Top Stories
ప్రధాన వార్తలు

గ్రూప్–2 అభ్యర్థులతో 'బాబు బంతాట'
డ్రామాలో భాగంగానే సీఎం పలుకులు మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతోనే ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్సీ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఈ డ్రామాలో భాగమే. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగళం పేరుతో లోకేశ్ ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ఈ 900 పోస్టులు పూర్తి చేసి ఈ ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేసేశాం అని డబ్బా కొట్టుకోవడానికే ఈ డ్రామాలు. – గ్రూప్–2 అభ్యర్థినిసాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులను అనేక రకాలుగా మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు వారి భావోద్వేగాలతో ఆడుకుంది. ఆదివారం పరీక్ష ఉందనగా.. శనివారం సాయంత్రం వరకు రకరకాల విన్యాసాలతో నాటకాలాడిన తీరు విస్తుగొలుపుతోంది.. ఓ పరీక్ష విషయంలో ఇంతటి గందరగోళం, 8 గంటల ముందు వరకు నాన్చుడు వ్యవహారం ఏపీపీఎస్సీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. బాబు సర్కారు బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అభ్యర్థుల్లో ఆశలు రేపారు. అయితే, పరీక్ష వాయిదా అంటూ ‘సోషల్ మీడియా’లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ శనివారం ఉదయం ఏపీపీఎస్సీ ప్రకటించింది. తర్వాత శనివారం మధ్యాహ్నానికి పరీక్ష వాయిదాకు అనువుగా నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. వాస్తవానికి రోస్టర్ అమలులో సమస్యలున్నాయని, వాటిని సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని, అప్పటిదాకా పరీక్ష వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం కలిసి విజ్ఞప్తులు చేశారు. కానీ, ఏ ఒక్కరూ నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే, కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఎమ్మెల్సీలు హామీ ఇవ్వడంతో ఈ నెల 20వ తేదీ వరకు ఆగారు. కోర్టు గ్రూప్–2 మెయిన్స్ రద్దుకు అంగీకరించకపోవడంతో పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు నేడు యథాప్రకారం జరగనున్నాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం కుదరదని ఏపీపీఎస్సీ చైర్మన్ అనూరాధ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ప్రభుత్వ తీరుపై గ్రూప్ –2 అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని చూసి లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ కూడా కోపంతో రగిలిపోతున్నారు. ఇంత దగా చేసిన కూటమి సర్కారును వదిలిపెట్టకూడదని, ‘బాయ్‌కాట్ ఎలక్షన్’ కాదు.. ఎన్నికల్లో పాల్గొని తగినవిధంగా బుద్ధిచెప్పాలని గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రాడ్యుయేట్స్ తీర్మానించుకుంటున్నారని తెలుస్తోంది. ‘బాయ్‌కాట్ ఎలక్షన్’ నిర్ణయంతో సర్కారు డ్రామాలు.. గ్రూప్–2 మెయిన్స్ నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు సర్కారుకు మొరపెట్టుకున్నారు. కోర్టు తీర్పు అనంతరం నిర్ణయాధికారం ప్రభుత్వ పరిధిలోకి వచ్చినందున రోస్టర్ సవరించే వరకు పరీక్షను వాయిదా వేయాలని ఈనెల 20నుంచి కోరుతున్నారు. అయిన్పటికీప్రభుత్వం స్పందించలేదు. దీంతో అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించింది. ‘‘పరీక్షలను వాయిదా వేయమని గ్రూప్–2 అభ్యర్థుల నుంచి నాకు అనేక అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను అర్థం చేసుకున్నాను. మా న్యాయ బృందాలతో సంప్రదించి, పరిష్కారాన్ని కనుగొనేందుకు అన్ని మార్గాలను అన్వేíÙస్తాము’’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే, శనివారం ఉదయం ఏపీపీఎస్సీ మరో ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఒకే అంశంపై రెండు వ్యవస్థలు భిన్న అభిప్రాయాలను వెల్లడించడంతో అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు. పరీక్ష మరో 14 గంటలు ఉందనగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో రోస్టర్ సమస్యను పరిష్కరించి పరీక్ష నిర్వహించాలని, అప్పటిదాకా మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వ కార్యదర్శి.. ఏపీపీఎస్సీకి రాసినట్టుగా ఓ లేఖ శుక్రవారం తేదీతో శనివారం మధ్యాహ్నం బహిర్గతమైంది. దీనిపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సర్వీస్ కమిషన్ చైర్మన్ అనురాధను తప్పుబడుతూ ఉన్న ఆడియోను లీక్ చేశారు. ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయమంటే ఏపీపీఎస్సీ పట్టించుకోవడం లేదన్నది ఆ ఆడియో సారాంశం. ఈ నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదు? గ్రూప్–2 రిజర్వేషన్లలో రోస్టర్ అమలు తప్పులున్నాయని ఏడాది కాలంగా ప్రచారం చేస్తూ వచి్చన కూటమి ప్రభుత్వంలోని నేతలు కేసు కోర్టు పరిధిలోకి వచ్చేవరకు ఎందుకు మార్చే ప్రయత్నం చేయలేదన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. వాస్తవానికి ఎన్‌డీఏ సర్కారు ఏర్పడి దాదాపు 9 నెలలు పూర్తవుతోంది. గ్రూప్–2 మెయిన్స్ ఒకసారి జూలైకి, మరోసారి డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ క్రమంలో తప్పులు సరిచేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కోర్టుకు సైతం తప్పులు లేవని చెప్పారని, ఒకవేళ తప్పులుంటే సరి చేస్తామని పేర్కొన్నట్టు చెబుతున్నారు. పరీక్ష తేదీ సమీపించే వరకు వాయిదా వేసే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నారు. ఆదివారం పరీక్ష ఉందనగా, శనివారం మధ్యాహ్నం పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ తప్పేంలేదని చెప్పేందుకే ఈ డ్రామా ఆడుతున్నట్టుగా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ తీరుతో సుదూర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరుకావాల్సిన వారు మూడు రోజులుగా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వివాదాలే ‘అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ కేలండర్ ఇస్తాం. నిరుద్యోగులకు మేలు చేసేలా సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తా’మని చెప్పిన ఎన్‌డీఏ కూటమి నాయకులు.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక సర్వీస్ కమిషన్‌ను నీరుగార్చే పనిలో పడ్డారు. ఏడాది పదవీ కాలం ఉండగానే.. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న కమిషన్ చైర్మన్‌ను రాజకీయ కుట్రతో తొలగించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు జరగకుండా వాయిదాలు వేశారు. ఇందులో గ్రూప్–2తో పాటు గ్రూప్–1 మెయిన్స్, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు వంటి కీలమైన 21 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటికి నిర్విరామంగా సిద్ధమవుతున్న దాదాపు 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చేశారు. ఇప్పుడూ గ్రూప్–2 మెయిన్స్ కొన్ని గంటల వ్యవధిలో ఉందనగా రాజకీయం ప్రారంభించారు. ఇందులో సాక్షాత్తూ ‘ముఖ్య’ నేతలే అభ్యర్థుల భావోధ్వేగాలతో ఆడుకోవడం గమనార్హం.ఇప్పటికిప్పుడు మెయిన్స్ వాయిదా వేయలేం : ఏపీపీఎస్సీ చైర్మన్ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను ఇప్పటికిప్పుడు వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ ద్వారా అవసరమైన వివరణ ఇచ్చేందుకు పరీక్షను వాయిదా వేయాలని శనివారం జీఏడీ సర్వీస్ కమిషన్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పైవిధంగా స్పందించినట్టు సమాచారం. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాక.. గంటల వ్యవధిలో వాయిదా వేయాలనడం సబబుకాదని చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం. నేడు గ్రూప్–2 మెయిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాలు సిద్ధంగ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 పేపర్–2 నిర్వహిస్తారు. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంతో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు ఉదయం 9.30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9.45కు కేంద్రాల గేట్లను మూసివేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీల వీరంగంవిజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కోట కూడలిలో శనివారం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీలు వీరవిహారం చేశారు. ఉన్నత విద్యావంతులని కూడా చూడకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. నిరసన శిబిరాన్ని చెదరగొట్టారు. పలువురు అభ్యర్థులను రాత్రి సమయాన జీపుల్లో దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. రోస్టర్ విధానంపై స్పష్టత ఇచ్చాకే గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించాలని కోరిన పాపానికి ప్రభుత్వం పోలీసులతో నిరుద్యోగుల ఆందోళనను అణచివేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. గ్రూప్–2 పరీక్షల్లో రోస్టర్ విధానం ప్రకటించాలని కోరుతూ కోట కూడలి వద్ద అభ్యర్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ఆదేశాలు రాకపోవడంతో సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో కోట వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో వన్‌టౌన్, టుటౌన్ సీఐలు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడలి వద్దకు చేరుకుని నిరుద్యోగులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు.ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటున్నాం..నిరుద్యోగులకు మేలు చేస్తుందని ఆశించి మేమంతా ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా రెండు చెప్పులతో మేం కొట్టుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా రోస్ట్‌ర్ సరిచేయకుంటే మేమంతా పెద్ద ఎత్తున నష్టపోతామంటూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించకుండా మెయిన్స్ నిర్వహిస్తోంది. మా భవిష్యత్‌ను, ఆశలను తుంగలొకి తొక్కిన ఈ ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా మేం బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. – గ్రూప్–2 అభ్యర్థి

SLBC ప్రమాదం.. టన్నెల్‌లో మోకాళ్ల లోతు బురద!
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. రాత్రి పరిస్థితి ఇది..👉ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిన్న రాత్రి 12 గంటలకు వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల లోపలికి వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. ఈ సందర్బంగా మోకాళ్ల లోతు బురద ఉన్నట్టు వారు గుర్తించారు. 👉ఇక, ఈ సొరంగానికి ఇన్‌లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. చిక్కుకున్నది వీరే.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. జేపీ సంస్థకు చెందిన మనోజ్‌కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్ఈ), రోజువారీ కార్మికులు సందీప్‌సాహు (28), జక్తాజెస్ (37), సంతోష్‌సాహు (37), అనూజ్ సాహు (25) ఉన్నారు. రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురుదీప్ సింగ్ (40) సొరంగం లోపల విధుల్లో ఉన్నారు. జమ్మూ, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బయటపడిన వారు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారే.మంత్రుల పర్యవేక్షణ..👉మరోవైపు.. దోమలపెంట వద్దకు నేడు మంత్రులు ఉత్తమ్, జూపల్లి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను మంత్రులు పర్యవేక్షించనున్నారు.ఇటీవలే పనులు పునః ప్రారంభమై... 👉శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్‌ఎల్‌బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్‌లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. 👉ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్‌లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. 👉శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్‌లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్‌బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్‌కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్‌కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్‌లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా..👉సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది.

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆస్తుల వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు మధ్యలో కొంత నిరాశ పర్చినా లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు రావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.వృషభం...ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి విషయాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు విస్తృతం చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించండి.మిథునం...కొత్త వ్యవహారాలు ప్రారంభం నుంచీ విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలై ఆర్థికంగా బలపడతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడి ఊరట చెందుతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నలుపు, ఆకుపచ్చ రంగులు. . గణేశారాధన మంచిది.కర్కాటకం...వ్యవహారాలలో విజయం. అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడతారు. గతానుభవాలు ప్రస్తుతం ఉపయోగిస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు ఫలిస్తాయి. వారం చివరిలో మానసిక అశాంతి. మిత్రులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.సింహం....ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా కొనసాగుతుంది. సన్నిహితుల సహాయం అందుకుని కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీ సిద్ధాంతాలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకుని లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం. వారం చివరిలో. కుటుంబంలో కొన్ని చికాకులు. తెలుపు, నీలం రంగులు. . దేవీస్తోత్రాలు పఠించండి.కన్య....అనుకున్న వ్యవహారాలు పూర్తికి మరింత ్రÔ¶ మిస్తారు. ఆర్థిక వనరులు సమకూరి అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సూచనలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపారాలు పుంజుకుని తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా దృఢవిశ్వాసంతో అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాల వారికి అన్ని విధాలా అనుకూల పరిస్థితి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. పసుపు, గులాబీ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.తుల...చేపట్టిన పనులు పూర్తి కాగలవు. ఆర్థికంగా బలం పుంజుకుని రుణవిముక్తి పొందుతారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలపై కుటుంబంలో అనుకూలత వ్యక్తమవుతుంది. స్థిరాస్తులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల కృషి నెరవేరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య, మానసిక సమస్యలు. నీలం, ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.వృశ్చికం...ఆదాయవ్యయాలు సమానస్థాయిలో ఉండవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండక నిరాశ చెందుతారు. బంధువులతో కొన్ని వివాదాలు నెలకొని మీకు పరీక్షగా నిలుస్తాయి. నిర్ణయాలలో ఎటూతేల్చుకోలేక సతమతమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా మారతాయి. ఉద్యోగాలలో మరింత సమర్థనీయంగా పనిచేయాల్సి ఉంటుంది. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. పసుపు, ఆకుపచ్చ రంగులు. . విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.ధనుస్సు...ముఖ్యమైన వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఎంతోకాలంగా ఉన్న భూవివాదాలు సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ భావాలు పంచుకుంటారు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురుకావచ్చు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుని మీదారికి తెచ్చుకుంటారు. ఊహించని విధంగా వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో సహచరులతో సర్దుబాటు వైఖరి అవలంభిస్తారు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. శివస్తుతి మంచిది.మకరం...అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు అ«ధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరి ఇతరులకు సైతం సాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణాలకు సన్నాహాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చాకచక్యం, నేర్పుగా వ్యవహరించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువుల నుంచి సమస్యలు. తెలుపు, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.కుంభం...సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తులు మీకు చేదోడుగా నిలుస్తారు. సమాజసేవలో పాలుపంచుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులు తమ అంచనాలకు తగినట్లుగా అవకాశాలు సాధిస్తారు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ధైర్యం, ఓర్పుతో ముందడుగు వేసి విజయాలతీరం చేరుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చేయండి.మీనం...ఏ వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితికి చేరతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబీ, నేరేడు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

అమెరికాలో ఉద్యోగులకు మస్క్ బిగ్ షాక్..!
వాషింగ్టన్:అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్ ఇలాన్ మస్క్ పెద్ద షాక్ ఇచ్చారు. ఈ మేరకు మస్క్ శనివారం(ఫిబ్రవరి22) ఎక్స్(ట్విటర్)లో ఒక షాకింగ్ పోస్టు చేశారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్‌కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని బాంబు పేల్చారు. Consistent with President @realDonaldTrump’s instructions, all federal employees will shortly receive an email requesting to understand what they got done last week.Failure to respond will be taken as a resignation.— Elon Musk (@elonmusk) February 22, 2025 మస్క్ తన ట్వీట్లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్ అందాయి. ఈ మెయిల్లో ఐదు బుల్లెట్ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం.ఈ మెయిల్‌కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్‌కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మస్క్ నేతృత్వంలోని ఉద్యోగుల సంఖ్య తగ్గించడంలో డీవోజీఈ మరింత దూకుడుగా వెళ్లాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిన గంటల్లోనే ఉద్యోగులకు మెయిళ్ల రూపంలో షాక్ తగలడం గమనార్హం. అయితే మస్క్ మెయిళ్లపై ఫెడరల్ ఉద్యోగుల యూనియన్ తీవ్రంగా స్పందించింది. చట్టవ్యతిరేకంగా ఉద్యోగులను తొలగిస్తే కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. తాము ఎంతో కష్టపడి ముఖ్యమైన విభాగాల్లో ప్రజలకు సేవ చేస్తుంటే ట్రంప్ మరోసారి తమను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు.

ఇది కుట్రపూరిత నిర్లక్ష్యం!
కాలం కలిసొస్తే కొందరికి అధికారం సంప్రాప్తించవచ్చు. అదృష్టం ఈడ్చితంతే కొందరు సరాసరి సింహాసనం మీదనే కూలబడవచ్చు. నక్కజిత్తులతో, తోడేలు వంచనతో, వెన్నుపోటుతో, మోసపు మాటలతో మరికొందరు ‘పవర్’ఫుల్‌గా మారిపోవచ్చు. కానీ వారందరూ ప్రజానాయకులు కాలేరు. అసలు నాయకుడంటే ఎవరు? అతనెట్లా ఉండాలి?... నమ్మకానికి నిలువెత్తు ప్రతిరూపంలా ఉండాలి. ఆడిన మాట మీద నిలబడే వాడై ఉండాలి. మడమ తిప్పని వాడై ఉండాలి. నిరంతరం జనం గుండె చప్పుళ్లను వినగలిగే విద్యాపారంగతుడై ఉండాలి. సకల జనుల శ్రేయస్సు కోసం పరితపించే తాపసిగా ఉండాలి. అటువంటి ప్రజా నాయకుడికి అధికార హోదాలను మించిన గౌరవం ఉంటుంది. జనం గుండెల్లో కొలువుండే అత్యున్నత హోదా ఉంటుంది. ఆ నాయకుడు వీధుల్లోకి వస్తే జనవాహిని అతని వెంట ప్రవహిస్తుంది. ఆబాలగోపాలం ఆనందోద్వేగాలతో హోరెత్తుతుంది. అది గిరిజన ప్రాంతమా... నగరం నడిబొడ్డా అనే తేడా ఉండదు. అన్ని చోట్లా ఒకటే స్పందన. ఆ నాయకుడు కనిపించగానే జనశ్రేణుల పాదాలు జజ్జెనకరె గజ్జల సడి చేయడానికి సిద్ధమవుతాయి. అతడే ప్రజానాయకుడు! ద మాస్ లీడర్! ఇటువంటి మాస్ లీడర్లు ఎందరుంటారు? ఆంధ్రరాష్ట్రం విషయానికి వస్తే అప్పుడెప్పుడో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రకాశం పంతులు గారిలో ఈ మ్యాజిక్ ఉండేదట. ఆ తర్వాత ఒక ఎన్టీ రామారావు... ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి... ఇదిగో ఇప్పుడు ఒక జగన్‌మోహన్‌రెడ్డి. దట్సాల్!సింహం ఇంకా వేటకు బయల్దేరనే లేదు. అది వెళ్లేదారిలో గోతులు తవ్వడానికీ, మందుపాతర్లు పెట్టే వ్యూహం పన్నడానికీ తోడేలు మందలు, నక్కల గుంపులు సమావేశమవుతున్నాయట. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా విస్తృత జనయాత్రలకు శ్రీకారం చుట్టనేలేదు. గద్దెనెక్కిన వారు ఏడాది పండుగ జరుపుకొనేదాకా ఊపిరిపీల్చుకునే అవకాశం ఇవ్వడానికి ఈ తాత్సారం కావచ్చు. ఇప్పుడు అడపాదడపా పర్యటనలు మాత్రమే జరుగుతున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజాశ్రేణులను కలవడానికీ, నిర్బంధాలకు గురవుతున్న కార్యకర్తలకూ, నేతలకూ అండగా నిలవడానికీ మాత్రమే ఈ పర్యటనలు పరిమితం. గడిచిన వారం ఇటువంటి మూడు యాత్రలు జరిగాయి. రెడ్‌బుక్ స్కీము కింద అరెస్టయిన సహచరుడు వంశీని కలవడానికి జగన్ విజయవాడ జైలుకు వెళ్లారు. దగా పడుతున్న రైతన్నకు దన్నుగా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. కన్నుమూసిన పార్టీ నాయకుని కుటుంబాన్ని పలకరించడానికి పాలకొండకు వెళ్లారు. ప్రదేశం ఏదైనా, సందర్భం ఏదైనా ప్రజాస్పందన సుస్పష్టం. జనప్రభంజనపు అడుగుల చప్పుడు విస్పష్టం. ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఓడిపోయిందని నమ్మడానికి పేదవర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. ఏదో ‘మాయ’ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నారు. పేదల అభ్యున్నతి కోసం పని చేసినందుకే బడా బాబులంతా కలిసి కుట్ర చేశారన్న అభిప్రాయం వారి మనసుల్లో బలంగా నాటుకొని పోయింది. ఫలితంగా జగన్‌పై వారికున్న అభిమానం మరింత బలపడుతున్నది.ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెట్లా ఇస్తామని ఇటీవలనే ప్రవచించిన ముఖ్యనాయకుడికి ప్రజలు మూడ్ బాగానే తెలుసు. జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. జనంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డితో తాము తలపడలేమని కూడా తెలుసు. అందుకే ఆయన జనంలోకి రాకూడదని ముఖ్యమంత్రీ, ఆయన శిబిరం భావిస్తుండవచ్చు. ఒక వేళ జనంలోకి వస్తే ఏం చేయాలన్న పథకంపై మొన్నటి పర్యటనల్లో రిహార్సళ్లు, రెక్కీలు జరిగి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతా కవచాలలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి ఆ స్థాయి భద్రతను కల్పించవలసి ఉన్నది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఆ సిబ్బందిని భారీగా కుదించినప్పుడే అనుమానాలకు బీజం పడింది.తాడేపల్లిలోని జగన్‌మోహన్‌రెడ్డి నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీ టెంట్లనూ, బారికేడ్లనూ, సిబ్బందినీ తొలగించినప్పుడే ప్రభుత్వ పెద్దల దురుద్దేశం బట్టబయలైంది. వినుకొండ పట్టణ నడివీధిలో జరి గిన రెడ్‌బుక్ ఘాతుకానికి బలైన రషీద్ కుటుంబ పరామర్శకు బయ ల్దేరినప్పుడు కూడా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించి జగన్ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు. ఆయన నివాసానికి సమీపంలోనే మంటలు చెలరేగడం భద్రతా వైఫల్యం కాక మరేమంటారు? ప్రొటోకాల్ ప్రకారం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే నాయకుడు పర్యటనలో ఉన్నప్పుడు రోడ్డు క్లియర్ చేసే టీమ్, కాన్వాయ్, రోప్ పార్టీ, ఎస్కార్ట్ విధిగా ఉండి తీరాలి. కానీ జగన్ పర్యటనల్లో వేళ్ల మీద లెక్కించగలిగేంత మంది కానిస్టేబుళ్లు తప్ప ఇవేమీ కనిపించడం లేదు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భద్రతకు ఎటువంటి లోటూ జరగలేదు. రూల్‌బుక్ స్థానాన్ని రెడ్‌బుక్ ఆక్రమించలేదు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోనే స్థిరనివాసం ఉండేవారు. జడ్ ప్లస్ కేటగిరీ కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొటోకాల్ ప్రకారం తీసుకోవలసిన భద్రతా చర్యల్ని తీసుకున్నది. అది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. జగన్ విషయంలో ఈ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం విస్మరించడం వెనుక భయంకరమైన కుట్ర ఉండవచ్చనే అనుమానాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అవి కేవలం అనుమానాలు మాత్రమే కావని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం.జగన్ భద్రత విషయంలో కుట్రపూరితమైన ఆలోచనలు చేయవలసిన అవసరం ప్రభుత్వ పెద్దలకు తప్ప ఇంకెవరికీ లేదు. చంద్రబాబు కూటమి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. తాము అమలు చేయలేమని తెలిసినప్పటికీ అనేక హామీలను గుప్పించి ఓటర్లను వంచించింది. ఇప్పుడా హామీలన్నింటినీ చాప చుట్టేసి అటకెక్కించింది. అంతకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్న’ పథకాలు కూడా ఆగిపోయాయి.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాస్వామికీకరణ కార్యక్రమాన్ని నిలిపి వేసి ప్రైవేట్ దోపిడీకి బాటలు వేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన గృహనిర్మాణ విప్లవానికి కళ్లెం వేశారు. ‘అమ్మ ఒడి’ని ఆపేశారు. ‘చేయూత’ను వదిలేశారు. ‘కాపు నేస్తం’ కనిపించడం లేదు. ఈ బీసీ నేస్తం పత్తా లేదు. జాతీయ స్థాయిలో బహుళ ప్రశంసలు అందుకున్న వలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేశారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తానని ప్రతి ఎన్నికల సభలోనూ బాబు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థనే గిరాటేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇటువంటి పచ్చి మోసాన్ని అనుమతించవచ్చునా? ఇటువంటి మోసగాళ్లు పాలకులు కావడం వాంఛనీయమేనా? ఇదొక్క అంశమే కాదు. అన్ని హామీలకూ ఇదే గతి పట్టింది. వీటిపై ప్రజల్లోనూ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారిలోనూ విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ప్రజానాయకుడైన జగన్‌మోహన్‌రెడ్డి ఒకసారి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడితే కూటమి మోసాల గుట్టురట్టవుతుంది. విస్తృత స్థాయిలో చర్చ మొదలవుతుంది. ఈ పరిణామం కూటమి మనుగడకే ్రపమాదం. కనుక జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి రాకూడదు. గతంలోనే ఆయనపై రెండు మార్లు హత్యాప్రయత్నాలు జరిగి ఉన్నాయి గనుక భద్రతా చర్యలను నిలిపివేస్తే ఆయన యాత్రలు ఆగిపోతాయన్న వెర్రి ఆలోచన ఏమైనా ఉండవచ్చు. భద్రతా సిబ్బందిని తొలగించినా, కార్యకర్తలే రోప్ పార్టీగా మారి నడుస్తున్న పరిణామాన్ని చూసిన తర్వాత మరింత తీవ్రమైన వ్యూహాలకు కూటమి సర్కార్ పదును పెట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే జగన్ వంటి ప్రజానాయకుడు రంగంలో ఉండగా తన వారసుడు రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆదిలో బాబు నిల దొక్కుకోవడానికి కూడా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు ద్వారా రంగం నుంచి తప్పించడానికి ఎటువంటి వ్యూహాలు అమలు చేశారనేది తెలిసిన సంగతే!రాజశేఖర్‌రెడ్డిని గద్దెదించడానికి కూడా బాబుకూటమి చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌నూ, సమైక్య రాష్ట్రానికి కట్టుబడివున్న సీపీఎంనూ ఒక్కచోటకు చేర్చి ‘మహాకూటమి’ని కట్టిన సంగతి కూడా తాజా జ్ఞాపకమే! ఆయన మీద ఎంత దుష్ప్రచారం చేసినా, ‘మహాకూటమి’ని నిర్మించినా, సంప్రదాయ కాంగ్రెస్ ఓటును చిరంజీవి పార్టీ బలంగా చీల్చినా బాబు ముఠా ప్రయత్నాలు ఫలించలేదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ మహానేత మరో విధంగా రంగం నుంచి నిష్క్రమించారు.జగన్‌మోహన్‌రెడ్డి మరో బలమైన మాస్ లీడర్‌గా ఆవిర్భవిస్తారని చంద్రబాబు – యెల్లో మీడియా వారు ఆదిలోనే గుర్తించారు. ఆయన్ను మొగ్గలోనే తుంచేయడానికి చేసిన ప్రయత్నాలను తెలుగు ప్రజలందరూ గమనించారు. గడిచిన పదిహేనేళ్లుగా జగన్‌మోహన్ రెడ్డి మీద జరుగుతున్న వ్యక్తిత్వ హనన కార్యక్రమం న భూతో న భవిష్యతి. ప్రపంచ చరిత్రలోనే ఈ స్థాయిలో వ్యక్తిత్వ హనన గోబెల్స్ ప్రచారం ఎవరి మీదా జరిగి ఉండదు. ప్రజా నాయకులను దూరం చేసి చంద్రబాబుకు మార్గం సుగమం చేసే కార్య క్రమంలో యెల్లో మీడియా, దాని రింగ్ లీడర్ రామోజీరావు పోషించినది దుర్మార్గమైన పాత్ర. చట్టాన్ని ధిక్కరించి ఫైనాన్సియర్స్ పేరుతో నిధులు పోగేసిన వ్యక్తి రామోజీ. చిట్‌ఫండ్స్ పేరుతో జనం సొమ్మును సొంత వ్యాపారాలకు వాడుకున్న వ్యక్తి రామోజీ. ఒకరి కొకరు తోడు నీడగా బాబు–రామోజీలు ముప్ఫయ్యేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను భ్రష్టు పట్టించారు. అయినా సరే, జనం మాత్రం జగన్ వెంట నిలబడుతున్నారు. ఈ పరిణామం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు జగన్‌కు భద్రత కల్పించడంలో విఫలం కావడమనేది కేవలం పొరపాటు కాదు. వట్టి నిర్లక్ష్యం కాదు. ఉద్దేశపూర్వక∙నిర్లక్ష్యం, కుట్రపూరిత నిర్లక్ష్యం! ఇటువంటి ధోరణిని ఎండగట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు మరింత బలహీనపడతాయి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Mahakumbh) అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 26(శివరాత్రి)తో కుంభమేళా ముగియనుంది. ఈ నేపధ్యంలో భక్తులు త్రివేణీ సంగమానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి తొక్కిసలాట ఘటనలు లాంటివి చోటుచేసుకుండా ఉండేందుకు యూపీ సీఎం స్వయంగా కుంభమేళాను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన అరుదైన రికార్డును కూడా నెలకొల్పారు.జనవరిలో కుంభమేళా ప్రారంభం కావడానికి ముందు నుంచి ఫిబ్రవరి 22 వరకు గడచిన 45 రోజుల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) 12 సార్లు కుంభమేళాను సందర్శించారు. దీంతో అత్యధికంగా కుంభమేళాను సందర్శించిన సీఎంగా చరిత్ర సృష్టించారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి మహా కుంభమేళా 1954లో జనవరి 14 నుండి మార్చి 3 వరకు జరిగింది. ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ రెండుమూడు సార్లు సంగమ స్థలికి వచ్చి పరిస్థితులను పర్యవేక్షించారు. ఆ తరువాత మరే ముఖ్యమంత్రీ కుంభమేళాను పదేపదే సందర్శించలేదు.సీఎం యోగి కుంభమేళా సందర్శనలుజనవరి 09: 13 అఖాడాలు, దండిబారా, ఖాక్ చౌక్ మహాసభల శిబిరాలను సీఎం యోగి సందర్శించారు. డిజిటల్ మీడియా సెంటర్‌ను ప్రారంభించారు.జనవరి 10: ప్రసార భారతి ఛానల్ కుంభవాణిని ప్రారంభించి, రవాణా సంస్థ బస్సులకు పచ్చజెండా ఊపారు.జనవరి 19: పూజ్య శంకరాచార్య తదితర సాధువులతో సమావేశమయ్యారు. పోలీసు గ్యాలరీ, రాజ్యాంగ గ్యాలరీ, పర్యాటక గ్యాలరీలను ప్రారంభించారు.జనవరి 22: మంత్రివర్గంతో పవిత్ర సంగమ స్నానం చేశారు.జనవరి 25: గురు గోరక్షనాథ్ అఖారాలో, విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad) సమావేశంలో పన్నెండు శాఖల యోగి మహాసభలో అవధూత వేషధారణలో కనిపించారు.జనవరి 27: హోంమంత్రి అమిత్ షాను స్వాగతించారు. త్రివేణి సంగమంలో పూజలు చేశారు.ఫిబ్రవరి 01: భారత్ సేవాశ్రమ శిబిరాన్ని సందర్శించారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రపంచంలోని 73 దేశాల దౌత్యవేత్తలతో సంభాషించారు.ఫిబ్రవరి 04: బౌద్ధ మహా కుంభ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూటాన్ రాజుకు స్వాగతం పలికారు.ఫిబ్రవరి 05: ప్రధాని మోదీకి స్వాగతం పలికి, త్రివేణి సంగమంలో పూజలు చేశారు.ఫిబ్రవరి 10: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.ఫిబ్రవరి 16: ప్రదీప్ మిశ్రా కథాశ్రవణం, ప్రభు ప్రేమి సంఘ్ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఫిబ్రవరి 22: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు. మహాశివరాత్రి సన్నాహాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (ఆదివారం) మరోమారు మహాకుంభ్ నగర్ కు రానున్నారు. గత అక్టోబర్‌లో మహా కుంభ్ లోగో విడుదలైన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్ రావడం ఇది 18వ సారి అవుతుంది.ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ..

దాయాదుల సమరానికి సమయం
గత పద్నాలుగేళ్ల కాలంలో వన్డేలు, టి20లు కలిపి భారత్, పాకిస్తాన్ మధ్య 13 మ్యాచ్‌లు జరిగితే భారత్ 11 గెలిచి 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమిపాలైంది... ఇరు జట్ల మధ్య జరిగిన గత 11 వన్డేల్లో భారత్ 9 గెలిచి 2 ఓడింది...ఇది చాలు దాయాదిపై టీమిండియా ఆధిపత్యం ఎలా సాగుతోందో చెప్పడానికి... అయినా సరే...అంతర్జాతీయ క్రికెట్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రతీ సారి అంతే ఉత్సుకత రేపుతుంది... ఆటగాళ్లు, అభిమానులు, ప్రసారకర్తలు, విశ్లేషకులు... ఇలా అందరి దృష్టిలో ఇది ఎంతో ప్రత్యేకమైన సమరం. తుది ఫలితంతో సంబంధం లేకుండా దాయాదుల మధ్య పోరు అంటే ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోతుంది. ఆదివారం ఆటవిడుపు వేళ మరో సారి భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆతిథ్య జట్టే అయినా... ఈ మ్యాచ్ కోసం పాక్ దుబాయ్ చేరగా, ఇప్పటికే ఈ వేదికపై ఒక మ్యాచ్ గెలిచిన టీమిండియా ఉత్సాహంగా సిద్ధమైంది. భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ చేరుకుంటుంది. పాక్‌కు మాత్రం టోర్నీనుంచి నిష్క్రమించకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య. దుబాయ్: వన్డే వరల్డ్ కప్‌లో తలపడిన దాదాపు 16 నెలల తర్వాత మరో ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ వన్డే సమరానికి సై అంటున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు నేడు తలపడతాయి. భారత్ తొలి తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయగా... పాక్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలైంది. బలాబలాలు, ఫామ్‌పరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ సేనదే పైచేయిగా ఉన్నా... అనూహ్య ప్రదర్శనతో చెలరేగాలని పాకిస్తాన్ భావిస్తోంది. మార్పుల్లేకుండా... గత మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో గిల్ తన ఫామ్‌ను చాటి చెప్పగా, రోహిత్ శర్మ అందించే శుభారంభాలు జట్టును ముందంజలో నిలుపుతున్నాయి. విరాట్ కోహ్లి మాత్రమే కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. ఇంకా తనదైన స్థాయి ఆటను విరాట్ ప్రదర్శించలేదు. దాని కోసం ఇంతకంటే మంచి వేదిక ఉండదు. రాహుల్ బంగ్లాతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం రాకుండానే మన జట్టు గత మ్యాచ్‌ను ముగించింది. అక్షర్ బ్యాటింగ్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ మరోసారి నమ్మకం ఉంచుతోంది. బౌలింగ్‌లో షమీ అద్భుత పునరాగమనం భారత్ బలాన్ని ఒక్కసారిగా పెంచింది. బంగ్లాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో అతను తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. షమీకి తోడుగా హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజాలను ఎదుర్కొని పాక్ బ్యాటర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. మొత్తంగా టీమిండియా ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన చేస్తే తిరుగుండకపోవచ్చు. గెలిపించేదెవరు! పాకిస్తాన్ జట్టు పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. స్వదేశంలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో రెండుసార్లు న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పడు ఈ మెగా టోర్నీ తొలి పోరులోనూ ఓటమిపాలైంది. పైగా భారీ తేడాతో ఓడటం వల్ల రన్‌రేట్‌పై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా భారత్‌తో మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో నిలుస్తుంది. లేదంటే ఆతిథ్య జట్టుగా సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడే సమయానికి పాక్ ఆట ముగిసిపోతుంది. జట్టు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఎన్ని వైఫల్యాలున్నా ఇప్పటికీ టీమ్ నంబర్‌వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. కానీ గత మ్యాచ్‌లో కూడా అతను చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఈ సారి అతని ప్రదర్శన మెరుగవుతుందేమో చూడాలి. ఫఖర్ గాయంతో దూరం కావడంతో టీమ్‌లోకి వచ్చిన ఇమామ్ కూడా దూకుడుగా ఆడలేడు. రిజ్వాన్, షకీల్ గత మ్యాచ్‌లో విఫలమయ్యారు. సల్మాన్, ఖుష్‌దిల్ ప్రదర్శన సానుకూలాంశం. మరో వైపు బౌలింగ్ అయితే మరీ పేలవంగా ఉంది. పాక్ ఎంతో నమ్ముకున్న ముగ్గురు పేసర్లు పోటీ పడి భారీగా పరుగులిస్తున్నారు. ఇటీవలి రికార్డు చూసినా...షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్‌లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. పైగా ఒక్క నాణ్యమైన స్పిన్నర్ కూడా జట్టులో లేడు. ఈ నేపథ్యంలో పాక్ గెలవాలంటే అసాధారణ పోరాటం చేయాల్సి ఉంది. 23 వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్‌లలో పాక్‌పై భారత్ ఆధిపత్యం ఉన్నా...చాంపియన్స్ ట్రోఫీలో పాక్ రికార్డు మెరుగ్గా ఉంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరిగితే భారత్ 2 గెలిచి 3 ఓడింది. 57 - 73 ఓవరాల్‌గా భారత్, పాకిస్తాన్ మధ్య 135 వన్డేలు జరగ్గా...భారత్ 57 గెలిచి 73 ఓడింది. మరో 5 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. పిచ్, వాతావరణం గత మ్యాచ్ తరహాలోనే నెమ్మదైన పిచ్. కానీ బ్యాటర్లు పట్టుదలగా ఆడితే భారీ స్కోరు సాధించవచ్చు. వర్ష సమస్య లేదు. మంచు ప్రభావం కూడా లేదు కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, రాణా. పాకిస్తాన్: రిజ్వాన్ (కెప్టెన్), ఇమామ్, షకీల్, బాబర్, సల్మాన్, తాహిర్, ఖుష్‌దిల్, అఫ్రిది, నసీమ్, రవూఫ్, అబ్రార్.

హీరోలా ఎగిరే జీరో..
ట్రాఫిక్‌జామ్‌లకు భయపడి కారును బయటకు తీయాలంటేనే భయపడుతున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఓ ఎగిరే కారు సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఆటోమోటివ్, ఏవియేషన్ సంస్థ సరికొత్త ఫ్యూచర్ కారును అభివృద్ధి చేస్తోంది. రోడ్డుపై రయ్యిమని దూసుకెళ్లగలగడంతోపాటు అవసరమైనప్పుడు అమాంతం పైకి ఎగిరి వెళ్లగల కారును సిద్ధం చేస్తోంది.తాజాగా మోడల్ జీరో అనే కారును ప్రయోగాత్మకంగా కాలిఫోర్నియాలోని ఓ రోడ్డుపై విజయవంతంగా పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను సంస్థ నెటిజన్లతో పంచుకుంది. ఆ వీడియోలో మోడల్ జీరో కారు రోడ్డుపై కాస్త దూరం ప్రయాణించి ఆపై నిట్టనిలువుగా టేకాఫ్ అయి ముందున్న కారు పైనుంచి ఎగురుతూ ముందుకు సాగింది. అనంతరం మళ్లీ రోడ్డుపై దిగి ముందుకు కదిలింది. –సాక్షి, సెంట్రల్ డెస్క్‌ఎలా సాధ్యమైంది?సాధారణ కార్లలో బానెట్‌లో ఇంజన్ ఉంటే మోడల్ జీరో కారులో మాత్రం నాలుగు చిన్న ఇంజన్లను వాటి చక్రాల వద్ద కంపెనీ అమర్చింది. వాటి సాయంతో సాధారణ ఎలక్ట్రిక్ కారులాగానే ఈ కారు రోడ్డుపై దుసుకెళ్తోంది. ఇక ఖాళీగా ఉన్న బానెట్, డిక్కీలలో మొత్తం ఎనిమిది ప్రొపెల్లర్లను సంస్థ ఏర్పాటు చేసింది. వేర్వేరు వేగములతో వేటికవే విడివిడిగా పరిభ్రమించగలగడం ఈ ప్రొపెల్లర్ల్ల ప్రత్యేకత. ఫలితంగా కారు ఏ దిశలో అయినా ఎగరడం సాధ్యం అవుతోంది. ఇందుకోసం డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీని కంపెనీ ఉపయోగించింది. కారు ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడటంతో బరువు 385 కిలోలకే పరిమితమైంది. ప్రస్తుత నమూనా గాల్లో సుమారు 177 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. రోడ్డుపై మాత్రం 56 కి.మీ. దూరం వెళ్లగలదని అలెఫ్ ఏరోనాటిక్స్ వివరించింది. రెండు సీట్లుగల మోడల్ ఏ రకం కారు రోడ్డుపై సుమారు 320 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. గాల్లో 177 కి.మీ. దూరం వెళ్లగలదని తెలిపింది. ఫ్లయింగ్ కార్లకన్నా భిన్నమైనది..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న ఫ్లయింగ్ కార్లకన్నా తాము రూపొందిస్తున్న కారు భిన్నమైనదని అలెఫ్ ఏరోనాటిక్స్ తెలిపింది. ఈవీటాల్ ఫ్లయింగ్ ట్యాక్సీల వంటి కార్లు టేకాఫ్ కోసం రోడ్డును రన్ వేలాగా ఉపయోగిస్తాయని.. కానీ తాము అభివృద్ధి చేస్తున్న కారు మాత్రం రోడ్డుపై నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోగలదని పేర్కొంది. సాధారణ ప్రజలు ఈ కారును వాడటం ఎంతో సులువని.. కేవలం 15 నిమిషాల్లో కారులోని కంట్రోల్స్‌పై పట్టు సాధించొచ్చని కంపెనీ సీఈఓ జిమ్ డకోవ్నీ పేర్కొన్నారు. ‘రైట్ బ్రదర్స్ విమాన వీడియో తరహాలో మా కారు ప్రయోగ వీడియో మానవాళికి సరికొత్త రవాణా సాధ్యమని నిరూపిస్తుందని భావిస్తున్నా’అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధర ఎక్కువే..మోడల్ ఏ రకం కారుపై కంపెనీ ఇప్పటికే ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి లగ్జరీ కార్ల తరహాలోనే ఈ కారు ధరను సుమారు రూ. 2.57 కోట్లుగా కంపెనీ ఖరారు చేసింది. అయితే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా సుమారు రూ. 27.35 లక్షలకు కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

2025 నుంచి 2050 టర్మ్‌లో సినిమాను ఏలేది ఇదే: ఆర్కే.సెల్వమణి
కాలం మారుతోంది. దానితో పాటు సినిమాను రూపాంతరం చెందుతోంది. సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి చెందుతోంది. మ్యాన్ పవర్ తగ్గుతోందని కూడా చెప్పవచ్పు. ఇప్పుడు ఇండియన్ సినిమా హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఎదుగుతోంది. ఇది సినీ విజ్ఞులు చెబుతున్న మాట. ప్రముఖ సినీ దర్శకుడు, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి ఇదే చెబుతున్నారు. ఈయన సినిమా రంగంలో 24 క్రాఫ్ట్‌లతో కూడిన దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కి అధ్యక్షుడు అన్న విషయం తెలిసిందే. కాగా ఈ 24 క్రాఫ్ట్‌ల సంఘంలో మరో క్రాఫ్ట్ చేరనుంది. అదే దివా( డిజిటల్ ఇంటర్ మీడియట్ విజువల్ ఎఫెక్ట్స్ అసోసియేషన్). దీంతో ఫెఫ్సీ ఇప్పుడు 25 క్రాఫ్ట్స్ కలిసిన సమాఖ్య కానుంది. దివా నిర్వాహకులు చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్కే.సెల్వమణి, దర్శకుడు రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సెల్వమణి మాట్లాడుతూ ఇంతకుముందు తాను సినిమాను రూపొందించినప్పుడు అనుకున్నది ముందుగానే చూడడానికి కఠిన శారీరక శ్రమ, డబ్బు ఖర్చు అవసరం అయ్యేదన్నారు. అయినా రిజల్ట్ 40 శాతమే వచ్చేదన్నారు. అలాంటిది ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఆ రిజల్ట్ 100 శాతంగా మారిందన్నారు. కె.బాలచందర్, భారతీరాజా, శ్రీధర్ వంటి దర్శకుల కాలంలో సినిమా సాంకేతిక నిపుణుల ఆధీనంలోకి వచ్చిందన్నారు. ఆ తరువాత రజనీకాంత్, కమలహాసన్ వంటి నటుల ఆధీనంలోకి వచ్చిందన్నారు. 2025 నుంచి 2050 వరకూ సినిమాను ఏలేది ఏఐ, వీఎఫ్ఎక్స్, సీజీ వంటి సాంకేతిక పరిజ్ఞానమేనని అన్నారు. అలాంటి దానికి ఒక సంఘం అన్నది స్వాగతించాల్సిన విషయమేనన్నారు. మీ సంఘాన్ని ఫెఫ్సీలో చేర్చుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని సెల్వమణి పేర్కొన్నారు. అయితే వీఎఫ్ఎక్స్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాతలకు భారం కాకుండా, వారితో కలిసి నడుచుకోవాలని ఆయన అన్నారు. దివా త్వరలో ఒడిసీ అవార్డుల పేరుతో భారీ ఎత్తున చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

యాప్‌రే.. యాప్!
అరచేతిలో స్మార్ట్‌ఫోన్– స్మార్ట్‌ఫోన్ నిండా రకరకాల యాప్స్– యాప్స్‌తో కావలసినంత కాలక్షేపం, వినోదం మాత్రమే కాదు, అంతకు మించి కూడా! యాప్స్ మన రోజువారీ పనులను సునాయాసం చేస్తున్నాయి. యాప్స్ నగదు బదిలీని సులభతరం చేసి, వ్యాపార లావాదేవీలకు ఊతమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్ వ్యాపారం శరవేగంగా దూసుకుపోతోంది. యాప్స్ వినియోగం, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారం గురించి ఈ ప్రత్యేక కథనం.మనం వాడే స్మార్ట్‌ఫోన్ లో యాభైకి పైగా అప్లికేషన్స్ (యాప్స్) ఉంటాయి. వీటిని తరచు డౌన్ లోడ్ చేస్తుంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్ని యాప్స్ డౌన్ లోడ్ అవుతున్నాయో మీకు తెలుసా? వీటిని రూపొందించిన కంపెనీలకు మొబైల్ యూజర్ల వల్ల ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్ లోడ్స్‌లోను, మొబైల్‌లో యాప్స్‌పై యూజర్లు వెచ్చించే సమయంలోను భారత్ తొలి స్థానంలో ఉంది.మొబైల్ ప్రపంచంలో మనదే రికార్డు. గత ఏడాది 2,436 కోట్ల డౌన్ లోడ్స్‌తో భారత్ తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది మన భారతీయులు మొబైల్‌లో వెచ్చించిన సమయం 11,26,60,00,00,000 గంటలు. చదవడానికి కష్టంగా ఉంది కదూ! సింపుల్‌గా చెప్పాలంటే 1,12,660 కోట్ల గంటలు. మరో ఆసక్తికర విషయమే మంటే, డేటింగ్ యాప్ ‘బంబుల్’కు భారతీయులు కోట్లాది రూపాయలు గుమ్మరించారు. గత ఏడాది ప్రపంచంలోని యాప్ పబ్లిషర్స్, పబ్లిషర్ల ఆదాయం 12.5 శాతం పెరిగి, వారి ఆదాయం రూ.13.12 లక్షల కోట్లుగా నమోదైంది. యాప్స్ వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నా, యాప్స్ ఆదాయంలో మాత్రం టాప్–20లో చోటు దక్కలేదు. గేమ్స్ యాప్స్ విషయంలో ప్రపంచస్థాయిలో ‘ఫ్రీ ఫైర్’ మొదటి స్థానంలో నిలిస్తే, భారత్‌లో ‘పబ్‌జీ’ అగ్రగామిగా ఉంది. ఫైనాన్స్ యాప్స్‌లో ‘ఫోన్ పే’ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మన దేశానికి చెందిన పేటీఎం 4వ స్థానంలోను, బజాజ్ ఫిన్‌సర్వ్ 10వ స్థానంలోనూ నిలిచాయి.అంతర్జాతీయంగా యాప్స్ తీరుప్రపంచవ్యాప్తంగా 2024లో 13,600 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి 1 శాతం క్షీణించింది. ‘కోవిడ్–19’ కాలంలో యాప్ డౌన్ లోడ్స్ బాగా పెరిగాయి. లాక్‌డౌన్‌ల వల్ల జనాలు ఇంటి పట్టునే ఉండడంతో కాలక్షేపం కోసం మొబైల్స్‌లో మునిగిపోయారు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు డౌన్ లోడ్స్ తిరోగమనంలో పడ్డాయి. అయితే, ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో ప్రపంచంలో మెక్‌డొనాల్డ్స్, జెప్టో, కేఎఫ్‌సీ, డామినోస్ పిజ్జా, జొమాటో టాప్–5లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్స్, పబ్లిషర్స్ ఆదాయం విషయంలో ఉత్తర అమెరికా, యూరప్‌లోని అగ్ర మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అమెరికా రూ.4.5 లక్షల కోట్లతో ముందుంది. గేమ్స్ రాబడి వృద్ధి నాన్–గేమ్స్ కంటే వెనుకబడి ఉండటంతో ఆసియాలోని కొన్ని గేమింగ్–ఫోకస్డ్ మార్కెట్లు నామామాత్రపు వృద్ధిని చూస్తే, ఇంకొన్ని స్వల్పంగా క్షీణించాయి. ఇన్ యాప్ పర్చేజ్ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. 2024లో ప్రధాన యాప్ విభాగాలైన సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ , జనరల్ షాపింగ్ యాప్స్ స్వల్ప వృద్ధిని సాధించాయి. కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉప విభాగాలు కూడా వీటిని అనుసరించాయి. ఇందుకు విరుద్ధంగా యాంటీవైరస్, వీపీఎన్ (–32 శాతం) ఫైల్ మేనేజ్‌మెంట్ (–24 శాతం) సహా అనేక సాఫ్ట్‌వేర్ ఉప విభాగాలు క్షీణతను చవిచూశాయి. మన దేశంలో ఇలా..పోటీ దేశం అయిన అమెరికా కంటే మన దేశంలో యాప్ డౌన్ లోడ్స్ రెండింతలు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 2024లో మొత్తం 4.2 లక్షల కోట్ల గంటలు మొబైల్‌ను ఆస్వాదించారు. ఇందులో 1,12,660 కోట్ల గంటలు.. అంటే 26.8 శాతం వాటా భారత్‌దే! ఇది పోటీదేశాలైన ఇండోనేషియా, అమెరికాల కంటే మూడు రెట్లకుపైగా ఎక్కువ. 2023తో పోలిస్తే 2024 భారతీయులు 13,510 కోట్ల గంటలు అధికంగా మొబైల్‌లో మునిగిపోయారు. జనాలు టీవీలు చూడటం కంటే ఎక్కువసేపు మొబైల్‌లోనే గడుపుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులు విరివిగా ఉపయోగించి, యాప్ డెవలపర్లకు అధికాదాయం తెచ్చిపెట్టిన యాప్స్‌లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ‘బంబుల్’ తొలి స్థానంలో నిలవడం విశేషం.‘యూట్యూబ్’ రెండవ స్థానంలోను, లైవ్ వీడియో చాట్ యాప్ ‘చామెట్’ మూడవ స్థానంలోనూ నిలిచాయి. ఇక జనరేటివ్ ఏఐ యాప్స్ 2023లో 911 శాతం దూసుకెళ్లి, 7.5 కోట్ల డౌన్ లోడ్స్ నమోదు చేసుకున్నాయి. 2024లో 135 శాతం వృద్ధితో ఈ సంఖ్య 17.7 కోట్లకు చేరింది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినై, జీనియస్, వాట్‌ఆటో, ఆర్టిమైండ్ గత ఏడాది టాప్ యాప్స్‌గా నిలిచాయి. యాప్స్‌లో టాప్–5 ఉప విభాగాల డౌన్ లోడ్స్ 2023తో పోలిస్తే 2024లో క్షీణించాయి. అయితే కస్టమైజేషన్ , రింగ్‌టోన్ యాప్స్ 3 శాతం, సోషల్ మెసేజింగ్ 4 శాతం, డిజిటల్ వాలెట్స్, పీ2పీ పేమెంట్స్ 9 శాతం, బిజినెస్, ప్రొడక్టివిటీ 7 శాతం, టెలికం 6 శాతం, కన్‌జ్యూమర్ బ్యాంకింగ్ 3 శాతం, లా, గవర్నమెంట్ 23 శాతం, కాలింగ్, ఎస్‌ఎంఎస్ యాప్స్ 9 శాతం వృద్ధి చెందాయి. ‘గేమ్’చేంజర్స్‌బిలియన్ డాలర్ క్లబ్‌లో గత ఏడాది అంతర్జాతీయంగా 11 గేమ్స్, 6 యాప్స్ చేరాయి. గేమ్స్‌లో లాస్ట్ వార్, వైట్‌ఔట్ సర్వైవల్, డంజన్ అండ్ ఫైటర్, బ్రాల్ స్టార్స్‌తోపాటు నాన్ –గేమ్స్‌లో వీటీవీ ఈ క్లబ్‌లో కొత్తగా చోటు సంపాదించాయి. మొబైల్ గేమ్స్ ద్వారా డెవలపర్లకు రూ.7,07,875 కోట్ల ఆదాయం సమకూరింది. 2023తో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. 2023తో పోలిస్తే డౌన్ లోడ్స్ 6 శాతం తగ్గి 4,960 కోట్లుగా ఉన్నాయి. మెక్సికో, భారత్, థాయ్‌లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగానికి ఆజ్యం పోశాయి. ప్రతి వారం సుమారు 100 కోట్ల డౌన్ లోడ్స్ కాగా, యూజర్లు ఇన్ యాప్ పర్చేజ్ కింద రూ.13,475 కోట్లు ఖర్చు చేశారు.సిమ్యులేషన్ , పజిల్, ఆరేక్డ్, లైఫ్‌స్టైల్, టేబుల్‌టాప్ టాప్–5 మొబైల్ గేమ్ విభాగాలుగా నిలిచాయి. డౌన్ లోడ్స్‌లో సబ్‌వే సర్ఫర్స్ గేమ్, ఆదాయంలో లాస్ట్ వార్ సర్వైవల్ గేమ్ టాప్‌లో ఉన్నాయి. మన దేశంలో డౌన్ లోడ్స్‌లో ఇండియన్ వెహికిల్స్ సిమ్యులేటర్ 3డీ, ఆదాయంలో ఫ్రీ ఫైర్ అగ్రస్థానంలో నిలిచాయి. కొత్తగా విడుదలైన గేమ్స్‌లో భారత్‌లో శ్రీ రామ్ మందిర్ గేమ్ తొలి స్థానంలో దూసుకెళుతోంది. సోషల్ మీడియా దూకుడుసోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు 2,37,410 కోట్ల గంటలు గడిపారు. 2023తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. మొబైల్స్‌లో గడిపిన మొత్తం సమయంలో సోషల్ మీడియా వాటా ఏకంగా 56 శాతం దాటింది. సోషల్ మెసేజింగ్‌కు 60,661 కోట్ల గంటల సమయం వెచ్చించారు.చాట్ జీపీటీ మూడంకెల వృద్ధిఇన్ యాప్ పర్చేజ్ రెవెన్యూ సాధించిన టాప్–20 యాప్ విభాగాల్లో చాట్ జీపీటీ ఏకంగా మూడంకెల వృద్ధి (209 శాతం) సాధించి, రూ.9,362.5 కోట్ల ఆదాయం పొందింది. బుక్స్, కామిక్స్ (9 శాతం) మినహా మిగిలిన ఇతర విభాగాలన్నీ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్నాయి. 31 శాతం వృద్ధితో రూ.1,04,825 కోట్లతో ఫిల్మ్, టెలివిజన్ తొలి స్థానం కైవసం చేసుకుంది. 29 శాతం ఎగసి రూ.1,02,891 కోట్లతో సోషల్ మీడియా, 13 శాతం దూసుకెళ్లి రూ.46,637 కోట్లతో మీడియా, ఎంటర్‌టైన్ మెంట్, డేటింగ్ విభాగాలు టాప్–3లో నిలిచాయి. ఆదాయపరంగా బుక్స్, కామిక్స్, మ్యూజిక్, పాడ్‌కాస్ట్ తర్వాతి వరుసలో ఉన్నాయి.ఏఐ చాట్‌బాట్స్ హవాగత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల ఏఐ చాట్‌బాట్స్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో 63.5 కోట్ల డౌన్ లోడ్స్ పెరిగాయి. ఏఐ చాట్‌బాట్స్ అత్యధికంగా 112 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. యాప్స్‌లో సోషల్ మీడియా, సోషల్ మెసేజింగ్ తర్వాత 599 కోట్ల గంటలు అదనంగా వెచ్చించడంతో చాట్‌బాట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఏఐ చాట్‌బాట్స్ కోసం వెచ్చించిన సమయం 347 శాతం పెరిగి 772 కోట్ల గంటలు నమోదైంది.నాన్ –గేమ్స్ ఆదాయంఇన్ యాప్ పర్చేజ్ ఆదాయం నాన్‌గేమ్స్ విభాగాల్లో అంతర్జాతీయంగా గడిచిన పదేళ్లలో విపరీతంగా పెరిగింది. నాన్ గేమ్స్ ఆదాయం 2014లో రూ.30,625 కోట్ల నుంచి 2024లో రూ.6,05,500 కోట్లకుపైగా చేరుకుంది. 2023తో పోలిస్తే 2024లో 25 శాతం వృద్థితో రూ.1,19,875 కోట్ల అదనపు ఆదాయం పొందింది.⇒ 4.2 లక్షల కోట్ల గంటలు యాప్స్ గణాంకాలు 2024⇒ ప్రపంచ జనాలు మొబైల్‌లో వెచ్చించిన సమయం⇒ ప్రపంచ జనాలు యాప్స్‌తో గడిపిన సగటు సమయం 500 గంటలు⇒ ఒక్కొక్కరు మొబైల్‌తో వెచ్చించే సగటు సమయం 210 నిమిషాలు⇒ నిద్రలేవగానే మొబైల్‌తో గడిపే సగటు సమయం 13 నిమిషాలు⇒ప్రపంచ జనాలు రోజుకు సగటున వాడిన యాప్స్ సంఖ్య 7⇒ ప్రతి నిమిషానికి యాప్ డెవలపర్స్ ఆదాయం రూ. 2.49 కోట్లు⇒యాప్స్ డౌన్‌లోడ్స్ 13,600 కోట్లు⇒ప్రతి నిమిషానికి సగటు మొబైల్ డౌన్‌లోడ్స్ 2.58 లక్షలు⇒మొత్తం డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా 17.91 శాతం
వివాహమైన నెలకే భార్య దూరమైందని .....
Mahakumbh: వెలుపల లక్ష వాహనాలు.. 60 కోట్లు దాటిన పుణ్యస్నానాలు
మరో ఓటీటీలో క్రైమ్ సస్పెన్స్ సినిమా స్ట్రీమింగ్
‘ఫాఫో పేరెంటింగ్’ అంటే..?
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది: ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తే..
SLBC ప్రమాదం.. టన్నెల్‌లో మోకాళ్ల లోతు బురద!
జంతురూపాల్లోని 'మనుషుల జూ'..!
అరుణవ్ చిరునవ్వులు.. ఇక కానరావు
INDvsPAK: ఆదివారం.. ‘ఆట’విడుపు
వామ్మో ఇదేం బిజినెస్? విలన్ కావాలా..!
సర్.. ప్రజలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అంటున్నారు!
ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ
IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం.. శుభవార్తలు వింటారు.
ఈపీఎఫ్ విత్‌డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
ఒక్క భారత్ ఏంటి సార్! ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలైనా మనం జోక్యం చేసుకుంటున్నాం!
ఐఏఎస్ రోహిణి Vs ఐపీఎస్ రూపాల వివాదం మళ్లీ తెరపైకి..!
తెల్ల బియ్యం తిన్నా... షుగర్ పెరగదు
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
పాస్‌పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
వివాహమైన నెలకే భార్య దూరమైందని .....
Mahakumbh: వెలుపల లక్ష వాహనాలు.. 60 కోట్లు దాటిన పుణ్యస్నానాలు
మరో ఓటీటీలో క్రైమ్ సస్పెన్స్ సినిమా స్ట్రీమింగ్
‘ఫాఫో పేరెంటింగ్’ అంటే..?
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది: ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తే..
SLBC ప్రమాదం.. టన్నెల్‌లో మోకాళ్ల లోతు బురద!
జంతురూపాల్లోని 'మనుషుల జూ'..!
అరుణవ్ చిరునవ్వులు.. ఇక కానరావు
INDvsPAK: ఆదివారం.. ‘ఆట’విడుపు
వామ్మో ఇదేం బిజినెస్? విలన్ కావాలా..!
సర్.. ప్రజలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అంటున్నారు!
ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ
IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం.. శుభవార్తలు వింటారు.
ఈపీఎఫ్ విత్‌డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
ఒక్క భారత్ ఏంటి సార్! ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలైనా మనం జోక్యం చేసుకుంటున్నాం!
ఐఏఎస్ రోహిణి Vs ఐపీఎస్ రూపాల వివాదం మళ్లీ తెరపైకి..!
తెల్ల బియ్యం తిన్నా... షుగర్ పెరగదు
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
పాస్‌పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
సినిమా

నంబర్స్‌కే మర్యాద: సందీప్ కిషన్
‘‘నేను చేసిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘మజాకా’. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను, నాన్న (రావు రమేశ్) ఒకే ఇంట్లో ఉండే బ్యాచిలర్స్‌లా బతుకుతుంటాము. మమ్మల్ని ఎవరూ పండగలకు, వేడుకలకు పిలవరు. మా ఇంట్లో మహిళలు పని చేయాలనుకోరు. ఇలా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్(Sandeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’(Mazaka movie). రావు రమేశ్, అన్షు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సందీప్ కిషన్ పంచుకున్న విశేషాలు.⇒ నాకు నచ్చిన కథతో సినిమా చేశాను. నిర్మాతకు డబ్బులొచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయిపోయారు... ఇలాంటి ఉద్దేశ్యంతోనే నేను సినిమాలు చేసుకుంటూ నా కెరీర్లో పరిగెత్తాను. నా తర్వాతి సినిమాల నంబర్స్ (వసూళ్లను ఉద్దేశించి..) ఇంత ఉండాలనే నాలెడ్జ్ నాకు అప్పట్లో లేదు. ఈ నాలెడ్జ్ వచ్చే సమయానికి అంటే... 2019లో నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. ‘మైఖేల్’ నుంచి మళ్లీ పుంజుకున్నాను. నంబర్స్ గురించి ఆలోచించాను. ‘మైఖేల్’కు పెద్ద నంబర్స్ రాలేదు.కానీ నాకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రేక్షకుల్లో నాకు గుర్తింపు పెరిగింది. ‘భైరవ కోన’ మూవీ పెద్ద నంబర్స్ రాగలవనే నమ్మకాన్ని నాకు ఇచ్చింది. రాయన్ (ఇందులో సందీప్ ఓ లీడ్ రోల్ చేశారు) హిట్‌గా నిలిచింది. కానీ ఇది ధనుష్ అన్న చిత్రం. ఇప్పుడు ‘మజాకా’కు పెద్ద నంబర్స్ వస్తాయి. చెప్పాలంటే... నంబర్స్ గురించి నాకు పెద్ద ఆసక్తి లేదు. కానీ నంబర్స్ వస్తేనే మర్యాద. కళకో, కృషికో దక్కని మర్యాద నంబర్స్‌కు లభిస్తోంది. గత ఐదేళ్లలో నా మార్కెట్ పది రెట్లు పెరిగింది.⇒ ‘మజాకా’లో ఇప్పటివరకు ఎవరూ చెప్పని మంచి పాయింట్‌ను టచ్ చేశాం. రావు రమేశ్‌గారికి, నాకు మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ఆడియన్స్‌కు నచ్చేలా సినిమాలు తీస్తారు త్రినాథరావుగారు. ప్రసన్నగారు మంచి కథ రాశారు. అనిల్, రాజేశ్గార్లంటే నాకు హోమ్ ప్రోడక్షన్. ఒకరు నాకు అన్నలాంటివారు. రాజేశ్ మంచి ఫ్రెండ్. ⇒ నా పదిహనేళ్ల కెరీర్లో ముప్పై సినిమాలు చేశాను. నా జర్నీలో కొత్త కథలను, దర్శకులను, ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశాననే ఆనందం ఉంది. రాబిన్‌హుడ్ లాంటి క్యారెక్టర్‌తో పీరియాడికల్ ఫిల్మ్ చేయాలని ఉంది. అయితే ఖాళీగా అయినా ఉంటాను కానీ, కమర్షియల్ సినిమాల్లో విలన్‌గా చేయను. ఇక తమిళంలో నాకు మంచి ఆదరణ లభిస్తుండటం హ్యాపీ. ప్రస్తుతం సంజయ్ (ప్రముఖ తమిళ హీరో విజయ్ తనయుడు) డైరెక్షన్లో మూవీ చేస్తున్నాను. ‘ఫ్యామిలీ మేన్’ థర్డ్ సీజన్లో నటించాను. నెట్‌ఫ్లిక్స్‌కి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను.

సమ్మర్లో సారంగపాణి
ప్రియదర్శి, రూపా కొడవయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను గత ఏడాది డిసెంబరులోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో తాజాగా ‘సారంగపాణి జాతకం’ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.‘‘మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతను చేతలతో చేసే పనులతో ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ మూవీని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాం’’ అని ఈ సినిమాను ఉద్దేశించి మేకర్స్ తెలిపారు. ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, నరేశ్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్.

ఆశ్చర్యపడిన వారిని అబ్బుర పరిచింది!
‘ప్రతి గింజపై తినే వారి పేరు రాసి ఉంటుంది’ అంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని.... ‘ప్రతి పాటపై పాడే వారి పేరు రాసి ఉంటుంది’ అంటాడు ఏసుదాస్. సినిమాల్లోని పాత్రలకు సంబంధించి కూడా ఇది వర్తిస్తుందేమో! ఊహించిన పాత్రలో నటించి, ఆ నటనకు ఫస్ట్ క్లాసు మార్కులు తెచ్చుకుంటే ఆ సంతోషమే వేరు. ఇటీవల విడుదలైన హిస్టారికల్ డ్రామా మూవీ ‘ఛావా’లో మహారాణి యశూబాయి పాత్రలో నటించింది రష్మిక(Rashmika Mandanna). మరాఠా సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీకౌశల్, అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో నటించారు.మిగిలిన పాత్రల సంగతి ఎలా ఉన్నా సౌత్ ఇండియన్ అమ్మాయి యశూబాయి భోంస్లే పాత్రలో నటించడం ఆశ్చర్యంగా, విశేషంగా మారింది. రష్మికకు ఈ పాత్ర సవాలుగా మారింది. గతంలో ఎంతో మంది ప్రతిభావంతులు నాటకం, సినిమా, టీవీల్లో ఈ పాత్రను రక్తి కట్టించడం వల్ల సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి.ఆ అంచనాలకు తగ్గకుండా నటించి శభాష్ అనిపించుకుంది రష్మిక. ‘ఛావా’ సెట్స్‌కు సంబంధించి రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అన్–సీన్ ఫొటోలు, వీడియోలు నెట్‌లోకంలో చక్కర్లు కొడుతున్నాయి. ‘మహారాణి యశూబాయి పాత్రని పోషిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. దక్షిణ భారతానికి చెందిన అమ్మాయిగా అది సాధ్యం అవుతుంది అని అనుకోలేదు’ అని తన మనసులో మాట రాసింది రష్మిక.

ఓ ప్రేమ... ప్రేమ
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా రతన్ రిషి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్’. ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఓ ప్రేమ ప్రేమ..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.‘జారే కన్నీరే అడుగుతుందా.. . నేరం ఏముందో చెప్పమంటూ... నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా... నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా...’ అంటూ భావోద్వేంగా సాగుతుందీ పాట. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని రమ్యా బెహ్రా పాడారు. ‘‘ఒక వినూత్నమైన ప్రేమ కథతో ‘ఆర్టిస్ట్’ సినిమా రూపొందింది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘చూస్తూ చూస్తూ..’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘సత్యం’ రాజేశ్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, పి.సోనియా ఆకుల, స్నేహా, మాధురి శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమేరా: చందూ ఏజే, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సురేష్ బసంత్, లైన్ ప్రోడ్యూసర్: కుమార్ రాజా.
క్రీడలు

దాయాదుల సమరానికి సమయం
గత పద్నాలుగేళ్ల కాలంలో వన్డేలు, టి20లు కలిపి భారత్, పాకిస్తాన్ మధ్య 13 మ్యాచ్‌లు జరిగితే భారత్ 11 గెలిచి 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమిపాలైంది... ఇరు జట్ల మధ్య జరిగిన గత 11 వన్డేల్లో భారత్ 9 గెలిచి 2 ఓడింది...ఇది చాలు దాయాదిపై టీమిండియా ఆధిపత్యం ఎలా సాగుతోందో చెప్పడానికి... అయినా సరే...అంతర్జాతీయ క్రికెట్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రతీ సారి అంతే ఉత్సుకత రేపుతుంది... ఆటగాళ్లు, అభిమానులు, ప్రసారకర్తలు, విశ్లేషకులు... ఇలా అందరి దృష్టిలో ఇది ఎంతో ప్రత్యేకమైన సమరం. తుది ఫలితంతో సంబంధం లేకుండా దాయాదుల మధ్య పోరు అంటే ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోతుంది. ఆదివారం ఆటవిడుపు వేళ మరో సారి భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆతిథ్య జట్టే అయినా... ఈ మ్యాచ్ కోసం పాక్ దుబాయ్ చేరగా, ఇప్పటికే ఈ వేదికపై ఒక మ్యాచ్ గెలిచిన టీమిండియా ఉత్సాహంగా సిద్ధమైంది. భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ చేరుకుంటుంది. పాక్‌కు మాత్రం టోర్నీనుంచి నిష్క్రమించకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య. దుబాయ్: వన్డే వరల్డ్ కప్‌లో తలపడిన దాదాపు 16 నెలల తర్వాత మరో ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ వన్డే సమరానికి సై అంటున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు నేడు తలపడతాయి. భారత్ తొలి తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయగా... పాక్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలైంది. బలాబలాలు, ఫామ్‌పరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ సేనదే పైచేయిగా ఉన్నా... అనూహ్య ప్రదర్శనతో చెలరేగాలని పాకిస్తాన్ భావిస్తోంది. మార్పుల్లేకుండా... గత మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో గిల్ తన ఫామ్‌ను చాటి చెప్పగా, రోహిత్ శర్మ అందించే శుభారంభాలు జట్టును ముందంజలో నిలుపుతున్నాయి. విరాట్ కోహ్లి మాత్రమే కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. ఇంకా తనదైన స్థాయి ఆటను విరాట్ ప్రదర్శించలేదు. దాని కోసం ఇంతకంటే మంచి వేదిక ఉండదు. రాహుల్ బంగ్లాతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం రాకుండానే మన జట్టు గత మ్యాచ్‌ను ముగించింది. అక్షర్ బ్యాటింగ్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ మరోసారి నమ్మకం ఉంచుతోంది. బౌలింగ్‌లో షమీ అద్భుత పునరాగమనం భారత్ బలాన్ని ఒక్కసారిగా పెంచింది. బంగ్లాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో అతను తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. షమీకి తోడుగా హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజాలను ఎదుర్కొని పాక్ బ్యాటర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. మొత్తంగా టీమిండియా ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన చేస్తే తిరుగుండకపోవచ్చు. గెలిపించేదెవరు! పాకిస్తాన్ జట్టు పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. స్వదేశంలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో రెండుసార్లు న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పడు ఈ మెగా టోర్నీ తొలి పోరులోనూ ఓటమిపాలైంది. పైగా భారీ తేడాతో ఓడటం వల్ల రన్‌రేట్‌పై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా భారత్‌తో మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో నిలుస్తుంది. లేదంటే ఆతిథ్య జట్టుగా సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడే సమయానికి పాక్ ఆట ముగిసిపోతుంది. జట్టు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఎన్ని వైఫల్యాలున్నా ఇప్పటికీ టీమ్ నంబర్‌వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. కానీ గత మ్యాచ్‌లో కూడా అతను చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఈ సారి అతని ప్రదర్శన మెరుగవుతుందేమో చూడాలి. ఫఖర్ గాయంతో దూరం కావడంతో టీమ్‌లోకి వచ్చిన ఇమామ్ కూడా దూకుడుగా ఆడలేడు. రిజ్వాన్, షకీల్ గత మ్యాచ్‌లో విఫలమయ్యారు. సల్మాన్, ఖుష్‌దిల్ ప్రదర్శన సానుకూలాంశం. మరో వైపు బౌలింగ్ అయితే మరీ పేలవంగా ఉంది. పాక్ ఎంతో నమ్ముకున్న ముగ్గురు పేసర్లు పోటీ పడి భారీగా పరుగులిస్తున్నారు. ఇటీవలి రికార్డు చూసినా...షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్‌లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. పైగా ఒక్క నాణ్యమైన స్పిన్నర్ కూడా జట్టులో లేడు. ఈ నేపథ్యంలో పాక్ గెలవాలంటే అసాధారణ పోరాటం చేయాల్సి ఉంది. 23 వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్‌లలో పాక్‌పై భారత్ ఆధిపత్యం ఉన్నా...చాంపియన్స్ ట్రోఫీలో పాక్ రికార్డు మెరుగ్గా ఉంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరిగితే భారత్ 2 గెలిచి 3 ఓడింది. 57 - 73 ఓవరాల్‌గా భారత్, పాకిస్తాన్ మధ్య 135 వన్డేలు జరగ్గా...భారత్ 57 గెలిచి 73 ఓడింది. మరో 5 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. పిచ్, వాతావరణం గత మ్యాచ్ తరహాలోనే నెమ్మదైన పిచ్. కానీ బ్యాటర్లు పట్టుదలగా ఆడితే భారీ స్కోరు సాధించవచ్చు. వర్ష సమస్య లేదు. మంచు ప్రభావం కూడా లేదు కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, రాణా. పాకిస్తాన్: రిజ్వాన్ (కెప్టెన్), ఇమామ్, షకీల్, బాబర్, సల్మాన్, తాహిర్, ఖుష్‌దిల్, అఫ్రిది, నసీమ్, రవూఫ్, అబ్రార్.

ఇన్‌గ్లిస్ ధనాధన్ షో
లాహోర్: ఐసీసీ చాంపియన్స్(ICC Champions) ట్రోఫీలో పలు రికార్డుల్ని చెరిపేసిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్(England)నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (143 బంతుల్లో 165; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.మిడిలార్డర్ బ్యాటర్ జో రూట్ (78 బంతుల్లో 68; 4 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసి గెలిచింది. 136/4 స్కోరు వద్ద ఓటమి వెంటాడుతున్న దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ ఇన్‌గ్లిస్ (86 బంతుల్లో 120 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో జట్టును గెలిపించే దాకా క్రీజులో నిలిచాడు.ఓపెనర్ మాథ్యూ షార్ట్ (66 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (63 బంతుల్లో 69; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, లబుõÙన్ (45 బంతుల్లో 47; 5 ఫోర్లు) రాణించాడు. చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. 2009 తర్వాత ఆసీస్ చాంపియన్స్ ట్రోఫీలో గెలవడం ఇదే తొలిసారి. 2013 ఈవెంట్లో రెండింట ఓడిపోగా, ఓ మ్యాచ్ రద్దయ్యింది. 2017లో రెండు మ్యాచ్‌లు రద్దవగా, ఓ మ్యాచ్‌లో ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల ఛేదన చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) కేరీ (బి) డ్వార్షుయిస్ 10; డకెట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లబుషేన్ 165; జేమీ స్మిత్ (సి) కేరీ (బి) డ్వార్షుయిస్ 15; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 68; హ్యారీ బ్రూక్ (సి) కేరీ (బి) జంపా 3; బట్లర్ (సి) ఎలీస్ (బి) మ్యాక్స్‌వెల్ 23; లివింగ్‌స్టోన్ (సి) ఎలిస్ (బి) డ్వార్షుయిస్ 14; కార్స్ (సి) అండ్ (బి) లబుõÙన్ 8; ఆర్చర్ నాటౌట్ 21; రషీద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 351.వికెట్ల పతనం: 1–13, 2–43, 3–201, 4–219, 5–280, 6–316, 7–322, 8–338. బౌలింగ్: జాన్సన్ 7–0–54–0, డ్వార్షుయిస్ 10–0–66–3, నాథన్ ఎలిస్ 10–0–51–0, మ్యాక్స్‌వెల్ 7–0–58–1, జంపా 10–0–64–2, షార్ట్ 1–0–7–0, లబుõÙన్ 5–0–41–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: షార్ట్ (సి) అండ్ (బి) లివింగ్‌స్టోన్ 63; హెడ్ (సి) అండ్ (బి) ఆర్చర్ 6; స్మిత్ (సి) డకెట్ (బి) వుడ్ 5; లబుషేన్ (సి) బట్లర్ (బి) రషీద్ 47; ఇంగ్లిస్ నాటౌట్ 120; కేరీ (సి) బట్లర్ (బి) కార్స్ 69; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 32; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 356. వికెట్ల పతనం: 1–21, 2–27, 3–122, 4–136, 5–282. బౌలింగ్: మార్క్‌వుడ్ 9.3–0–75–1, జోఫ్రా ఆర్చర్ 10–0–82–1, కార్స్ 7–0–69–1, రషీద్ 10–1–47–1, లివింగ్‌స్టోన్ 7–0–47–1, రూట్ 4–0–26–0.లాహోర్‌లో ‘భారత భాగ్య విధాత’ భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు... ఆ దేశంలో మ్యాచ్ ఆడటం లేదు... అయినా సరే మన జనగణమన... అక్కడ మోగింది. నిర్వాహకులు చేసిన పొరపాటు వల్ల ఇది చోటు చేసుకుంది. ఏదైనా మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల జాతీయ గీతాలు వినిపించడం రివాజు. శనివారం కూడా ముందుగా ఇంగ్లండ్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ద కింగ్’ వినిపించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా ‘అడ్వాన్స్ ఆ్రస్టేలియా ఫెయిర్’ రావాల్సి ఉంది. అయితే ఆసీస్ జెండా కనిపిస్తుండగా సాంకేతిక పొరపాటు జరిగింది.భారత జాతీయ గీతంలోని పదం ‘భారత భాగ్య విధాత’ వినిపించింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన సిబ్బంది దానిని వెంటనే నిలిపివేశారు. అయితే అప్పటికే అది ప్రసారం అయిపోయింది. దీనిపై పాక్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. మైదానంలో నిర్వహణా బాధ్యతలు చూస్తున్న ఐసీసీ వివరణ ఇవ్వాలని కోరింది.

చరిత్ర సృష్టించిన బెన్ డకెట్.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికి డకెట్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. స్టార్ బ్యాటర్ జో రూట్‌తో కలిసి స్కోర్ బోర్డును డకెట్ పరుగులు పెట్టించాడు.ఈ జోడీ మూడో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో కేవలం 95 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్‌ను డకెట్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 143 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 165 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు జో రూట్ (68), కెప్టెన్ జోస్ బట్లర్ (23) రాణించారు.డకెట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన డకెట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.డకెట్ సాధించిన రికార్డులు ఇవే..👉ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా డకెట్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం నాథన్ ఆస్ట్లీ పేరిట ఉండేది. నాథన్ ఆస్ట్ లీ 2004లో అమెరికాపై 145 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఆస్ట్లీ రికార్డును డకెట్ బ్రేక్ చేశాడు.👉ఐసీసీ టోర్నమెంట్(వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా డకెట్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో ఆసీస్ పై సచిన్ 141 పరుగులు చేశాడు. 👉ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగానూ డకెట్ రికార్డు సాధించాడు. కెవిన్ పీటర్సన్ ను అతడు అధిగమించాడు. 2007 వన్డే ప్రపంచకప్ లో పీటర్సన్ ఆసీస్ పై 104 పరుగులు చేశాడు.చదవండి: Champions Trophy: టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టుకు ‘స్పెషల్ కోచ్’

టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టుకు ‘స్పెషల్ కోచ్’
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్(IND-PAK) జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. పాక్‌పై కూడా గెలిచి సెమీస్‌కు ఆర్హత సాధించాలని పట్టుదలతో ఉంది.కానీ పాకిస్తాన్‌కు మాత్రం ఇది డూర్ ఆర్ డై మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌పై ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.కేవలం ఒక్క మ్యాచ్ కోసం తమ జట్టు స్పెషల్ కోచ్‌గా మాజీ క్రికెటర్ ముదాసర్ నాజర్‌ను పీసీబీ నియమించింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్‌తో కలిసి ముదాసర్ పనిచేయనున్నాడు. రెండు రోజుల కిందటే జట్టుతో కలిసిన ముదాసర్.. ప్రాక్టీస్ సెషన్లో తన అనుభవాన్ని ఆటగాళ్లతో పంచుకున్నాడు.కాగా ముదాసర్ దుబాయ్ పిచ్ కండీషన్స్‌పై విస్తృతమైన అవగాహన ఉంది. అతడు గత కొంతకాలంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముదాసర్ను పాక్ క్రికెట్ బోర్డు తమ జట్టు కోచింగ్ స్టాప్‌లోకి తీసుకుంది. కాగా ముదాసర్కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో పాకిస్తాన్, కెన్యా, యూఏఈ జట్లకు కోచ్‌గా అతడు పనిచేశాడు. అంతేకాకుండా లాహోర్‌లోని పీసీబీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ డైరకర్ట్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ముదాసర్ పాకిస్తాన్ తరఫున 76 టెస్ట్‌లు ఆడి 4114 పరుగులు, 122 వన్డేల్లో 2653 పరుగులు చేశాడు.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్‌దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: Champions Trophy: కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్‌మేన్‌లా డైవ్ చేస్తూ! వీడియో వైరల్
బిజినెస్

మఖానా... మా ఖానా!
పేరేమో బ్లాక్ డైమండ్స్.. లోపలున్నది వైట్ గోల్డ్! అవునండీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న సూపర్ ఫుడ్ ‘మఖానా’సంగతే ఇది. పుష్కలమైన పోషకాలతో ఆరోగ్య వరప్రదాయినిగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఫూల్ మఖానా క్రేజ్ కేక పుట్టిస్తోంది. బిహారీ రైతులకు కాసుల పంటగా మారింది. మఖానాకు తాజా కేంద్ర బడ్జెట్లో కూడా పెద్దపీట వేయడంతో దీని పేరు మరింత మార్మోగుతోంది. మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించింది. దీనివల్ల మార్కెటింగ్ సదుపాయాలు పెరగడంతో పాటు రైతులకు కూడా మరింత చేయూత లభించనుంది. సాక్షి, బిజినెస్ డెస్క్: రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ రారాజుగా నిలుస్తున్న మఖానా.. ప్రపంచ సూపర్ ఫుడ్స్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఫూల్ మఖానా, లోటస్ సీడ్స్, పఫ్డ్ వాటర్ లిల్లీ సీడ్స్, ఫాక్స్ నట్స్ వంటి పేర్లతో ప్రాచుర్యం పొందిన వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే తామర గింజలు. సహజమైన, సమతుల్య ఆహారంతో శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఈ బ్లాక్ డైమండ్స్ వరంలా మారుతున్నాయి. ఇతర చిరుతిళ్లకు బదులు పోషకాల ఖజానా.. మఖానాను డైట్లో చేర్చుకుంటున్నారు. మిలీనియల్స్‌తో పాటు జెన్ జీ యువతరం కూడా ఇప్పుడు దీని వెంట పడుతున్నారు. విదేశాలకు ఎగుమతులు జోరందుకోవడంతో ‘వైట్ గోల్డ్’రేటు కూడా బంగారంలా దూసుకెళ్తోంది. మార్కెట్లో కేజీ ధర రూ.2,000 పైనే పలుకుతోంది. పెళ్లిళ్లతో పాటు ఏ పంక్షన్లో చూసినా మఖానా వంటకం ట్రెండింగ్ ఫుడ్‌గా నిలుస్తోంది! ఇక హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఈ హెల్తీ స్నాక్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ చానెల్స్ కూడా వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తుండటంతో మఖానాకు మాంచి డిమాండ్ నెలకొంది. బిహార్ హబ్..ప్రపంచవ్యాప్తంగా మఖానా ఉత్పత్తిలో 90 శాతం వాటా భారత్‌దే. అందులో 85 శాతం ఒక్క బిహార్ నుంచే వస్తుండటం విశేషం! అంతర్జాతీయంగా ఈ సూపర్ ఫుడ్‌కు ఫుల్ డిమాండ్‌తో బిహార్ రైతులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మిథిలాంచల్ ప్రాంతం ఈ పంటకు ప్రధాన కేంద్రం. ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో పాటు పుష్కలంగా చిత్తడి నేలలు (వెట్ ల్యాండ్స్) ఉండటం తామర పంట సాగుకు సానుకూలంగా నిలుస్తోంది. 200 ఏళ్లుగా ఇక్కడ మఖానా సాగు కొనసాగుతూనే ఉంది. మధుబనీ దీనికి పుట్టినిల్లుగా చెబుతారు. 2020లో బిహార్ మఖానాకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కూడా లభించడంతో ప్రపంచవ్యాప్తంగా మరింత ఖ్యాతి పొందింది. ఎందుకింత రేటు? ఫూల్ మఖానా ఒక ప్రత్యేకమైన తామర పూల రకానికి చెందినది. సాధారణంగా ప్రిక్లీ వాటర్ లిల్లీగా పిలిచే దీని శాస్త్రీయ నామం యూరేల్ ఫెరాక్స్. ఇవి ఎక్కువగా ఆసియా ప్రాంతంలో చెరువుల్లో, చిత్తడి నేలల్లో పెరుగుతాయి. తామర పూల రెక్కలన్నీ రాలిపోయాక.. నల్లటి విత్తనాలు నీటి అడుగుకు (4–12 అడుగుల లోతు) చేరుకుంటాయి. రైతులు వీటిని వలలు, బుట్టలతో సేకరించాక, ఎండలో బాగా ఆరబెడతారు. తర్వాత ప్రత్యేకంగా వేయించి, జాగ్రత్తగా గింజల్ని పగలగొడితే తెల్లగా.. పఫీగా ఉండే ఫాక్స్ నట్స్ విక్రయానికి సిద్ధమవుతాయి. ఇదంతా ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ. ఇది కొన్ని ప్రాంతాల్లోనే, అది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఈ పంట సాగవుతోంది. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతోంది. సరఫరా పరిమితంగా ఉండటం.. దేశ, విదేశాల్లో గిరాకీ భారీగా పెరిగిపోవడంతో రేటు అ‘ధర’హో అనిపిస్తోంది! మార్కెట్ రయ్... 2023లో భారత్ మఖానా మార్కెట్ పరిమాణం రూ.780 కోట్లుగా నమోదైంది. 2032 నాటికి ఇది రూ.1,890 కోట్లకు వృద్ధి చెందుతుందని ఐమార్క్ గ్రూప్ అంచనా వేసింది. ఏటా ఈ మార్కెట్ 9.7 శాతం వృద్ధి చెందనుందని లెక్కగట్టింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 25,130 టన్నుల మఖానా ఎగుమతులు జరిగాయి. భారత్ నుంచి ఫూల్ మఖానా ఎగుమతికి అతిపెద్ద మార్కెట్‌గా అమెరికా ఉంది. కెనడా, ఆ్రస్టేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాల ప్రజలు కూడా మన మఖానాను లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే, 2024లో 15 కోట్ల డాలర్లుగా ఉన్న ఫూల్ మఖానా మార్కెట్.. 2031 నాటికి 8.5 శాతం వార్షిక వృద్ధితో 26.6 కోట్ల డాలర్లకు చేరవచ్చని కాగి్నటివ్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఆరోగ్యమే ’మఖానా’భాగ్యం.. » మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కీలకమైన ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్లే ఇది గ్లోబల్ సూపర్ ఫుడ్‌గా పేరుగాంచింది. » ప్రతి 100 గ్రాముల గింజల్లో 9.7 గ్రాముల ప్రొటీన్, 14 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది శాఖాహారులకు అద్భుతమైన ప్రొటీన్ సోర్స్‌గా మారింది. » 25 గ్రాముల మఖానాలో 89 క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు మఖానా మంత్రం జపిస్తున్నారు. » గ్లూటెన్ అస్సలు లేకపోవడం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక పీచు పదార్థం (ఫైబర్) ఉండటం వల్ల మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. » ఇక అధిక మెగ్నీషియం, తక్కువ సోడియం కారణంగా రక్తపోటును నియంత్రించి, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు హాజరు నిబంధనలను కఠినతరం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానంలో మార్పులు ప్రకటించింది. నోయల్ టాటా నేతృత్వంలోని ఐటీ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం మరింత నిర్మాణాత్మక ఇన్-ఆఫీస్ వర్క్ మోడల్ వైపు మారడాన్ని సూచిస్తుంది. ఇప్పటికీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని కొన్ని కంపెనీ నుండి టీసీఎస్‌ను భిన్నంగా చేస్తుంది.డబ్ల్యూఎఫ్‌హెచ్ పాలసీలో కీలక మార్పులు ఇవే..ఉద్యోగులు ఇప్పుడు త్రైమాసికానికి ఆరు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు. ఒక వేళ వీటిని ఉపయోగించని పక్షంలో తదుపరి త్రైమాసికానికి బదిలీ చేసుకోవచ్చు.స్థల పరిమితుల కారణంగా ఉద్యోగులు ఒకే ఎంట్రీలో 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్ వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు లాగిన్ చేయవచ్చు. 10 రోజుల్లోగా సబ్మిట్ చేయని అభ్యర్థనలు స్వయంచాలకంగా తిరస్కరణరకు గురవుతాయి.చివరి రెండు పనిదినాల్లో మాత్రమే బ్యాక్ డేటెడ్ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుత నెలకు సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంట్రీలను వచ్చే నెల 5వ తేదీ వరకు పెంచుకోవచ్చు.రెండు, మూడు రోజులు ఆఫీసు హాజరును అనుమతించే ఇతర ఐటీ సంస్థల మాదిరిగా కాకుండా టీసీఎస్ ఐదు రోజుల అటెండెన్స్ విధానాన్ని అమలు చేసింది.ఉద్యోగులపై ప్రభావం..సవరించిన విధానం టీసీఎస్ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కఠినమైన హాజరు నిబంధనలు, మరింత నిర్మాణాత్మక పని వాతావరణానికి సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్పులు ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగుల హాజరుపై మెరుగైన పర్యవేక్షణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సహాయక, సానుకూల వర్క్ ప్లేస్ సంస్కృతిని సృష్టించడం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతున్నాయి.ఉద్యోగులు ప్రేరణ, నిమగ్నతతో కూడిన సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ నొక్కి చెప్పారు. సహకార, మద్దతు సంస్కృతిని ప్రోత్సహించాలని, ఉద్యోగులు కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపేలా చూడాలని మేనేజర్లకు పంపిన కమ్యూనికేషన్ లో లక్కడ్ కోరారు.

జియో కొత్త ప్లాన్.. జియోహాట్‌స్టార్ ఫ్రీ
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.195 డేటా-ఓన్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ డేటా యాడ్-ఆన్ వోచర్‌గా వస్తుంది. ఇది అదనపు డేటాతోపాటు జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా జియోహాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్, ఇతర కంటెంట్‌ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్‌ను రూపొందించారు.రూ.195 ప్లాన్ ప్రయోజనాలురూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్‌స్టార్‌ను మొబైల్‌లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్‌ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్‌తోపాటు జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది.

రియల్టీలో ఆసక్తి.. లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు మొగ్గు
దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. 65 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తులపై ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియల్టీ(ఐఎస్‌ఐఆర్) వార్షిక సర్వే వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసి రావడమే.. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు.61 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు 2024–25లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్ అపార్ట్మెంట్లు కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్‌హౌస్‌లు, హాలిడే హోమ్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు.గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 34 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలామంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. 2015 గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యత మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే..ఈ నగరాలే హాట్‌స్పాట్స్.. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఫ్యామిలీ

నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!
మీకు ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు.. ఇంకా? ఈ మూడేనా? నాలుగైదు భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మాట్లాడటం సరే, వాళ్లు ఆ భాషలు రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మహమూద్ అక్రమ్. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాలా 400 భాషలు. అంతేకాకుండా, సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికి మూడు ప్రపంచ రికార్డులు సాధించాడు.అక్రమ్ తండ్రి షిల్బీ మొళిప్పిరిన్. ఉద్యోగరీత్యా రకరకాల దేశాలు ప్రయాణించేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థంకాక, వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. దాంతో తండ్రి అక్రమ్‌కు నాలుగేళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. ఆరు రోజుల్లో మొత్తం ఇంగ్లీషు అక్షరాలు (English Letters) నేర్చుకున్న అక్రమ్, మూడు వారాల్లో తమిళంలోని 299 అక్షరాలను నేర్చేసుకుని ఆ చిన్నవయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఆరేళ్ల వయసొచ్చేసరికి తండ్రితో రకరకాల భాషల్లో మాట్లాడటమే కాకుండా తమిళ వాక్యాలను స్పష్టంగా చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో 50 భాషలు సాధన చేసి, వాటి మీద అవగాహన తెచ్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించి, వివిధ భాషల పుస్తకాలు తెప్పించి, అతనికి ఇచ్చేవారు మొళిప్పిరిన్. కేవలం చదవడమే కాకుండా, ఆ భాషల్లో టైప్ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్, అతి చిన్నవయసులో వివిధ భాషలు టైప్ చేసి మొదటి ప్రపంచ రికార్డు సాధించాడు.10 ఏళ్ల వయసులో మన జాతీయ గీతం ‘జనగణమన’ను ఒక్క గంటలో 20 భాషల్లో రాసి రెండో ప్రపంచ రికార్డు సాధించాడు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి 400 భాషలు చదివి, రాసి, టైప్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో మూడోసారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్, అందుకుగానూ జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘జర్మనీ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్ అనువాదకులు సైతం ఆశ్చర్యపోయారు.చదవండి: డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్అయితే భాషల మీద ఇంత పట్టున్న అతనికి స్కూళ్ల నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టాలని అతణ్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్ మానేసి, ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి, ఆస్ట్రియాలోని డనుబే ఇంటర్నేషనల్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ ఇచ్చి మరీ తమ స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్ యూకేలోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి భాషావిభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు.

Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్ సుమ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela) అత్యంత ఉత్సాహంగా కొన సాగుతోంది. ఇప్పటికే 60కోట్ల మంది భక్తులు తరలి వచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం త్వరలో ముగియనున్న నేపథ్యంలో భక్తుల సందడి మరింత పెరిగింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో స్నానాలు చేసిన తమభక్తిని చాటుకున్నారు. రాజకీయ, వ్యాపారం, క్రీడారంగ ప్రముఖులతోపాటు, పలువురు సినీ స్టార్లు మహాకుంభమేళాను దర్శించు కున్నారు. ఇపుడు ఈ కోవలో ప్రముఖ యాంకర్ సుమ (sumakanakala) నిలిచారు. మహాకుంభ మేళా సందర్శనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తొలిసారి మహాకుంభమేళాకు వచ్చాను అంటూ సంతోషాన్ని ప్రకటించారు. ఇదీ చదవండి:ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!కాగా ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా. ఈ మహా వేడుక జనవరి 13న కుంభమేళా ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 21 వరకు సాగనుంది. ఇప్పటిదాకా మొత్తం 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.ఓదెల -2 టీజర్ లాంచ్ సందర్బంగా మహాకుంభకు వెళ్లిన సుమ అక్కడ పవిత్న స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మూవీ టీంకు అభినందనలు తెలిపారు. మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేసారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ నటిస్తున్నారు. నాగ సాధు పాత్రలో ఆమె స్టన్నింగ్ లుక్ లో కనిపించింది. 2022లో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకి సీక్వెల్. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు దారుడు, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్‌ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణం చేయడం విశేషంగా నిలిచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాశ్ పటేల్ ప్రేయసి అలెక్సీస్ విల్కిన్స్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఎవరీ అలెక్సీస్? వీరిద్దరి లవ్ స్టోరీ ఏంటీ అనే ఆసక్తి ఏర్పడింది. మరి ఆవివరాలేంటో చూసేద్దామా!ప్రమాణ స్వీకారం తర్వాత, పటేల్ ప్రసంగిస్తూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన కుటుంబం,స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. వారి వల్లే తానిక్కడ ఉన్నానిని చెప్పాడు. అలాగే సోదరి నిషా మేనల్లుడు లండన్ నుండి వచ్చారని పేర్కొన్నాడు. తన అందమైన ప్రేయసి అలెక్సిస్ కూడా ఇక్కడే ఉంది అనగానే చప్పట్లు మారుమోగిపోయాయి. WATCH: Kash Patel's full remarks after being sworn in as FBI Director:"Anyone who thinks the American Dream is dead, look right here. You're talking to a first-generation Indian kid who is about to lead the law enforcement community in the greatest nation on God's Earth." pic.twitter.com/PQrCkme9az— Rapid Response 47 (@RapidResponse47) February 21, 2025కాశ్ పటేల్ (44) అక్టోబర్ 2022లో జరిగిన కన్జర్వేటివ్ రీఅవేకెన్ అమెరికా టూర్లో అలెక్సిస్ (26)ను మొదటిసారి కలిశారు. ఇద్దరూ దేశభక్తులు, వారు సంప్రదాయవాద విలువలను ఇష్టపడ్డారు. అలా వారిద్దరి పరిచయం క్రమంగా బలపడింది. 2023లో డేటింగ్ ప్రారంభించారు.చదవండి: Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్ సుమBirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలుఅలెక్సీస్ వినాష్ విల్లేకు చెందిన గాయని, పాటల రచయిత్రి కూడా. అనేక స్వచ్ఛసంస్థలతో కలిసి పనిచేస్తోంది. 1999 నవంబర్ 3న ఆమె అర్కాన్సాస్లో పుట్టింది. అయితే ఆమె బాల్యం అంతా ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్‌లోనే గడిచింది. అమెరికా వచ్చిన తరువాత యూఎస్మీదే, అక్కడి సంగీతం మీద ఇష్టం ఏర్పడింది. బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో చదివి వ్యాపారం మరియు రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసింది. కేవలం 8 ఏళ్ల వయస్సులో తన మొదటి పాటను రాయడం విశేషం.విలియమ్స్-ముర్రే రైటింగ్ అవార్డు, ఎకనామిక్ క్రిటికల్ థింకింగ్ అవార్డులను గెలుచుకుంది.

డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్
సాక్షి, ముంబై: ముంబై, నవీ ముంబై నగరాల్లోని చిన్నారులకు త్వరలోనే ఒక గొప్ప వినోద అనుభవం లభించనుంది. మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, డోనాల్డ్ డక్, గూఫీ వంటి ప్రసిద్ధ కార్టూన్ పాత్రలను ప్రత్యక్షంగా చూసే అవకాశంతో పాటు, థ్రిల్లింగ్ రైడ్లను ఆస్వాదించే అవకాశం కల్పించేందుకు కొత్త థీమ్ పార్క్ ఏర్పాటు కానుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) గ్రోత్ హబ్’ప్రాజెక్టులో భాగంగా నవీ ముంబైలో 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక భారీ థీమ్ పార్క్ నిర్మాణం కోసం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) ప్రణాళికలు రూపొందించింది. ఎంఎంఆర్‌లో పర్యాటక వృద్ధి కోసం... పరిశ్రమ, పర్యాటకం, విద్య, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, ఆరోగ్యం, ఓడరేవుల అభివృద్ధికి సంబంధించి ఎంఎంఆర్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెమ్మార్డీయే గ్రోత్ హబ్ ప్రాజెక్టుకింద పలు ప్రణాళికలను రూపొందించింది.ఇందులో భాగంగా పర్యాటక కేంద్రంగా అలీబాగ్ అభివృద్ధి, ముంబైలోని చారిత్రక కోటల పరిరక్షణతో పాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు నవీ ముంబైలో డిస్నీల్యాండ్ తరహాలో భారీ థీమ్ పార్క్‌ను నిరి్మంచాలని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: వరుడి ముద్దు : రెడ్ లెహెంగాలో సిగ్గుల మొగ్గైన పెళ్లికూతురుమొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో... ప్రస్తుతం ముంబై, నవీ ముంబై, థానేలతో పాటు ఎంఎంఆర్ పరిధిలో అనేక రిసార్టులు, థీమ్ పార్కులు, వాటర్ పార్కులు ఉన్నాయి. అయితే మొట్టమొదటి సారిగా ప్రభుత్వం, ఎమ్మెమ్మార్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన రిసార్టులు, యానిమేషన్ స్టూడియోలు, రైడ్ జోన్లు, వాటర్ పార్క్, ఇతర ఆధు నిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ థీమ్ పార్కు రాష్ట్ర పర్యాటక రంగంలో పెద్ద మైలురాయి కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. (BirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు)
ఫొటోలు
National View all

Mahakumbh: వెలుపల లక్ష వాహనాలు.. 60 కోట్లు దాటిన పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు ఆఖరి

ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది: ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తే..
ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.

Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Mahakumbh) అత్యంత వైభవ

మహా కుంభ్‌కు 60 కోట్ల మంది..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాక

మహా ’కాసుల’ మేళా!
సాక్షి, బిజినెస్ బ్యూరో: మహా కుంభమేళా కాసులు కురిపిస్
International View all

అమెరికాలో ఉద్యోగులకు మస్క్ బిగ్ షాక్..!
వాషింగ్టన్:అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ ఆఫ

భారత్, చైనాలకు ట్రంప్ మార్క్ షాక్!
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఉత్పత్తులపై భారత్, చైనా దేశాలు

ఈవిడ... పాస్‌పోర్ట్‌లో ‘అతను’
వాషింగ్టన్: జన్మత: అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిన ప్రముఖ

కోట్లు పంచుకుందాం.. టికెట్ ఇవ్వండి
పారిస్: రూపాయి రూపాయి నువ్వేం చేయగలవంటే?.

ఆరుగురు బందీలకు విముక్తి
నుసెయిరత్: కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు కమ్ముకుంటున్న
NRI View all

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు ద

మాట నూతన కార్యవర్గం ఏర్పాటు
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్-మాట బోర్డు మీటింగ్ డల్లాస్ లో ఘనంగా జరిగింది.

న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్
ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి.

సులభతర వీసా విధానం అవసరం
న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్

గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్
క్రైమ్

వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్‌జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్జిత్కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్‌జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్‌జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది. जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025 VIDEO Credits: VeerArjunDainik

Visakhapatnam: మహిళపై జ్యోతిష్యుడు అత్యాచారం..
కొమ్మాది(విశాఖపట్నం): పెందుర్తి బీసీ కాలనీకి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న అలియాస్ అప్పన్న దొర (50) అస్థి పంజరం కేసు మిస్టరీ వీడింది. భీమిలి నేరెళ్ల వలసకు చెందిన భార్యాభర్తలు గుడ్డాల మౌనిక, ఊళ్ల చిన్నారావు పథకం ప్రకారం అతన్ని హత్య చేశారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు, సీసీ ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమిలి పోలీసులు నిందితులను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. భీమిలి సీఐ బి.సుధాకర్ తెలిపిన వివరాలివి..పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్‌లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటింటికీ వెళ్లి జ్యోతిష్యం చెబుతుంటాడు. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లలో పూజలు చేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఆయన ఈ నెల 9న ఆనందపురం వెళ్తున్నట్లు ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి రాకపోవడంతో 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఉప్పాడ ప్రాంతంలో అప్పన్న తప్పిపోయినట్లు గుర్తించి, ఆ ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించారు. అక్కడ ఓ ప్రైవేట్ లేఅవుట్లో అప్పన్నకు సంబంధించిన అవశేషాలు గుర్తించారు.పథకం ప్రకారం.. కత్తితో పొడిచికాగా.. నిందితులు నెల రోజుల కిందట ఆనందపురం మండలం లొగడలవానిపాలెంలో ఒక అద్దె ఇంట్లో దిగారు. అక్కడకు సమీపంలో ఉన్న యడ్ల తిరుపతమ్మ అనే టీ దుకాణం యజమానితో వారికి పరిచయం ఏర్పడింది. అదే టీ దుకాణానికి ప్రతి మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వస్తుండేవాడు. చుట్టు పక్కల గ్రామాల్లో వాస్తు, పూజలు చేస్తుండేవాడు. తనకు కూడా సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని నిందితురాలు అప్పన్నకు చెప్పగా ఇంటికి వచ్చి పూజలు చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో మౌనిక ఇంటికి వెళ్లిన అప్పన్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవరికై నా చెపితే కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఆమె ఈ విషయాన్ని తన భర్త చిన్నారావుకు తెలియజేయగా అప్పన్న దొరను హత్య చేయడానికి పథకం వేశారు. ఉప్పాడలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని, పూజ చేయాలని చిన్నారావు అప్పన్నను నమ్మించాడు. రూ.7 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 9న బటన్ కత్తి, పల్సర్ బైక్ తెప్పించుకుని అతన్ని ఆనందపురం మండలం క్రాస్ రోడ్డు, బోయపాలెం మీదుగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ లే అవుట్‌కు తీసుకువెళ్లాడు. అతన్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చిన్నారావు కుడిచేతి చూపుడు వేలికి గాయం కాగా కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్నాడు.ఒక రోజు ఆగి..ఆధారాలు లేకుండా చేసేందుకు తర్వాత రోజు టిన్నర్, పెట్రోల్ కొనుగోలు చేశాడు. 11వ తేదీ వేకువజాము 4 గంటల సమయంలో రెండు లీటర్ల టిన్నర్, మరో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొని తన భార్యతో కలిసి బయలుదేరాడు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో చిన్నారావు జ్యోతిష్యుడిని హత్య చేశాడని, ఈ ఘటనలో భర్తకు మౌనిక సహకారం అందించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ బి.సుధాకర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బటన్ కత్తి, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్ ప్యాంటు, అప్పన్నదొర ఫోన్ పౌచ్, లైటర్, పల్సర్ ద్విచక్రవాహనం, కీ పాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై!

యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా.. 10 మంది మహిళలు అరెస్ట్
గుణదల(విజయవాడతూర్పు): స్పా సెంటర్ల ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై మాచవరం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డు సమీపంలో స్టూడియో 9, ఏపీ 23 పేరుతో చలసాని ప్రసన్న భార్గవ్ ప్రైవేట్ యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఆ బిల్డింగ్ పై భాగంలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నట్లు నమ్మించి ఆ ముసుగులో స్పా సెంటర్లో వ్యభిచార గృహం నడుపుతున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అక్రమంగా రప్పించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు. అమ్మాయిలతో వల వేసి బడా బాబులను టార్గెట్ చేసి లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. ఆ బిల్డింగ్‌లో వ్యబిచారం జరుగుతున్నట్లు మాచవరం పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి స్పా సెంటర్ పై దాడి చేశారు. అక్కడ ఉన్న పది మంది మహిళలను, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దాడి విషయం తెలిసిన భార్గవ్ పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలసులు గాలిస్తున్నారు.మరెన్నో ఆరోపణలు..భార్గవ్‌కు పలు వ్యభిచార ముఠాలతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూ ట్యూబ్ చానల్ పేరుతో ధనికులను, అధికారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నేతగా చెలామణి అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..!

జీఎస్టీ అధికారి ఇంట్లో మిస్టరీ మరణాలు..!
కొచ్చి:కేరళలోని కొచ్చిలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్‌కు చెందిన 42 ఏళ్ల జీఎస్టీ అధికారితో పాటు అతడి 80 ఏళ్ల తల్లి,35ఏళ్ల సోదరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరు చనిపోయి నాలుగు రోజులవుతోందని,మృతదేహాలు కుళ్లిపోవడం స్టార్టైందని కొచ్చి త్రిక్కాకర పోలీసులు తెలిపారు.జీఎస్టీ అధికారి ఇంటిలో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి తలుపు తెరవగా మరణాల విషయం బయటపడింది.అధికారి తల్లి మృతదేహం ఒక షీట్‌తో కప్పిఉండడం అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ అధికారి సోదరి జార్ఖండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(జేఏఎస్) అధికారిగా పనిచేస్తున్నారు.ఆమె పబ్లిక్ సర్వీస్ పరీక్షలో తొలి ర్యాంక్ సాధించారు. అయితే పరీక్షల అవకతవకలకు సంబంధించి ఆమెపై ప్రస్తుతం సీబీఐ కేసు విచారణలో ఉంది. ఆమె మరణం ఆశ్చర్యానికి గురిచేసిందని తోటి జేఏఎస్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాథమికంగా వీరివి ఆత్మహత్యలనే పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం వివరాలొచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు.