Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

ap high court orders to ntr health university1
ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీపై ఆగ్రహం.. హైకోర్టు సంచలన తీర్పు

సాక్షి, అమరావతి : ఓ విద్యార్థినికి సీటు అంశానికి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు.. సంచలన తీర్పును వెలువరించింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్ణయం వల్ల నెల్లూరు జిల్లాకు చెందిన రేవూరు వెంకట అశ్రిత అనే విద్యార్థిని ఎంబీబీఎస్‌ సీటు కోల్పోయింది. ఇదే అంశంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రేవూరి వెంకట అశ్రితకు నష్టపరిహారం కింద ఏడు లక్షల రూపాయలు ఎన్టీఆర్ యూనివర్సిటీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో నష్ట పరిహారం విద్యార్థికి చెల్లించాలని తేల్చి చెప్పింది. అదే సమయంలో వెంకట ఆశ్రిత కన్నా తక్కువ మెరిట్ ఉన్న విద్యార్థికి సీటు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆశ్రిత కన్న తక్కువ మెరిట్ ఉన్న మరొకరికి సీటు కేటాయించడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఎక్కువ మెరిట్ ఉన్న ఆశ్రితకు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం సీటు కేటాయించకుండా నిరాకరించినందుకు రూ.25000లను ఖర్చుల కింద చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో అశ్వితకు చెల్లించాలని ఎన్టీఆర్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Don't take me lightly: Eknath Shinde2
నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఏక్‌నాథ్‌ షిండే స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ముంబై: తనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) తో ఎటువంటి విభేదాలు లేవని గతవారం వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం ఏక్‌నాత్‌ షిండే(Eknath Shinde). తాజాగా తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరిక నేరుగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు కాకపోయినా, షిండే ఇలా వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటో అనేది రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.ఈరోజు(శుక్రవారం) ఏక్ నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా గురించి తెలుసు. నేను పార్టీలో సామాన్య కార్తకర్తని. నేను అలాగే భావిస్తాను. అదే సమయంలో బాలా సాహెబ్ కు కూడా కార్యకర్తనే. నన్ను గతంలో తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం ఏమైందో మీకు తెలుసు.’ అంలూ హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే నేతృత్వంలోని శివసేనకు 57 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ ప్రభుత్వానికి సూచాయాగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూనే గత ప్రభుత్వాన్ని కూల్చిన సందర్భాన్ని షిండే తాజాగా గుర్తు చేసుకోవడమే రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇది ఫడ్నవీస్ ను పరోక్షంగా హెచ్చరించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేకపోలేదనే సంకేతాలు పంపినట్లు అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఫడ్నవీస్ సమావేశాలకు షిండే డుమ్మా..మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగే పలు సమావేశాలకు షిండే తరుచు గైర్హాజరు కావడంతో వారి మధ్య విభేదాలున్నాయనే దానికి అద్దం పడుతోంది. షిండే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమోదించిన రూ. 900 కోట్ల ప్రాజెక్టును ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ నిలిపివేయడంతో వీరి మధ్య అగ్నికి ఆజ్యం పోసిందనే వాదన తెరపైకి వచ్చింది. జల్నాలో తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆమోదించిన ప్రాజెక్టును సీఎం హోదాలో ఉన్న ఫడ్నవీస్ ఆపడమే షిండేకు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఫడ్నవీస్ క్యాబినెట్ సమావేశాలకు షిండే దూరంగా ఉన్నట్లు సమాచారం.2022లో ఇలా..మూడేళ్ల క్రితం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు షిండే. 40 మంది ఎమ్మెల్యేలతో బయటకొచ్చేశారు. ఫలితంగా మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరుణంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు షిండే.ఇక 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నేతృత్వంలోని మహాయుతి 232 మంది ఎమ్మెల్యేలను సొంతం చేసుకుంది. బీజేపీ(BJP) 132 సీట్లు గెలవగా, శివసేన 57 మంంది ఎమ్మెల్యేలను, ఎన్సీపీ 41 మంది శాసనసభ స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో సీఎం పదవి అనేది ఫడ్నవీస్ ను వరించింది. ఆ సమయంలో తనుకు ఇవ్వబోయే డిప్యూటీ సీఎం పదవిని షిండే తిరస్కరించారు. కొన్ని బుజ్జగింపుల తర్వాత దానికి కట్టుబడ్డారు షిండే.గతవారం అలా.. ఇప్పుడు ఇలాతనకు ఫడ్నవీస్ తో ఎటువంటి విభేదాలు లేవని షిండే గతవారం వ్యాఖ్యానించారు. మా మధ్య ఎటువంటి కోల్డ్ వార్ నడవడం లేదన్నారు షిండే. తాము కలిసి కట్టుగానే అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై యుద్ధం చేస్తామన్నారు.అయితే తాజాగా షిండే స్వరంలో కాస్త మార్పు కనిపించింది. ‘నేను విధాన సభలో తొలి ప్రసంగం ఇచ్చినప్పుడు రెండొందలపైగా సీట్లు వస్తాయని ఫడ్నవీస్ అన్నాను. మాకు 232 సీట్లు వచ్చాయి. నన్ను తేలిగ్గా తీసుకోవద్దనే విషయం ఎవరిని ఉద్దేశించి చెప్పానో వారికి అర్ధమైతే చాలు’ అంటూ ముక్తాయించారు ఏక్‌నాత్‌ షిండే

Perni Nani sensational comments on phone tapping in Andhra Pradesh3
చంద్రబాబు బంధువే ఫోన్‌ ట్యాపింగ్‌ సూత్రదారి: పేర్నినాని

సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖలు చేశారు. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీతో ఆయన సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు ములాఖత్‌ అయ్యారు.ములాఖత్‌ అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నెంబర్స్‌ను సేకరించారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్‌ నెంబర్లతో ఏం పని? అని ప్రశ్నించారు. చంద్రబాబు బంధువే ఫోన్‌ ట్యాపింగ్‌ సూత్రదారి చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి అనదికారికంగా విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టి ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారు. ఫోన్‌ ట్యాప్‌ చేసి నేతలను బెదిరించాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఎన్ని తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.వల్లభనేనీ వంశీ కేసులో దుర్మార్గంగా పోలీసులువల్లభనేనీ వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసం పటమట పోలీసులు పని చేస్తున్నారు. 10వ తేదిన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తప్పుడు కేసు అని అఫిడవిట్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఫణి కుమార్ అనే వ్యక్తి ద్వారా సత్యవర్ధన్, వంశీపై తప్పుడు కేసులు పెట్టించారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేశారు. ఊహాజనిత ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వంశీపై పెట్టారు. నాపైనా కేసులు సత్య వర్ధన్ చెప్పాడో లేదో కూడా తెలియకుండా కేసు పెడతారా? వంశీకి రిమాండ్ విధించే సమయంలో ఎస్సీ,ఎస్టీ కేసుల న్యాయస్థానంలో హాజరు పరచకుండా వేరే కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టాలు, కేసులు, సెక్షన్లు అనేవి లేకుండా పోలీసులు వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుంటూరులో పర్యటించే సమయంలో నేను లేను. అయినా నాపై కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్రపై పేర్ని ఫైర్ కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రజా సేవకు మా ఊరు,రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనికిరారు. లోకేష్ ఇస్తే కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి. కొడాలి నాని అరెస్టు చేయిస్తా, పేర్ని నానినీ అరెస్టు చేయిస్తా అంటున్నారు. నేనూ ఆరు నెలలుగా మచిలీపట్నం రోడ్లపై తిరుగుతున్నాను. మీరు ఏం చేయలేరు’అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.

Tamilnadu BJP dare to DMK Lets see who wins4
మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా? డీఎంకేకు బీజేపీ సవాల్‌

చెన్నై: అటు బీజేపీ‍ ఇటు డీఎంకే. తమిళనాడు వేదికగా సాగుతున్న సోషల్ మీడియా రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో వారి సోషల్ మీడియా వార్ సాగుతోంది. దీనింతటికీ ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ సోషల్ మీడియాలో డీఎంకే చేసిన హ్యాష్ ట్యాగ్ ప్రధాన కారణంగా నిలిచింది. గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే సాగుతోంది. హిందీ భాషను అమలు చేయడాన్ని డీఎంకే(DMK) వ్యతిరేకిస్తోంది. ఇది కాస్తా ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కు దారి తీసింది. ఈ క్రమంలోనే డీఎంకే ఐటీ వింగ్ సోషల్ మీడియాలో ‘గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను కోడ్ చేసింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ సైతం ‘ గెట్ అవుట్ స్టాలిన్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ను కౌంటర్ గా సోషల్ మీడియా(Social Media)లో వదిలింది. ఇరు పార్టీల ట్వీట్లకు సంబంధించి తమిళనాడు బీజేపీ(BJP) చీఫ్ కె అన్నామలై మాట్లాడుతూ.. ఈ రెండు హ్యాష్ ట్యాగ్ లను కోడ్ చేస్తూ ‘ఎవరు గెలిచారో చూసుకుందామా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డీఎంకేకు. ‘ మీరు గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను రాత్రి పూట్ రిలీజ్ చేశారు. ఆపై ఉదయం ఆరు గంటలకు ‘గెట్ అవుట్ స్టాలిన్’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్‌లోకి తెచ్చాం. ఇక్కడ ఎవరు హ్యాష్ ట్యాగ్ ఎక్కువ రీచ్ అయ్యిందో చూద్దామా. ఇందుకోసం మీకున్న అన్ని వనరులను ఉపయోగించుకుండి. మన ఇద్దరి ట్వీట్లలో ఎవరిది ఎక్కవ ప్రజల్లోకి పోయిందో చూద్దాం’’ అంటూ డీఎంకే కు చాలెంజ్ విసిరారు అన్నామలై.For high handedness of one family, having a tainted cabinet, being an epicentre of corruption, turning a blind eye to lawlessness, turning TN into a haven for drugs & illicit liquor, mounting debt, dilapidated education ministry, precarious environment for women & children,… pic.twitter.com/VyD0BgPLfk— K.Annamalai (@annamalai_k) February 21, 2025 ఇదే సమయంలో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు అన్నామలై. ప్రధానంగా పిల్లలకు భద్రత కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిందన్నారు. కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్‌

Telangana Government Orders Vigilance Inquiry Into Secretariat Construction5
తెలంగాణ సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంతంటే?.. ప్రభుత్వానికి విజిలెన్స్‌ నివేదిక

హైదరాబాద్‌ : సచివాలయ నిర్మాణం, వ్యయం అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయానికి వెచ్చించిన నిధులు, నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలు అంశాలను తేల్చాలని విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం వింగ్‌ల వారిగా విచారణ మొదలుపెట్టింది. అయితే, ఈ విచారణలో సచివాలయం నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ విభాగంపై విజిలెన్స్‌ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికలో సెక్రటేరియట్‌లో మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్‌వేర్‌, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి రూ. 320కోట్లకు పైగా ఖర్చు దాటిందని విజిలెన్స్ పేర్కొంది. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు తేల్చింది.బిల్లులు మంజూరు చేయకుండానే నిధులను విడుదల చేసినట్లు గుర్తించింది. రూ. 320 కోట్లకు పైగా నిధుల విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాదాపుగా ఇప్పటివరకు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ప్రభుత్వం సదరు సంస్థకు నిధులను విడుదల చేసింది. మొత్తం అంచనా రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని విజిలెన్స్‌ తాత్కాలిక రిపోర్టులో పేర్కొంది.

Digital Snan Service For Rs 1100 To Devotees Unable To Attend Maha Kumbh6
మహా కుంభమేళాలో డిజిటల్‌ స్నానం! వీడియో వైరల్‌

మహా కుంభమేళాకు (Maha Kumbh) సంబంధించి ప్రతిరోజూ పలు వింత వార్తలు, కథనాలు వస్తున్నాయి. త్రివేణి సంగమంలో తమ పాపాలను కడుక్కోవడానికి కొందరు వస్తుంటే మరికొందరు ఎప్పుడో దూరమైన తమ కుటుంబాలతో తిరిగి కలుస్తున్నారు. కొందరికి మాత్రం పెద్ద జనసమూహాల మధ్య కొత్త వ్యాపార ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమానికి ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది యాత్రికులను ఆకర్షించింది. అయితే ప్రయాణం చేయలేని వారి కోసం, స్థానిక ఔత్సాహిక ఎంట్రాప్రెన్యూర్‌ దీపక్ గోయల్ 'డిజిటల్ స్నాన్' (Digital Snan) సర్వీస్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా భక్తులు సంగమంలో స్నానం కోసం వాట్సాప్ ద్వారా తమ ఫొటోలను పంపవచ్చు. ఇందుకోసం అతను ఒక్కొక్కరికి రూ.1,100 ధర నిర్ణయించాడు.సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలుమహా కుంభమేళాలో డిజిటల్‌ స్నానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమర్శలతోపాటు ఉత్సుకతనూ రేకెత్తించింది. కొంతమంది యూజర్లు ఈ ఆలోచనను విశ్వాస దోపిడీ అంటూ విమర్శిస్తూ ఉంటే.. మరికొందరు అక్కడికి వెళ్లలేని వారికి ఇది అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: ‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!ఆధునిక సాంకేతికతతో విశ్వాసం ముడిపడి ఉండటం ఇదే మొదటిసారి కాదు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఆన్‌లైన్‌లో దాని గురించి ఒక కరపత్రాన్ని పంచుకున్నప్పుడు ఇలాంటి 'వాట్సాప్ సాల్వేషన్' సర్వీస్‌ దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి సర్వీస్‌లు ఆధ్యాత్మికపరమైన ప్రామాణికతను పలుచన చేస్తాయని విమర్శకులు వాదిస్తున్నప్పటికీ, డిజిటల్ ప్రపంచంలోనూ సంప్రదాయానికి ప్రాధాన్యత ఎలా కొనసాగుతోందో కూడా అవి తెలియజేస్తున్నాయి.Digital Kumbh Snan 😭😭 and people are even paying him 👇pic.twitter.com/qGBr168p0f— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) February 21, 2025

Google Pay Begins Charging for Bill Payments Check The Details Here7
గూగుల్‌ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!

స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది.. దాదాపు అన్ని లావాదేవీలకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. యూజర్ల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్న సమయంలో.. ట్రాన్సాక్షన్ల మీద ఛార్జీలను వసూలు చేయడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఇప్పటి వరకు లావాదేవీల మీద ఎలాంటి ఛార్జీలను వసూలు చేయని గూగుల్ పే.. ఇకపై ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, డీటీహెచ్ బిల్స్ చెల్లించినప్పుడు.. అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే వినియోగదారులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఫీజు ఉండదు.గతేడాది నుంచి మొబైల్ రీఛార్జీల మీద రూ. 3 కన్వీనియన్స్‌ ఫీజును వసూలు చేస్తున్న గూగుల్‌ పే.. ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బిల్స్ మీద 0.5 శాతం నుంచి 1 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి బిల్స్ చెల్లించిన యూజర్లకు ఇప్పటికే ఛార్జీలు పడినట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పులుఅదనపు ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా? లేదా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. భవిష్యత్తులో తప్పకుండా అందరూ ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే?.. దీనిపై గూగుల్‌ పే స్పందించలేదు. అయితే గూగుల్ పే దీనిని అమలు చేస్తే.. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

Haris Raufs Bold Statement Before IND vs PAK Clash8
భార‌త్‌తో మ్యాచ్‌.. మాకు స్పెషలేమి కాదు: పాక్‌ స్టార్‌ బౌలర్‌

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో అస‌లు సిసిలైన పోరుకు స‌మ‌యం అస‌న్న‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 23న దుబాయ్ వేదిక‌గా చిరకాల ప్ర‌త్య‌ర్దులు భారత్‌-పాకిస్తాన్(India-Pakistan) అమీతెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఐసీసీ ఈవెంట్‌ల‌లో పాక్‌పై త‌మ అధిప‌త్యాన్ని కొన‌సాగించాల‌ని భార‌త్ భావిస్తోంది. మ‌రోవైపు పాకిస్తాన్ మాత్రం 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్‌ ఫ‌లితాన్ని పున‌రావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ట్రోఫీ-2017 ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది.ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్‌ల్లో తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, పాక్ కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో జరిగే మ్యాచ్ ‍గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని రౌఫ్ తెలిపాడు."భారత్‌తో మ్యాచ్ సందర్బంగా మాపై ఎలాంటి ఒత్తడి లేడు. ఆటగాళ్లందరూ రిలాక్స్‌గా ఉన్నారు. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే. పాకిస్తాన్-భారత్ మ్యాచ్ అన్ని క్రికెట్ మ్యాచ్‌లనే జరుగుతుంది" అని జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రౌఫ్ పేర్కొన్నాడు. ఇక ఈ మెగా టోర్నీని భారత్‌ అద్భుతమైన విజయంతో ఆరంభించింది. గురువారం దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. పాక్‌ మాత్రం కివీస్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.తుది జ‌ట్లు(అంచనా)భారత్‌: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్‌: ఇమామ్ ఉల్ హ‌క్‌, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్‌), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: IPL 2025: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్‌..

Messages to Unknown Women at Night Consider As Says Mumbai Court9
అర్ధరాత్రిళ్లు మేసేజ్‌లు.. అశ్లీలతే అవుతుంది!

పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపడం.. అశ్లీలత కిందకే వస్తుందని ముంబై సెషన్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ మాజీ కార్పొరేటర్‌కు అశ్లీల సందేశాలు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.‘‘మీరంటే ఇష్టం, మీరు చూడడానికి బాగున్నారు, అందంగా ఉన్నారు, మీకు వివాహం అయ్యిందా? లేదా?, మీరు సన్నగా ఉన్నారు!!..’’ అంటూ.. తెలియని మహిళలకు అర్ధరాత్రిళ్లు సందేశాలు పంపడం సరికాదు. ఈ చర్య అశ్లీలత(Obscene) కిందకే వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు, వాళ్ల భాగస్వాములు ఇలాంటి వాటిని తట్టుకోలేరు. ప్రత్యేకించి.. ఒకరికొరు పరిచయం లేని సమయంలో అస్సలు భరించలేరు’’ అని అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి డీజీ ధోబ్లే వ్యాఖ్యానించారు.అయితే రాజకీయ వైరంతోనే ఆమె తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆ వ్యక్తి వాదించగా.. కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఏ మహిళ తెలిసి తెలిసి తప్పుడు కేసుతో తన పరువును పణంగా పెట్టాలనుకోదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడు బాధిత మహిళకు వాట్సాప్‌ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాసిక్యూషన్‌ రుజువు చేసిందని, కాబట్టి నిందితుడు ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షకు అర్హుడు అని సెషన్స్‌ కోర్టు స్పష్టం చేసింది.ముంబై బోరివాలీ ఏరియాకు చెందిన మాజీ కార్పొరేటర్‌కు.. 2016 జనవరిలో నార్సింగ్‌ గుడే అనే వ్యక్తి వాట్సాప్‌ సందేశాలు పంపాడు. ‘‘మీరు చూడడానికి బాగుంటారు.. మీరంటే ఇష్టం. మీకు పెళ్లైందా?’’ అంటూ అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేసుకుని నార్సింగ్‌ను అరెస్ట్‌ చేశారు ఆరేళ్ల తర్వాత.. మేజిస్ట్రేట్‌ కోర్టు నార్సింగ్‌ను దోషిగా నిర్ధారించి.. మూడు నెలల శిక్షను విధించింది. అయితే ఈ శిక్షను అతను సవాల్‌ చేయగా.. తాజాగా ట్రయల్‌ కోర్టు తీర్పును సెషన్స్‌ కోర్టు సమర్థించింది.

Return Of The Dragon Movie Review And Rating In Telugu10
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ రివ్యూ

‘లవ్‌ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు యంగ్‌ హీరో ప్రదీప్‌రంగనాథన్‌. చాలా గ్యాప్‌ తర్వాత ఈ సారి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Review)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా నటించారు. నేడు(ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డి.రాఘవన్‌(ప్రదీప్‌ రంగనాథన్‌)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్‌లో 96 శాతం మార్కులతో పాస్‌ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్‌ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్‌ బాయ్స్‌ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్‌ చేస్తుంది. దీంతో రాఘవన్‌ బ్యాడ్‌ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్‌ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్‌ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్‌(మిస్కిన్‌)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్‌ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్‌)(Ashwath Marimuthu) బ్రేకప్‌ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్‌ కావాలని ఫేక్‌ సర్టిఫికేట్స్‌ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్‌ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్‌ సర్టిఫికెట్స్‌ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్‌ అవ్వాలని కండీషన్‌ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్‌. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్‌ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ).ఎలా ఉందంటే.. 'లవ్ టుడే'తో భారీ హిట్‌ కొట్టాడు ప్రదీప్‌ రంగనాథన్‌. అంతకు ముందు అతనెవరేది కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో తెలుగు హీరోగా మారిపోయాడు. అతని నుంచి మరో సినిమా వస్తుందంటే టాలీవుడ్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మళ్లీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌తో వచ్చేశాడు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కథ, కథనంలో కొత్తదనం ఏమి లేదు కానీ..ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. కాలేజీ సీన్స్‌ మొదలు క్లైమాక్స్‌ వరకు ప్రతీ సీన్‌ గత సినిమాలను గుర్తు చేస్తుంది.ఊహించినట్లుగానే కథనం సాగుతుంది.అయినా కూడా బోర్‌ కొట్టదు. దర్శకుడు కథ విషయంలో కేర్‌ తీసుకోలేదు కానీ కథనం మాత్రం జాగ్రత్త పడ్డాడు. అల్రేడీ చూసిన కథలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌ కాలేజీ ఎపిసోడ్‌ కొంతవరకు ఆకట్టుకుంటుంది. హీరో కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరోకి ఉద్యోగం లభించిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫేక్‌ సర్టిఫికేట్స్‌తో దొరికిపోతాడు అనుకున్న ప్రతిసారి ఓ ట్విస్ట్‌ ఇవ్వడం ఆసక్తిని పెంచుతుంది. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. చోటా డ్రాగన్‌ కామెడీ నవ్విస్తుంది. అలాగే మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. ప్రీక్లైమాక్స్‌ నుంచి కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ముగింపు ఆకట్టుకుంటుంది. ఫేక్‌ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందడం కారణంగా టాలెంట్‌ ఉన్నవారు నష్టపోతున్నారనే విషయాన్ని దర్శకుడు తెరపై ఎంటర్‌టైనింగ్‌ చెప్పాడు. ఎవరెలా చేశారంటే.. రాఘవన్‌ అలియాస్‌ డ్రాగన్‌గా ప్రదీప్‌ రంగనాథ్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక డ్రాగన్‌ ప్రియురాలు కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోయిన్ కయాదు లోహర్‌ తెరపై గ్లామరస్‌గా కనిపించింది. అనుపమ కంటే ఆమె పాత్రకు స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువ. అయితే నటనతో అంతగా స్కోప్‌ ఉండదు. మిస్కిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. లియోన్‌ జేమ్స్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. పాటలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
మహా కుంభమేళాలో డిజిటల్‌ స్నానం! వీడియో వైరల్‌

మహా కుంభమేళాకు (Maha Kumbh) సంబంధించి ప్రతిరోజూ పలు వింత వార్తలు, కథనాలు వస్తున్నాయి.

title
‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh) అంతిమ దశకు వచ్చేసింది.

title
ఉదయనిధి సవాల్‌.. అన్నామలై సై

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచే త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి.

title
నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఏక్‌నాథ్‌ షిండే స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ముంబై:  తనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Deve

title
మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా? డీఎంకేకు బీజేపీ సవాల్‌

చెన్నై:  అటు బీజేపీ‍ ఇటు డీఎంకే.

International View all
Advertisement

వీడియోలు

Advertisement