Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Pawan Kalyan By Vardhelli Murali1
వీరమల్లు సైద్ధాంతిక విన్యాసం!

సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం పూర్తయింది. పిఠాపురంలో నిన్న ఆ వేడుక వైభవంగానే జరిగింది. తాను అసెంబ్లీ గేటు తాకడానికి అవకాశం కల్పించిన పిఠాపురాన్ని ఈ రకంగా పవన్‌ గౌరవించారు. అసెంబ్లీ గేటును తాకే క్రమంలో పనిలో పనిగా కొన్ని తొడలు విరగ్గొట్టినట్టుగా కూడా ఆయన చెప్పారు. వీరమల్లు కదా, ఆ మాత్రం ఎలివేషన్‌ అవసరమే! పుష్కర సభ అంగరంగ వైభవంగా జరిగిందనీ, లక్షలాది జనసందోహంతో పొంగిపొరలిందనీ యెల్లో మీడియా వేనోళ్ల పొగిడింది.యెల్లో మీడియా సాధారణంగా చంద్రబాబుకూ, ఆయన పార్టీకీ మాత్రమే పరిమితం చేసే ప్రచార గౌరవాన్ని పవన్‌ సభకు కూడా కల్పించి ఔదార్యాన్ని చాటుకున్నది. అందులో ఒక పత్రిక సభలో జనగణన కూడా చేసింది. సభలో జనం కూర్చోవడానికి 14 ఎకరాలు కేటాయించారనీ, ఆ స్థలంలో లక్షలాదిమంది కిక్కి రిసిపోయారని రాసింది. జనం కిక్కిరిసి కూర్చుంటే ఎకరాకు ఐదు వేల మందిని లెక్కవేయడం ఆనవాయితీ. అంతకంటే ఐదు రెట్లు లేదా పది రెట్లు ఎక్కువగా కిక్కిరిశారని యెల్లో మీడియా చెబుతున్నది. ఏమో గుర్రం ఎగరావచ్చు! ఎవరికీ అభ్యంతరం లేదు. జనం కూర్చోవడానికి కేటాయించిన స్థలం 14 ఎకరాలు కాదని, తొమ్మిదెకరాలు మాత్రమేనని స్థానికుల సమాచారం. ఆ స్థానికులు గిట్టనివారు కావచ్చు. యెల్లో మీడియా రాసిందే అక్షర సత్యం కావచ్చు. సభ విజయవంతమైనందుకు పవన్‌ కల్యాణ్‌కు సనాతనాభివందనాలు!ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ అధికారంలో భాగస్వామి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక ఎన్నికల హామీల అమలు గురించో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల గురించో మాట్లాడుతారని జనం ఆశించడం సహజం. కానీ, అటువంటి ఆశలకు ఆయన అవకాశం ఇవ్వలేదు. కాలు వల కింద కూడా ఎండిపోతున్న పంటల గురించి ఆయన మాట్లాడలేదు. చెమటోడ్చి తెచ్చిన పంటలకు పడిపోతున్న ధరల గురించీ ఆయన మాట్లాడలేదు. అవసరమైన ఔషధా లతో, అందుబాటులో వైద్యులతో తొమ్మిది నెలల కిందటి దాకా ధైర్యం నింపిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడు వెలవెల బోతున్న వైనం కూడా ఆయన ప్రసంగంలో చోటు చేసుకోలేదు.అధోముఖయానం చేస్తున్న జీఎస్టీ వసూళ్ల సాక్షిగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం గురించిన ప్రస్తావనే రాలేదు. పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిన విద్యా విప్లవానికి ఎందుకు కళ్లెం వేశారన్నదానిపై వివరణే వినిపించ లేదు. డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఇంటర్‌ విద్యార్థుల కోసం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం నెల తిరక్కుండానే పరమ నాసిరకంగా ఎందుకు దిగజారిందో ఆయన చెప్పలేదు. ఆర్‌బీకే సెంటర్లలో అందుబాటులో లేకుండా ఎరువులూ, విత్తనాలూ ఎందుకు అదృశ్యమయ్యాయో, ఇల్లిల్లూ తిరిగి సేవలందించిన వలంటీర్లు ఏమయ్యారో అనే విషయాల గురించి పవన్‌ మాట్లాడలేదు.ఎమ్మెల్యేలూ, నాయకులూ జనం మీద పడి దోచుకుతింటున్నారని యెల్లో మీడియానే కోడై కూస్తున్నది. పంపకాల్లో తేడా లతో కూటమి నాయకులు కాట్లాడుకుంటున్నారని కూడా పచ్చ కోడి గూడెక్కి కూస్తున్నది. అధికారులు కలెక్షన్‌ కౌంటర్లు తెరిచి అక్కడ వారి సతీమణుల్ని కూర్చోబెడుతున్నారని కూడా ఆరోప ణలు చేస్తున్నది. ఇటువంటి కీలక విషయాల జోలికి ఆయన వెళ్లలేదు. లౌకిక విషయాల గురించి ఆయన మాట్లాడ దలుచు కోలేదు. ఆయన ప్రసంగమంతా అలౌకిక పారవశ్యమే!ఈ సభ ద్వారా ఆయన మూడు అంశాలను చెప్పదలుచు కున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మొదటి నుంచీ ఆయన రాజకీయ ప్రయాణమంతా సిద్ధాంతబద్ధంగానే సాగిందని జనం నమ్మాలనేది ఆయన మొదటి పాయింట్‌. బాల్యం నుంచే తాను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పుకోవడం, తద్వారా ఆ శ్రేణుల్లో అగ్రభాగాన నిలబడాలని కోరుకోవడం రెండో పాయింటు. కొందరు విశ్లేషకులు, మరికొందరు మీడియా వ్యక్తులు ఊహిస్తున్నట్టు కూటమిలో విభేదాలేమీ ఉండబోవనీ, అక్కడ మోదీకీ – ఇక్కడ బాబుకూ విధేయుడనే అనే సందేశాన్ని శ్రేణులకు పంపించడం మూడో పాయింటు.లెఫ్ట్‌ నుంచీ సెంటర్‌కూ, అక్కడి నుంచి రైట్‌కూ తన సిద్ధాంత విధేయత మారిందని మీడియాలో వస్తున్న విమర్శలపై పవన్‌ కల్యాణ్‌ అసహనం వ్యక్తం చేశారు. చేగువేరాను తాను అభిమానించడానికి కారణం అతను కమ్యూనిస్టు కావడం కాదట! వైద్యవృత్తిని వదిలేసి విప్లవకారుడుగా మారినందు వల్లనే అభిమానించానని చెప్పుకొచ్చిన పవన్‌ కల్యాణ్‌ భాషణపై సీపీఎం అగ్రనాయకుడు బీవీ రాఘవులు వ్యంగ్యంగా స్పందించారు. చేగువేరా మెడిసిన్‌ చదివిన మాట నిజమే కానీ, ఆయన వైద్యవృత్తిలో ఎప్పుడున్నారో నాకైతే తెలియదన్నారు. నిజంగానే వైద్యుడిగా చే ప్రాక్టీస్‌ చేసిందేమీ లేదు. అంతర్జాతీయ విప్లవ కారుడుగానే ఆయన ప్రసిద్ధుడు. చేగువేరా మీద అభిమానానికి పవన్‌ చెప్పిన కారణమే నిజమైతే, విప్లవాలు – యుద్ధాల వీధి గుమ్మాల్లో నిలబడి వైద్యసేవలందించిన డాక్టర్‌ నార్మన్‌ బెథూన్, డాక్టర్‌ ద్వారకానాద్‌ కోట్నిస్‌ల అభిమానిగా ఆయన మారి ఉండాలి. అసలు ప్రాక్టీసే చేయని చేగువేరాను విప్లవకర వైద్యుని కోటాలో అభిమానించడం అనే కథ సరిగ్గా అతకలేదు.తాను బాల్యం నుంచే సనాతనవాదినని పవన్‌ ఈ సభలో చెప్పుకున్నారు. సనాతన ధర్మం తన రక్తంలోనే వుందని చెప్పారు. పధ్నాలుగేళ్ల వయసు నుంచే దీక్షలు చేస్తున్నట్టు కూడా చెప్పారు. తనపై సినిమాల ప్రభావం బాగా ఎక్కువని కూడా పవన్‌ అంగీకరించారు. సినిమాలు, కథలు, నవలలతో బాగా ప్రభావితమయ్యే వ్యక్తులు కొందరు వాటిలోని పాత్రలతో తమను పోల్చుకోవడం అనే ఫ్యాంటసీలో మునిగి తేలుతుంటారు. చేగువేరా ప్రభావం బాగా ఉన్న రోజులో తమ తండ్రి గారు కమ్యూనిస్టని పవన్‌ చెప్పేవారు. అంతటితో ఆగకుండా, నానమ్మ దీపారాధన చేస్తుంటే ఆ దీపంతో నాన్నగారు సిగరెట్‌ కాల్చుకునేవారని కూడా ఒక సందర్భంలో ఆయన చెప్పారు. ఇంతకన్నా అవగాహనా రాహిత్యం ఇంకొకటి ఉండదు. కమ్యూనిస్టు లంటే దైవదూషకులనే అర్థం ఇందులో స్ఫురిస్తున్నది. కమ్యూనిస్టు అయినంత మాత్రాన నాస్తికుడై ఉండాలనేదేమీ లేదు. నాస్తికుడైనంత మాత్రాన దైవదూషణ చేస్తారనీ, అవమానిస్తా రనీ అర్థం కాదు. వారి వారి విశ్వాసాలకు, నమ్మకాలకు కట్టుబడి ఉంటారంతే! దైవదూషణ వంటి పనులకు విశ్వాసాలతో సంబంధం లేదు. అది వ్యక్తిగతం. పూజా పునస్కారాలు చేసే సంప్రదాయ కుటుంబాల్లో పుట్టిన నిగమశర్మ వంటి వారి కథలు కూడా మనం విన్నాము.ఇప్పుడాయన సనాతన ధర్మ ప్రభావానికి లోనైన తర్వాత కుటుంబ కథలో కొంత మార్పు చేశారు. కేవలం ఇరవయ్యేళ్ల వయసులోనే నాన్నగారు కమ్యూనిస్టు భావజాలంతో ఉండే వారని, ఆ తర్వాత రామభక్తుడిగా మారారని పిఠాపురం సభలో పవన్‌ చెప్పారు. తన చిన్నతనం నుంచే ఇంట్లో రామనామ జపం వినిపించేదని ఆయన అన్నారు. తన సనాతనధర్మ నిబద్ధతపై ఎవరూ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఈ దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని మరోసారి ఆవేశం ప్రదర్శించారు. ఇదంతా ఎందుకంటే, తాను చిన్నతనం నుంచీ సిద్ధాంత నిబ ద్ధతతోనే ఉన్నాననీ, ఆ సిద్ధాంతం సనాతన ధర్మమేననీ ఇప్పు డాయన సవరణ చేయదలుచుకున్నారు.చేగువేరా కమ్యూనిస్టని కాదు... మంచి వైద్యుడూ, విప్లవ కారుడైనందువల్ల అభిమానించారు. మరి శ్రీశ్రీ, దాశరథి,శేషేంద్ర వంటి వారి సంగతేంది? అవకాశం దొరికిన ప్రతిసారీ వారి కవితా పంక్తుల్ని వల్లెవేయడం పవన్‌కు అలవాటు. వారు సనాతనవాదులా? సామ్యవాదులా? పిఠాపురం సభలో కూడా దాశరథినీ, శ్రీశ్రీని ఆయన తలచుకున్నారు. ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’’ అనే దాశరథి గేయం సామ్యవాద గీతమా? సనాతనవాద గీతమా?. ప్రసంగాన్ని ముగిస్తూ శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ‘అవతారం’ కవితను ఆసాంతం చదివి వినిపించారు. ‘‘యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఖణేల్‌మన్నాయి / నరకలోకపు జాగిల మ్ములు / గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి / ఉదయ సూర్యుని సప్త హయములు / నురుగులెత్తే పరుగు పెట్టేయి / కనకదుర్గా చండసింహం జూలు దులిపీ, ఆవులించింది...’’ ... ఇలా పురాణ ప్రతీకలతో సాగిపోతుందా కవిత.ఇంతకాలం ఈ ప్రతీకలన్నీ ప్రభవించబోయే విప్లవానికి సూచికలుగా భావించారంతా! మరి సనాతన ధర్మ పరిరక్షణా యాత్రికునికి ఈ కమ్యూనిస్టు విప్లవ ప్రతీకలెందుకో! ఆయన విడమరిచి చెబితే తప్ప సామాన్యులకు అర్థం కాదు. ఆయన ప్రసంగంలో ఒకపక్క చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తు తూనే మోదీ తరఫున వకాల్తా పుచ్చుకొని తమిళనాడులోని డీఎమ్‌కే పార్టీ మీద దాడి చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేయబోతున్నదనీ, దీనిపై ఐక్యంగా పోరాడదామనీ ఆ పార్టీ వాళ్లు వాళ్ల ప్రయత్నమేదో చేస్తున్నారు. బీజేపీ దీర్ఘకాల లక్ష్యాలకు ఇటువంటి చిన్నచిన్న ప్రయత్నాలు కూడా విఘాతం కలిగిస్తా యని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. వారి మనసెరిగి పవన్‌ ప్రసంగించారు. అప్పుడెప్పుడో చిన్నతనంలో ఆయన మద్రా స్‌లో ఉన్నప్పుడు తమిళుడెవరో ‘గొల్టీ’ అని గిచ్చాడట! దాన్ని ప్పుడు గుర్తుచేసుకున్నారు.పవన్‌ సభ ప్రారంభానికి ముందే చంద్రబాబు, లోకేశ్‌ బాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యెల్లో మీడియా ఆ సభకు పూర్ణకుంభ స్వాగతం పలికింది. ఈ మూడు పార్టీల కూటమిలో లుకలుకలున్నాయనీ, విడిపోతాయనీ, బీజేపీ – జన సేన కలిసి ఒక కూటమిగా ఏర్పడుతాయనీ ఊహిస్తున్న విశ్లేష కులు ఇప్పటికైనా తమ ఆలోచనల్ని సరిదిద్దుకోవాలి. విభేదా లేమీ లేవు. ముగ్గురూ కలిసి పనిచేస్తారు. బీజేపీ–సంఘ్‌ పరి వార్‌ల దీర్ఘకాలిక లక్ష్యానికి సహకరిస్తూనే మిగిలిన ఇద్దరు ఎవరి ఇంటిని వాళ్లు చక్కదిద్దుకుంటారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం లోకేశ్‌ను సీఎం కుర్చీలో త్వరగా కూర్చోబెట్టాలనే ఒత్తిడి బాబు మీద పెరుగుతున్నది. ఆ పరిస్థితుల్లో డిప్యూటీగా ఉండటం పవన్‌కు ఇబ్బంది కనుక ఆయన కేంద్రానికి వెళతారనీ, వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిన బీజేపీ తరఫున సనాతన ప్రచారానికి ఆయనను నియోగిస్తారని తెలుస్తున్నది. పవన్‌ స్థానంలో నాగబాబు రాష్ట్ర కేబినెట్‌లోకి రావచ్చు. జనసేన కార్య కర్తలు ఇంతకంటే పెద్ద దృశ్యాన్ని ఆశిస్తే నిరాశ తప్పకపోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

CM Revanth Reddy Comments in motion of thanks to Governor speech2
హద్దు మీరితే ఖబడ్దార్‌: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘సోషల్‌ మీడియాలో భాష చూడండి. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం. లేదంటే ఒక్కడు కూడా బయట తిరగలేడు. హద్దు దాటితే ఊరుకోబోం. మీడియా మిత్రులు, మీడియా సంఘాలు.. మీరైనా చెప్పండి. జర్నలిస్టులు ఎవరో మీరే జాబితా ఇవ్వండి. జాబితాలో లేనివాడు జర్నలిస్టు కాడు. జర్నలిస్టు కానోడిని క్రిమినల్‌గానే చూస్తాం. క్రిమినల్స్‌కు ఎట్లా జవాబు చెప్పాల్నో అట్లానే చెప్తాం. జర్నలిస్టు ముసుగేసుకుని వస్తే.. ముసుగుతీసి ఒక్కొక్కడిని బట్టలూడదీసి కొడతాం, తోడ్కలు తీస్తా..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తాను సీఎం కురీ్చలో ఉన్నానని, అందువల్ల ఊరుకుంటానని అనుకుంటున్నారని.. కానీ ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నేనూ మనిషినే.. చీమూనెత్తురు ఉన్నాయి. నన్ను తిట్టిన తిట్లకు మీపేరు పెట్టుకుని చూడండి. నేను ఓపికతో ఉన్నా.. కేసీఆర్‌ మీ పిల్లలకు బుద్ధిచెప్పు.. హద్దు దాటితే, మాటజారితే అనుభవిస్తరు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. కోర్టుకు పోతే బెయిల్‌ వస్తుందని అనుకుంటున్నారు. అవసరమైతే చట్టాన్ని సవరిస్తాం. ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతరేస్తం. చట్టపరిధిలో అన్ని చర్యలు ఉంటాయి. సోషల్‌ మీడియాపై చర్చ పెట్టండి. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బతింటుంది. దీనిపై చట్టం చేద్దాం. ఇది నా ఒక్కరి వేదన కాదు.. అందరి ఆవేదన. స్వీయ నియంత్రణతోపాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి. ఒకరోజు దీనిపై చర్చ పెట్టాలి. సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఈ అంశంపై దృష్టి పెట్టాలి. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు ఆడుతారా? రాష్ట్రంలో కులగణనను 1931 తర్వాత ఇప్పుడు మేమే చేశాం. ఈ సర్వేలో 96.9 శాతం మంది పాల్గొన్నారు. మిగతావారి కోసం మరో అవకాశం ఇచ్చాం. కానీ బీఆర్‌ఎస్‌ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కుటుంబం మొత్తం అబద్ధాలతోనే బతుకుతున్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకే కులగణనపై అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలపై జీఎస్టీ లేదని ఇష్టమున్నట్టు అబద్ధాలు ఆడుతారా? ప్రధాని మోదీకి చెప్పి అబద్ధాల మీద కూడా ట్యాక్స్‌ వేయించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని కోరుతున్నాను. నామీద కోపం ఎందుకు ఉంటుంది? మేం తెలంగాణ సంస్కృతిని గౌరవించాం. తెలంగాణ తల్లిని సచివాలయం లోపల ప్రతిష్టించాం. నామీద అన్ని వర్గాలకు కోపం ఉందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, రైతులకు, యువతకు 15 నెలల్లోనే ఎన్నో చేశాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే కార్యక్రమం చేపట్టాం. రైతులకు రుణమాఫీ, రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. యువతకు ఉద్యోగాలిస్తున్నాం. గ్రూప్స్‌ పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేస్తున్నాం. నామీద ఎందుకు కోపం ఉంటుంది? 15 ఏళ్లు పైబడ్డ వాహనాలు తిరగొద్దు హైదరాబాద్‌ నగరంలో ప్రతిరోజు 1,600 కొత్త వాహనాలు వస్తున్నాయి. ఇంటికి నాలుగు వాహనాలు ఉంటున్నాయి. దీనితో ట్రాఫిక్‌ సమస్య పెరుగుతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, కొత్త రోడ్లు వేసినా పరిస్థితిలో మార్పు రాదు. ప్రజా రవాణాను పెంచుతున్నాం. కాలుష్యం నుంచి హైదరాబాద్‌ను కాపాడాలి. మరో ఢిల్లీ కాకుండా చూడాలి. నగరంలోని 3 వేల డీజిల్‌ ఆర్టీసీ బస్సులను గ్రామాలకు పంపి.. ఇక్కడ ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకొస్తం. 15ఏళ్లు పైబడిన వాహనాలను నగరంలోకి అనుమతించం. పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ ఆవలికి తరలిస్తాం. పాతబస్తీలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ సూచన మేరకు లాల్‌దర్వాజా ఆలయం అభివృద్ధికి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.20కోట్లు కేటాయిస్తున్నా. ఈ మేరకు జారీ చేసే జీవోలో అక్బరుద్దీన్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి..’’అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. డ్రగ్స్‌ విక్రేతల ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్‌ ‘‘రాష్ట్రంలో గంజాయి, కొకైన్‌ వంటి మత్తు పదార్థాలను సరఫరా చేసే పెడ్లర్లు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. డ్రగ్స్‌ విక్రయించే వారి ఇళ్లకు కరెంటు, నీటి సరఫరా నిలిపివేస్తాం. రూ.250 కోట్లు వెచ్చించి యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరోను పటిష్టం చేశాం. ఇటీవల దుబాయిలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పోస్టుమార్టం వివరాలన్నీ తెప్పించాం. డ్రగ్స్‌కు సంబంధించిన గుట్టంతా మా వద్ద ఉంది. స్కూళ్లలో డ్రగ్స్‌ వినియోగిస్తే ఆ స్కూల్‌ యాజమాన్యానిదే బాధ్యత. వారిపై కేసులు పెట్టాలని నిర్ణయించాం. లక్షలకొద్దీ ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లలో ఏం జరుగుతోందో, పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో యాజమాన్యమే పర్యవేక్షించాలి. ప్రతి స్కూల్‌లో సైకాలజీ టీచర్‌ను తప్పనిసరిగా నియమించుకోవాలి. స్కూళ్లు, కాలేజీల వద్ద ప్రత్యేకంగా నిఘాపెడతాం.’’

WPL-2025: Mumbai Indians win over Delhi Capitals3
WPL-2025: డబ్ల్యూపీఎల్‌ విజేతగా ముంబై ఇండియన్స్

డబ్ల్యూపీఎల్‌-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీపై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్య చేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ వెనుక పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్‌ జట్టు ఈ సీజన్‌కి విజేతగా నిలిచింది. ఈ విజయంతో రెండోసారి ముంబై జట్టు టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) టాప్‌ స్కోరర్‌గా నిలిచారు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీప‌ర్‌), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీప‌ర్‌), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి

Ambati Rambabu Comments On Pawan And Balineni Srinivasa Reddy4
‘బాలినేని ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు’

సాక్షి, తాడేపల్లి: పిఠాపురం జయకేతనం సభలో పవన్‌ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్‌ జనసేన స్థాపించారని.. పవన్‌ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కాపు సామాజికవర్గంపై చంద్రబాబు అనేక దుశ్చర్యలు చేశారు. జనసేన నిర్వహణను చూసేది చంద్రబాబే. జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు మనుషులే. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ ఏమైంది?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పిఠాపురంలో పవన్‌ ఎందుకు మాట్లాడలేదు?. గతంలో బీజేపీ నేతలపై పవన్‌ అనేక విమర్శలు చేశారు. పవన్‌ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడు. రాష్ట్రంలో జనసేన నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. పవన్‌ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని.. పవన్‌ ఆయన అన్నకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని..బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలకు అంబటి కౌంటర్‌ ఇస్తూ.. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చరిత్ర ఏంటి?. అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని.. ఆయన ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు. జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన బాలశౌరి కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి రావటానికి 16 ఏళ్లు పట్టింది. అదికూడా అన్ని పార్టీలు కలిస్తేనే ఆ అవకాశం వచ్చింది. వైఎస్‌ జగన్ ఢిల్లీని ఢీకొట్టి, పోరాటం చేసి పదేళ్లకే సీఎం అయ్యారు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘టీడీపీ కోసం పుట్టిన పార్టీ జనసేన. చంద్రబాబును కాపులు నమ్మరు. కాబట్టి జనసేన పార్టీని పవన్ చేత ఏర్పాటు చేయించారు. జనసేనను నడిపేదంతా చంద్రబాబే. రెండు పార్టీల మద్దతుతో పవన్‌కు 21 సీట్లు వచ్చాయి. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. జనసేనలో ఉన్నవారంతా చంద్రబాబు మనుషులు, వైఎస్సార్‌సీపీ బహిష్కరించిన వారే..రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయబోతున్నారో చెప్ప లేదు. ఎర్రకండువా నుండి కాషాయ రంగు వేసుకునే వరకు పవన్ వచ్చారు. అసలు ఎప్పుడు ఏ వేషం వేస్తారో జనానికి అర్థం కావటం లేదు. ఏ వ్యూహం, సిద్దాంతం లేకుండా మారిపోతున్న వ్యక్తి పవన్. జనసేన నేతలంతా ఇసుక, మద్యం దోపిడీలో మునిగి పోయారు. బియ్యం, విజిలెన్స్, దాడులు, డబ్బులు.. ఇదే పనిలో ఒక మంత్రి ఉన్నారు. ఇంత దోపిడీ చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నారు?అధికారం, సినిమా గ్లామర్ ఉన్నందున జనం వస్తారు. అంతమాత్రానికే ఏదేదో ఊహించుకోవద్దు. పవన్ సీఎం అయ్యే అవకాశం లేదని కాపులకు సినిమా క్లయిమాక్స్ లో తెలుస్తుంది. నాగబాబుకు కొత్తగా ఎమ్మెల్సీ వచ్చేసరికి ఏవేవో కలలు కంటున్నారు. ఎన్నికలలో అవసరం తీరాక వర్మను తరిమేశారు. వర్మకి కనీసం మర్యాద అయినా ఇవ్వండి. పిఠాపురాన్ని మీ అడ్డా అనుకోవద్దు. ఉత్తరాది అహంకారం అంటూ అవకాశం వాద రాజకీయాలు చేయటం పవన్‌కే చెల్లింది’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

Hindi Controversy: Prakash Raj Is Another Counter To Pawan Kalyan5
గెలవక ముందు ‘జనసేనాని’.. గెలిచాక 'భజన సేనాని’: ప్రకాశ్ రాజ్

సాక్షి, అమరావతి: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న(శుక్రవారం) రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, పవన్ గెలవక ముందు ‘‘జనసేనాని’’.. గెలిచిన తరువాత ‘‘భజన సేనాని" అంతేనా? అంటూ సెటైర్లు వేశారాయన. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టులను ట్వీట్‌కి ప్రకాశ్‌రాజ్‌ జత చేశారు.‘‘హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ అంతకుముందు మరో ట్వీట్‌ కూడా చేశారు ప్రకాష్‌రాజ్‌. ‘‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్‌..’ అంటూ కామెంట్స్‌ చేశారాయన.కాగా, పవన్‌ కల్యాణ్‌ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే కూడా స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్‌ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్‌ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.“ గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా #justasking pic.twitter.com/EqjtqK6qFA— Prakash Raj (@prakashraaj) March 15, 2025‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్‌ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్‌ హఫీజుల్లా తేల్చి చెప్పారు.

Eknath Shinde Wanted To Join Congress MP Sanjay Raut6
‘ఏక్‌నాథ్‌ షిండే కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపారు’

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఒకానొక సమయంలో కాంగ్రెస్ లో జాయిన్‌ అయ్యేందకు మొగ్గు చూపారన్నారు శివసేన(యూబీటీ) నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు సంజయ్ రౌత్. ఆ విషయం తనతో పాటు కాంగ్రెస్‌లో కొంతమంది నేతలకు సైతం తెలుసంటూ ఎంపీ సంజయ్ రౌత్ నొక్కి మరీ చెప్పారు.ఈ క్రమంలోనే దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తో ఏక్‌నాథ్‌ షిండే బేరసారాలు జరపారన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి అహ్మద్ పటేల్ మన మధ్య లేరని, ఇంకో సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కు ఈ విషయం తెలుసన్నారు. దీనిపై ఇంతకు మించి తాను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు సంజయ్ రౌత్.అయితే సంజయ్ రౌత్ కామెంట్లపై పృథ్వీరాజ్ చౌహాన్ ను మీడియా సంప్రదించగా, ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. మరొకవైపు ఏక్‌నాథ్‌ షిండే కూడా అందుబాటులో లేరు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే ఏక్ నాథ్ షిండ్, పృథ్వీరాజ్ చౌహాన్ లు స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.2౦22లో శివసేన(యూబీటీ) నుంచి ఏక్‌నాథ్‌ షిండే దూరం కావడంతో పాటు ప్రత్యేక వర్గంతో మహాయుతి కూటమిలో జాయిన్ అయ్యారు. దాంతో శివసేన రెండు ముక్కలైంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు ఏక్‌నాథ్‌ షిండే సీఎం అయ్యారు. ఆపై 2024లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో పాటు అందులో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు.కొన్ని రోజుల క్రితం ఫడ్నవీస్, ఏక్‌నాథ్‌ షిండేల మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ ఏక్‌నాథ్‌ షిండే మీడియా ముఖంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు సైతం చేశారు. తన బలమేమిటో కొంతమంది తెలుసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తన చరిత్ర ఏమిటో గతాన్ని అడిగితే చెబుతుందంటూ కూటా శివసేనను ముక్కలు చేసిన చరిత్రను చెప్పుకొచ్చారు. ఇదే వార్నింగ్ మహారాష్ట్ర బీజేపీకి కూడా పరోక్షంగా ఇస్తున్నారా? అని ఏక్‌నాథ్‌ షిండే వ్యాఖ్యల ద్వారా అనుమానం కల్గింది.

Ishan Kishan smashes 16-ball fifty in SRH intra-squad match7
ఇషాన్ కిష‌న్ విధ్వంసం.. 16 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ! వీడియో వైర‌ల్‌

ఐపీఎల్‌-2025 సీజ‌న్ కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్ 18వ ఎడిషన్‌ను విజయంతో ప్రారంభించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. అయితే ఇంకా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఇంకా జ‌ట్టుతో చేర‌లేదు. కాలి మ‌డ‌మ గాయంతో బాధ‌ప‌డుతున్న క‌మ్మిన్స్‌.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. క‌మ్మిన్స్ ఒక‌ట్రెండు రోజుల్లో జ‌ట్టుతో చేరే అవ‌కాశ‌ముంది.ఇషాన్ కిష‌న్ విధ్వంసం..ఇక ప్రాక్టీస్‌లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ శనివారం ఇంట్రా-స్క్వాడ్ సిమ్యులేషన్ మ్యాచ్ ఆడింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఎస్‌ఆర్‌హెచ్‌-ఎ, ఎస్‌ఆర్‌హెచ్‌-బి జట్లగా విడిపోయారు. ఈ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌-ఎకు ప్రాతినిథ్యం వహించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. బి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కిషన్‌.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.ఈ క్రమంలో ఇషాన్ 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. మొత్తంగా 30 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. 10 ఓవర్ల త‌ర్వాత‌ వేరే ఆట‌గాళ్ల‌కు అవ‌కాశ‌మిచ్చేందుకు ఔటవ్వకుండానే బయటకు వెళ్లిపోయాడు. అతనితో పాటు అభినవ్ మనోహర్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌-ఎ టీమ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 261 పరుగులు చేసింది. కిష‌న్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను స‌న్‌రైజ‌ర్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో కిష‌న్‌ను రూ.11.25 కోట్ల భారీ ధ‌ర‌కు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ఇషాన్ కిష‌న్ గ‌త కొన్ని సీజ‌న్ల‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఈ మెగా వేలానికి ముందు అత‌డిని ముంబై రిటైన్ చేసుకోలేదు.చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిట‌ల్స్‌లోకి విధ్వంసక‌ర వీరుడు! Ishan Kishan scored a half-century in just 16 balls during SRH's intra-squad match😎📸💥@ishankishan51 #IshanKishan #SRH #IPL2025 #PlayWithFire pic.twitter.com/Vc1UiJAEZM— Ishan's🤫🧘🧡 (@IshanWK32) March 15, 2025ఐపీఎల్‌-2025కు ఎస్‌ఆర్‌హెచ్ జట్టుఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా , అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, వియాన్ ముల్డర్, కమిందు మెండిస్, సచిన్ హేషన్ బేబీ, అనికేత్, హెన్రిచ్‌ క్లాసెన్ (వికెట్ కీపర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ , నితీష్ కుమార్ రెడ్డి

Samantha As Producer Titled Shubham Movie8
సమంత కొత్త జర్నీ.. 'బంగారం' కంటే 'శుభం' ముందు

చాన్నాళ్ల నుంచి సమంత తెలుగు సినిమాలు చేయట్లేదు. చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి'లో నటించిన సామ్.. ఆ తర్వాత 'సిటాడెల్' వెబ్ సిరీస్ చేసింది. అది తప్పితే కొత్త ప్రాజెక్టులేం చేయలేదు. దీంతో సమంత ఇక కొత్త చిత్రాలకు స్వస్తి చెప్పేసిందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు 'శుభం'తో కొత్త ప్రయాణం ప్రారంభించింది. ఈ మేరకు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ))ఇప్పటివరకు సమంత అంటే మనకు తెలిసింది హీరోయిన్ మాత్రమే. కానీ ఇకపై నిర్మాతగానూ వరస సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఉంది. ఈ క్రమంలోనే తొలి ప్రాజెక్టుగా 'శుభం' ప్రకటించింది. పలువురు యువ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.సమంత.. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో గతంలోనే 'నా ఇంటి బంగారం' అని ఓ మూవీ ప్రకటించింది. కానీ అది ఇప్పుడు ఏ దశలో ఉందో.. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికే 'శుభం' షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Guntur Mayor Kavati Manohar Naidu Resigns9
‘కూటమి’ వేధింపులు.. గుంటూరు మేయర్‌ రాజీనామా

సాక్షి, గుంటూరు: గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు రాజీనామా చేశారు. కూటమి సర్కార్‌ తనను ఎంతగానో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు పంపా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్‌ కమిటీ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు కూడా తాళం వేశారు. నెలరోజుల క్రితం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు మా కార్పొరేటర్లను కొనుగోలు చేశారు. కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరించారు’’ అని మనోహర్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ నెల 17 తేదిన స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. స్టాండింగ్ కమిటికి నేనే ఛైర్మన్‌ను. స్టాండింగ్ కమిటీలో ఏం ప్రతిపాదనలు ఉండాలి. ఎక్కడ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అనేది నేను నిర్ణయించాలి. కానీ నాకు తెలియకుండా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు తాళం వేశారు. నేను ఛాంబర్‌కు వెళ్తే అధికారులు డ్రామాలు ఆడుతున్నారు.‘‘గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటినుంచి ఇంత దారుణమైన అవమానం ఏ మేయర్‌కు జరగలేదు. నాపై కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ దయవల్లే నేను మేయర్‌ అయ్యాను. పీవీకే కూరగాయలు మార్కెట్ పేరు మార్చితే చూస్తూ ఊరుకోం’’ అని మనోహర్‌ నాయుడు హెచ్చరించారు.

Ranya Rao writes Letter, Says She made to Sign Blank Pages by DRI Officers10
అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు లేఖ

కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తానసలు బంగారం అక్రమ రవాణా చేయలేదని యూటర్న్‌ తీసుకుంది. తాను గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేసినట్లుగా అధికారులే బలవంతంగా ఖాళీ పేపర్లపై సంతకం చేయించారని తెలిపింది. తనకు న్యాయం చేయండంటూ డీఆర్‌ఐ (Directorate of Revenue Intelligence) అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాసింది. ఒత్తిడి చేశారుఇటీవల బెంగళూరు ఎయిర్‌పోర్టులో దాదాపు రూ.17 కోట్ల విలువైన బంగారంతో అధికారులకు పట్టుబడింది నటి రన్యారావు. ఆమెను అరెస్ట్‌ చేసి విచారించగా బంగారం అక్రమ రవాణా చేసినట్లు అంగీకరించింది. ఇంతలో తన తప్పే లేదంటూ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆ లేఖలో ఇంకా ఏముందంటే.. నేను ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదు. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారు. పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టేవరకు నరకం చూపించారు. స్మగ్లింగ్‌ చేసినట్లుగా ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. ఖాళీ పేపర్లపై సంతకం15 సార్లు నా చెంప పగలగట్టారు. బలవంతంగా సంతకం చేయించారు. నాపై దాడి చేసిన అధికారులను నేను గుర్తుపట్టగలను. శారీరక హింస, మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. వారు చెప్పినట్లుగా 50-60 పేజీలను చదవకుండానే సంతకం చేశాను. అలాగే మరో 40 తెల్లకాగితాలపైనా సంతకం చేయించారు. దయచేసి ఈ కేసులో పారదర్శక విచారణ జరిపించి నాకు న్యాయం చేయండి అని లేఖలో పేర్కొంది. ఇకపోతే ఇటీవల రన్య కస్టడీలో ఉన్నప్పటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో రన్య కళ్ల కింద చర్మం కమిలిపోయి ఉండటం స్పష్టంగా కనిపించింది.(చదవండి: నితిన్‌ వల్లే ఐటం సాంగ్‌ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల)ఏం జరిగింది?నటి రన్యారావు మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది. ఈమెకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు తండ్రి పేరును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. విచారణలో స్మగ్లింగ్‌ చేయడం ఇదే మొదటిసారి అంటూ నేరాన్ని అంగీకరించిన ఆమె ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడంతో కేసు ఆసక్తికరంగా మారింది. ఇటీవల రన్యారావు బెయిల్‌ కోసం బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టును ఆశ్రయించగా.. బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ క్రమంలో ఆమె ఉన్నతాధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.చదవండి: హీరో విజయ్‌ 10 సినిమాలు రిజెక్ట్‌ చేశా: మ్యూజిక్‌ డైరెక్టర్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
రాళ్లతో హోలీ.. 42 మందికి గాయాలు.. ఎక్కడంటే?

దుంగార్‌పూర్‌: రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో హోలీవేడుకలను ర

title
‘ఏక్‌నాథ్‌ షిండే కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపారు’

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఒకానొక సమ

title
పవన్‌ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే రియాక్షన్‌

చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బహుభాష వ్

title
Vadodara: ‘తాగలేదు.. గుంతల వల్లే కారు అదుపు తప్పింది’

వడోదర: గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కారును వేగంగా నడిపి, ఒక మహిళ మృతికి క

title
భారత్‌కు ఆ రెండు టెస్లా కార్లు!.. సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు

టెస్లా భారతదేశంలో తన కార్ల విక్రయాలను ప్రారభించడానికి సిద్ధమైంది.

National View all
title
గెలవక ముందు ‘జనసేనాని’.. గెలిచాక 'భజన సేనాని’: ప్రకాశ్ రాజ్

సాక్షి, అమరావతి: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళన

title
‘రాహుల్‌కు వియాత్నాంపై అంత ఇంట్రెస్ట్ ఏమిటో..?’

న్యూఢిల్లీ: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వియాత్నాం పర్యటనపై బీజేపీ మరోసారి విమర్శల

title
అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు లేఖ

కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) క

title
హోలీ వేళ ఘర్షణలు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు

గిరిడీహ్‌: శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు(

title
మహాకుంభమేళాలో మాయమైన మహిళ తిరిగొచ్చిందిలా..

పట్నా: సోషల్‌ మీడియాతో కొంతమేరకు ముప్పు  పొంచివున్నమాట వాస్తవమే అయినప్

International View all
title
మస్క్‌పై వ్యతిరేకత.. టెస్లా షోరూంలపై కొనసాగుతున్న దాడులు

సలమ్‌: అమెరికాలో టెస్లా షోరూంపై మళ్లీ దాడి జరిగింది.

title
ఉక్రెయిన్‌ సేనలకు పుతిన్‌ హెచ్చరిక.. మీ ప్రాణాలకు గ్యారంటీ లేదంటూ..

మాస్కో: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం

title
నింగిలోకి ఫాల్కన్‌.. వెల్‌కమ్‌ బ్యాక్‌ సునీతా విలియమ్స్‌!

వాషింగ్టన్‌: అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్

title
మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్‌...

ఉత్తమ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ‘50 బెస్ట్‌’ఆవిష్కరించిన ఆసియా ఉత్తమ రెస్టారెం

title
గ్రీన్‌ కార్డు శాశ్వత నివాసానికి... హక్కు కాదు: వాన్స్‌

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ

NRI View all
title
గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్‌.. అమెరికా పౌరసత్వం కట్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసార

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

Advertisement
Advertisement