Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Kakani Govardhan Reddy Arrest Updates1
రెడ్‌బుక్‌ అరెస్ట్‌: కాకాణికి వైద్య పరీక్షలు పూర్తి

కాకాణి అరెస్ట్‌ అప్‌డేట్స్‌..వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి.చెముడు గుంటలోని డీటీసీ నుంచి నేరుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తీసుకెళ్లిన పోలీసులువైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.👉 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్‌ పాలన పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరాయి. ప్రశ్నించే వారే ఉండకూడదని టార్గెట్‌ చేస్తూ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్‌ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు.👉పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్‌ శాఖ ఇన్‌చార్జ్‌ డీడీ బాలాజీ నాయక్‌ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్‌ 3 పీడీపీపీఎ, సెక్షన్‌ 3 అండ్‌ 5 ఆఫ్‌ ఈఎస్‌ యాక్ట్‌ అండ్‌ సెక్షన్‌ 21(1), 21(4) ఆఫ్‌ ఎంఎండీఆర్‌ యాక్ట్‌ కింద పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.👉ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్‌ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్‌లు జత చేశారు.👉కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్‌ రోడ్డులోని కాకాణి గృహానికి చేరుకున్నారు.

USA Donlad Trump Serious On Russia Putin2
పుతిన్‌కు పిచ్చి పట్టింది.. రష్యాకు ట్రంప్‌ వార్నింగ్‌

వాషింగ్టన్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌, రష్యా మధ్య కాల్పుల విరమణకు సంబంధించి మంతనాలు జరుగుతున్న వేళ పుతిన్‌ సైన్యం దాడులు చేయడంతో మండిపడ్డారు. పుతిన్‌ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తపరిచారు.ట్రంప్‌ తాజాగా ట్విట్టర్‌లోని ట్రుత్‌ వేదికగా స్పందిస్తూ..‘రష్యా అధ్యక్షుడు పుతిన్ నాకు చాలా కాలంగా తెలుసు, మా మధ్య మంచి సంబంధం ఉంది. కానీ, ఇప్పుడు పుతిన్‌ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు. ఉక్రెయిన్‌పై ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. నగరాలపై దాడి చేస్తున్నాడు. అన్యాయంగా ప్రజలను చంపుతున్నాడు. నాకు ఇది అస్సలు ఇష్టం లేదు.Donald Trump Truth Social 05.25.25 08:46 PM ESTI’ve always had a very good relationship with Vladimir Putin of Russia, but something has happened to him. He has gone absolutely CRAZY! He is needlessly killing a lot of people, and I’m not just talking about soldiers. Missiles…— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) May 26, 2025పుతిన్‌.. ఉక్రెయిన్‌లోని ఒక భాగాన్ని మాత్రమే కాకుండా, మొత్తం ఉక్రెయిన్‌ను కోరుకుంటున్నారని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. బహుశా అది నిజమే కావచ్చు.. కానీ అలా చేస్తే, అది రష్యా పతనానికి దారి తీస్తుంది. అధ్యక్షుడు జెలెన్స్కీ తను మాట్లాడే విధానం ద్వారా తన దేశానికి ఎటువంటి మేలు చేయడం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలను సృష్టిస్తుంది. అతడు తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో రష్యా 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఉక్రేనియన్ వైమానిక దళం ప్రకారం, వారు 45 క్షిపణులను కూల్చివేసి 266 డ్రోన్లను ధ్వంసం చేశారు. అనేక నగరాల్లో భారీ విధ్వంసం జరిగింది. కీవ్‌తో సహా 30 కి పైగా నగరాలు, గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో కనీసం 12 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు.

Pak PM Shehbaz Sharif thanks To Turkey Erdogan3
తుర్కియే అధ్యక్షుడితో పాక్‌ ప్రధాని భేటీ.. భారత్‌ గురించి చర్చ?

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో పాకస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్‌తో యుద్ధం సమయంలో పాకిస్తాన్‌ ఆయుధపరంగా మద్దతు ఇచ్చినట్టు ఎర్డోగన్‌కు షరీఫ్‌ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్‌, తుర్కియే మధ్య స్నేహం చిరకాలం ఉండాలని కోరుకున్నారు.తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక చర్చలు జరిపారు. అనంతరం, షరీఫ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘ఇస్తాంబుల్‌లో నా ప్రియమైన సోదరుడు అధ్యక్షుడు ఎర్డోగన్‌ను కలిసే గౌరవం నాకు లభించింది. ఇటీవలి పాకిస్తాన్-భారత్ ప్రతిష్టంభనలో పాకిస్తాన్‌కు ఆయన దృఢంగా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్ని వేళలా ఎర్డోగన్‌ మాకు అండగా నిలిచారు. పాకిస్తాన్‌, తుర్కియే మధ్య స్నేహం చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను.ఈ చర్చలో ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో రెండు దేశాల మధ్య బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించాం. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఇంధనం, వాణిజ్యం, రవాణా, రక్షణ రంగాలలో పురోగతులే లక్ష్యంగా పెట్టుకున్నాం. నిఘా భాగస్వామ్యం, ఉగ్రవాద వ్యతిరేకత వంటి రంగాలలో సహకారంపై చర్చించాం. ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రెండు దేశాలు కలిసి పనిచేయడం కొనసాగించాలని అనుకుంటున్నాం అని తెలిపారు.Had the honor of meeting my dear brother President Reccep Tayipp Erdogan in Istanbul this evening. Thanked him for his resolute support to Pakistan in the recent Pakistan India standoff which resulted in Pakistan's overwhelming victory Alhamdolillah!Conveyed the sentiments of… pic.twitter.com/EEYxZdIf7g— Shehbaz Sharif (@CMShehbaz) May 25, 2025మరోవైపు, పాక్‌ ప్రధాని షరీఫ్‌తో చర్చలపై ఎర్డోగన్‌ స్పందిస్తూ..‘రెండు దేశాల మధ్య సోదరభావం, గౌరవం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇస్లామాబాద్‌కు మా పూర్తి మద్దతు కొనసాగుతుంది. తుర్కియే, పాకిస్తాన్ మధ్య ప్రతి రంగంలో చారిత్రక, మానవ, రాజకీయ సంబంధాలున్నాయి. వీటిని బలోపేతం చేయాలనేదే మా సంకల్పం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత వీరిద్దరూ భేటీ అవడం ఇదే తొలిసారి. భారత్‌-తుర్కియే మధ్య విభేదాలు నెలకొన్న వేళ.. ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌కు సాయం చేసిన తుర్కియేపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ ఉత్పత్తులను నిషేధించాలంటూ ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం మార్మోగుతోంది.

Siraj Loses Cool After GT Star Blunder Ravi Shastri Reaction Adds To Drama4
కోపంతో ఊగిపోయిన సిరాజ్‌.. ఇదేంటి మియా?.. ఇలాగేనా ప్రవర్తించేది?

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)కు కోపమొచ్చింది. సహచర ఆటగాడిపై మైదానంలోనే అతడు కోపంతో ఊగిపోయాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)తో ఆదివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. విషయమేమిటంటే..చేదు అనుభవంఐపీఎల్‌-2025 (IPL 2025) లీగ్‌ దశ ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో శుబ్‌మన్‌ సేన 83 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగాలంటే మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ ఆది నుంచే గుజరాత్‌కు కలిసిరాలేదు. టాస్‌ గెలిచిన సీఎస్‌కే తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 230 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆయుశ్‌ మాత్రే (17 బంతుల్లో 34), డెవాన్‌ కాన్వే (35 బంతుల్లో 52) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఉర్విల్‌ పటేల్‌ (19 బంతుల్లో 37) దానిని కొనసాగించాడు.The word 'fear' isn't in their dictionary 🔥#CSK's young guns Ayush Mhatre and Urvil Patel added to the Ahmedabad heat with their knocks 👏Updates ▶ https://t.co/P6Px72jm7j#TATAIPL | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/KcM4XW9peg— IndianPremierLeague (@IPL) May 25, 2025 ఇక శివం దూబే (8 బంతుల్లో 17) కాసేపు మెరుపులు మెరిపించగా.. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (23 బంతుల్లో 57) ధనాధన్‌ దంచికొట్టాడు. రవీంద్ర జడేజా (18 బంతుల్లో 21 నాటౌట్‌) కూడా ఈసారి ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.అదనపు పరుగులుకాగా సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను సిరాజ్‌ వేశాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న ఉర్విల్‌ పటేల్‌.. మిడాఫ్‌ దిశగా బాల్‌ను తరలించాడు. కాన్వేతో కలిసి సింగిల్‌ పూర్తి చేసుకున్నాడు. అయితే, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ డైరెక్ట్‌ త్రో ద్వారా వికెట్లను గిరాటేయాలని చూడగా.. మిస్‌ ఫీల్డ్‌ అయింది. ఓవర్‌ త్రో కారణంగా చెన్నై మరో పరుగు తీయగలిగింది.ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గిల్‌ వేసిన ఓవర్‌ త్రోను అందుకునేందుకు స్క్వేర్‌ లెగ్‌ వద్ద నుంచి పరిగెత్తుకు వచ్చిన ఆర్‌. సాయి కిషోర్‌ బంతిని అందుకుని మిడ్‌ వికెట్‌ వద్ద కలెక్ట్‌ చేసుకున్నాడు. అనుకోకుండా బంతి అతడి నుంచి చేజారగా.. ఇంతలో సీఎస్‌కే బ్యాటర్లు మూడో పరుగు కూడా పూర్తి చేసుకున్నారు.ఇదేంటి మియా? ఇలాగేనా ప్రవర్తించేది?దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్‌ కిషోర్‌ను ఉద్దేశించి గట్టిగానే తిట్టినట్లు కనిపించింది. అంతేకాదు.. బంతిని కూడా గ్రౌండ్‌కేసి కొడుతూ తన ఆగ్రహం వెళ్లగక్కాడు. ఇంతలో గిల్‌ వచ్చి సిరాజ్‌ భుజం తడుతూ నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ఇదేంటి మియాన్‌’’ అంటూ ఇలాగేనా ప్రవర్తించేది? అన్నట్లుగా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కాగా లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన గుజరాత్‌... 18.3 ఓవర్లలో కేవలం 147 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. చదవండి: చ‌రిత్ర సృష్టించిన సునీల్ నరైన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గాpic.twitter.com/8UKU1ibO6o— The Game Changer (@TheGame_26) May 25, 2025

Gaza doctor in ICU his 9 of 10 Children Killed in Israeli Airstrikes5
Gaza: వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలను కోల్పోయి.. ఐసీయూలో చేరిన వైద్యుడు

గాజా: గాజాలో చోటుచేసుకున్న మరో విషాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రెండురోజుల ‍క్రితం గాజాపై ఇ‍జ్రాయెల్‌ జరిపిన సైనికదాడిలో తన తొమ్మిది మంది సంతానాన్ని కోల్పోయిన వైద్యుడు ప్రస్తుతం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్‌(Intensive care)(ఐసీయూ) చికిత్స పొందుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు.గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ అనే వైద్యుడు తన 10 మంది పిల్లలతో పాటు ఖాన్ యూనిస్‌లోని తన ఇంట్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది చిన్నారులు మృతిచెందారు. ప్రాణాలతో బయటపడిన ఒక చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుగున్నాడు. ఇదే దాడిలో గాయపడిన డాక్టర్‌ హమ్ది అల్-నజ్జర్ ప్రస్తుతం దక్షిణ గాజాలోని సమీపంలోని నాజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న అబ్దుల్ అజీజ్ అల్-ఫర్రా మాట్లాడుతూ డాక్టర్‌ నజ్జర్‌కు ఉదరం, ఛాతీలో అవుతున్న రక్తస్రావాన్ని నియంత్రించేందుకు రెండు ఆపరేషన్లు జరిగాయని, అతని తలకు కూడా తీవ్రగాయం అయ్యిదని తెలిపారు.ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) శుక్రవారం ఖాన్ యూనిస్‌పై వైమానిక దాడి చేసినట్లు ధృవీకరించింది. తమ ఆపరేషన్ ప్రారంభించే ముందు సైన్యం ఆ ప్రాంతం నుండి పౌరులను తరలించిందని పేర్కొంది. కాగా నజ్జర్ భార్య కూడా వైద్యురాలు. అయితే ఆమె దాడి సమయంలో ఇంటిలో లేరు. విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి చేరుకుని విగత జీవులుగా పడివున్న తన పిల్లలను చూసి షాకయ్యారు. తరువాత తేరుకున్న ఆమె యుద్ధంలో గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్స అందిస్తున్నారు. 2023 అక్టోబర్‌లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతం ఈ యుద్ధం మొదలయ్యింది. తరువాత ఇజ్రాయెల్‌ హమాస్‌ను నిర్మూలించడం, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడమే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేస్తూ వస్తోంది. ఇది కూడా చదవండి: పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే..

Italy moschino couture Shirt Price In Trending6
రండి బాబు రండి.. ఇంకు మరకల చొక్కా 80,000 మాత్రమే..

పిచ్చి వెధవా.. తెల్లని చొక్కా వేసి బడికి పంపిస్తే మొత్తం ఇంకు మరకలు చేసుకోస్తావా.. బుద్ధి లేదా.. నేను ఇప్పుడు వీటిని ఎలా వదలగొట్టాలి.. ఎన్ని రిన్ సబ్బులు ఎన్ని సర్ఫ్ ప్యాకెట్లు వాడాలో.. ఇప్పుడు మీ నాన్నకు తెలిస్తే ఏమంటాడో.. మళ్ళీ కొత్త చొక్కా కొనాలంటే మాటలా.. తింగరి సన్నాసి అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు అని అమ్మ కొట్టిన రోజులు గుర్తున్నాయా?. బాబూ.. మా అబ్బాయి చొక్కా నిండా ఇంకు మరకలు పడ్డాయి దీన్ని కాస్త వదిలించియేలా గట్టిగా రేవు పెట్టావయ్యా అని చెప్పిన రోజులూ ఉన్నాయి. ఆమ్మో.. ఈ దరిద్రపు పెన్ను మళ్ళీ ఇంకు కక్కేసింది.. దీన్ని నిక్కర్ జేబులో పెట్టుకోకుండా అనవసరంగా తెల్ల చొక్కా జేబులో పెట్టాను.. ఇది మొత్తం షర్ట్ ను ఖరాబ్ చేసింది. ఇంటికెళ్తే అమ్మ ఏం తిడుతుందేమో ఏమిటో అని భయపడిన రోజులున్నాయి అయితే అప్పుడు మరక అన్నదే ఇప్పుడు మురిపెం అయింది. అదికూడా కాస్ట్లీ వ్యవహారం అయింది. మామూళోళ్ళకు దక్కని స్థాయి.ఒకనాడు ప్యాంట్‌కు ఎక్కడైనా కన్నం పడితే .. లేదా ఏ ముళ్లకంపకో.. ఏదైనా ఫెన్సింగ్‌కు గానీ తగులుకుని చినిగిపోతే అయ్యో అనే వాళ్ళం. దాన్ని మళ్ళా టైలర్ దగ్గరకు తీసుకెళ్లి రఫ్ చేయించేవాళ్ళు. కానీ, నేడు ఇప్పుడు జీన్స్‌లో చిరుగుల జీన్స్ (TORN JEANS) పేరిట అధిక ధరలకు కొంటున్నారు.. ఇదేంటి కుర్రోడా అంటే ఇదే ట్రేండింగ్ అంటున్నారు నేటి యూత్. అదే విధంగా ఇప్పుడు చొక్కాల్లో కూడా సరికొత్త మోడల్ వచ్చింది. ఇటలీ దేశానికీ చెందిన moschino couture అనే దుస్తుల కంపెనీ ఏకంగా ఇంకు మరకల చొక్కాను రూపొందించింది. men light blue pen ink leak pocket shirt పేరిట మార్కెట్లోకి దించిన ఈ చొక్కా జేబుల వద్ద సరిగ్గా ఇంకు మరక ఉండేలా డిజైన్ చేశారు.అలా మరక పడిన చొక్కాను సదరు సంస్థ బాగా చవగ్గా అమ్ముతోంది లెండి.. అంటే ఒక్కోటి రూ.80 వేలు మాత్రమే.. చూసారా. ఒకనాడు అయ్యో ఇదేంటి ఇలా అయిపొయింది చొక్కా అనుకునేది ఇప్పుడు మురిపెం అయింది. ఇంకుమరకల చొక్కా ధర చూసి గుండె గుభేల్ మన్నదా.. ఐతే సింపుల్.. ఓ మామూలు తెల్ల షర్ట్ కొనేద్దాం.. మనమే ఇంకు మరక వేసుకుందాం.. ఐదారొందల్లో కొత్త ఫ్యాషన్లోకి మారినట్లు సంబరపడిపోదాం.. -సిమ్మాదిరప్పన్న.

Chiranjeevi Small Interruption On Mega157 Project7
అనిల్‌ రావిపూడి స్పీడ్‌కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?

సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమా ప్రకటన నుంచే అదిరిపోయే ప్రమోషన్స్‌లతో ప్రేక్షకుల అభిరుచిని పట్టేస్తాడు. ఈ క్రమంలో నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్స్‌లో పాల్గొని, నవ్వులు పంచుతూ ఆయా చిత్రాలపై ఆసక్తి రేకెత్తిస్తుంటారు. అలాంటి మ్యాజిక్‌ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మారుమూల ప్రాంతం వారికి కూడా కనెక్ట్‌ అయ్యేలా చేశాడు. అయితే, తాజాగా ఆయన మెగాస్టార్‌ చిరంజీవితో (MEGA157) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌ విషయంలో అనిల్‌ దూకుడుతో అదరగొడుతున్నాడు. అయితే, దానికి కాస్త బ్రేక్‌ ఇవ్వాలని చిరు కోరారట. కావాలంటే కొంత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టమని సూచించారట.అనిల్‌ రావిపూడి స్పీడ్‌కు చిరు బ్రేకులు వేయడం వెనుక కూడా కారణం ఉందని తెలుస్తోంది. చిరు కొత్త సినిమా విశ్వంభర( Vishwambhara) త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ పట్ల మొదట్లో భారీ అంచనాలే ఉండేవి. కానీ, ప్రస్తుతం చిరు అభిమానుల్లో కూడా సినిమాపై అంతగా ఆసక్తి లేదని చెప్పవచ్చు. అనిల్‌ రావిపూడి తన సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్‌ వల్ల విశ్వంభర మీద ప్రభావం పడుతుంది. అందరూ మెగా157 ప్రాజెక్ట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. నయనతారతో ప్రమోషన్స్‌ ఆపై సినిమా షూటింగ్‌ ప్రారంభ సమయంలో చిరు కళ్ళమీద క్లాప్ కొట్టి దాని చిన్న క్లిప్ రూపంలో వదలడం.. ఇలాంటివి అన్నీ మెగా ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నాయి. కానీ, విశ్వంభరపై అలాంటి జోష్‌ కనిపించడం లేదు. అందుకే అనిల్‌ను కాస్త బ్రేక్‌ తీసుకోవాలని చిరు సూచించారట.విశ్వంభర టీజర్ తర్వాత ఎలాంటి పబ్లిసిటీని ఆ మూవీ మేకర్స్‌ చయలేదు. అయితే, ఈ సినిమా దర్శకుడు వశిష్ఠపై ఫ్యాన్స్‌ నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా హిట్‌ అవుతుందని సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రమోషన్స్‌ విషయంలో స్పీడ్‌ పెంచితేనే మార్కెట్‌ పెరిగే ఛాన్స్‌ ఉంటుంది. రీసెంట్‌గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఒక బుక్ లాంచ్ చేసి ఫోటోలు విడుదల చేశారు. కానీ, అందులో ఉన్న సారాంశం ఎంటి..? దాని ప్రత్యేకత ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇలా అయితే ఎలా అంటూ విశ్వంభర ప్రమోషన్స్‌లో వేగం పెరగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. సినిమా విడుదల విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జులైలో విడుదల కావచ్చు అనే టాక్‌ అయితే వస్తుంది.

No annual fee cashback Axis Bank super money credit card8
కొత్త క్రెడిట్‌ కార్డు.. యూపీఐ పేమెంట్లపై క్యాష్‌బ్యాక్‌

ముంబై: యాక్సిస్‌ బ్యాంక్‌ ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌నకు చెందిన క్రెడిట్‌ ఫస్ట్‌ యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ‘సూపర్‌.మనీ’ భాగస్వామ్యంతో కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును విడుదల చేసింది. ‘యాక్సిస్‌ బ్యాంక్‌ సూపర్‌.మనీ రూపే క్రెడిట్‌ కార్డ్‌’ అన్నది రూపే నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. యూపీఐ చెల్లింపులకు, పీవోఎస్‌ టెర్మినళ్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, ఏటీఎంలలో దీన్ని వినియోగించుకోవచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. కార్డు దారులు సూపర్‌.మనీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. దీని సాయంతో స్కాన్‌ చేసి చెల్లింపులు చేస్తే 3 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇతర విభాగాల్లో ఈ కార్డుతో చేసే వ్యయాలపై ఒక శాతం క్యాష్‌ బ్యాంక్‌ లభిస్తుంది. ఎలాంటి వార్షిక ఫీజులు లేకుండా జీవితకాలం ఉచిత సదుపాయంతో ఈ కార్డు లభిస్తుందని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది.

BJP Notice To Gonda chief Amar Kishore Kashyap Over His Viral Video9
పెద్ద సారూ.. పార్టీ ఆఫీసులో ఇదేం పని.. వీడియో వైరల్‌

లక్నో: బీజేపీ సీనియర్‌ నేత ఒకరు పార్టీకి చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లడం ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సదరు నేత స్పందిస్తూ.. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 12న రాత్రి 9.30 గంటల సమయంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్ కిషోర్ కశ్యప్, ఒక మహిళా కార్యకర్తతో కలిసి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళతో కలిసి పై అంతస్తులోని గదిలోకి వెళ్లాడు. బీజేపీ పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో ఇది రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్‌ తాజాగా వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో బామ్ బామ్‌ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.#Gonda: बमबम पर आरोप, पार्टी ने जारी किया नोटिस! क्या पद गंवाएंगे भाजपा जिलाध्यक्ष अमर किशोर कश्यप ? @deepaq_singh @Bhupendraupbjp pic.twitter.com/yKU2OFXYpz— GONDA POST (@gondapost) May 25, 2025మరోవైపు ఈ వైరల్‌ వీడియోపై బీజేపీ నేత అమర్ కిషోర్ కశ్యప్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగడం ఇష్టం లేని వ్యక్తులు పన్నిన కుట్ర ఇది. కొంతమంది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది ఏప్రిల్ 12 తేదీన జరిగింది. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించాను. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈ వీడియో వైరల్‌ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. Gonda BJP Chief Responds to Viral Video: “She Was Unwell, Needed Rest” pic.twitter.com/pVY9o8OKoT— The Times Patriot (@thetimespatriot) May 25, 2025ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అమర్ కిషోర్‌కు పార్టీ హైకమాండ్‌ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా స్పందిస్తూ..‘సోషల్ మీడియాలోని వీడియో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. పార్టీ నేతలకు క్రమశిక్షణ అవసరం. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడం జరిగింది. అనుచితంగా ప్రవర్తించినట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

woman ends life Cherlapalli Railway Station  10
Hyderabad: అత్తగారింటికి వెళ్తూ అనంతలోకాలకు..

సికింద్రాబాద్‌: కన్నపిల్లల కళ్ల ముందే ఓ తల్లి రైలు బోగీ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన ఆదివారం ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌లో విషాదాన్ని నింపింది. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్, శ్వేత (33) దంపతులు. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్‌ తన భార్య శ్వేత, ఇరువురు పిల్లలతో కలిసి లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు పూర్తవుతున్న క్రమంలో కొద్ది రోజులు శ్వేత తన ఇద్దరు పిల్లలతో దొండపూడిలో గడిపి రావాలనుకుంది. ఇందుకోసం భర్త వెంకటేశ్‌ ఆన్‌లైన్‌ టికెట్‌ కొనుగోలు చేశాడు. ఉదయం భార్య, పిల్లలను లింగంపల్లి రైల్వేస్టేషన్‌ తీసుకువచి్చన వెంకటేశ్‌ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కించి డీ3 బోగీలోని సీట్లలో కూర్చోబెట్టాడు. సీట్‌ నంబర్‌ సరిగా ప్రింట్‌ కాకపోవడంతో.. రైలు బయలుదేరిన కొద్ది సేపటి తర్వాత శ్వేత కూర్చున్న సీట్లు తమవని వేరే ప్రయాణికులు వచ్చారు. తన వద్ద ఉన్న టికెట్‌ను మరోసారి సరిచూసుకోగా తన బోగీ డీ8గా గుర్తించింది శ్వేత. రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో 3వ నంబరు బోగీ నుంచి 8వ నంబర్‌ బోగీ వరకు బోగీల మార్గం నుంచి వెళ్లడం సాధ్యం కాలేదు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు నిలపగానే డీ3 బోగీ దిగిన ఆమె తన పిల్లలు, లగేజీతో 8వ నంబర్‌ బోగీ వద్దకు చేరుకుంది. అప్పటికే రైలు కదలడం ప్రారంభమైంది. రైలు బోగీ, ప్లాట్‌ఫాం మధ్య నలిగి.. పిల్లలను, లగేజీని హుటాహుటిన బోగీలోకి ఎక్కించి తాను ఎక్కేందుకు ఉపక్రమిస్తున్న సమయంలోనే రైలు వేగం పుంజుకుంది. దీంతో కాలుజారి కిందపడిన శ్వేత బోగీకి ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలై పట్టాల పక్కన పడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు, పోలీసులు ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న భర్త వెంకటేశ్‌ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆన్‌లైన్‌ టికెట్‌లో ప్రింట్‌ సరిగా పడని కారణంతోనే తన భార్య రైలు ప్రమాదానికి బలైందన్నాడు. శ్వేత మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement