Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

MLC Teenmar Mallanna Suspended By Congress1
కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న సస్పెండ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ కుమార్‌(తీన్మార్‌ మల్లన్న)కు బిగ్‌ షాక్‌ తగిలింది. మల్లన్నను కాంగ్రెస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, పైగా పార్టీ శిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులకు వివరణ ఇవ్వలేదని, అందుకే క్రమశిక్షణ చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ప్రకటించారు. ఇక, ఎమ్మెల్సీ మల్లన్న సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పార్టీ లైన్‌ ఎవరు దాటినా ఊరుకునేది లేదు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించాం. బీసీ కుల గణన ప్రతులను చించడంపై ఏఐసీసీ సీరియస్‌ అయ్యింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ లైన్‌ దాటితే ఎవ్వరినీ వదలిపెట్టం’ అని హెచ్చరించారు. వరంగల్‌ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ వర్గాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకుగానూ ఫిబ్రవరి 5వ తేదీన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే.. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. సొంత పార్టీ విషయంలో నవీన్‌ వైఖరి మొదటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక ప్రతులను ఆయన దగ్ధం చేశారు. అలాగే.. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించారు. కుల గణన నివేదికను వ్యతిరేకించాలని పిలుపు కూడా ఇచ్చారు. మరోవైపు.. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. రెడ్డి కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి మల్లన్నను కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రెడ్డి కులానికి బహిరంగ క్షమాపణ చెప్పి మల్లన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి మలన్నకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే జానారెడ్డి కళ్లలో ఆనందం కోసమే తనకు చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారంటూ కరీంనగర్‌లో నవీన్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

Jyotika: Big Tamil Directors Only Make Movies for Male Stars2
సౌత్‌లో ఇదే పెద్ద సమస్య.. ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి: జ్యోతిక

చాలామంది డైరెక్టర్లు హీరోల కోసమే కథలు రాసుకుంటారు అంటోంది హీరోయిన్‌ జ్యోతిక (Jyotika). హీరోయిన్ల కోసం ప్రత్యేకంగా కథలు రాసుకునేవారు ఎంతమంది ఉన్నారని పెదవి విరిచింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ డబ్బా కార్టెల్‌. ఫిబ్రవరి 28న ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. డబ్బా కార్టెల్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వయసైపోయినవారిని హీరోలుగా జనాలు ఒప్పుకుంటారు. కానీ హీరోయిన్ల ఏజ్‌ పెరిగితే మాత్రం అస్సలు యాక్సెప్ట్‌ చేయరు.. నిజమేనా? అని అడుగుతుంటారు.వయసు అడ్డుగోడఇది చాలా పెద్ద ప్రశ్న.. నా విషయానికి వస్తే 28 ఏళ్ల వయసులో నాకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాతే నేను విభిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. అయితే స్టార్‌ హీరోలతో కలిసి నటించలేదనుకుంటాను. ఇక్కడ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. సౌత్‌లోని అన్ని ఇండస్ట్రీల గురించి నేను చెప్పలేను కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం వయసును ఒక అడ్డుగోడగా చూస్తారు. అలాంటప్పుడు మనమే కొత్త దర్శకులతో పని చేస్తూ మన కెరీర్‌ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. అదే పెద్ద సమస్యమహిళా ప్రధాన సినిమాలు, కథలు తెరకెక్కించేందుకు కె. బాలచందర్‌ వంటి దర్శకులు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లందరూ పెద్ద హీరోల కోసం కథలు రాసే పనిలోనే బిజీగా ఉన్నారు. మహిళా నటిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసిన పెద్ద దర్శకుడు ఇటీవలి కాలంలో ఎవరున్నారు చెప్పండి? అదే మనం కోల్పోతున్నాం. లేడీ ఓరియంటెడ్‌ అనగానే బడ్జెట్‌ కూడా కుదించేస్తారు. వయసు పెరిగితే పరిగణనలోకి తీసుకోరు.. ఇది ఇంకో సమస్య! సౌత్‌లో నటిగా రాణించడం చాలా కష్టం. ఎప్పుడూ ఒంటరి పోరాటం చేస్తూనే ఉండాలి అని చెప్పుకొచ్చింది.లవ్‌.. సినిమాజ్యోతిక.. 'డోలీ సజా కె రఖనా' అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. వాలి చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. పూవెల్లమ్‌ కెట్టుప్పర్‌, ఖుషి, రిథమ్‌, దం దం దం, పూవెల్లం ఉన్‌ వాసం. ఖాకా ఖాకా, ధూల్‌, మన్మధన్‌.. ఇలా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఠాగూర్‌, చంద్రముఖి, మాస్‌ సినిమాలతో తెలుగువారికీ పరిచయమైంది. హీరో సూర్య (Suriya)తో ఏడు సినిమాల్లో నటించింది. ఆ సమయంలో సూర్యతో ప్రేమలో పడ్డ జ్యోతిక 2006లో అతడ్ని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు దియా, కుమారుడు దేవ్‌ సంతానం.చదవండి: జనరేటర్ లో పంచదార గొడవపై ప్రశ్న.. విష్ణు ఏమన్నాడంటే?

Elon Musk Welcomes 14th Child, His 4th With Partner Shivon Zilis3
నెం. 14, మరోసారి తండ్రైన బిలియనీర్‌ : పేరేంటో తెలుసా?

టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు. మస్క్‌ భార్య, అతని కంపెనీ న్యూరాలింక్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న షివోన్ జిలిస్‌తో కలిసి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఇప్పటికే మస్క్‌కు 13 మంది పిల్లలున్నారు. దీంతో ఇపుడు మస్క్‌ సంతానం సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది.మస్క్‌ భార్య షివోన్ జిలిస్‌ ఈ విషయాన్ని ఎక్స్‌( ట్విటర్) ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ దంపతులు కవలలు (స్ట్రైడర్ , అజూర్) ఏడాది పాప ఆర్కాడియా ఉన్నారు. నాలుగో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్‌గా అపుడే పేరు కూడా పెట్టేయడం గమనార్హం. అందమైన ఆర్కాడియా పుట్టినరోజు సందర్బంగా తమ అద్భుతమైన కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ రాక గురించి చెప్పడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు హార్ట్ సింబల్‌తో ఎలాన్ మస్క్ సమాధానమిచ్చాడు. గణనీయంగా క్షీణిస్తున్న జనాభాపై ఎపుడూ ఆందోళన వ్యక్తం చేసే మస్క్‌ సంతానోత్పత్తి ప్రాముఖ్యతపై దృష్టిపెట్టునట్టున్నాడు అంటోది సోషల్‌ మీడియా. జనాభా వృద్ధి చెందాలని భావించే మస్క్‌, ఇప్పటికే తన స్పెర్మ్‌ను స్నేహితులు, పరిచయస్తులకు దానం చేశాడనే వాదనలు కూడా చాలానే ఉన్నాయి. Discussed with Elon and, in light of beautiful Arcadia’s birthday, we felt it was better to also just share directly about our wonderful and incredible son Seldon Lycurgus. Built like a juggernaut, with a solid heart of gold. Love him so much ♥️— Shivon Zilis (@shivon) February 28, 2025కాగా షివోన్ జిలిస్‌తో తనకున్న నలుగురు పిల్లలతో పాటు, మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్‌ ద్వారా ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో కవలలు వివియన్ , గ్రిఫిన్‌తో పాటు, కై, సాక్సన్ , డామియన్ అనే ముగ్గురున్నారు. వీరి తొలి సంతానం బిడ్డ నెవాడా అలెగ్జాండర్ మస్క్ కేవలం 10 వారాల వయసులోనే మరణించాడు.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package4
ఎల్‌పీయూ విద్యార్థికి రూ.1.03 కోట్ల ప్యాకేజీ

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

India will beat Australia by 1 run to win Champions Trophy Michael Clarke 5
'భారత్‌దే ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క ప‌రుగు తేడాతో'.. క్లార్క్‌ జోస్యం

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న భార‌త జ‌ట్టు.. త‌మ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.అనంత‌రం రోహిత్ సేన సెమీఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డే అవ‌కాశ‌ముంది. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా టీమిండియా నిలుస్తుంద‌ని క్లార్క్ జోస్యం చెప్పాడు."ఈ మెగా టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భార‌త జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నాను. ఆసీస్ ఛాంపియ‌న్స్‌గా నిల‌వాల‌ని నేను మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. కానీ టీమిండియాకే విజ‌య అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని భార‌త్ సొంతం చేసుకుంటుంది నేను అనుకుంటున్నాను. భార‌త్ ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే నంబర్ 1 వన్డే జట్టుగా ఉంది. వారిని ఓడించ‌డం అంత ఈజీ కాదు. భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య తుది పోరు హోర‌హోరీగా జ‌రుగుతుంది. కానీ టీమిండియా ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యం సాధిస్తుంది" అని రేవ్ స్పోర్ట్స్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్లార్క్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ మెగా టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నిలుస్తాడ‌ని క్లార్క్ అంచ‌నా వేశాడు."రోహిత్ శ‌ర్మ తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు అత‌డు క‌ట‌క్‌లో భారీ సెంచ‌రీ సాధించాడు. అద్భుత‌మైన షాట్ల‌తో అంద‌రిని అల‌రించాడు. అత‌డు ఈ మెగా ఈవెంట్‌లో కూడా మంచి ట‌చ్‌లో క‌న్పిస్తున్నాడు. రోహిత్ భార‌త్‌కు కీల‌కంగా మార‌నున్నాడు. అత‌డు త‌న దూకుడును కొన‌సాగించాలి. ప‌వ‌ర్ ప్లేలో ప‌రుగులు రాబ‌ట్టాల‌న్న అత‌డి ఉద్దేశ్యంలో ఎలాంటి త‌ప్పు లేదు. రోహిత్ అద్భుత‌మైన ఆట‌గాడు. రోహిత్ శ‌ర్మ టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు" అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌పై 40 ప‌రుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. పాకిస్తాన్ 20 ప‌రుగుల‌తో క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: జోస్ బట్లర్ రాజీనామా.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ అతడే!?

KSR Comment: Why Pawan Kalyan Praise CBN In Assembly Always6
పవనూ.. మరీ ఇంతకు దిగజారాలా!

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఏపీ అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమాషాగా ఉన్నాయి. ‘‘కింద పడతాం.. మీద పడతాం.. అవి మా ఇంటి విషయాలు.. కూటమి విషయాలు. ఒక మాట అనవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలో అడుగు పెట్టకూడదు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొంతన లేని అంశాలను బలవంతంగా అతికినట్టుగా అనిపిస్తుంది. ‘‘ఇది తన గురించో, చంద్రబాబుల గురించి కాదని, ప్రజల కోసం నిలబడి ఉన్నామని, కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతామని, అందుకే మాటిస్తున్నానని అంటూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమనించి మరో పదిహేనేళ్లు కలిసి ఉంటాము’’ అని పవన్ అనడం దేనికి సంకేతం?.. తెలుగుదేశంతో పొత్తు పుణ్యమా అని పవన్‌ కల్యాణ్‌ ఎలాగోలా శాసనసభలోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అది సంతోషమే. కానీ ఆయన సమస్యలపై ప్రశ్నించకుండా.. ప్రభుత్వంలో జరిగే తప్పులపై గొంతెత్తకుండా ఆత్మపరిశీలన చేసుకోకుండా, చేసిన బాసలను గాలికి వదలి పలాయన వాదంతో ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యల కన్నా ఉదాహరణ అవసరం లేదేమో!.👉ఇంతకీ పవన్‌ చేసిన ఆ వ్యాఖ్యల సారాంశం ఏమిటి? తమలో తాము ఎన్ని గొడవలు పడ్డా కలిసే ఉంటామని చెప్పడమే కదా! ఈ మాట అంటున్నారంటేనే ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది. ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని హామీ ఇవ్వకుండా వీరిద్దరూ తిట్టుకుంటే ఎవరికి కావాలి? కిందపడితే ఏంటి? మీద పడితే ఎవరికి ఆసక్తి? ఆయన అన్నట్టే అది వారి అంతర్గత వ్యవహారం. ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అయితే... శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలేమిటి? చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిన వైనం ఏమిటి? వీటిని ప్రశ్నించకుండా ఎవరూనా ఎలా ఉండగలరు? సుగాలి ప్రీతి మృతి కేసు నుంచి 31 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ సంచలనం కోసం పిచ్చి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్‌.. తీరా పదవి వచ్చాక వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ పరిణామాలలో పవన్ పలు అవమానాలకు గురయ్యారని జనసేన కార్యకర్తలు బాధ పడ్డారు. కానీ పవన్‌ తన మాటల ద్వారా ఆ అవమానాలను పట్టించుకోబోనని చెప్పినట్లు అయ్యింది. ఎంత పదవిలో ఉంటే మాత్రం పవన్ టీడీపీకి ఇంతగా లొంగి ఉండాలా అన్నది జనసేన కార్యకర్తల ఆవేదన. తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirumala Stampede Incident) తర్వాత పవన్ కల్యాణ్‌ ఓవరాక్షన్ చేశారని టీడీపీ ముఖ్యనేతలే వ్యాఖ్యానించిన సంగతిని ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ ఆత్మాభిమానం కలిగిన జనసేన క్యాడర్ సహించలేక సోషల్ మీడియాలో టీడీపీ వారికి పోటీగా ఎలా పోస్టులు పెట్టిందో తెలియదా! ఇవన్ని ఎవరి ఇంటి విషయాలు..? అంటే జనసేన కూడా టీడీపీలో భాగమని చెబుతున్నారా? కూటమి విషయాలైతే ఎన్నడైనా చర్చించుకున్నారా? అంత దాకా ఎందుకు.. పిఠాపురంలో పోలీసులు తన మాట వినడం లేదని ఎందుకు చెప్పారు? నెల రోజుల పాటు ఎవరి మీద అలిగి ఫైళ్ల జోలికి వెళ్లకుండా ఉన్నారు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? సనాతని వేషధారణ వేసుకున్నాక, ధర్మ బద్దంగా ఉండాలి కదా! అసత్య వచనాలు పలకరాదని కదా ఆ ధర్మం చెబుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కదా ఏ ధర్మం అయినా చెప్పేది. కాని పవన్ కల్యాణ్‌ వాటిని పాటిస్తున్నారా?. తిరుమల లడ్డూ విషయంలో(Tirumala Laddu Row) ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి అపచారం కాదా? వలంటీర్ల పొట్టకొట్టబోనని పవన్ హామీ ఇచ్చారా? లేదా? అధికారం ఎంజాయ్ చేస్తూ వారి గురించి మాట్లాడకపోగా.. అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని వ్యాఖ్యానించడం పొట్ట కొట్టడం అవుతుందా? లేదా? ఇదేనా సనాతన ధర్మం చెప్పేది? శాసనసభలో ఆయన మాట్లాడిన విషయాలలో సత్యదూరమైనవి ఎన్ని ఉన్నాయి? వైఎస్సార్‌సీపీ(YSRCP) వాళ్లు నినాదాలు చేసినందుకే... గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి అడుగు పెట్టకూడదని ఆయన కొత్త సూత్రం చెబుతున్నారే..! మరి గవర్నర్ వ్యవస్థే వద్దన్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? గతంలో గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ ప్రసంగిస్తుంటే.. తెలుగుదేశం సభ్యులు ఆయన కుర్చీని కూడా లాగి పారేశారు. అలా చేసిన వారిలో ఒకరైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. గత టర్మ్‌లో గవర్నర్ హరిచందన్ స్పీచ్ సమయంలో కానీ, స్పీకర్ పై కానీ టీడీపీ సభ్యులు ఎన్ని అల్లర్లు చేశారో ఒకసారి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది. తన సహ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక విజిల్ పట్టుకువచ్చి సభలో ఈల వేస్తూ తిరిగారే. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి, స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను బెదిరించేవారే! కొందరు టీడీపీ నేతలు ఎలా దూషించారో ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇవన్ని మంచి పద్దతులేనా? అలాంటి పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబితే సరిపోతుందా?. ఏమిటో కొత్తగా స్టేట్ రికన్సిలియేషన్ కేబినెట్ (Reconciliation Cabinet) అని అంటున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నికలకు ముందు ఏదో జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే ఉందని అనడం ఏమిటో?. బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా నెహ్రూ కేబినెట్ లో ఉన్నా ఆయా అంశాలపై విబేధించేవారని అన్నారు. అంటే ఏపీలో కూడా అలాగే చంద్రబాబును నిలదీస్తారా? ఆ ధైర్యం పవన్‌కు నిజంగా ఉందా? అలా ఉంటే ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలలో ఒక్కసారైనా ప్రజల పక్షాన మాట్లాడారా? శాంతిభద్రతల విషయంలో మాట్లాడినట్లే మాట్లాడి వెంటనే ఎందుకు జారిపోయారు? ప్రతిపక్షం ముఖం చాటేస్తే తామే ఆ బాధ్యత నిర్వహిస్తామని అన్నారు. 👉పవన్ ఆ పని చేసినా, చేయకపోయినా, ముందుగా సూపర్ సిక్స్ గురించి చంద్రబాబును ప్రశ్నించి ఉంటే, తన బాధ్యత ఏమిటో చెప్పి ఉంటే అప్పుడు ఆయన ఏమి చెప్పినా జనం నమ్మవచ్చు. తన శాఖకు సంబంధించి ఆయన గ్రామ సభలు, గోకులాలు అంటూ ఏవేవో చెప్పుకున్నారు. కాని వాటిని టీడీసీ వారే ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి ఆయనకు కూడా తెలిసి ఉండాలి. ఆంధ్రులకు కుల భావన ఉందని శాసనసభలో బాధ పడినట్లు నటించారు. మరీ ఇదే పవన్ కల్యాణ్‌ గతంలో కనీసం కుల భావన అయినా తెచ్చుకోండని అన్నారే! తనకైనా ఫలానా కులం వారు ఓట్లు వేయాలని అన్నది వాస్తవం కాదా! దీనికి సంబంధించి అప్పట్లో వీడియోలు వచ్చాయే! ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలు?. 👉విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని అంటున్నారు. సంతోషమే కానీ.. భవిష్యత్తులో కూడా జరగదని చెప్పగలిగితే బాగుంటుంది. ఒకపక్క అక్కడ అనేక మందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తుంటే, మరోపక్క పవన్ ఇలా మాట్లాడుతున్నారు. బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. కాని టీడీపీ, జనసేనల దూషణలకు, పెట్టిన బూతు పోస్టింగ్‌లకు ఆయన ఎలా మద్దతు ఇస్తున్నారు?. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక నేతపై మహిళల వేధింపు ఆరోపణలు వస్తే కనీసం పార్టీ నుంచి సస్సెండ్ కూడా చేయలేక పోయారే! ఆ మాటకు వస్తే ఎన్నికల సమయంలో పవన్ ఎన్ని దూషణలకు పాల్పడింది ఆధార సహితంగా ఉన్నాయి కదా! 2009లోనే యువరాజ్యం అధ్యక్షుడుగా ఉండి కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొడతానని అన్నది ఈయనే గదా అని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబును జైలులో ఎందుకు పెట్టింది తెలియదా? స్కిల్ స్కామ్‌లో తొలుత కేసు పెట్టింది ఈడి కాదా? గతంలో కులాలు, మతాల మధ్య గొడవలు వచ్చేలా రోజుల తరబడి మీడియా సమావేశాలు పెట్టి లైవ్ లో మాట్లాడిన ఒక నేతను ఇప్పుడు పెద్ద పదవిలో కూటమి కూర్చోపెట్టుకుందే!. చంద్రబాబు, లోకేష్‌లతో ఏదో జిగిరి దోస్తి ఉన్నట్లు ఇప్పుడు చెబుతున్నారు కాని, 2018లో ఇదే పవన్ వారిని ఉద్దేశించి ఎన్ని తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది తెలియదా? రాజకీయాలలోకి వచ్చి చెగువేరా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, మోదీ అన్నారు. తదుపరి వారిని కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి, వామపక్షాలతో కలిసి జట్టుకట్టారు. ఆ తర్వాత మళ్లీ మోదీ, చంద్రబాబు అన్నారు. .. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెబుతారు? నిజంగానే కిందా, మీద పడి పదవిలోకి వచ్చిన పవన్.. ఆ పదవి మీద మోజు పెంచుకోవడం తప్పు కాదు. కానీ అదే ప్రధానమన్నట్లుగా వ్యవహన్నారనే భావన ఏర్పడుతోంది. ప్రజల కోసం నిలబడకుండా చంద్రబాబు, లోకేష్ ల మెప్పు కోసం పనిచేస్తూ, సనాతని వేషం ధరించి కూడా అబద్దాలు, అర్ధ సత్యాలు చెప్పడం ఏ ధర్మం అవుతుందో ఆయనకే తెలియాలి!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Raj Sardana story is remarkable testament to resilience and hard work7
రూ.1,700తో అమెరికా వెళ్లి రూ.16,400 కోట్లు సంపాదన

దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమని ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్ సర్దానా నిరూపించారు. ఢిల్లీలో ప్రభుత్వం నిర్మించిన ఒక చిన్న ఇంట్లో ఉంటూ జీవనం సాగించిన సర్దానా వ్యాపారంలో ఎదిగి యునైటెడ్ స్టేట్స్‌లో బిలియనీర్‌గా స్థిరపడ్డారు. జేబులో కేవలం 100 డాలర్ల(సర్దానా అమెరికా వెళ్లే సమయానికి విలువ రూ.1700)తో అమెరికాలో అడుగుపెట్టిన ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఏకంగా రెండు బిలియన్‌ డాలర్ల(ప్రస్తుతం రూ.16,490 కోట్లు) నికర సంపదని సృష్టించారు. రాజ్‌ సర్దానా జీవిత ప్రయాణం ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఢిల్లీలో జీవితం ప్రారంభం..1947 విభజన తర్వాత భారతదేశానికి వలస వచ్చిన పంజాబీ తల్లిదండ్రులకు 1960లో సర్దానా జన్మించారు. న్యూఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో పెరిగారు. ఎలాంటి సదుపాయాలు లేని సాధారణ జీవితం సాగించారు. ‘నా తల్లిదండ్రులు నా ఎదుగుదలకు అలుపెరగని కృషి చేశారు. ఎన్నో విలువలు నేర్పించారు. నాకు, నా సోదరుడికి నాణ్యమైన విద్యను అందించడానికి చాలా కష్టపడ్డారు’ అని అథారిటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్దానా గుర్తు చేసుకున్నారు.అమెరికాకు తరలివెళ్లి..సర్దానా 1981లో జార్జియా టెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. అమెరికా వెళ్లే సమయానికి తన వద్ద కేవలం 100 డాలర్లు(ప్రస్తుతం దాని విలువ రూ.8,500) ఉన్నాయి. పొట్టకూటికోసం కాలేజీ క్యాంటీన్‌లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ సంపాదించగా వచ్చిన డబ్బుతోనే చదువు పూర్తిచేశాడు. గ్రాడ్యుయేషన్ తరువాత సర్దానా హెచ్-1 వీసా (నేటి హెచ్-1 బీ వీసా) పొంది హౌమెట్ ఏరోస్పేస్‌లో కెరియర్‌ ప్రారంభించారు.కెరియర్‌లో ఒడిదొడుకులు1987 నాటికి సర్దానా తోమహాక్ క్షిపణి ఇంజిన్లను తయారు చేసే టెలీడైన్ సీఏఈ అనే సంస్థలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగంలో చేరాడు. అయితే 1990లో ప్రచ్ఛన్న యుద్ధం(యూఎస్‌-సోవియట్‌ యూనియర్‌ మధ్య యుద్ధం) ముగియడంతో క్షిపణి ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో సర్దానా ఉద్యోగం కోల్పోయారు. ‘అప్పటికే నేను తనఖాతో ఇల్లు కొన్నాను. ఆరు నెలల కుమార్తె ఉంది. నా తల్లిదండ్రులు కూడా నాతో నివసిస్తున్నారు. ఆ సమయంలో నా కుటుంబాన్ని పోషించడానికి ఆదాయం లేదు’ అని సర్దానా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో ఆర్థిక అనిశ్చితి ఎదుర్కొన్న ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పారిశ్రామికవేత్తగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే తన వద్ద ఉన్న పొదుపు 25,000 డాలర్లు(ఇప్పటి విలువ రూ.21.86 లక్షలు)తో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో పెరిగిన ప్రయాణికులుఇన్నోవా సొల్యూషన్స్ఐటీ సేవలకు భవిష్యత్తులో గిరాకీ ఉంటుందని గ్రహించిన రాజ్‌ తరువాతి కాలంలో కొన్ని ఐటీ సంస్థలను కొనుగోలు చేసి ఇన్నోవా సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇన్నోవా సొల్యూషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సర్దానా సంస్థల నికర విలువ రెండు బిలియన్‌ డాలర్లు(రూ.16 వేల కోట్లు)గా ఉంది. ఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో నివసించి కేవలం జేబులో 100 డాలర్లతో అమెరికా వెళ్లిన సర్దానా ప్రస్తుతం బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

World Leader Supprot To Volodomyr Zelensky8
జెలెన్‌స్కీకి భారీగా పెరిగిన మద్దతు.. రష్యా స్పందన ఇదే..

కీవ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), జెలెన్‌స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. వైట్‌హౌస్‌లో ఇరువురి మధ్య భేటీ రసాభాసగా, వాగ్వాదంతో ముగిసింది. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్‌స్కీ (Zelenskyy) వైట్‌హౌస్‌ను వీడారు. ఈ క్రమంలో పలు దేశాల నేతలు జెలెన్‌స్కీకి మద్దుతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.ట్రంప్‌, జెలెన్‌స్కీ భేటీ అనంతరం యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన నేతలు స్పందించారు. ఈ సందర్బంగా పోలిష్‌ ప్రధాన మంత్రి డొనాల్డ్‌ టస్క్‌ స్పందిస్తూ.. జెలెన్‌స్కీ మీరు ఒంటరి కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సంఘీభావం తెలుపుతూ సందేశం విడుదల చేశారు.👉బ్రిటన్‌ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌కు మద్దుతు ఉంటుందన్నారు.👉ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ.. ఉక్రెయిన్ రక్షణ, భవిష్యత్తు గురించి చర్చించడానికి యూరోపియన్ దేశాలు, ఇతర మిత్రదేశాలతో అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌ అండగా ఉండాలన్నారు.Russia illegally and unjustifiably invaded Ukraine. For three years now, Ukrainians have fought with courage and resilience. Their fight for democracy, freedom, and sovereignty is a fight that matters to us all.Canada will continue to stand with Ukraine and…— Justin Trudeau (@JustinTrudeau) February 28, 2025👉కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిస్తూ.. రష్యా చట్టవిరుద్ధంగా, అన్యాయంగా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మూడు సంవత్సరాలుగా ఉక్రేనియన్లు ధైర్యంతో పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం వారి పోరాటం మనందరికీ మేలు కొలుపు. న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడంలో ఉక్రేనియన్లకు కెనడా అండగా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నేతలకు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు.ఇది కూడా చదవండి: జెలెన్‌స్కీతో ట్రంప్‌ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్‌👉యూరోపియన్ యూనియన్ చీఫ్‌లు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. ఉక్రెయిన్‌ జెలెన్‌స్కీ ఎప్పుడూ ఒంటరి కాదు. మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేమందరం మీతో న్యాయమైన, శాశ్వత శాంతి కోసం పని చేస్తూనే ఉంటాము. దైర్యంగా ఉండంటి అని అన్నారు.👉ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. రష్యా అనే దురాక్రమణతో ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్‌కు అందరం అండగా ఉండాలి. ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి, రష్యాపై ఆంక్షలు విధించడానికి ముందుకు రావాలన్నారు.👉మరోవైపు.. రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై మరోసారి సెటైరికల్‌ కామెంట్స్‌ చేసింది. ట్రంప్, జెలెన్‌స్కీ వాడీవేడీ చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ స్పందిస్తూ.. ఈ పరిణామం ఉక్రెయిన్‌కు చెంపదెబ్బ లాంటిదన్నారు. జెలెన్‌ స్కీకి ఇలా జరగాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.JD Vance and Trump just put Zelensky in his place. Wow. Watch this.pic.twitter.com/zndgjKEPKz— End Wokeness (@EndWokeness) February 28, 2025జరిగింది ఇదీ..ఇదిలా ఉండగా.. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ శుక్రవారం వైట్‌ హౌస్‌కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం, అరుపులు, బెదిరింపులతో వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్‌ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చని.. జెలెన్‌స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్‌ కోపంగా చెప్పారు. కానీ, జెలెన్‌స్కీ మాత్రం ఉక్రెయిన్‌ ప్రజల కోసం ట్రంప్‌ బెదిరింపులకు లొంగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం, జెలెన్‌స్కీని టార్గెట్‌ చేస్తూ ట్రంప్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సుముఖంగా లేరని అన్నారు. ఇదే సమయంలో పుతిన్‌ మాత్రం శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.

47 People Rescued after Avalanche in Uttarakhand9
Uttarakhand: మంచు చరియల కిందే ఇంకా 8 మంది

ఉత్తరాఖండ్‌: పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో భారీగా కురుస్తున్న హిమపాతం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. బద్రీనాథ్‌లోని మానా గ్రామం సమీపంలో సరిహద్దు రోడ్డు సంస్థ (బీఆర్‌ఓ) శిబిరంపై మంచు చరియలు విరిగిపడటంతో 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం సంభవించింది. ఈ దరిమిలా భారత సైన్యం, రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. రెస్క్యూ సిబ్బంది మంచు పెళ్లల నుంచి 47 మందిని సురక్షితంగా వెలికి తీసుకువచ్చారు. మరో ఎనిమిదిమందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.రెండవ రోజున సహాయక చర్యలు తిరిగి ప్రారంభించిన భారత సైన్యం(Indian Army) మంచులో కూరుకుపోయిన మరో 14 మంది సిబ్బందిని రక్షించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్ల ద్వారా జోషిమఠ్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ఇంకా మంచులోనే కూరుకుపోయిన సిబ్బందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి చీకటి పడ్డాక సహాయక చర్యలను నిలిపివేశారు.హిమపాత మరింతగా పెరగడంతో మంచులో కూరుకుపోయిన కార్మికులను కనుగొనడం రెస్క్యూ సిబ్బంది(Rescue crew)కి సవాలుగా మారింది. మొదటి రోజున రెస్క్యూ బృందాలు 33 మంది కార్మికులను రక్షించగలిగాయి. ఈ ప్రాంతంలో ఏడు అడుగుల మేరకు మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. ఇండో-టిబెట్ సరిహద్దులోని చివరి గ్రామమైన మానా వద్ద మంచును తొలగించే పనిలో నిమగ్నమైన 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు.సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ మంచు చరియల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి పుష్కర్ ధామి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా ఘటనా స్థలంలో కొనసాగుతున్న పనుల గురించి తెలుసుకునేందుకు సీఎం దామికి ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో

Rohit Sharma managing injury very well, on top of it: ten Doeschate10
Champions Trophy: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌​..

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో టీమిండియా త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. ఆదివారం(మార్చి 2) దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టేబుల్ టాప‌ర్‌గా లీగ్ స్టేజిని ముగించాల‌ని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు గుడ్ న్యూస్ అందింది.తొడ కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఈ గాయం కార‌ణంగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెష‌న్‌కు దూరంగా ఉన్న రోహిత్‌.. తిరిగి మ‌ళ్లీ నెట్స్‌లో అడుగుపెట్టాడు. శుక్ర‌వారం దాదాపు 95 నిమిషాల పాటు రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ విష‌యాన్ని భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ ధ్రువీకరించాడు."రోహిత్ శ‌ర్మ గాయంపై ఎటువంటి ఆందోళ‌న అవ‌స‌రం లేదు. అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. నెట్స్‌లో చాలా సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో కూడా అత‌డు భాగ‌మ‌య్యాడు. అత‌డికి ఈ గాయాన్ని ఎలా మెనెజ్ చేయాలో బాగా తెలుసు" అని ప్రీ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో టెన్ డెష్కాట్ పేర్కొన్నాడు. మ‌రోవైపు జ్వ‌రం బారిన ప‌డిన ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్ కూడా కివీస్‌తో మ్యాచ్‌కు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టు శ‌నివారం త‌మ ఆఖ‌రి ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గోనుంది. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం భార‌త తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటుచేసుకోపోవ‌చ్చు.తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జ‌ట్టునే ఈ మ్యాచ్‌కు కొన‌సాగించే అవ‌కాశ‌ముంది. దీంతో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌, యువ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ మ‌రోసారి బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.భారత తుది జట్టు (అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: Champions Trophy: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
Comment X: ఎవర్రా బాబూ ఇది ఎడిట్‌ చేసింది!

వైట్‌హౌజ్‌ ఓవెల్‌ ఆఫీస్‌లో జరిగిన పరిణామాలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

title
సునీతా విలియమ్స్‌ రాకకు సమయం ఆసన్నం

అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమ్స్‌, బుచ్ విల్మోర్‌ల రాకక

title
నెం. 14, మరోసారి తండ్రైన బిలియనీర్‌ : పేరేంటో తెలుసా?

టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు.

title
దేవుడా.. ఇలా జరిగిందేంటి?.. ఉక్రెయిన్‌ రాయబారి ఆవేదన

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్

title
జెలెన్‌స్కీకి భారీగా పెరిగిన మద్దతు.. రష్యా స్పందన ఇదే..

కీవ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump),

National View all
title
లైంగిక ఆరోపణన్నీ నిజం కాదు: కేరళ హైకోర్టు

కొచ్చి: మగవారిపై లేనిపోని లైంగిక ఆరోపణలు చేసే మహిళల ఆటలు ఇకపై చెల్లవు.

title
ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏది?

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయణమనగానే ఎవరికైనా ముందుగా ఢిల్లీ, ముంబై, కో

title
Uttarakhand: మంచు చరియల కిందే ఇంకా 8 మంది

ఉత్తరాఖండ్‌: పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్‌(

title
తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో

ముంబై: విజయవంతంగా డిగ్రీ పూర్తిచేసి, తమ విద్యార్హత పట్టాలను అందుకున్న ఆ విద

title
సన్యాసిగా మారిన వ్యక్తి ఆర్‌బీఐ బాండ్ల బదిలీకి బాంబే హైకోర్టు నో

ముంబై: ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి జైన సన్యాసం స్వీకరించిన

NRI View all
title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

Advertisement

వీడియోలు

Advertisement