
అనుష్క పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు తెగ మురిసిపోతారు.

ఎందుకంటే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది

'అరుంధతి' సినిమా అయితే అనుష్క లైఫ్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్

ఈ రోజు (నవంబర్ 07) స్వీటీ అనుష్క శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం

ఈమె అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల కోసం అనుష్కగా పేరు మార్చుకుంది

నాగార్జున 'సూపర్' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది

కెరీర్ మొదట్లో చిరంజీవి 'స్టాలిన్' చిత్రంలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది

ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్గా దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసింది

'అరుంధతి' సినిమాతో అనుష్క రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది

దీని తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చాలా చేసింది. కానీ 'అరుంధతి'ని మాత్రం అందుకోలేకపోయాయి

'బాహుబలి' ఫ్రాంచైజీలో యువరాణి దేవసేనగా అత్యద్భుతమైన నటనతో కట్టిపడేసింది

ఇది చేస్తున్న టైంలోనే 'సైజ్ జీరో' మూవీ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం నిజంగానే బరువు పెరిగింది

పెరగడం అయితే పెరిగింది. కానీ తగ్గే క్రమంలో చాలా ఇబ్బంది పడింది

ఓవర్ వెయిట్ వల్ల సినిమాలు చేయడం తగ్గించేసింది. బయటకు కనిపించడం మానేసింది

'సైజ్ జీరో' సినిమా అనుష్క చేసిన అది పెద్ద తప్పని చెప్పొచ్చు

40 ఏళ్లు దాటినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.
























