1/15
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానుల్లో కుతూహలం ఉండటం సహజం.
2/15
ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలతో పాటు.. పర్సనల్ లైఫ్ గురించి ఆరా తీస్తారు ఫ్యాన్స్.
3/15
ఇక సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత వారికి ఈ పని మరింత ఈజీ అయిపోయింది.
4/15
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జివా స్కూల్ ఫీజుకు సంబంధించినదే ఈ కథనం
5/15
టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని క్రీడా జీవితం తెరిచిన పుస్తకమే.
6/15
ఇక ఈ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి పర్సనల్ లైఫ్ గురించి కూడా కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు.
7/15
జార్ఖండ్‌లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధోని.. క్రికెటర్‌గా అత్యున్నతస్థాయికి చేరుకున్నాడు.
8/15
పేరు ప్రఖ్యాలతో పాటు వెయ్యి కోట్ల మేర ఆస్తులు కూడా కూడబెట్టినట్లు సమాచారం ఇక మహీ 2010, జూలై 4న సాక్షి సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు ఈ జంటకు 2015, ఫిబ్రవరి 6న కూతురు జివా జన్మించింది.
9/15
జివా జన్మించే సమయానికి.. వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్‌తో ఆస్ట్రేలియాలో బిజీగా ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా తన బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే బిడ్డను చూడటానికి దేశానికి తిరిగి వచ్చాడు.
10/15
ఒక్కగానొక్క కూతురు జివా అంటే ధోనికి పంచప్రాణాలు. కోటీశ్వరుడైన ధోని తలచుకుంటే తన కూతురిని విదేశాల్లో టాప్ మోస్ట్ స్కూల్స్‌లో చదివించగలడు. కానీ.. బిడ్డకు దూరంగా ఉండటం అతడికి ఇష్టం లేదు.
11/15
అందుకే స్వస్థలం రాంచిలోనే ప్రముఖ పాఠశాలలో జివాను చేర్పించారు ధోని జివా ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నట్లు సమాచారం. ఈ ఇంటర్నేషనల్ స్కూళ్లో డే స్కాలర్‌గా ఉన్న జివా కోసం ధోని ఏడాదికి చెల్లిస్తున్న ఫీజు ఎంతో తెలుసా? అక్షరాలా రెండు లక్షల డెబ్బై ఐదువేల రూపాయలట!!
12/15
సదరు పాఠశాల వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం గ్రేడ్ 2-8 వరకు డే స్కాలర్స్‌కు రూ. 2,75,000, హాస్టల్‌లో ఉండే వాళ్లకు రూ. 4,40,000 చెల్లించాల్సి ఉంటుంది.
13/15
మరి ఈ లెక్కన జివా నెల ఫీజు సుమారు 23 వేల రూపాయలు!
14/15
ధోనికి ఈ మొత్తం లెక్కకాదు. అయితే, కూతుర్ని విదేశాల్లో చదివించడమో.. హాస్టల్లో వేయడమో కాకుండా తామే స్వయంగా బిడ్డ ఆలనాపాలనా దగ్గరుండి చూసుకోవడం విశేషమే!!
15/15