Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt Fail In Tenth exam paper leaked in YSR district1
'పరీక్షల్లో' ప్రభుత్వం ఫెయిల్‌

సాక్షి, అమరావతి: ఇప్పటికే విద్యారంగ సంస్కరణలను నీరుగార్చి, చదువులను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు.. పరీక్షల వ్యవస్థను సైతం మూడు లీకులు.. ఆరు మాస్‌ కాపీయింగ్‌ల స్థాయికి దిగజార్చేసింది. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్, ఇంటర్‌ పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన నిర్వాకాలే దీనికి నిదర్శనం. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో కష్టపడి చదివిన విద్యార్థులు విద్యా వ్యవస్థపైనే నమ్మకం కోల్పోతున్నారని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. కనీసం ప్రశ్న పత్రాల ముద్రణ సరిగా ఉందో లేదో కూడా పరిశీలించకుండా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడుతున్నారు. కార్పొరేట్‌ కాలేజీల సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నా పత్రాన్ని మార్చేసిన ఘనత కూటమి సర్కారులోనే కనిపిస్తోందంటున్నారు. ఈ ఏడాది 10,58,893 మంది ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,49,884 మంది టెన్త్‌ విద్యార్థులు ప్రస్తుతం పరీక్షలు రాసున్నారు. ప్రభుత్వ నిర్వాకాలు వారి భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసేలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏ పరీక్ష అయినా పకడ్బందీగా నిర్వహించారని, ఏ ఒక్క చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 2022లో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణ విద్యాసంస్థల నేతృత్వంలో పేపర్‌ లీక్‌కు జరిగిన యత్నాలను సమర్థంగా అడ్డుకుని కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్‌ చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలను సైతం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పారదర్శకంగా, రికార్డు వేగంతో నిర్వహించి భర్తీ చేసిందని ఉదహరిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మళ్లీ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.⇒ మార్చి 17 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు మేలు చేసేలా మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారాలు పలు చోట్ల వెలుగు చూశాయి. ఈనెల 21న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్‌ పాఠశాలలోని ఏ, బీ కేంద్రాలలో మాల్‌ ప్రాక్టీస్‌కు తెర తీశారు.లీకేజీలకు కేరాఫ్‌ బాబు పాలనటీడీపీ అధికారంలో ఉండగా 1995లో పదో తరగతి ప్రశ్నపత్రం, 1997లో ఇంటర్‌ ప్రశ్నాపత్రం లీకై విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2017లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఉన్న నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. 2019లో కూడా చంద్రబాబు పాలనలో కర్నూలులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తాజాగా వైఎస్సార్‌ జిల్లాలో పదో తరగతి పేపర్‌ లీకైంది.టెన్త్‌ పేపర్‌ లీక్‌... 9 మంది అరెస్టుపదో తరగతి మ్యాథ్స్‌ ప్రశ్నాపత్రం లీక్‌ ఘటనకు సంబంధించి వైఎస్సార్‌ జిల్లా పోలీసులు బుధవారం 9 మందిని ఖాజీపేట మండలం ఏటూరు గ్రామం అల్లాడుపల్లి క్రాస్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. వల్లూరు జడ్పీ హైసూ్కల్‌ కేంద్రంలో ప్రశ్నా పత్రాన్ని వాట్సాప్‌ ద్వారా లీక్‌ చేసి చిట్టీలు తయారు చేశారు. వాటర్‌ బాయ్‌ సాయి మహేష్‌ షేర్‌ చేసేందుకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. కమలాపురం వివేకానంద ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ విఘ్నేష్‌రెడ్డి అలియాస్‌ విఘ్నేష్, కరస్పాండెంట్‌ రామసుబ్బారెడ్డి, మాథమేటిక్స్‌ టీచర్‌ శ్రీకాంత్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్‌ గెస్ట్‌ టీచర్‌ శ్రావణి, టీచర్‌ మధుయాదవ్, పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెంటెండ్‌ ఎం.రామకృష్ణమూర్తి, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ ఎన్‌.శ్రీనివాసరెడ్డి, ఇన్విజిలేటర్‌ ఎం.రమణ వీరిలో ఉన్నారు. ప్రశ్నాపత్రం లీక్‌పై డీఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇక్కడ విద్యార్థులకు స్లిప్పులు అందించడం.. పుస్తకాలు ముందుంచి జవాబులు రాస్తూ ఉపాధ్యాయులు పట్టుబడ్డ వ్యవహారం బట్టబయలైంది. దీంతో 11 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు హెచ్‌ఎంలు, రికార్డు అసిస్టెంట్‌ సహా మొత్తం 15 మందిని సస్పెండ్‌ చేశారు. ⇒ వైఎస్సార్‌ జిల్లా వల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రశ్నపత్రం లీక్‌ చేసి వాట్సాప్‌లో తిప్పారు. ఈనెల 24న ఇక్కడ పదో తరగతి లెక్కల పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా కొద్దిసేపటికే పేపర్‌ బయటకు వచ్చినట్లు గుర్తించారు. స్కూల్లో ఓ వాటర్‌ బాయ్‌ విద్యార్థుల నుంచి పేపర్‌ తీసుకుని వాట్సాప్‌ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పని చేస్తున్న వ్యక్తికి పంపినట్లు తేలింది. నిషిద్ధ ప్రాంతంలో వాటర్‌ బాయ్‌ వద్ద స్మార్ట్‌ ఫోన్‌ లభించడం విస్మయం కలిగిస్తోంది. ఉత్తీర్ణత పెరగాలంటూ ఒత్తిళ్లు..విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అస్తవ్యస్థ నిర్ణయాలతో చదువులను నీరుగార్చిన ప్రభుత్వం పరీక్షల్లో మాత్రం అత్యధికంగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ ఉపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలిచ్చింది. ఒకపక్క ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో జూన్‌లో ప్రక్రియ ప్రారంభించి అక్టోబర్‌ వరకు సాగదీసింది. అయినా నూరు శాతం పూర్తి చేయలేదు. మరోపక్క ‘అర్జెంట్‌ రిపోర్టు’ పేరుతో రోజూ మెస్సేజులు పంపుతూ బోధనను గాలికొదిలేసింది. తీరా పరీక్షల నాటికి ఫలితాల కోసం ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పెట్టారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటూ టీచర్ల మెడపై కత్తి వేలాడదీసింది! మీరు ఏం చేసినా సరే.. గతంలో కంటే ఎక్కువగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ హెచ్చరించింది. తన గొప్పల కోసం పాస్‌ శాతం పెరగాలని విద్యాశాఖ మంత్రి ఆదేశిస్తుండగా.. ఆయన వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారులు మరో ముందడుగు వేసి ఆయా సబ్జెక్టుల్లో పర్సంటేజ్‌ పెరగకుంటే నోటీసులు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని స్లిప్పులు రాసే స్థితికి దిగజార్చారు. ఇంటర్‌ పేపర్‌లో తప్పులు.. ⇒ మార్చి 5న జరిగిన ఇంటర్‌ రెండో సంవత్సరం ఇంగ్లిష్‌ పేపర్‌లో ముద్రణ తప్పులు రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం సృష్టించడంతో విద్యార్థులు 25 నిమిషాల సమయాన్ని కోల్పోయారు. 8వ ప్రశ్న కింద ‘అడ్వర్టైజ్‌మెంట్‌ చదివి సమాధానాలు రాయాలని ఒక్క మార్కు ప్రశ్నలు ఐదు ఇచ్చారు. అయితే ప్రశ్నలో ఏముందో గుర్తించలేని రీతిలో ముద్రించారు. ఈ విషయాన్ని నెల్లూరులో గుర్తించి ఉన్నతాధికారులకు చేరవేసి సరిదిద్దేసరికి గంట సమయం గడిచిపోయింది. దీంతో కొన్ని చోట్ల బోర్డుపై రాయగా మరికొన్ని చోట్ల ప్రశ్నపత్రంలోని అంశాలను ఇని్వజిలేటర్లు విద్యార్థులకు చదివి వినిపించారు. 13వ ప్రశ్న కూడా గందరగోళంగా ముద్రించడంతో విద్యార్థులు మొత్తం పది మార్కులు నష్టపోయిన పరిస్థితి నెలకొంది. ⇒ 15వ తేదీన సీనియర్‌ ఇంటర్‌ కెమిస్ట్రీ పేపర్‌లో 14వ ప్రశ్న అకడమిక్‌ సిలబస్‌ నుంచి ఇవ్వగా విద్యార్థులు జవాబులు రాశారు. తీరా గంట గడిచిన తర్వాత ప్రశ్నలో తప్పుందంటూ మార్పు చేశారు. ఓ కార్పొరేట్‌ కాలేజీ ముద్రించుకున్న సిలబస్‌కు అనుగుణంగా దీన్ని మార్చినట్లు తెలిసింది. ⇒ మార్చి 11న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి పరిధిలోని పెనుమాక జూనియర్‌ కాలేజీలో ఓ ప్రైవేట్‌ కాలేజీకి మేలు చేసేలా మాస్‌ కాపీయింగ్‌ జరిగింది. 180 మంది విద్యార్థులకు ఇక్కడ సెంటర్‌ కేటాయించారు. ఇంటర్‌ రెండో ఏడాది గణితం, జువాలజీ, చరిత్ర పరీక్షలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఇక్కడ మాస్‌ కాపీయింగ్‌ ప్రారంభమైంది. ఈ ఘటన తాడేపల్లిలోని మంత్రి నివాసానికి కూతవేటు దూరంలో చోటు చేసుకోవడంతో రహస్యంగా ఉంచారు. సెంటర్‌ చీఫ్‌ సూపరింటెండెంట్, ఇని్వజిలేటర్లను మార్చి చేతులు దులుపుకొన్నారు. ⇒ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే విజయవాడలోని ఓ కార్పొరేట్‌ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు అరగంట ఆలస్యంగా పేపర్‌ ఇవ్వగా ఎలాంటి అదనపు సమయం ఇవ్వకుండా నిర్దిష్ట సమయానికే తిరిగి తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు దీన్ని ఇంటర్‌ అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. సెల్ఫ్‌ సెంటర్లు...నిబంధనల ప్రకారం విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్ష సెంటర్‌ కేటాయించకూడదు. కానీ ఈ దఫా ఇంటర్‌ పరీక్షల్లో 1,535 సెంటర్లలో దాదాపు 300 సెల్ఫ్‌ సెంటర్లే ఉన్నాయి. పదో తరగతి పరీక్షలకు సైతం 800కిపైగా సెల్ఫ్‌ సెంటర్లే ఉండటం, వీటిలో అత్యధికం కార్పొరేట్‌ స్కూళ్లే కావడం గమనార్హం.

CM Revanth Reddy statement in Telangana Legislative Assembly2
ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్‌ పదవి, విప్‌ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్‌ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్‌లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్‌బుక్‌ వాళ్లే రాశారు. రూల్‌బుక్‌ కూడా మారలేదు కదా. ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్‌ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్‌రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్‌ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

YSRCP President and former CM YS Jaganmohan Reddy attended to Iftar dinner3
ఇఫ్తార్‌ విందుకు హాజరైన వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, విజయవాడ: పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్లొన్నారు. ‘‘ఈద్‌ ముబారక్‌’’ అంటూ ముందస్తు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. విజయవాడలో బుధవారం ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టోపీ, కండువా ధరించి నమాజ్‌ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్‌ జగన్‌ ముస్లింలతో కలిసి నమాజ్‌ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్‌ విందు స్వీకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ , మాజీ మంత్రులు అంజాద్‌ బాషా, జోగి రమేష్‌, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, పార్టీ నేతలు పూనూరు గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.విజయవాడలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపం వద్ద జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌ ఉప్పొంగిన అభిమానంవిజయవాడలో ఇఫ్తార్‌ విందుకు హాజరైన వైఎస్‌ జగన్‌కు ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఎన్‌ఏసీ కళ్యాణ మండపం ఉండే గురునానక్‌ కాలనీ రోడ్డు, వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. వైఎస్‌ జగన్‌ అభివాదం చేయగానే సీఎం, సీఎం నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై జగన్‌ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

Sakshi Editorial On AP High Court Fires On Police Officers4
ఎన్నాళ్లీ ఆగడాలు!

సందేహం లేదు... న్యాయస్థానాలతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఆటలాడుతున్నారు. పరిధులు గుర్తెరిగి విధినిర్వహణ చేయాలని పదిరోజులనాడు చెప్పినా తమ వెనకటి గుణం మానుకోవటానికి ససేమిరా అంటున్నారు. అందుకే ఏపీ హైకోర్టు మంగళవారం మరోసారి చీవాట్లు పెట్టవలసి వచ్చింది. హైకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావనకొచ్చిన ప్రేమ్‌కుమార్‌ కేసు విచిత్రమైనది. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడైన ప్రేమ్‌కుమార్‌ రహదారుల బాగుకు నిధుల కోసం ఊరూరా టోల్‌గేట్లు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా ఒక చిన్న రూపకాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దానిపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. తాము కట్టే పన్నుల్లో రోడ్‌ సెస్‌ వంటివి ఉండగా ఇలా ప్రత్యేకించి మళ్లీ వసూలు చేయడమేమిటన్న చర్చ మొదలైంది. అందుకే సర్కారువారికి కంటగింపైంది. ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టడమే ధ్యేయంగా తప్పుడు కేసు సృష్టించారు. ‘మనోభావాలు’ దెబ్బతిన్నాయని ఒక వ్యక్తి ద్వారా ఫిర్యాదు చేయించి కర్నూలునుంచి గుంటూరుకు ఆగమేఘాలమీద వచ్చి అర్ధరాత్రి అరెస్టుకు పూనుకున్నారు. ఇంగితం మరిచి ఆయన భార్య, కుమార్తెలపై దౌర్జన్యం కూడా చేశారు. ఇదొక్కటే కాదు... నిరుడు డిసెంబర్‌నుంచి ఇలాంటి కేసులెన్నో ఉన్నత న్యాయస్థానం దృష్టికి వస్తూనేవున్నాయి. ఆ పిటిషన్లపై విచారించిన న్యాయమూర్తులు హెచ్చరిస్తూనే వున్నారు. కానీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బహుశా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏలినవారే చూసుకుంటారన్న ధైర్యమేమో! హైకోర్టుతో చీవాట్లు తిన్న మరునాడే శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో పోలీసుల తీరు ఈ సందేహాన్నే కలిగిస్తోంది. ఎంపీపీ ఎన్నికల్లో విప్‌ జారీ చేయటానికి అధికారులను కలవడానికెళ్లిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులపై తెలుగుదేశం నేతలు దౌర్జన్యానికి దిగితే అడ్డుకోవాల్సిన పోలీసులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలపైనే తప్పుడు కేసు బనాయించి నిర్బంధంలోకి తీసుకున్నారు.నిద్రపోయేవారిని లేపవచ్చు... నిద్ర నటిస్తున్నవారిని తెలివిలోకి తీసుకురావటం సాధ్యమేనా? వీళ్లంతా కొత్తగా విధి నిర్వహణలో చేరినవారు కాదు. ‘జీ హుజూర్‌’ అంటే తప్ప జీతంరాళ్లు రాని వారు కాదు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులద్వారా వచ్చే ఆదాయంతో నెలనెలా జీతభత్యాలు పొందు తున్నవారు. అంచెలంచెలుగా పదోన్నతులు పొందినవారు. కానీ పాలకులు మారేసరికి వీరిలో అపరిచితుడు బయటికొచ్చినట్టుంది. తప్పుడు వాగ్దానాలతో, ప్రత్యర్థులపై దుష్ప్రచారంతో, చడీ చప్పుడూ కాకుండా సాగించిన అక్రమాలతో అందలం ఎక్కిన పాలకులు ఎంతకాలం ఊరేగుతారు? వారిని నమ్ముకుని ఇష్టారాజ్యం చేయొచ్చనుకోవటం, తమకేమీ కాదనుకోవటం మంచిదికాదని అధికారులు గ్రహించాలి. ఈ పాలన కొడిగట్టి కొండెక్కాక తమ పరిస్థితేమిటన్న స్పృహ కలగాలి. అసలు దేశానికి రాజ్యాంగం ఉన్నదని, పౌరులకు దానిద్వారా హక్కులు సమకూరాయని, తమతో సహా అన్ని వ్యవస్థలూ వాటికి అనుగుణంగానే ప్రవర్తించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవని తెలుసుకోవాలి. ఈ దేశంలో న్యాయస్థానాలు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో సైతం నిర్భయంగా తీర్పులిచ్చిన ఉదంతాలున్నాయి. ఆ సంగతిని ప్రభుత్వమూ, పోలీసులూ కూడా తెలుసుకోవాలి.విధినిర్వహణ తీరుతెన్నులెలా వుండాలో తెలిపే మాన్యువల్‌ గురించి ధర్మాసనం పోలీసులకు గుర్తు చేయక తప్పలేదు. సాధారణ స్థాయి కానిస్టేబుల్‌ మొదలుకొని డీజీపీ వరకూ విధినిర్వహణ ఎలా వుండాలో, బాధ్యతలేమిటో తెలిపే మాన్యువల్‌ అది. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, దర్యాప్తు విధి విధా నాలూ, అధికారాల వినియోగంలో పాటించాల్సిన పద్ధతులు, పరిమితులు వగైరాలన్నీ అందులో నిర్దేశించివుంటాయి. పౌరులకుండే హక్కులేమిటో, విధినిర్వహణలో వాటిని పాటించాల్సిన అవసర మేమిటో మాన్యువల్‌ చెబుతుంది. హైకోర్టు భిన్న సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ మాన్యువల్‌ను పోలీసులు పట్టించుకోవటం మానేశారని అర్థమవుతుంది. కనీసం గుర్తు చేస్తున్నా దున్నపోతు మీద వానపడిన చందాన ప్రవర్తిస్తున్నారు. వర్రా రవీంద్రరెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, పప్పుల వెంకటరమణారెడ్డి, బొసా రమణ వగైరాల అరెస్టుల విషయంలో పదే పదే చెబుతున్నా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే పోలీసుల తీరు చూస్తే మాకు బీపీ పెరిగిపోతున్నదని ధర్మా సనం వ్యాఖ్యానించింది. అవసరాన్నిబట్టి కేసులు కాక, ఏదోవిధంగా కేసులు పెట్టాలి... ఎవరో ఒకర్ని అరెస్టు చేయాలని చూడటం సరికాదని హెచ్చరించింది. తమ ముందు దాఖలైన పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే మేజిస్ట్రేట్‌లు రిమాండ్‌ విధిస్తు న్నారని కూడా ఈ సందర్భంగా ధర్మాసనం అనటం గమనించదగ్గది. ప్రేమ్‌కుమార్‌ కేసు సంగతే తీసుకుంటే ఆయన అక్రమార్జనకు పూనుకున్నాడంటూ రూ. 300 స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. ఇంత హాస్యాస్పదంగా పెట్టే కేసుల్ని మేజిస్ట్రేట్‌లే తమ స్థాయిలో అడ్డు కోవచ్చు. అది లేకపోవటంవల్ల ఉన్నత న్యాయస్థానంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేయక పోవటంవల్ల బెయిల్‌ దరఖాస్తులు తమవద్దకు వెల్లువలా వచ్చిపడుతున్నాయని నిరుడు జూలైలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గత సోమవారం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ దరఖాస్తులపై కిందిస్థాయి కోర్టుల తీరును తప్పుబట్టింది. హైకోర్టు ధర్మాసనం తాజా వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకుంటే చిక్కులు తప్పవని తెలుసుకోవాలి. నిబంధనలు గుర్తెరిగి మసులుకోవాలి.

UPI Down For Several Users Across India5
UPI Down: ఫోన్‌పే, గూగుల్‌ పే యూజర్లకు షాక్‌.. యూపీఐ సేవల్లో అంతరాయం

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. చాలామంది వినియోగదారులు లావాదేవీలను చేయలేకపోయినట్లు వెల్లడించారు. బుధవారం రాత్రి 7:50 గంటలకు 2,750 యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. గూగుల్‌పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు వచ్చాయి.యూపీఐ సేవలు డౌన్ అవ్వడంతో.. దేశ వ్యాప్తంగా వినియోగదారులు లావాదేవీలు చేయడంలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా.. వారు ఎదుర్కొన్న సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సమస్య కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.Is UPI down? Anyone facing the issue? #Upidown— Sumit Mishra (@SumitLinkedIn) March 26, 2025UPI Down ⚠️Nationwise issue or it's only me ?— Crypto with Khan ( SFZ ) (@Cryptowithkhan) March 26, 2025Anyone facing UPI app issues or just me facing?? #phonepe #gpay #paytm— Anoop CSKian 💛 (@Anoopraj_7) March 26, 2025

Saroor Nagar Apsara Case Judgement: What happend on that Night6
అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు

వివాహితుడైనప్పటికీ ఆమె అతన్ని గాఢంగా ఇష్టపడింది. శారీరక సుఖం కోసం అతనూ ఆమెను ఇష్టపడినట్లు నటించాడు. ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. పైపెచ్చు వాళ్ల తిరుగుళ్లకు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. అలా నాలుగేళ్లు గిర్రుమన్నాయి. తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి భరించలేకపోయాడు. ప్రేమ మత్తులో ఉండగానే ఆమెను అనంతలోకాలకు పంపించేశాడు. అప్సర-వెంకటసాయికృష్ణ జీవితాలు ఆ ఒక్కరాత్రిలో తలకిందులయ్యాయి. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే.. అప్సర-సాయికృష్ణ.. ఏడాది కాలంలోనే వాళ్ల మధ్య బంధం బలపడింది!. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తల్లితో సహా వచ్చిన అప్సర.. సరూర్‌ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించసాగింది. దైవభక్తి కారణంగా ఆలయాలకు క్రమం తప్పకుండా వెళ్తుండేది. అలా.. 2022లో సరూర్‌ నగర్‌ బంగారు మైసమ్మ గుడి పెద్ద పూజారి వెంకటసాయికృష్ణతో పరిచమైంది. తరచూ అప్సరకు వాట్సాప్‌ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. అలా స్నేహం బలపడింది. ఈలోపు.. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్‌ ద్వారా ఇద్దరూ వాళ్ల ప్రేమ వ్యక్తం చేసుకున్నారు. 👉అప్పటికే అప్సరకు వివాహమై భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మరోవైపు సాయికృష్ణకు వివాహమైంది కూడా. కానీ, ఇద్దరూ చనువుగా ఉంటూ వచ్చారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. సాయి-అప్సరల స్నేహ బంధం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్‌ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగడాన్ని భరించలేకపోయాడు. అలా చేయకపోతే రోడ్డుకు ఈడుస్తానని హెచ్చరించడంతో రగిలిపోయాడు. చివరకు.. .. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్‌లో వెతికి మరీ స్కెచ్‌ వేసుకున్నాడు. సరూర్‌ నగర్‌లో తాను పూజారిగా ఉన్న గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్‌ను అమలు చేశాడు.👉హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్‌ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్‌ అయ్యాడు. జూన్‌ 3.. అప్సర పాలిట కాళరాత్రిఓ ఫిల్మ్‌మేకర్‌తో సినిమా అవకాశాల కోసం మాట్లాడదామని.. అందుకోసం కోయంబత్తూరు వెళ్దామని అప్సరను సాయికృష్ణ నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. 2023 జూన్‌ 3న.. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్‌ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు.ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్‌ నుంచి బయల్దేరారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్‌ అంబేద్కర్‌ సర్కిల్‌ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్‌ బుక్‌ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటలకు శంషాబాద్‌ మండలం రాళ్లగూడలో డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు.అప్సరకు ఎంతో ఇష్టమైన గోశాలలో కొంతసేపు గడిపారు. అయితే గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులోకి చేర్చాడు. 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్‌ వద్దకు చేరారు. ఫ్రంట్‌ సీటులో తన పక్కనే గాఢ నిద్రలోకి జారుకున్న అప్సరను.. కారు సీటు కవర్‌ను ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.మృతదేహంపై కారు కవర్‌ కప్పి అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని.. కవర్‌లో చుట్టి సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఆపై దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్‌ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు. అప్సర నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి ఆమె తల్లి కంగారుపడి సాయికృష్ణకు ఫోన్‌ చేసింది. ఏమీ తెలియనట్లు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి.. తాను వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో సాయికృష్ణే హంతకుడని తేలింది. దర్యాప్తు జరుగుతున్న టైంలో సాయికృష్ణ అమాయకుడని.. తప్పంతా అప్సరదేనని అతని తల్లిదండ్రులు, భార్య వాదించారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన మృగానికి తగిన శిక్ష పడాలని అప్సర తల్లి డిమాండ్‌ చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు విస్తృతంగా జరిగింది. విచారణలోనూ సాయికృష్ణ తన నేరాన్ని అంగీకరించాడు. అలా.. 2023 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి సాయికృష్ణకు బుధవారం(మార్చి 26, 2025)న శిక్ష పడింది. జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకుగానూ అదనంగా మరో ఏడేళ్ల శిక్ష వేసింది. అప్సర కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Serious Discussion In Telugu States Over The Hatya Movie7
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు.. హత్య మూవీలో అసలు ఏముంది?

అమెజాన్ ప్రైమ్‌లో ఓ సినిమా స్ట్రీమ్ అవుతోంది. దాదాపు 15 రోజుల క్రితం ఈ సినిమా ప్రైమ్‌లో రిలీజైనప్పటి నుంచిం తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ డిస్కషన్‌కు కేంద్ర బిందువైంది. కొందరు ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంది.. చాలా ఫ్యాక్చువల్‌గా ఉందని చెబుతుంటేం మరికొంతమంది ఈ సినిమాను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌-2గా ట్రెండ్ అవుతున్న హత్య సినిమా ఐదు భాషల్లో రిలీజైంది.👉అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న హత్య సినిమా ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా బిట్స్ షేర్ చేసిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఓ సీనియర్ పొలిటీషియన్‌ హత్య విచారణకు సంబంధించిన కథాంశంతోం సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పొలిటీషియన్‌ను ఎవరు హత్యచేశారనే విషయంపై ఓ పోలీస్ అధికారి చేసే విచారణ సినిమాలో ప్రధాన అంశం. సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు అని నిర్మాతలు.. డైరెక్టర్‌ డిస్‌క్లైమర్ వేసినా ఈ సినిమా ఇతివృత్థం ఏంటో చూసే వారికి ఈజీగా అర్థం అయిపోతుంది.👉మాజీ మంత్రి హత్య నేపథ్యంలో ఈ సినిమా తీశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీమంత్రి హత్యకు దారితీసిన అంశాలను ఈ సినిమాలో చర్చించారనే డిస్కషన్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది. కేసు విచారణ మొదలుం సాంకేతిక ఎవిడెన్సెస్‌ వరకు ప్రతీ అంశంపై చాలా నిశితంగా చర్చిస్తూ సినిమా స్క్రీన్‌ప్లేను నడిపించిన తీరుం అందరిని ఆకట్టుకుంటోంది. మాజీమంత్రి హత్యకేసులో డిస్కషన్‌కు వచ్చిన చాలా టెక్నికల్ అంశాలను సైతం ఈ సినిమాలో సామాన్యులకు అర్థమయ్యే తీరులో వివరించారనే ప్రశంసలు వస్తున్నాయి.👉ఒక సినిమా పూర్తి ఫిక్షన్‌ అయినపప్పటికీ ఆ సినిమా కథ ఏదో ఒక వాస్తవ ఘటన ఆధారంగా తీసుకున్నదే అయి ఉంటుంది. ఇప్పుడు హత్య సినిమా కూడా ఎంతో కొంత వాస్తవ ఘటనల ఆధారంగా తీసుకన్నారనే డిస్కషన్ ఉంది. హత్య సినిమాలో ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు హత్యకు గురవుతాడు. ఈ కేసులో వాస్తవాలు వెలికితీయాలనే ఉద్దేశంతోం హత్యకు గురైన వ్యక్తి బంధువు ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై నిస్పక్ష విచారణకు ఆదేశిస్తారు. తన బాబాయి హంతకులు ఎవరనేది బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి సిన్సియర్‌గా యత్నిస్తారు.👉దీనిపై ఓ నిబద్ధత ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్‌కుం విచారణ బాధ్యతలు అప్పగిస్తారు. ఈ కేసులో వాస్తవాలను బయటకు తెచ్చేందుకు ఆ మహిళా అధికారి అన్ని కోణాల్లో విచారణ చేపడుతుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఎన్నో కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. అయితే విచారణ చేసిన అధికారిని కొన్ని శక్తులు అడ్డుకునేందుకు యత్నిస్తాయి. కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కొంతమంది అధికారులు ఆమెకు ద్రోహం చేస్తారు. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఆమెను విచారణ నుంచి తప్పిస్తారు. మొత్తానికి వాస్తవాలు బయటకు రాకుండా ఆమెను అడ్డుకుంటారు.👉సినిమా ముందుకు కదులుతున్నకొద్దీ హత్యకు గురైన మాజీ మంత్రికి సంబంధించి చాలా కొత్త కొత్త విషయాలు రివీల్ అవుతాయి. ఈ సినిమాలో హత్య గురైన వ్యక్తికి ఉన్నటువంటి వివాహేతర సంబంధంపైం చాలా డీటేయిల్డ్ ఇన్‌ఫర్‌మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాలో హత్యకు గురైన మాజీమంత్రి ఆ మహిళతో పరిచయం అయిన తీరు ఆ పరిచయం ఏవిధంగా కుటుంబంలో చిచ్చుపెట్టిందో ఇందులో స్పష్టంగా వివరించారు. ఈ కేసు విచారణలో చనిపోయిన మాజీమంత్రికి ఉన్న వివాహేతర సంబంధం కీలకంగా మారిందనేది సినిమా చూస్తున్న వారందరికీ అర్ధం అవుతుంది. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం ఆయన కూతురు, అల్లుడితో పాటు బావమరిదికి నచ్చలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది.👉ఒకవేళ రెండో వివాహానికి అంగీకారం తెలిపితే ఆస్తిలోవాటా ఇవ్వాల్సి వస్తుందనే భయం.. హత్యకు గురైన మాజీమంత్రి కూతురు, అల్లుడిని వెంటాడుతుంది. ఓ సందర్భంలో మాజీమంత్రి బావమరిది.. ఆమె రెండో భార్య దగ్గరకు వెళ్లి ఆమెపై దాడి చేసిన దృశ్యం సినిమాలో టర్నింగ్ పాయింట్. ఈ విషయం తెలిసిం హత్యకు గురికావడానికి ముందు ఆ మాజీమంత్రి తన మొదటి భార్య బంధువులతో సహా కూతురు అల్లుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. హత్యకు గురికావడానికి ముందు తన ముస్లిం భార్యకు ఆస్తిలో వాటాతో పాటు ఆమెతో కలిగిన కుమారుడికి కాన్వెంట్ అడ్మిషన్ ఇప్పించాలని మాజీమంత్రి కోరుకుంటాడు అనే సినిమాలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇదే హత్యకు కారణమైన ఉండొచ్చు అనే అనుమానాలు తరువాత విచారణలో ముందుకు వస్తాయి.👉ఈ సినిమాలో మాజీమంత్రి హత్యకు సంబంధించి రెండు కీలకమైన అంశాలను హైలైట్ చేశారు. ఒకటి హత్య జరిగిన సందర్భంగా హత్య చేసే సమయంలో దుండగులు మాజీమంత్రితో ఓ లేఖ రాయిస్తారు. సినిమాలో ఇది చాలా డ్రమటిక్ సీన్. లేఖలో తనను డ్రైవర్ తీవ్రంగా కొట్టాడంటూ రాయిస్తారు. అయితే ఉదయాన్నే మృతదేహం వద్ద ఈ లేఖను చూసిన పీఏ.. విషయం మాజీమంత్రి అల్లుడికి చెప్తాడు. ఈ విషయం బయట ఎవరికి చెప్పినాం ఇది హత్య అని అప్పుడే తెలిసే అవకాశం ఉండింది. కాని మాజీ మంత్రి అల్లుడు ఈ విషయం బయటకు రాకుండా మధ్యాహ్నం వరకు దాచిపెడతాడు. మొత్తం సినిమాలో ఇది చాలా కీలకమైన అంశం.👉ఎందుకు హత్యకు గురయిన మాజీ మంత్రి అల్లుడు ఇది హత్య అనే విషయం బయటకు రాకుండా అడ్డుకున్నాడనే సినిమా కథలో కీలకమైన అంశం. దీంతో మాజీమంత్రి మృతిపై రకరకాల పుకార్లు వస్తాయి. హత్య అని ముందే తెలిస్తే సాక్ష్యాలు భద్రపరిచే అవకాశం ఉన్నాం లేఖను ఎందుకు దాచిపెట్టారనే విషయం హత్య సినిమాలో కీలకం. ఇక పీఏను అబద్ధమపు సాక్ష్యం చెప్పమని మాజీమంత్రి కూతురు బలవంతపెడుతుంది. దీంతో తాను అబద్ధం చెప్పనని పీఏ తిరగబడతాడు. పీఏ అబద్ధం చెప్పకపోతే తన భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందనిం హత్యకు గురైన మాజీ మంత్రి కూతురు నోరుజారడం షాకింగ్‌ విషయం. అసలు హత్య వెనకాల మాజీమంత్రి కుటుంబం ఉందా? అనే విషయం ముందు నుంచీ ప్రతీ ఒక్కరికీ అనుమానం కలిగిస్తుంది. పరిస్థితులు సాక్ష్యాధారాలు సైతం మాజీ మంత్రి కూతురు,అల్లుడి వైపే అనుమానాలు కలిగిస్తాయి. హత్య వల్ల లాభం ఎవరికి అనేది సినిమా చూసిన వారికి స్పష్టంగా అర్థమైపోతుంది.👉హత్యకు సంబంధించిన అబద్ధాలు ప్రచారం చేసి ఏవిధంగా రాజకీయ రంగు పులుమే ప్రయత్నం జరుగుతుందో హత్య సినిమా చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. తండ్రి హత్యను రాజకీయాల కోసం వాడుకున్న కూతురు కథ ఈ సినిమాలో కనిపిస్తుంది. రెండో వివాహం కుటుంబంలో చిచ్చురేపిం అది హత్య వరకు దారితీసిన ఘటనలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. నిజాలు బయటకు రాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు ఏవిధంగా ద్రోహం చేశారో కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఏది ఏమైనా ఓ బలమైన వర్గం సొంత కూతురు కలిసి మాజీ మంత్రి హత్య కేసును ఏ విధంగా దారితప్పించారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Nani The Paradise Brand New Poster Released8
హిస్టారికల్‌ ప్యారడైజ్‌ 

‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల, నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై రూపొందుతోన్న ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. కాగా ఈ సినిమా సరిగ్గా 365 రోజుల్లో తెరపైకి రానుందని పేర్కొని, ‘వన్‌ ఇయర్‌ టు గో... ఇండియన్‌ సినిమా విట్నెస్‌ ది మ్యాడ్నెస్‌’ అంటూ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ‘‘ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఇప్పటికే విడుదలైన మా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్రిప్పింగ్‌ టీజర్‌ అందరి దృష్టిని ఆకర్షించి రికార్డ్‌ బ్రేకింగ్‌ వ్యూస్‌ సాధించింది. హైదరాబాద్‌ చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్‌’ నానీని మోస్ట్‌ ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో చూపించనుంది. సుధాకర్‌ చెరుకూరి అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం, ఏఓ విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మా చిత్రం తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్‌ సహా 8 భాషల్లో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Kolkata Knight Riders beat Rajasthan Royals by 8 wickets9
డికాక్‌ ధమాకా

ఐపీఎల్‌లో పరుగుల వరద పారిన రెండు వరుస మ్యాచ్‌ల తర్వాత ఆ జోరుకు కాస్త విరామం. పొడిగా, బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై సాగిన మ్యాచ్‌లో సీజన్‌లో తక్కువ స్కోరు నమోదు కాగా, డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) పైచేయి సాధించి తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుణ్‌ చక్రవర్తి, మొయిన్‌ అలీ కట్టుదిట్టమైన స్పిన్‌తో ముందుగా రాజస్తాన్‌ను నైట్‌రైడర్స్‌ తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత డికాక్‌ దూకుడైన బ్యాటింగ్‌తో లక్ష్యఛేదనను సునాయాసం చేసేశాడు. 15 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్‌ విజయాన్నందుకుంది. అన్ని రంగాల్లో విఫలమైన రాజస్తాన్‌ రాయల్స్‌ తమ ‘హోం గ్రౌండ్‌’లో పేలవ ప్రదర్శనతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గువహాటి: డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో గెలుపు బోణీ చేసింది. గత మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓడిన నైట్‌రైడర్స్‌ బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధ్రువ్‌ జురేల్‌ (28 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా, యశస్వి జైస్వాల్‌ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తాత్కాలిక కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 25; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై వరుణ్, మొయిన్‌ అలీ 8 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు తీసి రాయల్స్‌ను దెబ్బ కొట్టారు. వైభవ్‌ అరోరా, హర్షిత్‌ కూడా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్వింటన్‌ డికాక్‌ (61 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. సునీల్‌ నరైన్‌ అనారోగ్యం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో మొయిన్‌ అలీకి కోల్‌కతా చోటు కల్పించగా, ఫారుఖీ స్థానంలో రాజస్తాన్‌ జట్టులోకి హసరంగ వచ్చాడు.సమష్టి వైఫల్యం... రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఆసాంతం ఒకే తరహాలో సాదాసీదాగా సాగింది. ఆశించిన స్థాయిలో దూకుడైన బ్యాటింగ్‌ లేకపోగా, ఒక్కటీ సరైన భాగస్వామ్యం రాలేదు. జైస్వాల్‌ ధాటిగానే మొదలు పెట్టినా... మరోవైపు సంజు సామ్సన్‌ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేదు. ‘లోకల్‌ బాయ్‌’ పరాగ్‌ తన తొలి 7 బంతుల్లో 2 సిక్సర్లు బాది అభిమానులను ఆకట్టుకున్నాడు. వరుణ్‌ ఓవర్లోనూ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ బాదిన అతను...అదే ఓవర్లో మరో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగడంతో మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత హసరంగ (4)ను ముందుగా పంపిన ప్రయోగం ఫలితం ఇవ్వకపోగా, నితీశ్‌ రాణా (9 బంతుల్లో 8), శుభమ్‌ దూబే (12 బంతుల్లో 9; 1 ఫోర్‌) కూడా విఫలమయ్యారు. 67/1తో మెరుగైన స్థితిలో కనిపించిన రాజస్తాన్‌ 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 82/5కి చేరింది. దాంతో ‘ఇంపాక్ట్‌ సబ్‌’గా అదనపు బ్యాటర్‌ను శుభమ్‌ దూబే రూపంలో ఏడో స్థానంలో బరిలోకి దింపింది. అయితే ఒత్తిడిలో అతనూ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జురేల్‌ కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. హర్షిత్‌ రాణా వరుస ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే హర్షిత్‌ తన తర్వాతి ఓవర్లో జురేల్, ప్రమాదకర బ్యాటర్‌ హెట్‌మైర్‌ (8 బంతుల్లో 7; 1 ఫోర్‌)లను వెనక్కి పంపించాడు. చివర్లో ఆర్చర్‌ (7 బంతుల్లో 16; 2 సిక్స్‌లు) కొట్టిన రెండు సిక్సర్లతో రాజస్తాన్‌ స్కోరు 150 పరుగులు దాటింది. డికాక్‌ మెరుపులు... ఛేదనలో డికాక్‌ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 40 పరుగులు కాగా, డికాక్‌ ఒక్కడే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు సాధించాడు. మరోవైపు కేకేఆర్‌ తరఫున ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన మొయిన్‌ అలీ (5) రనౌట్‌ కావడంతో జట్టు మొదటి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్‌ అజింక్య రహానే (15 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయినా, డికాక్‌ జోరుతో స్కోరు వేగంగా సాగిపోయింది. 35 బంతుల్లోనే డికాక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అతనికి గెలుపు దిశగా అంగ్‌కృష్‌ రఘువంశీ (17 బంతుల్లో 22 నాటౌట్‌; 2 ఫోర్లు) సహకరించాడు. దూకుడు తగ్గించని డికాక్‌ శతకం దిశగా దూసుకుపోయాడు. చివరి 3 ఓవర్లలో నైట్‌రైడర్స్‌ విజయానికి 17 పరుగులు, డికాక్‌ సెంచరీకి 19 పరుగులు అవసరం కాగా, ఆర్చర్‌ ఓవర్లో డికాక్‌ ఒక ఫోర్, 2 సిక్స్‌లు బాదినా... చివరకు 97 వద్దే అతను ఆగిపోవాల్సి వచ్చింది. స్కోరు వివరాలు రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) హర్షిత్‌ రాణా (బి) అలీ 29; సామ్సన్‌ (బి) అరోరా 13; పరాగ్‌ (సి) డికాక్‌ (బి) వరుణ్‌ 25; నితీశ్‌ రాణా (బి) అలీ 8; హసరంగ (సి) రహానే (బి) వరుణ్‌ 4; జురేల్‌ (బి) హర్షిత్‌ రాణా 33; శుభమ్‌ (సి) రసెల్‌ (బి) అరోరా 9; హెట్‌మైర్‌ (సి) రఘువంశీ (బి) హర్షిత్‌ రాణా 7; ఆర్చర్‌ (బి) జాన్సన్‌ 16; తీక్షణ (నాటౌట్‌) 1; తుషార్‌ దేశ్‌పాండే (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–69, 4–76, 5–82, 6–110, 7–131, 8–138, 9–149. బౌలింగ్‌: స్పెన్సర్‌ జాన్సన్‌ 4–0–42–1, వైభవ్‌ అరోరా 4–0–33–2, హర్షిత్‌ రాణా 4–0–36–2, మొయిన్‌ అలీ 4–0–23–2, వరుణ్‌ 4–0–17–2. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: మొయిన్‌ అలీ (రనౌట్‌) 5; డికాక్‌ (­నాటౌట్‌) 97; రహానే (సి) దేశ్‌పాండే (బి) హసరంగ 18; రఘువంశీ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.3 ఓవర్లలో 2 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–41, 2–70. బౌలింగ్‌: జోఫ్రా ఆర్చర్‌ 2.3–0–33–0, మహీశ్‌ తీక్షణ 4–0–32–0, రియాన్‌ పరాగ్‌ 4–0–25–0, సందీప్‌ శర్మ 2–0–11–0, హసరంగ 3–0–34–1, నితీశ్‌ రాణా 1–0–9–0, తుషార్‌ 1–0–7–0.ఐపీఎల్‌లో నేడుహైదరాబాద్‌ X లక్నోవేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Kerala Chief Secretary Sarada Muraleedharan decries colourism10
నలుపు అంటే శక్తి

నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్‌ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్‌.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్‌ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్‌పై ఫేస్‌బుక్‌లో ఆమె పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. పంచాయితీ రాజ్‌ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌) డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్‌గా, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి కమిషనర్‌గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్‌ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్‌ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్‌ చేశారు. వారి కామెంట్స్‌లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పెట్టారు శారద. ఆ పోస్ట్‌పై మొదట్లో కొందరి కామెంట్స్‌ చూసిన తరువాత ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశారు. ‘మీ పోస్ట్‌ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్‌ చేశారు. రీ–షేర్‌ చేసిన తరువాత ఆమె పోస్ట్‌కు మద్దతుగా ఎన్నో కామెంట్స్‌ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్‌ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement