
బిగ్‌బాస్ షోలో ఈసారి 14 మంది వచ్చారు. వీళ్లలో తలో ఏడుగురు అమ్మాయిలు, అబ్బాయిలు.

అయితే మొత్తంగా చూసుకుంటే ఒకరిద్దరు తప్పితే పెద్దగా తెలిసిన ముఖాలు లేవు.

కానీ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బ్యూటీగా సోనియా ఆకుల హౌసులోకి అడుగుపెట్టింది.

గతంలో అషూరెడ్డి, అరియానా, ఇనయా సుల్తానా.. ఆర్జీవీతో ఫేమస్ అయి హౌసులోకి వచ్చారు.

ఇప్పుడు ఆ లిస్టులోకి తెలంగాణకు చెందిన సోనియా ఆకుల కూడా చేరిపోయిందని చెప్పొచ్చు.

తెలంగాణలోని మంథని ప్రాంతానికి చెందిన సోనియా.. మంచి అందగత్తె, సోషల్ వర్కర్ కూడా.

తాను కరాటే ఫైటర్ అని చెప్పి ఏకంగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునే షాకయ్యేలా చేసింది.

రాంగోపాల్ వర్మ తీసిన 'కరోనా వైరస్', 'ఆశ ఎన్ కౌంటర్' సినిమాల్లో కీలక పాత్రలు చేసింది.

అంతకుముందు 'జార్జ్ రెడ్డి' మూవీలో హీరోగా చెల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది.

చూస్తుంటే ఫైర్ బ్రాండ్‌లా అనిపిస్తున్న సోనియా.. హౌసులో ఎలాంటి ఫెర్ఫారెన్స్ ఇస్తాదో చూడాలి?






