Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Ugadi Wishes To All Telugu People1
తెలుగువారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు

తాడేపల్లి: తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ శ్రీ విశ్వావసు నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు. ఈ ఏడాది అంద‌రూ ఆయురారోగ్యాలు, సుఖ‌సంతోషాల‌తో ఉండేలా చూడాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘ‌నంగా జ‌రుపుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా.#Ugadi— YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2025

Sri Viswavasu Nama Samvatsara Ugadi Panchangam 2025-20262
శ్రీ విశ్వావసు నామ సంవత్సర (2025 – 26) రాశిఫలాలు

మేష రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–7.అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)కృత్తిక 1వ పాదము (ఆ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (తృతీయ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (లాభ), కేతువు సింహరాశి (పంచమ) స్థానాల్లో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (వ్యయం)లో సంచారం. ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ సంవత్సరం పనులు ఆలస్యం అవుతాయే గాని, పనులు పాడవడం జరగదు. దూకుడుగా నిర్ణయాలు చేయకండి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ పనుల్లో మంచిగా వ్యవహరించి సత్ఫలితాలు అందుకుంటారు. అనవసర కాలక్షేపం చేస్తారు. బంధువర్గంతో జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్థానచలన, ప్రమోషన్‌ ప్రయత్నాలు ప్రత్యేకంగా చేయకపోతే ప్రతికూలతలు తప్పవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగవు. వ్యాపారులకు అధికారుల ఒత్తిడి, పనివాళ్లతో సమస్యలున్నా, లాభాలు దక్కుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలకు, కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంది.వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఋణాలను ఎగవేసే వారు ఎక్కువ అవుతారు. కొత్త ఋణాలు దొరకవు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. నరాలు, ఎముకల సమస్యలు పెరగగలవు. మార్కెటింగ్‌ ఉద్యోగులకు పనులు ఆలస్యం అయినా, మంచి ఫలితాలు ఉంటాయి. షేర్‌ వ్యాపారులకు దూకుడుగా వ్యాపారం చేసే అవకాశం ఉండదు. రైతులు సాధారణ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో నష్టాలు లేకున్నా, ఆశించిన ఫలితం ఉండదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు మే నెల నుంచి అంతా సానుకూలం. విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు çఫలిస్తాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. గర్భిణీ స్త్రీలు మే నెల చివర వరకు జాగ్రత్తలు పాటించడం మంచిది.అశ్వని: ఎక్కువ కాలం సమయపాలనలో పనులు పూర్తి చేయలేరు. అందరితో మైత్రీ భావంతో ఉంటూ, సమస్యలు దగ్గరకు రాకుండా చూసుకోగలరు. మీ వద్ద పనిచేసేవారు పూర్తిగా సహకరిస్తారు. ఇతరుల విషయాలలో కలుగ చేసుకోరు. భవిష్యత్‌ ప్రణాళికలు బాగా చేస్తారు. భరణి: మీ ప్రవర్తనతో బంధుమిత్రులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక కార్యక్రమాలలో అవమానం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల విషయంలో అసంతృప్తి ఎదురవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని చేతులారా పాడు చేసుకుంటారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం: మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనీ మధ్యలోనే వదిలి వేస్తూ ఉంటారు. ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంటారు. కొన్నిసార్లు చక్కటి ఆలోచనా పటిమ ప్రదర్శించి విజయాలు సాధిస్తారు. విద్యా విషయాల్లో సానుకూలత ఎక్కువ. ఆర్థిక నిర్ణయాలు బాగుంటాయి. శాంతి మార్గం: నిత్యం రావిచెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రదక్షిణలు చేయండి. రోజూ దశరథకృత శని స్తోత్ర పారాయణ చేయండి. మే 15 తరువాత శని/ గురువులకు జపం దానాలు చేయడం, నవముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్‌: గురు, కుజుల అనుకూలత బాగుంది. ఐదు గ్రహాలు వ్యయంలో ఉన్నందున ప్రతి పనీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కుటుంబంలో అనుకోని సమస్యలు రాగలవు. మీకు సంబంధం లేని విషయాల్లోనూ ఇబ్బందులు రాగలవు. అందరికీ మీ మీద వైరభావం రాగలదు. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవద్దు. పనులు వాయిదా వేయకండి. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా దూరప్రాంతాలకు వాహనాలు నడపడం మంచిదికాదు. మే: కొన్ని సందర్భాలు సానుకూలం అవుతాయి. వ్యయంలో వున్న రాహు, శని, శుక్ర సంచారం వల్ల ఎక్కువగా ఇుబ్బందికర çపరిస్థితులే ఉంటాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోకండి. ఆర్థిక లావాదేవీలను స్వయంగా పరిశీలించండి. ఋణాలు తీర్చడం, కొత్త ఋణాలు దొరకడం కష్టమవుతుంది. జూన్‌: జన్మ శుక్రుడు వల్ల ఈ నెలంతా చాలా సమస్యలను తెలివిగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబంలో అందరికీ వారి వారి విధానములు సవ్యంగా సాగుతాయి. ఒత్తిడి లేని జీవితం సాగిస్తారు. బంధువుల సహకారం బాగుంటుంది. ఆరోగ్యం పట్ల ముందుజాగ్రత్తలు పాటించి సమస్యలను నివారించుకుంటారు. జులై: పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. అన్ని వ్యవహారాలలో ఓర్పు, సహనం ప్రదర్శించి అనుకున్న ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలలో గొప్ప సానుకూలత ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం. ఆగస్ట్‌: అన్ని పనులు చక్కగా సాగుతాయి. కొత్త ప్రయత్నాలు 21వ తేదీ నుండి వేగవంతమవుతాయి. మీకు అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. స్వబుద్ధితో కార్య జయం. ధన ధాన్యలాభం చేకూరుతుంది. బంధుమిత్రుల కలయిక వలన భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్‌ లభిస్తుంది. సెప్టెంబర్‌: బుద్ధి కుశలతతో పనులు సానుకూలం చేసుకుంటారు. కుటుంబ సమస్యలు పెరుగుతున్నట్లు అనిపించినా, తెలివిగా వాటిని పరిష్కరించుకుంటారు. ఓర్పుగా వ్యవహార జయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను అధికంగా చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తెలివిగా అధిగమించగలరు. అక్టోబర్‌: కలహప్రదమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పెంచుకోవద్దు. అన్న, వస్త్రాదులు సకాలంలో అందని పరిస్థితి ఏర్పడుతుంది. అవయవాలు ప్రతికూలిస్తున్నాయనే భావన ఎక్కువ అవుతుంది. మిత్రులతో మనసు విప్పి మాటలాడలేని పరిస్థితి. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి.నవంబర్‌: వాక్‌ నియంత్రణ పాటించడం, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రోజువారీ కార్యక్రమాలు మినహా ఇతరమైనవి చేపట్టవద్దు. ఆగ్రహావేశాలను అదుపు చేసుకోండి. ఆర్థిక వెసులుబాటు ఉన్నా, అనవసర ఖర్చులు పెరుగుతాయి. డిసెంబర్‌: ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయవలసిన కాలం. ప్రతిపనికీ అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో దూరప్రాంత విహారాలు చేస్తారు. శుభకార్యాలు, బంధు మిత్రుల కలయిక, కుటుంబంలోని పెద్దల ఆరోగ్య చికాకుల వల్ల వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా, శ్రద్ధగా ఋణములు, ఖర్చులు నిర్వహిస్తారు. జనవరి: మంచి మార్పులు మొదలవుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. సమస్యలను సరిచేసుకొని ముందుకు వెడతారు. ధైర్యంగా ఉంటారు. ఉద్యోగంలో పాత సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు ఉంటాయి. ఫిబ్రవరి: కాలం అనుకూలంగా ఉంది. గత సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. ఇటువంటి మంచి గ్రహచారం చాలా అరుదుగా వస్తుంటుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. ఋణ విషయాలలో మంచి నిర్ణయాలు జరుగుతాయి. కొన్ని జటిల సమస్యలు పరిష్కారానికి దగ్గర అవుతాయి. స్థిరబుద్ధిని ప్రదర్శించండి. మార్చి: మొండి ధైర్యం పెరుగుతుంది. వ్యయ గ్రహచారం పెరుగుతోంది. జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఇతరులకు సలహాలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. మీ కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ వ్యవహారాల్లోనూ అనుకూలత తక్కువగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలత తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగం అవుతాయి. వృషభ రాశిఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–1, అవమానం–3.కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)మృగశిర 1,2 పాదములు (వే,వో)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (ద్వితీయ) స్థానంలో ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (దశమ), కేతువు సింహరాశి (చతుర్థ) స్థానాల్లో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (లాభ) సంచారం. శని, గురు సంచారం అనుకూలత కారణంగా మంచి ఫలితాలు అందుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమయపాలనతో విజయాలు సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాలు చేస్తారు. సమస్యలు లేని జీవితం సాగుతుంది. కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. పిల్లల అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. అందరి సహాయ సహకారాలతో విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. ఆదాయం అనుకూలం. ఖర్చులను అదుపు చేయగలరు. నగలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన ఋణ సౌకర్యం దొరుకుతుంది. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నియమబద్ధమైన జీవనం సాగించి ఆరోగ్యపరంగా సత్ఫలితాలు పొందుతారు. దూరప్రాంతాలను సందర్శిస్తారు. మార్కెటింగ్‌ ఉద్యోగులు తేలికపాటి ప్రయత్నాలతోనే అభివృద్ధి సాధిస్తారు. షేర్‌ వ్యాపారులకు లాభాల పంట. రైతులకు సంవత్సరం అంతా బాగుంటుంది. విద్యార్థులకు సర్వత్రా విజయప్రదం. విజ్ఞాన విహార యాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అఖండ విజయానికి అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సానుకూల స్థితి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. ఉద్యోగాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శన అవకాశాలు పెరుగుతాయి. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అన్ని రంగాలలో విజయాలు సాధిస్తారు. పనివారితో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గర్భిణీ స్త్రీలకు సంవత్సరం అంతా అనుకూలం. మే నుంచి సత్ఫలితాలు పెరుగుతాయి. సుఖ ప్రసవయోగం ఉంది.కృత్తిక 2, 3, 4 పాదాలు: అంతా శుభప్రదంగా ఉంటుంది. తెలియని మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. వ్యాపారులకు ఋణ వెసులుబాటు తక్కువగా ఉంటుంది. అయినా నష్టం ఉండదు. పుణ్యకార్యాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. రోహిణి: తెలివిగా ఓర్పుగా వ్యవహరించడంలో వీరికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాలలో మంచి నిర్ణయాలు చేస్తారు. అందరికీ సహకరించడం ద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ అవసరాలు తీర్చడం ప్రధాన అంశంగా ముందుకు సాగుతారు. ప్రజాసంబంధాలు పెంచు కుంటారు.మృగశిర 1, 2 పాదాలు: ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల విషయాలలో కలుగ చేసుకోవద్దు. మీ విషయంలో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు. పుణ్యకార్య, శుభకార్యాల కోసం ప్రయాణాలు ఎక్కువ. ఖర్చులు ఎక్కువ. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడికి లోనవుతారు.శాంతి మార్గం: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. ప్రాతః కాలంలో తెల్లటి పూలతో లక్ష్మీపూజ చేయడం, గోపూజ చేయడం విశేషం. గ్రహశాంతి ప్రత్యేకంగా అవసరం లేదు కాని, నవగ్రహస్తోత్రములు రోజూ పారాయణ చేయడం శ్రేయస్కరం. పంచముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్‌: అన్ని పనులలోను ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. నూతనోత్సాహంతో ముందుకు వెడతారు. మీకు సహకరించే బంధుమిత్రులు ఉంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ప్రయత్నించవలసిన పనులు ఏమయినా ఉంటే 14వ తేదీ లోపుగా చేయండి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ దగ్గర పనిచేసే వారి నుంచి ప్రోత్సాహం అందుకుంటారు. శుభకార్య, పుణ్యకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు, షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు అనుకూలం. మే: ఎక్కువకాలం అనుకూలంగా ఉంటుంది. కొద్దిరోజులు మాత్రమే మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకార ధోరణి వల్ల సత్ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూల స్థితి ఉంటుంది. పుణ్యకార్య శుభకార్యాలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జూన్‌: ప్రయాణాలలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలు తరచుగా రిపేర్‌కు వస్తుంటాయి.పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది. పుణ్యకార్య శుభకార్యాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తెలివిగా పనులు సానుకూలం చేసుకుంటారు. జులై: చాలా అనుకూలమైన ఫలితాలు అందుతాయి. పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి విజయాలు అందుకుంటారు. ప్రారంభించిన ప్రతిపనీ అనుకూలమే. మనస్సౌఖ్యం ఎక్కువ. ధనధాన్య లాభం చేకూరుతుంది. కుటుంబపరంగా అన్నీ అనుకూలం. ఉద్యోగ, వ్యాపార, ఋణ, ఆరోగ్య విషయాలలో పనులు సానుకూలం చేసుకుంటారు. ఆగస్ట్‌: అకాలంలో పూర్తయ్యే పనులు వృత్తి ఉద్యోగాలకు చికాకులు కలిగిస్తాయి. భార్యా పిల్లల సహకారం బాగా ఉంటుంది. తరచుగా పనులు మరచిపోతుంటారు. పెంపుడు జంతువుల ద్వారా ఖర్చు పెరుగుతుంది. అధికారుల ద్వారా ఒత్తిడికి లోనవుతారు. అన్ని విషయాలలోనూ అసంతృప్తి ఉంటుంది. సెప్టెంబర్‌: వృద్ధి శాతం క్రమంగా పెరుగుతుంది. గత సమస్యల పరిష్కారానికి, కొత్త పనుల ప్రణాళికా రచనకు ఈ నెల అనుకూలం. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. అందరి నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో సాధించే విజయాలతో ఆనందంగా ఉంటారు. అక్టోబర్‌: మనోధైర్యంతో ఉంటారు. విద్యా, వినోద, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగా అందుతుంది. పదిమందికీ సలహాలు ఇస్తారు. ఉద్యోగ భద్రత, వ్యాపార వృద్ధి అద్వితీయంగా ఉంటాయి. ఋణ సౌకర్యం బాగుంటుంది. స్వేచ్ఛగా జీవితం గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నవంబర్‌: ఆరోగ్యపరంగా ఏదో తెలియని ఇబ్బందిని ఎదుర్కొంటారు. కుటుంబపరంగా గురు, శుక్ర, కుజ ప్రతికూలత దృష్ట్యా జాగ్రత్తలు అవసరం. అనవసర కలహాలకు దూరంగా ఉండండి. జ్ఞాతి వైరం ఎక్కువగా ఉం టుంది. శుభకార్య ప్రయత్నాలు, ప్రయాణాలలో విçఘ్నాలు ఎదురవుతాయి. అనవసర కాలక్షేపాలు చేస్తారు. డిసెంబర్‌: ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం అవసరం. అంతా అనుకూలంగా ఉందని అనుకున్నా, అకస్మాత్తుగా ఇబ్బందులు రాగలవు. ఇతర వ్యాపకాలు పనికిరాదు. కేవలం వృత్తి, కుటుంబ విషయాల మీద దృష్టి కేంద్రీకరించండి. పాత ఋణాల విషయంలో విచిత్రమైన సమస్యలు వచ్చే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. జనవరి: పిల్లల అభివృద్ధి సంతృప్తి కలిగిస్తుంది. క్రమంగా ఒక్కో మంచి మార్పు మీకు దగ్గర అవుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భోజన వసతి 17వ తేదీ నుండి ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ విషయాలు సాధారణంగా ఉంటాయి. మిగిలిన అన్ని ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఫిబ్రవరి: గోచారం చాలా బాగుంది. ప్రధానంగా పాత సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్కువ శ్రమ చేసి, ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సమస్యలు లేకుండా నడుస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మార్చి: కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా వృద్ధిని సాధిస్తారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నడుపుతారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. మనశ్శాంతిగా ఉంటారు. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. మిథున రాశిఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–4, అవమానం–3.మృగశిర 3,4 పాదములు (కా, కి)ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (జన్మ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (నవమ), కేతువు సింహరాశి (తృతీయం) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (దశమ) సంచారం. తరచుగా బుద్ధి భ్రంశానికి లోనవుతుంటారు. చేసే పనులు విడిచి ప్రశాంతంగా దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. ప్రతిపనీ పరధ్యానంగా చేస్తారు. మీ ప్రయత్నాలు ఏవీ సరిగా సాగవు. చతుష్పాద జంతువులతో ఇబ్బంది ఉంటుంది. సమయపాలనతో రోజువారీ పనులు పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మే వరకు కొన్ని సమస్యలు ఉంటాయి, మే తర్వాత కొంత అనుకూలత ఉంటుంది. కుటుంబ వ్యవహారములలో ఇతరుల ప్రమేయాన్ని ఖండిస్తేనే సుఖపడతారు. ఉద్యోగ విషయాల్లో మీకు సహకరించే అధికారులు విరుద్ధంగా ఉంటారు. ప్రతిపనీ మీ అవగాహన లోపం వలన ఒకటికి రెండుసార్లు చేయవలసి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆలోచనలకు, అమలుకు సంబంధం లేక సాధారణ ఫలితాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో అనిశ్చితి వల్ల చికాకులు ఎదుర్కొంటారు. ఆదాయం తక్కువ. అనవసర ఖర్చులను నియంత్రించలేకపోతారు. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. వస్తునష్టం ఉంటుంది. కొత్త ఋణాలు సకాలంలో అందవు. పాత ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా చికాకుపడుతుంటారు. మార్కెటింగ్‌ ఉద్యోగులు ప్రశాంతంగా ప్రవర్తిస్తే కొంత మంచి ఫలితాలు పొందగలరు. షేర్‌ వ్యాపారులకు చికాకులు ఎదురవుతాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్ళండి. రైతులకు శ్రమ ఎక్కువ. లాభాలు తక్కువ. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు అందు తాయి. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు వ్యవహారాలలో ప్రతిపనీ చికాకు పెడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. విదేశీ నివాస ఉద్యోగ ప్రయాణ ప్రయత్నాలలో పనులు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు చాలా విషయాలలో ధైర్యంగా ఉన్నా, బుద్ధి కుశలత తగ్గుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మే నెల నుంచి పెరుగుతుంది. ప్రధానంగా పిల్లల విషయంలో కలవర పడుతుంటారు. ఆరోగ్యంలో తేడా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికర ఘటనలేవీ ఉండవు. జూన్‌ వరకు ఆరోగ్య జాగ్రత్తలు అవసరం.మృగశిర 3, 4 పాదాలు: మీ స్వభావ సిద్ధమైన పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. చతుష్పాద జంతువులు, పెంపుడు జంతువులు ఇబ్బంది సృష్టిస్తాయి. నమ్మకంగా ఉండే వారి ప్రవర్తన కూడా కొంత అనుమానించేలా ఉండటంతో సందిగ్ధావస్థ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. ఆరుద్ర: అంతా శుభ పరిణామాలే ఉంటాయి. కుటుంబపరంగా మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. విజయం సాధిస్తారు. విద్యా, విజ్ఞాన, విషయ శోధనలో కాలక్షేపం జరుగుతుంది. ఆర్థిక వెసులుబాటు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ధనం వెసులుబాటు, పనివారి సహకారం తక్కువగా ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు: తరచుగా బుద్ధి స్థిమితం కోల్పోతుంటారు. ఆగ్రహావేశాలతో ప్రవర్తిస్తుంటారు. కుటుంబ సభ్యులకు మీకు సయోధ్య సరిగా సాగదు. అస్థిర బుద్ధితో ఏ పనీ సరిగా చేయలేరు. ఋణ విషయాలలో అవమానకర ఘటనలు ఉంటాయి. శాంతి మార్గం: కుజ గురువులకు జప, దాన, తర్పణ వంటివి తరచుగా చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం రోజూ పఠించండి. ప్రదోషకాలంలో శివాలయంలో ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు, కాలభైరవాష్టకం పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్‌: ఆదాయం బాగుంటుంది. ఖర్చులు నియంత్రించలేరు. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. అన్ని వ్యవహారాలలోనూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో తరచుగా పాల్గొంటారు. ఉద్యోగంలో స్థానచలన, ప్రమోషన్‌ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులు సంతృప్తికరంగా వ్యాపారం చేయగలుగుతారు. గురువులను, పూజ్యులను తరచుగా దర్శిస్తుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు సానుకూలం. మే: చాలా అనుకూల వాతావరణం. స్వయంగా పనులు పర్యవేక్షించడం, స్వబుద్ధితో ఆలోచించడం, సమయపాలన ద్వారా విజయావకాశాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల సహకారం, తోటివారి సహకారం బాగా అందుతుంది. ట్రాన్స్‌ఫర్‌ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జూన్‌: కేవలం ఓర్పు, సహనం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఋణ సౌకర్యం తగ్గుతుంది. జులై: వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్తపడండి. ధనవ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటుంది. వస్తువులను తరచుగా మరచిపోతుంటారు. కార్యవిఘ్నం తరచుగా ఉంటుంది. మొండి ధైర్యంతో పనులకు శ్రీకారం చుడతారు. చతుష్పాద జంతువుల వలన ఇబ్బందులు ఉంటాయి. ఆగస్ట్‌: చాలా విచిత్రమైన కాలం. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. విజయాలు సాధిస్తారు. పని ఒత్తిడి ఎక్కువ. అనుకోకుండా కొత్త పనులు చేయవలసి వచ్చి రోజువారీ పనులకు ఇబ్బంది కలుగుతుంది. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సెప్టెంబర్‌: ఇబ్బందులు లేని కాలమే నడుస్తుంది. కొత్త కొత్త ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలు చేస్తారు. అంతా శుభంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యత బాగుంటుంది. పెద్దలు, పూజ్యులు, గురువుల సందర్శన, పుణ్యకార్య నిర్వహణలో కాలక్షేపం జరుగుతుంది. అక్టోబర్‌: సాధారణ జీవనశైలితో ముందుకు వెడతారు. తెలియని అనిశ్చితి ఏర్పడుతుంది. ఉద్యోగం బాగుంటుంది. అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారం బాగా ఉన్నా, ఆర్థిక లావాదేవీలు, ఋణ వ్యవహారాలు ఇబ్బంది లేకున్నా, భయంతో గడుపుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు, శ్రమాధిక్యం ఉంటాయి. నవంబర్‌: ఊహాతీతంగా పనులు వేగంగా పూర్తవుతాయి. అనుకోని వ్యక్తులు కూడా సహకారం అందిస్తారు. వృత్తి రీత్యా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అప్పులు తీర్చడానికి అనుకూలం. ప్రయాణాలు అధికంగా చేస్తారు. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్‌: శుక్ర, కుజుల అనుకూలత తక్కువగా ఉన్నందున కుటుంబ కలహాలకు అవకాశం ఇవ్వకుండా కాలక్షేపం చేయండి. ప్రతి విషయంలో ఓర్పు అవసరం. స్నేహితుల పొరపాట్లకు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అనవసర కాలక్షేపాలకు దూరంగా ఉండండి. బంధువర్గంతో కలసి చేసే వ్యాపార వ్యవహారాలు సానుకూలం కావు. పుణ్యకార్య, పుణ్యక్షేత్ర సందర్శన ఖర్చులు పెరుగుతాయి. జనవరి: తరచుగా చేస్తున్న పనులు మానేసి, దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. రవి, కుజ, శుక్ర, బుధ సంచారం అనుకూలంగా లేదు. ప్రతి వ్యవహారాన్ని స్వయంగా సాధించుకోవాలి. సాంఘికంగా గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడండి. ఋణ, ఆరోగ్య సమస్యలకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. ఫిబ్రవరి: చాలాకాలం తరువాత అనుకూల గ్రహచారం చూస్తున్నారు. 13వ తేదీ నుండి కొంత మార్పు, 23వ తేదీ నుంచి పూర్తి అనుకూలత ఉంటుంది. పుణ్య, శుభకార్యాలు చేస్తారు. క్రమంగా లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఈనెల ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. ఋణ సమస్యలు తీరడానికి మంచి మార్గం దొరుకుతుంది. మార్చి: గ్రహచారం అద్భుతంగా ఉంది. అందరూ సహకరిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. షేర్‌ వ్యాపారులకు అనుకూలం. వాహన కొనుగోలు, అలంకరణ వస్తు కొనుగోలు పనులు వేగంగా జరుగుతాయి. కర్కాటక రాశిఆదాయం–8, వ్యయం–2, రాజయోగం–7, అవమానం–3పునర్వసు 4వ పాదము (హి)పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (నవమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (అష్టమ), కేతువు సింహరాశి (ద్వితీయ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (భాగ్య) సంచారం. ఒక్కోసారి అనుకూలత, ఒక్కోసారి ప్రతికూలత ఎదురవుతాయి. మే నెల నుంచి మానసిక, శారీరక శ్రమ ఎక్కువ. మీ వస్తువులను ఏదో ఒక రూపంగా నష్టపోతూ ఉంటారు. జాగ్రత్త పడాలనే విషయాలలో అనవసర ప్రయత్నాలు చేస్తారు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. రోజువారీ పనుల్లో సమయపాలన లేక ఇతర పనుల్లో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలకు, మీకు సమన్వయం కుదరక బాధపడతారు. పెద్దల ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల ప్రమేయం ఎక్కువ. ఉద్యోగులు మే తరువాత అధికారుల ఆగ్రహావేశాలను ఎదుర్కొంటారు. మే వరకు తెలివిగా ప్రవర్తిస్తారు. స్థానచలనం, ప్రమోషన్‌ ఆశించిన రీతిలో ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు మే నెల నుండి ఉన్నాయి. వ్యాపారులకు జాగ్రత్తలు మే నుంచి ఎక్కువ అవసరం. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి, ఖర్చుకు పొంతన ఉండదు. మే తరువాత నిల్వలు తీసే ఖర్చులు పెరుగుతాయి. ఋణ వ్యవహారాలలో అనుకూలత లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. పెద్ద ఇబ్బంది లేకున్నా, మంచి వైద్య సలహాలు అందక చికాకు పడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మార్కెటింగ్‌ ఉద్యోగులకు మానసిక, శారీరక శ్రమ తప్పదు. షేర్‌ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నుంచి చికాకులు పెరుగుతాయి. రైతులకు శ్రమ ఎక్కువ. నకిలీ పురుగు మందులు, ఎరువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు బుద్ధి స్థిరం తప్పే అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలలో మే నుంచి ప్రతికూలతలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో తరచుగా తప్పుడు సూచనలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ధనవ్యయం ఎక్కువ అవుతుంది. ఈ రాశి స్త్రీలకు తరచుగా పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎక్కువవుతాయి. సమర్థంగా ప్రవర్తించలేరు. అనవసర విషయాలు కలవర పెడుతుంటాయి. లేని అనారోగ్యాలకు కూడా భయపడతారు. గర్భిణీ స్త్రీలకు జాగ్రత్తలు అవసరం. మే 15 తరువాత ఆరోగ్య ఆహార విషయాలలో జాగ్రత్తలు పాటించలేక ఇబ్బందులకు లోనవుతారు. పునర్వసు 4వ పాదం: అనవసర ప్రయాణాలతో ఖర్చులు ఎక్కువవుతాయి. అందరితోనూ స్నేహంగా ఉండాలని ప్రయత్నించినా సానుకూలత ఉండదు. సమస్యల్లో చిక్కుకున్న ఇతరులకు సçహాయం చేసి అవమానాలకు లోనవుతుంటారు. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. జాగ్రత్తగా ఉన్నా, ఆశించిన ఫలితాలు అందవు. పుష్యమి: వృథా కాలక్షేపాలు అధికం అవుతాయి. వృత్తి విషయంలో మీ ఆలోచనకు, ఆచరణకు పొంతన ఉండదు. కుటుంబ విషయాలలో మంచి చేసినా అవమనాలకు లోనయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష: తరచుగా అనుకూలతలు ప్రతికూలతలు వస్తుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని స్థానచలనం లేదా మార్పు ఉంటుంది. సమయపాలన లేకుండా పనులు చేయవలసి ఉంటుంది. పిల్లల వలన మానసిక చికాకులు ఎక్కువ అవుతాయి. కుటుంబంలో సంఘంలో మీకు నచ్చని సందర్భాలు ఎక్కువగా ఉంటాయి.శాంతి మార్గం: రాహువుకు దుర్గా స్తోత్ర పారాయణ మంచిది. కేతువుకు లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ మంచిది. శివాలయంలో రోజూ ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. గురు రాహు కేతువులకు జపదానం తర్పణం మేలో చేయించండి. త్రిముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్‌: ప్రతి విషయం లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. స్వయంగా విజయాలు సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా అధికారుల ప్రోత్సాహం బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కోర్టు వ్యవహారాలు సానుకూలం. మార్కెటింగ్‌ ఉద్యోగులు లబ్ధి పొందుతారు. కులవృత్తిలో ఉన్నవారికి అనుకూలం. మే: ఆరుగ్రహాలు భాగ్య, రాజ్య, లాభ స్థానాలలో ఉన్నా, జన్మ కుజ, నవమ శని వల్ల ఏదో తెలియని భయం, ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే భావన పీడిస్తుంటాయి. సమస్యలు ఉన్నా, పరిష్కార మార్గం కూడా పక్కనే ఉంటుంది. జూన్‌: మొదటివారంలో ఆశ్లేష వారికి అనుకూలత తక్కువ. అన్నీ బాగున్నట్లుగా ఉన్నా, ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలను అప్రమత్తంగా నిర్వహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబడే సూచన. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. ఈ నెలలో కొత్త ఋణాలు చేస్తే, వాటిని తీర్చడం కష్టం. జులై: పుష్యమీ నక్షత్రం వారికి 20వ తేదీ నుండి కొంచెం శ్రమ ఎక్కువ. రాశివారు అందరూ ఏదో ఒక రకంగా పను వాయిదా వేస్తుంటారు. ప్రతిచోట, ప్రతిపనిలోనూ అధిక ఖర్చులు తప్పవు. భోజనం, నిద్ర వంటి రోజువారీ పనుల్లోనూ జాప్యం ఎదురవుతుంది. ఆగస్ట్‌: వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడండి. తెలియని అసంతృప్తి వెంబడిస్తుంది. కొన్ని సందర్భాలలో మొండి ధైర్యంతో పనులు సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు జాగ్రత్తలు అవసరం. ఒంటరి ప్రయాణాలు, అనవసర కాలక్షేపాలు విడనాడండి. సెప్టెంబర్‌: ఆర్థిక సమస్యలకు ఈ నెలలో పరిష్కార మార్గాలు గోచరిస్తాయి. ఇంటి విషయంలోనూ, వృత్తి విషయంలోనూ పనివారు సహకరించరు. కుటుంబ సమస్యల పరిష్కారం తేలికవుతుంది. ప్రయాణాలు, శుభకార్యాలు, ఉద్యోగ సమస్యల పరిష్కారంతో కాలక్షేపం బాగా సాగుతుంది. అక్టోబర్‌: కొత్త పనులు చేపట్టినవారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో తోటివారి ప్రతికూలత ఎక్కువ. అధికారుల రక్షణ విశేషంగా ఉంటుంది. స్వబుద్ధితో పనులు సానుకూలం చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు తేలికగా పూర్తి చేసుకుంటారు. నవంబర్‌: తెలివి, ఓర్పుతో విజయాలు సాధిస్తారు. పాత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార కుటుంబ వ్యవహారాలలో సానుకూలత ఉంటుంది. డిసెంబర్‌: భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందవు. కొత్త ఋణాలు చేయకుండా ఉండడం మంచిది. విద్యార్థులకు, రైతులకు, షేర్‌ వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. జనవరి: అన్నింటిలోనూ 17వ తేదీ నుంచి అడ్డంకులు పెరుగుతాయి. కోపావేశాలను అదుపు చేసుకోవలసిన కాలం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాలు తగ్గించండి. కలహాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోవద్దు. ఫిబ్రవరి: ఎవరూ మీకు సరిగా సహాయ సహకారాలు చేయరు. పనులు ఆలస్యం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. అధికారులతో జాగ్రత్త అవసరం. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగచేసుకోవద్దు. మార్చి: అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ నిర్వహణ, వృత్తి నిర్వహణ ఒకదానికి మరొకటి అవరోధాలు సృష్టిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో అనుకూలత తక్కువ. కుజ, గురు, శాంతి చేయించండి. ఉద్యోగ ఒత్తిడితో మీరు అందరితో కలహిస్తారు. ఇతరుల వ్యవహారాలు కలహప్రదంగా మారతాయి. సింహ రాశిఆదాయం–11, వ్యయం–11, రాజయోగం–3, అవమానం–6.మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)ఉత్తర 1వ పాదము (టే)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (లాభ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (సప్తమ), కేతువు సింహరాశి (జన్మ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (అష్టమ) సంచారం. మనస్పర్థలు రావడం, వాటిని సరి చేసుకోవడంతోనే ఈ ఏడాది కాలక్షేపం అవుతుంది. గురుబలం ఈ సంవత్సరమంతా శ్రీరామరక్ష. భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. గురు అనుకూలత ఉన్నప్పటికీ మంచి ప్రణాళికలు చేసినా, సన్నిహితులను నమ్మి సమస్యలకు దగ్గర అవుతుంటారు. రోజువారీ పనుల్లో భోజన, స్నాన, నిద్రలకు కూడా సమయపాలన ఉండదు. కుటుంబ విషయాల్లో మితభాషణ అవసరం. శని, రాహు సంచారం బాగా లేదు. ఉద్యోగులకు అధికారుల అండదండలు బాగా ఉంటాయి. మీ కింద పనిచేసేవారి ద్వారా ఇబ్బందులు పడతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అయోమయస్థితి ఉంటుంది. వ్యాపారస్తులకు శ్రమ తప్పదు. పనివారితో సమస్యలు ఎక్కువ, లాభాలు తక్కువ ఉంటాయి. ఆదాయానికి ఇబ్బంది లేదు కాని, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. పాత, కొత్త ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాత, జీర్ణ çసమస్యలు ఉంటాయి. అయితే మంచి వైద్యం లభిస్తుంది. మార్కెటింగ్‌ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువైనా, పనులు పూర్తి అవుతాయి. షేర్‌ వ్యాపారులు మంచి ఆలోచనలు చేస్తారు. రైతులకు శ్రమ ఎక్కువ. విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది. స్థిరాస్తి కొనుగోలులో ఇతరుల సలహాలు పాటించకుండా ఉంటే మంచిది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవుతాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని పనులు ఆలస్యంగా అవుతాయి. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. కుటుంబం, ఉద్యోగం సమతూకంగా నిర్వహించలేక ఇబ్బంది పడతారు. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాలి. నిత్యం వైద్యుల సలహాలు, ఆహార, ఆరోగ్య నియమాలు పాటించాలి.మఘ: మానసికంగా ఇతరులతో అనుబంధంగా మెలగలేని పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి. పుణ్య, శుభకార్య ప్రయత్నాలలో కాలక్షేపం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వాహన చికాకులు ఎక్కువ ఉంటాయి. పుబ్బ: ఇతరులను నమ్మి ధనం పెట్టుబడులు పెట్టవద్దు. మీ వస్తువులను ఎక్కడైనా మరచిపోవడం లేదా చౌర్యానికి గురవడం జరుగుతాయి. చేసే పనులలో ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. రోజువారీ పనుల్లో సమయపాలన లోపిస్తుంది. ఉత్తర 1వ పాదం: మీ పనులు ఇతరులకు, ఇతరుల పనులు మీకు నచ్చక ఉద్యోగ, వ్యాపార కుటుంబ విషయాలలో ఒత్తిడికి లోనవుతారు. ప్రతి పనీ మళ్లీ మళ్లీ చేయవలసి వస్తుంది. అందరినీ అనుమానిస్తుంటారు. పనులు వదిలివేసి ఒంటరిగా ఉండాలనే కోరిక పెరుగుతుంది. శాంతి మార్గం: శని రాహు కేతువులకు శాంతి చేయించండి. మే నెల నుంచి ప్రతి నెలా ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి భువనేశ్వరీ సహస్ర నామ స్తోత్రం పారాయణ చేయండి. కుదిరినప్పుడు చండీహోమం చేయించండి. సప్తముఖ రుద్రాక్షధారణ చేయడం శుభప్రదం.ఏప్రిల్‌: ప్రశాంతత కోసం, ధైర్యం కోసం ధ్యానం చేయండి. ప్రతిపనీ కాలవ్యయం, ధనవ్యయం సూచిస్తున్నాయి. నమ్మక ద్రోహం చేసేవారు మీ చుట్టూనే ఉంటారు. పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా, పాత ఋణాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి. వ్యవహార ప్రతిబంధకాలు గోచరిస్తున్నాయి. మే: తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని సూచన. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. రోజువారీ పనుల్లోనూ తెలియని ఆటంకాలు ఉంటాయి.ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలలో క్రమంగా మంచి ఆలోచనలు చేసి సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. జూన్‌: మఘ నక్షత్రం వారికి 7వ తేదీ నుంచి ఆరోగ్య చికాకులు ఉంటాయి. అయితే శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా శుభ, పుణ్య కార్యాలలో పాల్గొంటారు. రోజువారీ పనులు అనుకూలంగా ఉంటాయి. జులై: పుబ్బా నక్షత్రం వారు 23 వరకు, ఉత్తర 1వ పాదం వారు 23 నుంచి ఆరోగ్య సమస్యలకు గురవుతారు. పుబ్బవారు ఈనెల 21 నుండి కొంచెం ఎక్కువ చికాకులు పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాల్లో చిక్కులు తలెత్తవచ్చు. కుటుంబ, ఆరోగ్య, వృత్తి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్‌: శ్రమ చేసి ముఖ్యమైన సమస్యలు తీర్చుకోండి. ఒకటి రెండు ప్రయత్నాలు చేయడం ద్వారా సహకరించం అనే వ్యక్తులు కూడా బాగా సహకరించే అవకాశం ఉంటుంది. ఈ నెల 21 నుంచి కొన్ని పనులు వాయిదా పడడం, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. సెప్టెంబర్‌: ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటాయి. పనులు వాయిదా వేయడం, బద్ధకించడం మానకుంటే, 14వ తేదీ నుంచి మంచి పరిణామాలు ఉంటాయి. మీ శ్రమను గుర్తించి మీకు సహకరించేవారు పెరుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల తోడ్పాటు పెరుగుతుంది. అక్టోబర్‌: పుబ్బ నక్షత్ర జాతకులు మీ వ్యక్తిగత జాతకాన్ని సిద్ధాంతి ద్వారా పరిశీలన చేయించుకోండి. చాలా సందర్భాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. తెలివి, ఓర్పు ప్రదర్శించి కార్యసాధనకు కృషి చేస్తారు. అధికారులతో విరోధం రాకుండా జాగ్రత్తపడండి. కొన్ని ముఖ్యమైన పనులు మరచిపోయే లక్షణాలు గోచరిస్తున్నాయి. నవంబర్‌: కొంత అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నా, పనుల్లో తొందరపాటు పనికిరాదు. జాగ్రత్తగా ప్రయత్నిస్తే సత్ఫలితాలు పొందగలరు. కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చాలావరకు సానుకూలం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు సత్ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తు ప్రణాళి కలు గురించి చర్చిస్తారు. డిసెంబర్‌: తెలివిగా కార్యసాధన చేస్తారు. అవరో«ధాలను లెక్కచేయరు. ఉద్యోగంలో కొత్త రకంగా అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించి మంచి సలహాలు అందుతాయి. రైతులకు విద్యార్థులకు అనుకూలం. దేవాలయ దర్శనములు చేస్తుంటారు. జనవరి: శుభా శుభ పరిణామములతో కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయ, వ్యయ, ఋణ విషయాలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మాత్రం పూర్తి భిన్నంగా చాలా లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఫిబ్రవరి: ప్రతి విషయం సునిశితంగా పరిశీలించి చేయడానికి అలవాటు పడండి. పని ఒత్తిడి 13వ తేదీ నుంచి పెరుగుతుంది. మీ ఇంటి యజమాని లేదా షాపు యజమానితో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రాబోయే రెండు మాసాల గోచారంలో అనుకూలత తక్కువగా గోచరిస్తోంది. అవకాశం ఉన్నంత వరకు ఈ నెలలోనే ఆ పనులు పూర్తి చేయడం శ్రేయస్కరం. మార్చి: చేయవలసిన పనులు మానేసి అనవసర వ్యవహారాల్లో తలమునకలు అవుతుంటారు. గ్రహచార ప్రతికూలతలు పెరుగుతున్నాయి. రాబోవు మూడు నెలలలో కోర్టు వ్యవహారాలు, ఆరోగ్యం, ఋణ విషయాలలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాల క్షేపం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణములు విడనాడండి. కలహాలు, కొత్త ప్రయత్నాలు విడనాడండి. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలత తక్కువగా ఉంది. కన్యా రాశిఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6.ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)చిత్త 1,2 పాదములు (పే, పో)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (దశమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (షష్ఠ), కేతువు సింహరాశి (వ్యయ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (సప్తమ) సంచారం. మే నెల వరకు పుణ్యకార్యాలు, «ధార్మిక విజ్ఞాన వినోద కార్యక్రమాలు చేస్తుంటారు. «సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ప్రతిపనిలోనూ మే నెల నుంచి ధైర్యం పెరుగుతుంది. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. తరచుగా కుటుంబానికి దూరంగా గడపవలసి వస్తుంది. కొన్నిసార్లు భయం పొందుతారు. రోజువారీ పనుల్లో మే నుంచి సమయపాలన లేకుండా ప్రవర్తిస్తారు. బంధువుల రాకపోకలు అధికం అవుతాయి. ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఉద్యోగ విషయాలలో సందర్భానుసారంగా ప్రవర్తించలేరు. ఒక పనిలో జరిగే ఆలస్యం మరొక ముఖ్యమైన పనికి ఇబ్బందిగా మారుతుంది. మే నెల నుంచి మీ కింద పనిచేసే వారితో ఇబ్బంది ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు తక్కువ అయినా ప్రశాంతంగా ఉంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు. ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఋణ విషయాలు సానుకూలం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. కొత్తగా వచ్చే సమస్యలేవీ ఉండవు. భార్యాపిల్లల ఆరోగ్య విషయంలోనూ శుభ పరిణామాలు ఉంటాయి. మార్కెటింగ్‌ ఉద్యోగులకు టార్గెట్‌లు పూర్తి కావడానికి ఆలస్యమవుతుంది. అయితే నష్టం ఉండదు. షేర్‌ వ్యాపారులకు తెలివి, ధైర్యం ఉన్నా అనుకున్న ఫలితాలు దక్కవు. రైతులకు శ్రమ ఎక్కువ అయినా సమయానికి మంచి సలహాలు అందడం వల్ల నష్టం ఉండదు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. నిరుత్సాహం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులు ఉన్నా, ధైర్యంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో కావలసిన రీతిలో లబ్ధి పొందుతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవుతాయి కాని, నష్టం ఉండదు. ఈ రాశి స్త్రీలకు శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తరచుగా కుటుంబ, ఉద్యోగ విషయాలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. పనులు సమయపాలన లేకుండా సాగడం వలన ముఖ్యమైన పనుల్లో ప్రతికూలతలు చూస్తారు. గర్భిణీ స్త్రీలు కంగారు పడనవసరం లేదు. వైద్య సలహాలు, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతో సుఖజీవనం సాగిస్తారు.ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు: ఇతరుల విషయాలలో ఎక్కువగా కలుగ చేసుకోవద్దు తెలివిగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో సంఘంలో అనుకూల స్థితి ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. విజయాలు సాధిస్తారు. అయితే ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. హస్త: ప్రయాణాలను వీలయినంత తగ్గించుకుంటే లాభిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి ప్రయాణం, ఒంటరి కాలక్షేపాలు పనికిరాదు. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన పనులు వదిలేసి అనవసర కాలక్షేపం చేస్తూ ఉంటారు. చిత్త నక్షత్రం 1, 2 పాదాలు: వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్త అవసరం. ప్రతికూల విషయాలలో కూడా ధైర్యంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ కుటుంబ విషయాలలో పనివారితో సమస్యలు తరచుగా ఉంటాయి. ఋణ వెసులుబాటు అవసర సమయంలో అందక ఒత్తిడికి లోనవుతారు. శాంతి మార్గం: ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో ‘‘శ్రీరామశ్శరణంమమ’’ అని చెబుతూ ప్రదక్షిణలు చేయడం మంచిది. ప్రాతఃకాలంలో లకీ‡్ష్మనారాయణ పూజ చేయండి. ఏప్రిల్‌లో శని శాంతికి జపదానాదులు చేయించండి. రామాయణ పారాయణ మంచిది. పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్‌: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని అంశాలు ఆశించిన రీతిగా సాగుతాయి. గురు, కుజుల అనుకూలత దృష్ట్యా ఋణ సమస్యలు ఎలా ఉన్నా, ఆర్థిక లావాదేవీలు బాగా నడపగలుగుతారు. పాత ఆరోగ్య సమస్యల పట్ల కూడా తెలివిగా ముందు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. తరచు శుభకార్యాలలో పాల్గొంటారు. మే: అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రమేయం లేని విషయాల్లోనూ చికాకులు రాగలవు. తెలివిగా ఓర్పుగా ఉన్నా, వాత ఆర్థిక ఆరోగ్య కోర్టు సమస్యలు తిరగబెట్టగలవు. షేర్‌ వ్యాపారులు దూకుడు తగ్గించాలి. మార్కెటింగ్‌ ఉద్యోగులకు టార్గెట్‌లు పూర్తి కావడం కష్టమవుతుంది. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. జూన్‌: అందరికీ సహకరిస్తారు. మంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. కొన్నిసార్లు అనుకోని లాభాలు ఉంటాయి. మీ ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రతిపనీ ఆలస్యం అయినా లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. విజ్ఞాన వినోద కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు. బంధువులకు సహాయం చేస్తారు. జులై: బాగా ఆలోచించి నిర్ణయాలు చేయవలసిన కాలం. తెలివి ఓర్పు ప్రదర్శించి కార్యసాధనలో అనుకూల స్థితిని పొందుతారు. కొన్ని మంచి ఫలితాలు కూడా అందుతాయి. అయితే జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. ఇతరులపై ఆధారపడి ఏ పనినీ మొదలు పెట్టవద్దు. ఆగస్ట్‌: ప్రత్యేక జాగ్రత్తలు పాటించి, కొన్ని విషయాలలో విజయం సాధిస్తారు. మితభాషణ ఓర్పు అవసరం. కొన్ని సందర్భాలలో కొత్త అవకాశాలు వస్తాయి. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దని సూచన. శుభకార్య ప్రయత్నాలు లాభదాయకంగా పూర్తవుతాయి. సెప్టెంబర్‌: చిత్త నక్షత్రం 3వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో ఆరోగ్య ఋణ సమస్యలు రాగలవు. రాశి వారు అందరికీ 14వ తేదీ నుంచి దూర ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. వాహనాలు, ఆభరణాల మరమ్మతులకు ధనవ్యయం బాగా అవుతుంది. అక్టోబర్‌: అభివృద్ధి నిరోధకమైన అంశాలను సరి చేసుకుని మంచి జీవనం వైపు ప్రయాణం చేస్తారు. కొత్త వస్తువుల కొనుగోలుకు ఎక్కువ ధనవ్యయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులను సరిచేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కొంత లాభదాయకంగా ఉంటాయి. నవంబర్‌: పనులు సకాలంలో జరగకపోవడం తప్ప మిగిలినవన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. అందరి నుంచి సహకారం ఉంటుంది. ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.డిసెంబర్‌: ఉద్యోగులు ఎక్కువగా రక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారులకు ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు పరిస్థితులు సానుకూలం. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. జనవరి: సంతృప్తికరంగా కాలక్షేపం జరుగుతుంది. పనులు ఆలస్యమైనా, సానుకూలం అవుతాయి. ప్రతి పనీ విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. గత సమస్యల పరిష్కారానికి అవకాశం చాలా బాగుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత. ఫిబ్రవరి: కుటుంబ విషయాలు మినహా అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనులు ఆలస్యం అవుతాయి. వ్యాపారాలలో ఏదో ఒక అడ్డంకి గోచరిస్తూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అసలు ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. మార్చి: పనులు ఆలస్యమైనా, సానుకూలంగా అవుతాయి. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా, ఇబ్బందికరం కాదు. రోజువారీ పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిళ్లను ఎదుర్కోగలుగుతారు. కుటుంబ విషయాలు సాధారణం. తులా రాశిఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–2, అవమానం–2.చిత్త 3,4 పాదములు (రా, రి)స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)ఈ సంవత్సరం గురువు మే 14న మి«థునరాశి (భాగ్య) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (పంచమ), కేతువు సింహరాశి (లాభ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (షష్ఠ)లో సంచారం. చాలా సమస్యలకు పరిష్కారం పొందగలిగే కాలం. మే నెల నుంచి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్య, శుభకార్యములు, సాంఘిక కార్యక్రమాలు చేస్తారు. గత సమస్యలు తీరే అవకాశం మే నెల నుంచి పెరుగుతాయి. రోజువారీ పనులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాలలో శుభ పరిణామాలు ఎక్కువ. ఉద్యోగులకు ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది. క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. అనూహ్యంగా అందరూ సహకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చక్కటి లాభాలు అందుకుంటారు. వ్యాపారులకు కావలసిన వనరులు సమకూరి, ఇబ్బందిలేని వ్యాపారం చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మే తరువాత ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరిగినా, వాటికి సమతూకంగా ఆదాయం అందుతుంది. పాతా ఋణాలు తీరుతాయి. అవసరానికి కొత్త ఋణాలు సకాలంలో అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రదర్శిస్తారు. పాత సమస్యలు తీరుతాయి. మార్కెటింగ్‌ ఉద్యోగులకు మే నెల వరకు ఒత్తిడి. మే నెల నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. షేర్‌ వ్యాపారులు ఈ సంవత్సరం జూన్‌ నుంచి విశేష లాభాలను అందుకుంటారు. రైతులకు శ్రమ కొద్ది లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం, వరుణుడు, సలహాలు ఇచ్చేవారు అందరూ సహకరిస్తారు. విద్యార్థులకు మే వరకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. మే నుంచి విశేష ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో సమస్యల పరిష్కారానికి మే నుంచి సెటిల్‌మెంట్‌ ధోరణి ప్రదర్శించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలు ప్రశాంత జీవనం సాగిస్తారు. సంవత్సరారంభంలో ఉన్న ఒత్తిడిని అధిగమించి జూన్‌ నుంచి విశేష లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, కుటుంబ పరిస్థితులు అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. మంచివైద్యం లభించి సుఖప్రసవం జరుగుతుంది.చిత్త 3, 4 పాదాలు: అద్భుతాలు చూస్తారు. కుటుంబ అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టి మంచి జీవనం సాగిస్తారు. విజయాలు సాధిస్తారు. పుణ్యకార్యాలు చేయడం, గురువులు, పూజ్యులను దర్శించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వాతి: కుటుంబంలో పెద్దల ఆరోగ్య విష యంగా సేవలు చేయవలసి రావడంతో సొంత పనులలో సమయపాలన లోపిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. మితభాషణ అవసరం అని గ్రహించండి. విశాఖ 1, 2, 3 పాదాలు: గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలపై మంచి పట్టు సాధిస్తారు. ఋణాలు ప్రతిబంధకం కాకుండా తెలివిగా ప్రవర్తిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల విషయంలో చేయవలసిన పనుల పట్ల కొంత అసంతృప్తి ఉంటుంది.శాంతి మార్గం: గురు రాహువులకు జప, దానాదులు చేయండి. సంవత్సరారంభంలో రోజూ దేవీ భాగవతం పారాయణ చేయడం బాగుంటుంది. ప్రాతఃకాలంలో విష్ణు సహస్ర నామ పారాయణం, ప్రదోషకాలంలో కాలభైరవాష్టక పారాయణం ద్వారా పాత సమస్యలు పోతాయి. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్‌: కొన్ని వ్యవహారాలు లాభదాయకంగానూ, కొన్ని ఇబ్బందికరంగానూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఈ నెల ఎంత మౌనం వహిస్తే అంత అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఎక్కువవుతుంది. అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. మే: మితభాషణ, ఓర్పు ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. అన్నింటా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధిస్తారు. గురుబలంతో వృత్తి, ఆర్థిక, ఆరోగ్య వ్యవహార లాభాలు ప్రారంభం అవుతాయి. కలహాలకు దూరంగా ఉండండి. జూన్‌: కోపావేశాలు తగ్గించుకోవాలి. రోజువారీ పనులు మాత్రమే చేస్తూ ఉండండి. భోజనం అయిష్టమైన విధానాలతో ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాలను ఇస్తాయి. జులై: పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపారాలలోను, విదేశీ నివాస, కోర్టు, ఋణ వ్యవహారాలలో అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా గొప్ప అనుకూల స్థితి. ఆదాయ, వ్యయ, ఋణ వ్యవహారాలు అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. ఆగస్ట్‌: అద్భుతమైన కాలమనే చెప్పాలి. స్థానచలనం వంటి ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. కోర్టు వ్యవహారాలు, పాత కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. కాలం వృథా చేయకుండా ప్రయత్నించండి. ధన, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్‌: కుజగ్రహ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన చాలా అవసరం. రోజువారీ పనులు బాగానే ఉన్నా, ఏదో తెలియని శారీరక మానసిక ఒత్తిడి వెంబడిస్తుంది. ఋణ వ్యవహారాలు, వాహనాలు ఇబ్బంది కలిగిస్తాయి. అక్టోబర్‌: ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఋణ, ఆరోగ్య విషయాలలో బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల ప్రభావం వలన కలçహాలు పెరగవచ్చు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్‌: ప్రతి విషయంలోనూ తెలివిగా వ్యవహరిస్తారు. అనుకున్న ఫలితాలను సాధిస్తారు. బంధువులకు, స్నేహితులకు సహాయం చేస్తారు. మీ వద్ద పనిచేసేవారు మీకు బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు, శుభకార్యాలతో కాలక్షేపం చేస్తారు. డిసెంబర్‌: చాలా వ్యవహారాలను తెలివిగా సాధిస్తారు. పనులు వేగంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ వద్ద పనిచేసేవారు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చు పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. జనవరి: కుటుంబ వ్యవహారాలను సానుకూలం చేయగలుగుతారు. ప్రశాంతంగా అన్ని వ్యవహారాలు సాధించుకుంటారు. బంధువులకు, స్నేహితులకు ధనవ్యయం చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలత. ఫిబ్రవరి: తెలివిగా ధైర్యంగా వ్యవహార లాభం అందుకుంటారు. వృత్తి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ చేయమని ప్రత్యేక సూచన. ఆదాయ, వ్యయాలను సమర్థంగా నిర్వహిస్తారు. అవసరమైన ఋణాలు సకాలంలో అందుతాయి. వ్యాపారులకు ప్రోత్సాహకరమైన కాలం. షేర్‌ వ్యాపారులు లబ్ధి పొందుతారు. మార్చి: ప్రతిపనీ స్వయంగా చేసుకోండి. కుటుంబ విషయాలలో ఇతరుల ప్రమేయ కలహాలకు దారి తీస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడిని తెలివిగా దాటతారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ప్రతి విషయంలో ఆర్థిక వెసులుబాటు అనుకూలం. వ్యాపారులకు అనుకూలం. మీ పిల్లల నుంచి ఆశించిన ఫలితాలు అందక మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. వృశ్చిక రాశిఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–2.విశాఖ 4 వ పాదము (తొ)అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (అష్టమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (అర్థాష్టమ), కేతువు సింహరాశి (దశమ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29వ తేదీ నుండి మీనరాశి (పంచమ) సంచారం. ఏ పనిలోను స్థిరబుద్ధి ప్రదర్శించలేరు. అందరికీ మీ వ్యవహారాల మీద తక్కువ స్థాయి ఆలోచనలు ఉంటాయి. మీరు తరచుగా ప్రభుత్వ అధికారులు, చోరులు వంటి వారితో చికాకు పడుతూనే ఉంటారు. పరుషంగా మాట్లాడుతుంటారు. రోజువారీ పనుల్లో ఆలస్యం చేసి ఇబ్బంది పడతారు. మీ నుంచి కుటుంబీకులకు అందవలసినవన్నీ ఆలస్యంగా అందుతాయి. భోజన, స్నానాదికాలలో కూడా సమయపాలన లేక జీవనశైలి ఇబ్బందికరం అవుతుంది. ఉద్యోగ విషయాల్లో సరైన దృష్టి ప్రదర్శించక పనులు పాడు చేసుకుంటారు. ప్రమోషన్, స్థానచలనాలు అనుకూలంగా లేవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు సరిగా సాగవు. వ్యాపారులకు అనుకూల లాభాలు లేకున్నా, ఇబ్బందులు ఉండవు. నూతన వ్యాపార ప్రయత్నాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. స్థిరాస్తి లావాదేవీలు, ఆస్తి తగాదాలలో ఇబ్బందులు తప్పవు. మే వరకు ఆదాయ వ్యయాలు సమంగా ఉంటాయి. మే తరువాత డబ్బు ఇబ్బందులు తప్పవు. కొత్త ఋణాలు సకాలంలో అందవు. వాత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మార్కెటింగ్‌ ఉద్యోగులకు శారీరక మానసిక ఒత్తిడి ఉంటుంది. షేర్‌ వ్యాపారులకు మే వరకు లాభాలు బాగుంటాయి. మే తరువాత లాభాలు తక్కువగా ఉంటాయి. రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు మే నుంచి ఏకాగ్రత లోపిస్తుంది. కోర్టు వ్యవహారాలలో వాయిదాలే శరణ్యం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మోసాలు ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో విద్య కోసం వెళ్ళేవారికి మే వరకు కాలం అనుకూలం. ఈ రాశి స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమతూకంగా న్యాయం చేయలేరు. కుటుంబ సభ్యులు తగిన గౌరవం ఇవ్వడం లేదనే భావనకు లోనవుతారు. పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక లావాదేవీలలో సమస్యలు వెంటాడుతాయి. గర్భిణీ స్త్రీలకు మే నుంచి జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు, పెద్దల సంరక్షణ తప్పనిసరి.విశాఖ 4వ పాదం: దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆర్థిక చికాకులు ఇంకా ఉంటాయి. ఋణ అసౌకర్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలసి చేయవలసిన పనులు వాయిదా పడుతూ ఉంటాయి. వివాదాల జోలికి వెళ్ళవద్దు. స్వబుద్ధితో చేసే పనుల్లో విజయావకాశాలు ఎక్కువ. అనురాధ: స్పష్టత లేని నిర్ణయాలు చేస్తుంటారు. ఎప్పటి నుంచో ఉన్న వ్యాపార సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ అవసరాలు తీర్చడానికి ఎక్కువ కృషి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జ్యేష్ఠ: అవసరమైన సమయాలలో ఆత్మీయులు స్పందింపక పోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. çగౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ఋణం, ఆదాయం సరిగా అందక ఇబ్బంది పడతారు. శాంతి మార్గం: మార్చి నెలలో రాహువుకు, మే నెలలో గురువుకు శాంతి చేయించండి. దుర్గా సప్తశ్లోకి, దక్షిణామూర్తి స్తోత్రం, దేవీ భాగవత పారాయణం చేయడం వలన ప్రశాంతత ఏర్పడుతుంది. విష్ణుపూజలు చేయండి. పంచముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్‌: కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పిల్లల అభివృద్ధి వార్తలు తరచుగా వింటారు. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. ఋణాలు ఇబ్బందికరం కాకుండా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మే: స్థానచలన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 15వ తేదీ తరువాత గురుగ్రహ శాంతి చేయించండి. అందరి సహాయ సహకారాలు, గౌరవం అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలు చేయండి. ఒంటరిగా దూర ప్రయాణాలు విరమించుకోండి. జూన్‌: ఆత్మీయుల సేవలను గుర్తించరు. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఉంటుంది. కొన్ని పాత సమస్యలు మరలా తిరగబడే అవకాశం ఉంటుంది. అవసరాలకు తగిన డబ్బులు సర్దుబాటు జరగదు. కొన్ని సందర్భాలలో మనో నిబ్బరం ప్రదర్శిస్తారు. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. జులై: కోపావేశాలకు అనుకూల కాలం కాదు. ఉద్యోగ రీత్యా అనవసర తిరుగుడు పెరుగుతుంది. జీర్ణసంబంధ ఇబ్బందులు రాగలవు. పాత సమస్యలు తిరగబడే అవకాశం ఉంది. అధికారులు, తోటివారు సహకరించరు. అవసరానికి ధనం అందుబాటు తక్కువ. అనవసర విషయాల జోలికి పోవద్దు. ఆగస్ట్‌: కొత్త అవసరాలకు తగిన ఆర్థిక సౌకర్యం లభిస్తుంది. చాలా విషయాలలో స్వయంగా శోధించి, విజయాలు అందుకుంటారు. తెలియక చేసిన పొరపాట్లు నెలాఖరులో సరిచేసుకునే అవకాశం ఉంది. బంధువులు, కుటుంబసభ్యులు సహకారం తక్కువ. ఉద్యోగ వ్యాపారాలలో సాధారణ స్థితి ఉంటుంది. సెప్టెంబర్‌: అధిక గ్రçహానుకూలత ఉన్న కాలం. కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం వ్యయాలు సమతూకంగా లేకున్నా, సమర్థంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లలో కొత్త ఋణాలు చేయవద్దు. అక్టోబర్‌: ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. మీరు మంచి మాటలు చెప్పినా, అవి వికటించే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. విద్యా వ్యాసంగం సరిగా సాగదు. నూతన ఉద్యోగ వ్యాపారాలు కొంత ఇబ్బందికరం. అవసరానికి తగిన ధనం చేకూరదు.నవంబర్‌: పనులు కొంచెం ఇబ్బందికరం అవుతున్నా, అన్నింటా సమర్థంగా వ్యవహరిస్తూ ముందుకు వెడతారు. ఫలితాలు ఆశించిన రీతిగా ఉండవు. విద్యా విజ్ఞాన కార్యక్రమాలలో విఘ్నాలు ఎదురవుతాయి. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగవు. డిసెంబర్‌: వృత్తి ఉద్యోగాలను శ్రద్ధగా నడపలేని పరిస్థితి ఉంటుంది. పనులు దాటవేసే లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. పిల్లలు వ్యతిరేక ధోరణితో ప్రవర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలలో తెలివిగా వ్యవహరిస్తారు. కొత్త ఋణాలు చేయవద్దని సూచన. జనవరి: మంచి కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ధైర్య స్థైర్యాలను అన్ని విషయాలలోనూ ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగా సాగుతాయి. కుటుంబపరంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. గత సమస్యలకు పరిష్కారాలను త్వరగా వెదకగలుగుతారు. కొత్త ఋణాలు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి.ఫిబ్రవరి: మంచి అనుభూతులు మిగిల్చే కాలం. అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరం అయినా, తెలివిగా వ్యవరించి, లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. ఒత్తిడిని తట్టుకుని నిలబడతారు. కుటుంబ, వృత్తి విషయాలు రెండింటినీ సమర్థంగా నడిపి మంచి పేరు సాధిస్తారు. మార్చి: రోజువారీ పనులలో బాగా తెలివిగా వ్యవహరిస్తారు. ఇతరులకు సçహాయం చేయడాన్ని ఒక విధిగా భావించి చేస్తుంటారు. ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అవుతుంది. అధికారుల తోడ్పాటు తక్కువ అయినా నష్టంలేని జీవితం సాగుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. ఆదాయ, వ్యయ ఋణాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. మాట నిలబెట్టుకోలేరు. ధనూ రాశిఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–1, అవమానం–5మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)ఉత్తరాషాఢ 1వ పాదము (బే)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (సప్తమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (తృతీయం), కేతువు సింహరాశి (భాగ్య) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (అర్ధాష్టమ) సంచారం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేసిన పనులకు తగిన గుర్తింపు రాదు. గొప్పగా ఓర్పు సహనం ప్రదర్శించి సాధారణ జీవనానికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. అందరితోనూ కలహాలు రాకుండా స్నేహభావం ప్రదర్శిస్తారు. స్నేహితులతో మిత సంభాషణ, సంచారం చేయండి. రోజువారీ పనులపై ప్రత్యేక దృష్టి ఉంచండి. కుటుంబ వ్యవహారాల్లో శుభపరిణామాలు ఉంటాయి. మీ అవసరాలు గుర్తించి సహకరించే కుటుంబసభ్యుల కారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. సోదరద్వేషం తప్పదు. ఉద్యోగాల్లో ట్రాన్స్‌ఫర్‌ ప్రయత్నాలు జాగ్రత్తగా చేసుకుంటే మీకు కావలసిన చోటుకు చేరే అవకాశం ఉంటుంది. ఎవరూ సహకరించకపోయినా, విజయం తథ్యం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి సూచనలు అందుతాయి. వ్యాపారులకు కొన్నిసార్లు విశేష మందగమనం, కొన్నిసార్లు విశేష లాభాలు ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు తెలివిగా నడుపుతారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు అధికం అవుతాయి. ఋణ విషయాలు సానుకూలం. వాత సంబంధ ఆరోగ్య సమస్యలు, చర్మవ్యాధులు ఉన్నవారు ఇబ్బంది పడతారు. మార్కెటింగ్‌ ఉద్యోగులు జూన్‌ నుంచి తేలికపాటి ప్రయత్నాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. షేర్‌ వ్యాపారులు బుద్ధి, ఓర్పుతో లాభాలు అందిస్తాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. విద్యార్థులకు మంచి కాలం. కోర్టు వ్యవహారాలలో స్వయంగా అన్నీ శోధిస్తే విజయం పొందగలరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో పనులు వేగం చేయమని సూచన. వాహన కొనుగోలుకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో అంతా లాభదాయకం. ఈ రాశి స్త్రీలకు చాలా ధైర్యం చేకూరుతుంది. ప్రతిపనీ చేయగలం అనే ధీమా ఉంటుంది. ఉద్యోగినులకు ప్రమోషన్‌లు ద్వితీయార్ధంలో అందుతాయి. వ్యాపారులు శ్రమతో పనులు పూర్తి చేసు కుంటారు. గర్భిణీ స్త్రీలకు సాధారణ ఫలితాలు ఉంటాయి. జూన్‌ దగ్గర నుంచి అంతా అనుకూలం. కావలసిన వైద్య సదుపాయాలు, మంచి సంరక్షణ అందుతాయి. మూల: ఎవరికీ హామీలు ఇవ్వవదు. ముఖ్య వ్యవహరాలలో అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. రోజువారీ కార్యక్రమాలకు పరిమితం కావడం మేలు. వేరే వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. పూర్వాషాఢ: మీ సహననానికి పరీక్షా కాలం. మీ ఆర్థిక వనరులు అవసరానికి ఉపయోగపడవు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువైనా, సమస్యలు ఉండవు. వినోద కార్యక్రమాలో పాల్గొంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం: వ్యాపారులకు విజయావకాశాలు ఎక్కువ. ఉద్యోగంలో పదోన్నతికి ఆటంకాలు. కుటుంబ విషయంలో మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. కొత్త ప్రయత్నాలు వద్దు అనుకుంటూనే ప్రారంభించి, రోజువారీ పనుల్లో ఇబ్బందులు పడతారు. అనవసర ప్రయాణాలు ఎక్కువ. శాంతి మార్గం: కుజగ్రహ సంచారం ఎక్కువ ఇబ్బందికరం. జూన్‌ వరకు నెలకు ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పంచముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్‌: కొత్త కొత్త అనుభూతులు ఎదురవుతాయి. రోజువారీ జీవనశైలిలో విశేష మార్పులు చూస్తారు. కొన్ని సందర్భాలు ఆనందాన్ని, కొన్ని సందర్భాలు విచిత్రమైన భయాలు కలుగజేస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. మే: ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో, ఎప్పుడు ఆగ్రహావేశాలతో ఉంటారో తెలియని పరిస్థితి. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరుల ప్రమేయానికి ఆస్కారం ఇవ్వకండి. «అవసరానికి దనం సర్దుబాటు కాకపోవచ్చు. ఇల్లు లేదా వాహనం విషయంలో ఖర్చులు పెరగవచ్చు. 15వ తేదీ తరువాత అనుకూలం. జూన్‌: తెలివిగా ఉద్యోగ, వ్యాపార సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో నిబద్ధతతో వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాలు తెలివిగా సాగిస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. పుణ్యకార్యాలు చేయాలనుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. జులై: కలహాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఏకాగ్రత లోపిస్తుంది. వాత సమస్యలు తరచుగా వెంటబడే అవకాశం ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేళకు అన్న వస్త్రాలు అందవు. స్థానచలన విషయంలో ప్రతికూలతలు రాకుండా జాగ్రత్త పడండి. తెలియని పొరపాట్ల వల్ల ఇబ్బంది పడవచ్చు. ఆగస్ట్‌: అనవసర చర్చలు, వృథా కాలక్షేపాలతో అవసరమైన పనులు దూరం చేసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు తగ్గుతాయి. దూర ప్రయాణాలలో చికాకులు, వాహన మరమ్మతు ఖర్చులు ఉంటాయి. బంధు మిత్రుల రాకపోకలు ఎక్కువవుతాయి. సెప్టెంబర్‌: ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తరచుగా బంధు మిత్రుల కలయిక మంచి అనుభూతిని ఇస్తుంది. పుణ్య కార్య శుభ కార్యాలలో మంచి కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. సర్వత్రా విజయం ఉంటుంది. అక్టోబర్‌: కొన్ని విశేష కార్యక్రమములకు శ్రీకారం చేస్తారు. కాలం చాలా బాగుంది. పనులు వేగం చేయండి. బంధు మిత్రులు బాగా సహకరిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. నవంబర్‌: 15వ తేదీ తరువాత అడ్డంకులు తరచుగా వస్తాయి. ఆలోచనా శక్తి బాగున్నా పనుల అమలు కష్టం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అధికారులతో ఒత్తిడి ఉంటుంది. అందరూ సహకారం చేస్తున్నట్లుగా ఉన్నా, అది భ్రమ. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటేనే అభివృద్ధి ఉంటుంది.డిసెంబర్‌: అనవసర భయాందోళనలను దరి చేరనివ్వకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చులు నియంత్రించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యం. మంచి ఆలోచనలు చేసినా అమలు చేయలేని స్థితి. జనవరి: బంధుమిత్రుల రాకపోకలలో కలహాలకు అవకాశం ఇవ్వవద్దని సూచన. కొన్ని పనుల వల్ల రోజువారీ పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు బాగానే ఉన్నా, ఋణ విషయాలలో కొంత జాగ్రత్త పాటించాలి. కుటుంబ అవసరాలు తీర్చడంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. విహార యాత్రలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. ఫిబ్రవరి: కాలం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేసేవారు మాత్రమే ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆరోగ్యం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సాధారణంగా ఉంటాయి. వ్యాపారాలలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు సాధారణంగా ఉంటాయి. మార్చి: అంతా శుభ పరిణామాలతో గడచిపోతుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యవహారాలు ఈ నెలలో పూర్తి అయ్యే దిశగా పయనిస్తాయి. ఉద్యోగులకు చాలా విశేషమైన కాలం. పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు బాగా అనుకూలం. విద్యార్థులకు, షేర్‌ వ్యాపారులకు కాలం అనుకూలం. మకర రాశిఆదాయం–8, వ్యయం–14 , రాజయోగం–4, అవమానం–5 .ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)ఈ సంవత్సరం గురువు మే 14న మి«థునరాశి (షష్ఠ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (ద్వితీయ), కేతువు సింహరాశి (అష్టమం) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (తృతీయ) సంచారం. కేవలం శని, రాహు సంచారం అనుకూలత వల్ల విజయాలు సాధిస్తారు. అయితే జూన్‌ వరకు కుజ సంచారం ప్రభావంగా ప్రయాణ విషయాలలో చికాకులు ఉంటాయి. స్వబుద్ధి, స్వశక్తితో విజయాలు సాధిస్తారు. శ్రమతో కూడిన పనులు జూన్‌లోపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. రోజువారీ పనుల్లో ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాలను కొంచెం ఓర్పుగా చూసుకోవాలి. చికాకులు ఎప్పుడు ఎలా ఉత్పన్నమవుతాయో చెప్పలేని స్థితి ఉంటుంది. ఉద్యోగాలలో శని అనుకూలత వల్ల సర్వత్రా విజయమే. ట్రాన్స్‌ఫర్‌ ప్రయత్నాలు, ప్రమోషన్‌ ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు జూన్‌ వరకు విశేషం. సంవత్సరం అంతా శుభమే. వ్యాపారులు మార్పులు చేపట్టే ఆలోచనలు చేస్తారు. వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సానుకూలత. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా సాగిస్తారు. ఆదాయం తక్కువగా ఉన్నా, ఖర్చులు నియంత్రించి జూన్‌ వరకు సుఖపడతారు. జూన్‌ తరువాత ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశములు ఉ్తన్నాయి. తరువాత కొత్త ఋణాలు అందడం కష్టం అవుతుంది. ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. ప్రతి విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్‌ ఉద్యోగులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్‌ వ్యాపారులకు అంతా శుభసూచకమే. మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. కోర్టు వ్యవహారాలలో మంచి లాభ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా వ్యవహారం జరుగుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు మే వరకు ఉన్న ప్రశాంతతో చాలా విజయాలు సాధిస్తారు. ఇబ్బందిలేని జీవనం సాగిస్తారు. తెలివిగా ఓర్పుగా కుటుంబవృద్ధి సాధించుకుంటారు. గౌరవం పొందుతారు. సమయపాలన ద్వారా విజయాలు అందుకుంటారు. పుణ్య విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అంతా శుభప్రదంగా ఉన్నా, అధైర్యం పొందుతారు. చిన్న ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయండి.ఉత్తరాషాఢ 2, 3,4 పాదాలు: అనాలోచిత కార్యములు ఎక్కువగా చేస్తుంటారు. నమ్మకంగా మోసగించే లక్షణాలు వున్నవారు మీ పనులలో చొరబడతారు. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, ఆర్థిక విషయాలలో ఇతరుల సలహాలకు అవకాశం ఇవ్వకుండా గౌరవంగా పనులు పూర్తి చేసుకుంటారు. శ్రవణం: మరింత శ్రద్ధ అవసరం. ఇతరులకు ఇచ్చిన డబ్బులు వసూలు కావడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇతర వ్యాపకాలు ఆకర్షించినా, వాటి జోలికి పోవద్దని సూచన. మితభాషణ, ఓర్పు మీకు శ్రీరామరక్షగా గుర్తించండి. ధనిష్ఠ 1, 2 పాదాలు: కర్తవ్య నిర్వహణ నిబద్ధతతో ఉండి గౌరవం అందుకుంటారు. కొత్త వ్యవహారాల జోలికి పోవద్దు. వ్యాపారులకు వర్కర్స్‌ ద్వారా సహకారం అందుతుంది. కొత్త అలంకరణ వస్తువులు, వాహనాల కొనుగోలుపై దృష్టి ఉంచుతారు. కుటుంబ ప్రోత్సాహం అద్భుతంగా అందుకుంటారు. శాంతి మార్గం: గురువుకు, కుజుడికి మే నెలలో శాంతి చేయించండి. రోజూ శివ కుటుంబం అంతా ఉన్న శివాలయంలో ప్రదోషకాలంలో 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. గురుచరిత్ర పారాయణ, సుదర్శన స్తోత్ర పారాయణ చేయడం మంచిది. అష్టముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్‌: కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండేవారు సుఖంగా ఉంటారు. అనవసర ప్రయోగాలు చేసేవారు ఇబ్బందులు పడతారు. ఈ నెలంతా వృత్తి రీత్యా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం వలన అద్భుత ఫలితాలు రాగలవు. విద్యార్థులకు కాలం అనుకూలం. మే: ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. కోపావేశాలకు గురి అవుతుంటారు. కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళకండి. అధికంగా దూర ప్రయాణాలు చేయవద్దు. మార్కెటింగ్‌ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ప్రతి విషయానికి అతిగా స్పందించవద్దు. జూన్‌: బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయండి. జీవనోపాధి మార్గాలు సాధారణ స్థాయిలో నడుస్తాయి. కుటుంబ విషయాల్లో ఎప్పుడెలా సమస్యలు తలెత్తుతాయో చెప్పలేం. కొన్నిసార్లు లాభం చేకూరుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలలో మంచి వార్తలు వింటారు. జులై: 16 తర్వాత అనుకూలత తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించకుండా ఓర్పుగా ముందుకు వెళితే విజయావకాశాలు పెరుగుతాయి. జాగ్రత్తగా సంచరించేవారికి ఈ నెల చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్‌: చాలా విషయాలు స్వయంగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవు. పూర్తి అనుకూలమైన కాలం కాకున్నా, సరిగా ప్రయత్నిస్తే సమస్యలు దూరం అవుతాయి. కొత్త అలంకరణ వస్తువుల కొనుగోలు విషయంగా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్తు వ్యవహారాలకు శ్రీకారం చేస్తారు. సెప్టెంబర్‌: కోపావేశాలు లేనివారికి, తొందరపాటు నిర్ణయాలు చేయనివారికి చాలా మంచి కాలం. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అయితే వాటి అమలు కష్టసాధ్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఉపశమనంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. అక్టోబర్‌: భార్యాభర్తలకు, తండ్రి పిల్లలకు మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వాహన లాభం, ప్రయాణ సౌఖ్యం బాగుంది. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. అందరి ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్‌ ఉద్యోగులు, షేర్‌ వ్యాపారులు కొంత శ్రమను పొందినా, లాభాలు పొందుతారు. విద్యార్థులకు, రైతులకు లాభదాయకం. నవంబర్‌: చాలా గొప్ప అనుభూతులు కలుగుతాయి. ధైర్యం తెలివి ప్రతి విషయంలో ప్రదర్శిస్తారు. మీ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. ఇతరుల వ్యవహారాలు చూడడం విడనాడండి. కావలసిన ఆర్థిక వెసులుబాటు, మనిషి సహకారం బాగా అందుతాయి. ప్రశాంత జీవనంతో సుఖపడతారు. డిసెంబర్‌: వ్యాపార అవరో«ధాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలలో విచిత్రస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు ఈ నెలలో కదలికలు వస్తాయి. జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ వ్యాపార కుటుంబ వ్యవహారాలు మినహా ఇతర పనులు చేపట్టవద్దు అని సూచన. ఋణాలు అవసరానికి సర్దుబాటు కావు. జనవరి: ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, కుటుంబ విషయాలు మినహా మిగిలిన వాటిని వాయిదా వేయడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోవడం మంచిది కాదు. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. ఫిబ్రవరి: శుభాశుభ పరిణామాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో ఎక్కువగా కలుగచేసుకోకండి. పనులు స్వయంగా చేసుకోండి. ఆగ్రహావేశాలు తగ్గించండి. చాలా ఒత్తిడితో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తారు. శుభకార్య పుణ్యకార్యాలలో ధనవ్యయం అధికం అవుతుంది. మార్చి: మంచి మార్పులు ఉంటాయి. అన్ని అంశాలలోనూ విజయాలకు దగ్గర అవుతారు. రాబోవు మూడు మాసాలలో చాలా అనుకూలతలు గోచరిస్తున్నాయి. వేగంగా పనులు పూర్తి చేసి వృత్తి ఉద్యోగాలలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆదాయ వ్యయాలు సానుకూలంగా ఉంటాయి. ప్రశాంత జీవనం చేస్తారు. కుంభ రాశిఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–7, అవమానం–5ధనిష్ఠ 3,4 పాదములు (గూ, గే)శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (పంచమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (జన్మ), కేతువు సింహరాశి (సప్తమ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (ద్వితీయ) సంచారం. ఏలినాటి శని తృతీయ భాగంలో నడుస్తుంది. రాహువు పెద్దగా యోగించకపోయినా, గురుబలం అనుకూలత వలన మంచి ఫలితాలు అందుకుంటారు. కొన్నిసార్లు తెలివిగాను, కొన్నిసార్లు అసహనంతో ప్రవర్తిస్తుంటారు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ప్రవర్తన ఉండేలా చూసుకోండి. రోజువారీ పనులలో స్థిరచిత్తం లోపించడంతో కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో అనవసర కలహాలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తిస్తుంటారు. గురుబలం వలన పెద్దస్థాయి కుటుంబ ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలలో కొన్నిసార్లు ఓర్పుగా ప్రవర్తించి మంచి ఫలితాలు, కొన్నిసార్లు చికాకుగా వ్యవహరించి ఇబ్బందులు పొందుతారు. అధికారులతో జాగ్రత్త అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు వేగంగా సాగుతాయి. వ్యాపారులకు అంతా శుభ ఫలితాలే ఉన్నా, తెలియని అసంతృప్తి ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు, సహకారం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఇబ్బందులు లేకుండా కాలం సాగుతుంది. ఋణ విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయంలో రోగం ఒకటి, వైద్యం మరొకటిగా ఉంటుంది. మార్కెటింగ్‌ ఉద్యోగులకు బుద్ధి సరిలేక తగిన ఫలితాలు అందుకోలేరు. షేర్‌ వ్యాపారులకు శుభపరిణామాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలలో తప్పుదోవ పట్టించేవారిని గుర్తించి, దూరంగా ఉంచడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో చికాకులు, మోసం వెంట వచ్చినా చివరకు లాభాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో మందగమనంగా లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు. రాహు ప్రభావం వల్ల మీ సేవలకు తగిన గుర్తింపు ఉండదు. మోసపోయే అవకాశాలు ఎక్కువ. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం బాగానే ఉన్నా, అనవసర భయాందోళనలు పెరిగి చికాకులు పొందుతారు. దేవీ భాగవత పారాయణ చేయండి. దుర్గా/దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి.ధనిష్ఠ 3, 4 పాదాలు: తరచుగా మోసాలకు గురవుతారు. శారీరకంగా ఇబ్బంది ఉందనే భావన గోచరిస్తుంది. చేయవలసిన పనులు ఆపేసి అనవసరమైనవి చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో అంతా బాగున్నా, తెలియని భయం వెంటాడుతుంది. అవసరాలకు కావలసిన డబ్బు అందుతుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేయరు. శతభిషం: వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజా సంబంధాలు చికాకులు సృష్టిస్తాయి. గొప్ప కోసం విరాళాలు ఇవ్వాల్సి వచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. కుటుంబంలో పెద్దలు, పిల్లల విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు: ఆర్థిక లావాదేవీలు విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు డబ్బు ఉన్నా అప్పులు చేయడం, కొన్నిసార్లు డబ్బు ఉన్నా అప్పులు తీర్చకపోవడం వంటివి చేస్తుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి అనుమానాలు పెరుగుతాయి. నేత్ర బాధలు చికాకులు కలిగిస్తాయి. అనాలోచితంగా ప్రవర్తించడం సహజ లక్షణంగా మారిపోతుంది. సొంత డ్రైవింగ్‌ తగ్గించండి.శాంతి మార్గం: శని, రాహు, కేతువులకు శాంతి చేయించండి. రోజూ ఇంద్రాక్షీ స్తోత్రం మరియు పిప్పలాద కృత శనిస్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. శనివారం రోజు బట్టలు, చెప్పులు వంటివి దానం చేయడం శుభప్రదం. గౌరీశంకర రుద్రాక్షధారణ చేయడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది.ఏప్రిల్‌: సమస్యలు ఉన్నాయో లేవో చెప్పలేని సందిగ్ధ కాలం. ఓర్పుగా ఉండాలి. కొత్త పనులు చేయడం మంచిది కాదు. ఋణ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఇతరుల ప్రమేయం వల్ల సమస్యలు రాగలవు. శతభిషా నక్షత్రం వారికి మానసిక అసౌకర్యం, పూర్వాభాద్ర వారికి ఆర్థిక అసౌకర్యం, ధనిష్ఠ వారికి ఉద్యోగ అసౌకర్యం ఉంటాయి. వ్యాపారులకు పనివారితో సమస్యలు ఎక్కువవుతాయి. మే: మాటకు విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. అందరి సహకారం బాగుంటుంది. పూజ్యులు, గురువులు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. జూన్‌: జూన్, జులై నెలల్లో స్నేహితులు చేసిన పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. షేర్‌ వ్యాపారాలకు, మార్కెటింగ్‌ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఋణ, ఆరోగ్య విషయములలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడండి. ఓర్పు అవసరం. జులై: మనో ధైర్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. విద్యా, విజ్ఞాన, ప్రదర్శన చేస్తారు. చాలా వ్యవహారాలలో అడ్డంకులు రావడం, వాటిని తొలగించుకోవడం జరుగుతుంది. స్నేహితుల ద్వారా ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ. విద్యా వ్యాసంగం బాగుంటుంది. ధన ధాన్యలాభం చేకూరుతుంది. ఆగస్ట్‌: ఋణ, ఆరోగ్య విషయాలలో ప్రతికూల సలహాలు ఇచ్చేవారికి ఆకర్షితులు అవుతారు. ఆదాయం తక్కువ, ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ప్రతివారికి సహాయం చేయాలనే కోరిక పెరుగుతుంది. లాభదాయక సంఘటనలు ఉంటాయి. పెద్దలను దర్శించడం, పుణ్యకార్యాలు చేయడం జరుగుతుంది. సెప్టెంబర్‌: అభివృద్ధికి మీ కోపావేశాలు అడ్డంకులు కలిగిస్తాయి. ఎప్పుడు ఏ పని సక్రమంగా అవుతుందో తెలియని çపరిస్థితి. మితభాషణ చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. పనివారిని నమ్ముకొని పెద్ద వ్యవహారాలకు శ్రీకారం చుట్టవద్దు. అక్టోబర్‌: పనులు సకాలంలో సవ్యంగా పూర్తవని కారణంగా చికాకులు పడతారు. అనవసర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో, ఉద్యోగంలో, తోటివారితో ఇబ్బందులు పెరుగుతాయి. రోజువారీ పనులు కాకుండా కొత్త çపనులు చేపట్టవద్దు. నవంబర్‌: పనులు సానుకూలం చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. అన్ని అంశాలలోనూ కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సానుకూలం అవుతాయి. వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగులకు పనులు సకాలంలో అవుతాయి. డిసెంబర్‌: మానసిక అశాంతి ఎక్కువైనా, విజయాలు సాధిస్తారు. కొన్నిసార్లు ధైర్యం ప్రదర్శిస్తారు. ఉద్యోగాలలో అంతా సానుకూలమే. వ్యాపారులు ప్రోత్సాహకర ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు, షేర్‌ వ్యాపారులకు కాలం అనుకూలం. జనవరి: 13వ తేదీ నుండి జాగ్రత్తలు పాటించండి. 13వ తేదీ వరకు అనుకున్న పనులు వేగంగా సాగుతాయి. ఆ తర్వాత ప్రయాణ చికాకులు, ఆరోగ్య చికాకులు ఉంటాయి. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. బంధు మిత్రులతో కలహాలు రాకుండా సంచరించాలి. కొత్త వ్యవహారాలు చేయవద్దు. ఫిబ్రవరి: తరచు ఇబ్బందులు వస్తుంటాయి. అయినా తెలివిగా సరి చేసుకోగలుగుతారు. ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో మంచి తెలివి ప్రదర్శిస్తారు కాని, రాబోవు మూడు మాసాలు ఒత్తిడిగానే సాగుతుంది. ఆరోగ్యం, స్థానచలనం విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు రాగలవు. మార్చి: తరచు ఎదురయ్యే సమస్యలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి రావడంతో రోజువారీ పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగ భద్రత కోసం ఎక్కువగా శ్రమించాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. అధికంగా ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. మీన రాశి ఆదాయం–5, వ్యయం–5 , రాజయోగం–3, అవమానం–1పూర్వాభాద్ర 4 వ పాదము (ది)ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (అర్థాష్టమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (వ్యయ), కేతువు సింహరాశి (షష్ఠ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (జన్మ) సంచారం. ఏలినాటి శని జన్మంలో రెండవ భాగం ప్రారంభం. జన్మ శని, వ్యయ రాహు తగు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. మీ ప్రమేయం లేకుండా సమస్యలు తలెత్తే సమయం. అందరినీ మీరు, మిమ్మల్ని అందరూ అనుమానిస్తారు. ఇతర పనులు ఆపివేయండి. ప్రతిపనిలోనూ మందగమనం ఉంటుంది. రోజువారీ పనుల్లో జాగ్రత్త వహించండి. కుటుంబపరంగా ఇబ్బందిలేని జీవనశైలి ఉంటుంది. అలసత్వం, పనులు వాయిదా వేయడం, అనవసర కలహాలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. ఉద్యోగులు తోటివారితోను, మీ కింద పనిచేసే వారితోను జాగ్రత్తగా ఉండాలి. మోసపూరిత వాతావరణంతో ఇబ్బంది పడతారు. అధికారులతో జాగ్రత్త. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూలత ఉన్నట్లు కనిపించినా, పనులు పూర్తి కావు. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. పనివారితో సమస్యలు, అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి ఫలితాలు లేవనే చెప్పాలి. ఆర్థిక లావాదేవీలలో చికాకులు పొందుతారు. అవసరానికి తగిన ఆదాయం అందదు. ఖర్చులు నియంత్రించలేరు. ఋణ విషయములో అవమానాలు ఎదురవకుండా జాగ్రత్తపడండి. ఆరోగ్య విషయంలో నేత్ర బాధలు ఉన్నవారు ఇబ్బందులు పడతారు. గుండె, ఎముకల సమస్యలు ఉన్నవారు పాత సమస్యలు తిరగబెట్టకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్‌ ఉద్యోగులకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అధికారుల ఆగ్రహం తప్పదు. షేర్‌ వ్యాపారులకు కాలం అనుకూలం కాదు. రైతులు స్వబుద్ధితో ప్రత్యక్షంగా పనులు పర్యవేక్షించుకోవాలని సూచన. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు ఎక్కువై ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారాలలో బాగా సçహాయం చేస్తారు అనుకునేవారు కూడా మోసం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మోసాలు ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు చికాకులతో సాగుతాయి. ఈ రాశి స్త్రీలకు అంతటా చిక్కులు, సమస్యలు తప్పవ. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచండి. ఇతరుల విషయాలలో కలుగచేసుకోవద్దు. దూర ప్రయాణాలు విరమించండి. అలంకరణ మీద దృష్టి ఉంచరు. మీరు చేసే పనికి గుర్తింపుకు రాకపోగా విమర్శలు ఎదురవుతాయి. గర్భిణీ స్త్రీలకు మానసిక ఆందోళనలు ఎక్కువవుతాయి.అనవసర భయాందోళనలు పెరుగుతాయి. తరచుగా వైద్య అవసరాలు ఏర్పడతాయి. సౌందర్యలహరి పారాయణ శ్రేయోదాయకం.పూర్వాభాద్ర 4వ పాదం: అనవసర ఆలోచనలు, అనవసర కాలక్షేపాలు, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైద్య, ఋణ, కోర్టు విషయాలలో సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొత్త పనులు చేపట్టకపోవడం శ్రేయస్కరం. అన్ని పనుల్లోనూ వాయిదాలను ఇష్టపడుతుంటారు. ఉత్తరాభాద్ర: వైద్యపరంగా మంచి సలహాలు అందక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్య విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేరు. అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మంచిగా వ్యవహరించి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. ఆర్థిక ప్రోత్సాహం తక్కువ. రేవతి: వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. సామాజిక చెడు ప్రభావాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. మిత్రుల సలహాలు, బంధు సహకారం అనుకూలించవు. మతిమరపు పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అధిక జాగ్రత్తలు పాటిస్తారు. పుణ్యకార్యాలు చేస్తుంటారు. శాంతి మార్గం: శని, రాహు, కుజ గ్రహశాంతి అవసరం. రావి చెట్టు కింద కొలువైన ఆంజనేయస్వామికి ‘‘శ్రీరామ జయరామ జయజయరామ’’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం, ప్రదోషకాలంలో ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయడం శుభప్రదం. గౌరీశంకరం రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్‌: ఈ నెలలో చేసే కొత్త ఋణాలు భవిష్యత్తుకు ప్రమాదం అవుతాయి. పనులు వాయిదా వేయడం మానుకోండి. బుద్ధి కుశలత తగ్గుతుంది. ఒంటరి కాలక్షేపం, ఒంటరి ప్రయాణాలు విడనాడడం శ్రేయస్కరం. రోజువారీ పనులు మినహా కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవదు.్ద మే: ఒక విచిత్రమైన కాలం. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. చాలా అంశాలలో తెలివి ప్రదర్శించి చికాకులు పెరగకుండా చూసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతుంటాయి. జూన్‌: కుటుంబ వాతావరణం చాలా సౌకర్యంగా ఉంటుంది. మీ పనులు ఆలస్యమైనా, సానుకూలంగా పూర్తవుతాయి. వాహన, ప్రయాణ, ఆర్థిక విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. జులై: పనులు సాధించే వనరులు ఉన్నా, ఆలస్యం అవుతుంటుంది. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. అవయవాలు కొంత ప్రతికూలిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విదేశీ ప్రయత్నాలు మందగమనంగా ఉంటాయి. ఆగస్ట్‌: మానసిక ఒత్తిడి ఎక్కువ. ప్రతికూల సలహాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. చేయవలసిన పనులు ఆలస్యంగానూ, అనవసరమైన పనులు వేగంగానూ చేస్తూ ఉంటారు. ఎవరినీ నమ్మలేని స్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఋణ విషయాలు సానుకూలంగా సాగుతాయి.సెప్టెంబర్‌: విచిత్రమైన కాలం. ద్వితీయార్ధం కార్య వైఫల్యాలు ఉంటాయి. కొత్త పనులు చేయవద్దు. రోజువారీ పనులలోనూ, వృత్తి వ్యవహారాలలోనూ ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల ప్రమేయాన్ని తగ్గించండి. ప్రయాణాలు తగ్గించడం శ్రేయస్కరం. అక్టోబర్‌: బహు జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. స్థానభ్రష్టతకు, కుటుంబంలో అనైక్యతకు అవకాశాలు ఎక్కువ. ఆర్థిక లావాదేవీలు, ఋణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలు విరమించండి. ఒంటరిగా ఏ పనీ చేయవద్దని సూచన. నవంబర్‌: విచిత్రమైన కాలం. ఏ పనీ సవ్యంగా సకాలంలో పూర్తవదు. ప్రతిదానికీ భయపడుతూ ఏ ప్రయత్నమూ సవ్యంగా చేయరు. మానసిక పరిస్థితికి, ఆచరణకు పొంతన ఉండదు. పుణ్యకార్యాలలో అవరోధాలు రాకుండా జాగ్రత్తపడండి. చిన్న చిన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. డిసెంబర్‌: ఉద్యోగంలో మీ అధికారులు బాగా ప్రోత్సాహం అందిస్తారు. వ్యాపారులకు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో అనుకూలత ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. పుణ్యకార్యాలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దలను సేవించుకుంటారు. షేర్‌ వ్యాపారులకు అనుకూలం. జనవరి: క్రమంగా లాభాలు పెరుగుతాయి. ప్రారంభించిన ప్రతి పని లాభదాయకంగా పూర్తవుతుంది. గత సమస్యల పరిష్కారానికి, భవిష్యత్‌ ప్రణాళికలకు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ చాలా అనుకూలం.ఫిబ్రవరి: చాలా జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఋణ వ్యవహారాలలో అవమానాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. దూర ప్రయాణములు, ఒంటరి ప్రయాణాలు రాబోవు మూడు మాసములు అనుకూలంగా అగుపించడం లేదు. ఆర్థికలావాదేవీలు ఇబ్బందికరం. మార్చి: ఆరోగ్య చికాకులు రాగలవు. తెలివిగా పనిచేయగలిగిన శక్తి ఉన్నా, నిస్తేజంగా ఉండిపోతారు. పనులు అనుకూలం కావు. రోజువారీ పనులు అస్తవ్యస్తంగా జరుగుతాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో ఇబ్బందులు పడతారు. మేష సంక్రమణ ఫలముది.14 ఏప్రిల్‌ 2025 ఉదయం 5:33లకు విశ్వావసు చైత్ర బహుళ పాడ్యమీ సోమవారం స్వాతి నక్షత్రం వజ్రనామయోగం, కౌలవ కరణం మీనలగ్న సమయంలో రవి మేషరాశిలో ప్రవేశం. సోమవారం సుభిక్షం. సంధ్యాకాలం ప్రజలకు సుఖం. స్వాతీ నక్షత్ర సమయంలో ప్రవేశం హానికలుగును. రోహిణీ చక్ర విధానంగా చూడగా మంచి వర్షానికి అవకాశం. సంవత్సరం అంతా ఉన్నది. ప్రవేశకాల గ్రహ సంచారం ప్రకారం లగ్నంలో చాతుర్గ్రహ కూటమి అందులోను, శని, రాహువులు పరిపాలనా రంగంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. సమాజంలో ఇబ్బందికర ఘటనలకు అవకాశం గోచరిస్తుంది. అయితే గురుసంచారం బాగుంది. కావున సాధారణ స్థాయి ఇబ్బందులుగా గుర్తించవచ్చు.రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశ ఫలముది.22–06–2024 పగలు (22.35 వి.ఘ.) గం.2:32ని.లకు విశ్వావసు సంవత్సరం జ్యేష్ఠ బహుళ ద్వాదశీ ఆదివారం భరణీ నక్షత్రం సుకర్మ యోగం తైతుల కరణం తులా లగ్నం సమయంలో రవి ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశం. ‘‘అపరేహేః ఆర్ద్రా ప్రవేశం అతిలోక పీడా’’ అపరాహ్ణ కాలములో ఆర్ద్రా నక్షత్రంలో రవి ప్రవేశం లోకులకు ఇబ్బంది. చంద్రుడు మేషంలో ఉన్న కారణంగా దివారాత్రి దోషం తోడయి ఎక్కువ కాలం నీటి ఎద్దడి. అయితే రవి చంద్రులకు ఇరువురికీ శుభగ్రహ కలయిక వలన దోషం తక్కువగా భావించాలి. ద్వాదశ్యాం శుభప్రోక్తం అని చెప్పబడినది. ఆదివారం పశువులకు నష్టం. కశ్యపవచనం దృష్ట్యా భరణిలో చంద్రుడు ఆర్ద్రా ప్రవేశ కాలంలో వున్న కారణం సస్యవృద్ధిగా గమనించాలి. సుకర్మ యోగం సువృష్టి అని చెప్పబడినది. భరణ్యాది చతుష్కమండలం దృష్ట్యా సస్యానుకాలం వర్షయోగం చెప్పబడినది. తులాలగ్న సమయంలో ప్రవేశం సువృష్టి. తైతుల కరణం నిత్యశుభం. ఫలితం: సాధారణం నుండి అధిక వర్షపాతం నమోదు అవుతుంది. సూచన: ఈరోజు వర్షం కురిసినట్లయితే, దానిని ఆధారం చేసుకొని భవిష్య వర్షయోగం నిర్ణయిస్తారు.చంద్రచారముజ్యేష్ఠ శుక్ల ప్రతిపత్‌ బుధవారం ‘‘సుభిక్షం క్షేమమారోగ్యం వృష్టిసస్య వివర్ధనం స్వధర్మ నిరతాభూపాః జ్యేష్టాదౌ సౌమ్యవాసరేః’’ సస్యానుకూల వర్షాలు పాడిపంటలు సమృద్ధి ఉంటుంది. రాజులు ధర్మ నిరతులై ఉంటారు. ‘‘ఆషాఢే పంచమీ శుక్లా సోమవారో యదా భవేత్‌ సుభిక్షం క్షేమమారోగ్యం సువృష్టిశ్చ భవేద్భవం’’ ఆషాఢ శుక్ల పంచమీ సోమవారం కూడా సుభిక్ష క్షేమ ఆరోగ్యాలను సూచిస్తోంది. ‘‘ఆషాఢే శుక్ల పక్షేతు దశమీ స్వాతీ సంయుతా మహద్వర్షం భవేద్ధ్రువం’’ అధిక వర్షాలకు అవకాశం. ‘‘ఆషాఢే కృష్ణపక్షే రోహిణీ ఏకాదశీ యుతామధ్యమ వర్షాలు మధ్యంగా సస్యాలు ఫలిస్తాయి. పుష్య అమావాస్య ఆదివారం దుర్భిక్షం మాఘ ఫాల్గుణాలలో అని గ్రహించాలి.మకర సంక్రాంతి పురుష లక్షణ ది.14 జనవరి 2026 రా.8:51లకు పుష్య బహుళ ద్వాదశి బుధవారం అనురాధ నక్షత్రం, గండ యోగం, కౌలవ కరణం సింహలగ్న సమయాన రవి మకరంలో రవి ప్రవేశం. తర్పణాలు సంకల్పాలు 15 జనవరి ఉదయం నుండి ప్రారంభం కుంకుమోదక స్నానం రాజులకు అరిష్టం. విచిత్ర వస్త్రధారణ శుభం. మందాకినీ నామధేయం రాజులకు నష్టం.

Myanmar shakes 15 Times in 24 hours Earthquake 3
Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు

నేపిడా: శుక్రవారం సంభవించిన భారీ భూకంపం మయన్మార్‌(Myanmar)ను అతలాకుతలం చేసింది. నాటి భయం నుంచి అక్కడి ‍ప్రజలు కోలుకోకముందే తిరిగి పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో మయన్మార్‌లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో మయన్మార్‌కు ఇంకా భూ ప్రకంపనల ముప్పు తప్పలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.గడచిన 24 గంటల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి భూమి కంపించడాన్ని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. భూకంపం తర్వాత మయన్మార్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి విషాదానికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు అందుబాటులోకి రావడం లేదు. భూకంపం తీవ్రతకు పలు భవనాలు, వంతెనలు కూలిపోయాయి. మయన్మార్‌లోని చారిత్రక అవా వంతెన కూడా భూకంపం తీవ్రతకు కూలిపోయింది. ఈ వంతెనను 1934లో నిర్మించారు.ఇదేవిధంగా మయన్మార్‌లోని ప్రముఖ పగోడా ఆలయం కూడా కూలిపోయింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా(UNESCO World Heritage List)లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలయం శిథిలమయ్యింది. మయన్మార్‌లో ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో తాజాగా సంభవించిన భూకంపం మయన్మార్‌కు దెబ్బ మీద దెబ్బలా తయారయ్యింది. ఈ నేపధ్యంలో భారత్‌.. మయన్మార్‌కు అండగా నిలిచింది. బాధితులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం

IPL 2025: Peeved Over Free Tickets Demand By HCA, Sunrisers Threaten To Move Out Of Uppal Stadium4
IPL 2025: ఇలా అయితే హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతాం: సన్‌రైజర్స్‌ యాజమాన్యం

ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్‌ 2025) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. పాస్‌ల కోసం​ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్‌ జనరల్‌ మేనేజర్‌ టిబి శ్రీనాథ్‌ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్‌ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్‌మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు కూడా వెనకాడము. వారి ప్రవర్తన చూస్తే మేము ఉప్పల్‌ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకుని మ్యాచ్‌లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాను. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం మరియు మా యాజమాన్యానికి తెలియజేయగలము. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదారబాద్‌ నుంచి తరలిపోతామని సన్‌రైజర్స్‌ ప్రతినిథి హెచ్‌సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. సన్‌రైజర్స్‌ జనరల్‌ మేనేజర్‌ టిబి శ్రీనాథ్‌ ఈ విషయాలను కూడా తన ఈ-మెయిల్‌లో రాశారు. గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్‌లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.అయినా పట్టించుకోకుండా హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్‌ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్‌ బాక్స్‌కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్‌ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్‌ తన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.కాగా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్‌ స్టేడియం) హోం గ్రౌండ్‌గా ఉన్న విషయం తెలిసిందే.

Sakshi Editorial On TDP alliance Red Book Conspiracy5
ఎర్రబుక్కు తెల్లమొహం!

ఎర్ర పుస్తకం తెల్లమొహం వేసినట్లయింది. రాజ్యాంగ విధి విధానాలను కూడా ప్రైవేటీకరించబోయిన తెంపరితనానికి చెంపలు వాయించినట్లయింది. ఇష్టారీతిన పోలీసు రాజ్యాన్ని నడుపుతామంటే, పౌరహక్కుల్ని చిదిమేస్తామంటే అంగీకరించేది లేదని ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయ స్థానం ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించింది. ఇప్పుడదే హెచ్చరికను జనతా న్యాయస్థానం కూడా జారీ చేసినట్లయింది. రాష్ట్రంలో 56 మండల పరిషత్తు అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలకు, కడప జిల్లా పరిషత్తు అధ్యక్ష స్థానానికి మొన్న ఉపఎన్నికలు జరిగాయి. ఓట్లు వేసింది ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలే. వీరు క్షేత్రస్థాయి ప్రజా ప్రతినిధులు. జనం గుండె చప్పుళ్లను నిరంతరం వినగలిగేవాళ్లు. ప్రజల నాడీ స్పందనను ముందుగా పసిగట్టగలిగేవాళ్లు.ఉపఎన్నికల్లో అధికార కూటమి పన్నిన వ్యూహం ఫలించ లేదు. విపక్షమైన వైసీపీ ఘనవిజయాన్ని నమోదు చేసింది. కడప జడ్‌పీతో సహా 40 స్థానాలను ఆ పార్టీ అవలీలగా గెలవగలిగింది. కూటమికి 10 స్థానాలు దక్కాయి. మిగిలినచోట్ల ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ టిక్కెట్‌పై గెలుపొందిన స్థానిక ప్రతినిధులు ఆ పార్టీ పక్షాన్నే నిలవడంలో వింతేముందని ఇప్పుడు కూటమి చిలుకలు పలుకుతుండవచ్చు. కానీ ఏపీలో ఈ తొమ్మిది నెలల పూర్వరంగం అర్థమైన వారికి వైసీపీ గెలుపులో వింతే కాదు, అద్భుతం కూడా కనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకంలో బలంగా వేళ్లూనుకున్న పార్టీ వైసీపీ. ఆ సంగతి కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. అందుకే కూటమి కట్టుకున్నారు. కుయుక్తులను ఆశ్రయించారు. ఎన్నికల్లో ఈ కూటమి చేసిన దుష్ప్రచారం, వెదజల్లిన విషం, పలికిన అసత్యాలు, చేసిన బూటకపు బాసలు అనే నిచ్చెనమెట్ల మీదుగా చేరుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే సంకల్పానికి అధికార కూటమి వచ్చినట్టు దాని చర్యలు నిరూపిస్తున్నాయి. ఇటువంటి ప్రయ త్నాలు సత్ఫలితాలనివ్వవని గతంలో అనేక గుణపాఠాలు న్నాయి. అయినా అధికార మత్తులో ఉన్నప్పుడు అవి స్ఫురించక పోవచ్చు. ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు.... ... కానీ మూర్ఖుని మనసును సమాధానపరచడం మాత్రం సాధ్యంకాద’ని భర్తృహరి చెప్పిన సుభాషితం మనకు ఉండనే ఉన్నది.ప్రభుత్వ వైఖరిని విమర్శించిన వారి మీద, ఎన్నికల హామీలను అమలు చేయలేదేమని అడిగిన వారి మీద వందలాది కేసులు నమోదయ్యాయి. టెర్రరిస్టుల మీద పెట్టాల్సిన కేసులను సోషల్‌ మీడియా విమర్శకుల మీద ఎందుకు పెడు తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తున్నా పోలీసు యంత్రాంగం ఖాతరు చేయడం లేదు. రక్షక భటులే అర్ధరాత్రి పూట సివిల్‌ డ్రెస్సుల్లో ఇళ్లలోకి చొరబడి విమర్శకులను బరబరా లాక్కొని వెళ్తున్నారని, రాష్ట్రమంతటా తిప్పుతున్నారనీ, కుటుంబ సభ్యులకు సమా చారం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు తరచుగా వినిపి స్తున్నాయి. పోసాని కృష్ణమురళి పదేళ్ల కింద ప్రెస్‌మీట్‌లో చేసిన విమర్శలపై టెర్రరిస్టు కేసు పెట్టి జైల్లోకి నెట్టారు. నడివీధుల్లో విపక్ష కార్యకర్తలను విచ్చుకత్తులతో నరుకుతున్న దృశ్యాల వీడియోలను చూడవలసి వచ్చింది. ప్రైవేట్‌ ఆస్తుల మీద దాడులు జరిగాయి. పార్టీ ఆఫీసులను కూల్చేశారు. పంట చేల విధ్వంసం జరిగింది. పండిన తోటలను నరికేశారు. మీడియా మీద అప్రకటిత సెన్సార్‌షిప్‌ అమలైంది. తమకు గిట్టని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేసేలా కేబుల్‌ ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో వచ్చిన స్థానిక ఉపఎన్నికల సందర్భంగా కూటమి నాయకత్వం మరింత రెచ్చిపోయింది. స్థానిక ప్రతి నిధులను లొంగదీసుకోవడానికి సామ దాన భేద దండో పాయాలను ప్రయోగించారు. ప్రలోభాల ఎరలు వేశారు. కేసులు పెడతామని బెదిరించారు. ఉపాధిని దెబ్బతీస్తామని హెచ్చరించారు. పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని స్వయంగా ప్రభుత్వమే అధికార జులుమ్‌కు దిగినప్పుడు స్థానిక ప్రతినిధులను లొంగదీసుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. పైగా రాజ్యసభల్లో, శాసన మండళ్లలో అధికార హోదాలు వెలగబెట్టిన బడాబడా ఆసాములే సర్కార్‌ కొరడా ముందు సాగిలపడి పోయిన ఉదంతాలు కళ్లముందటే కనిపిస్తున్నాయి. స్థానిక పదవులను గెలుచుకోవడానికి అధికార పార్టీ బరి తెగించిందనీ, పలుచోట్ల ప్రతినిధులను అడ్డుకున్నారనీ, ప్రలోభపెట్టారనీ ‘సాక్షి’ మీడియానే కాదు, ‘ప్రజాశక్తి’ పత్రిక కూడా రాసింది. ఇలా అధికార యంత్రాంగం బరితెగించి ప్రవర్తించినప్పుడు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ స్వీప్‌ చేయడం కష్టం కాదనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ, వైసీపీ స్థానిక ప్రతినిధులు అరుదైన ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రదర్శించారు. పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. నిర్బంధాలను ధిక్క రించి తమను నమ్మి గెలిపించిన పార్టీ పక్షానే దృఢంగా నిలబడ్డారు. తమ పదవులేమీ ప్రభావం చూపగలిగేంత పెద్దవి కాదు. అయినా సరే విశ్వసనీయతకే వారు పట్టం కట్టారు. గోడ దూకిన బడా ఆసాములు ఈ పరిణామం తర్వాత ఎలా తలెత్తుకుంటారో చూడాలి. ‘స్టేట్‌ టెర్రరిజమ్‌’ అనదగ్గ స్థాయిలో నిర్బంధకాండను ప్రయోగించినా ఈ క్షేత్రస్థాయి ప్రతినిధులు దృఢంగా నిలవడానికి రెండు ముఖ్యమైన కారణాలు కనిపి స్తున్నాయి. మొదటిది – రెండు నెలల క్రితం పార్టీ కార్య కర్తలనుద్దేశించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం. కార్యకర్తలెవరూ అధైర్యపడవలసిన అవసరం లేదనీ, వారికి తాను అండగా నిలబడతాననీ ప్రకటించారు. జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తాడో చేసి చూపెడతానని భరోసా ఇచ్చారు.జగన్‌ ప్రకటన తర్వాత గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలకు మంచి ప్రేరణ లభించిందనీ, వారు ధైర్యంగా నిలబడుతున్నారనీ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండో ప్రధాన కారణం – క్షేత్రస్థాయి వాస్తవికత. ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి చేసిన బూటకపు హామీల బండారం ప్రజ లందరికీ అర్థమైంది. వైసీపీ సర్కార్‌ మీదా, జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగతంగా కూటమి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రజాశ్రేణులు ఇప్పుడు భావిస్తున్నాయి. మోసపోయామన్న భావన వారిని వెంటాడుతున్నది. ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నది. వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి భయపడటం లేదు. బహిరంగంగానే కూటమి సర్కార్‌ను విమర్శిస్తున్నారు. ఈ పరిణామం కూడా వైసీపీ కార్యకర్తలు ఎదురొడ్డి నిలబడేందుకు దోహదపడింది.జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూటమి సర్కార్‌ తన ధోరణిని మార్చుకోకపోగా అదే అసత్య ప్రచారాన్ని మరింత ఎక్కువగా ఆశ్రయిస్తున్నది. తేలిపోయిన ఆరోపణల్నే మళ్లీ మళ్లీ ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అప్పుల లెక్కల్ని గుర్తు చేసుకుంటూ జనం నవ్వుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. శనివారం నాడు జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అలవాటు ప్రకారం అప్పుల కథను మరోసారి వినిపించారు. ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లున్న అప్పు, గవర్నర్‌ ప్రసంగంలో 10 లక్షల కోట్లుగా మారి, బడ్జెట్‌ ప్రసంగంలో ఏడు లక్షల కోట్లుగా రూపాంతరం చెంది, ఆవిర్భావ సభలో తొమ్మిదిన్నర లక్షల కోట్లుగా పరిణామం చెందింది.అప్పుల కథతోపాటు అసలు విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. ‘‘బయట నుండి (ప్రభుత్వంలోకి రాకముందు) చూసినప్పుడు ‘సూపర్‌ సిక్స్‌’ హామీలను అమలు చేయవచ్చని అనుకున్నా, ఇప్పుడు చూస్తే తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పుంది. దీనిపై వడ్డీ కట్టాలి. ఇప్పుడు సంక్షేమాన్ని అమలుచేస్తే మధ్యలోనే ఆగిపోతుంది. కనుక ముందుగా అభివృద్ధి చేసి, వచ్చే ఆదాయంతో సంక్షేమం చేద్దా’’మని ఈ సభలో చెప్పుకొచ్చారు.ఈ తూచ్‌ మంత్రాన్ని ఆయన ఆవిర్భావ సభలో మాత్రమే చెప్పలేదు. ఈ వార్షిక బడ్జెట్‌లో కూడా ఆయన దీన్ని పొందు పరిచారు. కాకపోతే అంకెల్లో చెప్పడం వల్ల సరిగ్గా అర్థం కాలేదు. ‘సూపర్‌ సిక్స్‌’గా పేర్కొన్న ఆరు అంశాలను ఆయన చెప్పి నట్టుగా అమలు చేస్తే 70 వేల కోట్ల పైచిలుకు నిధులు అవసరమవుతాయని అంచనా. అయితే బడ్జెట్‌ కేటాయింపుల్లో మాత్రం 17 వేల కోట్లు మాత్రమే చూపెట్టారు. కేటాయింపు చూపినంత మాత్రాన అమలు చేస్తారని అర్థం కాదు. గత బడ్జెట్‌లో కూడా ‘తల్లికి వందనం’, ‘అన్నదాతా సుఖీభవ’ పథకాలకు అరకొర కేటాయింపులు చూపెట్టారు. కానీ,అందులో అణా పైసలు కూడా ఖర్చుపెట్టలేదన్నది జనం అనుభవంలోకి వచ్చిన సత్యం.మొన్నటి మంగళవారం జోలెతో పాడుకున్న వేలంతో కలిపి తొమ్మిదిన్నర మాసాల్లో బాబు సర్కార్‌ ఒక లక్షా 52 వేల కోట్ల పైచిలుకు అప్పులు చేసి జాతీయ రికార్డును నెలకొల్పింది. ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు 98,088 కోట్లయితే, ష్యూరిటీ సంతకం పెట్టి కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 23,700 కోట్లు, ఇక రాజధాని పేరుతో ఇప్పటివరకు చేసిన అప్పు 31,000 కోట్లు. వెరసి 1,52,788 కోట్లు. ఇంతటి జగదేక అప్పారావు ప్రభుత్వం జగన్‌ సర్కార్‌ను అప్పులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రచారం చేయబూనడాన్ని దాష్టీకం అనాలో, దగుల్బాజీతనం అనాలో తెలుసుకోవాలి. ఈ అప్పుల చిట్టా వ్యవహారం ఇక ఎంతమాత్రమూ దాచేస్తే దాగేది కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇస్తున్న సమాచారాన్ని బట్టి, కాగ్‌ రిపోర్టుల ఆధారంగా, బడ్జెట్‌ పత్రాల సాక్షిగా జనంలోకి వాస్తవాలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని జగన్‌ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిందన్న ప్రచారాన్ని ఇప్పుడెవ్వరూ నమ్మడం లేదు.జగన్‌ ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరిగిందనే మాట చంద్రబాబుకు ఊతపదంగా మారింది. చివరికి కలెక్టర్ల సమా వేశంలో కూడా ‘గత ప్రభుత్వం విధ్వంసం చేసింద’ని మాట్లా డారు. ఇలా కలెక్టర్ల సమావేశాన్ని రాజకీయాలకు వాడుకున్న ముఖ్యమంత్రి ఈయన తప్ప మరొకరు ఉండకపోవచ్చు. తాను చెప్పిందే వేదం, తన పచ్చ కోడి కూస్తేనే సమాచారం తెలిసేది అనే భ్రమల్లోంచి ఆయనింకా బయటపడలేదు. పదేపదే అబద్ధాన్ని వల్లెవేస్తే అది నిజమైపోతుందనే పాతకాలపు గోబెల్స్‌ థియరీని పట్టుకొని వేళ్లాడుతున్నారు. ఇప్పుడు విధ్వంసం గురించి ఎక్కువ మాట్లాడితే జనం రికార్డుల్ని తిరగేస్తారు.విధ్వంసం ఎవరిదో వికాసం ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుంటారు. సమాచారం ఇప్పుడు ఎవరి ప్రైవేట్‌ ప్రాపర్టీ కాదు. అది ప్రజల హక్కు.పౌరుల భావప్రకటనా స్వేచ్ఛపై శుక్రవారం నాడు సర్వో న్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అధికార మత్తులో జోగుతున్న మన వ్యవస్థలకు కనువిప్పు కావాలి. భావ ప్రకటనా స్వాతంత్య్రం లేనినాడు రాజ్యాంగం హామీ పడిన గౌరవ ప్రదమైన జీవన హక్కు సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది. ఈ హక్కును రక్షించడంలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు హితవు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ అనే కాంగ్రెస్‌ ఎంపీ పెట్టిన పోస్టుపై గుజరాత్‌ పోలీసులు పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ తీర్పుపై సంపాదకీయం రాసిన ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ‘కేసును కొట్టివేయడంలో ఆశ్చర్యం లేదు. అసలు సుప్రీంకోర్టు దాకా ఈ కేసు రావడమే దిగ్భ్రాంతిని కలిగిస్తు న్నద’ని వ్యాఖ్యానించింది. ప్రతాప్‌గఢీ పెట్టిన పోస్టుకూ,ఆంధ్రాలో ప్రేమ్‌ కుమార్‌ అనే దళిత యువకుడి సోషల్‌ మీడియా పోస్టుకూ సారూప్యతలున్నాయి. కానీ ఆ యువకుడిని మన పోలీసు యంత్రాంగం ఎంతగా వేధించిందో తెలిసిందే. ఇప్పటి కైనా పోలీస్‌ యంత్రాంగం జీ హుజూర్‌ పద్ధతుల్ని విడిచి పెట్టక పోతే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని గ్రహిస్తే మంచిది. పోలీసు యంత్రాంగానికే కాదు... రెడ్‌బుక్‌ వంటి గ్రంథాల రచయితలకు కూడా సుప్రీం వ్యాఖ్యలు వాతలు పెట్టినట్టే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Majority of homebuyers opt for plots for first-time investments: Magicbricks6
ఓపెన్‌ ప్లాటా.. అపార్ట్‌మెంటా?

ఓపెన్‌ ప్లాటా? అపార్ట్‌మెంటా? ఎందులో పెట్టుబడులకు ఆసక్తి ఉందనే ప్రశ్నకు సగానికి పైగా తొలిసారి ప్రాపర్టీ కొనుగోలుదారుల అభిప్రాయం ఓపెన్‌ ప్లాటనే సమాధానం. 58 శాతం మంది కస్టమర్లు స్థలం మీద పెట్టుబడులకు మొగ్గు చూపిస్తున్నారని మ్యాజిక్‌ బ్రిక్స్‌ సర్వేలో తేలింది. దీర్ఘకాలిక మూలధన లాభాలు, అధిక రాబడులే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని సుమారు 2,200 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. ఇందులో 17.1 శాతం మంది కస్టమర్లు పెట్టుబడులకు రెండో ప్రాధాన్యత ఆస్తిగా వాణిజ్య స్థలాలను ఎంచుకున్నారు. ఓపెన్‌ ప్లాట్లలో అత్యధికంగా బెంగళూరు స్థలాలకు డిమాండ్‌ ఉంది. 36.5 శాతంతో గ్రీన్‌ సిటీ అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై ప్లాట్లకు 11 శాతం, లక్నో స్థలాలకు 8.9 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. 1,000–2,000 చ.అ. మధ్య తరహా ప్లాట్లకు 46.76 శాతం డిమాండ్‌ ఉంది. రూ.50 లక్షల వరకూ.. రూ.50 లక్షల వరకు ధర ఉండే స్థలాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 50.83 శాతం మంది ప్లాట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్‌లో షాద్‌నగర్, కడ్తాల్, సదాశివపేట వంటి ప్రాంతాలలో ప్లాట్ల సరఫరా అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్లాట్ల సగటు ధర చ.అ.కు రూ.2,765గా ఉంది. లక్నోలో రూ.2,836, చెన్నైలో రూ.3,208లు పలుకుతున్నాయి. అత్యధికంగా నోయిడాలో రూ.22,523, గుర్గావ్‌లో రూ.21,901లతో ఖరీదైన మార్కెట్లుగా ఉన్నాయి.

India sends 15 tonnes of relief material to quake-hit Myanmar7
ఆపరేషన్‌ బ్రహ్మ.. మయన్మార్‌కు భారత్‌ ఆపన్నహస్తం

న్యూఢిల్లీ: భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు అంతర్జాతీయ సాయం వెల్లువెత్తుతోంది. ఈ విషయంలో తక్షణం స్పందించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయక సామగ్రి తదితరాలు అందజేసేందుకు ఆపరేషన్‌ బ్రహ్మ పేరిట హుటాహుటిన రంగంలోకి దిగింది. టెంట్లు, స్లీపింగ్‌ బ్యాగు లు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, వాటర్‌ ప్యూరిఫయర్లు, సోలార్‌లైట్లు, జెనరేటర్‌ సెట్లు, అత్యవసర ఔషధాల వంటివాటితో కూడిన 15 టన్నుల సహాయక సామగ్రిని శనివారం తెల్లవారుజామున మూడింటికే సైనిక విమానాల్లో మయన్మార్‌కు పంపింది. ఉదయం 8 గంటలకల్లా వాటిని స్థానికంగా బాధిత ప్రాంతాలకు పంపే కార్యక్రమం మొదలైపోయింది. అంతేగాక 118 మంది వైద్య తదితర సిబ్బందితో కూడిన పూర్తిస్థాయి ఫీల్డ్‌ ఆస్పత్రిని కూడా వాయుమార్గాన శనివారం రాత్రికల్లా మయన్మార్‌కు తరలించింది! వాళ్లంతా ఇప్పటికే మాండలే ప్రాంతంలో రంగంలోకి దిగా రు. గాయపడ్డ వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. మరో రెండు వాయుసేన విమానాల్లో మరింత సామగ్రిని పంపుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేగాక మరో 40 టన్నుల సామగ్రిని ఐఎన్‌ఎస్‌ సాత్పురా, ఐఎన్‌ఎస్‌ సావిత్రి నౌకల్లో యాంగూన్‌కు తరలిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. కమాండెంట్‌ పి.కె.తివారీ నేతృత్వంలో 80 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అన్వేషక, విపత్తు సహాయక బృందాలు శనివారం సాయంత్రానికే బాధిత ప్రాంతాలకు చేరుకుని రంగంలోకి కూడా దిగాయని చెప్పారు. ‘‘రెస్క్యూ డాగ్స్‌ కూడా వెంట వెళ్లాయి. వాయు మార్గాన ఆరు అంబులెన్సులను తరలిస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. చైనా, రష్యా, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి కూడా సహాయక సామగ్రి మయన్మార్‌ చేరుతోంది. ఆ దేశంతో భారత్‌ 1,643 కి.మీ. పొడవైన సరిహద్దును పంచుకుంటుంది. అందుకే ‘బ్రహ్మ’ ‘‘బ్రహ్మ సృష్టికర్త. తీవ్ర విధ్వంసం బారిన పడ్డ మయన్మార్‌లో వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ జరగాలన్నది భారత్‌ ఆకాంక్ష. అందుకే ఈ సహాయక ఆపరేషన్‌కు బ్రహ్మ అని పేరు పెట్టాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్‌ జైస్వాల్‌ మీడియాకు వివరించారు. మరింత సాయం పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు. గతేడాది యాగీ తుపానుతో అతలాకుతలమైనప్పుడు కూడా మయన్మార్‌కు భారత్‌ ఇలాగే తక్షణం ఆపన్నహస్తం అందించిందని గుర్తు చేశారు. సహాయక సామగ్రి బాధిత ప్రాంతాలకు తక్షణం చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మయన్మార్‌ సైనిక పాలకుడు జనరల్‌ మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు.

Donald Trump Big Twist To Foreign Students In USA8
వీసా రద్దు చేశాం.. తక్షణం వెళ్లిపోండి

వాషింగ్టన్‌: అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమరి్థంచే వాళ్లెవరూ ఇక్కడ ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలంటూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దుచేసింది. వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్, అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌(సీబీపీ) యాప్‌ లో నమోదుచేసుకుని స్వీయబహిష్కరణ ద్వారా అమెరికాను వదిలివెళ్లాలంటూ ఆయా వి ద్యార్థులకు ఈ–మెయిళ్లు, టెక్ట్స్‌ సందేశాలను పంపించింది. ఇలా బహిష్కరణ సందేశాలను అందుకున్న వారిలో భారతీయ విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న లక్షలాది భారతీయ విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. గాజా యుద్ధంలో హమాస్‌కు, పాలస్తీనియన్లకు మద్దతు పలకడం, ఇజ్రాయెల్‌ను విమర్శించడం, యుద్ధం విషయంలో ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ సంబంధిత సోషల్‌ మీడియా పోస్ట్‌లను సోషల్‌ మీడియా ఖాతాల్లో లైక్‌ చేయడం, షేర్‌ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి వీసాలను రద్దుచేశామని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌(డీఓఎస్‌) ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్‌–1 వీసాను రద్దుచేస్తూ సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్‌ పంపించింది. ఈ సందర్బంగా ‘‘అమెరికా శరణార్థి, జాతీయత చట్టంలోని సెక్షన్‌ 221(ఐ) ప్రకారం మీ ఎఫ్‌–1 వీసా గడువును తక్షణం ముగిస్తున్నాం. అమెరికాను వీడటానికి ముందు కచ్చితతంగా అమెరికా ఎంబసీ/కాన్సులేట్‌లో మీ పాస్‌పోర్ట్‌ను చూపించండి. వాళ్లు మీ వీసాను స్వయంగా రద్దు చేస్తారు. ఆ తర్వాత సీబీపీ యాప్‌ సాయంతో స్వీయబహిష్కరణ విధానాన్ని వాడుకుని అమెరికాను వీడండి. అలా వెళ్లకపోతే మీమే మిమ్మల్ని బలవంతంగా బహిష్కరిస్తాం. మేం పంపితే మీ స్వదేశానికే పంపకపోవచ్చు. మా వీలును బట్టి మాకు అనువైన మరేదైనా దేశానికి తరలించే వీలుంది’’ అని ఈ–మెయిల్‌ సందేశంలో ప్రభుత్వం పేర్కొంది. 2023–24 ఏడాదికి విదేశీ విద్యార్థులకు సంబంధించిన ‘ఓపెన్‌ డోర్స్‌’నివేదిక ప్రకారం అమెరికాలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. వారిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులే.

Janhvi Kapoor Collaborate with Rahul Mishra For Lakme Fashion Week9
కోటు తొలగిస్తూ 'జాన్వీ కపూర్‌' ర్యాంప్‌ వాక్‌.. వీడియో వైరల్‌

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2025లో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్ తన గ్లామర్‌ వాక్‌తో హీట్‌ పెంచింది. ప్ర‌ముఖ ఇండియ‌న్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ రాహుల్ మిశ్రాకు నటి జాన్వీ షోస్టాపర్‌గా నిలిచింది. ఆయన డిజైన్‌ చేసిన దుస్తులను ఎందరో మోడల్స్‌ ధరించి పలు స్టేజీలపైనా ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఇప్పుడు తొలిసారి జాన్వీ కూడా రాహుల్‌ మిశ్రా డిజైన్‌ చేసిన దుస్తులను ధరించి లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ఆకట్టుకుంది.జాన్వీ కపూర్‌ నల్లటి దుస్తుల్లో ర్యాంప్‌పై నడిచింది. పొడవాటి నల్లటి కోటు కింద అద్భుతమైన బంధానీ బాడీకాన్ డ్రెస్‌లో స్టేజీపై ఆమె అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె హీల్స్ కూడా ఎంచుకుంది. స్టేజీపై మధ్యలోనే జాన్వీ తన కోటు తీసేసి పోజులిచ్చింది. కొంతదూరం అలా తన ర్యాంప్ వాక్‌ను కొనసాగించింది. డ్రెస్‌ డిజైనర్‌ బ్రాండ్‌ (AFEW Rahul Mishra) కోసం జాన్వీ భాగమైంది. భవిష్యత్‌లో మరిన్ని కొత్త డిజైన్‌ డ్రెస్‌లతో ఆమె ఫోజులు ఇవ్వనుంది.ఆమె ఆకర్షణీయమైన దుస్తులు, డైనమిక్ స్టైల్‌తో పాటు అక్కడ వినిపించే సంగీతం అన్నీ ఒకదానికొకటి ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. జాన్వీ ర్యాంప్‌ వాక్‌పై చాలా వరకు ప్రశంసలే వచ్చాయి. కానీ, కొందరు మాత్రం ఆమెను తప్పుపట్టారు. వేదికపై నిజమైన మోడల్స్ ఎక్కడ ఉన్నారంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇలాంటి వేదికలపై సెలబ్రిటీలకు ఇలా ప్రాధాన్యత ఇవ్వడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని చెబుతున్నారు. ఇలా అయితే కొత్త మోడల్స్‌ ఎలా పరిచయం అవుతారని నిర్వాహకులను తప్పపట్టారు. View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Bollywood Chronicle (@bollywoodchronicle)

Case against Bangladesh Sheikh Hasina10
బంగ్లా షేక్‌ హసీనాకు బిగ్‌ షాక్‌

ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనుస్‌ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ బంగ్లాదేశ్‌ పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనాపై కేసు నమోదైంది. హసీనా, మరో 72 మందిపై క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్టుమెంట్‌(సీఐడీ) ఢాకాలోని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ సీఐడీని గురువారం కోరిందన్నారు.ఈ సందర్బంగా ‘జోయ్‌ బంగ్లా బ్రిగేడ్‌’పేరుతో ఏర్పాటైన ఆన్‌లైన్‌ వేదికపై 2024 డిసెంబర్‌ 19వ తేదీన కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్దం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారము ఉందని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్‌ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్‌ సమావేశం నిర్ణయించిందన్నారు.షేక్‌ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్‌ తమకు లభ్యమైనట్లు సీఐడీ తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్‌ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా, యూనుస్‌ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement