Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Yuvatha Poru: Ys Jagan Tweet On Chandrababu Conspiracies1
చంద్రబాబూ.. తొలి హెచ్చరిక ఇది: వైఎస్‌ జగన్

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుట్రలను ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ‘‘పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.‘‘పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు. నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది.. చంద్రబాబు’’ అని వైఎస్‌ జగన్ పేర్కొన్నారు. ‘‘పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, వసతి దీవెన ద్వారా హాస్టల్‌, మెస్‌ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమచేస్తూ, అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబూ… మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ మీరు తీసుకు వచ్చారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.‘‘2024 జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బును ఏప్రిల్‌లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉంది. అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్‌ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబుగారూ, మీరిచ్చింది కేవలం రూ. 700 కోట్లు. అదికూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు...అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు, అదీ కాక ఈ ఏడాది ఖర్చుచేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు, రెండూ కలిపితే రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చుపెట్టాలి. అయితే ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. దీని అర్థం పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా ? ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబూ....అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అందాక నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలి. కాని, గత ఏడాది బడ్జెట్లో ఒక్కపైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్కపైసా కేటాయించలేదు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ రూ.72వేల చొప్పున బకాయి పడ్డారు. అలాగే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు, పేద విద్యార్థులకు మెడికల్‌ విద్యను దూరం చేస్తున్నారు. ..కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదికూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబూ? ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారికోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ “యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నాను. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్నివర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్ ట్వీట్‌ చేశారు.1. @ncbn గారూ పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని… pic.twitter.com/dn2LslNZzI— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2025

Governor Jishnu Dev Verma Comments On both houses on Budget Session2
దేశానికి దిక్సూచి

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ కేవలం పురోగమించడమే కాకుండా రూపాంతరం చెందుతోంది. సమ్మిళితత్వం, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ అనే విజన్‌.. సాహసోపేత సంస్కరణలు, ప్రజా కేంద్రీకృత సుపరిపాలన, నిర్ణయాత్మక నాయకత్వంతో సాకారమవుతోంది. అన్ని వర్గాల సంక్షేమానికి, సుస్థిర పురోగతికి ప్రభుత్వం బాటలు వేస్తోంది సమానత్వం, పురోగతిలో దేశానికి దిక్సూచి అయ్యే తెలంగాణ నిర్మాణానికి సంఘటితంగా, విశ్వాసంతో, స్థిరమైన నిబద్ధతతో అందరం కలిసి ముందుకు సాగుదాం..’ అని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పిలుపునిచ్చారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఉదయం ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు, లక్ష్యాలు, ప్రభుత్వ విజయాలను వివరించారు. గవర్నర్‌ మాట్లాడుతున్నంతసేపు ప్రధాన ప్రతిపక్ష సభ్యులు నిరసన నినాదాలు చేస్తూనే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ చేయి చూపటం ద్వారా పలుమార్లు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు గవర్నర్‌ కీలకాంశాలను ప్రస్తావించినప్పుడల్లా..అధికార పక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం ప్రకటించారు. గవర్నర్‌ 35 నిమిషాల పాటు ఆంగ్లంలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి రైతాంగమే ప్రాణం ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కలలుగన్న దిశలో పురోగమించేందుకు అవసరమైన అవకాశాలను కల్పించే నిబద్ధతకు అద్దం పట్టేదిగా ఈ బడ్జెట్‌ సమావేశం ఉండనుంది. తెలంగాణ రాష్ట్రానికి రైతాంగమే ప్రాణం. మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేందుకు వారి కృషే కీలకం. అలాంటి రైతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. తొలుత హామీ ఇచ్చినట్టుగా రూ.2 లక్షలు చొప్పున పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రూ.20,616.89 కోట్ల మొత్తంతో 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమిలేని వ్యవసాయ కార్మీకులకు ఎన్నడూ లేని విధంగా సహాయం చేస్తూ ఏడాదికి రూ.12 వేలను సమకూరుస్తోంది. 566 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. 260 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడితో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించింది. సన్న రకం వరి ధాన్యానికి కింటాల్‌కు రూ.500ల బోనస్‌ చొప్పున రూ.1,206.44 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌­ను ఏర్పాటు చేసింది..’ అని గవర్నర్‌ చెప్పారు. గేమ్‌ ఛేంజర్‌గా మహాలక్ష్మి పథకం ‘బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన మహాలక్ష్మి పథకం గేమ్‌ ఛేంజర్‌గా మారింది. ఇప్పటివరకు మహిళలకు రూ.5,005.95 కోట్లు ఆదా చేసింది. ఇటీవలే ఆమోదించిన ఇందిరా మహిళాశక్తి మిషన్‌ పాలసీ ద్వారా రూ.లక్ష కోట్ల ఆర్థిక సాయ లక్ష్యంతో లక్షమంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తయారు చేస్తోంది. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తోంది. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్‌ అందిస్తోంది. మహిళా సంఘాలకు 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులను కేటాయించింది. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాదిలో 55 వేల మంది ప్రభుత్వోద్యోగాలు పొందారు. ఇది ఎన్నడూ సాధించని విజయం. ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేయడానికి యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సమీకృత గురుకులాల ప్రారంభంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధమవుతోంది. పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి రంగారెడ్డి జిల్లాలో యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ను ఏర్పాటు చేస్తోంది..’ అని గవర్నర్‌ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు, ఎస్సీ వర్గీకరణకు బిల్లులు ‘రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించడం ద్వారా ప్రభుత్వం సాహసోపేత మార్పు దిశగా ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయాన్ని అందించే దిశగా వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక బిల్లును ప్రతిపాదించింది. షెడ్యూల్డు కులాల ఉప వర్గీకరణ కోసం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. అత్యంత అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ కులాలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలను మరింత న్యాయోచితంగా, సమతుల్యంగా అందించడమే దీని ఉద్దేశం..’ అని జిష్ణుదేవ్‌ వర్మ తెలిపారు. దావోస్‌­లో ‘తెలంగాణ రైజింగ్‌’ ‘దావోస్‌­లో తెలంగాణ రైజింగ్‌ డెలిగేషన్‌ 49,500 మందికి ఉద్యోగాలను కల్పించేలా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగేలా పర్యాటక రంగాన్ని ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి చేయనుంది. ఇందుకు ప్రత్యేక పర్యాటక విధానాన్ని సిద్ధం చేసింది. భూ పరిపాలనను క్రమబదీ్ధకరించడానికి, పౌరులందరికీ భూ భద్రతను కల్పించడానికి, భూ వివాదాలను తగ్గించడానికి, భూ రికార్డులలో పారదర్శకతను పెంపొందించడానికి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. సుస్థిర ప్రపంచ శ్రేణి నగర నిర్మాణం కోసం ప్యూచర్‌ సిటీ డెవలప్‌­మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది..’ అని గవర్నర్‌ చెప్పారు. ప్రతి కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు ‘బడ్జెట్‌ కేవలం అంకెల కూర్పు కాదు. ప్రభుత్వ భవిష్యత్తు ప్రాధాన్యతలు, విజన్‌­కు ప్రతిబింబం. మన పాలసీలను, కార్యక్రమాలను, సంక్షేమ చర్యలను తెలియజేసే ఒక ఆర్థిక నమూనా. కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ, ప్రతి కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు ఉంటాయని గుర్తించాలి. యువ, డైనమిక్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సంకల్పం దృఢమైంది. ప్రవేశపెట్టిన ప్రతి పాలసీ, ప్రతి కార్యక్రమం, ప్రతి సంస్కరణ ప్రజల సాధికారతకు, సమ్మిళిత వృద్ధి కోసం ఉద్దేశించిందే. ప్రస్తుత తెలంగాణ అవకాశాలు, అభివృద్ధి, సాధికారతగల రాష్ట్రంగా ఉంది. రేపటి తెలంగాణ మరింత ఉజ్వలంగా, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞాన వినూత్నత, సామాజిక న్యాయంలో అగ్రగామిగా నిలవబోతోంది. డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ అన్నట్లు ‘‘కలలు కనండి, కలలు ఆలోచనలుగా మారుతాయి, ఆ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి’’. ప్రజల కలలను ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది, విజన్, సంకల్పం, కార్యాచరణ ద్వారా వాటిని వాస్తవాలుగా మారుస్తుంది..’ అని గవర్నర్‌ చెప్పారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేయడాన్ని, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు తదితర అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.

Cid Produced Posani Krishna Murali Before The Magistrate3
మేజిస్ట్రేట్‌ ముందు కన్నీరు పెట్టుకున్న పోసాని

సాక్షి, గుంటూరు: పోసాని కృష్ణమురళిని మేజిస్ట్రేట్‌ ముందు సీఐడీ హాజరుపరిచింది. మేజిస్ట్రేట్‌ ముందు పోసాని కన్నీరు పెట్టుకున్నారు. మేజిస్ట్రేట్‌ ముందే న్యాయవాదులతో​ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నన్ను లోకేష్‌ పార్టీలోకి రమ్మన్నారు.. రానన్నా. నాకు నార్కో ఎనాలసిస్‌ టెస్ట్‌ చేయండి. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు పెడతారా?. నా మీద ఎ‍ని కేసులు పెట్టారో నాకే తెలియదు’’ అంటూ పోసాని వాపోయారు.‘‘నన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో నాకు బెయిల్‌ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్‌ మరో కుట్రకు తెరతీసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ బాపట్ల పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను తెనాలి కోర్టు అనుమతించింది.కాగా, పోసాని కృష్ణమురళిపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్‌ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్ట్‌ పెట్టారంటూ పోసానిపై మరో కేసు తెరపైకి తెచ్చారు.పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకుగానూ ఆయన అరెస్ట్‌ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూ ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్‌ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.. తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచా­రణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనా­యించింది. 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి.

Sakshi Editorial On Balochistan, Pakistan issues4
నెత్తురోడుతున్న బలూచిస్తాన్‌

ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలను ఉక్కుపాదంతో అణచాలని చూస్తే... దాని అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అక్కడి వనరులను పీల్చిపిప్పి చేస్తే... ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రూపంలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడతాయి. విభజనానంతరం పాకిస్తాన్‌ ఒక దేశంగా ఏర్పడినప్పుడు అందులో విలీనం కాకుండా తాము స్వతంత్రంగా ఉంటామని కరాత్‌ సంస్థానం ప్రకటించినప్పుడు నూతన పాలకులు ససేమిరా అంగీకరించలేదు. అక్కడి వనరులపై కన్నేసిన పాలకులు ఆ సంస్థానాన్ని నమ్మించి, స్నేహ ఒడంబడిక కుదుర్చుకుని చివరకు దాన్ని బుట్టదాఖలా చేశారు. ఈ ద్రోహం వెనక పాక్‌ జాతిపిత మహమ్మదాలీ జిన్నాతోసహా పలువురున్నారు. దాని పర్యవసానాలు ఈ ఏడున్నర దశాబ్దాలుగా ఆ దేశం అనుభవిస్తూనే ఉంది. క్వెట్టానుంచి పెషావర్‌ వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) మిలిటెంట్లు హైజాక్‌ చేసి వందలమందిని అపహ రించుకు పోవటం, కొందరిని హతమార్చటం ఆ వరసలో మరో చర్య. బుధవారం భద్రతా దళాలను రంగంలోకి దింపి దాదాపు 200 మంది ప్రయాణికులను విడిపించినట్టు చెబుతున్నారు.ఇందుకు ప్రతిగా 50 మంది బందీలను మిలిటెంట్లు హతమార్చగా, ఆ తర్వాత మిలిటెంట్లందరినీ పాక్‌ సైన్యం మట్టుబెట్టిందంటున్నారు. ఇలా నిత్యం నెత్తురోడుతున్న బలూచిస్తాన్‌ భౌగోళికంగా పాకిస్తాన్‌లోనే ఉన్నా, అక్కడివారు తమను తాము పాకిస్తానీలుగా పరిగణించుకోరు. ఒకనాడు సాధారణ సమస్యల కోసం ఉద్యమించినవారు ఇప్పుడు స్వాతంత్య్రాన్ని కోరుకునేదాకా వచ్చారు. పాక్‌ పాలకుల నిర్వాకమే ఇందుకు కారణం.బలూచిస్తాన్‌ సాధారణ ప్రాంతం కాదు. ఇక్కడి భూమిలో బంగారం, వజ్రాలు, వెండి, రాగి వనరులు నిక్షిప్తమైవున్నాయి. దేశ వర్తక, వాణిజ్యాలను అత్యున్నత స్థాయికి తీసుకుపోగల డీప్‌ సీ పోర్టు ఉన్న గ్వాదర్‌ కూడా ఇక్కడిదే. 2002లో ఈ ఓడరేవు తొలి దశలో కొంత భాగాన్ని పూర్తిచేసి ఆదరాబాదరాగా ప్రారంభించారు. కానీ ఆ తర్వాత పనులు పడకేశాయి. దీన్ని నిర్మిస్తున్న చైనా... స్థానికులకు నామమాత్రం అవకాశాలిచ్చింది. ఇది బలూచి వాసుల అసంతృప్తిని మరిన్ని రెట్లు పెంచింది. భౌగోళికంగా వైశాల్యంలో ఫ్రాన్స్‌ను పోలివుండే ఈ ప్రాంత జనాభా కేవలం 90 లక్షలు. ఇంత తక్కువ జనాభాతో, అపరిమితమైన వనరులతో ఉండే ఈ బలూచిస్తాన్‌ గత 77 ఏళ్లలో వాస్తవానికి అద్భుతమైన ప్రగతి సాధించివుండాలి. కానీ విషాదమేమంటే ఇక్కడున్న 70 శాతం మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతుంటారు. వారికి ఉపాధి అవకాశాలుండవు. వేరేచోటకు వెళ్లి స్థిరపడేంత చదువుసంధ్యలుండవు. సైనిక దళాల్లో సైతం బలూచిస్తాన్‌ వాసులకు మొండిచేయి చూపారు. వారిపై పాక్‌ సైన్యాధికారుల్లో వున్న అపనమ్మకమూ, భయాందోళనలే అందుకు కారణం. తెలివైన పాలకులైతే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తినిచ్చి, దాని అభివృద్ధికి బాటలు పరిచే వారు. కానీ పాకిస్తాన్‌ పాలకులు అణచివేతే పరిష్కారం అనుకున్నారు. సైనిక పదఘట్టనలతో అది పాదాక్రాంతం అవుతుందనుకున్నారు. బలూచిస్తాన్‌లో తరచు మిలిటెంట్‌ దాడులకు పాల్పడే బీఎల్‌ఏ 2000 సంవత్సరంలో ఏర్పడినా అంతకు చాలాముందునుంచే ఉద్యమకారులను అపహరించి మాయం చేయటం, బూటకపు ఎన్‌ కౌంటర్లలో వారిని హతమార్చటం పాక్‌ సైన్యం ఒక పద్ధతిగా కొనసాగించింది. 2011 నుంచి లెక్కేసినా దాదాపు 10,000 మంది అదృశ్యమయ్యారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అంటున్నది. బీఎల్‌ఏ సైతం అదే మార్గం ఎంచుకుంది. మొదట్లో చెదురు మదురు ఘటనలకే పరిమితమైన ఆ సంస్థ ఇటీవలి కాలంలో భారీ దాడులకు పాల్పడుతోంది. బీఎల్‌ఏ కారణంగా చైనా–పాకిస్తాన్‌ కారిడార్‌ (సీపీఈసీ) అటకెక్కేలావుంది. చైనా ఖండాంతర ప్రాజెక్టు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌(బీఆర్‌ఐ)లో సీపీఈసీ కీలకమైనది. కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారులనూ, ఇతర మౌలిక సదుపాయాలనూ బీఎల్‌ఏ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయటం ఇందుకే. 6,500 కోట్ల డాలర్ల విలువైన సీపీఈసీలో ఇంధనం, రవాణా, పారిశ్రా మిక కారిడార్లూ, గ్వాదర్‌ పోర్టు వగైరాలున్నాయి. స్థానికులకు అవకాశాలీయకుండా ఇంత పెద్ద నిర్మాణాన్ని తలకెత్తుకుంటే అసంతృప్తి రాజుకుంటుందన్న ఇంగితజ్ఞానం పాలకులకు కొరవడింది. బలూచిస్తాన్‌ వాసుల డిమాండ్లు ధర్మమైనవి. కానీ అందుకు హింసాత్మక మార్గాన్ని ఎంచు కోవటంవల్ల న్యాయమైన సమస్య మరుగున పడుతుంది. బలూచిస్తాన్‌లో జాతి, మత, తెగ, రాజకీయ విశ్వాసాలతో నిమిత్తం లేకుండా మానవ హక్కుల కోసం పోరాడే బలూచ్‌ యక్‌జహితీ కమిటీ (బీవైసీ) 2019 నుంచీ పనిచేస్తోంది. ఆ సంస్థ నాయకురాలు డాక్టర్‌ మెహ్రాంగ్‌ బలూచ్‌కు అన్ని వర్గాల నుంచీ అపారమైన ఆదరణ వుంది. పాక్‌ సైన్యం ఆగడాల కారణంగా తండ్రి అదృశ్యం కావటం, చాన్నాళ్ల తర్వాత ఛిద్రమైన ఆయన మృతదేహం లభ్యం కావటం ఆమె పట్టుదలను మరింత పెంచాయి. నిరుడు ఆగస్టులో డాక్టర్‌ మెహ్రాంగ్‌ గ్వాదర్‌లో తలపెట్టిన ర్యాలీయే దీనికి రుజువు. సైన్యం ఎన్ని అడ్డంకులు కల్పించినా అది విజయవంతమైంది. శాంతియుతంగా జరిగిన ఆ ర్యాలీలో పాల్గొన్నారన్న కక్షతో డజన్లకొద్దీమందిని అరెస్టు చేస్తే దానికి నిరసనగా 12 రోజుల పాటు ధర్నా సాగించి వారిని విడిపించుకున్న చరిత్ర బీవైసీది. అణచివేత ధిక్కారానికి దారి తీస్తుంది. దాన్ని ఉపేక్షిస్తే తిరుగుబాటుకు బాటలు పరుస్తుంది. ప్రజల మౌలిక ఆకాంక్షలను బేఖాతరు చేస్తే ఎంత శక్తిమంతమైన రాజ్యానికైనా భంగపాటు తప్పదు. బలూచిస్తాన్‌ ప్రజలు దాన్నే చాటుతున్నారు.

Ap High Court Issues Key Order To Ttd On Unauthorised Construction In Tirumala5
ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.. టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు

సాక్షి, అమరావతి: తిరుమలలో నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పలు మఠాలు నిర్మాణాలు చేపట్టాయని.. వాటిపై చర్యలు తీసుకునేలా అధికారులు ఆదేశించాలంటూ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం.. హైకోర్టు విచారణ జరిపింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హైకోర్టు హెచ్చరించింది.ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి హైకోర్టు తేల్చి చెప్పింది. తిరుమలలో నిర్మాణాలను ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత తిరుమల అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు వార్నింగ్‌ ఇచ్చింది. తిరుమలలో ధార్మిక సంస్థలు, మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించామని పేర్కొన్న హైకోర్టు.. తిరుమలలో నిర్మాణాలు చేసిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్ జనరల్‌కు నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 7 తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Forbes Asian Billionaires 2025 Top 10 richest Asians India claims two spots6
కొత్త కుబేరులు.. ఆసియా బిలియనీర్స్‌ లేటెస్ట్‌ లిస్ట్‌

ఆసియాలో కొత్త కుబేరులు అవతరించారు. ఫోర్బ్స్‌ ఏషియన్‌ బిలియనీర్స్‌ 2025 తాజా ర్యాంకింగ్స్‌ విడుదలయ్యాయి. 2024లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌తో పోలిస్తే 2025లో (మార్చి నాటికి) ఆసియా బిలియనీర్లు అపూర్వ సంపదను ఆర్జించగా, ఈ ఏడాది టాప్ 10 ఆసియా బిలియనీర్ల జాబితాలో ఇండోనేషియాకు చెందిన ప్రజోగో పంగేస్తు, భారత్‌కు చెందిన సావిత్రి జిందాల్ వంటి ప్రముఖులు చోటు కోల్పోయారు. 2025 ఆసియా బిలియనీర్ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నిలిచారు. ఆయన తరువాత ప్రసిద్ధ బాటిల్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ప్రింగ్ యజమాని జోంగ్ షాన్షాన్ ఆసియాలో రెండవ ధనవంతుడిగా, చైనాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ సరఫరా సంస్థ కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీని (సీఏటీఎల్) నడిపించే రాబిన్ జెంగ్, చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమీ సహ వ్యవస్థాపకుడు లీ జున్ 2025 ఆసియా రిచెస్ట్ లిస్ట్‌లో కొత్తగా చేరారు.యునిక్లో, థియరీ, జె బ్రాండ్ వంటి పోర్ట్‌ఫోలియో బ్రాండ్లతో 25 దేశాలలో 2,400 పైగా స్టోర్లతో బలమైన ఉనికిని కలిగి ఉన్న ప్రముఖ జపనీస్ రిటైల్ కంపెనీ ఫాస్ట్ రిటైలింగ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ తడాషి యానాయ్ ఒక్కరే జపాన్ నుండి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక బిలియనీర్‌.ఆసియాలో టాప్ 10 ధనవంతులు (2025 మార్చి నాటికి )1 ముఖేష్ అంబానీ - 86.9 బి.డాలర్లు - భారత్‌2 జోంగ్ షాన్షాన్ - 56.0 బి.డాలర్లు - చైనా3 గౌతమ్ అదానీ 54.7 బి.డాలర్లు - భారత్‌4 మా హుటెంగ్ 53.3బి.డాలర్లు - చైనా5 జాంగ్ యిమింగ్ 45.6 బి.డాలర్లు - చైనా 6 తడాషి యానై & ఫ్యామిలీ 45.1 బి.డాలర్లు - జపాన్ 7 లీ జున్ 42.6 బి.డాలర్లు - చైనా 8 కొలిన్ హువాంగ్ 40.0 బి.డాలర్లు - చైనా 9 లీ కా-షింగ్ 38.3 బి.డాలర్లు - హాంగ్ కాంగ్ 10 రాబిన్ జెంగ్ 37.6 బి.డాలర్లు - హాంగ్ కాంగ్

We are not able to defeat D Teams: Former Star Lashes out at Pak After CT 20257
ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాం: పాక్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్‌

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌(Kamran Akmal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం ‘డి’ స్థాయి జట్లపై కూడా తమ ప్రధాన జట్టు గెలవలేకపోతోందని.. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని మండిపడ్డాడు. టీమిండియా, న్యూజిలాండ్‌ లాంటి జట్లను చూసి రిజ్వాన్‌ బృందం నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డాడు. ఒక్క విజయం లేకుండానేఇతర దేశాల్లో ప్రతిభ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తే.. పాక్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం ఇందుకు విరుద్ధమని కమ్రాన్‌ అక్మల్‌ విమర్శించాడు. కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో పాక్‌ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిస్తూ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. కనీసం ఒక్క విజయం లేకుండానే వెనుదిరిగింది.గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌, టీమిండియా(Team India) చేతుల్లో ఓడిన రిజ్వాన్‌ బృందం.. ఆఖరిగా బంగ్లాదేశ్‌పై అయినా గెలవాలని ఉవ్విళ్లూరింది. అయితే, వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ రద్దు కావడంతో పాకిస్తాన్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో గెలుపున్నదే లేకుండా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో పాక్‌ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాంఈ క్రమంలో మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ మాట్లాడుతూ... ‘‘మా దేశానికి వచ్చిన ‘డి’ స్థాయి(చిన్న జట్లను అన్న ఉద్దేశంలో) జట్లను కూడా పాకిస్తాన్‌ తమ పూర్తి స్థాయి జట్టుతో ఓడించలేకపోయింది. మన జట్టు బాగా ఆడి గెలిస్తేనే గౌరవం, మర్యాద ఉంటాయి’’ అని రిజ్వాన్‌ బృందం ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘టీమిండియా వరుసగా ఐసీసీ ఈవెంట్లు గెలుస్తోంది. న్యూజిలాండ్‌ కూడా అద్భుతంగా ఆడుతోంది. ఒక్క సిరీస్‌ ఓడిపోగానే ఆ జట్ల బోర్డులు మార్పులు చేసుకుంటూ వెళ్లవు. మరింత ఉత్సాహంతో తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపుతాయి. వాళ్లు మళ్లీ గెలుపుబాట పట్టేలా చేస్తాయి.కానీ మన పరిస్థితి వేరు. ఒక్కటి ఓడితే.. వరుసగా ఇక పరాజయాలే. చాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించడం వల్ల మనకు ఎంత డబ్బు వచ్చిందనేదే మనకు ప్రధానం. కానీ ఆటలో గెలవాలి. గౌరవప్రదంగా ముందుకు వెళ్లాలని మాత్రం ఉండదు’’ అంటూ కమ్రాన్‌ అక్మల్‌ పాక్‌ బోర్డు తీరును కూడా తప్పుబట్టాడు.పాక్‌ క్రికెట్‌ ‘ఐసీయూ’లో ఉందిఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఇటీవలి ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ప్లేయర్‌ షాహిద్‌ అఫ్రిది కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తప్పుడు నిర్ణయాల వల్ల ప్రస్తుతం జట్టు పరిస్థితి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)లో ఉందని అతను ఘాటుగా వ్యాఖ్యానించాడు. శస్త్రచికిత్స చేసి కోలుకునే పరిస్థితి నుంచి కూడా ఇప్పుడు చేయిదాటిపోయిందని అతను అన్నాడు. ముఖ్యంగా జట్టులో షాదాబ్‌ ఖాన్‌ ఎంపికను అతను తీవ్రంగా విమర్శించాడు.గత టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన షాదాబ్‌ను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయడంతో పాటు వైస్‌ కెప్టెన్‌గా కూడా నియమించారు. ‘ఏ ప్రాతిపదికన షాదాబ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీలో అతను ఏమాత్రం ప్రదర్శన ఇచ్చాడని ఎంపిక చేశారు.టోర్నీకి ముందు అంతా సన్నాహకాల గురించి మాట్లాడతారు. చిత్తుగా ఓడిపోగానే శస్త్రచికిత్స అవసరమంటారు. ఇప్పుడు అది కూడా సాధ్యం కాదు. పాక్‌ క్రికెట్‌ ఐసీయూలోకి చేరింది. బోర్డు విధానాలు, నిర్ణయాల్లో నిలకడ లేదు. కెప్టెన్లు, కోచ్‌లను మార్చడం తప్ప బోర్డు అధికారులకు జవాబుదారీతనం లేదు. వాళ్ల ఉద్యోగాలు కాపాడుకోవడానికి అంతా ఆటగాళ్లను బలి పశువులను చేస్తారు’ అని అఫ్రిది అభిప్రాయ పడ్డాడు. చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్‌ ముగిసినట్లే: కివీస్‌ మాజీ పేసర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

A Takeoff How Telugu Actress Soundarya Died In 20048
సౌందర్య మరణం.. ఆ రోజు ఏం జరిగింది?

అందం, అభినయం..ఈ రెండు కలిస్తే సౌందర్య. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో సౌందర్య ఒకరు. దశాబ్దానికి పైగా హీరోలతో సమానంగా క్రేజీ సొంతం చేసుకున్న ఈ విలక్షణ నటి.. చిన్న వయసులోనే అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. 2004లో ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై పేలి పోయింది. ఈ ప్రమాదంలో సౌందర్య(32)తో పాటు ఆమె సోదరుడు కూడా మృతి చెందారు. ఈ ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు సౌందర్య మరణంపై పుకార్లు వచ్చాయి. ఆమె మరణం వెనుక సీనియర్‌ హీరో మోహన్‌ బాబు ఉన్నారంటూ ఓ వ్యక్తి లేఖ రాయడంతో మరోసారి సౌందర్య పేరు నెట్టింట వైరల్‌గా మారింది. అసలు సౌందర్య ఎలా చనిపోయింది? ఆ రోజు ఏం జరిగింది?→ 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం గం.1:14 నిమిషాలకు బెంగళూరులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. ఆమెతో పాటు అన్నయ్య అమర్ కూడా నేలరాలి పోయారు. అప్పటికామెకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రఘుతో పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు. → కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సపోర్ట్‌గా ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్‌ 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ హెలికాఫ్టర్‌ను కొద్దిగా ఎడమ వైపు తిప్పాడు. అంతే..ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాఫ్టర్‌లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇదంతా జరిగింది. → ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. ప్రమాదం జరిగిన సమయానికి సౌందర్య గర్భంతో ఉంది. మంటలు భారీగా చెలరేగడంతో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఎవరి శరీర భాగాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. → సౌందర్య మరణించి 20 ఏళ్లు దాటినా అభిమానులు ఇప్పటికీ ఆమెను మర్చిపోవడం లేదు. కాగా, ఆమె మరణంపై వస్తున్న పుకార్లపై భర్త రఘు స్పందించారు. మోహన్‌ బాబుతో తమకు ఎలాంటి గొడవల్లేవని, ఆస్తు వివాదాలు అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. (చదవండి: మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవల్లేవు: సౌందర్య భర్త)

Madras High Court Ruled Tamil Proficiency Mandatory For Government Jobs9
Madras High Court : మాతృభాషలో చదవడం, రాయడం వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం..

చెన్నై: జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ కీలక వ్యాఖ్యాలు చేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి తప్పని సరిగా తమిళంలో చదవడం, రాయడం వ‌చ్చి ఉండాల‌నే అభిప్రాయం వ్యక్తం చేసింది. తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB)లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాలంటే తప్పని సరిగా తమిళ భాష పరీక్ష (Tamil Language Test)లో తప్పని సరిగా ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే ఉద్యోగానికి అనర్హులు. టీఎన్ఈబీ నిర్వ‌హించిన త‌మిళ లాంగ్వేజ్ టెస్టులో ఫెయిలైన అభ్య‌ర్థి ఇదే అంశాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్‌పై విచార‌ణ స‌మ‌యంలో హైకోర్టు కోర్టు ధ‌ర్మాస‌నం తమిళ మాతృభాష గురించి ప్రస్తావించింది.త‌మిళ‌నాడు రాష్ట్రం తేని జిల్లాకు చెందిన జే.జైకుమార్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగి. అయితే జైకుమార్ రెండేళ్ల‌లో త‌మిళ లాంగ్వేజ్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సింది. కానీ పాస‌వ్వ‌లేదు. దీంతో విద్యుత్ శాఖ అత‌న్ని విధుల నుంచి తొల‌గించింది. త‌మిళ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఫెయిల్ కావ‌డంతో ప్ర‌భుత్వ ఉద్యోగం కోల్పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ త‌మిళ‌నాడు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తన తండ్రి నావల్ సర్వీస్‌లో పని చేయడం వల్ల తాను సీబీఎస్‌ఈ స్కూల్లో చదివానని, అందువల్ల తాను తమిళం నేర్చుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిష‌న్‌పై జి జయచంద్రన్, ఆర్ పూర్ణిమా ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ‌లో భాగంగా పిటిష‌న‌ర్‌కు మాతృభాష తమిళం రాకపోవడంపై పిటిషనర్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమిళం రాకుండా ఎలా పని చేయగలరు? రోజువారి పనులను ఎలా చేస్తారు? ఏ రాష్ట్రంలోనైనా, ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర భాష తెలియాలి. అలా లేనిపక్షంలో ఉద్యోగాలు ఎలా చేస్తారు?’అని బెంచ్ వ్యాఖ్యానించింది.అభ్యర్థులు ప్రభుత్వ భాష పరీక్షను నిర్ణీత సమయంలో పాసవాలని, తమిళ భాష నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అనంతరం, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసును ఆరువారాల పాటు వాయిదా వేసింది.

Do You Know Sobhita Dhulipala First Crush was Not Naga Chaitanya10
శోభిత మొదట ప్రేమించింది నాగచైతన్యను కాదు.. ఎవర్నో తెలుసా?

నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala).. కొంతకాలంపాటు దాగుడుమూతలు ఆడారు. డేటింగ్‌ గురించి ప్రశ్నలొస్తే.. ప్రేమాగీమా ఏదీ లేదనేది శోభిత. చై అయితే అసలు స్పందించేవాడే కాదు. మీరు చెప్పకపోయినా మాకు తెలుసులే అన్నట్లుగా అక్కినేని అభిమానులు ఈ జంట గాఢమైన ప్రేమలో ఉందని తేల్చేశారు. అది నిజమేనంటూ 2024 డిసెంబర్‌లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.అతడిపై మనసు పారేసుకున్న శోభితఅప్పటికే నాగచైతన్య.. గతంలో సమంతను ప్రేమించి పెళ్లిచేసుకోగా ఆమెకు విడాకులిచ్చేశాడు. శోభితకు మాత్రం ఇదే తొలి వివాహం. అయితే చై కంటే ముందు ఆమె వేరే వ్యక్తిపై మనసు పారేసుకున్న విషయం మీకు తెలుసా? గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్‌లో ఓ అబ్బాయిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ వెధవ నన్నసలు పట్టించుకునేవాడే కాదు. అతడి గురించే ప్రత్యేకంగా..అతడి ప్రవర్తన చూసి నాకు బాధేసేది. అప్పుడు వ్యాసరచన వంటి కొన్ని అంశాల్లో ఎక్కువ ఫోకస్‌ చేశాను. అందులో టాప్‌ వస్తేనైనా నన్ను చూస్తాడేమోనని! కానీ అలా ప్రయత్నించే క్రమంలో నేను చాలా మారిపోయాను. అతడి గురించి పట్టించుకోవడం మానేశాను. కొంచెం పరిపక్వత చెందాను.సినిమా..కాలేజీలో నాకు లవ్‌ ప్రపోజల్స్‌ వచ్చేవి. నేను కూడా కొన్ని లెటర్స్‌ రాశాను. అయితే అబ్బాయిల విషయంలో నా టేస్ట్‌ అస్సలు బాగుండేది కాదు అని పేర్కొంది. గూఢచారి, మేజర్‌, కల్కి 2898 ఏడీ సినిమాలతో తెలుగులో మెప్పించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించింది. ప్రస్తుతం గూఢచారి 2 మూవీలో నటిస్తోంది.చదవండి: సౌందర్య మరణం.. ఆ రోజు ఏం జరిగింది?హనీరోజ్‌ అమాయకురాలేం కాదు.. దేనికైనా లిమిట్‌ ఉంటుంది: నటి ఫైర్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
Madras High Court : మాతృభాషలో చదవడం, రాయడం వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం..

చెన్నై: జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్ర

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆర్టీఐ సమాచారంలో షాకింగ్‌ లెక్కలు

సాక్షి ముంబై: రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో జరిగిన వివిధ రోడ్డు

title
Haryana: కాంగ్రెస్‌కు ఘోర పరాభవం

ఛండీగఢ్‌: హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ పార్

title
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన న‌గ‌రం మ‌న‌దే!

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో కిటకిటలాడుతున్న మన దేశం కాలుష్య నగరాల జాబితాలోనూ టాప్‌లో ఉంది.

International View all
title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
ఇండియాకు వెళ్తా: అమెరికా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌

వాషింగ్టన్‌: అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తులసీ గబ్బార్డ్‌ (Tulsi Gabbard) త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు.

title
పీఐఏను మరోసారి అమ్మ‌కానికి పెట్టిన పాకిస్తాన్‌

ఇస్లామాబాద్‌: ప్రభుత్వం ఆధీనంలోని పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)ను పాక్‌ ప్రభుత్వం మరోసారి విక్రయానికి పె

title
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఎదురుదెబ్బ

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఎదురుదెబ్బ తగిల

title
పాక్‌ రైలు హైజాక్‌.. కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్‌

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్‌ మ

NRI View all
title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

Advertisement

వీడియోలు

Advertisement