Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

CM Chandrababu Naidu Comments Against YSRCP1
వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా ఇప్పటికే కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ఈసారి ఏకంగా ఆ పార్టీకి చెందిన వారికి ఏ పనులు చేయొద్దంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్ సీపీకి చెందిన వారికి ఎటువంటి పనులు చేయొద్దని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకండని, అన్ని స్థాయిల్లోనూ ఇది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. తన సొంత జిల్లా(చిత్తూరు జిల్లా) పర్యటనలో భాగంగా ప్రజా వేదిక పేరుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ఈ రకంగా కక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలుముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ తరహా కక్ష సాధింపు వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో పార్టీ రహితంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాలన అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం కక్ష పూరిత రాజకీయం కాకపోతే ఏంటని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమైందని మండిపడుతున్నారు. ఇది రాజ్యాంగానికి, సీఎం ప్రమాణానికి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Zelenskyy Stark Message To USA President Donald Trump2
ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్‌స్కీ కీలక ట్వీట్‌

కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య వైట్ హౌస్ వేదికగా జరిగిన చర్చలు పూర్తిగా విఫలం కావడమే కాదు.. ఆ చర్చ కాస్తా ‘ మూడో ప్రపంచ యుద్ధం’ అని ట్రంప్ నోట వచ్చే వరకూ వెళ్లింది. అంటే రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమంటూనే ట్రంప్ చెప్పిన ప్రతీ దానికి తలాడించలేదు జెలెన్ స్కీ. పూర్తిగా తమ భూభాగంపై ఎటువంటి కాల‍్పులు, బాంబుల మోత లేకుండా చూస్తామని అమెరికా తరఫున మీరు(ట్రంప్) మాటిస్తేనే మీతో వాణిజ్య ఖనిజాల ఒప్పందంపై సంతకం చేస్తామని కరాఖండీగా చెప్పేశారు జెలెన్ స్కీ.తమ భూ భాగంలో నివసిస్తే వేరే వాళ్ల పెత్తనం ఏమిటని జెలెన్ స్కీ కాస్త గట్టిగానే స్వరం వినిపించారు. ఇది ట్రంప్ కు నషాళానికి ఎక్కినట్లుంది. రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోకపోతే మూడో ప్రపంచం యుద్ధం వచ్చినా రావొచ్చు అని ట్రంప్ హెచ్చరించారు. దాంతో వారి మధ్య చర్చ సంగతి పక్కన పెడితే, వాగ్వాదమే ఎక్కువ కనిపించింది.ఇలా వాదోపవాదాల నడుమనే ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయకుండా వైట్ హౌస్ వీడారు జెలెన్ స్కీ. అయితే జెలెన్ స్కీ వైఖరి కచ్చితంగానే ఉందనే అభిప్రాయమో, ట్రంప్ పై కోపమో తెలీదు కానీ కొన్ని దేశాలు మాత్రం ఉక్రెయిన్ కు మద్దతు తెలిపాయి. కెనడా, బ్రిటన్ తో సహా పలు కీలక దేశాలు జెలెన్ స్కీకి జై కొట్టాయి.మీ సపోర్ట్ ఎప్పుడూ కీలకమే.. కానీ మాకు స్వేచ్ఛ కూడా ​అవసరంఅయితే ఇలా ట్రంప్ తో వాదించి వెళ్లిన జెలెన్ స్కీ గురించి ప్రపంచం అంతా చర్చించుకునే తరుణం ఇది. అగ్రదేశం, ఆ దేశ అధ్యక్షుడ్ని ఎదిరించి వాదించిన సిసలైన నాయకుడు అని, ‘వీడు మగడ్రా బుజ్జి’ అని సోషల్ మీడియా వరల్డ్ అనుకుంటున్న తరుణం.. అయితే ట్రంప్‌ తో వాగ్వాదం తర్వాత జెలెన్‌స్కీ.. తమకు యూఎస్ సపోర్ట్ అనేది కీలకమని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ సపోర్ట్ చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ వేదికగా జెలెన్ స్కీ ట్వీట్ చేశారు. ‘ మీ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఇప్పటివరకూ రష్యాతో వార్ లో మాకు అందించిన ప్రతీ సహకారం మరువలేనింది. ఉక్రెయిన్ ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడే ఉంటారు.ఇప్పుడు ట్రంప్ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఆయన యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. యుద్ధాన్ని ముగించడానికి మా కంటే ఎక్కువ కోరుకునే వారు ఎవరూ ఉండరు. కానీ మేము యుద్ధంతోనే జీవనం సాగిస్తున్నాం. మా స్వాతంత్య్యం కోసం మేము చేస్తున్నా పోరాటం.. మా ప్రతీ ఒక్కరి ఆశయం, ఆశ కూడా మాకు స్వే‍చ్ఛగా మనుగడ సాగించడమే’ అని రాశారు. America’s help has been vital in helping us survive, and I want to acknowledge that. Despite the tough dialogue, we remain strategic partners. But we need to be honest and direct with each other to truly understand our shared goals.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025 It’s crucial for us to have President Trump’s support. He wants to end the war, but no one wants peace more than we do. We are the ones living this war in Ukraine. It’s a fight for our freedom, for our very survival.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025

Hariyana Congres Leader Himani Narwal Dies3
మహిళా కాంగ్రెస్ నేత హిమానీ దారుణ హత్య

చండీగఢ్: హర్యానా రాష్ట్రంలో రోహతక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు దుండగులు. ఆమె మృతదేహం సూట్ కేసులో లభించింది. సప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు.

Doubts Over Police Statement On Posani Krishna Murali Health4
పోసానిపై సీఐ స్టేట్‌మెంట్‌ ఇవ్వడమేంటి?.. ప్రకటనపై అనుమానాలు!

సాక్షి, వైఎస్సార్ జిల్లా: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిపై పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న పోసానిపై నాటకాలాడుతున్నారంటూ రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చేసిన ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు ప్రకటన విడుదల చేయకుండా ముందుగానే సీఐ ​మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పోసాని భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోసాని ఆరోగ్యంపై పోలీసులు స్టేట్‌మెంట్‌ ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా పోలీసులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. పోసాని తీవ్రమైన గ్యాస్టిక్‌ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్‌ హెర్నియా సర్జరీలో ఇన్‌ఫెక్షన్‌ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది.హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్‌ కార్డు సర్జరీ జరిగింది. కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్‌ సర్జరీ చేసిన స్టంట్‌ వేశారు వైద్యులు. హార్ట్‌ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో పోసాని బాధపడుతున్నారు.

Ys Jagan Wishes Muslims On The Occasion Of Beginning Of Holy Month Of Ramadan5
ముస్లిం సోదరులకు వైఎస్‌ జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2025

Venkatesh Sankranthiki Vasthunam Movie Ott Surprise To Audience6
ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. ఆడియన్స్‌కు బిగ్‌ ట్విస్ట్!

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే టీవీలతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ఓటీటీ వర్షన్‌లో సినీ ప్రియులకు షాకిచ్చారు సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్. ఈ సినిమా నిడివిని తగ్గించి విడుదల చేశారు. థియేటర్లలో 2 గంటల 24 నిమిషాలు ఉన్న ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాల రన్‌టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించడంతో ఫ్యాన్స్‌ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.అయితే థియేటర్‌ వర్షన్‌ నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్‌ రావిపూడి తొలగించారని ఇటీవల వార్తలొచ్చాయి. అవి ఓటీటీలో యాడ్‌ చేస్తారంటూ భావించారు. ముఖ్యంగా సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్‌ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ‍అలా జరగపోగా.. ఉన్న నిడివి కాస్తా తగ్గడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package7
ఎల్‌పీయూ విద్యార్థికి రూ.1.03 కోట్ల ప్యాకేజీ

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

CT 2025 Klassen Dussen 50s South Africa Beat England By 7 Wickets8
SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్‌ బైబై

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండానే ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. సౌతాఫ్రికాతో శనివారం నాటి మ్యాచ్‌తో పరాజయాల పరంపరను పరిపూర్ణం చేసుకుని ఇంటిబాట పట్టింది.ఈ మెగా టోర్నీలో గ్రూప్‌-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌లతో కలిసి ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది. తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొన్న బట్లర్‌ బృందం.. ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం అఫ్గనిస్తాన్‌తో తలపడ్డ ఇంగ్లండ్‌.. ఆఖరి వరకు పోరాడి అనూహ్య రీతిలో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో పరాజయాన్ని చవిచూసింది.ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరుఈ క్రమంలో సెమీస్‌ రేసు నుంచి వైదొలిగిన ఇంగ్లిష్‌ జట్టు.. ఆఖరిగా సౌతాఫ్రికా(England vs South Africa)తో మ్యాచ్‌లోనైనా గెలవాలని భావించింది. కానీ ప్రొటిస్‌ జట్టు బట్లర్‌ బృందానికి ఆ అవకాశం ఇవ్వలేదు. కరాచీ వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే, సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 179 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లలో ఫిల్‌ సాల్ట్‌(8), వన్‌డౌన్‌ బ్యాటర్‌ జామీ స్మిత్‌(0)లతో సహా హ్యారీ బ్రూక్‌(19), లియామ్‌ లివింగ్‌స్టోన్‌(9) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో జో రూట్‌ 37 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. జోస్‌ బట్లర్‌(Jos Buttler- 21), జో జోఫ్రా ఆర్చర్‌(25) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో 179 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌ కాగా.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరుగా నమోదైంది.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 29.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో రియాన్‌ రికెల్టన్‌(27) ఫర్వాలేదనిపించగా.. తన ప్రొఫెషనల్‌ కెరీర్‌లో తొలిసారిగా ఓపెనర్‌గా వచ్చిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ డకౌట్‌ అయ్యాడు. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ అర్ధ శతకాలతో చెలరేగారు. బాధతో బట్లర్‌ బైబైడసెన్‌ 87 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలవగా.. క్లాసెన్‌ 56 బంతుల్లో 64 రన్స్‌ సాధించాడు. ఈ క్రమంలో మూడు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా టార్గెట్‌ను ఛేదించింది. సెమీస్‌ చేరడంతో పాటు గ్రూప్‌-బి టాపర్‌గా నిలిచింది. ఇక ఇదే గ్రూపు నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌ చేరగా.. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ తమ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్‌ వరుస పరాభవాల నేపథ్యంలో బట్లర్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించిన బట్లర్‌.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి వల్ల చేదు అనుభవంతో తన కెప్టెన్సీ కెరీర్‌ను ముగించాడు.సౌతాఫ్రికా వర్సెస్‌ ఇంగ్లండ్‌👉వేదిక: నేషనల్‌ స్టేడియం, కరాచి👉టాస్‌: ఇంగ్లండ్‌..బ్యాటింగ్‌👉ఇంగ్లండ్‌ స్కోరు: 179 (38.2)👉సౌతాఫ్రికా స్కోరు: 181/3 (29.1)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మార్కో యాన్సెన్‌(3/39).చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌​..

Piramal Enterprises hit with Rs 1502 crore GST demand notice9
అంబానీ అల్లుడికి ట్యాక్స్‌ నోటీసు..

ఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్‌ అంబానీ అల్లుడికి భారీ ట్యాక్స్‌ నోటీసు వచ్చింది. ఇషా అంబానీకి భర్త అయిన ఆనంద్‌ పిరమల్‌ ప్రమోటర్‌గా ఉన్న రూ.19,675 కోట్ల పిరమల్ గ్రూప్ లో ప్రముఖ సంస్థ అయిన పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.1,502 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు అందింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఫార్మా వ్యాపారాన్ని పిరమల్ ఫార్మా లిమిటెడ్‌కు విక్రయించడానికి సంబంధించి మహారాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఈ నోటీసు జారీ చేశారు. రూ.4,487 కోట్ల విలువైన ఈ లావాదేవీలో అనుబంధ సంస్థల బదలాయింపు కూడా ఉంది. రూ.1,502 కోట్ల పన్ను డిమాండ్‌లో పన్ను మొత్తం రూ.837.17 కోట్లు కాగా వడ్డీ కింద రూ.581.53 కోట్లు, జరిమానాగా రూ.83.71 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.వివాదం ఇదే.. లావాదేవీ వర్గీకరణలోనే పన్ను వివాదం సారాంశం ఉంది. పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ అమ్మకాన్ని "స్లంప్ సేల్" గా వర్గీకరించింది. వ్యక్తిగత విలువలను కేటాయించకుండా ఆస్తులు, అప్పులతో సహా మొత్తం వ్యాపార సంస్థను బదిలీ చేస్తే దాన్ని స్లంప్‌ సేల్‌గా పేర్కొంటారు. ఇటువంటి అమ్మకాలు సాధారణంగా జీఎ‍స్టీ పరిధిలోకి రావు. అయితే ఈ వర్గీకరణ తప్పని, ఈ లావాదేవీ "ఐటమైజ్డ్ సేల్" అని పన్ను అధికారులు వాదిస్తున్నారు. ఇక్కడ ఆస్తులు, అప్పులకు ప్రత్యేక విలువలు కేటాయించి మొత్తం అమ్మకాలపై 18 శాతం జీఎస్టీ విధించారు.పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ స్పందనపన్ను ఉత్తర్వులను పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ తీవ్రంగా ఖండించింది. ఈ డిమాండ్ సమంజసం కాదని భావించిన కంపెనీ ఈ తీర్పును సవాలు చేయడానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. "కంపెనీ తన ఉత్తమ ప్రయోజనాల కోసం తగిన చర్యలు తీసుకుంటుంది. ఆర్డర్ ను పక్కన పెట్టడం వల్ల సానుకూల ఫలితం ఉంటుందని సహేతుకంగా ఆశిస్తున్నాము. ఈ ఆర్డర్ కంపెనీ లాభనష్టాల ప్రకటనపై ఎలాంటి ప్రభావం చూపదు" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది.ఇది చదివారా? అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్‌?​ఆర్థిక ప్రభావంపన్ను వివాదం కొనసాగుతున్నప్పటికీ, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ .38.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.2,476 కోట్లతో పోలిస్తే 1.1 శాతం క్షీణతతో రూ.2,449 కోట్లకు పరిమితమైంది. వడ్డీ, పన్ను, తరుగుదల, ఎమోర్టైజేషన్ (ఇబిటా) ముందు ఆదాయం 10.8 శాతం క్షీణించి రూ.1,075 కోట్లకు పరిమితమైంది.

Posani Krishna Murali Admitted To Rajampet Government Hospital10
పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత

అన్నమయ్య జిల్లా: కూటమి సర్కార్‌ అక్రమంగా పెట్టిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు.. ఈసీజీతో పాటు మరికొన్ని రక్ష పరీక్షలు నిర్వహించారు. బీపీతో పాటు ఈసీజీలో తేడాలున్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం పోసానిని కడప రిమ్స్‌కు తరలించారు. గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు.పోసాని తీవ్రమైన గ్యాస్టిక్‌ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్‌ హెర్నియా సర్జరీలో ఇన్‌ఫెక్షన్‌ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది. హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్‌ కార్డు సర్జరీ జరిగింది.కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్‌ సర్జరీ చేసిన స్టంట్‌ వేశారు వైద్యులు. హార్ట్‌ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో బాధపడుతున్నారు పోసాని కాగా, పోసాని కృష్ణ మురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మెజిస్ట్రేట్‌ 14 రోజులు రిమాండ్‌ విధించారు. గురువారం రాత్రి 9 గంటలకు పోలీసులు కృష్ణ మురళిని మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచారు. పదేళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేత ఫిర్యాదు మేరకు ఆయనపై అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు.పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ, ఈ సెక్షన్లు ఆయనకు వర్తించవని వివరించారు. సంబంధం లేని సెక్షన్లతో పాటు అనవసర సెక్షన్లు పెట్టారని వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించి తమ వాదనలు వినిపించారు. దాదాపు 9.30 గంటలకు ప్రారంభమైన వాదనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన మెజిస్ట్రేట్‌ సాయితేజ్‌.. తెల్లవారుజామున పోసానికి 14 రోజుల రిమాండును విధించారు. అనంతరం పోసానిని రైల్వేకోడూరు సీఐ పి.వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్‌ఐ పి.మహేష్‌నాయుడులు తమ సిబ్బందితో ఉదయం 7.52 గంటలకు నేరుగా రాజంపేట సబ్‌ జైలు వద్దకు తీసుకొచ్చారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

Advertisement

వీడియోలు

Advertisement