Top Stories
ప్రధాన వార్తలు

Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన తొలి సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి (మొత్తంగా ఐదోసారి) ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (షమీ) బరిలోకి దిగినప్పటికీ ఆసీస్‌ను ఆలౌట్ చేయడంలో సఫలమైంది.ఛేదనలో విరాట్ (84) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే ఈవెంట్లలో ఆసీస్ నిర్దేశించిన అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది.

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం!
హైదరాబాద్: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. కల్పన నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. . నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో వెళ్లిన ఆమెను తలుపులు పగలగొట్టి బయటకు తీశారు. గత రెండు రోజులుగా ఇంటి తలుపులు ఓపెన్ చేయలేదని అపార్ట్ మెంట్ వాసులు అంటున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు తలుపులు పగలుగొట్టి చూడగా ఆమెకు నిద్రమాత్రలు మింగినట్లు గమనించారు. దాంతో ఆమెను నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో మరో ముందడుగు పడింది. సహయకచర్యలకు ఆటంకంగా ఉన్న బురద, శిథిలాలు తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించారు. దీంతో సహయక చర్యలు వేగవంతం కానున్నాయి. టన్నెల్లో 11 రోజుల క్రితం గల్లంతైన 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహయక చర్యలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగనున్నాయి. త్వరలో తప్పిపోయిన వారి ఆచూకీ దొరుకుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో తప్పిపోయిన వారి ఆచూకీ కోసం 11 రోజులుగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్‌హోల్ మైనర్స్, ఎన్జీఆర్ఐ ఇలా 12 విభాగాలకు చెందిన దాదాపు 650 సభ్యులతో నిర్విరామంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ప్రమాద సమయంలో పెద్దమొత్తంలో సీపేజ్ వాటర్, మట్టి పడటంతో టన్నెల్లో బురద పేరుకుపోయి సహయక చర్యలకు ఆటంకంగా మారింది. అదే సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ధ్వంసం అయ్యింది. మిషన్‌కు అను సంధానంగా పనిచేసే కన్నేయర్ బెల్ట్ సైతం దెబ్బతింది.దీంతో టన్నెల్లో ఉన్న శిథిలాలు, బురద అలాగే ప్లాస్మా కట్టర్స్ ద్వారా తొలగిస్తున్న టీబీఎం మిషన్ పరికరాల తొలగింపు సమస్యగా మారింది. ఇప్పటి వరకు లోకో ట్రైన్ ద్వారా రెండు బోగీలలో వాటిని తొలగిస్తూ వచ్చారు.ఒకసారి లోకో ట్రైన్ లోపలికి వెళ్లి రావటానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. అంటే ఈ లెక్కన బురద, శిథిలాలు తొలగించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సహయక చర్యలు వేగవంతం కావాలంటే కన్వేయర్ బెల్ట్ పునరద్దరణే శరణ్యమని నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కూడ ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. దీంతో వెంటనే కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణ పనులు చేపట్టారు. ఇంజనీయర్లు రెండు రోజులు శ్రమించి ఇవాళ సాయంత్రం దాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం వ్యర్దాలను ఈ బెల్ట్ ద్వార బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో టన్నెల్లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం దాదాపు10 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి, బురద ఉన్నట్టు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణతో తప్పిపోయిన వారి ఆచూకీ త్వరలోనే గుర్తించవచ్చని అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండటంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు వివరించారు. మొత్తంగా కన్వేయర్ బెల్ట్ ను పునరుద్దరించి సహయకచర్యలు చేపట్టడం మాత్రం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా మారింది.

‘మీ నాన్నను అడుగు.. నేను ఏం చేశానో?
పాట్నా: బీహార్ రాష్ట్రంలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ హవా నడిస్తే.. ఇప్పుడు నితీష్ కుమార్ దే శాసనం. అటు ఇండియా కూటమిలో ఉండాలన్నా, అంతే త్వరగా దానికి ఎండ్ కార్డ్ వేసి ఎన్డీయే కూటమిలో చేరాలన్నా ఆయనకే చెల్లింది. ఆయన ఏ కూటమితో జట్టు కట్టినా తన సీఎం పదవికి ఢోకా లేకుండా చూసుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉంటారు నితీష్ కుమార్. అయితే ఇదే అంశాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన ఆర్జేడీ నాయకుడు, తేజస్వీ యాదవ్.. అసెంబ్లీ వేదికగా లేవనెత్తారు. బీహార్ లో నితీష్ పాలన ‘పొలిటికల్ షిప్ట్స్’ మాదిరిగా ఉంది అంటూ విమర్శించారు.ఈరోజు(మంగళవారం) బీహార్ అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి గురించి సీఎం నితీష్ మాట్లాడే సమయంలో తేజస్వీ యాదవ్ అడ్డుకున్నారు. ఎన్డీఏ నేతృత్వంలోని మన ప్రభుత్వం బీహార్ ను అభివృద్ధి పధంలో తీసుకెళుతోందని నితీష్ వ్యాఖ్యానించగా, అందుకు తేజస్వీ యాదవ్ అడ్డుతగిలారు. అసలు బీహార్ కు ఏం చేశారో చెప్పండి అంటూ నిలదీశారు. అందుకు తీవ్రంగా స్పందించిన సీఎం నితీష్.. అంతకుముందు బీహార్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే రీతిలో సమాధానమిచ్చారు. ‘ నేను ఏం చేశానో మీ తండ్రి లాలూను అడుగు. మీ తండ్రి రాజకీయంగా ఎదగడానికి నేనే కారణం. మీ నాన్న పొలిటికల్ కెరీర్ ఎదిగింది అంటే అందులో నాది ప్రధాన పాత్ర. మీ నాన్నకు సపోర్ట్ చేయడాన్ని మీ కులంలోని వాళ్లే వ్యతిరేకించే వారు. ఎందుకు అలా చేస్తున్నావ్ అంటూ నన్ను అడిగే వారు. కానీ మీ నాన్నను తయారు చేసింది నేనే. ఇప్పటికీ మీ నాన్నకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను’ అని రిప్లై ఇచ్చారు నితీష్.దీనికి తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ప్రస్తుత బీహార్ పరిస్థితి గురించి అడిగితే.. 2005 కు ముందు బీహార్ చరిత్ర చెబుతారు నితీష్ అంటూ ఎద్దేవా చేశారు. నితీష్ చెప్పేదానిని బట్టి.. 2005కు ముందు బీహార్ ఉనికే లేదంటారా? అంటూ ప్రశ్నించారు తేజస్వీ. ఈ ప్రభుత్వం ప్రస్తుతం కన్ ఫ్యూజన్ లో ఉందని, రిక్రూట్ మెంట్ కు సంబంధించి గత హామీలనే మళ్లీ రిపీట్ చేస్తున్నారు అంటూ తేజస్వీ విమర్శించారు.

CT 2025, IND VS AUS 1st Semis: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 265 పరుగుల ఛేదనలో విరాట్ 98 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ చరిత్రపుట్లోకెక్కాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి-1003రోహిత్ శర్మ-808రికీ పాంటింగ్-731ఈ మ్యాచ్‌లో విరాట్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (24) చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (23) పేరిట ఉండేది. తాజా హాఫ్ సెంచరీతో విరాట్ తన పేరిట ఉండిన మరో రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఐసీసీ నాకౌట్స్‌లో విరాట్ తన హాఫ్ సెంచరీల సంఖ్యను 10కి పెంచుకున్నాడు. ఐసీసీ నాకౌట్స్‌లో సచిన్, స్టీవ్ స్మిత్ తలో ఆరు అర్ద సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు.

ప్రైవేట్ ఆస్పత్రులలో మెడిసిన్ కొనుగోలు.. రాష్ట్రాలకు సుప్రీం చివాట్లు
ఢిల్లీ : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షాగా మారింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చివాట్లు పెట్టింది. సామాన్యులకు వైద్య సంరక్షణ,మౌలిక సదుపాయాలు కల్పిస్తూ భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. వైద్యాన్ని సామాన్యులకు దూరం చేయడమేకాదు.. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో చేరేలా పరోక్షంగా సులభతరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేట్ ఆస్పత్రులు తాము నిర్వహించే మెడికల్ షాపుల్లోనే మెడిసిన్లు, ఇంప్లాంట్స్, ఇతర మెడికల్ కేర్ ఉత్పుత్తులు కొనుగోలు చేయాలని పేషెంట్లను, వారి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేస్తున్నాయని పిల్లో పేర్కొన్నారు. అంతేకాదు, రోగులకు అమ్మే మెడిసిన్లను సైతం వాస్తవ ధరకంటే అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని హైలెట్ చేశారు. ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్రాలు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ.. తమ ఫార్మసీలలో మాత్రమే మెడిసిన్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేయాలని పిల్లో కోరారు. ఆ పిల్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జస్టిస్ సూర్యకాంత్, ఎన్కే సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా మేము మీతో ఏకీభవిస్తున్నాము.. అయితే దీన్ని ఎలా నియంత్రించాలి? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.The Supreme Court is hears a Public Interest Litigation (PIL) challenging the practice of hospitals and in-house pharmacies compelling patients to purchase medicines exclusively from their designated pharmacy.Bench: Justice Surya Kant and Justice N. Kotiswar Singh pic.twitter.com/jS3RLmZBwJ— Bar and Bench (@barandbench) March 4, 2025 ఈ సందర్భంగా తమ ఫార్మసీలలోనే మెడిసిన్ తీసుకోవాలని పేషెంట్లపై ఒత్తిడి చేసే ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకునేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ మార్కెట్లో మెడిసిన్ తక్కువ ధరలో దొరికినప్పుడు అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. అలా కాకుండా హాస్పిటల్‌కు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు చేయాలని పేషెంట్లపై ఒత్తిడి చేయొకూడదని సూచించింది.మరోవైపు, కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్, వైద్య సంస్థలు పౌరులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు అంశంపై సుప్రీం కోర్టు ఒరిస్సా, ఆరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్‌లకు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయా రాష్ట్రాలు సుప్రీంలో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి.మెడిసిన్ ధరలు కేంద్రం జారీ చేసిన ధర నియంత్రణ ఆదేశాలపై ఆధారపడ్డాయని, అత్యవసర మెడిసిన్ సైతం అందుబాటులో ఉండేందుకు ధరలు నిర్ణయించబడ్డాయని తెలిపాయి. హాస్పిటల్ ఫార్మసీల నుండి మందులు కొనుగోలు చేయాలని పేషెంట్లపై ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతం చేయడంలేదు’కేంద్రం సైతం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది.

ప్లేస్మెంట్లో ఎల్పీయూ సత్తా.. ఏకంగా 10 లక్షలపైనే ప్యాకేజీలు.. అదీ ఏకంగా 1,700 మందికి!!
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్ డూపర్ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్వర్క్స్, నుటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్ అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్మెంట్లు.గత ప్లేస్మెంట్ సీజన్ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్ (రూ.48.64 LPA), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ. 44.92 LPA), సర్వీస్ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్వాల్ట్ (రూ. 33.42 LPA), స్కేలర్ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్ డెవెలప్మెంట్, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్, క్యాప్‌జెమినీ, టీసీఎస్ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ రోల్స్ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పొజిషన్ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా 418 మంది విద్యార్థులను జెన్సీ రోల్స్ కోసం తీసుకుంది. ఎల్పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్ (279 మంది), టీసీఎస్ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్‌గ్రూప్, నుటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్పీయూ కట్టుబడి ఉంది. ఎల్పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్ సాధించిన రికార్డు ఎల్పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్పీయూ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ వివరించారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

తల్లికి వందనంపై పచ్చి దగా.. అడ్డంగా దొరికిపోయిన లోకేష్
అమరావతి, సాక్షి: బడి పిల్లలను, వాళ్ల తల్లులను భరోసా పేరిట వంచించాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ ప్రయత్నం.. శాసన మండలి సాక్షిగా బయటపడింది. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనం(Thalliki Vandanam)పై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం అడుగు ముందుకు పడడం లేదు. పైగా కిందటి ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా.. అమలు మాత్రం చేయలేదు. విచిత్రంగా.. ఈ ఏడాది మే నెల నుంచి స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఇవాళ.. ‘‘ఈ ఏడాది తల్లికి వందనం ఎంతమందికి ఇస్తారు?’’ అని విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అయితే.. తల్లికి వందనం పథకం లబ్ధిదారుల సంఖ్య చెప్పని మంత్రి నారా లోకేష్.. నిధుల లెక్కలు చూపించాలంటూ అధికారులను పురమాయించారు. ప్రజలను, సభను మభ్యపెట్టేలా విద్యాశాఖ లిఖితపూర్వక సమాధానం ఇప్పించారు. అందులో రూ.9,400 కోట్లు కేటాయించామంటూ బడ్జెట్ లెక్కలు చెప్పారు. కానీ, ఇది వచ్చే ఏడాది పథకం తాలుకా నిధుల లెక్కకు సంబంధించింది. ఏపీలో పేద విద్యార్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందించింది. అయితే.. అదే పథకాన్ని తల్లికి వందనం పేరుతో మార్చేసిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. కూటమి నేతలైన పవన్, నారా లోకేష్ కూడా ఈ విషయాన్నేన్నికల ప్రచారంలో నొక్కి మరీ చెప్పారు. పైగా ఇంట్లో ఎంత మంది ఉంటే(విద్యార్థులు) .. అంత మందికీ వర్తింజేస్తామని ప్రకటించారు. దీనిపై ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడుకు సంబంధించిన వీడియో ఒకటి ఎంతగా వైరల్ అయ్యిందో తెలియంది కాదు. తీరా అధికారంలోకి వచ్చాక.. మార్గదర్శకాల పేరుతో హడావిడి చేశారే తప్ప పైసా విదిల్చింది లేదు. ఈ నేపథ్యంలో తాజా ప్రకటనతో.. 2024-25 విద్యా సంవత్సరానికి తల్లికి వందనానికి ఎగనామం పెడుతూ .. 80 లక్షల పిల్లలు, వారి తల్లులను చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం మోసం చేసినట్లయ్యింది.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ప్రభుత్వానికి,ఈసీకి.. సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరిగింది. బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల అంశంపై మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు’అని బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తన వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడమంటే రాజ్యంగమిచ్చిన విధులను నిర్వహించడంలో విఫలమైనట్లేనని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది. గత విచారణలోగత విచారణ సందర్బంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది.ఇక, తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇటీవలే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు సహా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.మరోవైపు.. గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్ (Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఉద్యోగులకు ఈ మార్చి ఇంత దారుణంగా ఉంటుందా?
ఈ మార్చి (March 2025) నెల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పాలిట దారుణంగా ఉండబోతోంది. ఈనెలలో దాదాపు 100 కంపెనీలు ఉద్యోగుల తొలగింపును (Lay Off) ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఈ తొలగింపులు వివిధ పరిశ్రమలలో విస్తరించి ఉన్నాయి. ఇది మహమ్మారి అనంతరం వ్యాపారాలు ఎదుర్కొంటున్న విస్తృత ఆర్థిక సవాళ్లను ప్రతిబింబిస్తుంది.వార్నింగ్ నోటీసులుఈ మేరకు ప్రభావిత ఉద్యోగులకు ఇప్పటికే యాజమాన్యాలు వార్న్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఎస్‌లోని వర్కర్ అడ్జస్ట్ మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (వార్న్) చట్టం ప్రకారం జాబ్స్ రిస్క్‌లో ఉంటే ఆయా కంపెనీలు ఉద్యోగులకు ముందస్తు నోటీసు ఇవ్వాలి. పెద్ద ఎత్తున తొలగింపులు, మూసివేతలకు ఉద్యోగులు, యాజమాన్యాలు, కమ్యూనిటీలు సిద్ధం కావడానికి ఈ చట్టపరమైన ఆవశ్యకత సహాయపడుతుంది. ఈ తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్య ఒక్కో కంపెనీకి 10 నుంచి 500 వరకు ఉంటుంది.కొన్ని ప్రముఖ కంపెనీలు ఇవే..టెక్ లేఆఫ్స్ పతాక శీర్షికల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, తొలగింపులు టెక్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జోన్ ఫ్యాబ్రిక్స్, వాల్‌గ్రీన్స్ వంటి రిటైలర్లు ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉంది. ఇంటెల్, ఫెడెక్స్, నీమన్ మార్కస్, జాన్ డీర్ ఈ జాబితాలోని ఇతర గుర్తించదగిన కంపెనీలుగా ఉన్నాయి.వచ్చే మూడేళ్లలో 150 స్టోర్లను మూసివేసే బృహత్తర వ్యూహంలో భాగంగా 66 స్టోర్లను మూసివేసే యోచనలో ఉన్నట్లు మాకీస్ ప్రకటించింది. రిటైల్ పరిశ్రమలో మార్పులకు అనుగుణంగా కాలిఫోర్నియా, ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగులను కూడా వాల్‌గ్రీన్స్ వదులుకుంటోంది.ఇది చదివారా? ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..ఆర్థిక కారకాలుఈ విస్తృతమైన తొలగింపులకు అనేక అంశాలు దోహదం చేస్తాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లు రుణాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని పెంచాయి. అదనంగా, ద్రవ్యోల్బణం నిర్వహణ ఖర్చులను పెంచింది. వ్యాపారాలు లాభదాయకంగా ఉండటం సవాలుగా మారింది. వినియోగదారుల ప్రవర్తన, డిమాండ్ లో మార్పులు కూడా అనేక కంపెనీల ఆర్థిక కష్టాలకు కారణమయ్యాయి.ఆటోమేషన్.. పునర్నిర్మాణంఆటోమేషన్కు ఊతమివ్వడమే ఈ ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి కంపెనీలు ఉద్యోగాలను ఆటోమేటెడ్ సొల్యూషన్లతో భర్తీ చేయాలని చూస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా కంపెనీలు తమ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు.
ఇది చట్టబద్ధ హత్య!
వాడుకున్నవాళ్లకు వాడుకున్నంత...
Rohit Sharma: చరిత్రలో ఒకే ఒక్కడు
Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఫైనల్‌కు చేరిన టీమిండియాకు కిషన్‌రెడ్డి అభినందనలు
CT 2025, IND VS AUS 1st Semis: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్లిమిటెడ్
ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్
హనుమాన్ నటి బర్త్ డే.. గొప్ప మనసు చాటుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్
రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం!
IND vs AUS: ఛేదిస్తే చరిత్రే..
Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
‘ఎందుకింత నిర్లక్ష్యం?’.. కుల్దీప్పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!
CT 2025, IND VS AUS 1st Semis: రోహిత్, విరాట్ చెత్త నిర్ణయం.. తిట్టి పోస్తున్న జనాలు
షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. ఇక..: టీమిండియా దిగ్గజం
నాగచైతన్యతో మొదటి సీన్.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: సమంత
CT 2025, IND VS AUS 1st Semis: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
IND vs AUS: ఆ ఒక్కడే కాదు.. వాళ్లంతా ప్రమాదకరమే.. గెలవాలంటే: స్మిత్
ఇది చట్టబద్ధ హత్య!
వాడుకున్నవాళ్లకు వాడుకున్నంత...
Rohit Sharma: చరిత్రలో ఒకే ఒక్కడు
Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఫైనల్‌కు చేరిన టీమిండియాకు కిషన్‌రెడ్డి అభినందనలు
CT 2025, IND VS AUS 1st Semis: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్లిమిటెడ్
ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్
హనుమాన్ నటి బర్త్ డే.. గొప్ప మనసు చాటుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్
రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం!
IND vs AUS: ఛేదిస్తే చరిత్రే..
Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
‘ఎందుకింత నిర్లక్ష్యం?’.. కుల్దీప్పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!
CT 2025, IND VS AUS 1st Semis: రోహిత్, విరాట్ చెత్త నిర్ణయం.. తిట్టి పోస్తున్న జనాలు
షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. ఇక..: టీమిండియా దిగ్గజం
నాగచైతన్యతో మొదటి సీన్.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: సమంత
CT 2025, IND VS AUS 1st Semis: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
IND vs AUS: ఆ ఒక్కడే కాదు.. వాళ్లంతా ప్రమాదకరమే.. గెలవాలంటే: స్మిత్
సినిమా

పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్
మిల్కీ బ్యూటీ, హీరోయిన్ తమన్నాకి బ్రేకప్ అయిందట. గత కొన్నేళ్లుగా సహనటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని రహస్యంగా ఏం ఉంచలేదు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కలిసి సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోయారని తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.ముంబై ముద్దుగుమ్మ తమన్నా.. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. హ్యాపీడేస్, ఆవారా, 100% లవ్, బాహుబలి తదితర చిత్రాల్లో నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా హిందీలోనూ మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)అలా 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ చేస్తున్న టైంలో తమన్నా-విజయ్ వర్మ మధ్య ఏదో ఉందనే రూమర్స్ వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా గోవాలో ఓ న్యూఇయర్ పార్టీలో వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ సిరీస్ లో కెమిస్ట్రీ కూడా తెగ వర్కౌట్ అయింది.ఆ తర్వాత నుంచి గత రెండు మూడేళ్లుగా జంట పక్షుల్లా తమన్నా-విజయ్ వర్మ ఎక్కడపడితే అక్కడ కనిపించారు. అలాంటిది కొన్నివారాల క్రితం వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడేమో బ్రేకప్ అని షాకిచ్చారు. రీసెంట్ టైంలో తమన్నా బయట ఒంటరిగానే కనిపిస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ బ్రేకప్ వార్త నిజమేనేమో అనే సందేహం వస్తోంది. అలానే విడిపోవడానికి కారణం కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు)

ఏడాదిలో హీరోగా 12 సినిమాలు.. అది నా అదృష్టం: రాజేంద్రప్రసాద్
సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయ్యింది. చాలా వెరైటీ పాత్రలు చేశాను. రాబిన్హుడ్లోనూ నా పాత్ర డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఆ సినిమా చూశాక.. నేను హీరోగా చేసిన ఎంటర్టైనింగ్ సినిమాలు, ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ సినిమా, క్యారెక్టర్ పట్ల చాలా హ్యాపీగా ఉంది’ అన్నారు నట కిరీటీ రాజేంద్రప్రసాద్. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’.వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించాడు. మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్రప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ రాబిన్‌హుడ్( Robinhood Movie) చేశాక యాక్టర్ గా నామీద నాకు కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగింది. క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ పరంగా సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. దర్శకుడు వెంకీ అద్భుతంగా రాశాడు, తీశాడు. ఇందులో ఇండియాలోనే హయ్యస్ట్ సెక్యురిటీ ఏజెన్సీ నాది. నా ఏజెన్సీలో పని చేయడానికి హీరో వస్తాడు. ఇంతకంటే కథ చెప్పకూడదు(నవ్వుతూ) ఈ కాంబినేషన్ లో చాలా అద్భుతంగా ఉంటుంది.→ ఇందులో నా టైమింగ్ నితిన్(Nithiin) ఫాలో అవ్వాలి, నితిన్ టైమింగ్ నేను ఫాలో అవ్వాలి. క్యారెక్టర్స్ అలా డిజైన్ చేయబడ్డాయి. మేము ఇద్దరం వెన్నెల కిశోర్ కి దొరక్కూడదు. సినిమా చూసినప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇలాంటి ఎంటర్ టైనింగ్ సినిమా చేసి చాలా కాలమయింది. రాబిన్‌హుడ్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్.→ వెంకీ కుడుముల చాలా బిగ్ డైరెక్టర్ అవుతారు. ఈ మధ్య కాలంలో వన్ అఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ రాబిన్‌హుడ్ లో చేశాను. డైరెక్టర్ వెంకీ స్పెషల్ గా ఈ క్యారెక్టర్ ని నా గురించి రాసుకున్నారు. వర్క్ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. వెంకీ, త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. ఆయన లక్షణాలు అన్నీ వచ్చాయి. డైలాగ్ లో మంచి పంచ్ ఉంటుంది. తను కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.→ నటుడిగా ఈ జీవితం దేవుడు, ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. లేడిస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, మిస్టర్ పెళ్ళాం,పెళ్లి పుస్తకం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా ప్రతి సినిమా దేనికదే భిన్నంగా వుంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఒకే ఏడాది హీరోగా 12 సినిమాలు రిలీజ్ చేసిన రోజులున్నాయి. దాదాపు ఆ సినిమాలన్నీ మనం రిలేట్ చేసుకునే పాత్రలే. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని అనుకుంటాను.→ నాటి ప్రధాని పీవీ నరసింహారావు గారు దగ్గర నుంచి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు జీవితంలో ఒత్తిడి, నిరాశలో ఉన్నప్పుడు సరదాగా నవ్వుకోవడానికి, మనసు తేలిక అవడానికి నా సినిమాలు చూస్తుంటామని చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటికీ దర్శకులు నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం నా అదృష్టం. రాబిన్‌హుడ్ సినిమా చూసినప్పుడు ఆ స్పెషాలిటీ మీరు ఫీలౌతారు. → శ్రీలీల(Sreeleela) చాలా మంచి సినిమాలు చేస్తోంది. చాలా మెచ్యూర్ యాక్టర్ గా కనిపించింది. ఇందులో ఆమె బిహేవియర్ నాకు చాలా నచ్చింది. ఇందులో ఫారిన్ నుంచి వచ్చిన తనకి సెక్యురిటీ ఇచ్చే బాధ్యత మాది. చాలా సరదాగా ఉంటుంది. → నాకు కొత్త పాత అని ఉండవు, నిజానికి కొత్త దర్శకులు నాతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అందరికంటే ముందు నేనే సెట్స్ లో తెగ అల్లరి చేస్తాను. దీంతో అందరూ చాలా కంఫర్ట్ బుల్ గా ఫీలౌతారు. నాతో వర్క్ చేయడం చాలా ఈజీ.→ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నాను. దాదాపు ఏడు సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. మొదలు పెట్టాల్సిన సినిమాలు ఓ ఐదు వరకు ఉంటాయి.

నాగచైతన్యతో మొదటి సీన్.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్‌ను అందుకుంది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో సమంతకు అవార్డ్‌ను బహుకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన తొలి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో ఏ మాయ చేశావే మూవీతో సామ్ సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి సమంత మాట్లాడింది. ఈ సినిమాలో ప్రతి షాట్ తన జీవితాంతం గుర్తుండిపోతుందని వెల్లడించింది. అయితే ఈ 15 ఏళ్లలో తనకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవటం వల్ల కొన్ని మంచి సినిమాలు చేయలేకపోయాననని తెలిపింది. అంతేకాకుడా తనకు తమిళం రాకపోవడం వల్ల ఇబ్బంది పడినట్లు సామ్ చెప్పింది.అయితే సమంతా 2010లో రాహుల్ రవీంద్రన్తో మాస్కోయిన్ కావేరిలో నటించింది. అయితే ఆ సినిమా ఏమాయ చేశావే కంటే ముందే చిత్రీకరించినప్పటికీ విడుదల కాలేదు. ఆ సినిమా కంటే తనకు నాగ చైతన్యతో చేసిన సినిమాలోని ప్రతి షాట్ గుర్తుండిపోతుందని సమంత చెబుతోంది. ఈ చిత్రంలో జెస్సీ పాత్రలో కార్తీక్‌ను కలిసే మొదటి సన్నివేశం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని సమంత వెల్లడించింది. గౌతమ్ మీనన్‌తో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవమని తెలిపింది.కాగా.. 2010లో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం, మహేశ్ బాబు దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది. అంతేకాకుండా గతేడాది వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో నటించింది.

మెగాస్టార్‌కు ఆ దేశ పౌరసత్వం.. ఆయన టీమ్ ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మువీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో చిరు సందడి చేశారు. అయితే తాజాగా మెగాస్టార్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుకు యూకే గౌరవ పౌరసత్వం అందించనుందని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ టీమ్ స్పందించింది. ఇటీవల ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి తాను లండన్ వెళ్తన్నట్లు చెప్పడంతో ఈ ఈ వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందన్న వార్తలు అవాస్తవమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు రాసేముందు ముందుగా ధృవీకరించుకోవాలని తెలిపింది. విశ్వక్ సేన్ మూవీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ లండన్ వెళ్లనున్నట్లు తెలిపారు. లండన్‌లో ఓ ఈవెంట్లో తనకు సన్మానం జరగనుందని మెగాస్టార్ తెలిపారు. దీంతో కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సిటిజెన్షిప్ గురించే లండన్ వెళ్తున్నారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా.. చిరంజీవి చివరిసారిగా భోలా శంకర్‌లో కనిపించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర్ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో చిరు జతకట్టనున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన తొలి సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి (మొత్తంగా ఐదోసారి) ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (షమీ) బరిలోకి దిగినప్పటికీ ఆసీస్‌ను ఆలౌట్ చేయడంలో సఫలమైంది.ఛేదనలో విరాట్ (84) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే ఈవెంట్లలో ఆసీస్ నిర్దేశించిన అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది.

CT 2025, IND VS AUS 1st Semis: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 265 పరుగుల ఛేదనలో విరాట్ 98 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ చరిత్రపుట్లోకెక్కాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి-1003రోహిత్ శర్మ-808రికీ పాంటింగ్-731ఈ మ్యాచ్‌లో విరాట్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (24) చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (23) పేరిట ఉండేది. తాజా హాఫ్ సెంచరీతో విరాట్ తన పేరిట ఉండిన మరో రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఐసీసీ నాకౌట్స్‌లో విరాట్ తన హాఫ్ సెంచరీల సంఖ్యను 10కి పెంచుకున్నాడు. ఐసీసీ నాకౌట్స్‌లో సచిన్, స్టీవ్ స్మిత్ తలో ఆరు అర్ద సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు.

CT 2025, IND VS AUS 1st Semis: రోహిత్, విరాట్ చెత్త నిర్ణయం.. తిట్టి పోస్తున్న జనాలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో భారత్ లక్ష్యం దిశగా పయనిస్తుంది. 33 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 167/3గా ఉంది. శుభ్‌మన్ గిల్ (8), రోహిత్ శర్మ (28), శ్రేయస్ అయ్యర్ (45) ఔట్ కాగా.. విరాట్ కోహ్లి (64), అక్షర్ పటేల్ (20) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 17 ఓవర్లలో మరో 98 పరుగులు చేయాలి. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు.. శ్రేయస్ అయ్యర్ వికెట్ ఆడమ్ జంపాకు దక్కింది.pic.twitter.com/9zGKhnuFuP— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 4, 2025రోహిత్, విరాట్ చెత్త నిర్ణయంకాగా, భారత్ బ్యాటింగ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ చెత్త నిర్ణయం తీసుకున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి కూపర్ కన్నోలీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ అయినట్లు ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు. రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయినట్లు సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయం రోహిత్‌తో పాటు నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి కూడా తెలుసు. అయినప్పటికీ రోహిత్, కోహ్లితో చర్చించి రివ్యూ వెళ్లడం అభిమానులను విస్మయానికి గురి చేసింది. వికెట్ల ముందు దొరికిపోయినట్లు క్లియర్‌గా తెలుస్తున్నా రోహిత్, కోహ్లి రివ్యూకి వెళ్లడమేంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మ్యాచ్‌లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉండగా అనవసరంగా రివ్యూ వేస్ట్ చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, కన్నోలీ సంధించిన ఫుల్ లెంగ్త్ బంతిని స్వీప్ చేయబోయి రోహిత్ వికెట్ల ముందు ఈజీగా దొరికిపోయాడు.

CT 2025, IND VS AUS 1st Semis: 97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్లో తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ భారత్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. 49.3 ఓవర్లలో ఆ జట్టు 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 8, రోహిత్ శర్మ 28 పరుగులు చేసి ఔటయ్యారు. విరాట్ కోహ్లి (26 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 19 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 93/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 31 ఓవర్లలో 172 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు దక్కింది.97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!ఈ మ్యాచ్‌లో భారత్ ఆసక్తికర రీతిలో జట్టును సమీకరించింది. కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (మహ్మద్ షమీ) బరిలోకి దిగింది. 97 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్ ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఇలా ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.మొత్తంగా ఐసీసీ వన్డే సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఓ జట్టు ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడం ఇదే నాలుగో సారి మాత్రమే. తొలి రెండు సందర్భాలు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు ఎడిషన్లలో (1998, 2000) చోటు చేసుకోవడం విశేషం. 1998 ఎడిషన్ ఫైనల్లో సౌతాఫ్రికా, 2000 ఎడిషన్ సెమీస్‌లో పాకిస్తాన్ జట్లు ఇలానే ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాయి. మూడో సందర్భం 2011 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో చోటు చేసుకుంది. నాడు శ్రీలంక న్యూజిలాండ్‌పై ఒకే ఒక పేసర్‌ను బరిలోకి దించి విజయం సాధించింది. 14 ఏళ్ల అనంతరం భారత్ తిరిగి ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్‌లో ఒకే ఒక పేసర్‌ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది.ఐసీసీ ఈవెంట్ల సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగిన జట్లు..సౌతాఫ్రికా (1998 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్)- వెస్టిండీస్‌పై గెలుపుపాకిస్తాన్ (2000 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్)- న్యూజిలాండ్ చేతిలో ఓటమిశ్రీలంక (2011 వన్డే వరల్డ్‌కప్ సెమీస్)- న్యూజిలాండ్‌పై గెలుపుభారత్ (2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్)
బిజినెస్

ట్రంప్ నిర్ణయం.. చైనా ప్రతీకారం
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై విధించే సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ ప్రకటించారు. అమెరికా సుంకాలకు చైనా కూడా వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. యూఎస్ దిగుమతి సుంకాలను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ ప్రకటన జారీ చేసింది.చైనా తీసుకున్న నిర్ణయం సుమారు 25 సంస్థలపై ప్రభావాన్ని చూపనుంది. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులపై చైనా సుంకాలను పెంచింది. మార్చి 10 నుంచి ఈ సుంకాలు వర్తించనున్నట్లు తెలుస్తోంది.అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న మరియు పత్తిపై అదనంగా 15 శాతం సుంకాన్ని.. సోయాబీన్స్, జొన్న, పంది మాంసం, గొడ్డు మాంసం, జల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల దిగుమతులపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను దృఢంగా కాపాడుకుంటుందని స్పష్టం చేసింది.చైనాపై ట్రంప్ సుంకాలుచైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.అమెరికా విధించిన సుంకాలు.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వీడియోగేమ్ కన్సోల్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్లు, బ్లూటూత్ పరికరాల వంటి ఎలక్ట్రానిక్స్‌పై వర్తిస్తాయి. చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు ప్రకటించడంతో.. ట్రంప్ వెనుకడుగు వేస్తారా?.. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

మొదలైన పసిడి పరుగు: భారీగా పెరిగిన ధరలు
వారంరోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. నేడు (మార్చి 04) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 760 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 760 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 760 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,380 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 760 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గరిష్టంగా రూ.2,000 పెరిగింది. దీంతో ఈ రోజు (మార్చి 3) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1000 పెరిగి.. రూ. 98,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

అంబానీ వంతారా: పులి పిల్లలతో నరేంద్ర మోదీ - వీడియో
గుజరాత్‌లోని వన్యప్రాణుల రక్షణ, పునరావాసం & సంరక్షణ కేంద్రంమైన 'వంతారా'ను ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' ప్రారంభించారు. అక్కడ పరిసరాలను సందర్శించారు. అక్కడ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ఆయన సన్నిహితంగా మెలిగారు.వంతారాలోని వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించారు. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్లు, ICUలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు.ఆసియాటిక్ సింహానికి MRI చేయడం, హైవేలో కారు ఢీకొట్టిన తర్వాత గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయడం వంటి దృశ్యాలను మోదీ చూసారు. ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల, అరుదైన మరియు అంతరించిపోతున్న జాతి చిరుతపులి పిల్ల, కారకల్ పిల్ల వంటి వివిధ జాతులతో సరదాగా గడిపడమే కాకుండా.. వాటికి పాలు పట్టించడం వంటివియు కూడా మోదీ చేశారు.వంతారా కేంద్రంలో.. రక్షించబడిన జంతువులను వాటి సహజ ఆవాసాలను దగ్గరగా ప్రతిబింబించే ప్రదేశాలలో ఉంచారు. ఇక్కడ ఆసియాటిక్ సింహం, చిరుత, ఒక కొమ్ము గల ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్, హిప్పోపొటామస్, మొసళ్ళు, ఏనుగులు, పెద్ద పాములు మొదలైన జంతువులను మోదీ చూసారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన ఏనుగుల ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించారు. జంతువులను వీక్షించడమే కాకుండా.. వాటికి సేవ చేస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది, కార్మికులతో ప్రధానమంత్రి సంభాషించారు. వంతారాలో 2,000 కంటే ఎక్కువ జాతులు.. రక్షించబడిన, అంతరించిపోతున్న 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి.Watch: Prime Minister Narendra Modi inaugurated and visited Vantara, a wildlife rescue and conservation center in Gujarat, home to over 1.5 lakh rescued animals. He explored its advanced veterinary facilities, interacted with rare species, witnessed surgeries, and participated in… pic.twitter.com/XV5j8mELaz— IANS (@ians_india) March 4, 2025

ట్రంప్ చర్యపై వారెన్ బఫెట్ ఆందోళన
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కెనడా, చైనా, మెక్సికోలపై భారీ సుంకాలను విధించారు. ఈ ప్రకటన ''యుద్ధ చర్య'' అని బిలియనీర్, ప్రముఖ పెట్టుబడిదారు 'వారెన్ బఫెట్' (Warren Buffett) అని అన్నారు. సుంకాలు ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని కూడా వెల్లడించారు.సుంకాలు.. వస్తువులపై పన్నుగా పనిచేస్తాయని. ఇది ప్రజలు లేదా వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ బఫెట్ అన్నారు. ఇప్పటి వరకు మా కంపెనీ అమెరికా ప్రభుత్వానికి గత 60 ఏళ్లలో 101 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పన్ను చెల్లించిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ కంపెనీ.. ఇంత పెద్ద మొత్తంలో పన్ను చెల్లించలేదని స్పష్టం చేశారు.అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన బఫెట్.. సుంకాల ఆర్థిక భారం వినియోగదారులపై పడుతుందని చెప్పారు. ఈ రోజు (మంగళవారం) నుంచి అమలులోకి వచ్చే కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాలను విధించడంలో ట్రంప్ ముందుకు సాగుతున్నందున.. బఫెట్ ఈ వ్యాఖ్యలు చేశారు.చైనా దిగుమతులపై సుంకాలను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ చర్య బీజింగ్‌తో ఉద్రిక్తతలను పెంచానుందని నిపుణులు చెబుతున్నారు. చైనా కూడా సుంకాలతోనే ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఇవన్నీ గమనిస్తుంటే.. వాణిజ్య యుద్ధం జరుగుతుందా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: చైనా నెత్తిన ట్రంప్ పిడుగు.. సుంకాల విషయంలో తగ్గేదేలే!సుంకాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని.. వ్యాపారాలు, వినియోగదారులపై ఖర్చుల భారం పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. సుంకాలతో విదేశీ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి కారణం.. దేశీయ తయారీని పెంచడమే అని ట్రంప్ సమర్ధించుకుంటున్నారు. అయితే విమర్శకులు ఇటువంటి విధానాల వల్ల ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఫ్యామిలీ

వారి కోసం జుకర్‌బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్‌బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్‌లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్‌బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్‌బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్‌లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్‌బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్‌పైకి అద్భుతమైన నీలిరంగు జంప్‌సూట్‌లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్‌సూట్ కూడా ఇలాంటిదేనట.

అరుదైన శస్త్రచికిత్స: దంతంతో కంటి చూపు..!
"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. కళ్లే లేకపోతే ఏం నేర్చుకోవాలన్న కష్టమే. అంధత్వంతో బాధపడేవాళ్లకు బాగా తెలుస్తోంది ఆ ఇబ్బంది ఏంటో. అయితే పుట్టుకతో కంటి చూపు కోల్పోయినా, లేదా ఏదైనా వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయినా తిరిగి చూపు ప్రసాదించడం కాస్త కష్టం మవుతుంది. కంటి చూపుకి కారణమయ్యే, నరాలు, కార్నియా బాగుంటేనే అదంతా సాధ్యం. అలాంటిది వైద్యులు సరికొత్త వైద్య విధానంతో అంధత్వంతో భాధపడుతున్న వాళ్లకు సరికొత్త ఆశను అందించారు. కంటికి దంతం సాయంతో చూపుని ప్రసాదించారు వైద్యులు. ఇలాంటి ప్రక్రియ ద్వారా చూపుని ప్రసాదించిన తొలి కేసు ఇదేకావడం విశేషం.కెనడియన్ మహిళ గెయిల్ లేన్‌కి 'టూత్ ఇన్ ఐ' అనే అరుదైన శస్త్ర వైద్య విధానంతో చూపుని ప్రసాదించారు. దీన్ని వాంకోవర్‌లోని మౌంట్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నిర్వహించింది. ఈ మేరకు డాక్టర్ గ్రెగ్ మోలోనీ శస్త్ర చికిత్స గురించి వివరిస్తూ..ఈ ప్రక్రియ గురించి చాలామంది వైద్యులకు తెలియదని అన్నారు. ఇది క్రియాత్మక కార్నియాను సృష్టించడానికి రోగి పంటిలో లెన్స్‌ను అమర్చి చేస్తారని చెప్పారు. ఇది సంక్లిష్టమైన ప్రక్రియని, రెండు దశల్లో నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా రోగి నోటిలో దంతాన్ని ఒకటి తీసి సరైన ఆకృతిలోకి మార్చి, దానిలో ప్లాస్టిక్ లెన్స్‌ని చొప్పిస్తారు. ఈ సవరించిన దంతాన్ని ఆమె చెంపలో మూడు నెలలపాటు ఉంచుతారు. ఆ తర్వాత అవసరమైన కణాజాలాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నేరుగా కంటిలో అమర్చుతామని వివరించారు. ఆమె చెంప నుంచి కణజాల అంటుకట్టుతో దీన్ని అమర్చడం సాధ్యమవుతుందని అన్నారు. ఎందుకంటే సహజ బంధన కణజాలం దంతంలో లేకపోవడంతో ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.అయితే ఈ ప్రక్రియ అన్ని దృష్టి సమస్యలకు సరిపోయే వైద్య విధానం మాత్రం కాదని డాక్టర్ మోలోనీ నొక్కి చెప్పారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రసాయన కాలిన గాయాలు లేదా ఇతర గాయాలు, కండ్లకలక మచ్చల వల్ల తీవ్రమైన కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ వైద్య విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శస్త్ర చికిత్స మంచి ఫలితం ఇవ్వాలంటే మాత్రం సదరు రోగులకు ఆరోగ్యకరమైన రెటీనా, ఆప్టిక్ నరాలను కలిగి ఉండాలని అన్నారు. చివరగా సదరు రోగి గెయిల్ లేన్ తాను పదేళ్లుగా చూడలేదని..ఇప్పుడూ గనుక ఈ ప్రక్రియ సఫలమైతే భయం, ఆశ రెండూ ఒకేసారి కలుగుతాయంటూ కన్నీళ్లు పెట్టుకుందామె. కంటి చూపు వస్తే మాత్రం తప్పక చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నయంటూ సంతోషభరితంగా చెబుతోంది లేన్.(చదవండి: చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చింది..? ఆ నెంబర్‌తో పిలవడానికి రీజన్..?)

ఏసీలు కూడా పేలే అవకాశం : ఎలా గుర్తించాలి? ముఖ్యమైన జాగ్రత్తలు
ఎండలు ముదురుతున్నాయి. సూర్యుడి భగభగలను తట్టుకోవాలంటే అందరూ తప్పనిసరిగా ఏసీలను వాడుతున్న పరిస్థితి. అయితే ఏసీల పని తీరుపై ప్రాథమిక అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలమంతా వాడకుండా పక్కన పెట్టి ఉంచుతాం కాబట్టి ఇపుడు వాడేటపుడు మెయింటెనైన్స్పై దృష్టి పెట్టాలి. ఏసీలోని భాగాలను శుభ్రం చేసుకోవాలి. అసలు ఎండాకాలంలో ఏసీల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలో తెలుసు కుందాం ఈ కథనంలో...కొన్ని చోట్ల ఏసీ పేలడం కారణంగా అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.మెయింటెనెన్స్వేసవికాలంలో ఏసీలను వాడే ముందు శుభ్రంచేయడం, ప్రొఫెషనల్ టెక్నీషియల్ సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. ఏసీ సరిగ్గా పనిచేస్తుందో? లేదో నిపుణులై టెక్నీషియన్ ద్వారా తనిఖీ చేయించాలి. లేదా సంబంధిత బ్రాండ్ సర్వీస్ సెంటర్ వారిని సంప్రదించాలి. దీని వల్ల ఏసీలో ఉన్న లోపాలను ముందుగనాఏ గుర్తించవచ్చు. అన్ని ఎలక్ట్రికల్ భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవచ్చు. ఫిల్టర్లను శుభ్రపరచడం, రిఫ్రిజిరేంట్ లీక్ లాంటి ప్రధానం చెక్ చేసుకోవాలి.వైరింగ్ తనిఖీఏసీకి అనుబంధంగా ఉన్న వైరింగ్‌ను తనిఖీ చేయాలి. ఏవైనా లోపాలు కనిపిస్తే బాగు చేయించుకోవాలి, లేదా వెంటనే మార్చుకోవాలి. వైరింగ్ సరిగ్గా లేకపోతే షాక్ వచ్చే అవకాశాలుంటాయి. రిమోట్లో కూల్ మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్ లేదా ఎనర్జీ-సేవింగ్ మోడ్ వంటి మోడ్లు పనిచేయక పోవడం, AC లోని సెన్సార్ పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది. మోడ్లు ఏవీ సరిగ్గా పనిచేయకపోతే, వెంటనే టెక్నీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.వెంటిలేషన్ ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం మంచిది. ఖాళీగా ఉన్న ప్రదేశంలో, మంచి వెంటిలేషన్ ఉంచితే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది. గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసుకోవాలి. లేదంటే గాలి సరిగ్గా రాదు. గాలి ప్రవాహం సరిగ్గా ఉటే ఏసీ యూనిట్ పై ఎలాంటి ఒత్తిడి పడదు. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ వేడెక్కి అగ్ని ప్రమాద అవకాశాలను పెంచుతుంది.ఒక వేళ ఏసీ ఎలక్ట్రికల్ భాగాలు పాడైతే, వాటిని రీప్లేస్ చేసినప్పుడు నాణ్యమైన, కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ భాగాలతోనే రీప్లేస్ చేయాలి. అలాగే పవర్ సాకెట్లు, ప్లగ్గులు, షెడ్యూల్ బ్రేకర్లు నాణ్యతను ఒకటిరెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఏసీ టెంపరేచర్ని రూమ్ టెంపరేచర్ కంటే తక్కువగా సెట్ చేసుకోవడం కూడా ముఖ్యంఏసీ నుంచి అసాధారణ శబ్దాలు వస్తున్నా, వాసన వస్తున్నా, లీకేజీ ఉన్నా కూడా వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి. ఏసీ నుంచి పొగలు వస్తున్నట్టు గమనిస్తే పొరపాటున కూడా నీటిని చల్లకూడదు. నిపుణులు వచ్చి తనిఖీ చేసేదాకా ఏసీని ఆఫ్ చేయడం ఉత్తమం.ఏసీ నిరంతరం వాడుతున్నవారు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే.. రోజులో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఏసీ ని ఆఫ్ చేసి ఉంచాలి. దీని చాలాప్రమాదాలను నివారించవచ్చు. అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలు ఇంట్లో ఉంటే మంచిది. ఎలాంటి ప్రాణాపాయాలు కలగకుండా ఉంటాయి.ఎలాంటి ఏసీలను తీసుకోవాలి? నాణ్యమైన ఎలక్ట్రికల్ భాగాలను వినియోగించే, నాణ్యమైన బ్రాండుకు సంబంధించిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలి. నోట్ : ఏసీలు వాడుతున్నవారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మెంటెయిన్ చేయాలి. దీని వల్ల చల్లదనాన్ని ఆస్వాదించడంలోపాటు, కరెంట్ ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇదీ చదవండి : సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది!

ప్రముఖ డిజైనర్ దుస్తుల్లో రాయల్‌లుక్‌లో మెరిసిన తారలు
ముంబైలో ఫ్యాషన్ టూర్–2025 సందర్భంగా టైగర్ ష్రాఫ్ . మానుషి చిల్లర్ అద్భుతంగా కనిపించారుముంబైలో జరిగిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ లో బాలీవుడ్ తారలు టైగర్ ష్రాఫ్ ,మానుషి చిల్లర్ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేశారు.శనివారం రాత్రి బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ముంబైలో అద్భుతంగా జరిగింది. తరుణ్ తహిలియాని కోచర్ మాస్టర్ క్లాస్ లో టైగర్ ష్రాఫ్ మానుషి చిల్లర్ అద్భుతంగా కనిపించారు టైగర్ ఎంబ్రాయిడరీ సూట్లో, మనుషి పాస్టెల్ లెహంగాలో ఆకట్టుకున్నారు. ట్రెడిషనల్ హ్యాండ్‌మేడ్, సమకాలీన ఫ్యాషన్ ట్రెండ్ పరిపూర్ణ సమ్మేళనంతో రూపొందించిన దుస్తుల్లో మోడల్స్ హైలైట్‌గా నిలిచారు. ముఖ్యంగా టైగర్, మానుషి ఇద్దరూ ఆత్మవిశ్వాసం, అధునాతనతకు ప్రతి రూపాలుగా ఫ్యాషన్ ఔత్సాహికులను ఆశ్చర్యపరిచారు. ఈ ఫ్యాషన్టూర్కి సంబంధించిన వీడియోను తరుణ్ తహిలియానీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Tarun Tahiliani (@taruntahiliani)ఇదీ చదవండి: సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది! టైగర్ ష్రాఫ్ డీప్ ప్లంజింగ్ సిల్క్ షర్ట్, ఫిట్టెడ్ బ్లాక్ ప్యాంటుతో కూడిన బ్లాక్ ఎంబ్రాయిడరీ సూట్లో మెరిశాడు. ముఖ్యంగా అతని పొడవైన, నల్ల జాకెట్, సంక్లిష్టమైన అలంకరణలు,బోల్డ్ కళ్ళజోడు ,లేయర్డ్ బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ రాజ వైభవాన్ని తెచ్చిపెట్టింది.మరోవైపు, మనుషి చిల్లార్ మృదువైన పాస్టెల్-రంగు లెహంగాలో ఆధునిక మహారాణిలా కనిపించింది. విలాసవంతంగా ఎంబ్రాయిడరీ చేయబడిన స్కర్ట్ అద్భుతంగా కనిపించింది. హెరిటేజ్ పోల్కి, పచ్చ ఆభరణాలతో విశేషంగా నిలిచాయి. చోకర్ ,మాంగ్ టిక్కాతో సహా, సొగసైన బన్ ఆమె రూపానికి రాయల్ లుక్ తీసుకొచ్చింది.
ఫొటోలు
National View all

డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె!
గౌహతి: ఓ ఆటోడ్రైవర్‌ను మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొట్టిన ద

‘నీ వల్లే నా జీవితాన్ని ఇక్కడితో ముగిస్తున్నా’.. అంటూ వీడియో కాల్
అతనొక టైలర్. వృత్తి చేసుకుంటూ జీవనం సాగించడానికి ఒక ప్రాంతానికి వెళ్లాడు.

రూ.10 కోసం తండ్రిని చంపి.. తలతో పోలీస్ స్టేషన్‌కు..
బారిపడా: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో దారుణం జరిగింది.

బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో కన్నడ నటి అరెస్ట్
బెంగుళూరు: బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుక

‘మీ నాన్నను అడుగు.. నేను ఏం చేశానో?
పాట్నా: బీహార్ రాష్ట్రంలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న జేడీయూ నేత, ప్రస్తు
International View all

ఉక్రెయిన్ ఖనిజ కాంతులు
అమెరికా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన ఖనిజాల ఒప్పందంపై సఫలీకృతం కాలేదు.

ఫోన్ లేకుంటేనే సూపర్ బ్రెయిన్!
మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌తోనే నడుస్తోంది.

Trump: చేతిపై కమిలిన గాయాలు.. కాళ్లు ఈడ్చుకుంటూ..!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా

ట్రంప్ నిర్ణయం.. చైనా ప్రతీకారం
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై విధించే సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ ప్రకటించారు.

పుతిన్‌కు ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికా ప్లాన్ ఏంటి?
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు
NRI View all

టంపా వేదికగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు

జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం
ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీనిహల్ తమ్మనకు మరో అరుదైన గౌరవం లభించింది.

గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం
గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్

వలస కార్మికుల మృత్యు ఘోష
మోర్తాడ్ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

వీసా గోల్డెన్ చాన్సేనా?
గోల్డ్ కార్డ్ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్ ఇది.
క్రైమ్

రోడ్డురోలర్ కొట్టేసి.. తుక్కుకింద అమ్మేసి..
మహబూబాబాద్ రూరల్: బంగారం, వెండి, డబ్బులు, ఇతర వస్తువులు చోరీ జరగడం సాధారణమే. కానీ టన్నులకొద్దీ బరువుండే రోడ్డు రోలర్‌ను కొందరు దొంగలు అపహరించి.. పాత ఇనుప సామాను దుకాణంలో అమ్మేసి డబ్బుతో ఉడాయించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తండ్రీకొడుకులు ఎస్.కే.బడేమియా, ఖాదర్, కరీమ్ ఉమ్మడిగా పాత ఇనుప సామాను (స్క్రాప్) దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణానికి చెందిన ఎంఎస్ కన్స్ట్రక్షన్ సివిల్ రైల్వే కాంట్రాక్టర్ మోహన్‌మిశ్రా పేరిట ఉన్న రోడ్డురోలర్‌ను.. కొందరు వ్యక్తులు జేసీబీతో పాత ఇనుప సామాను దుకాణానికి తీసుకొచ్చారు. రూ.2.19 లక్షలకు దాన్ని విక్రయించి, వచ్చిన నగదుతో వెళ్లిపోయారు. కాగా, చోరీ చేసి తీసుకువచ్చి విక్రయించారని గ్రహించని స్క్రాప్ దుకాణం నిర్వాహకులు రోడ్డురోలర్‌ను గ్యాస్ కట్టర్‌తో ముక్కలు చేసే పనిలో నిమగ్నం కాగా.. వారికి ఒక ఫోన్ వచ్చింది.రోడ్డురోలర్ యజమానిని మాట్లాడుతున్నానని.. ఇటీవల చోరీ అయిన తన రోడ్డురోలర్‌ను ఎలా కొనుగోలు చేశారని అవతలి వ్యక్తి ప్రశ్నించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో తమను మోసగించి విక్రయించారని దుకాణ యజమానులు లబోదిబోమన్నారు. రోడ్డురోలర్ చోరీ, విక్రయంపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కడుపులోనే శిశువు.. కాసేపటికే తల్లి
కోనరావుపేట(వేములవాడ): ఓ గర్భిణిని ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే.. శిశువు కడుపులోనే చనిపోగా.. పరిస్థితి విషమించి, కాసేపటికే తల్లి మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెంది సిద్దరవేణి బాబుకు కొండాపూర్ గ్రామానికి చెందిన లాస్యతో ఏడాది క్రితం వివాహం జరిగింది. గర్భిణి అయిన లాస్యను కుటుంబసభ్యులు ప్రసవం నిమిత్తం గురువారం వేములవాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో ఆమెకు ఫిట్స్ వచ్చాయి. దీంతో వారు ఆందోళనకు గురై, కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు కరీంనగర్ వెళ్లాలని చెప్పడంతో వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. వైద్యులు లాస్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకోగా వైద్యులు ఆపరేషన్ చేసి, మృత శిశువును బయటకు తీశారు. పరిస్థితి విషమించడంతో కాసేపటికే తల్లి లాస్య కూడా మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో పల్లిమక్త, కొండాపూర్‌లలో విషాదం నెలకొంది.

అమ్మను అనాథను చేశాడు!
మన్సూరాబాద్(హైదరాబాద్): రోజు రోజుకూ మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు ఆమెను రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. వృద్ధురాలి దీనస్థితిని గమనించిన కాలనీవాసులు అక్కున చేర్చుకుని అన్న పానీయాలు అందించి ఆశ్రయం కల్పించారు. ఈ ఘటన మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. వృద్ధురాలు చెప్పిన వివరాల ప్రకారం.. భువనగిరి– యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామానికి సమీపంలోని సీత్యా తండాకు చెందిన ధర్మీ (80)కి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. వీరిలో ఇద్దరు పెద్ద కుమారులు గతంలోనే చనిపోయారు. చిన్న కుమారుడు లక్ష్మణ్ నాయక్ వద్ద ధర్మీ ఉంటోంది. లక్ష్మణ్‌నాయక్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. ఎల్బీనగర్లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం లక్ష్మణ్‌నాయక్ తన తల్లి ధరీ్మని మన్సూరాబాద్‌లోని చిత్రసీమ కాలనీలోని లిటిల్ చాంప్ స్కూల్ వద్ద తన ఆటోలో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ధర్మీ కాలనీలోని రోడ్ నంబర్–4లో ఓ మూలన కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన రిటైర్డ్ అధికారి బొప్పిడి కరుణాకర్‌రెడ్డి, సైదులు గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచారు. తన కుమారుడు ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లాడని చెప్పింది. దీంతో ఆమెకు ఆశ్రయం కల్పించి ఈ సమాచారాన్ని 108తో పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ వృద్ధురాలి కోసం ఎవరూ రాకపోవడంతో కాలనీ వాసులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఆలేటి వృద్థాశ్రమానికి ధరీ్మని తరలించారు. కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన కుమారుడికి తగిన బుద్ధి చెప్పాలని కాలనీ వాసులు కోరారు.

మూడు ప్రాణాలు బలి
మణికొండ(హైదరాబాద్): గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ పాషా కాలనీలో శుక్రవారం సాయంత్రం విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కారులోని గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మరింత ఉద్ధృతమై భవనంలోని మొదటి అంతస్తుకు వ్యాపించడంతో కిచెన్ గదిలోని రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఓ గదిలో ఇరుక్కుపోయిన ఉస్మాన్‌ఖాన్ తల్లి జమిలాఖాతమ్ (78), అతని తమ్ముడి భార్య శాహినా ఖాతమ్ (38), తమ్ముడి కూతురు సిజ్రా ఖాతమ్ (4)లు ఊపిరి ఆడకపోవడంతో గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందికి దూకి.. మంటల నుంచి తప్పించుకునేందుకు చుట్టుపక్కల వారు బాధితుల ఇంటి ముందు పరుపులు వేయగా.. ఉస్మాన్‌ఖాన్ తమ్ముడు యూసుఫ్‌ఖాన్, కుమారుడు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకారు. దీంతో యూసుఫ్ ఖాన్ కాలు విరిగింది. గాయపడిన యూసుఫ్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్ని మాపక శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్లాట్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. అగి్నమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత పైఅంతస్తుకు వెళ్లి గోడలకు రంగులు వేసే జూల ద్వారా ఇద్దరిని సురక్షితంగా కిందికి తీసుకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు మొదటి అంతస్తు నుంచి దూకి, ఇద్దరు జూల ద్వార కిందికి వచ్చి ప్రాణాలను కాపాడుకోగా.. ఇద్దరు మహిళలు, బాలిక మృతి చెందారు. ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.