Top Stories
ప్రధాన వార్తలు

చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి: పేర్నినాని
సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖలు చేశారు. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీతో ఆయన సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ అయ్యారు.ములాఖత్ అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నెంబర్స్‌ను సేకరించారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లతో ఏం పని? అని ప్రశ్నించారు. చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి అనదికారికంగా విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాప్ చేసి నేతలను బెదిరించాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఎన్ని తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.వల్లభనేనీ వంశీ కేసులో దుర్మార్గంగా పోలీసులువల్లభనేనీ వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసం పటమట పోలీసులు పని చేస్తున్నారు. 10వ తేదిన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తప్పుడు కేసు అని అఫిడవిట్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఫణి కుమార్ అనే వ్యక్తి ద్వారా సత్యవర్ధన్, వంశీపై తప్పుడు కేసులు పెట్టించారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేశారు. ఊహాజనిత ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వంశీపై పెట్టారు. నాపైనా కేసులు సత్య వర్ధన్ చెప్పాడో లేదో కూడా తెలియకుండా కేసు పెడతారా? వంశీకి రిమాండ్ విధించే సమయంలో ఎస్సీ,ఎస్టీ కేసుల న్యాయస్థానంలో హాజరు పరచకుండా వేరే కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టాలు, కేసులు, సెక్షన్లు అనేవి లేకుండా పోలీసులు వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించే సమయంలో నేను లేను. అయినా నాపై కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్రపై పేర్ని ఫైర్ కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రజా సేవకు మా ఊరు,రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనికిరారు. లోకేష్ ఇస్తే కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి. కొడాలి నాని అరెస్టు చేయిస్తా, పేర్ని నానినీ అరెస్టు చేయిస్తా అంటున్నారు. నేనూ ఆరు నెలలుగా మచిలీపట్నం రోడ్లపై తిరుగుతున్నాను. మీరు ఏం చేయలేరు’అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.

తెలంగాణ సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంతంటే?.. ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక
హైదరాబాద్ : సచివాలయ నిర్మాణం, వ్యయం అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయానికి వెచ్చించిన నిధులు, నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలు అంశాలను తేల్చాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వింగ్‌ల వారిగా విచారణ మొదలుపెట్టింది. అయితే, ఈ విచారణలో సచివాలయం నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ విభాగంపై విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికలో సెక్రటేరియట్లో మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్‌వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి రూ. 320కోట్లకు పైగా ఖర్చు దాటిందని విజిలెన్స్ పేర్కొంది. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు తేల్చింది.బిల్లులు మంజూరు చేయకుండానే నిధులను విడుదల చేసినట్లు గుర్తించింది. రూ. 320 కోట్లకు పైగా నిధుల విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాదాపుగా ఇప్పటివరకు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ప్రభుత్వం సదరు సంస్థకు నిధులను విడుదల చేసింది. మొత్తం అంచనా రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని విజిలెన్స్ తాత్కాలిక రిపోర్టులో పేర్కొంది.

గూగుల్ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!
స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది.. దాదాపు అన్ని లావాదేవీలకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. యూజర్ల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్న సమయంలో.. ట్రాన్సాక్షన్ల మీద ఛార్జీలను వసూలు చేయడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఇప్పటి వరకు లావాదేవీల మీద ఎలాంటి ఛార్జీలను వసూలు చేయని గూగుల్ పే.. ఇకపై ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, డీటీహెచ్ బిల్స్ చెల్లించినప్పుడు.. అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే వినియోగదారులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఫీజు ఉండదు.గతేడాది నుంచి మొబైల్ రీఛార్జీల మీద రూ. 3 కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తున్న గూగుల్ పే.. ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బిల్స్ మీద 0.5 శాతం నుంచి 1 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి బిల్స్ చెల్లించిన యూజర్లకు ఇప్పటికే ఛార్జీలు పడినట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పులుఅదనపు ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా? లేదా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. భవిష్యత్తులో తప్పకుండా అందరూ ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే?.. దీనిపై గూగుల్ పే స్పందించలేదు. అయితే గూగుల్ పే దీనిని అమలు చేస్తే.. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

భారత్‌తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అసలు సిసిలైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్దులు భారత్-పాకిస్తాన్(India-Pakistan) అమీతెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఐసీసీ ఈవెంట్లలో పాక్‌పై తమ అధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ట్రోఫీ-2017 ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది.ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్‌ల్లో తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, పాక్ కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో జరిగే మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని రౌఫ్ తెలిపాడు."భారత్‌తో మ్యాచ్ సందర్బంగా మాపై ఎలాంటి ఒత్తడి లేడు. ఆటగాళ్లందరూ రిలాక్స్‌గా ఉన్నారు. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే. పాకిస్తాన్-భారత్ మ్యాచ్ అన్ని క్రికెట్ మ్యాచ్‌లనే జరుగుతుంది" అని జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రౌఫ్ పేర్కొన్నాడు. ఇక ఈ మెగా టోర్నీని భారత్ అద్భుతమైన విజయంతో ఆరంభించింది. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. పాక్ మాత్రం కివీస్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్..

‘సెకీ’ ఒప్పందం సక్రమమే
సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సేకరణకు సంబంధించి అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చాయి. సెకీ విద్యుత్ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో ఈ పీఎస్‌ఏపై ఏపీఈఆర్సీ మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (సీఈఆర్సీ) జనరల్ నెట్వర్క్ యాక్సెన్ (జీఎన్ఏ) నిబంధనలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ప్రకారం..‘సెకీ’ విద్యుత్‌కు అంతర్ రాష్ట్ర ప్రసార (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్–ఐఎస్టీఎస్) చార్జీలు వర్తించవు. అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది.సెకీ విద్యుత్ కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు ప్రతిపాదించాయి. అందువల్ల ఈ 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు. – ఏపీఈఆర్‌సీసాక్షి, అమరావతి: రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్లీన్ చిట్ ఇచ్చింది. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్)లో ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. విద్యుత్ సేకరణపై తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్ ‘సెకీ’ విద్యుత్ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. ‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్సీ పేర్కొంది. ఇక సెకీ నుంచి విద్యుత్ సేకరణ ప్రణాళికలో ట్రేడింగ్ మార్జిన్ తగ్గించడంపై జరిగిన చర్చలను కూడా మండలి ప్రస్తావించింది. సీఈఆర్సీ రూ.0.7 పైసల ట్రేడింగ్ మార్జిన్‌తో టారిఫ్‌ను ఇప్పటికే ఆమోదించిందని, అందువల్ల దానిపై కమిషన్ దీనిపై ఇప్పుడు వ్యాఖ్యానించదని తెలిపింది. అంటే గత ప్రభుత్వం కుదుర్చుకున్న ధర యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి విద్యుత్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపధ్యంలో సెకీ లాంటి పీఎస్ఏ ఒప్పందాలను కొందరు డిమాండ్ చేస్తున్నట్లుగా సూమోటోగా కమిషన్ రద్దు చేయలేదని తేల్చి చెప్పింది. కాబట్టి ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబరులో విద్యుత్ సేకరణకు డిస్కంలు కోరిన ప్రణాళికలో సెకీ విద్యుత్‌ను చేర్చడానికి కమిషన్ మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించింది. సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని.. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారని.. పేరుకే సెకీ.. ఒప్పందం అదానీతోనే.. ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సిందే.. జుగల్ బందీలు.. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం.. ఇలా చిలువలు పలువలుగా.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఎల్లో మీడియా, టీడీపీ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని దీన్నిబట్టి తేలిపోయింది. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా బరితెగించినట్లు వెల్లడైంది. అంటే తప్పులేదని ఒప్పుకున్నట్లేగాఅంతరాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలను (ఐఎస్టీఎస్) మినహాయించి యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో యూనిట్ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ కూడా ఆమోదించింది. 2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. నిజానికి సెకీ నుంచి గతేడాది సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవ్వాల్సి ఉంది. తొలి ఏడాది 2024లో 3వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం 7వేల మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుందని ఒప్పందంలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం 4వేల మెగావాట్లను ఈ ఏడాదే తీసుకుంటామంటూ ప్రతిపాదించింది. అంటే ఇన్నాళ్లూ తాము చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని, కల్పిత కథనాలేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్లైంది!సంపద సృష్టించిందెవరు?.. గుదిబండ మోపిందెవరు?సెకీ నుంచి కారుచౌకగా విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ద్వారా గత ప్రభుత్వం ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా చేసింది. ఈ లెక్కన 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా సంపద సృష్టించింది. అదే చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్ యూనిట్ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్ జగన్ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా? చేసిన మంచిని దాచలేరు.. గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని చక్కదిద్దేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్ సరఫరా అందించింది. అందుకుగానూ డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రెండు లక్షలపైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసింది. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చి సాగుకు చేదోడు వాదోడుగా నిలిచింది. రాష్ట్రంలో 9 గంటలు వ్యవసాయానికి పగటిపూట విద్యుత్ సరఫరా చేసేలా 6,663 ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారు. విద్యుత్ రంగానికి, రైతన్నలకు ఇంత మంచి చేసిన వైఎస్ జగన్‌పై బురద చల్లుతూ సెకీ విద్యుత్ ధర ఎక్కువని, ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సి వస్తుందని కూటమి నేతలు, కరపత్రికలు దు్రష్పచారం చేశాయి. చివరికి అవన్నీ తప్పుడు ఆరోపణలని విద్యుత్ నియంత్రణ మండలి తేల్చింది. ఇప్పుడేమంటారు బాబూ..?కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మంత్రి మండలితో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే జరిగింది. సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. దాన్ని రైతుల వ్యవసాయ అవసరాల కోసం అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఆ ధర అప్పటికి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ఈ ఒప్పందంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం, టీడీపీ అనుబంధ కరపత్రిక ఈనాడు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేశాయి.అదానీపై అమెరికాలో ఏదో కేసు నమోదైందని, అందులో జగన్ పేరు ఉందని, లంచం తీసుకున్నారని నిరాధార కథనాలను వండి వార్చాయి. ఈనాడు, టీడీపీ అనుబంధ మీడియా రాసిన అసత్య కథనాలను పట్టుకుని చంద్రబాబు ప్రోద్బలంతో కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఊగిపోయారు. ఏకంగా జగన్‌పైనే కేసు పెట్టినట్లు నిందలేస్తూ ఆరోపణలు గుప్పించారు. సెకీ ఒప్పందానికి అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు రాదని, యూనిట్ రూ.2.49 కూడా ఎక్కువేనని, ప్రజలపై పాతికేళ్లలో రూ.లక్ష కోట్ల భారం పడుతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఏమార్చేందుకు టీడీపీ కరపత్రికలు యత్నించాయి. అవన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. ఇదే చంద్రబాబు గతంలో అత్యధిక ధరలకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పడు మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొన్నారు. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దానిని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నారు. తాజాగా ఏపీఈఆర్సీ ఇచ్చిన స్పష్టత వాటికి చెంపపెట్టులా పరిణమించింది.ఎల్లో కరపత్రం.. ఎంత విషం చిమ్మిందో.. ఆరోపణ: సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణనిజం: సెకీ లేఖ – ఒప్పందానికి మధ్య దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ సమయం. కమిటీ లోతైన అధ్యయనం తరువాతే కేబినెట్ ఆమోదంఆరోపణ: ట్రాన్స్మిషన్ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు నిజం: పాతికేళ్ల పాటు అంతరాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ’సెకీ’ఆరోపణ: సోలార్ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగింది.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్ధిక భారం పడుతుంది.నిజం: ఈ ఒప్పందంలో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. ఒప్పందం జరిగింది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం.. డిస్కమ్‌ల మధ్య! ఇక లంచాలకు తావెక్కడ?రాష్ట్ర చరిత్రలోనే కారుచౌకరాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు ఇక లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? నేరుగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది?‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..» కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49కే సోలార్ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.» ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది. » ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్ పవర్ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్టీఎస్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది. » రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. » ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?» టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది.అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందంæ జరిగితే.. యూనిట్ రూ.2.49కే రాష్ట్రానికి విద్యుత్ దొరుకుతుంటే.. పైగా స్పెషల్ ఇన్సెంటివ్‌గా అంతరాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్‌కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆలోచించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్ మోడల్ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లకు సెకీ ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12 తక్కువకే విద్యుత్ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సింది పోయి బురద జల్లుతారా? మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు మిడిమిడి జ్ఞానంతో చంద్రబాబును మోయాలన్న తాపత్రయంతో... జగన్‌పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?. – ఎల్లో మీడియా దుష్ప్రచార కథనాలపై గతంలో వైఎస్ జగన్ వ్యాఖ్య

దమ్ముంటేరండి!
2014 ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చకు సిద్ధమా? అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా నాతో చర్చకు రావాలి. మీ బంట్లు, బంట్రోతులను ఎవరిని పంపుతారో తేల్చుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో.. ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) ఉన్న గ్రామాల్లో మేం పోటీ చేస్తాం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే బీఆర్ఎస్ పోటీ చేయాలి. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?సాక్షి, నాగర్‌కర్నూల్/ నారాయణపేట: దేశంలో 12 ఏళ్ల మోదీ పాలన, రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ పాలన.. 12 నెలల కాంగ్రెస్ పాలనపై తనతో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్లకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఎవరు వస్తారో, ఎక్కడికి వస్తారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు అయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దుస్థితిలో ఉందని సీఎం విమర్శించారు.శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం మెడికల్ కళాశాల, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలకు ప్రారంబోత్సవం చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పెట్రోల్ బంక్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే... రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎన్నో పనులు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎప్పుడో బ్రిటిష్ కాలమైన 1931లో చేసిన కులగణన తప్ప ఈనాటికీ ఎవరూ లెక్క చెప్పలేదు. బీసీలు చైతన్యం అవుతున్నారు. తమ లెక్క చెప్పాలని అంటున్నారు. దేశంలో మొదటిసారి ప్రతి కులం లెక్క తీసేందుకు కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచాం. 30ఏళ్లుగా పీటముడి పడిన ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపాం.ఏడాదిలోనే సాధించిన ఈ విజయాలు కేసీఆర్ కళ్లకు కనబడటం లేదా? ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు కాకముందే దిగిపోవాలని చూస్తున్నారు. కళ్లలో నిప్పులు, కడుపులో కత్తులు పెట్టుకొని మన మధ్యనే పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. తాను కొడితే గట్టిగా వేరేలా ఉంటుందని కేసీఆర్ అంటున్నారు. ఆయన కొట్టాల్సి వస్తే ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీలు చేసిన కొడుకును, ఢిల్లీలో లిక్కర్ దందా చేసిన బిడ్డను, కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు మింగిన అల్లుడిని కొడితే వాళ్లకు బుద్ధి వస్తుంది. కేసీఆర్ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు.. పాలమూరు నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినా ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఉన్నా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన పాపం బీఆర్ఎస్దే. అప్పుడే పూర్తిచేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయతీ ఎందుకు వచ్చేది? పోతిరెడ్డిపాడు ద్వారా జగన్ ఏపీకి 40వేల క్యూసెక్కులు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఊడిగం చేశారు. ఆనాడు మంత్రిగా ఉన్నది హరీశ్‌రావు కాదా? జగన్‌తో కలసి ప్రగతిభవన్‌లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం పన్నింది ద్రోహం కాదా? రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 10 టీఎంసీల చొప్పున నెల రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుంది. మహిళలకు ఏడాదికి రెండు చీరలు.. దేశంలోనే మొట్టమొదటిసారిగా నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభించాం. ఇందిరా మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళల చేతికి పర్యవేక్షణ, మహిళా సమాఖ్యల ఆధ్యర్యంలో 600 బస్సుల కొనుగోలు, పావలా– జీరో వడ్డీ రుణాలతో మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని మహిళా సంఘాల మహిళలకు ఏడాదికి 2 నాణ్యమైన చీరలు అందిస్తాం. పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చే బాధ్యత నాది.ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపుతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు మళ్లీ అధికారం కల: మంత్రులు రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది కలగానే మిగులుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని అలాంటిది ఏడాది పాలనలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని చెప్పారు. రాష్ట్రంలో కులగణనతోపాటు ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపి చరిత్రలో నిలిచామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సామాజిక న్యాయం అందిస్తూ అసమానతలను తొలగిస్తామన్నారు. నిన్నేం అంటలేను అక్కా.. – సీఎం రేవంత్, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం గేటు వద్ద మహిళా సమాఖ్య ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ప్రారంబోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఒకచోటుకు చేర్చి, మహిళా శక్తిని చాటుతూ నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరతామని సీఎం రేవంత్ పేర్కొనగా.. ఎంపీ డీకే అరుణ కలుగజేసుకుని కేంద్రం ఇప్పటికే నిధులను ఇస్తోందని చెప్పారు.దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘కేంద్రం ఇస్తుంది. ఇవ్వాలి. మిమ్మల్ని ఏమీ అనడం లేదు అక్కా. ప్రజలకు సేవ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మీకు ఇక్కడ తల్లి గారిల్లు, అక్కడ అత్త గారిల్లు, పిల్లల కోసం ఎవరేం ఇచ్చినా వద్దు అనలేం. అవసరమైనప్పుడు అందరం ఒక్క తాటిపై నిలబడాలి..’’ అని పేర్కొన్నారు.

అదరగొట్టిన దక్షిణాఫ్రికా
కరాచీ: సుదీర్ఘ కాలంగా ఐసీసీ ట్రోఫీ టైటిల్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న దక్షిణాఫ్రికా చాంపియన్స్ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టింది. తొలిసారి టోర్నీ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా తమ స్థాయికి తగ్గ ఆటతో పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో చెలరేగిన మాజీ చాంపియన్ ఆ తర్వాత పదునైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ర్యాన్ రికెల్టన్ (106 బంతుల్లో 103; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ బవుమా (76 బంతుల్లో 58; 5 ఫోర్లు), మార్క్రమ్ (36 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), డసెన్ (46 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్ షా (92 బంతుల్లో 90; 9 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. మూడు అర్ధ సెంచరీలు... ఇన్నింగ్స్ ఆరంభంలోనే టోనీ జోర్జి (11) వెనుదిరగ్గా ... రికెల్టన్, బవుమా కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. తొలి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 46 పరుగులకు చేరింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రికెల్టన్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు అఫ్గాన్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 63 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్న అనంతరం నబీ బౌలింగ్‌లో బవుమా వెనుదిరిగాడు. రికెల్టన్, బవుమా రెండో వికెట్‌కు 23.4 ఓవర్లలో 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి 101 బంతుల్లో రికెల్టన్ కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే అతను అనూహ్యంగా రనౌటయ్యాడు. కీలక వికెట్ తీసిన ఆనందం అఫ్గాన్‌కు దక్కలేదు. ఆపై డసెన్, మార్క్రమ్ తమ జోరును ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా స్కోరు 300 దాటింది. రహ్మత్ షా మినహా... భారీ ఛేదనలో అఫ్గాన్ టీమ్ తడబడింది. రహ్మత్ షా పట్టుదలగా నిలబడినా... ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. నలుగురు సఫారీ పేసర్ల ధాటికి బ్యాటర్లు నిలవలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేసరికే తొలి 2 వికెట్లు కోల్పోయిన జట్టు తర్వాతి 5 ఓవర్లలో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 89/5 స్కోరు వద్ద జట్టు గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. రహ్మత్ మాత్రం కాస్త పోరాడుతూ సెంచరీకి చేరువయ్యాడు. అయితే మరోవైపు నుంచి అతనికి సహకారం లభించలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (రనౌట్) 103; టోనీ జోర్జి (సి) అజ్మతుల్లా (బి) నబీ 11; బవుమా (సి) సాదిఖుల్లా (బి) నబీ 58; డసెన్ (సి) హష్మతుల్లా (బి) నూర్ 52; మార్క్రమ్ (నాటౌట్) 52; మిల్లర్ (సి) రహ్మత్ (బి) ఫారుఖీ 14; యాన్సెన్ (బి) అజ్మతుల్లా 0; ముల్డర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 315. వికెట్ల పతనం: 1–28, 2–157, 3–201, 4–248, 5–298, 6–299. బౌలింగ్: ఫారుఖీ 8–0–59–1, అజ్మతుల్లా 6–0–39–1, నబీ 10–0– 51–2, రషీద్ ఖాన్ 10–0–59–0, గుల్బదిన్ 7–0–42–0, నూర్ అహ్మద్ 9–0–65–1. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) మహరాజ్ (బి) ఎన్గిడి 10; ఇబ్రహీమ్ (బి) రబడ 17; సాదిఖుల్లా (రనౌట్) 16; రహ్మత్ షా (సి) రికెల్టన్ (బి) రబడ 90; హష్మతుల్లా (సి) బవుమా (బి) ముల్డర్ 0; అజ్మతుల్లా (సి) రికెల్టన్ (బి) రబడ 18; నబీ (సి) రబడ (బి) యాన్సెన్ 8; గుల్బదిన్ (సి) బవుమా (బి) ఎన్గిడి 13; రషీద్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 18; నూర్ (బి) ముల్డర్ 9; ఫారుఖీ (నాటౌట్) 0; ఎక్స్ ట్రాలు 9; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–16, 2–38, 3–50, 4–50, 5–89, 6–120, 7–142, 8–169, 9– 208, 10–208. బౌలింగ్: యాన్సెన్ 8–1– 32– 1, ఎన్గిడి 8–0–56–2,రబడ 8.3–1–36–3, ముల్డర్ 9–0–36–2, మహరాజ్ 10–0–46–1. చాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆ్రస్టేలియా X ఇంగ్లండ్‌వేదిక: లాహోర్ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం
బ్యాంకులు ప్రదర్శిస్తున్న ఈ అసమానత వింత గొలుపుతుంది. ఒక ఆర్టీఐ అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ, 2014 ఏప్రిల్ 1 నుండి కార్పొరేట్ ఇండియాకు సంబంధించి రూ. 16.61 లక్షల కోట్ల మొండి రుణాలనుబ్యాంకులు మాఫీ చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. మరుసటి రోజు రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ పార్లమెంటులో మాట్లాడుతూ, దేశంలో బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు ఇప్పుడు రూ. 32 లక్షల కోట్లు దాటాయని అన్నారు. 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ అని బేనీ వాల్ అన్నారు. రైతులకు వ్యవసాయ రుణ మాఫీ పథకం గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.కార్పొరేట్లకు రుణమాఫీదీనికి విరుద్ధంగా, గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్లు చేసిన మొత్తం రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) రద్దు చేశారు. గత ఐదేళ్లలో కార్పొరేట్లు చెల్లించని రుణా లలో రూ. 10.6 లక్షల కోట్లను రద్దు చేయడానికి భారతీయబ్యాంకులు ఏమాత్రం సందేహించలేదు. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలకు చెందినవని నివేదికలు చెబుతున్నాయి. అదే కర్ణాటక, శివమొగ్గలోని ఒక రైతు కేవలం తన రూ. 3.46 పైసల బకాయి చెల్లించేందుకు సాధారణ బస్సు సర్వీస్ లేకపోతే, 15 కిలో మీటర్లు నడిచివెళ్లాల్సినంతటి ఆత్రుతను బ్యాంక్ ప్రదర్శించింది.2023–24 ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు రూ. 1.7 లక్షల కోట్లు మాఫీ చేశాయి. ఒక సంవత్సరం క్రితం, 2022–23లో రూ. 2.08 లక్షల కోట్లు మాఫీ చేశాయి. కానీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసే విషయానికి వస్తే, కేంద్రం రెండుసార్లు మాత్రమే ఆ పని చేసింది: 1990, 2008లో. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వ్యవ సాయ రుణాల మాఫీ చేశాయి. కానీ మాఫీ చేసిన మొత్తాన్ని బ్యాంకు లకు రాష్ట్రాలు చెల్లిస్తున్నందున అది బ్యాంకులపై భారం కాదు. కార్పొ రేట్లు చెల్లించని బ్యాంకు రుణాలను అవి దేశ నిర్మాణానికి తోడ్ప డ్డాయనేంత జాగ్రత్తగా మాఫీ చేశారు. చిన్న రుణాలు మాఫీ చేయలేమా?పేద రైతులు, గ్రామీణ శ్రామికవర్గం చేసిన చిన్న చిన్న రుణా లను మాఫీ చేయడం అనేది జాతీయ బ్యాలెన్స్ షీట్‌ను కలవర పెట్టడానికి కారణంగా కనిపిస్తుంది. అదే ధనవంతులైన రుణమాఫీ దారులు సులభంగా తప్పించుకుంటారు. వీరిలో రూ.3.45 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించని 16,000 మందికి పైగా ఉద్దేశ పూర్వక రుణమాఫీదారులు ఉన్నారు. పైగా వారివద్ద డబ్బు ఉందని ఆర్బీఐ అంగీకరించినప్పటికీ వారు తిరిగి చెల్లించడానికి ఇష్టపడలేదు. కచ్చితంగా, వీరు సంపద సృష్టికర్తలు. దేశం వారిని అభినందించాలన్నమాట!ఇప్పుడు రాజస్థాన్‌లోని పీలీబంగాకు చెందిన ఒక రైతును చూడండి: ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 2.70 లక్షల రుణం తీసుకొని రూ. 2.57 లక్షలను తిరిగి చెల్లించాడు (మహమ్మారి సమయంలో రాష్ట్రం నుండి అందుకున్న రూ. 57,000 మద్దతుతో సహా). మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఆయన ఒక రోజు ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తరువాత, ఆగ్రహించిన గ్రామస్థులు ఆ తాళం పగలగొట్టారు.ఈ దురదృష్టకర సంఘటనను మరొకదానితో పోల్చి చూద్దాం. ప్రముఖ మిశ్రమ లోహ, ఉక్కు తయారీదారు అయిన ‘ఆధునిక్ మెటాలిక్స్’... 2018 జూలైలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా శాఖ తన పరిష్కార ప్రణాళికను ఆమోదించిన తర్వాత, తమ బకాయిలు రూ. 5,370 కోట్లకుగానూ కేవలం రూ. 410 కోట్లు చెల్లించడానికి ఒప్పుకుంది. అంటే 92 శాతం రుణమాఫీ! స్పష్టంగా, ఇంత పెద్ద ‘రుణమాఫీ’ తర్వాత, కంపెనీ ప్రమోటర్లు అన్ని కార్యకలాపాలను పూర్తి చేయడానికీ, ప్రధానసంస్థను పునరుద్ధరించి తిరిగి పని చేయడం ప్రారంభించడానికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు పరివర్తనాత్మక పరిష్కార యంత్రాంగంగా ప్రశంసలందుకున్న దివాళా కోడ్ ఇప్పుడు ఒక వైఫల్యంగా మారిపోయింది.అయితే, పెద్ద ప్రశ్న మిగిలే ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ. 20,000 మొత్తాన్ని తిరిగి పొందలేకపోయినందుకు రాజస్థాన్ రైతు ఇంటికి తాళం వేయగలిగినప్పుడు, పెండింగ్‌లో ఉన్న బకాయిలలో 92 శాతం మాఫీ చేసి రాజమార్గాన పంపడానికి బదులుగా, ఆధునిక్ మెటాలిక్స్ వంటి సంస్థల ప్రాంగణాన్ని ఎన్సీఎల్టీ ఎందుకు తాళం వేయలేకపోయింది? రైతుల వంటి వారే అయిన ఆ యజమానులను ఎందుకు కటకటాల వెనుక ఉంచలేకపోయింది?చట్టాల్లో ఎందుకు తేడా?ఒక పెద్ద కంపెనీకి ఇంత పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, రైతులు ఇలాంటి విధానంతో ప్రయోజనాన్ని, అది కూడా సాపేక్షంగా తక్కువ అయినాసరే ఎందుకు పొందకూడదు? వివిధ వర్గాల బ్యాంకు వినియోగదారులకు బ్యాంకింగ్ చట్టాలు ఎందుకు భిన్నంగాఉండాలి? గృహనిర్మాణం, కారు, ట్రాక్టర్ లేదా మోటార్ సైకిల్ రుణాలు తీసుకునే వారిని బ్యాంకులు ఎప్పుడైనా అదే రకమైన సున్ని తత్వంతో చూస్తాయా? ఆర్థిక వృద్ధి పేరుతో కంపెనీల మొండి బకాయిలను మాఫీ రూపంలో తమ సొంతం చేసుకోవాల్సిన అగత్యాన్ని బ్యాంకులు ఎంతకాలం సమర్థించుకోగలవు?పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో నిటారుగా నిలబడి ఉన్న తమ కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలను తిరిగి దున్నడానికి ట్రాక్టర్లను నడుపుతున్న రైతుల బాధాకరమైన వీడియోలను; ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్లలో టమోటా ధరలు పతనమై రైతులు కుప్పగూలిపోవడాన్ని నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు తీవ్రంగా బాధపడ్డాను. టమోటా, ఉల్లిపాయ, బంగాళాదుంపల ధరలను స్థిరీకరించడానికి రూ. 500 కోట్ల వ్యయంతో 2018–19 బడ్జెట్లో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్స్ పథకం నాకు ఇలాంటి సందర్భాల్లో గుర్తుకువస్తుంది. కోల్డ్ చైన్స్ నెట్‌వర్క్‌తో సహా వ్యవసాయ మౌలిక సదుపా యాలలో తగినంత పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ వాస్తవికత ఏమిటంటే, కూరగాయల ధరలను స్థిరీకరించడంలో ఆపరేషన్ గ్రీన్స్ పథకం ఘోరంగా విఫలమైంది. తగిన నిధుల మద్దతు లేకపోవడం ఒక కారణం కావచ్చు.రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్సీఐఎల్) దివాళా తీసిన తీర్మానాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 2023 డిసెంబర్లో ఆమోదించింది. ఈ సంస్థ క్లెయిమ్ చేసిన రుణంలో 99 శాతాన్ని మాఫీ చేయడం జరిగింది. చూడండి విచిత్రం: 2018–19లో ఆపరేషన్ గ్రీన్స్ కోసం కేటాయించిన రూ. 500 కోట్లతో పోలిస్తే, ఆర్సీఐఎల్ రూ. 47,251.34 కోట్ల క్లెయిమ్‌కు బదులుగా కేవలం రూ. 455.92 కోట్లు చెల్లించి బయటపడింది. మాఫీ చేసిన ఆ మొత్తాన్ని తిరిగి పొంది ఆపరేషన్ గ్రీన్స్ లో పెట్టుబడి పెడితే, పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక వనరుల కొరత ఏమాత్రం ఉండేది కాదు.- దేశంలో 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ.- గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్ల రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) బ్యాంకులు రద్దు చేశాయి. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలవి.- ఒక పెద్ద కంపెనీకి పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, ఒక చిన్న రైతు అలాంటి ప్రయోజనం ఎందుకు పొంద కూడదు?- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు , ఈ–మెయిల్: hunger55@gmail.com- దేవీందర్ శర్మ

ఖైదీలపై ఇంత వివక్షా!
జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు శిక్షనుంచి మినహాయింపు (రెమిషన్) ఇవ్వడానికి సంబంధించిన విధానం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతనీ, ఖైదీలు అడగటం లేదు గనుక ఆ మినహాయింపుపై ఆలోచించాల్సిన అవసరం లేదని భావించటం సరికాదనీ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పు కీలకమైనది. ఒక చట్టం రూపొందటం వెనక ఎంతో కృషి ఉంటుంది. దాని అవసరాన్ని గుర్తించటం తొలి మెట్టయితే ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. తొలుత చట్టం పూర్వరూపమైన బిల్లు ముసాయిదా రూపురేఖలపైనా, ఆ తర్వాత దాన్లో ఉండాల్సిన నిబంధనలపైనా, పరిహరించవలసినవాటిపైనా లోతైన చర్చలుంటాయి. చట్ట సభలోనూ, పౌర సమాజంలోనూ దాని మంచిచెడ్డలపై నిశిత పరిశీలన ఉంటుంది. తీరా చట్టం అయ్యాక ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కృషి మొత్తం వృథా అవుతుంది. కొన్ని ప్రభుత్వాల ధోరణి మరీ అన్యాయం. ఖైదీల శిక్ష మినహాయింపుపై వాటికంటూ విధానమే ఉండదు. ఆ బాపతు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది. ఇంతవరకూ శిక్ష మినహాయింపుపై విధానం లేని రాష్ట్రాలు రెండు నెలల్లో ఆ పని చేయాలనీ, అది వాటి బాధ్యతనీ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఖైదీలు అడగలేదన్న సాకు చెల్లదన్నది తీర్పు సారాంశం.నిన్న మొన్నటివరకూ నూటయాభైయ్యేళ్ల నాటి నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) ఉండేది. దానిస్థానంలో నిరుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అమల్లోకొచ్చింది. సీఆర్పీసీ లోని చాలా నిబంధనలు బీఎన్ఎస్ఎస్లోకి కూడా వచ్చాయి. కాకపోతే ఆ సెక్షన్ల క్రమసంఖ్యలు మారాయి. ఖైదీలకు శిక్షాకాలం నుంచి మినహాయింపునిచ్చేందుకు, ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచేందుకూ ప్రభుత్వానికి సీఆర్పీసీలోని సెక్షన్ 432 అధికారం ఇవ్వగా... బీఎన్ఎస్ఎస్లోని 473వ సెక్షన్ ఆ పని చేస్తోంది. చట్టం ఇంత స్పష్టంగావున్నా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ సెక్షన్లకు అనుగుణంగా విధాన రూపకల్పన చేసిన ప్రభుత్వాలూ, అసలు దాని జోలికేపోని ప్రభుత్వాలూ కూడా శిక్ష మినహాయింపు ఇవ్వొచ్చన్న సంగతే తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి.జైళ్లంటే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. అక్కడ నిర్బంధంలో ఉన్నవారంతా ఏదో తప్పు చేసేవుంటారన్న భావనలోనే చాలామంది ఉంటారు. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్నవారిలో కూడా చాలామందికి జరిగిన నేరంతో నిజంగా ప్రమేయం లేకపోవచ్చు. సకాలంలో తగిన న్యాయసహాయం అందకపోవటం వల్ల కావొచ్చు... ఆర్థిక స్థోమత లేకపోవటంవల్ల కావొచ్చు వారు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉండొచ్చు. పలుకుబడి ఉన్నవారు తమ నేరాన్ని వేరేవారిపైకి నెట్టి వారు జైలుకు పోయేలా చేసిన సందర్భాలూ అప్పుడప్పుడు బయట పడు తుంటాయి. ఒకవేళ నిజంగా నేరంతో ప్రమేయం ఉన్న వ్యక్తికి సైతం అతడి హక్కులన్నీ హరించుకు పోవు. శిక్ష కారణంగా కొన్ని హక్కులు తాత్కాలికంగా నిలిచిపోతాయి. శిక్ష మినహాయింపు అర్హత పొందిన ఖైదీలకు ఆ వెసులుబాటును కల్పించకపోవటం అంటే ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించటమే, ఏకపక్షంగా వ్యవహరించటమే అవుతుంది. చట్టం ముందు పౌరులందరూ సమానులేనని, ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించరాదని ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించే రాజ్యాంగంలోని 14వ అధికరణ స్పష్టం చేస్తోంది. శిక్షలో మినహాయింపునకు అర్హత పొందినవారికి దాన్ని నిరాకరించటం అంటే ఈ అధికరణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. శిక్షకాలంలో మినహాయింపునివ్వటం కూడా విచక్షణా రహితంగా ఉండకూడదు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నేర స్వభావంలో మార్పు వచ్చిందో లేదో గమ నించటం, సమాజంలో సాధారణ మనిషిగా జీవించ గలుగుతాడా అని చూడటం జైలు అధికారుల బాధ్యత.వారినుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన నిర్ణయానికి రావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికుంటుంది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశాన్ని గుర్తుచేసింది. శిక్ష మినహాయింపునకు రూపొందించే నిబంధనలు ఖైదీలు వినియోగించుకోవటం అసాధ్యమైన రీతిలో కఠినంగా ఉండరాదని... అవి అస్పష్టంగా కూడా ఉండకూడదని సూచించింది. ఒకవేళ మినహా యింపునకు అర్హత లేనట్టయితే అందుకు గల కారణాలేమిటో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జైలు అధికారులు వివరించాల్సి వుంటుంది. అదే సమయంలో తన అనర్హతకు చూపిన కారణాలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఖైదీకి చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. ఒకవేళ బయటి కెళ్లాక ఖైదీ ప్రవర్తన సమాజానికి హాని కలిగే రీతిలో ఉన్నదని భావిస్తే శిక్ష మినహాయింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుంటుంది. అందుకుగల కారణాలను ఆ ఖైదీకి వివరించాలి.చట్టాలు చేయగానే సరికాదు. వాటిని వినియోగించటానికి అవసరమైన విధానాలను కూడా రూపొందించాలి. చిత్తశుద్ధితో వాటిని అనుసరించాలి. ఆచరణకు అనువైన విధానం లేనట్టయితే చట్టాల ఉద్దేశమే నీరుగారుతుంది. 2022 నాటి నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని 1,300కు పైగా జైళ్లలో 5,73,200 మంది ఖైదీలున్నారు. ఈ జైళ్లలో వాస్తవానికి 4,36,266 మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. జైళ్లు ఇలా కిక్కిరిసి ఉండటంవల్ల అవి సకల రుగ్మతలకూ నిలయాలవుతున్నాయి. నిస్సహాయుల పాలిట నరకాలవుతున్నాయి. చాలీచాలని సిబ్బందితో పర్యవేక్షణ అసాధ్యమై నిజంగా నేరం చేసినవారిని సంస్కరించటం మాట అటుంచి, అకారణంగా జైలుపాలైనవారు సైతం నేరగాళ్లుగా మారే ప్రమాదం పొంచివుంటోంది. తాజా తీర్పు ప్రభుత్వాల మొద్దునిద్ర వదిలించాలి.

ఇక వెండి.. కొండ!
ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి రేట్లకు దీటుగా పరుగులు తీసేందుకు వెండి కూడా సన్నద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఖరీదైన బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు వెండి వైపు చూస్తుండటంతో పాటు పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన డిమాండ్ పెరుగుతుండటం కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. బంగారం, వెండి మధ్య కీలక నిష్పత్తుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు దీన్ని సూచిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏడాది వ్యవధిలో వెండి రేటు కేజీకి రూ. 1.1 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారానికి మించి వెండి అధిక రాబడులు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు చూసే ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. నిష్పత్తి చెబుతోందిదే.. బంగారంతో పోలిస్తే వెండి ధర ఎంత చౌకగా ఉంది, లేదా ఎంత ఎక్కువగా ఉంది అనేది తెలుసుకోవడానికి రెండింటి రేట్ల మధ్య నిర్దిష్టంగా ఉండే నిష్పత్తి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ఆల్‌టైమ్ కనిష్టం అయిన 0.01 స్థాయిలో ఉంది. ఈ నిష్పత్తి ఆల్‌టైం గరిష్టం 0.06 స్థాయి. సాధారణంగా సగటున ఒక్క ఔన్సు (31.1) గ్రాముల బంగారం విలువ, 60 నుంచి 70 ఔన్సుల వెండి విలువకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఒక్క ఔన్సు బంగారం కొనాలంటే 90 ఔన్సుల వెండి అవసరమవుతోంది. ఈ వ్యత్యాసం సగటు స్థాయికి తగ్గాలంటే వెండి మరింతగా పెరగాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో పసిడి భారీగా ఎగిసిన నేపథ్యంలో స్వల్పకాలానికి వెండిని కొనుగోలు చేస్తే సురక్షితంగా ఉంటుందనే భావన ఇన్వెస్టర్లలో నెలకొంది. గత మూడేళ్లుగా రాబడుల విషయంలో పసిడితో పోలిస్తే వెండి వెనకబడింది. డాలరు మారకంలో పసిడిపై రాబడులు సుమారు 54 శాతంగా ఉండగా, వెండిపై రాబడులు 37 శాతమే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి రేటు 11.77 శాతం పెరగ్గా, వెండి రేట్లు 13.3 శాతం పెరిగాయి. 3,200 డాలర్ల దిశగా పసిడి!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం భారీగా ఎగియొచ్చన్న అంచనాలు పసిడి ర్యాలీకి దోహదపడుతున్నాయి. సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ. 2,948 డాలర్లకు పెరిగింది. ఇది ఈ ఏడాది ఏకంగా 3,200 డాలర్లకు ఎగియొచ్చనే పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుత స్థాయి నుంచి మరీ దూకుడుగా ధరల పెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత విషయంలో జాప్యం చేసే అవకాశాలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు, ట్రేడ్ టారిఫ్‌ల అమలు నెమ్మదించడం వంటి అంశాలు ప్రతికూలంగా మారొచ్చని వివరించాయి.ఇన్వెస్టర్లు, పరిశ్రమల దన్ను.. ఇటు ఇన్వెస్టర్లు, అటు పరిశ్రమల నుంచి డిమాండ్ నెలకొనడంతో సమీప భవిష్యత్తులో పసిడికి మించి వెండి ర్యాలీ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాది వ్యవధిలో వెండి ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తోంది.అంటే సగటున 20 శాతం రాబడి ఉండొచ్చు. దీంతో ప్రస్తుతం రేటు తగ్గితే కొనుక్కుని దగ్గర పెట్టుకోవడం మంచిదని సూచించాయి. అయితే, వెండి మీద అధిక రాబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాయి. పసిడితో పోలిస్తే వెండి ధరలో హెచ్చుతగ్గులు 2.5 రెట్లు అధికంగా ఉంటాయని వివరించాయి. ఏడాది వ్యవధిలో వెండి ఈటీఎఫ్‌ల్లో రాబడులు (%)ఏబీఎస్ఎల్ సిల్వర్ 36.36 కోటక్ సిల్వర్ 36.34 డీఎస్పీ సిల్వర్ 36.21 హెచ్డీఎఫ్సీ సిల్వర్ 36.13 యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ 36.01 ఫిబ్రవరి 20 గణాంకాల ప్రకారం–సాక్షి, బిజినెస్‌డెస్క్
‘ఎల్రక్టానిక్స్’కే రూ.320 కోట్లు
సర్.. ప్రజలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అంటున్నారు!
చేతివృత్తులకు చేయూత
ఒక్క భారత్ ఏంటి సార్! ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలైనా మనం జోక్యం చేసుకుంటున్నాం!
డేటా ఇంజనీర్లకు శిక్షణ
ఖైదీలపై ఇంత వివక్షా!
రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం
గరిష్టానికి ఆర్థిక లోటు
సెలక్షన్స్‌పై ‘వీడియో’ కన్ను
భారత్‌లో మరోసారి కామన్వెల్త్ క్రీడలు!
ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి.. సమాజంలో గౌరవం పెరుగుతుంది
సాక్షి కార్టూన్ 21-02-2025
నీ దగ్గర ఉన్నంత డబ్బు నా దగ్గర కూడా లేదు!
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు
‘మార్గదర్శి’ మోసాల కేసు మూత
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేత వర్మ సంచలన ట్వీట్
ఏవండీ.. మీ స్నేహితుడు రాత్రంతా మన ఇంట్లోనే నిద్రించాడు..!
Raamam Raaghavam Review: ‘రామం రాఘవం’ రివ్యూ
Hyderabad: హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం
‘ఎల్రక్టానిక్స్’కే రూ.320 కోట్లు
సర్.. ప్రజలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అంటున్నారు!
చేతివృత్తులకు చేయూత
ఒక్క భారత్ ఏంటి సార్! ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలైనా మనం జోక్యం చేసుకుంటున్నాం!
డేటా ఇంజనీర్లకు శిక్షణ
ఖైదీలపై ఇంత వివక్షా!
రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం
గరిష్టానికి ఆర్థిక లోటు
సెలక్షన్స్‌పై ‘వీడియో’ కన్ను
భారత్‌లో మరోసారి కామన్వెల్త్ క్రీడలు!
ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి.. సమాజంలో గౌరవం పెరుగుతుంది
సాక్షి కార్టూన్ 21-02-2025
నీ దగ్గర ఉన్నంత డబ్బు నా దగ్గర కూడా లేదు!
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు
‘మార్గదర్శి’ మోసాల కేసు మూత
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేత వర్మ సంచలన ట్వీట్
ఏవండీ.. మీ స్నేహితుడు రాత్రంతా మన ఇంట్లోనే నిద్రించాడు..!
Raamam Raaghavam Review: ‘రామం రాఘవం’ రివ్యూ
Hyderabad: హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం
సినిమా

అమ్మ అంజనాదేవికి అస్వస్థత.. స్పందించిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అస్వస్థత గురైనట్లు వచ్చిన వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన ట్వీట్ చేశారు. మా అమ్మ అస్వస్థతకు గురైందని కొన్ని మీడియా కథనాలు చూశానని వెల్లడించారు. అమ్మ కొద్దిపాటి అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని.. రెండు రోజుల ముందు నుంచే ఆమెకు ఆరోగ్యం కాస్తా బాగాలేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని.. సంపూర్ణం ఆరోగ్యంతో ఉన్నారని చిరంజీవి తెలిపారు. అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నా అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థత గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే కేవలం రెగ్యూలర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లినట్లు వారి కుటుంబ సన్నిహితులు తెలిపారు. కానీ సోషల్ మీడియాలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కథనాలొచ్చాయి. దీంతో మెగాస్టార్ చిరు స్పందించారు. తాజాగా అమ్మ అంజనాదేవి ఆరోగ్యంపై అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార్ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. My attention is drawn to some media reports claiming our mother is unwell and is hospitalised. Want to clarify that she was a little indisposed for a couple of days. She is hale and hearty and is perfectly alright now. Appeal to all media not to publish any speculative reports…— Chiranjeevi Konidela (@KChiruTweets) February 21, 2025

నేను సంతూర్ మమ్మీలా ఉంటా.. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి?: నటి
మలయాళ నటి చిత్ర నాయర్ (Actress Chitra Nair) రెండో పెళ్లి చేసుకుంది. ఆర్మీ ఏవియేషన్ విభాగంలో పనిచేసే లెనీష్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం విశేషం! ఈ వివాహ వేడుకకు చిత్ర కుమారుడు, లెనీష్ కుమార్తె సహా ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. అలాగే పెళ్లి వీడియోను చిత్ర సోషల్ మీడియాలో షేర్ చేసింది.జాతకాలు చూసే పెళ్లి.. చివరకేమైంది?గతంలో ఓ ఇంటర్వ్యూలో చిత్ర మాట్లాడుతూ.. నా కొడుక్కి పద్నాలుగేళ్లు. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. నాకు 36 ఏళ్లు. అందరూ సంతూర్ మమ్మీ అని పిలుస్తుంటారు. నా పక్కన ఉన్న కొడుకుని చూసి నా తమ్ముడనుకుంటారు. 21 ఏళ్ల వయసులోనే నాకు పెళ్లయింది. అది పెద్దలు కుదిర్చిన సంబంధం. జాతకాలు అన్నీ చూశాకే నాకు పెళ్లి చేశారు. చివరకు ఏమైంది? ఎనిమిదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం.కచ్చితంగా ఆలోచిస్తా..మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అని నన్నడిగితే కచ్చితంగా ఆలోచిస్తానని చెప్తాను. నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే ఎందుకు వదులుకుంటాను? ఈ విషయంలో నా కొడుక్కి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈసారి జాతకాలు కలిసాయా? లేదా? అని మాత్రం చూడను. అయితే ఇప్పుడే పెళ్లి గురించే ఆలోచించడం లేదు అని చెప్పుకొచ్చింది.యాక్టర్‌గా మారిన టీచర్కేరళకు చెందిన చిత్రనాయర్ గతంలో ఉపాధ్యాయినిగా పని చేసింది. కరోనా సమయంలో తన వృత్తిని వదిలేసి సినిమావైపు ఆసక్తి చూపించింది. ఆడిషన్స్‌కు వెళ్లి తనకంటూ కొత్తదారి నిర్మించుకుంది. మోహన్‌లాల్ 'ఆరట్టు' చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైంది. పార్ట్నర్స్, సురేశింతెయుమ్ సుమలతయుదెయుం హృదయహరియయ ప్రణయకథ, పొరట్టు నడకం, క్వీన్ ఎలిజబెత్, ఎన్న తాన్ కేస్ కొడు వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by chithra_nair_L (@chithra_nair_official) చదవండి: ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి

ఆ సినిమాలో మోహన్‌లాల్ నటన నాకు నచ్చలేదు.. కానీ: రాం గోపాల్ వర్మ
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2002లో ఆర్జీవీ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. అజయ్ దేవగణ్, మనీషా కొయిరాలా జంటగా నటించిన కంపెనీ అనే మూవీలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాంగోపాల్ వర్మ మోహన్ లాల్ నటన గురించి వివరించారు. తన సినిమాలో ఎక్కువ రీటేక్‌లు తీసుకున్నాడని అన్నారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. ' నా సినిమా కంపెనీ కోసం మొదటిసారి మోహన్ లాల్‌ను కలిశా. నా సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడా. తన పాత్ర గురించి చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడిగుతాడేమోనని నేను ముందుగానే సిద్ధం అయ్యా. కథ మొత్తం చెప్పడం పూర్తయిన తర్వాత అతను నన్ను అడిగిన ఏకైక ప్రశ్న ఇదే. సార్, మీకు ఎన్ని రోజులు కావాలి? అన్నారు. ఇలాంటి క్లైమాక్స్ నేను ఊహించలేదు. నాతో మాత్రమే కాదు.. అందరితోనూ ఆయన ఇలానే చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే అతనికి సినిమాల గురించి పూర్తి అవగాహన ఉంది. డైరెక్టర్ నమ్మకానికి తగినట్లుగా ఏ పాత్రనైనా చేస్తాడని భావించా' అని తెలిపారు.కంపెనీ షూటింగ్ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు మోహన్ లాల్ ప్రదర్శన పట్ల నేను అసంతృప్తిగా ఉన్నా. అతను సరిగ్గా చేయడం లేదని అనుకున్నా. ఆయన ఓ సీన్లో ఎక్కువ టేక్‌లు అడుగుతూనే ఉన్నాడు. దాదాపు ఆరు, ఏడు టేక్‌ల తర్వాత వాటిని చెక్ చేశా. ఆ తర్వాత తెలిసింది. మొదటి టేక్‌లోనే అద్భుతంగా చేశాడనిపించింది. నిజంగా మోహన్ లాల్ సహ నటుడు.' అంటూ కొనియాడారు. కాగా.. 2002లో వచ్చిన కంపెనీ చిత్రంలో మోహన్‌లాల్.. వీర్పల్లి శ్రీనివాసన్ అనే ఐపీఎస్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించాడు.

కబాలి నటి క్రైమ్ థ్రిల్లర్.. నాలుగు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి మూవీతో అలరించిన నటి సాయి ధన్సిక. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అయితే ఇటీవల సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'దక్షిణ'. ఓ సైకో కిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.తాజాగా ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ రోజు నుంచే లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సాయి ధన్సిక ఏసీపీ పాత్రలో కనిపించింది. అమ్మాయిలను వరుస హత్యలు చేస్తోన్న ఆ సైకో కిల్లర్‌ను ఏసీపీ పట్టుకుందా? ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలేంటి? అసలు ఆ కేసును ఆమె ఎలా ఛేదించింది? అనేదే ఈ దక్షిణ మూవీ స్టోరీ. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారు ఎంచక్కా ఈ సినిమాను చూసేయండి. కాగా.. ఈ చిత్రానికి మంత్ర ఫేమ్ ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించారు. Action, adrenaline, and pure thrill! 🔥💥#Dhakshina is now streaming on #LionsgatePlay – gear up for an action-packed ride. Watch now! 🎬🍿 pic.twitter.com/6JKiFKW1JR— Lionsgate Play (@lionsgateplayIN) February 21, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

‘మార్గదర్శి’ మోసాల కేసును మూసివేసే దిశగా అడుగులు... చంద్రబాబు డైరెక్షన్లో ప్లేటు ఫిరాయించిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో రైతు బతికే పరిస్థితి లేదు... ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

తప్పు చేసినోళ్లు ఎక్కడున్నా వదలం. టీడీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు, ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక. జైలులో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్

తెలంగాణలో వెంటనే కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలి... అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

మేము ఒక తప్పు చేయాలంటే, ఒకటేంటి సార్ మూడు చేద్దామంటున్నారు... అధికారుల వ్యవహార శైలిపై సంతోషంగా లేను... తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలకు కప్పం కడితేనే మైనింగ్... రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన గనుల తవ్వకాలు

మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే... రామోజీరావు మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు.. తెలంగాణ హైకోర్టుకు నివేదించిన ఆర్బీఐ

ఏపీ సీఎం చంద్రబాబుతో సీఐడీ బంధం... ‘కరకట్ట బంగ్లా’ కేసులో అటాచ్మెంట్ పొడిగింపు కోరని దర్యాప్తు సంస్థ

చంద్రబాబు నాయుడు మోసకారి కాదా? ప్రజలను మోసం చేసినందుకు 420 కేసు పెట్టకూడదా?... వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల.. 14 మంది విద్యార్థులకు 100 పర్సంటేజ్
క్రీడలు

ఐర్లాండ్‌పై భారత్ విజయం
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు మరో విజయం లభించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (22వ నిమిషంలో), జర్మన్‌ప్రీత్ సింగ్ (45వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఐర్లాండ్ జట్టుకు జెరెమీ డంకన్ (8వ నిమిషంలో) ఒక గోల్ అందించాడు. మరోవైపు జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0–4 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది.

'వెళ్లి జింబాబ్వేతో సిరీస్ ఆడుకోండి'.. పాక్‌పై ఆక్మల్ ఫైర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కరాచీ వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 320 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక పాక్ చతికలపడింది.బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పాక్ విఫలమైంది. ఈ క్రమంలో పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ విమర్శల వర్షం గుప్పించాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదని ఆక్మల్ జోస్యం చెప్పాడు."ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు ఆడే ఆర్హత లేదు. ప్రస్తుతం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో పాక్ జట్టు పాల్గోవాలి. కనీసం వారిపైనా విజయం సాధిస్తే ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ఆర్హత ఉందని భావించవచ్చు. గేమ్ ప్లాన్ ఎలా ఉండాలో న్యూజిలాండ్‌ను చూసి నేర్చుకోవాలి. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికి అద్బుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చారు. కివీస్ బ్యాటర్లు సెటిల్ అయ్యాక మళ్లీ ఎదురుదాడికి దిగారు. పరిణితి చెందిన జట్టు చేసే పని అదే. కివీస్ లాంటి టాప్ క్లాస్‌కు జట్టుకు ఎల్లప్పుడూ బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. రచిన్ రవీంద్ర గాయపడగా.. అతడి స్ధానంలో వచ్చిన విల్ యంగ్ సెంచరీతో మెరిశాడు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్రాన్ ఆక్మల్ పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో కమ్‌బ్యాక్ ఇవ్వాలని పాక్ భావిస్తోంది. భారత్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: భారత్‌తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్

ఆ జట్టేమైనా పాకిస్తానా? ఆసీసా?.. ముందే కొట్టేస్తారు అనుకున్నా: సెహ్వాగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. అయితే భారత్ విజయం సాధించినప్పటికి ఛేజింగ్‌లో మాత్రం కాస్త తడబడిందనే చెప్పాలి.ఎందకంటే 229 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు భారత్ ఏకంగా 46.3 ఓవర్ల సమయం తీసుకుంది. లక్ష్య చేధనలో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్‌లో స్పీడ్ తగ్గింది. 30 ఓవర్లు ముగిసే సరికి 144/4 స్కోరుతో భారత్ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది.కానీ శుబ్‌మన్ గిల్(101), కేఎల్ రాహుల్(41) ఆచితూచి ఆడుతూ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. తాజాగా ఈ స్లో రన్ ఛేజింగ్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఇంకాస్త ముందుగానే టార్గెట్‌ను చేధిస్తుందని భావించానని సెహ్వాగ్ అన్నాడు."బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అభిమానులు టెన్షన్ పడి ఉంటారు నేను అనుకోను. ఎందుకంటే ప్రత్యర్ధిగా ఉన్నది బంగ్లాదేశ్. మీరు బంగ్లాను చాలా అద్భుతమైన జట్టుగా నాతో పొగిడించు కోవాలనుకుంటున్నారా? అలా జరగాలంటే వారు ఆట తీరులో మార్పు రావాలి.బంగ్లాదేశ్‌తో ఆడేటప్పుడే నేను భయపడలేదు, ఇప్పుడు ఇంకా ఏమి భయపడతాను. టెన్షన్ పడడానికి ప్రత్యర్ది ఏమైనా పాకిస్తానా..? ఆస్ట్రేలియానా? ఇది చాలా ఈజీ మ్యాచ్. దాదాపు నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తొలుత దూకుడుగా ఆడిన గిల్.. ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేదా శ్రేయాస్ అయ్యర్ ఎక్కువసేపు క్రీజులో ఉండి ఉంటే, ఈ మ్యాచ్‌లో 35 ఓవర్లలోనే ముగిసి ఉండేదని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.

రికెల్టన్ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ చేసిన సౌతాఫ్రికా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ టోనీ డిజోర్జీ తొందరగా ఔటైనప్పటికి రికెల్టన్ మాత్రం మెరుపులు మెరిపించాడు.రికెల్టన్ కేవలం 106 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ర్యాన్ మంచి ఊపులో ఉండగా దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అతడితో పాటు కెప్టెన్ టెంబా బావుమా(58), రాస్సీ వండర్ డస్సెన్(52), ఐడైన్ మార్క్రమ్(52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు.అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫరూఖీ, ఒమర్జాయ్ తలా వికెట్ సాధించారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక్క వికెట్ కూడా పడగొట్ట లేకపోయాడు. మరి 316 పరుగుల భారీ లక్ష్యాన్ని అఫ్గాన్ చేధిస్తుందో లేదో వేచి చూడాలి. ఇంతకుముందు వన్డే ప్రపంచకప్-2023లో మాత్రం సఫారీలను అఫ్గాన్ మట్టికర్పించింది.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ ఆహ్మద్దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడిచదవండి: భారత్‌తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్
బిజినెస్

మెటాలో ఇంత అన్యాయమా?
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా (Meta).. వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించింది. తమ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు వారి బేసిక్ పేలో 200 శాతం వరకు బోనస్‌లు (Bonus) ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ పనితీరు పేరుతో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించిన (Lay Off)వారం రోజుల్లోనే ఈ నిర్ణయం రావడంతో కంపెనీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు బోనస్‌ల చెల్లింపు నిర్ణయాన్ని ఫిబ్రవరి 13న మెటా డైరెక్టర్ల బోర్డు కమిటీ ఆమోదించింది. పోటీ కంపెనీలలో ఇలాంటి పాత్రలతో పోలిస్తే తమ ఎగ్జిక్యూటివ్ పరిహారం 15 శాతం మేర తక్కువగా ఉందన్న కారణంతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బోనస్ ప్రకటన సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు వర్తించదని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది.అల్ప స్థాయి ఉద్యోగులను తొలగించి బాస్‌లకు బోనస్‌లు ప్రకటించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఉద్యోగులను తొలగిస్తూనే ఎగ్జిక్యూటివ్‌లకు భారీగా బోనస్‌లను అందించడం అన్యాయమని విమర్శకులు వాదిస్తున్నారు. కంపెనీలోని ఆదాయ అసమానతల సమస్యలను ఇది ఎత్తి చూపుతుందని పేర్కొంటున్నారు.ఇది చదివారా? ‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’ఈ నిర్ణయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సమర్థించుకున్నారు. బోనస్‌లు అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడానికి కంపెనీ నిరంతర వృద్ధి, విజయాన్ని నిర్ధారించడానికి అవసరమైన ప్రోత్సాహకం అని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు, కార్మిక హక్కుల వాదులు ఇటీవలి తొలగింపుల నేపథ్యంలో బోనస్‌లకు ఇదా సమయం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఎగ్జిక్యూటివ్ బోనస్‌లను 200 శాతానికి పెంచాలనే నిర్ణయం మునుపటి 75 శాతం నుండి గణనీయమైన పెరుగుదల. పెరుగుతున్న పోటీ, ఆర్థిక సవాళ్ల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, లాభదాయకతను మెరుగుపరచడానికి ఈ చర్య విస్తృత వ్యూహంలో భాగమని కంపెనీ చెబుతోంది.

సమస్యను సోషల్ మీడియాలో పెట్టిన ఉద్యోగి: నెట్టింట్లో వైరల్
ఉద్యోగులకు ఏదైనా సమస్యలు వచ్చినా.. సందేహాలు వచ్చినా.. తగిన పరిష్కారం తెలుసుకోవడానికి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఒక ఉద్యోగి.. తాను నోటీస్ పీరియడ్‌లో ఉన్నప్పుడే జాబ్ నుంచి తీసేశారని, రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.నేను ఒక కంపెనీలో రెండు నెలలకు ముందు చేరాను. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్‌లో ఉన్నాను. ఈ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకున్నందుకు.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు హెచ్ఆర్ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాకుండా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. నా జీతం.. పెంపుకు సంబంధించిన లెటర్ పొందటానికి నేను ఏమి చేయాలని ప్రశ్నించారు. సీటీసీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాలరీ పొందే ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానని అన్నారు.ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందించారు. నా సహోద్యోగికి ఇలాగే జరిగింది. దీనికోసం ఒక న్యాయవాదిని నియమించుకోండి. మీకు కావలసిన లెటర్స్ పొందటానికి రూ. 50వేలు ఖర్చు చేయడానికి వెనకాడవద్దని, ఒక యూజర్ పేర్కొన్నారు. మీ అనుభవాన్ని ఉపయోగించుకోండి, దీనికోసం ఆఫర్ లెటర్ యూస్ చేయండి. శాలరీ హైక్ లెటర్ అవసరం లేదని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: గూగుల్ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!మీరు చేరిన వెంటనే రాజీనామా చేసిన కంపెనీ నుంచి మీకు.. ఎక్స్పీరియన్స్ లెటర్ ఎందుకు అవసరం. ఈ విషయాన్ని.. ఇకపై చేరబోయే సంస్థలో చెప్పినా, మీ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుందని ఇంకో నెటిజన్ పేర్కొన్నారు. రిలీవింగ్ లెటర్‌ను ఎవరూ ఆపలేరని హెచ్ఆర్కు చెప్పండి. పీఎఫ్ పాస్‌బుక్‌లో ఈ సంస్థ నుంచి ఈపీఎఫ్ ట్రీ ఉంటే, భవిష్యత్తులో మీరు చేరే కంపెనీలలో నేపథ్య ధృవీకరణ ప్రక్రియ కోసం మీకు రిలీవింగ్ లెటర్ అవసరం అవుతుంది.

గూగుల్ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!
స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది.. దాదాపు అన్ని లావాదేవీలకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. యూజర్ల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్న సమయంలో.. ట్రాన్సాక్షన్ల మీద ఛార్జీలను వసూలు చేయడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఇప్పటి వరకు లావాదేవీల మీద ఎలాంటి ఛార్జీలను వసూలు చేయని గూగుల్ పే.. ఇకపై ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, డీటీహెచ్ బిల్స్ చెల్లించినప్పుడు.. అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే వినియోగదారులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఫీజు ఉండదు.గతేడాది నుంచి మొబైల్ రీఛార్జీల మీద రూ. 3 కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తున్న గూగుల్ పే.. ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బిల్స్ మీద 0.5 శాతం నుంచి 1 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి బిల్స్ చెల్లించిన యూజర్లకు ఇప్పటికే ఛార్జీలు పడినట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పులుఅదనపు ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా? లేదా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. భవిష్యత్తులో తప్పకుండా అందరూ ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే?.. దీనిపై గూగుల్ పే స్పందించలేదు. అయితే గూగుల్ పే దీనిని అమలు చేస్తే.. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

ఈపీఎఫ్ విత్‌డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
ఈపీఎఫ్ (EPF) విత్‌డ్రా ఇక మరింత సులువు కానుంది. పీఎఫ్ మొత్తాన్ని నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులకు వాడుకునే వెసులుబాటు రానుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) రాబోయే మూడు నెలల్లో ఈపీఎఫ్ క్లెయిమ్‌ల కోసం యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత ఉపసంహరణలను ప్రవేశపెట్టనుంది .ఈపీఎఫ్ విత్‌డ్రా (EPF Withdrawal) ప్రక్రియను మరింత సులువుగా మార్చడమే లక్ష్యంగా ఈపీఎఫ్‌వో ఈ వెసులుబాటు తీసుకొస్తోంది. దీని ద్వారా దాని లక్షల మంది చందాదారులకు ఈపీఎఫ్ ఉపసంహరణ వేగవంతంగా మరింత అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసి యూపీఐ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫీచర్‌ను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇది చదివారా? త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్‌తో..ఒకసారి ఇంటిగ్రేట్ ప్రక్రియ పూర్తయి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే క్లెయిమ్ మొత్తాలను సబ్స్క్రైబర్లు డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఉపసంహరణలను సులభతరం చేయడానికి, జాప్యాలను నివారించడానికి, కాగితపు పనిని తగ్గించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్‌వో డిజిటల్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోంది.పెన్షన్ సేవలను మెరుగుపరచడం, ప్రావిడెంట్ ఫండ్ ( PF ) క్లెయిమ్‌ల కోసం క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను సులభతరం చేయడం లక్ష్యంగా ఇప్పటికే ఈపీఎఫ్‌వో అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. అందులో భాగమే ఈ చొరవ. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌లో 5 కోట్లకు పైగా చందాదారుల క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసి, రూ . 2.05 లక్షల కోట్లకు పైగా సొమ్మును పంపిణీ చేసింది.
ఫ్యామిలీ

అందాల ఆతిథ్యం..! విశ్వసుందరి జన్మించిన నగరంలో పోటీలు..
నగరంలో ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచం సరికొత్త సందడి పులుముకుంది. ఈవెంట్స్ రంగం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ణంలోని హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించడమే ఈ సందడికి కారణం. ప్రపంచస్థాయి అందాల పోటీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం భాగ్యనగరంలోని ఫ్యాషన్ రంగానికి చెందిన ఔత్సాహికులకు కలర్ ఫుల్ కలలకు ఊతమిస్తోంది. ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం నగరానికి మరింత గ్లోబల్ లుక్ తెచి్చపెడుతోంది. మొత్తం 120 దేశాలు పాల్గొనే ఈ అతిపెద్ద ఈవెంట్ దాదాపు నెల రోజుల పాటు నగర కేంద్రంగా జరగడం వల్ల అంతర్జాతీయంగా ఖ్యాతి పొందనుంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ జరగని స్థాయిలో అంతర్జాతీయ ఫ్యాషన్, మోడలింగ్ రంగాలను నగరం ఆకర్షిస్తోంది. తద్వారా నగరంలో ఔత్సాహిక యువతకు అవకాశాలు విస్తరిస్తాయి. అదే విధంగా నగరం, చుట్టుపక్కల చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హస్తకళలు ప్రపంచం దృష్టికి రానున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న నగరం టాలీవుడ్ పరిశ్రమకు సైతం మరింత ఊపునివ్వనుంది. గొప్ప విశేషం.. ఎందరో యువత కల.. హైదరాబాద్ దేశంలోనే ఓ గొప్ప నగరంగా ఎదుగుతోంది. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటివెన్నో నిర్వహించగల సామర్థ్యం నగరానికి ఉంది. ఒకనాటి బ్యూటీ కాంటెస్ట్ విజేతగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అందమైన యువతులకు మన నగరం వేదిక కావడాన్ని చూసే రోజు కోసం ఎంతో ఉది్వగ్నంగా ఎదురుచూస్తున్నాను. – శిల్పారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా బ్యూటీ ఈవెంట్స్ కేంద్రంగా.. గత కొంత కాలంగా బ్యూటీ క్వీన్స్‌కు మాత్రమే కాదు బ్యూటీ ఈవెంట్స్‌కు సైతం చిరునామాగా మారుతోంది. నగరానికి చెందిన శిల్పారెడ్డి మొదలుకుని గత ఏడాది సుష్మ తొండేటి వరకూ మిసెస్ ఇండియా కిరీటాన్ని నగరవాసులు ఎందరో గెలుచుకున్నారు. ఇక మానసా వారణాసి వంటివారు మిస్ ఇండియా కిరీటాలను తీసుకొచ్చారు. పూనమ్ కౌర్, మధుశాలిని వంటి మిస్ హైదరాబాద్‌లు అనంతరం సినీతారలుగా రాణించారు. నగరంలోని కళాశాలల నుంచి క్లబ్స్ వరకూ బ్యూటీ కాంటెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి.ఈ తరహా ఈవెంట్లకు మరింత ప్రొఫెషనలిజాన్ని మిస్ వరల్డ్ అందించడం తధ్యం. ఏదేమైనా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌కు ప్రపంచ సుందరి పోటీలు రావడం సమయోచితం అని చెప్పాలి. (చదవండి: ఆరోగ్య ప్రయోజనాలందించే బెస్ట్ చట్నీలివే..!)

నీతా అంబానీ లుక్: వందేళ్లకు పైగా చరిత్ర, తయారీకి రెండేళ్లు
వివాహాలు, ప్రత్యేక సందర్భాలలో పార్సీ మహిళలు గారా చీరలను ధరించేవారు. అత్యంత ఖరీదైనదిగా పేరొందిన ఈ ఎంబ్రాయిడరీని కొన్ని ప్రత్యేక రోజులకే పరిమితం చేయకూడదని నేడు సృజనాత్మకంగా దుపట్టాలు, లెహంగాలు, ఇండోవెస్ట్రన్ డ్రెస్సుల మీదకు తీసుకు వస్తున్నారు. భారతదేశం నుండి పార్సీలు వాణిజ్యం కోసం చైనాకు ప్రయాణించే రోజుల్లో ‘గారా’ ఎంబ్రాయిడరీ మన దేశంలోకి అడుగుపెట్టింది. పార్సీలు మన దేశం నుండి నల్లమందు, పత్తిని చైనాకు తీసుకెళ్లి, అక్కడి టీ కోసం మార్పిడి చేసేవారు. బ్రిటిష్ వారు ఐరోపాలో ఎక్కువ టీని అమ్మాలనుకోవడంతో పార్సీలు త్వరగా వ్యాపారంలో ధనవంతులయ్యారు. వారు తిరిగి వచ్చేటప్పుడు చైనాలో అందుబాటులో ఉన్న సిరామిక్స్, వివిధ ప్రాచీన వస్తువులను కూడా తీసుకు వచ్చేవారు. ఒక వ్యాపారి కళాత్మకంగా ఉండే ఆ ఎంబ్రాయిడరీ ముక్కను ఒకటి తీసుకువచ్చాడన్నది చరిత్ర. ఆ ఎంబ్రాయిడరీ లో రకరకాల మార్పులు చేసి, తదుపరి కాలంలోపార్సీ మహిళల చీరల మీద వైభవంగా వెలిసింది. ముంబైలో స్థిరపడిన పార్సీ సమాజం చాలా ధనవంతులుగా, గారా చీరలు వారి సిగ్నేచర్‌గా మారిపోయాయి. ఆ విధంగా పార్సీ గారా అనే పేరు స్థిరపడిపోయింది.‘గారా’ ఎంబ్రాయిడరీలో పోల్కా చుక్కలను, సాలీడులా అనిపించే మోటిఫ్స్ కనిపిస్తాయి. పక్షులు, వృక్షజాలం, జంతుజాలం.. వంటివి ఈ ఎంబ్రాయిడరీలో ఒద్దికగా కనిపిస్తాయి. అచ్చమైన పట్టు దారాలతో సంక్లిష్టంగా ఉండే ఈ డిజైన్‌తో చీర రూ పొందించాలంటే కళాకారులకు కొన్ని నెలల సమయం పడుతుంది. అందుకే ఈ ఎంబ్రాయిడరీ అత్యంత ఖరీదైనదిగా పేరొందింది.ఇదీ చదవండి: వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్లునాటి రోజుల్లో ఈ ఎంబ్రాయిడరీకి సాలిఘజ్’ అని పిలిచే ప్రత్యేక ఫ్యాబ్రిక్‌ను ఎంపిక చేసుకునేవారు.. 1930లలో ఈ ఫ్యాషన్ వెలుగు చూసింది. తర్వాత 80లలో పునరుద్ధరించబడింది. ముంబైలో పార్సీలు ఈఎంబ్రాయిడరీని మందపాటి పట్టు ఫ్యాబ్రిక్ పైనే డిజైన్ చేసేవారు. ఇప్పుడు క్రేప్, జార్జెట్, షిఫాన్ ఫ్యాబ్రిక్లను ఉపయోగిస్తున్నారు. డిజైన్‌కి పెద్దమొత్తంలో పట్టుదారాలు ఉపయోగిస్తారు కాబట్టి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఈ ఎంబ్రాయిడరీ బరువును మోయలేవు. దాదాపు 40–50 సంవత్సరాల క్రితం ట్రెండ్‌లో ఉన్న ఈ కళ ఇప్పుడు మళ్లీ కళగా వెలుగులోకి రావడం చూస్తుంటే టైమ్‌లెస్ ట్రెడిషన్ అనిపించకమానదు. తరతరాలుగా చేతులు మారే ఆభరణాలలా పార్సీ‘గారా’ అనే ఎంబ్రాయిడరీని అత్యున్నతమైన వారసత్వ సంపదగా పేర్కొంటారు. గాజ్ లేదా పాజ్ అనే అందమైన పట్టు వస్త్రంపై రూపొందించే ఈ ఎంబ్రాయిడరీ సంప్రదాయ వేడుకలలో వైభవంగా వెలిగిపోతుంటుంది. వందేళ్లకు పైగా ప్రాచీన చరిత్ర కల ‘గారా’ డిజైన్ నేడు సెలబ్రిటీలకు ఇష్టమైన ఎంపిక అయ్యింది. ఇదీ చదవండి: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!ఇటీవల హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నీతా అంబానీ పార్సీ గారా శారీలో మెరిసి, మరోసారి వారసత్వ సంపదను అందరికీ గుర్తుచేశారు. సంక్లిష్టమైన ఈ హస్తకళ పూర్తి కావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జెనోబియా ఎస్.దావర్ ఈ చీర రూపకర్త.

తెల్లబియ్యం తిన్నా.. షుగర్ పెరగదు!
సాక్షి, సాగుబడి డెస్క్: ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది షుగర్ వ్యాధి (మధుమేహం) బాధితులుంటే.. అందులో 10.1 కోట్ల మంది భారతీయులే (2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరనుంది). త్వరలోనే ఈ జాబితాలో చేరే వారు జనాభాలో మరో 15% ఉంటారు. గ్లైసైమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉండే సాంబ మసూరి (జీఐ 72) వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినటం మధుమేహానికి ప్రధాన కారణాల్లో మొదటిదని ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) గుర్తించింది. ఏదైనా ఆహార పదార్ధాన్ని తిన్న తర్వాత అది ఎంత త్వరగా గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తున్నదో సూచించేదే ‘గ్లైసైమిక్ ఇండెక్స్’. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత హానికరమన్నమాట. హరిత విప్లవానికి ముందు ఐఆర్8 వంటి అధిక దిగుబడినిచ్చే ‘మిరకిల్ రైస్’ వంగడాన్ని ఇచ్చి మన దేశ ఆకలి తీర్చిన ‘ఇరి’.. ఇప్పుడు షుగర్ పెంచని, ప్రొటీన్ లోపాన్ని ఎదుర్కొనే మరో రెండు అద్భుత వంగడాలను అందుబాటులోకి తెస్తోంది. లో గ్లైసైమిక్ ఇండెక్స్ (55%) కలిగిన ‘ఐఆర్ఆర్ఐ147’ ఈ ఏడాది ఖరీఫ్‌లోనే మన దేశంలో అందుబాటులోకి రానుంది. అలాగే అల్ట్రా లో మిగతా 2వ పేజీలో uగ్లైసైమిక్ (45%) + హై ప్రొటీన్ (16%)ను అందించే మరో అద్భుత వంగడం ఇంకో ఏడాదిలో అందుబాటులోకి రానుందని ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, కంజ్యూమర్–డ్రివెన్ గ్రెయిన్ క్వాలిటీ అండ్ న్యూట్రిషన్ యూనిట్ హెడ్ డా.నెసె శ్రీనివాసులు తెలిపారు. ఈ రెండో వంగడానికి డాక్టర్ శ్రీనివాసులు స్వయంగా రూపకల్పన చేశారు. భారత్ పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తక్కువ జీఐ.. ‘ఐఆర్ఆర్ఐ147’ ‘ఐఆర్ఆర్ఐ 147’ రకం తెల్లగా పాలిష్ చేసిన బియ్యంలో గ్‌లెసైమిక్ ఇండెక్స్ (55%) తక్కువగా ఉంటుంది. 22.3 పీపీఎం జింక్ ఉంటుంది. ఉప్పదనాన్ని, తెగుళ్లను తట్టుకుంటుంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కి రెండేళ్ల క్రితం ‘ఇరి’ ఈ వంగడాన్ని అందించింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఐసీఏఆర్ ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా క్షేత్రస్థాయిలో సాగు చేసింది. 7కు గాను 4 జోన్లలో మంచి ఫలితాలు వచ్చాయి. హెక్టారుకు 5– 9.5 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ‘సీడ్ వితవుట్ బార్డర్స్–ఎల్లలు లేని విత్తనాలు’ కార్యక్రమంలో భాగంగా ఫాస్ట్ ట్రాక్‌లో విడుదల చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ముతక రకం కావటంతో ఉప్మా రవ్వ, అటుకులు, తదితర అల్పాహార ఉత్పత్తులుగా ప్రాసెస్ చేసి విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి మన దేశంలోని రైతులకు ఐసీఏఆర్ ద్వారా ఈ న్యూక్లియస్ సీడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అత్యల్ప జీఐ, రెట్టింపు ప్రొటీన్! షుగర్ రోగులు కూడా తినదగిన అతి తక్కువ గ్‌లెసైమిక్ ఇండెక్స్‌తో పాటు అధిక ప్రొటీన్‌ను కలిగి ఉండే అద్భుత వరి వంగడాన్ని ‘ఇరి’ భారతీయులకు అందిస్తోంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. అత్యంత ప్రజాదరణ పొందిన సాంబ మసూరి మాదిరిగానే ఇది సన్న రకం, అధిక దిగుబడినిచ్చేది కూడా. సాధారణ సాంబ మసూరి జీఐ 72% కాగా, ప్రొటీన్ 8%, కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ 0.3% మాత్రమే. సాంబ మసూరితో కలిపి రూపొందిస్తున్న ఈ సరికొత్త రకం జీఐ కేవలం 45% మాత్రమే. ప్రొటీన్ మాత్రం రెట్టింపు. అంటే.. 16%. కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ కూడా 3.8% ఉంటుంది. అందువల్ల తిన్న తర్వాత 125 నిమిషాల వరకు నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్‌ను తగుమాత్రంగా విడుదల చేస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు, ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్న వారు కూడా ఈ రకం తెల్ల బియ్యాన్ని ఇబ్బంది లేకుండా తినవచ్చు. వచ్చే ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా ఐసీఏఆర్ ఆధ్వర్యంలో సాగు చేస్తాం. ప్రజల దైనందిన ఆహారం ద్వారా డయాబెటిస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రొటీన్ లోపాన్ని అరికట్టడానికి ఈ వంగడం ఉపకరిస్తుంది. ఎఫ్‌పీవోల ద్వారా సాగు..మహిళా సంఘాల ద్వారా ప్రాసెసింగ్ అత్యల్ప గ్‌లెసైమిక్ ఇండెక్స్‌తో పాటు రెట్టింపు ప్రొటీన్‌ను కలిగి ఉండే ఆరోగ్యదాయకమైన కొత్త రకం వరి బియ్యాన్ని, ఇతర ఉప ఉత్పత్తులను దేశంలోని సాధరణ ప్రజలకు సైతం అందుబాటులోకి తేవాలన్నదే ‘ఇరి’ లక్ష్యం. ఒకసారి అందుబాటులోకి వస్తే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ బియ్యానికి చాలా గిరాకీ ఉంటుంది. అందువల్ల ఈ వంగడంపై పెద్ద కంపెనీలు గుత్తాధిపత్యం పొందటానికి వీల్లేకుండా, ఈ బియ్యాన్ని, ఇతర ఉత్పత్తులను దేశ ప్రజలకు సరసమైన ధరకే అందుబాటులోకి తేవటానికి కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నాం. ( వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)ఇందులో భాగంగా ఒడిశాలో ఎంపిక చేసిన కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓలు) రైతులతో సాగు చేయిస్తున్నాం. మిల్లింగ్, ప్రాసెసింగ్‌లో 30 మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చారు. భువనేశ్వర్ దగ్గర్లో ప్రత్యేక ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం భారీ పెట్టుబడితో నెలకొల్పుతోంది. ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించి ఆరోగ్యదాయకమైన ఈ బియ్యం, ఇతర ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లోని పెద్ద కంపెనీల ద్వారా సరసమైన ధరలకే ప్రజలకు విక్రయించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం. ఇదీ చదవండి: వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు

పసికూనలకు రక్షణ..లా
పసిపిల్లలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వాడుకునే నీడలు ఎక్కువ. నీడలు వారిని బంధిస్తాయి వారితో చెడు పనులు చేస్తాయి వారి పసితనాన్ని అశుభ్రం చేస్తాయి.నీడలు ఈ పనికి దేవుణ్ణో, దెయ్యాన్నో తోడు తెచ్చుకుంటాయి. తల్లిదండ్రులు స్వయంగా తీసుకెళ్లి అమాయకత్వంతోనో మూర్ఖత్వంతోనో పిల్లల్ని ఈ నీడలకు అప్పగిస్తారు. పిల్లలు పులి నోటికి చిక్కుతారు. న్యాయం ఎప్పుడోగాని ఉదయించదు. జమ్ము–కశ్మీర్లో మంత్రాల పేరు చెప్పి పిల్లలను లైంగికంగా వేధించిన బాబాకుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉద్వేగంగా కవిత రాశారు. భయం లేని వేకువకై ప్రార్థించారు.జనవరి, 2021.మదనపల్లె ఘటన అందరికీ గుర్తుంది. మూఢ విశ్వాసం నెత్తికెక్కి ఇద్దరు ఎదిగొచ్చిన కుమార్తెల ఉసురు తీశారు తల్లిదండ్రులు. చనిపోయాక వారు సత్యయుగంలో జన్మిస్తారట. అందుకోసమని బతికుండగానే సమాధి చేశారు.ప్రాణం పోయడం దైవం. ప్రాణం తీయడం దెయ్యం.అక్టోబర్, 2024.చత్తిస్‌గఢ్‌లోని శక్తి జిల్లా.తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇద్దరు కుమారులను గొంతు పిసికి చంపేసింది. తర్వాత ఉజ్జయినీ నుంచి తెచ్చుకున్న ఒక ‘గురువు’ ఫొటో పెట్టుకొని ఆ చనిపోయిన కుమారులనుప్రాణాలతో లేచేందుకు మంత్రాలు చదవడం మొదలెట్టింది. ఇదంతా ఆమె తంత్ర సాధనలో భాగమట.కడుపున పుట్టిన వారినే కాటేసే గుడ్డితనమే అంధ విశ్వాసం.జూన్, 2024.తమిళనాడులోని అలియలూరు జిల్లా.లేక లేక మనవరాలు పుడితే ఆ పుట్టిన శకునం బాగ లేదని స్వయంగా తాతే ఆ పసికూన ప్రాణాలు తీశాడు. ఆ శకునం కుటుంబానికి హానికారక సూచన కనుక ఈ పని చేశాడట.చేతులతో పూజ చేయడం భక్తి. అదే చేతులతో పీక పిసకడం మూఢ భక్తి.ఫిబ్రవరి 18, 2025.జమ్ము–కశ్మీర్‌లోని సొపోర్ నగర కోర్టులో చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ మీర్ వజాహత్ ఒక 123 పేజీల తీర్పును వెలువరించారు. ఆ తీర్పు అంతా మూఢ విశ్వాసాల వల్ల చిన్నపిల్లల మీద సాగుతున్న దౌర్జన్యాల పట్ల, అకృత్యాల పట్ల ఆవేదన. కారణం? ఆ తీర్పు ఏజాజ్ అహ్మద్ అనే దొంగబాబా పసిపిల్లల మీద సాగించే అకృత్యాల మీద కావడం. ఈ ఘోరాన్ని ఆ బాబా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఉండటం. విషయం తెలియకనే తల్లిదండ్రులు అందులో భాగం కావడం.ఏం జరిగింది?జమ్ము–కశ్మీర్లో ‘పీర్ బాబా’గా పేరుబడ్డ ఏజాజ్ షేక్ దగ్గరకు చాలా మంది తమ దైనందిన బాధల నుంచి విముక్తి కోసం వచ్చేవారు. అనారోగ్యం, ఆర్థిక బాధలు, తగవులు... వీటికి విరుగుడు కోసం ఆయన దగ్గరకు మంత్ర తంత్రాలకు వచ్చేవారు. అయితే ఇక్కడే ఆ బాబా ఒక చిట్కా పాటించేవాడు– ‘మీ కష్టాలు పోవడానికి దైవ సహాయం కంటే ‘జిన్ను’ (భూతం)ల సాయం మంచిది. జిన్నులతో మాట్లాడి పరిష్కారం చేస్తాను. అయితే జిన్నులు పెద్దల కంటే పిల్లలతో మాట్లాడటానికి ఇష్టపడతాయి. మీరు మీ పిల్లల్ని (అబ్బాయిల్ని) తెచ్చి నాకు అప్పగిస్తే తంత్రాలు ముగిశాక మళ్లీ మీకు అప్పగిస్తాను’ అనేవాడు. అమాయక/ఆశబోతు తల్లిదండ్రులు ఈ మాటలు నమ్మి తమ పిల్లల్ని బాబా దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు. పదేళ్లలోపు మగపిల్లలుఈ బాబా చేతిలో బాధితులుగా మారిన వారందరూ పదేళ్ల లోపు అబ్బాయిలే. బాబా వారిని పూజ పేరుతో నగ్నంగా మార్చి అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవాడని ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. పిల్లల్ని భయపెట్టేందుకు బాబా తనలోనే ‘జిన్’ ఉందని, అది అన్ని కష్టాల నుంచి దూరం చేస్తుందని, కోరికలు నెరవేరుస్తుందని చెప్పి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. కొందరు పిల్లలు నాలుగైదు ఏళ్లపాటు ఇతని వల్ల బాధ పడ్డారు. భయం వల్ల, ఆ బాబా స్కూల్ టీచర్ కూడా కావడం వల్ల నోరు మెదపలేక తల్లిదండ్రులు బాబా దగ్గరికెళ్దామంటే వారు మొండికేయడం మొదలెట్టారు. అప్పుడు గాని పెద్దలకు అనుమానం రాలేదు. ఒక బాలుడు తెగించి తండ్రికి జరిగేది చెప్పడంతో బండారం బయటపడింది.శిక్ష పడింది2016లో బాబా అకృత్యాలు బయటపడి బేడీలు పడ్డాయి. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న బాబాకు ఫిబ్రవరి 18న న్యాయమూర్తి మీర్ వజాహత్ 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు భక్తి, విశ్వాసాలను జనం బలహీనతగా ఎంచి దొంగ వేషగాళ్లు పసిపిల్లలను కబళించడంపై న్యాయమూర్తి తీవ్రమైన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బాబాలు మొత్తం విశ్వాస ప్రపంచానికి విఘాతం కలిగిస్తారన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం కేసు మీద ఒక లోతైన, సంకేతపూర్వకమైన కవిత రాశారు. ఎంత కదిలిపోతే ఇంత గాఢమైన కవిత వస్తుందనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జస్టిస్ మీర్ వజాహత్ రాసిన కవితవిశ్వాసపు గుసగుసలు... భయవిహ్వల పెనుకేకలువెలుగు దుస్తులు ధరించి నిలిచిన వాడుకారు చీకటిలో దారి చూపుతానని మాటిచ్చాడుగుసగుసగా మంత్రాలు జపిస్తూ తన పవిత్ర హస్తాలతోఅంగలార్చే నేలలో విశ్వాసపు బీజాన్ని నాటాడుసాంత్వనకై వెదుకుతూ అభయానికై తపిస్తూవి΄్పారిన నేత్రాలతో చేరవచ్చిందొక పసితనంకానీ ఆ వెలుగుల మాటున చీకటి నీడలుగడ్డకట్టిన మంచులా వణికించిన గుసగుసలు‘భూతమంటే భయమేలే కానీ నాపై నమ్మకముంచునిన్ను బయటపడేసే తాళంచెవి నా దగ్గరుంది’పవిత్ర వేషంలో మాటలే సంకెళ్లుఇక గొంతు దాటని రోదన... విశ్వాసం గల్లంతుచెప్పినట్టు, తాకినట్టు, దయగా చూసినట్టుమాయామంత్రాల మత్తుగాలి... ఆశలను బూడిద చేస్తూకానరాని వలయాల్లో సుళ్లు తిరిగిన ఉత్త మాటలుఇక మిగిలింది కలవర పెట్టే పీడకలలుఏళ్లు గడిచిపోతాయి... పుళ్లు సలుపుతూనే ఉంటాయికాని ఆ నొప్పి వెనుక దాగి వెంటాడే ఆనాటి గుసగుసలుచీలికలైనదేదీ అతుకు పడనే లేదునిబద్ధమై ఉండాల్సిన ఆత్మ గాలివాటుగా పరిభ్రమిస్తూకాని నిజం తలెత్తుకుని నిలబడుతుందిజాతకాలు తలకిందులవుతాయిన్యాయానికి ఎదురు నిలవక నీడలు చెదిరిపోతాయిగాయాల ఆనవాళ్లు మాసిపోవేమోలే కానీభయం లేని వేకువలో భళ్లున తెల్లారుతుంది
ఫొటోలు


కరీనా కపూర్ కజిన్ ఆదార్ జైన్ మెహందీ ఫంక్షన్ (ఫోటోలు)


చై-శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో! (ఫోటోలు)


Lasya Chittella: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గృహప్రవేశం (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫోటోలు)


అందాలతో సెగలు పుట్టిస్తున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఫొటోస్


హాఫ్ శారీకే అందం తెచ్చిన ‘బుజ్జితల్లి’ (ఫొటోలు)


ముస్తాబు అయిన హైదరాబాద్ (ఫొటోలు)


మరింత యంగ్‌గా మాధురీ దీక్షిత్.. 57 ఏళ్లు అంటే నమ్ముతారా..? (ఫోటోలు)


ఆహా అనిపిస్తున్న.. బెంగళూరులోని గూగుల్ కొత్త ఆఫీస్ (ఫోటోలు)


మహాకుంభమేళాలో స్టాల్స్ : స్ట్రీట్ వెండర్లుగా అంబానీ, అదానీ, మస్క్.. (ఫొటోలు)
National View all

మణిపూర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరె కటిక (ఖటిక్) కులస్తుల

గూడు కట్టుకున్న పక్షి ప్రేమ
‘హర్గిలా కొంగలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి.

మహా కుంభమేళాలో డిజిటల్ స్నానం! వీడియో వైరల్
మహా కుంభమేళాకు (Maha Kumbh) సంబంధించి ప్రతిరోజూ పలు వింత వార్తలు, కథనాలు వస్తున్నాయి.

‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh) అంతిమ దశకు వచ్చేసింది.

ఉదయనిధి సవాల్.. అన్నామలై సై
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
NRI View all

గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు
న్యూజెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార

జేఈఈ టాపర్ గుత్తికొండ మనోజ్ఞకు నాట్స్ అభినందనలు
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జేఈఈ పర

ఉగాది సాహిత్య సమ్మేళనం, ఎంట్రీలకు ఆహ్వానం!
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం సంయుక్త ఆ

తెలుగమ్మాయికి యూఏఈ ప్రతిష్టాత్మక అవార్డు..!
ఎయిర్ క్వాలిటీని పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ ను
International View all

ఛత్రపతి శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?.. వీకీపీడియాపై కేసులు
ముంబై: మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ (Chhatr

శత్రువు దాడులకు ‘అటానమస్’ కౌంటర్..యూఎస్ కంపెనీతో ‘ఎమ్అండ్ఎం’ ఒప్పందం
ముంబయి: అత్యాధునిక భద్రతా,నిఘా సాంకేతికత అభివృద్ధి చేయడంలో ప

‘ఇడియట్’..వ్యోమగామిపై మస్క్ చిందులు
వాషింగ్టన్:అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతావిలియమ్స్,బుచ్

‘బ్రిక్స్’ దేశాలపై ట్రంప్ సెటైర్లు
వాషింగ్టన్:‘బ్రిక్స్’ కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొన

అమెరికా సాయం వివాదం..ఎవరీ వీణారెడ్డి..?
న్యూఢిల్లీ:భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా చేసిన సా
క్రైమ్

కాల్ మెర్జింగ్‌తో కాజేస్తారు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో అమాయకులను మోసం చేసి డబ్బు కొల్లగొడుతున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ స్కాంకు తెరలేపారు. మనకు తెలియకుండానే మన నుంచి ఓటీపీలు తీసుకుని మన బ్యాంకు ఖాతాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు చెందిన ది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) హెచ్చరించింది. అపరిచితులు ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలను చెప్పవద్దని సూచించింది.కాల్ మెర్జింగ్ స్కాం అంటే? ఒక అపరిచితుడు మీ ఫోన్ నంబర్‌ను మీ స్నేహితుడి నుంచి తీసుకున్నానని చెబుతూ కాల్ చేయడంతో ఈ స్కాం ప్రారంభమవుతుంది. మీతో ఫోన్ మాట్లాడుతూనే.. మీ స్నేహితుడు వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి, రెండు కాల్స్‌ను విలీనం (మెర్జ్) చేయమని స్కామర్ అడుగుతాడు. ఆ ‘స్నేహితుడి’కాల్ నిజంగా మీ మిత్రుడిది కాదు. అది బ్యాంకు ఓటీపీ కాల్. స్కామర్ అడగ్గానే మీరు కాల్ విలీనానికి అనుమతిస్తే సదరు వ్యక్తి వెంటనే బ్యాంకు ధ్రువీకరణకు సంబంధించిన ఓటీపీ కాల్‌తో కనెక్ట్ అవుతాడు. ఇలా బ్యాంకు కాల్ నుంచి వచ్చే ఓటీపీని అవతలి నుంచి వింటున్న సైబర్ మోసగాళ్లు సేకరిస్తారు. అప్పటికే బ్యాంకు వివరాలు తీసుకుని పెట్టుకునే సైబర్ మోసగాళ్లు..ఆ ఓటీపీని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొడతారు. ఇదంతా కచ్చితమైన సమయంలోపు పూర్తిచేస్తారు. మీరు బ్యాంకు ఓటీపీ వారికి చెప్పినట్లు కూడా గుర్తించలేరు.కాల్ మెర్జింగ్ స్కాంకు చిక్కకుండా ఉండాలంటే?» అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి, మరో నంబర్ నుంచి వస్తున్న కాల్‌ను మెర్జ్ చేయాలని కోరితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి.» మీకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, లేదా మీకు స్నేహితుడికి స్నేహితుడిని అని చెప్తే నమ్మవద్దు.» అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌పై వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930లో ఫిర్యాదు చేయాలి.» మీరు ఓటీపీ పంచుకున్నట్టు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి డబ్బులు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన రహానే
విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ముంబై జట్టు ఎదురీదుతుంది. 406 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే చివరి రోజు మరో 323 పరుగులు చేయాలి. చేతిలో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. శివమ్ దూబే (12), తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఆకాశ్ ఆనంద్ (27) క్రీజ్‌లో ఉన్నారు. ఈ రంజీ సీజన్లో ముంబై ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అదే, విదర్భ ఫైనల్‌కు చేరాలంటే డ్రా చేసుకున్నా సరిపోతుంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది.కీలక ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన రహానేతప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే నిరాశపరిచాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదిలోనే ఔటయ్యాడు. రహానే లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి వికెట్ కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ముంబై గెలవలేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ముంబైకి ఒరిగేదేమీ లేదు. కాబట్టి చివరి రోజు ముంబై గెలుపు కోసమే ఆడాలి. ఆ జట్టు ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్‌లపై గంపెడాశలు పెట్టుకుంది. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చే సూర్యకుమార్ యాదవ్‌పై పెద్దగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. స్కై.. వేగంగా పరుగులు సాధించగలిగినా వికెట్ కాపాడుకుంటాడన్న గ్యారెంటీ లేదు. చివరి రోజు 90 ఓవర్ల ఆటకు ఆస్కారముంటుంది. దూబే, ఆకాశ్ ఆనంద్, సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే ముంబై సంచలన విజయం సాధించే అవకాశం ఉంటుంది.దూబే, ఆకాశ్ ఆనంద్, సూర్యకుమార్ తర్వాత కూడా ముంబై బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. షమ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ కూడా బ్యాటింగ్ చేయగల సమర్థులే. అయితే లక్ష్యం భారీగా ఉండటంతో వీరిపై అంచనాలు పెట్టుకోలేని పరిస్థితి ఉంది.అంతకుముందు విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులు చేసి ముంబై ముందు కొండంత లక్షాన్ని ఉంచింది. యశ్ రాథోడ్ 151 పరుగులు చేసి విదర్భ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. యశ్‌కు కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (52) సహకరించాడు. వీరిద్దరి నుంచి ఈ స్థాయి ఇన్నింగ్స్‌లు రాకపోయుంటే విదర్భ ముంబై ముందు ఇంత భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయేది. విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో షమ్స్ ములానీ దెబ్బకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ములానీ ఆరు వికెట్లు తీశాడు. తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు.దీనికి ముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. ఆకాశ్ ఆనంద్‌కు సిద్దేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37), తనుశ్ కోటియన్ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 4, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2, దర్శన్ నల్కండే, భూటే చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.

Hyderabad: హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం
గచ్చిబౌలి: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీరాంనగర్ కాలనీలో స్టైలిష్ బ్యూటీ స్పా పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, గచ్చిబౌలి పోలీసులు బుధవారం దాడులు చేశారు. నిర్వాహకుడు సత్యనారాయణ, విటులు శ్రీకాంత్, గోవిందరావు, అప్పారావులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు కారు ప్రమాదాలు.. నలుగురికి గాయాలుమణికొండ: బుధవారం జరిగిన వేర్వేరు కారు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. నార్సింగి పోలీసులు తెలిపిన మేరకు.. రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్‌కు చెందిన విజయ్‌కుమార్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన స్నేహితురాలితో కలిసి బుధవారం తెల్లవారు జామున సుజికీ ఫ్రాంక్స్ కారులో కోకాపేట మూవీటవర్ వైపు లాంగ్ డ్రైవ్‌కు వచ్చారు. కారును వేగంగా నడపటం, ముందు లారీ వెళుతున్న విషయాన్ని గమనించకపోవటంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దాంతో విజయ్‌కుమార్‌తో పాటు అతని స్నేహితురాలికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స కొరకు తరలించారు. మరో సంఘటనలో వోక్స్ వ్యాగన్ కారులో వికారాబాద్ నుంచి నార్సింగికి వస్తుండగా సీబీఐటీ కళాశాల ముందుకు రాగానే అదుపు తప్పిన కారు రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న హోర్డింగ్ పోల్‌ను ఢీ కొట్టింది. దాంతో కారు ముందు బాగం పూర్తిగా నుజ్జు,నుజ్జు అయ్యింది. అందులో ఉన్న కార్తీక్, అభిõÙక్రెడ్డిలకు స్వల్పగాయాలు కావటంతో వారు కారును అక్కడే వదిలి పారిపోయారు. రెండు కారు ప్రమాదాల కేసులను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

బ్యాంకులో కుప్పకూలిన న్యాయవాది
కంటోన్మెంట్(హైదరాబాద్): కోర్టు చలాన్ డబ్బులు జమ చేసే నిమిత్తం బ్యాంకుకు వచ్చిన ఓ న్యాయవాది బ్యాంకులోనే కుప్పకూలి మరణించిన ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలో ఉంటున్న న్యాయవాది వెంకటరమణ (58) సికింద్రాబాద్ కోర్టులో కేసులు వాదిస్తుంటారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మారేడుపల్లి కొండారెడ్డి స్ట్రీట్‌లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు ఆయన వెళ్లారు. బ్యాంకు చలాన్ రిసీట్ తీసుకుంటూనే ఫ్లోర్‌పై కుప్పకూలడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు వెంకటరమణకు సీపీఆర్ చేసేందుకు యతి్నంచినా ఫలితం లేకపోయింది. వెంకటరమణ మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద కుమార్తె అమెరికాలో ఉండగా, చిన్న కుమార్తె తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఇటీవలే చిన్న కూతురు పెళ్లి నిశ్చయమైనట్లు సమాచారం. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే బ్యాంకుకు చేరుకున్న వెంకటరమణ కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కదిలించింది. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


Group 2: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన


కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు


ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది: Botsa


ఫోన్ ట్యాపింగ్‌లకు నేను భయపడను: పేర్నినాని


CM Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం


మానసికంగా వేధిస్తున్నారు మీ ఇంట్లో పిల్లను ఇలాగే చేస్తావా: Pothina Mahesh
ఔరా! అనిపించే అందాలతో కవ్విస్తోన్న నోరా ఫతేహి ఫొటోస్


కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు


YS Jagan: ఐ మిస్ యు గౌతమ్


సచివాలయ ఉద్యోగులను దూషించిన కమిషనర్