
ప్రకృతి ఒడిలో దాగిన అందాలు మనిషిన కట్టిపడేస్తాయి. చూసే దృష్టి ఉండాలిగానీ ప్రకృతిలో ప్రతీదీ అందమైనదే. రాళ్లూ రప్పలు.. ఆకులురాలిన చెట్లు.. నీళ్లు.. కొండలు అబ్బో ఒక్కటేమిటి ప్రతీది మనసును హత్తుకునేది. ఇక్కడున్న చిత్రాలు ఎక్కడో కాదు బ్రహ్మంసాగర్‌లోనివి. నీరు తగ్గాక కనిపించిన అందమైన దృశ్యాలు ఇవి. –సాక్షి, కడప