ప్రధాన వార్తలు

ట్రంప్, పుతిన్ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్!
అలాస్కా: అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు. కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.#WATCH | Alaska, USA | US President Donald Trump says, "We had a very productive meeting, there were many points that we agreed on. Couple of big ones that we haven't quite gotten there but we made some headway. There's no deal until there's a deal so I will call up NATO in a… pic.twitter.com/mY5t9zkoCT— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో డీల్ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉంది. ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు. పుతిన్‌తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్ నిరాకరించారు. #WATCH | Alaska, USA | Russian President Vladimir Putin says, "... We see the strive of the administration and President Trump personally to help facilitate the resolution of the Ukrainian conflict and his strive to get to the crux of the matter to understand this history is… pic.twitter.com/kiOKgw2JBf— ANI (@ANI) August 15, 2025అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. కాగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.#WATCH | Alaska, USA | "Next time in Moscow," says Russian President Vladimir Putin as US President Trump thanks his counterpart for today's meeting."... I could see it happening," replies President Trump.Source: The White House/ YouTube pic.twitter.com/N3U6Rygllj— ANI (@ANI) August 15, 2025 పుతిన్‌కు ఘన స్వాగతం..ఇదిలా ఉండగా.. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్, పుతిన్ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్‌హౌస్, క్రెమ్లిన్లు ప్రకటించాయి.#WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin exchange greetings in Anchorage, ahead of their talks.Source: Reuters pic.twitter.com/mdGoQe6qqx— ANI (@ANI) August 15, 2025 అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్‌కు చేరుకున్నారు. అక్కడ పుతిన్‌కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ట్రంప్‌కు చెందిన వాహనంలో సమావేశాని భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కథ మళ్లీ ముందుకే వచ్చింది. #WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin share the same car to reach the venue for their talks. Source: Reuters pic.twitter.com/X9YkJvqb6g— ANI (@ANI) August 15, 2025

‘ముద్దు’ల ముచ్చట.. ‘కూన’ నైట్ కాలింగ్..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం పట్నం బజారు (గుంటూరు), కళ్యాణదుర్గం: దేశమంతా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటున్న వేళ.. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించి ప్రవర్తిస్తుండటంతో మహిళలు రక్షణ కరువై అల్లాడుతున్నారు. పైశాచిక వేధింపులతో గుండె బరువై రాలిపోతున్నారు. బాధ్యత మరిచిన టీడీపీ ప్రజాప్రతినిధుల విశృంఖల వైఖరితో మహిళలు బెంబేలెత్తుతున్నారు. కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతోంది. విద్యాధికులైన మహిళలను సైతం కామ పిశాచాలు వేధిస్తుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కళ్లు మూసుకుని కూర్చున్నారు! కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళా ఉద్యోగులు కార్యాలయాలకు రావాలంటే వణికిపోతున్నారు. రాత్రిపూట పార్టీ కార్యాలయాలకు పిలుస్తూ.. వీడియో కాల్స్ చేసి వేధింపులకు దిగుతున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన అఘాయిత్యాలు.. గుంటూరు ఎమ్మెల్యే ‘ముద్దు’ వీడియోలు మహిళల పట్ల ఏడాది పాలనలో జరుగుతున్న దుశ్చర్యలకు మచ్చు తునకగా నిలుస్తున్నాయి. ‘కూన’ వీడియో కాల్స్...!‘ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్ రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయాలకు రావాలని తన అనుచరులతో పిలిపిస్తారు. చాలాసేపు అక్కడే ఉంచుతారు. రాత్రి 10.30 దాటిన తర్వాత వీడియో కాల్ చేసి వేధిస్తుంటాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. సాధారణ కాల్స్ చేయరు. వీడియో కాల్ అయితేనే మాట్లాడతారని అనుచరులతో చెప్పిస్తారు. దుర్బుద్ధితోనే ఇదంతా... దారికి రాలేదని వేధింపులకు గురి చేస్తున్నారు. నాలా నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలను కున్నా...!’టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు ఎదుర్కొన్న పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆవేదన ఇదీ! దళితురాలిని తీవ్రంగా వేధించారంటూ బాధితురాలు కన్నీరు మున్నీరవుతున్నారు. కూన రవికుమార్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఇద్దరు మనుషులను పంపించి కేజీబీవీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో తనకు వ్యతిరేకంగా బలవంతంగా సంతకాలు చేయించినట్లు తెలిపారు. అధికారులు తనకు అండగా ఉండకపోగా ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారని వాపోయారు. కాగా గార, కంచిలి కేజీబీవీల ప్రిన్సిపాళ్లపై కూడా వ్యూహాత్మకంగా ఫిర్యాదులు చేయించి బదిలీలు చేయించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.బలిపశువుని చేస్తున్నారు..!గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ ‘ముద్దు’ దృశ్యాల వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలిపశువుని చేస్తున్నారంటూ పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ శుక్రవారం ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పార్టీ నాయకురాలు గుడిపల్లి వాణితో ఎమ్మెల్యే వివాహేతర సంబంధం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసని సూఫియా మీడియాతో పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్త నవీన్‌కృష్ణ స్వయంగా రికార్డ్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే నసీర్‌కు చెప్పడంతో రెండు రోజులు మాట్లాడకుండా ఉండమన్నారని చెప్పారు. గుడిపల్లి వాణి కుటుంబంతో ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేసుకుని తనని ఇరికించే యత్నం చేస్తున్నారని చెప్పారు. నవీన్‌కృష్ణ ఫోన్లో ఉన్న వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. కళ్యాణదుర్గంలో గర్భిణి బలవన్మరణం..‘భర్త, అత్త మామల వేధింపులు తాళలేక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదు. నా ఫిర్యాదును పోలీసోళ్లు మార్చేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నాకు అన్యాయం చేశారు..’ అని విలపిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిండు గర్భిణి శ్రావణి (22) ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన దయనీయ పరిస్థితిని ఫోన్లో ఆడియో రికార్డ్ చేసి తనువు చాలించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకోగా... శుక్రవారం ఉదయం మృతురాలి ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదా..?కళ్యాణదుర్గానికే చెందిన శ్రీనివాసులుతో మూడేళ్ల క్రితం శ్రావణికి వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త,అత్త మామలు తరచూ వేధించడంతో కళ్యాణదుర్గం పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్లు శ్రావణి పేర్కొంది. స్థానిక టీడీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ వైపీ రమేష్, మాజీ వైస్ చైర్మన్ శర్మస్ వలి ఒత్తిళ్లతో సీఐ దీన్ని మరో రకంగా మార్చేసి భర్త, అత్తమా మలకు అనుకూలంగా వ్యవహరించారని ఆడియోలో మృతురాలు కన్నీరు మున్నీరైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు తాను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నామని, కనీసం తన మొదటి బిడ్డకైనా (రెండేళ్ల చిన్నారి) న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ప్రభుత్వంలో ఇక న్యాయం జరగదా? అని ఆక్రోశించింది. ఈమేరకు ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి పుట్టింట్లో ఉరేసుకుని తనువు చాలించింది. దీనిపై పట్టణ సీఐ యువరాజును వివరణ కోరగా.. మృతురాలు ఆరోపించినట్లుగా తాము నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు.

ట్రంప్‌కు జాన్ బోల్టన్ హెచ్చరిక.. ‘మాస్కో, బీజింగ్, ఢిల్లీ ఒక్కటైతే..’
వాషింగ్టన్: అమెరికా- భారత్ మధ్య వాణిజ్య సుంకాల యుద్ధం నడుస్తోంది. ఈ నేపధ్యంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మండిపడ్డారు. ట్రంప్ చర్యతో భారత్.. చైనా-రష్యా కూటమికి దగ్గరవుతుందని, ఇది అమెరికా అధ్యక్షుని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమిస్తుందని జాన్ బోల్టన్ పేర్కొన్నారు.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించడాన్ని జాన్ బోల్టన్ తప్పుబట్టారు. అలాస్కాలోని యాంకరేజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా కౌంటర్ వ్లాదిమిర్ పుతిన్‌ల సమావేశ సమయంలో జాన్ బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై సుంకాలు విధించారని అయితే ఇదేవిధంగా రష్యా నుండి అత్యధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అదనపు సుంకాలను విధించలేదన్నారు. ఈ చర్య భారతదేశాన్ని చైనా-రష్యా కూటమి వైపు ఆకర్షితమయ్యేలా చేయవచ్చని బోల్టన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.‘Unforced error’: John Bolton calls Trump’s anti-India pitch lack of strategic thinking https://t.co/CVDLrD07ll— Financial Express (@FinancialXpress) August 15, 2025సీఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడుతూ, రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారతదేశం లాంటి దేశాలపై వైట్ హౌస్ ద్వితీయ సుంకాలను విధించిందని అన్నారు. భారతదేశంపై 25 శాతం సుంకం విధించిందని. అయితే ఇది ఇంకా అమలు కాలేదన్నారు. దీనిపై భారత్ చాలా ఆగ్రహంతో ఉన్నదని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అలాంటి సుంకం విధించకుండా భారత్‌పైననే విధించడమేమిటని బోల్టన్ ప్రశ్నించారు. మాస్కో, బీజింగ్, ఢిల్లీ(మూడు దేశాల రాజధానులు) ఒక్కటైతే అమెరికాపై ప్రతికూల పరిణామాలు తలెత్తవచ్చని హెచ్చరించారు. 2018 తర్వాత పుతిన్ భారత్ పర్యటన, భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలు అమెరికాపై ప్రతికూల పరిణామాలకు ఉదాహరణలు కావచ్చని బోల్టన్ అన్నారు. ట్రంప్ ఎటువంటి సంప్రదింపులు లేకుండా సుంకాల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బోల్టన్ ఆరోపించారు. ఇటీవల ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఈ పర్యటన 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరుగనుంది. మరోవైపు ఈ నెల చివరిలో ప్రధాని మోదీ చైనాను సందర్శించే అవకాశం ఉంది. ఆగస్టు 31- సెప్టెంబర్ ఒకటి మధ్య టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

పుతిన్ ఆలోచన అదే.. రష్యాపై విరుచుకుపడిన జెలెన్ స్కీ
కీవ్: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన భేటీ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, పుతిన్ జరిపే చర్చల సఫలం కావు అంటూ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం పుతిన్‌కు లేదంటూ విమర్శలు చేశారు. అందువల్లే ఈ భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్ స్కీ అభివర్ణిస్తున్నారు.అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య భేటీ జరుగుతున్న నేపథ్యంలో జెలెన్ స్కీ స్పందించారు. ఈ సందర్బంగా జెలెన్ స్కీ ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లేకుండా ట్రంప్, పుతిన్ చర్చలేంటి?. ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న రోజున కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం మాస్కోకు లేదని మరోసారి నిరూపితం అయ్యింది. యుద్ధానికి సరైన ముగింపు ఎలా సాధించాలనే దానిపై ఉక్రెయిన్.. వాషింగ్టన్, యూరోపియన్ మిత్రదేశాలతో చర్చలు జరుపుతోంది. ఆయా దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్ సాధ్యమైనంత పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము అమెరికా నుండి బలమైన స్థానాన్ని ఆశిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.On the day of negotiations, the Russians are killing as well. And that speaks volumes. Recently, weʼve discussed with the U.S. and Europeans what can truly work. Everyone needs a just end to the war. Ukraine is ready to work as productively as possible to bring the war to an end,… pic.twitter.com/tmN8F4jDzl— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 15, 2025ఉక్రెయిన్ డిమాండ్స్ ఇవే?రష్యాతో ఘర్షణలో బాధిత దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ భాగస్వామి చేయకుండా ట్రంప్, పుతిన్ జరిపే చర్చలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కారణంగానే వీరి భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్స్కీ అభివర్ణిస్తున్నారు.శాంతి చర్చలు జరపాలంటే రష్యా బేషరతుగా కాల్పుల విరమణను ప్రకటించాలన్నది ఉక్రెయిన్ డిమాండ్. రష్యాకు తమ భూభాగాల అప్పగింత ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని, రష్యా అపహరించుకుపోయిన తమ దేశ చిన్నారులను తిరిగి అప్పగించాలని కోరుతోంది.భవిష్యత్తులో తమ దేశంపై రష్యా దాడి చేయకుండా రక్షణలు కల్పించాలని పట్టుబడుతోంది.రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది.అవసరమైతే వాటిని మళ్లీ విధించేందుకు అవకాశం ఉండాలి. మరోవైపు.. అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ ఎలాంటి ఫలితం తేల్చకుండానే ముగిసిపోయింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ట్రంప్ స్పందిస్తూ.. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు.

అయ్యా రేవంత్ రెడ్డి పదవులూ మీకే.. పైసలూ మీకేనా?
సంస్థాన్ నారాయణపురం: ‘పదవుల్లో మీరే ఉంటరు.. పైసలు మీరే తీసుకుంటరు. నాకు పదవి ఇవ్వకపోయినా నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘పదవి వచ్చేటప్పుడు వస్తుంది. మనను ఎవరూ ఆపలేరు. పదవులు మీకే.. పైసల్ మీకే అని కొన్ని రోజుల కిందట అన్నాను. సీఎం రేవంత్‌రెడ్డిని అన్నానని తెలుసు కదా. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదు. మంత్రి దగ్గరకి వెళ్లి అడిగినా రాలే. పనిచేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించమంటున్నారు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్ చేతిలో ఉంది. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి’ అని వ్యాఖ్యానించారు. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.

ఇంగ్లండ్ ‘టీ20’ జట్టు కెప్టెన్‌గా జేకబ్ బెతెల్.. ప్రకటన విడుదల
టీమిండియాతో ప్రతిష్టాత్మక ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ తర్వాత ఇంగ్లండ్.. సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న ఇంగ్లిష్ జట్టు.. తదుపరి ప్రొటిస్ టీమ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.సొంతగడ్డపై జరిగే ఈ వైట్‌బాల్ సిరీస్‌లకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తాజాగా వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఈ జట్లలో ఆల్‌రౌండర్ రెహాన్ చోటు దక్కించుకున్నాడు. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.మరోవైపు.. పేసర్ సోనీ బేకర్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక నాలుగేళ్ల విరామం తర్వాత టీమిండియాతో టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేసిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా సౌతాఫ్రికాతో సిరీస్‌లలో పాల్గొననున్నాడు.వీరితో పాటు ల్యూక్ వుడ్, లియామ్ డాసన్‌ను కూడా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక ప్రొటిస్ జట్టుతో సిరీస్‌లు ముగిసిన అనంతరం.. ఇంగ్లండ్ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టుకు యువ సంచలనం జేకబ్ బెతెల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.రెగ్యులర్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. సారథ్య బాధ్యతలను జేకబ్‌కు అప్పగించారు. ఇక లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీతో పాటు మాథ్యూ పాట్స్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఐర్లాండ్‌తో సిరీస్ నేపథ్యంలో మార్కస్ ట్రెస్కోతిక్ ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు.సౌతాఫ్రికాతో వన్డేలకు ఇంగ్లండ్ జట్టుహ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేకబ్ బేతెల్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్.సౌతాఫ్రికాతో టీ20లకు ఇంగ్లండ్ జట్టుహ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జేకబ్ బెతెల్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, ల్యూక్ వుడ్.ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టుజేకబ్ బెతెల్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, లియామ్ డాసన్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్.

చిరంజీవి బర్త్‌డే గిఫ్ట్స్.. అభిమానులకు పండగే
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వంభర’ నుంచి మరో టీజర్ విడుదల కానుంది. ఈమేరకు షోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది... కానీ కుదర్లేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. అయితే, ఈ మూవీకి సంబంధించి విడుదలై మొదటి టీజర్ గ్రాఫిక్స్ వర్క్‌పై విమర్శలు వచ్చాయి. ఆ సమయం నుంచి పెద్దగా అప్డేట్స్ మాత్రం బయటకు రావడం లేదు.విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠి పలు జాగ్రత్తలు తీసుకున్నారట. మరింత సమయం తీసుకున్నా సరే సినిమా హిట్ కావాలనే సంకల్పంతో పనిచేశాడట. ఈ క్రమంలోనే ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు వస్తుండటంతో అభిమానులు విశ్వంభర నుంచి ఏదైనా గిఫ్ట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీజర్‌ను సిద్ధం చేసింది చిత్ర బృందం. ఆపై విడుదల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు అనిల్ రావిపూడి కూడా చిరు పుట్టినరోజుకు కానుక ఇవ్వాలని చూస్తున్నారట. సినిమా టైటిల్ ప్రకటించాలని ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.విశ్వంభర అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో త్రిష హీరోయిన్గా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఇదే ఏడాది చివర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.

అడ్డగోలుగా డ్రోన్ల రిజిస్ట్రేషన్..
నిబంధనలను విరుద్ధంగా రిజిస్టర్ అయిన వేలాది డ్రోన్లు, వాటి కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు భారత విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డ్రోన్ రిజిస్ట్రేషన్లపై విస్తృత సమీక్ష చేపట్టింది. దిగుమతి నిషేధాలు, తప్పనిసరి నిబంధనలను పాటించకుండా చాలా డ్రోన్లు రిజిస్టర్ అయ్యాయని నివేదికలు వెల్లడైన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రధానంగా చైనా సంస్థలకు చెందిన డ్రోన్లు దేశీయంగా తప్పుడు కారణాలతో నమోదయ్యాయనే వాదనలున్నట్లు తెలిపింది.2021 నుంచి దిగుమతిలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ 8,700కి పైగా చైనా డ్రోన్లు భారతదేశంలో నమోదయ్యాయని జులై 29న ఓ వార్తా సంస్థ కోరిక మేరకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. డ్రోన్ అనుమతులు పొందడానికి తప్పుడు డిక్లరేషన్లను ఉపయోగించే సంస్థలు అధికారిక రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌లైన డిజిటల్ స్కై, ఈ-జీసీఏలను దుర్వినియోగం చేస్తున్నాయని డీజీసీఏ ఇటీవల జారీ చేసిన నోటీసులో పేర్కొంది. కొంతమంది ఆపరేటర్లు తప్పుడు కేటగిరీల కింద యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లను (యూఐఎన్) జనరేట్ చేసేటప్పుడు సర్టిఫికేషన్ ప్రక్రియను దాటవేయడంతో తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నట్లు నోటీసు ఎత్తిచూపింది.ముఖ్యంగా చాలా మంది దరఖాస్తుదారులు కఠినమైన కమర్షియల్ నిబంధనలను పాటించకుండా ఉండడానికి తమ డ్రోన్లను ‘మోడల్ ఆర్పీఏఎస్’ సబ్‌కేటగిరీ కింద తప్పుగా వర్గీకరించారు. ఇవి విద్య, పరిశోధన, పరీక్ష లేదా వినోద ఉపయోగం కోసం ఉద్దేశించినవి. కానీ వాటిని ఇతర అవసరాల కోసం వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది నిబంధనల ఉల్లంఘనేనని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి దుర్వినియోగం పౌర విమానయాన వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడమే కాకుండా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు.ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్‌లతో స్వావలంబనడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నుంచి అవసరమైన దిగుమతి అనుమతులు లేకుండానే పలు డ్రోన్లను విదేశాల్లో తయారు చేసి భారత్‌లోకి తీసుకువచ్చినట్లు డీజీసీఏ వెల్లడించింది. 2022 డీజీఎఫ్టీ నోటిఫికేషన్ ప్రకారం రక్షణ, పరిశోధన, అభివృద్ధి, భద్రతకు సంబంధించిన ప్రయోజనాలు మినహా డ్రోన్ల దిగుమతులు నిషిద్ధం. కొనుగోలు ఇన్వాయిస్లు, దిగుమతి అనుమతులు, డ్రోన్ ఛాయాచిత్రాలు వంటి మద్దతు పత్రాలతో పాటు లిఖితపూర్వక వివరణ ఇవ్వడానికి బాధిత డ్రోన్ కంపెనీలకు ఏవియేషన్ రెగ్యులేటర్ సెప్టెంబర్ 12 వరకు గడువు ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌ను సమర్థించడంలో విఫలమైతే యూఐఎన్లను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. వాటితోపాటు చట్టపరమైన చర్యలు ఉంటాయి.

కృష్ణం వందే జగద్గురుమ్
చాలామంది కృష్ణుడంటే అల్లరి, చిలిపితనం, మాయలు, మహిమలు... అనే అనుకుంటారు. కానీ కృష్ణుడంటే ఒక చైతన్యం. ఒక స్ఫూర్తి. ఎందుకంటే తానో రాజు కొడుకైనా సామాన్య గోపబాలురతో చెలిమి చేశాడు. అల్లరి పనులతో బాల్యాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాడు. అంతేకాదు, యవ్వనంలో ఉండే చిన్న చిన్న సరదాలనూ చూపించాడు. బంధాలను నిలుపుకోవడంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, స్నేహం... ఏదైనా సరే పది కాలాల పాటు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో వివరించాడు. భగవద్గీత ద్వారా ఈ సారాన్ని ప్రపంచానికి అందించాడు. నేడు కృష్ణాష్టమి సందర్భంగా ఆయన చెప్పిన ఆ పాఠాలను అర్థం చేసుకుందాం...స్నేహానికి ప్రాణంచిన్నప్పుడు గోపబాలురతో అరమరికలు లేకుండా హాయిగా ఆడుకున్న శ్రీ కృష్ణుడు స్నేహితులకు, శరణార్థులకూ మాట ఇచ్చాడంటే తప్పడం అన్నది లేదు. ‘కురుక్షేత్రంలో ఆయుధం పట్టను’ అని చెప్పాడు. ఆ మాట మీదే నిలబడ్డాడు. అంతేకాదు. అర్జునుడితో చుట్టరికం ఉన్నప్పటికీ అంతకు మించి ఆప్యాయతను చూపించాడు. శ్రీ కృష్ణుడు, కుచేలుడి గురించి ఎలా చెప్పుకుంటారో అదే విధంగా శ్రీకృష్ణుడు, అర్జునుడి బంధం గురించి కూడా మాట్లాడతారు. పాండవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అండగా నిలిచాడు. వారికి దిక్కుతోచనప్పుడు మార్గదర్శిగా మారాడు. యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఇవన్నీ కేవలం స్నేహం కోసం చేసినవే.ఒక భరోసా... ఒక నమ్మకంనమ్మకం అనేది ఏ బంధంలో అయినా ముఖ్యం. నమ్మకం పోగొట్టుకోడానికి ఎంతోసేపు పట్టదు. కానీ సంపాదించుకోడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కృష్ణుడు చెప్పింది కూడా ఇదే. ‘నన్ను పూర్తిగా నమ్ము.. అంతా నేను చూసుకుంటాను’ అనే భరోసా ఇచ్చాడందరికీ. అందరికన్నా ముందుగా అర్జునుడికి. ఆ నమ్మకంతోనే యుద్ధంలో పోరాడాడు అర్జునుడు. అంగబలం, అర్థబలం, అధికార బలం, సైనిక బలం ఉన్న కౌరవులపై యుద్ధంలో పాండవులు పైచేయి సాధించగలిగారంటే అందుకు కృష్ణుడే కారణం.స్థాయీ భేదాలు చూపలేదు...అవతలి వాళ్ల స్థాయి ఏంటి... వారు ఎలాంటి హోదాలో ఉన్నారు అన్నది పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలని బోధించాడు కృష్ణుడు. అందుకే సాయం కోసం వచ్చిన కుచేలుడి మనసు అర్థం చేసుకుని ఆనందాన్ని అందించాడు. అదే సమయంలో గౌరవం చూపించాడు. కేవలం స్నేహితులు అనే కాదు. ప్రేమికులు, భార్యా భర్తలు...ఇలా ఏ బంధంలో అయినా సరే అందరినీ సమానంగా చూస్తే ఎలాంటి చిక్కులూ రావని, పరస్పరం గౌరవించుకుంటే సమస్యలే ఉండవని నిరూపించాడు.క్షమాగుణంతప్పులు అందరూ చేస్తారు. కొన్నిసార్లు తెలియక, కొన్ని సార్లు తెలిసి అవి జరుగుతుంటాయి. అంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అయిపోడు. వాళ్లపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు. మిత్రులనే కాదు. శత్రువులను కూడా ఒకే రకంగా ఆదరించడంలో కృష్ణుడు ముందుండే వాడు. ఆ మాత్రం క్షమాగుణం లేకపోతే బంధం ఎలా నిలబడుతుంది? మేనత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడు చేసిన వంద తప్పులను మన్నించాడు. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ల నుంచి ఏవేవో ఆశించకుండా పూర్తిగా డిటాచ్డ్గా ఉండాలని బోధించాడు కృష్ణుడు.పరిపూర్ణ జీవితంకృష్ణుడంటే అన్ని బంధాలనూ ఆస్వాదించిన వాడని మరచిపోరాదు. బాల్యంలోనే కన్న తల్లిదండ్రులకు దూరమైనా, పెంచిన తల్లిదండ్రులను పరిపూర్ణంగా ప్రేమించాడు. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులకూ సాంత్వన నిచ్చాడు. పదహారు వేలమంది గోపికలకూ తన ప్రేమను పంచాడు. అష్టమహిషులనూ అదేవిధంగా ఆదరించాడు. తనను నమ్మి వచ్చిన ఎవ్వరికీ ఏ లోటూ రానివ్వలేదు. తాను సంతోషంగా ఉన్నాడు. తనతో ఉన్న వారిని అదేరీతిలో ఉంచాడు.వ్యక్తిత్వ వికాస గురువుఇప్పుడు వస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నింటికీ మూలాధారం రణరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతే! వ్యక్తిత్వ వికాస బోధకులకు కృష్ణుడే గాడ్ ఫాదర్. అందుకే కృష్ణుడు పరమాత్ముడే కాదు.. అందరికీ పరమ ఆప్తుడు... జగద్గురువు కూడా!– డి.వి.ఆర్.

ఈ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు.. వాహనయోగం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.అష్టమి రా.10.54 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: భరణి ఉ.8.29 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.7.39 నుండి 9.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: తె.4.33 నుండి 6.01 వరకు (తెల్లవారితే ఆదివారం), శ్రీకృష్ణాష్టమి.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.23రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.వృషభం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. పనుల్లో ఆటంకాలు. కాంట్రాక్టులు చేజారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. వాహనాలు కొంటారు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ముందడుగు.కర్కాటకం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి.సింహం: సన్నిహితులతో అకారణ వైరం. చర్చలు ఫలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కన్య: రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.తుల: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.మకరం: విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. కష్టించినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది పరుస్తాయి.కుంభం: వ్యవహారాలలో విజయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.మీనం: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
వీడియో: ట్రంప్ ఓవరాక్షన్ ప్లాన్.. పుతిన్‌నే భయపెట్టే ప్రయత్నం!
ఉప్పల్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై హత్యాచారం
ముంబైలో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
భార్యను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
అడ్డగోలుగా డ్రోన్ల రిజిస్ట్రేషన్..
చిరు మాజీ అల్లుడితో నటించిన బ్యూటీ.. 'కూలీ'తో వైరల్
ఇంగ్లండ్ ‘టీ20’ జట్టు కెప్టెన్‌గా జేకబ్ బెతెల్.. ప్రకటన విడుదల
ముకుందా.. ముకుందా..
ట్రంప్‌కు జాన్ బోల్టన్ హెచ్చరిక.. ‘మాస్కో, బీజింగ్, ఢిల్లీ ఒక్కటైతే..’
మహిళను కట్టేసి చితకబాదిన దాయాదులు
జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కాల్చిపడేస్తా ఖబడ్దార్!
వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
సచిన్‌కు కాబోయే కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా?
ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది.. సంఘంలో విశేష గౌరవం
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
‘వార్ 2 ’మూవీ రివ్యూ
విరిగిపడిన కొండ చరియలు.. హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జాం
మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా?.. వాహనాలకు ఆ రంగులేంటి?
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
మామూలు సమయంలోనే కనపడరు.. ఇక ఇప్పుడొచ్చి ఎలా ఆదుకుంటారనుకుంటున్నావ్!
దేశ ప్రజలకు శుభవార్త.. ట్యాక్స్‌పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
కెప్టెన్‌గా రుతురాజ్‌పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
శారీలో హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?
అనిల్ అంబానీకి భారీ విజయం
వీడియో: ట్రంప్ ఓవరాక్షన్ ప్లాన్.. పుతిన్‌నే భయపెట్టే ప్రయత్నం!
ఉప్పల్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై హత్యాచారం
ముంబైలో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
భార్యను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
అడ్డగోలుగా డ్రోన్ల రిజిస్ట్రేషన్..
చిరు మాజీ అల్లుడితో నటించిన బ్యూటీ.. 'కూలీ'తో వైరల్
ఇంగ్లండ్ ‘టీ20’ జట్టు కెప్టెన్‌గా జేకబ్ బెతెల్.. ప్రకటన విడుదల
ముకుందా.. ముకుందా..
ట్రంప్‌కు జాన్ బోల్టన్ హెచ్చరిక.. ‘మాస్కో, బీజింగ్, ఢిల్లీ ఒక్కటైతే..’
మహిళను కట్టేసి చితకబాదిన దాయాదులు
జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కాల్చిపడేస్తా ఖబడ్దార్!
వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
సచిన్‌కు కాబోయే కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా?
ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది.. సంఘంలో విశేష గౌరవం
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
‘వార్ 2 ’మూవీ రివ్యూ
విరిగిపడిన కొండ చరియలు.. హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జాం
మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా?.. వాహనాలకు ఆ రంగులేంటి?
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
మామూలు సమయంలోనే కనపడరు.. ఇక ఇప్పుడొచ్చి ఎలా ఆదుకుంటారనుకుంటున్నావ్!
దేశ ప్రజలకు శుభవార్త.. ట్యాక్స్‌పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
కెప్టెన్‌గా రుతురాజ్‌పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?
అనిల్ అంబానీకి భారీ విజయం
స్థిరంగా బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
సినిమా

హిందుస్తాన్... హిందుస్తాన్...
మేజర్ కుల్దీప్ సింగ్‌గా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ వెండితెరపైకి మళ్లీ వస్తున్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బోర్డర్ 2’. వరుణ్ ధావన్, దిల్జీత్ సింగ్, అహన్ శెట్టి, మేధా రాణా, మోనా సింగ్, సోనమ్ బజ్వా ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మేజర్ కుల్దీప్ సింగ్ పాత్రలో కనిపిస్తారు సన్నీ డియోల్. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘బోర్డర్ 2’ సినిమాలోని సన్నీ డియోల్ పాత్ర తాలూకు మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.‘హిందుస్తాన్... హిందుస్తాన్... మేరీ జాన్ హిందుస్తాన్’ అనే పాటతో ఈ మోషన్‌పోస్టర్ సాగుతుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో భూషణ్ కుమార్, క్రిషణ్‌కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 22న విడుదల కానుంది. అయితే ఈ సినిమాను తొలుత జనవరి 23న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఒకరోజు ముందుగా... జనవరి 22న విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.ఇక 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘బోర్డర్’ (1997) సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ రూపొందింది. ‘‘27 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఓ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఓ సైనికుడు తిరిగి వస్తున్నాడు’’ అంటూ ఈ సినిమాను ప్రకటించిన సమయంలో ఈ చిత్రబృందం పేర్కొంది.

అమ్మవారి ఆలయంలో పాపులర్ నటి.. ఎవరో తెలుసా?
తెలుగింటికి చెందిన కోమలి ప్రసాద్ ( Komalee Prasad) తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆమె దర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారిని ఈ బ్యూటీ తాజాగా హిట్ 3 సినిమాతో పాపులారిటీ పెంచుకుంది. ఇక త్వరలోనే ‘శశివదనే’ చిత్రంతో తెరపైకి రాబోతుంది. వైజాగ్‌కు చెందిన కోమలి ప్రసాద్లో నటి మాత్రమే కాకుండా జాతీయస్థాయి అథ్లెట్, క్లాసికల్ నృత్య కళాకారిణి అంటూ పలు రంగాల్లో ప్రతిభ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈమె రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ కళాకారిణి కూడా. విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి.ఇప్పటికే తెలుగులో నెపోలియన్,హిట్2, రౌడీ బాయ్స్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి పలు చిత్రాల్లో నటించిన కోమలి ప్రసాద్ హిట్–3 చిత్రంలో ఏఎస్పీ వర్షాగా చాలా కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈపాత్ర కోసం జాతీయస్థాయి బాక్సర్ అనిల్ వద్ద శిక్షణ పొందారు. View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad)

మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం.. 'అమ్మ' ప్రెసిడెంట్‌గా శ్వేతా మీనన్
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) ప్రెసిడెంట్‌గా తొలిసారి ఒక మహిళ ఎన్నికయ్యారు. నటుడు, బీజేపీ నాయకుడు దేవన్‌తో గట్టి పోటీ ఎదుర్కొని ఆమె గెలుపొందారు. దీంతో మలయాళ చిత్రపరిశ్రమలో తొలిసారిగా మహిళా అధ్యక్షురాలిగా నటి శ్వేతా మీనన్‌ను రికార్డ్ క్రియేట్ చేశారు. శ్వేతతో పాటు, నటి కుక్కు పరమేశ్వరన్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు, నటి అన్సిబా హసన్ జాయింట్ సెక్రటరీగా ఎగ్జిక్యూటివ్ కమిటీకి తిరిగి వచ్చారు. వీరిలో ముగ్గురు మహిళలు కీలక నాయకత్వ పాత్రల్లో ఉన్నారు. అదనంగా, జయన్ చెర్తాల, లక్ష్మీ ప్రియ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిన జస్టిస్ హేమా కమిటీ నివేదిక విడుదలైన తర్వాత ‘అమ్మ’ అధ్యక్షురాలిగా శ్వేతా మేనన్ ఎంపిక కావడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ (Hema Committee report) తేల్చింది. దీంతో దీంతో నైతిక బాధ్యతగా ‘అమ్మ’ సంఘానికి అధ్యక్షుడిగా మోహన్‌లాల్ (Mohanlal) గతేడాదిలోనే రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న పాలక మండలి కూడా పదవుల నుంచి వైదొలిగింది. దీంతో మళ్లీ ఎన్నికలు జరిగాయి. తన విజయం తర్వాత శ్వేతా మీనన్ సంతోషం వ్యక్తం చేశారు. మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి వంటి స్టార్స్ మద్ధతు తనకు చాలా అవసరమని ఆమె ఆశించారు.అశ్లీల సినిమాలో నటించారని ఎన్నికల ముందు కేసు నమోదుశ్వేతా మీనన్ ఎన్నికలకు ముందే ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. అశ్లీల కంటెంట్‌లో నటించిందనే ఆరోపణలతో కేరళ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటింటిన శ్వేతా మీనన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచేరి ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమె దాదాపు ఓడిపోతారని అందరూ అనుకున్నారు. అయితే, గెలిచి సత్తా చాటారు.కాగా.. శ్వేతా మీనన్.. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్లో నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కనిపించింది. బాలీవుడ్లో అశోక, బంధన్, హంగామా, రన్, కార్పొరేట్, శాండ్విచ్, కిస్సే ప్యార్ కరూన్ లాంటి సినిమాల్లో నటించింది. ఆమె చివరిగా 2024లో విడుదలైన మలయాళ చిత్రం జాంగర్, వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్‌లో మెప్పించింది. ఇటీవలే ఎంకిలే ఎన్నోడు పారా అనే మలయాళ షోను కూడా శ్వేత హోస్ట్ చేసింది. మలయాళంలో రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేసింది. View this post on Instagram A post shared by NEWS9 (@news9live)

జైలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. దూరంగా దర్శన్
క్రైం థ్రిల్లర్ సినిమాలను మించిన మలుపులు ప్రముఖ నటుడు దర్శన్ జీవితంలో జరుగుతున్నాయి. చిత్రదుర్గవాసి రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, ఆయన ప్రియురాలు నటి పవిత్రగౌడతో పాటు 15 మంది నిందితులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వారి బెయిలు రద్దు కావడంతో మళ్లీ చెరసాలకు వెళ్లాల్సి వచ్చింది.బెంగళూరు సెంట్రల్ జైలుకు దర్శన్‌ను తరలించారు. జైలులో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన హాజరుకాలేదని సమాచారం. జైలులో ఆయన రాత్రంతా మేల్కొని ఉన్నారని తెలుస్తోంది. దర్శన్ బెయిల్‌తో పాటు, పవిత్ర గౌడ బెయిల్‌ను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆమెను బెంగళూరులోని మహిళా జైలుకు తరలించారు.బెయిల్ రద్దుకాగానే నటి రమ్యా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చట్టం ముందు అందరూ సమానం అనే స్పష్టమైన సందేశం కోర్టు ద్వారా వచ్చింది. మన పని మనం చేయాలి. చివరిలో ఆశ, వెలుగు ఉంటుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు, న్యాయం అందరికీ లభిస్తుంది అని రేణుకాస్వామి కుటుంబానికి మద్దతుగా పేర్కొన్నారు.#WATCH | Bengaluru, Karnataka | The Police arrest actor Pavitra Gowda after the Supreme Court cancelled the bail granted to her by the High Court in the Renukaswamy murder case. Visuals from outside of Pavithra Gowda's residence. pic.twitter.com/jqf56st025— ANI (@ANI) August 14, 2025
క్రీడలు

చివరి ఓవర్లో ఛేదించి...
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్ కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు... వన్డే సిరీస్‌లో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన రెండో వన్డేలో భారత ‘ఎ’ జట్టు 2 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (87 బంతుల్లో 91; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కిమ్ గార్త్ (41 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో మిన్ను మణి 46 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా ... సైమా ఠాకూర్ 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. టిటాస్ సాధు, రాధా యాదవ్, ప్రేమ రావత్, తనూజ కన్వర్‌లకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత మహిళల ‘ఎ’ జట్టు 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రాధ యాదవ్ (78 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (71 బంతుల్లో 66; 9 ఫోర్లు), తనూజ కన్వర్ (57 బంతుల్లో 50; 3 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో కదంతొక్కారు. షఫాలీ వర్మ (4), ధారా గుజ్జర్ (0), తేజల్ హసబ్నిస్ (19), రాఘ్వీ బిస్త్ (14) విఫలమయ్యారు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఆరంభంలో యస్తిక ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఆ తర్వాత ఆ బాధ్యతను రాధ యాదవ్ సక్రమంగా నిర్వర్తించగా... ఆఖర్లో తనూజ అదరగొట్టింది. అర్ధశతకం అనంతరం రాధా యాదవ్ అవుట్ కావడంతో భారత జట్టు 193/7తో నిలిచింది. ఇక ఛేదన కష్టమే అనుకుంటున్న తరుణంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తనూజ కన్వర్ చక్కటి ఆటతీరుతో చెలరేగింది. ప్రేమ రావత్ (33 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 68 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించింది. చివరి ఓవర్ తొలి బంతికి తనూజ అవుట్ కావడంతో ఉత్కంఠ నెలకొన్నా... ప్రేమ రావత్ విజయానికి కావాల్సిన 5 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగానే జట్టును గెలిపించింది. ఇదే వేదికపై బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత ‘ఎ’ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం ఇక్కడే జరగనుంది.

అర్జున్‌కు మూడో స్థానం
చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో అనీశ్ గిరి (నెదర్లాండ్స్), అర్జున్, కార్తికేయన్ మురళీ (భారత్) 5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. దాంతో అనీశ్‌కు రెండో స్థానం, అర్జున్‌కు మూడో స్థానం, కార్తికేయన్‌కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. 7 పాయింట్లతో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్ చాంపియన్‌గా నిలిచాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు నిహాల్ సరీన్ 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో, విదిత్ 4 పాయింట్లతో ఏడో స్థానంలో, ప్రణవ్ 3 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహించారు. శుక్రవారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేముల్లో కీమెర్ 41 ఎత్తుల్లో రే రాబ్సన్ (అమెరికా)పై, అనీశ్ గిరి 33 ఎత్తుల్లో జోర్డెన్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. అర్జున్–కార్తికేయన్ గేమ్ 49 ఎత్తుల్లో... విదిత్ (భారత్)–లియాంగ్ (అమెరికా) గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. విజేత కీమెర్కు రూ. 25 లక్షలు... అనీశ్‌కు రూ. 15 లక్షలు... అర్జున్‌కు రూ. 10 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదే వేదికపై జరిగిన చాలెంజర్స్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రాణేశ్ 6.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. తద్వారా వచ్చే ఏడాది చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. హైదరాబాద్ ప్లేయర్ హారిక 1.5 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది.

కొత్త ‘క్రీడా విధానం’తో రాత మారిపోతుంది
న్యూఢిల్లీ: దేశంలోని క్రీడా వ్యవస్థలో పలు మార్పులను ఆశిస్తూ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ పాలసీ (ఎన్ఎస్పీ) బిల్‌కు ఇటీవలే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించింది. త్వరలోనే చట్టంగా మారనున్న ఈ బిల్లుతో క్రీడా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇచ్చిన ప్రసంగంలో ఆయన భారత క్రీడల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘అభివృద్ధిలో క్రీడలు కూడా ఒక భాగం. ఒకప్పుడు ఆటలు ఆడితే తల్లిదండ్రులు కోప్పడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రోత్సహించే వరకు పరిస్థితి మారడం సంతోషంగా ఉంది. ఇది మంచి సంకేతం. భారతీయ కుటుంబాల్లో క్రీడలు కూడా అంతర్భాగం కావడం నాకు గర్వంగా అనిపిస్తోంది. భారత భవిష్యత్తుకు కూడా ఇది చాలా మంచిది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్తగా అమల్లోకి రాబోయే స్పోర్ట్స్ పాలసీ దేశంలో పలు మార్పులకు శ్రీకారం చుడుతుందని, జవాబుదారీతనం పెంచుతుందని ఆయన అన్నారు. ‘క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకే పలు దశాబ్దాల తర్వాత కొత్త పాలసీని తీసుకొచ్చాం. పాఠశాలలనుంచి ఒలింపిక్స్ వరకు ఇది ఆటలను అభివృద్ధి చేసేలా ఉంటుంది. కోచింగ్, ఫిట్నెస్, మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించి ఒక వ్యవస్థను దీని ద్వారా రూపొందిస్తున్నాం. ఇది దేశంలోని మారుమూలలకు వెళ్లి పని చేస్తుంది’ అని మోదీ స్పష్టం చేశారు. ఫిట్నెస్, క్రీడల ప్రాధాన్యత గురించి వివరిస్తూ ప్రధాని... ప్రస్తుతం దేశంలో ఊబకాయం అతి పెద్ద సమస్యగా మారిందని, దీనిలో మార్పుల తేవాలంటే నూనెల వినియోగాన్ని తక్కువ చేయాలని సూచించారు.

టీమిండియాకు మరో సెహ్వాగ్ దొరికేశాడు..?
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ 2025లో అన్క్యాప్టెడ్ ఇండియన్ క్రికెటర్ మహ్మద్ తాహా తన అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ టోర్నీలో హుబ్లి టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తహా పరుగులు వరదపారిస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లలో సెంచరీలతో సత్తాచాటాడు.తొలుత ఆగస్టు 12న శివమొగ్గ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసిన తాహా.. అనంతరం ఆగస్టు 13న బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో మళ్లీ 101 పరుగులు చేశాడు. రెండు మ్యాచ్‌లలోనే మొత్తంగా 202 పరుగులు చేసిన తహా.. ఈ ఏడాది టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి స్ట్రైక్ రేట్ 190కు పైగా ఉండడం విశేషం. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్‌కు మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికేశాడని పోస్ట్‌లు పెడుతున్నారు. మరి కొంతమంది ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలంలో అతడిపై కాసుల వర్షం కురువనుందని అభిప్రాయపడుతున్నారు.ఎవరీ తాహా?బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల తహా మహ్మద్ తాహా 2016లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరపున టీ20 అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. దీంతో ఆ తర్వాత అతడికి పెద్దగా అవకాశాలు లభించలేదు. అతడు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడాడు. చివరిసారిగా 2017లో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక తరపున ఆడాడు.ఓవరాల్ కర్ణాటక తరపున 5 టీ20లు ఆడి 91 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తహాకు రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ఐపీఎల్-2012 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నెట్ బౌలర్‌గా తాహా పని చేశాడు. అతడు విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్లకు బౌలింగ్ చేశాడు.ది హిందూ రిపోర్ట్ ప్రకారం.. మహమ్మద్ తహా టన్‌బ్రిడ్జ్ హై స్కూల్లో చదువుకున్నాడు.తరువాత జైన్ విశ్వవిద్యాలయం నుండి బి.కామ్ డిగ్రీని పూర్తి చేశాడు. తహా తన 16 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. తహా తండ్రి అతన్ని కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ (KIOC) జాయిన్ చేశాడు. 2015లో తన తండ్రి మరణించిన తర్వాత పార్ట్ టైమ్ కోచ్‌గా పని చేస్తూ కుటంబాన్ని పోషించినట్లు ఓ ఇంటర్వ్యూలో తాహా పేర్కొన్నాడు.చదవండి: మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం.. శ్రీలంక క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
బిజినెస్

జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపునకు కేంద్రం అడుగులు!
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకరించే పనిని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు ప్రధాన స్లాబ్‌లను కుదించి రెండు ప్రధాన స్లాబ్‌లుగా మారుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. 12 శాతం, 28 శాతం, స్లాబ్‌లను రద్దు చేసి 5 శాతం, 18 శాతం మాత్రమే కొనసాగించాలన్న ఆలోచనను కేంద్ర ఆర్థిక శాఖ ముందుంచినట్లు సమాచారం.నూతన ప్రతిపాదనల ప్రకారం.. 28 శాతం స్లాబ్ పరిధిలోని 90 శాతం వస్తువులను 18 శాతం పరిధిలోకి, అలాగే 12 శాతం స్లాబ్ పరిధిలోని 99 శాతం వస్తువులను 5 శాతం కిందికి తీసుకురానున్నారు. ప్రస్తుతం 12 శాతం స్లాబ్‌లో ఉన్న టూత్‌పేస్ట్, మొబైల్ ఫోన్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, బట్టలు, బూట్లు వంటి మధ్యస్థాయి వినియోగ వస్తువులను 5 శాతం స్లాబ్‌లోకి మార్చే యోచన ఉంది. ఇదే సమయంలో, 28 శాతం స్లాబ్‌లో ఉన్న కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని సేవలను 18 శాతం స్లాబ్‌లోకి తరలించనున్నారు.ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ జీఎస్టీ పన్ను నిర్మాణంలో ప్రధానంగా రెండు స్లాబ్లే కొనసాగనున్నప్పటికీ కొన్ని హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్‌ను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ స్లాబ్‌లో తంబాకు, గుట్కా, సిగరెట్లు వంటి కేవలం 5–7 వస్తువులే ఉండే అవకాశం ఉంది.ఈ మార్పుల వల్ల నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి, వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాలపై నెలవారీ ఖర్చుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. కేంద్రం అంచనా ప్రకారం, ఈ స్లాబ్ మార్పుల వల్ల రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు రెవెన్యూ నష్టం జరగవచ్చని భావిస్తున్నప్పటికీ, వినియోగం పెరిగి, పన్ను ఆదాయం తిరిగి స్థిరపడే అవకాశం ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి లేవు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ జీఎస్టీ మార్పులను "డబుల్ దీపావళి గిఫ్ట్"గా ప్రజలకు ప్రకటించారు. పన్ను వ్యవస్థను సరళీకరించడం ద్వారా ప్రజలపై పన్ను భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.

ఎస్బీఐ ప్రత్యేక లోన్: తాకట్టు లేకుండా రూ.4 లక్షలు
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యంలోని అగ్నివర్ల కోసం ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న అగ్నివీర్లు ఎటువంటి పూచీకత్తు లేదా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రూ .4 లక్షల వరకు రుణాలు పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ రుణాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి అగ్నిపథ్ పథకం కాలపరిమితి అంటే సైనికులు సర్వీసులో ఉండే కాలానికి అనుగుణంగా ఉంటుంది. దేశం కోసం సైన్యంలో సేవలు అందించి తిరిగి సాధారణ పౌర జీవితంలో వచ్చే సైనికులకు ఆర్థికంగా సహకారం అందించే లక్ష్యంతో ఎస్బీఐ ఈ ప్రత్యేక లోన్ స్కీమ్‌ను ప్రకటించింది. అలాగే 2025 సెప్టెంబర్ 30 వరకు రక్షణ సిబ్బంది తీసుకునే రుణాలకు 10.50 శాతం ఫ్లాట్ వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తోంది.‘మన స్వాతంత్య్రాన్ని కాపాడుతున్న వాళ్లకు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు మా అచంచలమైన మద్దతు అవసరమని మేము నమ్ముతున్నాం. ఈ జీరో ప్రాసెసింగ్ ఫీజు కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సాహస వీరులకు సాధికారత కల్పించే పరిష్కారాలను సృష్టించడం కొనసాగిస్తాం’ అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.ఇదే కాకుండా తమ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్లు ఉన్న భారత సాయుధ దళాల సిబ్బందికి అనేక ప్రయోజనాలను ఎస్బీఐ కల్పిస్తోంది. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ఉచిత అంతర్జాతీయ గోల్డ్ డెబిట్ కార్డులు, దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఏటీఎంలలో అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలు, డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీల మాఫీ వంటి అనేక ప్రయోజనాలను ఈ ప్యాకేజీ అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. వీటితోపాటు రూ.50 లక్షల కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.కోటి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.50 లక్షల వరకు శాశ్వత అంగవైకల్యానికి కవరేజీ లభిస్తుంది.

మరోసారి ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ: ఈసారి ఎంతంటే?
పండుగ సీజన్లో ఆర్డర్ల సంఖ్య పెరగడంతో.. ప్రముఖ ఫుడ్ డెలివరీ మేజర్ 'స్విగ్గీ' ప్రతి ఫుడ్ డెలివరీ ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.14కి పెంచింది. ప్రతి ఆర్డర్‌ను మరింత లాభదాయకంగా మార్చడంతో పాటు.. దాని లాభాలను పెంచుకోవడం కోసం కంపెనీ గతంలో వసూలు చేస్తున్న రూ.12 ఫీజును రూ. 14లకు పెంచింది. అంటే తాజాగా రెండు రూపాయలు పెంచిందన్నమాట.యూనిట్ ఎకనామిక్స్‌ను మెరుగుపరచుకోవడానికి స్విగ్గీ.. ఏప్రిల్ 2023లో ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి.. అదనపు ఖర్చులు ఉన్నప్పటికీ ఆర్డర్ వాల్యూమ్లపై ఎటువంటి ప్రభావం చూపకపోవడంతో కంపెనీ ప్లాట్‌ఫామ్ ఫీజును క్రమంగా పెంచింది. ప్రతి ఆర్డర్‌పై రూ.2 పెరుగుదల వినియోగదారులపై పెద్దగా భారం చూపకపోయినా.. స్విగ్గీ వంటి కంపెనీల ఆర్థికస్థితి మెరుగుపడటంతో దోహదపడుతుంది.ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లు

చాలామందికి తెలియని వాట్సాప్ టిప్స్
టెక్నాలజీ పెరుగుతోంది, ప్రతి అంశంలో పురోగతి కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే అందరూ వాట్సాప్ వినియోగిస్తున్నారు. కానీ చాలామందికి చాట్‌జీపీటీతో చాట్ చేయడం, వాయిస్ మెసేజ్‌ను టెక్స్ట్ రూపంలోకి ఎలా మార్చాలి?, వీడియో కాల్స్‌కు ఫన్ యాడ్ చేయడం వంటివి తెలియదు. ఈ కథనంలో అలాంటి ఆసక్తికరమైన వాట్సాప్ టిప్స్ గురించి తెలుసుకుందాం.చాట్‌జీపీటీతో చాటింగ్ఏఐ అందుబాటులోకి వచ్చిన తరువాత చాట్‌జీపీటీతో చాటింగ్ చేయడం సాధ్యమవుతోంది. మీరు దీనికోసం చేయాల్సిందల్లా.. చాట్‌జీపీటీ యొక్క ప్రత్యేక నంబర్‌ను యాడ్ చేసుకోవడమే. ఇలా చేస్తే మీరు వాట్సాప్‌లోనే చాటింగ్ చేయవచ్చు. ప్రశ్నలు అడగడం వంటివి చేయవచ్చు. దీనిని ఒక తెలివైన ఫ్రెండ్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంఐఫోన్ వినియోగదారులకు మాత్రమే వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ లభిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు మీకు వచ్చిన వాయిస్ మెసేజ్ వినడానికి ఇబ్బందిపడే సమయంలో.. ఈ ఫీచర్ వచ్చిన సందేశాన్ని టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. అప్పుడు వచ్చిన విషయాన్ని చదివి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.వీడియో కాల్లకు ఫన్ యాడ్వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో.. మీ ముఖం విసుగ్గా అనిపించినప్పుడు.. మ్యాజిక్ వాండ్ ఐకాన్ ద్వారా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ ట్వీక్‌లు లేదా ఫిల్టర్లను ఉపయోగించి కొంత ఆనందపడొచ్చు. ఇది సరదాగా కూడా ఉంటుంది.ఈ మెయిల్ లేదా పాస్‌కీతో లాగిన్ఎస్ఎమ్ఎస్ కోడ్ పనిచేయనప్పుడు.. మీరు ఈమెయిల్‌ను లింక్ చేసి వెరిఫికేషన్ కోడ్స్ స్వీకరించవచ్చు. అంతే కాకుండా.. భవిష్యత్ లాగిన్ల కోసం పాస్‌కీని సెట్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ చేసిన తరువాత కోడ్లను టైప్ చేయడానికి బదులుగా బయోమెట్రిక్ సాయంతో సైన్ ఇన్ చేసుకోవచ్చు.ఒక వాట్సాప్.. మల్టిపుల్ ఫోన్లలోఒక నెంబరుకు ఒక వాట్సాప్ ఉంటుంది. రెండు లేదా మూడు మొబైల్ ఫోన్లలో ఒకే వాట్సాప్ లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు లేదా ఉపయోగించాలనుకున్నప్పుడు.. మీ మొదటి ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. రెండవ మొబైల్ ఫోనులో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వర్క్ లైఫ్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ''వన్ అకౌంట్ - మల్టిపుల్ స్మార్ట్‌ఫోన్స్'' అన్నమాట.ప్రైవేట్ సంభాషణలను లాక్మీరు చేసే చాటింగ్ రహస్యంగా ఉంచాలంటే.. లాక్ చేసుకోవచ్చు. దీనికి మీరు పేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా బయోమెట్రిక్ వంటివి ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా.. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ చాటింగ్ చూడలేరు.పర్సనల్ నోట్బుక్గా వాట్సాప్మీకు అవసరమైన విషయాన్ని సేవ్ చేసుకోవడానికి లేదా మర్చిపోకుండా ఉండటానికి పర్సనల్ నోట్బుక్గా వాట్సాప్ పనిచేస్తుంది. అంటే 'మై సెల్ఫ్' అన్నట్టు.. మీకు మీరే విషయాలను మెసేజ్ చేసుకోవచ్చు. వాటిని మళ్ళీ అవసరమైనప్పుడు చదువుకోవచ్చు.ఇలాంటి టిప్స్ ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సరదాగా ఉంటుంది. అంతే కాకుండా మీకు మీరే వాట్సప్‌ను ఉపయోగకరంగా కూడా మార్చుకోవచ్చు. మొత్తం మీద వాట్సప్‌ను సరదాగా ఉండే కమ్యూనికేషన్ హబ్‌గా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉందనే విషయం మాత్రమే మర్చిపోవచ్చు.
ఫ్యామిలీ

ఫ్యాషన్ క్లిక్.. ట్రై లుక్ : మువ్వన్నెల వస్త్రాలు
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల వస్త్రధారణలో భాగం కావడం సాధారణమే. అయితే ఈ మూడూ ఒకే డ్రెస్సింగ్‌లో మేళవింపుగా చూడాలంటే అది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సాధ్యం. భారత జాతీయ జెండాను ప్రకాశింపజేసే త్రివర్ణాలను రంగరించి ఫ్యాషన్ ఔత్సాహికులు వస్త్రధారణ కాంతులీనేలా చేయడం ఇప్పుడు నగరంలో సర్వసాధారణంగా మారింది. ఆయా సందర్భాలు, సంఘటలకు అనుగుణంగా వస్త్రధారణలో మార్పులు ప్రస్పుటంగా కనిపించేలా అదరగొట్టే లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ వస్త్రధారణలో దుస్తులతోపాటు వివిధ రకాల యాక్సెసరీస్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో భారతీయ జెండా రంగులను – కాషాయం (ధైర్యం), తెలుపు (శాంతి) ఆకుపచ్చ (సంపద/ శ్రేయస్సు) దుస్తుల్లో చేర్చడం ఆనవాయితీగా మారింది. ఈ సందర్భంగా మహిళలు మూడు రంగుల్లో సొగసైన చీరలు, సల్వార్ కమీజ్ సెట్స్ లేదా కుర్తాలను ఎంచుకుంటున్నారు. అలాగే కాషాయం దుపట్టా, ఆకుపచ్చ గాజులతో తెల్లటి కుర్తాలను జత చేయడం లేదా పూర్తి త్రివర్ణాలు కలగలిసిన చీర ధరించడం కూడా ట్రెండ్ అవుతోంది. ‘మిగిలిన రోజుల్లో ఎన్ని ఫ్యాషన్స్ ఫాలో అయినా, ప్రత్యేక సందర్భాల్లో ట్రై కలర్స్ మన డ్రెస్సింగ్‌లో మేళవించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాం. ఈ వస్త్రధారణ మన ఫ్యాషన్ సెన్స్ చాటి చెప్పడానికి కాదు.. మనం భారతీయులం అని సగర్వంగా చెప్పుకోడానికి కదా’ అంటున్నారు నగరానికి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ కాచిగూడ నివాసి గౌరీ జోషి. ఇదే అభిప్రాయన్ని పూర్తిగా బలపరుస్తున్నారు నగర మహిళ సుమన్ కృష్ణ. ‘ఇది ఫ్యాషన్ షో కాదు.. మన అస్తిత్వ ప్రదర్శన’ అంటారామె. ఖాదీ.. హైదరాబాదీ.. పురుషులు కుర్తాలు, నెహ్రూ జాకెట్లు లేదా జాతీయవాద స్పర్శతో కూడిన సాధారణ టీ షర్ట్స్ కూడా ఇండిపెండెన్స్ లుక్‌లో భాగం చేస్తున్నారు. ఖాదీ అనేది కేవలం ఒక ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు. ఇది నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం. అందుకే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖాదీ లేదా భారతీయ చేనేత వ్రస్తాలను కూడా అనేక మంది ధరిస్తున్నారు. తద్వారా భారతదేశ స్వాతంత్య్ర పోరాట మూలాలను స్మరించుకోవడంతో పాటు స్థానిక చేనేత కళాకారులకు మద్దతు అందించినట్టుగా భావిస్తున్నారు. అలాగే ఈ ట్రెండ్స్‌లో లినెన్ కాటన్, చందేరి ఖాదీ మిశ్రమాలు కూడా స్టైలిష్‌గా ప్రదర్శిస్తున్నారు. ‘జాతీయత ప్రతిబింబించే వస్త్రధారణ ఎంచుకున్నప్పుడు నా డ్రెస్సింగ్‌లో ఖాదీ తప్పనిసరిగా ఉండాల్సిందే’ అని చెప్పారు నగరానికి చెందిన ఈవెంట్ మేనేజర్ రాజ్ కిషోర్. స్వేచ్ఛా స్ఫూర్తిని తెలిపేలా.. : స్వేచ్ఛా స్ఫూర్తిని వ్యక్తీకరించడానికి ఫ్యాషన్ ఒక శక్తిమంతమైన మార్గం అంటున్నారు నగరానికి చెందిన హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ. వారు అందిస్తున్న విశేషాలివి.. త్రివర్ణాలు (కుంకుమ, తెలుపు, లేదా ఆకుపచ్చ) కలిగన కుర్తాలను ఎంచుకుని, దానికి నప్పేలా లేదా కాంట్రాస్ట్‌గా ఉండే పైజామా జత చేయాలి. వీటికి అనుగుణమైన షేడ్‌లో దుపట్టా జోడించడం ఫ్రీడమ్ లుక్‌కి మెరుపునిస్తుంది.స్వేచ్ఛను సగర్వంగా వేడుకగా జరుపుకోవడంలో ఆత్మవిశ్వాసం కనిపించాలి. అధికారిక సమావేశాలకు, సంప్రదాయ దుస్తులు, చీర లేదా కుర్తా, పైజామా వంటివి సరైన ఎంపిక. అయితే సాధారణ సమావేశాలకు, మరింత ఆధునిక శైలితో ప్రయోగాలు చేయవచ్చు. త్రివర్ణంలో మెరిసే గాజుల నుంచి స్కార్ఫ్‌లు, హెడ్ బ్యాండ్స్, రిస్ట్‌బ్యాండ్స్ వరకూ విభిన్న రకాల యాక్సెసరీస్ కూడా ఫ్రీడమ్ ఫ్లేవర్ జోడించడానికి సులభమైన మార్గం. సాధారణ ట్రై కలర్స్‌లో మెరిసే హెయిర్ క్లిప్‌తో కూడా ఇండిపెండెన్స్ డే లుక్ ప్రతిబింబించవచ్చు. స్ఫటికంలా మెరిసే తెల్లటి టాప్‌కి జీన్స్, జాకెట్ లేదా వేరే డ్రెస్ ఏదైనా స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రస్ఫుటించేలా క్లాసిక్ డెనిమ్ దుస్తులు ధరించి, వాటికి ట్రై కలర్ యాక్సెసరీస్ జోడిస్తే అందంగా తళుక్కుమనేలా కనిపిస్తారు. ఇది ఓ రకంగా ఫ్యూజన్Œ స్వేచ్ఛను కనబరుస్తుంది. ధోతి–చీర సంప్రదాయ ట్రెండ్‌ను మిళితం చేస్తుంది. ఇది ఫ్యాషన్–ఫార్వర్డ్ సౌకర్యవంతమైన విధంగా జరుపుకోడానికి అనువైన ఎంపికగా చేస్తుంది. హామ్ స్టెక్ కాలేజ్ ఆఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్ టు.. లెగ్గింగ్స్.. చెవిపోగుల నుంచి ట్రైకలర్స్తో ఎంబ్రాయిడరీ చేసిన జుతా (ఓ రకమైన పాదరక్షలు)ల వరకూ, యాక్సెసరీస్ కూడా ఫ్రీడమ్ స్ఫూర్తిని చాటేలా వినియోగిస్తున్నారు. అలాగే బ్యాగులు, దుపట్టాలు మాసు్కలు సైతం త్రివర్ణ శోభితంగా మారుతున్నాయి. పాఠశాలలు లేదా కళాశాలల్లోని అబ్బాయిలు అమ్మాయిలు త్రివర్ణాల థీమ్‌తో టీ షర్ట్స్, స్నీకర్స్ ఎంచుకుంటున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా త్రివర్ణాల థీమ్‌లతో కూడిన ఫ్యామిలీ కాంబో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ‘ప్రౌడ్ ఇండియన్’ అనే క్యాప్షన్ రాసున్న కస్టమైజ్డ్ టీ షర్ట్స్ స్కూల్స్‌లో విరివిగా కనిపిస్తున్నాయి. పర్యావరణ స్పృహతో మేళవించిన ఫ్యాషన్ అనుసరణీయంగా మారింది. ఆర్గానిక్ కాటన్, రీసైకిల్ చేసిన దుస్తులు కూడా వినియోగిస్తు న్నారు.

యస్...ఇది గణేష్ బండి!
‘అవసరమే ఆవిష్కరణకు దారి చూపిస్తుంది’ అనే మాట తెలంగాణ రాష్ట్రం ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన లకావత్ గణేశ్ విషయంలోనూ నిజమైంది. పుట్టుకతో పోలియోతో రెండు కాళ్లు చచ్చుపడిపోయిన గణేశ్ ఎనిమిదో తరగతి వరకు చదివాడు. సెల్‌ఫోన్ రిపేరును సొంతంగా నేర్చుకొని ఇంట్లోనే షాపు పెట్టుకున్నాడు. ప్రభుత్వం ద్వారా వచ్చిన మూడు చక్రాల బండి తరచూ రిపేరుకు రావడం, ఎత్తైన ప్రదేశాలు ఎక్కలేక పోవడంతో గణేశ్ ఇబ్బంది పడ్డాడు. విడిభాగాలు కాలిపోవడంతో బండిని మూలన పడేశాడు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా మరొకరు సాయం చేసే వారు. కొన్నిసార్లు ఎవరూ సాయం రాకపోవడంతో గణేశ్ ఆలోచన మూడు చక్రాల బండిపై పడింది. దీంతో ఒక సైకిల్ కొని దానికి బ్యాటరీ, మోటర్ బిగించాడు. కొన్ని విడిభాగాలను ఆన్లైన్లో, మరికొన్నింటిని ముస్తాబాద్‌లో కొనుగోలు చేశాడు. వాటిని సైకిల్‌కు బిగించి బ్యాటరీతో సులభంగా నడిచేలా ప్రయోగం చేశాడు. అది విజయవంతం కావడంతో ఆ బ్యాటరీ సైకిల్‌పై తిరుగుతూ తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తానని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు గణేశ్.– అవదూత బాలశేఖర్, సాక్షి, ముస్తాబాద్ (చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..)

జన్మాంతర సాఫల్యం అంటే ఎంటో తెలుసా?
అథర్వ వేదానికి అనుబంధమైనది కృష్ణోపనిషత్తు. ఈ రెండు శ్లోకాలు అందులోనివే:అన్యోన్య విగ్రహం ధార్యం తవాఙ్గస్పర్శనాదిహ / శశ్వత్స్పర్శాయితాస్మాకం గృహ్ణీమోవతారాన్వయమ్.రుద్రాదీనాం వచః శ్రుత్వా ప్రోవాచ భగవాన్స్వయమ్ /అఙ్గసఙ్గం కరిష్యామి భవద్వాక్యం కరోమ్యహమ్.సర్వాంగ సుందరుడు, సచ్చిదానంద స్వరూపుడు, మహావిష్ణు అవతారము అయిన శ్రీరామచంద్రుడిని చూసి వనవాసులైన మునిజనం (ఆయన సౌందర్యానికి) ఆశ్చర్యచకితులైనారు. ఆ మునులు శ్రీరాముడితో ‘ఈ భూమిపై జన్మించిన విష్ణు స్వరూపుడివైన నీ ఆలింగన సుఖాన్ని మేమందరం కోరుకుంటున్నాము’ అన్నారు. వారి మాటలకు శ్రీరాముడు ‘నా మరో అవతారమైన శ్రీకృష్ణావతారంలో మీరందరూ గోపికలై జన్మించి నా ఆలింగన సౌఖ్యాన్నీ, అతి సన్నిహిత సామీప్యాన్నీ అనుభవించి ఆనందిస్తారు’ అని బదులిచ్చాడు. ‘అలాగా స్వామీ! అయితే మమ్ములను మా మరుజన్మలో గోపికలుగాను, గోపబాలురుగాను జన్మింపజేయండి. మీ సాన్నిధ్యాన్ని, మీ స్పర్శ సుఖాన్ని పొందే స్థితిలో మాకు గోపికలుగానూ, గోపబాలురుగానూ రూపాలు ధారణ చేయడం సమ్మతమే!’ అని ఆ మునిగణం ఆనందంతో అంగీకారం తెలిపారు. రుద్రాది దేవతలు, మునులు స్వయంగా చేసిన ఈ స్నేహమయ ప్రార్థనను విన్న ఆదిపురుషుడైన భగవానుడు ‘మీ గాఢమైన కోరికను నేను తప్పక మన్నించి నెరవేరుస్తాను!’ అన్నాడు – అని పై శ్లోకాల భావం. పరమ పురుషుడు, భగవానుడు అయిన శ్రీరాముడి ఈ మాటలను విన్న దేవ మునిగణాలు ఆనందంతో ‘మేము కృతార్థులమైనాము స్వామీ!’ అన్నారు. రామావతారంలో ఏకపత్నీవ్రతుడు అయిన కారణంగా శ్రీరాముడికి మునిజనం కోరికను ఆ జన్మలో తీర్చే అవకాశం లేకపోయిందన్నది విదితం. ఒక జన్మలో చేసిన పుణ్యాలకు ఫలితాన్ని మలి జన్మలో పొందడాన్ని ‘జన్మాంతర సాఫల్యం’ అంటారు. రామావతారంలో మునిజనం కృష్ణావతారంలో గోపికలై జన్మించడం ద్వారా భగవంతునితో అత్యంత సన్నిహితమైన సాంగత్యం పొంది అత్యుత్తమమైన జన్మాంతర సాఫల్యాన్ని పొందారు.– భట్టు వెంకటరావు

స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..
స్వేచ్ఛా జీవితం అంటే ఎవరికి నచ్చినట్టు వారు ఉండటం మాత్రమే కాదు తమ అభిరుచులను కూడా నైపుణ్యంగా మలుచుకునే స్వేచ్ఛను కలిగి ఉండటం అంటోంది నేటి యువత. తమ భావి జీవన నిర్మాణాన్ని బాధ్యతగా మలుచుకోవడమూ దేశభక్తే అని చెబుతోంది. వివిధ రంగాలలో రాణిస్తూ తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు. ముంబైలో ఉంటూ నటిగా, మోడల్‌గా నిరూపించుకుంటోంది దియా సీతేపల్లి. కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తూ, జెండర్ ఈక్వాలిటీకి కృషి చేస్తోంది ఢిల్లీ శ్రీరామ్ యూనివర్శిటీలో డిగ్రీ చేస్తున్న శ్రీహిత. ‘కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయిన కాకినాడ శ్రీదేవి సైకాలజీ చేస్తానంటోంది. డిగ్రీ చేస్తూ నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకుంటున్న హరిణి, క్యారమ్స్‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా రాణించి, యూకే యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అందుకున్న హుస్నా సమీర.. నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంతటి కష్టమైనా...జూనియర్ ఇంటర్ టైమ్‌లోనే మోడలింగ్ ఫ్రీలాన్స్ చేశాను. ఏజెన్సీతో కలిసి పనిచేశాను. హైదరాబాద్‌లోని లేడీస్ బ్రాండ్స్‌కి మోడలింగ్ చేశాను. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద బాగా ఇష్టం. లాక్డౌన్ టైమ్‌లో ‘ప్రేమకథ’ సినిమా చేశా. తమిళ సినిమాకు వర్క్ చేశాను. ముంబైలో ఉంటూ మోడలింగ్‌గా నా కెరియర్ను కొనసాగిస్తున్నాను. ఆడిషన్స్ చేస్తుంటాను. నా ఇష్టాన్ని అమ్మనాన్నలు కాదనలేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ముంబై వంటి మహానగరంలో మనవాళ్లు ఎలా నిలదొక్కుకుంటారు, అమ్మాయిలు కదా... లాంటి అనుమానాలేవీ అక్కర్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్కటే. మన వర్క్‌ని ఎంత బెస్ట్‌గా ఇవ్వగలుగుతున్నాం అనే దానిపైన దృష్టి ఉండాలి. సక్సెస్ కోసం ఎంతటి కష్టమైనా ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. – దియా సీతేపల్లి, నటి, మోడల్అభిరుచులకు మద్దతుక్యారమ్స్లో అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడి వరల్డ్ రికార్డ్ సాధించాను. యూకేలో ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్‌లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. కాలీగ్రఫీ, మ్యాథమేటిక్స్‌లో అవార్డులు ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. వ్యాపారవేత్తగా రాణించాలని, క్యారమ్స్‌లోనూ మరిన్ని విజయాలు అందుకోవడానికి కృషి చేస్తున్నాను. నా ఇష్టాలకు, అభిరుచులకు అమ్మనాన్నలు చాలా సపోర్ట్ నిచ్చారు. చిన్నప్పటి నుంచి ఇలా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి వారిచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. – హుస్నా సమీరజెండర్ ఈక్వాలిటీకి కృషినేను టెన్త్ క్లాస్‌లోనే శాస్త్రీయ నృత్యంలో సర్టిఫికెట్స్ తీసుకున్నాను. కూచిపూడి నృత్యకారిణిగా ప్రదర్శనలు ఇస్తుంటాను. ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. అమ్మ గైనకాలజిస్ట్, నాన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. మ్యాథ్స్, సైన్స్ వైపు కాకుండా పొలిటికల్ సైన్స్ వైపు వచ్చాను. యూపీఎస్సీలో ర్యాంకు సాధించాలనేది నా లక్ష్యం. ఢిల్లీ శ్రీరామ్ కాలే జ్ ఫర్ ఉమెన్‌లో బీఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చేస్తున్నాను. కాలేజీలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ఎడిటోరియల్ టీమ్‌కు సబ్ హెడ్‌గా ఉంటూనే, ఎన్ఎస్ఎస్ ఆర్గనైజేషన్‌లో జెండర్ ఈక్వాలిటీ కోసం కృషి చేస్తున్నాను. ఒక లక్ష్యంతో పాటు అభిరుచికి తగిన స్కిల్‌ను నేర్చుకోవాలి. అంతేకాదు సమాజానికి మన వంతు భాగస్వామ్యాన్ని, సేవను అందించాలి. అందుకు మనల్ని మనం ఎప్పుడూ సిద్ధం చేసుకోవాలి. – శ్రీహిత నీలి మల్టిపుల్ స్కిల్స్ మస్ట్స్కూల్ టైమ్‌లోనే హిందీ పండిట్ కోర్సు చేశాను. సంగీతం అంటే ఇష్టం ఉండటంతో కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ, సంగీత విశారద డిగ్రీ కోర్సు పూర్తిచేశాను. వాలీబాల్ స్టేట్‌లెవల్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. ఈమధ్య బీటెక్ అవుతూనే క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. కర్ణాటక సంగీతంలో కచేరీలు ఇస్తుంటాను. మలేషియాలో తెలుగు అసోసియేషన్ ఆహ్వానంతో అక్కడ కచేరీలో పాల్గొన్నాను. మ్యూజిక్ క్లాసులు కూడా తీసుకుంటాను. జాబ్ చేస్తూనే సింగర్‌గానూ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పడు యోగాలో టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తున్నాను. సాంకేతికపరంగా ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒక చదువు మాత్రమే ఉంటే సరిపోదు. ఇలా విభిన్న రంగాలలో నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల మనల్ని మనం మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు. ఆసక్తి, అభిరుచులను కూడా స్కిల్స్గా డెవలప్ చేసుకుంటే మన వ్యక్తిత్వం కూడా బాగుంటుంది. లైఫ్ అంతా ఉపయుక్తంగా మార్చుకుంటూ వెళితే చాలా హ్యాపీగా ఉంటాం. – హరిణి ఆనంద్ చెరుకూరిసైకాలజీ స్టార్‘కోర్టు’ సినిమా నటిగా నాకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు తమిళంలో ఓ మూవీ చేస్తున్నాను. జూనియర్ ఇంటర్ పూర్తయ్యింది. సైకాలజీలో డిగ్రీ చేయాలనుకుంటున్నాను. జెన్ జి తరం చాలా ఆందోళన, డిప్రెషన్‌తో లైఫ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని గందరగోళంలో ఉంటున్నారు. అందుకే, సైకాలజీ చేసి, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి చికిత్సను అందించాలనుకుంటున్నాను. డ్యాన్స్, కుకింగ్ నా ఫేవరేట్స్. యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్నా ఇలా సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. రీల్స్ చేయడం ద్వారా పేరొచ్చింది. మూవీలో అవకాశం వచ్చింది. అమ్మ ఓకే అంది. అలా జాలీగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. మంచి నటిగా పేరు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటాను. – కాకినాడ శ్రీదేవి, నటి (చదవండి:
ఫొటోలు
అంతర్జాతీయం

ఎవరి పంతం నెగ్గుతుందో!
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికి, శాంతి దూతగా పేరు సంపాదించాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం. యుద్ధంలో ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తమదేశంలో సంపూర్ణంగా విలీనం చేసుకొని, చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత పుతిన్ ఆశయం. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ శుక్రవారం అలస్కాలో సమావేశం కాబోతున్నారు. ఇరువురు నేతల భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు జరుగుతాయని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర అంశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల విషయంలో పుతిన్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అలస్కా భేటీతో ఇరువురు నేతలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం.. అందుకే అలస్కా వేదిక ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న పుతిన్‌ను ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాను దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఇందుకోసం అలస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలలేదని ట్రంప్‌తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతున్నారు. సమావేశానికి వేదికగా అలస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలస్కాకు చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సిన అసవరం లేదు. ఎవరినో అనుమతి కోరాల్సిన పనిలేదు. రష్యా నుంచి నేరుగా అలస్కాకు చేరుకోగలరు. అలస్కాను 19వ శతాబ్దంలో రష్యా పాలకులు అమెరికాకు విక్రయించారు. 21వ శతాబ్దంలో కొన్ని సరిహద్దుల్లో బలవంతంగా చేసిన మార్పులను సమర్థించుకోవడానికి అలస్కాను వేదికగా పుతిన్ ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులు మార్చడం, భూభాగాల యజమానులు మారడం సాధారణ విషయమేనని ఆయన చెప్పదలిచారు. అలాగైతేనే కాల్పుల విరమణ ఉక్రెయిన్తోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను పుతిన్ పక్కనపెట్టారు. ప్రత్యక్షంగా అమెరికాతోనే చర్చలకు సిద్ధమయ్యారు. ఇతర దేశాల పరిగణనలోకి తీసుకోవడం లేదు. చర్చలైనా, ఒప్పందమైనా అమెరికాతోనే అంటున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పుతిన్ పట్టించుకోలేదు. తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే, పుతిన్ డిమాండ్‌ను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తెగేసి చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్‌పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఇతర దేశాలపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలను వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామంటూ అమెరికా బెదిరిస్తే ఉక్రెయిన్ దారికి రావడం ఖాయమని పుతిన్ వాదిస్తున్నారు. ఆర్థిక బంధం బలపడుతుందా? అమెరికా–రష్యా మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరిస్తే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావొచ్చు. యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాల ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాను హెచ్చరించడం గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం జరిగే భేటీలో పుతిన్‌ను ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

అదే జరిగితే భారత్‌కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా
భారత్ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్‌కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్‌పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్‌పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం బ్లూమరాంగ్‌టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్‌పై సెకండరీ టారిఫ్‌లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్ స్పష్టం చేశారు.భారత్ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్‌పై అగ్రరాజ్యం టారిఫ్‌లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్‌న్యూస్‌తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్‌కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్‌ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్‌తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి.

జాబిలిపై అణువిద్యుత్ సాధ్యమా?
వ్యోమగాములు తమ అంతరిక్ష పరిశో ధనలకు మజిలీగా చందమామను మార్చుకోవాలని భావిస్తున్న తరుణంలో చంద్రునిపై ఏకంగా అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని నాసా భావిస్తోంది. అయితే 2030కల్లా అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎక్కువకాలంపాటు వ్యోమగాములు చంద్రునిపైనే స్థిరనివాసం ఏర్పర్చుకుని జీవించాలన్నా, ఎలాంటి విద్యుత్ అవాంతరాల లేకుండా శాస్త్రసాంకేతిక పరిశోధనలు కొనసా గించాలన్నా అనుక్షణం విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రాణాధార ఉపకరణాలకూ విద్యుత్ ఖచ్చితంగా అవసరం. అందుకే ఐదేళ్ల లోపే అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయా లని నాసా భావిస్తోంది. కేంద్రక విచ్చిత్తి (న్యూక్లియర్ ఫిజన్) సూత్రంపై పనిచేసే అణుప్లాంట్‌ను అక్కడ నెలకొల్పనున్నారు. అయితే నాసాకు పోటీగా సొంత అణువిద్యుత్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చైనా, రష్యాలు సైతం ప్రకటించాయి. మరో పదేళ్లలో ఈ ప్లాంట్లను ఏర్పాటుచేస్తామని ఇప్పటికే వెల్లడించాయి. అణు విద్యుతే ఎందుకు?చందమామపై స్థిరనివాసం ఏర్పర్చుకునే వ్యోమగాముల నిరంతర విద్యుత్ అవసరా లను సౌరవిద్యుత్ ఏమాత్రం తీర్చలేదు. ఎందుకంటే చంద్రునిపై ప్రతిరోజూ సూర్యకాంతి ప్రసారం కాదు. 14 రోజులపాటు ఏకధాటి గా ఎండకాచి తర్వాత 14 రోజులపాటు మైనస్ డిగ్రీ సెల్సియస్ స్థాయిలో చిమ్మచీకటి నెలకొంటుంది. ఈ చీకటిమయ రోజుల్లో విద్యుత్ అవసరాలు తీర్చే ఏకైక ప్రత్యామ్నా యంగా అణువిద్యుత్కేంద్రం నిలుస్తోంది. అందుకే ఎంత ఖర్చయినాసరే వ్యయప్రయా సల కోర్చి చంద్రునిపై న్యూక్లియర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నాసా కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన లకు సైతం పచ్చజెండా ఊపింది. మరో ఐదేళ్లలో అక్కడ అణువిద్యుత్ ప్లాంట్ కలను సాకారంచేయాలని కంకణం కట్టుకుంది. చిన్నస్థాయిలో మొదలెట్టిఅణువిద్యుత్ కేంద్రంలో ఏవైనా ప్రమాదాలు సంభవించినా అక్కడ శూన్యం ఉంటుందికనుక రేడియోధార్మికత అంతటా వ్యాపిస్తుందన్న భయం అక్కర్లేదు. థర్మల్, జల, పవన విద్యుత్‌లతో పోలిస్తే చందమామపై అణువిద్యుత్ మాత్రమే ఆచరణ సాధ్యమవుతుంది. సౌరఫలకాలతో సూర్యకాంతిని ఒడిసిపట్టి సౌర విద్యుత్‌ను తయారుచేసినా అది అక్కడి వ్యోమగాముల అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని న్యూక్లియర్ ప్లాంట్ వైపు శాస్త్రవేత్తలు మొగ్గుచూపుతున్నారు. తొలుత కేవలం 100 కిలోవాట్ల విద్యుత్‌ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. భూమి మీద అయితే ఇదే 100 కిలోవాట్ల విద్యుత్‌తో 80 గృహాల విద్యుత్అవసరాలు తీర్చొచ్చు. దశలవారీగా ప్లాంట్‌ను విస్తరించి గణనీయమైన స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్సమస్యలెన్నో...జల, థర్మల్ విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే అణువిద్యుత్ ప్లాంట్‌కు పెద్దగా భూవిస్తీర్ణంతో పనిలేదు. కానీ చంద్రుని మీదకు ఈ మొత్తం అణువిద్యుత్ వ్యవస్థ ఉపకరణాలను మోసుకెళ్లాలంటే చాలా చాలా కష్టం. పైగా ఇవి రాకెట్లో తరలించేంత తేలికగా ఉండాలి. అత్యధిక బరువులను ఇప్పుడున్న రాకెట్లు అస్సలుమోయలేవు. ఒకవేళ అధిక బరువులను మోసుకెళ్లేలా వ్యోమనౌకలను డిజైన్చేసి రూపొందించినా అవి అంత బరువును మోస్తూకూడా జాగ్రత్తగా చంద్రునిపై ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చి అది క్రాష్ ల్యాండ్ అయినా వేలకోట్ల రూపాయల నష్టం ఖాయం. భూమిపై అయితే అణువిద్యుత్ కేంద్రాన్ని ఎంతో మంది సాంకేతిక నిపుణులు తీరిగ్గా, నిశితంగా తనిఖీచేసి నిర్మిస్తారు. చంద్రునిపై ఈ ప్లాంట్‌ను నిర్మించాలంటే కార్మిక సిబ్బంది దొరకరు. ఉన్న ఆ కొద్దిపాటి వ్యోమగాములే అణుప్లాంట్ ఉన్నతాధికారుల అవతారమెత్తి ప్లాంట్‌ను బిగించాల్సి ఉంటుంది. అణువిద్యుత్ ప్లాంట్ నుంచి అత్యధిక స్థాయిలో వేడిమి వెలువడుతుంది. దానికి చల్లబరిచే కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలి. వాటిని కూడా భూమి మీద నుంచే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన వ్యవహారం. శూన్యస్థితిని తట్టుకునేలా వినూత్న రీతిలో ప్లాంట్‌ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. రేడియోధార్మిక వ్యర్థ్యాల పారబోత, ప్లాంట్ పాడైతే రిపేర్లు వంటి ఎన్నో అవరోధాలు అక్కడి హఠాత్తుగా స్వాగతం పలుకుతాయి.వీటిని తట్టుకుంటూనే ప్లాంట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ట్రంప్ హయాంలో నాసాకు అంతరిక్ష పరిశోధనా బడ్జెట్లో భారీ కోత పెట్టిన నేపథ్యంలో ఇతర మార్గాల్లో ఆదాయం సమకూర్చి ఈ ప్రాజెక్ట్‌ను సఫలీకృతం చేయాల్సి ఉంది. ఇన్ని బాలారిష్టాలను దాటుకుని ప్లాంట్ ఏర్పాటు సుసాధ్యమైతే జాబిలిపై మానవనివాసం ఎలాంటి జంజాటాలు లేకుండా హాయిగా సాగుతుంది.

అమెరికాలో హిందూ ఆలయం ధ్వంసం
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా నగరంలో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ వారం ప్రారంభంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 10న గ్రీన్వుడ్ నగరంలోని బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయంలో ఈ ద్వేషపూరిత చర్య జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. షికాగోలోని భారత కాన్సులేట్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. ‘ఇండియానాలోని గ్రీన్‌వుడ్‌లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయం ప్రధాన సైన్‌బోర్డును అపవిత్రం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం’ అని ఎక్స్‌లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ‘ఐక్యత–సంఘీభావం’ కార్యక్రమం నిర్వహించింది. గ్రీన్వుడ్ మేయర్ సహా భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాన్సులర్ జనరల్ మాట్లాడారు. హిందూ సమాజం మరింత బలోపేతమవ్వాలన్న విషయాన్ని ఈ ఘటన గుర్తు చేసిందన్నారు. దుండగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
జాతీయం

ప్రేమంటే ఇదేరా.. ప్రియుడి కోసం శ్రీలంక యువతి సాహసం
అన్నానగర్: ప్రేమించిన యువకుడి కోసం ఓ యువతి ఏకంగా దేశం దాటి వచ్చిన ఉదంతమిది. ప్రియుడి కోసం ప్రియురాలు తన దగ్గరున్న నగలు అమ్ముకుని మరీ శ్రీలంక నుంచి నకిలీ పడవలో భారత్‌కు వచ్చిన ఘటన బుధవారం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటిలో జరిగింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. అరిచలమునై బీచు బుధవారం ఉదయం ఓ యువతి శరణార్థిగా వచ్చిందని కోస్టల్ పోలీసులకు సమాచారం అందింది.ఆ మహిళను కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. పోలీసుల కథనం మేరకు.. శ్రీలంకలోని మన్నార్‌కు చెందిన విదుర్షియ (25) తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా పళనిలో ఒక శరణార్థి శిబిరంలో తన తల్లి, తండ్రితో కలిసి నివసించేది. ఆ సమయంలో ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. గత ఏప్రిల్‌లో ఆమె శ్రీలంకకు వెళ్లగా, తిరిగి అక్కడి నుంచి భారత్‌కు రావడానికి వీసా పొందలేకపోయింది.అయితే ఆమె తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి నకిలీ పడవలో రావాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఆ మహిళ తన నగలను అమ్మి వచ్చిన నగదుతో తలైమన్నార్ బీచ్ నుంచి ఓ ప్లాస్టిక్ పడవ ఎక్కి అరిచల్ మునైకి చేరుకుంది. దర్యాప్తు అనంతరం ఆ యువతిని మండపం శరణార్థి శిబిరానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ఢిల్లీ నిజాముద్దీన్‌లో విషాదం.. కూలిన దర్గా పైకప్పు.. ఏడుగురు దుర్మరణం
ఢిల్లీ: ఢిల్లీలో నిజాముద్దీన్ ఏరియాలో దర్గా పై కప్పు కూలి పలువురు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) సాయంత్ర సమయంలో చోటు చేసుకుంది. నిజాముద్దీన్‌ప్ ప్రాంతంలోని హుమయూన్ సమాధ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. దర్గా శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. #WATCH | Delhi | NDRF personnel conduct a search operation at Dargah Sharif Patte Shah, located near Humayun's Tomb, in the Nizamuddin area, following the collapse of the roof of a room in the dargah premises. Police and Fire Department personnel are also present. So far, 11… pic.twitter.com/6oW3XjroAX— ANI (@ANI) August 15, 2025 సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యటు చేపట్టారు. శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ చర్యలు చేపట్టింది.

ఘోర రోడ్డు ప్రమాదం: 10 మంది యాత్రికులు దుర్మరణం
బరద్వాన్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో బిహార్ వెళుతున్న బస్సు.. రోడ్డు ప్రమాదానికి గురౌవడంతో 10 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 35 మందికి గాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. యాత్రికులతో బిహార్ వెళుతున్న బస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బరద్వాన్ జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. నేషనల్ హైవే 19పై రోడ్డు ప్రక్కన ఆపి ఉంచిన ట్రక్కును బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. నాలా ఫెర్రీ ఘాట్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారి ట్రక్కును ఢికొట్టడంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ధర్మస్థళ తవ్వకాలపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారిన సామూహిక ఖననం కేసుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. ధర్మస్థళ పుణ్యక్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, త్వరలోనే నిజం నిలకడ మీద తెలుస్తుందని అన్నారాయన.ధర్మస్థళలో రెండు దశాబ్దాల కిందట.. హత్యలు, అత్యాచారాలు జరిగాయని, వందల సంఖ్యలో మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని ఓ వ్యక్తి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్షేత్రంలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడిగా చెబుతున్న ఆ 61 ఏళ్ల వ్యక్తి ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయించి అతను చూపించిన చోటల్లా తవ్వకాలు జరిపిస్తోంది. అయితే.. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలకు దిగడంతో.. డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే ధర్మస్థళపై జరుగుతున్న కుట్ర బయటకు వస్తుందని, ఆ ఆరోపణలు రుజువుకాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తనతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని శివకుమార్ వెల్లడించారు. అయితే.. ‘‘నేను ఇప్పటికీ ధర్మస్థళ మంజునాథస్వామి భక్తుడినే. ధర్మస్థల వీరేంద్రహెగ్డే చేసిన సేవలను గౌరవిస్తాం. భక్తునికి– దేవునికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదు. అలాగని నేనేం ధర్మస్థళకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడడం లేదు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకవేళ ధర్మస్థళపై నిజంగా కుట్ర జరిగి ఉంటే విచారణలో బయటపడుతుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించకతప్పదు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ఈ అంశంపై హోం మంత్రి పరమేశ్వర సోమవారం కర్ణాటక అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేస్తారు’’ అని శివకుమార్ వెల్లడించారు. గురువారం ధర్మస్థళ తవ్వకాలపై అసెంబ్లీలో హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడారు. ‘‘ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు జూన్ 19 సిట్ ను ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించాం. ఇది పూర్తి కావడానికి కాలపరిమితి ఉంటుంది. ఈలోపు సిట్ దర్యాప్తునకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని భావిస్తున్నాం’’ అని అన్నారాయన. 1995-2014 మధ్య తాను పని చేస్తున్న సమయంలో ధర్మస్థళ ఆలయ నిర్వాహకుల ఆదేశాల మేరకు తానే స్వయంగా ఆ మృతదేహాలను పాతిపెట్టినట్లు సదరు వ్యక్తి చెబుతున్నాడు. అందులో మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు అధికంగా ఉన్నాయని, కొందరిపై లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ముసుగు ధరించిన ఆ వేగు(Whistleblower)ను.. ‘భీమా’.. ‘చిన్నయ్య’.. అని కర్ణాటక మీడియా వ్యవహరిస్తోంది. విక్టిమ్ ప్రొటెక్షన్ కింద సిట్ అతనికి రక్షణ కల్పిస్తోంది కూడా. ఇప్పటిదాకా నేత్రావతి నదీ తీరం వెంబడి అతను చూపించిన చోట్లలో సిట్ తవ్వకాలు జరిపింది. అందులో రెండు చోట్ల మాత్రమే అస్తిపంజరాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: ఆలయ నిర్వాహకులే పూడ్చాలని.. సిట్ నన్ను నమ్మడం లేదుఇదిలా ఉంటే.. తీవ్ర చర్చకు దారితీసిన ధర్మస్థలలో మృతదేహాల కోసం తవ్వకాల కేసులో గురువారం విధానసభ దద్దరిల్లింది. ధర్మస్థల మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ నాయకులు శాపాలు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి 10, 15 ఏళ్ల క్రితం ధర్మస్థల లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం ద్వారా పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కుట్ర జరుగుతోంది. అస్థికల కోసం తవ్వకాలంటూ హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న అసత్య ప్రచారం సహించడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రజలు ఆవేశం చెంది పోరాటం చేసే స్థితి తీసుకురాకూడదు.. .. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా, హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్తుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా?’’ అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సిట్ దర్యాప్తు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అలాగని ధర్మస్థళను టార్గెట్ చేయడం సరికాదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని గుంతలు తవ్వే పనిచేస్తున్నారని, ధర్మస్థల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎన్ని గుంతలు తవ్వారు, ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి అనేది చెప్పాలని సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
ఎన్ఆర్ఐ

ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్‌లో అమానుష ఘటన
విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తున్నదే. తాజాగా ఐర్లాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆరేళ్ల చిన్నారిపై తోటి పిల్లలు జాత్యాంహకారం ప్రదర్శించారు. ఆమెపై ఇష్టానుసారం దాడి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఐర్లాండ్ వాటర్‌ఫోర్డ్ నగరంలో ఆగస్టు 4వ తేదీన దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలికపై జాత్యంహకార దాడి జరిగింది. భారత్‌కు తిరిగి వెళ్లిపో అంటూ తోటి పిల్లల్లో కొందరు ఆమెపై ఈ దాడికి తెగబడడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె ప్రైవేట్ భాగాలను గాయపరిచినట్లు తల్లి మీడియాకు వివరించారు.సోమవారం సాయంత్రం కిల్‌బర్రీ ప్రాంతంలోని తన నివాసం బయట నియా నవీన్(6) తోటి పిల్లలలో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో 12-14 ఏళ్ల వయసున్న పిల్లలు కొందరు బాలిక వద్దకు వచ్చారు. అప్పటిదాకా అక్కడే ఉన్న బాలిక తల్లి.. మరో బిడ్డకు పాలిచ్చేందుకు లోపలికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆ బ్యాచ్ సదరు బాలికపై దాడికి తెగబడింది. ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. సైకిల్‌తో ప్రైవేట్ భాగాలను గాయపరిచింది.బాలిక కేకలు విని బయటకు పరిగెత్తుకొచ్చింది ఆ తల్లి. ఆ సమయంలో వాళ్లంతా పారిపోగా.. నడవలేని స్థితిలో బాలిక భయంతో వణికిపోతూ కనిపించింది. డర్టీ ఇండియన్.. గో బ్యాక్ టూ ఇండియా అంటూ వాళ్లు అసభ్య పదజాలం ప్రయోగిస్తూ ఆ బాలికను వారించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.తాను ఎనిమిదేళ్లుగా ఇక్కడ నర్సుగా పని చేస్తున్నానని, ఈ మధ్యే ఐర్లాండ్ పౌరసత్వం దక్కిందని బాలిక తల్లి అనుపా అచ్యుతన్ ‘ఐరీష్ మిర్రర్’ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘మేం అధికారికంగానే ఇక్కడ వచ్చి ఉంటున్నాం.. మంచి వృత్తుల్లో స్థిరపడ్డాం. కానీ, ఇక్కడ భారతీయులెవరికీ భద్రత లేకుండా పోయింది. చివరికి ఇంట్లోనూ భయంతోనే గడపాల్సి వస్తోంది. నా బిడ్డను నేను దాడి నుంచి రక్షించుకోలేకపోయా. ఆమె ఇక నుంచి మునుపటిలా సరదాగా ఆడుకోలేదని నేను భావిస్తున్నా’’ అని జరిగిన ఘటన గురించి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలిక తల్లి తెలిపింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పిల్లలపై కఠిన చర్యలు తీసుకోకుండా.. విషబీజాలను వాళ్ల మనసుల్లోంచి తొలగించేలా కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆమె కోరుకుంటోంది.ఐర్లాండ్‌లో భారతీయులపై జాత్యాంహకార దాడులు పెరిగిపోయాయి. గత జులై నుంచి ఇప్పటిదాకా ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. కిందటి నెలలోనూ ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగింది. రాజధాని నగరం డబ్లిన్‌లోని టల్లాట్‌లో 40 ఏళ్ల వ్యక్తిని దుండగులు దుస్తులు విప్పించి హింసించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను భారత రాయబారి ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక కౌన్సిలర్ బాధితుడిని పరామర్శించి, బాసటగా నిలిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రెండు నెలల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఐర్లాండ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యి.. హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసింది.Credits: irishmirror

భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?
ఈ ప్రశ్న వేసింది వాన్షివ్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవో గౌరవ్ ఖేటర్‌పాల్. తనను బాధ పెట్టిన సంఘటన గురించి తలుచుకుంటూ ఆయన ఈ ప్రశ్న వేశారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. కని, పెంచి ప్రయోజకులను చేసిన పేరెంట్స్‌ను చివరి రోజుల్లో ఒంటరిగా వదిలేస్తున్న వారు ఎందరో. కనీసం కన్నవారి చివరిచూపునకు కూడా నోచుకోకుండా కన్నుమూస్తున్న తల్లిదండ్రులు కోకోల్లలు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఖేటర్‌పాల్ ఎక్స్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడొకరు.. తండ్రి చివరి రోజుల్లో వ్యవహరించిన తీరును తన పోస్ట్ ద్వారా వెల్లడించారు.'15 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న స్నేహితుడొకరు ఇటీవల తన తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో అతడి తండ్రి (84) జైపూర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజుల ముందు తెల్లవారుజామున 3 గంటలకు నాకొక ఫోన్ కాల్ (Phone Call) వచ్చింది. తన తండ్రి ఆరోగ్యం బాలేదని, వెళ్లి చూడమని అమెరికా నుంచి ఫ్రెండ్ ఫోన్లో చెప్పాడు. కొంతమంది స్నేహితులతో కలిసి నేను వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించాను. గుండెపోటు, అవయవాలు పనిచేయకుండా పోవడంతో పెద్దాయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. సరైన సమయంతో మంచి వైద్యం అందిచడంతో ఆయన కోలుకుకున్నారు. బంధువులు ఆయన చూడటానికి వచ్చారు. కానీ ఎవరూ ఎటువంటి బిల్లులు చెల్లించలేదు సరికదా, ఆయన బాధ్యత భుజానికెత్తుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఇక పెద్దాయన కొడుకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తండ్రి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంటే కొడుకు మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం అమెరికాలోనే ఉన్నాడు. తండ్రిని చూడటానికి రాలేదు. గత వారమే పెద్దాయన ప్రాణాలు వదిలారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇండియాకు వచ్చిన కొడుకు మళ్లీ 3 రోజులకే తిరుగు పయనమయ్యాడు.నన్ను కదిలించినది ఏమిటంటే..అంతిమ గడియల్లో ఉన్న తండ్రి కంటే అమెరికా కలే అతడికి ముఖ్యమైంది. తండ్రి చనిపోయినప్పుడు కూడా అతడి భార్య, పిల్లలు రాలేదు. వాళ్లు అమెరికాలోనే ఉండిపోయారు. "ఆమెకు ఉద్యోగం ఉంది, పిల్లలకు చదువు ఉంది" అని అతడు అన్నాడు - నమ్మశక్యం కాదు!నేను, నా స్నేహితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి, ఖర్చులు చూసుకుంటూ, వంతులవారీగా ఆస్పత్రికి వెళుతూ అతడి తండ్రిని చివరి శ్వాస వరకు వెన్నంటే ఉన్నాం. కానీ నగరంలోని అతడి బంధువులెవరూ మర్యాదపూర్వకంగా కలవడం తప్ప ఎటువంటి సహాయం చేయలేదు.తండ్రి చనిపోయిన మూడో రోజునే నా స్నేహితుడు స్వదేశం విడిచి వెళ్లాడు. తండ్రి అస్థికలను నిమజ్జనం కూడా చేయకుండానే అతడు అమెరికా వెళ్లిపోయాడు.భారతీయ కుటుంబ విలువలు, మన ఆచారాలు, బంధాలు ప్రపంచంలో మరెక్కడా లేనంత మెరుగ్గా.. బలంగా ఉన్నాయని ఇప్పటివరకు నేను నమ్మాను. కానీ ఈ సంఘటన నన్ను పూర్తిగా కదిలించింది! భారతీయ సమాజం ఎటు పయనిస్తోంది, మన కుటుంబ విలువలు ఎక్కడ కనుమరుగవుతున్నాయ'ని గౌరవ్ ఖేటర్‌పాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. విదేశాల్లో ఉంటూ కెరీర్ కొనసాగిస్తువారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కొంతమంది సానుభూతి వ్యక్తం చేశారు. ఎక్కువ మంది మాత్రం విచ్ఛిన్నమవుతున్న భారతీయ కుటుంబ విలువల గురించే ఆందోళన చెందారు.స్నేహితుడిని బద్నాం చేస్తారా?మరికొందరైతే గౌరవ్‌పై విరుచుకుపడ్డారు. ట్వీట్ కోసం స్నేహితుడిని బద్నాం చేస్తారా అంటూ ప్రశ్నించారు. 'కేవలం 3 రోజుల కోసమే అమెరికా (America) నుంచి ఎవరూ ఇండియాకు రారు. ప్రయాణానికే ఒక రోజు పడుతుంది. జెట్ లాగ్ ఎలాగూ ఉంటుంది. అతడి తండ్రికి అప్పటికే 84 ఏళ్లు, తన కొడుకుతో ఉండటానికి నిరాకరించి ఉండవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం, చలి వాతావరణం కారణంగా అమెరికాలో వృద్ధులు నివసించడం కష్టం. అతడు తన తండ్రిని చూసుకోవడానికి సహాయకులను నియమించుకునే ఏర్పాటు చేసి ఉండాలి. మీరు ఎటువంటి రుజువు ఇవ్వకుండానే ఇక్కడ మీ స్నేహితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించారని కూడా మీరు పేర్కొన్నారు. మీరు నిజం చెబుతుంటే, ఆసుపత్రి పత్రాలు, బిల్లులతో పాటు వృద్ధుడు, అతడి కొడుకు వివరాలను వెల్లడించండి' అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేశాడు. దీనిపై ఖేటర్‌పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'మీ స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం మీద.. 3 రోజుల కోసం ఎవరూ అమెరికా నుంచి భారతదేశానికి రారు అనే వాస్తవాన్ని మీరు ఇప్పుడే గమనించారు. మీ IQ వేరే స్థాయిలో ఉందంటూ' సమాధానమిచ్చారు.చదవండి: టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్యలో గతంలో చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఈ సంఖ్య బాగా పెరుగుతుండడంతో.. తల్లిదండ్రులకు చివరి రోజుల్లో ఎడబాటు తప్పడం లేదని మరో నెటిజన్ (Netizen) అభిప్రాయపడ్డారు. అఖరి గడియాల్లో పిల్లల కోసం వేచిచూసి తనువు చాలిస్తున్న పేరెంట్స్ సంఖ్య నానాటికీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. చాలా మంది పిల్లలకు.. తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత, ఆస్తులన్నీ అమ్మేసి ముందుకు సాగడమే ఏకైక లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దాదాపు 2 లక్షల మంది భారతీయులు (Indians) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు ఇటీవల వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం.ఎవరీ గౌరవ్ ఖేటర్‌పాల్?రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు గౌరవ్ ఖేటర్‌పాల్ (Gaurav Kheterpal). గూగుల్ డెవలపర్ ఏఐ ఎక్స్పర్ట్ అయిన గౌరవ్‌కు ఐటీ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మల్టీ-క్లౌడ్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్‌గానూ ఆయన పేరు గాంచారు. చాలా దేశాల్లో ఐటీపై ప్రసంగాలు ఇచ్చారు. గ్లోబల్ మొబైల్ డెవలపర్ చాలెంజ్, యాప్స్ హకథాన్ వంటి పలు రకాల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వాన్షివ్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించి సీఈవోగా కొనసాగుతున్నారు. Is the Indian family system dead?A friend (let's call him 'X') recently lost his father. He's been living in the US for the last 15 years while his father lived alone in Jaipur - his mother passed away 3 years back. Few days earlier, I received a frantic call from him at 3 AM…— Gaurav Kheterpal (@gauravkheterpal) August 3, 2025

దుబాయ్‌కి డ్రైవర్లు కావలెను.. జీతం ఎంతంటే?
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో డ్రైవర్లు స్వదేశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. డ్రైవర్లు వంటి అసంఘటిత రంగ కార్మికుల కొరతతో విలవిల్లాడుతోంది. దీంతో భారత్‌కు వచ్చేసిన డ్రైవర్లను ఆకర్షించేందుకు యూఏఈ కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీనికోసం జలంధర్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నియామక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. దుబాయ్‌కి చెందిన త్రీస్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్‌పోర్టు, దుబాయ్పోర్ట్ వంటి సంస్థలు డ్రైవర్ల నియామకం కోసం 10, 30వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో గణేష్‌కుమార్ తెలిపారు.కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో దుబాయ్ (Dubai) నుంచి తిరిగి వచ్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు (Drivers) అత్యధికంగా ఉన్నారని, వారిని గుర్తించి అక్కడ దేశాల్లో ఉపాధి కల్పించేలా స్థానిక అధికారులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి యూఏఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ట్రైలర్, ట్రక్, ఐటీవీ డ్రైవర్లుగా అవకాశాలు కల్పించనున్నారు. 24 నుంచి 48 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని, నెలకు రూ.35,000 నుంచి రూ.94,000 వరకు జీతం లభిస్తుందని ఏపీఎస్ఎస్డీసీ తెలిపింది. డ్రైవింగ్ టెస్ట్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆగస్టు 10న స్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగాలకు ఆగస్టు 30న ఐటీవీ డ్రైవర్లకు ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. లేదా skillinternational@apssdc.in ఈమెయిల్, 91–99888533 35, 8712655686, 8790118349, 8790117279 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరింది.చదవండి: స్కూల్లో కూలి పనులు చేయిస్తున్నారు

ఎడిసన్‌లో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం
అమెరికాలో భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ తన దౌత్య సేవలను మరింత విస్తరించింది. ఈ క్రమంలోనే అమెరికా వ్యాప్తంగా కొత్తగా 8 ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా వెల్లడించారు. ఎడిసన్, బోస్టన్, కొలంబస్, డల్లాస్, డెట్రాయిట్, ఓర్లాండో, రాలీ, శాన్ జోస్ వంటి నగరాల్లో ఈ నూతన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లను వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో మొత్తం ICACల సంఖ్య 17కి చేరినట్లు వివరించారు.ఇక న్యూజెర్సీలోని ఎడిసన్‌లో జరిగిన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయా ప్రధాన్ హాజరై ప్రసంగించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎడిసన్ మేయర్ సామ్ జోషితో పాటు ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో VFS గ్లోబల్ నార్త్ అమెరికా, కరేబియన్ అధిపతి అమిత్ కుమార్ శర్మ పాల్గొని ప్రసంగించారు. VFS 150 దేశాలలో 70 ప్రభుత్వాలతో కలిసి పనిచేసిందన్నారు. ఇక నూతన కేంద్రాల నుండి వర్చువల్‌గా చేరిన ప్రవాసులను ఉద్దేశించి వినయ్ ప్రసంగించారు. ఈ కొత్త కేంద్రాల ఏర్పాటు ద్వారా భారతీయ డయాస్పోరాకు కాన్సులర్ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని, సేవలు సులభతరం, వేగవంతమౌతాయని వినయ్ పేర్కొన్నారు. శనివారాల్లో కూడా ఈ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో- అమెరికా వ్యాప్తంగా నివసించే లక్షలాది మంది భారతీయులకు కాన్సులర్ సేవలు మరింత చేరువ చేసినట్టవుతుందని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ఈ కొత్త కాన్సులేట్లను తెరవడం ద్వారా భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని.. ముఖ్యంగా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలమని అభిప్రాయపడ్డారు.(చదవండి: డాలస్‌లో కొత్తగా ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్)
క్రైమ్

తండ్రి డబ్బులివ్వలేదని కుమార్తె కిడ్నాప్!
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. బాలిక తండ్రి తనకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వట్లేదనే కారణంతో ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాలు.. మువ్వావారిపాలేనికి చెందిన కె.శ్రీనివాసరావు కుమార్తె చీమకుర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తిరుపతికి చెందిన ఈశ్వర్‌రెడ్డి శుక్రవారం పాఠశాల వద్దకు వెళ్లి బాలికను బయటకు పిలిపించాడు. తమ కుటుంబానికి తెలిసిన వ్యక్తే కావడంతో.. ఈశ్వర్‌రెడ్డి మాయమాటలు నమ్మిన బాలిక అతని బైక్ ఎక్కింది. అనంతరం తిరుపతి వైపు బయలుదేరిన ఈశ్వర్‌రెడ్డి.. కొద్దిసేపటికి బాలిక తండ్రికి ఫోన్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన రూ.5 లక్షలు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వనందున.. నీ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నానని చెప్పాడు. దీంతో బాలిక తండ్రి చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ సుబ్బారావు వెంటనే కిడ్నాపర్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయించారు. నెల్లూరు జిల్లా కావలి వైపు వెళ్తున్నట్లు గుర్తించి.. సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. కిడ్నాపర్‌ను కావలి–నెల్లూరు మధ్యలో అదుపులోకి తీసుకొని.. బాలికను రక్షించారు.

నా కుమారుడిని మంత్రి అనుచరులే పొట్టనపెట్టుకున్నారు..
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుల వల్లే తన కుమారుడు వడ్డే సునీల్(24) చనిపోయాడంటూ తల్లి లక్ష్మీదేవి ఆరోపించారు. గురువారం సాయంత్రం తన కుమారుడిని ఇష్టానుసారం కొట్టి చంపేసి.. చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీదేవి, నారాయణప్ప దంపతుల కుమారుడు సునీల్.. నెల నుంచి కియా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఫ్యాక్టరీ గేటు ఎదురుగా ఉన్న వేపచెట్టుకు ఉరికి వేలాడుతున్న స్థితిలో సునీల్ మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి నారాయణప్ప ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపారు. సునీల్ రొద్దం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను వేధించేవాడని, ఈ క్రమంలో ఆమె సమీప బంధువైన విట్టాపల్లికి చెందిన ఓ వ్యక్తి కలగజేసుకుని పరిగికి చెందిన వ్యక్తితో ఈ విషయంపై చర్చించాడని, దీంతో పరిగికి చెందిన వ్యక్తి గురువారం సాయంత్రం సునీల్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల ఎదుటే మందలించాడని, దీన్ని అవమానంగా భావించిన అతను గురువారం సాయంత్రమే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ చెప్పారు. కాగా, సునీల్తల్లి లక్ష్మీదేవి మాత్రం కియా పరిశ్రమలో డ్యూటీకి వెళ్లిన తన కుమారుడు ఇలా ఉరి వేసుకునేంత తప్పు చేయలేదని కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి అనుచరుడు చంద్ర ఇంటి వద్దకు వచ్చి తన కుమారుడిని మందలించాడని, ఆ తర్వాత మరికొందరు కలసి ఇష్టానుసారం కొట్టారని ఆమె తెలిపారు. తన కుమారుడి చావుకు మంత్రి అనుచరులే కారణమని.. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని విన్నవించారు.

అర్చన దొరికింది, కానీ..
‘‘ఆంటీ.. భోపాల్ దగ్గర్లో ఉన్నా..’’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఆ తర్వాత పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంటూ సివిల్ జడ్జి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అర్చనా తివారీ(28).. రాఖీ పండుగకు ఇంటికి రైలులో బయల్దేరి అనూహ్యరీతిలో అదృశ్యం కావడం మధ్యప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కట్నీకి చెందిన అర్చనా తివారీ.. ఆగస్టు 7వ తేదీన ఇండోర్ నుంచి సొంతూరుకు బయల్దేరేందుకు ఇండోర్-బిలాస్పూర్ నర్మదా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరింది. రాత్రి 10.16గం. టైంలో చివరిసారిగా ఆమె తన దగ్గరి బంధువుతో ఫోన్లో మాట్లాడింది. అయితే ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయింది. 👉ఆగస్టు 8వ తేదీ.. తెల్లవారు జామున.. కట్నీ సౌత్ స్టేషన్లో అర్చన రైలు దిగలేదు. కుటుంబ సభ్యులు ఆమె ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆందోళన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈలోపు ఆమె బంధువు ఒకరు తర్వాతి స్టేషన్ ఉమారియాలో ఆమె బెర్త్ వద్ద బ్యాగ్‌ను గుర్తించారు.👉ఆగస్టు 9-11వ తేదీ.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మూడు బృందాలుగా విడిపోయారు. భోపాల్, కట్నీ, ఇండోర్, నర్మదాపురం ప్రాంతాలను రెండ్రోజులపాటు జల్లెడ పట్టారు. చివరిసారిగా ఆమె ఫోన్ సిగ్నల్ నర్మదా రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తించారు. దీంతో ఎస్డీఆర్ఎఫ్, హోంగార్డుల బృందాలతో నదిలో గాలించారు. 👉ఆగస్టు 12వ తేదీ.. 100 గంటల గాలింపు తర్వాత కూడా అర్చన గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. రాణి కమలపతి స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీల్లో ఆమె కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులు సైతం అది అర్చననేని ధృవీకరించలేకపోయారు. ఈలోపు.. అర్చన కేసు సెన్సేషన్ కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం సైతం పోలీస్ శాఖపై ఒత్తిడి పెంచింది. దీంతో అర్చన ఆచూకీ పేరిట పోస్టర్లు వెలిశాయి. 👉ఆగస్టు 13వ తేదీ.. అర్చనా తివారీ మిస్సింగ్ కేసులో ఒక మేజర్ క్లూ దొరికిందని భోపాల్ రైల్వే పోలీసులు ప్రకటించారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డాటా రికార్డులు, కాల్ డిటైల్ రికార్డుల ఆధారంగా ఆమెను ఆచూకీని గుర్తించినట్లు ప్రకటించారు. 👉ఆగస్టు 14వ తేదీ.. నర్మదాపురం పిపరియాలో అర్చనను చూశామంటూ కొందరు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భోపాల్ రైల్వే పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కబురు పంపారు. తమ సోదరి క్షేమంగా ఉండే ఉంటుందని.. ఆమెను వెంట పెట్టుకునే తిరిగి వెళ్తామంటూ ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 👉ఆగస్టు 15వ తేదీ.. అర్చన సొంతూరికి బయల్దేరిన విషయాన్ని ఆమె ఉంటున్న హస్టల్ ఓనర్ ధృవీకరించారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇదివరకే మీడియాకు విడుదల చేసినట్లు గుర్తు చేశాడు. అర్చనా తివారీ దొరికిందని భోపాల్ పోలీసులు ప్రకటించి.. 48 గంటలు గడుస్తోంది. కానీ, ఇప్పటిదాకా ఆ వివరాలేవీ మీడియాకు వెల్లడించలేదు. ఆమె తనంతట తానుగా వెళ్లిందా? ఎవరైనా ఎత్తుకెళ్లారా? అసలు ఆమె ఎలా అదృశ్యమైంది?.. ఈ మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతోంది.

ఆర్టీపీపీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
జమ్మలమడుగు : మండల పరిధిలోని కలమల్ల గ్రామ సమీపంలో ఆర్టీపీపీ వద్ద బ్రిడ్జిపైన గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఫ్లైయాష్ టిప్పర్ ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుభాషిణి(35), గాయత్రి(25) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని కలమల్ల ఎస్ఐ సునీల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముద్దనూరు మండల పరిధిలోని కోసినేపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఆర్టీపీపీలోని లోకోషెడ్‌లో పని చేస్తుండగా, వెంకటేశు కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ అన్నదమ్ములు.గురువారం వారి బంధువులకు సంబంధించిన వివాహానికి ప్రొద్దుటూరుకు బైక్‌లో బయలుదేరారు. బైక్‌ను వెంకటేష్ నడుపుతుండగా అతని భార్య గాయత్రి, వెంకటరమణయ్య భార్య సుభాషిణి వెనుక కూర్చున్నారు. వీరు ఆర్టీపీపీ నుంచి కలమల్ల మీదుగా బైక్‌లో బ్రిడ్జిపై వెళుతుండగా అధిక లోడుతో వస్తున్న ఫ్లైయాష్ టిప్పర్ వెనుక వైపు నుంచి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వెంకటేష్, గాయత్రి, సుభాషిణి కిందపడ్డారు. టిప్పర్ వేగంగా గాయత్రి, సుభాషిణిలపై దూసుకెళ్లింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎంత సేపటికి 108 వాహనం రాకపోవడంతో సంఘటన స్థలానికి వచ్చిన కలమల్ల ఎస్ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తన జీపులో తీవ్ర గాయాలైన వెంకటేష్‌ను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయత్రికి ఇద్దరు, సుభాషిణికి ఇద్దరు సంతానం ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పరిశీలించారు.న్యాయం చేయాలంటూ ధర్నా..మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ స్థానికులు, కార్మికులు బ్రిడ్జిపైనే మృతదేహాలను పెట్టుకుని ధర్నా చేపట్టారు. ఫ్లైయాష్‌ను అధికంగా లోడు చేసుకుంటూ టిప్పర్లు, లారీలు మనుషులను తొక్కించుకుంటూ పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పర్ల యజమానులేమో బూడిదలో ఆదాయం పొందుతుండగా జనం మాత్రం ఇలా మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.