Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
breaking news

ప్రధాన వార్తలు

Is ISRO Not Promote Shubhanshu shukla Historical Feat1
ISSలో శుభాంశు శుక్లా.. ఇస్రో ఎందుకో వెనుకబడింది!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు?.. ఇంకెవరు తాజాగా ఆ ఫీట్‌తో చరిత్ర సృష్టించింది భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లానే. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మిషన్‌లో భారతీయ అంతరిక్ష సంస్థ(ISRO) కూడా భాగంగా ఉంది. అలాంటప్పుడు ఇస్రో ఎందుకు దీనిని అంతగా ప్రమోట్‌ చేసుకోవడం లేదు!!.శుభాంశు శుక్లా అడుగు.. భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం. శుభాంశు పైలట్‌గా సాగిన ఐఎస్‌ఐఎస్‌కి సాగిన యాక్జియం-4 మిషన్‌ ప్రయాణం.. అంతరిక్షంపై భారత్‌ చేసిన సంతకం. కానీ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ISRO తక్కువగా ప్రచారం చేయడం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తోంది. దేశం మొత్తం గర్వపడే ఈ ఘనతను మరింత ఉత్సాహంగా, ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇస్రో ఎందుకు వెనకబడిందనే విషయాన్ని పరిశీలిస్తే..వీళ్ల తర్వాత శుక్లానే..అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్‌ రాకేశ్‌ శర్మ. సోయుజ్ T-11 (Soyuz T-11) మిషన్‌ కోసం 1984, ఏప్రిల్ 3న ఆయన స్పేస్‌లోకి వెళ్లారు. అక్కడ సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) ద్వారా నిర్వహించబడిన సల్యూట్ 7లో(సెకండ్‌జనరేషన్‌ అంతరిక్ష కేంద్రం) ఏడు రోజులపాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయులెవరూ స్పేస్‌లోకి వెళ్లింది లేదు. కానీ..భారతీయ మూలాలు ఉన్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌.. తెలుగు మూలాలున్న భారత సంతతికి చెందిన శిరీషా బండ్లా, రాజా జాన్ వూర్పుటూర్ చారి మాత్రం రోదసీ యాత్రలు చేశారు. ఈ లెక్కన రాశేష్‌ శర్మ తర్వాత స్పేస్‌లోకి.. అందునా ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోకి అడుగిడిన తొలి వ్యక్తి ఘనత శుభాంశు శుక్లాదే. పైగా నలుగురితో కూడిన ఈ బృందంలో పైలట్‌గా ఉన్న శుభాంశు స్వయంగా 7 కీలక ప్రయోగాలు(60 ప్రయోగాల్లో) నిర్వహించనున్నారు. అలాంటప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిని ఇస్రో ఎందుకు హైలైట్‌ చేసుకోవడం లేదు!.అంత బడ్జెట్‌ కేటాయించి మరీ..అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్న భారత్‌.. చంద్రయాన్‌, మంగళయాన్‌తో సూపర్‌ సక్సెస్‌ సాధించింది. అలాంటి దేశం తరఫున ఐఎస్‌ఎస్‌కి వెళ్లిన తొలి మిషన్‌ ఇదే. పైగా భారతదేశం భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ మిషన్‌కు.. శుక్లా పాల్గొన్న ఈ మిషన్‌ ముందడుగుగా పరిగణించబడుతోంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం తరఫున Department of Space (DoS) ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి రూ. 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన రూ. 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు.ఈ మొత్తం బడ్జెట్‌లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. పైగా తాజా మిషన్‌లో జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకుంటే ఈ విషయాలన్నింటిని భారీగా ప్రచారం చేసుకునేదే. కానీ, ఎందుకో ఆ పని చేయడం లేదు. దీంతో Wake up ISRO! అనే చర్చ మొదలైంది.అందుకేనా?..ఇస్రో మౌనానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. సాధారణంగా తక్కువ ప్రచారంతో, శాస్త్రీయ దృష్టితో ముందుకు సాగే సంస్థ ఇది. అందుకే దేశానికి గర్వకారణమైన ఘట్టం విషయంలోనూ అదే వైఖరి అవలంభిస్తుందా? అనే అనుమానం కలగకమానదు. సంస్థ సంస్కృతికి తోడు ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు..యాక్సియం-4 ‍స్పేస్‌ మిషన్‌.. ప్రైవేట్ అంతర్జాతీయ భాగస్వామ్యం అంటే ISRO, NASA, Axiom Space సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన మిషన్. అందుకే గతంలో చంద్రయాన్-3 వంటి సొంత మిషన్లకు భారీ ప్రచారం ఇచ్చిన ఇస్రో, తాజా మిషన్ అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరిగినందున తక్కువ స్థాయిలో స్పందించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. మిషన్‌ ముగిసే సమయంలోనైనా ఇస్రో శుభాంశు శుక్లా ఘనతను ప్రపంచమంతా మారుమోగిపోయేలా ప్రచారం చేయాలని పలువురు భారతీయులు ఆశిస్తున్నారు.:::వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం

Picnic Turns Tragic For Pak Family Swat River flash floods Video2
ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు

సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్‌ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్‌ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్‌లో ఘోరం జరిగింది. స్వాత్‌ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్‌ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.పంజాబ్‌ సియాల్‌కోట్‌కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్‌ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఫిజాఘట్‌ వద్ద స్వాత్‌ లోయకు పిక్నిక్‌కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్‌ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్‌ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్‌ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్‌ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్‌లో వైరల్‌ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025

Security Guard Arrested In Kolkata Law College Incident3
Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్‌

కోల్‌కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్‌ లా ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్‌ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. ‌కోల్‌కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్‌ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్‌లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్‌కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్‌ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్‌ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్‌ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్‌ గేట్‌కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్‌ చదువుతున్న జయీబ్‌ అహ్మద్‌ (19), ప్రమీద్‌ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్‌ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్‌ బెదిరించాడు.నా బోయ్‌ఫ్రెండ్‌కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్‌ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్‌ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు.

Rich Dad Poor Dad author Robert Kiyosaki says Silver price will explode in July4
జూలైలో ‘సిల్వర్‌ బాంబ్‌’.. వెండిపై ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ రచయిత

అత్యధికంగా అమ్ముడైన పర్సనల్‌ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఇది వెండిపై పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కియోసాకి తన అధికారిక హ్యాండిల్‌లో పేర్కొన్నారు.కియోసాకి వెండిని ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'గా అభివర్ణించారు. దాని అధిక రివార్డ్-టు-రిస్క్ సామర్థ్యాన్ని ఉదహరించారు."వెండి ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'. అంటే తక్కువ ప్రతికూల రిస్క్‌తో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయి' అని రాబర్ట్‌ కియోసాకి తన ట్వీట్లో పేర్కొన్నారు.వైట్ మెటల్ తక్కువ ప్రతికూల రిస్క్ తో ఎక్కువ లాభాలను కలిగి ఉందని ఆయన వివరించారు. "ఈ రోజు ప్రతి ఒక్కరూ వెండిని కొనగలరు... కానీ రేపు కాదు" అన్నారు. తన సందేశాన్ని "గొప్ప పాఠం"గా అభివర్ణిస్తూ, తనను అనుసరించేవారికి గుర్తు చేశారు. "మీరు కొనుగోలు చేసినప్పుడు లాభాలు వస్తాయి... అమ్మినప్పుడు కాదు" అని సూచించారు.వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో కియోసాకి ప్రకటన వెండి సమీప కదలికపై దృష్టిని మరింత పెంచింది. చాలా మంది ఇప్పుడు జూలైని నిశితంగా గమనిస్తున్నారు. విలువైన లోహాల మార్కెట్ ను గమనిస్తున్న విశ్లేషకులు కూడా వెండి జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. REMINDER: Rich Lesson:“Your profits are made when you buy…. Not when you sell.”Silver is the best “asymmetric buy” today. That means more possible upside gain with little down side risk.Silver price will explode in July, Everyone can afford silver today… but not…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2025

BRS Working President KTR Slams Congress Govt5
‘మిస్టర్‌ రేవంత్‌.. మీ తెలివి తక్కువ నిర్ణయాలను మేం రద్దు చేస్తాం’

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధానంగా అన్నపూర్ణ క్యాంటీన్‌ల పేర్లు మార్చడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్‌. ఢిల్లీ బాస్‌లకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విధేయతను చూపించాలనుకుంటే.. మీ పేర్లను రాజీవ్‌ లేదా జవహర్‌గా మార్చుకోండి అంటూ చురకలంటిచారు.ఈ మేరకు తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘ అన్నపూర్ణ క్యాంటీన్‌ల పేరు మార్చడం హాస్యాస్పదం.. సిగ్గుచేటు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తెలివి తక్కువ నిర్ణయాలను రద్ద చేస్తాం. 2028లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిర్ణయాలకు చరమగీతం పాడతాం’ అని కేటీఆర్‌ హెచ్చరించారు. Mr. Revant Reddy, If you want to show your subservience to Delhi bosses, why don’t you change your own name to Rajiv or Jawahar ? Renaming Annapurna canteens is absolutely ridiculous and shameful We shall undo all of these senseless actions in 2028 when BRS is back at the… https://t.co/ufWwUWyXu2— KTR (@KTRBRS) June 28, 2025

Tadipatri Municipal Office Survey At Pedda Reddy House6
పెద్దారెడ్డి ఇంటి కూల్చివేతకు కూటమి కుట్ర!

సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న కూటమి నేతలు.. తాజాగా ఆయన ఇంటిని టార్గెట్‌ చేసినట్టు తెలుస్తోంది. పెద్దారెడ్డి ఇంటి వద్ద తాజాగా మున్సిపల్‌ శాఖ అధికారులు కొలతలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి కక్ష సాధింపు పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. పెద్దారెడ్డిని టార్గెట్‌ చేసి అధికారులు, టీడీపీ నేతలు రాజీకీయంగా వేధింపులకు గురిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక టీడీపీ నేతలు, పోలీసులు.. ఇప్పటికీ ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వడం లేదు. ఇక, తాజాగా తాడిపత్రిలో మున్సిపల్‌ అధికారులు తనిఖీలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈరోజు పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన అధికారులు.. అక్కడ టేపుతో కొలతలు తీసుకున్నారు. ఇంటి ముందు, పరిసరాల్లో కొలతలు చేపట్టారు. అయితే, మున్సిపల్‌ స్థలం ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు తాము కొలతలు చేపట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే, వారి మాటలకు చేతలకు పొంతన కనిపించలేదు. దీంతో, స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు మాత్రం పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు.

Mahesh Anand, Tollywood Villain did 300 Films, Married 5 Times7
5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..

కరాటేలో బ్లాక్‌బెల్ట్‌.. డ్యాన్సర్‌, మోడల్‌. ఇవన్నీ కాదని నటనవైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించాడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. అతడే నటుడు మహేశ్‌ ఆనంద్‌ (Mahesh Anand).కెరీర్‌1982లో సనమ్‌ తేరీ కసం మూవీలో బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా పనిచేశాడు. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత కమల్‌ హాసన్‌ 'కరిష్మా' చిత్రంతో నటుడిగా మారాడు. సస్తి దుల్హన్‌ మహేంగ దుల్హ చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కవుట్‌ కాకపోవడంతో విలన్‌గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్‌లో కరడుగట్టిన విలన్‌గా పేరు గడించిన మహేశ్‌ ఆనంద్‌.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్‌, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్‌ వన్‌, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్‌ చేసి ఇక్కడి జనానికి దగ్గరయ్యాడు.ఐదు పెళ్లిళ్లువెండితెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట బర్క రాయ్‌ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవకాశాలు దూరంఅనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే (2000-2002) వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేశ్‌ కెరీర్‌ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అని ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్‌.. 2015లో రష్యన్‌ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్లు తెలుస్తోంది. పేదరికంలో మగ్గిన నటుడువందల సినిమాలు చేసిన మహేశ్‌.. దాదాపు 18 ఏళ్లపాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెప్‌ బ్రదర్‌ రూ.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కి పైగా సినిమాలు చేశా.. కానీ, ఇప్పుడు నీళ్ల బాటిల్‌ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరం అని రాసుకొచ్చాడు.మూడురోజులుగా కుళ్లిపోయిన మృతదేహం2019 ఫిబ్రవరి 9న మహేశ్‌ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. మూడు రోజులుగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమేనని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, అప్పటికే మరణించి మూడు రోజులైనట్లు వెల్లడించారు.చదవండి: ఆ డైరెక్టర్‌ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్‌

IPS Officer Parag Jain appointed new RAW chief8
రా చీఫ్‌గా ‘ఆపరేషన్‌ సింధూర్‌’ ఫేమ్‌

న్యూఢిల్లీ: ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌ రా(రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) చీఫ్‌గా నియమితులయ్యారు. పంజాబ్‌కు చెందిన 1989 బ్యాచ్‌ పరాగ్‌ జైన్‌ను రవి సిన్హా స్థానంలో రా చీఫ్‌గా నియమించారు. రా సెక్రటరీగా విధులు నిర్వరిస్తున్న రవి సిన్హా పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సీనియర్‌ అధికారి అయిన పరాగ్‌ జైన్‌ను రా చీఫ్‌గా నియమించారు. ఆయన పదవీ కాలం రెండేళ్ల పాట కొనసాగనుంది. అంతకుముందు పరాగ్‌ జైన్‌.. చండీగడ్‌లో ఎస్‌ఎస్‌పీ(సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా పని చేశారు. అలాగే కెనడా, శ్రీలంకల్లో దౌత్య ప్రతినిధిగా పని చేసిన అనుభవం పరాగ్‌జైన్‌కు ఉంది. ఇటీవల భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌లో పరాగ్‌ జైన్‌ సైతం కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం ఏవియేసన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో హెడ్‌గా పని చేస్తున్న పరాగ్‌ జైన్‌.. భారత చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌లో ముఖ్యభూమిక పోషించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధించి కీలక సమాచారం అందించడంలో పరాగ్‌ జైన్‌ ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్‌ తన వంతు పాత్రన సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఫలితంగా పలు విభాగాల్లో పని చేసి విశేష అనుభవం గడించిన పరాగ్‌ జైన్‌ను రా చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆయన అధికారికంగా జూన్‌ 30వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు.

Travis Head Scripts History Becomes 1st In World To Achieve This Feat9
డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్‌గా.. ట్రవిస్‌ హెడ్‌ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ ట్రవిస్‌ హెడ్‌ (Travis Head) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC)లో అత్యధిక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా హెడ్‌ ఈ ఘనత సాధించాడు.కాగా ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత మూడు టెస్టులు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మొదలైన తొలి టెస్టు (WI vs AUS) మూడు రోజు ఆటలోనే ముగిసింది.హెడ్‌ హాఫ్‌ సెంచరీలుబార్బడోస్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే, విండీస్‌ బౌలర్ల విజృంభణకు ఆసీస్‌ టాపార్డర్‌ కుదేలు అయింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (47) ఫర్యాలేదనిపించగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ట్రవిస్‌ హెడ్‌ అర్ధ శతకం (59)తో రాణించాడు. మిగతా వాళ్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (28) కాసేపు పోరాటం చేశాడు.ఈ క్రమంలో 56.5 ఓవర్లలోనే ఆసీస్‌ కథ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇందుకు బదులుగా విండీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 190 పరుగులు సాధించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పొరపాట్లను పునరావృతం చేయలేదు.టాపార్డర్‌ మరోసారి విఫలమైనా.. ఈసారి హెడ్‌ (61)తో పాటు బ్యూ వెబ్‌స్టర్‌ (63), అలెక్స్‌ క్యారీ (65) కలిసి ఇన్నింగ్స్‌ నిలబెట్టారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేసిన కంగారూలు.. ఆతిథ్య జట్టుకు 301 పరుగుల (విండీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల ఆధిక్యం) లక్ష్యం విధించారు.ఆస్ట్రేలియా ఘన విజయంఈ క్రమంలో విండీస్‌ 141 పరుగులకే ఆలౌట్‌ కావడంతో.. 159 రన్స్‌తో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 59, రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులతో రాణించి ఇక ఆసీస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన ట్రవిస్‌ హెడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. హెడ్‌ టెస్టు కెరీర్‌లో ఇది పదో అవార్డు.తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (2019) మొదలుపెట్టిన తర్వాత అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా హెడ్‌ చరిత్రకెక్కాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్‌ కలిస్‌ అత్యధికంగా 23సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు.చదవండి: వ‌రుసగా ఐదు ఓట‌ములు.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న స‌న్‌రైజ‌ర్స్ స్టార్‌

Konda Murali Key Comments After Appear Before Disciplinary Committee10
బిగ్‌ ట్విస్ట్‌.. కొండా మురళీకి మళ్లీ నోటీసులు

గాంధీభవన్‌లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఉల్టా వరంగల్‌ నేతలపైనే ఫిర్యాదు చేశారు. అయితే కాసేపటికే కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఆయనకు ట్విస్ట్‌ ఇచ్చింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ మళ్లీ నోటీసులు జారీ చేసింది. సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దుమారాన్ని రేపాయి. వరంగల్ జిల్లాలోని సొంత పార్టీనేతలపై కొండా మురళి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతీకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో శనివారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు కొండా మురళిని హాజరయ్యారు. కమిటీ ముందు తనపై ఫిర్యాదు చేసిన నేతలపైనే ఆయన ఫిర్యాదు చేశారు. అయితే, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వని అం‍శాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కోరింది. కొండా ఇచ్చిన సమాధానం తర్వాత మిగత ప్రక్రియ ఉంటుందని కమిటీ తెలిపింది. కొండా మురళి ఇచ్చింది వివరణ కాదు: మల్లు రవికొండా మురళి తమపై చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ ఉమ్మడి‌ వరంగల్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్‌తో పాటు,క్రమ శిక్షణా కమిటీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళీకి క్రమ శిక్షణా కమిటీ నోటీసులు పంపించింది. ఈ తరుణంలో ఇవాళ గాంధీ భవన్‌లో క్రమశిక్షణా కమిటీ ముందుకు కొండా మురళి వచ్చారు. ఇదే అంశంపై క్రమ శిక్షణా కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి చిట్‌చాట్‌ నిర్వహించారు. కొండా మురళీకి నేనే ఫోన్‌ చేశా. ఇవాళ కమిటీ ముందుకు వచ్చారు. కొండా మురళీ ఇచ్చింది వివరణ కాదు. ఇది ఆరంభం మాత్రమే. కొండా మురళీ కేసును ఇప్పుడే పరిశీలిస్తున్నాం.మా కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. కొండా మురళీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరాను. వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పాము. ఏ ఫిర్యాదులు ఉన్నా లిఖిత పూర్వకంగా రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలని కోరినట్లు చిట్‌చాట్‌లో మల్లు రవి వెల్లడించారు. మళ్లీ రేవంత్‌ అన్నే సీఎం: కొండా మురళిఇక క్రమ శిక్షణా కమిటీతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. ‘ఎవరి బలమెంతో ప్రజలందరికి తెలుసు. దయ చేసి నన్ను గెలకొద్దు. రాహుల్‌ గాంధీ అంటే నాకు గౌరవం, కాంగగ్రెస్‌ను గౌరవిస్తాను. రేవంత్‌ అన్న మళ్లీ సీఎం అవ్వాలి. బీసీ నాయకుడు మహేష్‌ అన్నకు మరిన్ని పదవులు రావాలి. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పీసీసీ అయినందుకు సంతోషపడుతున్నా. నేను మాట్లాడింది తప్పా? లేదా? అన్నది నా అంతరాత్మకు తెలుసు. నేను కేసులకు బయపడేవాడిని కాదు.’ అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement