Top Stories
ప్రధాన వార్తలు
![Sakshi Guest Column On India US Diplomatic Relations1](/styles/webp/s3/article_images/2025/02/19/modi-tump.jpg.webp?itok=8T3Z_-hi)
మారాల్సిన దౌత్యం తీరు
దౌత్య కెమిస్ట్రీ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు ఒక నిర్మాణాత్మక వాతావరణాన్ని అందిస్తుంది. ఇలాంటి సంబంధం ఉద్రిక్తతలను తగ్గిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే దౌత్యం అనేది పూర్తిగా నాయకత్వ స్థాయి కెమిస్ట్రీ పైనే ఆధారపడదు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు అదృష్టవ శాత్తూ పరస్పర ప్రయోజనం, ప్రజా మద్దతుకు చెందిన దృఢమైన చట్రంపై ఆధారపడి ఉన్నాయి. జాతీయ ప్రయోజనాలకు సంబంధించి, బహుళ రంగాలలో అనేక సంవత్సరాల పరిణామ క్రమంపై కూడా ఇవి నిర్మితమై ఉన్నాయి. అయితే మనం జీవిస్తున్నది విచ్ఛిన్న మవుతున్న ప్రపంచం. దీంట్లో ఆత్మసంతృప్తికి కాలం చెల్లిపోయింది.మారిన సవాళ్లునేడు మనం ఎదుర్కొంటున్న వాస్తవాలు ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలానికి భిన్నంగా ఉన్నాయి. ప్రపంచ దౌత్య చలనశీలత మారిపోయింది. యుద్ధం– సంఘర్షణ, కొల్లగొట్టే పోటీ, వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచీకరణకు చెందిన క్షీణిస్తున్న ఆకర్షణలు భౌగోళిక రాజకీయాలను నిర్వచిస్తున్నాయి. ట్రంప్ తన ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాతో అధికారంలోకి వచ్చారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదా నికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అమెరికన్ రాజకీయాల్లో జన రంజక, స్థానికవాదపు ఉప్పెనపై ఆయన స్వారీ చేస్తున్నారు.మోదీ అమెరికా పర్యటన ఫలితాలను మీడియా మొత్తంగా విశ్లే షించింది. ఇప్పుడు భారతదేశంపై ట్రంప్ ప్రాపంచిక దృక్పథం చూపిన ప్రభావం గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ట్రంప్ విలువ ఇవ్వలేదని కాదు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గగనతలం, భూమి, సముద్రం, అంతరిక్షం, సైబర్‌స్పేస్‌తో సహా వివిధ రంగాలను ఉన్నతీకరించడానికి, సైనిక సహకారాన్ని పెంచడానికి ఇరు పక్షాలూ ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టమైంది. ఎఫ్–35 జెట్‌ల వంటి అధు నాతన విమానయాన వ్యవస్థల అమ్మకాలకూ, సహ ఉత్పత్తికీ ప్రణాళి కలు ఉన్నాయి. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో–పసిఫిక్ వాణిజ్యం, వలసల కోసం ఉమ్మడి వ్యూహాత్మక దృష్టి కూడా ఉంది. ఇవి మరింత సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయి.అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న ‘ప్రతీకార’ సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ప్రాథమికంగా దెబ్బతీస్తాయి, వ్యాపార అనిశ్చితులు పెరుగుతాయి, భౌగోళిక రాజకీయ అంతరాలు తీవ్రమ వుతాయి. దేశాలు అమెరికాతో తమ వాణిజ్య సంబంధాలను తిరిగి అంచనా వేయవలసి ఉంటుంది. ఇప్పటికే ఏర్పర్చిన సరఫరా గొలు సులు, అలాగే ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కూడా ప్రభావితం కావచ్చు. అమెరికా సుంకాలను విధించడం వల్ల ఉత్పత్తి ఖర్చులు ప్రభావిత మవుతాయి. ఇది వినియోగదారులను దెబ్బతీస్తుంది. అధిక ద్రవ్యో ల్బణానికి దోహదం చేస్తుంది. వాస్తవానికి, చైనాకు దూరం జరు గుతూ, తన సరఫరా గొలుసులను అమెరికా వైవిధ్యపరిచినందు వలన, మన వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ వస్తువుల రంగాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రపంచంతో ఆర్థిక సంబంధాలపై ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానం భారత్‌కు సవాళ్లను కలిగిస్తుంది. వాటిని తక్కువ అంచనా వేయకూడదు.బ్రిక్స్ దేశాలకు బెదిరింపుఅమెరికాతో మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే మన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవడానికి జాగ్రత్తగా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ప్రతీకార సుంకాల విధానం భారత్ తన సొంత సుంకాలను హేతుబద్ధీకరించుకోవడా నికి తోడ్పడుతుంది. ఈ సంవత్సరం చివరిలోపు రెండు దేశాలు కుదుర్చుకోవాలనుకుంటున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలకు ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. అటువంటి ఒప్పందాన్ని చేరుకోవడం మన చర్చల నైపుణ్యాలకు నిజమైన పరీక్ష అవుతుంది. వలసల విషయానికి వస్తే, సంకెళ్లలో బంధించి మరీ, భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరిస్తున్న విధానం చాలా మందికి రుచించలేదు. ఇంతవరకూ అనుసరించిన బహిష్కరణ విధా నాలు తీవ్రమైన వివాదానికి దారితీశాయి. మన జాతీయులతో అమా నుషంగా ప్రవర్తించారనే భావన దేశీయుల్లో ఉంది. విదేశాలలోని మన పౌరులను రక్షించడంలో వైఫల్యంగా దీన్ని అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అంతర్జాతీయంగా తన పౌరులను రక్షించుకోగల సామర్థ్యం స్మార్ట్ పవర్‌లో ఒక భాగం. చట్టపరమైన వలసలను, హెచ్–1బీ వీసా సమస్యలను రెండు దేశాలు నిస్సందేహంగా దీటుగా ఎదుర్కోగలవు. కానీ మానవ అక్రమ రవాణా పరిశ్రమను మన ఏజెన్సీలు ఎలా సమర్థంగా అణచివేయగలవనేదే మన సమస్య.బ్రిక్స్ దేశాలకు ట్రంప్ చేసిన హెచ్చరిక మరొక ఆందోళనను రేకెత్తిస్తోంది. అమెరికన్ డాలర్ శక్తి ఆధారంగా ట్రంప్ ప్రపంచ ఆధిప త్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డాలర్ ఆధిపత్యాన్ని నిరోధించే ప్రత్యా మ్నాయ ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ దేశాలు అనుసరిస్తే బ్రిక్స్‌కు మరణ శాసనం లిఖిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. బ్రిక్స్ సభ్యదేశమైన దక్షిణాఫ్రికా, శ్వేత ఆఫ్రికనర్ మైనారిటీని ప్రభావితం చేసే భూ విధా నాల కారణంగా చిక్కుల్లో పడింది. దీనిని ఎలాన్ మస్క్ ‘జాత్యహంకార యాజమాన్య చట్టాలు’గా ఎత్తి చూపారు. మస్క్ దక్షిణాఫ్రికాలో తన స్టార్‌లింక్ ప్రాజెక్ట్ కోసం సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. ఫలి తంగా దక్షిణాఫ్రికాకు తాను అందించే అన్ని ఆర్థిక సహాయాలనూ అమెరికా నిలిపివేసింది. పైగా జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాకూడదని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. విధాన ‘సూత్రాల’కు నష్టం కలుగుతున్నట్లు కనిపిస్తే దౌత్య సంబంధాలను త్యాగం చేయడానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నారని ఇది చెబుతోంది.బహుళ ధ్రువ ప్రపంచంబహుళ ధ్రువ ప్రపంచం గురించి నేడు చాలా చర్చ జరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ఇంట ర్వ్యూలో ‘ప్రపంచానికి ఏక ధ్రువ శక్తి ఉండటం సాధారణం కాదు’ అని అంగీకరించారు. ఇది ఓదార్పునిచ్చే మాటగా అనిపించవచ్చు. కానీ ‘అమెరికా ఫస్ట్’ అనే ప్రాపంచిక దృక్పథం అమెరికా ప్రాధాన్యం గురించిన అంతర్లీన అంచనాలను కలిగి ఉంది. పైగా బ్రిక్స్‌కు హెచ్చ రిక బహుళ పక్ష సమూహాలకు కూడా మేల్కొలుపు కానుంది: గట్టిగా కోరుకుంటే ఉనికిలో ఉండండి, కానీ అమెరికన్ నియమాల ప్రకారం ఆడండి. అందుకే కొందరు ట్రంప్ కొత్త అధ్యక్ష పదవిని తనదైన ’సామ్రాజ్యవాదం’ అని పిలుస్తున్నారు.అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సెత్ ఇటీవల మాట్లాడిన ‘స్పష్ట మైన వ్యూహాత్మక వాస్తవాలు’ యూరప్ రక్షణ నుండి అమెరికా వైదొలగుతుందనీ, ఈ బాధ్యతను యూరోపియన్లకు వదిలివేస్తుందనీ సూచిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ వివాదంలో శాంతి అంటే రష్యా బలమైన పక్షం అని, ఉక్రెయిన్ ‘నాటో’లో భాగం కాలేదని లేదా రష్యా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి పొందాలని అది కోరు కోలేదని ఆయన మాటలు సూచిస్తున్నాయి. విజేత అన్నింటినీ ఆక్ర మించగలదని భావించే ప్రపంచంలో ఇజ్రాయెల్ ఛాంపియన్ కాబట్టి పాలస్తీనియన్లు సర్వం కోల్పోయారని పీట్ మాటలు చెబుతున్నాయి. చైనా విషయానికొస్తే, వాణిజ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు ఇతర రంగాలలో సహకారాన్ని విస్తరించ డానికి లేదా కనీసం ఆయనతో ఒక నిలకడైన పద్ధతిలో వ్యవహరించ డానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ప్రస్తుత సంద ర్భంలో స్నేహితులు, శత్రువులు ఎవరూ లేరు. కేవలం లావాదేవీలు జరపాలి, ఒప్పందాలు కుదుర్చుకోవాలి. భారతదేశం తదనుగుణంగా తన దౌత్య దిక్సూచిని నిర్దేశించుకోవాలి.నిరుపమా రావు వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి
![Vallabhaneni Vamsi Innocent YS Jagan Slams Chandrababu Govt After Visit Vjy Jail2](/styles/webp/s3/article_images/2025/02/18/YS-Jagan-Slams-Chandrababu_1.jpg.webp?itok=il2p-YPY)
వంశీ ఏ తప్పూ చేయలేదు.. ఇది చంద్రబాబు కుట్ర: వైఎస్ జగన్
విజయవాడ, సాక్షి: వల్లభనేని వంశీ అరెస్ట్.. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు అద్దం పడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఇదంతా వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారాయన. మంగళవారం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు పెట్టిన కేసు ఏంటి?. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్ చెప్పారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు. మంగళగిరికి సత్యవర్ధన్‌ను పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారు. ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారు. కేసు మళ్లీ రీ ఓపెన్ చేశారు. సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్‌మెంట్ తీసున్నారు. అందులోనూ వంశీ తప్పు లేదని చెప్పారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయం(TDP Office Case) తగలబెట్టే ప్రయత్నం చేశారని, ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిందని వంశీపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు.. ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించింది కాదు. వంశీపై చంద్రబాబు కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టించారు. వంశీకి బెయిల్ రాకూడదని చంద్రబాబు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. మరో నెలల తరబడి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. మరో 44 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలుఈ రోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్లయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోంది.ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఈ వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జ్ గారి సమక్షంలో, జడ్జ్ గారు ఇచ్చిన సమన్లతో, పోలీసుల నుంచి సమన్లు అందుకుని, న్యాయస్థానం ముందుకు వచ్చి జడ్జ్ గారి ముందు హాజరై వాగ్మూలం ఇచ్చారు. ఆ వాగ్మూలంలో ఆయన వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా వంశీపై తప్పుడు కేసును బనాయించారు.ఇదీ కేసు చరిత్ర2023, ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీపై భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తట్టించారు.మర్నాడు ఫిబ్రవరి 20న చంద్రబాబు నేరుగా గన్నవరంకు పట్టాభిని పంపారు. అక్కడ పట్టాభి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీని తిట్టారు. అ తర్వాత అక్కణ్నుంచి ఒక ప్రదర్శనగా వెళ్లి వైయస్సార్‌సీపీ కార్యాలయం చేరుకుని అక్కడ, శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా టీడీపీ మూకలు దాడి చేశాయి. పట్టాభి, ఆయన అనుయాయులు సీఐ కనకారావు తల పగలగొట్టారు.ఆ ఘటన తర్వాత పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు మేమే అధికారంలో ఉన్నా ఏకపక్షంగా వ్యవహరించలేదు.పోలీసులు సుమోటోగా తెలుగుదేశం వారితో పాటు వైయస్‌ఆర్ సీపీ వారిపైనా కూడా కేసులు పెట్టారు. అందులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. కారణం వంశీ ఘటనా స్థలంలో లేరు.కుట్రపూరితంగా..ఇది జరిగిన రెండు రోజుల తరువాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో డీటీపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ అనే దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు మనుషులు పిలిపించారు.అక్కడ సత్యవర్థన్ తో తెల్లకాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. కారణం వంశీ ఆ ఘటనా స్థలంలో లేరు కాబట్టి.2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్ నుంచి 161 స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ స్టేట్‌మెంట్ లో కూడా ఎక్కడా వంశీ పేరు లేదు. ఘటన జరిగినప్పుడు తాను అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని కూడా చెప్పారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..గత ఏడాది టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2024 జూలై 10న ఆ కేసు రీఓపెన్ చేశారు. వంశీపై చంద్రబాబు పెట్టుకున్న ఆక్రోశం, కోపం ఏ స్థాయిలో ఉందంటే, ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా, ఆయన్ను ఈ కేసులో 71వ నిందితుడిగా చేర్చారు.అవన్నీ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో, ముందస్తు బెయిల్ కోసం అప్పటికే వంశీ హైకోర్ట్‌ను ఆశ్రయించాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదని చంద్రబాబు కుట్రను ఇంకా ముందుకు తీసుకువెళ్లారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ తగలబెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు. వాస్తవానికి టీడీపీ ఆఫీస్‌ను ఎవరూ తగలబెట్టలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదు. అయినా తప్పుడు కేసు పెట్టారు.ఆ ఆఫీస్ చంద్రబాబుకు సంబంధించిన కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినది. ఆయన ఎస్సీ. అలా వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి, బెయిల్ కూడా రాకూడదని చేసిన కుట్ర ఇది.మొత్తం 94 మందిపై కేసు పెడితే, నెలలు తరబడి వైయస్‌ఆర్ సీపీ వారిని వేధించాలని ఇంకా 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు.చంద్రబాబు, లోకేష్ కుట్రఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్థన్ మేజిస్ట్రేట్ ముందు హాజరై వాగ్మూలం ఇస్తే, మిగతా వారికి కూడా బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు, పోలీసులు కలిసి కుట్రపన్నారు.పలు సమన్ల తర్వాత 2025 ఫిబ్రవరి 10న జడ్జిగారి ముందు హాజరైన సత్యవర్థన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో చంద్రబాబుగారు, లోకేష్‌కు మనశ్శాంతి లేకుండా పోయింది. మళ్లీ వీరు పోలీసులకు కలిసి కుట్రపన్నారు.సత్యవర్థన్ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ, ఆ మర్నాడే 11న విజయవాడ, పటమట పీఎస్‌లో సత్యవర్థన్ మీద ఒక ఎఫ్‌ఐఆర్ పెట్టి, దాన్ని వారి కుటుంబ సభ్యులకు చూపించి, బెదిరించారు.ఆ మర్నాడు ఫిబ్రవరి 12న సత్యవర్థన్ అన్నతో సత్యవర్థన్ వద్ద ఉన్న రూ.20 వేలు లాక్కుని, అతడిని కిడ్నాప్ చేశారని, దీనిని ఎవరో చూసి తమకు చెప్పారంటూ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయించి వెంటనే కేసు రిజిస్టర్ చేశారు.ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 13వ తేదీ తెల్లవారుజామున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు.ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. అదే రోజు 13వ రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్‌మెంట్ నమోదు చేసి, అందులో వంశీపై చెప్పించారు.అంటే కనీసం ఎవరైతే కిడ్నాప్ అయ్యారని చెబుతున్నారో.. అతడి స్టేట్‌మెంట్ నమోదు చేయక ముందే, వంశీని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారంటే ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందో అర్థమవుతోంది.దొంగ కేసులకు నిదర్శనంఒక మనిషి తప్పు చేస్తే అతడిని శిక్షిస్తే పోలీసులకు ఒక గౌరవం ఉంటుంది. కానీ నేడు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైలులో పెడుతున్నారు.దీనికి వంశీపై పెట్టిన కేసు ఒక నిదర్శనం.దిగజారిన ప్రజాస్వామ్యం:పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్ స్ఠానాలకు గానూ అన్నింటినీ వైయస్‌ఆర్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశంకు ఒక్క కౌన్సిలర్ కూడా లేరు.కానీ, నిన్న జరిగిన పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకోవడం చూస్తే చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో చెప్పడానికి నిదర్శనం. తిరుపతి కార్పోరేషన్‌లో మొత్తం 49 స్థానాలుంటే, అందులో వైయస్‌ఆర్‌సీపీ 48 స్థానాలను, తెలుగుదేశం ఒక స్థానంను గెలుచుకుంది. అటువంటి చోట డిప్యూటీ మేయర్ ఎన్నిక పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం వారు కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ ను గెలుచుకున్నామని చెప్పుకున్నారు. అటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలు వైయస్‌ఆర్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశం ఒక్కటి కూడా గెలుచుకోలేదు.అలాంటి చోట తెలుగుదేశం పార్టీ వైస్ ఛైర్మన్‌ను ఎలా గెల్చుకుంటుంది? ఇక్కడ దౌర్జన్యం చేసి వైయస్‌ఆర్ సీపీ కౌన్సిలర్లను తీసుకువెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి తెలుగుదేశం పార్టీ వత్తిడితో ఎన్నికనే వాయిదా వేయించారు. అంటే వారికి అనుకూల వాతావరణం వచ్చే వరకు ఎన్నిక జరపరు. పాలకొండలో వైయస్‌ఆర్ సీపీకి 17 స్థానాలు ఉంటే, టీడీపీకి కేవలం మూడు స్థానాలు ఉన్నాయి. అక్కడ వైస్ చైర్మన్ పదవి వైయస్‌ఆర్ సీపీకే వస్తుందని ఎన్నికను వాయిదా వేయించారు.పోలీసులూ గుర్తుంచుకొండిపోలీసులను ఇష్టానుసారంగా వాడుకుని ప్రజాస్వామ్యంకు తూట్లు పొడుస్తున్నారు. ఈరోజు ప్రతి పోలీస్ కు చెబుతున్నాను, మీ టోపీల కనిపించే ఆ మూడు సింహాలకు సెల్యూట్ కొట్టండి, కానీ తెలుగుదేశం నాయకులకు కాదు. వారు చెప్పినట్లు చేయడం మొదలు పెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాను.రేపు మా అధికారం వస్తుంది. అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులను బట్టలు ఊడదీసి నిలబెడతామని తెలియచేస్తున్నాను. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేప్పుడు సీఐ అన్నడంట. నేను ఒకటిన్నర సంవత్సరాల తరువాత రిటైర్ అవుతాను అని. రిటైర్ అయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, మొత్తం అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందు నిలబెడతాం. బట్టలు ఊడదీస్తాం.– న్యాయం జరిగేట్టుగా చేస్తామని ప్రతి ఒక్కరికీ తెలియచేస్తున్నాను. ఈ మాదిరిగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా ప్రజలు, దేవుడు వీరిని శిక్షించే కార్యక్రమం జరుగుతుందని మరోసారి చెబుతున్నాం. – అన్యాయంలో భాగస్వాములు కావొద్దు. మీ టోపీలపై ఉన్న సింహాలను గౌరవించండి. వాటికి సెల్యూట్ కొట్టండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాం.మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..ప్రతి కేసూ ఇల్లీగల్‌ప్రజాస్వామ్యం కూలిపోతోందనేందు ఇవ్వన్నీ నిదర్శనం. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ వీరే బెదిరిస్తున్నారు. తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు.అసలు ఎవరు, ఎవరిని బెదరిస్తున్నారు. ప్రతి విషయంలోనూ వీరే. పారిశ్రామికవేత్తలను, రాజకీయనేతలను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరినీ వీరే బెదరించి, అవతలి వారు బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు.ఇవ్వన్నీ ఊరికే పోవు. ఇవ్వన్నీ కూడా వీరికి చుట్టుకుంటాయి. అప్పుడు వారి పరిస్తితి అతి దారుణంగా తయారవుతుంది.వంశీ ఎందుకు టార్గెట్ అంటే..తన సామాజికవర్గం నుంచి ఒక వ్యక్తి (వంశీ) ఎదుగుతున్నాడని.. అతడు తన కంటే, లోకేష్ కంటే గ్లామరస్‌గా ఉన్నాడని చంద్రబాబుకు కోపం. అలాగే కొడాలి నానిపైనా చంద్రబాబుకు జీర్ణించుకోలేని ఆక్రోశం. ఇంకా అవినాశ్ కూడా లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారు. ఇదీ చంద్రబాబు మనస్తత్వం.కేవలం తాను, తన కుమారుడు మాత్రమే ఆ సామాజికవర్గంలో లీడర్లుగా ఉండాలని చంద్రబాబు మాట. అందుకే వారికి అనుకూలంగా లేని వారిని ఆ సామాజికవర్గం నుంచి వెలేస్తారు.అదో మాఫియా రాజ్యంచంద్రబాబు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి చేసేది. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం.చంద్రబాబును సీఎంను చేయడం కోసం, ఆయనకు ఓట్లు వేయించడం కోసం ఆ మాఫియా సామ్రాజ్యం తయారైంది.వారి సామాజికవర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్. వారిపై బురద చల్లడం. వారిపై ట్రోలింగ్ చేయించడం చేస్తున్నారు. ఇవ్వన్నీ చంద్రబాబు, లోకేష్ నైజానికి అద్దం పడుతున్నాయి.
![Sakshi Editorial On Election Commission of India3](/styles/webp/s3/article_images/2025/02/19/ec.jpg.webp?itok=f12igAHc)
ఆత్మావలోకనం అవసరం
విశ్వసనీయతను కాపాడుకునే విషయంలో, విలువలు పాటించే అంశంలో పట్టింపు ఉన్నట్టు కనబడకపోతే వ్యక్తులైనా, వ్యవస్థలైనా విమర్శలపాలు కాకతప్పదు. తన రిటైర్మెంట్‌కు ఒక రోజు ముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ రాజీవ్ కుమార్ తమపై వస్తున్న విమర్శలకూ, ఆరోపణలకూ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఓడిన వారు ఫలితాలను జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నది ఆయన అభిప్రాయం. దీనికి మూలం ఎక్కడుందో, తామెంత వరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునివుంటే సమస్య మొత్తం ఆయనకే అర్థమయ్యేది. ఈసీకి ఇప్పటికీ ఏదోమేర విశ్వసనీయత ఉందంటే అది మాజీ సీఈసీ టీఎన్ శేషన్ పెట్టిన భిక్ష. అంతకుముందు ఈసీ ఉనికి పెద్దగా తెలిసేది కాదు. అది రాజ్యాంగ సంస్థ అనీ, దానికి విస్తృతాధికారాలు ఉంటాయనీ ఎవరూ అనుకోలేదు. శేషన్ తీరు నియంతను పోలివుంటుందని, తానే సర్వంసహాధికారినన్నట్టు ప్రవర్తిస్తారని ఆరోపణలొచ్చిన మాట వాస్తవమే అయినా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటంలో, అవసరమైతే ఎన్నికలను రద్దు చేయటం వంటి కఠిన చర్యలకు వెనకాడకపోవటంలో ఆయనకెవరూ సాటిరారు. అనంతరం వచ్చిన సీఈసీల్లో అతి కొద్దిమంది మాత్రమే శేషన్ దరిదాపుల్లోకొచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా అసలు ఆ ఊసే లేకుండా కాలక్షేపం చేసినవారే అధికం. శేషన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోకపోతే పోయారు... కనీసం ఆ సంస్థ ఔన్నత్యాన్ని దిగజార్చకపోతే బాగుండునని కోరు కోవటం కూడా అత్యాశేనన్న చందంగా పరిస్థితి మారింది. దాని స్వతంత్రత, తటస్థత, విశ్వస నీయత ప్రశ్నార్థకమయ్యే రోజులొచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించటానికి రాజ్యాంగం సృష్టించిన సంస్థ ఈసీ. అది తనకు ఎదురయ్యే అనుభవాలతో తన అధికారాలను పునర్నిర్వచించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తే, దానిద్వారా రాజ్యాంగం ఆశించిన ఉద్దేశాలు నెరవేరేవి. ఈసీ ఏక సభ్య సంఘంగా మొదలై త్రిసభ్య సంఘమైంది. కానీ ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోలేని అశక్తతకు లోబడుతుండటం చేదు వాస్తవం. రాజ్యాంగం ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినా దాన్ని వినియోగించుకోవటంలో ఆసక్తి కనబరుస్తున్న దాఖలా లేదు. పార్టీలను నమోదు చేసుకునే అధికారం 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఈసీకి ఇస్తోంది. ఆ నమోదును రద్దు చేసే లేదా ఆ పార్టీనే రద్దుచేసే అధికారం మాత్రం లేదు. మరింత స్వతంత్రంగా, మరింత దృఢ సంకల్పంతో వ్యవహరించమని వేర్వేరు తీర్పుల్లో సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగా ఈసీ వ్యవహరించివుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! గెలిచిన పార్టీలకు ఆరోపణలు చేసే అవసరం తలెత్తదు. అంతటి త్యాగధనులు కూడా ఎవరూ లేరు. కానీ మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ చేసిన ఆరోపణల మాటేమిటి? వాటినీ కొట్టిపారేస్తారా? కనీసం ఆయన వ్యాఖ్యలపైన స్పందించలేని అచేతన స్థితికి ఈసీ చేరుకోవటాన్ని రాజీవ్ ఏరకంగా సమర్థించుకోగలరు? రోజులు గడిస్తే తప్పులు సమసిపోతాయా? ఇంత అమాయకత్వాన్ని నటిస్తున్న రాజీవ్ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల తంతుపై వచ్చిన విమర్శలకు ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారైనా జవాబిచ్చారా? పోలింగ్ జరిగినరోజు రాత్రి 8 గంటలకు వోటింగ్ శాతాన్ని 68.12 అని ప్రకటించి, మరో మూడు గంటలు గడిచాక దాన్ని ఏకంగా 76.50 శాతమని చెప్పటం, మరో నాలుగు రోజులకు మళ్లీ గొంతు సవరించుకుని 80.66గా మార్చటంలోని మర్మమేమిటి? ఈ పెంపు ఏకంగా 12.5 శాతం. దాన్ని అంకెల్లోకి మారిస్తే 49 లక్షలు! ఈ మాయా జాలం ఏమిటో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 49 లక్షలమంది కథాకమామీషు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండనవసరం లేదా? తమకై తాము ప్రజలను అయోమయంలోకి నెట్టి, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి రాజకీయపక్షాలపై బండరాళ్లు వేయటం ఏ రకమైన నీతి? మహారాష్ట్ర ఎన్నికలు సైతం ఈ బాణీలోనే సాగాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పిన ఎన్నికల సంఘమే రాత్రికల్లా 65.02 శాతమని మార్చింది. కౌంటింగ్‌కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. అంటే వోటింగ్‌లో 7.83 శాతం పెరుగుదల. అంకెల్లో చూస్తే స్థూలంగా 76 లక్షలు. ఇలాంటి దుఃస్థితి అఘోరించినప్పుడు సందేహాలు రావా? ఆరోపణలు వెల్లువెత్తవా?రాజీవ్ మీడియా సమావేశం రోజునే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఇది సరికాదంటూ విపక్ష నేత రాహుల్‌గాంధీ అసమ్మతి నోట్ అందజేశారు. ఇలా వివాదాస్పద ఎంపికలోనే సమస్యకు బీజం ఉంటుందని, అటుపై ఈసీ నడతను నిశితంగా పరిశీలించటం మొదలవుతుందని రాజీవ్ గుర్తిస్తే మంచిది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నదని ఖురేషీ విమర్శిస్తే ఇదే రాజీవ్ నొచ్చుకుని ‘ఎంతమంది సీఈసీలు ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులు అందుకున్నారో, వాటి ఆధారంగా ఎందరిపై చర్య తీసుకున్నారో మేం ఆరా తీశాం’ అని గంభీరంగా ప్రకటించారు. అదేమిటో బయటపెట్టాలని ఖురేషీ సవాలు చేస్తే ఈ ఆరేళ్లుగా మౌనమే సమాధానమైంది. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదని చెప్పటానికి ఇది చాలదా?
![CM Revanth Reddy Comments In Cyber Security Conference4](/styles/webp/s3/article_images/2025/02/19/CONCLAVE-8_0.jpg.webp?itok=mJR7MGJh)
సైబర్ భద్రతలో సూపర్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సైబర్ భద్రతలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులోనూ దేశానికే ఆదర్శంగా ఉన్నామని చెప్పారు. ఈ తరహా నేరాలను నియంత్రించడంలో జాతీయ స్థాయిలో తెలంగాణ ముందు వరుసలో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం కితాబిచి్చందని గుర్తు చేశారు. సైబర్ నేరాలు ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయని, వీటిని అరికట్టేందుకు ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని, రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు షీల్డ్–2025 వంటి సైబర్ సెక్యూరిటీ సదస్సులు మంచి వేదికలుగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీలో రెండురోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ‘షీల్డ్–2025 సైబర్ సెక్యూరిటీ సదస్సు’ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం మంగళవారం ప్రారంభించారు. అలాగే టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (సీఓసీ), సైబర్ ఫ్యూజన్ సెంటర్ (సీఎఫ్‌సీ), చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను పరిష్కరించే చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం సదస్సునుద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. హెల్ప్‌లైన్ నంబర్ 1930 అందరికీ చేరాలి ‘సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు రూ.22 వేల కోట్లు కాజేసినట్టు అంచనాలు ఉన్నాయి. ప్రజల జీవన స్థితిగతులను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి ప్రమాదకరమైన పరిణామాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. ఫేక్‌న్యూస్, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తి కూడా సమాజానికి చేటు చేస్తున్నాయి. సమాజంలో కొంతమంది జరగని నేరాలు జరిగినట్టు, జరగని దాడులు జరిగినట్టు లేదా మరో రూపంలో డీప్ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారు. ఆర్థిక నేరాలతో పాటు ఇలాంటి వాటన్నింటినీ నియంత్రించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలను అరికట్టడానికి ఐటీ సంస్థలు, నిపుణులతో కలిసి తెలంగాణ నిబద్ధతతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 నిరి్వరామంగా 24 గంటలూ పనిచేస్తోంది. ఈ విషయాన్ని అందరికీ చేరవేయాలి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో భాగంగా జాతీయ స్థాయిలో ఈ సదస్సు ఏర్పాటుకు చొరవ తీసుకున్నందుకు టీజీసీఎస్‌బీ డీజీ శిఖాగోయల్, ఇతర సిబ్బందిని అభినందించారు. ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి: మంత్రి శ్రీధర్‌బాబు డేటా భద్రతకు సంబంధించి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలో తెలంగాణలో కొత్త సెక్యూరిటీ పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సైబర్ నేరాలను తగ్గించడం కాకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేసే వ్యవస్థ రావాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు ఏటా 10 ట్రిలియన్ డాలర్ల సొమ్ము కొల్లగొడుతున్నారని చెప్పారు. భారత్‌లో రూ.15 వేల కోట్ల వరకు దోచుకున్నారని తెలిపారు. చాలామంది మోసపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదన్నారు. ఒక్కసారి డబ్బులు కోల్పోతే రికవరీ కష్టమని, ప్రజలే సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోడ్రన్ పోలీసింగ్‌లో టెక్నాలజీ అత్యంత కీలకమని డీజీపీ జితేందర్ అన్నారు. సైబర్ సెక్యూరిటీ పరిశోధన, విధాన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధిలో భవిష్యత్ సహకారాల కోసం షీల్డ్–2025 విద్యారంగ భాగస్వాములైన ఐఐటీ హైదరాబాద్, నల్సార్, ఐఎస్‌బీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నట్టు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. కార్యక్రమంలో హోం శాఖ కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ జనరల్ రమేశ్ ఖాజా, 14 రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ పోలీస్ అధికారులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఐటీ, టెలికాం, రక్షణ.. ప్రజా విధాన సంస్థలు, స్టార్టప్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు బుధవారం కూడా కొనసాగనుంది.
![Subramanya Swamy Writes A Letter To CBI For Deputy Mayor Election Of Tirupati5](/styles/webp/s3/article_images/2025/02/18/subramanian-swamy1.jpg.webp?itok=P0XkTVEm)
డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై సుబ్రహ్మణ్యస్వామి లేఖ
ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. ఆ ఎన్నికల సందర్బంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారని, అక్రమాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. ఎంపీ గురుమూర్తి సహా పలువురుపై దాడికి పాల్పడిన సందర్భాన్ని సుబ్రహ్మణ్యస్వామి లేఖలో పేర్కొన్నారు.కాగా, ఈనెలలో జరిగిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుంది. దాడులు, దౌర్జన్యాలతో పదవి లాక్కున్న కూటమి ప్రభుత్వం బరి తెగించి.. కుతంత్రాలకు తెరతీసింది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్‌తో కూటమి విధ్వంసం సృష్టించింది. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామంటూ బెదిరింపులకు దిగింది. మహిళా కార్పొరేటర్లపై కూడా దాడులు చేసిన కూటమి గూండాలు.. బెదిరింపులకు పాల్పడ్డారు.మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్‌లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు.
![CT 2025: Full schedule All Squads Match Timings Venues Live Streaming Details6](/styles/webp/s3/article_images/2025/02/18/cricket.jpg.webp?itok=2lrlyCJn)
CT 2025: షెడ్యూల్, జట్లు, టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్(India), పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు,జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?!చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉12. మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉సెమీ ఫైనల్ 1: మార్చి 4- దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 👉సెమీ ఫైనల్ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్(పాకిస్తాన్ క్వాలిఫై అయితే)👉ఫైనల్ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్ లేదా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్. అదే విధంగా.. జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా(ఎక్స్) హ్యాండిల్‌లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు. టెలివిజన్, మొబైల్‌లలో ఈ వెసలుబాటు ఉంటుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్లుగ్రూప్-ఎఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్స్: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే.పాకిస్తాన్‌మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీషన్.బంగ్లాదేశ్‌సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా, నసూమ్ అహ్మద్.గ్రూప్-బిఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షూయిస్, స్పెన్సర్ జాన్సన్.ట్రావెలింగ్ రిజ్వర్స్: కూపర్ కొనొలి.సౌతాఫ్రికాటెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, కార్బిన్ బాష్‌ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.ఇంగ్లండ్‌జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్‌టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.అఫ్గనిస్తాన్‌ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నంగ్యాల్ ఖరోటీ, నవీద్ జద్రాన్‌రిజర్వ్ ప్లేయర్లు: డార్విష్ రసూలీ, బిలాల్ సమీ.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్
![TDP And Police conspiracy in Vallabhaneni Vamsi Case7](/styles/webp/s3/article_images/2025/02/18/chandrababu1.jpg.webp?itok=2YTqQYAM)
వంశీ కేసులో బట్టబయలైన టీడీపీ పన్నాగం
విజయవాడ: వైఎస్సార్ సీపీ నేత వల్లభనేని వంశీ కేసులో టీడీపీ-పోలీసుల పన్నాగం బట్టబయలైంది. వంశీ కేసులో తప్పుడు సాక్ష్యం ఇచ్చానని కోర్టుకు చెప్పిన సత్యవర్థన్ పై కేసు నమోదు చేయడంతో టీడీపీ కుట్ర తేటతెల్లమైంది. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని సత్యవర్థన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో టీడీపీ కుట్ర పూరిత రాజకీయం మరొకసారి బట్టబయలైంది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు సత్యవర్థన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సత్యవర్థన్ని బెదిరించేందుకు కేసు నమోదు చేశారు. ఈ నెల 11వ తేదీన వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్ రిజస్టర్ చేశారు పోలీసులు. 84/2025 కేసులో సత్యవర్థన్ ఏ5గా ఉన్నారు. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై కొమ్మాకోట్టు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్థన్లపై కేసు నమోదు చేశారు. 232, 351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు విజయవాడ పటమట పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తాజాగా వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్థన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. సత్యవర్థన్ పై కేసు పెట్టి మరుసటి రోజు అన్న తో ఫిర్యాదు చేయించారు పోలీసులు. ఆ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో వంశీపై కుట్ర పూరితంగా టీడీపీ కేసు పెట్టించిందనే విషయం బహిర్గతమైంది.
![Infosys got caught red handed stealing trade secrets says Cognizant8](/styles/webp/s3/article_images/2025/02/18/infosys.jpg.webp?itok=C294p6l6)
‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’
ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మధ్య న్యాయ పోరాటం తీవ్రంగా మారింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. పోటీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ గోప్యమైన డేటాను దుర్వినియోగం చేసిందని, బహిర్గతం చేయని ఒప్పందాలను (NDAs) ఉల్లంఘించిందని కాగ్నిజెంట్ ఆరోపించింది .కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య యూఎస్ కోర్టులో ఓ దావా నడుస్తోంది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్‌వేర్ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్ కేసు దాఖలు చేసిందని మింట్ నివేదిక తెలిపింది. "నాన్ డిస్‌క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్స్ (NDAAs) ద్వారా ఇన్ఫోసిస్ తమ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది" అని 22 పేజీల కోర్టు ప్రతిస్పందనను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: టీసీఎస్ వీసా ఫ్రాడ్ చేసింది.. మాజీ ఉద్యోగుల ఆరోపణలు తమ ట్రైజెట్టో సమాచారాన్ని ఉపయోగించారా లేదా అన్నది ఆడిట్ చేయడానికి ఇన్ఫోసిస్ నిరాకరించిందని, ఇది తన తప్పును రుజువు చేస్తుందని కాగ్నిజెంట్ వాదిస్తోంది. ఈ చట్టపరమైన వివాదం 2024 ఆగస్టు నాటిది. కాగ్నిజెంట్ మొదట డల్లాస్ కోర్టులో ఈ ప్రకటన చేసింది. గత జనవరి 9న దాఖలు చేసిన కేసులో ఈ ఆరోపణను ఇన్ఫోసిస్ తిరస్కరించింది, కాగ్నిజెంట్‌కు సంబంధించిన హెల్త్ కేర్ సొల్యూషన్స్ బహిరంగంగానే ఉన్నాయని, అందులో వాణిజ్య రహస్యాలు ఏమున్నాయో వారే చూసుకోవాలని కాగ్నిజెంట్‌కు సూచించాలని కోర్టును ఇన్ఫోసిస్ కోరింది.ఇన్ఫోసిస్ ప్రతి దావాఇన్ఫోసిస్ తరువాత కాగ్నిజెంట్ పై ప్రతి దావా వేసింది. దాని సీఈవో రవి కుమార్ ఇన్ఫోసిస్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సొంత హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తిని విడుదల చేయడాన్ని కావాలని ఆలస్యం చేశారని, కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని ప్రత్యారోపణలు చేసింది. రవి కుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను వీడారు. ఆ తర్వాత ఏడాది అంటే 2023 జనవరిలో కాగ్నిజెంట్‌లో సీఈవోగా చేరారు. రెండు కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ రంగ క్లయింట్ల నుంచే పొందుతోంది. కాగ్నిజెంట్‌కు కూడా తమ క్లయింట్లలో దాదాపు మూడోవంతు హెల్త్ కేర్ నుంచే ఉన్నారు.
![Maharashtra Ruling Alliance Rift Widens9](/styles/webp/s3/article_images/2025/02/18/eknath%20shinde.jpg.webp?itok=ixKj9BpE)
కూటమికి ఏక్‌నాథ్ షిండే దూరం..? పొమ్మనలేక, పొగపెడుతున్న..
ముంబై : ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయ్యిందో లేదో .. మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. దీంతో కూటమి చీలిపోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంతకీ మహా రాజకీయాల్లో ఏం జరుగుతోంది.మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి.మహాయుతి కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు,ఎంపీలకు వై కేటగిరీ భద్రతను తొలగిస్తున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. భద్రత తగ్గింపులో కూటమిలో ఎన్సీపీ అజిత్ కుమార్ వర్గం కంటే.. శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గం నేతలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఏక్‌నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం 44 మంది ఎమ్మెల్యేలకు , 11 లోక్‌సభ ఎంపీలకు ‘వై’ కేటగిరి భద్రతను అందించింది. తాజాగా, ఆ భద్రతను తొలగించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో భద్రతా సమీక్షా కమిటీ జరిగింది. భద్రతా కమిటీ సమీక్షల ఆధారంగా.. ప్రజాప్రతినిధులకు వైకేటగిరి భద్రతను తొలగిస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ పరమైన జోక్యం లేదని స్పష్టం చేశారు.అయినప్పటికీ మహాయుతి కూటమిలో మనస్పర్ధలు ఉన్నాయని, సీఎం దేవేంద్రఫడ్నవీస్ షిండేని దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా ఇటీవల అయితే, దావోస్ పర్యటనకు ముందు సీఎం ఫడ్నవీస్ ఎన్సీపీ,బీజేపీకి చెందిన నేతల్ని రాయ్‌గఢ్ రాయ్‌గఢ్, నాసిక్‌లకు ఇన్‌ఛార్జులుగా నియమించారు. అందులో శివసేన నేతలు లేకపోవడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇన్‌ఛార్జ్‌ల నియామకానికి బ్రేకులు పడ్డాయి. ఈ పరిణామాల వేళ..షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలకు భద్రతను కుదించాలని నిర్ణయించుకోవడం గమనార్హం.మహాయుతి కూటమి లుకలుకలపై శివసేన (యూబీటీ)ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. మహాయుతి కూటమి ప్రేమికుల దినం జరుపుకుంటోంది అంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు.
![Rajasthan IPS Pankaj Kumar Chaudhary Demoted Over Family Issues and Second Marriage10](/styles/webp/s3/article_images/2025/02/18/pankaj%20kumar%20chaudhary.jpg.webp?itok=jyUtPtJC)
రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
జైపూర్ : రెండో వివాహం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియర్ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి హోదా తగ్గించింది. ఈ నిర్ణయంతో సీనియర్ ఐపీఎస్ అధికారిగా హోదాతో పాటు తీసుకునే పేస్కేలు సైతం తగ్గింది. కొత్తగా విధుల్లో చేరిన ఐపీఎస్ ఎంత వేతనం తీసుకుంటారో.. అంతే వేతనం సదరు సీనియర్ ఐపీఎస్ అధికారికి అందుతుంది.పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ చౌదరి జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. అయితే పంకజ్ కుమార్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాదంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పంకజ్ కుటుంబ సభ్యులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పంకజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.ఈ తరుణంలో ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ వివాహంపై రాజస్థాన్ రాష్ట్ర ఉన్నాతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంకజ్ కుమార్ దోషిగా తేల్చారు. విచారణ అనంతరం మూడు సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్న తన డిజిగ్నేషన్‌ను తగ్గించారు. లెవల్ 11 సీనియర్ పే స్కేల్ నుండి లెవల్ 10 జూనియర్ పే స్కేల్‌కు కుదించారు. ఈ పేస్కేల్ కొత్తగా విధుల్లోకి చేరిన ఐపీఎస్‌లకు కేటాయిస్తారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పంకజ్ చౌదరి. ప్రస్తుతం,జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. హోదా తగ్గించడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (లెవల్ 10)గా కొనసాగనున్నారు.
అన్ని వివరాలూ ఇవ్వాల్సిందే: సెబీ
యూఏఈలోకి రిలయన్స్ ప్రొడక్ట్స్ ఎంట్రీ.. కాంపా లాంచ్
WPL 2025: ముంబై బౌలర్ల విజృంభణ.. గుజరాత్ నామమాత్రపు స్కోరు
శతక్కొట్టిన ఓపెనర్.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. సిరీస్ సొంతం
కో-వర్కింగ్ సెంటర్ల జోరు.. హైదరాబాద్‌లో 26,000 సీట్లు
కూటమికి ఏక్‌నాథ్ షిండే దూరం..? పొమ్మనలేక, పొగపెడుతున్న..
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్
‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’
ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల పేరిట ‘ముందస్తు’ దోపిడీ
ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. సూర్యకుమార్ యాదవ్, శివం దూబే డకౌట్
ఇప్పటివరకూ అక్రమ వలసదారులే టార్గెట్ అనుకున్నాం.. మనల్ని చేస్తారనుకోలేదు!!
'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తి వివాదాలు పరిష్కారం
దేశంలోనే ధనిక పార్టీ బీజేపీ
నాడు డబుల్.. నేడు సింగిల్! తేలికవుతున్న ఐటీ జీతాలు
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్
Software Engineer: ప్రవళిక ఎందుకమ్మా ఇలా చేశావు..!
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు
Telangana: రూ. 50 వేలకు మించి తీసుకెళ్లొద్దు
అన్ని వివరాలూ ఇవ్వాల్సిందే: సెబీ
యూఏఈలోకి రిలయన్స్ ప్రొడక్ట్స్ ఎంట్రీ.. కాంపా లాంచ్
WPL 2025: ముంబై బౌలర్ల విజృంభణ.. గుజరాత్ నామమాత్రపు స్కోరు
శతక్కొట్టిన ఓపెనర్.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. సిరీస్ సొంతం
కో-వర్కింగ్ సెంటర్ల జోరు.. హైదరాబాద్‌లో 26,000 సీట్లు
కూటమికి ఏక్‌నాథ్ షిండే దూరం..? పొమ్మనలేక, పొగపెడుతున్న..
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్
‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’
ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల పేరిట ‘ముందస్తు’ దోపిడీ
ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. సూర్యకుమార్ యాదవ్, శివం దూబే డకౌట్
ఇప్పటివరకూ అక్రమ వలసదారులే టార్గెట్ అనుకున్నాం.. మనల్ని చేస్తారనుకోలేదు!!
'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తి వివాదాలు పరిష్కారం
దేశంలోనే ధనిక పార్టీ బీజేపీ
నాడు డబుల్.. నేడు సింగిల్! తేలికవుతున్న ఐటీ జీతాలు
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్
Software Engineer: ప్రవళిక ఎందుకమ్మా ఇలా చేశావు..!
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు
Telangana: రూ. 50 వేలకు మించి తీసుకెళ్లొద్దు
సినిమా
![Bollywood Actress Amrita Singh Buys Luxury Apartment In Mumbai](/styles/webp/s3/article_images/2025/02/18/amrita-singh.jpg.webp?itok=B-5HcOZh)
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న సైప్ అలీ ఖాన్ మాజీ భార్య.. ఎన్ని కోట్లంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి అమృతా సింగ్ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఈ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ.18 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. కాగా.. అమృతా సింగ్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరిద్దరు విడిపోయారు. వీరిద్దరికీ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.కాగా.. అమృతా సింగ్ బేతాబ్ (1983) చిత్రంతో అరంగేట్రం చేశారు. ఈ సినిమాతోనే బాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మార్డ్, నామ్, చమేలి కి షాదీ, రాజు బన్ గయా జెంటిల్మన్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె కలియుగ్, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా వంటి చిత్రాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఐనా చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది, తరువాత ఆమె 2 స్టేట్స్ మూవీలో ఆమె పాత్రకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది.
![Nandamuri Taraka Ratna's Wife Alekhya Reddy Emotional Post About Husband](/styles/webp/s3/article_images/2025/02/18/Nandamuri-Taraka-Ratn_0.jpg.webp?itok=zyhWJ-SY)
మనం ఇలా విడిపోతామని ఎప్పుడూ అనుకోలేదు: తారకరత్న భార్య ఎమోషనల్
సరిగ్గా రెండేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో, నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆయన చివరికీ కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఫిబ్రవరి 18, 2023న నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇవాళ తారకరత్న వర్ధంతి కావడంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించింది. ఈ ప్రపంచంలో నువ్వు లేని లోటు పూడ్చలేనిదని ఎమోషలైంది. నిన్ను కోల్పోయిన క్షణం కాలం నయం చేయలేని గాయం.. నీ స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిదని భావోద్వేగానికి గురయ్యారు. మనం ఎప్పుడూ ఇలా విడిపోవాలని అనుకోలేదు... నువ్వు ఇక్కడ ఉండకపోవచ్చు.. కానీ నీ ఉనికి మా జీవితాల్లో, నువ్వు వదిలి వెళ్లిన కలల్లో వికసిస్తూనే ఉంటుందని రాసుకొచ్చింది. మాటలకు , కాలానికి, జీవితానికి అతీతంగా మేము నిన్ను మిస్ అవుతున్నాం అంటూ అలేఖ్యా రెడ్డి.. తన భర్త తారకరత్నను గుర్తు చేసుకుంది.(ఇది చదవండి: Taraka Ratna Death: నందమూరి తారకరత్న కన్నుమూత)నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna)
![Tollywood Producer SKN Released A Video About His Comments In Event](/styles/webp/s3/article_images/2025/02/18/skna.jpg.webp?itok=P6dE7vIj)
తెలుగమ్మాయిలపై వివాదాస్పద కామెంట్స్: టాలీవుడ్ నిర్మాత వివరణ
ఇటీవల డ్రాగన్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించమని.. వారిని తీసుకుంటే ఏమవుతుందో తెలుసని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను చెప్పిన వాటిలో వివాదమేముందని ఎస్కేఎన్ రిప్లై కూడా ఇచ్చారు.(ఇది చదవండి: తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వకూడదు: ఎస్కేఎన్)అయితే తాజాగా ఈ వివాదంపై నిర్మాత ఎస్కేఎన్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది తెలుగమ్మాయిలను పరిచయం నిర్మాతల్లో తాను కూడా ఉన్నానని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఈవెంట్లో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని తెలుగువారిని వెండితెరకు పరిచయం చేశానని వెల్లడించారు. భవిష్యత్తులో మరో 25 మందిని ప్రతిభావంతులైన తెలుగమ్మాయిలను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగువారి ప్రతిభను ప్రోత్సహించడం ఎల్లప్పుడూ నా ప్రాదాన్యతగా భావిస్తానని ట్విటర్లో వీడియోను పంచుకున్నారు. అందుకే దయచేసి తనపై ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వీడియోలో ఎస్కేఎన్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఇటీవల డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు అమ్మాయిల గురించి మాట్లాడా. కానీ నేను తెలుగు అమ్మాయిలతో పని చేయనని రాశారు. కానీ చాలా మంది తెలుగు నటీమణులను పరిశ్రమకు పరిచయం చేసిన కొద్దిమంది నిర్మాతలలో నేను ఒకడిని. రేష్మా, ఆనంది, మానస, ప్రియాంక జువాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత లాంటి వారని నేనే పరిచయం చేశా. ఇలా ఎనిమిది మందిని పరిచయం చేశానని' అన్నారు. Hi everyone, Namaste. I am one of the few producers who have introduced Many Telugu actresses to the industry. A lighthearted comment I made recently was misunderstood, leading to unnecessary headlines with incorrect meanings.To clarify, I have introduced 8 talented individuals… pic.twitter.com/raWN8Suvpk— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 18, 2025
![Paradha Team Special Wishes To Anupama Parameswaran on Her Birthday](/styles/webp/s3/article_images/2025/02/18/anupama.jpg.webp?itok=DQfa23Jh)
అనుపమ బర్త్ డే.. పరదా టీమ్ స్పెషల్ విషెస్
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్)ఇవాళ అనుపమ బర్త్ డే కావడంతో ఓ వీడియోను విడుదల చేశారు. దాదాపు 20 సెకన్లపాటు ఉన్న మూవీ క్లిప్‌ను షేర్ చేస్తూ అనుపమకు పుట్టినరోజ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నమైన సోషియో ఫాంటసీ కథగా రానున్న ఈ చిత్రంలో అనుపమ సుబ్బు అనే పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు.
క్రీడలు
![CT 2025: Full schedule All Squads Match Timings Venues Live Streaming Details5](/styles/webp/s3/article_images/2025/02/18/cricket.jpg.webp?itok=2lrlyCJn)
CT 2025: షెడ్యూల్, జట్లు, టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్(India), పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు,జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?!చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉12. మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉సెమీ ఫైనల్ 1: మార్చి 4- దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 👉సెమీ ఫైనల్ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్(పాకిస్తాన్ క్వాలిఫై అయితే)👉ఫైనల్ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్ లేదా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్. అదే విధంగా.. జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా(ఎక్స్) హ్యాండిల్‌లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు. టెలివిజన్, మొబైల్‌లలో ఈ వెసలుబాటు ఉంటుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్లుగ్రూప్-ఎఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్స్: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే.పాకిస్తాన్‌మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీషన్.బంగ్లాదేశ్‌సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా, నసూమ్ అహ్మద్.గ్రూప్-బిఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షూయిస్, స్పెన్సర్ జాన్సన్.ట్రావెలింగ్ రిజ్వర్స్: కూపర్ కొనొలి.సౌతాఫ్రికాటెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, కార్బిన్ బాష్‌ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.ఇంగ్లండ్‌జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్‌టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.అఫ్గనిస్తాన్‌ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నంగ్యాల్ ఖరోటీ, నవీద్ జద్రాన్‌రిజర్వ్ ప్లేయర్లు: డార్విష్ రసూలీ, బిలాల్ సమీ.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్
![CT 2025: Rizwan Confirms Babar Azam Batting Position Big Decision6](/styles/webp/s3/article_images/2025/02/18/babarrizwan.jpg.webp?itok=g3OkPN2G)
అతడు ఓపెనర్‌గానే వస్తాడు.. ట్రోఫీ గెలవడమే లక్ష్యం: పాక్ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడని పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) అన్నాడు. తమ పాత్రలు ఏవైనా అందరి ప్రధాన లక్ష్యం మాత్రం టైటిల్ గెలవడమేనని తెలిపాడు. అదే విధంగా తమ ఓపెనింగ్ జోడీలోనూ ఎలాంటి మార్పులు చేయబోవడం లేదని రిజ్వాన్ పేర్కొన్నాడు.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) నిర్వహించగా నాడు పాకిస్తాన్ విజేతగా నిలిచింది. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో.. చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 19 నుంచి సొంతగడ్డపై మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో పాక్ జట్టు తొలుత న్యూజిలాండ్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా బాబర్ ఆజం(Babar Azam) ఓపెనర్‌గానే బరిలో దిగుతాడని స్పష్టం చేశాడు. కాగా వన్‌డౌన్‌లో వచ్చే బాబర్.. ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌తో త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఓపెనర్‌గా వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ విఫలమయ్యాడు.ఓపెనర్‌గా ఆడిన మూడు మ్యాచ్‌లలో వరుసగా 10, 23, 29 పరుగులు చేశాడు. అంతకుముందు సౌతాఫ్రికా గడ్డపై సయీమ్ ఆయుబ్ స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్‌గా ప్రమోట్ అయిన బాబర్ అక్కడ కూడా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను ఓపెనర్‌గా ఆడించడంపై పునరాలోచన చేయాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు.అతడు ఓపెనర్‌గానే వస్తాడు..ఈ నేపథ్యంలో కెప్టెన్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే, కాంబినేషన్లకు అనుగుణంగానే తుదిజట్టు కూర్పు ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీలోనూ బాబర్ ఆజం ఓపెనర్‌గా కొనసాగుతాడు. తన బ్యాటింగ్ స్థానం పట్ల అతడు సంతృప్తిగానే ఉన్నాడు.స్పెషలిస్టు ఓపెనర్లతోనే బరిలోకి దిగాలని మాకూ ఉంది. అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఒక్కోసారి సడలింపులు తప్పవు. అందుకే బాబర్ ఆజంను ఓపెనర్‌గా పంపాలనే నిర్ణయానికి వచ్చాం. ఫఖర్ జమాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. టెక్నికల్‌గా అతడు గొప్ప బ్యాటర్ అని అందరికీ తెలిసిందే.అందరూ కెప్టెన్లేఇక ఈ టోర్నీలో నేను లేదంటే బాబర్ ఆజం మాత్రమే ముఖ్యంకాదు. ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్కరు కఠినంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్‌గా జట్టు సమిష్టి ప్రదర్శనతో వచ్చే గెలుపును ఆస్వాదిస్తా. అయితే, కొన్నిమ్యాచ్లలో వ్యక్తిగత ప్రదర్శనలే అధిక ప్రభావం చూపిస్తాయి. ఏదేమైనా ప్రస్తుతం మా దృష్టి జట్టులోని పదిహేను మంది సభ్యులపై ఉంది. అందరూ కెప్టెన్లే. అయితే, వారికి ప్రతినిధిగా నేను టాస్ సమయంలో.. మీడియా సమావేశంలో ముందుకు వచ్చి మాట్లాడుతానంతే’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే ప్రపంచకప్-2023లో ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’లో అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఉన్నాయి. చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్
![Not Sachin: Sehwag Names This Star Number 1 ODI Batter Picks All Time Top 57](/styles/webp/s3/article_images/2025/02/18/Sehwag_0.jpg.webp?itok=aFlJYijv)
సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గురించే చర్చ. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్ కోసం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో సెమీ ఫైనలిస్టులు, ఫైనల్స్ చేరే జట్లు, విజేతపై తమ అంచనాలు తెలియజేస్తూ సందడి చేస్తున్నారు.సచిన్ టెండ్కులర్కు రెండో స్థానంఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) వన్డే క్రికెట్లో టాప్-5 ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లు వీరేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో తన సహచర ఓపెనర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండ్కులర్(Sachin Tendulkar)కు వీరూ భాయ్ రెండో స్థానం ఇవ్వడం విశేషం. మరి ఆ మొదటి ప్లేయర్ ఎవరంటారా?!..అప్పుడే తొలిసారిగా చూశానుచాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘నా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే బ్యాటర్లలో క్రిస్ గేల్ ఐదో స్థానంలో ఉంటాడు. అతడు గొప్ప బ్యాటర్. గొప్ప ఓపెనర్ కూడా! 2002-03లో టీమిండియా వెస్టిండీస్‌కు వెళ్లింది. నాటి ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో గేల్ మూడు శతకాలు బాదాడు.అంతర్జాతీయ స్థాయిలో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్ షాట్లతో సిక్సర్లు బాదిన క్రికెటర్‌ను నేను అప్పుడే తొలిసారిగా చూశాను’’ అని సెహ్వాగ్ గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు చోటిచ్చిన వీరూ భాయ్.. ‘‘డివిలియర్స్ బ్యాటింగ్ చేసే విధాననం నాకెంతో ఇష్టం. సిక్సర్లు కొట్టడంలో అతడిదొక ప్రత్యేక శైలి’’ అని పేర్కొన్నాడు.అతడిని చూసే నేర్చుకున్నాఅదే విధంగా.. పాకిస్తాన్ మాజీ స్టార్ ఇంజమామ్ ఉల్ హక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆసియాలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఇంజమామ్ ఒకడు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. మ్యాచ్‌ను ఎలాగోలా తన ఆధీనంలోకి తెచ్చుకునేవాడు.చివరిదాకా ఇన్నింగ్స్ ఎలా కొనసాగించాలో నేను అతడిని చూసే నేర్చుకున్నా. ఓవర్‌కు ఏడు లేదంటే ఎనిమిది పరుగులు రాబట్టడం అప్పట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇంజమామ్ మాత్రం మంచినీళ్లు తాగినంత సులువుగా ఇన్నింగ్స్ ఆడేవాడు. ఎవరి బౌలింగ్‌లో ఎప్పుడు సిక్సర్లు కొట్టాలన్న విషయంపై అతడికి స్పష్టమైన అవగాహన ఉండేది’’ అని సెహ్వాగ్ కొనియాడాడు.సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లుఇక సచిన్ టెండుల్కర్ గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికి అభిమాన క్రికెటర్.. నాకు ఆదర్శమూర్తి అయిన సచిన్ టెండుల్కర్ గురించి చెప్పాలంటే.. ఆయనతో కలిసి బ్యాటింగ్‌కు వెళ్తుంటే... అడవిలో సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లు ఉండేది.అప్పుడు ప్రతి ఒక్కరి కళ్లు ఆ సింహంపైనే ఉండేవి. నేను సైలెంట్‌గా నా పనిచేసుకుపోయేవాడిని’’ అని అభిమానం చాటుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లికి అగ్రస్థానం ఇచ్చిన సెహ్వాగ్.. ‘‘నంబర్ వన్ విరాట్ కోహ్లి. సరైన సమయంలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య.అతడొక ఛేజ్‌మాస్టర్. ఆరంభంలో ఉన్న కోహ్లికి.. ఇప్పటి కోహ్లికి చాలా తేడా ఉంది. రోజురోజుకు అతడు మరింత పరిణతి చెందుతున్నాడు. 2011-12 తర్వాత మాత్రం సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ఫిట్నెస్, ఆటలో నిలకడ.. ఈ రెండింటిలో తనకు తానే సాటి. అద్భుతమైన ఇన్నింగ్స్‌కు అతడు పెట్టింది పేరు’’అని రన్‌మెషీన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.వీరేంద్ర సెహ్వాగ్ ఆల్‌టైమ్ బెస్ట్ టాప్-5 క్రికెటర్లు1. విరాట్ కోహ్లి(ఇండియా)2. సచిన్ టెండుల్కర్(ఇండియా)3. ఇంజమామ్ -ఉల్ -హక్(పాకిస్తాన్)4. ఏబీ డివిలియర్స్(సౌతాఫ్రికా)5. క్రిస్ గేల్(వెస్టిండీస్).చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్
![CT 2025 Ind vs Ban: Aakash Chopra Picks India Probable Playing XI Feels If Rohit8](/styles/webp/s3/article_images/2025/02/18/rohit.jpg.webp?itok=9lK1Yyzs)
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్‌లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్‌కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. పేసర్ల విభాగంలో మాత్రంజట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్‌కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్‌కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.నా ఓటు కుల్దీప్ యాదవ్కేఅలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్‌దీప్ సింగ్ తప్పక ఉంటాడు.అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్‌లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.చదవండి: శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు
బిజినెస్
![PURE EV signed MOU with Jio Things Limited to integrate smart digital clusters and telematics](/styles/webp/s3/article_images/2025/02/18/pure01.jpg.webp?itok=tdpH_kFz)
జియో థింగ్స్‌తో ప్యూర్ ఈవీ ఒప్పందం
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ప్యూర్ ఈవీ(PURE EV) తన ఉత్పత్తుల్లో స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లను ఏకీకృతం చేయడానికి జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జియో థింగ్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వల్ల అధునాతన ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరిష్కారాలు, అంతరాయం లేని కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ ఇంటిగ్రేషన్‌ను అందించేందుకు తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.జియోథింగ్స్ ఇంటిగ్రేషన్ సాయంతో ద్విచక్రవాహనంలో ఎంటర్టైన్మెంట్, నావిగేషన్ సేవలు వంటివాటిని వాయిస్ ద్వారా నియంత్రించవచ్చని సంస్థ పేర్కొంది. వాహనదారులు వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా వాహనంలోని టెక్నాలజీ ఇంటర్ఫేస్ను మార్చుకోవచ్చు. అందుకోసం వాయిస్ కమాండ్లను ఉపయోగించవచ్చు. దాంతో మెరుగైన రైడింగ్ అనుభూతిని పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.ప్యూర్ ఈవీ జియోథింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ల సాయంతో ఎండ్-టు-ఎండ్ ఐఓటీ పరిష్కారాలు అందించేందుకు ప్రయత్నిస్తుంది. వాహనాల పనితీరును ట్రాక్ చేయడానికి 4G కనెక్టివిటీ ఎనేబుల్ చేసిన టెలిమాటిక్స్ ద్వారా రియల్ టైమ్‌లో వాహనం కండిషన్‌ను పర్యవేక్షించవచ్చు. ఇందుకోసం జియోథింగ్స్ 4జీ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (ఏఓఎస్‌పీ) ‘అవ్ని ఓఎస్’ను ఉపయోగిస్తుంది. ఇది రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, టూ వీలర్ ఇంటర్ఫేస్ కస్టమైజేషన్, ఫుల్ హెచ్డీ టచ్‌స్క్రీన్ డిస్ప్లే కంపాటబిలిటీని అందిస్తుంది. జియోస్టోర్, మ్యూజిక్ స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెన్స్, నావిగేషన్, గేమింగ్‌తోపాటు మరెన్నో సదుపాయాలను అందిస్తున్నారు.ఇదీ చదవండి: రూ.80 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.15 లక్షలు గ్యారెంటీ!జియో థింగ్స్ ఐఓటీ టెక్నాలజీ సాయంతో ప్యూర్ ఈవీ ఉత్పత్తులను పరిశ్రమ అత్యున్నత ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు, ఎండీ డాక్టర్ నిశాంత్ డోంగారి అన్నారు. వాహనాల సామర్థ్యం, ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సంస్థ వినియోగదారులకు సాంకేతికత సాయంతో మెరుగైన కనెక్టివిటీ, ఫంక్షనాలిటీని అందించనున్నట్లు చెప్పారు. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆశిష్ లోధా మాట్లాడుతూ.. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో సృజనాత్మకతను పెంచుకోవాలనుకునే ప్యూర్ ఈవీ వంటి సంస్థతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. మా అధునాతన ఐఓటీ పరిష్కారాలను ఏకీకృతం చేయడం ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం’ అన్నారు.
![Post Office NSC scheme is a popular investment option for individuals](/styles/webp/s3/article_images/2025/02/18/post01.jpg.webp?itok=uTvItCjE)
రూ.80 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.15 లక్షలు గ్యారెంటీ!
table, th, td { border: 1px solid black; } పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) పథకాన్ని సురక్షితమైన, గ్యారెంటీ రాబడిని కోరుకునే వ్యక్తులు మంచి పెట్టుబడి ఎంపికగా చూస్తారు. ప్రభుత్వ పథకం కావడంతో రిస్క్ తక్కువగా ఉంటుందనే భావనే ఇందుకు కారణం. అయితే ఈ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెడితే ఎంత మొత్తం సమకూరుతుందో చాలామందికి సరైన అవగాహన ఉండదు. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతోపాటు ఈ పథకం కీలక అంశాలను కింద చూద్దాం.పోస్టాఫీస్ ఎన్ఎస్సీ పథకంనేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) అనేది భారతీయ తపాలా కార్యాలయం అందించే స్థిర ఆదాయ పెట్టుబడి పథకం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద స్థిరమైన రాబడులు, పన్ను ప్రయోజనాల హామీతో చిన్న, మధ్యతరహా పెట్టుబడిదారులను పొదుపు చేయడానికి ప్రోత్సహించడానికి దీన్ని రూపొందించారు.కీలక ఫీచర్లు..రిస్క్‌లేని పెట్టుబడి: భారత ప్రభుత్వ మద్దతు ఉండడంతో ఎన్ఎస్సీను సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తున్నారు.ఫిక్స్డ్ వడ్డీ రేటు: వడ్డీ రేటును ఏటా ఫిక్స్ చేసి కాంపౌండ్ చేస్తారు. 2024 మొదటి త్రైమాసిక కాలం నాటికి వడ్డీ రేటు ఏడాదికి 7.7 శాతంగా ఉంది.పన్ను ప్రయోజనాలు: రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు: పెట్టుబడిదారులు ఎన్ఎస్సీలో చేసే ఇన్వెస్ట్‌మెంట్‌కు గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.చక్రవడ్డీ: వడ్డీని ఏటా తిరిగి పెట్టుబడిగా పెడతారు. ఇది మెచ్యూరిటీ సమయంలో అధిక రాబడిని అందిస్తుంది.కనీస పెట్టుబడి: కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000.ఇదీ చదవండి: పేరు మార్చుకుంటే రూ.8,400 కోట్లు ఆఫర్!ఐదేళ్ల తరువాత ఎంత వస్తుంది?ఐదేళ్ల కాలపరిమితికి ఎన్ఎస్సీ పథకంలో పెట్టుబడి చేస్తే రూ.80,000 ఇన్వెస్ట్‌మెంట్‌కు మెచ్యూరిటీ మొత్తం కింది విధంగా ఉంటుంది.(రూ.ల్లో)ఏడాదిఅసలు వడ్డీ మొత్తం 180,000 6,160 86,160286,160 6,633 92,7933 92,7937,14599,938499,938 7,695 1,07,63351,07,6338,2861,15,919
![Elon Musk once again brought up his 1 billion USD offer to Wikipedia name change](/styles/webp/s3/article_images/2025/02/18/musk0103.jpg.webp?itok=fxiy51uh)
పేరు మార్చుకుంటే రూ.8,600 కోట్లు ఆఫర్!
ఎక్స్(గతంలో ట్విటర్) సీఈఓ ఎలాన్ మస్క్ వికీపీడియా పేరు మార్చుకుంటే ఏకంగా ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.8,600 కోట్లు) ఇస్తానని ఆఫర్ చేశారు. గతంలో ఈమేరకు వికీపీడియా పేరు మార్పునకు సంబంధించి ఒక బిలియన్ డాలర్లు చెల్లిస్తానని చెప్పారు. తాజాగా ఓ నెటిజన్ మస్క్‌ను ‘ఈ ఆఫర్ ఇంకా ఉందా’ అని ప్రశ్నించారు. దాంతో మస్క్ తన ట్విటర్లో స్పందిస్తూ ‘ఆఫర్ ఉంది. రండి.. పేరు మార్చండి’ అంటూ అదే విషయాన్ని మళ్లీ ధ్రువీకరించారు.వివాదం నేపథ్యంవికీపీడియాతో కొనసాగుతున్న వైరంలో భాగంగా మస్క్ ఈ ఆఫర్ ప్రకటించారు. వికీపీడియా ఆర్థిక పద్ధతులు, రాజకీయ పక్షపాతం కారణంగా మస్క్ ఈ విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వికీపీడియాను ‘వేక్పీడియా’ అని సంబోధించిన ఆయన, తన అనుచరులు ఈ వేదికకు విరాళాలు ఇవ్వడం మానేయాలని కోరారు. వికీమీడియా ఫౌండేషన్ తన నిధులను ముఖ్యంగా డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్ క్లూజన్ (డీఈఐ) కార్యక్రమాలకు కేటాయిస్తున్న నేపథ్యంలో మస్క్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.Offer still stands. Come on, do it … https://t.co/RtRfd8wOI5— Elon Musk (@elonmusk) February 17, 2025మస్క్ వికీపీడియాపై గతంలో చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నారా అని నెటిజన్లు వేసిన ప్రశ్నలకు మస్క్ సూటిగా స్పందించారు. వికీపీడియా పేరు మార్పునకు సంబంధించి ‘ఈ ఆఫర్ ఇప్పటికీ ఉందా?’ అని మస్క్‌ను ట్విటర్లో కోట్ చేస్తూ జాన్స్ మీమ్స్ అనే యూజర్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా మస్క్ స్పందించారు. ‘ఆఫర్ ఇంకా ఉంది. రండి, పేరు మార్చండి..’ అని తెలిపారు. వికీపీడియాకు ‘డికిపీడియా’గా పేరు మార్పును ప్రతిపాదించారు.నెటిజన్ల స్పందనమస్క్ ఆఫర్‌కు సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది వికీపీడియా నిధుల నిర్వహణపై మస్క్‌కు ఏం సంబంధం? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు లాభాపేక్ష లేని సంస్థలు తమ వద్ద ఉన్న వనరులను ఎలా నిర్వహిస్తున్నాయనే దానిపై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు చెబుతున్నారు. మస్క్ విమర్శలు కొనసాగుతున్నప్పటికీ వికీపీడియా నమ్మదగిన, పారదర్శక ప్లాట్‌ఫామ్ అని పేర్కొంటూ సంస్థ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ తెలిపారు. అయితే మస్క్ ప్రతిపాదనపై మాత్రం ఏవిధంగానూ స్పందించలేదు.
![Tesla Inc leader in EVs and renewable energy is gearing up to enter the Indian market](/styles/webp/s3/article_images/2025/02/18/tesla01.jpg.webp?itok=UkRQuFYg)
భారత్‌లో ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న టెస్లా
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న టెస్లా ఇంక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ల మధ్య సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వాణిజ్య అంశాలపై చర్చించారు. అందులో భాగంగా టెస్లా భారత్‌లో ప్రవేశానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ముంబై, ఢిల్లీలో కస్టమర్ ఫేసింగ్, బ్యాకెండ్ పొజిషన్లలో పని చేసేందుకు 13 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టెస్లా ప్రకటించింది. దాంతో టెస్టా భారత్‌లో ప్రవేశించేందుకు అడ్డంకులు తొలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.వ్యూహాత్మక ఎత్తుగడ..టెస్లా భారతదేశంలో నియామకాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం దేశంలో తన ఉనికిని స్థాపించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. సర్వీస్ టెక్నీషియన్, టెస్లా అడ్వైజర్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్ వంటి పోస్టులను ఈ మేరకు భర్తీ చేయనున్నారు. హైఎండ్ కార్లపై దిగుమతి సుంకాన్ని భారతదేశం ఇటీవల 110% నుంచి 70%కు తగ్గించిన తరువాత ఇలా నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. టెస్లా వంటి లగ్జరీ కార్ల తయారీదారులు మార్కెట్లోకి ప్రవేశించడం ఆర్థికంగా మరింత లాభదాయకంగా మారనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.భారత మార్కెట్లో అవకాశాలుచైనా వంటి దేశాలతో పోలిస్తే భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇంకా తక్కువగానే ఉంది. 2024లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1,00,000 యూనిట్లకు దగ్గరగా ఉన్నందున భారత ప్రభుత్వం ఈ రంగంలో మరింత వృద్ధి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ వ్యవహారం టెస్లాకు గణనీయమైన అవకాశాన్ని అందించనుంది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి దేశం కట్టుబడి ఉంది. అందుకోసం సుస్థిర ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడంలో భాగంగా టెస్లా వంటి కంపెనీలకు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: పరుగు ఆపని పసిడి! తులం ఎంతంటే..స్టార్ లింక్‌కు గ్రీన్ సిగ్నల్..?ఇటీవల మస్క్-మోదీల మధ్య జరిగిన సమావేశం అనంతరం మస్క్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంపై కూడా చర్చ జరుగుతుంది. ట్రాయ్ ఆంక్షల కారణంగా స్టార్ లింక్ భారత్‌లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది. అయితే మోదీ, మస్క్ ఇద్దరూ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టార్ లింక్ లైసెన్సింగ్ సవాళ్ల పరిష్కారానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు.
ఫ్యామిలీ
![Something special viral stories on social media12](/styles/webp/s3/article_images/2025/02/18/Paraglide%20and%20pakcar.jpg.webp?itok=1NQQdBkC)
సమ్‌థింగ్ స్పెషల్: గాల్లో ఎగిరొచ్చి పరీక్ష, ఇది కారా, బైకా?
‘ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వెళతారు?’ అనే ప్రశ్నకు జవాబు తెలియనిదేమీ కాదు. అయితే ఈ స్టూడెంట్ మాత్రం తన రూటే సెపరేట్ అని నిరూపించుకున్నాడు. ‘మనసు ఉంటే ఇలాంటి మార్గం కూడా ఉంటుంది’ అని చెప్పకనే చెప్పాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన బీకామ్ విద్యార్థి సమర్థ్ మహంగాడే పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఎవరూ ఊహించని మార్గాన్ని ఎంచుకున్నాడు. రోడ్డుమీద వెళ్లకుండా ట్రాఫిక్ జామ్ భయంతో సమర్థ్ ఎంచుకున్న మార్గం... పారాగ్లైడ్!ప్రముఖ పర్యాటక కేంద్రం పంచగనిలో సమర్థ్ చిన్న జ్యూస్ స్టాల్ నడుపుతున్నాడు. పరీక్ష కేంద్రం అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది, సమయం ఇంకా ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా అక్కడికి సకాలంలో చేరుకోవడం అసాధ్యం అనుకున్న సమర్థ్ అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నాడు. పారాగ్లైడింగ్ గేర్ ధరించిన సమర్థ్ గాలిలో ఎగురుతూ పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకున్నాడు. ఇందు కోసం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ గోవింద్ యెవాలే సహాయం తీసుకున్నాడు. తన బృందం సహాయంతో సమర్థ్‌కు అన్నిరకాల ఏర్పాట్లు చేసి తోడ్పాటు అందించాడు గోవింద్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.A Panchgani student paraglided 15 km to make it to his exam on time as the traffic was very high on the roads. 100 marks for creative problem solving! #ExamHacks #OnlyInIndia pic.twitter.com/YzFYKRWnSx— Harsh Goenka (@hvgoenka) February 17, 2025బైక్+కారు= బైకార్ కొన్ని వారాల క్రితం పాకిస్థాన్‌కు సంబంధించి హోమ్మేడ్ టెస్లా సైబర్ ట్రక్ రెప్లికా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇక తాజా విషయానికి వస్తే... సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఒక పాకిస్థానీ వ్యక్తి విచిత్రమైన, ఆకర్షణీయమైన హైబ్రీడ్ వాహనంలో ప్రయాణిస్తున్నాడు. ఈ వాహనాన్ని కారు అనలేము. అలా అని బైక్ అనలేము. ఎందుకంటే సగం కారు, సగం బైక్ ‘కళ’యిక ఈ వాహనం!వాహనం ముందుభాగంలో మోటర్ సైకిల్ హ్యాండిల్ బార్, వీల్ కనిపిస్తాయి. ‘వోన్లీ ఇన్ పాకిస్థాన్’ ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను చూసి ‘అయ్ బాబోయ్’ అంటున్నారు నెటిజనులు. కొందరు ఈ విచిత్ర వాహనాన్ని సల్మాన్‌ఖాన్ ‘కిక్’ సినిమాలో ఉపయోగించిన వాహనంతో పోల్చారు. ‘కిక్ సినిమాతో ఇన్స్పైర్ అయ్యి ఈ బైక్ ప్లస్ కారును తయారు చేశారు’ అని రాశారు. ఈ వీడియో మూడు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం మాట ఎలా ఉన్నా.... ‘సరదాలు, ప్రయోగాల సంగతి సరే... రోడ్ సేఫ్టీ మాటేమిటి’ అని ఘాటుగా ప్రశ్నించారు కొందరు. నిజమే కదా!
![Mixed-mode natural convection solar crop dryers13](/styles/webp/s3/article_images/2025/02/18/11ssb27b-640009.jpg.webp?itok=nh07PVRK)
ఆరబెడితే అధికాదాయం!
పూలను కష్టపడి పండించటంతోనే సరిపోదు. మార్కెట్లో గిరాకీ తగ్గినప్పుడు.. పండించిన పంటను రూపం మార్చి అమ్మగలిగితే మంచి ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు అభ్యుదయ రైతు గాదె రాజశేఖర్. అందుకోసం 2.5 టన్నుల పంటను ఆరబెట్టగల పెద్ద సోలార్ డ్రయ్యర్‌ను తానే సొంతంగా రూపొందించుకున్నారు. అందులో గులాబీ తదితర రకాల పూల రేకులు, మునగ ఆకులను ఆరబెట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గండిగూడ వద్ద గల తన 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మిశ్రమ పంటలు సాగు చేస్తున్నారు. సోలార్ డ్రయ్యర్‌ను వినియోగిస్తూ గులాబీ రేకులు, మునగ ఆకులను ఆరబెట్టి మార్కెట్ చేస్తున్నారు. ఆరబెట్టిన ఈ గులాబీ రేకులను పాన్మసాలాలో, స్వీట్ల తయారీలో వాడుతున్నారు. ఆరబెట్టిన మునగ ఆకుల పొడిని అనేక ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నందున మార్కెట్లో గిరాకీ ఉందని చెబుతున్నారు.దేశవాళీ గులాబీ రేకులతో..రెండు ఎకరాల్లో దేశవాళీ పింక్ సెంటెడ్ గులాబీ తోటను రాజశేఖర్ సాగు చేస్తున్నారు. ఈ పూల రేకులను సోలార డ్రయ్యర్లో ఆరబెడుతున్నారు. తాను పండించిన పూలే కాకుండా, మార్కెట్లో ఈ రకమైన పూల ధర కిలో రూ.20 లోపు ఉన్నప్పుడు ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి, వాటిని కూడా తన డ్రయ్యర్లో ఆరబెడుతున్నారు. పది కిలోల గులాబీ రేకులను ఆరబెడితే కిలో ఎండు పూల రేకులు తయారవుతాయి. వీటిని కిలో రూ.600 చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. సోలార్ డ్రయ్యర్లో చామంతి, మందార, శంకపుష్పం, మల్లెపూలను కూడా ఆరబెట్టి మార్కెట్ చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. మునగ ఆకులతో..వ్యవసాయ క్షేత్రంలో 8 ఎకరాల్లో ఇతర పంటల మధ్యన మిశ్రమ పంటగా సాగు చేసిన మునగ చెట్ల నుంచి సేకరించిన ఆకును ఆరబెట్టి, పొడి చేసి ఆయన అమ్ముతున్నారు. ఏపుగా పెరిగిన మునగ చెట్ల కొమ్మలను కత్తిరించినప్పుడు వాటి ఆకులను వృథాగా పారేయకుండా డ్రయర్లో ఆరబెట్టి పొడిగా మార్చుతున్నారు. ఇరవై కిలోల ఆకును ఆరబెడితే కిలో పౌడర్ తయారవుతుంది. దీన్ని కిలో రూ.800 వరకు అమ్ముకోవచ్చని చెబుతున్నారు. – బూరుగు ప్రభాకర్‌రెడ్డి, శంషాబాద్ రూరల్, రంగారెడ్డి జిల్లాసొంత ఆలోచనఏడాది కిందట రాజశేఖర్ ఓ కంపెనీ నుంచి చిన్న సైజు సోలార్ డ్రయ్యర్‌ను కొనుగోలు చేశారు. అందులో 350 కిలోల పూల రేకులను, ఆకులను ఆరబెట్టవచ్చు. అయితే, అది తన అవసరాలకు సరిపోలేదు. వ్యవసాయ క్షేత్రంలో వినియోగంలో లేని ఇనుప పైపులతో మూడు నెలల కిందట సొంత ఆలోచనతో పెద్ద సైజు సోలార్ డ్రయ్యర్‌ను తానే నిర్మించుకున్నారు. 60 అడుగుల పొడవు, 22 అడుగుల పొడవుతో 10 అడుగుల ఎత్తు ఉండేలా దీన్ని రూపొందించారు. ఇందుకు 2ఎంఎం మందం ఉన్న అక్రాలిక్ షీట్‌ను వాడారు. దీని లోపలి నుంచి తేమతో కూడిన గాలిని బయటకు పంపేందుకు చుట్టూ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి 2,500 కిలోల ఆకులు లేదా పూల రేకులను ఆరబెట్టవచ్చని ఆయన తెలిపారు. విద్యుత్తుతో నడిచే డ్రయ్యర్ కంటే సోలార్ డ్రయ్యర్ నిర్వహణ సులువుగా ఉందన్నారు.సోలార్ డ్రయ్యర్ లోపలి ఉష్ణోగ్రత బయటికంటే 8 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలుంటే ఆకులు, పూల రేకులను ఆరబెట్టడానికి ఒక రోజు సమయం చాలు. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే మరింత ఎక్కువ సమయం పడుతుంది. మునగాకు పొడిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే ఆలోచన ఉందని రాజశేఖర్ (99123 33444) అన్నారు.
![Paddy cum fish farming involves preparing an area14](/styles/webp/s3/article_images/2025/02/18/13PTP02-270062_27_6-111.jpg.webp?itok=qAaoZd5t)
వరి చేలోనే కూరగాయలు, చేపలు!
మాగాణి చేను అనగానే మనకు ఒక్క వరి పంట (Paddy) మాత్రమే మదిలో మెదులుతుంది. అయితే, మాగాణి పొలంలో వరి పంటతో పాటు కూరగాయ పంటలు, చేపల సాగు (aquaculture) కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించుకునే సరికొత్త సమీకృత సేద్య నమూనా ఇది. కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురం మండలం పి.రాయవరం గ్రామానికి చెందిన యువ రైతు కరుపురెడ్డి వెంకటేష్ నమూనా క్షేత్రం ఇందుకు ఒక ఉదాహరణ. 1.20 ఎకరాల భూమిలో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు, కందకంలో చేపల సాగు దర్శనమిస్తాయి. ఏడాదికి ఎకరం వరి సాగులో సాధారణంగా రూ. 40 వేల ఆదాయం వస్తుంది. అయితే, సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వెంకటేష్ రూ. లక్షకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈయన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల రైతులకు సైతం ఆదర్శంగా నిలిచారు.ఎకరానికి రూ. లక్ష ఆదాయంవెంకటేష్ వ్యవసాయ క్షేత్రం విసీర్ణం ఎకరం 20 సెంట్లు. కాగా, చుట్టూతా విశాలమైన గట్టు 55 సెంట్లలో, గట్టు పక్కనే చుట్టూతా 20 సెంట్లలో తవ్విన కందకంలో చేపల పెంపకం, మధ్యలో మిగిలిన 45 సెంట్ల విస్తీర్ణంలో వరి పంట పండిస్తున్నారు. మాగాణిలో ఒకే పంటగా వరి సాగు చేస్తే ఎకరానికి మహా అయితే రూ.40 వేల ఆదాయం వస్తుంది. దీనికి భిన్నంగా తన పొలంలో గట్టు మీద పండ్ల చెట్లు, కూరగాయ పంటలు, ఆకు కూరలు.. గట్టు పక్కనే తవ్విన కందకం (లేదా కాలువ)లో చేపలు పెంచుతున్నారు. మధ్యలోని పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఈ విధంగా సమీకృత ప్రకృతి సేద్యం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.లక్ష ఆదాయం సంపాదిస్తున్నారు. మాగాణి పొలాల్లో కూడా వరి తప్ప వేరే పండదు అనే అపోహను వదిలిపెట్టి పలు రకాల పంటలు పండించుకోవటం ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ఈ సమీకృతి ప్రకృతి సేద్య నమూనా తెలియజెప్తోంది. వెంకటేష్ వ్యవసాయ క్షేత్రం రైతులకు, ఇతర సిబ్బందికి రాష్ట్ర స్థాయి శిక్షణ ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం. – విఎస్విఎస్ వరప్రసాద్, సాక్షి, పిఠాపురంఇతర రైతులకు ఆదర్శంయువ రైతు వెంకటేష్ సమీకృత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరితో పాటు చేపలు, కూరగాయ పంటల సాగుపై ఆసక్తి చూపటంతో శిక్షణ ఇచ్చాం. ఆచరణలో పెట్టి, మంచి ఫలితాలు సాదించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన పొలాన్నే రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రదర్శన క్షేత్రంగా వినియోగిస్తున్నాం. – ఎలియాజర్ (94416 56083), జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడరెండేళ్లలోనే మంచి ఫలితాలునాకున్న 1.2 ఎకరాల పొలంలో గతంలో వరి మాత్రమే సాగు చేసే వాడిని. ఏడాదికి పెట్టుబడి పోను అతి కష్టం మీద రూ. 40 వేల వరకు ఆదాయం వచ్చేది. ఆ దశలో 2020లో మా జిల్లాలో చేపట్టిన పకృతి వ్యవసాయం చేయాలనిపించి ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లాప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ను సంప్రదించాను. ఆయన నా ఆసక్తిని గమనించి దుర్గాడ రైతు గుండ్ర శివ చక్రం ద్వారా నాకు సమీకృత సాగుపై శిక్షణ ఇప్పించారు. సార్వా వరి కోసిన తర్వాత, అదేవిధంగా దాళ్వా పంట కోసిన తర్వాత నేలను సారవంతం చేసే 20 రకాల పచ్చిరొట్ట పంటలను పెంచి, కలిదున్నేస్తున్నా. దీని వల్ల భూమి సారవంతమవుతోంది. ఎద్దులతోనే దుక్కి, దమ్ము చేస్తాం. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు వాడుతున్నాం. రెండేళ్లలోనే మంచి ఫలితాలు వచ్చాయి. మా కుటుంబానికి వాడుకోగా మిగిలిన కూరగాయల ఇతరులకు ఇస్తున్నాం. బొచ్చె, కొర్రమీను వంటి చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. రసాయనాలు వాడకుండా పెంచటం వల్ల మా పంటలకు మంచి డిమాండ్ ఉంటోంది. సంతృప్తికరంగా ఆదాయం పొందటంతో పాటు రైతుల శిక్షణ కేంద్రంగా మా పొలం మారినందుకు చాలా సంతోషంగా ఉంది. – కరుపురెడ్డి వెంకటేష్ (63024 19274),పి.రాయవరం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా
![Nameplates with names of daughters were put up on the doors15](/styles/webp/s3/article_images/2025/02/18/names.jpg.webp?itok=4YuOhFy_)
నేమ్ ప్లేట్: ఇంటిపేరు ఆడపిల్ల
మన దేశంలో ఇంటి పేరు, ఇంటి వాకిలి పేరు నాన్నదే ఉంటుంది. అమ్మ పేరు దాదాపుగా ఉండదు. కూతురి పేరు అసలే కనిపించదు. కూతురూ ఇంటి సభ్యురాలే అనే భావన ఆమెకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. అబ్బాయిల వైఖరిలో మార్పు తెస్తుంది. అందుకే నార్త్‌లో చాలాచోట్ల కుమార్తె నేమ్‌ప్లేట్ పెట్టే ఆనవాయితీ మొదలైంది. ఇటీవల నాగ్‌పూర్ చుట్టుపక్క పల్లెల్లో 2100 ఇళ్లకు అమ్మాయిల పేర్లు సగౌరవంగా అమర్చారు. ఇంకా ఈ ఆనవాయితీ దక్షణాదికి రాలేదు. వివరాలుమన ఇళ్లల్లో ఆడపిల్లలు ఉన్నారో లేరో అన్నట్టుగా ఎందుకు ఉండాలి... వారు తమ అస్తిత్వంతో ఎందుకు ఉండకూడదు.. ఆత్మవిశ్వాసంతో ఎందుకు ఉండకూడదు... గుర్తింపుతో ఎందుకు ఉండకూడదు... ఈ ప్రశ్నలు‘మేజిక్ బస్ ఫౌండేషన్’ బా«ధ్యురాలు ధనశ్రీ బ్రహ్మేకు వచ్చాయి. ఐక్యరాజ్య సమితిలో చాలా కాలం పని చేశాక భారతదేశంలో పారిశ్రామికప్రాంతాల్లోని బస్తీల్లో, వెనుకబడిన పల్లెల్లో లైంగిక వివక్షను రూపుమాపి టీనేజ్ ఆడపిల్లల వికాసానికి కృషి చేయాలని ధనశ్రీ ‘మేజిక్ బస్ ఫౌండేషన్’ను స్థాపించారు. ఆడపిల్ల తను ఎదిగే వయసులో వెనుకబడితే జీవితాంతం వెనుకబడుతుందని ఆమెకు ఆత్మవిశ్వాసం అవసరమని భావించారు. అందుకే ‘నేమ్స్ ఆన్ డోర్స్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఆడపిల్ల గురించి ఆలోచించరుమన దేశంలో ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఉంటేప్రాముఖ్యత అంతా అబ్బాయికే ఉంటుంది. అమ్మాయిని మామూలు బడిలో... అబ్బాయిని మంచి బడిలో వేయడం, సౌకర్యాలు, చదువు కొనసాగింపు... ఇవన్నీ అమ్మాయి పట్ల వివక్షను చూపుతాయి. బడి మాన్పించి పెళ్లి చేసే బెడద ఎలాగూ ఉంటుంది. ఆస్తిలో భాగం గురించిన ఆలోచన ఉండదు. వీటన్నింటి దృష్ట్యా పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోవడం తప్ప ఆడపిల్ల వికాసం సంపూర్ణం కాదు. ‘నేనూ ఇంటిలో సమాజంలో భాగమే. నాకంటూ ఒక స్థానం ఉంది. నా బాధ్యతలు నాకున్నా నాకంటూ కొన్ని కలలు ఉంటాయి అని అమ్మాయిలకు అనిపించాలి’ అంటారు ధనశ్రీ. ‘ఇంటికి అమ్మాయి నేమ్‌ప్లేట్ పెడితే కొద్ది మార్పు సాధ్యమే’ అనుకున్నారామె.ఎందుకు పెట్టాలి?మహారాష్ట్రలోని నాగపూర్ శివార్లలో ఉన్న కలమేశ్వర్ పారిశ్రామిక వాడను ఆనుకుని 108 గ్రామాలు ఉన్నాయి. వాటన్నింటిలో రోజు కూలీలు, కార్మికులే ఉంటారు. వీరికి ఆదాయం చాలా తక్కువ. అందువల్ల ఆర్థిక దృష్టికోణంలో అబ్బాయికి ఇచ్చేప్రాధాన్యం అమ్మాయికి ఇవ్వరు. అందుకే అమ్మాయిలు తెర వెనుకే ఉండిపోతారు. వారికి ఆత్మవిశ్వాసం కల్పించేందుకు 12 నుంచి 16 ఏళ్లు వయసున్న అందరు అమ్మాయిల డేటా తీసుకుని వారి ఇళ్లకు వెళ్లి మీ అమ్మాయి నేమ్‌ప్లేట్ ఇంటికి పెట్టండి అని ఫౌండేషన్ కార్యకర్తలు అడిగితే అందరి నుంచి ఎదురైన ప్రశ్న ‘ఎందుకు పెట్టాలి’ అని. ఎందుకంటే ఇంటికి నేమ్‌ప్లేట్ తండ్రిదే ఉంటుంది. లేదంటే కొడుకుది. కూతురిది ఉండదు. ‘అయితే ఇంటికి కూతురు కూడా హక్కుదారని... ఆమె పెరిగే ఇంటికి ఆమె పేరు పెట్టుకునే హక్కు ఉంటుందని కార్యకర్తలు గట్టిగా చెప్తారు’ అని తెలిపారు ధనశ్రీ. అంతేకాదు ఊరి పెద్దలతో, పంచాయితీ పెద్దలతో, స్కూలు టీచర్లతో చెప్పించి ఒప్పించారు.పెనుమార్పుకలమేశ్వర్ చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల్లో 12 నుంచి 16 ఏళ్లు ఉన్న ప్రతి అమ్మాయి ఇంటికి ఆ అమ్మాయి పేరుతో నేమ్‌ప్లేట్ తయారు చేయించి వాటిని ఇంటి వాకిలికి అమర్చే ఏర్పాటు చేశాక ఆడపిల్లల్లో వచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇదో కొత్త గుర్తింపు గౌరవం అయ్యింది. ‘మా అన్నయ్య నాతో నీ పేరు ఎందుకు పెట్టాలి అనడిగాడు... నీ పేరు నువ్వు పెద్దయ్యాక నీ ఇంటికి ఎలాగూ పెట్టుకుంటావు... ఇప్పుడు నా పేరు పెట్టకపోతే ఎక్కడా ఎప్పుడూ పెట్టరు అని సమాధానం ఇచ్చాను’ అని 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అంది. ఈ 18 పల్లెల్లో 2100 గడపలకు అమ్మాయిల నేమ్ప్లేట్లు ఇవాళ కళకళలాడుతూ కనపడుతున్నాయి. ‘ఈ నేమ్ప్లేట్లు పెట్టాక తల్లిదండ్రులు మమ్మల్ని చదివించాలని, మా మాటకు విలువ ఇవ్వాలని, మాకూ గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు’ అన్నారు అమ్మాయిలంతా. ‘చుట్టుపక్కల పల్లెల వాళ్లు ఈ పల్లెలకు వచ్చి నేమ్ప్లేట్లు చూసి మేమూ పెట్టిస్తాం అని వెళుతున్నారు’ అని వారు తెలిపారు. అదే అమ్మాయి... కాని ఒక చిన్న గుర్తింపుతో అడుగున నిలబడే దశ నుంచి సమాన దశకు వచ్చి నిలబడేలా చేసింది ఈ నేమ్‌ప్లేట్.దక్షిణాదిలో ఇవాళ్టికీ జరుగుతున్న కొన్ని వివక్షలను గమనిస్తే ‘నేమ్స్ ఆన్ డోర్స్’ ఎక్కువ అవసరం అని భావించడంలో తప్పు లేదు.
ఫొటోలు
National View all
![title](/styles/webp/s3/article_images/2025/02/18/pankaj%20kumar%20chaudhary.jpg.webp?itok=jyUtPtJC)
రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
జైపూర్ : రెండో వివాహం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని చిక్కుల్
![title](/styles/webp/s3/article_images/2025/02/18/subramanian-swamy1.jpg.webp?itok=P0XkTVEm)
డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై సుబ్రహ్మణ్యస్వామి లేఖ
ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని కేం
![title](/styles/webp/s3/article_images/2025/02/18/sunitha.jpg.webp?itok=yiNyE3Ng)
కీలక ఫైళ్ల గల్లంతు.. గుజరాత్ హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్!
న్యూఢిల్లీ: పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ గల్లంతు అయిన వ్యవ
![title](/styles/webp/s3/article_images/2025/02/18/Mamata%20Banerjee.jpg.webp?itok=6T48jcmf)
‘మహా కుంభ్‌కాదు.. మృత్యుకుంభ్’ : దీదీ
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata
![title](/styles/webp/s3/article_images/2025/02/18/delhi-cm.jpg.webp?itok=DdhOKrfP)
ఢిల్లీ సీఎం ప్రమాణానికి కేజ్రీవాల్‌కు ఆహ్వానం?
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ జోరుగా సన్న
International View all
![title](/styles/webp/s3/article_images/2025/02/18/Putin_Ready_For_Talks.jpg.webp?itok=z-J2k_t7)
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న
![title](/styles/webp/s3/article_images/2025/02/18/Bangladesh-Pakistan-Absent.jpg.webp?itok=EACKFAVh)
ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్
ప్రపంచంలోని 10 అత్యంత పేద దేశాల జాబితా విడుదలయ్యింది.
![title](/styles/webp/s3/article_images/2025/02/18/Deepseek-Downloads-Suspende.jpg.webp?itok=vZcTdmXe)
దక్షిణ కొరియా డీప్‌సీక్ డౌన్లోడ్ నిలిపివేత
సియోల్: చైనాకు చెందిన కృత్రిమ మేథ అంకుర సంస్థ డీప్‌సీక్‌కు
![title](/styles/webp/s3/article_images/2025/02/18/donaldtrump.jpg.webp?itok=yGpAVyfZ)
ఎవరినీ వదిలేది లేదు: ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా వాణిజ్య విధానం ఇచ్చిపుచ్చుకునే విధంగా న
![title](/styles/webp/s3/article_images/2025/02/18/160220251737-MIDEAST-ISRAEL.jpg.webp?itok=qdAB4uzr)
విడుదల చేయకుంటే నరకమే
జెరూసలెం: గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ హమాస్ విడుదల చేయకప
NRI View all
![title](/styles/webp/s3/article_images/2025/02/17/Mana-American-Telugu-Association.jpg.webp?itok=eLPbfGMr)
MATA అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'మన అమెర
![title](/styles/webp/s3/article_images/2025/02/15/Telugu-expats.jpg.webp?itok=IRSa2FZC)
ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు
ఆర్మూర్: తెలంగాణ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్‌కామ్ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్ (Israel)
![title](/styles/webp/s3/article_images/2025/02/15/TTA1.jpg.webp?itok=vu0K2RpY)
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దశాబ్ద వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) దశాబ్ద వేడుకలు డిసెంబర్‌లో జరగనున్నాయి.
![title](/styles/webp/s3/article_images/2025/02/14/NRI1.jpg.webp?itok=Ucp99Q7Z)
USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక
డల్లాస్: మాట (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) బోర్డు మీటిం
![title](/styles/webp/s3/article_images/2025/02/14/Partner-Met-Indian-PM-Modi.jpg.webp?itok=IGc1aOY5)
ప్రధాని మోదీతో మస్క్-శివోన్ పిల్లల అల్లరి
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటనలో
క్రైమ్
![Police Constable Ends Life In Hyderabad](/styles/webp/s3/article_images/2025/02/18/2112.jpg.webp?itok=XUJ4l5fe)
ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
రాంగోపాల్‌పేట్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి లోనైన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిటీ పోలీస్ ఐటీసెల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రంగనాథ్‌రావు (36) కళాసీగూడ కామాక్షి దేవాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య గాజుల దాక్షాయణి, కుమార్తె ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను అందు కు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అ యినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఆదివారం కుమార్తెతో కలిసి బోయిన్‌పల్లిలోని పుట్టింటికి వెళ్లిన అతడి భార్య దాక్షాయణి అక్కడి నుంచి భర్తకు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో రాత్రి ఇంటికి వచ్చి చూడగా రంగనాథ్ వెంటిలేటర్ గ్రిల్‌కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో అతడిని కిందకు దించి చూడ గా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో మహంకాళి ఇన్స్పెక్టర్ పరశురాం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
![Girl Ends Life In Palamaner](/styles/webp/s3/article_images/2025/02/18/15455.jpg.webp?itok=VbJFshc0)
దేవుడా.. ఎవరిదీ పాపం?
రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.. బండపని చేసుకుంటూ పొట్టపోసుకునే బడుగులు.. ఏ పూటకు ఆ పూట కూలి తెచ్చుకుని జీవనం సాగించే నిరుపేదలు.. అష్టకష్టాలు పడుతున్నా తమ నలుగురు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అందులో ఓ ఆడబిడ్డకు పెళ్లి చేశారు. మరో అమ్మాయిని పదోతరగతి, అబ్బాయిని ఏడోతరగతి, మూడో కుమార్తెను రెండో తరగతి చదివిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ సాఫీగానే సంసారం నెట్టుకొస్తున్నారు. ఇంతలో ఆ పేద కుటుంబంపై పిడుగు పడింది. వారి జీవితాలను అల్లకల్లోలం చేసేసింది.పలమనేరు : మండలంలోని టి. వడ్డూరు గ్రామంలో బండపని చేసుకుని బతికే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. మిగిలినవారు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో రెండో బిడ్డకు కడుపు ముందుకొస్తోందని టీచర్లు చెప్పడంతో ఆందోళన చెందారు. కామెర్ల వల్ల అలా జరిగిందేమో అని పట్టించుకోలేదు. తర్వాత బాలికకు కడుపునొప్పి అసలు విషయం తెలిసింది. ఆ బిడ్డ గర్భం దాల్చిందని తెలిసి బంగారుపాళెంలోని సోదరి ఇంటికి పంపేశారు. అక్కడే ఓ ప్రైవేట్ వైద్యుడికి చూపించారు. అయితే ఆ అమ్మాయికి ఫిట్స్ రావడంతో మూడురోజుల క్రితం చిత్తూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిజరేయన్ చేసి శిశువును బయటకి తీశారు. ఉన్నట్టుండి తల్లీబిడ్డల పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్సపొందుతూ ఆ బాలిక మృతిచెందింది. ఆ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.కారణం ఆ ముగ్గురే..తన అక్క మృతికి ముగ్గురు యువకులు కారణమని చెల్లెలు వెల్లడించింది. తమ బంధువైన ఓ మహిళ కారణంగా తమ ఇంటికి తల్లిదండ్రులు లేని సమయంలో యువకులు వచ్చేవారని తెలిపింది. తరచూ బిరియానీ, ఇతర తినబండారాలను అక్కకు ఇచ్చేవారని వివరించింది.గ్రామంలో నిరసనలుఇలా ఉండగా తిరుపతి నుంచి బాలిక మృతదేహం ఆంబులెన్స్‌లో రాగానే గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. బాలిక మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పలమనేరు సీఐ నరసింహరాజు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.కఠినంగా శిక్షించాలిమైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భం దాల్చేలా చేసి, ఆమె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. తొమ్మిదినెలలు తన కడుపులో బిడ్డను మోస్తున్నా ఏ డాక్టరైనా ఎందుకు గుర్తించలేదు. ఇది వైద్యులు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. గతంలోనూ ఈ గ్రామంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పట్లో నిందితులను కఠినంగా శిక్షించి ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగేవి కావు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి.– భువనేశ్వరి, ఐద్వా జిల్లా కన్వీనర్
![Young man died in Khammam district](/styles/webp/s3/article_images/2025/02/17/5553.jpg.webp?itok=21ccy9fJ)
అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన అత్తా మామ..
టేకులపల్లి: భార్యాపిల్లలను చూసేందుకు అత్తారింటికి వచ్చిన అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఇంట్లోకి వెళ్లి తలుపుపెట్టుకున్నారు. మంటలకు తాళలేక ఎంతగా మెత్తుకున్నా వారు తలుపు తీయకపోవడంతో పక్కనే ఉన్న నీటితొట్టిలో దూకాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం దంతెలబోరు ఎస్సీకాలనీకి చెందిన బల్లెం చినవెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు బల్లెం గౌతమ్ (23).. టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు కుమార్తె కావ్యను రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సుజాతనగర్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత నెల కావ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి రామచంద్రునిపేటలోని పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న రాత్రి గౌతమ్ తన పిల్లలు, భార్యను చూసేందుకు రామచంద్రునిపేటకు వచ్చాడు. గౌతమ్‌ని లోపలికి వెళ్లనీయకుండా అత్తా మామ, బావమరుదులు అడ్డుకున్నారు. దుర్భాషలాడి, దాడి చేయడంతో పాటు గౌతమ్‌పై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం అందరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తున్నా రక్షించలేదు. పక్కనే ఉన్న నీటి తొట్టిలో దూకిన గౌతమ్‌ని చుట్టు పక్కల వారు బయటకు తీసి, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన గౌతమ్ ఆదివారం మృతి చెందాడు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్‌ను వివరణ కోరగా ఈ నెల 2న రామచంద్రునిపేటలో ఘటన జరిగిందని, 11న మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 2న ఘటన జరిగి, 11న ఫిర్యాదు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
![27 year old Mna Ends Life In west godavari](/styles/webp/s3/article_images/2025/02/17/211.jpg.webp?itok=_cP8l2RS)
హత్య చేసి.. కుడి చేయి తీసుకెళ్లినా హంతకులు
నిడమర్రు (పశ్చిమ గోదావరి): నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో యువకుడి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు మజ్జి ఏసు(26)ను శనివారం రాత్రి అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏసు తండ్రి ప్రసాద్ మరణించగా, తల్లి దుబాయ్‌లో ఉంది. ఏసు దుర్గా శ్రీవల్లిని 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలోని ఆక్వా చెరువుల కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. భార్య 8వ నెల గర్భవతి కావడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మృతుడితోపాటు అమ్మమ్మ మాత్రమే ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక బావాయిపాలెం శివారులో ఉన్న చినకాపవరం పంటకాల్వ వద్ద ఏసును చంపి, శవాన్ని కాలువ రేవు వద్ద పడేశారు. అతని కుడి చేయిని నరికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం సమాచారం అందిన వెంటనే నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీర ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. భార్య శ్రీవల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ కూడా క్లూస్ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హంతకులు ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి ఇంటి పరిసరాల్లోనే డాగ్ స్క్వాడ్ కలియ తిరిగింది.