Top Stories
ప్రధాన వార్తలు

ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్స్కీ కీలక ట్వీట్
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య వైట్ హౌస్ వేదికగా జరిగిన చర్చలు పూర్తిగా విఫలం కావడమే కాదు.. ఆ చర్చ కాస్తా ‘ మూడో ప్రపంచ యుద్ధం’ అని ట్రంప్ నోట వచ్చే వరకూ వెళ్లింది. అంటే రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమంటూనే ట్రంప్ చెప్పిన ప్రతీ దానికి తలాడించలేదు జెలెన్ స్కీ. పూర్తిగా తమ భూభాగంపై ఎటువంటి కాల్పులు, బాంబుల మోత లేకుండా చూస్తామని అమెరికా తరఫున మీరు(ట్రంప్) మాటిస్తేనే మీతో వాణిజ్య ఖనిజాల ఒప్పందంపై సంతకం చేస్తామని కరాఖండీగా చెప్పేశారు జెలెన్ స్కీ.తమ భూ భాగంలో నివసిస్తే వేరే వాళ్ల పెత్తనం ఏమిటని జెలెన్ స్కీ కాస్త గట్టిగానే స్వరం వినిపించారు. ఇది ట్రంప్ కు నషాళానికి ఎక్కినట్లుంది. రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోకపోతే మూడో ప్రపంచం యుద్ధం వచ్చినా రావొచ్చు అని ట్రంప్ హెచ్చరించారు. దాంతో వారి మధ్య చర్చ సంగతి పక్కన పెడితే, వాగ్వాదమే ఎక్కువ కనిపించింది.ఇలా వాదోపవాదాల నడుమనే ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయకుండా వైట్ హౌస్ వీడారు జెలెన్ స్కీ. అయితే జెలెన్ స్కీ వైఖరి కచ్చితంగానే ఉందనే అభిప్రాయమో, ట్రంప్ పై కోపమో తెలీదు కానీ కొన్ని దేశాలు మాత్రం ఉక్రెయిన్ కు మద్దతు తెలిపాయి. కెనడా, బ్రిటన్ తో సహా పలు కీలక దేశాలు జెలెన్ స్కీకి జై కొట్టాయి.మీ సపోర్ట్ ఎప్పుడూ కీలకమే.. కానీ మాకు స్వేచ్ఛ కూడా అవసరంఅయితే ఇలా ట్రంప్ తో వాదించి వెళ్లిన జెలెన్ స్కీ గురించి ప్రపంచం అంతా చర్చించుకునే తరుణం ఇది. అగ్రదేశం, ఆ దేశ అధ్యక్షుడ్ని ఎదిరించి వాదించిన సిసలైన నాయకుడు అని, ‘వీడు మగడ్రా బుజ్జి’ అని సోషల్ మీడియా వరల్డ్ అనుకుంటున్న తరుణం.. అయితే ట్రంప్ తో వాగ్వాదం తర్వాత జెలెన్స్కీ.. తమకు యూఎస్ సపోర్ట్ అనేది కీలకమని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ సపోర్ట్ చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ వేదికగా జెలెన్ స్కీ ట్వీట్ చేశారు. ‘ మీ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఇప్పటివరకూ రష్యాతో వార్ లో మాకు అందించిన ప్రతీ సహకారం మరువలేనింది. ఉక్రెయిన్ ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడే ఉంటారు.ఇప్పుడు ట్రంప్ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఆయన యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. యుద్ధాన్ని ముగించడానికి మా కంటే ఎక్కువ కోరుకునే వారు ఎవరూ ఉండరు. కానీ మేము యుద్ధంతోనే జీవనం సాగిస్తున్నాం. మా స్వాతంత్య్యం కోసం మేము చేస్తున్నా పోరాటం.. మా ప్రతీ ఒక్కరి ఆశయం, ఆశ కూడా మాకు స్వేచ్ఛగా మనుగడ సాగించడమే’ అని రాశారు. America’s help has been vital in helping us survive, and I want to acknowledge that. Despite the tough dialogue, we remain strategic partners. But we need to be honest and direct with each other to truly understand our shared goals.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025 It’s crucial for us to have President Trump’s support. He wants to end the war, but no one wants peace more than we do. We are the ones living this war in Ukraine. It’s a fight for our freedom, for our very survival.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025

పోసానిపై ‘పచ్చ’ పగ
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి దగ్గర్నుంచి ఈరోజు(శనివారం) రిమ్స్ ఆస్పత్రి తరలించే విషయంలోనూ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది పోసాని అనారోగ్యంతో ఉన్నా పోలీసుల వేధింపుల పర్వం మాత్రం కొనసాగుతోంది. అరెస్టు సమయంలో తన అనారోగ్యం సమస్యలను పోసాని, ఆయన కుటుంబ సభ్యులు.. పోలీసులకు చెప్పారు. అరెస్ట్ చేసేటప్పుడు తనకు రేపు ఎంఆర్ఐ స్కాన్ ఉందని పోలీసులకు స్పష్టం చేశారు. అయినా వినిపించుకోకుండా పోసానిని అరెస్ట్ చేశారు. తమ వద్ద మంచి డాక్టర్లు ఉన్నారంటూ జీపులో ఎక్కించుకుని పోసానిని తీసుకువెళ్లారు సంబేపల్లి ఎస్ఐ.తెల్లారిదాకా జీప్‌లో తిప్పుతూ..ఇలా తెల్లారిదాకా జీపులోనే తిప్పుతూ పోసానిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఖాకీలు. 27వ తేదీ మధ్యాహ్నం ఓబులవారి పల్లె పీఎస్ కు తరలించారు. అప్పుడు కూడా పోసానిని 9 గంటల పాటు విచారించారు. కోర్టుకు తరలించే ముందు పీహెచ్ సీ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. గొంతు, చేయి నొప్పితో ఉన్న పోసానికి బీపీ, షగర్ చెక్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రాత్రిళ్లు నిద్ర, ఆహారం లేకుండా పోసానిని ఖాకీలు ఇబ్బంది పెట్టారు. రాజంపేట జైలుకు తరలించిన తర్వాత ఛాతి నొప్పితో పోసాని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక జైలు నుంచి ఆస్పత్రికి తరలింపులోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడింది. తీవ్రంగా నొప్పితో బాధపడుతున్నా మధ్యాహ్నం వరకూ ఆస్పత్రికి తరలించకుండా వేధింపులకు గురిచేశారు. ఈసీజీ పరీక్షల్లో హార్ట్ బీట్ తేడా కనపించడంతో కడప రిమ్స్ కు తరలించారు. రిమ్స్ కు పోసానిని తరలించే విషయంలో కూడా అలక్ష్యం ప్రదర్శించారు. చాతి నొప్పితో బాధపడుతున్న పోసానిని అంబులెన్స్ లో కాకుండా పోలీస్ వ్యాన్ లో తరలించడం పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి అద్దం పడుతోంది.

Delhi: ఆ వాహనాలకు ఇంధనం బంద్..!
ఢిల్లీ : నిత్యం తీవ్ర వాయు కాలుష్యం(Delhi Pollution)తో కొట్టిమిట్టాడే ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది తాజా బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలను బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈరోజు(శనివారం) సమీక్ష నిర్వహించారు పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా.ఈ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. పాత వాహణాలపై ఆంక్షలు, స్మోగ్ నిరోధక చర్యలు తప్పనిసరి చేయడంతో పాటు పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. ఢిల్లీలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి యాంటీ స్మోగ్ గన్ లను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నఆరు. ఢిల్లీలో కొన్ని పెద్ద హోటళ్లు, కొన్ని పెద్ద కార్యాలయం సముదాయాలు, ఢిల్లీ విమానాశ్రయం, పెద్ద నిర్మాణ స్థలాలకు వెంటనే యాంటీ స్మోగ్ ఎక్స్ ని ఇన్ స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయనున్నారు.వాహనాలకు 15 ఏళ్లు దాటితే..ఇక 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఢిల్లీ బంకుల్లో ఇంధనం నిలిపివేయనున్నారు. 15 ఏళ్ల పైబడిని వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తొమ్మిది సెంచరీలు.. సిగ్గుతో తలదించుకోండి!.. వీడియో వైరల్
విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) మరోసారి శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఎలైట్ 2024-25 సీజన్ ఫైనల్లో భాగంగా కేరళపై సెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా అతడు సెలబ్రేట్ చేసుకున్న విధానం నెటిజన్లను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భీకర ఫామ్‌లో ఉన్న ఆటగాడి పట్ల వివక్ష చూపిస్తున్న టీమిండియా సెలక్టర్లు సిగ్గుతో తలదించుకోవాలంటూ అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా దేశవాళీ క్రికెట్ తాజా ఎడిషన్‌లో ఫార్మాట్లకు అతీతంగా కరుణ్ నాయర్ దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ(Vidarbha) కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం ఎనిమిది ఇన్నింగ్స్‌లోనే 779 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు శతకాలు ఉండటం విశేషం.ఈ నేపథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టులో కరుణ్ నాయర్‌కు స్థానం దక్కాలని భారత మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడి అత్యద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు.ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న వాళ్లను జట్టులోకి తీసుకోలేమని వ్యాఖ్యానించాడు. అతడు ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రస్తుత జట్టులో చోటు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడు.23వ శతకంఈ క్రమంలో నిరాశకు గురైనప్పటికీ కరుణ్ నాయర్ ఆ ప్రభావాన్ని తన ఆట మీద పడనీయలేదు. రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై శతకం(122) బాదిన అతడు.. తాజాగా ఫైనల్లోనూ సెంచరీతో మెరిశాడు. నాగ్‌పూర్ వేదికగా కేరళ జట్టుతో జరుగుతున్న తుదిపోరులో నాలుగో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్.. 184 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి ఇది 23వ శతకం.సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!ఈ నేపథ్యంలో హెల్మెట్ తీసి బ్యాట్‌ను ఆకాశం వైపు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్న కరుణ్ నాయర్... ఆ తర్వాత బ్యాట్, హెల్మెట్‌ను కింద పెట్టేసి.. తన చేతి వేళ్లలో తొమ్మిదింటిని ఎత్తి చూపాడు. దేశీ తాజా సీజన్లో తాను తొమ్మిది సెంచరీలు సాధించానని.. ఇకనైనా టీమిండియాలో చోట ఇవ్వండి అన్నట్లుగా సెలక్టర్లకు సందేశం పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ ఇప్పటి వరకు కేవలం ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ సాయంతో 374 పరుగులు చేసిన అతడు.. వన్డేల్లో 46 రన్స్ చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. కేరళతో శనివారం నాటి ఆట ముగిసే సరికి కరుణ్ నాయర్ 280 బంతులు ఎదుర్కొని 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో రోజు ఆట పూర్తయ్యే సరికి కేరళ కంటే 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం 💯 for Karun Nair 👏A splendid knock on the big stage under pressure 💪It's his 9⃣th 1⃣0⃣0⃣ in all formats combined this season, and the celebration says it all👌🙌#RanjiTrophy | @IDFCFIRSTBank | #FinalScorecard ▶️ https://t.co/up5GVaflpp pic.twitter.com/9MvZSHKKMY— BCCI Domestic (@BCCIdomestic) March 1, 2025

పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత
అన్నమయ్య జిల్లా: కూటమి సర్కార్ అక్రమంగా పెట్టిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు.. ఈసీజీతో పాటు మరికొన్ని రక్ష పరీక్షలు నిర్వహించారు. బీపీతో పాటు ఈసీజీలో తేడాలున్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం పోసానిని కడప రిమ్స్‌కు తరలించారు. గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు.పోసాని తీవ్రమైన గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్ హెర్నియా సర్జరీలో ఇన్ఫెక్షన్ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది. హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్ కార్డు సర్జరీ జరిగింది.కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్ సర్జరీ చేసిన స్టంట్ వేశారు వైద్యులు. హార్ట్ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో బాధపడుతున్నారు పోసాని కాగా, పోసాని కృష్ణ మురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. గురువారం రాత్రి 9 గంటలకు పోలీసులు కృష్ణ మురళిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. పదేళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేత ఫిర్యాదు మేరకు ఆయనపై అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు.పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ, ఈ సెక్షన్లు ఆయనకు వర్తించవని వివరించారు. సంబంధం లేని సెక్షన్లతో పాటు అనవసర సెక్షన్లు పెట్టారని వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించి తమ వాదనలు వినిపించారు. దాదాపు 9.30 గంటలకు ప్రారంభమైన వాదనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన మెజిస్ట్రేట్ సాయితేజ్.. తెల్లవారుజామున పోసానికి 14 రోజుల రిమాండును విధించారు. అనంతరం పోసానిని రైల్వేకోడూరు సీఐ పి.వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్ఐ పి.మహేష్‌నాయుడులు తమ సిబ్బందితో ఉదయం 7.52 గంటలకు నేరుగా రాజంపేట సబ్ జైలు వద్దకు తీసుకొచ్చారు.

నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం నేడు ఓటీటీలో, టీవీలో ఒకేసారి ముందుకు వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ రావిపూడి భవిష్యత్తులో కుదిరితే హీరోగా సినిమా చేస్తానన్నాడు. ఆ సినిమాకు హీరోయిన్గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని తీసుకోండి, మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని యాంకర్ అనడంతో అతడు ఆశ్చర్యపోయాడు.దారుణమైన కథలు ప్రచారం..ఆ కామెంట్‌కు అనిల్ స్పందిస్తూ.. మా మధ్య కెమిస్ట్రీలు, ఫిజిక్స్‌లు ఏం లేవు. ఇప్పటికే మా గురించి యూట్యూబ్‌లో రకరకాలుగా రాస్తున్నారు. నాయనా.. నేనేదో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నాను. వీళ్లేమో యూట్యూబ్‌లో వాయిస్ ఓవర్‌తో ఘోరమైన కథలు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలు నా భార్యకు, కుటుంబానికి వాట్సాప్‌లో పంపిస్తున్నారు. నా గురించి ఏ స్టోరీలు రాయకండ్రా బాబూ.. దీనిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను.ఎలాంటి కెమిస్ట్రీ లేదుమర్యాదగా ఆ వీడియోలు యూట్యూబ్‌లో నుంచి తీసేయండి. లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. నాకెటువంటి కెమిస్ట్రీలు లేవు. నా గురించే కాదు చాలామంది గురించి ఇలాగే కథలు అల్లుతున్నారు. వ్యూస్ కోసం లేని కథను అందమైన వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేస్తున్నారు. చాలామంది అది నిజమని నమ్ముతున్నారు. దానివల్ల చాలామంది వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నారు. లేనిపోనివి రాయకండి అని అనిల్ రావిపూడి కోరాడు.చదవండి: సంజయ్-నమ్రత సినిమా.. రెండు పెగ్గులేసి వెళ్లా: డైరెక్టర్

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, పైగా పార్టీ శిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వలేదని, అందుకే క్రమశిక్షణ చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. ఇక, ఎమ్మెల్సీ మల్లన్న సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పార్టీ లైన్ ఎవరు దాటినా ఊరుకునేది లేదు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించాం. బీసీ కుల గణన ప్రతులను చించడంపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ లైన్ దాటితే ఎవ్వరినీ వదలిపెట్టం’ అని హెచ్చరించారు. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ వర్గాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకుగానూ ఫిబ్రవరి 5వ తేదీన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే.. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. సొంత పార్టీ విషయంలో నవీన్ వైఖరి మొదటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక ప్రతులను ఆయన దగ్ధం చేశారు. అలాగే.. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించారు. కుల గణన నివేదికను వ్యతిరేకించాలని పిలుపు కూడా ఇచ్చారు. మరోవైపు.. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. రెడ్డి కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి కులానికి బహిరంగ క్షమాపణ చెప్పి మల్లన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి మలన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే జానారెడ్డి కళ్లలో ఆనందం కోసమే తనకు చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారంటూ కరీంనగర్లో నవీన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

Uttarakhand: మంచు చరియల కిందే ఇంకా 8 మంది
ఉత్తరాఖండ్: పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్(Uttarakhand)లో భారీగా కురుస్తున్న హిమపాతం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. బద్రీనాథ్‌లోని మానా గ్రామం సమీపంలో సరిహద్దు రోడ్డు సంస్థ (బీఆర్ఓ) శిబిరంపై మంచు చరియలు విరిగిపడటంతో 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం సంభవించింది. ఈ దరిమిలా భారత సైన్యం, రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. రెస్క్యూ సిబ్బంది మంచు పెళ్లల నుంచి 47 మందిని సురక్షితంగా వెలికి తీసుకువచ్చారు. మరో ఎనిమిదిమందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.రెండవ రోజున సహాయక చర్యలు తిరిగి ప్రారంభించిన భారత సైన్యం(Indian Army) మంచులో కూరుకుపోయిన మరో 14 మంది సిబ్బందిని రక్షించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్ల ద్వారా జోషిమఠ్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ఇంకా మంచులోనే కూరుకుపోయిన సిబ్బందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి చీకటి పడ్డాక సహాయక చర్యలను నిలిపివేశారు.హిమపాత మరింతగా పెరగడంతో మంచులో కూరుకుపోయిన కార్మికులను కనుగొనడం రెస్క్యూ సిబ్బంది(Rescue crew)కి సవాలుగా మారింది. మొదటి రోజున రెస్క్యూ బృందాలు 33 మంది కార్మికులను రక్షించగలిగాయి. ఈ ప్రాంతంలో ఏడు అడుగుల మేరకు మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. ఇండో-టిబెట్ సరిహద్దులోని చివరి గ్రామమైన మానా వద్ద మంచును తొలగించే పనిలో నిమగ్నమైన 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు.సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ మంచు చరియల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి పుష్కర్ ధామి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా ఘటనా స్థలంలో కొనసాగుతున్న పనుల గురించి తెలుసుకునేందుకు సీఎం దామికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో

'నాన్న అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు'
భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలను.. ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. నాన్న పనితీరు నాకు ఆదర్శమని 'ముంబై టెక్ వీక్' కార్యక్రమంలో వెల్లడించారు.ఇప్పటికి కూడా నాన్న (ముకేశ్ అంబానీ) తనకొచ్చిన అన్ని ఈమెయిల్‌కు రిప్లై ఇస్తూ.. తెల్లవారుజామున 2 గంటల వరకు మేల్కొని ఉంటారని ఆకాష్ అంబానీ చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా.. కంపెనీ వృద్ధి కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇది 45వ ఏడాది. ఆయన పనతీరు నాకు ఆదర్శమని.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.అమ్మకు, నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఇద్దరూ టీవిలో క్రికెట్ కూస్తూ ఉంటాము. అప్పుడు అమ్మ చిన్నచిన్న విషయాలను కూడా గమనిస్తూ ఉంటారు. అవన్నీ నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అమ్మ, నాన్నకు అంకితభావం ఎక్కువ. అవి మాకందరికీ స్ఫూర్తి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా కుటుంబాన్ని చూసే నేర్చుకున్నానని చెప్పారు.జీవితంలో పని మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. గత 10 సంవత్సరాలుగా రిలయన్స్‌లో పనిచేస్తూనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నాను. ఇషా, నేను కవల పిల్లలం. మేము ఇద్దరూ కూడా కుటుంబ విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. నా పిల్లలతో గడపడం నాకు చాలా ఇష్టం. శ్లోకా భార్యగా రావడం నా అదృష్టం. తను నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటుంది.పనిగంటలుముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' పనిగంటలపై కూడా మాట్లాడారు. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐని సంప్రదించండి.. అనిల్ అంబానీకి కోర్టు ఆదేశంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్గనిర్దేశం చేయడానికి తమ కంపెనీ 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజనీర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది ఆకాష్ అంబానీ అన్నారు. అంతే కాకుండా ఏఐలో దేశం ముందుకు సాగటానికి సహాయపడటానికి రిలయన్స్.. జామ్‌నగర్‌లో 1GW సామర్థ్యం గల డేటా సెంటర్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేస్తోందని అన్నారు.

రేవంత్ చేసింది చెబితే చెవుల్లోంచి రక్తం కారుతుంది: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ నేరాల్లో.. అప్పుల్లో ఆ రైజింగ్ కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవా చేశారు. శనివారం బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జి వస్తే సమావేశం పెట్టారు. ఆ మీటింగ్‌లో సీఎం రేవంత్ మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు. మంచి మైకులో చెప్పాలని.. చెడు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. మైక్‌లో చెప్పడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన మంచి ఏం లేదు. ఆయన చేసిన చెడు చెబితే చెవుల నుంచి రక్తం కారుతుంది. జనం కాంగ్రెస్‌ను.. రేవంత్‌ను తిట్టుకుంటున్నారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) నా బ్యాగులు మోయవద్దని అంటున్నారు. కానీ, ఆమె వాస్తవాలు తెలుసుకోవాలి. మీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి ఇక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డికి టింగ్,టింగ్ అంటే నచ్చదు. అందుకే రేవంత్ రెడ్డి టకీ,టకీ మని పైసలు పడతాయని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎవరికైనా టకీ,టకీ మని పైసలు పడ్డాయా?. పదిశాతం ఖర్చు పెడితే శ్రీశైలం జలాలు చేవెళ్లకు వచ్చేవి కానీ రేవంత్ రెడ్డికి ఇష్టం లేక చేయడం లేదు. కమీషన్లు రావనే ఉదేశ్యంతోనే పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయడం లేదు. మూసీ వలన జరిగే లాభం ఎంత. కమీషన్ల కోసమే మూసీ అనే రంగుల సినిమా చూపుతున్నారు. మూసీతో 50-70 వేల కోట్లు కమీషన్లు తీసుకొని ఢిల్లీకి మూటలు పంపి సీఎం కుర్చీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. నీళ్లు పాతాలానికి వెళ్లాయి నిధులు ఢిల్లీకి పోతున్నాయి.తెలంగాణ రైజింగ్(Telangana Rising) అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ, ఆ రైజింగ్ క్రైమ్ రేట్లో, అప్పుల్లో కనిపిస్తోంది. ఆత్మహత్యల్లో రైజింగ్, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్లో రైజింగ్. గురుకుల పాఠశాలల విద్యార్థుల మరణాల్లో రైజింగ్. కేసీఆర్ అప్పులు తెచ్చి మరీ ఆస్తులు సృష్టించారు. మరి ఈ ఏడాదిలో లక్షా 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రేవంత్ ఏం సాధించారు?.రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టింది నా కోసమే. అధికారంలోకి వచ్చి 15 నెలల తర్వాత ఇంకా కేసీఆర్ ను తిట్టుకుంటా బ్రతుకుతావా?. అన్ని చూసుకోకుండా ఆగం,ఆగంగా కమీషన్ల కోసం SLBC పనులు ప్రారంభించారు. ఎనిమిది మంది చిక్కుకుంటే.. సహాయక చర్యల పేరుతో మంత్రులు చాపల కూరలు తింటున్నారుకేసీఆర్(KCR) మన ఇంట్లో పెద్ద మనిషి,బాపు లాంటోడు కాబట్టే ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ దళంలోకి.. గులాబీ వనంలోకి కార్తీక్ రెడ్డి(karthik Reddy)ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి. త్వరలోనే కార్తీక్ ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెడతారు. కేసీఆర్ కు తెలంగాణపై ఉండే ప్రేమ కాంగ్రెస్,బీజేపీకి ఒక్క శాతం అయినా వుంటుందా?. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం చేసింది?. ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ నేతలు ఓట్లు ఎట్లా అడుగుతారు?. దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారా?. మనల్ని మనం ఓడించి.. మంది ముందు దరఖాస్తు పెట్టే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు అయినా పార్లమెంట్ ఎన్నికలు అయినా ఎగరాల్సింది గులాబీ జెండానే. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు.. జాగ్రత్త’’ అని కేటీఆర్ అన్నారు.ఇదీ చదవండి: మామునూర్ ఎయిర్‌పోర్టు క్రెడిట్ కోసం ఢిష్యూం.. ఢిష్యూం
ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. ఆడియన్స్‌కు బిగ్ ట్విస్ట్!
పోసాని ఆరోగ్యంపై పూనం కౌర్ ట్వీట్
విడాకుల తర్వాత పరిచయం.. పిల్లలు ఎందుకు లేరంటే?: నటి సీత
సౌతాఫ్రికా రెండో బౌలర్‌గా ఎంగిడి అరుదైన ఘనత
‘మేం చర్చకు సిద్ధం ...మీరు సిద్ధమా?’
పోసానిపై సీఐ స్టేట్మెంట్ ఇవ్వడమేంటి?.. ప్రకటనపై అనుమానాలు!
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా?
ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్స్కీ కీలక ట్వీట్
రూ.3 లక్షలకే రెండు గుంటలు.. తొందరపడితే..
'దయచేసి ఎవరూ కూడా లింక్స్ క్లిక్ చేయొద్దు'.. అభిమానులకు సింగర్ విజ్ఞప్తి
నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత
తొమ్మిది సెంచరీలు.. సిగ్గుతో తలదించుకోండి!.. వీడియో వైరల్
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్..
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం
సర్! ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకపోయినా... విజన్ 2047 అని చెప్పి ముందుకు పోతున్నారంటే చరిత్రలో మీకు మీరే సాటి!!
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు: కొనేందుకు త్వరపడాల్సిందే!
Bigg Boss 9: నాగార్జున ఔట్.. హోస్ట్‌గా మరో స్టార్ హీరో!
రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. ఆడియన్స్‌కు బిగ్ ట్విస్ట్!
పోసాని ఆరోగ్యంపై పూనం కౌర్ ట్వీట్
విడాకుల తర్వాత పరిచయం.. పిల్లలు ఎందుకు లేరంటే?: నటి సీత
సౌతాఫ్రికా రెండో బౌలర్‌గా ఎంగిడి అరుదైన ఘనత
‘మేం చర్చకు సిద్ధం ...మీరు సిద్ధమా?’
పోసానిపై సీఐ స్టేట్మెంట్ ఇవ్వడమేంటి?.. ప్రకటనపై అనుమానాలు!
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా?
ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్స్కీ కీలక ట్వీట్
రూ.3 లక్షలకే రెండు గుంటలు.. తొందరపడితే..
'దయచేసి ఎవరూ కూడా లింక్స్ క్లిక్ చేయొద్దు'.. అభిమానులకు సింగర్ విజ్ఞప్తి
నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత
తొమ్మిది సెంచరీలు.. సిగ్గుతో తలదించుకోండి!.. వీడియో వైరల్
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్..
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం
సర్! ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకపోయినా... విజన్ 2047 అని చెప్పి ముందుకు పోతున్నారంటే చరిత్రలో మీకు మీరే సాటి!!
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు: కొనేందుకు త్వరపడాల్సిందే!
Bigg Boss 9: నాగార్జున ఔట్.. హోస్ట్‌గా మరో స్టార్ హీరో!
రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
సినిమా

నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం నేడు ఓటీటీలో, టీవీలో ఒకేసారి ముందుకు వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ రావిపూడి భవిష్యత్తులో కుదిరితే హీరోగా సినిమా చేస్తానన్నాడు. ఆ సినిమాకు హీరోయిన్గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని తీసుకోండి, మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని యాంకర్ అనడంతో అతడు ఆశ్చర్యపోయాడు.దారుణమైన కథలు ప్రచారం..ఆ కామెంట్‌కు అనిల్ స్పందిస్తూ.. మా మధ్య కెమిస్ట్రీలు, ఫిజిక్స్‌లు ఏం లేవు. ఇప్పటికే మా గురించి యూట్యూబ్‌లో రకరకాలుగా రాస్తున్నారు. నాయనా.. నేనేదో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నాను. వీళ్లేమో యూట్యూబ్‌లో వాయిస్ ఓవర్‌తో ఘోరమైన కథలు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలు నా భార్యకు, కుటుంబానికి వాట్సాప్‌లో పంపిస్తున్నారు. నా గురించి ఏ స్టోరీలు రాయకండ్రా బాబూ.. దీనిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను.ఎలాంటి కెమిస్ట్రీ లేదుమర్యాదగా ఆ వీడియోలు యూట్యూబ్‌లో నుంచి తీసేయండి. లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. నాకెటువంటి కెమిస్ట్రీలు లేవు. నా గురించే కాదు చాలామంది గురించి ఇలాగే కథలు అల్లుతున్నారు. వ్యూస్ కోసం లేని కథను అందమైన వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేస్తున్నారు. చాలామంది అది నిజమని నమ్ముతున్నారు. దానివల్ల చాలామంది వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నారు. లేనిపోనివి రాయకండి అని అనిల్ రావిపూడి కోరాడు.చదవండి: సంజయ్-నమ్రత సినిమా.. రెండు పెగ్గులేసి వెళ్లా: డైరెక్టర్

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. లైవ్ ఏ ఓటీటీలో చూడాలంటే?
ప్రతిష్టాత్మక సినీ ఆవార్డుల వేడుక-2025కు అంతా సిద్ధమైంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 97వ ఆస్కార్ అవార్డుల పండుగ ఆదివారం జరగనుంది. ఈ అవార్డులకు ఎంపికైన విజేతలను ఆ రోజు ప్రకటించనున్నారు. ఈ వేడుక కోసం వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుకలు జరగనున్నాయి.(ఇది చదవండి: ఆస్కార్ నామినేషన్స్.. ఎంపికైన చిత్రాలివే.. ఫుల్ లిస్ట్ చూసేయండి) అయితే భారత కాలమానం ప్రకారం మనదేశంలో మార్చి 3వ తేదీ ఉదయం 5:30 నిమిషాలకు ఈ వేడుక వీక్షించే అవకాశముంది. మనదేశంలోని సినీ ప్రియులు ఈ వేడుక లైవ్‌లో చూడొచ్చు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌తో పాటు లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. కాగా.. ఇప్పటికే 97వ అకాడమీ అవార్డులకు నామినీలను ఈ ఏడాది జనవరి 23న ప్రకటించారు. ఈసారి హాలీవుడ్ చిత్రం ఎమిలియా పెరెజ్ అత్యధికంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత్ వికెడ్ మూవీ 10 విభాగాల్లో నామినేషన్లను సాధించింది. ఈ ఏడాది భారతీయ సినిమాలకు మాత్రం నిరాశే ఎదురైంది.

చీరలో అనుపమ.. టీ షర్ట్ పోజుల్లో అమలాపాల్!
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అందాల అరాచకంచీరకట్టులో బుట్టబొమ్మలా అనుపమటీ షర్ట్ మాత్రమే వేసుకుని అమలాపాల్ పోజులుఫన్నీ వీడియో పోస్ట్ చేసిన మృణాల్ ఠాకుర్జిమ్ లో గ్లామర్ చూపిస్తూనే నభా వర్కౌట్స్ఎర్ర చీరలో రీతూవర్మ మోడ్రన్ లుక్ View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur)

ప్రభాస్ 'బ్రహ్మరాక్షస్'లో ట్రెండింగ్ హీరోయిన్?
సాధారణంగా ఫ్లాప్ వస్తే ఆ సినిమా హీరోయిన్లని పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ బ్యూటీకి మాత్రం వరస అవకాశాలొస్తున్నాయి. చేతిలో ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులుండగా.. ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ?గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. దీనికి ముందు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో నటించిందంతే. బచ్చన్ మూవీ ఫ్లాప్ అయినా సరే దుల్కర్ సల్మాన్ 'కాంత', విజయ్ దేవరకొండ 'కింగడమ్', రామ్ కొత్త మూవీలో ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)పై మూడు కాకుండా సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తీసే మూవీలోనూ భాగ్యశ్రీనే తీసుకోవాలని ఫిక్సయ్యారట. ఇలా చేతినిండా సినిమాలతో ఉన్న ఈమెని ఇప్పుడు ప్రభాస్ కోసం లుక్ టెస్ట్ చేశారట.రీసెంట్ గా ప్రశాంత్ వర్మ-ప్రభాస్ మూవీ ఓకే అయింది. ఇందులోనే హీరోయిన్ గా భాగ్యశ్రీని పరిశీలించారట. అందులో భాగంగానే శుక్రవారం లుక్ టెస్ట్ షూట్ కూడా జరిగిందట. దాదాపు ఓకే అని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం భాగ్యశ్రీ.. లక్ తోక తొక్కేసినట్లే.(ఇదీ చదవండి: మార్చిలో థియేటర్ మూవీస్.. హిట్ కొడితే చాలు!)
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అడుగడుగునా దగా... హామీల అమలు ఊసే లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచిన కూటమి సర్కారు... పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్టే ఇందుకు నిదర్శనం

పులివెందులలో వైఎస్ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి... వీసీల రాజీనామా.. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు

ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగించాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు

చంద్రబాబు మోసాలకు గ్రూపు-2 అభ్యర్థులే ప్రత్యక్ష నిదర్శనం... న్యాయం చేస్తానంటూ నట్టేట ముంచాడు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో భూ దోపిడీకి ఇక రాజముద్ర... అమరావతిలో రైతుల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములకు రిటర్నబుల్ ప్లాట్లు.. సీఆర్డీఏకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశం

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతలో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర... జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడి భద్రతపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం

‘మార్గదర్శి’ మోసాల కేసును మూసివేసే దిశగా అడుగులు... చంద్రబాబు డైరెక్షన్లో ప్లేటు ఫిరాయించిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో రైతు బతికే పరిస్థితి లేదు... ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
క్రీడలు

మార్చి పడేయండి.. అంత సీనుందా?.. వసీం అక్రంకు ఆఫ్రిది కౌంటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో చెత్త ప్రదర్శన కారణంగా రిజ్వాన్ బృందంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడాన్ని తప్పుబడుతున్నారు.కనీసం ఒక్క విజయం కూడా లేకుండానే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడాన్ని తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఇప్పటికైనా ప్రక్షాళన చర్యలు చేపట్టాలని.. ఆటగాళ్ల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ పేస్ బౌలర్ వసీం అక్రం(Wasim Akram) కూడా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.5-6 మార్పులు చేయాల్సి వచ్చినాటెన్ స్పోర్ట్స్ షో లో మాట్లాడుతూ.. ‘‘జరిగిందేదో జరిగింది. ఇదే జట్టుతో గత రెండేళ్లుగా మనం ఎన్నో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు కోల్పోయాం. ఇప్పటికైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని వకార్ యూనిస్ అంటున్నాడు. ఒకవేళ మన జట్టులో 5-6 మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వెనుకాడకండి.ఇదే జట్టును మాత్రం కొనసాగిస్తే వచ్చే ఆరునెలల్లో మనం మరిన్ని చేదు అనుభవాలు చూస్తాం. టీ20 ప్రపంచకప్-2026కు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయండి’’అని వసీం అక్రం పీసీబీకి సూచించాడు. అయితే, ఈ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ వ్యాఖ్యలపై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది అభ్యంతరం వ్యక్తం చేశాడు.‘‘వసీం భాయ్ మాటలు నేను విన్నాను. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత మనమంతా భావోద్వేగంలో మునిగిపోయిన మాట వాస్తవం. అయినా.. జట్టు నుంచి 6-7 మంది ఆటగాళ్లను తప్పించాలని వసీం భాయ్ అంటున్నాడు.నిజంగా అంత సీనుందా?ఒకవేళ అదే జరిగితే.. మనకు వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐదారుగురు ప్లేయర్లు ఉన్నారా?.. మన బెంచ్ బలమెంతో మీకు తెలియదా వసీం భాయ్! మన దేశవాళీ క్రికెటర్లలో అంతర్జాతీయ స్థాయిలో రాణించగల ఆటగాళ్లు ఎంతమంది?.. ఒకవేళ మీరన్నట్లు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగిస్తే వారిలో ఎంత మందికి సరైన రీప్లేస్మెంట్ దొరుకుతుంది? మీరేమో ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని చెబుతున్నారు.కానీ ఒకవేళ మనం ఆ పని మొదలుపెట్టినా.. అప్పుడు కూడా మన మీద ఏడ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకున్నా మళ్లీ విమర్శలు వస్తూనే ఉంటాయి’’ అని షాహిద్ ఆఫ్రిది సామా టీవీ షోలో వసీం అక్రం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత న్యూజిలాండ్ చేతిలో ఓడిన రిజ్వాన్ బృందం.. రెండో మ్యాచ్‌లో దాయాది భారత్ చేతిలో పరాజయం పాలైంది. అనంతరం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క గెలుపు కూడా లేకుండానే ఈ మెగా టోర్నీలో తమ ప్రయాణం ముగించింది. ఇక ఈ ఈవెంట్లో భారత్, న్యూజిలాండ్ , పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి.చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం

SA vs ENG: హిట్టర్లు వచ్చేశారు..! కీలక మ్యాచ్‌లో బవుమా లేకుండానే..
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో మరో ఆసక్తికపోరుకు రంగం సిద్దమైంది. గ్రూప్-‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికా- ఇంగ్లండ్(South Africa vs England) తలపడనున్నాయి. కరాచీ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ప్రొటిస్ జట్టు బౌలింగ్‌కు సిద్ధమైంది.కాగా ఈ ఐసీసీ వన్డే టోర్నీ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే, ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. కాబట్టి ప్రొటిస్ జట్టుకు కూడా ఇంగ్లండ్‌తో పోరు కీలకంగా మారడంతో మ్యాచ్ మరింత రసవత్తరం కానుంది.హిట్టర్లు వచ్చేశారు..! కీలక మ్యాచ్‌లో బవుమా లేకుండానే.. అయితే, ఈ మ్యాచ్‌కు సౌతాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) దూరమయ్యాడు. అతడితో పాటు టోనీ డి జోర్జ్ కూడా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేడని తాత్కాలిక సారథి ఐడెన్ మార్క్రమ్ టాస్ సందర్భంగా వెల్లడించాడు. వీరిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారని.. బవుమా, టోనీ స్థానాల్లో ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దైందని.. అయితే, ఆ తర్వాత తాము నెట్స్‌లో తీవ్రంగా శ్రమించి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైనట్లు తెలిపాడు.సరైన సమయంలోనేమరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడుతున్న బట్లర్ మాట్లాడుతూ.. తాను సరైన సమయంలోనే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలిపాడు. అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. గాయపడిన మార్క్‌వుడ్ స్థానంలో సకీబ్ మహబూబ్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా ఆసీస్, అఫ్గనిస్తాన్ జట్ల చేతిలో ఓటమి తర్వాత ఇంగ్లండ్ నిష్క్రమించగా... గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. గ్రూప్-ఎ నుంచి టీమిండియా,న్యూజిలాండ్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.తుదిజట్లుసౌతాఫ్రికాట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: Champions Trophy: ఆసీస్‌తో కీలక సమరం.. ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన రషీద్ ఖాన్

భారత్‌కు అడ్వాంటేజ్.. ఇంగ్లండ్ మాజీలకు ఇచ్చిపడేసిన గవాస్కర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ టోర్నీ పాకిస్తాన్ ఒక్క వేదికగానే జరగాల్సి ఉండగా.. ఆ దేశానికి భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్ల భద్రతను కారణంగా ఐసీసీకి చూపించింది.దీంతో ఐసీసీ ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీని ఒప్పించింది. దీంతో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆడుతోంది. ఈ క్రమంలో ఒకే వేదికలో మ్యాచ్‌లను నిర్వహించడం ద్వారా భారత్‌కు అడ్వాంటేజ్ కలుగుతోందని ఇంగ్లండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్ ఐసీసీ తీరును తప్పుబట్టారు.వీరిద్దరే కాకుండా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఈ తరహా కామెంట్సే చేశారు. తాజాగా ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యలకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గట్టి కౌంటరిచ్చాడు. ముందు మీ జట్టు సంగతి చూసుకుండి, తర్వాత ఇతర జట్ల గురించి మాట్లాడండి అంటూ సన్నీ ఫైరయ్యాడు."మీరంతా ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. అంతేకాకుండా చాలా తెలివైన వారు కూడా. అసలు మీ జట్టు(ఇంగ్లండ్) ఎందుకు సెమీస్‌కు ఆర్హత సాధించలేకపోయిందో సమీక్షించుకుండి సర్. ఎప్పుడూ భారత జట్టుపై దృష్టి సారించే బదులు, మీ సొంత టీమ్‌పై ఫోకస్ చేయవచ్చుగా. మీ ఆటగాళ్లు చాలా పేలవంగా ఆడుతున్నారు. వారు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నారు. ఫస్ట్ మీ దేశం, మీ టీమ్ గురుంచి ఆలోచించడండి. అంతే తప్ప భారత్‌కు అది జరిగింది, భారత్ ఇలా ఆడింది అని పనికిమాలిన కామెంట్స్ ఎందుకు. భారత జట్టు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మీ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ సేవలు అద్బుతం.ఆటపరంగానే కాకుండా, ఆర్థికపరంగా కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది. టెలివిజన్ హక్కులు. మీడియా ఆదాయం ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. కామెంటేర్లగా మీరు తీసుకుంటున్న జీతాలు కూడా భారత్ వల్లేనన్న విషయం మర్చిపోకండి "అంటూ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మండిపడ్డాడు.కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటి ముఖం పట్టింది. అఫ్గానిస్తాన్ చేతిలో మరోసారి ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఈ ఓటుములకు నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ తప్పుకున్నాడు. ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్ శనివారం రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడుతోంది.చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం

'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న భారత జట్టు.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.అనంతరం రోహిత్ సేన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో తలపడే అవకాశముంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలుస్తుందని క్లార్క్ జోస్యం చెప్పాడు."ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడతాయని భావిస్తున్నాను. ఆసీస్ ఛాంపియన్స్‌గా నిలవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కానీ టీమిండియాకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంటుంది నేను అనుకుంటున్నాను. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 వన్డే జట్టుగా ఉంది. వారిని ఓడించడం అంత ఈజీ కాదు. భారత్, ఆసీస్ మధ్య తుది పోరు హోరహోరీగా జరుగుతుంది. కానీ టీమిండియా ఒక్క పరుగు తేడాతో విజయం సాధిస్తుంది" అని రేవ్ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లార్క్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ మెగా టోర్నీ టాప్ స్కోరర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిలుస్తాడని క్లార్క్ అంచనా వేశాడు."రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడు కటక్‌లో భారీ సెంచరీ సాధించాడు. అద్భుతమైన షాట్లతో అందరిని అలరించాడు. అతడు ఈ మెగా ఈవెంట్లో కూడా మంచి టచ్‌లో కన్పిస్తున్నాడు. రోహిత్ భారత్‌కు కీలకంగా మారనున్నాడు. అతడు తన దూకుడును కొనసాగించాలి. పవర్ ప్లేలో పరుగులు రాబట్టాలన్న అతడి ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేదు. రోహిత్ అద్భుతమైన ఆటగాడు. రోహిత్ శర్మ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు" అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌పై 40 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. పాకిస్తాన్ 20 పరుగులతో క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: జోస్ బట్లర్ రాజీనామా.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ అతడే!?
బిజినెస్

హైదరాబాద్‌లో ‘గ్లోబల్’ జోష్
గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్(GCC)లకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. గతేడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2.83 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోరెండేళ్లలో ఏకంగా 5.28 కోట్ల చదరపు అడుగుల డీల్స్ పూర్తయ్యాయి. జీసీసీ లావాదేవీల్లో ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లు పోటీపడుతున్నాయని పేర్కొంది. 1.2 కోట్ల చదరపు అడుగులతో బెంగళూరు టాప్‌లో ఉండగా హైదరాబాద్‌లో 48.6 లక్షల చదరపు అడుగుల మేర జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి.జీసీసీ అంటే? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు.మూడో స్థానంలో హైదరాబాద్దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగానికి చెందిన జీసీసీలలో దాదాపు 35% లేదా 42 బెంగళూరులో ఉండగా 16 జీసీసీలతో హైదరాబాద్.. ఢిల్లీ ఎన్సీఆర్ (22) తర్వాత మూడవ స్థానంలో ఉంది. అయితే నైపుణ్యాలు కలిగిన 19% మంది యాక్టివ్ ఉద్యోగార్థులతో రెండవ స్థానంలో ఉందని కెరీర్‌నెట్ తెలిపింది.

సెబీ మార్గదర్శకాలలో సవరణలు
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలకు నామినీలను పేర్కొనే విషయంలో నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సవరించింది. ఆస్తుల బదిలీ, నామినీ సులభతర ఎంపికకు వీలుగా మార్గదర్శకాలను సవరిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. వెరసి సెక్యూరిటీల మార్కెట్లలో నామినేషన్ సౌకర్యంపై అవసరమైన స్పష్టతను కల్పించింది.ఒక వ్యక్తి లేదా సంయుక్త ఖాతాదారులలో ఒకరు మరణిస్తే ఆస్తుల బదిలీని అదనపు కేవైసీ అవసరంలేకుండా రెండవ వ్యక్తికి బదిలీ చేసేందుకు దారి ఏర్పాటు చేసింది. ముందస్తుగానే కేవైసీ ఇచ్చి ఉంటే వీటి అవసరం ఉండదు. ఖాతాదారులలో జీవించి ఉన్న వ్యక్తి ఏ సమయంలోనైనా కాంటాక్టు వివరాలు, నామినీ మార్పు వంటివి చేపట్టవచ్చు.ఈ బాటలో ఫిజికల్‌గా ఖాతా నిర్వహించేలేని వ్యక్తులు, ఎన్ఆర్ఐలకు సంబంధించి సైతం మార్పులు ప్రవేపెట్టింది. తాజా సవరణలు 2025 మార్చి1 నుంచి మూడు దశలలో అమలుకానున్నాయి. సవరించిన మరికొన్ని నిబంధనలు జూన్1 నుంచి, పూర్తి నిబంధనలు సెపె్టంబర్ 1నుంచి వర్తించనున్నాయి.

ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులు
ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మార్చి 1 నుంచి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించే ‘జన్ ఔషధి సప్తాహ్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈమేరకు ‘జన్ ఔషధి రథ్’లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 2025 చివరి నాటికి 20,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 2027 నాటికి మరో 25,000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ..‘జన్ ఔషధి రథాలు ప్రజల్లో జన్ ఔషధి కేంద్రాల ప్రయోజనాల గురించి అవగాహన పెంచుతాయి. చౌకైన జనరిక్ మందుల ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఖరీదైన బ్రాండెడ్ మందులకు ప్రత్యామ్నాయాలు అందించాలని, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పీఎంబీజేపీ)లో భాగంగా ఈ చర్యలు చేపట్టాం. ప్రధాని నాయకత్వంలో 2027 నాటికి 25,000 జన ఔషధి కేంద్రాలకు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ముందుగా 80 కేంద్రాలతో వీటిని ప్రారంభించాం. ప్రస్తుతం 15 వేల కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్యను 20 వేలకు పెంచుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ పాల్గొని మాట్లాడారు. ‘మార్చి 1 నుంచి 7 వరకు 'జన్ ఔషధి - జన్ చేతన' వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. జన్ ఔషధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మందులపై ప్రజలు చేసే ఖర్చును తగ్గించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి’ అని చెప్పారు.రూ.1కే శానిటరీ న్యాప్కిన్స్మహిళల నెలసరి సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్‌ను జన్ ఔషధి కేంద్రాల్లో కేవలం రూ.1కే అందించనున్నారు. సువిధ ఆక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్స్ ఎంతో పరిశుభ్రమైనవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజల్లో విభిన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి వారమంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.జన్ ఔషధిప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) అనేది భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్ విభాగం ప్రారంభించిన ఒక కార్యక్రమం. జన ఔషధి కేంద్రాలు అనే ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులను అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. బ్రాండెడ్ మందుల కంటే 50%-80% చౌకగా జనరిక్ మందులను అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారు. డబ్ల్యూహెచ్‌వో-జీఎంపీ గుర్తింపు కలిగిన తయారీదారుల నుంచి ఔషధాలను సేకరించి నాణ్యత, భద్రతను ధృవీకరించడం కోసం ఎన్ఏబీఎల్(నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షిస్తారు.ఇదీ చదవండి: పని గంటలా..? పని నాణ్యతా..?ఈ జన్ ఔషధి అవుట్లెట్లలో 2,000 కంటే ఎక్కువ మందులు, 300 శస్త్రచికిత్సా వస్తువులు అందుబాటులో ఉంటాయి. 2024 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 13,822 జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ కేంద్రాలను ప్రారంభించడంలో స్థానిక యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధిని సృష్టించే అవకాశం ఏర్పడింది. ‘సుగమ్ మొబైల్ యాప్’ ద్వారా వినియోగదారులు తమ సమీపంలోని జన ఔషధి కేంద్రాలను గుర్తించవచ్చని, జనరిక్ మందుల కోసం సెర్చ్ చేయవచ్చని, బ్రాండెడ్ మందులతో ధరలను పోల్చవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

ఆర్బీఐని సంప్రదించండి: అనిల్ అంబానీకి కోర్టు ఆదేశం
బ్యాంకులు ఖాతాలను 'ఎగవేత' లేదా 'మోసం'గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసే "కట్, కాపీ, పేస్ట్ పద్ధతి"పై శుక్రవారం బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తన రుణ ఖాతాను 'మోసం'గా ప్రకటిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆర్బీఐని సంప్రదించాలని పారిశ్రామికవేత్త 'అనిల్ అంబానీ' (Anil Ambani)ని కోరింది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 అక్టోబర్ 10న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు రేవతి మోహితే డెరె, నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఆదేశాలు జారీ చేయడానికి ముందు తనకు ఎటువంటి విచారణకు అనుమతి ఇవ్వలేదని, బ్యాంక్ జారీ చేసిన రెండు షో-కాజ్ నోటీసులను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. ఈ ఆదేశాలను జారీ చేసేందుకు ఏ పత్రాలపై ఆధారపడ్డారో, వాటి నకళ్లు అడిగినా ఇవ్వలేదని తన పిటిషన్లో అనిల్ పేర్కొన్నారు.విచారణ సందర్భంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండా, బ్యాంకులు ఖాతాలను 'మోసం' లేదా 'ఉద్దేశపూర్వక ఎగవేత'గా ప్రకటించే కేసులు పదే పదే వస్తున్నాయని కోర్టు తెలిపింది. ఇలాంటి కట్, కాపీ, పేస్ట్ ఆర్డర్లు ఉండకూడదు. ఇది ప్రజాధనం. మనం అలాంటి ఆర్డర్లను అంత యాదృచ్ఛికంగా ఆమోదించకూడదు. దీనికోసం కొత్త వ్యవస్థను తీసుకురావాలని ధర్మాసనం పేర్కొంది.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?ఆర్బీఐ 'మాస్టర్ సర్క్యులర్'లలో ప్రచురించిన మార్గదర్శకాలు అమలులో ఉన్నాయనే వాస్తవాన్ని బ్యాంకులు తప్పకుండా గుర్తుంచుకోవాలని హైకోర్టు పేర్కొంది. బ్యాంకు అధికారులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' చర్య తీసుకోకపోతే ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తూనే ఉంటాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఆర్బీఐ కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం మంచిది అని కోర్టు తెలిపింది.
ఫ్యామిలీ

తల్లి కాబోతున్న కియారా : తొలి మెటర్నిటీ ఫ్యాషన్ లుక్ అదుర్స్!
హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మా జీవితాల్లో అత్యంతవిలువైన బహుమతి రాబోతోంది అనే క్యాప్షన్‌తో ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన కియారా త్వరలోనే ఒక బిడ్డకు జన్వనివ్వబోతోందన్న వార్త ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కియారా భర్త సిద్దార్థ్ (Sidharth Malhotra)కూడా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కియారా అద్వానీ ఫ్యాషన్ మాస్ట్రో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రకటన చేయడానికి ముందు ఫ్యాషన్‌షోలో బాలెన్సియాగా బ్లాక్ దుస్తులను ప్రదర్శించింది. అది ట్రెడిషనల్ దుస్తులైనా, లేదా హై-ఫ్యాషన్ వెస్ట్రన్ అయినా ఆమె లుక్ స్పెషల్‌గా ఉంటుంది. ఇటీవల, తీరా ఈవెంట్లో, కియారా క్లాసిక్ బ్లాక్ దుస్తులు, బంగార ఆభరణాలతో ఒక బోల్డ్ స్టేట్మెంట్ లుక్‌తో అదరగొట్టింది. బ్రాండ్ సిగ్నేచర్ లోగోను పోలీ ఉన్న లూజ్‌గా ఉండేశాటిన్ జాక్వర్డ్ టాప్ ఎంచుకుంది బాలెన్సియాటూ-పీసెస్ ఎటైర్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆమె తొలి పబ్లిక్ మెటర్నిటీ ఫ్యాషన్ లుక్. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే చోకర్ ,ఆకర్షించే సింహం పంజా పెండెంట్‌తో సహా చంకీ స్టేట్మెంట్ నెక్లెస్‌లను ధరించింది కియారా. భారీ చెవిపోగులు, ఉంగరాలు బ్రాస్లెట్ల స్టాక్‌ను కూడా జోడించింది. అంతేకాదు లౌబౌటిన్ హీల్స్‌లో అసలే పొడగరి అయిన కియారా మరింత సొగసరిలా అందర్నీ మెస్మరైజ్ చేసింది.

ప్రజక్తా కోలి మెడలో హైలెట్‌గా తిల్హరి నెక్లెస్..! స్పెషాలిటీ ఏంటంటే..
ప్రముఖ యూట్యూబర్‌గా పేరుగాంచిన ప్రజక్తాకోలి తన చిరకాల ప్రియుడు వృషాంక్ ఖనాల్ని వివాహం చేసుకుంది. ఆమె మోస్ట్‌లీసేన్ అనే యూట్యూబ్ ఛానెల్‌తో రోజువారీ జీవిత పరిస్థితులకు సంబంధించిన కామెడీతో ఫేమస్ అయ్యింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ డ్రామా మిస్మ్యాచ్డ్లో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె ప్రీ వెడ్డింగ్, వివాహ వేడుకల్లో మహారాష్ట్ర సంప్రదాయన్ని హైలెట్ చేసేలా ఆమె లుకింగ్ స్టైల్ ఉంది. అయితే ఆమె ధరించి ఆకుపచ్చ నెక్లెస్ తిల్హరి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అసలేంటి నెక్లెస్..? దాని విశిష్టత ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.ప్రజక్తా తన వివాహ వేడుకలో జరిగే ప్రతీ కార్యక్రమానికి ఆమె ధరించిన దుస్తులు, నగలు టాక్ ఆఫ్ ది టౌగా మారాయి. ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ లుక్స్ కోసం మినిమలిస్టిక్‌గా ఉండే స్టైల్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. సంప్రదాయం ఉంట్టిపడేలా ఆధునిక ఫ్యాషన్ తగ్గ దుస్తుల శైలిని ఎంచుకున్నారు. అయితే ఈ జంట రిసెప్షన్ కోసం నేపాలి సంప్రదాయాన్ని అనుసరించారు. వరుడు వృషాంక్ బ్రౌన్ బ్లేజర్ ధరించి, ఐవరీ కుర్తా సెట్‌తో అందంగా కనిపించాడు. నేపాలీ టచ్ కోసం సాంప్రదాయ ఢాకా టోపీని జోడించారు. ఇక ప్రజక్త సాంప్రదాయ నేపలీ క్రిమ్సన్ బంగారు పట్టు నేత చీరను ఎంపిక చేసుకుంది. దానికి తగిన విధంగా బంగారు ఆభరణాలను జత చేసింది. మెడలో ధరించి ఆకుపచ్చ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీన్ని తిల్హారీ నెక్లెస్ అని పిలుస్తారు.తిల్హారీ నెక్లెస్ అంటే..?తిల్హారీ నెక్లెస్ అనేది మంగళసూత్రం లాంటిది. ఇది నేపాల్‌లో మహిళల వైవాహిక స్థితికి సంకేతం. ఇది పోటే అని పిలిచే పూసలతో తయారు చేసిన దండవలె ఉండి, కింద తిల్హారీగా పిలిచే స్థూపకార లాకెట్టు ఉంటుంది. నెక్లెస్ రెండు భాగాలను విడిగా తీసుకువచ్చి ఆపై ఒకదానితో ఒకటి సమలేఖనం చేస్తారు. వధువులు తిల్హారీ ధరించడం అనేది పవిత్రమైనది, శుభప్రదమైనదిగా చెబుతుంటారు.(చదవండి: 37 ఏళ్ల తర్వాత కుంభమేళాలో కలుసుకున్న స్నేహితులు..!)

Maha Kumbh: 37 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం మహా కుంభమేళా. ఇది ఎందరెందరో మహమహులు, సాధువులు, సెలబ్రిటీలు ప్రముఖులను ఒక చోట చేర్చి అంత ఒక్కటే అనే భావన కలగజేసిన గొప్ప కార్యక్రమం. ఈ కుంభమేళ సాధువులుగా మారిన గొప్ప గొప్ప మేధావులను పరిచయం చేసింది. యూట్యూబ్ పుణ్యమా అని సాదాసీదా వ్యక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నేపథ్యంలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను అందుకున్నారు. అంతేగాదు ఈ వేడుక ఎన్నో గొప్ప విషయాలకు నెలవుగా మారింది. తాజాగా ఏళ్ల నాటి స్నేహబంధాన్ని హైలెట్ చేసింది. ఎప్పుడో చదువుకుని విడిపోయిన స్నేహితులను కలిపి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది ఈ సంబరం. వాళ్లెరవంటే..వారే సంజీవ్ కుమార్ సింగ్, రష్మి గుప్తాలు. ఇద్దరు ఒకే కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. 1988 బ్యాచ్ విద్యార్థులు. ఎప్పుడో 37 ఏళ్ల క్రితం కలుసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ మహాకుంభమేళా కారణంగా కలుసుకున్నాం అని చెబుతున్నారు ఆ స్నేహితులు. సంజీవ్ కుమార్ అగ్నిమాపక అధికారిగా ఈ మహాకుంభమేళలో విధులు నిర్వర్తిస్తుండగా, అతడి స్నేహితురాలు రష్మి లక్నోలోని ఒక కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఈ మేరకు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన స్నేహితుడు చాలా సైలెంట్ అని, మాట్లాడటం చాలా అరుదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం అతడి వ్యక్తిత్వం పూర్తిగా భిన్నంగా ఉందంటూ నవ్వేశారామె. అనుకోకుండా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తాను ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఏర్పాట్లు మాకు ఎంతగానే సహాయపడ్డాయని అన్నారు. ఇక సంజీవ్ కుమార్ రష్మిని ఎగతాళి చేస్తూ..రష్మీ, వాళ్ల గ్యాంగ్ తనతో మాట్లాడేందుకు తెగ ట్రై చేసేదంటూ మాట్లాడారు. అలాగే ఆమె చెప్పింది కూడా నిజేమనని, తాను నిజంగానే అప్పుడు అంతగా ఎవరితో ఫ్రీగా కలిసేవాడిని కానని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రితో చివరి స్నానం ముగిసింది. ఈ మేళా అనేక లక్షలాదిమంది ప్రజలను ఒక చోట ఏకం చేసిన గొప్ప దైవ కార్యక్రమం.Pehle log Kumbh me kho jate the.Fire officer Sanjeev Kumar Singh 1988 ke baad MahaKumbh me apni classmate se mile.Such a cute conversation! pic.twitter.com/WQzSa35nsd— Swami (@Swami_65) February 26, 2025(చదవండి: అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి..! ఆమె వికాస్ దివ్యకీర్తి.)

రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
బరువు తగ్గాలంటే అంత ఈజీ కాదు గురూ! ఇది ఒకరి మాట..మనసు పెట్టాలే గానీ అదెంత పనీ అనేది సక్సెస్ అయిన వారి మాట. విజయవంతంగా తాము అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది వెయిట్‌లాస్ జర్నీల గురించి తెలుసుకున్నాం. తాజాగా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దాదాపు 90 కిలోలు తగ్గింది. అధిక బరువుతో బాధపడే ఆమె జీవనశైలి మార్పులతో జాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇంతకీ ఎవరామె? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? తెలుసుకుందాం పదండి.వాస్తవానికి బరువు తగ్గడం అనేక సవాళ్లతో కూడుకున్నది. డైటింగ్ చేసి కష్టపడి బరువు తగ్గినా, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. దీనికి మన శరీర తత్వంపై, మనం తింటున్న ఆహారంపై, మన జీవన శైలిపై అవగాహన ఉండాలి. వైద్య నిపుణుల సలహా మేరకు, ప్రణాళికా బద్దంగా ప్రయత్నించి ఒక్కో మైలురాయిని అధిగమించాలి. ఫలితంగా అధిక బరువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించడమేకాదు కొన్ని కిలోలు తగ్గి స్లిమ్‌గా ఆరోగ్యంగా కనిపించడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం.న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే అదే చేసింది. తద్వారా 150కిలోల బరువునుంచి 66 కిలోలకు విజయవంతంగా బరువును తగ్గించుకుంది. కేవలం రెండేళ్లలో ఈ విజయాన్ని సాధించింది. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఉంచి ఆమె ప్రయాణం మొదలైంది. రోజువారీ శారీరక శ్రమ,ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించింది. దీనికి సంబంధించి ఎలా బరువు తగ్గిందీ ఇన్‌స్టాలో వివరించింది. తన అభిమానులు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. బరువు తగ్గడం ఎవరికైనా సాధ్యమేనని రుజువు చేసింది.తన కృషి , అంకితభావాన్నిఇలా చెప్పింది.‘‘బరువున్నా.. బాగానే ఉన్నాను కదా అనుకునేదాన్ని..అంతేకాదు అసలు నేను సన్నగా మారతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎలాగైతేనేం డబుల్ డిజిట్‌కి చేరాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. ఎంతో చెమట చిందించాను. కన్నీళ్లు కార్చాను. చివరికి ఇన్నేళ్లకు 150 కిలోల నుండి 66 కిలోలకు చేరాను’’ అని తెలిపింది.ప్రాంజల్ అనుసరించిన పద్దతులుబరువు తగ్గడానికి డైటింగ్, ఎక్స్‌ర్‌సైజ్ కంటే.. జీవనశైలిమార్పులే ముఖ్యం అంటుంది ప్రాంజల్.ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీరు త్రాగడం ప్రోటీన్ ఫుడ్ బాగా తినడం, చేపలు, పౌల్ట్రీ, రొయ్యలు ,గుడ్లు, అలాగే మొక్కల ప్రోటీన్,పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, సోయాలాంటివి ఆహారంలో చేర్చుకోవడం.భోజనానికి ముందు సలాడ్ తీసుకోవడం ముఖ్యంగాక్యారెట్లు , కీరలాంటివాటితోసూక్ష్మపోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం తృణధాన్యాలు, పండ్లు , కూరగాయలు తినడం. ప్రతిరోజూ నాలుగు లీటర్ల నీరు త్రాగడం.వ్యాయామంప్రతి భోజనంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యత. ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు రోజువారీ నడక. వాకింగ్ కుదరకపోతే భోజనం తర్వాత చురుకుగా ఉండటానికి 10-15 స్క్వాట్లు , పడుకునే ముందు 2-3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయడం. జిమ్‌కు వెళ్లడం, పైలేట్స్ , వాకింగ్ లేదా జాగింగ్ నోట్: బరువు తగ్గడం, దానిని నిర్వహించడం అనేది పూర్తి జీవనశైలి మార్పు ద్వారా సాధ్యం అనేది ప్రాంజల్ అనుభవం. ఇది అందరికీ ఒకేలా ఉండకపోయినా.. దాదాపు అందరికీ వర్తిస్తుంది. అంకితభావం , ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎవరైనా తమ లక్ష్యాలను సాధించవచ్చు.
ఫొటోలు


హీరోయిన్ పార్వతి నాయర్ మెహందీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)


వితికా షెరు చెల్లిని చూశారా? భర్తతో గృహప్రవేశం (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ (ఫొటోలు)


ఈ బ్యూటీని గుర్తుపట్టారా? బన్నీ, ప్రభాస్ సినిమాల్లో హీరోయినే కానీ (ఫొటోలు)


‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)


అబ్బురపరిచే అద్భుత చిత్రాలు.. చూస్తే వావ్ అనాల్సిందే! (ఫొటోలు)


‘కన్నప్ప’ మూవీ HD స్టిల్స్


Jr NTR : న్యూ లుక్ తో ఎన్టీఆర్ (ఫొటోలు)


భాగ్యనగరంలో..‘విజ్ఞాన్ వైభవ్ 2 కే 25’ (ఫొటోలు)


హైదరాబాద్ : ఆకట్టుకున్న మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ ఆడిషన్స్ (ఫొటోలు)
International View all

ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్స్కీ కీలక ట్వీట్
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అ

బండి ఏదైనా.. మైలేజ్ పెంచే పొగ గొట్టం!
పెట్రోలు రేటేమో వంద రూపాయలు దాటేసింది..

Comment X: ఎవర్రా బాబూ ఇది ఎడిట్ చేసింది!
వైట్‌హౌజ్ ఓవెల్ ఆఫీస్‌లో జరిగిన పరిణామాలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

సునీతా విలియమ్స్ రాకకు సమయం ఆసన్నం
అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమ్స్, బుచ్ విల్మోర్ల రాకక

నెం. 14, మరోసారి తండ్రైన బిలియనీర్ : పేరేంటో తెలుసా?
టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు.
National View all

Delhi: ఆ వాహనాలకు ఇంధనం బంద్..!
ఢిల్లీ : నిత్యం తీవ్ర వాయు కాలుష్యం(Delhi Pollution)తో కొట్టిమిట

ఉత్తరాఖండ్: 46 మంది సేఫ్.. నలుగురి మృతి.. ఐదుగురు మిస్సింగ్
డెహ్రాడూన్: మంచు చరియలు విరిగిపడిన(Uttarakhand avalanche) ఘ

మణిపూర్ సంక్షోభం.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక

లైంగిక ఆరోపణలన్నీ నిజం కాదు: కేరళ హైకోర్టు
కొచ్చి: మగవారిపై లేనిపోని లైంగిక ఆరోపణలు చేసే మహిళల ఆటలు ఇకపై చెల్లవు.

ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏది?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయణమనగానే ఎవరికైనా ముందుగా ఢిల్లీ, ముంబై, కో
NRI View all

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను ఈ మహా శ

అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్ క్లియర్
వాషింగ్టన్: ఫిబ్రవ

Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం
డాలస్ : ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం
క్రైమ్

అమ్మను అనాథను చేశాడు!
మన్సూరాబాద్(హైదరాబాద్): రోజు రోజుకూ మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు ఆమెను రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. వృద్ధురాలి దీనస్థితిని గమనించిన కాలనీవాసులు అక్కున చేర్చుకుని అన్న పానీయాలు అందించి ఆశ్రయం కల్పించారు. ఈ ఘటన మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. వృద్ధురాలు చెప్పిన వివరాల ప్రకారం.. భువనగిరి– యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామానికి సమీపంలోని సీత్యా తండాకు చెందిన ధర్మీ (80)కి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. వీరిలో ఇద్దరు పెద్ద కుమారులు గతంలోనే చనిపోయారు. చిన్న కుమారుడు లక్ష్మణ్ నాయక్ వద్ద ధర్మీ ఉంటోంది. లక్ష్మణ్‌నాయక్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. ఎల్బీనగర్లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం లక్ష్మణ్‌నాయక్ తన తల్లి ధరీ్మని మన్సూరాబాద్‌లోని చిత్రసీమ కాలనీలోని లిటిల్ చాంప్ స్కూల్ వద్ద తన ఆటోలో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ధర్మీ కాలనీలోని రోడ్ నంబర్–4లో ఓ మూలన కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన రిటైర్డ్ అధికారి బొప్పిడి కరుణాకర్‌రెడ్డి, సైదులు గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచారు. తన కుమారుడు ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లాడని చెప్పింది. దీంతో ఆమెకు ఆశ్రయం కల్పించి ఈ సమాచారాన్ని 108తో పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ వృద్ధురాలి కోసం ఎవరూ రాకపోవడంతో కాలనీ వాసులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఆలేటి వృద్థాశ్రమానికి ధరీ్మని తరలించారు. కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన కుమారుడికి తగిన బుద్ధి చెప్పాలని కాలనీ వాసులు కోరారు.

మూడు ప్రాణాలు బలి
మణికొండ(హైదరాబాద్): గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ పాషా కాలనీలో శుక్రవారం సాయంత్రం విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కారులోని గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మరింత ఉద్ధృతమై భవనంలోని మొదటి అంతస్తుకు వ్యాపించడంతో కిచెన్ గదిలోని రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఓ గదిలో ఇరుక్కుపోయిన ఉస్మాన్‌ఖాన్ తల్లి జమిలాఖాతమ్ (78), అతని తమ్ముడి భార్య శాహినా ఖాతమ్ (38), తమ్ముడి కూతురు సిజ్రా ఖాతమ్ (4)లు ఊపిరి ఆడకపోవడంతో గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందికి దూకి.. మంటల నుంచి తప్పించుకునేందుకు చుట్టుపక్కల వారు బాధితుల ఇంటి ముందు పరుపులు వేయగా.. ఉస్మాన్‌ఖాన్ తమ్ముడు యూసుఫ్‌ఖాన్, కుమారుడు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకారు. దీంతో యూసుఫ్ ఖాన్ కాలు విరిగింది. గాయపడిన యూసుఫ్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్ని మాపక శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్లాట్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. అగి్నమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత పైఅంతస్తుకు వెళ్లి గోడలకు రంగులు వేసే జూల ద్వారా ఇద్దరిని సురక్షితంగా కిందికి తీసుకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు మొదటి అంతస్తు నుంచి దూకి, ఇద్దరు జూల ద్వార కిందికి వచ్చి ప్రాణాలను కాపాడుకోగా.. ఇద్దరు మహిళలు, బాలిక మృతి చెందారు. ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం కేంద్రంగా మొదలై.. హైదరాబాద్ వరకు ఇద్దరు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చిoది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు రూ.6 కోట్లతో పరారైన వైనం బయటపడింది. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొచ్చెర్ల ధర్మారావురెడ్డి పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఏజెంట్‌గా అవతారం ఎత్తి స్థానిక యువకులకు ఉద్యోగాల ఎర వేశాడు. దగ్గర బంధువుల్లో నిరుద్యోగులుగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇటలీలో అదిరిపోయే ఉద్యోగాలున్నాయని ఊరించాడు. ధర్మారావురెడ్డి తన బంధువులైన ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాయి దిలీప్(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)తో ప్రచారం ఊదరగొట్టించాడు. ఇటలీలో ఫ్రూట్స్ కటింగ్, ప్యాకింగ్, వైన్, బీర్ల కంపెనీలు, ప్యాకింగ్ మొదలైన సంస్థల్లో మంచి ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మించాడు. ఎంత వీలైతే అంతమందికి ఉద్యోగాలున్నాయని.. ఎక్కువ మందిని తీసుకొస్తే ఫీజులో కొంత తగ్గిస్తానంటూ ఆశ చూపించాడు. టీడీపీ నేతల మాటలు నమ్మిన నిరుద్యోగులు.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న బంధువులు, స్నేహితులను సంప్రదించారు. వారిని కూడా ఈ ఉచ్చులోకి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ధర్మారావురెడ్డి, దిలీప్ కలిసి ప్లాన్ వేసినట్లు పక్కాగా స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధం.. ఏం జరిగినా పార్టీ కాపాడుతుందన్న తెగింపుతో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 350 మందిని ఎంపిక చేశారు. ఇచ్చాç³#రంలో లాడ్జిని తీసుకొని మొదటి విడతలో 2024 ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.20 వేలు అడ్వాన్స్, తర్వాత రూ.1.35 లక్షలు వసూలు చేశారు. ఆగస్టులో హైదరాబాద్‌లో మరో 175 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.1.35 లక్షలు చొప్పున తీసుకున్నారు. జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి రూ.50 వేలు వంతున వసూలు చేశారు. అందరి దగ్గర విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌లు, ఫొటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఇటలీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారని చెప్పి ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో 350 మంది నిరుద్యోగులకు వారి సొంత డబ్బు తోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ వెళ్లాక బట్టబయలైన మోసంఇటలీ ప్రయాణానికి మొదటి విడతలో 30 మంది పాస్‌పోర్టు చెకింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ధర్మారావు, దిలీప్ రెండు వారాల క్రితం చెప్పడంతో.. ఢిల్లీ వెళ్లిన యువకులకు అసలు విషయం తెలిసింది. వాళ్లు చెప్పిన అడ్రస్‌లు, పాస్‌పోర్టు చెకింగ్లు అంతా మోసమని గ్రహించారు. 350 మందితో ఒక వాట్సప్ గ్రూప్ పెట్టిన టీడీపీ నేతలు.. ’’మీతో పాటు మేము కూడా మోసపోయాం.. అందరూ క్షమించాలి‘‘ అంటూ వాయిస్ మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు. పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు.! ధర్మారావురెడ్డి బాధితులు ఫిబ్రవరి 17న ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని చెప్పారు తప్ప.. విచారణకు సాహసించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. విచారణను ఆపుతున్నట్లు బాధితులు గ్రహించారు. చేసేదిలేక విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌కు వచి్చనా పట్టించుకోలేదంటూ బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితో.. కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.సీఎం కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం టీడీపీ నేతల బాధితులు ధర్మారెడ్డి మంచివాడు అని నమ్మబలికిన దిలీప్ మధ్యవర్తిత్వంతో అందరం డబ్బు చెల్లించాం. మోసపోయామని చివరి నిమిషంలో తెలిసింది. దిలీప్‌ను నిలదీసినా స్పందించలేదు. ఇచ్ఛాపురం పోలీసులు పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్‌కు వెళ్లాం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లారని చెప్పడంతో.. సీఎం కార్యాలయంలోనూ, మంత్రి లోకేష్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం. మా ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడును కలిసి ఫిర్యాదు చేస్తే.. రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పారు. వారం దాటినా ఎలాంటి స్పందన లేదు. చాలామంది ఉన్న ఉద్యోగం వదిలి డబ్బులు కట్టాం. రోడ్డున పడ్డాం. డబ్బు తిరిగి చెల్లించాలి.

మద్యం మత్తులో అత్యంత పైశాచికంగా..
మద్యం మత్తులో ఆ యువకుడు మృగంగా మారాడు. భయ్యా అని పిలిచే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత పైశాచికంగా ప్రవర్తించడంతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్ శివపురి(Shivpuri District) జిల్లాలో జరిగిన పాశవికమైన ఘటన వివరాల్లోకి వెళ్తే..ఆ చిన్నారి ఓ యువకుడు జరిపిన లైంగికదాడి(Sexual Assault)లో తీవ్రంగా గాయపడింది. ఎంతలా అంటే.. ఆమె తలను గోడకేసి బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి, ఒంటి నిండా పంటి గుర్తులు పడ్డాయి. పెద్ద పేగు చిధ్రమైంది. ఆఖరికి ప్రైవేటు భాగం రెండుగా చీల్చేసి ఉంది. కనీసం మంచంపై పక్కకు కూడా తిరగలేని స్థితిలో.. కొన ఊపిరితో ఉందా చిన్నారి. ఫిబ్రవరి 22వ తేదీన దినార(Dinara) ప్రాంతంలో ఇంటి డాబాపైన ఆడుకుంటున్న ఆ ఐదేళ్ల చిన్నారి.. హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తోటి పిల్లలను ఆ తల్లి ఆరా తీస్తే.. పక్కింటి భయ్యా చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లాడని చెప్పారు. రెండు గంటలైనా వాళ్లు తిరిగి రాలేదు. దీంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించారు. కాసేపటికి ఆ కాలనీకి పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో రక్తపు మడుగులో స్థానికులు గుర్తించారు. శరీరంపై తీవ్ర గాయాలై.. లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో చిన్నారిని హుటాహుటిన గ్వాలియర్ కమలారాజ్ ఆస్పత్రిలో చేర్పించారు.అత్యంత దారుణంగా..ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు రెండు గంటలపాటు అత్యవసర సర్జరీలు చేశారు వైద్యులు. గాయాలకు చికిత్సతో పాటు చిధ్రమైన పెద్ద పేగును కత్తిరించి కృతిమంగా మలద్వారం సృష్టించారు. ప్రైవేట్ పార్ట్‌కు 28 కుట్లు వేశారు. అయినప్పటికీ శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.మైనర్‌గా చూపించి..ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆమె పక్కింట్లోనే ఉంటాడు. మద్యం మత్తులో తాను ఈ నేరానికి పాల్పడినటట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. అతని వయసు 17 ఏళ్లుగా పోలీసులు ప్రకటించడంతో ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. నిందితుడిని మైనర్‌గా చూపించి.. శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్ధతు ప్రకటించాయి. జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ కాంగ్రెస్‌లు పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. అయితే..పోలీసులు మాత్రం నిందితుడి వయసు నిర్ధారణ ఇంకా జరగలేదని చెబుతున్నారు. అప్పటిదాకా.. జువైనల్ చట్టాల ప్రకారమే అతన్ని అదుపులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్థానిక ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia) ఈ దారుణ ఘటనను ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతోపాటు బాధిత తల్లిదండ్రులతోనూ ఆయన మాట్లాడారు. చట్టం ప్రకారం ఈ కేసులో కఠినంగా శిక్ష పడాల్సిందేనని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. शिवपुरी के दिनारा में हमारी मासूम बेटी के साथ हुए अमानवीय कृत्य की जानकारी मिलते ही आज परिजनों से फोन पर बातचीत की एवं उन्हें हौसला दिया। बेटी अभी अस्पताल में भर्ती है और उसकी हालत स्थिर है। मैं लगातार डॉक्टरों की टीम के संपर्क में हूं। हमारे क्षेत्र और प्रदेश में इस तरह के…— Jyotiraditya M. Scindia (@JM_Scindia) February 25, 2025
వీడియోలు


టకీ లేదు టుకి లేదు.. ఎవరికైనా టకీ,టుకి మని పైసలు పడ్డాయా


ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు


కర్నూలు ప్రజల సమస్యలను వినడానికి కూడా ఇష్టపడని మంత్రి టీజీ భరత్


ఏపీ బడ్జెట్.. ఓన్లీ కోతల బడ్జెట్: బీవీ రాఘవులు


పోసాని కృష్ణమురళికి తీవ్ర ఆస్వస్థత


మల్లన్న వ్యాఖ్యలు చాలా తప్పు : పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్


ఏపీ బడ్జెట్ తో మరోసారి చంద్రబాబు మోసం: పుష్పశ్రీవాణి


వరంగల్ జిల్లా మామునూర్ లో ఉద్రిక్తత


కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్


అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పింది