
ఎవరికి ఎప్పుడు అదృష్టం కలిసొస్తుందో తెలీదు. ఇప్పుడే అని చెప్పలేం కూడా

అలా కొన్ని సినిమాలకే అద్భుతమైన స్టార్‌డమ్ అందుకుంది పూజా హెగ్డే

కన్నడ మూలాలున్న ఈ బ్యూటీ ముంబైలో పుట్టి పెరిగింది

మోడలింగ్ చేసి సినిమాల్లోకి వచ్చింది. తొలుత 'మాస్క్' అనే తమిళ మూవీ చేసింది

'ఒక లైలా కోసం', 'ముకుంద' చిత్రాలతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది

అప్పటినుంచి తెలుగులోనే వరస సినిమాలు చేస్తూ ఇక్కడ సెటిలైపోయింది

అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' మూవీతో స్టార్ హీరోయిన్ అయిపోయింది

అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో లాంటి చిత్రాలు బోలెడంత క్రేజ్ తెచ్చిపెట్టాయి

కానీ ఆ తర్వాత పూజా హెగ్డే బ్యాడ్ టైమ్ మొదలైందని చెప్పాలి

ఎందుకంటే చేసినా సినిమా చేసినట్లే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో పూజా కెరీర్ డౌన్ అయిపోయింది

రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రాల ఫెయిల్యూర్ ఈమె కెరీర్‌పై ప్రభావం చూపింది

అలా అని ఈమె ఖాళీగా ఏం లేదు. సూర్య 44, దళపతి విజయ్ 69వ మూవీస్ ప్రస్తుతం చేస్తోంది

ఇవి హిట్ అయితే సరేసరి. లేదంటే మాత్రం పూజా హెగ్డే కెరీర్ ప్రశ్నార్ధకమే అని చెప్పొచ్చు

గ్లామర్ పరంగా ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే పూజా హెగ్డే.. ఫ్లాప్స్ వల్ల కాస్త వెనకబడింది అంతే!





