్రాం తరహా ఒక యూజర్‌కు పంపిన మెసేజ్‌ సర్వర్‌లోకి వెళుతుంది. సర్వర్‌ నుంచి రిసీవర్‌కు మెసేజ్‌ వెళుతుంది. బిట్‌చాట్‌లో అలా ఉండదు.. నేరుగా సెండర్‌నుంచి రిసీవర్‌కు మెసేజ్‌ వెళుతుంది. మెష్ నెట్‌వర్కింగ్: బ్లూట్‌తో పనిచేసే ఈ బిట్‌చాట్‌ యాప్‌ ద్వారా రిసీవర్‌ సమీపంలో లేనప్పటికీ మెసేజ్‌ వెళుతుంది. ఈ టెక్నిక్‌ను మెష్ రూటింగ్ అంటారు ఇది మెసేజ్‌ బ్లూటూత్ పరిధికి మించి 300 మీటర్లు (984 అడుగులు) వరకు పంపడానికి వీలవుతుంది. ప్రూప్స్‌ అవసరం లేదు: ఈ యాప్‌లో లాగిన్‌ అయ్యేందుకు ఎలాంటి వ్యక్తిగత యూజర్‌ వివరాలు అవసరం లేదు. అంటే ఫోన్‌ నెంబర్‌,ఈమెయిల్‌తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలతో పనిలేదు. డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్ : బిట్‌చాట్‌ కొన్నిసార్లు పీట్‌ టూ పీర్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా పనిచేస్తుంది. అంటే సర్వర్‌ లేకుండా నెట్‌వర్క్‌లోని యూజర్‌ టూ యూజర్‌ల మధ్య డేటా మార్పిడి జరుగుతుంది. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్: గ్రూప్ చాట్స్‌ను ‘రూమ్‌లు’ అని పిలుస్తారు. ఇవి పాస్‌వర్డ్‌తో రక్షితంగా ఉంటాయియూజర్ ఇంటర్‌ఫేస్: యాప్‌ను ఇన్‌ స్టాల్‌ చేసి, అకౌంట్‌ క్రియేట్‌ చేస్తే చాలు. తర్వాత మీ కాంటాక్ట్‌ లిస్ట్‌ నుంచి ఎవరితోనైనా చాట్‌ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్స్ అండ్‌ రూమ్స్: హ్యాష్‌ట్యాగ్‌లతో పేర్లు పెట్టి, పాస్‌వర్డ్‌లతో సెక్యూర్ చేయవచ్చు. ఉపయోగపడే సందర్భాలు: రద్దీ ప్రదేశాల్లో నెట్‌వర్క్ సరిగ్గా పనిచేయని సమయంలో విపత్తుల సమయంలో (disaster zones). సెన్సార్ ఉన్న ప్రాంతాల్లో కమ్యూనికేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బిట్‌చాట్‌ బీటా వెర్షన్‌లో టెస్ట్‌ఫ్లైట్‌ మోడ్‌లో ఐఓఎస్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.టెస్ట్‌ ఫ్లైట్‌ మోడ్‌ అనేది యాపిల్‌ అందించే బీటా టెస్టింగ్ ప్లాట్‌ఫారమ్. యాప్‌లను విడుదలకు ముందు దీని ద్వారా iOS, iPadOS, watchOS, tvOS పరీక్షించేందుకు డెవలపర్లు ఉపయోగించుకుంటారు. తద్వారా ఫీడ్‌బ్యాక్‌తో సంబంధిత యాప్‌ను ఎలా అంటే అలా మార్పులు చేర్పులు చేస్తారు.

Man Breaks Down After Losing Phone In Water Video Viral4
రేయ్ తమ్ముడూ.. ఎందుకురా ఏడుస్తున్నావ్‌?

మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించవలసిన మనుషుల్ని వాడుకుంటున్నాడు. జీవితాలకు సరిగ్గా అతుక్కుపోయే సినిమా డైలాగ్‌ ఇది. సెల్‌ఫోన్‌ పోయిందని ఓ యువకుడు నీళ్లలో వెతకడం.. అది దొరక్క చివరకు ఏడుస్తూ కూర్చోవడం.. ఆ వీడియో కాస్త వైరల్‌ కావడం.. నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది. రాజస్తాన్‌ జైపూర్‌లో స్థానిక సుభాష్‌ చౌక్‌లో నివాసం ఉంటున్నాడు హల్దార్‌ అనే యువకుడు. తన స్కూటీ మీద వెళ్తుంటే రామ్‌ నివాస్‌ బాఘ్‌ వద్ద రోడ్డు మీద వానకు నిలిచిపోయిన నీటిలో పడిపోయాడు. దెబ్బలేం తాకలేదు. అయితే ఆ పడడమే అతని జేబులోని సెల్‌ ఫోన్‌ ఎగిరి నీళ్లలో పడింది. ‘అయ్యో నా ఫోన్‌..’ అనుకుంటూ కంగారుగా నీళ్లలోకి దిగాడు. పాపం.. ఆ ఫోన్‌ కోసం ఆ బురద నీటిలో చాలాసేపు వెతికాడు.అటుగా వెళ్లేవాళ్లు.. ‘‘ఎవడ్రా.. వీడు’’ అన్నట్లుగా చూస్తూ పోతున్నారే తప్ప, ఆగి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. ఒక్కడు తప్ప!. చాలాసేపైనా దొరక్కపోవడంతో చివరకు ఆ నీళ్లోనే కూలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా ఆ ఒక్కడు తన ఫోన్‌లో బంధిస్తూనే ఉన్నాడు. ఈలోపు.. ఆ వీడియో తీసే వ్యక్తి ఏమైందని అడిగాడు.. రోడ్లు గుంతలు లేకుండా సరిగ్గా ఉంటే.. మున్సిపల్‌ వాళ్లు సరిగా​ పని చేసి ఉంటే.. ఈ నీరు ఇలా ఆగేదా?. నా ఫోన్‌ పోయేదా?.. ఇలాంటి వాళ్ల వల్లే వ్యవస్థలో నాలాంటి వాళ్లు విఫలం అవుతూనే ఉన్నారు అంటూ ఆ యువకుడు భారీ డైలాగులే కొట్టాడు.ఈలోపు ఈ వీడియో సోషల్‌ మీడియాకు ఎక్కింది. చాలామంది పోయింది ఫోనే కదా.. అంటూ తామూ ఫోన్‌లను పొగొట్టుకున్న సందర్భాలను ప్రస్తావించారు. మరికొందరు అధికారులను తిట్టిపోశారు. ఇంకొందరు అటుగా వెళ్లేవాళ్లు సాయం చేసి ఉండొచ్చు కదా అంటూ సలహా పడేశారు. ఇంకొందరు బహుశా అదే అతని జీవనాధారం అయి ఉండొచ్చని.. అతని వివరాలు ఇస్తే కొత్త ఫోన్‌ కొనిస్తామని కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు.. ఒక్కోలా..! ప్చ్‌.. ఎవరేమనుకున్నా ఆ కన్నీళ్లకు మాత్రం ఓ అర్థం ఉంది. రేయ్‌ హల్దార్‌.. ఎందుకురా ఏడుస్తున్నావ్‌?. ఫోన్‌ పోయిందనా?.. ఇంట్లో వాళ్లు తిడతారనా?. కష్టపడి సంపాదించుకున్నావనా?. లేకుంటే సాయం చేయకుండా జనాలు ఎవరిమానాాన వాళ్లు వెళ్లిపోయారనా?. రోడ్లు సవ్యంగా లేవనా? నీళ్లలో పడిపోయావనా? అధికారులు.. సిబ్బంది సవ్యంగా పని చేయలేదనా?.. రేయ్‌ తమ్ముడూ జీవితం అంటే ఇంతేనా?.. పైకి లేవు!!. సాయానికి జనం ముందుకొస్తున్నారుగా.. చూద్దాం! A viral video shows a young man breaking down in tears after his mobile phone reportedly slipped into rainwater in Jaipur.#JaipurRains #Rajasthan #Viral #ViralVideo #HeavyRainfall #Trending pic.twitter.com/KwDtwoYaAj— TIMES NOW (@TimesNow) July 10, 2025

ENG VS IND 3rd Test: Rishabh Pant Injury, Can Replacement Dhruv Jurel Bat At Lord's In His Absence5
ENG VS IND 3rd Test: అదే జరిగితే టీమిండియా 10 మందితోనే బ్యాటింగ్‌ చేయాలి..!

లార్డ్స్‌ టెస్ట్‌ తొలి రోజు ఆటలో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గాయపడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవ‌ర్ వేసిన జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతిని అందుకునే క్ర‌మంలో పంత్ ఎడ‌మ చేతి చూపుడు వేలికి గాయ‌మైంది. బంతిని అందుకున్న తర్వాత పంత్ తీవ్ర‌మైన నొప్పితో విలవిలలాడాడు.ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినా అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో పంత్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో సబ్‌స్టిట్యూట్‌ వికెట్ కీప‌ర్‌గా దృవ్ జురెల్ మైదానంలోకి వ‌చ్చాడు. పంత్‌ గాయంపై బీసీసీఐ ప్రకటన చేసింది. అయితే అందులో గాయం తీవ్రత, మ్యాచ్‌లో పంత్‌ కొనసాగింపుపై ఎలాంటి సమాచారం లేదు.రెండో రోజు ఆట ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పంత్‌ గాయంపై సందిగ్దత వీడలేదు. ఈ నేపథ్యంలో పంత్‌ మ్యాచ్‌లో కొనసాగుతాడా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ​ పంత్‌ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైతే టీమిండియాకు అది భారీ ఎదురుదెబ్బ అవుతుంది.ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ మొదలయ్యాక గాయపడిన ఆటగాడికి ప్రత్యామ్నాయంగా ఫీల్డింగ్‌ లేదా వికెట్‌కీపింగ్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్‌ చేయడానికి వీలు ఉండదు. ఈ లెక్కన పంత్‌ మైదానంలోని తిరిగి రాకపోతే భారత్‌ 10 మందితోనే బ్యాటింగ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. భీకర ఫామ్‌లో ఉన్న పంత్‌ బ్యాటింగ్‌కు అందుబాటులో ఉండకపోతే టీమిండియా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ సిరీస్‌లో పంత్‌ కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సహా ఇప్పటివరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 342 పరుగులు చేసి గిల్‌ తర్వాత ఈ సిరీస్‌లో సెకెండ్‌ హయ్యెస్ట్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న పంత్‌ బ్యాటింగ్‌కు దిగకపోతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్‌ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే 18, బెన్‌ డకెట్‌ 23, ఓలీ పోప్‌ 44, హ్యారీ బ్రూక్‌ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్‌ కుమార్‌ రె​డ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. పంత్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన జురెల్‌ జడేజా బౌలింగ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌, భారత్‌ తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్‌ భారీ విజయం సాధించింది.

BRS Harish Rao Satirical Comments On CM Revanth Reddy6
‘అయ్యా రేవంత్‌.. 400 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్‌లు నీవేనా?’

సాక్షి, బీఆర్‌కే భవన్‌: దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. నీళ్ల విషయంలో కాంగ్రెస్‌ తెలంగాణకు అన్యాయం చేసింది. 50ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీవి.. అవే మోసాలు, అవే అబద్ధాలు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిన్న చెప్పినవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు బీఆర్‌కే భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా భవన్‌లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు.. కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్‌కు అవగాహన లేదని బాధతో చెప్తున్నా. 299 టీఎంసీల పేరుతో శాశ్వత ఒప్పందం అని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేతకాక కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడే 299 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం చేశారు.చంద్రబాబుకు ‍గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారా..శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్-3పై ఎందుకు పోరాటం చేస్తారు?. సెక్షన్-3 విషయంలో ఉమా భారతి, గడ్కరీని కలిశారు. కేంద్రంపై పోరాటం చేసి సెక్షన్-3ని కేసీఆర్ సాధించారు. బోర్డు తాత్కాలిక నీటి వినియోగం కోసం మాత్రమే వినియోగిస్తారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడారు.. చాలా బాధతో చెప్తున్నాను. కృష్ణా నదిని దోచుకో అని రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని నేను బయటపెట్టిన తర్వాత సీఎం మాట మార్చారు.నిజాం కట్టినవీ నీవేనా..సీఎం రేవంత్‌కి ఎలాగూ తెలియదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదు అంటే బాధేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా?. 573 టీఎంసీలు చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అజ్ఞానం. 400 ఏళ్ల కింద కాకతీయ, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. బీఆర్‌ఎస్‌ పాలనలో 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.తుమ్మడిహట్టి నుంచి బ్యారేజీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చింది.. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించు. ఎనిమిదేళ్లలో 160 టీఎంసీలకు కేంద్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి తేలేదు?. దీనిపై అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం. మా మైక్ కట్ చేయకుండా, అసెంబ్లీ నుంచి పారిపోవద్దు. 20 నెలల పాలనలో ఇప్పుడు ఒక్క చెరువు, చెక్ డ్యామ్ కట్టించారా?. మీరు ఏమీ చేయకుండానే నీళ్లు ఎలా వచ్చాయి.. పంటలు ఎలా పండాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను వాడటం లేదు.. ఆరు శాతం నీళ్లను తక్కువగా వాడారు’ అని చెప్పుకొచ్చారు.

Gold and Silver rates today on July 11 in Telugu states7
అమాంతం ఎగిసిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు అమాంతం ఎగిశాయి. క్రితం రోజున ఫ్లాట్‌గా ఉన్న పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Delhi High Court Stays Release Of Udaipur Files Movie8
ఒక్క సినిమాకు 150 కట్స్‌.. విడుదలకు ముందే కోర్టు స్టే

‌‌'ఉదయపూర్ ఫైల్స్' నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది. నేడు (జులై 11)న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రదర్శనపై స్టే విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‌‌రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన 'టైలర్ కన్హయ్య లాల్' హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఉదయపూర్ ఫైల్ ' ( Udaipur Files )... ఈ మూవీ విషయంలో ఇప్పటికే పలు అభ్యంతరాలు వచ్చాయి. ఏకంగా 150 సీన్స్‌కు సెన్సార్‌ బోర్ట్‌ కూడా అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైతే.. ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రోత్సహిస్తుందని, ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండటమే కాకుండా మతపరమైన ఉద్రిక్తతను రేకెత్తించగలదని వాదిస్తూ.. పిటిషనర్లు - జమియత్ ఉలామా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ, పాత్రికేయుడు ప్రశాంత్ టండన్ దీని విడుదలపై శాశ్వత నిషేధం కోరుతూ పిటిషన్ వేశారు. ఈమేరకు సినిమా విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. సినిమా విడుదల చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి కోర్టు కేంద్రానికి వారం సమయం ఇచ్చింది.టైలర్ కన్హయ్య లాల్ హత్య స్టోరీ ఏంటి..2022 ఉదయపూర్‌లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టినందుకు గాను టైలర్ కన్హయ్య లాల్‌ను దారుణంగా చంపేశారు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే అతని దుకాణంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్‌ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. 26 సార్లు కత్తితో నరికినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దాంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్‌ నేత నూపుర్‌ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్‌ అక్తర్‌, గౌస్‌ మొహమ్మద్‌గా గుర్తించారు. రియాజ్‌ గొంతు కోయగా.. గౌస్‌ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. హత్యకు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ నగరంతో కూడా నిందితులకు సంబంధాలు ఉన్నట్లు NIA విచారణలో తేలింది.నుపుర్ శర్మ ఎవరు..?న్యూఢిల్లీకి చెందిన నుపుర్ శర్మ విద్యార్థి దశ నుండి బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో కీలకంగా వ్యవహరించింది. 2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. వృత్తి రీత్యా న్యాయవాది . 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేశారు. 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, మహ్మద్‌ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీ నుంచి బీజేపీ తొలగించింది. మహ్మద్‌ ప్రవక్త గురించి వారి వివాహం సమయంలో అతని మూడవ భార్య ఆయిషా వయస్సు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరానికి గురిచేశాయి. ఆ సమయంలో ఖతర్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు భారత్‌ను క్షమాపణ కోరాయి.దర్శకుడు ఏమన్నారు..?ఉదయపూర్‌ ఫైల్స్‌ సినిమా విడుదల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు భరత్ ఎస్ శ్రీనేట్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ మూవీ ఒక మ‌తానికో..? విశ్వాసాకో సంబంధించినది కాదని చెప్పారు. భావ‌జాలం, స‌త్యం గురించి మాత్ర‌మే సినిమాలో ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎవ‌రి మ‌నో భావాలను దెబ్బ తీసే కంటెంట్ ఎంత మాత్రం ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇందులో క‌న్హ‌య్య లాల్ పాత్ర‌లో విజ‌య్ రాజ న‌టిస్తున్నారు. దుగ్గ‌ల్, ర‌జ‌నీష్‌, ప్రీతి ఘుంగియానీ, క‌మలేష్‌, సావంత్, కంచి సింగ్, ముస్తాక్ ఖాన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అమీత్ జానీ ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు.

The Rise of Home Fitness: Best Home Workout Equipment9
రిమ్‌ 'జిమ్‌'.. హోమ్‌..! కోవిడ్‌ తర్వాత పెరుగుతున్న ట్రెండ్‌..

నగరంలో ఆరోగ్యంపై అవగాహనతో పాటు కొత్త కొత్త ట్రెండ్స్‌ పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం హోమ్‌ జిమ్స్‌కు డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు, సంపన్నులకు మాత్రమే పరిమితమైన ఇవి ప్రస్తుతం మధ్యతరగతి ఇళ్లలో సైతం సాధారణంగా మారాయి. బ్యాచిలర్‌ హోమ్స్‌లో, కో–లివింగ్‌ ఫ్లాట్స్‌లో సైతం నలుగురైదుగురు యువత కలిసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. హోమ్‌ జిమ్‌ కాన్సెప్ట్‌ ఇటీవల కాలంలో నగరంలో స్థిరపడుతోంది. నగరంలో హోమ్‌ జిమ్‌ ట్రెండ్‌ ఊపందుకోడానికి కోవిడ్‌ పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లో వచ్చిన మార్పులు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కూడా ఒక కారణమే. ఇంట్లో అధిక సమయం గడపడం అలవాటవుతున్న పలువురు వృత్తి నిపుణులు ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే హోమ్‌ జిమ్‌ ఏర్పాటు చేసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాల నుంచి ప్రతికూలతల వరకూ ఒకసారి బేరీజు వేసుకోవడం మంచిదని ఫిట్‌నెస్‌ రంగ నిపుణులు సూచిస్తున్నారు. స్థలం ఉంటేనే ఫలం.. ఒక మోస్తరు హోమ్‌ జిమ్‌ ఏర్పాటుకు కనీసం 60–100 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని అంచనా. బేసిక్‌ హోమ్‌ జిమ్‌ అయితే 60–80 చదరపు అడుగులు (ఉదాహరణకు బెడ్‌రూమ్‌ కార్నర్‌ లేదా బాల్కనీలో) అలా కాకుండా ఫుల్‌ సెటప్‌ చేసుకోవాలంటే.. 100–150 చ.అ. (ఒక ప్రత్యేక గది అయితే మరింత మంచిది) అవసరం అవుతుంది. బడ్జెట్‌ ఇలా.. హోమ్‌ జిమ్‌ బడ్జెట్‌ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎంట్రీ లెవల్‌ హోమ్‌ జిమ్‌కైతే పెట్టుబడిగా రూ.30,000 నుంచి రూ.50,000 మధ్య సరిపోతుంది. అదే మిడ్‌ రేంజ్‌లో వెళ్లాలనుకుంటే రూ.50,000 నుంచి రూ.1.5 లక్షలు, పూర్తి సెటప్‌ కోరుకుంటే రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ (బ్రాండెడ్‌ ఎక్విప్‌మెంట్‌ను బట్టి మారవచ్చు) వెచ్చించాల్సి ఉంటుంది.ప్రాథమిక పరికరాలు.. ఇంట్లో జిమ్‌లో ఉండాల్సిన పరికరాల్లో డంబెల్స్‌ సెట్స్‌ (రూ.3,000 నుంచి రూ.10,000) రాడ్స్, వెయిట్స్‌ (రూ.5,000 నుంచి రూ.15,000), బెంచ్‌ ప్రెస్‌ (రూ.8,000 నుంచి రూ.20,000) యోగా మ్యాట్, రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌ (రూ.1,000 నుంచి రూ.3,000 ), ట్రెడ్‌మిల్‌ లేదా ఎలిప్టికల్‌ మిషన్‌ (రూ.20,000 నుంచి రూ.లక్ష) ఆల్‌ ఇన్‌ వన్‌ మల్టీ జిమ్‌ మిషన్‌ (రూ.40,000 నుంచి రూ.1.5 లక్షల వరకు), లాట్‌ మిషన్‌ (రూ.15,000 నుంచి రూ.25,000)లు కొనుగోలు చేయాలి. ప్రతికూలతలు.. సరైన శిక్షకులు అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. ఒకవేళ ఇంటికి వచ్చి శిక్షణ ఇచ్చే ట్రైనర్స్‌ను ఎంచుకుంటే వారికి చెల్లించాల్సిన మొత్తం ఆర్థిక భారంగా మారుతుంది. ఒంటరిగా చేయడం వల్ల సరిపడా మోటివేషన్‌ దొరకదు. వర్కవుట్స్‌ను వాయిదా వేసే అవకాశం ఎక్కువ. ఎంత వరకూ చేయాలో, ఏ వర్కవుట్‌ ఎలా చేయాలో తెలుసుకుని చేయకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. అద్దెకు ఉంటున్న ఇళ్లు అయితే ఇంటి యజమానులతో ఇబ్బందులు రావచ్చు. అంతేకాకుండా ఇళ్లు మారే సమయంలో ఈ ఎక్విప్‌మెంట్‌ భారంగా పరిణమించవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. నగర ట్రాఫిక్‌లో రాకపోకలకు పట్టే సమయం, ఎండ, వాన తదితర వాతావరణ అడ్డంకులు ఉండవు. జిమ్‌లో పదుల సంఖ్యలో ఉండే ఇతర సభ్యుల మధ్య చేయడం, కొన్ని సార్లు ఎక్విప్‌మెంట్‌ అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక్క హోమ్‌ జిమ్‌తో కుటుంబ సభ్యులందరికీ వ్యాయామం చేసే అవకాశం లభిస్తుంది. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ చక్కని ఆరోగ్యకర వాతావరణానికి దోహదపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా దీన్ని చెప్పుకోవచ్చు. నెలవారీగానో, వార్షిక ఫీజు రూపంలోనో చెల్లించాల్సిన జిమ్‌ మెంబర్‌షిప్‌ ఖర్చును దూరం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు సన్నిహితులను కూడా కలుపుకుంటే స్వల్ప కాలంలోనే పెట్టుబడి రికవరీ అయినట్టు భావించవచ్చు.

CM Bhagwant Mann Comments PM Modi foreign visits Centre slams10
‘మోదీజీ.. అలాంటి దేశాలకు వెళ్లడమెందుకు?.. ఇక అవార్డులా?’

ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ప్రధాని మోదీ.. ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. కేవలం పది వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించం ఏంటి? అని మాన్‌ విమర్శించారు. ఈ క్రమంలో సీఎం మాన్‌ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ మండిపడింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పూర్తిగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించింది.ఇటీవల ప్రధాని మోదీ.. ఘనా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌, నమీబియా దేశాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆయా దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పర్యటనలపై తాజాగా పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్ స్పందించారు. ఓ కార్యక్రమంలో సీఎం మాన్‌ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ.. చిన్న చిన్న దేశాలకు సైతం వెళ్తున్నారు. ఘనా అని ఎక్కడికో వెళ్లారు. స్వదేశానికి తిరిగివస్తున్న ఆయనకు స్వాగతం. ప్రధాని ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో మన ప్రధాని ఉండరు. కానీ, పది వేల మంది జనాభా ఉన్న దేశాలను మాత్రం సందర్శిస్తున్నారు. అక్కడ ఆయనకు అత్యున్నత అవార్డులు కూడా అందుతున్నాయి’ అని వ్యాఖ్యలు చేశారు.#Punjab CM Bhagwant Mann makes Fun of PM Modiਭਗਵੰਤ ਮਾਨ ਨੇ ਮੋਦੀ ਫਿਰ ਮਜ਼ਾਕ ਉਡਾਇਆ#Punjab CM Doin'it Again !CM Bhagwant Mann makes Fun of PM Modi foreign trips & also asks the Journos now you will ask the questions of Modi also from me. Mann says he didn't do 1 PC in 11 yrs, I… pic.twitter.com/tqmpoyUzt4— Punjab Spectrum (@PunjabSpectrum) July 10, 2025ఈ నేపథ్యంలో సీఎం మాన్‌ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ మండిపడింది. ప్రధాని విదేశీ పర్యటనలపై రాష్ట్రంలోని ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని మాన్‌ పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించేవని మండిపడింది. భారత్‌తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదని పేర్కొంది.కాంగ్రెస్‌ కౌంటర్‌..మరోవైపు.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్‌ నేతలు సైతం విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌.. ప్రధాని మరో విదేశీ పర్యటనకు వెళ్లేలోపు ఓ మూడు వారాలు మన దేశంలో ఉంటారేమో! ఇప్పుడైనా మణిపూర్‌ వెళ్లడానికి ఆయనకు తీరిక దొరుకుతుందో, లేదో అని ఆయన ఎద్దేవా చేశారు. ఇక, మణిపూర్‌ విషయమై.. ఇప్పటికే కాంగ్రెస్‌.. మోదీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement