Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

World Leader Supprot To Volodomyr Zelensky1
జెలెన్‌స్కీకి భారీగా పెరిగిన మద్దతు.. రష్యా స్పందన ఇదే..

కీవ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), జెలెన్‌స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. వైట్‌హౌస్‌లో ఇరువురి మధ్య భేటీ రసాభాసగా, వాగ్వాదంతో ముగిసింది. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్‌స్కీ (Zelenskyy) వైట్‌హౌస్‌ను వీడారు. ఈ క్రమంలో పలు దేశాల నేతలు జెలెన్‌స్కీకి మద్దుతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.ట్రంప్‌, జెలెన్‌స్కీ భేటీ అనంతరం యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన నేతలు స్పందించారు. ఈ సందర్బంగా పోలిష్‌ ప్రధాన మంత్రి డొనాల్డ్‌ టస్క్‌ స్పందిస్తూ.. జెలెన్‌స్కీ మీరు ఒంటరి కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సంఘీభావం తెలుపుతూ సందేశం విడుదల చేశారు.👉బ్రిటన్‌ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌కు మద్దుతు ఉంటుందన్నారు.👉ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ.. ఉక్రెయిన్ రక్షణ, భవిష్యత్తు గురించి చర్చించడానికి యూరోపియన్ దేశాలు, ఇతర మిత్రదేశాలతో అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌ అండగా ఉండాలన్నారు.Russia illegally and unjustifiably invaded Ukraine. For three years now, Ukrainians have fought with courage and resilience. Their fight for democracy, freedom, and sovereignty is a fight that matters to us all.Canada will continue to stand with Ukraine and…— Justin Trudeau (@JustinTrudeau) February 28, 2025👉కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిస్తూ.. రష్యా చట్టవిరుద్ధంగా, అన్యాయంగా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మూడు సంవత్సరాలుగా ఉక్రేనియన్లు ధైర్యంతో పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం వారి పోరాటం మనందరికీ మేలు కొలుపు. న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడంలో ఉక్రేనియన్లకు కెనడా అండగా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నేతలకు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు.ఇది కూడా చదవండి: జెలెన్‌స్కీతో ట్రంప్‌ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్‌👉యూరోపియన్ యూనియన్ చీఫ్‌లు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. ఉక్రెయిన్‌ జెలెన్‌స్కీ ఎప్పుడూ ఒంటరి కాదు. మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేమందరం మీతో న్యాయమైన, శాశ్వత శాంతి కోసం పని చేస్తూనే ఉంటాము. దైర్యంగా ఉండంటి అని అన్నారు.👉ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. రష్యా అనే దురాక్రమణతో ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్‌కు అందరం అండగా ఉండాలి. ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి, రష్యాపై ఆంక్షలు విధించడానికి ముందుకు రావాలన్నారు.👉మరోవైపు.. రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై మరోసారి సెటైరికల్‌ కామెంట్స్‌ చేసింది. ట్రంప్, జెలెన్‌స్కీ వాడీవేడీ చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ స్పందిస్తూ.. ఈ పరిణామం ఉక్రెయిన్‌కు చెంపదెబ్బ లాంటిదన్నారు. జెలెన్‌ స్కీకి ఇలా జరగాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.JD Vance and Trump just put Zelensky in his place. Wow. Watch this.pic.twitter.com/zndgjKEPKz— End Wokeness (@EndWokeness) February 28, 2025జరిగింది ఇదీ..ఇదిలా ఉండగా.. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ శుక్రవారం వైట్‌ హౌస్‌కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం, అరుపులు, బెదిరింపులతో వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్‌ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చని.. జెలెన్‌స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్‌ కోపంగా చెప్పారు. కానీ, జెలెన్‌స్కీ మాత్రం ఉక్రెయిన్‌ ప్రజల కోసం ట్రంప్‌ బెదిరింపులకు లొంగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం, జెలెన్‌స్కీని టార్గెట్‌ చేస్తూ ట్రంప్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సుముఖంగా లేరని అన్నారు. ఇదే సమయంలో పుతిన్‌ మాత్రం శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Rohit Sharma managing injury very well, on top of it: ten Doeschate2
Champions Trophy: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌​..

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో టీమిండియా త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. ఆదివారం(మార్చి 2) దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టేబుల్ టాప‌ర్‌గా లీగ్ స్టేజిని ముగించాల‌ని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు గుడ్ న్యూస్ అందింది.తొడ కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఈ గాయం కార‌ణంగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెష‌న్‌కు దూరంగా ఉన్న రోహిత్‌.. తిరిగి మ‌ళ్లీ నెట్స్‌లో అడుగుపెట్టాడు. శుక్ర‌వారం దాదాపు 95 నిమిషాల పాటు రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ విష‌యాన్ని భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ ధ్రువీకరించాడు."రోహిత్ శ‌ర్మ గాయంపై ఎటువంటి ఆందోళ‌న అవ‌స‌రం లేదు. అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. నెట్స్‌లో చాలా సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో కూడా అత‌డు భాగ‌మ‌య్యాడు. అత‌డికి ఈ గాయాన్ని ఎలా మెనెజ్ చేయాలో బాగా తెలుసు" అని ప్రీ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో టెన్ డెష్కాట్ పేర్కొన్నాడు. మ‌రోవైపు జ్వ‌రం బారిన ప‌డిన ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్ కూడా కివీస్‌తో మ్యాచ్‌కు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టు శ‌నివారం త‌మ ఆఖ‌రి ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గోనుంది. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం భార‌త తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటుచేసుకోపోవ‌చ్చు.తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జ‌ట్టునే ఈ మ్యాచ్‌కు కొన‌సాగించే అవ‌కాశ‌ముంది. దీంతో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌, యువ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ మ‌రోసారి బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.భారత తుది జట్టు (అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: Champions Trophy: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..

Telangana SLBC Tunnel Rescue: Relatives Reached BJP Leaders Visit Updates3
SLBC టన్నెల్‌ వద్ద గుండెలు అవిసేలా రోదనలు

నాగర్‌ కర్నూల్‌, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన వారం రోజులకు.. ఎనిమిది మంది మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే. భారీగా పేరుకుపోయిన బురదను తొలగించి.. మృతదేహాలను వెలికి తీసే పనిలో సహాయక బృందాలు ఉన్నాయి.ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. శుక్రవారం రాత్రి.. జీపీఆర్‌, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన అవశేషాలను గుర్తించగలిగారు. మట్టిని తొలగించి మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నాల్లో ఉన్నాయి. లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్‌ వరకు తీసుకొచ్చి.. బంధువుల సాయంతో మృతదేహాలను గుర్తించాలనుకుంటున్నారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ఎనిమిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు.మరోవైపు టన్నెల్‌ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్‌ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ శ్రీధర్‌ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్‌ కర్నూల్‌ డీఎంహెచ్‌వో కూడా టన్నెల్‌ వద్దకు చేరుకున్నారు. కార్మికుల కుటుంబాల రోదనలతో టన్నెల్‌ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఎలాగైనా మృతదేహాలను వెలికి తీసి.. బంధువులకు అప్పగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం బంధువులను లోపలికి తీసుళ్లేందుకు జేపీ కంపెనీ లోకో ట్రైన్‌ సిద్ధం చేస్తోంది.ఐదు రోజులెందుకు పట్టింది?: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిటన్నెల్ కట్టింగ్‌ చేయలనీ నిర్ణయం తీసుకోవడానికి 5 రోజులు సమయం ఎందుకు పట్టిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు SLBC ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. SLBC ఘటన బాధాకరం. సంఘటన స్థలానికి సీఎం వెళ్లకపోవడం దురదృష్టకరం. మంత్రులేమో పిక్నిక్ గా వెళ్లి వచ్చారు. కనీస ఆలోచన లేకుండా పనులు చేస్తున్నారు. నత్తనడకన నడుస్తున్న ప్రాజెక్టు ఇది. గత కాంగ్రెస్, BRS ప్రభుత్వాలు SLBC నీ నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో కేటాయించిన నిధుల్లో సగం SLBC కి కేటాయిస్తే ప్రాజెక్టు ఈపాటికి పూర్తి అయ్యేది. ఎనిమిది మంది ప్రాణాలను ప్రభుత్వం తీసింది.. ప్రభుత్వ హత్యలే ఇవి అని మండిపడ్డారాయన.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package4
ఎల్‌పీయూ విద్యార్థికి రూ.1.03 కోట్ల ప్యాకేజీ

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Today Gold and Silver Price March 1st 20255
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు: కొనేందుకు త్వరపడాల్సిందే!

వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ రేటు నేడు (మార్చి 1)న గరిష్టంగా రూ. 220 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద నిలిచాయి. నిన్న రూ. 500, రూ. 540 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 200 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 220 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,620 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79,550 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,770 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఈ రోజు (మార్చి 1) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

KSR Comment: Why Pawan Kalyan Praise CBN In Assembly Always6
బాలయ్య ఏమైనా సుద్దపూసా?.. మరీ ఇంతకు దిగజారాలా!

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఏపీ అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమాషాగా ఉన్నాయి. ‘‘కింద పడతాం.. మీద పడతాం.. అవి మా ఇంటి విషయాలు.. కూటమి విషయాలు. ఒక మాట అనవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలో అడుగు పెట్టకూడదు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొంతన లేని అంశాలను బలవంతంగా అతికినట్టుగా అనిపిస్తుంది. ‘‘ఇది తన గురించో, చంద్రబాబుల గురించి కాదని, ప్రజల కోసం నిలబడి ఉన్నామని, కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతామని, అందుకే మాటిస్తున్నానని అంటూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమనించి మరో పదిహేనేళ్లు కలిసి ఉంటాము’’ అని పవన్ అనడం దేనికి సంకేతం?.. తెలుగుదేశంతో పొత్తు పుణ్యమా అని పవన్‌ కల్యాణ్‌ ఎలాగోలా శాసనసభలోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అది సంతోషమే. కానీ ఆయన సమస్యలపై ప్రశ్నించకుండా.. ప్రభుత్వంలో జరిగే తప్పులపై గొంతెత్తకుండా ఆత్మపరిశీలన చేసుకోకుండా, చేసిన బాసలను గాలికి వదలి పలాయన వాదంతో ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యల కన్నా ఉదాహరణ అవసరం లేదేమో!.👉ఇంతకీ పవన్‌ చేసిన ఆ వ్యాఖ్యల సారాంశం ఏమిటి? తమలో తాము ఎన్ని గొడవలు పడ్డా కలిసే ఉంటామని చెప్పడమే కదా! ఈ మాట అంటున్నారంటేనే ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది. ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని హామీ ఇవ్వకుండా వీరిద్దరూ తిట్టుకుంటే ఎవరికి కావాలి? కిందపడితే ఏంటి? మీద పడితే ఎవరికి ఆసక్తి? ఆయన అన్నట్టే అది వారి అంతర్గత వ్యవహారం. ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అయితే... శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలేమిటి? చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిన వైనం ఏమిటి? వీటిని ప్రశ్నించకుండా ఎవరూనా ఎలా ఉండగలరు? సుగాలి ప్రీతి మృతి కేసు నుంచి 31 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ సంచలనం కోసం పిచ్చి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్‌.. తీరా పదవి వచ్చాక వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ పరిణామాలలో పవన్ పలు అవమానాలకు గురయ్యారని జనసేన కార్యకర్తలు బాధ పడ్డారు. కానీ పవన్‌ తన మాటల ద్వారా ఆ అవమానాలను పట్టించుకోబోనని చెప్పినట్లు అయ్యింది. ఎంత పదవిలో ఉంటే మాత్రం పవన్ టీడీపీకి ఇంతగా లొంగి ఉండాలా అన్నది జనసేన కార్యకర్తల ఆవేదన. తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirumala Stampede Incident) తర్వాత పవన్ కల్యాణ్‌ ఓవరాక్షన్ చేశారని టీడీపీ ముఖ్యనేతలే వ్యాఖ్యానించిన సంగతిని ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ ఆత్మాభిమానం కలిగిన జనసేన క్యాడర్ సహించలేక సోషల్ మీడియాలో టీడీపీ వారికి పోటీగా ఎలా పోస్టులు పెట్టిందో తెలియదా! ఇవన్ని ఎవరి ఇంటి విషయాలు..? అంటే జనసేన కూడా టీడీపీలో భాగమని చెబుతున్నారా? కూటమి విషయాలైతే ఎన్నడైనా చర్చించుకున్నారా? అంత దాకా ఎందుకు.. పిఠాపురంలో పోలీసులు తన మాట వినడం లేదని ఎందుకు చెప్పారు? నెల రోజుల పాటు ఎవరి మీద అలిగి ఫైళ్ల జోలికి వెళ్లకుండా ఉన్నారు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? సనాతని వేషధారణ వేసుకున్నాక, ధర్మ బద్దంగా ఉండాలి కదా! అసత్య వచనాలు పలకరాదని కదా ఆ ధర్మం చెబుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కదా ఏ ధర్మం అయినా చెప్పేది. కాని పవన్ కల్యాణ్‌ వాటిని పాటిస్తున్నారా?. తిరుమల లడ్డూ విషయంలో(Tirumala Laddu Row) ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి అపచారం కాదా? వలంటీర్ల పొట్టకొట్టబోనని పవన్ హామీ ఇచ్చారా? లేదా? అధికారం ఎంజాయ్ చేస్తూ వారి గురించి మాట్లాడకపోగా.. అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని వ్యాఖ్యానించడం పొట్ట కొట్టడం అవుతుందా? లేదా? ఇదేనా సనాతన ధర్మం చెప్పేది? శాసనసభలో ఆయన మాట్లాడిన విషయాలలో సత్యదూరమైనవి ఎన్ని ఉన్నాయి? వైఎస్సార్‌సీపీ(YSRCP) వాళ్లు నినాదాలు చేసినందుకే... గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి అడుగు పెట్టకూడదని ఆయన కొత్త సూత్రం చెబుతున్నారే..! మరి గవర్నర్ వ్యవస్థే వద్దన్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? గతంలో గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ ప్రసంగిస్తుంటే.. తెలుగుదేశం సభ్యులు ఆయన కుర్చీని కూడా లాగి పారేశారు. అలా చేసిన వారిలో ఒకరైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. గత టర్మ్‌లో గవర్నర్ హరిచందన్ స్పీచ్ సమయంలో కానీ, స్పీకర్ పై కానీ టీడీపీ సభ్యులు ఎన్ని అల్లర్లు చేశారో ఒకసారి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది. తన సహ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక విజిల్ పట్టుకువచ్చి సభలో ఈల వేస్తూ తిరిగారే. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి, స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను బెదిరించేవారే! కొందరు టీడీపీ నేతలు ఎలా దూషించారో ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇవన్ని మంచి పద్దతులేనా? అలాంటి పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబితే సరిపోతుందా?. ఏమిటో కొత్తగా స్టేట్ రికన్సిలియేషన్ కేబినెట్ (Reconciliation Cabinet) అని అంటున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నికలకు ముందు ఏదో జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే ఉందని అనడం ఏమిటో?. బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా నెహ్రూ కేబినెట్ లో ఉన్నా ఆయా అంశాలపై విబేధించేవారని అన్నారు. అంటే ఏపీలో కూడా అలాగే చంద్రబాబును నిలదీస్తారా? ఆ ధైర్యం పవన్‌కు నిజంగా ఉందా? అలా ఉంటే ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలలో ఒక్కసారైనా ప్రజల పక్షాన మాట్లాడారా? శాంతిభద్రతల విషయంలో మాట్లాడినట్లే మాట్లాడి వెంటనే ఎందుకు జారిపోయారు? ప్రతిపక్షం ముఖం చాటేస్తే తామే ఆ బాధ్యత నిర్వహిస్తామని అన్నారు. 👉పవన్ ఆ పని చేసినా, చేయకపోయినా, ముందుగా సూపర్ సిక్స్ గురించి చంద్రబాబును ప్రశ్నించి ఉంటే, తన బాధ్యత ఏమిటో చెప్పి ఉంటే అప్పుడు ఆయన ఏమి చెప్పినా జనం నమ్మవచ్చు. తన శాఖకు సంబంధించి ఆయన గ్రామ సభలు, గోకులాలు అంటూ ఏవేవో చెప్పుకున్నారు. కాని వాటిని టీడీసీ వారే ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి ఆయనకు కూడా తెలిసి ఉండాలి. ఆంధ్రులకు కుల భావన ఉందని శాసనసభలో బాధ పడినట్లు నటించారు. మరీ ఇదే పవన్ కల్యాణ్‌ గతంలో కనీసం కుల భావన అయినా తెచ్చుకోండని అన్నారే! తనకైనా ఫలానా కులం వారు ఓట్లు వేయాలని అన్నది వాస్తవం కాదా! దీనికి సంబంధించి అప్పట్లో వీడియోలు వచ్చాయే! ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలు?. 👉విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని అంటున్నారు. సంతోషమే కానీ.. భవిష్యత్తులో కూడా జరగదని చెప్పగలిగితే బాగుంటుంది. ఒకపక్క అక్కడ అనేక మందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తుంటే, మరోపక్క పవన్ ఇలా మాట్లాడుతున్నారు. బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. కాని టీడీపీ, జనసేనల దూషణలకు, పెట్టిన బూతు పోస్టింగ్‌లకు ఆయన ఎలా మద్దతు ఇస్తున్నారు?. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక నేతపై మహిళల వేధింపు ఆరోపణలు వస్తే కనీసం పార్టీ నుంచి సస్సెండ్ కూడా చేయలేక పోయారే! ఆ మాటకు వస్తే ఎన్నికల సమయంలో పవన్ ఎన్ని దూషణలకు పాల్పడింది ఆధార సహితంగా ఉన్నాయి కదా! 2009లోనే యువరాజ్యం అధ్యక్షుడుగా ఉండి కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొడతానని అన్నది ఈయనే గదా అని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబును జైలులో ఎందుకు పెట్టింది తెలియదా? స్కిల్ స్కామ్‌లో తొలుత కేసు పెట్టింది ఈడి కాదా? గతంలో కులాలు, మతాల మధ్య గొడవలు వచ్చేలా రోజుల తరబడి మీడియా సమావేశాలు పెట్టి లైవ్ లో మాట్లాడిన ఒక నేతను ఇప్పుడు పెద్ద పదవిలో కూటమి కూర్చోపెట్టుకుందే!. చంద్రబాబు, లోకేష్‌లతో ఏదో జిగిరి దోస్తి ఉన్నట్లు ఇప్పుడు చెబుతున్నారు కాని, 2018లో ఇదే పవన్ వారిని ఉద్దేశించి ఎన్ని తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది తెలియదా? రాజకీయాలలోకి వచ్చి చెగువేరా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, మోదీ అన్నారు. తదుపరి వారిని కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి, వామపక్షాలతో కలిసి జట్టుకట్టారు. ఆ తర్వాత మళ్లీ మోదీ, చంద్రబాబు అన్నారు. .. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెబుతారు? నిజంగానే కిందా, మీద పడి పదవిలోకి వచ్చిన పవన్.. ఆ పదవి మీద మోజు పెంచుకోవడం తప్పు కాదు. కానీ అదే ప్రధానమన్నట్లుగా వ్యవహన్నారనే భావన ఏర్పడుతోంది. ప్రజల కోసం నిలబడకుండా చంద్రబాబు, లోకేష్ ల మెప్పు కోసం పనిచేస్తూ, సనాతని వేషం ధరించి కూడా అబద్దాలు, అర్ధ సత్యాలు చెప్పడం ఏ ధర్మం అవుతుందో ఆయనకే తెలియాలి!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

How to get loan for diary business by PMEGP scheme7
PMEGP : సబ్సిడీతో పాడి పథకం, లోన్‌ ఎలా పొందాలి?

సబ్సిడీతో పాడి పథకం మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్‌ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలాదరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్‌ రేట్‌ వంటి వివరాలను ‘‘ఓనర్‌‘షి’ప్‌’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్‌ ప్రధానమంత్రి ఎం΄్లాయ్‌మెంట్‌ జెనరేషన్ ప్రోగ్రామ్‌.మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్‌ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలాదరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్‌ రేట్‌ వంటివివరాలను ‘‘ఓనర్‌‘షిప్‌’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్‌ ప్రధానమంత్రి ఎప్లాయ్‌మెంట్‌ జెనరేషన్‌ ప్రోగ్రామ్‌. పీఎమ్‌ఈజీపీ (PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ జెనరేషన్‌ ప్రాగ్రామ్‌) స్కీమ్‌... పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం రూ పొందించిన పథకం ఇది. ఇందులో 35 శాతం సబ్సిడీతో రూ. 10 లక్షల నుంచి కోటి వరకు రుణ సహాయం అందుతుంది. దీనికి అయిదు ఎకరాల సొంత లేదా రిజిస్ట్రేషన్‌ లీజు కలిగిన భూమి ఉండాలి. గ్రామం, పట్టణం.. ఎక్కడైనా ఈ పరిశ్రమను పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు గరిష్ఠంగా 35 శాతం రాయితీ లభిస్తుంది.ఇలా దరఖాస్తు చేసుకోవాలి...పద్ధెనిమిదేళ్లు్ల పైబడి.. 730 సిబిల్‌ స్కోర్‌ దాటినవారు ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాస్ట్‌ సర్టిఫికెట్, ఏరియాపాపులేషన్‌ రి΄ోర్ట్, టెన్త్‌క్లాస్‌ ఉత్తీర్ణతా సర్టిఫికెట్, ఇతర విద్యార్హతల సర్టిఫికెట్స్, ఆధార్‌ కార్డ్, పాన్‌ కార్డ్, భూమికి సంబంధించిన పట్టా, పాస్‌బుక్‌ కాపీలను జతచేస్తూ పీఎమ్‌ఈజీపీ ఆన్‌లైన్‌ ్ర΄÷ఫైల్‌ను నింపాలి. అది సంబంధిత కేవీఐబీ లేదా కేవీఐసీకి వెళ్తుంది. వాళ్లు అప్రూవ్‌చేసి ఆ దరఖాస్తును బ్యాంకులకు పంపుతారు. బ్యాంక్‌ల నుంచి పిలుపు రాగానే వారు సూచించిన ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్లు, సవివరమైన ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను సమర్పించాలి. బ్యాంక్‌లు వాటిని పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తారు. మళ్లీ అది కేవీఐబీ లేదా కేవీఐసీకి వస్తుంది. తర్వాత 15 రోజులు ఆన్‌లైన్‌ ట్రైనిం ఉంది., సంబంధిత పరీక్ష రాయాల్సి ఉంటుంది. అది పాస్‌ అయితేనే రుణం విడుదల అవుతుంది. అప్పుడే సబ్సిడీనీ శాంక్షన్‌ చేయించుకోవాలి. దాన్ని మూడేళ్ల వరకు బ్యాంక్‌లోనే డిపాజిట్‌ చేస్తారు. మూడేళ్ల తర్వాత దాన్ని బ్యాంక్‌ వాడుకుంటుంది. ΄÷ందిన సబ్సిడీకి వడ్డీ ఉండదు. ఈ మొత్తం రుణానికి బ్యాంక్‌ ఎటువంటి పూచీకత్తు అడగదు. అందిన రుణంలోని కొంత మొత్తంతో షెడ్డును నిర్మించి, ఇంకొంత మొత్తంతో గేదెలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పశువైద్యనిపుణులు సర్టిఫై చేసిన ఆరోగ్యకరమైన గేదెలకు మాత్రమే బ్యాంక్‌ అనుమతిస్తుంది. కొన్నచోటు నుంచి రసీదు తీసుకోవాలి. షెడ్డును కూడా ప్రభుత్వ సూచనల మేరకు.. గాలి వెలుతురు ధారాళంగా సోకేలా, నీటి సౌలభ్యం, డ్రైనేజీ వసతులు ఉండేలా నిర్మించాలి. అధికంగా పాలనిచ్చే సూడి గేదెలను మాత్రమే కొనాల్సి ఉంటుంది. నాణ్యమైన పాల ఉత్పత్తి, వేరొక జాతి పశువులతో కలపని పూర్తిస్థాయి దేశీ పశు అభివృద్ధే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇదేకాకుండా నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఎన్‌డీడీబీ) నుంచి అందుతున్న పశుజాతి అభివృద్ధి (Breed Multiplication Farm) పథకమూ ఉంది. దీనికి రూ. 4 కోట్ల రుణం అందుతోంది. అందులో సగం అంటే రూ. 2 కోట్లకు సబ్సిడీ ఉంటుంది. పది శాతం బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్‌ అంటే రూ.4 కోట్ల ప్రాజెక్ట్‌కు రూ. 40 లక్షలు సొంత పెట్టుబడి ఉండాలి. మిగిలిన కోటీ అరవై లక్షలకు బ్యాంకు నుంచి రుణాన్ని పొందవచ్చు. అయితే దీనికి పూచీకత్తు తప్పనిసరి. అయిదు ఎకరాల భూమిలో ప్రాజెక్ట్‌ ఉండాలి. పదేళ్ల పైబడి లీజుకు రిజిస్ట్రేషన్‌ చేయించాలి. సవివరమైన ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌తో ఎన్‌డీడీబీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్‌ స్క్రూటినీ అనంతరం పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ లోన్, ప్రభుత్వ సబ్సిడీలు పొందిన తర్వాతప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టాలి. అయిదు ఎకరాల భూమిలో పాడికి అవసరమైన పచ్చగడ్డిని పండించాలి. దేశీ పశు అభివృద్ధి ప్రణాళికతో తయారైన, ప్రభుత్వం సప్లయ్‌ చేస్తున్న దాణాను కూడా సబ్సిడీ ధరలకు కొనుక్కోవచ్చు. ఈ పథకం ద్వారా చాలామంది పాడి రైతులు తాము లాభపడటమే కాక మరికొంత మందికీ ఉపాధి కల్పిస్తున్నారు. ఇది మహిళా రైతులకు మరింత ప్రోత్సాహకరం. – బి.ఎన్‌. రత్న, బిజినెస్‌ కన్సల్టెంట్, దలీప్‌నిర్వహణ : సరస్వతి రమ మీ సందేహాలను పంపవలసిన మెయిల్‌ ఐడీ : ownership.sakshi@gmail.com

Bigg Boss 9: Nagarjuna Out From Hosting The Telugu Bigg Boss Season 98
Bigg Boss 9: నాగార్జున ఔట్‌.. హోస్ట్‌గా మరో స్టార్‌ హీరో!

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌(Bigg Boss)కు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్‌ ఉంది. అన్ని భాషల్లోనూ ఈ షోని ఆదరిస్తున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో.. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను దిగ్విజయంగా ముగించుకుంది. రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్‌ నుంచి ఎనిమిదో సీజన్‌ వరకు కింగ్‌ నాగార్జుననే బిగ్‌బాస్‌ సోకి వ్యాఖ్యాతగా ఉన్నారు. తనదైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆటలో తప్పొప్పులను ఎత్తి చూపుతూ నాగార్జున చేసే విశ్లేషణ బిగ్‌బాస్‌ షోకి మరింత ప్లస్‌ అయింది. వారం మొత్తం చూడకపోయినా సరే.. శని,ఆదివారాలు షో చూసేవారు చాలా మందే ఉన్నారు. అందుకే ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా ముగిశాయి. ఇక త్వరలోనే తొమ్మిదో సీజన్‌(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడం లేదట. ఆయన ప్లేస్‌లో ఓ యంగ్‌ హీరో రాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.కొత్తదనం కోసం కొత్త హోస్ట్‌!బిగ్‌బాస్‌ షోకి మొదట్లో ఉన్న ఆదరణ ఇప్పుడు లేడు. షో రొటీన్‌గా సాగడం, పెద్ద సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొనకపోవడంతో ఎనిమిదో సీజన్‌ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తొమ్మిదో సీజన్‌ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నారట. కొత్తదనం కోసం హోస్ట్‌ని కూడా మార్చబోతున్నారట మేకర్స్‌. ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి ఓ యంగ్‌ హీరోని రంగంలోకి దించబోతున్నారట. గేమ్‌లోనూ భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇక హోస్ట్‌గా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్‌ విజయ్‌ని సంప్రదించారట. భారీ రెమ్యునరేషన్‌ కూడా ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ కోసం విజయ్‌ కూడా హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది మేకర్స్‌ చెబితే తప్ప తెలియదు.కంటెస్టెంట్స్‌ ఎంపికలో కొత్తట్రెండ్‌బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ కొత్తగా ఉండబోతుందట. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ వేటలో పడ్డారు మేకర్స్‌. ఈ సారి బాగా తెలిసిన ముఖాలనే హౌస్‌లోకి పంపిస్తారట. గత సీజన్లలో ఒక కామన్‌ మ్యాన్‌ కచ్చితంగా హోస్‌లోకి వెళ్లేవాడు. కానీ ఆ సారి ఆ రూల్‌కి బ్రేక్‌ వేశారట. ఈ సారి సెలెబ్రీలను మాత్రమే తీసుకోబోతున్నారట. అంతేకాదు గేమ్‌లోనూ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఓ యంగ్‌ హీరో సైతం ఈసారి కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నాడట. అలాగే ఓ కమెడిన్‌, ప్రముఖ సింగర్‌, కొరియోగ్రాఫర్‌ కూడా ఈ సారి హౌస్‌లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. గత సీజన్లలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్‌ చేయకుండా.. చాలా పకడ్భందీగా తొమ్మిదో సీజన్‌ని ప్లాన్‌ చేస్తున్నారు.

 IIT Baba Alleges Beaten Up During TV News Debate Video Viral9
టీవీ డిబెట్‌లో ఐఐటీ బాబాపై దాడి.. వీడియో వైరల్‌

ఢిల్లీ: కుంభామేళాతో పాపులర్‌ అయిన ఐఐటీ బాబా అభయ్‌ సింగ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. కొందరు వ్యక్తులు ఆయనపై కర్రలతో దాడి చేశారు. అభయ్‌ సింగ్‌లో ఓ టీవీ ఛానల్‌లో డిబెట్‌లో పాల్గొన్న సమయంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఐఐటీ బాబా అభయ్‌ సింగ్‌ తాజాగా నోయిడాలో ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌లో డిబెట్‌లో పాల్గొన్నారు. డిబెట్‌ కొనసాగుతున్న సమయంలో కాషాయ దుస్తులు ధరించి వచ్చిన కొంత మంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. అనంతరం, అభయ్‌సింగ్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడి తర్వాత ఆయన డిబెట్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా తనకు న్యాయం చేయాలని పోలీస్‌ అవుట్ పోస్టు ఎదుట బైఠాయించారు. దీంతో, పోలీసులు.. ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.I know, This is all Media Strategy but still I think, Media is mentally exploiting this IIT Baba for its TRP, This Baba should not go to such programs.pic.twitter.com/w7j0z0FAQC— Harsh (@harsht2024) February 28, 2025ఎవరీ ఐఐటీ బాబా..?ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్న అభ‌య్ సింగ్ ఇప్పుడు బాబాగా అవ‌త‌రించారు. ఐఐటీ బాబాగా (IIT Baba) పిలుస్తున్నారు. అభ‌య్ సింగ్‌ది హ‌ర్యానా రాష్ట్రం. మహా కుంభమేళా సందర్భంగా ఐఐటీ బాబా పేరుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగం.. కొంతకాలం కార్పొరేట్‌లో పనిచేసిన ఆయన.. దాన్ని వదులుకొన్నారు. ఫొటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. మహా కుంభమేళాకు వచ్చిన ఆయన.. ఓ వార్తా ఛానెల్‌ ఇంటర్వ్యూతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ఐఐటీ బాబా, ఇంజినీర్‌ బాబాగా నెటిజన్లు ఆయన్ను పేర్కొంటున్నారు. సైన్స్‌ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. నెటిజన్లకు క్షమాపణలు..ఇదిలా ఉండగా.. చాంపియన్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌‌పై భారత్‌ గెలవదంటూ ఐఐటీ బాబా (IIT Baba) జోష్యం చెప్పిన విషయం తెలిసిందే. ‘ఈసారి భారత్ గెలవదు. విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే’ అంటూ ఐఐటీ బాబా జోష్యం చెప్పారు. అయితే, మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తాయి. ఇలా జోష్యం చెప్పడం మానేయాలంటూ ఐఐటీ బాబాకు క్రికెట్‌ అభిమానులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌పై ఐఐటీ బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. ‘నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను జోడించారు.

Dr Sumanth Reddy Dead At Warangal MGM Hospital10
డాక్టర్‌ మృతి.. భార్య, ప్రియుడు స్కెచ్‌?

సాక్షి, వరంగల్‌: వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ వైద్యుడు సుమంత్‌ రెడ్డి మృతిచెందారు. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం అర్థరాత్రి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. సుమంత్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రెండు రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా, దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, సామ్యూల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది.దీంతో, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు. అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్‌, అతని స్నేహితుడు ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే తన చేతికి మట్టి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్‌ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్‌ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్‌ కారును అడ్డగించి, అతడిపై ఐరన్‌ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్‌ స్నేహితుడు ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజు నిందితులని తేలింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
NRI View all
title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

Advertisement
Advertisement