ప్రధాన వార్తలు

రూ.లక్ష కోట్ల దోపిడీకి మళ్లీ ‘స్టార్టప్’
సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పునరుద్ధరణే ఎజెండాగా సీఎంచంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. తనయుడు, మంత్రి నారా లోకేశ్, పురపాలక మంత్రి నారాయణతో కలిసి శనివారం నుంచి ఆరు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వరకు గతంలో సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయనతో కలిసి రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు చంద్రబాబు. అయితే, ‘ఫార్ములా–1 కార్ రేసింగ్ ఒప్పందం’లో ముడుపులు తీసుకున్న కేసులో ఈశ్వరన్ జైలుకెళ్లారు. జూన్ 5న విడుదలయ్యారు. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రణాళిక అమలుకు చంద్రబాబు సిద్ధమయ్యారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా ఎవరిని తెరపైకి తెస్తారు..? తన మిత్రుడు ఈశ్వరన్‌తో అధికారికంగా భేటీ అవుతారా? లేదంటే అనధికారికంగా కలుస్తారా? అన్నది తేలాల్సి ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కాదు.. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన కోటరీకి లీక్ చేసి ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి చంద్రబాబు, ఆయన బినామీలు తక్కువ ధరకే రైతుల భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. ఇక ఈశ్వరన్ తనకు ప్రాణ స్నేహితుడని.. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిందంటూ గొప్పలు పోయారు. ఈశ్వరన్‌తో కలిసి మరో దోపిడీకి తెరతీశారు. అదే రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కుంభకోణం ఇదీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కింద 1,691 ఎకరాలను సింగపూర్ సంస్థల కన్సార్షియంకు ప్రభుత్వం అప్పగిస్తుంది. 371 ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సి ఉంటుంది. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలను సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది. మిగతా 1,070 ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు. » సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీ (కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటు చేసే ఏడీపీ (అమరావతి డెవలప్మెంట్ పార్టనర్)కి ప్రభుత్వం 1,691 ఎకరాలను అప్పగించింది. ఎకరం రూ.4 కోట్లు (కనీస ధర)గా నిర్ణయించింది. మొత్తం విలువ రూ.6,764 కోట్లు. » ఈ భూమికి రోడ్లు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి సదుపాయాలన్నీ ప్రభుత్వం సొంత ఖర్చు రూ.5,500 కోట్లతో కల్పిస్తుంది. ఏడీపీలో సీసీడీఎంసీ వాటాగా రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ మొత్తం రూ.12,485.90 కోట్ల పెట్టుబడిలో సీసీఎండీసీకి దక్కే వాటా 42 శాతమే. » కేవలం రూ.306 కోట్లు మాత్రమే పెట్టే సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. సింగపూర్ కన్సార్షియంకు తొలుత 50, తర్వాత 200 ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు నాటి చంద్రబాబు సర్కార్ అంగీకరించింది. కన్సార్షియం ముసుగులో... » 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థల కన్సార్షియం నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. ఈ విధానం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు ఆక్షేపించింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సింగపూర్ సంస్థల కన్సార్షియం గోప్యంగా ఉంచడం ఏమిటని అక్షింతలు వేసి స్టే ఇచ్చింది. అయినా, నాటి రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ఉంచేందుకే ప్రయత్నించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.66 వేల కోట్లు. » సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందిస్తుందని చెప్పిన మాస్టర్ ప్లాన్ పనులను సింగపూర్ సంస్థలు ‘సుర్బానా–జురాంగ్’కు రూ.28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. దీన్ని తప్పుపడుతూ 2023లో కాగ్ నివేదిక ఇవ్వడం గమనార్హం. » రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి తొలి విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటానే ఇస్తామని పేర్కొన్నారు. ఈ ప్రకారం స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం మాత్రమే వాటా దక్కనుండగా కన్సార్షియానికి 91.3 శాతం వాటా లభిస్తుందని స్పష్టమైంది. వాస్తవానికి కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ సహకరించారు. మరోవైపు పైసా పెట్టుబడి పెట్టకుండా బాబు బినామీల గుప్పిట్లోని మేనేజ్మెంట్ కంపెనీ, సింగపూర్ సంస్థల కన్సార్షియంలు రూ.కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే కనీసంగా రూ.66 వేల కోట్లు కొల్లగొడుతుంటే 54 వేల ఎకరాల (రైతుల నుంచి సమీకరించిన 34 వేల ఎకరాలు, ప్రభుత్వ అ«దీనంలోని 20 వేల ఎకరాలు) రాజధాని నిర్మాణంలో ఎన్ని లక్షల కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారో ఊహకు కూడా అందని విషయం. » స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్షియంకు కట్టబెడుతూ 2017 మే 15న చంద్రబాబు సర్కార్ ఒప్పందం చేసుకుంది. 54 వేల ఎకరాలు మాత్రమే కాదు.. రెండో దశ పేరుతో 14 వేల ఎకరాలను సమీకరించాలని, రాజధాని ప్రాంతంలోని 31 వేల ఎకరాల అటవీ భూమినీ అప్పగించాలంటూ చంద్రబాబు నాడు కేంద్రాన్ని కోరారు. మేనేజ్మెంట్ కంపెనీ పేరిట... స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీలతో ఏర్పాటయ్యే ఏడీపీ చేపడుతుంది. ఇక ప్లాట్ల విక్రయం వ్యవహారాలు చూసేందుకు ఓ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. సింగపూర్ కంపెనీల ప్రతినిధులు, చంద్రబాబు బినామీలే సభ్యులుగా ఉంటారు. ఎవరికి, ఎంతకు విక్రయించాలనేది మేనేజ్మెంట్ కంపెనీ చూస్తుంది. మామూలుగా ప్లాట్లు వేసి అమ్మడంలో ఖర్చు ఎకరాకు రూ.50 లక్షలు మించదు. కానీ, ఇక్కడ ఎకరాకు రూ.2 కోట్లు చూపించడం గమనార్హం. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3,137 కోట్లు ఖర్చవుతుందన్నది వీరి అంచనా. ఇందులో రూ.1,255.40 కోట్లను ప్రచార ఖర్చులు, కన్సల్టెన్సీ , డెవలప్మెంట్, మేనేజ్మెంట్ ఫీజు, వేతనాల కింద మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో చంద్రబాబు బినామీలు, సింగపూర్ సంస్థల కన్సార్షియం కొట్టేసేందుకు స్కెచ్ వేశాయి. వింత వింత నిబంధనలతో... స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు 20 ఏళ్లు అమల్లో ఉంటుంది. ముందుగా ప్రభుత్వం రద్దు చేస్తే కన్సార్షియం పెట్టుబడికి 150 శాతం మేర అపరాధ రుసుం చెల్లించాలి. ఆ సంస్థల బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లించాలి. కన్సార్షియమే వైదొలగినా కూడా వాటి పెట్టుబడిని 100 శాతం ప్రభుత్వం చెల్లించాలి. బ్యాంకు రుణాలనూ కట్టాలి. పైగా వివాదం తలెత్తితే లండన్ కోర్టులో తేల్చుకోవాలి. అంటే, స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పూర్తిగా సింగపూర్ కన్సార్షియం చేతుల్లో ఉండేలా ప్లాన్ చేశారు. చెప్పుచేతల్లో ఉండే మేనేజ్మెంట్ కంపెనీయే లావాదేవీలను చూస్తుంది కాబట్టి ఎకరం రూ.20 కోట్లకు అమ్మినా అడిగేవారుండరు. ఎకరం రూ.50 కోట్ల చొప్పున 1,070 ఎకరాలను అమ్మి రూ.53,500 కోట్లను చంద్రబాబు అండ్ కో సింగపూర్ సంస్థల కన్సార్షియం సొమ్ము చేసుకోవడానికి ప్లాన్ వేశాయి. తొలుత 50, రెండో దశలో 200 ఎకరాలను కన్సార్షియంకు ఉచితంగా కట్టబెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.50 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.12,500 కోట్ల మేర సొమ్ము చేసుకోవడానికి ఆ సంస్థలు ప్లాన్ వేశాయి. అంటే గరిష్టంగా రూ.లక్ష కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు కాజేయడానికి పథకం పన్నాయని స్పష్టమవుతోంది. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే ఈ స్థాయిలో దోచుకుంటే 34 వేల ఎకరాల రాజధానిలో ఇంకే స్థాయిలో దోపిడీ చేయడానికి ప్లాన్ వేశారన్నది అంచనాలకే అందడం లేదు.కుంభకోణం గుట్టు రట్టవుతుందని... స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌కు... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడంతో తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆందోళన చెందింది. దాంతో 2019 అక్టోబర్ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది.

పిల్లలకు ప్రత్యక్ష నరకం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని 3,878 ప్రభుత్వ వసతి గృహాలు(హాస్టల్స్), గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడుపు నిండా తిండి లేక, రాత్రిళ్లు నిద్ర లేక సతమతమవుతున్నారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల పప్పు, సాంబారుతోనే పిల్లలకు భోజనం పెడుతున్నారు. అధిక శాతం హాస్టళ్లకు ఇప్పటిదాకా దుప్పట్లు, దోమ తెరలు పంపిణీ కాలేదు. సరిపడా స్నానపు గదులు, మరుగు దొడ్లు లేక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాలికలైతే ఉదయాన్నే వాష్ రూమ్‌ల ఎదుట క్యూ కడుతున్నారు. బాలురైతే ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. సమయానికి డైట్ చార్జీలను ప్రభుత్వం ఇవ్వక పోవడంతో మెనూలో నాణ్యత పూర్తిగా లోపించింది. చాలా మంది వార్డెన్లు సరుకులు అప్పుగా తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో చెడిపోయిన, నాణ్యత లేని కూరగాయలతో వంట చేస్తున్నారు. ఫలితంగా ఆహారం కలుషితమై పిల్లలు తరచూ రోగాలబారిన పడుతున్నారు. చాలా హాస్టళ్లు భోజనాలకే పరిమితమవుతున్నాయి. వసతులు లేనందున రాత్రిళ్లు పిల్లలు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కళాశాలకు వెళ్లే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. ఉదయాన్నే వంట పూర్తి కాక చాలా మంది పస్తులుంటున్నారు. మరికొన్ని చోట్ల కేవలం తెల్లన్నం బాక్స్‌లో పెట్టుకుని వెళ్తున్నారు. మరోవైపు కాస్మొటిక్ చార్జీలు కూడా అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. చాలా హాస్టళ్లు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. సమీపంలోనే మురుగు నీటిలో పందులు తిరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లను ‘సాక్షి’ బృందం సందర్శించినప్పుడు దాదాపు అన్ని హాస్టళ్లలో ఇదే దుస్థితి కనిపించింది. అన్నీ బకాయిలే ప్రతి సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి ఒక దుప్పటి, ఒక కార్పెట్, రెండు టవళ్లు, ప్లేటు, గ్లాసు, బౌలు, ట్రంకు పెట్టె ఇవ్వాల్సి ఉండగా, అరకొరగా అందించి అయ్యిందనిపించారు. ఒక్కొక్కరికి రూ.46 చొప్పున డైట్ బిల్లు (మెస్ చార్జీలు) సైతం సకాలంలో ఇవ్వకుండా పెండింగ్ పెడుతున్నారు. దీన్ని సాకుగా తీసుకున్న హాస్టల్, గురుకులాల నిర్వాహకులు విద్యార్థులకు అందించే మెనూలో కోత పెడుతున్నారు. ప్రతి రోజు అందించాల్సిన గుడ్డు, వేరుశనగ చిక్కీ, వారానికి రెండు సార్లు చికెన్ సైతం సరిగా ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.ప్రతి నెలా ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు, బార్బర్ ఖర్చులను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ అద్దె భవనాలకు సైతం ఐదు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో హాస్టల్, గురుకులానికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు చొప్పున ఏడాదికి ముందే ఇవ్వాల్సిన కంటింజెంట్ బిల్స్ కూడా మంజూరు చేయకపోవడంతో స్టేషనరీ, నిత్యావసర వస్తువులు, హెల్త్ కిట్స్, రిపేర్లు వంటి అత్యవసరమైన వాటికి అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,878 ప్రభుత్వ వసతి గృహాలు(హాస్టల్స్), గురుకుల విద్యాలయాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 6,35,864 మంది విద్యార్థులు అవస్థలపాలవుతున్నారు. వసతుల లేమి, ఆరోగ్య సమస్యలు, నిర్వహణ వైఫల్యం, ఆర్థిక సమస్యలు విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు సైతం ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. హాస్టల్స్, గురుకులాల్లో ఉండే పేద పిల్లలకు మెరుగైన వసతులు కల్పిస్తామంటూ కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. మెనూ కచ్చితంగా అమలుకాకపోగా చాలా చోట్ల కలుషిత ఆహారం, నిల్వ ఆహారంతో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనకాపల్లి, శ్రీకాకుళం, తిరుపతి, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లోని వసతి గృహాలు, గురుకులాల్లో కలుషిత ఆహారం కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంత్రుల సొంతూళ్లలోనూ అదే దుస్థితి 230 మందికి ఆరు చిన్న గదులు.. నీటి కొరత, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, మంచాలు లేక కటిక నేలపైనే నిద్ర, అధ్వానంగా మరుగుదొడ్లు ఇదీ సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సొంత జిల్లా ప్రకాశంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితి. ఒంగోలు బాలికల వసతి గృహాల్లో ఉదయం మరుగుదొడ్ల వద్ద భారీ క్యూ కనిపిస్తోంది. దీంతో సమయానికి కళాశాలకు వెళ్లలేకపోతున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని హాస్టళ్లలో పారిశుద్ధ్య లేమి, తలుపులు లేని మరుగుదొడ్లు, విరిగిపోయిన బల్లలు, కలుషిత తాగునీరు, విద్యుత్ కోతలు, దోమల బెడద.. తదితర సమస్యల మధ్య విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అన్ని సౌకర్యాలు కల్పించామని అధికార కూటమి ప్రజాప్రతినిధులు మాత్రం ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారు. భోజనం తినలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ హాస్టళ్లలో పిల్లలు నేలపైనే నిద్రిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోని హాస్టళ్లలో మంచి నీటి సౌకర్యం సరిగా లేదు. మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదు. రాయలసీమ జిల్లాల్లోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించక పోవడంతో సమస్యలు తాండవిస్తున్నాయి. విద్యార్థులకు సరిపడా గదులు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలికల హాస్టళ్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక శాఖలకు చెందిన బీసీ సంక్షేమశాఖ, ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రులు ఉన్నా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయం. చాలా చోట్ల బాత్రూంలు శుభ్రంగా ఉంచక పోవడంతో విద్యార్థులు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. భద్రత గాలికి.. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న భావితరం భద్రతను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాల నిర్వహణలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏడాది కాలంగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ వైఫల్యం, పర్యవేక్షణ లోపంతో కలుషిత ఆహారం కారణంగా బాల్యం అనారోగ్యం పాలవుతోంది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 జూలైలో జీవో నెంబర్ 46 జారీ చేసింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాలు, గురుకులాలు తదితర విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ, వాటిని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పేద విద్యార్థుల భద్రత, భవిత ఇబ్బందుల్లో పడింది. నోట్లో ముద్ద పెట్టుకోవాలంటే భయం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రధానంగా భోజనంలో నాణ్యత పూర్తిగా లోపించింది. మచిలీపట్నంలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో తాగునీటి సౌకర్యం సరిగా లేదు. ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు చినిగిపోయాయి. దుప్పట్లు ఇంత వరకు పంపిణీ చేయలేదు. మరుగుదొడ్ల నిర్వహణ ఘోరంగా ఉంది. పెడన బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో ఎవరూ ఉండటం లేదు. పిల్లలు రోజూ ఉదయం టిఫిన్, రాత్రి భోజనం చేసి వెళ్లిపోతున్నారు. గుడివాడలో పిల్లలకు దోమతెరలు, గన్నవరంలో దుప్పట్లు ఇంత వరకు ఇవ్వలేదు. వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థులు చలికి వణికిపోతున్నారు. పొన్నూరులోని హాస్టళ్లలో పాడైన కూరగాయలతో చేసిన కూరలు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వండిన కూర ఉదయం కూడా పెడుతుండడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల పట్టణంలోని ఓ హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సౌకర్యాలు కల్పించాలి భీమవరం డీఎన్ఆర్ కళాశాలలో బీటెక్ చదువుతూ బీసీ బాలుర హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్లో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేదు. బెడ్లు లేక కింద పడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. కాస్మోటిక్స్ డబ్బులు కూడా జమ కావడం లేదు. సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి. – కె.గోపి, బీటెక్ విద్యార్థి,బీసీ బాలుర హాస్టల్–1, భీమవరం నేల మీదే నిద్ర గదిలోని గచ్చు మీద పడుకోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయి. మంచాలు లేవు, కనీసం పరుపులైనా ఇవ్వలేదు. గచ్చు మీద పడుకోవడంతో చీమలు, జెర్రిలు, ఇతర పురుగులతో ఇబ్బందులు పడుతున్నాం. – నాగవంశం సందీప్, పదో తరగతి, ఎస్సీ బాలుర వసతి గృహం, కొత్తూరు బ్యాగ్ కొనుక్కొని తెచ్చా మా వసతి గృహంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాస్మొటిక్స్ చార్జీలు, దుప్పట్లు, టవల్స్ త్వరితగతిన అందజేయాలి. హైస్కూల్లో ఇచ్చిన స్కూల్ బ్యాగు చిరిగిపోయింది. దీంతో నేను కొనుక్కున్న బ్యాగులో పుస్తకాలు పెట్టుకుంటున్నాను. నేనే కాదు నా మిత్రులు కూడా సొంత బ్యాగులు తెచ్చుకుంటున్నారు. – ఎం కార్తీక్, పదో తరగతి విద్యార్థి, సమీకృత వసతి గృహం, మచిలీపట్నం, కృష్ణాజిల్లా

ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.విదియ రా.11.23 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఆశ్లేష సా.5.28 వరకు తదుపరి మఖ, వర్జ్యం: ఉ.6.14 నుండి 7.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి 7.17 వరకు, అమృతఘడియలు: ప.3.54 నుండి 5.24 వరకు.సూర్యోదయం : 5.40సూర్యాస్తమయం : 6.32రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. బంధుమిత్రులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.వృషభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.మిథునం: ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.కర్కాటకం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.సింహం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు.కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. నూతన పరిచయాలు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.తుల: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. కీలక సమాచారం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మరింత సానుకూలం.వృశ్చికం: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. దైవదర్శనాలు.ధనుస్సు: కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారులు నిదానం పాటించాలి. ఉద్యోగులకు పనిభారం తప్పదు.మకరం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు.కుంభం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. పరపతి పెరుగుతుంది. కార్యజయం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.మీనం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మిత్రులతో మాటపట్టింపులు.

అదో పనికిరాని సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పనికి రానిదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చెబుతున్న 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో డొంకతిరుగుడు ప్రచారంతో సీఎం రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీలు బీసీలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగబద్ధమైనవి కాకుండా ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ తూతూమంత్రంగా చేసినట్టు తాము దేశవ్యాప్తంగా చేపట్టబోయే కులగణన ఉండదన్నారు. రాజ్యాంగబద్ధమైన కులగణన చేసి, భవిష్యత్‌లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, అజారుద్దీన్ వంటి వారికోసమే రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు. కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్ హేళన చేయడాన్ని ఆక్షేపించారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.1972లో లంబాడీలను ఎస్టీల్లో చేర్చారు అంటే వారు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా అంటూ ప్రశ్నించారు. 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారమే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ఏ సామాజికవర్గానికి చెందిన వారో సీఎం రేవంత్ చెప్పాలన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.వేరేవారికి నీతులు చెప్పే రేవంత్‌రెడ్డి ముందు సీఎం పదవికి రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. మెట్రో విషయంలో రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాలన్న అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారని, మెట్రోకు వందశాతం కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకు ఇవ్వాలన్న డిమాండ్‌ను స్వాగతిస్తున్నామన్నారు.

అరకోటి మంది ఓటర్లెక్కడ?
బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా నవీకరణ సుప్రీంకోర్టులో విచారణ దశలోనే వున్నా, పార్లమెంటులో అలజడి రేగుతున్నాఆ ప్రక్రియ తన దోవన తాను ముందుకెళ్తున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ గురువారం ఆ వ్యవహారం గురించి వెల్లడించిన వివరాల ప్రకారం, లక్షమందికి పైగా ఓటర్ల ఆచూకీ లేదు. 21.6 లక్షల మంది మరణించారు. మరో 31.5 లక్షల మంది శాశ్వతంగా వేరే చోటుకు వలసపోయారు. పోలింగ్ కేంద్రం స్థాయి అధికారులు (బీఎల్ఓలు) అడుగుతున్నా, మరో ఏడు లక్షల మంది ఇంతవరకూ తమ పత్రాలు దాఖలు చేయలేదు. తాము ఫలానా చోట ఉంటు న్నామని రుజువులు చూపక పోయినా, బతికే ఉన్నామని చెప్పకపోయినా లేదా తగిన పత్రాలుఅందజేయక పోయినా ఈ 61 లక్షల మంది ఓటర్లు జాబితా నుంచి శాశ్వతంగా కనుమరుగవుతారు. రాష్ట్ర ఓటర్లలో వీరు 7.7 శాతం. శుక్రవారం సాయంత్రంతో వీరందరికీ గడువు ముగిసిపోయింది. సవరించిన ఓటర్ల జాబితా ఆగస్టు 1న విడుదలవుతుంది. అయితే సెప్టెంబర్ 1లోగా ఎవరైనా జాబితాలో తమ పేరు లేదని ఫిర్యాదు చేస్తే పరిశీలించి, తగిన పత్రాలున్న పక్షంలో వారిని చేర్చి తుది జాబితా విడుదల చేస్తారు. నకిలీ లేదా విదేశీయులుగా గుర్తించిన వారిని తొలగించటం కోసం ప్రారంభించిన ఈ ప్రక్రియ దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ‘పరిశుద్ధమైన’ ఓటర్ల జాబితా రూప కల్పనే తమ లక్ష్యమని జ్ఞానేశ్ చెబుతున్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడవాలంటే మెజారిటీ ఆమోదం పొందిన ప్రభుత్వాలు ఏర్పడాలి.ప్రజల ఆదరణ ఉన్నవారే పాలకులు కావాలి. నకిలీ ఓటర్లు లేదా ఈ దేశ పౌరులు కానివారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే స్థితి ఉంటే ఆ ఎన్నికలే ప్రహసన ప్రాయమవుతాయి. ఎన్నికలు సజావుగా పూర్తవుతున్నాయన్న భావన వల్లే ఫలితాలు వెలువడ్డాక అధికార మార్పిడి శాంతియుతంగా పూర్తవుతోంది. గత దశాబ్దాలతో పోలిస్తే ఎన్నికల హింస గణనీయంగా తగ్గింది. ఇలాంటి కారణాల వల్లే విదేశాల ఎన్నికలకు మన ఈసీ అధికారులు పరిశీలకులుగా వెళ్తున్నారు. వారు సూచిస్తున్న మార్పులకు ఎంతో విలువ ఉంటున్నది. కానీ గత ఏడాది, రెండేళ్లుగా ఈసీ వ్యవహార శైలిపై విమర్శలూ, ఆరోపణలూ వెల్లువెత్తు తున్నాయి. వాటిపై అసలే స్పందించకపోవటం లేదా మరిన్ని సందేహాలు కలిగే రీతిలో జవాబీ యటం రాజకీయ పక్షాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. బిహార్ ఎన్నికల జాబితా సంగతే తీసుకుంటే సుప్రీంకోర్టు సూచించిన ఆధార్, రేషన్ కార్డు వగైరాలు పరిశీలనకు పనికి రావని అది ఎందుకు తిరస్కరించిందో అంతుపట్టదు. ఆధార్‌ను ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమని, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినాఉంటుందన్నారు. కానీ జరుగుతున్నది అందుకు విరుద్ధం. మరి విశ్వసనీయత లేని ఆధార్‌ను అన్నిటికీ అనుసంధానం చేయటం ఎందుకు? ఇప్పటికీ ఆ కార్డు సంపాదించటానికి సాధారణ పౌరులు తలకిందులవుతున్నారు. పుట్టిన చోటే నవజాత శిశువులకు ఆధార్ అందేలా తాజాగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటువంటి కార్డు ఓటరు గుర్తింపునకు పనికిరాదని ఈసీ ఎలా చెబుతుందో అర్థంకాని విషయం. పౌరుల్ని గుర్తించటమనే ప్రక్రియ అన్యులకు ఆసాధ్యమని, కేవలం తామే సమర్థులమని ఆ సంస్థ చెప్పదల్చుకుంటే దాన్నెవరూ అంగీకరించరు.ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తటంపై ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మహారాష్ట్ర, హరియాణాల వరకూ ఎన్ని ఉదాహరణలైనా చూపొచ్చు. ఏపీ సంగతే తీసుకుంటే... అక్కడ ఓటింగ్‌కు గడువు ముగిసి కేవలం ప్రాంగణంలో ఉన్న వారితో పోలింగ్ పూర్తి చేయటానికి అర్ధరాత్రి వరకూ సమయం పట్టింది. అలా వేచివున్నవారి సంఖ్య ఏకంగా 51 లక్షలు! ఇది నమ్మేలా ఉందా? ఇక పోలింగ్ శాతంపై మొదటి, చివరి ఈసీ ప్రకటనల్లోని అంకెల మధ్య 12.5 శాతం తేడావచ్చింది. ఇది గతంలో ఎప్పుడూ ఒక శాతం మించిలేదు. ఇందువల్ల సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో అదనంగా 28,000 ఓట్లు, లోక్‌సభ స్థానంలో 1.96 లక్షల ఓట్లు అమాంతం పెరిగి పోయాయి. తటస్థ సంస్థల లెక్కల ప్రకారం ఇది 87 అసెంబ్లీ స్థానాల గెలుపోటముల్ని తారుమారు చేసింది! వేరే రాష్ట్రాల్లోనూ ఇలాంటి ధోరణే కనబడిందని అక్కడి విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ సందేహాలకు సక్రమమైన జవాబు చెబితే బిహార్‌లో చేపట్టిన ‘సర్’పై పెద్దగా అభ్యంతరాలు వచ్చేవి కాదేమో! కానీ ఆ సంస్థ తనకు తోచినప్పుడు మాట్లాడటం తప్ప జవాబుదారీతనాన్నీ, బాధ్యతాయుత వర్తననూ కనబరచటం లేదు. సందేహాలు పటాపంచలు చేద్దామన్న పట్టుదలను ప్రదర్శించటం లేదు. ఈసీ న్యాయబద్ధంగానే వ్యవహరిస్తున్నాననుకోవచ్చు. కానీ అలా అందరూ అనుకునేలా తన వ్యవహార శైలి వుండాలి. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థకైనా ఇది తప్పనిసరి.అందునా ప్రభుత్వాల తలరాతలను మార్చే కీలకమైన వ్యవస్థగా ఉన్న ఈసీకి ఇది మరింత ప్రాణప్రదం. దేశంలో ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచి వలసలు ఎక్కువుంటాయి. అలాంటిచోటఇంత తక్కువ వ్యవధిలో ఎక్కడెక్కడినుంచో పనులు మానుకుని వచ్చి ఓటర్లుగా నమోదు చేసు కోవటానికి అవసరమైన పత్రాలు సేకరించి సమర్పించటం బడుగు జీవులకు సాధ్యమేనా? అందుకే సర్వోన్నత న్యాయస్థానం సూచించిన ఇతర ప్రత్యామ్నాయాల గురించి కూడా ఈసీ పరిశీలించాలి. ఈ మాదిరి సవరణకు దేశవ్యాప్త ఆదరణ లభించాలంటే ఇది తప్పనిసరి.

మాల్దీవులతో బలీయ బంధం
మాలె: భారత్, మాల్దీవ్స్ విశ్వసనీయమైన మిత్రదేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మాల్దీవ్స్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని, ద్వీప దేశానికి రూ.4,850 కోట్ల రుణం(లైన్ ఆఫ్ క్రెడిట్) ఇవ్వబోతున్నామని ప్రకటించారు. శుక్రవారం మాల్దీవ్స్ రాజధాని మాలెలో ప్రధాని మోదీ, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ నుంచి శుక్రవారం ఉదయం మాల్దీవులకు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో మొహమ్మద్ ముయిజ్జుతోపాటు సీనియర్ మంత్రులు ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్ స్క్వేర్‌లో మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఇండియా–మాల్దీవ్స్ మధ్య కొన్ని రోజుల క్రితం సంబంధాలు బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. సైనిక సామర్థ్యం పెంపునకు సహకారం మాల్దీవులతో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ అమలు చేస్తున్న ‘పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’, ‘మహాసాగర్’ విధానాల్లో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ఒక కొలమానం అని వివరించారు. మాల్దీవుల సైనిక సామర్థ్యం పెంపునకు భారత్ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి స్వా గతం పలకడం తన హృదయాన్ని హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.రక్షణ శాఖ కార్యాలయం ప్రారంభం ఇండియా–మాల్దీవ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక తపాళ బిళ్లను మోదీ, ముయిజ్జు ఆవిష్కరించారు. వేర్వేరు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మాల్దీవ్స్‌లో భారత యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి మరో ఒప్పందం కుదిరింది. రూ.4,850 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌పై రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మాలె సిటీలో రక్షణ శాఖ కార్యాలయాన్ని మోదీ, ముయిజ్జు ప్రారంభించారు.

టెస్టు చేజారిపోతోంది!
మాంచెస్టర్‌లో మూడు రోజూ భారత్‌కు నిరాశ తప్పలేదు. ఇంగ్లండ్ దూకుడు కొనసాగగా, పస లేని బౌలింగ్‌తో భారత్ డీలా పడింది. రూట్ రికార్డుల సెంచరీకి తోడు పోప్, స్టోక్స్ కూడా రాణించడంతో ఆతిథ్య జట్టు పూర్తిగా పైచేయి సాధించింది. మన బౌలర్లు 89 ఓవర్లు శ్రమించి ఐదు వికెట్లు తీయగలిగినా... ఇంగ్లండ్ ఆధిక్యం దాదాపు రెండు వందలకు చేరింది. ఈ స్థితిలో నాలుగో రోజు ప్రత్యర్థిని వీలైనంత వేగంగా నిలువరించడంతో పాటు మిగిలిన లోటును పూరించేందుకు మన బ్యాటర్లు పోరాడాల్సి ఉంటుంది. మాంచెస్టర్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ఆ జట్టు ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. జో రూట్ (248 బంతుల్లో 150; 14 ఫోర్లు) భారీ సెంచరీతో కదం తొక్కగా... ఒలీ పోప్ (128 బంతుల్లో 71; 7 ఫోర్లు), బెన్ స్టోక్స్ (134 బంతుల్లో 77 బ్యాటింగ్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. పోప్‌తో మూడో వికెట్‌కు 144 పరుగులు జోడించిన రూట్... ఐదో వికెట్‌కు స్టోక్స్‌తో 142 పరుగులు జత చేశాడు. స్టోక్స్‌తో పాటు డాసన్ (21 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. వికెట్ కోల్పోకుండా... ఓవర్‌నైట్ స్కోరు 225/2తో ఆట కొనసాగించిన పోప్, రూట్ ఇంగ్లండ్‌ను మరింత మెరుగైన స్థితికి చేర్చారు. రెండో రోజు తరహాలోనే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. రూట్ 22 పరుగుల వద్ద ఉన్నప్పుడు సులువైన రనౌట్ చేసే అవకాశం వచ్చినా భారత్ చేజార్చుకుంది. సిరాజ్ బౌలింగ్‌లో రూట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడగా... మరోవైపు నుంచి పోప్ దూసుకొచ్చాడు. దాంతోఆలస్యంగా రూట్ పరుగు కోసం వెళ్లాల్సి వచ్చింది. జడేజా విసిరిన బంతి నాన్‌స్ట్రయికింగ్ స్టంప్స్‌కు నేరుగా తగల్లేదు. అయితే దగ్గరలో ఒక్క బ్యాకప్ ఫీల్డర్ ఉన్నా రూట్ రనౌటయ్యేవాడు! దీనిపై జడేజా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 93 బంతుల్లో పోప్ హాఫ్ సెంచరీని అందుకోగా, 99 బంతుల్లో రూట్ అర్ధసెంచరీ పూర్తయింది. తొలి సెషన్లో భారత్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా, ఇంగ్లండ్ 28 ఓవర్లలో 107 పరుగులు చేసింది. సుందర్ ఆలస్యంగా వచ్చినా... రెండో రోజు ఆటలో భారత్ 46 ఓవర్లు వేయగా, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం చర్చకు దారి తీసింది. మూడో రోజు కూడా చాలా ఆలస్యంగా లంచ్‌కు కాస్త ముందు అతనికి కెప్టెన్ బంతిని అప్పగించాడు. ఇన్నింగ్స్ 69వ ఓవర్‌తో సుందర్ మొదలుపెట్టాడు. అప్పటికే జడేజా 12 ఓవర్లు వేశాడు. అయితే రెండో సెషన్ మొదలు కాగానే సుందర్ తన విలువేమిటో చూపించాడు.8 పరుగుల వ్యవధిలో అతను 2 వికెట్లు తీసి భారత్‌కు ఊరట అందించాడు. సుందర్ వేసిన చక్కటి బంతిని ఆడలేక పోప్ స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇవ్వగా... షాట్ కోసం ముందుకొచ్చిన బ్రూక్ (3) స్టంపౌటయ్యాడు. స్పిన్‌కు వికెట్లు దక్కడంతో భారత్ కొత్త బంతిని తీసుకోవడంలో 10 ఓవర్లు ఆలస్యం చేసింది. అయితే రూట్, స్టోక్స్ కలిసి మళ్లీ ఇంగ్లండ్‌ను ముందంజలో నిలిపారు. కంబోజ్ వేసిన బంతిని ఫైన్‌లెగ్ దిశగా ఆడి బౌండరీ రాబట్టడంతో 178 బంతుల్లో రూట్ శతకం పూర్తయింది. రెండో సెషన్లో ఇంగ్లండ్ 28 ఓవర్లలో 2 వికెట్లు చేజార్చుకొని 101 పరుగులు సాధించింది. మరో 3 వికెట్లు... టీ తర్వాత కూడా రూట్, స్టోక్స్ భాగస్వామ్యం కొనసాగింది. భారత బౌలర్లు వీరిని ఇబ్బంది పెట్టడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో 97 బంతుల్లో స్టోక్స్ ఈ సిరీస్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయితే కొద్ది సేపటికే తీవ్ర అలసటతో అతను రిటైర్డ్‌హర్ట్‌గా మైదానం వీడాడు. మరోవైపు 150 మార్క్‌ను అందుకున్న వెంటనే రూట్... జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి డిఫెన్స్ ఆడబోయి స్టంపౌటయ్యాడు. సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న జేమీ స్మిత్ (9), క్రిస్ వోక్స్ (4) కూడా తక్కువ వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఈ దశలో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్... డాసన్‌తో కలిసి జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించాడు. చివరి సెషన్లో ఇంగ్లండ్ 33 ఓవర్లలో 111 పరుగులు సాధించింది. మూడో రోజు 89 ఓవర్లు ఆడిన జట్టు 3.58 రన్‌రేట్‌తో 319 పరుగులు చేసింది.స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 358ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) జడేజా 84; డకెట్ (సి) (సబ్) జురేల్ (బి) కంబోజ్ 94; పోప్ (సి) రాహుల్ (బి) సుందర్ 71; రూట్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) జడేజా 150; బ్రూక్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) సుందర్ 3; స్టోక్స్ (బ్యాటింగ్) 77; స్మిత్ (సి) (సబ్) జురేల్ (బి) బుమ్రా 9; డాసన్ (బ్యాటింగ్) 21; వోక్స్ (బి) సిరాజ్ 4; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (135 ఓవర్లలో 7 వికెట్లకు) 544.వికెట్ల పతనం: 1–166, 2–197, 3–341, 4–349, 5–499, 6–515, 7–528.బౌలింగ్: బుమ్రా 28–5–95–1, అన్షుల్ కంబోజ్ 18–1–89–1, సిరాజ్ 26–4–113–1, శార్దుల్ 11–0–55–0, జడేజా 33–0–117–2, సుందర్ 19–4–57–2.

అమెరికా కొరివితో తల గోక్కుందామా?
అమెరికాతో కుదుర్చుకొనే వాణిజ్య ఒప్పందాలపై కీలకమైన చర్చలు జరపడానికి భారత విదేశీ వాణిజ్య శాఖకు చెందిన ఓబృందం అమెరికాలో పర్యటించి ఇటీవలనే స్వదేశం చేరుకొంది. అమెరికా కొన్ని నిర్దిష్ట మైన చర్యల్ని ప్రతిపాదిస్తోంది. ప్రధానంగా ఎగుమతులు, దిగుమతులపై భారత్ విధి స్తున్న అన్ని రకాల ఆంక్షల్ని ఎత్తివేయాలని పట్టుబడుతున్నది. అమెరికా సూచనలను, పెంచుతున్న ఒత్తిళ్లను ఇప్పటివరకూ భారత్ అంగీకరించకపోవటం ఊరట కలిగించేదే. కాగా, ఆగస్ట్ మొదటి వారంలోనే తుది నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత భారత్ ముందుంది. అమెరికా ఒత్తిడి మేరకు వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాలను ‘ఓపెన్ అప్’ చేసినట్లయితే... భారత్ నుంచి ఎగుమతుల మాట అటుంచి, అమెరికా నుంచి అన్ని రకాల వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తుతాయి. ప్రారంభంలో మెట్రోలు, తర్వాత దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలలో అమెరికా పండ్లు, కూరగాయలు... చివరకు ఆకుకూరలు, పూలు దర్శన మిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ముందు స్వేచ్ఛ, అటుపై సంకెళ్లు1990 ముందువరకు ‘జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అంటే టారిఫ్ (గాట్) వ్యవస్థ అధ్యక్షుడు ఆర్థర్ డంకెల్ ప్రతిపాదించినఅంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య సమాజంలో భారత్ భాగస్వామి కాలేదు. కానీ, 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాకదేశంలో మొదలైన ఆర్థిక సంస్కరణల పర్వంలో భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భాగస్వామి అయింది. దీనివల్ల్ల మన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగి మంచి ధర లొస్తాయనీ, నాసిరకం స్వదేశీ వస్తువులకు బదులుగా మేలు రకం విదేశీ వస్తువులు కారుచౌకగా అందుబాటులోకి వస్తాయనీ పాలకులు ఊదరగొట్టారు. బహుళజాతి సంస్థల ఉత్పత్తులు మనతో పాటు కొన్ని వర్ధమాన దేశాల్లో కొంత మేర చౌకగా లభించిన మాట నిజం. అయితే, దానివల్ల స్వదేశీ సంస్థలు శీఘ్రగతిన తమ ప్రాభ వాన్ని కోల్పోయాయి. అనేకం మూతబడ్డాయి. మరికొన్నింటిని బహుళజాతి సంస్థలే హస్తగతం చేసుకొన్నాయి. మోన్శాంటో వంటి బహుళజాతి సంస్థలు దేశీయ విత్తన రంగాన్ని గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఏర్పడింది.ఇప్పుడు అమెరికాతో కుదుర్చుకొనే వాణిజ్య ఒప్పందంలో వ్యవ సాయం, పాల ఉత్పత్తులు కూడా భాగమైతే... దేశీయ రైతాంగంకుదేలవడం తథ్యం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ‘డెడ్ లైన్’ను లెక్క చేయకుండా భారత్ కచ్చితమైన వైఖరిని తీసుకోవా లనీ, లేదంటే అమెరికా వలలో ఇండోనేషియా చిక్కుకొన్నట్లుఅవుతుందనీ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్ఐ)’ ఇప్పటికే హెచ్చరించింది. ట్రంప్ వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఇండో నేషియా, కంబోడియా దేశాధినేతల్ని అమెరికా ఒప్పందాలకు అను కూలంగా సంతకాలు చేయించారని.. అటువంటి పరిస్థితి భారత్ తెచ్చు కోరాదని పలువురు వాణిజ్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇండోనేషియాలో ఏం జరిగింది?అమెరికాతో ఇండోనేషియా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం, అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై ఆ దేశంలో ప్రస్తుతం విధిస్తున్న సుంకాల్లో 99 శాతం కోతపడింది. దాంతో ఇండో నేషియా పారిశ్రామిక, సాంకేతిక, వ్యవసాయ ఉత్పత్తుల రంగాలపై అమెరికా గుత్తాధిపత్యం వహించే పరిస్థితి ఏర్పడింది. మరోవిధంగా చెప్పాలంటే... దాదాపు సున్నా సుంకాల కారణంగా ఇండోనేషియా మార్కెట్లను అమెరికా ఉత్పత్తులు ముంచెత్తుతాయి. అందువల్ల ఇండో నేషియాలో స్వదేశీ పరిశ్రమలకు గిరాకీ లేక మూతపడతాయి. అక్కడి వ్యవసాయదారులు ఇకపై వ్యవసాయం విరమించుకోవాల్సిందే. అయితే ట్రంప్ దయతలచి ఇండోనేషియా నుంచి వచ్చే ఉత్పత్తులపై తమ దేశంలో ప్రస్తుతం విధిస్తున్న 40% సుంకాలను 19%కు తగ్గించారు. అంటే, ఇండోనేషియాలోని అన్ని రకాల ఉత్పత్తి రంగాలు... అమెరికా ఎగుమతుల మీదనే ఆధారపడాలి. ఏదో సామెత చెప్పి నట్లు, చెయ్యోడిని వదిలి కాలోడిని పట్టుకొన్న చందంగా ఉంది.ప్రపంచంలోనే భారత్ వ్యవసాయ మార్కెట్ పెద్దది. ప్రస్తుతం దేశంలో 3,323 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పండుతుండగా, అందులో దేశీయ అవసరాలకు సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నులు ఖర్చవుతున్నట్లు అంచనా. సగటున ఏటా 45 నుంచి 50 బిలియన్ల డాలర్ల ఆహారోత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది.29 బిలియన్ల డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. ఇందులో పప్పుదినుసులు, వంటనూనెలు, పండ్లు, కూరగాయలు అధికం. దశాబ్దంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరుగుతున్నాయి. దానివల్ల వ్యవసాయ వాణిజ్య మిగులు క్రమేపీ తగ్గుతోంది. పప్పు ధాన్యాలు, వంటనూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు తగ్గిస్తూ... దిగుమతులపై విధించిన సుంకాలను గణనీయంగా తగ్గించడంతో కొందరు వ్యాపారస్తులు విదేశాల నుండి కారుచౌకగా వీటిని దిగుమతి చేసుకొంటూ దేశీయ రైతాంగం పొట్టకొడుతున్నారు. ఫలితంగా, రైతులు వీటి సాగును విరమించుకొంటున్నారు, లేదా తగ్గించుకొంటున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 50% క్షీణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.అమెరికాతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే... భారత్‌లోకి అమెరికా ఉత్పత్తులు మాత్రమే వస్తాయన్న గ్యారంటీ లేదు. చైనా లేదా మరికొన్ని దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసు కొని, వాటినే భారత్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే పరిస్థితి మరింత దుర్భరం అవుతుంది.భారత్ ఎగుమతి మార్కెట్లపై అమెరికా కన్నుభారత్ ఎగుమతి మార్కెట్లను సైతం అమెరికా దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా, జపాన్ పై విధించిన 25 శాతం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించారు. దానివల్ల జపాన్ ఇప్ప టివరకు భారత్ నుంచి దిగుమతి చేసుకొంటున్న బియ్యాన్ని కాదని, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి మొగ్గుచూపుతోంది.ఈ నేపథ్యంలోనే వాణిజ్య ఒప్పందాలలో వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను పూర్తిగా మినహాయించాలని ‘ఇండియన్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఫార్మర్స్ మూమెంట్ (ఐసీసీఎఫ్‌ఎం)’ కేంద్రా నికి విజ్ఞప్తి చేసింది. అమెరికా తన దేశీయ రైతాంగానికి ఏటా సగటున వ్యవసాయ బడ్జెట్లో 1.5 ట్రిలియన్ డాలర్ల మేర సబ్సిడీలుఅందిస్తూ, వాటిని విదేశీ మార్కెట్లలో లాభసాటిగా అమ్ముకోవడం ద్వారా సబ్సిడీల మొత్తానికి పదింతలు లాభాల్ని ఆర్జిస్తోంది. ఇటువంటి సూత్రాలను అన్ని రంగాలలో అమలు చేస్తున్న అమెరికాతో భారత్ సరైన ప్రాతిపదిక లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడంఅంటే కొరివితో తల గోక్కోవడమే.ప్రస్తుతం 70 కోట్ల మంది భారతీయులు బతుకు తెరువు కోసం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతున్నారు. దేశ ప్రజలకు ఆహార భద్రత అందిస్తూ, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, స్థిరమైన ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న వ్యవసాయ, పాడి రంగాలకుసంబంధించి తీసుకొనే ప్రతి నిర్ణయమూ జాతి ప్రయోజనాల కోణంలో ఉండాలి.-వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ కేంద్రమంత్రి-డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు

ఐదోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. విపక్ష సభ్యు లు ఆందోళనలు, నిరసనలు, నినాదాల కారణంగా వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం ఉభయ సభలు స్తంభించాయి. పలుమార్లు వాయిదా పడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై పార్లమెంట్లో వెంటనే చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశాయి. నినాదాలతో హోరెత్తించాయి. ప్రతిపక్షాల ఆగ్రహావేశాల వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో లోక్‌సభ, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తుతన్నట్లు సభాపతులు ప్రకటించారు. చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ జరగకుండానే వర్షాకాల సమావేశాల్లో తొలివారం ముగిసిపోవడం గమనార్హం. లోక్‌సభలో నినాదాల హోరు లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీనిపై చర్చకు విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. చేసేది లేక స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షాలు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఇప్పడే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. వారిపై జగదాంబికా పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సి సభలో ఈ అలజడి ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అన్నారు. సభ వాయిదా పడేలా చేయడం గొప్ప విషయం కాదని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోతే దేశమే నష్టపోతుందని చెప్పారు. చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. గోవాలో ఎస్టీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుపై చర్చిద్దామని న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెప్పారు. అయినా విపక్షాల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జగదాంబికా పాల్ ప్రకటించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ నేపథ్యంలో కార్గిల్ అమర వీరులకు లోక్‌సభలో నివాళులర్పించారు. ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ పార్లమెంట్ ఎగువ సభలోనూ విపక్షాల ఆందోళన యథాతథంగా కొనసాగింది. వివిధ అంశాలపై రూల్ 267 కింద చర్చను కోరుతూ విపక్షాలు ఇచ్చిన 28 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. దీనిపై సభలో తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ మొదలైన వెంటనే నినాదాలు మిన్నంటడడంతో రఘువంశ్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌పై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా కేకలు వేశారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను ఆపాలని డిమాండ్ చేశారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ అంటూ నినదించారు. కొందరు ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్లిపోవాలని, సభకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ ఘన్‌శ్యామ్ తివారీ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘన్‌శ్యామ్ తివారీ ప్రకటించారు. కమల్ హాసన్ ప్రమాణం ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌పీ) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డీఎంకే నాయకులు రాజాత్తి, ఎస్.ఆర్.శివలింగం, పి.విల్సన్ సైతం ఎగువ సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. విపక్షాల నిరసన బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పా ర్లమెంట్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. మకరద్వారం మెట్లపై వినూ త్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ అని రాసి ఉ న్న పత్రాలను చించివేసి, చెత్తకుండీలో విసి రేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఎస్ఐఆర్పై పార్లమెంట్లో చర్చించాలని తేల్చిచెప్పారు. సభకు సహకరించడానికి విపక్షాల అంగీకారం నిరసనలు, నినాదాలు పక్కనపెట్టి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇకపై సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం అన్ని పార్టీల సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరగా, ప్రతిపక్ష నాయకులు అందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి నిర్మాణాత్మక చర్చలు సాగిద్దామని స్పీకర్ సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది.

నిరుద్యోగ యువతకు దారుణంగా దగా
సాక్షి, అమరావతి : బడుగు, బలహీన వర్గాల యువతను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్), ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల స్వయం ఉపాధికి, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలిస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు, టీడీపీ నేతలు.. అధికారంలోకొచ్చాక మొండిచేయి చూపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను అన్ని సంక్షేమ శాఖలు కలిపి కనీసం రూ.4 వేల కోట్ల రుణాలివ్వాల్సి ఉంది. ఇందులో 50 శాతం ప్రభుత్వ సబ్సిడీగా ఇవ్వాలి. స్వయం ఉపాధి కోసం చిన్నపాటి పరిశ్రమలు, వ్యాపారాలు, వ్యవసాయ అనుబంధ సంస్థలు తదితర వాటికి యూనిట్‌కు రూ.50 వేల నుంచి రూ.8 లక్షల వరకు సబ్సిడీపై రుణాలిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా తెగ ప్రచారం చేశారు. ఆ తర్వాత బీసీ, అగ్రవర్ణ పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రుణాలిస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ప్రకటనలు గుప్పించారు. అర్హులైన వారంతా ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్, మానిటరింగ్ సిస్టమ్ (ఏపీఓబీఎంఎంఎస్) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తేదీలనూ ప్రకటించారు. కూటమి నేతల మాటలు నమ్మిన యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంది. కూటమి ఇచ్చిన హామీ ప్రకారం 2024, 2025 రెండేళ్లకు ఇప్పటికే రెండు పర్యాయాలు రుణాలివ్వాల్సి ఉంది. అయినా ఇప్పటి వరకు ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.బీసీ సంక్షేమ శాఖ మొండిచేయిబీసీలతో పాటు ఈడబ్ల్యూఎస్ (కాపు, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన)కు రూ.వెయ్యి కోట్ల సబ్సిడీ రుణాలు ఇస్తామని ఆర్భాటపు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం.. చివరకు మొండి చేయి చూపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు నెలల్లో 1.30 లక్షల మందికి సబ్సిడీ రుణాలిస్తున్నట్టు మంత్రి సవిత ప్రకటించారు. లబ్ధిదారుల వాటా, జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివద్ధి సంస్థ, బ్యాంకు రుణాలు కలిపి మొత్తం రూ.1,969.58 కోట్లు అవుతుందని, అందులో రూ.1,038.81 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఒక్కో యూనిట్‌కు పదికి పైగా దరఖాస్తులొచ్చాయి. చివరకు ముఖ్య నేత ఆదేశాలతో ఎవరికీ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది.వింత మెలికతో ఎస్సీలకు ఎగనామంఎస్సీల రుణాల విషయంలో ప్రభుత్వం వింత మెలిక పెట్టి మొత్తం పథకానికే ఎసరు పెట్టింది. పెద్ద సంఖ్యలో రుణాలు ఇస్తామంటూ దరఖాస్తులకు రెండు పర్యాయాలు గడువు పెంచిన ఎస్సీ కార్పొరేషన్.. ముగింపు గడువు ఎప్పుడో, రుణాలు ఎప్పుడిస్తారో అన్న విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్న ఆకాంక్షతో ఎస్సీ యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసింది. సుమారు రూ.410 కోట్ల సబ్సిడీ అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. రుణం మంజూరైన రెండేళ్లకు దానిని లబ్ధిదారులకు అందిస్తామంటూ మెలిక పెట్టడంతో అందరూ విస్తుపోతున్నారు. లబ్ధిదారుడి వాటా, ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణం మొత్తం కలిపితేనే ఎస్సీ యువత యూనిట్ పెట్టుకుని స్వయం ఉపాధి పొందగలదు. అయితే రుణాలు ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మెలిక పెట్టిందని ఎస్సీ వర్గాలు మండిపడుతున్నాయి.మైనార్టీలకూ ఇదే మోసంమైనార్టీ యువతకు అందించే రుణాలకూ ప్రభుత్వం ఇదే విధమైన మెలిక పెట్టింది. రాష్ట్రంలో 49,218 మందికి రూ.326 కోట్ల సబ్సిడీ రుణాలిస్తామంటూ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ గొప్పగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ద్వారా అందించే రుణాలకు ముందుగా బ్యాంకు రుణం పొందిన లబ్ధిదారులకు.. రెండేళ్ల తర్వాత పరిశీలించి సబ్సిడీ అందిస్తామని మెలిక పెట్టడంతో ముస్లిం మైనార్టీ వర్గాలు కంగుతిన్నాయి. రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు నాలుగు శ్లాబ్‌లలో సబ్సిడీ రుణాలు ఇస్తామనే ఆర్బాటం మినహా ఇప్పటి వరకు ఒక్క రుణమూ మంజూరు చేయలేదు.అడవి బిడ్డల పట్లా అలక్ష్యంబీసీలను మోసం చేసిన కూటమిబీసీలకు స్వయం ఉపాధి రుణాలు ఇస్తామని నమ్మించిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత గొంతు కోశారు. కూటమి నేతల మాటలు నమ్మిన చేతి వృత్తిదార్లు, పేద, మధ్య తరగతి ప్రజలు, ప్రధానంగా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వారందరినీ ప్రభుత్వం మోసం చేసింది. – చింతపల్లి గురుప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ కులాల ఐక్య వేదికకార్పొరేషన్ల నిధుల మళ్లింపు దారుణంకూటమి ప్రభుత్వం సబ్సిడీ రుణాలివ్వకుండా.. ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోంది. స్వయం ఉపాధి మార్గం ఎంచుకున్న యువత లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. – ఆండ్ర మాల్యాద్రి, రాష్ట్ర కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంజీవోలు అమలు చేయడం చేతకాలేదా?ముస్లిం మైనార్టీల స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలిస్తామని జీవో ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి దాన్ని అమలు చేయడం చేతకాలేదా? ముస్లిం మైనార్టీలను కూటమి ప్రభుత్వం మరోమారు మోసం చేసింది. 2018–19 మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఇదే తరహాలో ముస్లిం మైనార్టీ యువత నుంచి దరఖాస్తులు తీసుకుని.. చివరకు నిధులు విడుదల చేయకుండా మొండిచేయి చూపింది. – షేక్ నాగుల్ మీరా, రాష్ట్ర అధ్యక్షుడు, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితిఅడవి బిడ్డల పట్లా అలక్ష్యంగిరిజనులకు సబ్సిడీ రుణాల విషయంలో ప్రభుత్వం పూర్తి అలక్ష్యం ప్రదర్శిస్తోంది. గిరిజనుల స్వయం ఉపా«ధి కోసం గిరిజన ఆర్థిక సహకార సంస్థకు రూ.110 కోట్లు కేటాయించినట్టు లెక్కల్లో చూపినప్పటికీ.. ఇంతవరకు సబ్సిడీ రుణాలకు ఒక్క పైసా విదల్చలేదు. వారి స్వయం ఉపాధి కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న ఆలోచన చేయలేదు. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా వంచిస్తోంది.
... నిన్నొకరినే కాదమ్మా ఆయన ప్రపంచాన్నే అదోలా చూస్తున్నారు...!!
అరకోటి మంది ఓటర్లెక్కడ?
అమెరికా కొరివితో తల గోక్కుందామా?
ఫుట్‌బాల్‌లో డీలా... క్రికెట్లో ఇటలీల...
నగాల్ పునరాగమనం
ప్రపంచ బాక్సింగ్ పోటీలకు నిఖత్
ఓబీసీల కోసం ప్రత్యేక ప్రణాళిక
చివరి మజిలీ వీలునామా!
టెస్టు చేజారిపోతోంది!
అదో పనికిరాని సర్వే
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్‌కాట్ దెబ్బ
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
హరి హర వీరమల్లు.. హిట్టా..! ఫట్టా..!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
హైదరాబాద్‌లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఓటీటీలోకి 'టామ్ క్రూజ్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
అన్ని సార్లు అన్నా కూడా పాపం ‘నోబెల్’వాళ్లు గుర్తించలేద్సార్
సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు
‘హరి హర వీరమల్లు’ ట్విటర్ రివ్యూ
‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’
సర్టిఫికెట్లు ఇవ్వలేదు.. రిజిస్ట్రేషన్లు ఎలా?
లోటు నుంచి సాధారణం దిశగా..
నిరుద్యోగ యువతకు దారుణంగా దగా
లోక్‌సభలోనే అభిశంసన చర్యలు
డీలిమిటేషన్ పిటిషన్ కొట్టివేత
విద్యార్థుల ఆత్మహత్యలు వ్యవస్థాగత లోపమే: సుప్రీం
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం
హెచ్ఐవీకి సూదిమందు ఆమోదించిన ఈయూ
అమ్మకానికి ‘ఆయిల్ ఫెడ్’ ఫ్యాక్టరీ!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్‌కాట్ దెబ్బ
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
హైదరాబాద్‌లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఓటీటీలోకి 'టామ్ క్రూజ్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
అన్ని సార్లు అన్నా కూడా పాపం ‘నోబెల్’వాళ్లు గుర్తించలేద్సార్
సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు
‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’
‘హరి హర వీరమల్లు’ ట్విటర్ రివ్యూ
40 ఏళ్ల అంకుల్‌తో 10వ తరగతి విద్యార్థిని ప్రేమ..!
సినిమా

'స్క్విడ్ గేమ్‌లో బాహుబలి'.. తెగ నవ్వులు తెప్పిస్తోన్న వీడియో!
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఇప్పటికే మూడు సీజన్స్ రిలీజ్ కాగా.. అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. అయితే ఈ సిరీస్‌లో మన సినీతారలు నటిస్తే ఎలా ఉంటుందో చూపించే వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఏఐ సాయంతో పలువురు స్టార్స్‌తో స్క్విడ్ గేమ్ సిరీస్ వీడియోలు రూపొందించారు.అయితే మన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి- స్క్విడ్ గేమ్ కలిపి చూస్తే ఎలా ఉంటుంది. మీకు కూడా అలా చూడాలని అనిపిస్తోందా? అయితే ఈ వీడియో మీ కోసమే చేసినట్లు ఉంది. బాహుబలి- స్క్విడ్ గేమ్ సీన్స్‌ను కలిపి ఓ వీడియోను రూపొందించారు. బాహుబలి ఇన్ స్క్విడ్‌గేమ్ అంటూ సినిమా, వెబ్‌సిరీస్‌ను కలిపి క్రియేట్ చేసిన క్రాస్ ఓవర్ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. బాహుబలిలోని ప్రభాస్, కట్టప్ప స్క్విడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపించిన విధానం నవ్వులు తెప్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
టాలీవుడ్ నటి అనసూయ రెండు నెలల క్రితమే నూతన గృహ ప్రవేశం చేసింది. తమ జీవితంలో మరో అధ్యాయం మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా తమ కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టుకుంది. కొత్తింట్లో సంప్రదాయ పద్ధతిలో హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం నిర్వహించింది.అయితే గృహ ప్రవేశం మరో సంప్రదాయ శుభకార్యం నిర్వహించింది. తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మన ఆధ్యాత్మిక, వైదిక సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజాగా అనసూయ మరో సంప్రదాయం ఉట్టిపడేలా కుమారులిద్దరికీ స్నానాలు చేయించింది. మన సంస్కృతి ప్రతిబింబించేలా ప్రకృతి ఒడిలో కూర్చోబెట్టి నలుగు పెట్టి మరి స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.మన పూర్వీకులు/పెద్దలు మనల్ని అనుసరించమని చెప్పినా సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు పాటించాలని తెలిపింది. మన ఆచారాలను అనుసరించడంలో వచ్చే అపరిమితమైన విలువ, సారాంశం, అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుందని పోస్ట్ చేసింది. పిల్లలు పుట్టిన తొలినాళ్లలో ఈ ఆచారాలు పాటించానని తెలిపింది. మరోసారి ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తోంది అనసూయ. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

పెళ్లి చేసుకోలేదు.. తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికైనా..
ఆనందం సినిమా హీరోయిన్ గుర్తుందా? రేఖ వేదవ్యాస్ (Rekha Vedavyas).. 2001లో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమా ఆనందంతోనే సెన్సేషన్ అయింది. ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం.. పెళ్లికి రండి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 2014 తర్వాత వెండితెరకు గుడ్‌బై చెప్పిన ఈ బ్యూటీ రెండేళ్లక్రితం ఓ షోలో ప్రత్యక్షమైంది.రీఎంట్రీకి రెడీ..పూర్తిగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. అనారోగ్యంతోనే సన్నబడినట్లు ఆ షోలో వెల్లడించింది. తాజాగా ఆమె రీఎంట్రీకి రెడీగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేఖ వేదవ్యాస్ మాట్లాడుతూ.. చిన్నవయసులోనే కెరీర్ ప్రారంభించాను. నేను కన్నడ అమ్మాయి కావడంతో సాండల్‌వుడ్‌కు షిఫ్ట్ అయిపోయి అక్కడే ఎక్కువ సినిమాలు చేశాను. అప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేకపోవడంతో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. తీవ్ర అనారోగ్యంతో సమస్యలు2014 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాను. ఒకానొక సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. చాలా నరకం అనుభవించాను. చాలాకాలం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు భరించడం అంత ఈజీ కాదు. ఆ బిల్లులు చెల్లిండానికైనా మళ్లీ సినిమాలు చేయాల్సిందే! సినిమాలే కాదు.. యాక్టింగ్ పరంగా ఏ ప్రాజెక్టుల్లోనైనా నటిస్తాను.పెళ్లి చేసుకోలేదుఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలనుకుంటున్నాను. లేటుగా పెళ్లి చేసుకున్నా సరే ఆ బంధం జీవితాంతం కొనసాగేలా చూసుకుంటాను అని రేఖ వేదవ్యాస్ చెప్పుకొచ్చింది. ఇన్ని చెప్పింది కానీ, తనకు వచ్చిన వ్యాధి ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు. బాధల్ని చెప్పకపోవడమే మంచిదంటూ తన అనారోగ్యానికి గల కారణాన్ని సస్పెన్స్‌గానే ఉంచింది.చదవండి: అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్

'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కొన్నాళ్ల క్రితం మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఏడాదికో యానిమేటెడ్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి సినిమా 'మహావతార్: నరసింహ' నేడు(జులై 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూనిమేటెడ్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'మహావతార్: నరసింహ' కథేంటంటే..పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథ గురించి తెలిసిందే. విష్ణువు మూర్తి నరసింహ అవతారం(సగం మనిషి, సగం సింహం) ఎత్తి, భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. ఇదే కథను యానిమేషన్లో చూస్తే.. అదే మహావతార్: నరసింహ సినిమా.విశ్లేషణభక్త ప్రహ్లాద కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించిన 'భక్త ప్రహ్లాద' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ప్రహ్లాద కథ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి తెలిసింది. ఇలాంటి కథలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా'మహావతార్: నరసింహ'. కథనం మొత్తం యానిమేషన్‌తో నడుస్తుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. మహా విష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు..తమకున్న శక్తులతో దేవతలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భంలో బంధిస్తాడు. దీంతో విష్ణు మూర్తి వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు సంహరించి భూదేవిని తీసుకొస్తాడు. సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యకశిపుడు మరింత పగను పెంచుకుంటాడు. తీవ్రమైన తప్పస్సు చేసి బ్రహ్మాదేవుడి నుంచి తనకు భూమి, అకాశం పైన,దేవతలతో గాని, పశువులతోగానీ, పగలు గానీ రాత్రి గానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చకుంటాడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు. తండ్రికేమో విష్ణువు అంటే పడదు.. కొడుకుకేమో విష్ణుమూర్తే సర్వస్వం అన్నట్లుగా బతుకుతాడు. ఎంత నచ్చజెప్పిన విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు. చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహా అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి. దాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ చక్కగా వాడుకున్నాడు. భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్‌లో నరసింహ స్వామి ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోతుంది.హిరణ్యకశిపుడితో నరసింహాస్వామి చేసే యాక్షన్ తెరపై చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. యానిమేటెడ్ సినిమా అయినా సరే కొన్ని యాక్షన్ సీన్లకు థియేటర్స్‌లో విజిల్స్ పడతాయి. యానిమేషన్ పర్ఫెక్ట్గా కుదిరింది. తెరపై చూస్తుంటే కమర్షియల్ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. సామ్ సీ.ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎం అదిరిపోయింది. చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

రూట్ రికార్డు శతకం.. భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
Update: టీమిండియా-ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 77, లియాం డాసన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కంటే ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది.రూట్ రికార్డు శతకం: మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. 127 ఓవర్ల తర్వాత ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ రికార్డు శతకం (150) సాధించి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. అతనికి స్టోక్స్ (66 రిటైర్డ్ హర్ట్) అండగా నిలిచాడు. క్రిస్ వోక్స్ (2), లియామ్ డాసన్ (7) క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. 2, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

Fact Check: కరుణ్ నాయర్ నిజంగానే ఏడ్చాడా..?
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట సాగుతున్న వేల ఓ ఆసక్తికర ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటోలో టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ బాధపడుతూ (ఏడుస్తూ) ఉన్నట్లు కనిపించగా.. సహచరుడు కేఎల్ రాహుల్ అతన్ని ఓదారుస్తున్నట్లు కనిపించాడు. ఈ ఫోటో సోషల్‌మీడియాలో కొద్ది క్షణాల్లోనే వైరలైంది. ఇది చూసి క్రికెట్ అభిమానులు కరుణ్‌ను నాలుగో టెస్ట్ నుంచి తప్పించినందుకు ఏడుస్తున్నాడంటూ, బాధలో ఉన్న అతన్ని అతని ఆప్తమిత్రుడు కేఎల్ రాహుల్ ఓదారుస్తున్నాడంటూ ఊహించుకోవడం మొదలు పెట్టారు. దీనిపై ఫ్యాక్ట్ చేయగా అది నిజం కాదని తెలిసింది. వాస్తవానికి ఆ ఫోటో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా తీసిందని తేలింది. కరుణ్, రాహుల్ లార్డ్స్ బాల్కనీలో కూర్చున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో నాలుగో టెస్ట్ నుంచి తప్పించినందుకు కరుణ్ ఏడుస్తున్నాడన్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది.కాగా, కరుణ్ నాయర్ దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేసి ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో క్రికెట్ ఒక్క ఛాన్స్ అంటూ కరుణ్ చేసిన ఓ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలైంది. ఎట్టకేలకు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లండ్ పర్యటనలో తొలి మూడు టెస్ట్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న కరుణ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక జట్టులో (నాలుగో టెస్ట్) స్థానం కోల్పోయాడు. కరుణ్ స్థానంలో మేనేజ్మెంట్ నాలుగో టెస్ట్‌లో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వగా అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బరిలోకి దిగి బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో సాయి సుదర్శన్ భారత జట్టులో నంబర్-3 స్థానాన్ని ఖాయం చేసుకున్నాడని ప్రచారం మొదలైంది. ఇది పరోక్షంగా కరుణ్ కెరీర్ ముగిసినట్లేనన్న సంకేతాలిస్తుంది. కెరీర్ ముగిసిపోయిందన్న బాధలో కరుణ్ ఏడుస్తున్నాడని అభిమానులు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. వాస్తవానికి కరుణ్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా పెద్ద తప్పిదం. ప్రస్తుత పరిస్థితుల్లో అతని మరో అవకాశం రావడం దాదాపుగా అసాధ్యం. ఒకవేళ సాయి సుదర్శన్ కూడా తదుపరి మ్యాచ్‌ల్లో విఫలమైనా కరుణ్‌కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే తిలక్ వర్మ, సర్ఫరాజ్ ఖాన్ లాంటి యువకులతో పాటు శ్రేయస్ అయ్యర్ టెస్ట్ జట్టులో స్థానంలో కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్ కెరీర్ ముగిసిందనే చెప్పుకోవాలి.ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసేసింది. రూట్ రికార్డు సెంచరీతో ఆ జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసి 141 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ 150, జేమీ స్మిత్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 భారత ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

పాంటింగ్నూ దాటేసిన రూట్.. మిగిలింది సచిన్ ఒక్కడే
మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్న రూట్.. 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మరో దిగ్గజ ఆటగాడి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ స్కోర్ వద్ద రూట్ సచిన్ తర్వాత టెస్ట్‌ల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తోనే రాహుల్ ద్రవిడ్, జాక్ కల్లిస్, రికీ పాంటింగ్‌ను దాటేయడం విశేషం. ఇక రూట్ ముందున్న ఏకైక లక్ష్యం సచిన్ ఆల్‌టైమ్ రికార్డు ఒక్కటే. ఈ రికార్డును చేరుకోవాలంటే రూట్ మరో 2500 పైచిలుకు పరుగులు చేయాలి. ఇది ఈజీ కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921జో రూట్- 13380*రికీ పాంటింగ్- 13378జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు టీ విరామం సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 433/4గా ఉంది. రూట్ 121, స్టోక్స్ 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 75 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

38వ సెంచరీ పూర్తి చేసిన రూట్.. రికార్డుల జాతర
మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే రెండు భారీ రికార్డులు సాధించిన రూట్.. తాజాగా సెంచరీ పూర్తి చేసి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 178 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన రూట్.. టెస్ట్‌ల్లో 38వ శతకాన్ని, ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 56 శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీతో రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. సంగక్కర్ కూడా టెస్ట్‌ల్లో 38 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51), జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.ఈ ఇన్నింగ్స్‌లో రూట్ తొలుత టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్‌ను (13289) అధిగమించి మూడో స్థానానికి ఎగబాకాడు. ఆతర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసి టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్, జాక్ కల్లిస్‌ను దాటేసి రెండో స్థానానికి చేరాడు. తాజాగా సెంచరీ పూర్తి చేసి టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంగక్కరతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సింగిల్‌గా ఆరో స్థానంలో నిలిచాడు. ఈ సెంచరీకి ముందు రూట్, హాషిమ్ అమ్లా తలో 55 సెంచరీలతో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉండేవారు. 56వ సెంచరీతో రూట్ సింగిల్‌గా ఆరో స్థానానికి చేరాడు.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13358*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 119జో రూట్- 104రికీ పాంటింగ్- 103జాక్ కల్లిస్- 103రాహుల్ ద్రవిడ్- 99టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 51జాక్ కల్లిస్- 45రికీ పాంటింగ్- 41జో రూట్- 38కుమార సంగక్కర- 38అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-6 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 100విరాట్ కోహ్లి- 82రికీ పాంటింగ్- 71కుమార సంగక్కర- 63జాక్ కల్లిస్- 62జో రూట్- 56ఈ సెంచరీతో రూట్ సాధించిన మరిన్ని ఘనతలు..టెస్ట్‌ల్లో ఫాబ్-4 ఆటగాళ్లు చేసిన సెంచరీలురూట్-38 స్టీవ్ స్మిత్- 36కేన్ విలియమ్సన్- 33విరాట్ కోహ్లి- 30అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్ ఉండి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 82జో రూట్- 56రోహిత్ శర్మ- 49కేన్ విలియమ్సన్- 48స్టీవ్ స్మిత్- 48టెస్ట్‌ల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లురూట్- 12స్టీవ్ స్మిత్- 11గత ఐదేళ్లలో 21 సెంచరీలు చేసిన రూట్2021లో 62022లో 52023లో 22024లో 62025లో 2మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆటలో రూట్ సెంచరీ పూర్తి చేసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 407/4గా ఉంది. రూట్ 104, స్టోక్స్ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 49 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కుప్పకూలిన బజాజ్ షేర్లు
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇతర హెవీవెయిట్ షేర్ల బలహీనత మధ్య భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయంగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు (0.88 శాతం) నష్టపోయి 81,463.09 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్లు (0.9 శాతం) క్షీణించి 24,837 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో బజాజ్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ట్రెంట్ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలవగా సన్ ఫార్మా మాత్రమే లాభపడింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.61 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా (0.54 శాతం) మినహా అన్ని కౌంటర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ ఆటో 1.27 శాతం, నిఫ్టీ ఐటీ 1.42 శాతం, నిఫ్టీ మెటల్ 1.64 శాతం, నిఫ్టీ రియల్టీ 0.99 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.91 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.9 శాతం నష్టపోయాయి.దేశీయ మార్కెట్లో మార్కెట్ అస్థిరతకు కొలమానమైన ఇండియా వీఐఎక్స్ 5.15 శాతం లాభంతో 11.28 వద్ద ముగిసింది.

రూ.10 వేల లోపు కేటగిరిలో మరో కొత్త స్మార్ట్ ఫోన్
రూ.10 వేల లోపు కేటగిరిలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. హెచ్డీ+ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ64 వాటర్ రెసిస్టెన్స్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎన్ఎఫ్సీ, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ తో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ వివో టీ4 లైట్, పోకో ఎం7, లావా స్టార్మ్ ప్లే ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 ధర.. లభ్యత ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్ 4 జీబీ ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. దీని ధర రూ .6,799. ఐరిస్ బ్లూ, ట్విలైట్ గోల్డ్, టైటానియం సిల్వర్, స్లీక్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆగస్టు 2వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్పెసిఫికేషన్లుఇన్ఫినిక్స్ స్మార్ట్ 10లో 6.67 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.ఇది ఐపీ 64 వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది. అంటే ఫోన్‌పై దుమ్ము, నీటి చుక్కలు పడినా ఏమీ అవ్వదు కానీ నీటిలో పూర్తిగా మునిగిపోకుండా ఉండాలి.స్మార్ట్ 10 డీటీఎస్ ట్యూన్ చేసిన డ్యూయల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. 300% వాల్యూమ్ బూస్ట్ ను సపోర్ట్ చేస్తుంది.ఏ55 జీపీయూతో కూడిన యూనిసోక్ టీ7250 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఏడాది లాంచ్ అయిన ఇతర ఇన్ఫినిక్స్ ఫోన్ల మాదిరిగానే, ఈ స్మార్ట్ 10 ఆండ్రాయిడ్ 15 ఆధారిత కంపెనీ తాజా ఎక్స్ఓఎస్ 15 పై పనిచేస్తుంది.ఇందులో 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ ను 2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.ఆప్టిక్స్ విషయానికొస్తే, ఫోన్లలో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, వెనుక భాగంలో డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది. రియర్, ఫ్రంట్ కెమెరా రెండూ 2కే 30 ఎఫ్‌పీఎస్ వేగంతో వీడియోలను షూట్ చేయగలవు.15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

వేగంగా 1 లక్ష కార్లు ఎగుమతి చేసి రికార్డు
భారత ఆటోమొబైల్ తయారీలో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్ ఎగుమతుల్లో రికార్డు నెలకొల్పింది. భారతదేశం నుంచి వేగంగా 1 లక్ష ఎగుమతులను అధిగమించిన ఎస్‌యూవీగా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. 2023 జూన్‌లో ప్రపంచ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమైన కేవలం 25 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకుందని చెప్పింది.గుజరాత్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్రాంక్స్ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా విదేశీ మార్కెట్లలో బలమైన పనితీరును కనబరుస్తోందని కంపెనీ తెలిపింది. జపాన్‌లో దీనికి పెరుగుతున్న ప్రజాదరణ ఎగుమతి వృద్ధికి దోహదం చేసిందని చెప్పింది. మారుకీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. ‘ప్రపంచ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి వాహనాలను తయారు చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. మేక్ ఇన్ ఇండియా చొరవకు కంపెనీ సాధించిన విజయమే నిదర్శనం. ప్యాసింజర్ వాహన ఎగుమతులు, అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్‌పాట్2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే మారుతీ సుజుకీ 96,000 వాహనాలను ఎగుమతి చేయడం విశేషం. భారతదేశ ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో రికార్డు స్థాయిలో 47 శాతం వాటాను ఆక్రమించింది. వరుసగా నాలుగో ఏడాది భారతదేశపు టాప్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా కంపెనీ తన స్థానాన్ని నిలుపుకుంది.

ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్‌పాట్
భారత వ్యవసాయ రంగానికి ఇండియా-యూకే ఇటీవల సంతకం చేసిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈటీఏ) ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతుల్లో 95% యూకే మార్కెట్లో సుంకం లేకుండా అనుమతించే వీలుంది. ఇది భారతీయ రైతులు, వ్యవసాయ ఎగుమతిదారులకు మార్కెట్ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం వ్యవసాయానికి సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి.జీరో-డ్యూటీ యాక్సెస్బాస్మతి, బాస్మతియేతర బియ్యంపండ్లు మరియు కూరగాయలుమసాలా దినుసులు (పసుపు, మిరియాలు, యాలకులు)ప్రాసెస్ చేసిన ఆహారాలు (ఊరగాయలు, మసాలా మిశ్రమాలు, పండ్ల గుజ్జులు, రెడీ టు ఈట్ భోజనం)సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు, ట్యూనా, ఫిష్ మీల్, ఫిష్ ఫీడ్)పాడి, వంట నూనెలు, యాపిల్స్ సుంకం రాయితీ పరిధిలోకి రావు. ఇది కీలకమైన దేశీయ పరిశ్రమలను కాపాడుతుంది.గతంలో 70 శాతం వరకు దిగుమతి సుంకాలను ఎదుర్కొన్న ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు జీరో డ్యూటీ పరిధిలోకి రానున్నాయి.ఇదీ చదవండి: విస్కీ ధరలు తగ్గింపు..?వచ్చే మూడేళ్లలో యూకేకు భారత వ్యవసాయ ఎగుమతుల్లో 20% వృద్ధి నమోదవుతుందని అంచనా. ఇది భారతదేశం తన 100 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఎగుమతి లక్ష్యానికి చేరువ కావడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం 2.25 శాతం మాత్రమే ఉన్న బ్రిటన్ 5.4 బిలియన్ డాలర్ల సముద్ర దిగుమతుల్లో భారత్ వాటాను ఈ వాణిజ్య ఒప్పందం పెంచుతుందని భావిస్తున్నారు.
ఫ్యామిలీ

శ్రావణం : రోజూ పండుగే.. ప్రతీ తిథి దివ్యముహూర్తమే
చిన్నకోడూరు(సిద్దిపేట): శ్రావణ మాసంతోనే హిందూ సాంప్రదాయాల ప్రకారం పండుగలు ప్రారంభమవుతాయి. శ్రావణం శుభకరం అని కూడా అంటారు. ఈ మాసంలో రోజూ పండుగేనని ప్రతీ ఘడియ లక్ష్మి కటాక్షమే అని విశ్వసిస్తారు. ఈ మాసంలో చేసే అన్ని పూజల్లోకెల్లా వరలక్ష్మి వ్రతాన్ని ఉత్తమమైనదిగా పేర్కొంటారు. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కాగా, ఈ నెల 29న నాగుల పంచమి, వచ్చే నెల 8న వరలక్ష్మివ్రతం, 9న శ్రావణ పౌర్ణమి(రాఖీ పండుగ), 16న శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. మంగళ, శుక్ర, శనివారాలకు ప్రాధాన్యత శ్రావణమాసంలోని మంగళ, శుక్ర, శనివారాలు అత్యంత పుణ్యప్రదమైనవి భక్తులు నమ్ముతారు. మంగళవారాలు శ్రీగౌరీ, శుక్రవారాలు శ్రీలక్ష్మీ, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజలకు ముఖ్యమైన రోజులు. వీటికి తోడు శ్రావణంలోని శుక్ల పక్షంలోని 15 రోజులు ఎంతో విశేషమైనవి. సకల ఉపచారాలతో నిష్ఠగా మహలక్షి్మవ్రతం నిర్వహిస్తారు. తొమ్మిది సంఖ్యకు ఈ వ్రతంలో ప్రాధాన్యత. అందుకే తొమ్మిది పోగులతో కూడిన తోరం ధరించి తొమ్మిద రకాల పిండి వంటలు లక్ష్మీదేవికి నివేదన చేసి ముత్తైదువులకు వాయినమిస్తారు. మహిమాన్వితం శ్రావణ పున్నమి శ్రావణ మాసం పౌర్ణమి ఎంతో మహిమ కలిగినదని చెబుతారు. గాయత్రీ ఉపాసన చేసే వారు నూతన యజ్ఞోపవీతాలను ఇదే రోజున ధరిస్తారు. సర్వ విద్యా స్వరూపుడైన హయగ్రీవుని జయంతి కూడా ఇదే రోజు. రక్షా బంధనం, రుషి తర్పణం వంటి వైదిక కర్మలు ఇదే రోజున ఆచరిస్తారు. ఎంతో మహిమాన్విమైన ఈ తిథినాడు పూజిస్తే సత్ఫలితాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంపరమపవిత్రం శ్రావణం హిందువుల పరమ పవిత్రం శ్రావణ మాసం. ఈ మాసం పండుగలకు ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ప్రతీ హైందవ ఇంట్లో ఈ నెలంతా పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. దేవాలయాల్లో సామూహిక కుంకుమార్చనలు, తులసి అర్చనలు, పుష్పార్చనలు, రుద్రాభిషేకాలు వంటి పూజలు చేస్తారు. –సదాశివ శర్మ, పురోహితులు, చిన్నకోడూరుచదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్‌లుక్ వైరల్

గిరాయిపల్లి అమరుల స్ఫూర్తి
గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగి ఏభై ఏళ్లు. ఈ సంఘటనతో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ) విద్యార్థుల విప్లవ పోరాటం ముగిసిపోలేదు. కామ్రేడ్స్ సూరపనేని జనార్దనరావు, లంకా మురళీమోహన్ రెడ్డి, కొలిశెట్టి ఆనందరావు, వనపర్తి సుధాకర్... ఈ నలుగురి అమరత్వం సజీవమైనది. 1974లో ప్రారంభమైన రాడికల్ విద్యార్థి యూనియన్ ప్రభావానికి గురయ్యారు గిరాయిపల్లి అమరులు. నక్సల్బరీ సైద్ధాంతిక అవగాహనతో పనిచేశారు. జనార్దనరావు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు దగ్గర గరికపర్రు గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబం. ఇంజినీరింగ్ విద్య కోసం వచ్చిన విద్యార్థి వరంగల్ పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్న విప్లవోద్యమంలోనూ ప్రధాన శక్తి అయ్యాడు. ఇంజనీరింగ్ విద్యను ఆఖరి సంవత్సరం వదిలి ప్రజా పోరాటాలలో భాగమయ్యాడు. విప్లవోద్యమ కర్తవ్యాన్ని దాని ప్రాసంగికతను విడవకుండా ఆనాటి యువతరంలో విప్లవ మార్గం పట్ల, అనురక్తి కలిగించగలిగాడు. 1975 జూన్ 25న తన సహచరులతో పాటు ఎన్కౌంటర్ అయిన సమయానికి అతడి వయసు ఇరవై అయిదేళ్లు. ఎమర్జన్సీ తొలి నాళ్ళ కాలం అది.గిరాయిపల్లి అమరులు తమ అమరత్వంతో పోరు విత్తనాలు చల్లారు. వీరి జ్ఞాపకార్థం గిరాయిపల్లిలో స్ఫూర్తి స్థూపం వెలిసింది. ప్రభుత్వం 1985లో ఈ స్థూపాన్ని కూల్చివేసింది. 1990లో తిరిగి నిర్మాణం జరిగింది. గిరాయిపల్లి అమరత్వాన్ని తలుచుకున్నప్పుడు మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసీ హననం గురించి మాట్లాడుకోవడం సముచితం. అరవై ఏళ్ళ విప్లవోద్యమ చరిత్రలో అణ చివేత, రక్తపాతం సాధారణమైన అంశమైంది. విప్లవకారులకు, ఆదివాసులకు భారత రాజ్యాంగ పరిధిలోని ఏ హక్కులూ వర్తించడం లేదు. జీవించే హక్కు అనుమతించడం లేదు. గిరాయిపల్లి అమరుల అమరత్వాన్ని వర్తమానం వెలుగులో చూసినప్పుడే దాని విలువ మరింత అర్థమవుతుంది.– అరసవిల్లి కృష్ణ ‘ విరసం అధ్యక్షుడు(గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగి నేటికి 50 ఏళ్లు)

సానబెట్టే సామర్థ్యం, సమరోత్సాహం
రామాయణ, మహాభారత కాలాల నుంచి నేటి దాకా చూస్తున్నాం, తలపెట్టిన పని విజయవంతం కావాలంటే, అర్థ బలం, అంగ బలం, బుద్ధి బలం, సామర్థ్యం మాత్రమే సరిపోవు. వాటికి తోడుగా ఉత్సాహం కావాలి. ఆత్మవిశ్వాసం, సకారాత్మకత, పట్టుదల, బలమైన విజయకాంక్ష– వీటిని కలబోస్తే అది ఉత్సాహం రూపంలో ప్రకటితమౌతుంది.రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి అన్నట్టు సమరం సాగింది. ప్రత్యర్థులిద్దరూ అన్ని విధాలా సమరంలో సమవుజ్జీలే. ఇద్దరివీ లోకోత్తరమైన బల పరాక్రమాలు. అందుకే యుద్ధం సుదీర్ఘంగా సాగినా, ఎంతకీ ఎటూ తెగలేదు. ప్రత్యర్థులిద్దరూ అలసిపోయారు. చింతాక్రాంతులు కూడా అయ్యారు. ఆ దశలో, యుద్ధం చూసేందుకు దేవతలతో కలిసి వచ్చిన అగస్త్య మహర్షి, యుద్ధ పరిశ్రాంతుడై కూర్చొన్న దాశరథి దగ్గరకు వచ్చాడు. సకల కార్య సిద్ధిప్రదమూ, సర్వశత్రు వినాశకమూ అయిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు. అవని జనులకు ప్రత్యక్ష దైవమయిన ఆదిత్యుడిని ఈ స్తోత్రంతో ముమ్మారు స్తుతించి, అందరు దేవతల అనుగ్రహాన్ని పొంది, దైవబలం సమకూర్చుకొమ్మన్నాడు. జయావహమైన ఈ మంత్రం జపించి, స్థైర్య సాహసాలను సంతరించుకొమ్మన్నాడు. ‘ఇప్పుడిక నువ్వు రావణుడిని వధించటం తథ్యం!’ అని తన ఆశీర్వాద బలం కూడా జోడించి, శ్రీరాముడిని ఉత్సాహపరిచి వెళ్ళాడు. ఈ ఘటన యుద్ధాన్ని కీలకమైన మలుపు తిప్పింది. ఇనుమడించిన ఉత్సాహంతో ఈసారి రణరంగంలో ప్రవేశించిన దాశరథి ధాటిని దశకంఠుడు తట్టుకోలేకపోయాడు. వీగిపోయి, విగత జీవుడయ్యాడు. వైదేహీ వల్లభుడినే విజయలక్ష్మి కూడా వరించింది. నిరుత్సాహం సమర్థతను నీరు గారుస్తుంది. ఉత్సాహ శక్తి సామర్థ్యాన్ని సాన బట్టి, పదును పెంచుతుంది. అగ్నికి వాయువులా తోడై, ప్రజ్వలింపజేస్తుంది. దైవబలమూ, మహా పురుషుల ఆశీర్వాద బలమూ, శంకలను శమింపజేయటం వల్ల కలిగే మనోబలమూ, ధర్మ పక్షానికి సర్వదా కవచంగా నిలిచే ధర్మబలమూ, ఉత్సాహాన్ని వృద్ధి చేసే ఉత్ప్రేరకాలు.– ఎం. మారుతిశాస్త్రి

‘ఇక్సీ’తో.. ఇన్ఫెర్టిలిటీ ఫిక్స్..!
ఫెర్టిలిటీ సమస్యలకు ప్రత్యామ్నాయం టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇది మానవ జీవితాన్ని గట్టిగానే ప్రభావితం చేస్తోంది. మానవ మనుగడకు తోడ్పాటునందిస్తోంది.. కాలుష్యం, రసాయనాల ప్రభావంతో పాటు తీవ్ర ఒత్తిడి అనేక రుగ్మతలకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సంతానోత్పత్తిపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తోంది.. దీనికి పరిష్కారంగా అనేక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగినది ఐవీఎఫ్ పద్ధతి. చదువులు, ఉద్యోగాలు, భారీ జీతాల కోసం భారీ లక్ష్యాలతో వివాహ వయసు దాటిపోతోంది. దీంతో గతంలో మహిళలనే ఇబ్బంది పెట్టిన ఇన్ఫెర్టిలిటీ సమస్య మగవారిలోనూ కనిపిస్తోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడాలేకుండా సగటున 50 శాతం మందిలో ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా యుక్త వయసులోనే పురుషులు శుక్ర కణాలను, మహిళలు అండాలను భద్రపరుచుకునే వెసులుబాటు వచ్చేసింది. మారుతున్న కాలంలో పాటే అధునాతన చికిత్సలు అందుబాలోకి వచ్చేశాయి. ఆలస్యంగా వివాహాలు చేసుకునే వారి వేధించే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు పరిష్కారంగా ఎంబ్రియో ఫ్రీజింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. మెట్రోనగరాల్లో ఒకటైన మన నగరంలోనూ ఈ వెసులుబాటు వచ్చేసింది. శుక్ర కణాలు, ఎగ్ (జీవ కణం) క్వాలిటీలో ఎలాంటి ఇబ్బందులూ లేనివారు యుక్త వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీటిని ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఇలా ఫ్రీజ్ చేసిన వాటిని ఐదు నుంచి పదేళ్లలో ఎప్పుడైనా గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వవచ్చు. దీంతో విద్య, ఉద్యోగం వంటి కారణాలతో అనేక మంది వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు. ఇది సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో నగర ప్రజలు ఐవీఎఫ్ కేంద్రాలకు క్యూ కట్టేవారు.. దీనికి పరిష్కారంగా అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడంతో ఫ్రీజింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. 40 శాతం దంపతుల్లో సంతాన సమస్యలు..ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, ఒత్తిడి, సంపాదన, లైఫ్‌స్టైల్, కుటుంబ పరిస్థితులు, కాలుష్యం, ఆహారం, మైక్రో ప్లాస్టిక్, హార్మోన్ల సమతుల్యత, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మద్యం సేవించడం, పొగ తాగడం, రక్త సంబందీకులను పెళ్లి చేసుకోవడం, జన్యుపరమైన, ఇతర సమస్యలతో సుమారు 40 శాతం కొత్తగా పెళ్లైన జంటల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో పురుషుల్లో 50 శాతం మందిలో, 45 శాతం మంది స్త్రీలల్లో పునరుత్పత్తి సమస్యలు గుర్తిస్తున్నారు. ఇద్దరిలోనూ సమస్యలు ఉన్న జంటలు సుమారు 15 శాతం నుంచి 20 శాతం ఉంటున్నాయి. ఈ సమయంలో కొంత మంది మానసికంగా కుంగిపోవడం కనిపిస్తోంది. ఐవీఎఫ్ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. 30 ఏళ్లు వయసుగల వారిలో ఐవీఎఫ్ పద్దతులు సుమారు 60 శాతం నుంచి 70 శాతం సక్సస్ రేటు ఉండగా, ఆపై వయసున్న వారిలో సుమారు 40 శాతం నుంచి 50 శాతం ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. జీవ కణం పదేళ్లు..ఆరోగ్య రంగంలో ప్రపంచానికే మార్గదర్శిగా వెలుగొందుతున్న హైదరాబాద్ సంతాన సమస్యలకు చెక్ పెట్టే అధునాతన పద్ధతులను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ కంటే అధునాతన చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచి్చంది. దంపతుల నుంచి సేకరించిన ఎగ్స్, శుక్రకణాలను ఎంబ్రియాలజీ ల్యాబ్‌లో మైక్రోస్కోప్ కింద పిండాన్ని (జీవ కణం) తయారు చేస్తారు. ఐదు నుంచి ఆరు రోజుల్లో పిండం సిద్ధమైపోతుంది. ఇలా తయారు చేసిన పిండాన్ని పదేళ్లలోపు ఎప్పుడైనా మహిళ గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. వైరల్ మార్కర్ టెస్టులు.. పెళ్లికి ముందు, లేదా వివాహం నిశ్చయించుకున్న జంటలు ముందుగా వైరల్ మార్కర్, ఏఎంహెచ్ వంటి టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒక వేళ ఇద్దరిలో ఎవరికైనా సమస్యలు ఉంటే ముందుగానే వాటికి చికిత్సలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతల్లో పనిచేసే వారిలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందట. మహిళల్లో 25 ఏళ్ల లోపు ఎగ్ రిలీజ్ బాగుంటుందని, తరువాత తగ్గిపోతుందని చెబుతున్నారు. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ వివాహానికి ముందే చేసుకుంటే మంచిది. ఏడాది వరకూ సహజంగానే ట్రై చేసుకోవచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్..పట్టణ ప్రాంతాల్లో జీవన శైలి, ఇతర అలవాట్లతో సంతాన సమ్యలు సర్వసాధారణం అయిపోయాయి. దీంతో కొందరు ఐవీఎఫ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. శుక్రకణాలు, అండం, పిండాన్ని ఫ్రీజ్ చేయడం, ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే ప్రొసీజర్లు కొనసాగుతున్నాయి. శుక్ర కణాలు, ఎగ్స్ ఎంబ్రియాలజీ ల్యాబ్‌లో మైక్రో స్కోప్ కింద కలిపి పిండం (జీవకణం) తయారు చేస్తాం. దీన్ని ఇక్సీ పద్ధతి అంటారు. మహిళకు నొప్పి లేకుండా డే కేర్ ప్రొసీజర్‌లో పూర్తయిపోతుంది. మరుసటి రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. – పీ.స్వాతి, రీప్రొడక్టివ్ మెడిసిన్, కన్సల్టెంట్ రైన్బో హాస్పటల్స్ (చదవండి: సైక్లింగ్ పర్యావరణ హితం.. ఆరోగ్యం కూడా..!)
ఫొటోలు
అంతర్జాతీయం

భగ్గుమన్న సరిహద్దు వివాదం
బ్యాంకాక్: థాయ్‌లాండ్–కాంబోడియాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికులు గురువారం ఉదయం తుపాకులు, ఫిరంగులు, రాకెట్లతో కాల్పులకు దిగారు. థాయ్‌లాండ్ వైమానిక దాడులను సైతం ప్రారంభించింది. ఈ ఘటనల్లో 12 మంది చనిపోయారు. వీరిలో 11 మంది పౌరులు కాగా, ఒక సైనికుడు ఉన్నారని థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుంథమ్ వెచాయచై తెలిపారు. మరో నలుగురు సైనికులు 25 మంది వరకు పౌరులు గాయపడ్డారన్నారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను కాంబోడియా విడుదల చేయలేదు. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులు భయంతో ఇళ్లను వదిలి పారిపోతున్నట్లు తెలిపే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. సరిహద్దుల్లోని కనీసం ఆరు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నట్లు థాయ్ రక్షణ శాఖ తెలిపింది. ఏం జరిగిందంటే..ప్రాచీన ‘ట మ్యుయెన్ థోమ్’ఆలయం సమీపంలోనే గురువారం ఉదయం ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ మొదటగా మొదలైంది. ఘర్షణకు కారణం మీరంటే మీరేనని ఎవరికి వారు ఆరోపణలు సంధించుకుంటున్నారు. సరిహద్దుల్లోని తమ సైనిక స్థావరాలకు సమీపంలో డ్రోన్ కనిపించగా కొద్దిసేపటికే ఆరుగురు కాంబోడియా సైనికులు దూసుకొచ్చారని, ఘర్షణను నివారించేందుకు ప్రయత్నిస్తుండగానే వారు కాల్పులకు దిగారని థాయ్ ఆర్మీ తెలిపింది. ఆస్పత్రిపైనా కాంబోడియా దాడులు చేసిందని ఆరోపించింది. అందుకే, తాము సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టినట్లు అనంతరం ప్రకటించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే ఆత్మ రక్షణ చర్యలను తీవ్రతరం చేస్తామని థాయ్ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, థాయ్ సైన్యం తమ ప్రాంతంలోకి ముందుగా డ్రోన్‌ను పంపించిందని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని కాంబోడియా ఆర్మీ పేర్కొంది. పురాతన ప్రియా విహియార్ ఆలయంలోని రహదారిపై థాయ్ జెట్ విమానాలు బాంబులు విసిరాయని ఆరోపించింది. థాయ్ దురాక్రమణను వెంటనే నిలిపివేసేందుకు భద్రతా మండలిని సమావేశపర్చాలని కాంబోడియా ప్రధాని హున్ మనెత్ ఐరాసకు తాజాగా లేఖ రాశారు.పేలిన మందుపాతరబుధవారం వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో మందుపాతర పేలి థాయ్‌లాండ్ సైనికుడొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో థాయ్ ప్రభుత్వం కాంబోడియా రాయబారిని బహిష్కరించడంతోపాటు ఆ దేశంలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. కాంబోడియాతో గల ఈశాన్య సరిహద్దు క్రాసింగ్‌లన్నిటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ పౌరులను కాంబోడియా వీడాలని కోరింది. ప్రతిగా కాంబోడియా సైతం థాయ్‌తో దౌత్య సంబంధాలను కనీస స్థాయికి తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. బ్యాంకాక్‌లోని తమ దౌత్య సిబ్బంది మొత్తాన్ని వెనక్కి పిలిపించుకుంది. థాయ్‌లాండ్ దౌత్య సిబ్బంది మొత్తం తమ దేశం విడిచివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఉబోన్ రట్చంథని ప్రావిన్స్‌లో బుధవారం మందుపాతర పేలి ఐదుగురు గాయపడినట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం తెలపగా తమ ప్రియా విహియార్ ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుందని కాంబోడియా అంటోంది.వెయ్యేళ్ల ఆలయమే కేంద్రంగాభారతదేశాన్ని పాలించిన గుప్తులు, పల్లవ చక్రవర్తుల ప్రాబల్యం అప్పట్లో థాయ్‌లాండ్, కాంబోడియాల దాకా విస్తరించింది. పల్లవుల కాలంలో 11వ శతాబ్దంలో ఖ్మెర్ రాజులు నిర్మించిన మూడు హిందూ ఆలయాలున్నాయి. ఈ ఆలయా ల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. ఇక్కడి ప్రసత్తా మ్యుయెన్ థోమ్ అనే శివాల యా న్ని 11వ శతాబ్దంలో ఉదయాదిత్యవర్మన్–2 అనే రాజు నిర్మించాడు. దాంగ్రెక్ పర్వతాల్లో పురాతన ఖ్మెర్ హైవేను కాంబోడి యాలోని అంగ్కోర్ను థాయ్‌లాండ్‌లోని ఫిమయితో కలిపే మార్గంలో ఈ ఆలయం ఉంది. దీని ప్రకారం ఖ్మెర్ సామాజ్య సరిహద్దులపై తమకే హక్కుందని కాంబోడియా అంటుండగా, థాయ్‌లాండ్ అంగీకరించట్లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి. ఫ్రాన్స్ ఇచ్చిన మ్యాప్‌తో వివాదంథాయ్లాండ్లోని సురిన్ ప్రావిన్స్, కాంబోడియా లోని ఒద్దార్ మియాంచే ప్రావిన్స్‌ల పొడవునా ఉన్న వెయ్యేళ్లనాటి ప్రాచీన శివాలయం ‘టమ్యుయెన్ థోమ్’ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. థాయ్‌లాండ్, కాంబోడియాలు గతంలో ఫ్రాన్స్ వలస పాలనలో ఉన్నాయి. ఆ సమయంలో 1907లో రెండు దేశాల సరిహద్దులను విభజిస్తూ ఫ్రాన్స్ ఒక మ్యాప్‌ను రూపొందించింది. ఈ మ్యాప్‌లో పేర్కొన్న భూ భాగం తమదేనని కాంబోడియా అంటుండగా, థాయ్‌లాండ్ అది అస్పష్టంగా ఉందని వాదిస్తోంది. దీనిపై కాంబోడియా అంతర్జాతీయ న్యాయ స్థానానికి వెళ్లగా 1962లో అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అప్పటి నుంచీ తరచూ చోటుచేసుకుంటున్న సైనిక ఘర్షణల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాంబోడియా 2011లో మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం 2013లో మరోసారి కాంబోడియాకే ఆ దేవాలయ ప్రాంతంపై హక్కుందంటూ మరోసారి ప్రకటించింది. థాయ్‌లాండ్ మాత్రం ఈ తీర్పును అంగీకరించడంలేదు.

ఇక స్వేచ్ఛా వాణిజ్యం
లండన్: భారత్, బ్రిటన్ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. భారత ప్రధాని మోదీ గురువారం లండన్‌లో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్ 2035’ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్‌పై మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్‌టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే.. కీర్ స్టార్మర్తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. భారత్‌కు ఎనలేని మేలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్‌కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్ మార్కెట్లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్–2030’ రోడ్‌మ్యాప్‌పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.మోదీకి స్టార్మర్ విందు యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్‌తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్ అండ్ మిస్ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్ బ్యాట్‌తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్ ‘బకింగ్హమ్ స్ట్రీట్ క్రికెట్ క్లబ్’ క్రీడాకారులతో సంభాíÙంచారు. ఒప్పందంతో లాభమేంటి? వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే.. → బ్రిటిష్ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి. → బ్రిటన్ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి. → బ్రిటిష్ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది. → భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి. → ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్‌లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్‌తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి. → మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే. → ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్ ఉండదు. → దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి. → ఎఫ్టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. → దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్‌ను ఎఫ్‌టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు. మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు ఎఫ్‌టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్ స్పీచ్‌ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్ చిరునవ్వు చిందించారు.

బ్రిటన్ కింగ్ ఛార్లెస్‌ను కలిసిన మోదీ
లండన్: బ్రిటన్‌లో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడ బ్రిటన్ రాజు ఛార్లెస్‌ను కలిశారు. గురువారం రాజు అధికారిక నివాసాల్లో ఒకటైన నోర్ఫోక్ ప్రాంతంలోని సాండ్రింగ్‌హామ్ హౌస్‌కు విచ్చేసిన మోదీని ఛార్లెస్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఛార్లెస్‌కు మోదీ తెల్లని పూరెమ్మలు ఉండే సోనోమా డేవిడియా ఇన్వాలుక్రాటా అనే వింతైన మొక్కను బహూకరించారు. ఈ చెట్టుకు పూసే పూలను దూరం నుంచి చూస్తే గాల్లో ఎగిరే తెల్లపావురాల్లా కనిపిస్తాయి. శ్వేతవర్ణ పూరెమ్మలు ఉండటంతో దీనిని హ్యాండ్కర్చీఫ్ చెట్టు అని కూడా అంటారు. అమ్మ పేరిట ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా ఛార్లెస్‌కు మోదీ ఈ మొక్కను బహుమతిగా అందించారు. తల్లిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెల్సిందే. సాధారణంగా డేవిడియా మొక్క నాటిన 20 ఏళ్ల తర్వాతే పూలు పూస్తుంది. కానీ సోనోమా రకం సంకరజాతి మొక్క కేవలం రెండు, మూడేళ్లలోనే విరగబూస్తుంది.

వనాలకు ఆకాశ శరాలు
వాషింగ్టన్: వెచ్చని సూర్యకిరణాలు పుడమి తల్లిని ముద్దాడకుండా అడ్డుకుంటూ దట్టంగా, ఏపుగా పెరిగిన వృక్షాలను చూసి వరుణదేవునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుదో లేదో తెలీదుగానీ వర్షం వంటి సందర్భాల్లో భూమిపైకి దూసుకొచ్చే మెరుపులు, పిడుగుల కారణంగా కోట్లాది వృక్షాలను కాలిబూడిద అవుతున్నాయి. పిడుగులు పడడంతో ఉద్భవించే అతి ఉష్ణానికి ప్రతి ఏటా అక్షరాలా 35 కోట్ల చెట్లు నిట్టనిలువునా కాలిపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పుడమిపై పచ్చదనం క్షీణించడానికి పిడుగులు కూడా ప్రబల హేతువుగా మారాయన్న కొత్త విషయాన్ని అధ్యయనకారులు వెల్లడించారు. మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ మేరకు విస్తృతస్థాయిలో పరిశోధన చేశారు. పిడుగులు పడటంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది చెట్లు కాలిపోతున్నాయని, దీంతో పచ్చదనం తగ్గిపోతోందని అధ్యయనంలో స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అడవుల్లో వృక్షాల క్షీణతకు సంబంధించిన సమాచారాన్ని ఆధునిక గణన పద్ధతులతో విశ్లేషించి ఈ విషయాన్ని దృవీకరించుకున్నారు. అయితే వాస్తవంగా చూస్తే ఏటా ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే వృక్షాలు పిడుగులకు బలికావొచ్చని అధ్యయనకారులు అంచనావేశారు. ‘‘ప్రతి సంవత్సరం పడుతున్న పిడుగుల కారణంగా ఎన్ని చెట్లు కాలిపోతున్నాయి అనేది అంశంతోపాటే ఏఏ దేశాల్లో పిడుగుల ఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి? వాటి కారణంగా తగ్గిన పచ్చదనంతో అక్కడ మారిన వాతావరణ పరిస్థితుల వివరాలనూ సేకరిస్తున్నాం’’అని అధ్యయనంలో ముఖ్య రచయిత ఆండ్రీస్ క్రాస్ చెప్పారు. భారీ స్థాయిలో నష్టం 32 కోట్ల చెట్లు అంటే చిన్న విషయం కాదు. ఏకంగా ప్రపంచ వృక్ష సంపదలో 2.1 శాతం నుంచి 2.9 శాతానికి సరిపడా వృక్షాలు అంతరించిపోతున్నట్లే లెక్క. ఈ లెక్కన పుడమిపై పచ్చదనం గాఢత సైతం తగ్గుతోంది. ఇంతటి భారీ సంఖ్యలో చెట్లు లేకపోవడం కారణంగా ఈ చెట్లుఉంటే పీల్చుకునే కార్భన్‌డయాక్సైడ్ అలాగే వాతావరణంలోనే పోగుబడుతోంది. ఇలా ఏటా ఏకంగా 77 కోట్ల నుంచి 109 కోట్ల టన్నుల కార్భన్‌డయాక్సైడ్ వాతావరణంలోనే ఉండిపోతోంది. ఇది భూతాపోన్నతికి ప్రత్యక్షంగా కారణమవుతోందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. పిడుగులు పరోక్షంగా 109 కోట్ల టన్నుల సీఓ2 వాతావరణంలో పేరుకుపోవడానికి కారణమైతే.. కార్చిచ్చు, అడవి దగ్ధం వంటి ఘటనల కారణంగా వృక్షసంపద కాలిపోయి తద్వారా దాదాపు అదే స్థాయిలో 126 కోట్ల టన్నుల కార్భన్‌డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది.మరింతగా పిడుగుల వర్షం! రాబోయే రోజుల్లో పిడుగులు పడే దృగి్వషయాలు మరింతగా సర్వసాధారణం కానున్నాయని అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఉష్ణమండల అరణ్యాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి. దీంతో భారీసంఖ్యలో చెట్లు నాశనమవుతున్నాయి. రాబోయే రోజుల్లో సముద్రమట్టంతో పోలిస్తే మధ్యస్థాయి, కాస్తంత ఎక్కువ ఎత్తులో ఉండే దేశాల్లోనూ పిడుగుల బెడద ఎక్కువ కానుందని అధ్యయనకారులు చెప్పారు. సమశీతోష్ణ మండలాలు, యూరప్ దేశాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశముంది. దీంతో అటవీ ఆవరణ వ్యవస్థ, అక్కడి కార్భన్‌డయాక్సైడ్ స్థాయిలపై దుష్ప్రభావం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు తమ పరిధిలోని అడవుల సంరక్షణపై మరింతగా దృష్టిసారించాలని అధ్యయనకారులు సూచించారు.
జాతీయం

Air India: టేకాఫ్ అయిన పావుగంటకే..
అహ్మదాబాద్ ఘటన తర్వాత.. విమానాల్లో, అందునా ఎయిరిండియా సంస్థ విమానాల్లోనే ఎక్కువగా సాంకేతిక సమస్యలూ బయటపడున్నాయి. ఈ క్రమంలో విమానాల ఆలస్యం, రద్దు, దారి మళ్లింపు, వెనక్కి రావడం లాంటి ఘటనలూ నమోదు అవుతున్నాయి. తాజాగా..జైపూర్ నుంచి ముంబై బయల్దేరిన ఎయిరిండియా విమానం.. పావు గంటకే సాంకేతిక సమస్యతో వెనక్కి వచ్చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.35గం.కు బయల్దేరిన విమానం.. 18 నిమిషాల తర్వాత తిరిగి జైపూర్ ఎయిర్‌పోర్టుకే వచ్చేసింది. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే విమానాన్ని పైలట్ వెనక్కి తీసుకురావాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం(జులై 23వ తేదీ) సైతం ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి 160 మంది ప్రయాణికులతో బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం.. సాంకేతిక సమస్యతో రద్దయ్యింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమంటూ ఆ సమయంలో ఎయిరిండియా ప్రకటించింది. అదే రోజు.. కేరళ కాలికట్(కోజికోడ్) నుంచి దోహాకు 188 మందితో(సిబ్బంది సహా) బయల్దేరిన ఎయిరిండియా విమానం.. రెండు గంటల తర్వాత తిరిగి కాలికట్ ఎయిర్‌పోర్టుకే చేరుకుంది. ఇది కూడా సాంకేతిక సమస్యతోనే వెనక్కి వచ్చినట్లు విమానయాన సంస్థ ప్రకటించింది.

అది నా తప్పే.. ఇప్పుడు సరిదిద్దుతున్నాం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: తెలంగాణ కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రశంసలు గుప్పించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయామని, అది ముమ్మాటికీ తన తప్పిదమేనని అన్నారాయన. శుక్రవారం ఢిల్లీ టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన భాగిదారి న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను... ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు, ఓ తప్పు చేశానని అర్థమవుతోంది. నేను ఓబీసీల హక్కులను రక్షించాల్సిన విధంగా రక్షించలేదు. అప్పట్లో మీ(ఓబీసీలనుద్దేశించి..) సమస్యలు లోతుగా అర్థం చేసుకోలేకపోయాను.... మీ చరిత్రను, మీ సమస్యలను కొంచెం అయినా ముందే తెలుసుకుని ఉండినట్లైతే, అప్పటికే కుల గణాంకాలు (Caste Census) నిర్వహించేవాడిని. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన ప్రభావం అర్థం చేసుకోలేకపోయాం. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు.. ముమ్మాటికీ నా తప్పు. ఇప్పుడు ఆ తప్పును సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారాయన. ఓబీసీల చరిత్ర గురించి ఎవరైనా రాశారా?. పెద్ద పెద్ద వ్యాపారవేత్తల పేర్లు బయటికి తీయండి. అందులో ఒక్కరైనా ఓబీసీ ఉన్నారా? అదానీ ఒబీసీనా?. ఇంగ్లీష్‌ను వ్యతిరేకించేవారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? అని ప్రశ్నించారాయన. తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్ అని పేర్కొన్న రాహుల్.. దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనని ఉద్ఘాటించారు.#WATCH | Delhi: At Congress' 'Bhagidari Nyay Sammelan', Lok Sabha LoP Rahul Gandhi says, "I have been in politics since 2004...When I look back, I can see that I made a mistake. I didn't protect the OBCs like I should have...It was because I could not understand your issues in… pic.twitter.com/uink9xyKFJ— ANI (@ANI) July 25, 2025మోదీపై రాహుల్ విసుర్లుఇదే వేదికగా.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విసుర్లు గుప్పించారు. ‘‘మోదీకి అంత సీన్ లేదు. ఆయనదంతా బిల్డప్పు మాత్రమే. అంత శక్తేం ఆయనకు లేదు. అవసరంగా అంత ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీతో రెండు,మూడుసార్లు భేటీ అయ్యాక.. ఆయనేం పెద్ద సమస్య కాదని అర్ధమైందని రాహుల్ అన్నారు. దేశంలో దళితులు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు 90 శాతం ఉన్నారు. కానీ,బడ్జెట్ హల్వా తయారీలో ఈ వర్గాలకు చెందిన ఎవరికీ ప్రాధాన్యం ఉండదు. ఆ హల్వా తయారీకి ఈ వర్గాలే కారణం. కానీ, తినడానికి మాత్రం వీళ్లు అర్హులు కారా?’’ అని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు.

తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
తల్లి ఏమరపాటు ఆ పసిబిడ్డ ప్రాణం తీసింది. హడావిడిలో.. కిటికీని ఆనుకుని ఉన్న చెప్పుల స్టాండ్ మీద మూడున్నరేళ్ల చిన్నారిని కూర్చోబెట్టింది. అయితే ఆ చిన్నారి వెనక్కి దొర్లడంతో.. 12వ అంతస్తు నుంచి కిందపడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది.ముంబైలోని నియగావ్ నవకర్ సిటీలో బుధవారం సాయంత్రం ఘోరం జరిగిపోయింది. అన్వికా ప్రజాప్రతి అనే చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం 8గం. సమయంలో బయటకు వెళ్లేందుకు అన్వికా, ఆమె తల్లి వచ్చారు. తన బిడ్డ బయట తిరుగుతున్న విషయం గమనించిన తల్లి..ఆమె దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చిన్నారిని షూ ర్యాక్ మీద కూర్చోబెట్టింది. అయితే చిన్నారి నిల్చుని ఒక్కసారిగా కూర్చునేందుకు ప్రయత్నించి.. వెనక్కి పడిపోయింది. ఆ ఘటనతో గుండెపగిలిన ఆ తల్లి సాయం కోసం కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రక్తపు మడుగులో పడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియోను చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఏడాదిలో ప్రాణాలు పోతున్న చిన్నారుల సంఖ్య.. వేలల్లోనే ఉంటోందని యూనిసెఫ్ నివేదిక చెబుతోంది. View this post on Instagram A post shared by NDTV Marathi (@ndtvmarathi)

ప్రభుత్వ అధికారుల అక్రమాల పుట్టపగులుతోంది.. తవ్వే కొద్దీ డబ్బే డబ్బు
భువనేశ్వర్: అవినీతికి పాల్పడుతున్న అటవీశాఖ అధికారుల్ని విజిలెన్స్ అధికారులు ఆట కట్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అటవీ శాఖ అధికారుల ఇళ్లలో విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ అధికారికి 116 ఫ్లాట్లు గుర్తించగా.. మరో అధికారి ఇంట్లో తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, గోల్డ్ కాయిన్లు, ఇతర బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. సదరు అధికారుల ఇళ్లల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆరో ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నాయక్ నివాసంలో ఆదాయానికి మించిన రూ.1.44 కోట్ల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు.తనిఖీల్లో జయపూర్‌లోని ఆయన ఫ్లాట్‌లో రహస్య గదిలో దాచిన రూ. 1.44 కోట్ల నగదు, 4 బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణేలు (ప్రతి నాణెం 10 గ్రాములు),6 ప్రాంతాల్లోని జయపూర్, భువనేశ్వర్‌లోని ఆయన నివాసాలు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఈ దాడుల్లో ఆరుగురు డీఎస్పీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, తొమ్మిదిమంది ఏఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు ఉపయోగించి నగదు లెక్కింపు కొనసాగుతోంది.ఈ దాడికి ముందు మరో అటవీ శాఖ అధికారి నివాసాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సదరు అధికారికి 119కి పైగా ప్లాట్లు ఉన్నట్లు తేలింది.
ఎన్ఆర్ఐ

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్‌లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్‌వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నాట్స్ ముందడుగు
డాలస్, టెక్సాస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఆకలితో ఆలమటిస్తున్న పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్లు కలిసి పేద పిల్లలకు ఆహారం అందించేందుకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేశాయి. రిచర్డ్సన్ నగరంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ, యువకులు, పెద్దలు.. 133 బాక్సుల పౌష్టికాహారాన్ని ప్యాక్ చేశారు. ఇందులో 28,728 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించేలా ఫుడ్ ప్యాకింగ్ చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల మార్గదర్శకత్వంలో పలువురు నాట్స్ యువ వాలంటీర్లు కుటుంబ సమేతంగా పాల్గొని వేల సంఖ్యలో ఆహార కిట్లను సిద్ధం చేశారు నాట్స్ డాలస్ చాప్టర్ యువతను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలా పేద పిల్లలకు పౌష్టికాహారం సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని బాపు నూతి అన్నారు. సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులను భాగస్వామ్యులను చేయటం చాలా సంతోషంగా ఉందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని రాజేంద్ర మాదల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డాలస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహకోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న తదితరులు పాల్గొన్నారు. డాలస్ చాప్టర్ టీం, నాట్స్ సలహాదారు బృందం సభ్యుల సహకారంతో ఇంత మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నాట్స్ డాలస్ విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్ సంతాపం
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్‌గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
క్రైమ్

గర్భిణీ భార్య హత్య.. ఇంట్లో మృతదేహం.. బయట భర్త నాటకం
సాక్షి,బెంగళూరు: ప్రేమన్నాడు. పెళ్లన్నాడు. నువ్వులేకపోతే నేను లేనన్నాడు. కాదూ కూడదు అంటే చచ్చిపోతున్నాడు. చివరికి ఆమెను లేకుండా చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను కడతేర్చాడు. ఆపై పరారయ్యాడు.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో జరిగిన విషాద ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు శివం తన 22 ఏళ్ల గర్భవతి భార్య సుమనను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.శివం, సుమన ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మందలించారు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం, బెంగళూరుకు పారిపోయి వచ్చారు. బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న శివమ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా.. సుమన ఇంట్లోనే ఉంటుంది. ఆమె మూడు నెలల గర్భిణీ.ఐదేళ్ల పాటు ప్రేమ,దోమ అంటూ సుమన వెంటబడ్డ శివమ్ పెళ్లి తర్వాత తన రాక్షస బుద్ధిని బయటపెట్టాడు. అనుమానం పేరుతో సుమనను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇదే విషయమై సుమనపై శివమ్ చేయిచేసుకున్నాడు. ఇరువురి మధ్య గొడవ జరగడంతో ఎవరికి వారు వేర్వేరు రూముల్లోకి వెళ్లి నిద్రించాడు. మరునాడు అంటే మంగళవారం ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించకపోవడంతో ఎప్పటిలాగే పనికెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. పూటగా మద్యం సేవించాడు. బుధవారం సైతం ఆమెను లేపేందుకు ప్రయత్నించగా అచేతనంగా పడి ఉండి.సుమన మరణించిందని నిర్ధారించుకొని ఇంటినుంచి పారిపోయాడు. అయితే,ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహం జరిగిన నాటి నుంచి సుమనపై అనుమానం పెంచుకున్న భర్త శివమ్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు.

చచ్చేంత వరకు జైల్లోనే ఉండండి
సాక్షి, చెన్నై: తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజూ చెమ్మల్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కాంచీపురం సమీపంలో 2018లో ఇద్దరు పిల్లల హత్య స్థానికంగా కలకలం రేపింది. విజయ్, అభిరామి దంపతుల పిల్లలైన అజయ్(6), కరి్ణక(4) ఈ హత్యకు గురైనట్టు గుర్తించారు. ఈ పిల్లలను వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో తల్లే కడతేర్చినట్టు విచారణలో తేలింది. ప్రియుడు మీనాక్షి సుందరం మోజులో పడ్డ అభిరామి భర్త విజయ్, పిల్లలను హతమార్చేందుకు పథకం వేసింది. అయితే, ఘటన జరిగిన రోజున భర్త విజయ్ ఇంటికి రావడంలో ఆలస్యం జరగడంతో పిల్లలు హతమైనట్టు విచారణలో తేలింది. భర్తను హతమార్చ లేక పిల్లల్ని చంపేసి ప్రియుడితో ఉడాయించిన అభిరామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసు విచారణ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజు చెమ్మల్ ముందు విచారణ జరిగింది. వానదనలు, సాక్షుల విచారణలన్నీ ముగిసి గురువారం న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఈ కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధించారు. ఈ సమయంలో కోర్టుకు వచ్చిన అభిరామి తీర్పు తదుపరి మహిళా కానిస్టేబుల్ కాళ్లను పట్టుకుని కన్నీటి పర్యంతమైంది. అభిరామి, మీనాక్షి సుందరంకు మరణించే వరకు జైలు శిక్షతోపాటూ తలా రూ. 15 వేలు జరిమానా విధించారు.

రాజస్తాన్: కుప్పకూలిన స్కూల్ పైకప్పు.. ఏడుగురు విద్యార్థుల దుర్మరణం
రాజస్తాన్ ఝలవార్ జిల్లా ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. మరో 15 మందికి గాయాలైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 8.30గం.ప్రాంతంలో మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు క్లాస్‌లో కూర్చుని ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 20 ఏళ్ల కిందటి నాటి ఈ స్కూల్ భవనానికి మరమ్మత్తులు అవసరమని గతంలో పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో.. గత కొంతకాలంగా ఇక్కడ వర్షాలు పడుతుండడంతో ఈ ఘోరం జరిగింది. పైకప్పు రాళ్లతో కట్టి ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.ప్రమాదంపై ప్రధాని మోదీ, రాజస్తాన్ సీఎం భజనాన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. सुबह-सुबह झालावाड़ से दुखद खबरझालावाड़ में एक सरकारी स्कूल की बिल्डिंग गिरने से 5 बच्चों की मौत हो गई. वहीं हादसे में 30 से ज्यादा बच्चे गंभीर घायल हैं.हादसा शुक्रवार सुबह प्रार्थना के दौरान मनोहरथाना ब्लॉक के पीपलोदी सरकारी स्कूल में हुआ.#Rajasthan #Jhalawar pic.twitter.com/DgtbbO8k3q— Avdhesh Pareek (@Zinda_Avdhesh) July 25, 2025

మా బిడ్డను చంపేశాడు
విశాఖపట్నం: వివాహం చేసుకుంటానని తమ కుమార్తెను వంచించి వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ యశ్వంత్ అనే యువకుడు చంపేశాడని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి ప్రాంతానికి చెందిన కార్తీక రామారావు, కార్తీక రామలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. కార్తీక నవ్యశ్రీ (25)ని ప్రేమికుడు యశ్వంత్ తామెవరం ఇంట్లో లేని సమయంలో ఈ నెల 2వ తేదీన చంపేశాడని తెలిపారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు కార్తీక నవ్యశ్రీ తల్లిదండ్రులు రామారావు, రామలక్ష్మి తెలిపిన వివరాలివి. 35 ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నామని వారు చెప్పారు. తమ కుమార్తె కార్తీక నవ్యశ్రీ, యశ్వంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. వారి పెళ్లికి రెండు కుటుంబాలు సమ్మతించాయన్నారు. ఈ నేపథ్యంలో కావ్యశ్రీకి హైదరాబద్‌లో ఉద్యోగం దొరకడంతో వెళ్లి ఉద్యోగం చేసుకోమని యశ్వంత్ ఆమెతో చెప్పాడని పేర్కొన్నారు. అక్కడి నుంచే వేధింపులు ప్రారంభం.. కావ్యశ్రీ హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటుండగా అనుమానం పెంచుకున్న యశ్వంత్ నీవు ఎవరితోనో తిరుగుతున్నావని తరచూ వేధించేవాడని, కావ్యశ్రీని వైజాగ్ వచ్చేయమని చెప్పడంతో ఆమె మూడు నెలల కిందట వచ్చి వర్క్ ఫ్రం హోం చేస్తుందని తెలిపారు. మేము లేనప్పుడు.. గత నెల 29న ఇంటి పని కోసం కొత్తూరు వెళ్లామని, కావ్యశ్రీ నుంచి ఫోన్ వచ్చిందని, యశ్వంత్ తనను వేధిస్తున్నాడని చెప్పిందన్నారు. మూడు రోజుల పాటు యశ్వంత్ కావ్యశ్రీతోనే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (2వ తేదీ వేకువ జాము) యశ్వంత్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, కావ్యశ్రీ ఉరి పోసుకున్నట్టు తెలిపాడన్నారు. ఉదయం వచ్చి చూసే సరికి తమ కుమార్తె చనిపోయి ఉందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇంట్లో ఉన్న హుక్ కూడా ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకునేంతగా ఉండదని, యశ్వంతే తమ కుమార్తెను చంపేసి ఉండాడని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికులు, కావ్యశ్రీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి యశ్వంత్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్‌లో ఉన్నాడు.