Top Stories
ప్రధాన వార్తలు

కూటమి దౌర్జన్యాలకు తెర.. తిరిగింది ఫ్యాన్ గిరగిర
సాక్షి నెట్వర్క్: అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డంకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తన హవాను చాటుకుంది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడినా చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు. పలు చోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైనా ఎంపీటీసీ/జెడ్పీటీసీ/వార్డు సభ్యులు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, మద్దతుదారుల పక్షానే నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు. తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసినా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్సార్సీపీ జెండాను గట్టిగా పట్టుకుని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక జడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్‌ఎంపీపీ, 8 కో ఆప్షన్ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి 50 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా, 40 స్థానాల్లో (ఇందులో ఒక వైస్ ఎంపీపీ రెబల్) వైఎస్సార్సీపీ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ, రెండు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ.. ప్రలోభాలతో గట్టెక్కారు. 7 స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. 210 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 184 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక పూర్తయింది. వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండటం వల్ల 16 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక రద్దయింది. మరో పది పంచాయతీల్ల్లో ఉప సర్పంచు ఎన్నిక వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు. దౌర్జన్యకాండ.. వైఎస్సార్ జిల్లా గోపవరంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ జెడ్పీ పీఠంపై ఫ్యాన్ రెపరెపలు వైఎస్సార్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ డిక్లరేషన్ అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 10 గంటలకు సహాయ ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని మాత్రమే జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించడం, బలపర్చడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు. ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులను టీడీపీ నేతలు బలవంతంగా, ప్రలోభాలతో ఆ పారీ్టలోకి లాక్కున్నారు. ఈ లెక్కన వైఎస్సార్సీపీకి నికరంగా 42 సభ్యుల మద్దతు ఉండగా, వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి మాతృమూర్తి వియోగంతో ఎన్నికకు హాజరు కాలేకపోయారు. దీంతో 41 మంది జెడ్పీటీసీ సభ్యులు రామగోవిందురెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాడులకు తెగబడ్డ టీడీపీ శ్రేణులు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులకు తెగించారు. రెండు కార్లలో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 14 మంది వార్డు సభ్యులు రాగా, గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పోలీసులు వారిని నిలిపేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడంతో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి కారు దిగబోయాడు. అంతలోనే వందల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కారు వద్దకు వచ్చి అతడిపై దాడి చేస్తూ ఈడ్చుకెళ్లారు. తర్వాత ఆయన అక్కడి నుంచి తప్పించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చేరుకున్నారు. కానీ మిగిలిన వార్డు సభ్యులు కారులోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ నేతలు కారు అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో వాహన డ్రైవర్‌తో పాటు వార్డు మెంబర్లకు గాయాలయ్యాయి. పంచాయతీ కార్యాలయంలోకి చొరబడిన టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, తోట మహేశ్వరరెడ్డి, వంగనూరు మురళీధర్‌రెడ్డి, చీమల రాజశేఖరరెడ్డి, గంటా వెంకటేశ్వర్లు, బొగ్గుల సుబ్బారెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఎన్నిక జరుగుతున్న కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేశారు. ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి కోరం తప్పకుండా ఉండాలని చెప్పడంతో టీడీపీ నాయకులు 10వ వార్డు మెంబర్ కందుల బీబీ, 9వ వార్డు మెంబర్ షేక్ ఖాదర్ బాషా, 4వ వార్డు మెంబర్ కేశవ స్థానంలో నకిలీ గుర్తింపు కార్డులతో కొత్త వ్యక్తులను వార్డు సభ్యులు అని చెప్పి కార్యాలయంలోకి పంపారు. విచారణలో వారు వార్డు సభ్యులు కాదని నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వచ్చేందుకు కారులో ఉన్న వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ప్రయతి్నంచగా టీడీపీ నాయకులు మళ్లీ దాడులకు పాల్పడ్డారు. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఒంటిమిట్ట వైస్ ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బెదిరింపులు, ప్రలోభాల పర్వంతో చేజిక్కించుకుంది. ఖాజీపేట ఉప మండలాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ (రెబల్) అభ్యర్థి ముమ్మడి స్వప్న విజయం సాధించారు. రాయచోటి రూరల్ మండల ఉపాధ్యక్షురాలు–2గా వైఎస్సార్ సీపీకి చెందిన శిబ్యాల ఎంపీటీసీ సభ్యురాలు నాగ సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.త్రిపురాంతకంలో టీడీపీకి దిమ్మ తిరిగేలా షాక్ప్రకాశం జిల్లాలో గురువారం రెండు ఎంపీపీలు, ఒక వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్, నాలుగు ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. రెండు ఎంపీపీలతో పాటు వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుడిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మిదేవి, త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీగా లింగంగుంట్ల రాములు, యర్రగొండపాలెం కో–ఆప్షన్ సభ్యునిగా సయ్యద్ సాధిక్లు వైఎస్సార్సీపీ తరుఫున ఎన్నికయ్యారు. సృజన, కృష్ణలతో ఎంపీపీ సుబ్బమ్మ త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎం.సృజనను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఎంపీపీ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయి ఎత్తారు. దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ పట్టుకుని లాగాడు. చేయిదించమని గట్టిగా అరుస్తూ గద్దించినా సృజన చలించలేదు. దీంతోపాటు మేడపి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యుడు పి.కృష్ణ నేరుగా వచ్చి సుబ్బమ్మకు మద్దతిచ్చారు. ఫలితంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నికైంది. పుల్లలచెరువులో కూడా బలం లేకపోయినా టీడీపీ కుయుక్తులు పన్నింది. రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.జగనన్న పార్టీకే జై ‘మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి వెంటే ఉంటానని మాట ఇచ్చాను. నిలబెట్టుకున్నాను. నేను మొదటి నుంచి జగనన్న అభిమానిని. ఆయన చరిష్మాతోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచా. కొంత మంది నన్ను మభ్య పెట్టాలని చూశారు. మూడు రోజులుగా హౌస్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఎన్నిక సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చారు. – ఎం.సృజన, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం–2 ఎంపీటీసీ సభ్యురాలుధీరనారి... నాగేంద్రమ్మప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వైస్ ఎంపీపీ పదవికి గురువారం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీకి ఓటు వేయాలని భర్త ఒత్తిడి తెచ్చినా, భార్య మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేసి అటు నుంచి అటే పల్నాడులోని పుట్టింటికి వెళ్లింది. పుల్లల చెరువు మండలం ముటుకుల విద్యుత్ సబ్ స్టేషన్లో పోలయ్య నైట్ వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య వి.నాగేంద్రమ్మ మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలు. మండల వైస్ ఎంపీపీగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు పోలయ్యపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. చేసేదిలేక పోలయ్య తన భార్యతో ఓటు వేయిస్తానని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైస్ ఎంపీపీ పోటీలో ఉన్న రాములుకు మద్దతుగా చేయి ఎత్తారు. ఆ తర్వాత తన భర్తతో మాట పడాల్సి వస్తుందని అటునుంచి అటే పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తన పుట్టింటికి వెళ్లారు.రామగిరిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీల అడ్డగింతశ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చిల్లర రాజకీయం చేశారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌ను అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. ప్రలోభాలకు గురిచేసే యత్నం చేశారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని భావించారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. కంబదూరు ఎంపీపీగా ఎన్నికైన లక్ష్మీదేవితో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీ తలారి రంగయ్య రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ క్రమంలో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మరణించారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ తరఫున ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేకపోవడంతో ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ తరఫున ఒక్కరే ఉన్నారు. భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు టీడీపీలోకి లాక్కున్నారు. ముగ్గురూ పురుషులే కావడంతో టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు అభ్యర్థి కూడా లేరు. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు ఆరుగురు రామగిరికి వస్తుండగా.. కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరికి తామే తీసుకెళ్తామని, మిగతా వాళ్లు రాకూడదని చెప్పారు. ఈ క్రమంలో ఆలస్యం కావడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు మీరిందని.. ఎన్నికను మరుసటి రోజుకు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంజీవయ్య ప్రకటించారు. దీంతో మార్గం మధ్యలో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ అక్కడికి చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులతో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌కు వీడియో కాల్ కలిపారు. డబ్బులు, పదవులు ఆశ చూపి.. పార్టీ మారాలని వారు కోరగా.. వైఎస్సార్సీపీ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యంగా ఉందని.. వాంతి వస్తోందని పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వాహనం నుంచి కిందకు దిగారు. వెనుకే వస్తున్న టీడీపీ నేతలు ఆమెను బలవంతంగా వారి వాహనం ఎక్కించుకుని ఉడాయించారు. మిగిలిన ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులను కర్ణాటక సరిహద్దు వరకు పోలీసులు వదిలివచ్చారు. కాగా, కూటమి పార్టీల నేతలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవస్థకు చెడ్డపేరు తెస్తోన్న ఎస్ఐ మొన్నటి వరకు సెలవులో ఉన్న రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నఫలంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధులకు రావడం దేనికి? బందోబస్తులో భాగంగా రామగిరిలో డ్యూటీ ముగించుకుని వెంటనే.. ప్రత్యేక వాహనాల్లో వైఎస్సార్సీపీ సభ్యుల వెంట వెళ్లడం.. పరిటాల సునీత, శ్రీరామ్‌తో వీడియో కాల్స్ మాట్లాడించి.. బెదిరింపులకు దిగడం సబబు కాదు. రక్షణ కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఎస్ఐ సుధాకర్ యాదవ్ ప్రవర్తించాడు. గత ఎన్నికల్లోనూ ఆయన అనంతపురం జిల్లాలో టీడీపీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు.– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేకర్నూలు జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనంఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్ ఇలియాజ్‌ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్‌పురం ఎంపీటీసీ సభ్యురాలు రాచపాటి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెల్దుర్తి ఎంపీపీగా ఎల్.నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎన్నుకున్నారు. నందిగామ పీఠం వైఎస్సార్సీపీదే ఎనీ్టఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం నిర్వహించిన ఎన్నికలో రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రమాదేవి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కిడ్నాప్ చేసి దక్కించుకున్న టీడీపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 16 మంది వైఎస్సార్ సీపీ, ఒక్కరు టీడీపీ. వారిలో గ్రంధశిరి ఎంపీటీసీ సభ్యుడు చిలకా జ్ఞానయ్య అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 16 మందితో ఎన్నిక నిర్వహించవలసి ఉంది. అయితే బుధవారం పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు తొమ్మిది మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వారికి పచ్చ కుండువాలు కప్పి బలవంతంగా ఎన్నికకు తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్న ఆరుగురు ఎంపీటీసీలను ఆలస్యంగా వచ్చారన్న సాకుతో ఎన్నికకు రాకుండా అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నూతన ఎంపీపీగా భూక్యా స్వర్ణమ్మ భాయి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో ఎన్నిక బాయ్‌కాట్ నరసరరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేదన్న కారణంతో ఆగిపోయింది. మొత్తం 17 మంది ఎంపీటీసీలకు గాను అన్ని స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇందులో గతంలో వైస్ ఎంపీపీగా గెలిచిన యాంపాటి లక్ష్మీ మరణించడంతో గురువారం ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం రాత్రి ఎంపీపీ భర్త మూరబోయిన శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ తన్నీరు శ్రీనిసవారావు, పాలపాడు ఎంపీటీసీ మెట్టు రామిరెడ్డిలను పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు అపహరించారు. దీనికి నిరసనగా ఎన్నికలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు పాల్గొనలేదు. విడవలూరులో ఏకపక్షంగా ఎన్నిక నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీని గురువారం ఏకపక్షంగా ఎన్నుకున్నారు. మొత్తం 14 స్థానాల్లో వైఎస్సార్సీపీ 12, సీపీఎం 2 స్థానాల్లో గతంలో విజయం సాధించాయి. అయినప్పటికీ బెదిరింపులతో టీడీపీ బలపరిచిన ఏకుల శేషమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దగదర్తిలో వాయిదా వేశారు. విశాఖలో వైఎస్సార్సీపీకి నాలుగుఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్ జోరు పెంచింది. మొత్తం 5 ఎంపీపీ, 2 వైఎస్ ఎంపీపీ, ఒక కోఆప్షన్ మెంబర్‌కు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 4 ఎంపీపీ, ఒక వైఎస్ ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.సీఎం సొంత జిల్లాలో టీడీపీ అరాచకం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గురువారం జరిగిన నాలుగు మండలాల ఎంపీపీ ఉప ఎన్నికల్లో మూడింట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని రామకుప్పం ఎంపీపీ స్థానాన్ని, వైస్ ఎంపీపీ స్థానాన్ని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. రామకుప్పంలో ఉప ఎన్నిక సందర్భంగా ఎనిమిది మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్‌కృష్ణ మండల పరిషత్ కార్యాలయానికి బయలు దేరారు. వీరి వాహనాన్ని టీడీపీ మూకలు పథకం ప్రకారం పట్రపల్లి క్రాస్, అన్నవరం క్రాస్, రాజుపేట క్రాస్‌లో అడ్డుకున్నారు. ఎంపీటీసీల వాహనానికి ముందు, వెనుక కార్లు, ట్రాక్టర్లు, టెంపో వాహనాలను అడ్డుపెట్టి ముందుకు కదలకుండా చేశారు. మరి కొన్నిచోట్ల చెట్లను నరికి రోడ్డుకు అడ్డుగా వేశారు. అడ్డుగా ఉన్న వాహనాలు, చెట్లను తొలగించుకుంటూ రామకుప్పం మండల పరిషత్ కార్యాలయం చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. ఆ లోపు టీడీపీ ఆరుగురు ఎంపీటీసీలతో ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయించుకున్నారు. చివరకు ఎంపీపీగా టీడీపీ బలపరచిన సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా టీడీపీ బలపరచిన వెంకట్రామయ్య గౌడ్ గెలుపొందారు. ఆ మూడు మండల పరిషత్‌లు వైఎస్సార్సీపీ ఖాతాలోకే.. తిరుపతి జిల్లాలోని తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడిగా మూలం చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా సదుం మండల పరిషత్ అధ్యక్షురాలిగా మాధవి, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్సుందర్రాయల్ రెడ్డి విజయం సాధించారు. వీరు ముగ్గురూ వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులే. చిత్తూరు జిల్లా విజయపురం మండల ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ బలపరిచిన కన్నెమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కో–ఆప్షన్ సభ్యురాలిగా వైఎస్సార్సీపీ బలపరచిన నసీమా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలోని చింతగుంట పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారు అన్నపూర్ణ గెలుపొందారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె ఉప సర్పంచ్‌గా టీడీపీ బలపరచిన వెంకటరమణ గెలుపొందారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లె పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. భయపెట్టినా..నిలబడ్డారు నామమాత్రపు బలం లేకపోయినా బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పన్నిన కుట్రలు భగ్నమయ్యాయి. పిట్టలవానిపాలెం ఎంపీపీ పరిధిలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 10 మంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ తరఫున పోటీకి దిగిన దిందుకూరి సీతారామరాజుకు మద్దతుగా నిలిచి ఓట్లేశారు. ఆయన ఎంపీపీగా ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు సయ్యద్ నబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం ఉప సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికకాగా, రేపల్లె మండలం పేటేరు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారు శ్రీదేవి ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారుడు శ్రీనివాసరావు, పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు పలికిన వాసంతి విజయం సాధించారు. పశ్చిమగోదావరిలో ప్రజాస్వామ్యం ఖూనీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ పచ్చమూకలు రెచి్చపోయాయి. అత్తిలిలో 20 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒక ఎంపీటీసీ గల్ఫ్‌లో ఉండగా, ప్రస్తుతం వైఎస్సార్సీపీకి 13, కూటమికి ఆరుగురు సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఐదుగురు సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి ఉదయం 13 మంది సభ్యులు బయలుదేరుతుండగా అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు ఇంటిని చుట్టుముట్టారు. రోడ్డుకు మోటారు సైకిళ్లు అడ్డంగా పెట్టి దమ్ముంటే తీసుకువెళ్లమంటూ గొడవకు దిగారు. ఒకానొక దశలో గేట్లు తోసుకుంటూ లోపలకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఎంపీటీసీ సభ్యులు కారుమూరి నివాసంలోకి వెళ్లి తలదాచుకోవాల్సి వచి్చంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక వాయిదా వేసినట్టు సమాచారం అందాక కూటమి శ్రేణులు కారుమూరి నివాసం నుంచి వెళ్లారు.యలమంచిలిలో హైడ్రామాకూటమి హైడ్రామా నడుమ యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. 17 మంది ఎంపీటీసీలకు గాను 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులు కాగా, నలుగురు కూటమి సభ్యులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ ఎన్నిక లాంఛనమే కావాల్సి ఉంది. తమకు ఓటేయాలని వైఎస్సార్సీపీ నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ కూటమి సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు పెన్మత్స సూర్యనారాయణరాజును కూటమి నేతలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఫొటోలు తీస్తున్న స్థానిక జర్నలిస్ట్ కురేళ్ల కిషోర్‌ను కూటమి నేతలు చితకబదారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీని రాకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గ ఇన్చార్జి దూలం నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు. కూటమి పార్టీకి చెందిన తొమ్మిది మంది మాత్రమే ఎన్నికకు హాజరుకావడంతో కోరం లేక ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు.

Donald Trump: మరో టారిఫ్ బాంబు
వాషింగ్టన్/టొరంటో/ఫ్రాంక్ఫర్ట్/టోక్యో: ప్రపంచ దేశాలతో టారిఫ్‌ల యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తారస్థాయికి తీసుకెళ్తున్నారు. తమ దేశంలోకి దిగుమతయ్యే అన్నిరకాల కార్లపైనా సుంకాలను ఎకాయెకి 25 శాతానికి పెంచేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇది కార్ల విడిభాగాలతో పాటు తేలికపాటి ట్రక్కులకు కూడా వర్తించనుంది. ‘‘కొత్త టారిఫ్‌లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయి. ఇది శాశ్వత నిర్ణయం. దీనిపై వెనక్కు తగ్గేదే లేదు’’ అని ట్రంప్ బుధవారం ప్రకటించారు. ‘‘సుంకాలు వద్దనుకునే తయారీ కంపెనీలు అమెరికాలోనే కార్లను తయారు చేసుకుంటే సరి! పైసా కూడా పన్ను కట్టాల్సిన పనుండదు!’’ అంటూ హితవు పలికారు! భారత్‌తో పాటు పలు దేశాలపై ప్రకటించిన పరస్పర సుంకాలు కూడా ఏప్రిల్ 2 నుంచే అమల్లోకి వస్తాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. దాన్ని ‘విముక్తి దినం’గా అభివరి్ణంచారు. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని కఠిన వాణిజ్య నిర్ణయాలు కూడా ప్రకటించనున్నారు. కార్లపై సుంకాల పెంపుపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. కెనడా, మెక్సికో, చైనా, బ్రెజిల్, జపాన్‌తో పాటు పలు యూరప్ దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే తగిన ప్రతి చర్య తప్పదని హెచ్చరించాయి. ట్రంప్ నిర్ణయం ప్రభావం భారత్‌పైనా పడనుంది. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ వంటి ఆటో దిగ్గజాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. త్వరలో ప్రతీకార చర్యలు: కెనడా ట్రంప్ ప్రకటించిన కార్ల సుంకాలను కెనడాపై ప్రత్యక్ష దాడిగా ప్రధాని మార్క్ కార్నీ అభివరి్ణంచారు. దీనిబారి నుంచి తమ దేశాన్ని, కార్ల పరిశ్రమను, కంపెనీలను, కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని ప్రకటించారు. దీనికి తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వాటిపై నిర్ణయం తీసుకునేందుకు ‘అమెరికాతో సంబంధాలపై కేబినెట్ కమిటీ’తో కార్నీ గురువారం అవ్యతసరంగా సమావేశం కానున్నారు. ఇందుకోసం ఎన్నికల ప్రచారం నుంచి ఆయన ఉన్నపళాన ఒట్టావా చేరుకున్నారు. ట్రంప్ టారిఫ్‌ల బారినుంచి దేశీయ ఆటో పరిశ్రమను కాపాడేందుకు కెనడా ఇప్పటికే 140 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. అమెరికాకు కెనడా ఎగుమతుల్లో ఆటో ఉత్పత్తులది రెండో స్థానం. యూరప్ ఆందోళన ఆర్థిక మందగమనంతో ఇప్పటికే సతమతమవుతున్న యూరప్ కార్ల పరిశ్రమపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వాగన్, మెర్సిడెజ్–బెంజ్, వోల్వో, స్టెలాంటిస్ వంటి యూరప్ తయారీ కార్ల ధరలు అమెరికాలో భారీగా పెరగనున్నాయి. ట్రంప్ చర్యను అక్కడి కార్ల దిగ్గజాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది అమెరికాపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని యూరప్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే ట్రంప్ ప్రకటన తర్వాత ఫోర్డ్, జనరల్ మోటార్స్ వంటి అమెరికా కార్ల తయారీ దిగ్గజాల షేర్ల ధరలు పతనమయ్యాయి. యూరప్ ఆటో పరిశ్రమకు అమెరికాయే అతి పెద్ద దిగుమతిదారు. 2023లో అక్కడినుంచి అమెరికాకు 560 కోట్ల యూరోల విలువైన వాహనాలు, విడిభాగాలు ఎగుమతయ్యాయి. ఇటలీ, జర్మనీ కార్ల ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే. అమెరికా కార్ల ఎగుమతుల్లో యూరప్ వాటా కేవలం 2 శాతమే. జపాన్ కార్లకు అమెరికాయే అతి పెద్ద దిగుమతిదారు. దాంతో ట్రంప్ నిర్ణయం గురువారం జపాన్ పార్లమెంటును కుదిపేసింది. ప్రధాని షిగెరు ఇషిబా దీనిపై సభలో ప్రకటన చేశారు. తాజా నిర్ణయం నుంచి తమను మినహాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా కూడా ట్రంప్ నిర్ణయంపై మండిపడ్డారు. స్వేచ్ఛా వాణిజ్య విలువలకు ఇష్టానికి తూట్లు పొడవడం ద్వరా ట్రంప్ సర్కారు దారుణంగా ప్రవర్తిస్తోందంటూ తూర్పారబట్టారు. ‘‘ట్రంప్ తాను ప్రపంచానికే అధ్యక్షుడినని భావిస్తున్నారు. ఈ మతిలేని నిర్ణయాలు అంతిమంగా అమెరికాతో పాటు ఎవరికీ మంచి చేయవు’’ అని హెచ్చరించారు. అమెరికా టారిఫ్‌లపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.అమెరికాపైనా ప్రభావం ట్రంప్ కార్ల టారిఫ్ నిర్ణయం ప్రభావం అమెరికాపైనా గట్టిగానే పడనుంది. ముఖ్యంగా డెట్రాయిట్ వంటి కార్ల పరిశ్రమ కేంద్రాలకు ఇది కోలుకోలేని దెబ్బే కానుంది. అక్కడి నుంచి ఒక్క కెనడాకే 40 శాతం కార్లు ఎగుమతి అవుతాయి. ఇతర దేశాలన్నీ అమెరికాపై విధించబోయే ప్రతీకార సుంకాలు దేశీయ కార్ల పరిశ్రమ నడ్డి విరవడం ఖాయమని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ‘‘కార్ల కంపెనీలు తయారీ యూనిట్లు అమెరికా బయటికి తరలి వేలాది మంది ఉపాధి కోల్పోవచ్చు. సరిహద్దులకు రెండు వైపులా చాలా కార్ల కంపెనీలు మూతబడటం ఖాయం. ఏప్రిల్ 2 అమెరికాకు విముక్తి దినమని ట్రంప్ అనుకుంటున్నారు. కానీ నిజానికి అది ఆ దేశం పాలిట వినాశ దినం కాబోతోంది’’ అని కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ గవర్నర్ డౌగ్ ఫోర్డ్ చెప్పారు.2024లో అమెరికా దిగుమతి చేసుకున్న కార్లు, ట్రక్కులు దాదాపు 80 లక్షలు వాటి విలువ24,000 కోట్ల డాలర్లు

జెయింట్స్ సూపర్ విక్టరీ
ఉప్పల్ స్టేడియంలో మళ్లీ పరుగులు వరద పారింది. దాదాపు 400 పరుగులు కూడా నమోదయ్యాయి. కానీ ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా వచ్చింది. ప్రతీసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతూ ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేసే సన్‌రైజర్స్ ఈసారి ఓటమి పక్షాన నిలిచింది. బలహీన బౌలింగ్‌గా అనిపించిన లక్నో పట్టుదలగా ఆడి రైజర్స్‌ను 200 గీత దాటకుండా చేస్తే... ఆపై లక్నో బ్యాటర్లు పూరన్, మిచెల్ మార్ష్‌లు సన్‌రైజర్స్‌కు వారి బ్యాటింగ్ దెబ్బనే రుచి చూపించారు. ఫలితంగా హైదరాబాద్‌కు అనూహ్య ఓటమి ఎదురుకాగా... లక్నో గెలుపు బోణీ చేసింది. ఏడాది క్రితం ఇదే మైదానంలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో టీమ్ ఇప్పుడు బదులు తీర్చుకుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు సొంతగడ్డపై తొలి పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 47; 5 ఫోర్లు,3 సిక్స్‌లు), అనికేత్ వర్మ (13 బంతుల్లో 36; 5 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డి (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పరుగులు సాధించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 43 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. అభిషేక్, ఇషాన్ విఫలం సన్‌రైజర్స్‌కు ఈసారి సరైన ఆరంభం లభించలేదు. శార్దుల్ వరుస బంతుల్లో అభిషేక్ శర్మ (6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ (0)లను వెనక్కి పంపడంతో 15 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే హెడ్ మాత్రం తన జోరు తగ్గించలేదు. అవేశ్ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగాడు. రవి బిష్ణోయ్ ఓవర్లో 35 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను పూరన్ వదిలేశాడు. అదే ఓవర్లో బిష్ణోయ్ కూడా కఠినమైన మరో రిటర్న్ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. అయితే దాని వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. మరో 12 పరుగులు జోడించిన హెడ్‌ను ప్రిన్స్ యాదవ్ అద్భుత బంతితో క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రిన్స్‌కు ఐపీఎల్లో ఇది తొలి వికెట్ కావడం విశేషం. మరో ఎండ్‌లో బాగా తడబడిన నితీశ్ ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించిన క్లాసెన్ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. అయితే అనికేత్, ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18; 3 సిక్స్‌లు) సిక్సర్లు స్కోరును 200 పరుగులకు చేరువగా తెచ్చారు. బిష్ణోయ్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు బాదిన అనికేత్...రాఠీ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్సర్లతో చెలరేగాడు. అయితే తర్వాతి బంతికీ ఇదే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు. చివరి 2 ఓవర్లలో కలిపి 10 పరుగులే చేయగలిగిన హైదరాబాద్ ఆఖరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం గమనార్హం. మెరుపు భాగస్వామ్యం... షమీ తన తొలి ఓవర్లో మార్క్రమ్ (1)ను అవుట్ చేసిన ఆనందం రైజర్స్ శిబిరంలో ఎంతోసేపు నిలవలేదు. అక్కడి నుంచి మార్ష్, పూరన్ కలిసి రైజర్స్ బౌలర్ల భరతం పట్టారు. సిమర్జీత్ ఓవర్లో పూరన్ ఫోర్, 2 సిక్స్‌లు బాదగా, షమీ ఓవర్లో మార్ష్ 2 సిక్స్‌లు కొట్టాడు. అభిషేక్ ఓవర్లో కూడా పూరన్ 2 సిక్స్‌లు కొట్టడంతో పవర్‌ప్లేలో లక్నో స్కోరు 77 పరుగులకు చేరింది. ఆ తర్వాత పూరన్ మరింత చెలరేగిపోయాడు. 18 బంతుల్లోనే ఈ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్ అవుటైన తర్వాత 29 బంతుల్లో మార్ష్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో బదోని (6), పంత్ (15) అవుటైనా... మిల్లర్ (13 నాటౌట్), సమద్ (8 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి విజయాన్ని పూర్తి చేశారు. మూడు బంతులు, మూడు సిక్సర్లు... సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఆసక్తికరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తొలి 3 బంతులను అతను సిక్సర్లుగా మలిచాడు. శార్దుల్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అతను, అవేశ్ ఓవర్లో తొలి బంతిని సిక్సర్ కొట్టి తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అనూహ్య రనౌట్... టాప్–3 బ్యాటర్లు వెనుదిరిగిన తర్వాత రైజర్స్ ఆశలన్నీ క్లాసెన్‌పైనే ఉన్నాయి. అతనూ అప్పటికే చక్కటి షాట్లతో ధాటిని ప్రదర్శిస్తున్నాడు. అయితే ప్రిన్స్ యాదవ్ ఓవర్లో అతను రనౌట్ కావడం జట్టు తుది స్కోరుపై ప్రభావం చూపించింది. ప్రిన్స్ వేసిన బంతిని నితీశ్ బలంగా బాదగా బౌలర్ దానిని క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అది విఫలం కాగా, బంతి చేతులను తాకి నాన్ స్ట్రయికింగ్ స్టంప్స్ వైపు వెళ్లింది. అప్పటికే పరుగు కోసం క్రీజ్ దాటిన క్లాసెన్ రనౌటవక తప్పలేదు. ఎవరీ అనికేత్ వర్మ...? ఐదు సిక్సర్లతో సన్‌రైజర్స్ అభిమానులను ఆకట్టుకున్న అనికేత్ వర్మ గత మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. రాజస్తాన్‌తో పోరులో తన రెండో బంతికే అతను సిక్స్ కొట్టాడు. ఐపీఎల్‌కు ముందు అతను సీనియర్ స్థాయిలో ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడాడు. మధ్యప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన అనికేత్ హైదరాబాద్‌తో జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే అండర్–23 స్థాయి తన దూకుడైన ప్రదర్శనతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. దేశవాళీ అండర్–23 వన్డే టోర్నీలో 7 మ్యాచ్‌లలో 16 సిక్సర్లు బాదాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కూడా చెలరేగిన తీరును చూసి సన్‌రైజర్స్ వేలంలో కనీస విలువ రూ. 30 లక్షలకు అనికేత్‌ను తీసుకుంది. పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోనే అయినా మెరుగైన అవకాశాల కోసం సరిహద్దు రాష్ట్రం మధ్యప్రదేశ్ చేరుకొని అక్కడే ఆటను మొదలు పెట్టాడు. ఐపీఎల్లో నేడుచెన్నై X బెంగళూరువేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) ప్రిన్స్ 47; అభిషేక్ (సి) పూరన్ (బి) శార్దుల్ 6; ఇషాన్ కిషన్ (సి) పంత్ (బి) శార్దుల్ 0; నితీశ్ రెడ్డి (బి) రవి బిష్ణోయ్ 32; క్లాసెన్ (రనౌట్) 26; అనికేత్ (సి) మిల్లర్ (బి) రాఠీ 36; అభినవ్ మనోహర్ (సి) సమద్ (బి) శార్దుల్ 2; కమిన్స్ (సి) రాఠీ (బి) అవేశ్ 18; హర్షల్ (నాటౌట్) 12; షమీ (సి) బదోని (బి) శారుŠద్ల్ 1; సిమర్జీత్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–15, 2–15, 3–76, 4–110, 5–128, 6–156, 7–156, 8–176, 9–181. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–34–4, అవేశ్ ఖాన్ 4–0–45–1, దిగ్వేశ్ రాఠీ 4–0–40–1, రవి బిష్ణోయ్ 4–0–42–1, ప్రిన్స్ యాదవ్ 4–0–29–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) కమిన్స్ 52; మార్క్రమ్ (సి) కమిన్స్ (బి) షమీ 1; పూరన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 70; పంత్ (సి) షమీ (బి) హర్షల్ 15; బదోని (సి) హర్షల్ (బి) జంపా 6; మిల్లర్ (నాటౌట్) 13; సమద్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (16.1 ఓవర్లలో 5 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–4, 2–120, 3–138, 4–154, 5–164. బౌలింగ్: అభిషేక్ శర్మ 2–0–20–0, షమీ 3–0–37–1, సిమర్జీత్ సింగ్ 2–0–28–0, కమిన్స్ 3–0–29–2, ఆడమ్ జంపా 4–0–46–1, హర్షల్ పటేల్ 2–0–28–1, ఇషాన్ కిషన్ 0.1–0–4–0.

ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: బ.చతుర్దశి రా.7.12 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.46 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.28 నుండి 9.16 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.19 వరకు,అమృత ఘడియలు: ప.2.05 నుండి 3.38 వరకు.సూర్యోదయం : 6.01సూర్యాస్తమయం : 6.08రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... పనులు సకాలంలో పూర్తి కాగలవు. బంధువులతో సఖ్యత. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగాలలో హోదాలు.వృషభం... ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో అనుకూలత. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.మిథునం.... ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. అనారోగ్యం. దైవదర్శనాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం..కర్కాటకం... ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పనులలో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.సింహం.... ఆప్తులు మరింత దగ్గరవుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.కన్య.... కార్యజయం. మొండిబాకీలు వసూలవుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు.తుల.... కొన్ని పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.వృశ్చికం... కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.ధనుస్సు.... పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పాత మిత్రుల కలయిక. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.మకరం... ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవం.కుంభం.... పనులు సజావుగా సాగుతాయి. బంధువుల నుంచి ధనలాభం. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు అధిక లాభాలు. ఉద్యోగాల్లో పైహోదాలు.మీనం.... మిత్రులతో అకారణంగా తగాదాలు. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగాల్లో పనిభారం. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి.

పుతిన్ త్వరలో చనిపోతారు
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. ఆయన తొందరలోనే చనిపోతారని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మద్య యుద్ధం అప్పుడే ముగుస్తుందన్నారు. పారిస్‌లో ఓ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మా న్యుయేల్ మాక్రాన్‌తో బుధవారం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా రష్యా మాత్రం సంఘర్షణను ఇంకా లాగుతోందని ఆరోపించారు. ‘‘యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. యుద్ధాన్ని ముగించేలా దానిపై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది’’ అన్నారు. పుతిన్ ఆరోగ్యంపై కొన్ని నెలలుగా ఊహాగానాలు, వదంతులు వినిపిస్తున్నాయి. ఆయన ఎడ తెరిపి లేకుండా దగ్గుతున్న వీడియోలు, చేతులు, కాళ్లు అసంకల్పితంగా కదలడం వంటివి పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. 2022లో రష్యా మాజీ రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో భేటీ సందర్భంగా పుతిన్ టేబుల్ పట్టుకొని కుర్చీలో కూర్చున్న వీడియో వైరలైంది. ఆయన పార్కిన్సన్, కేన్సర్‌తో పోరా డుతున్నట్టు కొన్ని నివేదికలు కూడా వచ్చాయి. క్రెమ్లిన్ మాత్రం ఈ వార్తలను ఖండించింది.

రూ.2,704.81 కోట్లనూ మళ్లించిన సర్కారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా.. నిధుల సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12న రెండో విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,704.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసింది. తక్షణమే ఆ నిధులను సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేసి, రసీదు పంపాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు రోజూ ఒత్తిడి చేస్తుండటంతో జల వనరుల శాఖ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. నిర్వాసితులకు పరిహారం, సేకరించాల్సిన భూమికి పరిహారం, చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్సు నిధులను మళ్లీ దారి మళ్లించేయడంపై అధికారవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 9న తొలి విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇదే రీతిలో మళ్లించేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు జనవరి రెండో వారంలో వాటిని నోడల్ ఏజెన్సీ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఖర్చు పెట్టిన నిధులను తిరిగిస్తే చంద్రబాబు గగ్గోలుగతంలో పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కేంద్ర ప్రభుత్వం తిరిగి (రీయింబర్స్ చేసేది) ఇచ్చేది. అంటే.. కేంద్రం రీయింబర్స్ చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులే. ఆ నిధులను ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పథకాల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినియోగిస్తే.. పోలవరం నిధులను దారి మళ్లించేశారంటూ చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు అప్పట్లో దుష్ఫ్రచారం చేశారు. రీయింబర్స్మెంట్ ప్రక్రియలో జాప్యం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందని.. అడ్వాన్సుగా నిధులు ఇచ్చి ప్రాజెక్టు పనులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తికి ప్రధాని మోదీ అప్పట్లో సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు పనులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.459.68 కోట్లను రీయింబర్స్ చేయడంతోపాటు రూ.2,348 కోట్లను తొలి విడత అడ్వాన్సు రూపంలో మొత్తం రూ.2,807.68 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. అదే రోజున వాటిని రాష్ట్ర ఖజానాలో జమ చేసింది. ఈ నిధులను సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమచేసి.. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర కేబినెట్ నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన పెట్టింది. ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేశాక.. వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) పంపితే మిగతా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 12న రెండో విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,704.81 కోట్ల విషయంలోనూ ఇదే నిబంధనలు పెట్టింది. అప్పట్లో రీయింబర్స్ చేసిన నిధులను మళ్లించేశారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అడ్వాన్సు నిధులను మళ్లించేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?: వైఎస్ జగన్
ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు.. మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూలి్చవేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపై, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు ఉందా? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు యథేచ్ఛగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు.. మరో వైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ‘ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే.. మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే.. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న, సనాతన వాదినని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం.. తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని దెప్పి పొడిచారు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని నిలదీçస్తూ గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కాశినాయన క్షేత్రం పరిరక్షణకు ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేసిన కృషికి సంబంధించిన ఆధారాలు, అప్పట్లో అధ్యాత్మిక శోభతో విలసిల్లిన ఆ క్షేత్రం ఫొటోలు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వులు, కూల్చివేత ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘ఇవిగో ఆధారాలు.. ఏమిటి మీ సమా«దానం’ అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను సూటిగా ప్రశ్నించారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే... దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు.. రాష్ట్రంలో ఆలయాలపై, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?మా ఐదేళ్ల పాలనలో ఈ క్షేత్రాన్ని పరిరక్షించాం అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుం బిగించిన మాట వాస్తవం కాదా? అదే ఏడాది.. అదే నెల 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాశాను. కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రాన్ని రిజర్వ్ చేయాలని, దీని కోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇవిగో ఆధారాలు07–08–2023:కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేయాలని, ఉన్నవాటిని తొలగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిన కాపీ 18–08–2023: కాశినాయన క్షేత్రం ఉన్న భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, 12.98 హెక్టార్ల భూమిని కాశినాయన క్షేత్రానికి రిజర్వు చేయాలని కోరుతూ అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు నాటి సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ అధికార అహంకారానికి ఇవిగో ఆధారాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో నిర్మాణాలను కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారు. ఇందుకు ఇవిగో ఆధారాలు (కాశినాయన క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులు ట్యాగ్ చేస్తూ), ఏమిటి మీ సమాధానం?1–1–2025: ఏపీ అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాల మేరకు కాశినాయన క్షేత్రంలోని నిర్మాణాలను తొలగించాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత అధికారులకు జారీ చేసిన ఆదేశాల కాపీ వీళ్ల తీరే అంత.. వారే ఉత్తర్వులిచ్చి, వారి చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్న పూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెబుతున్నారు. వీళ్ల తీరే అంత. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే.

వెండితెరకు డొక్కా సీతమ్మ జీవితం
అన్నపూర్ణగా, అన్నదాతగా చరిత్రలో నిలిచిపోయిన డొక్కా సీతమ్మ జీవితం వెండితెరకు రానుంది. ‘డొక్కా సీతమ్మ’ పేరుతో ఈ సినిమాని రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రభాకర్ గౌడ్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాని మరొకరు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ వివాదం గురించి రామకృష్ణ, ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘2016లోనే ‘డొక్కా సీతమ్మ’ సినిమా స్క్రిప్ట్‌ని హైదరాబాద్‌లోని తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేశాం. మా రచనను కాపీ కొడుతూ వేరొక సంస్థ వారు డొక్కా సీతమ్మపై సినిమా తీయడానికి పూనుకోవడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. కాపీ రైట్ యాక్ట్ మాకు ఉన్నప్పటికీ కోర్టులో వివాదం ఉండటంతో మేం ముందుకెళ్లలేదు. వేరొక సంస్థ ఈ సినిమాను తీసేందుకు సన్నాహాలు చేస్తే కోర్టు ధిక్కారం అవుతుంది’’ అన్నారు. ‘డొక్కా సీతమ్మ’ చరిత్ర తొలి రచయిత వంశీయులు మిర్తిపాటి రామచయనులు, దర్శకుడు సాయికృష్ణ, కెమేరామేన్ వాసువర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు

డిజిటల్ లోయల్లో టీనేజ్ పిల్లలు
తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడుతుంటారు. పిల్లలు చదువులతో కష్టపడాలి వాస్తవంగా. కాని వారికి సోషల్ మీడియాలోని చెత్తా చెదారం, తప్పుడు సమాచారం, ఉద్రిక్త ఆకర్షణలు, హింసాత్మక భావజాలాలు... ఇవి కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘అడోలసెన్స్’ వెబ్‌సిరీస్ మీద సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇది హెచ్చరిక అంటున్నారు. ఈ సిరీస్ మనల్ని ఎలా నిద్ర లేపుతున్నది?మీ పిల్లలు మీతో ఇంట్లో మాట్లాడే భాష మీకు తెలుసు. వాళ్లు సోషల్ మీడియాలో మాట్లాడే భాష మీకు తెలుసా? వాళ్లు ఉపయోగించే ‘ఎమోజీ’ల అర్థాలు తెలుసా? మాటలు లేకుండా ఎమోజీలతో గాయపరిచే వీలు ఉంటుందని తెలుసా? కిడ్నీ బీన్స్, రెడ్ పిల్, బ్లూ పిల్, డైనమైట్, రెడ్ హార్ట్, పర్పుల్ హార్ట్, ఎల్లో హార్ట్.... ఈ ఎమోజీల అర్థం ప్రతి దానికీ మారుతుంది. అవి ఎందుకు ఉపయోగిస్తున్నారు. ఇంట్లో మన ఎదురుగా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసు. సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసా?ముఖ్యంగా వారి వయసు 12– 14 సంవత్సరాల మధ్య ఉంటే వారికి తెలిసింది ఎంత... తెలియంది ఎంత... తెలిసీ తెలియంది అంత. జాగ్రత్త సుమా... అని హెచ్చరించడానికి వచ్చింది ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్.నాలుగు ఎపిసోడ్స్ల సిరీస్‘అడోలసెన్స్’ అనేది నాలుగు ఎపిసోడ్ల మినీ వెబ్ సిరీస్. బ్రిటిష్ క్రైమ్ డ్రామా. బ్రిటన్‌లో టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తిని గమనించి ఈ సిరీస్‌ను తీశారు. జాక్ థోర్న్ స్క్రిప్ట్ రాస్తే, ఫిలిప్ బరాన్టిని దర్శకత్వం వహించాడు. ఒక్కో ఎపిసోడ్ ఒక గంట ఉంటుంది. విశేషం ఏమిటంటే ప్రతి ఎపిసోడ్ సింగిల్ షాట్. అంటే మధ్యలో కట్ లేకుండా కెమెరా కదులుతూ దృశ్యాలను చూపుతూ వెళుతుంది. ఈ మేకింగ్‌లో వినూత్నత వల్ల కూడా ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంటోంది.ఆ పసివాడి సంఘర్షణఈ సిరీస్ మొదలు కావడమే ‘జెమీ మిల్లర్’ అనే 13 ఏళ్ల పిల్లవాడి అరెస్టుతో మొదలవుతుంది. ముందు రోజు రాత్రి స్కూల్లో తన క్లాస్మేట్ అమ్మాయి కేటీని కత్తితో ఏడుసార్లు పొడిచి చంపాడని అభియోగం. తండ్రి, తల్లి, సోదరి హడలిపోతాడు. జెమీ మిల్లర్ అయితే పోలీసులను చూసి ప్యాంట్ తడుపుకుంటాడు. ఆ తర్వాత జేమీనే కేటీని చంపాడని ఇందుకు ఒక స్నేహితుడు కూడా పురిగొల్పాడని విచారణలో ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇందులో ఎవరి తప్పు ఎంత? దీనికి బాధ్యులు ఎవరెవరు? శిక్ష మాత్రం ఒక్కడికే పడబోతోందా?ఇన్‌స్టా గొడవజెమీ వయసు 13 ఏళ్లే అయినా అతనికి ఇన్‌స్టా అకౌంట్ ఉంది. అందమైన ఫిమేల్మోడల్స్ బొమ్మలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు. అతని పోస్టులకు కేటీ కామెంట్స్ పెడుతూ ఉంటుంది. వాటికి రకరకాల ఎమోజీలు వాడుతుంటుంది. అవి జెమీని బాధ పెట్టాయని మనకు తెలుస్తుంది. జెమీ తన వయసులో అపరిపక్వత వల్ల తను ఆకర్షణీయంగా లేడని తనను ఎవరూ ఇష్టపడరని న్యూనతతో ఉంటాడు. కేటీ కామెంట్స్ ఇందుకు ఆజ్యం పోస్తాయి. అంతే కాదు సాటి మనిషి పట్ల, ఆడపిల్లల పట్ల సెన్సిటివ్‌గా ఉండాలనే భావజాలం కాకుండా వాళ్లను ఏమైనా అనొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అనే ఆధిపత్యపు భావజాలమే ఎక్కువగా జెమీకి పరిచయం అవుతుంటుంది. వీటన్నింటి దరిమిలా అతడు కేటీప్రాణం తీసేవరకూ వెళతాడు.టీనేజ్ పిల్లలు ఎంతో సున్నితమైన దశలో ఉండే సీతాకోక చిలుకలు. వారిని గురించి అందరికీ బాధ్యత ఉండాలని చెబుతోంది ఈ సిరీస్. ఇందులోని ముఖ్య పాత్రను ఒవెన్ కూపర్ అనే బాల నటుడు అద్భుతంగా పోషించాడు. దిన పత్రికల వార్తలు కూడా మనకు రోజూ టీనేజ్ పిల్లల సమస్యలు, కుటుంబాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లోపం పట్టి ఇస్తున్నాయి. తల్లిదండ్రులు ఈ సిరీస్ చూడటం మంచిదంటున్నారు అభిరుచి ఉన్న ప్రేక్షకులు. కొందరైతే టీనేజ్ పిల్లలతో పాటుగా తల్లిదండ్రులూ చూడాలని సూచిస్తునారు. ముందు పెద్దలు చూడండి. ఆ తర్వాత మీకు సబబని అనిపిస్తే పిల్లలకు చూపించండి. కానీ ఆలోచించండి.ఎవరు నిందితులు?సోషల్ మీడియాను, ఎమోజీలను కనిపెట్టిన వారా? వాటిని ఫోన్లకు అనుసంధానం చేసిన వారా? పిల్లలకు ఫోన్లు కొనిచ్చిన తల్లిదండ్రులా? వాళ్లు ఏ మీడియాను ఉపయోగిస్తున్నారో చూడని తల్లిదండ్రుల నిర్బాధ్యతా? వారితో గడపలేని బిజీతో ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యమా? సరిగా పెంచని, సరిగా విద్యాబుద్ధులు చెప్పని వారంతా ఇందుకు బాధ్యులు కాదా? సమాజంలో పేరుకున్న హింసా ప్రవృత్తిని దూరం చేయలేని పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, పౌర వ్యవస్థలో ఉన్న వీరంతా కాదా బాధ్యులు.

ముందే ప్లానేద్దాం.. సమ్మర్లో టూరేద్దాం!
సాక్షి, హైదరాబాద్: సమ్మర్ వెకేషన్‌కు ఇప్పటినుంచే మనవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏటేటా పెరుగుతున్న పర్యాటకుల డిమాండ్‌కు తగ్గట్టుగానే...దేశవ్యాప్తంగా హోటళ్లు (హోటల్ రూమ్‌లు), ఇతర ప్రత్యామ్నాయ విడిదుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వేసవిలో వివాహాలకు కూడా ముహూర్తాలు ఉండటంతో హోటళ్లకు కూడా డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఇప్పటికే లగ్జరీ, మిడ్–స్కేల్, బడ్జెట్ సెగ్మెంట్లలో హోటల్ గదుల రేట్లు 10 నుంచి 12 శాతం పెరిగినట్టుగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ వర్గాలు చెబుతున్నాయి. తమతమ కుటుంబ బడ్జెట్, వేసవి విడిదులకు సంబంధించి ఖర్చు చేయగలిగే స్తోమతను బట్టి దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, విదేశాల్లోని ప్రముఖ సందర్శన ప్రదేశాలు, మరికొందరు వీసా ఫ్రీ దేశాల్లో వేసవి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కశ్మీర్, గోవా, హిమాచల్, కేరళలకు వెళ్లేందుకు క్రేజ్ దేశీయంగా చూస్తే.. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, గోవా, రాజస్తాన్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాలు వేసవి సెలవులకు గమ్యస్థానాలుగా అగ్రభాగాన నిలుస్తున్నాయి. వీటితోపాటు హిల్‌స్టేషన్లుగా పేరుగాంచిన ముస్సోరి, మనాలి, రుషికేశ్ తదితర ప్రాంతాల్లోని హోటళ్ల గదులకు డిమాండ్ అత్యధికంగా ఉన్నట్టుగా వెల్లడైంది. కూర్గ్, మహబలేశ్వర్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్లకు కూడా క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేకంగా మహబలేశ్వర్‌లోని బీచ్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయ్‌పూర్, జైపూర్లు కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేవు. రుషికేశ్, కాసోల్, హంపి, ముక్తేశ్వర్ వంటి పర్యాటక ప్రదేశాల్లో హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతున్నట్టుగా జో వరల్డ్ సంస్థ వెల్లడించింది. టాప్ ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్ ఇవే.. ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్‌గా స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, హంగేరీ, ఆ్రస్టియా, చెక్ రిపబ్లిక్, ఇతర ఐరోపా దేశాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. వీటితోపాటు దుబాయ్, ఈజిప్ట్, జపాన్, సింగపూర్, వియత్నాం, ఇండోనేసియాలకు ఏటా డిమాండ్ పెరుగుతోందని అట్లీస్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ వేసవి సీజన్లో యూఏఈ, యూఎస్ఏలకు అత్యధికంగా బుక్సింగ్ జరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ దేశాల్లో పర్యటించేందుకు ముందుగానే పర్యాటకులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఆ సంస్థ అంచనా వేసింది. అంటార్కిటికాలో ఐస్‌బ్రేకర్ క్రూయిజ్‌లు, ఫిన్లాండ్లో నార్తర్న్ లైట్స్ అనుభవాలు, గాజు గోపుర ఇగ్లూలు, ఆర్కిటిక్ సూట్లు మరియు ఆర్కిటిక్ ట్రీహౌస్‌లలో బస వంటి ప్రీమియం అనుభవాలను కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా వైన్‌యార్డ్‌లలో కన్వర్టిబుల్ కార్లు లేదా హార్లే–డేవిడ్‌సన్‌లతో సెల్ఫ్–డ్రైవ్ సాహసాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.తొలిసారి విదేశీ పర్యటనలకు వెళుతున్న వారిలో ఎక్కువగా కాంబోడియా, శ్రీలంక, అజర్‌బైజాన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ దేశాల సందర్శనకు సులభంగా వీసా ప్రక్రియ ఉండటంతోపాటు ఆయా సమ్మర్ ట్రిప్‌లకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండడమే అందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీసా అవసరం లేని ప్రాంతాలకు ఆదరణ... ఇక వీసా అవసరం లేని వివిధ పర్యాటక దేశాలు భారత టూరిస్ట్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే వీసా ఫ్రీ దేశాలు అయిన నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మాల్దీవులు, మారిషస్ వంటి వాటికి భారత్ టూరిస్టుల నుంచి భారీగా డిమాండ్ పెరిగినట్టు హాలిడే, టూరిజం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దేశాలు వీసా రహిత సులభ ప్రవేశ కారణంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఎస్ఓటీసీ ట్రావెల్ హాలిడేస్, కార్పొరేట్ టూర్స్ విభాగం నివేదిక ప్రకారం.. వీసా రహిత గమ్యస్థానాలు ప్రయాణికులకు ఖర్చులను ఆదా చేసే అవకాశాన్ని అందిస్తున్నాయని, దీనిని వారు లగ్జరీ అనుభవాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో ముయే థాయ్ (కిక్‌బాక్సింగ్) నేర్చుకోవడం, లగ్జరీ రిసార్ట్‌లలో డిటాక్స్ కార్యక్రమాలు, మారిషస్‌లో స్నార్కెలింగ్ లేదా మాల్దీవ్స్‌లో మిషెలిన్–స్టార్ అండర్‌వాటర్ డైనింగ్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫినామినన్–ఆధారిత ప్రయాణం ఒక కీలక ధోరణిగా ఉద్భవించిందని ఈ నివేదిక తెలిపింది.
ఉద్యోగం–జీవితం...సమతుల్యంపై అసంతృప్తి
‘రాబిన్‌హుడ్’ మూవీ ట్విటర్ రివ్యూ
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ డౌన్..
30న నాగపూర్‌కు మోదీ
రణరంగంగా మారిన భువనేశ్వర్
ఆ హామీ మున్సిపాలిటీ చెత్త బుట్టలోకి
కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్
ఎట్టకేలకు కశ్మీర్ లోయలో రైలు సేవలు
కనీస వేతనం ఇవ్వాల్సిందే..
వసుధైక కుటుంబం ఎక్కడ: సుప్రీంకోర్టు
IPL 2025 LSG vs SRH: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’
బిజినెస్మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి.. స్పందించిన టీమ్
వాళ్లకు మాత్రం ఏఐ ముప్పు ఉండదు.. బిల్ గేట్స్
‘అబద్ధాల్లో అందరి కంటే పెద్ద.. నిజాల్లో అందరి కంటే చిన్న’
గ్లోబల్ స్టార్ రామ చరణ్ ఫిట్నెస్ సీక్రెట్..! డైట్లో అవి ఉండాల్సిందే..
జస్టిస్ యశ్వంత్ వివాదంపై ఏం చేద్దాం..? వారితో సీజేఐ ప్రత్యేక భేటీ
ఇన్ఫోసిస్‌లో మరికొంత మందికి లేఆఫ్.. ‘కొత్త’ ఆఫర్
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం
ఉద్యోగం–జీవితం...సమతుల్యంపై అసంతృప్తి
‘రాబిన్‌హుడ్’ మూవీ ట్విటర్ రివ్యూ
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ డౌన్..
30న నాగపూర్‌కు మోదీ
రణరంగంగా మారిన భువనేశ్వర్
ఆ హామీ మున్సిపాలిటీ చెత్త బుట్టలోకి
కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్
ఎట్టకేలకు కశ్మీర్ లోయలో రైలు సేవలు
కనీస వేతనం ఇవ్వాల్సిందే..
వసుధైక కుటుంబం ఎక్కడ: సుప్రీంకోర్టు
IPL 2025 LSG vs SRH: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’
బిజినెస్మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి.. స్పందించిన టీమ్
వాళ్లకు మాత్రం ఏఐ ముప్పు ఉండదు.. బిల్ గేట్స్
‘అబద్ధాల్లో అందరి కంటే పెద్ద.. నిజాల్లో అందరి కంటే చిన్న’
గ్లోబల్ స్టార్ రామ చరణ్ ఫిట్నెస్ సీక్రెట్..! డైట్లో అవి ఉండాల్సిందే..
జస్టిస్ యశ్వంత్ వివాదంపై ఏం చేద్దాం..? వారితో సీజేఐ ప్రత్యేక భేటీ
ఇన్ఫోసిస్‌లో మరికొంత మందికి లేఆఫ్.. ‘కొత్త’ ఆఫర్
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం
సినిమా

బిజినెస్మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి.. స్పందించిన టీమ్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయి. కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రభాస్ పెళ్లి గురించి మొదలైంది. త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారని నెట్టింట తెగ వైరలవుతోంది. అంతేకాదు రెబల్ స్టార్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ అన్న పెళ్లి కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన టీమ్ స్పందించింది. ప్రభాస్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేశారు. ఓ బిజినెస్మెన్ కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలపై ఆయన టీమ్‌ను సంప్రదించగా.. ఎలాంటి ఊహగానాలు నమ్మవద్దని రెబల్ స్టార్ అభిమానులకు సూచించారు.(ఇది చదవండి: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి)గతంలో ప్రభాస్ పెళ్లి గురించిన వచ్చిన రూమర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను తన బాహుబలి నటి అనుష్క శెట్టితో రిలేషన్షిప్లో ఉన్నాడని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఈ వార్తలను నటీనటులిద్దరూ ఖండించారు. తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి -2, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2: శౌర్యంగ పర్వం సినిమాలను చేయనున్నారు.

ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా!
పెళ్లవగానే హీరోయిన్లను పక్కన పెట్టేసే ధోరణి సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బాలీవుడ్లో అలా కాదు.. పెళ్లయినా, పిల్లలున్నా సరే పలువురు కథానాయికలు అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీనే ఏలుతారు. ఆలియా భట్ (Alia Bhatt) హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆమెను చూస్తే ఈర్ష్యగా ఉందంటోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్.లైఫ్ సెట్టయిపోయిందనుకున్నాఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ (Sara Ali Khan) మాట్లాడుతూ.. ఆలియాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా? ఆలియా అవార్డు గెలిచింది.. అటు తనకు పాప కూడా ఉంది. ఇంకేంటి? తన లైఫ్ సెట్టయిపోయింది అనుకున్నాను. కానీ ఆ స్థాయికి చేరుకోవడానికి తను ఎంత కష్టపడిందన్నది ఆలోచించలేదు. నటిగా మానవత్వం మరిచిపోయాననిపించింది. తను ఎన్ని కష్టాలు పడింది.. ఎన్నిసార్లు నిరాశకు గురైందన్నది మనకు తెలియదు. ఆ సక్సెస్ మనకెందుకు లేదని..నాణానికి రెండువైపులా చూడాలి. మనలా చాలామంది అవతలివారి గురించి తెలుసుకోకుండా ఊరికే కుళ్లుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి సక్సెస్ చూసి మనకెందుకు రాలేదా? అన్న ఈర్ష్య వస్తుంది. కానీ ఆ సక్సెస్ వెనక ఉన్న శ్రమను గుర్తించం. అసూయ చెందడం అంటే కళ్లు మూసుకుపోవడంతో సమానం అని సారా చెప్పుకొచ్చింది. సినిమా..కాగా ఆలియా భట్.. 2022లో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడింది. అదే ఏడాది వీరికి రాహా అనే కూతురు జన్మించింది. గంగూబాయ్ కథియావాడి చిత్రానికిగానూ ఉత్తమనటిగా 2023లో జాతీయ అవార్డు అందుకుంది. సారా అలా ఖాన్ విషయానికి వస్తే.. ఈమె చివరగా స్కై ఫోర్స్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే మూవీ చేస్తోంది. అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.చదవండి: బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి

మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్
ట్రెండ్ మారినా ఫ్రెండు మారడే.. ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే.. అని పాట పాడుకుంటోంది మహాతల్లి జాహ్నవి. యూట్యూబర్‌లో ఫన్నీ వీడియోలతో నవ్వించిన మహాతల్లి ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. జాహ్నవి- సుశాంత్ రెడ్డి దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. అయితే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు దిగిన ఫోటోలన్నింటినీ వరుస పెట్టి రిలీజ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తన ముగ్గురు ఫ్రెండ్స్ (నిహారిక, వితికా, భార్గవి)తో స్పెషల్‌గా దిగిన ఫోటోషూట్ పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనలైంది.బాలి ట్రిప్‌తో బాండింగ్'ఫీమేల్ ఫ్రెండ్షిప్ ప్రాముఖ్యత ఎదిగే వయసులో పెద్దగా తెలీలేదు. ఇప్పటికీ మేము నలుగురం ఇంతలా ఎలా క్లోజ్ అయ్యామో అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరం ఒక్కో రకం. మా అందరిదీ వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్.. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చాం. మొదటిసారి కలుసుకున్నప్పుడు కూడా ఏదో కొంతకాలం కలిసుంటాంలే అనుకున్నాను. కానీ బాలి ట్రిప్‌తో మా బంధం బలపడింది. ఫ్రెండ్స్ అయ్యాక విహారయాత్రలకు వెళ్లడం మామూలే. లైఫ్‌లో చిన్న బ్రేక్ తీసుకోవాలని..కానీ మేమంతా లైఫ్‌లో ఒక బ్రేక్ తీసుకోవాలని చూస్తున్నాం. ఆ ఆలోచనతోనే ఈ ట్రిప్పుకు వెళ్లాం. నిజానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లేవరకు కూడా ఈ విహారయాత్ర నుంచి ఎలా తప్పించుకోవాలనే చూశాను. కానీ ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఇంత అందమైన స్నేహాన్ని, ప్రేమను మిస్ అయ్యేదాన్ని అనిపిస్తోంది. నాకంటూ ముగ్గురు, నలుగురు స్నేహితులుంటే చాలు ఇంకెవరూ వద్దు అన్నంతలా మారిపోయాను. స్నేహానికి మారుపేరులా..ఎందుకంటే ఎవరితోనైనా స్నేహం చేసినప్పుడు.. అది వర్కవుట్ కాకపోతే.. గొడవలు వస్తే.. ఎలా అన్న భయం నన్నెప్పుడూ వెంటాడుతుంది. కానీ ఈ అమ్మాయిలు స్నేహానికి కొత్త నిర్వచనంలా మారిపోయారు. ప్రతి విషయాల్లో బలవంతంగా దూరకుండా నాకంటూ టైమ్ ఇస్తూనే నా బాగోగులు చూసుకునేవారు. అందుకేనేమో వారికి అంతగా క్లోజ్ అయ్యాను. ప్రెగ్నెన్సీలో మంచి రోజుల్ని, చెడ్డ రోజుల్ని రెండింటినీ చూశాను. ఈ ఫ్రెండ్స్ లేకపోయుంటే నా జర్నీ ఇలా ఉండేదే కాదు.ఐ లవ్యూ..మీరంతా కలిసి నన్నెక్కువ ముద్దు చేసేవారు. అది చూసి నేను కొంత భయపడేదాన్ని కానీ ఇప్పుడలా కాదు. మీరు నా చుట్టూ ఉంటే అదే నా సేఫ్ ప్లేస్. నన్ను బాగా చూసుకున్నందుకు, తినిపించినందుకు, ప్రేమించినందుకు థాంక్యూ. నా కూతురికి మీరందరూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్యూ అని జాహ్నవి రాసుకొచ్చింది. ఫ్రెండ్స్ నిహారిక కొణిదెల, వితికా షెరు, అంబటి భార్గవిని ట్యాగ్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండరు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) చదవండి: RRR చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ అభిమాని.. తారక్ ఎమోషనల్

నా డబ్బులతో పారిపోయారు.. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు: సింగర్ ఆవేదన
బాలీవుడ్ సింగర్ నేహ కక్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు వెళ్లారు. కానీ ఆమె ఆ ఈవెంట్‌కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. ఆ తర్వాత లేట్‌గా రావడంపై అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు సింగర్. ఆయితే నేహాకు ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రం ఊహించని విధంగా షాకిచ్చారు. ఈవెంట్ ముగిశాక నేహా కక్కర్‌కు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. ఈ విషయాన్ని నేహా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.నేహా కక్కర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నేను మెల్బోర్న్ కన్సర్ట్ను ప్రేక్షకులకు పూర్తిగా ఉచితంగా ప్రదర్శన ఇచ్చానని మీ అందరికీ తెలుసా? నిర్వాహకులు నా డబ్బుతో పారిపోయారు. నా టీమ్‌కు కనీసం ఆహారం, హోటల్, నీరు కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని స్నేహితుల వెళ్లి వారికి ఆహారం అందించారు. అయినా కూడా మేము స్టేజ్‌పైకి వచ్చాం. మేము ఆలస్యంగా వచ్చామని మాకు డబ్బు ఇవ్వలేదు. అంతేకాకుండా నిర్వాహకులు నా మేనేజర్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు' అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కన్సర్ట్కు హాజరైన కొంతమంది కక్కర్‌పై సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు ఆలస్యం రావడంపై నిరాశ వ్యక్తం చేశారు.అభిమానులకు కృతజ్ఞతలు..అయితే సింగర్ నేహా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు జరిగిన విషయం గురించి మాట్లాడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆ రోజు నా కచేరీకి హాజరైన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

జెయింట్స్ సూపర్ విక్టరీ
ఉప్పల్ స్టేడియంలో మళ్లీ పరుగులు వరద పారింది. దాదాపు 400 పరుగులు కూడా నమోదయ్యాయి. కానీ ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా వచ్చింది. ప్రతీసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతూ ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేసే సన్‌రైజర్స్ ఈసారి ఓటమి పక్షాన నిలిచింది. బలహీన బౌలింగ్‌గా అనిపించిన లక్నో పట్టుదలగా ఆడి రైజర్స్‌ను 200 గీత దాటకుండా చేస్తే... ఆపై లక్నో బ్యాటర్లు పూరన్, మిచెల్ మార్ష్‌లు సన్‌రైజర్స్‌కు వారి బ్యాటింగ్ దెబ్బనే రుచి చూపించారు. ఫలితంగా హైదరాబాద్‌కు అనూహ్య ఓటమి ఎదురుకాగా... లక్నో గెలుపు బోణీ చేసింది. ఏడాది క్రితం ఇదే మైదానంలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో టీమ్ ఇప్పుడు బదులు తీర్చుకుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు సొంతగడ్డపై తొలి పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 47; 5 ఫోర్లు,3 సిక్స్‌లు), అనికేత్ వర్మ (13 బంతుల్లో 36; 5 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డి (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పరుగులు సాధించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 43 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. అభిషేక్, ఇషాన్ విఫలం సన్‌రైజర్స్‌కు ఈసారి సరైన ఆరంభం లభించలేదు. శార్దుల్ వరుస బంతుల్లో అభిషేక్ శర్మ (6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ (0)లను వెనక్కి పంపడంతో 15 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే హెడ్ మాత్రం తన జోరు తగ్గించలేదు. అవేశ్ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగాడు. రవి బిష్ణోయ్ ఓవర్లో 35 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను పూరన్ వదిలేశాడు. అదే ఓవర్లో బిష్ణోయ్ కూడా కఠినమైన మరో రిటర్న్ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. అయితే దాని వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. మరో 12 పరుగులు జోడించిన హెడ్‌ను ప్రిన్స్ యాదవ్ అద్భుత బంతితో క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రిన్స్‌కు ఐపీఎల్లో ఇది తొలి వికెట్ కావడం విశేషం. మరో ఎండ్‌లో బాగా తడబడిన నితీశ్ ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించిన క్లాసెన్ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. అయితే అనికేత్, ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18; 3 సిక్స్‌లు) సిక్సర్లు స్కోరును 200 పరుగులకు చేరువగా తెచ్చారు. బిష్ణోయ్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు బాదిన అనికేత్...రాఠీ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్సర్లతో చెలరేగాడు. అయితే తర్వాతి బంతికీ ఇదే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు. చివరి 2 ఓవర్లలో కలిపి 10 పరుగులే చేయగలిగిన హైదరాబాద్ ఆఖరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం గమనార్హం. మెరుపు భాగస్వామ్యం... షమీ తన తొలి ఓవర్లో మార్క్రమ్ (1)ను అవుట్ చేసిన ఆనందం రైజర్స్ శిబిరంలో ఎంతోసేపు నిలవలేదు. అక్కడి నుంచి మార్ష్, పూరన్ కలిసి రైజర్స్ బౌలర్ల భరతం పట్టారు. సిమర్జీత్ ఓవర్లో పూరన్ ఫోర్, 2 సిక్స్‌లు బాదగా, షమీ ఓవర్లో మార్ష్ 2 సిక్స్‌లు కొట్టాడు. అభిషేక్ ఓవర్లో కూడా పూరన్ 2 సిక్స్‌లు కొట్టడంతో పవర్‌ప్లేలో లక్నో స్కోరు 77 పరుగులకు చేరింది. ఆ తర్వాత పూరన్ మరింత చెలరేగిపోయాడు. 18 బంతుల్లోనే ఈ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్ అవుటైన తర్వాత 29 బంతుల్లో మార్ష్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో బదోని (6), పంత్ (15) అవుటైనా... మిల్లర్ (13 నాటౌట్), సమద్ (8 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి విజయాన్ని పూర్తి చేశారు. మూడు బంతులు, మూడు సిక్సర్లు... సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఆసక్తికరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తొలి 3 బంతులను అతను సిక్సర్లుగా మలిచాడు. శార్దుల్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అతను, అవేశ్ ఓవర్లో తొలి బంతిని సిక్సర్ కొట్టి తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అనూహ్య రనౌట్... టాప్–3 బ్యాటర్లు వెనుదిరిగిన తర్వాత రైజర్స్ ఆశలన్నీ క్లాసెన్‌పైనే ఉన్నాయి. అతనూ అప్పటికే చక్కటి షాట్లతో ధాటిని ప్రదర్శిస్తున్నాడు. అయితే ప్రిన్స్ యాదవ్ ఓవర్లో అతను రనౌట్ కావడం జట్టు తుది స్కోరుపై ప్రభావం చూపించింది. ప్రిన్స్ వేసిన బంతిని నితీశ్ బలంగా బాదగా బౌలర్ దానిని క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అది విఫలం కాగా, బంతి చేతులను తాకి నాన్ స్ట్రయికింగ్ స్టంప్స్ వైపు వెళ్లింది. అప్పటికే పరుగు కోసం క్రీజ్ దాటిన క్లాసెన్ రనౌటవక తప్పలేదు. ఎవరీ అనికేత్ వర్మ...? ఐదు సిక్సర్లతో సన్‌రైజర్స్ అభిమానులను ఆకట్టుకున్న అనికేత్ వర్మ గత మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. రాజస్తాన్‌తో పోరులో తన రెండో బంతికే అతను సిక్స్ కొట్టాడు. ఐపీఎల్‌కు ముందు అతను సీనియర్ స్థాయిలో ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడాడు. మధ్యప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన అనికేత్ హైదరాబాద్‌తో జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే అండర్–23 స్థాయి తన దూకుడైన ప్రదర్శనతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. దేశవాళీ అండర్–23 వన్డే టోర్నీలో 7 మ్యాచ్‌లలో 16 సిక్సర్లు బాదాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కూడా చెలరేగిన తీరును చూసి సన్‌రైజర్స్ వేలంలో కనీస విలువ రూ. 30 లక్షలకు అనికేత్‌ను తీసుకుంది. పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోనే అయినా మెరుగైన అవకాశాల కోసం సరిహద్దు రాష్ట్రం మధ్యప్రదేశ్ చేరుకొని అక్కడే ఆటను మొదలు పెట్టాడు. ఐపీఎల్లో నేడుచెన్నై X బెంగళూరువేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) ప్రిన్స్ 47; అభిషేక్ (సి) పూరన్ (బి) శార్దుల్ 6; ఇషాన్ కిషన్ (సి) పంత్ (బి) శార్దుల్ 0; నితీశ్ రెడ్డి (బి) రవి బిష్ణోయ్ 32; క్లాసెన్ (రనౌట్) 26; అనికేత్ (సి) మిల్లర్ (బి) రాఠీ 36; అభినవ్ మనోహర్ (సి) సమద్ (బి) శార్దుల్ 2; కమిన్స్ (సి) రాఠీ (బి) అవేశ్ 18; హర్షల్ (నాటౌట్) 12; షమీ (సి) బదోని (బి) శారుŠద్ల్ 1; సిమర్జీత్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–15, 2–15, 3–76, 4–110, 5–128, 6–156, 7–156, 8–176, 9–181. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–34–4, అవేశ్ ఖాన్ 4–0–45–1, దిగ్వేశ్ రాఠీ 4–0–40–1, రవి బిష్ణోయ్ 4–0–42–1, ప్రిన్స్ యాదవ్ 4–0–29–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) కమిన్స్ 52; మార్క్రమ్ (సి) కమిన్స్ (బి) షమీ 1; పూరన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 70; పంత్ (సి) షమీ (బి) హర్షల్ 15; బదోని (సి) హర్షల్ (బి) జంపా 6; మిల్లర్ (నాటౌట్) 13; సమద్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (16.1 ఓవర్లలో 5 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–4, 2–120, 3–138, 4–154, 5–164. బౌలింగ్: అభిషేక్ శర్మ 2–0–20–0, షమీ 3–0–37–1, సిమర్జీత్ సింగ్ 2–0–28–0, కమిన్స్ 3–0–29–2, ఆడమ్ జంపా 4–0–46–1, హర్షల్ పటేల్ 2–0–28–1, ఇషాన్ కిషన్ 0.1–0–4–0.

పూరన్, మార్ష్ విధ్వంసం.. సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన లక్నో
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కేవలం 16.1 ఓవర్లలో ఊదిపడేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన మిచెల్ మార్ష్ సైతం తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా, హర్షల్ పటేల్, షమీ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు.నాలుగేసిన శార్ధూల్..ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు.చదవండి: IPL 2025: నికోలస్ పూరన్ ఊచకోత.. ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్

నికోలస్ పూరన్ ఊచకోత.. ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 191 పరుగుల లక్ష్య చేధనలో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వన్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగిన నికోలస్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కెప్టెన్ కమ్మిన్స్‌తో సహా ఏ బౌలర్‌ను పూరన్ విడిచిపెట్టలేదు.ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో ఈ కరేబియన్ బ్యాటర్ కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా పూరన్ నిలిచాడు. ఓవరాల్‌గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. అతడి విధ్వంసం ఫలితంగా లక్నో లక్ష్యాన్ని కేవలం లక్నో కేవలం 16.1 ఓవర్లలో ఛేదించింది. లక్నో బ్యాటర్లలో పూరన్‌తో పాటు మార్ష్(52) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా, హర్షల్ పటేల్, షమీ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు. Raining sixes in Hyderabad... but by #LSG 🌧Nicholas Pooran show guides LSG to 77/1 after 6 overs 👊Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @LucknowIPL pic.twitter.com/K2Dlk5AXQw— IndianPremierLeague (@IPL) March 27, 2025

13 బంతుల్లో విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ నయా హీరో! ఎవరీ అనికేత్?
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో కొత్త హిట్టర్ దొరికేశాడు. అతడు యువ ఆటగాడు అనికేత్ వర్మ. ఐపీఎల్-2025లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనికేత్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అనికేత్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అనికేత్.. 5 సిక్స్‌లతో 36 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ లక్నో ముందు ఫైటింగ్ స్కోర్ ఉంచడంలో అనికేత్ది కీలక పాత్ర. ఈ క్రమంలో ఎవరీ అనికేత్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు. ఎవరీ అనికేత్ వర్మ..?23 ఏళ్ల అనికేత్ వర్మ.. ఫిబ్రవరి 5, 2002న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జన్మించాడు. కానీ అతడు దేశవాళీ క్రికెట్లో మాత్రం మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన వర్మ.. పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. అనికేత్ వర్మ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో తనను తను నిరూపించుకున్నాడు.ఫెయిత్ క్రికెట్ క్లబ్ తరపున 44 బంతుల్లో 120 చేసిన వర్మ.. మధ్యప్రదేశ్ లీగ్ (MPL) టీ20 లీగ్‌లో కేవలం 41 బంతుల్లో 123 పరుగులు చేశాడు. అదేవిధంగా పురుషుల అండర్-23 స్టేట్ A ట్రోఫీలో సైతం ఆజేయ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు.చదవండి: #Ishan Kishan: నిన్న సెంచరీ.. కట్ చేస్తే! నేడు తొలి బంతికే ఔట్
బిజినెస్

వాళ్లకు మాత్రం ఏఐ ముప్పు ఉండదు.. బిల్ గేట్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశ్రమలను వేగంగా మార్చివేసింది. ముఖ్యంగా 2022లో చాట్‌జీపీటీ వచ్చినప్పటి నుంచి దీని విస్తృతి మరింతగా పెరిగింది. చాలా మంది తమ రోజువారీ జీవితంలో, వృత్తుల్లో జెమినీ, కోపైలట్, డీప్‌సీక్ వంటి చాట్బాట్లను వినియోగిస్తున్నారు. దీని ప్రయోజనాలు ఎలా ఉన్నా సరే.. మానవ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగేసుకుంటుందన్న ఆందోళనలు మాత్రం ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఈ సరికొత్త సాంకేతిక విప్లవం నడుమ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. కనీసం కొన్ని రోజులైనా కృత్రిమ మేధ ఆధారిత ఆటోమేషన్ నుండి సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉన్న వృత్తులపై తన భావాలను పంచుకున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో గేట్స్ ప్రత్యేకమైన మానవ నైపుణ్యాలు అవసరమయ్యే మూడు కీలక రంగాలను హైలైట్ చేశారు. అవి కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బయాలజీ.కోడర్లు.. వీళ్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించే నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకునే అవకాశం ఉంది. ఏఐ కోడ్ జనరేట్ చేయడం, కొన్ని ప్రోగ్రామింగ్ పనులను ఆటోమేట్ చేయడంలో పురోగతి సాధించినప్పటికీ, సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఖచ్చితత్వం, లాజిక్, సమస్య పరిష్కార నైపుణ్యాలు దీనికి లేవు. డీబగ్గింగ్ చేయడానికి, రిఫైనింగ్ చేయడానికి, మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మెరుగుపరచడానికి కూడా హ్యూమన్ ప్రోగ్రామర్లు అనివార్యమని గేట్స్ అభిప్రాయపడ్డారు.ఎనర్జీ ఎక్స్పర్ట్స్శిలాజ ఇంధనాలు, అణుశక్తి, పునరుత్పాదక ఇంధన వనరులతో కూడిన ప్రపంచ ఇంధన రంగం అత్యంత సంక్లిష్టమైనది. కృత్రిమ మేధస్సు.. సామర్థ్యాన్ని మెరుగుపరచడం, డిమాండ్‌ను అంచనా వేయడం, మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అయితే ఇది ఇంధన పరిశ్రమను నిర్వచించే సంక్లిష్టమైన నియంత్రణ భూభాగాలు, భౌగోళిక రాజకీయ సవాళ్లు, అనూహ్య మార్కెట్ హెచ్చుతగ్గులను స్వతంత్రంగా నిర్వహించలేదు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, సుస్థిర పరిష్కారాలను అమలు చేయడంలో, విద్యుత్ అంతరాయాలు లేదా వనరుల కొరత వంటి సంక్షోభాలకు ప్రతిస్పందించడంలో మానవ నైపుణ్యం కీలకమని గేట్స్ నొక్కి చెప్పారు.జీవశాస్త్రవేత్తలుజీవశాస్త్రంలో.. ముఖ్యంగా వైద్య పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణలో మానవ అంతర్దృష్టి, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన అవసరం. కృత్రిమ మేధ పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడంలో, నమూనాలను గుర్తించడంలో రాణిస్తున్నప్పటికీ, ఇది అద్భుతమైన పరికల్పనలను రూపొందించే లేదా పరిశోధనలో సహజమైన పురోగతిని సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. వ్యాధుల నిర్ధారణకు, జన్యుక్రమాలను విశ్లేషించడానికి, ఔషధ ఆవిష్కరణకు మాత్రం ఏఐ సహాయపడుతుందని గేట్స్ పేర్కొన్నారు.

కారు కొన్న కస్టమర్.. ఆనంద్ మహింద్రా ఎమోషనల్!
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా.. అబ్బురపరిచే, ఆలోచింపజేసే వీడియోలను, సమాచారాన్ని తన ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ఈ సారి ఓ కస్టమర్ తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొన్న వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఇది కేవలం వీడియో మాత్రమే కాదంటూ ఎమోషనల్ అవుతూ మూడు దాశాబ్దాల క్రితం నాటి కథను రాసుకొచ్చారు. ఇంతకీ ఆ కస్టమర్ ఎవరు.. ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..ఆనంద్ మహీంద్రా ఇటీవల డాక్టర్ పవన్ గోయెంకా ప్రయాణంపై తన హృదయపూర్వక ఆలోచనలను పంచుకున్నారు. 1990ల ప్రారంభంలో గోయెంకా యూఎస్‌లో జనరల్ మోటార్స్‌లో మంచి హోదాతో కూడిన ఉద్యోగాన్ని విడిచి భారత్‌కు తిరిగి వచ్చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆనంద్ మహింద్రా ఆయన్ను కంపెనీ నాసిక్ ఫెసిలిటీలో ఆర్అండ్డీ డిప్యూటీ హెడ్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం& ఎం) లో చేరేలా ఒప్పించారు.అప్పట్లో కంపెనీ ఆర్అండ్డీ విభాగం పరిస్థితిని చూసిన పవన్ గోయెంకా ఇక్కడ కొనసాగుతారా లేదా అన్న సందేహాలు ప్రారంభంలో ఉన్నప్పటికీ ఆయన కొనసాగారు. పరిశోధన, అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. ఐకానిక్ మహీంద్రా స్కార్పియో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం కంపెనీ ఉత్పత్తి శ్రేణిని రూపొందించడమే కాకుండా, భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో సృజనాత్మకతను కొనసాగించే ప్రపంచ స్థాయి ఆర్ & డి కేంద్రానికి పునాది వేసింది. ఆ తర్వాత గోయెంకా ఎంఅండ్ఎం లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో పదవి దాకా ఎదిగారు.గోయెంకా, ఆయన భార్య మమత ఇటీవల మహీంద్రా లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటైన ఎక్స్ఈవీ 9ఈ వాహనాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. తన దృష్టిలో ఈ క్షణం కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదే.. అంత కంటే ఎక్కువ. మహీంద్రా ఆటోమోటివ్ ల్యాండ్ స్కేప్ ను మార్చడంలో కీలక పాత్ర పోషించిన గోయెంకా ఇప్పుడు తాను చేసిన ఆవిష్కరణలను స్వీకరిస్తున్నారు.2021లో పదవీ విరమణ చేసిన తరువాత, పవన్ గోయెంకా భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అంతరిక్ష విభాగం సంస్థ ఇన్-స్పేస్ చైర్మన్‌గా కొత్త సవాలును స్వీకరించారు. భారతీయ పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలు ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో గుర్తింపు పొందాయి. ప్రస్తుతం గోయెంకా ఐఐటీ మద్రాస్ లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్థానిక విలువ-యాడ్ అండ్ ఎక్స్ పోర్ట్స్ (స్కేల్ ) స్టీరింగ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.This is not just another video for me…When Pawan Goenka decided to return to India in the early ‘90s, leaving behind a job at General Motors, I managed to convince him to join @Mahindra_Auto at Nashik as Deputy Head of R&DHe often relates how when he first went to Nashik and… pic.twitter.com/auggd8gEQ9— anand mahindra (@anandmahindra) March 27, 2025

రక్షణ మంత్రిత్వ శాఖతో భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఒప్పందం
భారత్ ఫోర్జ్ లిమిటెడ్, దేశీయంగా అభివృద్ధి చేసిన 184 అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ (ATAGS) సరఫరా కోసం రక్షణ మంత్రిత్వ శాఖ (MoD)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 4,140 కోట్ల విలువైన ఈ ఒప్పందం.. 155mm/52 క్యాలిబర్ ఆర్టిలరీ సిస్టమ్ కోసం మొత్తం రూ. 6,900 కోట్ల సేకరణ కార్యక్రమంలో 60 శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది.భారత్ ఫోర్జ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'బాబా కళ్యాణి', రక్షణ తయారీలో ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు నిదర్శనంగా ఈ ఒప్పందం జరిగిందని అన్నారు. ఈ ఒప్పందం రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది.ఈ సందర్భంగా, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాబా కళ్యాణి మాట్లాడుతూ, ఇది కంపెనీకి గర్వకారణమైన క్షణం అని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అనే దార్శనికతకు ఇది నిదర్శనం. రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం, డీఆర్డీఓ, ఏఆర్డీఈ, భారత్ ఫోర్జ్లోని మా బృందం వారి అమూల్యమైన ప్రయత్నాలు.. సహకారాన్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని అన్నారు.#MoD has signed contracts with #BharatForge Limited and #Tata Advanced System Limited for the procurement of 155mm/52 Calibre Advanced Towed Artillery Gun Systems (#ATAGS) and High Mobility Vehicle 6x6 Gun Towing Vehicles respectively at a total cost of about Rs 6,900 crore.… pic.twitter.com/3keBkqh2e8— Defence Production India (@DefProdnIndia) March 26, 2025

మార్చి 31 డెడ్‌లైన్.. ఇవన్నీ పూర్తి చేశారా?
మార్చి 31తో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అంతే కాకుండా ఆదాయ పన్ను, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, యూపీఐ రూల్, అప్డేటెడ్ ఐటీఆర్ డెడ్‌లైన్ మొదలైనవాటికి కూడా అదే ఆఖరి రోజు కావడం గమనార్హం. కాబట్టి ఈ కథనంలో ఏప్రిల్ 1నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్మహిళలు, బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' (MSSC) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ 2023 జూన్ 27న ప్రారంభించింది. ఇది ఈ నెల చివరి నాటికి క్లోజ్ అవుతుంది. ఈ పథకంలో రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ గడువు రెండేళ్లు. ఇందులో వడ్డీ 7.5 శాతం ఉంటుంది.యూపీఐ రూల్నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల భద్రతను మెరుగుపరచడానికి కొత్త ఆదేశాలను ప్రకటించింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి.ఐటీఆర్ డెడ్లైన్భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులు 2025 మార్చి 31కు ముందే తమ అప్డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR-U) దాఖలు చేసుకోవాలి. గడువులోపల ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే.. దాఖలు చేసిన రిటర్న్‌లకు 25% తక్కువ అదనపు పన్ను రేటు ఉంటుంది. గడువు దాటితే.. అదనపు పన్ను భారం మోయాల్సి ఉంటుంది.హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య భీమాకు సంబంధించిన ఏవైనా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటే మార్చి 31లోపల క్లియర్ చేసుకోవాలి. సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపును కోల్పోకుండా ఉండటానికి గడువు లోపల చెల్లింపులు పూర్తవ్వాలి. అలా చేయడంలో విఫలమైతే గడువులోగా ప్రీమియంలు చెల్లించకపోతే ఆరోగ్య కవరేజీని కోల్పోయే ప్రమాదం ఉంది.అడ్వాన్స్ ట్యాక్స్అదనపు ఆదాయాలపై ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైన.. జీతం పొందుతున్న ఉద్యోగులు మార్చి 31 లోపల చెల్లించవచ్చు. పన్ను చెల్లింపుదారులు 2021-22 ఆర్థిక సంవత్సరానికి అప్డేట్ చేయబడిన రిటర్న్(ITR-U)ను దాఖలు చేయడం ద్వారా గత ఆదాయపు పన్ను రిటర్న్‌లను సరిదిద్దవచ్చు. దీనికి కూడా మార్చి 31 చివరిరోజు.ఇదీ చదవండి: మూడో కంటికి చిక్కని ‘సిగ్నల్’.. ఈ యాప్ గురించి తెలుసా?ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్పన్ను చెల్లింపుదారులు మార్చి 31 లోపల.. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్, డిక్లరేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది. పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన ప్లాన్ చేసుకుంటే గడువు లోపల పన్ను చెల్లించాలి. అయితే పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునేవారే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్ మెంట్లు చేసుకోవచ్చు. కొత్త పన్న విధానానికి ఇది వర్తించదు.ఎస్బీఐ క్రెడిట్ కార్డు రూల్స్ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తోంది. ఎస్బీఐ తన క్లబ్ విస్తారా ఎస్బీఐ, క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
ఫ్యామిలీ

కాశ్మీర్ అందాలతో.. హాయిదరాబాద్
ఎండలు మండుతున్నాయి.. ఉదయం 10 గంటలు దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. ఈ సమయంలో మైనస్ డిగ్రీల్లో గడ్డకట్టే చల్లని ప్రదేశం కోసం ఎదురుచూస్తున్నారా..? ఉపశమనం కోసం హిమగిరుల్లో సేదతీరాలని కోరుకుంటున్నారా.. సిమ్లా పొగ మంచులో విహరించాలని, డార్జిలింగ్ గడ్డకట్టిన మంచుపై స్కేటింగ్ చేయాలని ఆశిస్తున్నారా.. అయితే మీకోసం నగరంలో స్నో థీమ్‌తో వింటర్ థ్రిల్లింగ్ ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయి.కాశ్మీర్ మంచు కొండల అనుభూతిని కొండాపూర్‌లోని ఓ మాల్తో పాటు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఓ ప్రాంతంలో సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీ ఉద్యోగులు ఇలా వివిధ వర్గాలకు చెందిన వానిరి ఆకట్టుకోవడానికి వింటర్ థ్రిల్లింగ్ వినోద కేంద్రాల్లో ప్రత్యేకించి ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. కుటుంబ వ్యవహారాలు, చదువు, పనిఒత్తిడి నుంచి ఉపశమనం కోసం మైనస్ డిగ్రీల్లో సేదతీరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. స్నో ప్రాంతంలోకి ప్రవేశించడానికి ముందు చలిని తట్టుకునే జర్కినీ, బూట్లు, చేతి గ్లౌజ్‌లు నిర్వాహకులు అందిస్తారు. విశాలమైన మంచు గదిలోకి వెళ్లగానే కశీ్మర్, సిమ్లా, డార్జిలింగ్ తదతర ప్రదేశాలు గుర్తుకొస్తాయి. మంచు కొండలు ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవచ్చు. ఇక్కడే తక్కువ ఖర్చుతో ఆ అనుభూతి పొందవచ్చు. మండు వేసవిలో గడ్డకట్టిన స్నో, పొగ మంచుపై కాసేపు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు.పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారుహిమాలయాల్లో ఉన్నామన్న ఫీల్ ఉంది. చాలాబాగా నచ్చింది. గడ్డకట్టిన ఐస్, పొగమంచు, వివిధ రకాల థీమ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మేం మొత్తం ఐదుగురం వచ్చాం. మా కంటే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. – దీప, షేక్‌పేట్, హైదరాబాద్బాగా నచ్చింది ..మాది విశాఖపట్నం. మా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి గతంలో ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతం ఎంతగానో నచ్చింది. మరో రావాలనిపించింది. పాఠశాలలకు సెలవులు కావడంతో మళ్లీ మా అక్క నేను వచ్చాం. మంచులో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. – హనీష్, రిథిమ, విశాఖపట్నంమంచు క్రీడలు.. విశాలమైన అతిశీతల గదుల్లో మంచు క్రీడలు అందుబాటులో ఉంటాయి. టోబోగానింగ్, స్నో స్లెడ్డింగ్, స్నో రాక్ క్లైమింగ్, స్నో డాన్స్, ఫ్లోర్లో డాన్స్ వంటివి ప్లాన్ చేసుకోవచ్చు. మంచు ప్యాలెస్‌లు, మంచుతో కప్పబడిన పర్వతాలు, నల్ల సీల్స్‌తో కూడిన ఓక్ చెట్లు, ధ్రువ ఎలుగుబంట్లు, పెంగి్వన్లు, ఇగ్లూలు కనువిందు చేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్నో మచ్ ఫన్, గేమ్స్‌తో గొప్ప జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలకు వేర్వేరుగా టికెట్ ధరలు ఉంటాయి.

మా చెల్లికి 28 ఏళ్లు.. పెళ్ళి చెయ్యొచ్చంటారా?
డాక్టర్! మా చెల్లెలి వయస్సు 28 ఏళ్లు. డిగ్రీ పాసయ్యింది. ఐదేళ్లుగా మానసిక వ్యాధికి మందులు ఇప్పిస్తున్నాం. తనలో తాను నవ్వుకోవడం, గొణుక్కోవడం, ఎవరేది అంటున్నా తన గురించేననడం. చెవిలో ఎవరివో మాటలు వినబడుతున్నాయనడం... పనేమీ చేయదు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో వైద్యం చేయించిన తర్వాత చాలా మెరుగైంది. కానీ పూర్తిగా మామూలు మనిషి కాలేదు. మా నాన్న లేరు. చెల్లికి పెళ్ళి చేయాలని అమ్మ తాపత్రయం. చెల్లి మానసిక స్థితి గురించి చెప్పకుండా చేస్తే తర్వాత సమస్యలొస్తాయని భయం. ఇలాంటి వారికి పెళ్ళి చెయ్యొచ్చంటారా? దీనికి పరిష్కారం ఉందా? – ఉదయరాణి, హైదరాబాద్మీరు చెప్పినదాన్ని బట్టి మీ చెల్లెలు...‘స్కిజోఫ్రీనియా’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి వచ్చినవారు చాలా సంవత్సరాలపాటు డాక్టరు పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి పూర్తిగా నయం కాకపోవచ్చు. షుగర్, బి.పి. లాగా స్కిజోఫ్రీనియాని కూడా మందులతో అదుపు చేయవచ్చే తప్ప, పూర్తిగా నయం చేయడం కష్టమే! ఇలాంటి వారికి కేవలం మందులే కాకుండా, కొంతకాలం ‘రిహాబిలిటేషన్’ సెంటర్లో ఉంచితే, ఆమె యాక్టివ్‌గా, నలుగురిలో కలిసేటట్లుగా తన పనులే కాకుండా, ఇంటిపని, వంటపని, పిల్లలను చూసుకోవడం లాంటి లక్షణాలు ఆమెలో పెంపోదించేట్లుగా శిక్షణ ఇస్తారు.ఇలా చేసిన తర్వాతే అవతలివారికి విషయం చెప్పి వారు ఒప్పుకుంటే వివాహానికి అభ్యంతరం లేదు. చెప్పకుండా చేయడం అనర్థదాయకం. అన్ని విషయాలు చెబితే కొందరు ఒప్పుకోవచ్చు. అవసరమైతే డాక్టరు దగ్గరికి కూడా అవతలి పార్టీని తీసుకొచ్చి వారి అనుమానాలు నివృత్తి చేయడం మంచిది. అన్నీ చెప్పి వాళ్ల సమ్మతి మీద పెళ్లి చేసిన సందర్భాలలో భవిష్యత్తులో ఏమైనా తేడాలే వచ్చినప్పుడు ఒకవేళ వారు విడాకుల కేసు వేసినా కోర్టు అంత సులభంగా విడాకులు మంజూరు చేయదు.ఎందుకంటే గతంలో ఒకరు తన భార్యకు స్కిజోఫ్రీనియా ఉంది కాబట్టి విడాకులివ్వాలని కోర్టుకెక్కాడు. అయితే స్కిజోఫ్రీనియా జబ్బు వచ్చినంత మాత్రాన విడాకులు ఇవ్వలేం, కానీ ఆ వ్యాధి వలన ఆ భర్త, పిల్లలు, కుటుంబం ఏమేరకు నష్టపోయిందనే విషయాలను నిర్ధారించగలిగితేనే అలాంటి కేసుల విషయంలో విడాకులు ఇవ్వాలా, వద్దా... అనే దాన్ని నిర్ణయించవలసి ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ జడ్జిమెంట్‌ను ఇప్పటికీ మన దేశంలో ప్రామాణికంగా పాటిస్తూ ఉన్నారు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com

స్నేహ శిల్పం
వరల్డ్ ఆర్ట్ మార్కెట్లో మన ఆర్ట్ వాటా 0.5 శాతమే! అసలు విలువ రెండువేల కోట్లకు పైమాటే అని చెబుతున్నారు నిపుణులు! మరెందుకు అంత తక్కువంటే.. ‘మనకు ఆర్ట్‌ను మార్కెట్ చేసుకోవడం తెలీక’ అంటారు ఆర్ట్‌లో పీహెచ్డీ, ఆర్ట్ ట్రేడ్‌లో అపార అనుభవం గడించిన హైదరాబాద్ కళాకారిణి, శిల్పి డాక్టర్ స్నేహలతా ప్రసాద్. ఆమె పరిచయం.. .డాక్టర్ స్నేహలతా ప్రసాద్ సొంతూరు జోద్పూర్. తండ్రి దివాన్సింగ్ నరూకా డిఫెన్స్‌లో పనిచేసేవారు. అమ్మ.. లీలా దివాన్ హోమ్ మేకర్. ఆడపిల్లల మీద ఆంక్షలుండే రాజపుత్ర కుటుంబమైనా తల్లిదండ్రులిద్దరూ చదువుకున్నవారవడంతో స్నేహలతకు స్వేచ్ఛనిచ్చారు. ఆమె డాక్టర్ అవ్వాలని తండ్రి ఆశపడ్డాడు. కానీ స్నేహకు చిన్నప్పటి నుంచీ డ్రాయింగ్ అంటే ఆసక్తి. చక్కగా బొమ్మలు వేసేది. ఆర్మేచర్, క్లే ఆర్ట్ మీద వ్యాక్స్‌తో అలంకరించేది. అది గమనించే లీలా దివాన్ కూతురు ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంది. ఆమె అనుకున్నట్టే స్నేహ ఆర్టిస్ట్ అయింది. పీహెచ్డీ చేసింది. తన ఆర్ట్‌ని మార్కెట్ చేసుకునే ఆర్టూ తెలిసుండాలని ఫారిన్ ట్రేడ్ కోర్స్ కూడా చేసింది. సొంతంగా గ్యాలరీ పెట్టుకుంది. ఆర్ట్ + 2ఎగ్జిబిషన్స్ లో ఆమె పెయింటింగ్స్ ఎమ్మెఫ్ హుస్సేన్ పెయింటింగ్స్‌తో సమంగా సేల్ అయ్యేవి! అలా రాజస్థాన్‌లో టాప్ టెన్ యంగ్ ఆర్టిస్ట్స్లో ఒకరుగా నిలిచింది.పెళ్లితో...సంప్రదాయ రాజపుత్ర కుటుంబాల నుంచి వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ పెళ్లయ్యాక స్నేహ గృహిణిగా ఉండాలనే షరతుతో వచ్చినవే! దాంతో వాటిని తిరస్కరించారు స్నేహ తల్లిదండ్రులు. అప్పుడే స్నేహా వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి డాక్టర్. నాన్‌మెడికల్ ప్రొఫెషన్ అమ్మాయి కోసం వెదుకుతున్నాడతను. అందరికీ నచ్చడంతో 2004లో పెళ్లి అయింది. అతని పేరు డాక్టర్ ప్రసాద్ పత్రి. తెలుగు వ్యక్తి. అయితే అది రాజ్‌పుత్ సంబంధం కాదని ఆ పెళ్లికి స్నేహా వాళ్ల దగ్గరి బంధువులెవరూ రాలేదు. కొత్తదంపతులు హైదరాబాద్ వచ్చేశారు. పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టడంతో మాతృత్వాన్ని ఆస్వాదించాలనుకుంది స్నేహ. దాంతో పెయింటింగ్‌కి బ్రేక్ పడింది.సెకండ్ ఇన్నింగ్స్...పదేళ్ల తర్వాత మళ్లీ కాన్వాస్ ఫ్రేమ్ చేసుకుంది స్నేహ. అయితే అదంత ఈజీ కాలేదు. పెళ్లికిముందు ఆర్టిస్ట్‌గానే కాదు మంచి ఆంట్రప్రెన్యూర్‌గానూ స్పేస్ సంపాదించుకున్న ఆమెకు ఈ పదేళ్లలో చాలా మారిపోయినట్టనిపించింది. దాంతో జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ షో కోసం ఢిల్లీ లలిత కళా అకాడమీని బుక్ చేసుకుంది. నెల రోజుల్లో ప్రదర్శన. బ్రేక్ తీసుకున్న పదేళ్ల కాలాన్నే పద్నాలుగు పెయింటింగ్స్ తో వ్యక్తపరచింది. మరోటి ‘గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ పెయింటింగ్’. తనను ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆర్ట్ఫామ్స్ని ట్రాన్స్పరెంట్ ఫామ్‌లో వేసిన 32 అడుగుల తన తొలి పెద్ద పెయింటింగ్. దాని కోసం చాలా కష్టపడింది. ఆ శ్రమ వృథా కాలేదు. కాంప్లిమెంట్స్తోబాటు కాసులూ వచ్చాయి. లలిత కళా అకాడమీలో ఆమెకు లభించిన ఆదరణ చూసి భర్త ప్రసాద్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆమె కెరీర్‌కి సపోర్ట్‌గా నిలిచారు.శిల్పం...2013లో లలిత కళా అకాడమీ వాళ్లదే సిమ్లాలో ఆర్ట్ క్యాంప్ ఉంటే వెళ్లింది స్నేహ. అందులో పెయింటింగ్, స్కల్ప్చర్ రెండూ ఉన్నాయి. అక్కడ వుడ్ స్కల్ప్టింగ్ చూసేసరికి ఒక్కసారిగా తన చిన్నప్పటి స్కల్ప్టింగ్ ఆశ రెక్కలు తొడుక్కుంది. స్కల్ప్టింగ్కి ప్రయత్నించింది. తొలుత క్లే మోడలింగ్‌తో స్కల్ప్టింగ్ జర్నీ స్టార్ట్ చేసింది. తర్వాత స్టోన్ వర్క్ మొదలుపెట్టింది. ఆర్ట్ అండ్ కల్చర్ మినిస్ట్రీ జూనియర్ ఫెలోషిప్ కూడా పొందింది. ఎన్నో ఆర్ట్ క్యాంప్స్, నేషనల్, ఇంటర్నేషనల్ సింపోజియమ్స్ను నిర్వహించింది. ఈ మధ్యనే 25వ సోలో షో చేసింది. ఇంటర్నేషనల్ ఆర్ట్ షోస్‌నూ క్యురేట్ చేస్తోంది. ఆర్ట్ లెక్చర్స్ ఇస్తుంది. లాంగెస్ట్ పెయింటింగ్ ఆఫ్ ఇండియాలో పేరు సంపాదించింది. హైదరాబాద్‌లో ‘స్నేహా డి ఆర్ట్స్’ పేరుతో గ్యాలరీప్రారంభించింది. పెయింటింగ్, స్కల్ప్చర్లో శిక్షణ ఇస్తోంది. సంప్రదాయానికి విరుద్ధంగా తనను చదివించినందుకు, కళారంగంలో ప్రోత్సహించినందుకు ఎవరైతే స్నేహ కుటుంబాన్ని విమర్శించారో వాళ్లంతా స్నేహను చూసి మొత్తం ఖాన్దాన్కే ఖ్యాతినార్జించి పెట్టిందని గర్వపడే స్థాయికి ఎదిగింది. – సరస్వతి రమస్నేహలతా ఆర్ట్ క్రెడిట్స్రాజస్థాన్, ఢిల్లీ, హరియాణా హైవై, పుణె, హైదరాబాద్, కొత్తగూడెంలలో స్కల్ప్టింగ్ చేసింది. దేశంలోని పలుప్రాంతాల్లో పదిహేను ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ పార్క్స్‌ను డిజైన్ చేసింది. సికంద్రాబాద్ కంటోన్మెంట్‌లోనూ స్కల్ప్టింగ్ చేసింది. వందల ఏళ్ల నాటి శిల్పాలను రెస్టొరేట్ చేసింది. ఏఐ ఇంటిరీయర్ డిజైన్ చేస్తోంది. బికనీర్ ఆర్మీ కోసమూ పనిచేస్తోంది.‘కళతోపాటు మార్కెట్‌ను క్రియేట్ చేసుకునే స్కిల్ కూడా ఉండాలి. ఎమ్మెఫ్ హుస్సేన్ సాబ్ గనుక తన మార్కెట్‌ను డెవలప్ చేసుకోకపోయి ఉంటే ఈరోజు ఆయన ఎవరికీ తెలిసుండేవారు కాదు. ఆర్ట్‌కి మార్కెట్ అంత ఇంపార్టెంట్. ఆర్ట్ అకడమిక్స్‌లోనూ మార్కెటింగ్‌ని చేర్చాలి. విమెన్ ఆర్టిస్ట్‌లు తమ పరిధిని విస్తృతం చేసుకోవాలి. బడ్డింగ్ ఆర్టిస్ట్‌లకు చెప్పేదొకటే.. ఓన్ స్టయిల్‌ను తద్వారా ఓన్ మార్కెట్‌ను క్రియేట్ చేసుకోవాలి.’– డాక్టర్ స్నేహలతా ప్రసాద్

World Theatre Day: రాజుల కాలం నుంచి హవా సాగుతోంది..!
రాజుల కాలం నుంచి విరాజిల్లుతూ నేటికీ తనప్రాభవాన్ని నిలబెట్టుకుంటున్న రంగం నాటకరంగం... మరింతమందికి ఈ రంగాన్ని చేరువ చేయడానికి కృషి చేస్తున్నవారు ఎందరో. ప్రపంచవ్యాప్తంగా మార్చి 27న రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చదువుకు సాధనంగా, సామాజిక మార్పు కోసం ప్రభావంతంగా పనిచేసే నాటకం ప్రాముఖ్యత, మన సంస్కృతిలో ఎంతగా మమేకం అయ్యిందో తెలియజేస్తున్నారు కళాకారులు సురభి లలిత, ఆర్.రేఖ, ఇరిగి త్రివేణి.నైపుణ్యాలకు మెరుగుఎనిమిదేళ్ల వయసు నుంచే నాటకరంగంలోకి వచ్చాను. 28 ఏళ్లుగా నాటకరంగంలో ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను. నెలలో 4 నుంచి 8 వరకు ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఈ నెల 29న హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు స్వేచ్ఛ నాటక ప్రదర్శన ఉంది. ఒక నాటకం చూడటానికి 500 నుంచి 800 మంది హాజరవుతుంటారు. లైవ్ ఫెర్ఫార్మెన్స్ కాబట్టి ఎంతో సంతోషం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికివస్తుంది. ఒక్కొక్క నాటిక 50 నుంచి వందసార్లు కూడా ప్రదర్శిస్తుంటాం. ఎంత ఇబ్బంది ఉన్నా, రాత్రిళ్లు నిద్ర లేకపోయినా సరే ఒకసారి మేకప్ వేసుకొని, వేదిక ఎక్కగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ‘గడి’ అనే నాటికకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. కిందటేడాది వేసిన స్వేచ్ఛ, నిశి.. నాటికలలో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. నాటక ప్రదర్శనలు లేనప్పుడు సినిమా ఆడిషన్స్‌కి వెళుతుంటాను. ఆ విధంగా ‘బలగం’ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. కొన్ని వెబ్సీరీస్లలోనూ నటిస్తున్నాను. – సురభి లలిత, హైదరాబాద్ఎన్నో అవకాశాలకు దారి చూపిందిమా నాన్న వారసత్వంగా నాటక, హరికథా కళాకారిణిగా ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ఆ ఇష్టంతోనే ఎం.ఎ. థియేటర్ ఆర్ట్స్ చేశాను. సీతారాముల కళ్యాణంలో సీత పాత్ర, చరణ్దాసు నాటకంలో రాణి పాత్రలతో నాటకరంగానికి పరిచయం అయ్యాను. డా.బిఆర్ అంబేడ్కర్ రాజ గృహప్రవేశం నాటకంలో రమాబాయి పాత్రకు మంచి పేరు వచ్చింది. జాతీయ బహుమతి పొందిన రేడియో తెలుగు నాటకాలు– ఒక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేస్తున్నాను. గాయనిగా వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంటాను. సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ పనిచేస్తున్నాను. ఇవన్నీ నాటకం నాకు ఇచ్చిన వరాలుగా చెప్పవచ్చు. గురుకుల పాఠశాలలో మ్యూజిక్ టీచర్‌గా చేస్తున్నాను. – ఆర్.రేఖ, హైదరాబాద్వెక్కిరించినవారే మెచ్చుకున్నారుమాది గ్రామీణ నేపథ్యం. తెలుగు యూనివర్శిటీలో జానపదం, అక్కడే థియేటర్ ఆర్ట్‌లో పీజీ చేశాను. వర్క్‌షాప్స్ చేస్తూ, నాలుగేళ్లుగా నాటకాలు వేస్తున్నాను. సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ, వి ఆర్ ఇండియన్స్.. ఇలా నాటకాల జాబితా ఎక్కువ. ఇప్పుడు చాలా థియేటర్ గ్రూప్స్ వస్తున్నాయి. సినిమాల వాళ్లు కూడా థియేటర్లో నటిస్తున్నవారికిప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికి పది రాష్ట్రాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాను. మన వారసత్వం, సంప్రదాయాలు మన ముందు తరాలకు పరిచయం చేయాలని టీచింగ్ వైపుకు వచ్చాను. డ్యాన్స్, మ్యూజిక్, థియేటర్.. టీచర్‌గా కిందటి నెలలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను చదువుకునేటప్పుడు మా చుట్టుపక్కల వాళ్లు ఈ నాటకాలు, డ్యాన్సులు ఏంటి.. పెళ్లి చేసుకోకుండా అనేవారు. ఇప్పుడు ‘సాధించావు’ అంటుంటారు. – ఇరిగి త్రివేణి, దేవరకొండ, నల్లగొండ– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు
International

ఓటింగ్‌పై ట్రంప్‌కార్డు
న్యూయార్క్: అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాలో ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తెచ్చే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో సమూల సంస్కరణలు తెస్తూ బుధవారం మరో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇన్నాళ్లూ స్వీయప్రకటిత పత్రాన్ని సమర్పించి ఓటింగ్ కేంద్రంలో పౌరులు ఓటేస్తుండగా ఇకపై ఏదైనా అదీకృత గుర్తింపు పత్రం/కార్డును చూపించి అమెరికా పౌరుడిగా నిరూపించుకున్నాకే ఓటేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ తెగేసి చెప్పారు. దీంతో పెళ్లయ్యాక ఇంటి పేరు మారిన, సరైన డ్రైవింగ్ లైసెన్స్, కొత్త పాస్పోర్ట్లేని అమెరికా పౌరులకు ఓటింగ్ కష్టాలు మొదలుకానున్నాయి. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఇప్పటికే ‘ఓటింగ్ కేంద్రం వద్ద గుర్తింపు కార్డు’ విధానాన్ని అవలంబిస్తుండగా ట్రంప్ సైతం అమెరికాను ఇదే బాటలో పయనింపజేయాలని నిశ్చయించుకున్నారు. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలున్న నేపథ్యంలో ఆలోపే ఎన్నికల సంస్కరణలను అమల్లోకి తేవాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకంచేశారు. అయితే ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకే ఉండటంతో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏ మేరకు సమగ్రస్థాయిలో అమలవుతుందో తేలాల్సి ఉంది. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వును కొన్ని రాష్ట్రాలు కోర్టుల్లో సవాల్‌చేసే అవకాశం ఉంది. గుర్తింపు కార్డు తప్పనిసరి ఇన్నాళ్లూ ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు ఓటేసేటప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేసి తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి భారత్‌లో మాదిరి ఏదైనా గుర్తింపు కార్డును చూపిస్తేనే ఓటేసేందుకు అనుమతించాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. పాస్ట్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ వంటి అ«దీకృత గుర్తింపు పత్రం/కార్డును ఓటింగ్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వాళ్లను బహిష్కరిస్తూ, స్వదేశాలకు తరలిస్తూ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను అధికార రిపబ్లికన్ పార్టీ స్వాగతిస్తోంది. దీంతో నాన్–అమెరికన్లలో రిపబ్లికన్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది. వీరిలో ఓటేసే అవకాశమున్న వాళ్లు విపక్ష డెమొక్రటిక్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల గెలుపు అవకాశాలను దెబ్బతీసేందుకు, నాన్–అమెరికన్లు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. పౌరులుకాని వ్యక్తులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు, తొలుత వారిని గుర్తించేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, స్టేట్ డిపార్ట్మెంట్లు అన్ని రాష్ట్రాల అధికారులకు ఈ జాబితాను అందజేయనున్నాయి. వ్యతిరేకిస్తున్న హక్కుల సంఘాలు గుర్తింపు కార్డు ఉంటేనే ఓటేసేందుకు అనుమతిస్తామనడం ఓటింగ్ హక్కును కాలరాయడమేనని ఓటింగ్ హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ‘‘ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమలుచేస్తే ఓటర్ల జాబితాలోని నాన్–సిటిజన్లు కొద్దిమంది మాత్రమే ఓటింగ్‌ను కోల్పోరు. సరైన పత్రాలు లేని లక్షలాది మంది అమెరికా పౌరులు సైతం తమ ఓటు హక్కుకు దూరమవుతారు. ఇది ఓటింగ్ శాతంపై పెను ప్రభావం చూపుతుంది. గెలుపుపైనా ప్రభావం పడొచ్చు’’ అని లాస్ఏంజెలెస్లోని కాలిఫోరి్నయా యూనివర్సిటీలో ఎన్నికల చట్టాల నిపుణుడు రిచర్డ్ హేసన్ అభిప్రాయపడ్డారు. ‘‘మహిళల బర్త్ సర్టిఫికెట్లో అసలైన పేరు ఉంటుంది. పెళ్లయ్యాక లాస్ట్‌నేమ్ మారుతుంది. పెళ్లయ్యాక తీసుకున్న పత్రాలు, బర్త్ సర్టిఫికెట్ ఒకలా ఉండవు. ఇలాంటి వాళ్లు ఓటేయడ కష్టమే’’ అని ఆయన ఉదహరించారు. 14.6 కోట్ల మందికి పాస్‌పోర్ట్ లేదు పబ్లిక్ సిటిజన్ అనే సంస్థ గణాంకాల ప్రకారం అమెరికన్ పౌరుల్లో దాదాపు 14.6 కోట్ల మందికి పాస్‌పోర్ట్ లేదు. ఓటింగ్‌కు పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్‌నే అనుమతించే అవకాశముంది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఓటింగ్‌కు దూరమయ్యే అవకాశముంది. ‘‘ట్రంప్ అతి చర్యల కారణంగా ప్రభుత్వ రికార్డులన్నింటిలో పేరు సరిపోలిన వాళ్లు మాత్రమే ఓటేసేందుకు అర్హులవుతారు. ఇంటి పేరు మారిన మహిళలు, కార్చిచ్చులు, తుపాన్లు, వరదల్లో ఇళ్లు కాలిపోయి డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వాళ్లు ఇకపై ఓటు హక్కును వినియోగించుకోవడం అసాధ్యం’’ అని డెమొక్రటిక్ నేత, దిగువసభ సభ్యురాలు జాస్మిన్ ఫెలీసియా క్రోకెట్ ఆందోళన వ్యక్తంచేశారు. తర్వాత వచ్చే బ్యాలెట్ ఓట్లను పరిగణించరు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఎన్నికల తేదీ తర్వాత వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతించబోరు. ఓటింగ్ తేదీకి ముందే మార్కింగ్ చేసి పోస్ట్‌లో పంపినట్లు రుజువైతే మాత్రమే తర్వాతి తేదీన అందినా అనుమతిస్తారు. ప్రస్తుతం 18 రాష్ట్రాలు, ప్యూర్టోరీకో మాత్రమే తర్వాత తేదీ నుంచి వచి్చనా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతిస్తున్నాయి. అత్యధిక ఓటర్లు ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏకంగా ఏడు రోజుల తర్వాత కూడా అనుమతిస్తారు. ఎన్నికల విరాళాల మీదా ఆంక్షలు! రాజకీయ పార్టీలకు వ్యక్తులు నేరుగా విరాళాలు ఇచ్చే అవకాశం లేదు. పొలిటికల్ యాక్షన్ కమిటీలను ఏర్పాటుచేసి వాటికి విరాళాలు అందించి వాటి ద్వారానే ఎన్నికల ఖర్చులకు సాయపడొచ్చు. ఈ ఎన్నికల విరాళాలపైనా కఠిన నియమాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అమెరికా పౌరులుగాని వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ఉత్తర్వులో పేర్కొన్నారు.ఎన్నికల నిబంధనల్లో విఫలమయ్యాం: ట్రంప్ ‘‘సుపరిపాలనలో మనం ఎన్నో దేశాలకు ఆదర్శంగా ఉన్నాం. కానీ ఎన్నికల ప్రాథమిక నిబంధనల పటిష్ట అమలులో విఫలమయ్యాం. ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో ముందున్నాయి. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ల జాబితాను బయోమెట్రిక్ డేటాబేస్‌తో పోలి్చచూస్తూ ముందంజలో ఉంటే మనం ఇంకా సెల్ఫ్–అటెస్టేషన్ స్థాయిలోనే ఆగిపోయాం. జర్మనీ, కెనడా వంటి దేశాలు పేపర్ బ్యాలెట్లను అందరి సమక్షంలో లెక్కిస్తూ ఎలాంటి వివాదాలకు తావివ్వడం లేదు. మనం వేర్వేరు రకాల ఓటింగ్ విధానాలను అవలంభిస్తూ సుదీర్ఘ ఓటింగ్ ప్రక్రియలో మునిగిపోయాం. మెయిల్–ఇన్ ఓట్ల విషయంలో డెన్మార్క్, స్వీడన్ ముందున్నాయి’’.బ్రెనాన్ సెంటర్ ఫర్ జస్టిస్ గణాంకాల ప్రకారం ఓటింగ్ వయసున్న అమెరికా పౌరుల్లో 9 శాతం మందికి, అంటే 2.13 కోట్ల మందికి పౌరసత్వాన్ని నిరూపించుకునేఎలాంటి గుర్తింపు పత్రాలూ లేవు!

‘నీ ఇష్టమొచ్చింది చేసుకో’.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్ వీడియో
తెహ్రాన్ : ఇరాన్ ఎనభై ఐదు సెకన్ల నిడివిగల వీడియోతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రెచ్చగొట్టింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో అణు ఒప్పందం చేసుకోబోమని పరోక్షంగా సంకేతాలిచ్చింది.ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని ఆహ్వానించారు. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు.అయితే, ట్రంప్ విధించిన అణు ఒప్పందం డెడ్ లైన్ గడువు సమీపిస్తున్న తరుణంలో తన సైనిక విభాగం బలంగా ఉందని చెబుతూ ఇరాన్ ఎనభై ఐదు సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మిస్సైల్ సిటీ పేరుతో క్షిపణులను ఏర్పాటు చేసిన తన మూడవ అండర్‌గ్రౌండ్ ప్రదేశాల్ని క్యాప్చర్ చేసింది. అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌లో ఏర్పాటు చేసిన మిస్సైల్ సిటీలో భారీ అణు ఆయుధాల్ని మనం చూడొచ్చు. Iran is responding to external threats by releasing a new video showcasing one of its underground missile tunnel systems, packed with missile engines, mobile launchers, and a range of advanced weaponry. The footage prominently features the Paveh cruise missile, the Ghadr-380… pic.twitter.com/ILsdlrPtQy— Basha باشا (@BashaReport) March 25, 2025ఇక ఇరానియన్ రాష్ట్రీయ మీడియా ప్రసారం చేసిన 85 సెకన్ల వీడియోలో ఇరాన్ సైనిక సారథి మేజర్ జనరల్ మొహమ్మద్ హోసేన్ బాగెరీ, ఐఆర్సీజీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ అమీర్ అలీ హాజిజాదెహోలు ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఆ క్షిపణుల్ని చూపిస్తున్నారు.ఇరాన్ మిస్సైల్ సిటీలో ఖైబర్ షెకాన్, ఘదర్-హెచ్,సెజిల్, పావే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. ఈ అణు ఆయుధాల్ని ఇరాన్ ఇటీవల ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు ఉపయోగించినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.

పాస్‌పోర్టు మర్చిపోయిన పైలట్.. విమానం వెనక్కి..
విమానంలో ప్రయాణించే ప్రయాణికులకే కాదు.. విమానం నడిపించే పైలట్‌కు కూడా పాస్‌పోర్టు ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అలాంటి ఇబ్బందే ప్రయాణికులకు అనుభవంలోకి వచ్చింది. ఎయిర్‌పోర్టు (Airport) నుంచి బయలుదేరిన విమానం పైలట్ పాస్‌పోర్టు (Passport) మర్చిపోవడంతో వెనక్కి మళ్లింది. అసలేం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం 257 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం చైనాలోని షాంఘైకి బయలుదేరింది. టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత పైలట్ వద్ద పాస్‌పోర్టు లేదని గుర్తించారు. అతడు పాస్‌పోర్టు ఇంట్లో మర్చిపోయి వచ్చాడు. దీంతో చేసేది లేక ఎయిర్‌పోర్టు అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని వెనక్కిమళ్లించాడు. యూ–టర్న్ తీసుకున్న విమానం సాయంత్రం 5 గంటలకు మళ్లీ లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది.ప్రయాణికుల కోసం అధికారులు మరో విమానాన్ని, పైలట్‌ను సిద్ధం చేశారు. రాత్రి 9 గంటలకు అది టేకాఫ్ అయ్యింది. 12 గంటలు ప్రయాణించి ఎట్టకేలకు షాంఘైకి చేరుకుంది. పైలట్ వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించిన సంగతి నిజమేనని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి నిర్ధారించారు. లాస్ ఏంజెలెస్‌లో ల్యాండైన వెంటనే ప్రయాణికులకు ఆహార కూపన్లు, పరిహారం అందించామని చెప్పారు. ఒక్కో కూపన్ విలువ 15 డాలర్లు (రూ.1,283) అని తెలిపారు. యూఎస్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రాజీనామావాషింగ్టన్: డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) చీఫ్ ఎలాన్ మస్క్‌తో విభేదాల నేపథ్యంలో యూఎస్ పోస్ట్ మాస్టర్ జనరల్ లూయిస్ డిజాయ్ రాజీనామా చేశారు. తన శాఖకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందివ్వాలన్న మస్క్ నిర్దేశాలను ఆయన ఖాతరు చేయలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. నష్టాలను తగ్గించేందుకు యూఎస్ పోస్టల్ సర్వీస్‌ను ప్రైవేటీకరించాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఈ విభాగాన్ని కామర్స్ విభాగంలో ఆధ్వర్యంలో ఉంచాలని ప్రకటించారు కూడా.చదవండి: ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు.. అమెరికాకు భారీ షాక్ రిపబ్లికన్ పార్టీకి విరాళాలిచ్చే ప్రముఖుల్లో ఒకరైన లూయిస్‌ను ట్రంప్ మొదటి సారి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు 2020లో యూఎస్పీఎస్ చీఫ్‌గా నియమించారు. డోజ్ సిఫారసుతోనే పోస్టల్ శాఖలో కనీసం 10 వేల మందిని తొలగించేందుకు ఈ నెల ప్రారంభంలోనే లూయిస్ అంగీకరించారు. ఇతర మార్పులను కాంగ్రెస్ ద్వారా చేయాలని ఆయన వాదిస్తున్నారు. ఈ విషయంలో మస్క్‌తో తలెత్తిన విభేదాల నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు.

ఆ నిర్దోషికి రూ. 12 కోట్ల భారీ నష్టపరిహారం
హత్యల కేసులో ఓ వ్యక్తికి మరణ శిక్ష పడింది. దాదాపు 50 ఏళ్లు గడిచినా ఆ శిక్ష అమలు కాలేదు. కేసు పునర్విచారణ అనంతరం గతేడాది 89 ఏళ్ల వయస్సులో కోర్టు ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది. మానసికంగా ఆయన తీవ్రంగా దెబ్బతినడంతో జైలులో పడిన వేదనకు ప్రతిఫలంగా రూ. 12.41 కోట్లు చెల్లించాలని తాజాగా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జపాన్‌లోనే కాదు ప్రపంచ క్రిమినల్ కేసుల చరిత్రలో ఇదే అత్యంత భారీ నష్ట పరిహారంగా చెబుతున్నారు.1966లో టోక్యోకు పశ్చిమాన ఉన్న షిజౌకాలోని ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఇవావో హకమట (Iwao Hakamada) అనే వ్యక్తి పనిచేసేవారు. ఒక రోజు ఆ ప్లాంట్ యజమాని, భార్య, ఇద్దరు పిల్లలు వారి ఇంట్లో హత్యకు గురయ్యారు. రూ.కోటి వరకు నగదు మాయమైంది. నలుగురూ కత్తిపోట్లతోనే మరణించినట్లు తేల్చారు. ఇందుకు హకమటాయే కారణమని ఆరోపణలొచ్చాయి. తనకేపాపం తెలియదని హకమట వాదించారు. అయినా అధికారులు వినిపించుకోలేదు. జైలులో ఆయన్ను చిత్ర హింసలు పెట్టారు. రోజుకు 12 గంటలపాటు ఆయ న్ను విచారించారు. తట్టుకోలేక ఆ నేరం తానే చేసినట్లు హకమట ఒప్పుకున్నారు. 1968లో కోర్టు ఆయనకు మరణ శిక్ష (Death Sentence) విధించింది.తన సోదరుడు అమాయకుడంటూ సోదరి హిడెకు అప్పటి నుంచి, గత 56 ఏళ్లుగా న్యాయం పోరాటం సాగిస్తూనే ఉన్నారు. హతుల దుస్తుల్లో లభ్యమైన డీఎన్ఏ (DNA) తన సోదరుడిది కాదని తెలిపారు. ఈ కేసులో ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగానే అతడికి సంబంధించిన ఆధారాలను అక్కడ ఉంచి ఉంటారని ఆమె అంటున్నారు. ఆమె సుదీర్ఘ పోరాటం ఫలించింది. కేసును తిరిగి విచారించేందుకు 2014లో న్యాయస్థానం అంగీకరించింది. హకమట కేసు అత్యంత ప్రముఖ న్యాయ పోరాటంగా మారింది. గత సెప్టెంబర్‌లో షిజౌకా కోర్టు (Shizuoka Court) హకమటను విడుదల చేస్తూ తీర్పు వెలువరించింది.కోర్టు వద్ద వందలాదిగా గుమికూడిన జనం హకమటను నిర్దోషిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్న హకమట ఇప్పుడు 91 ఏళ్ల తన సోదరి సంరక్షణలో ఉన్నారు. అందుకే విచారణ నుంచి కోర్టు ఆయనకు మినహాయించింది. సోమవారం ఈ కేసును విచారించిన జడ్జి కుని కోషి... హకమట దాదాపు 47 ఏళ్లపాటు జైలులో అత్యంత తీవ్రమైన మానసిక, శారీరక వేదనను అనుభవించారని పేర్కొన్నారు. అందుకు గాను రూ.12.41 కోట్లు పరిహారంగా చెల్లించాలని జైలు అధికారులను ఆదేశించారు.చదవండి: ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు.. అమెరికాకు భారీ షాక్
National

భాయ్.. అన్‌పార్లమెంటరీ పదమా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మంత్రి పర్వేష్ వర్మ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష నేత అతిషీని ఉద్దేశించి మంత్రి పర్వేష్ వర్మ చేసిన ‘భాయ్’ వ్యాఖ్యలపై ఆప్ ఆందోళనకు దిగింది. అతిషీకి వర్మ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి పర్వేష్ వర్మ ప్రశ్నోత్తరాల టైంలో మాట్లాడుతూ.. గతేడాది బడ్జెట్లో తీర్థయాత్ర పథకానికి రూ.80 కోట్ల బడ్జెట్ కేటాయించినప్పటికీ.. అప్పటి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కేవలం పబ్లిసిటీ మాత్రమే చేశారంటూ ఆరోపణలు గుప్పించారు.ఈ క్రమంలో.. అతిషీ సహా ఆప్ ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. ఈ క్రమంలో వర్మ అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘ఎక్కడి నుంచి ఈమెను తెచ్చారు భాయ్’’ అంటూ అతిషిని ఉద్దేశించి ఆప్ ఎమ్మెల్యేలతో అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది.వర్మ అతిషిపై అన్‌పార్లమెంటరీ పదజాలం ఉపయోగించారని ఆప్ నిరసనకు దిగింది. అయితే భాయ్ అనడంలో తప్పేముందంటూ వర్మ ఆప్ ఎమ్మెల్యేలను ప్రశ్నించగా.. స్పీకర్ విజేందర్ గుప్తా సైతం మంత్రికి మద్దతుగా నిలిచారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఆప్ సభ్యులు శాంతించకపోవడంతో మార్షల్స్ సాయంతో ఎమ్మెల్యేలు విశేష్ రవి, కులదీప్ కుమార్‌లను బయటకు పంపించారు.

అమిత్ షాపై సభా హక్కుల నోటీసు తిరస్కరణ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సమర్పించిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను గురువారం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలించాను. అందులో అతిక్రమణ ఏదీ కనిపించలేదని చెబుతూ నోటీసులను తిరస్కరించారు. విపత్తుల నిర్వహణ బిల్లు 2024పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రి సహాయనిధి కేవలం ఒక కుటుంబం గుప్పిట్లో ఉండేదని, ప్రధానమంత్రి సహాయనిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసినా అందులో కాంగ్రెస్ అధ్యక్షులు సభ్యులుగా ఉండేవారు’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా సోనియా గాంధీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, హోం మంత్రి సభ్యులను తప్పుదోవ పట్టించారని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ జైరాం రమేశ్ ప్రివిలేజ్ నోటీసు రాజ్యసభ చైర్మన్‌కు అందించారు.

కునాల్ కమ్రా: ‘కర్ర పట్టిన రాజ్యంలో.. నోరు గతేమిటి?’
ఒక పురాణ కథ చెప్పుకుందాం.. రుషుల కాలంలో అష్టావక్రుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన కురూపి. శరీర నిర్మాణం సరిగా లేనివాడు. అయితేనేం.. అపరిమిత జ్ఞాన సంపన్నుడు! అనేక శాస్త్రాల మీద పట్టు సంపాదించిన వాడు. ఒకసారి ఏమైందంటే.. ఒక రాజుగారి ఆస్థానంలో పండిత గోష్టి జరుగుతోంది. ఎక్కడెక్కడినుంచో దూరదేశాల నుంచి వచ్చిన మహా పండితులు అక్కడి చర్చల్లో పాల్గొంటున్నారు. ఆ సభకు అష్టావక్రుడు కూడా వచ్చాడు. ‘ఎవరివయ్యా నువ్వు.. ఇక్కడకు ఎందుకు వచ్చావు..’ అని అడిగారు రాజుగారు.అష్టావక్రుడు తన గురించి చెప్పుకుని.. పండిత గోష్టిలో పాల్గొనడానికే వచ్చాననే సంగతి వెల్లడించాడు. అలా కురూపిగా ఉన్న ఆయన ఆ మాట చెప్పగానే.. సభలో ఉన్నవాళ్లలో చాలామంది ఫక్కున నవ్వారు. అలాంటి అనాకారి తాను పండితుడినని చెప్పగానే వారికి నవ్వొచ్చింది మరి. ఆ వెంటనే అష్టావక్రుడు వెనుతిరిగి సభనుంచి వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. రాజుగారు కంగారు పడ్డారు. తన ఆస్థనంలో సభ నుంచి ఒక పండితుడు అలా నిరసనగా తిరిగి వెళ్లిపోవడం తనకు అవమానం కదా అని భావించి, అతడిని వారించాడు. ‘పండితుడా.. ఎందుకు వెళ్లిపోతున్నావు’ అని అడిగాడు. అందుకు జవాబుగా అష్టావక్రుడు..‘‘చర్మంతో చెప్పులు కుట్టుకుని పనిచేసే వాళ్లు నిండిన సభలో నేను పాండిత్యం చూపను.. అది నాకు అవమానం..’’ అని అన్నాడు. రాజుగారు ఖంగుతిన్నారు. ‘‘అదేమిటి ఇందరు పేరుమోసిన పండితులు కూర్చుని ఉన్న సభ నీకు.. తోలు చెప్పులు కుట్టుకునే వాళ్ల కూటమిలా కనిపిస్తున్నదా’’ అని కొంచెం కోపగించుకున్నారు కూడా!. అందుకు అష్టావక్రుడు.. ‘‘రాజా నేను మిమ్మల్ని అవమానించాలని ఈ మాట అనలేదు. చర్మాన్ని చూసి విలువను లెక్కగట్టేవాళ్లు చెప్పులు కుట్టేవాళ్లే కదా..’’ అని అన్నాడు.తన ఆకారాన్ని చూసి పాండిత్యాన్ని ఎలా నిర్ణయిస్తారని చెప్పాడు. రాజు కూడా నొచ్చుకున్నాడు. సభలోని సాటిపండితులు కూడా మన్నింపు వేడుకున్నారు. ఆ తర్వాత అష్టావక్రుడు పండితగోష్టిలో పాల్గొనడమూ.. తన పాండిత్యానికి తిరుగులేదని నిరూపించుకోవడమూ జరిగింది. ఇదీ కథ. ఎందుకో.. కునాల్ కమ్రా కు జరిగిన, జరుగుతున్న పరాభవం, హెచ్చరిక, సత్కార ఛీత్కారాలు గమనిస్తోంటే.. ఈ అష్టావక్రుడి కథ గుర్తుకు వస్తోంది. ఎలాంటి రాజ్యంలో బతుకుతున్నాం మనం..? ఒకడు కర్రపట్టుకుని కాపలా కూర్చుని.. ఈ దేశంలో ఎవడు ఏం మాట్లాడినా సరే.. నాకు నచ్చిన నాకు ప్రీతికరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి? అని శాసించే రాజ్యంలో బతుకుతున్నామా? అసభ్యపు మాటలతో, బూతులతో ఏమైనా అంటే.. వాటిని నేరాలుగా పరిగణించడానికి చట్టాలున్నాయి. ఆ చట్టాలను దుర్వినియోగం చేయడం కూడా ఉంది. ఏదైనా సరే.. చట్టం అనే ముసుగులో జరుగుతోంది. చట్టాన్ని మీరిన పనులు చేసినప్పుడు.. అలా అనిపించిన పనులు జరిగినప్పుడు జరుగుతోంది.మరి చట్టం పరిధిలోకి రానటువంటి.. సమకాలీన సంగతులను హాస్యస్ఫోరకంగా, ఆలోచింపజేసే చిరు వెక్కిరింతగా ప్రస్తావించే మాటలకు కూడా మహోద్రేకంతో రగిలిపోయి.. కర్రపట్టుకుని దండించి తీరుతాం అని బరితెగించే మూకలు రాజ్యం చేస్తున్న చోట మనం ఎన్నాళ్లు బతకగలం?. నాయకులు తమ గురించి గొప్పలు చెప్పుకునేప్పుడు.. గతచరిత్రలోని చిన్నస్థాయి నేపథ్యాలను చాలా గర్వంగా వల్లెవేసుకుంటూ ఉంటారు కదా..! అదే నేపథ్యాల గురించి ఒక వెక్కిరింత వస్తే.. ఎందుకంత ఉడికిపోతుంటారు?నోటికి వేసే తాళాలు తయారుచేసుకునే కంపెనీలకే ఇప్పుడు చెల్లుబాటు అయ్యే రోజులు. కర్ర పట్టుకుని కాపలా తిరుగుతూ ఉండే.. కిట్టని మాటలు వినిపిస్తే మూతులు పగలగొట్టాలని చూసే కర్రదండు రాజ్యం చేస్తున్న నేలమీద మనం ఎంతకాలం జీవించగలం? మాట్లాడే స్వేచ్ఛ ఈ దేశంలో ప్రతి మనిషికీ ఉన్నదని అనుకోవడం ఒక భ్రమే కదా? అందరికీ మాట్లాడే స్వేచ్ఛను ఇచ్చింది రాజ్యాంగం.. కానీ, కొందరికి కర్రపుచ్చుకుని దాడులు చేసి, చావచితగ్గొట్టే స్వేచ్ఛను ఇస్తున్నాయి ప్రభుత్వాలు!-ఎం.రాజేశ్వరి

కునాల్ కమ్రాకు ముంబై పోలీసుల ఝలక్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే(Eknath Shinde)పై పేరడీ పేరిట కామెంట్లు చేసిన కేసులో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు ముంబై పోలీసులు ఝలక్ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని.. విచారణకు హాజరయ్యేందుకు కాస్త గడువు ఇవ్వాలని కునాల్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు.షిండే పరువుకు భంగం కలిగించారనే ప్రధాన అభియోగంతో పాటు మరికొన్నింటిని కమ్రాపై ముంబై పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మార్చి 31వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. ఒకవైపు ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్న కునాల్ కమ్రా(Kunal Kamra).. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ గడువు పొడిగింపు కోరాడు. ఏప్రిల్ 3వ తేదీన విచారణకు హాజరవుతానని విజ్ఞప్తి చేశాడు. కానీ, పోలీసులు అందుకు అంగీకరించలేదు.ముంబైలోని హాబిటాట్ స్టూడియో(Habitat Studio)లో జరిగిన ఈవెంట్లో కునాల్ కమ్రా ప్రదర్శన ఇచ్చాడు. ఈ క్రమంలో ఏక్నాథ్ షిండేను ద్రోహిగా వర్ణించడంతో షిండే శివసేన యువ విభాగం భగ్గుమంది. కునాల్‌కు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగింది. అదే టైంలో.. హాబిటాట్ స్టూడియోపై దాడికి దిగి విధ్వంసానికి పాల్పడింది. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వెంటనే బెయిల్ లభించింది.షిండేపై కునాల్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా కూటమి ప్రభుత్వ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. థాక్రే శివసేన, ఎస్పీ పార్టీలు కునాల్‌కు మద్ధతుగా నిలిచాయి. షిండేకు క్షమాపణలు చెప్పాలంటూ సీఎం ఫడ్నవిస్ కోరగా.. అందుకు కునాల్ నిరాకరించాడు. కోర్టు కోరితేనే క్షమాపణలు చెబుతానంటూ తెగేసి చెప్పాడు. మరోవైపు కునాల్ వ్యంగ్యాన్ని తాను అర్థం చేసుకోగలనంటూనే.. దేనికైనా పరిమితి ఉంటుందంటూ షిండే మండిపడ్డారు. అదే టైంలో స్టూడియోపై తన పార్టీ విభాగం జరిపిన దాడిని ఖండిస్తూ.. చర్యకు ప్రతిచర్య ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.ఈలోపు.. శివసేన(షిండే) ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఫిర్యాదుతో మంబై పోలీసులు కునాల్ కమ్రాపై కేసు నమోదు చేసి విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారు.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

సీతయ్యపై పోక్సో కేసు
విశాఖపట్నం: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను గర్భవతిని చేసిన ఘటనలో సీహెచ్ సీతయ్య అనే వ్యక్తిపై ఎంవీపీ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాసవానిపాలేనికి చెందిన 14 ఏళ్ల బాలిక 21వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఆమె తల్లి, అన్నయ్యతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన వివాహితుడైన సీహెచ్ సీతయ్య గత ఏడాదిగా బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకుంటున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఓ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి అనుమానంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించగా, గర్భవతి అని తేలింది. దీంతో ఆమె తల్లి ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీతయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
నాగర్ కర్నూల్: లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారి కుటుంబం పాలిట యమపాశమైంది. అప్పటివరకు నలుగురు(ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు) పిల్లలతో సరదాగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన భార్యభర్తలు సక్కభాయి (40), పాండు (45) 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు మధుమిత, మధురుషిత, యాద్విక్, యశిత్..పిల్లలున్నారు. సక్కుభాయి మహేశ్వరం మండలంలోని ఎన్‌డీతండాలో పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్‌పేట్‌లోని పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై సుక్కుభాయి తమ అమ్మగారి గ్రామమైన కొందుర్గులో ఉన్న తమ వ్యవసాయ పొలంలో జరుగుతున్న పండ్లతోట పనులను పరిశీలించి తిరిగి సాయంత్రం రామంతాపూర్‌కు బయల్దేరారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ శివారు ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ అతివేగంగా ఢీ కొట్టింది. దీంతో సక్కుభాయి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాలను రఘుపతిపేటకు తరలించి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు ముగించారు.

పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..
జయశంకర్: రెక్కాడితే గాని డొక్కాడని రెండు నిరుపేద కుటుంబాలను మృత్యువు వెంటాడింది. ఉదయం కూలీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. ఖాళీగా ఉంటే ఏముంటుంది..? అదనపు కూలీకి వెళ్తే పూట అయినా గడుస్తుంది కదా అనే ఆశతో సాయంత్రం కూడా వెళ్లారు. అయితే ఈ కూలే వారికి చివరిది అవుతుందని అనుకోలేదు. పాపం.. పని వెళ్లకున్నా బతికేవారేమో. మృత్యువు లారీ రూపంలో ఇద్దరు మహిళా కూలీలను కబలించింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకిష్టాపూర్(టి)లో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్షుల కథనం ప్రకారం.. రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మోకిడి పూలమ్మ(45), మోకిడి సంధ్య(30)తోపాటు మరో ఆరుగురు కూలీలు ఉదయం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. సాయంత్రం వేళలో కూడా మళ్లీ అదే గ్రామానికి చెందిన సల్పాల బుచ్చయ్య అనే రైతు పొలంలోని పని చేయడానికి వెళ్తున్నారు. సరిగా పొలం వద్దకు చేరుకునే సమయానికి చిట్యాల మండలం శాంతినగర్ శివారు కాటన్ మిల్లు నుంచి అతివేగంగా పత్తి గింజల లోడ్‌తో మూలమలుపు వద్ద నుంచి వస్తున్న లారీని గమనించిన కూలీలు కొంత దూరం పరుగులు తీశారు. ఇందులో ముగ్గురు పొలంలోకి వెళ్లడంతో అక్కడే లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పత్తి గింజల బస్తాలు పడడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తృటిలో తప్పించుకుంది. తోటి మహిళా కూలీలు భయంతో కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్సై అమరేందర్‌రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో లారీని లేపారు. మృతదేహాలను పత్తి గింజల బస్తాల కింద నుంచి బయటకు తీసి 108లో చిట్యాల సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అప్పటి వరకు అందరి మధ్యలో ఉన్న ఇద్దరు విగత జీవులుగా మారడంతో తోటి మహిళా కూలీల రోదనలు మిన్నంటాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారైనట్లు మహిళా కూలీలు తెలిపారు.పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..మన పిల్లలు ఇక నుంచి ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా.. ఒక్కసారి చూడు సంధ్యా.. నా ప్రాణం పోయేలా ఉంది.. అయ్యో దేవుడా ఒక్కసారి బతికించమంటూ సంధ్య భర్త రాజు రోదించిన తీరు చిట్యాల సివిల్ ఆస్పత్రిలో ప్రతీ ఒక్కరిని కంట తడి పెట్టించింది. అమ్మా లే.. అమ్మా లే.. అంటూ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పూలమ్మ భర్త, కూతురు సైతం కన్నీరుమున్నీరయ్యారు. సంధ్య, పూలమ్మ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున చిట్యాల సివిల్ ఆస్పత్రికి చేరుకుని వారి మృతదేహాల మీద పడి గుండెలవిసేలా రోదించారు.

భర్త దూరపు బంధువుతో భార్య వివాహేతర సంబంధం..!
కర్ణాటక: వివాహేతర సంబంధం వద్దని దండించిన భర్తను, ప్రియునితో కలిసి హతమార్చిందో భార్య. ఈ కేసులో భార్యతో పాటు ప్రియునికి జీవితఖైదును విధిస్తూ హోసూరు కోర్టు జడ్జి సంతోష్ తీర్పు చెప్పారు. వివరాల మేరకు డెంకణీకోట తాలూకా ఉణిసెట్టి గ్రామానికి చెందిన అయ్యప్ప (37), పికప్ వాహన డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. రైతుల పొలాల నుంచి కాయగూలను వాహనంలో మార్కెట్‌కు తీసుకెళ్లేవాడు. తనకు తోడుగా దూరపు బంధువైన మంచుగిరి గ్రామవాసి తంగమణి (24)ను తోడుగా తీసుకెళ్లేవాడు. తంగమణి తరచూ అయ్యప్ప ఇంటికెళ్లి వస్తుండేవాడు. హత్య చేసి నాటకం ఈ నేపథ్యంలో అయ్యప్ప భార్య రూప (29)తో తంగమణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకొన్న అయ్యప్ప భార్యను నిలదీశాడు. దీంతో అయ్యప్పను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ కుట్ర చేశారు. 2021 అక్టోబరు 21వ తేదీన ఇంట్లోనే మద్యం మత్తులో ఉన్న అయ్యప్పను గొంతుకోసి చంపారు. మత్తులో తానే గొంతు కోసుకొని చనిపోయాడని భార్య నాటకమాడింది. ఈ ఘటనపై డెంకణీకోట పోలీసులు తీవ్ర విచారణ జరుపగా అయ్యప్ప భార్య, ప్రియుని బండారం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసు హోసూరు కోర్టులో జరుగుతూ వచ్చింది. నేరం రుజువు కావడంతో మంగళవారం సాయంత్రం జడ్జి సంతోష్ తీర్పు వెలువరించారు.