ప్రధాన వార్తలు

ఇసుకలో మస్కా!
ఓచేత్తో ఉచిత ఇసుక అంటూ ప్రజలను మాయ చేస్తూ... మరోచేత్తో భారీ దందాను ప్రోత్సహిస్తూ జేబులు నింపుకొంటున్నారు పెదబాబు, చినబాబు. అర్హత లేని సంస్థను అడ్డుపెట్టుకుని.. అనుమతుల్లేని తవ్వకాలతో రోజుకు రూ.కోట్లు దండుకుంటున్నారు. ఈ దోపిడీతో కృష్ణా నదీ గర్భం అస్తవ్యస్తంగా మారిపోతోంది. ఇదంతా సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో బల్లకట్టు నావిగేషన్ చానల్ ముసుగులో సాగుతున్న భారీ దందా.సాక్షి, అమరావతి: పెదబాబు, చినబాబు అండదండలే అర్హతగా... కృష్ణా నదిలో బల్లకట్టు నావిగేషన్ చానల్ పూడికతీత పనుల కాంట్రాక్టు చేజిక్కించుకుంది కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ. ఇది పైకి మాత్రమే. చేస్తున్నది మాత్రం నిత్యం వేలాది టన్నుల ఇసుక అక్రమ తవ్వకం.. తరలింపు. రాజధాని పనులకు ఇసుక, నావిగేషన్ చానల్ పేరిట అడ్డగోలుగా తవ్వి రోజుకు దాదాపు రూ.4 కోట్లు మింగేస్తోంది. ⇒ కృష్ణా నది మీదుగా గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాకపోకలకు ఇబ్రహీంపట్నం–వైకుంఠపురం మధ్య బల్లకట్టు దారి ఉంది. దీనిలో ఇసుక మేటలను తొలగించేందుకు కృష్ణా, గోదావరి వాటర్ వేస్ సంస్థ డిసెంబరులో కాంట్రాక్టు పొందింది. ఇసుక తవ్వకంలో ఎలాంటి అర్హత లేకున్నా కేవలం చినబాబు సన్నిహితులంతా కలిసి దీనికి కాంట్రాక్టు ఇప్పించారు. తాము చెప్పినట్టల్లా సంతకం పెట్టే ఇరిగేషన్ అధికారిని గుంటూరు జిల్లాలో నియమించి అనుమతులు తీసుకున్నారు. నావిగేషన్ చానల్ పరిధిలో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీయాలనేది కాంట్రాక్టు. టన్నుకు రూ.215 చొప్పున చెల్లిస్తోంది. వాస్తవానికి టన్ను ఇసుక తవ్వేందుకు రూ.50, లోడింగ్‌కు రూ.15 మాత్రమే ఖర్చవుతుంది. కానీ, అంతా సొంతవాళ్లే కావడంతో ప్రభుత్వ పెద్దలు అదనంగా రూ.150 కలిపి కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. దీంట్లోనే.. కాంట్రాక్టు సంస్థకు నిర్దేశిత 7 లక్షల టన్నులకు రూ.10.5 కోట్లు అప్పనంగా ఇచ్చినట్లయింది. ⇒ ఇప్పటికే 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేసినట్లు స్థానిక బోట్స్‌మెన్ సంఘాలు చెబుతున్నాయి. రాజధాని పనుల కోసమని చెబుతూ రోజుకు 30 వేల టన్నుల ఇసుకను తోడుతున్నారు. ఇందులో సగానికి పైగా హైదరాబాద్, తదితర నగరాలు, పట్టణాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి రాజధాని పనుల కాంట్రాక్టు సంస్థలకు టన్ను రూ.130కే ఇసుక సరఫరా చేయాలని మొదట ఒప్పుకొన్నారు. కానీ, కాంట్రాక్టు రూ.215కు తీసుకున్నాం కాబట్టి అంతే ఇవ్వాలని వసూలు చేస్తున్నారు. ఇందులోనూ టన్నుకు రూ.85 మిగుల్చుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌కు తరలించే ఇసుకను టన్ను రూ.2,500తో అమ్ముతున్నారు. మొత్తంగా రోజుకు 30 వేల టన్నుల మీద సుమారు రూ.4 కోట్లు.. నెలకు రూ.100–120 కోట్లు అక్రమంగా అర్జిస్తున్నారు. ఈ లెక్కన మార్చి నుంచి ఇప్పటి వరకు.. అంటే ఐదు నెలల్లో రూ.580 కోట్లకు పైగా దోచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ దందా చూస్తుంటే... బల్లకట్టు కోసం కానే కాదు.. చినబాబు మూటల కోసమేనని స్పష్టమవుతోంది. అంతా ఆ తాను ముక్కలే...కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ తాతినేని వంశీది చినబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎన్ఆర్ఐ డాక్టర్ కీలక పాత్ర అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న కీలక అనుయాయుడు కేఆర్కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ తాతినేని వంశీ అనే వ్యక్తికి చెందినది. కరకట్టపైనే నివాసం ఉండే, చినబాబుకు అత్యంత సన్నిహితుడైన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్, మరికొందరు కలిసి దీన్ని నడిపిస్తున్నారు. వీరికి చినబాబు తరఫున ప్రతినిధిగా ఆయన కీలక అనుయాయుడు కేఆర్ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. అందరూ ముఠాగా ఏర్పడి ఇసుక అక్రమ తవ్వకాలతో రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు ప్రకాశం బ్యారేజీ పూడికతీత పనుల్లోనూ రెట్టింపు మొత్తం దండుకునేందుకు స్కెచ్ వేశారు. రాజధాని పనులు చేస్తున్న బడా కంపెనీల తరఫున ఇదే కంపెనీతో టెండర్లు వేయించి, దాన్ని కూడా సిండికేట్‌గా దక్కించుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా త్వరలో రూ.286 కోట్ల విలువతో టెండర్ పిలిచేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కాంట్రాక్టు కూడా కృష్ణా–గోదావరి వాటర్ వేస్‌కు ఇచ్చేలా చినబాబు స్కెచ్ వేశారు. అందుకుతగ్గట్టుగానే టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.అర్హత, అనుభవం లేని సంస్థకు కట్టబెట్టేసి...చినబాబు జేబు సంస్థకు అడ్డగోలుగా అనుమతులులారీలు ఆపితే పేషీ నుంచి వెంటనే ఫోన్లుఅడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకిగత ప్రభుత్వంలో పక్కనపెట్టినా.. కూటమి వచ్చాక పచ్చజెండాకృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థకు ఇసుక తవ్వే అర్హతలు ఏమాత్రం లేవని బోట్స్‌మెన్ సంఘాలు చెబుతున్నాయి. డ్రెడ్జింగ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించేలా ఉందని వాపోతున్నాయి. తమ ఉపాధి పోతోందని, నదీ గర్భం కుంగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకునేవారే లేరని బోట్స్‌మెన్ సంఘాల వారు వాపోతున్నారు. వాస్తవానికి డ్రెడ్జింగ్‌కు అవసరమైన రిజిస్ట్రేషన్లు, బోట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, సరంగు లైసెన్స్‌లతో పాటు ఇతర చట్టపరమైన అర్హతలు ఏవీ లేవని తేలడంతో గత ప్రభుత్వంలో ఈ సంస్థకు ఏ పనీ ఇవ్వలేదు. ఇప్పుడు చినబాబు బినామీగా మారడంతో కాంట్రాక్టులు సులభంగా వచ్చేస్తున్నాయి. పేరు ఆ కంపెనీదైనా వ్యవహారాలన్నీ చినబాబు మనుషులే చూసుకుంటున్నారు. అడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకి దిగి సర్దుబాటు చేస్తున్నారు. కంపెనీ లారీలు, వ్యవహారాలను ఎవరైనా ఆపితే వెంటనే చినబాబు పేషీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. నావిగేషన్ చానల్, డ్రెడ్జింగ్ పేరుతో తమ ఇంటి పక్క నుంచే రూ.కోట్లు కురిపించే ఇసుక చానల్‌ను పెదబాబు, చినబాబు తయారు చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

యూరియా కోత.. రైతన్న వెత
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరినాట్లు ఊపందుకున్నాయి. దీంతో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా అవసరమైన మొత్తంలో యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే తీవ్రమైన కొరత నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ విధానంలో ఒక్కొక్కరికి రెండు బస్తాలే ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ ఆగస్టు నెలలో రైతుల అవసరాలు తీరాలంటే కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆ మేరకు యూరియా వస్తేనే గండం గట్టెక్కే అవకాశం ఉంటుందని, లేకపోతే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం వానాకాలం సీజన్‌కు గాను నెలల వారీగా కేటాయించిన 9.80 ఎల్ఎంటీల యూరియాలో కోత పెట్టడంతోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా..రాష్ట్రానికి కోటాకు మించి ఎరువులు సరఫరా చేశామంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఇది రైతులకు తప్పుడు సంకేతాలను ఇస్తుందని, గ్రామాల్లో యూరియా కోసం ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. చర్చనీయాంశమైన కేంద్రమంత్రి ప్రకటన రాష్ట్రంలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, లోక్‌సభలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. తెలంగాణకు ఈ ఖరీఫ్ (వానాకాలం) సీజన్లో అవసరమైన 20.30 ఎల్ఎంటీల కన్నా అధికంగా 22.15 ఎల్ఎంటీలు సరఫరా చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. దీంతో బిత్తరపోవడం రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల వంతయ్యింది. వాస్తవానికి ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి.. యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్ఎస్పీ ఎరువులు కలిపి 22.15 ఎల్ఎంటీ ఇచ్చినట్లు చెప్పాల్సిన కేంద్ర మంత్రి.. కేవలం యూరియానే 22.15 ఎల్ఎంటీ సరఫరా చేసినట్లుగా చెప్పారని ఓ అధికారి వివరించారు. నిజానికి ఇప్పటివరకు ఇచ్చిన యూరియా 4.50 ఎల్ఎంటీలు మాత్రమేనని చెప్పారు. అసలు లెక్కలేంటి? రాష్ట్రంలో పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ వానాకాలంలో ఏకంగా 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 10.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం ఈ సీజన్‌కు గాను నెలవారీగా 9.80 ఎల్ఎంటీలు మాత్రమే కేటాయించింది. అదేమంటే యాసంగి సీజన్లో మిగిలిన యూరియా 1.92 ఎల్ఎంటీ గోదాముల్లో ఉందని, దాన్ని వినియోగించుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సమాచారం మేరకు.. ఏప్రిల్ నుంచి జూలై వరకు కేంద్రం 6.60 ఎల్ఎంటీల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 4.50 ఎల్‌ఎంటీలే వచ్చింది. అంటే 2.10 ఎల్ఎంటీ (32 శాతం) తక్కువగా వచ్చిందన్న మాట. దీనికి రాష్ట్రం వద్ద ప్రారంభ నిల్వ కింద ఉన్న యూరియా 1.92 ఎల్ఎంటీలు కలిపితే మొత్తం 6.42 ఎల్ఎంటీలు అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. ఇందులో సుమారు 5.20 ఎల్ఎంటీలు ఇప్పటికే రైతులకు విక్రయించగా.. 1.20 ఎల్ఎంటీల పైచిలుకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. 2 ఎల్‌ఎంటీలైనా వస్తేనే.. ఈ సీజన్లో రాష్ట్రానికి కేటాయించిన 9.80 ఎల్ఎంటీలకు గాను జూలై వరకు 4.50 ఎల్ఎంటీలు సరఫరా చేసిన నేపథ్యంలో ఇంకా 5.30 ఎల్ఎంటీల యూరియా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల్లో కోత విధించిన 2.10 ఎల్ఎంటీలతో పాటు ఆగస్టు కోటా 1.70 ఎల్ఎంటీలు కలిపి ఈ నెలలో సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. కాగా ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో అధికారులు సమావేశమై యూరియా కొరత పరిస్థితిని సమీక్షించారు. ఆగస్టులో కనీసం 2 ఎల్ఎంటీల యూరియా అయినా వస్తేనే ప్రస్తుతానికి గట్టెక్కే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తాజాగా కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు లేఖ రాశారు. రాష్ట్రానికి యూరియా కేటాయింపులు, ఇప్పటివరకు కేంద్రం నుంచి వాస్తవంగా వచ్చిన యూరియా వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలో కొరతను దృష్టిలో పెట్టుకుని తక్షణమే అవసరమైన యూరియాను పంపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలలో పురోగతి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: శు.దశమి ఉ.9.44 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: అనూరాధ ఉ.8.31 వరకు, తదుపరి జ్యేష్ఠ,వర్జ్యం: ప.2.38 నుండి 4.23 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.19 వరకు, తదుపరి ప.3.00 నుండి 3.50 వరకు,అమృత ఘడియలు: రా.1.29 నుండి 2.55 వరకు.సూర్యోదయం : 5.42సూర్యాస్తమయం : 6.29రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.వృషభం..... పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.మిథునం... కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి. కొత్త విద్యావకాశాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కర్కాటకం......ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. సోదరులు,సోదరీలతో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ.సింహం... అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులు నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి.కన్య... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. విందువినోదాలు.తుల... వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మార్పులు.వృశ్చికం.... ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.ధనుస్సు.... ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.మకరం.... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.కుంభం... కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు పనిభారం నుంచి బయటపడతారు. దైవదర్శనాలు.మీనం... ఆర్ధిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

తలతిక్క సుంకాల తలనొప్పి!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన బృందంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్ నాలుగు నెలలు చర్చలు జరిపినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నవాటిపై 26 శాతం సుంకం విధిస్తామని ఏప్రిల్ 2న బెదిరించిన ట్రంప్ ఆగస్టు 30న 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.చర్చలు మొదలైనప్పటి నాటికన్నా పరిస్థితి ఇపుడు మరింత దారుణంగా తయారైంది. రష్యా నుంచి చమురు, రక్షణ సామగ్రి కొనుగోళ్ళను నిలిపివేయకపోతే జరిమానా కింద మరికొంత సుంకాన్ని విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఆ సుంకం శాతాన్ని నిర్దిష్టంగా ప్రకటించలేదు. భారత్ సుంకాలు ప్రపంచం మొత్తంమీద చాలా ఎక్కువగా ఉన్నాయని, ద్రవ్యేతర వాణిజ్య చర్యలు ‘‘అత్యంత శ్రమ పెట్టేవిగా, అప్రియమైనవిగా’’ ఉన్నాయని ఆయన అన్నారు.ట్రంప్ కోరుతున్నదేమిటి?అమెరికాతో వాణిజ్యం విషయంలో, ట్రంప్ కుయుక్తులను, మనం ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని రకాల చర్చలనూ విరమించుకోవాలా లేక లొంగిపోవాలా? ద్వైపాక్షిక వాణిజ్య లోటును నిర్మూలించే పేరుతో ట్రంప్ మొదలెట్టిన జూదం దాని భాగస్వామ్య దేశాలకు ఎంత రుచించని దైనా, ఆయన లక్ష్యాలు మాత్రం స్పష్టం. అమెరికాతో వాణిజ్యంలో మిగులులో ఉన్న దేశాలు, ఆ వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు నాలుగు చర్యలు తీసుకోవాలని ట్రంప్ కోరుతున్నారు. 1. సుంకం పైసా కూడా లేకుండా అన్ని అమెరికా ఉత్పత్తులకూ సంపూర్ణ మార్కెట్ సౌలభ్యం కల్పించడం; 2. అమెరికాకు ఎగుమతి చేసే వాటిపై 15–25 శాతం సుంకం విధించడానికి అంగీకరించడం; 3. వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు వీలుగా అమెరికా నుంచి ఇపుడు కొంటున్నవాటికి తోడుగా విమానాలు, ఇంధనం వంటివాటిని కొనడం; 4. అమెరికాలో వస్తూత్పత్తికి పెట్టుబడులు పెట్టడం.చాలా దేశాలు రెండు కారణాలతో అమెరికాకు ఎగుమతులు ఇష్టపడతాయి. ఒకటి– అది చాలా పెద్ద మార్కెట్ (మొత్తం ప్రపంచం ఎగుమతుల్లో సుమారుగా 15 శాతం దానికే వెళుతున్నాయి), రెండు – ఎగుమతిదారులకు లాభాలు సమకూరుతాయి. కానీ అద నపు సుంకాల భారాన్ని నెత్తికెత్తుకుని అనిష్టంగానైనా ఎగుమతులు చేస్తే వారికొచ్చే లాభాలు ఏమీ ఉండవు. అదనపు సుంకాల భారాన్ని భరించినా ఎంతో కొంత లాభాన్ని మిగుల్చుకోగలిగిన అవకాశం భారతీయ ఎగుమతిదారులకు లేదు. కనుక, అదనపు 25 శాతం సుంకానికీ, జరిమానా సుంకానికీ భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.తీర్చలేని డిమాండ్లుజన్యుపరంగా సవరించిన గింజలతో తీసిన వంటనూనె దిగు మతులను (జీఎం నూనె మనుషుల ఆరోగ్యానికి మంచిది కాదని నిరూపించే శాస్త్రీయ అధ్యయనాలు ఏవీ జరగలేదు), పాడి పరిశ్రమ ఉత్పత్తులను, పౌల్ట్రీ ఉత్పత్తులను (అమెరికన్ చికెన్ లెగ్స్ వినియోగదారుల సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి) అనుమతించడం అంటే... వ్యావసాయిక వాణిజ్యాన్ని భారత్ సరళీకృతం చేయడం. ఇది వివేకవంతమైన చర్యగానే తోస్తుంది. కానీ, దేశీయ రైతులను సంరక్షించవలసిన బాధ్యత వల్ల, ఈ విషయంలో భారత దేశం పాలుపోని స్థితిలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాకు ఎలాంటి రాయితీలూ ఇవ్వగలిగిన స్థితిలో ఇండియా లేదు. భారతదేశ రక్షణ అవసరాలకు ఒదగని లేదా మరీ ఖరీదుతో కూడిన ఎఫ్–35 విమానాలను లేదా ముడి చమురును కొనాలని అమెరికా బలవంతపెట్టడం బ్లాక్ మెయిల్ చేయడమే! దానికి లొంగి పోతే భారత్ బలహీనమైనదనే ముద్రపడుతుంది. ఇక భారత్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించడమేకానీ, ఇవ్వడం చాలా అరుదు. విదేశాల్లో భారత్ పెట్టుబడులు కొద్దిగానే ఉన్నాయి. రానున్న 5–10 ఏళ్ళలో, అమెరికాలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడం కూడా మనకు కష్టమే. ట్రంప్ అడుగుతున్న నాలుగింటిలో దేన్నీ తీర్చగల స్థితిలో ఇండియా లేదు.ట్రంప్ నాలుగు డిమాండ్లకూ వియత్నాం, జపాన్, ఇండో నేషియా, యూరోపియన్ యూనియన్ మాత్రమే అంగీకరించాయి. అమెరికా అదనపు సుంకాలను దిగమింగుకుని ఈ దేశాల ఎగుమతిదారులు తమ వస్తువుల ధరలను తగ్గిస్తారా లేక అమెరికా వినియోగదారులకు ఆ భారాన్ని బదలీ చేస్తారా? లేక రెండింటి మిశ్రమంతో ముందుకు సాగుతారా? ఆ యా ఎగుమతి దేశాలు అదనపు సుంకాలను తామే భరించడంలో లేదా అమెరికా వినియోగ దారులకు బదిలీ చేయడంలో విఫలమైతే నష్టపోయేది అమెరికా, దాని వినియోగదారులే! ఇచ్చిన వాగ్దానం మేరకు, ఆ యా దేశాలు, నిజంగా చెప్పినంత సంఖ్యలో విమానాలను, ఇంధన ఉత్పత్తులను, రక్షణ పరికరాలను కొనుగోలు చేయగలుగుతాయా? దానికి చాలా కాలం పడుతుంది. పైగా, వాటి ధరలు తగ్గించాలని అవి అమెరికాను డిమాండ్ చేయవచ్చు. తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇలా ఉండాలి, అలా ఉండాలని చర్చలతో సుదీర్ఘ కాలయాపన చేయ వచ్చు. ఈ తతంగం ద్వారా ట్రంప్ ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో అది నెరవేరకపోవచ్చు. లేదా ఆశించింది కొండంత, లభించింది ఆవగింజంతగా పరిణమించవచ్చు. ఇండియా ముందున్న మార్గంభారత్ ఎదుట రెండు అవకాశాలున్నాయి. ఒకటి– జపాన్, వియత్నాం, ఇండోనేషియా, యూరోపియన్ యూనియన్ల మాదిరిగా తలొగ్గి ఒప్పందం కుదుర్చుకోవడం. తర్వాత, భారత్ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎగువ పేర్కొన్న ఎత్తుగడలను అనుసరించడం. రెండు– ట్రంప్ వాణిజ్య బృందంతో అన్ని చర్చలకూ స్వస్తి పలికి, ఏ సుంకాలు విధించుకుంటావో విధించుకో అనడం. అదనపు సుంకాల భారాన్ని నెత్తిన రుద్దుకోకుండా, వస్తువులను వాటి సాధారణ ధరలకే విక్రయించవలసిందని ఎగుమతిదారులకు నచ్చజెప్పడం. అమెరికాలోని దిగుమతిదారులు కొంటే మంచిదే. లేదంటే, ఆ వస్తువులను, అటువంటి అసంబద్ధ సుంకాలు లేని ఇతర దేశాలకు విక్రయిచడం. దేశీయ మార్కెట్ లోనూ అమ్ముకునేటట్లు చూసుకోవడం. కొన్ని ఎంపిక చేసుకున్న వాటికి అంగీకరించి, మధ్యే మార్గాన్ని అనుసరించడం వల్ల భారత దేశానికి పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. అంతకంటే, రెండవ దారిని ఎంచుకుని ముందుకు సాగడమే మంచిది. ట్రంప్ పాలనా యంత్రాంగం తలతిక్కతో తీసుకుంటున్న సుంకాల చర్యల ప్రతికూల పర్యవసానాలను త్వరలోనే (మహా అయితే 3–6 నెలల్లో) చవిచూడవలసి రావచ్చు. అమెరికా దిగు మతులు మందగిస్తాయి (ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంక వివ రాలు దాన్ని ధ్రువపరుస్తున్నాయి). సుంకాల రాబడి కింద అమెరికాకు కొద్ది వందల బిలియన్ల డాలర్లు లభించవచ్చు. కానీ, దానిలో చాలా భాగాన్ని అమెరికాలోని దిగుమతిదారులు, వినియోగదారులే చెల్లించవలసి ఉంటుంది. ధరలు మంట పుట్టించడంతో వినియోగ దారుల తిరుగుబాటుకు ఎంతో కాలం పట్టదు. పరిస్థితులు తేటతెల్లమవుతున్నకొద్దీ, ట్రంప్ తాను విధించిన చాలా సుంకాలను వెనక్కి తీసుకోక తప్పదు. అందుకే ఇండియా వేచి చూడటమే మంచిది. దానివల్ల పెద్దగా ఖర్చయ్యేదేమీ ఉండదు.సుభాష్ చంద్ర గర్గ్ వ్యాసకర్త ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)

కరోలిన్‌పై ట్రంప్ ‘వంకర పొగడ్తలు’
వాషింగ్టన్: మహిళలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపు ఇప్పుడు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్(27)పై పడింది. ఆమె అందరికంటే ఉత్తమ సెక్రటరీ అంటూ కితాబివ్వడంతోపాటు పలు విపరీత పొగడ్తలు కురిపించారు. న్యూస్‌మ్యాక్స్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో ట్రంప్.. లెవిట్‌ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశారు. అధికార పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే ట్రంప్ ఆరు ప్రాంతాలకు సంబంధించిన కాల్పుల విరమణ ఒప్పందాలను కుదిర్చారంటూ శుక్రవారం మీడియా సమావేశం సందర్భంగా ట్రంప్‌పై లెవిట్ ప్రశంసలు కురిపించారు. ‘లెవిట్ పెద్ద స్టారైపోయారు. ఆ ఫేస్..ఆ బ్రెయిన్ అద్భుతం. ఆమె పెదాలు అబ్బో..అవి కదులుతుంటే అచ్చు మెషీన్ గన్ లాగే ఉంటాయి’అంటూ పేర్కొన్నారు. ఆమె చాలా గొప్పవ్యక్తి. కరోలిన్ కంటే ఉత్తమ ప్రెస్ సెక్రటరీ ఇప్పటి వరకు ఎవరూ లేరనే అనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదంటూ నెటిజన్లు తప్పుబట్టారు. ఆయన పొగడ్తలు అసౌకర్యం, భయంకరం, అనవసరం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ బెస్ట్‌ఫ్రెండ్ మాట్లాడినట్లే ఉందంటూ ఎద్దేవా చేశారు. గతంలో ట్రంప్, ఎప్స్టీన్ మధ్య కొనసాగిన మైత్రి వివాదాస్పదంగా మారడం తెల్సిందే. ‘అదే ఒక వ్యక్తి తన మహిళా కొలీగ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి, కోర్టు బోనెక్కించేవారు అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. వృత్తిపరమైన ప్రవర్తనలో ద్వంద ప్రమాణాలకు ఇదే ఉదాహరణ అంటూ ఆ యూజర్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మీడియా ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రధాన మీడియా సంస్థలు గానీ, వైట్ హౌస్ గానీ ఈ విపరీత వ్యాఖ్యలపై ట్రంప్‌ను ప్రశి్నస్తాయా అంటూ నిలదీస్తున్నారు.

‘ధర్మస్థల’ దారుణాలపై సాక్ష్యాధారాలు ధ్వంసం
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి, మృతదేహాలను సామూహికంగా ఖననం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో వందకు పైగా మహిళల మృతదేహాలను స్వయంగా ఖననం చేశానని ఓ పారిశుధ్య కార్మీకుడు ప్రకటించడంతో సంచలనం రేగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ధర్మస్థలలో 2000 సంవత్సరం నుంచి 2015 వరకు.. 15 ఏళ్లలో అసహజ మరణాల రికార్డులు కనిపించకుండాపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి పోలీసులు వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కార్యకర్త జయంత్ ఈ విషయం బహిర్గతం చేశారు. 2000 నుంచి 2015 దాకా అసహజ మరణాల రిజిస్టర్(యూడీఆర్)లో నమోదైన అన్ని ఎంట్రీలను పోలీసులు ఒక పద్ధతి ప్రకారం డిలీట్ చేసినట్లు వెల్లడయ్యింది. ధర్మస్థలలో అదే సమయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద, నమోదు కాని మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారుల సమక్షంలోనే ఖననం ఒక యువతి మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా, రహస్యంగా ఖననం చేస్తుండగా అనుకోకుండా తాను చూశానని ఆర్టీఐ కార్యకర్త జయంత్ చెప్పారు. దీనిపై ఈ నెల 2వ తేదీన సిట్‌కు ఫిర్యాదు చేశారనని వివరించారు. ఆ ఖననం జరుగుతున్న సమయంలో పలువురు అధికారులు అక్కడే ఉన్నారని, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించలేదని చెప్పారు. జయంత్ ఫిర్యాదుపై సిట్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి జయంత్ చాలాకాలంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు, యువతుల పూర్తి వివరాలు, ఫోటోలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద బెళ్తంగడి పోలీసులను కోరగా, వారు అందుకు నిరాకరించారని జయంత్ చెప్పా రు. సంబంధిత డాక్యుమెంట్లు, పోస్ట్‌మార్టం రిపోర్టులు, వాల్ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలను నాశనం చేసినట్లు వారు బదులిచ్చారని పేర్కొన్నారు. గుర్తించని మృతదేహాలకు సంబంధించిన ఆధారాలేవీ లేవని, రొటీన్ ప్రక్రియలో భాగంగానే వాటిని నాశనం చేశామంటూ చెప్పారని స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అధికారుల సమక్షంలోనే యువతి మృతదేహాన్ని చనిపోయిన శునకాన్ని ఖననం చేసినట్టుగా చేశారని, ఆ సంఘటన చాలాకాలం తనను వెంటాడిందని జయంత్ తెలియజేశారు. ఆ అధికారుల పేర్లు కూడా చెప్పగలనని అన్నారు. ధర్మస్థలలో మరణాలపై దర్యాప్తు బాధ్యతను నిజాయతీ గల అధికారులకు అప్పగించకపోతే తనకు నిజాలు బయటపెడతానని రెండేళ్ల క్రితం హెచ్చరించానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు. అందుకే సిట్‌కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తన వెనుక ఎవరూ లేరని, తనను ఎవరూ ప్రభావితం చేయడం లేదని తేల్చిచెప్పారు. నేటి టెక్నాలజీ యుగంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తవ్వకాల్లో అస్తిపంజరం బయటపడితే అది ఎవరిదో ఎలా గుర్తిస్తారని అన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. ధర్మస్థలలో జరిగిన దారుణాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరన్నది బయటపడాలని స్పష్టంచేశారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్న వ్యక్తులెవరో ప్రభుత్వం తేల్చాలని అన్నారు. సాక్ష్యాధారాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని చెప్పారు.

యాభై ఏళ్ల షోలే
థియేటర్లోని ప్రేక్షకులు సీటు కిందకు తల ఒంచి అటూ ఇటూ వెతికారు... కాయిన్ ఇక్కడెక్కడైనా పడిందా అని. ‘షోలే’ క్లయిమాక్స్‌లో అమితాబ్ మరణించాక అతని చేతిలోని కాయిన్ చూసి ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఆ కాయిన్ కు రెండు వైపులా ‘హెడ్స్’ ఉంటుంది. ఇంతకాలం తన ప్రాణమిత్రుడు దొంగటాస్ వేసి మోసం చేశాడని, ఇవాళ అదే టాస్‌తో తనను కాపాడితాను మరణించాడని గ్రహించి, ఆగ్రహంతో కాయిన్ ని విసిరి కొడతాడు. అది గల్గల్మంటూ థియేటర్లోనే ఎక్కడో పడుతుంది. ఒక క్షణం ప్రేక్షకులు దాని కోసం అటూఇటూ వెతుకుతారు. ఎందుకంటే అందాక వారికలాంటి అనుభూతి తెలియదు. స్టీరియోఫోనిక్ వల్ల వచ్చింది. షోలేను షోలే అభిమానులు స్టీరియోఫోనిక్ థియేటర్ వెతుక్కుంటూ నగరాలకు వెళ్లి చూశారు. 70 ఎం.ఎంలో చూశారు. స్కోప్‌లో చూశారు. 35 ఎం.ఎం.లో చూశారు. చిన్న ఊళ్లలో నిడివి కుదించి జయభాదురి ఫ్లాష్‌బ్యాక్ లేని వెర్షన్ రిలీజ్ చేస్తే అదీ చూశారు. దూరదర్శన్ లో చూశారు. కేబుల్ టీవీలో చూశారు. యూ ట్యూబ్‌లో చూశారు. ఓటిటిలో చూశారు. యాభై ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. షోలే అభిమానులది వేరే లెవల్.ఆడే సినిమాలు ఆడదగ్గ రీతిలో తీస్తే ఆడతాయి. సెట్స్ వల్ల, విఎఫ్ఎక్స్ వల్ల, భారీ బడ్జట్ వల్ల, ముహూర్తబలం వల్ల ఆడవు. ఆడదగ్గ రీతిలో కథ అనుకుని ఇవన్నీ కలిపితే ఆడొచ్చు. షోలే సినిమా తొలిషాట్ తీయడం కుదరలేదు. వాన. ముహూర్తం అప్సెట్ అయ్యింది. రెండోరోజు తెల్లచీర కట్టుకుని వితంతువు పాత్రలో ఉన్న జయభాదురి అమితాబ్‌కు ఇనప్పెట్టె తాళాలు ఇవ్వడం ఫస్ట్‌షాట్‌గా తీశారు. దక్షిణాది సినీచరిత్రలో నేటి వరకు వితంతువు పాత్రపై ముహూర్తం షాటు తీసిన దాఖలా లేదు. అలా తీస్తే ఫ్లాప్ అవుతుందా? అలా తీయకపోతే హిట్ ఏమైనా అయ్యిందా? తాము చేసే దుర్మార్గాలకు, దోపిడీలకు దైవబలాన్ని తోడు అడగడం కూడా షోలే తీసేసింది. గబ్బర్ సింగ్ ఒక్కనాడు కూడా కాళీమాత విగ్రహం ఎదుట ప్రమాణం చేసి దోపిడీకి బయలుదేరడు. అప్పటి వరకూ హిందీ సినిమాలలోని బందిపోట్లు అందరూ కాళీమాత బలాన్ని తోడు అడిగేవారే.సమాజం చెడ్డను భరించగలదుగానీ మరీ దారుణమైన చెడ్డను సహించలేదు. ఆ చెడ్డను పరిహరించడానికి మెరుగైన చెడ్డనైనా శరణుజొచ్చడానికి వెనుకాడదు. గబ్బర్ సింగ్ అఘాయిత్యాలు పట్టనలవి కానప్పుడు అంత చెడ్డవాణ్ణి నిర్మూలించడానికి కొంచెం చెడ్డవాళ్లను నియమిస్తారు. వీరు, జయ్ చిల్లర దొంగలే గాని వారిలో బహాదూరి ఉంది. మానవత్వం కూడా ఉంది. ఊరు వారిని ఆదరిస్తుంది. వర్తమానంలో కరడుగట్టిన నేరస్తుల శిక్షకు పోలీసులు ఎన్ కౌంటర్ అనే చెడ్డమార్గం ఎంచుకుంటే ప్రజలు ఆదరించడం ఇలాంటిదే కావచ్చు. వ్యక్తిగత ఆగ్రహాన్ని సామాజికస్థాయికి తీసుకెళ్లమని షోలే చెబుతుంది. గబ్బర్ సింగ్ వల్ల ఠాకూర్ తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. గబ్బర్‌ని శిక్షించడం వ్యక్తిగతమైన కక్షే... కాని అందులో సామాజిక న్యాయం ఉంది. ఇవాళ సగటు మనిషి తన నెత్తిన పన్నులు పడుతున్నా, తన ప్రమేయం లేకుండా కుల, మత, పార్టీల జంజాటంలో పడుతున్నా, తన సంపాదనను స్కూళ్లు, హాస్పిటళ్లు బట్టలిప్పించి దోచుకుంటున్నా, చిల్లర జీతాలతో సంస్థలు గాడిద చాకిరీ చేయిస్తున్నా, న్యాయం కోసం ఏళ్లకేళ్లు అంగలార్చాల్సి వస్తున్నా కిమ్మనడం లేదు... శాపనార్థాలు పెట్టుకోవడం తప్ప. ఎలుక శాపం పిల్లికి తగలదు. ఠాకూర్‌లా కార్యాచరణకు దిగితే, ఒకరొకరుగా కదిలి ఊరు మొత్తం గబ్బర్ అంతు చూసినట్టు సమస్య అంతు చూడొచ్చు. దురదష్టవశాత్తు జనంలో అది పూర్తిగా పోయింది.షోలేలోని మహిళలు ధీర వనితలు. గబ్బర్ను ధిక్కరించే బసంతి గాని, పరిస్థితులకు చలించక స్థైర్యం చూపే ఠాకూర్ కోడలుగాని ‘ఊ అంటావా మావా... ఉఊ అంటావా’ తరహా కాదు. షోలే కథ ‘రేప్’ సీన్ కు చోటివ్వలేదు. నేడులా బడ్జెట్లో సగాన్ని బకెట్ల బకెట్ల బ్లడ్‌కు కేటాయించే పని లేకుండా రక్తమే చూపలేదు. కొండలు, గుట్టలు, పచ్చదనం ఉన్న బెంగళూరు సమీపంలోని రామ్‌నగర్ అనే చోట షూటింగ్ చేయడం తప్ప షోలే చేసిన సర్కస్ ఏదీ లేదు. షోలే మానవ ఉద్వేగాల మేజిక్. కెమెరా, సంగీతం, మాట, పాత్ర, దర్శకత్వం... వీటిని ఎంత మేలిమి నైపుణ్యంతో వాడి ఈ మేజిక్ చేయవచ్చో చరిత్ర చెప్పుకునేలా చూపింది. 1975 ఆగస్టు 15న షోలే విడుదలైంది. ఈ ఆగస్టు 15కు యాభై ఏళ్లు. ఇప్పటికే దేశంలో చర్చలు, కార్యక్రమాలు, జ్ఞాపకాల రీవిజిట్లు సాగుతున్నాయి. తెలుగు అభిమానులు ఎలాగూ ఉత్సవాలు జరుపుతారు. మన పరిశ్రమ... ముఖ్యంగా సినీ రచయితలు, దర్శకులు షోలేకు ఎటువంటి స్మరణ, సత్కారం చేస్తారో చూడాలి.

బేతాళ కుట్రలో మరో అంకం
సాక్షి, అమరావతి: నయా బేతాళ కుట్రలో చంద్రబాబు, సిట్, ఎల్లో మీడియా కలసికట్టుగా మరో అంకాన్ని సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ పెద్దలు, సిట్‌కు దిమ్మతిరిగిపోయింది. వెంటనే ఏదో ఒకటి చేసి.. ఈ విషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించకపోతే ఇది పూర్తిగా తప్పుడు కేసేనని తెలిసిపోతుందని అప్పటికప్పుడు ఓ వీడియోను ఎల్లో మీడియాకు లీక్ చేశారు.తద్వారా ఆ వీడియోకు విపరీత ప్రచారం కల్పించారు. ఆ వీడియోలో వెంకటేశ్ నాయుడు కరెన్సీ నోట్ల పక్కన ఉన్న ఫొటోను ఎల్లో మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వైరల్ చేశారు. వీళ్లు చెప్పినట్లు వినేవారిని ముందు పెట్టి సరికొత్త నాటకానికి తెరతీశారు. చెల్లని నోట్లతో కట్టుకథ చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు పంపిణీ చేస్తున్న డబ్బుగా దానిని చిత్రీకరించారు. ఆ ఫొటోలు, వీడియోల్లో రూ.2 వేల నోట్లు కనిపిస్తున్నాయి. అయితే దేశంలో రూ.2 వేల నోట్ల చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19న ఆర్బీఐ చివరి సారిగా ప్రకటించింది. కానీ 2024 ఎన్నికల సమయంలో మద్యం సొమ్ము అక్రమంగా తరలించారని చెవిరెడ్డిని అరెస్టు చేశారు.దీనిని బట్టి అర్థం కావడం లేదూ ఇదంతా కట్టుకథ అని. ఇదే వెంకటేశ్ నాయుడికి టీడీపీ నేతలతోనే సంబంధాలున్నాయని సోషల్ మీడియా సాక్షిగా బైటపడింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని, ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌లతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈ డబ్బు వారందరిదీ అని కూడా అనుకోవచ్చు కదా. వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న ఫొటో పక్కన వీరి ఫొటోలు కూడా పెట్టి.. ఇది వీరి డబ్బే అని చెప్పగలరా? తాము చెప్పినట్టు వినేవాళ్లను రంగంలోకి దించి కట్టుకథ అల్లుతున్నారనేందుకు ఇదే ప్రబల నిదర్శనం.ఇదేవిషయం గతంలోనూ వెల్లడయ్యింది ఇపుడూ నిరూపితమయింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు, సిట్, ఎల్లో మీడియా కూడబలుక్కుని సమష్టిగా ఆడుతున్న నాటకం అని ఇట్టే తెలిసిపోతోంది. ఎలాగైనా సరే మద్యం అక్రమ కేసును సక్రమం అని నిరూపించడమే లక్ష్యంగా సిట్ బరితెగించి వ్యవహరిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్లో పరువు పోగొట్టుకున్న సిట్.. మరో సరికొత్త ఎపిసోడ్ ద్వారా బేతాళ కథను రక్తి కట్టించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది.

రూ.10 లక్షలున్నా ప్రాపర్టీ కింగ్..!
ఓ ఇల్లు లేదా వాణిజ్య భవనానికి యజమాని అయితే ఆ దర్జాయే వేరు! స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా అండగా నిలిచే ప్రాపర్టీ ఉంటే చెప్పలేనంత నిశి్చంత. ప్రాపర్టీపై పెట్టుబడి ఎన్నో తరాలను ధనవంతులను చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, నేడు ఇళ్లు, వాణిజ్య స్థలాల ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థలాల లభ్యత పెరగదన్నది వాస్తవం. కనుక ప్రాపర్టీ ఇక ముందూ పెట్టుబడుల పరంగా మెరుగైన సాధనమే అవుతుంది. భారీ పెట్టుబడి పెట్టలేని వారు సైతం ప్రాపర్టీకి సహ యజమాని అయ్యే అవకాశం కల్పిస్తున్నవే ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్’లు. ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్’కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తోనే ప్రాపర్టీపై పెట్టుబడికి లభిస్తున్న అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు ఎక్కువ మంది (గతంతో పోల్చితే) ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడికి వీలు కల్పించడం ఇందులో ఉన్న సౌలభ్యం. ఇదే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. అసలు ఈ సాధనం ఎలా పనిచేస్తుంది? ప్రయోజనాలు, పన్ను తదితర అంశాల గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి ఇదొక వినూత్న సాధనం. అధిక విలువ కలిగిన ప్రాపర్టీకి ఏ ఒక్కరో యజమానిగా కాకుండా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉమ్మడిగా వాటా కలిగి ఉండడం. దీనివల్ల ప్రయోజనం ఏంటి? అంటే.. తమ వాటా మేరకు రాబడి అందుకోవచ్చు. ఇల్లు కొనుగోలుకు రూ.50 లక్షలు, ఇంకా ఎక్కువే పెట్టుబడి అవసరం. ఇక్కడ మాత్రం రూ.10 లక్షలు ఉన్నా సరే ఆ మేరకు వాటా లభిస్తుంది. ముఖ్యంగా ధరలు భారీగా పెరిగిపోయిన ప్రాంతాల్లో పెట్టుబడికి ఎంతో అనుకూలం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ నిబంధనలు (సవరణ), 2014కు మార్పులు చేయడం ద్వారా సెబీ కొత్తగా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్) విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌ను నియంత్రణల పరిధిలో మరింత మందికి చేరువ చేసేందుకు, పారదర్శకత, సౌలభ్యం కోసం తీసుకొచ్చింది. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (పాక్షిక యాజమాన్యం)ను ఆఫర్ చేసే ప్రతి ప్లాట్‌ఫామ్ కూడా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్)గా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కు బదిలీ చేస్తాయి. ఆఫీస్ వసతులు, గోదాములు, డేటా సెంటర్లు తదితర వాటిపై ఎస్పీవీ పెట్టుబడులు పెడతాయి. ప్రతి పెట్టుబడిదారుడికి వారి వాటా మేరకు డిజిటల్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. రాబడులను వారి వాటాకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. సెబీ నియంత్రణ ఎస్ఎం రీట్ సాధనాలు సెబీ పర్యవేక్షణ కింద పనిచేస్తుంటాయి కనుక రక్షణ ఉంటుంది. ‘‘ఈ ప్లాట్‌ఫామ్‌లు తమ నిర్వహణలోని ఆస్తుల విలువను రెండేళ్లకోసారి స్వతంత్రంగా మదింపు వేయించి, ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. పనితీరు, ఆస్తుల వివరాలు, రిస్‌్కలు, ప్రయోజన వైరుధ్యం తదితర సమాచారాన్ని వెల్లడించాలి’’ అని ట్రైలీగల్కు చెందిన కునాల్‌షా తెలిపారు. వీటిలో రకాలు.. నివాస భవనాలు: ఇందులో పెట్టుబడిపై అద్దె ఆదాయం మోస్తరుగా ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి విలువ సైతం వృద్ధి చెందుతుంది. వాణిజ్య ప్రాపర్టీలు: అధిక అద్దె ఆదాయం లభిస్తుంది. పెట్టుబడి విలువ వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రాపర్టీ కొంత కాలం పాటు ఖాళీగా ఉండడం వంటి కొన్ని రిస్‌్కలు ఇందులో ఉంటాయి. ఎమర్జింగ్ అస్సెట్ క్లాసెస్: గోదాములు, డేటా సెంటర్లు, కో–వర్కింగ్ స్పేస్‌లకు ఇవి వేదికగా ఉంటాయి. వీటిల్లో పెట్టుబడిపై అద్దె రాబడి స్థిరంగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువ. కనుక వసతులు ఖాళీగా ఉండకుండా అద్దె ఆదాయం స్థిరంగా లభిస్తుంది. పెట్టుబడులకు వైవిధ్యం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పరంగా వైవిధ్యం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌తో సాధ్యపడుతుంది. భారీ పెట్టుబడి ఒకే ప్రాపర్టీకి పరిమితం కాకుండా చూసుకోవచ్చు. ఒకటికి మించిన ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆదాయంలో వైవిధ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే ప్రాంతం కాకుండా భిన్న ప్రాంతాల్లోని, భిన్న రకాల ప్రాపర్టీలపై (ఆఫీసులు, గోదాములు, ఇళ్లు) పెట్టుబడి పెట్టుకోవడం ఇందులో ఉన్న సౌలభ్యం. అయితే అన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లు ఎస్ఎం రీట్లుగా నమోదై లేవు. పెట్టుబడి వృద్ధితోపాటు రాబడి స్థిరమైన ఆదాయానికితోడు పెట్టుబడి విలువ కూడా నిరీ్ణత కాలంలో ఎంతో కొంత వృద్ధి చెందుతుంది. ఆస్తులను నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ప్రాపర్టీల నిర్వహణ, కిరాయిదారుల నుంచి అద్దెలు వసూలు, చట్టపరమైన ప్రక్రియలను అనుసరించడం తదితర బాధ్యతలన్నింటినీ వారు చూసుకుంటారు. కనుక పెట్టుబడిదారులకు ఈ తలనొప్పులేవీ ఉండవు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం 500–600 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.5,160 కోట్లు) ఉంటుందని ఖైతాన్ అండ్ కో పార్ట్నర్ హర్ష్ పారిఖ్ తెలిపారు. వచ్చే 8–10 ఏళ్లలో 5 నుంచి 5.5 బిలియన్ డాలర్ల స్థాయికి (రూ.47,300 కోట్లు) చేరుకుంటుందని అంచనా వేశారు.పెట్టుబడికి ముందు చూడాల్సినవి.. → ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లు సెబీ వద్ద నమోదయ్యాయా? లేవా అన్నది తప్పకుండా చూడాలి. అంతేకాదు ప్రాపర్టీ సైతం రెరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. లీజు డాక్యుమెంట్లు, యాజమాన్యం వివరాలను సరి చూసుకోవాలి. → కొన్ని ప్లాట్‌ఫామ్‌లపై పెట్టుబడికి లాకిన్ పీరియడ్ ఉంటోంది. దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. → సొంతంగా ప్రాపర్టీ కొనుగోలుకు భారీ పెట్టుబడి అవసరం. కావాలనుకున్నప్పుడు వేగంగా విక్రయించడ అన్ని వేళలా సాధ్యపడదు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అయినా లేదా ఎస్ఎం రీట్లు అయినా కొంచెం వేగంగా విక్రయించుకోవచ్చు. → కొన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లు (సెబీ వద్ద నమోదు కాని) రూ.5 లక్షల నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నాయి. వీటి రిజిస్ట్రేషన్, వాస్తవికత తెలుసుకున్న తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్ లేదా రీట్ల్లో ఈ తరహా రిస్క్ ఉండదు. కానీ సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో లేవు. అదే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లు చాలా ఉన్నాయి. → కనీస పెట్టుబడి అన్నది ప్లాట్‌ఫామ్ ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ ప్లాట్‌ఫామ్‌లోనూ రూ.10 లక్షలే ఉండాలని లేదు. → ఎంపిక చేసుకునే ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది? అక్కడ లీజుకు ఉన్న డిమాండ్ ఏ పాటిది? భవిష్యత్తులో బలమైన వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమేనా? తదితర అంశాలను పరిశీలించాలి.ఎవరికి అనుకూలం? స్థిరమైన ఆదాయం కోరుకునే విశ్రాంత జీవులు, ఇతరులు ఎవరికైనా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ లేదా ఎస్ఎం రీట్లు అనుకూలమే. సంప్రదాయ ఈక్విటీలు, డెట్ సాధనాలకు అదనంగా వైవిధ్యం కోసం అనుకూలిస్తాయి. ‘‘అద్దె రూపంలో 8–9 శాతం రాబడులు ఎంతో మెరుగైనవి. పైగా ఈ రాబడి ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది. ఏటా 5 శాతం మేర పెరుగుతూ ఉంటుంది’’ అని ‘ప్రాపర్టీ షేర్’ సహ వ్యవస్థాపకుడు కునాల్ మోక్తాన్ వివరించారు. ఏడాది మించిన పెట్టుబడి దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎం రీట్లు పంపిణీ చేసే డివిడెండ్లపై పన్ను లేదు. వడ్డీ ఆదాయం మాత్రం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి. ఎస్ఎం రీట్ – రీట్ → రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) అన్నది ఒక కంపెనీ. ఆదాయాన్నిచ్చే వాణిజ్య ఆస్తులను నిర్వహిస్తుంటుంది. షేర్ల మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయిన రీట్లను ఒక్క యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. సిప్ మాదిరే ప్రతి నెలా కొద్ది మొత్తం పెట్టుబడులకు లిస్టెడ్ రీట్లకు అనుకూలమైన సాధనం. ఇవి పెద్ద స్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. నేరుగా కాకుండా పరోక్షంగా అన్ని ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు మధ్య, చిన్నస్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో ఇన్వెస్టర్ ఎంపిక మేరకు ఒక ప్రాపర్టీ లేదా ఒకటికి మించిన ప్రాపర్టీల్లో పెట్టుబడులకు వీలుంటుంది. ఒక విధంగా ఇది ప్రత్యక్ష పెట్టుబడి. ఒకటికి మించిన ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉండదు. ప్రతీ ప్రాపర్టీకి విడిగా సర్టిఫికెట్ జారీ చేయాల్సిందే. → ఎస్ఎం రీట్లు రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. రెగ్యులర్ రీట్లు రూ.500 కోట్లకు పైగా విలువైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. → ఎస్ఎం రీట్లలో తమకు ఇష్టమైన ప్రాపర్టీని ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ప్రాపర్టీ వారీగా విడివిడిగా ఉంటుంది. రీట్‌లో ఇందుకు అవకాశం లేదు. → ఎస్ఎం రీట్లలో కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. రెగ్యులర్ రీట్లలో కనీసం ఒక యూనిట్‌ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు కనీసం 5–6 ఏళ్లు, అదే రెగ్యులర్ రీట్లు అయితే మరింత దీర్ఘకాలం కోసం ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ఎందుకు? అసలు ప్రాపర్టీపై ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? రాబడి కోసమా, సంపద సృష్టి కోసమా అన్నది తేల్చుకోవాలి. ఎందుకంటే రాబడి, పెట్టుబడి విలువ వృద్ధి కోరుకునే వారికి ఈ తరహా డిజిటల్ రియల్ ఎస్టేట్ సాధనాలే అనుకూలం. ఒకవేళ సొంత వినియోగం కోసం అయితే నేరుగా ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఒక ప్రాపర్టీని సొంతంగా కొనుగోలు చేసుకోవడానికి పెద్ద మొత్తం పెట్టుబడి కావాలి. అంత స్తోమత లేని వారికి ఈ తరహా సాధనాలు అనుకూలం. పైగా పెట్టుబడులు అన్నీ ఒకే విభాగంలో ఉండరాదు. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం చక్కని సమతూకంతో, రిస్క్ పరంగా మెరుగైన ప్రణాళిక అవుతుంది. రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడికి ఫ్రాక్షనల్ ఓనర్షిప్ లేదా రీట్లను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనికంటే ముందు రిస్క్‌లు, సానుకూలతలు, ప్రతికూలతలను సమగ్రంగా తెలుసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్

India vs England: ఇంకా ఉంది!
ఆఖరి టెస్టుకు, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు నాలుగో రోజే తెరపడాలి. కానీ వెలుతురు మందగించడంతో ఆగిన ఆట... తర్వాత జోరు వాన కురవడంతో ఎంతకీ కొనసాగలేదు. నాటకీయ ముగింపునకు తెరలేచిన ఈ పోరు తుది ఫలితం నేటికి వాయిదా పడింది. ఆతిథ్య ఇంగ్లండ్ 3–1 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకునేందుకు మరో 35 పరుగుల దూరంతో దగ్గరైంది. అలాగే భారత్ కూడా 2–2తో సమం చేసేందుకు అంతే దగ్గరగా ఉంది. ప్రధాన బ్యాటర్లంతా అవుట్‌కాగా 35 పరుగులు చేసేలోపు 4 వికెట్లు తీస్తే టీమిండియా సమం చేసుకొని సగర్వంగా తిరిగొస్తుంది. లండన్: నాటకీయత మొదలవగానే... ఉత్కంఠ అంతకంతకు పెరగకముందే... ప్రతికూల వాతావరణం ఆటకు ‘రెడ్ సిగ్నల్’ ఇవ్వడంతో ‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’ సిరీస్ ఫలితం నాలుగో రోజు తేలలేదు. ఇన్నాళ్లు జరిగిన నాలుగు టెస్టుల అసలు మజా కంటే చివరి ఐదో టెస్టు ‘కొసరే’ ఇరు జట్లను ఊరిస్తోంది. ఇంగ్లండ్ 374 పరుగులు ఛేదన కాస్తా 35 పరుగుల దూరంలో నిలిచింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్ (152 బంతుల్లో 105; 12 ఫోర్లు) శతక్కొట్టారు. జేమీ స్మిత్ (2 బ్యాటింగ్), ఓవర్టన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆకాశ్‌దీప్‌కు ఒక వికెట్ దక్కింది. ‘టాప్’ లేపడంతో ఉత్సాహం తొలి సెషన్ భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. లక్ష్యఛేదన జట్టులోని ఇద్దరు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఓవర్‌నైట్ స్కోరు 50/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన డకెట్ (54, 6 ఫోరు), కెప్టెన్ ఒలీ పోప్ (34 బంతుల్లో 27; 5 ఫోర్లు) నిలకడను ప్రదర్శించారు. ఓవర్‌నైట్ బ్యాటర్ డకెట్ 76 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ని్రష్కమించాడు. మళ్లీ ఐదు ఓవర్ల లోపలే సిరాజ్ చక్కని డెలివరీతో కెపె్టన్ పోప్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ 106/3 స్కోరే చేసింది. తర్వాత రూట్, బ్రూక్ పరుగుల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలి సెషన్లోనే బ్రూక్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడి భారత బౌలర్లకు మింగుడుపడిని ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టేశాడు. ఇంగ్లండ్ 164/3 వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. బ్రూక్, రూట్ శతకాలు నాలుగో ఇన్నింగ్స్‌లో తొలి సెషన్లోనే రెండు కీలక వికెట్లు పడిపోవడం బౌలింగ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అయితే క్రీజులో పాతుకుపోయిన రూట్‌తో అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న బ్రూక్ సాఫీగా పరుగులు సాధిస్తుండటంతో భారత శిబిరంలోని ఆత్మవిశ్వాసం కాస్తా సన్నగిల్లింది. ఇదే అదనుగా ఇద్దరు లక్ష్యాన్ని కరిగించే పనినిలో ముందడుగు వేశారు. ఈ సెషన్ భారత్ ఆశల్ని చిదిమింది. వన్డేను తలపించే ఆటతీరుతో బ్రూక్ 91 బంతుల్లోనే శతకం సాధించాడు. అతను ని్రష్కమించాక... ఆఖరి సెషన్లో రూట్ 137 బంతుల్లో సెంచరీ చేశాడు. లక్ష్యానికి చేరువైన దశలో బెథెల్ (5), రూట్ అవుటవడంతోనే డ్రామా మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 54; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 27; రూట్ (సి) జురేల్ (బి) ప్రసి«ద్ 105; బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్‌దీప్ 111; బెథెల్ (బి) ప్రసి«ద్‌కృష్ణ 5; స్మిత్ బ్యాటింగ్ 2; ఓవర్టన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (76.2 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 20–4–85–1, ప్రసి«ద్‌కృష్ణ 22.2–3–109–3, సిరాజ్ 26–5–95–2, సుందర్ 4–0–19–0, జడేజా 4–0–22–0.
రిటైర్మెంట్ ఫండ్ కోసం ఉత్తమ మార్గం
పదవీచ్యుత బంగ్లా ప్రధాని హసీనాపై విచారణ ప్రారంభం
ఎంఎస్ఎంఈల్లో.. మహిళా శక్తి
7న ‘ఇండియా’ కూటమి విందు భేటీ
మెగా టెక్స్టైల్ పార్కుతో వేలకోట్ల పెట్టుబడులు
చుక్క నీటినీ వదులుకోం: భట్టి విక్రమార్క
రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి భేటీ
చిరుత 'పల్లె' కరింపు
చివరి బంతికి ఫోర్ కొట్టి...
జనసేన ఎమ్మెల్యేపై ‘ఆడియో’ దుమారం
చెప్పు తెగుద్ది.. యువకులకు వార్నింగ్ ఇచ్చిన అనసూయ
జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..
కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్
కటకటాల్లోకి ‘కుబేరులు’!
చెప్పు తెగుద్ది.. అంటూ భగ్గుమన్న అనసూయ (వీడియో)
బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది'
మళ్లీ సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్ 70 దేశాలపై పెంపు
వరంగల్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఇంటిలో శుభకార్యాలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవర్తమానాలు
క్రికెట్ చరిత్రలో సంచలనం.. ఒకే ఓవర్లో 45 పరుగులు
నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
ట్యూబెక్టమీ చేస్తే ప్రాణాలు పోయాయి
రెండు బ్యాంకుల విలీనానికి ఆర్బీఐ ఆమోదం
టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు సమం
IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..
Hyderabad: అన్నదానం వద్దంటూ నిమ్స్ గేటు బంద్
చరిత్ర సృష్టించిన జడేజా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
‘ఇండియా డెడ్ ఎకానమీ’.. ఏఐ దిమ్మతిరిగే సమాధానం
రిటైర్మెంట్ ఫండ్ కోసం ఉత్తమ మార్గం
పదవీచ్యుత బంగ్లా ప్రధాని హసీనాపై విచారణ ప్రారంభం
ఎంఎస్ఎంఈల్లో.. మహిళా శక్తి
7న ‘ఇండియా’ కూటమి విందు భేటీ
మెగా టెక్స్టైల్ పార్కుతో వేలకోట్ల పెట్టుబడులు
చుక్క నీటినీ వదులుకోం: భట్టి విక్రమార్క
రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి భేటీ
చిరుత 'పల్లె' కరింపు
చివరి బంతికి ఫోర్ కొట్టి...
జనసేన ఎమ్మెల్యేపై ‘ఆడియో’ దుమారం
జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..
కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్
కటకటాల్లోకి ‘కుబేరులు’!
చెప్పు తెగుద్ది.. అంటూ భగ్గుమన్న అనసూయ (వీడియో)
బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది'
వరంగల్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి
మళ్లీ సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్ 70 దేశాలపై పెంపు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఇంటిలో శుభకార్యాలు
క్రికెట్ చరిత్రలో సంచలనం.. ఒకే ఓవర్లో 45 పరుగులు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవర్తమానాలు
ట్యూబెక్టమీ చేస్తే ప్రాణాలు పోయాయి
నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
రెండు బ్యాంకుల విలీనానికి ఆర్బీఐ ఆమోదం
టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు సమం
IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..
Hyderabad: అన్నదానం వద్దంటూ నిమ్స్ గేటు బంద్
చరిత్ర సృష్టించిన జడేజా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
‘ఇండియా డెడ్ ఎకానమీ’.. ఏఐ దిమ్మతిరిగే సమాధానం
బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!
సినిమా

టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..!
తెలుగు సినిమా ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లేఖను విడుదల చేసింది. దాదాపు 30 శాతం వేతనం పెంచిన వారి షూటింగ్స్‌కు మాత్రమే వెళ్లాలని తెలిపింది. ఇవాళ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.పెంచిన వేతనాలు వెంటనే అమలు చేయాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఏ రోజు వేతనాలు ఆరోజే ఇవ్వాలని కోరింది. 30 శాతం వేతనాలు పెంచి ఇచ్చిన వారికి షూటింగ్‌లకు మాత్రమే పాల్గొనాలని ఫెడరేషన్ నాయకులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న చిత్రాలపై ప్రభావం పడనుంది.

పార్టీ మూడ్‌లో బన్నీ భార్య.. ఫ్రెండ్ ఒడిలో తమన్నా
ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్న అల్లు స్నేహారెడ్డిఫ్రెండ్ షిప్ డే.. వీడియో పోస్ట్ చేసిన తమన్నాబీచ్లో స్పెషల్ యాచ్‌లో సోనాల్ ఎంజాయ్వరలక్ష్మి వ్రతం చేసిన హీరోయిన్ అనన్య నాగళ్లశ్రావణ మాసం.. పద్ధతిగా రెడీ అయిన బిగ్‌బాస్ హారికనిండు చంద్రుడ్ని చూస్తూ ఆస్వాదిస్తున్న మౌనీ రాయ్ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon)

పాక్ క్రికెటర్‌తో మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీతోనూ పెళ్లి: తమన్నా
మిల్కీ బ్యూటీ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా. తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పెద్దగా కనిపించట్లేదు. ఈ ఏడాదిలో ఓదెల-2 మూవీతో అభిమానులను పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తనపై వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.గతంలో పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా పెళ్లి అంటూ వచ్చిన కథనాలపై స్పందించింది. ఇలాంటి వార్తలు చాలా ఫన్నీగా అనిపించాయని గుర్తు చేసుకుంది. ఓ ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవంలో అబ్దుల్ రజాక్‌తో కలిసి ఫోటో దిగడంతో ఇలాంటి రూమర్స్ వచ్చాయని తెలిపింది. తనకు కేవలం అబ్దుల్ రజాక్‌తో మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీతోనూ తనకు ముడిపెట్టారని వివరించింది. నా జీవితంలో విరాట్‌ను కేవలం ఒక్కసారి మాత్రమే కలిశానని తమన్నా వెల్లడించింది. ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా, బాధగా అనిపిస్తుందని పేర్కొంది. ఇలాంటి వాటిని మరిచిపోవడానికి కాస్తా సమయం పడుతుందని తెలిపింది.

ప్రాణంగా పెంచుకున్న కొడుకు చనిపోయాడు: గీతా సింగ్
గీతా సింగ్ (Geeta Singh) అనగానే గుర్తొచ్చే మూవీ కితకితలు. అందులో గీతా యాక్టింగ్, అమాయకత్వం అందరినీ కట్టిపడేశాయి. ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అందరూ తనను కితకితలు హీరోయిన్‌గానే గుర్తుపెట్టుకున్నారు. ఇటీవల గీతా సింగ్ బరువు తగ్గి కాస్త సన్నబడింది. ఆ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అలాగే బిగ్‌బాస్ షోపై తన ఆసక్తిని వెల్లడించింది. బిగ్‌బాస్‌కు వెళ్లాలనుందిగీతా సింగ్ మాట్లాడుతూ.. మా స్వస్థలం నిజామాబాద్. జై సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్లాను. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎవడి గోల వాడిదే సినిమాతో గుర్తింపు వచ్చింది. కితకితలు చిత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాకు రూ.60 లక్షలు పెడితే దాదాపు రూ.9 కోట్లు వచ్చాయి. బిగ్‌బాస్ షోకు వెళ్లాలనుంది. కానీ ఇంత పేరు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్తవారినే సెలక్ట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ 9కి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను. అయితే వెళ్లినప్పుడు ఫస్ట్ నాగార్జునకు ముద్దు పెట్టాకే మాట్లాడతాను. కష్టాల్లో ఎవరూ తోడుగా లేరుబరువు తగ్గడం అంటే అంత ఈజీ కాదు. కడుపు మాడ్చుకుని కష్టపడుతుంటే ఏడుపొచ్చేసేది. అయినా ఇంకా తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను. నా వ్యక్తిగత విషయానికి వస్తే.. డబ్బున్నప్పుడు అందరూ వస్తారు. కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ తోడుగా ఉండరు. నేను నా కొడుకును కోల్పోయినప్పుడు నా దగ్గర ఎవరూ లేరు. కనీసం తిన్నావా? లేదా? ఎలా ఉన్నావు? అని అడిగేవాళ్లే లేరు. నాకు నేనే ధైర్యం చెప్పుకుని బతికాను. నిజానికి వాడు నా కొడుకు కాదు, అన్నయ్య కొడుకు. నేను దత్తత తీసుకుని పెంచుకున్నాను. పిల్లల కోసమే పెళ్లి చేసుకోలే24 ఏళ్లు ప్రాణంగా పెంచుకున్నాను. యాక్సిడెంట్లో చనిపోయాడు. తట్టుకోలేకపోయాను. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడుతున్నాను. అన్నయ్య రెండో కొడుకును కూడా నేనే చూసుకుంటున్నాను. కజిన్ అన్నయ్య కూతురు కూడా నా దగ్గరే ఉంటుంది. పిల్లల కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. కానీ, దేవుడేమో ఇలా చేశాడు. నేను వెయ్యికి పైగా సినిమాలు చేశాను. కానీ, అందులో చాలావరకు రిలీజవ్వలేదు అని గీతా సింగ్ చెప్పుకొచ్చింది.చదవండి: స్టార్స్ రీయూనియన్.. జల్సాకు బదులు సేవ చేయొచ్చుగా
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

India vs England: ఇంకా ఉంది!
ఆఖరి టెస్టుకు, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు నాలుగో రోజే తెరపడాలి. కానీ వెలుతురు మందగించడంతో ఆగిన ఆట... తర్వాత జోరు వాన కురవడంతో ఎంతకీ కొనసాగలేదు. నాటకీయ ముగింపునకు తెరలేచిన ఈ పోరు తుది ఫలితం నేటికి వాయిదా పడింది. ఆతిథ్య ఇంగ్లండ్ 3–1 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకునేందుకు మరో 35 పరుగుల దూరంతో దగ్గరైంది. అలాగే భారత్ కూడా 2–2తో సమం చేసేందుకు అంతే దగ్గరగా ఉంది. ప్రధాన బ్యాటర్లంతా అవుట్‌కాగా 35 పరుగులు చేసేలోపు 4 వికెట్లు తీస్తే టీమిండియా సమం చేసుకొని సగర్వంగా తిరిగొస్తుంది. లండన్: నాటకీయత మొదలవగానే... ఉత్కంఠ అంతకంతకు పెరగకముందే... ప్రతికూల వాతావరణం ఆటకు ‘రెడ్ సిగ్నల్’ ఇవ్వడంతో ‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’ సిరీస్ ఫలితం నాలుగో రోజు తేలలేదు. ఇన్నాళ్లు జరిగిన నాలుగు టెస్టుల అసలు మజా కంటే చివరి ఐదో టెస్టు ‘కొసరే’ ఇరు జట్లను ఊరిస్తోంది. ఇంగ్లండ్ 374 పరుగులు ఛేదన కాస్తా 35 పరుగుల దూరంలో నిలిచింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్ (152 బంతుల్లో 105; 12 ఫోర్లు) శతక్కొట్టారు. జేమీ స్మిత్ (2 బ్యాటింగ్), ఓవర్టన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆకాశ్‌దీప్‌కు ఒక వికెట్ దక్కింది. ‘టాప్’ లేపడంతో ఉత్సాహం తొలి సెషన్ భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. లక్ష్యఛేదన జట్టులోని ఇద్దరు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఓవర్‌నైట్ స్కోరు 50/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన డకెట్ (54, 6 ఫోరు), కెప్టెన్ ఒలీ పోప్ (34 బంతుల్లో 27; 5 ఫోర్లు) నిలకడను ప్రదర్శించారు. ఓవర్‌నైట్ బ్యాటర్ డకెట్ 76 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ని్రష్కమించాడు. మళ్లీ ఐదు ఓవర్ల లోపలే సిరాజ్ చక్కని డెలివరీతో కెపె్టన్ పోప్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ 106/3 స్కోరే చేసింది. తర్వాత రూట్, బ్రూక్ పరుగుల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలి సెషన్లోనే బ్రూక్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడి భారత బౌలర్లకు మింగుడుపడిని ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టేశాడు. ఇంగ్లండ్ 164/3 వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. బ్రూక్, రూట్ శతకాలు నాలుగో ఇన్నింగ్స్‌లో తొలి సెషన్లోనే రెండు కీలక వికెట్లు పడిపోవడం బౌలింగ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అయితే క్రీజులో పాతుకుపోయిన రూట్‌తో అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న బ్రూక్ సాఫీగా పరుగులు సాధిస్తుండటంతో భారత శిబిరంలోని ఆత్మవిశ్వాసం కాస్తా సన్నగిల్లింది. ఇదే అదనుగా ఇద్దరు లక్ష్యాన్ని కరిగించే పనినిలో ముందడుగు వేశారు. ఈ సెషన్ భారత్ ఆశల్ని చిదిమింది. వన్డేను తలపించే ఆటతీరుతో బ్రూక్ 91 బంతుల్లోనే శతకం సాధించాడు. అతను ని్రష్కమించాక... ఆఖరి సెషన్లో రూట్ 137 బంతుల్లో సెంచరీ చేశాడు. లక్ష్యానికి చేరువైన దశలో బెథెల్ (5), రూట్ అవుటవడంతోనే డ్రామా మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 54; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 27; రూట్ (సి) జురేల్ (బి) ప్రసి«ద్ 105; బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్‌దీప్ 111; బెథెల్ (బి) ప్రసి«ద్‌కృష్ణ 5; స్మిత్ బ్యాటింగ్ 2; ఓవర్టన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (76.2 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 20–4–85–1, ప్రసి«ద్‌కృష్ణ 22.2–3–109–3, సిరాజ్ 26–5–95–2, సుందర్ 4–0–19–0, జడేజా 4–0–22–0.

ENG VS IND 5th Test Day 4: నిలిచిపోయిన ఆట
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉన్నప్పుడు వెలుతురులేమి వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఆతర్వాత భారీ వర్షం మొదలైంది. దీంతో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌ల్లో సేద తీరుతున్నారు.ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111), జో రూట్ (105), జేకబ్ బేతెల్ (5() ఔట్ కాగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు, భారత గెలుపుకు 4 వికెట్లు కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.

శతక్కొట్టిన బ్రూక్.. సెంచరీకి చేరువలో రూట్.. గెలుపు దిశగా ఇంగ్లండ్
భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. 374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ నాలుగో రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది.హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది ఇంగ్లండ్ గెలుపుకు గట్టి పునాది వేయగా.. రూట్ (98 నాటౌట్) సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. రూట్‌కు జతగా జేకబ్ బేతెల్ (1) క్రీజ్‌లో ఉన్నాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111) ఔటయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 5 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) తీయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తుంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ల భారత్ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్‌ను కూడా కోల్పోతుంది (1-3లో).అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.

చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో తొలి ఆటగాడు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 6000 పరుగులు (69 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ ఈ ఘనత సాధించాడు.టీమిండియా నిర్దేశించిన 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ డబ్ల్యూటీసీలో 6000 పరుగుల మైలురాయిని తాకాడు.డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్ (4278), మార్నస్ లబూషేన్ (4225), బెన్ స్టోక్స్ (3616), ట్రవిస్ హెడ్ (3300) రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూట్ డబ్ల్యూటీసీలో 20 సెంచరీలు, 22 అర్ద సెంచరీలు చేయడం గమనార్హం.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన లక్ష్యానికి ఇంగ్లండ్ మరో 81 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. హ్యారీ బ్రూక్ (103) అద్భుతమైన సెంచరీతో ఇంగ్లండ్ గెలుపుకు బాటలు వేస్తున్నాడు. రూట్ 83 పరుగుల వద్ద బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ అతనికి సహకరిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోర్ 293/3గా ఉంది.క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (59), బ్రూక్ (82) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.
బిజినెస్

ఇల్లు కూడా హైటెక్‌గా ఉండాలిగా..
కరోనా తర్వాత నుంచి హోమ్ ఆటోమేషన్‌పై నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. ప్రతి ఒక్కరూ ఇల్లు ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు భాగమైపోయింది. రెండు దశాబ్దాలుగా స్మార్ట్ హోమ్స్ సేవలనేవి విలాసవంతమైన వసతుల నుంచి దైనందిన అవసరంగా మారిపోయాయి. భద్రత, ఆదా, సౌకర్యం.. హోమ్ ఆటోమేషన్ లాభాలివే. దీంతో నివసించే నగరమే కాదు ఇళ్లు కూడా హైటెక్‌గా ఉండాలని యువతరం కోరుకుంటోంది. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా స్మార్ట్ హోమ్స్‌ను నిర్మిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఇంటిలోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, ఫ్రిజ్, గీజర్, టీవీ వంటి ప్రతి ఎల్రక్టానిక్ ఉపకరణాన్ని సెల్‌ఫోన్‌తోనే నిర్వహణ చేసే వీలుండటమే స్మార్ట్ హోమ్స్ ప్రత్యేకత. ఇంటి ముందు గేటు నుంచి మొదలుపెడితే తలుపులు, కిటికీ కర్టెన్లు, లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఏసీ, గీజర్, ఫ్రిడ్జ్, గ్యాస్, హోమ్ థియేటర్, గార్డెన్ ఇలా ప్రతి ఒక్క దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతతో వినియోగించడమే హోమ్ ఆటోమేషన్. అలెక్సా, గూగుల్ హోమ్, సిరి ఈ మూడు వర్చువల్ అసిస్టెంట్ టెక్నాలజీతో మనం ఎంపిక చేసిన సమయం ప్రోగ్రామింగ్ ప్రకారం ఆయా వస్తువులు పని చేస్తుంటాయి.ఎలా పనిచేస్తాయంటే.. విప్రో, ఫిలిప్స్, హావెల్స్, ఎంఐ, క్రిస్టాన్, స్నైడర్, ల్యూట్రాన్, లెగ్గ్రాండ్, పెర్ట్ హోమ్, ఫైబరో వంటి కంపెనీలకు చెందిన వైర్లెస్, వైర్డ్ అనే రెండు రకాల హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వైఫై, బ్లూటూత్, జెడ్ వేవ్, జిగ్బీ నాలుగు రకాల వైర్లెస్ ప్రొటోకాల్స్‌తో ఆటోమేషన్ ఉత్పత్తులు అనుసంధానమై ఉంటాయి. ఆయా ఉత్పత్తులకు చెందిన మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని, ఇంట్లోని ఎన్ని ఫోన్లకైనా అనుసంధానిచవచ్చు. కస్టమర్లు ఇష్టాన్ని బట్టి కేవలం తన వాయిస్‌ను మాత్రమే గుర్తించేలా ఉపకరణాలను అనుసంధానివచ్చు. లేదా ఇంట్లోని ప్రతి ఒక్కరి వాయిస్‌నైనా గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు.లాభాలెన్నో.. హోమ్ ఆటోమేషన్తో విద్యుత్ వృథా ఉండదు. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్మార్ట్ హోమ్స్‌లో 20–30 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. సమయం, డబ్బు ఆదా అవడంతో పాటు భద్రత మెరుగవుతుంది. ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. 1,500 చ.అ. అపార్ట్మెంట్లో వీడియో డోర్ బెల్, ఒక లైట్, ఫ్యాన్, ఏసీ, గీజర్‌తో కూడిన బేసిక్ హోమ్ ఆటోమేషన్‌కు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఎలక్ట్రిషన్, ఇంజనీర్, నెట్వర్క్, సాంకేతిక నిపుణులు నలుగురు వ్యక్తులు 3–4 రోజుల్లో పూర్తిగా హోమ్ ఆటోమేషన్ పూర్తి చేస్తారు.

ఈ సీఈవో శాలరీ.. ఐటీ కంపెనీల్లోనే టాప్
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌టెక్ సీఈవో సి.విజయకుమార్ రికార్డు స్థాయి వేతనం అందుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన 10.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.94.6 కోట్లు) సంపాదించారు. ఇది భారతీయ ఐటీ రంగంలో ఎగ్జిక్యూటివ్‌లు పొందుతున్న అత్యధిక వేతనంగా నిలిచింది.విజయకుమార్ వేతనం పెద్ద పోటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఛీప్‌ల సంపాదనను సైతం అధిగమించింది. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రస్తుత వేతనాన్ని 71 శాతం పెంచి 18.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.154 కోట్లు) పెంచుకోవడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది.ఇదే సమయంలో టీసీఎస్ సీఈఓ కృతివాసన్ వేతనం రూ.26.52 కోట్లు కాగా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం రూ.80.62 కోట్లుగా ఉంది. అలాగే విప్రో సీఈఓ శ్రీనివాస్ పలియా ఆర్జన సుమారు రూ.53.64 కోట్లు, టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి సంపాదన రూ.53.9 కోట్లుగా ఉన్నాయి.2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ అందుకున్న మొత్తం పరిహారంలో మూల వేతనం 1.96 మిలియన్ డాలర్లు కాగా పనితీరు ఆధారిత బోనస్ 1.73 మిలియన్ డాలర్లుగా ఉందని హెచ్‌సీఎల్‌టెక్ వార్షిక నివేదిక తెలిపింది.ఆయన సంపాదనలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు 6.96 మిలియన్ డాలర్ల విలువైన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్యూలు) నుంచే వచ్చింది. ఇవికాక బెనిఫిట్స్, పెర్క్విసైట్స్ కింద అదనంగా మరో 0.20 మిలియన్ డాలర్లు లభించాయి.2016లో హెచ్‌సీఎల్‌టెక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ అమెరికాలో ఉంటూ తన రెమ్యూనరేషన్‌ను కంపెనీకి చెందిన అమెరికా అనుబంధ సంస్థ హెచ్‌సీఎల్ అమెరికా ఇంక్ నుంచి తీసుకుంటున్నారు.👉ఇది చదివారా? కాగ్నిజెంట్‌లో జీతాల పెంపు.. సీఎఫ్‌వో కీలక ప్రకటన

ఏడబ్ల్యూఎస్ కొత్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్
బెంగళూరు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కొత్తగా ఏఐ డ్రివెన్ డెవలప్మెంట్ లైఫ్‌సైకిల్ (ఏఐ–డీఎల్సీ) మోడల్‌ను ఆవిష్కరించింది. కైరో, అమెజాన్ క్యూ డెవలపర్లాంటి టూల్స్‌ను ఉపయోగించి, కృత్రిమ మేథ (ఏఐ)తో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.దీనితో మానవ పర్యవేక్షణలో కోడింగ్, టెస్టింగ్‌లాంటి పనులను ఆటోమేట్ చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే వ్యవధిని నెలల నుంచి రోజుల స్థాయిలోకి కుదించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే మెరుగైన ఏఐ విధానాలను షేర్ చేసుకునేందుకు ఏఐ–నేటివ్ బిల్డర్స్ కమ్యూనిటీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది.అటు ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా అంతర్జాతీయంగా 27 లక్షల మంది విద్యార్థులకు, ఉచితంగా ఏఐ ట్రైనింగ్ యాక్సెస్ అందిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ తెలిపింది. జనరేటివ్ ఏఐని ఉపయోగించి వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించే డెవలపర్లకు 2 మిలియన్ డాలర్ల విలువ చేసే క్రెడిట్స్‌ను ఇచ్చేలా ఏడబ్ల్యూఎస్ ఏఐ లీగ్‌ను కూడా ప్రకటించింది.

ఒక్కసారి చెల్లిస్తే.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
టోల్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్రం వార్షిక పాస్‌ను ప్రకటించింది. దీని ద్వారా సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించవచ్చు. ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రకటించారు. ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.2025-26 సంవత్సరానికి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధర రూ. 3,000. వినియోగదారుడు రాజ్‌మార్గయాత్ర మొబైల్ అప్లికేషన్ లేదా ఎన్హెచ్ఏఐ (NHAI) వెబ్సైట్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. చెల్లింపులు పూర్తయిన తరువాత యాన్యువల్ పాస్ 2 గంటల్లో యాక్టివేట్ అవుతుంది.ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్.. ప్రైవేట్ కార్లు, జీప్, వ్యాన్లు నేషనల్ హైవే (NH) & నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే (NE) టోల్ ప్లాజాల ద్వారా ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులకు (ఏది ముందు అయితే అది) ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది.ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ కోసం వినియోగదారులు ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. మీ ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్‌లో వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేయవచ్చు.ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ద్వారా ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఫ్యామిలీ

మీ జీన్స్‌లోనే లేదా!
అన్నీ వేదాలలోనే ఉన్నాయన్నట్లు, మొత్తం మన ఆరోగ్య చరిత్రంతా మన జీన్స్‌లోనే ఉంటుంది. అయితే జీన్స్‌లో లేకుండా, బయటెక్కడి నుంచో వచ్చి శరీరంలోకి చొర బడి, ఆరోగ్యాన్ని ‘డిస్టర్బ్’ చేసే శక్తుల మాటేమిటి? అది తెలుసుకోవటానికే గత ఇరవై ఏళ్లుగా వైద్య పరిశోధకులు చెట్టూ, పుట్టా గాలిస్తున్నారు. కొండా కోనా ఎక్కి దిగుతున్నారు. పంచభూతాలపై పరిశీలనలు జరుపుతున్నారు. ఏమైనా తేలిందా మరి? త్వరలోనే తేలబోతోందని డాక్టర్ కల్పన బాలకృష్ణన్ అంటున్నారు. చెన్నైలోని ‘శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ డీన్ కల్పన.. ఈ పరిశోధనల్లో భారతదేశం చురుగ్గా ఉందని కూడా చెబుతున్నారు!లోపల జన్యువులు.. బయట అన్యశక్తులు‘‘మా డీఎన్ఏలోనే లేదు..’’ అని ధీమాగా అంటుండే వాళ్లలో సైతం గుండె జబ్బులు కనిపిస్తుంటాయి! కారణమేంటి? ‘‘మా బ్లడ్‌లోనే లేదు...’’ అని కులాసాగా కబుర్లు చెబుతుండే వాళ్లలో హఠాత్తుగా షుగర్ బయట పడుతుంటుంది! కారణమేంటి? ఈ వైరుధ్యాలను తెలుసుకోవటానికే ‘ఎక్స్పోజోమిక్స్’ రంగంలో నేడు అవిశ్రాంత కృషి జరుగుతోంది. జన్యుశాస్త్రాన్ని ‘జెనోమిక్స్’ అన్నట్లే, బయటి నుండి ప్రభావం చూపే అంశాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఎక్స్పోజోమిక్స్’ అంటున్నారు! మానవ ఆరోగ్యం అన్నది కేవలం వారి లోపలి జన్యువులపైనే ఆధారపడి ఉండదని; బయట పీల్చే గాలి, తాగే నీరు, ఉండే పరిసరాలు, ఉష్ణోగ్రతలు... ఇవన్నీ చూపే ప్రభావాన్ని బట్టి కూడా ఉంటుందని ఎక్స్పోజోమిక్స్ నిపుణులు ఏనాడో నిర్ధారించుకున్నారు. దాంతో ఈ రంగంలో పరిశోధనలు ముమ్మరం అయి, నేటికీ కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వీటిపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించింది.భారత్... సహజ ప్రయోగశాలజన్యు నిపుణులను ‘జెనిటిసిస్ట్’లు అన్నట్లు, ఎక్స్పోజోమిక్స్ నిపుణులకు ప్రత్యేకమైన పేరు లేదు. ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు, బయాలజిస్టులు, కెమిస్టులు, ఎపిడెమియాలజిస్టులు, టాక్సికాలజిస్టులు, డేటా సైంటిస్టులు, స్టాటిస్టీషియన్లు, కంప్యూటేషన్ బయాలజిస్టులు అంతా కలిసి ఒక చెయ్యేస్తేనే ‘ఎక్స్పోజోమిక్స్’ అధ్యయనం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో భారత్ వడివడిగా అడుగులు వేస్తోందని, ఎక్స్పోజోమిక్స్పై త్వరలోనే ఒక స్పష్టతను సాధించనుందని చెబుతున్నారు ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) కొలాబరేటింగ్ సెంటర్ ఫర్ ఆక్యుపేషనల్ ఎన్విరాన్మెంటల్ హెల్త్’ డైరెక్టర్ కూడా అయిన కల్పన బాలకృష్ణన్. ఇటీవలే ఆమె ఎక్స్పోజోమిక్స్పై వాషింగ్టన్ డీసీలోని జా¯Œ ్స హాప్కి¯Œ ్స విశ్వవిద్యాలయం నిర్వహించిన ఫోరమ్‌లో పాల్గొని వచ్చారు. ఎక్స్పోజోమిక్స్ సైన్స్ పరిశోధనలకు భారత్ ‘సహజ ప్రయోగశాల‘గా మారబోతోందని ఆమె అన్నారు. జినోమ్ సాఫ్ట్... ఎక్స్పోజోమ్ ఫాస్ట్‘ఎక్స్పోజోమిక్స్’ అనే మాట ‘ఎక్స్పోజోమ్’ అనే పదం నుండి పుట్టింది. 2005లో డాక్టర్ క్రిస్టోఫర్ వైల్డ్ ఈ పదాన్ని సృష్టించారు. గర్భస్థ శిశువు మొదలు, జీవిత చరమాంకం వరకు మనుషులపై ఉండే పర్యావరణ ప్రభావాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఎక్స్పోజోమిక్స్. వారసత్వంగా, స్థిరంగా ఉండే జీనోమ్లా కాకుండా ఎక్స్పోజోమ్ క్రియాశీలకంగా ఉండి, నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుంది. మనిషి ఆరోగ్య అంశాలతో ఇది లోతుగా ముడిపడి ఉంటుంది. జన్యువులు, జన్యు గ్రహణశీలత మాత్రమే మనుషుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకు అభివృద్ధి చెందుతాయో చెప్పలేవు. కొందరిలో గుండె జబ్బులు లేదా మధుమేహానికి సంబంధించిన జన్యుపరమైన చిహ్నాలు లేకుండానే, వారు వాటి బారిన పడవచ్చు. దీని వెనుక ఉన్న కారణాలను ‘ఎక్స్పోజోమ్’ అధ్యయనం వివరిస్తుంది. మ్యాపింగ్ అత్యంత కీలకంమానవ జీనోమ్ ప్రాజెక్ట్ ఒక దశాబ్దం వ్యవధిలోనే జన్యు శాస్త్రాన్ని అభివృద్ధి పరచినప్పటికీ, హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులు, అంతఃస్రావ గ్రంథులకు చెందిన ఎండోక్రైన్ రుగ్మతలు, మానసిక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోటానికి ఒక్క జన్యుశాస్త్రం మాత్రమే సరిపోదు. రసాయన, భౌతిక, జీవ సంబంధ, సామాజిక మనోరుగ్మతలు; జీవనశైలి లేదా జీవన పరిస్థితులతో ఆ రుగ్మతల పరస్పర చర్యల ప్రభావాలను తెలుసుకోటానికి వినూత్నమైన ఉపకరణాలతో పాటుగా ఎక్స్పోజోమ్స్ మ్యాపింగ్ అత్యంత కీలకం. (ఉనికిని గుర్తించి దృశ్యమానం చేసే పటాలను సృష్టించే ప్రక్రియే మ్యాపింగ్). గాలి, నీరు, నేల, ఆహారాలలో వేలాది రసాయన సమ్మేళనాలను ఏకకాలంలో పరీక్షించగల హై రిజల్యూషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ (హెచ్.ఆర్.ఎం.ఎస్.)తో ఇది సాధ్యం అవుతుంది. అయితే, ‘‘మనం ఆశించే ఎ, బి, సి ల కోసం మాత్రమే చూడకుండా, ఉంటాయో ఉండవో తెలియని డి, ఇ, ఎఫ్ లను, ఆ తర్వాతి వాటిని కూడా కనుగొనడానికి ‘లక్ష్య రహిత’ విశ్లేషణ చేయాలి. లేకపోతే, మనకు తెలియని వాటి గురించి మనం ఎప్పటికీ తెలుసుకోలేం’’ అంటారు కల్పన. విశ్లేషణలన్నీ కలిస్తేనే సంపూర్ణం, సఫలంజీవసంబంధమైన ప్రతిస్పందనల విశ్లేషణకు నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్.జి.ఎస్.); జీవక్రియలు, ప్రొటీన్లు, జన్యుశాస్త్ర అధ్యయనాలు సహా, వాటన్నిటికీ ఉపకరించే సాఫ్ట్వేర్ సమాహారం ఎక్స్పోజోమిక్స్లో ముఖ్యమైనవి. ఇవి మన దేహంలోని అంతర్గత వ్యవస్థలు బాహ్య ప్రభావాలకు (ఎక్స్పోజర్లకు) ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. రక్తం, మూత్రం, ఇతర కణజాలాల నుండి తీసుకున్న నమూనాలు వీటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తాయి. అయితే, ఎక్స్పోజోమిక్స్ పరిశోధన ప్రయోగశాలకు మాత్రమే పరిమితమైనది కాదు. అదిప్పుడు వాయు కాలుష్యం, పట్టణ ఉష్ణ దీవులు, వృక్ష విస్తీర్ణం, భూ వినియోగ మార్పుల వంటి భౌతిక ప్రభావాల అధ్యయనం కోసం ఉపగ్రహం ద్వారా సేకరించిన డేటా వంటి వాటిని కూడా కలుపుకుని పోవాలి. అప్పుడే పరిశోధకుల ప్రయత్నాలు సంపూర్ణం, సఫలం అవుతాయి.లోతైన అభ్యాసం.. ఏఐ సహకారం పర్యావరణ సవాళ్లు ఉన్న భారతదేశం వంటి దేశాలలో ఎక్స్పోజోమిక్స్ అధ్యయనం ఎంతో కష్టమైనది. సామాజిక ఆర్థిక స్థితిగతులు కూడా ఆ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా ఎక్స్పోజోమిక్స్ డేటాలోని సంక్లిష్టతను అర్థం చేసుకోటానికి దానిని మ్యాపింగ్ చేసే ప్రాథమిక గణాంక పద్ధతులకు మించి లోతైన అభ్యాసం, ఏఐ ఆధారిత జీవనశైలి నమూనాల గుర్తింపు అవసరం. ఈ గణన సాధనాలు చాలా కీలకమైనవి. పర్యావరణ నమూనాలు, జీవసంబంధమైన ప్రతిస్పందనలు, జనాభాకు సంబంధించిన భారీ, అంచెలవారీ డేటా కేటగిరీలను అవగాహన చేసుకోవడానికి ఆ నమూనాలు అవసరం. ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాల ఎక్స్పోజోమ్ సంస్థలు తీసుకున్న నమూనాలు అక్కడి కాలుష్యం, భౌగోళిక వైవిధ్యాల మధ్య... మధుమేహం, హృద్రోగాల వంటి వ్యాధుల ప్రమాదాలను విజయవంతంగా అంచనా వేస్తున్నాయి. సవాళ్లలోనే అధ్యయన అవకాశాలుభారతదేశంలో ఎక్స్పోజోమిక్స్ అధ్యయనాలకు అవకాశాలు ఇక్కడి ప్రజారోగ్య సవాళ్లలోనే ఉన్నాయి. పారిశుధ్యలోపం, పరిశుభ్రమైన నీరు లేకపోవడం ఆ సవాళ్లలో ప్రధానమైనవి. అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్, వాయు కాలుష్యం, సామాజిక మనోరుగ్మతల ఒత్తిడి వంటివి కూడా వీటిలో ఉన్నాయి. పైగా భారతదేశం ఒంటరి శాస్త్రీయ విధానాలపై ఆధారపడుతోంది. ‘‘నిజానికి ఎక్స్పోజోమిక్స్లో ప్రపంచంతో కలిసి పనిచేయటానికి భారతదేశం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది..’’ అని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఆరోగ్యం, ప్రాదేశిక శాస్త్రాల అసోసియేట్ ప్రొఫెసర్ రిమా హాబ్రే అన్నట్లు కల్పన తెలిపారు. ఇటీవల అహ్మదాబాద్ జరిగిన ఐ.సి.ఎం.ఆర్–ఎన్.ఐ.ఓ.హెచ్ సమావేశంలో వీరిద్దరూ భారత్‌లో జరుగుతున్న ఎక్స్పోజోమిక్స్ అధ్యయనాలపై చర్చించారు. గ్రహణం ఆన్ డిమాండ్! సూర్యగ్రహణం కావాలా? ఆర్డర్ పెడితే వస్తుంది! నిజం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ‘ప్రోబా 3’ అనే డబుల్ స్పేస్‌క్రాఫ్ట్ మిష¯Œ ద్వారా ఒక కృత్రిమ సూర్యగ్రహణం సృష్టించింది. తాజాగా ఆ మొదటి కృత్రిమ గ్రహణం ఫోటోలు కూడా విడుదల చేసింది. ఇది ఆకాశంలో ఒక అద్భుత ప్రదర్శన. రెండు ఉపగ్రహాల్లో ఒకటి ‘ఆక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్’ సూర్యుడిని కప్పేసుంటే, మరొకటి ‘కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్’ సూర్యుడిని పరిశీలిస్తుంది. వీటి మధ్యలో కచ్చితంగా 150 మీటర్ల దూరం. అంతే కాదు, ఇక ‘గ్రహణం కేవలం కొన్ని నిమిషాలే’ అన్నది పాత కథ! సెకన్లపాటు వచ్చే సహజ గ్రహణాల మధ్య ఇది ఏకంగా 6 గంటల పాటు కొనసాగింది. అంతేకాదు, ప్రతి 19.6 గంటలకోసారి ఒక కొత్త సూర్యగ్రహణాన్ని సృష్టించవచ్చు. పూర్తిగా మనుషుల చేతుల్లోనే అంతా ఉంటుంది. ఇక గ్రహణం కోసం ఆకాశం కేసి వేచి చూడాల్సిన రోజులు పోయాయి. మనకిష్టమైనప్పుడు గ్రహణాలను షెడ్యూల్ చేసుకోవచ్చు! శాస్త్రవేత్తలు దీనిని ‘ప్రపంచంలోనే ఇది, తొలి ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లైయింగ్ మిషన్’గా ప్రకటించారు. అయితే, ఇది మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో సూర్యుని మరిన్ని రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు.·

పోల్చుకోవద్దు.. కుంగిపోవద్దు!
‘‘ఇతరులతో పోల్చుకోవడం ప్రేరణను ఇవ్వకపోగా మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుంది’’ అని ఒక స్కూల్ వర్క్‌షాప్‌లో చెప్పినప్పుడు ఒక పేరెంట్ లేచారు. ‘‘వాళ్లలా నేనెందుకు సక్సెస్ కాలేకపోతున్నాను నాన్నా? అని మా బాబు చాలాసార్లు అడుగుతాడు సర్! ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నాలో నేనే బాధపడతాను’’ అని తన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రోజుకు ముగ్గురు, నలుగురు విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం మా సెంటర్‌కు వస్తుంటారు. వాళ్లకు 90 శాతం మార్కులు వస్తున్నా, ఫెయిల్యూర్‌లా ఫీలవుతుంటారు. కారణం ఇతరులతో పోల్చుకోవడం. ఈ సమస్యతో పిల్లలు, విద్యార్థులే కాదు, లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయి. కాస్తంత గమనిస్తే, ఇది అందరికీ తెలిసే విషయమే!అసలేంటీ కంపేరిజన్ సిండ్రోమ్? మనిషి తనను తాను అర్థం చేసుకునేందుకు ఇతరులతో పోల్చుకుంటాడు. అది సహజం. కానీ టెక్నాలజీ, సోషల్ మీడియా, టాప్ ర్యాంక్స్, పక్కింటి పిల్లలతో పోలికలు– ఇవన్నీ ఇప్పుడు పిల్లల మనసుల్లో భయాన్ని, ఆందోళనను, న్యూనత భావాన్ని నింపుతున్నాయి. ఇలా ఇతరులతో పోల్చుకుని తనను తాను తక్కువ చేసుకోవడమే కంపేరిజన్ సిండ్రోమ్.సోషల్ కంపేరిజన్ సిద్ధాంతాన్ని 1954లో లియోన్ ఫెస్టింజెర్ అనే సైకాలజిస్ట్ ప్రతిపాదించాడు. మన అసలైన విలువను పక్కన పెట్టి, ఇతరుల ప్రమాణాలతో మన జీవితం నడపడమే దీని లక్షణం. ఈ పోలికలు వాళ్లకంటే తక్కువగా ఉన్నవారితో లేదా మెరుగ్గా ఉన్నవారితో జరగొచ్చు. పోలికలు నెగటివ్ దిశలో ఎక్కువగా జరిగితే ఆత్మన్యూనత, అసంతృప్తి, ఆత్మనింద పెరుగుతాయి.పది పరిష్కార మార్గాలుకంపేరిజన్ అనేది ఒక ట్రాప్. ఏ రెండు వేలిముద్రలూ ఒకలా ఉండనట్లే, ఏ ఇద్దరు విద్యార్థులూ ఒకేలా ఉండరు, ఒకేలా చదవరు, చదవలేరు. కాబట్టి ఈ కంపేరిజన్ ట్రాప్ నుంచి బయటపడితేనే మీ అసలైన ప్రతిభ కనిపిస్తుంది. అందుకోసం ఈ పది మార్గాలు పాటించండి. 1. ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. ‘‘నిన్న కంటే నేడు ఏం మెరుగయ్యాను?’ అని ప్రశ్నించుకుని మీ ప్రోగ్రెస్‌ను గమనించండి. 2, సోషల్ మీడియా ఒక ఫిల్టర్ చేసిన ప్రపంచం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరి విజయమూ ఫుల్ స్టోరీ కాదు. మీ ప్రయాణం నిజమైనదిగా, నిజాయితీగా ఉంటే చాలు.3. ప్రయత్నం మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు కష్టపడ్డారు, ఎలా ఫోకస్ చేశారన్నదే అసలైన విజయానికి సూచిక.4. మీ బలాల జాబితా తయారు చేసుకోండి. ‘నాలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?’ అని రాసుకోండి.5. మైండ్‌ఫుల్ బ్రేకులు తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోండి. పోలిక వల్ల వచ్చే నెగటివ్ భావాల నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ పది నిమిషాల సేపు మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి.6. పరీక్షలు ఓ పోటీ కాదు, నేర్చుకునే ప్రయాణం అని గుర్తుంచుకోండి. ఫలితాల కోసమే కాకుండా, అభివృద్ధి కోసం చదవండి.7. ఇతరులు చేసిన విమర్శలు మీ విలువకు ప్రమాణం కాదు. ఏదైనా కామెంట్, మెసేజ్ వల్ల తక్కువగా ఫీలవకండి. అది వాళ్ల అభిప్రాయం మాత్రమే అని గుర్తించండి. 8. మీ సొంత లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉండండి. ఇతరులు ఎటు పోతున్నారన్న దానికన్నా, మీరు ఎందుకు చదువుతున్నారన్న దానిపై దృష్టి పెట్టండి.9. తప్పుల నుంచి నేర్చుకోండి. తప్పు చేయడమంటే ఫెయిలవ్వడం కాదు, నేర్చుకునే అవకాశ అనే దృష్టితో చూడండి. 10. మీరు వేరెవరిలానో మారాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి. మీ బాటలో మీరున్నారని నమ్మండి. మీ బిడ్డ కంపేరిజన్ ట్రాప్‌లో ఉన్నట్లు ఎలా తెలుసుకోవాలి?‘నాకు రాదు’ అనే మాట తరచూ వినిపిస్తేసోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే · ‘వాళ్లు మంచి మార్కులు తెచ్చుకున్నారు’ అని తరచూ చెప్తుంటే మిగిలినవాళ్ల విజయాలను చూసి తనదే తప్పులా భావిస్తేవిద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులుఇతరుల విజయాలను చూస్తూ తానేం సాధించలేనన్న భావనలో బందీలవుతారు. తమ ప్రయత్నాల వల్ల ఉపయోగం లేదనుకోవడంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఎప్పుడూ తప్పులపైనే దృష్టి పెడుతుండటం వల్ల తమను తామే నిందించుకుంటారు. దీనివల్ల జ్ఞాపకశక్తి, సృజనశీలత దెబ్బతింటాయి. ఇతరుల విజయాలు, తమ లోపాలపైనే దృష్టి పెట్టడం వల్ల ఎవరితో మాట్లాడకుండా, కలవకుండా ఒంటరవుతారు. పదే పదే పోల్చుకోవడం వల్ల ఒత్తిడి, నిరాశ, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్‌కు దారితీయవచ్చు. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..)

రహస్య నగరాలు
ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. వీటిలో చారిత్రక ప్రాశస్త్యం గల నగరాలు కొన్ని; ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలు ఇంకొన్ని; పర్యాటక ఆకర్షణలు గల నగరాలు మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి నగరాల గురించి చాలామందికి తెలుసు. వీటికి భిన్నంగా ప్రపంచంలో అక్కడక్కడా రహస్య నగరాలు కూడా ఉన్నాయి. వీటి గురించి బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు. ప్రపంచ పటాల్లో కూడా ఈ నగరాలు కనిపించవు. అలాంటి కొన్ని రహస్య నగరాల గురించి, ఆ నగరాల్లో జరిగే కార్యకలాపాల గురించి తెలుసుకుందాం.సిటీ 40ఇది రష్యాలో ఉంది. సోవియట్ ప్రభుత్వం 1946లో అణ్వాయుధాల తయారీ కోసం ఏర్పాటు చేసిన రహస్య నగరాల్లో ఇదొకటి. ఈ నగరంలో దాదాపు లక్షమందికి పైగా జనాభా ఉండేవారు. ఇక్కడకు ఇతరుల రాకపోకలపై కట్టుదిట్టమైన ఆంక్షలు ఉండేవి. రష్యాలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లోని పౌరుల కంటే ఈ రహస్య నగరంలోని పౌరులకు నిత్యావసరాల సరఫరా మొదలుకొని రకరకాల సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉండేవి. చుట్టూ ఎత్తయిన ఇనుప కంచెల మధ్యనున్న ఈ నగరంలో ఇప్పటికీ ‘అణు’ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇదివరకు ఇక్కడ కొన్ని అణు ప్రమాదాలు జరిగినా, వాటి వివరాలు బయటి ప్రపంచానికి తెలియకుండా నాటి సోవియట్ ప్రభుత్వం కప్పిపుచ్చింది. చెర్నోబిల్ దుస్సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాతే ‘సిటీ 40’లో కూడా అణు ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసింది. వాతావరణంలో అణు ధర్మాకత నిండి ఉన్న ఈ నగరంలో ఇప్పటికీ జనాలు నివసిస్తున్నారు. కార్మికులు పనులు సాగిస్తూనే ఉన్నారు. ఈ నగరం మ్యాపుల్లో కనిపించదు. అంతేకాదు, ఇక్కడి పౌరుల వివరాలు కూడా ప్రభుత్వ రికార్డుల్లో కనిపించవు.ఇది రష్యాలో ఉంది. ఇప్పటి తరానికి చెందిన రష్యన్లలో చాలామందికి ఈ నగరం ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. ఎందుకంటే, ఈ నగరాన్ని రష్యా మ్యాపుల నుంచి 1947లోనే తొలగించారు. ఇదివరకు దీనిని ‘అర్జామాస్–16’ అనే పేరుతో పిలిచేవారు. సోవియట్ హయాంలో ఇక్కడ అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాక, దీనిని మ్యాపుల నుంచి తొలగించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన అణ్వాయుధ తయారీ కేంద్రం ఇప్పటికీ పనిచేస్తోంది. ఈ నగరాన్ని మ్యాపుల నుంచి తొలగించిన విషయాన్ని రష్యా ప్రభుత్వం 1994లో తొలిసారిగా అంగీకరించింది. ఈ నగరంలో పద్దెనిమిదో శతాబ్ది నాటి చర్చి ఉంది. సెయింట్ సెరాఫియన్ ఈ చర్చిలో ప్రార్థనలు జరిపేవారు. ప్రేమ, కరుణ, మానవత్వం వంటి అంశాలపై తన బోధలు వినిపించేవారు. ఆయన బోధలకు భిన్నంగా ఇక్కడ భీకర హింసకు దారితీసే అణ్వాయుధాల తయారీ కొనసాగుతుండటమే విచిత్రం.బర్లింగ్టన్ బంకర్ఇది ఇంగ్లండ్‌లో ఉంది. నిజానికి ఇది నగరం కాదు. కేవలం ఒక సువిశాల భూగర్భ స్థావరం మాత్రమే! అయితే, ఇందులో అభివృద్ధి చెందిన నగరాల్లో ఉండే సమస్త సౌకర్యాలూ ఉన్నాయి. కర్మకాలి ఎప్పుడైనా అణు యుద్ధం తటస్థిస్తే, ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి భద్రత కల్పించడానికి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఈ భూగర్భ నగరాన్ని 1950లలో నిర్మించింది. బ్రిటిష్ రాచకుటుంబ సభ్యులు సహా ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఉండే నాలుగువేల మంది ఇందులో సురక్షితంగా ఆశ్రయం పొందడానికి అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. ఈ స్థావరాన్ని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మించి, దశాబ్దాలు గడిచినా దీనిని వినియోగించుకునే అవసరం ఏర్పడలేదు. అవసరం లేని ఈ నిర్మాణానికి ఏటేటా నిర్వహణ వ్యయం పెరుగుతూ రావడంతో ప్రభుత్వం 2016లో దీనిని కారుచౌకగా కేవలం 1.5 మిలియన్ పౌండ్లకు (రూ.17.42 కోట్లు) అమ్మకానికి పెట్టింది. అయినా ఇప్పటి వరకు దీనిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం దీనిని అమ్మకానికి పెట్టేంత వరకు జనాలకు దీని గురించి తెలియదు.ఓక్రిడ్జ్ఇది అమెరికాలో ఉంది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో అమెరికా, దాని మిత్ర దేశాలు యుద్ధాన్ని వీలైనంత త్వరగా పరిసమాప్తం చేయడానికి అణుబాంబు ప్రయోగించడం ఒక్కటే మార్గమని తలచాయి. అణుబాంబు తయారీ కోసం రహస్య స్థావరం, ఆ స్థావరానికి తగిన ఏర్పాట్లు కావలసి వచ్చాయి. అందువల్ల అమెరికా ప్రభుత్వం టెనసీ రాష్ట్రంలోని నాక్స్విల్కు పడమరన నలభై కిలోమీటర్ల దూరంలో అరవైవేల ఎకరాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి, 1943లో ఈ రహస్య నగరాన్ని నిర్మించింది. ఇక్కడ పెద్దసంఖ్యలో సైనికులు, శాస్త్రవేత్తలు, కార్మికులు పనిచేసేవారు. ఈ రహస్య పట్టణాన్ని అమెరికా తన మ్యాపుల్లో చూపలేదు. ఇక్కడ పనిచేసే కార్మికులకు తాము చేసే పని తప్ప, ఇక్కడ జరిగే కార్యకలాపాలేవీ తెలిసేవి కావు. కొంతకాలం పనిచేశాక ఓక్రిడ్జ్లోని శాస్త్రవేత్తలు అణుబాంబు తయారీకి కీలకమైన శుద్ధి చేసిన యురేనియంను తయారు చేయగలిగారు. ఇక్కడ రెండు యురేనియం శుద్ధి కర్మాగారాలు, ఒక ప్లూటోనియం శుద్ధి కర్మాగారం పనిచేసేవి. దీని గురించి సాధారణ పౌరులకు వివరాలేవీ తెలియవు.క్యాంప్ సెంచరీఇది గ్రీన్లాండ్లో ఉంది. బయటి నుంచి చూస్తే, ఇది మంచుకొండల్లో ఏర్పడిన గుహలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది సువిశాల భూగర్భ నగరానికి ప్రవేశమార్గం. గ్రీన్‌లండ్ భూభాగంలో అమెరికా ఏర్పరచుకున్న రహస్య సైనిక స్థావరం ఇది. సోవియట్ కాలంలో రష్యా–అమెరికాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో రష్యాను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో అమెరికా దీనిని నిర్మించింది. భూగర్భంలో నాలుగువేల కిలోమీటర్ల పొడవున సొరంగ రహదారులతో సైనిక అవసరాలకు కావలసిన శాస్త్ర సాంకేతిక పరిశోధనల కోసం అమెరికా భారీ వ్యయంతో ఈ భూగర్భ నగరాన్ని నిర్మించుకుంది. ‘ప్రాజెక్ట్ ఐస్ వర్మ’ పేరుతో ఇక్కడ సైనిక పరిశోధనలు సాగించింది. ఈ నగరంలో శాస్త్రవేత్తలు, సైనికాధికారులు, ఇతర సిబ్బంది, వారి కుటుంబాలు నివసించడానికి కావలసిన సకల సౌకర్యాలూ ఉన్నాయి. వారి కోసం ఒక సినిమా థియేటర్, ఒక ప్రార్థన మందిరం కూడా ఉండటం విశేషం.వన్స్డార్ఫ్ఇది జర్మనీలో ఉంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ రహస్య నగరాన్ని జర్మన్ రాజ్యం 1871లో నిర్మించింది. అప్పట్లో ఇక్కడ ముస్లిం ఖైదీలను బంధించేవారు. వారి కోసం ఇక్కడ మసీదు కూడా నిర్మించారు. ఇదే జర్మనీలోని తొలి మసీదు. నాజీల ప్రాబల్యం పెరిగాక, 1935 నుంచి రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో ఇది నాజీల ప్రధాన రహస్య స్థావరంగా ఉండేది. తర్వాత సోవియట్ రెడ్ ఆర్మీ వశమైంది. అప్పట్లో సోవియట్ సైనికులు వారి కుటుంబాలతో ఇక్కడ నివసించేవారు. దాదాపు 75 వేల జనాభా ఉండే ఈ నగరం ‘లిటిల్ మాస్కో’గా, ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరుమోసింది. అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో రష్యన్ బలగాలు ఇక్కడి నుంచి రహస్య కార్యకలాపాలు సాగించేవి. ఇప్పుడు ఈ నగరం శిథిలావస్థకు చేరుకుంది. నగరం నడిబొడ్డున సోవియట్ బలగాలు నెలకొల్పిన లెనిన్ విగ్రహం మాత్రం ఆనాటి కార్యకలాపాలకు సాక్షీభూతంగా నిలిచి ఉంది.

లీప్ ఇయర్ పత్రిక
ప్రపంచంలో రకరకాల పత్రికలు ఉన్నాయి. దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు సర్వసాధారణంగా అందరికీ తెలిసివే! అక్కడక్కడా ద్వైమాసిక పత్రికలు, త్రైమాసిక పత్రికలు కూడా ఉన్నాయి. అరుదుగా ఏడాదికి రెండుసార్లు మాత్రమే ప్రచురితమయ్యే అర్ధవార్షిక పత్రికలు, ఏడాదికి ఒకే సంచికను వెలువరించే వార్షిక పత్రికలు కూడా ఉంటాయి. ఫ్రాన్స్ నుంచి వెలువడే ‘లా బూజీ డి సాపోర్’ అనే ఈ పత్రిక మాత్రం అలాంటిలాంటి పత్రిక కాదు. ప్రపంచంలోని పత్రికలన్నింటిదీ ఒకదారి అయితే, ఈ పత్రికది మరోదారి. జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈ పత్రిక క్రమం తప్పకుండా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే ప్రచురితమవుతుంది. అది కూడా ఠంచనుగా ప్రతి లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తేదీన ఇది విడుదలవుతుంది. లీపు సంవత్సరం వచ్చిందంటే చాలు, దీనికోసం పెద్దసంఖ్యలో పాఠకులు ఎదురుచూస్తూ ఉంటారు.అలా మొదలైంది...హాస్య, వ్యంగ్య కథనాలను ప్రధానంగా ప్రచురించే ఈ పత్రిక 1980లో మొదలైంది. ఇప్పటి వరకు ఈ పత్రిక వెలువరించినవి పన్నెండు సంచికలు మాత్రమే! పెద్దగా వ్యాపార ప్రణాళికలు, ఘనమైన లక్ష్యాలు వంటివేవీ లేకుండానే ఈ పత్రిక ఇద్దరు మిత్రుల చిలిపి ఆలోచన ఫలితంగా పుట్టుకొచ్చింది. జాక్వెస్ డి బుయిసన్, క్రిస్టియన్ బెయిలీ అనే మిత్రులు కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నపుడు ‘లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి కదా, ప్రతిసారీ ఫిబ్రవరి 29న విడుదలయ్యేలా ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకొస్తే భలేగా ఉంటుంది కదా!’ అని అనుకున్నారు. జాక్వెస్ పాలిటెక్నీషియన్, క్రిస్టియన్ ఔత్సాహిక ప్రెస్ టెక్నీషియన్– అంతేకాకుండా, పాతపత్రికల సేకర్త కూడా! ఇద్దరూ కలసి ఎలాగైనా, ఫిబ్రవరి 29న విడుదలయ్యేలా పత్రిక ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. పత్రికకు ఏ పేరు పెడదామని ఆలోచించారు. పంతొమ్మిదో శతాబ్ది చివరిరోజుల నాటి కార్టూన్ క్యారెక్టర్ ‘సాపర్ కామెంబర్’ గుర్తొచ్చింది. ఆ కార్టూన్ పాత్ర ఫిబ్రవరి 29న వస్తుంది. నాలుగేళ్లకు ఒకసారి పుట్టినరోజు జరుపుకొనే ఆ పాత్ర బోలెడంత హాస్యం సృష్టిస్తుంది. అందుకే, ఆ పాత్ర గుర్తొచ్చేలాంటి పేరు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ‘లా బూజీ డి సాపోర్’ (సాపర్స్ క్యాండిల్) అనే పేరు పెట్టారు. తొలి సంచికను 1980 ఫిబ్రవరి 29న ఇరవై పేజీలతో టాబ్లాయిడ్ సైజులో విడుదల చేశారు. మార్కెట్లోకి విడుదలైన కాపీలు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. అప్పటి నుంచి ఈ పత్రిక ప్రతి లీపు సంవత్సరంలోను ఫిబ్రవరి 29న ఠంచనుగా మార్కెట్లోకి తన సంచికను విడుదల చేస్తోంది. ప్రస్తుతం జీన్ డి లిండీ ఈ పత్రికకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగుతున్నారు. హాస్యరస ప్రధానంప్రధానంగా ఇది హాస్యరస ప్రధానమైన పత్రిక. ఎక్కువగా హాస్య, వ్యంగ్య కథనాలను ప్రచురిస్తుంది. అయినా, దీనిపైన రాజకీయ విమర్శలు లేకపోలేదు. జాతీయ అతివాదానికి ఈ పత్రిక మద్దతుగా కథనాలను ప్రచురిస్తోందని కొన్ని ఫ్రెంచ్ పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే, తమది పూర్తిగా రాజకీయాలకు అతీతమైన పత్రిక అని ప్రధాన సంపాదకుడు జీన్ డి లిండీ చెప్పుకుంటారు. ఈ పత్రిక ప్రతులు ఫ్రాన్స్‌లోనే కాకుండా బెల్జియం, స్విట్జర్లండ్, లగ్జెంబర్గ్, కెనడా దేశాల్లో కూడా అమ్ముడవుతాయి. చివరిగా 2024లో విడుదలైన ఈ పత్రిక ప్రతులు రెండు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. ‘మేం ప్రచురించే ప్రతి సంచికలోనూ గడచిన నాలుగేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలను సింహావలోకనం చేస్తాం. అలాగని మాది రాజకీయ పత్రిక కాదు. రాజకీయాలకు అతీతంగా మేం పత్రికను నడుపుతున్నాం. బ్రెగ్జిట్ మొదలుకొని పర్యావరణ మార్పుల వరకు రకరకాల సమస్యలను మా పత్రికలో చర్చిస్తుంటాం. కథనాలు హాస్యస్ఫోరకంగా, వ్యంగ్యంగా ఉంటే పాఠకులను త్వరగా ఆకట్టుకోగలవని మా ఉద్దేశం. నవ్వు ఆరోగ్య లక్షణం. పాఠకులను నవ్వించాలనేదే మా లక్ష్యం’ అంటారు ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు జీన్ డి లిండీ. ఈ పత్రిక 2024 సంచిక ధర 4.90 యూరోలు. మిగిలిన పత్రికల్లాగానే ఈ పత్రికను కూడా మార్కెట్లోకి విడుదలైనప్పుడు కొనుక్కోవచ్చు. ఎప్పటి సంచికను అప్పుడు కాకుండా, ఒకేసారి చందా కట్టాలనుకుంటే, 100 యూరోలు చందా కట్టినట్లయితే, వందేళ్ల పాటు– అంటే, పాతిక సంచికలు అందుతాయి. ప్రపంచ పత్రికా రంగంలో ఈ ఫ్రెంచ్ పత్రికది ఒక విలక్షణమైన కథ.
ఫొటోలు
అంతర్జాతీయం

అంత సీన్ లేదు.. ఎక్కడున్నారో మరచిపోయారా?: ట్రంప్‌కు రష్యా కౌంటర్
మాస్కో: అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికాకు చెందిన రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అమెరికా చర్యలకు రష్యా కౌంటరిచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు తమవద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని రష్యా హెచ్చరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ స్పందిస్తూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యా వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యావి చాలా ఎక్కువే ఉన్నాయి. అమెరికా మోహరించినవి జలాంతర్గాములు సైతం రష్యా జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.🚨 BREAKING: Russian lawmaker Viktor Vodolatsky says Russia has enough nuclear submarines to counter the 2 U.S. subs recently repositioned by President Trump. The move follows provocative remarks from former Russian President Medvedev. #Defense #NuclearSubmarines #USRussia pic.twitter.com/QnsGLdx4Q5— India Defence Daily (@IndiaDefDaily) August 2, 2025మరోవైపు.. గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్‌చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్ మాట్లాడుతూ.. ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మాస్కో, వాషింగ్టన్ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్రోవ్ పేర్కొన్నారు.మెద్వెదెవ్ కామెంట్స్..ఇదిలా ఉండగా.. శుక్రవారం అమెరికా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదెవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్..‘అవి మతిలేని, రెచ్చగొట్టే ప్రకటనలు. నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారముంటే దీటుగా స్పందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండు సబ్మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించాను’ అని వివరించారు.ఏమిటీ డెడ్ హ్యాండ్? ఇది రష్యా (నాటి సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణు దాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిక్‌గా అణు దాడులు జరుపుతుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత.

రష్యాతో భారత్ కటీఫ్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురుపై ట్రంప్ స్పందించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇది మంచి చర్య.. భారత్ సరైన నిర్ణయం తీసుకుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనబోదని నేను అనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, నేను విన్నది సరైందో కాదో నాకు తెలియదు. భారత్ కనుక ఇలా చేస్తే అది మంచి నిర్ణయం. ఏం జరుగుతుందో చూద్దాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.#WATCH | "I understand that India is no longer going to be buying oil from Russia. That's what I heard, I don't know if that's right or not. That is a good step. We will see what happens..." says, US President Donald Trump on a question by ANI, if he had a number in mind for the… pic.twitter.com/qAbGUkpE12— ANI (@ANI) August 1, 2025జైశ్వాల్ కీలక వ్యాఖ్యలు..మరోవైపు, తాజా పరిణామాలపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ దేశంతోనూ భారత్‌కు ఉన్న సంబంధాలను మూడో దేశం కోణంలో చూడవద్దని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తాం. పరస్పర ఆసక్తులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాల విషయంలో భారత్, అమెరికా దేశాలు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాయి. ఇందులో ఇరు దేశాలు ఎన్నో మార్పులు, సవాళ్లను ఎదుర్కొన్నాయి. అందుకే ముఖ్యమైన ఎజెండాపైనే మేము దృష్టి సారించాం. ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. భారత్, అమెరికా బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి బలోపేతమయ్యాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.నిలిచిన కొనుగోళ్లు..ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. అయితే, చమురు కొనుగోలుపై భారత్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తోంది. కాగా, దీన్ని ఓ కారణంగా చూపుతూ ఇటీవల ట్రంప్.. భారత్‌పై పెనాల్టీలు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థ నిలిపివేశాయంటూ వార్తలు వస్తున్నాయి.భారత్‌కు చెందిన ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ లిమిటెడ్ వంటి సంస్థలు గత వారం రోజులుగా మాస్కో నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి. రిఫైనరీ సంస్థలకు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. అయితే, దీనిపై ఆయా సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. ఇప్పటివరకు అలాంటి ఆదేశాలేమీ ప్రభుత్వం జారీ చేయలేదని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

పాక్‌లో రైలు ప్రమాదం.. 30 మందికి గాయాలు
లాహోర్: పాకిస్తాన్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాహోర్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.పాకిస్తాన్ రైల్వేలు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం లాహోర్ నుండి రావల్పిండికి వెళ్తున్న ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్.. షేక్‌పురాలోని కాలా షా కాకు వద్ద పట్టాలు తప్పింది. రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. 🚨🇵🇰 Train Derailment in Pakistan⚠️ Islamabad Express derailed near Kala Shah Kaku (Muridke).🚑 Over 40 passengers injured, rescue teams on site.📍 Cause of derailment under investigation.#Pakistan #TrainAccident #Breaking pic.twitter.com/O6yhz5aBKR— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) August 1, 2025ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. లాహోర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన అరగంటకు రైలు బోగీలు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే మంత్రి ముహమ్మద్ హనీఫ్ అబ్బాసి వెంటనే రైల్వే సీఈఓ, డివిజనల్ సూపరింటెండెంట్‌ను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి ఏడు రోజుల్లోగా విచారణ ఫలితాలను సమర్పించాలని ఆదేశించారు.

సెల్ ఫోన్‌ను సైతం మోయలేనని అనిపించింది..!
వాషింగ్టన్: యాగ్జియం స్పేస్ మిషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని భార రహిత స్థితిలో గడిపి భూమిపైకి వచ్చిన తర్వాత భూగురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడే క్రమంలో ఎదురైన ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గురుత్వాకర్షణ శక్తి ఎంత అవసరమో భూమిని వీడాకనే తమకు తెలిసిందన్నారు. ‘ఒక్కసారిగా భార రహిత స్థితిలోకి మారిపోగా దానికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టింది. అదేవిధంగా, భూమికి తిరిగొచ్చాక కూడా తిరిగి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడాల్సి వచ్చింది’ అని వివరించారు. క్యాప్సూ్యల్లోంచి బయటకు వచ్చాక సెల్ ఫోన్ సైతం పట్టుకోలేనంత బరువుగా మారిపోవడం తనకు ఆశ్చర్యం వేసిందని తెలిపారు. భూమి పైకి వచ్చిన కొన్ని వారాల తర్వాత సైతం అడ్జెస్ట్ కావడం కష్టమవుతుందని, పడిపోకుండా నిలబడటం, అడుగులు వేయడం సైతం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పారు. అందుకే, వ్యోమగాములకు ప్రత్యేక రిహాబిలిటేషన్ కార్యక్రమం ద్వారా బలం కూడదీసుకోవడం, శరీర అవయవాల సమన్వయం, బ్యాలెన్స్ వంటివి ఒక్కటొక్కటిగా అలవాటయ్యాయన్నారు. అంతరిక్షంలో ఉన్నప్పటి మాదిరిగానే వదిలేసిన ల్యాప్‌టాప్ గాల్లోనే తేలియాడుతుందని భావించి, రూంలోనే దాన్ని పడేశాన ని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతరిక్షంలో శూన్య గురుత్వాకర్షణ శక్తిలో అన్నీ తేలియాడుతూనే ఉంటాయి. అటువంటి భారరహిత స్థితిలోనే తనకు అప్పగించిన ప్రయోగాలన్నిటినీ విజయవంతంగా నెరవేర్చానన్నారు. ‘ఇప్పుడంతా మునుపటిలాగానే మారిపోయింది. మరో స్పేస్ మిషన్‌కు సిద్ధంగా ఉన్నా’అంటూ ఆయన ప్రకటించారు. శుభాంశు అంతరిక్ష కేంద్రంలో ఉంటూ చేపట్టిన ప్రయోగాల డేటా, సేకరించిన నమూనాలు ఇప్పటికే అమెరికా నుంచి భారత్‌లోని పరిశోధన శాలలకు చేరాయి. త్వరలో భారత్‌కు రానున్న శుభాంశు శుక్లా ఆ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలకు వివరించనున్నారు.
జాతీయం

‘రెండు రూపాయల డాక్టర్’ ఇకలేరు
తిరువనంతపురం: పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నిస్వార్ధ సేవకుడు. డాక్టర్ ఏకే రైరూ గోపాల్ అలియాస్ ‘రెండు రూపాయల డాక్టర్’ ఆదివారం (ఆగస్టు 3న) కన్నుమూశారు. ఉత్తర కేరళలోని కన్నూర్‌లో వేలాది మంది జీవితాల్లో నిస్వార్థ సేవ చేసిన డాక్టర్ గోపాల్ పేదలు,అణగారిన ప్రజలకు దశాబ్దాలుగా(ఒక దశాబ్ధం అంటే 10ఏళ్లు) రెండు రూపాయిలకే వైద్యం అందించారు.డాక్టర్ ఏకే రైరూ గోపాల్ 50 ఏళ్ల పాటు అతి తక్కువకే రూ.2కే వైద్యం చేసేవారు. అందుకే ఆయనను అందరూ ‘రెండు రూపాయల డాక్టర్..రెండు రూపాయల డాక్టర్’ అని పిలుస్తుంటారు. ఇతర డాక్టర్లు ఒక్క ఓపీకి వందల్లో ఛార్జ్ చేస్తుంటే డాక్టర్ గోపాల్ మాత్రం పేషెంట్ స్థోమతను బట్టి రూ.40, రూ.50 మాత్రమే తీసుకునేవారు.అలా వైద్యం ఖరీదైన తరుణంలో డాక్టర్ గోపాల్ మాత్రం వైద్యంలో దాతృత్వం, నీతికి చిహ్నంగా నిలిచారు. వైద్యుడిగా సేవలందిస్తుండగా.. ఓ రోగి దారుణమైన పరిస్థితిని చూసి చలించిపోయారు. అలా ఆయన ప్రయాణం స్వచ్ఛంద సేవతో ప్రారంభమైంది. నాటి నుంచి ముఖ్యంగా రోజూవారి దినసరి కూలీలు, విద్యార్థులకు, పేదలకు అందుబాటులో సరసమైన వైద్యాన్ని అందించేందుకు తనని తాను అంకితం చేసుకున్నారు.విధులు నిర్వహించే సమయంలో తన మిత్రులు, కుటుంబ సభ్యులు,ఇంకెవరైనా తనని కలిసేందుకు వస్తే రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. తన ఇంటి గేటుకు ఓ బోర్డు తగిలలించారు. ఆ బోర్డులో రోగులకు చికిత్స చేసే సమయంలో తనకోసం ఎవరూ రావొచద్దు. ఒక వేళ రావాలని ప్రయత్నం చేస్తారేమో.. రావద్దు. చిరునవ్వుతో తిరిగి వెనక్కి వెళ్లిపోండి అని రాసి ఉంచారు. అంతలా తన వైద్య సేవల్ని అందించడంలో నిమగ్నమయ్యేవారు.ఆయన ఎందుకంత ప్రత్యేకం50 సంవత్సరాలకు పైగా వైద్య రంగంలో సేవ చేసిన ఆయన రూ.2 రూపాయలకే వైద్యం పొందేలా అవకాశం కల్పించారు. దినసరి కూలీలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజూ అర్ధరాత్రి 2:15 నుండే రోగుల కోసం వైద్య సేవలు ప్రారంభించి.. ఇలా ప్రతి రోజు 300-400 మంది వరకు రోగులకు చికిత్స అందించేవారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే మందులే సూచించేవారు. గోపాల్‌కు తోడుగా ఆయన సతీమణి డాక్టర్ శకుంతల, సహాయకులు మందులు పంపిణీ చేయడంలో సహాయపడేవారు.డాక్టర్ గోపాల్ చేసిన సేవలకు గానుడాక్టర్ గోపాల్ చేసిన సేవలకు గాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నుండి కేరళలో ఉత్తమ ఫ్యామిలీ డాక్టర్ అవార్డు పొందారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన సేవలను ప్రశంసిస్తూ “ప్రజల డాక్టర్” అని అభివర్ణించారు. ఆయన దగ్గరకు వెళ్లడం అంటే మందు (మెడిసిన్) కోసం కాదు, ప్రేమ కోసం అని స్థానికులు చెబుతుండగా..‘ఆయనను కలిస్తే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇట్టే తగ్గిపోతుందనేది రోగుల నమ్మకం. డాక్టర్ గోపాల్ తదనంతరంతో ఆయన సోదరులు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రాజగోపాల్‌లు వైద్య సేవల్ని కొనసాగించనున్నారు. Dr. #RairuGopal, a dedicated doctor, succumbed to age-related health issues today. For over 50 years, he selflessly served the community at Lakshmi Home Clinic, providing medical care to the poor at a nominal fee of Rs 2 per consultation. His daily routine involved treating… pic.twitter.com/qjA61cubat— Harish M (@chnmharish) August 3, 2025

నితిన్ గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసులు
నాగపూర్: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న నితిన్ గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్క్వాడ్.. గడ్కరీ ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. సోదాల తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అది నకిలీ బెదిరింపు అని తేల్చారు. అనంతరం ఫోన్ నంబర్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నకిలీ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని నాగ్‌పుర్ తులసి బాగ్ రోడ్‌లోని మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ విష్ణు రౌత్‌గా గుర్తించామన్నారు. బెదిరింపు కాల్ చేయడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.#WATCH | Nagpur, Maharashtra: Nagpur Police arrested a man for allegedly threatening to bomb Union Minister Nitin Gadkari’s residence. On this, DCP Nagpur, Rushikesh Singa Reddy says, "We received a call in which someone claimed they had planted a bomb in Nitin Gadkari's home,… pic.twitter.com/flrZc3k2LQ— ANI (@ANI) August 3, 2025

దవడ పగిలింది.. వెన్నెముక విరిగింది..!
న్యూఢిల్లీ: పరిమితికి మించిన లగేజీతో వచ్చినందుకు అదనంగా ఫీజు చెల్లించాలని కోరిన స్పైస్‌జెట్ సిబ్బందిపై ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెలరేగిపోయారు. నలుగురు ఉద్యోగులను చితకబాదడంతో వెన్నెముక విరగడం, దవడ పగలడం వంటి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో జూలై 26వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లెఫ్టినెంట్ కల్నల్ రితేశ్ కుమార్ సింగ్ గుల్మార్గ్లోని హై అల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ పనిచేస్తున్నారు. ఆయన జూలై 26వ తేదీన ఢిల్లీ వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణించాల్సి ఉంది. క్యాబిన్లోకి ప్రయా ణికులు కేవలం 7 కిలోల బరువైన లగేజీని మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. కల్నల్ సింగ్ మాత్రం 16 కిలోల బరువున్న రెండు బ్యాగులతో వచ్చారు. అదనపు బరువుకు నిబంధనల ప్రకారం అదనంగా చార్జీ ఉంటుందని సిబ్బంది చెప్పగా చెల్లించేందుకు నిరాకరించిన సింగ్ ఆగ్రహంతో దుర్భాషలాడుతూ ఊగిపోయారు. వారిని నెట్టేసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై సైన్ బోర్డు స్టీల్ స్టాండుతో దాడికి దిగారు. SHOCKING “MURDEROUS” Assault on SpiceJet Staffers at Srinagar Airport Passenger attacks 4 SpiceJet Staffers with whatever he cud get hold off— 2 grievously injured. Jaw & Spine injured. July 26th incident, FIR Filed Pax - allegedly an army officer - put on NO FLY List 1/2 pic.twitter.com/g79eiuSy3P— Amit Bhardwaj (@tweets_amit) August 3, 2025ఒక ఉద్యోగి స్పృహ తప్పి పడిపోగా, ఆయన్ను కాలితో తన్నారు. ముఖంపై పంచ్ ఇవ్వడంతో మరో ఉద్యోగి దవడ ఎముక విరిగింది. ముక్కు నుంచి రక్తం వచ్చింది. మరో ఉద్యోగి వెన్నెముక చిట్లింది. సీఐఎస్ఎఫ్ అధికారి కలుగ జేసుకుని ఆయన్ను తిరిగి గేట్ వద్దకు తీసుకెళ్లారు. బాధిత నలుగురు ఉద్యోగులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేపట్టామని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనల ప్రకారం..ఆ అధికారి పేరును నో ఫ్లై జాబితాలో చేరుస్తామని స్పైస్ జెట్ తెలిపింది. ఆ ప్రయాణికుడిపై తగు చర్యలు తీసుకోవాలని పౌరవిమానయాన శాఖకు లేఖ రాసింది.

ఎన్నికల ఎఫెక్ట్.. ‘తమిళనాట 6.5 లక్షల కొత్త ఓటర్లు’
ఢిల్లీ: ఓటర్ లిస్టు విషయంలో ఎన్నికల సంఘంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మరో బాంబు పేల్చారు. తమిళనాడులో ఏకంగా 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని చెప్పుకొచ్చారు. దీంతో ఓటర్ లిస్ట్‌పై కొత్త చర్చ మొదలైంది.బీహార్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా ఓటర్ల సంఖ్య పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. తాజాగా చిదంబరం ట్విట్టర్ వేదికగా.. ‘ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతోంది. బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉండగా.. తమిళనాడులో మాత్రం 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇది ఆందోళనకరమైన చర్య. చట్టవిరుద్ధమైనది. పెరిగిన ఓటర్లను శాశ్వత వలస కార్మికులు అని పిలిస్తే అసలైన వలస కార్మికులను అవమానించినట్లు అవుతుంది. తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా చేసేందుకు ఓట్ల పెంపుదల జరిగింది. ఎన్నికల సంఘం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. ఈ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సిందే’ అని పిలుపునిచ్చారు.The SIR exercise is getting curiouser and curiouserWhile 65 lakh voters are in danger of being disenfranchised in Bihar, reports of "adding" 6.5 lakh persons as voters in Tamil Nadu is alarming and patently illegalCalling them "permanently migrated" is an insult to the…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025ప్రతి భారతీయుడికి శాశ్వత నివాసం ఉన్న ఏ రాష్ట్రంలోనైనా నివసించడానికి, పని చేయడానికి హక్కు ఉంది. అది స్పష్టంగా సరైనది. బీహార్ ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న లక్షల మంది వ్యక్తులు రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు. కాబట్టి వారిని మినహాయించాలని ఎన్నికల సంఘం ఎలా నిర్ణయానికి వచ్చింది?. ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు అని నిర్ధారణకు రాక ముందే, ప్రతి కేసుపై సమగ్ర విచారణ నిర్వహించకూడదా?. సామూహిక ఓటుహక్కుల తొలగింపు అనేది తీవ్రమైన సమస్య, అందుకే సుప్రీంకోర్టు పిటిషన్లను విచారిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చిదంబరం తన పోస్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. తమిళనాడు ఓటరు జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై అధికార డీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. Every Indian has a right to live and work in any state where he has a permanent home. That is obvious and rightHow did the ECI come to the conclusion that several lakh persons, whose names are in the current electoral rolls of Bihar, must be excluded because they had…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025
ఎన్ఆర్ఐ

ఎవరీ లండన్ చాయ్‌వాలా.. ఏంటి ప్రత్యేకత?
ఇండియన్ కల్చర్‌లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్‌లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్‌వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్‌వాలా. అది కుడా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్‌లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్‌ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "చెకర్స్‌లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్‌పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్‌లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా..భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్‌ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు. ఎవరీ అఖిల్ పటేల్?భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్‌ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్‌కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్‌లోని హాంప్స్టెడ్లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశాడు.చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్‌కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్‌లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్‌కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్.

థాయ్-కంబోడియా ఘర్షణలు.. భారతీయులకు అడ్వైజరీ
థాయ్‌లాండ్, కంబోడియా దేశాలు సరిహద్దు వివాదంతో పరస్పర దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం.. తాజాగా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం అడ్వైజరీ జారీ అయ్యింది.భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌ల వైపు ప్రయాణం చేయొద్దని శుక్రవారం థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సూచింది. అంతేకాదు మార్గదర్శకాల కోసం థాయ్ అధికారుల సహకారం కోరవచ్చని అందులో స్పష్టం చేసింది. ట్రాట్, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కవావో, ఛంథాబురి, ఉవోన్ రట్చథాని..ప్రావిన్స్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.In view of the situation near Thailand-Cambodia border, all Indian travelers to Thailand are advised to check updates from Thai official sources, including TAT Newsroom.As per Tourism Authority of Thailand places mentioned in the following link are not recommended for… https://t.co/ToeHLSQUYi— India in Thailand (@IndiainThailand) July 25, 2025ఇదిలా ఉంటే.. మరోవైపు థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని పుమ్తోమ్ వెచయాచై కూడా ఆయా ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్ని దశాబ్దాలుగా థాయ్‌లాండ్ – కాంబోడియా మధ్య నడుస్తున్న వివాదం.. తాజాగా తీవ్రరూపం దాల్చింది.Ta Muen, Ta Moan Thom దేవాలయాలు తమవంటే తమవని ఇరు దేశాలు కొన్ని దశాబ్దాలుగా వాదించుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ.. థాయ్‌లాండ్ నుంచి అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. మే నెలలో కంబోడియాకు చెందిన సైనికుడ్ని థాయ్ సైన్యం కాల్చి చంపింది. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దులో వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్ ప్రధాని షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో రాయబారం చేయబోయారు. ఆ సమయంలో ‘అంకుల్’ అని సంబోధిస్తూ మాట్లాడిన ఫోన్‌కాల్ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్ సైన్యం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశంపై అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం విచారణకు ఆదేశించడంతో పాటు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 3న పుమ్తోమ్ వెచయాచై థాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.జూలై 23, 2025న ల్యాండ్‌మైన్ పేలడంతో థాయ్‌లాండ్‌కు చెందిన ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ప్రతిగా.. థాయ్‌లాండ్ F-16 యుద్ధ విమానాలతో కాంబోడియా లక్ష్యాలపై బాంబుల దాడులు చేసింది. ఈ పరిణామంతో ఇరు దేశాల రాయబారులను ఉపసంహరించుకున్నారు.గురువారం నాటి ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన 14 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ సంక్షోభంతో సరిహద్దులో ఉంటున్న వేలమంది తమ తమ దేశాలకు పారిపోయారు. శుక్రవారం సైతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. థాయ్‌లాండ్ కంబోడియన్ సరిహద్దులో వైమానిక దాడులు చేస్తోంది.

భారతీయులకు ఉద్యోగాలు ఆపండి
న్యూయార్క్/వాషింగ్టన్: విపరీతమైన వీసా ఆంక్షలు అమలుచేస్తూ, సోషల్‌మీడియా ఖాతాలను జల్లెడపడుతూ వీలైనంతవరకు భారతీయులను అమెరికా గడ్డపై కాలుమోపకుండా అడ్డు తగులుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు నేరుగా అక్కడి కంపెనీలకే ఆదేశాలు ఇచ్చేందుకు తెగించారు. చట్టబద్ధంగా, అత్యంత నైపుణ్యముండి వీసాలతో అమెరికాకొస్తున్న భారతీయులను కాదని, అమెరికన్లకే కొలువుల్లో పట్టంకట్టాలని ట్రంప్ అక్కడి టెక్ దిగ్గజ సంస్థలకు హితవు పలికారు. బుధవారం వాషింగ్టన్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలనుద్దేశిస్తూ సూటిగా సూచనలు ఇచ్చారు. ‘‘ వేర్పాటు వాదంలాంటి ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) భావాజలంలో మన అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు కొట్టుకుపోతున్నాయి. గ్లోబలైజేషన్ కోసం పరితపిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలన్నీ కోట్లాది మంది అమెరికన్ల విశ్వాసాన్ని కోల్పోయి కృతçఘ్నులుగా తయారవుతున్నాయి. మీరు తోటి అమెరికన్ల పట్ల తీవ్ర నిర్లక్ష ధోరణిని కనబరుస్తున్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఇక్కడి కంపెనీలు చైనాలో భారీ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాయి. భారత్ నుంచి తక్కువ జీతభత్యాలకు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఐర్లాండ్‌లో నష్టాలు వస్తున్నాయన్న సాకుతో ఇక్కడ లాభాలను తక్కువచేసి చూపిస్తూ పన్నుల భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇవన్నీ చేస్తూ మీ తోటి అమెరికన్పౌరుల ఉద్యోగ హక్కులను కాలరాస్తున్నారు. ఇక నా హయాంలో మీ ఆటలు సాగవు. అమెరికా టెక్నాలజీ సంస్థలన్నీ మన దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. ఫ్యాక్టరీల కల్ప నలో, ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం దక్కాలి. ఇకనైనా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపండి. అమెరికన్లకు ఉపాధి కల్పించండి. మిమ్మల్ని నేను అడిగేది ఇదొక్కటే. ఈ పని మీరు ఖచ్చితంగా చేస్తారనే భావిస్తున్నా’’ అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.#WATCH | Trump promises to bring tech jobs back home, slamming US firms for outsourcing to China and hiring Indian workers abroad.#DonaldTrump #UnitedStates #China #India pic.twitter.com/p2KLKkDqj9— News18 (@CNNnews18) July 24, 2025 ట్రంప్ వ్యాఖ్యలు.. భారతదేశంపై ప్రభావంట్రంప్ వ్యాఖ్యలు అమెరికా-భారత టెక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇండియన్ IT ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ రంగం పై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.“No more Indian workers” అని ట్రంప్ స్పష్టంగా హెచ్చరించారు.Apple, Google, Tesla వంటి కంపెనీలు భారతదేశం లో ఉద్యోగాలు ఇవ్వడం పై 25% టారిఫ్ విధించవచ్చని హెచ్చరిక జారీ చేశారు.

''నెల నెలా తెలుగువెన్నెల'' 18వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెల నెలా తెలుగువెన్నెల'' ,తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవం 2025 జూలై నెల 19 వ తేదీన డాలస్‌లోని ఇన్నోవేషన్ హబ్ మీటింగ్ హాల్లో ఘనంగా జరిగింది. తొలుత చిరంజీవి సమన్విత మాడా త్యాగరాజ కీర్తన''మనవ్యాలకించరాదటే' ప్రార్ధన గీతంతో సదస్సును ప్రారంభం కాగా, తరువాత ప్రముఖ కవి కీ శే వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సంస్థ ప్రత్యేక గీతం ''నెల నెలా -తెలుగు వెన్నెలా ''ని ప్రముఖ గాయని శివాత్మిక ఆలపించారు. సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3 వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలియజేసారు. గత రెండేళ్లుగి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాని కలిగించిందన్నారు. ముఖ్య అతిథి సంస్కృతాంధ్ర ద్విశతావధాని పాలడుగు శ్రీచరణ్ గారిని సాహితీ ప్రియులకు పరిచయం చేశారు. సాఫ్ట్వేర్ రంగం లో ఉద్యోగం చేస్తూ గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో నివాసం ఉంటున్న వీరు, ఇప్పటిదాకా 36 అష్టావధానాలు, 2 శతావధానాలు, ఒక ద్విశతావధానము చేసారు. ఈ రోజు విశిష్టమయిన సంస్కృతాంధ్ర ఏకాదశావధానం చేయబోతున్నారు.కార్యక్రమానికి సంధాతగా తొలి తెలుగు అమెరికా అవధాని ఆచార్య పుదూరు జగదీశ్వరన్ గారు వ్యవహరించి అవధాన ప్రక్రియ ని సభకు పరిచయం చేసి కార్యక్రమం ఆరంభించారు.అటు సంస్కృతం, ఇటు తెలుగు పూరణలతో, సమయోచిత సందర్భ సహిత వివరణలతో, చతురోక్తులతో ఆద్యంతం అవధాని గారు ఆహుతులను అలరించారు.పృచ్చకులుగా నిషిద్ధాక్షరి- జంద్యాల జయకృష్ణ బాపూజీ, సమస్య- ఉపద్రష్ట సత్యం, దత్తపది-చంద్రహాస్ మద్దుకూరి, వర్ణన-డా.గుర్రం మైథిలి, న్యస్తాక్షరి-సిద్దా శ్రీధర్,అప్రస్తుత ప్రసంగము-మాడాదయాకర్, పురాణము-వేముల లెనిన్, ఆశువు-పాలూరి సుజన,సంస్కృతము దత్తపది-నేమాని రాజశేఖర్, సమస్య-పేరి భార్గవి,వర్ణన-రామడుగు నరసింహాచార్యులు వ్యవహరించారు. 'కృత్స్న జ్యోత్స్నల వీడి చెప్పగదవే హృత్స్నేహమేపారగన్' అంటూ క్లిష్టమైన ప్రాసలతో కూడిన సమస్యను వారు పూరించిన తీరు, 'రసాభాసోజాతః కవికులగురోః కావ్యనిచయే' సంస్కృత సమస్యాపూరణము ఆహుతులను అలరించింది. అవధానానంతరము సభికుల కరతాళ ద్వనుల మధ్య సంస్థ అవధాని గారిని ఘనంగా సత్కరించింది.విశిష్ట అతిథులుగా విచ్చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం పొందిన పర్వ నవలానువాద అనుభూతులను పంచుకుంటూ 'అనువాద పర్వం' పై ప్రసంగించారు. తరువాత హైదరాబాద్ విశ్వవిద్యాలయం లోని అనువర్తిత భాషాశాస్త్రం మరియు అనువాద అధ్యయనాల కేంద్రానికి నిర్దేశకుడిగా పదవీ విరమణ చేసిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు ' యంత్రానువాద వ్యవస్థల ' పై సోదాహరణముగా ప్రసంగం గావించారు. ఈ ఇరువురి ప్రధాన ప్రసంగాలు ఆహుతులని చాలా అలరించాయి. భాషకి సంబంధించిన కొత్త కోణాలని పరిచయం చేసాయి.చివరగా కాలార్చన డాక్టర్ రాళ్ల బండి కవిత ప్రసాద్ శాస్త్రీయ నృత్య రూపకం, దేవి భాగవతం ఆధారంగా చేసుకుని కాలాన్ని నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ విశిష్టమైన సాహిత్యం, శ్రవ్యమైన సంగీతంతో 40 మంది నర్తకి నర్తకులతో కనుల పండుగగా ఈ నృత్య రూపకాన్ని కళా రత్న కెవి సత్యనారాయణ నృత్య దర్శకత్వం వహించారు. డాలస్ నగరంలోని ప్రముఖ నృత్య సంస్థల నుండి నాట్య గురువులు, నాట్య కళాకారులు ఈ నృత్య రూపకంలో పాత్రను పోషించారు. అనంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ కార్యవర్గ బృందము మరియు పాలక మండలి, సంస్థ తరపున అతిథులందరికీ సన్మాన పత్ర జ్ఞాపికలు శాలువాలతో సత్కరించారు.ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి వందన సమర్పణ చేసి, సహకరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. సభా వేదికను ఇచ్చి సహకరించిన విజయ్ బొర్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుఈ కార్యక్రమములో సంస్థ ఉత్తరాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి,పాలక మండలి అధిపతి డా కొండా తిరుమల్ రెడ్డి, సభ్యులు డా శ్రీనాథ్ రెడ్డి పల్వల, సురేష్ మండువ, జ్యోతి వనం, కార్యవర్గ బృందం ఉదయ్ నిడిగంటి, దీప్తి సూర్యదేవర, సునీల్ సూరపరాజు, నరసింహ పోపూరి, శివారెడ్డి వల్లూరు, లెనిన్ తుళ్ళూరి సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర,శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ,డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి ,చిన్న సత్యం వీర్నాపు,చంద్ర కన్నెగంటి మరియు ప్రముఖ రచయితలు వంగూరి చిట్టెం రాజు, అత్తలూరి విజయలక్ష్మి పాల్గొన్నారు.
క్రైమ్

ఏకాంత సేవలో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఉన్న సమయంలో సదరు మహిళ భర్త వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం, కుటుంబ సభ్యులు, స్థానికులు వారిద్దరినీ స్థంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలం నాయకుని తండాలో వివాహిత, రమేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ గమనించిన సదరు మహిళ భర్త.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం, సదరు భర్త స్థానికుల సాయంతో.. విద్యుత్ స్తంభానికి కట్టేసి ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఐదో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. నారాయణగూడ అడ్మిన్ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్‌నగర్ ఉర్దూ గల్లీలో సాయికృష్ణ గ్రాండ్యువర్ అపార్ట్మెంట్లో అరుణ్ కుమార్ జైన్ తన భార్య పూజజైన్(43) ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా పూజ జైన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. శనివారం ఉదయం ఆమె భర్త అరుణ్ కుమార్ బయటకు వెళ్లగానే ఐదో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.

బాంబు బెదిరింపు మెయిల్స్ చేసిన యువతి రిమాండ్
హైదరాబాద్: ప్రియుడిపై కోపంతో దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిన యువతిని శనివారం ఆర్జీఐఏ పోలీసులు కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. చెన్నైకు చెందిన రోబోటిక్ సాఫ్ట్వేర్ ఇంజరీన్ రినే జోషిదా (30) చెన్నైకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ప్రేమించింది. పెళ్లికి ప్రియుడు అంగీకరించకపోవడంతో అతడిపై పగబట్టిన జోషిదా అతడిని ఏదైనా నేరంలో ఇరికించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గత ఏడు నెలలుగా దేశవ్యాప్తంగా సుమారు 11 విమానాశ్రయాలతో పాటు పలు విద్యాసంస్థలకు బాంబులున్నాయంటూ ప్రియుడికి సంబంధించిన మెయిల్‌తో సందేశాలు పంపింది. స్విట్జర్లాండ్ వేదికగా వచ్చిన వీటిపై విమానాశ్రయం అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటన సైతం తామే చేసినట్లు పంపిన ఈమెయిల్‌ను కేంద్ర దర్యాప్తు అధికారులు తీవ్రంగా పరిగణించి రినే జోషిదాను అరెస్ట్ చేశారు. ఈమెపై ఆర్జీఐఏ ఔట్‌పోస్టు పోలీస్ స్టేషన్లో కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ కేసులు ఉండడంతో శనివారం ఆర్జీఐఏ ఔట్‌పోస్టు సీఐ బాలరాజు ఆధ్వర్యంలో కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ చేశారు.

బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి
హైదరాబాద్: బిల్డింగ్‌పై వాకింగ్ చేస్తుండగా..మూర్ఛ వ్యాధి రావడంతో అదుపుతప్పి విద్యార్థి మూడో అంతస్తు నుండి కిందపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన ఐఎస్ సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుర్గా భవానీనగర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి బద్రీనాథ్ రావు కుమారుడు గౌరవ్ రావు (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేసిన అనంతరం వాకింగ్ చేసేందుకు మూడో అంతస్తుకు వెళ్లాడు. అక్కడ వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అదుపుతప్పి భవనం నుంచి కిందపడిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలకు గురైన గౌరవ్‌ను చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.