1/6
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇందులో 40 మందికి పైగా మహిళా క్రీడాకారులు ఉన్నారు. మరి మన తెలుగు అమ్మాయిలు ఎంత మంది ఉన్నారంటే?
2/6
పీవీ సింధు- బ్యాడ్మింటన్ పీవీ సింధు రియో ఒలింపిక్స్-2016లో రజతం, టోక్యో ఒలింపిక్స్-2020లో కాంస్యం గెలిచిన ఘనత సింధు సొంతం
3/6
నిఖత్ జరీన్- బాక్సింగ్ నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్. మహిళల 50 కేజీల బాక్సింగ్ విభాగంలో తలపడుతోంది.
4/6
జ్యోతి యర్రాజీ- 100 మీటర్ల హార్డిల్స్ రేస్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హార్డిల్స్ రేసులో పోటీ పడుతున్న భారత తొలి అథ్లెట్ జ్యోతి యర్రాజీ. విశాఖపట్నానికి చెందిన ఈ అమ్మాయి ఖాతాలో ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో పది పతకాలు , రెండు కామన్వెల్త్ పతకాలు కూడా ఉన్నాయి.
5/6
శ్రీజ ఆకుల- టేబుల్ టెన్నిస్ హైదరాబాద్‌కు చెందిన ఆకుల శ్రీజ వరల్డ్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో పసిడి గెలిచిన భారత తొలి టీటీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.
6/6
దండి జ్యోతిక శ్రీ- 4X400 మీటర్ల రిలే ఈవెంట్ పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ ఈ ఏడాది అథ్లెటిక్స్ 4X400 రిలే ఈవెంట్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటి వరకు ఆమె రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది. ఒలింపిక్స్ భారత జట్లకు జరిగిన పోటీల్లో విశేష క్రీడా నైపుణ్యం ప్రదర్శించి ప్యారిస్‌కు పయనమైంది.