Top Stories
ప్రధాన వార్తలు

నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గట్టిగా నిలబడిన ప్రజా ప్రతినిధులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో 8 నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్టెడ్ సభ్యులు హాజరవుతారు. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలపై చర్చించడంతోపాటు, భవిష్యత్ కార్యాచరణపైనా ఈ సమావేశంలో వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతిని«ధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం⇒ వచ్చే వారం స్వయంగా నేనే వస్తా⇒ టీడీపీ ఎమ్మెల్యే బంధువుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య ⇒ కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ⇒బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్సార్సీపీ అధినేత సాక్షి, అమరావతి/రామగిరి: ‘ఏమాత్రం అధైర్యపడొద్దు.. మీ కుటుంబానికి పూర్తిగా అండగా నిలుస్తాం.. అన్ని విధాలా ఆదుకుంటాం.. వచ్చే వారం స్వయంగా నేనే వస్తా’ అని వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల చేతిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం ఆయన ఫోన్లో పరామర్శించారు.లింగమయ్య భార్య రామాంజినమ్మ, కుమారులు మనోహర్, శ్రీనివాసులతో మాట్లాడారు. లింగమయ్య హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ‘సార్.. రామగిరి మండలంలో రాక్షసపాలన కొనసాగుతోంది. పరిటాల సునీత నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఇక్కడి పోలీసులు పరిటాల కుటుంబ సభ్యులకు తొత్తులుగా మారారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం రామగిరి ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటిపై పరిటాల సునీత సమీప బంధువులైన ధర్మవరపు ఆదర్శ్‌నాయుడు, ధర్మవరపు మనోజ్ నాయుడు దాడులకు దిగారు. వారిని మా నాన్న అడ్డుకోబోయాడు. దీంతో కక్ష కట్టి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారంటూ పండుగ వేళ ఇంట్లో ఉన్న మాపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనలో నాన్న లింగమయ్య మృతి చెందాడు’ అంటూ కుమారులు మనోహర్, శ్రీనివాసులు... మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. మీరు అధైర్య పడొద్దని, పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా నేతలు, లీగల్‌సెల్‌ను అప్రమత్తం చేస్తామని, వారు తగిన రక్షణ కల్పిస్తారన్నారు. ‘మీ కుటుంబానికి ఏం జరిగినా చూస్తూ ఊరుకోం. పూర్తి అండగా నిలుస్తాం. అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఏ మాత్రం భయపడొద్దు. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు.

లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం: మిథున్ రెడ్డి
Waqf Bill In Lok sabha Updates..వైఎస్సార్సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి కామెంట్స్..ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాంలోక్‌సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాంమైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించారుముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారు చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారుఅన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలిముస్లింల ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరంవక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉందిఇదిలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంది 👉నేడు లోక్‌సభలో కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.👉తాజాగా కాంగ్రెస్ ఎంపీ, జేపీసీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము నిజం చెప్పాలనుకుంటున్నాను. ముస్లింలకు ఏమీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రభుత్వానికి వాటా ఉన్న ప్రభుత్వ ఆస్తి వివాదాస్పదమని, నియమించబడిన అధికారి దర్యాప్తు చేసే వరకు ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించబోమని, వివాదాస్పద ఆస్తి ఇకపై వక్ఫ్‌గా ఉండదని వారు నిబంధన చేశారు’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayCongress MP and JPC member Imran Masood says, "We are ready for discussion. But I want to tell you the truth. The government is repeatedly saying that nothing will happen to Muslims, but they have made a… pic.twitter.com/ZULzEi1RzT— ANI (@ANI) April 2, 2025👉 ఇక, బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు.👉బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆయా పార్టీలు విప్ జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.👉ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయించారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి. ఏమిటీ వివాదం? 👉వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.👉ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి.👉ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి.

పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో మహా భూకంపం (Mega quake) రానుందా? దీని తీవ్రతకు 3,00,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారా? లెక్కలేనన్ని నగరాలు సముద్రంలో మునిగిపోతాయా? ఈ సామూహిక విధ్వంసానికి సమయం ఆసన్నమయ్యిందా?.. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రశ్నలకు ‘అదే జరగవచ్చు’ అంటూ జపాన్ తన అంచనాలను, భవిష్యవాణిని వెల్లడించింది. ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ (Agence France-Presse) (ఏఎప్పీ) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసింది. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుంది.ఇటీవల మయన్మార్ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను మరువక ముందే జపాన్ మహాభూకంపం అంచనాలను చెప్పడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు.జపాన్ ప్రభుత్వం (Japanese Government) తమ దేశ పసిఫిక్ తీరంలో వినాశకరమైన మెగా క్వేక్ సంభవించవచ్చని తెలిపింది. దీని కారణంగా సునామీ వస్తుందని, ఇదే జరిగితే జపాన్‌లో లక్షలాది మంది ప్రజలు కొన్ని నిమిషాల్లోనే మృత్యువాత పడతారని పేర్కొంది. మృతదేహాలను లెక్కించడం కూడా కష్టమయ్యేంత విధ్వంసం జరుగుతుందని అంచనా వేసింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు నాశనమవుతుందని పేర్కొంది. అందుకే మెగా భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు వెల్లడించింది.భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. వార్తా సంస్థ ఏఎప్పీ నివేదిక ప్రకారం జపాన్‌లో 9 తీవ్రతతో భూకంపం సంభవిస్తే, 13 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. భవనాలు కూలిపోవడం వల్ల సుమారు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే జపాన్ ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు (అంటే రూ. 171 లక్షల కోట్లకు పైగా) నష్టపోతుంది. ఈ నష్టం నుండి కోలుకోవడం జపాన్‌కు చాలా భారంగా మారుతుంది.ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్

రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant). ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ పంత్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించింది.అయితే, లక్నో సారథిగా తొలి మ్యాచ్‌లోనే పంత్ విఫలమయ్యాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేక.. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం పంత్‌కు ఊరట దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లక్నో గెలుపొందడంతో అతడు తొలి విజయం అందుకున్నాడు. అయితే, సొంత మైదానంలో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది.పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సమిష్టి వైఫల్యం కారణంగా హోం గ్రౌండ్లో తొలి మ్యాచ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇప్పటి వరకు లక్నో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పంత్ బ్యాటర్‌గా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.బ్యాటర్‌గా విఫలంతొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో పోరులో పదిహేను బంతుల్లో పదిహేను పరుగులు చేయగలిగాడు. ఇక తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండే పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పంత్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రూ. 27 కోట్లు దండుగ!‘‘పంత్‌కు ఏమైంది? హ్యాట్రిక్ అట్టర్‌ఫ్లాప్‌లు.. రూ. 27 కోట్లు.. లక్నో బూడిదలో పోసినట్లే..’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పంత్‌పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు.. ప్రతి మ్యాచ్ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌తో సంభాషిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకాతాజాగా పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత కూడా గోయెంకా పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్ చేతులు కట్టుకుని నిలబడగా.. అతడి వైపు వేలు చూపిస్తూ మరీ గోయెంకా సీరియస్ అయిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోయెంకా తీరుపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో కేఎల్ రాహుల్‌తో ఇలాగే వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.‘‘విజయాల కంటే కూడా ఇలాంటి వివాదాలతోనే హైలైట్ కావాలని చూసే ఓనర్ ఈయన ఒక్కడేనేమో! ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా కెప్టెన్‌తో అందరి ముందే సంభాషిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడం ద్వారా ఏం నిరూపించాలనుకుంటున్నారు? డబ్బులు పెట్టి కొన్నంత మాత్రాన వారిని తక్కువ చేసి చూపడం సరికాదు’’ అంటూ హితవు పలుకుతున్నారు.ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ పంజాబ్ స్కోర్లు👉వేదిక: భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉లక్నో స్కోరు: 171/7 (20)👉పంజాబ్ స్కోరు: 177/2 (16.2)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69).చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?Statement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025

ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి
సాక్షి, పల్నాడు: ఏపీలో బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ కారణంగా ఓ చిన్నారి చనిపోయింది. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి నిర్ధారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పలు ఆరోగ్య సమస్యలు రావడంతో మార్చి నాలుగో తేదీన మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో, మార్చి 16న సదరు చిన్నారి మృతిచెందింది.అయితే, చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్‌లోని వీఆర్డీఎల్లో పరీక్షించారు. ఈ పరీక్షలో ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్‌గా తేలింది. అనంతరం మరో నమూనాను 15న ఢిల్లీలో పరీక్షించారు. అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్.. 24న స్వాబ్ నమూనాలను పుణెలోని ఎన్ఐవీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ)కి పంపించింది. అక్కడ హెచ్5ఎన్1 వైరస్‌గా నిర్ధారించారు. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు.చిన్నారి మృతి నేపథ్యంలో ఏం జరిగిందనే విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగి వైద్యాధికారులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో సదరు చిన్నారి.. ఫిబ్రవరి 28న జ్వర లక్షణాలు కన్పించగా, అంతకు రెండు రోజుల ముందు పచ్చి కోడి మాంసం పట్టుకున్నట్టు, కొంచెం మాంసం తిన్నట్లు తెలిపారు. ఇక, పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారు. బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటరు దూరంలో ఒకరు మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో పెంపుడు, వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారు.ఇదిలా ఉండగా.. బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. మరోవైపు.. జబ్బు పడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతోపాటు జలుబు, తీవ్రస్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలని తెలిపారు.

ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు.. నేడు రెండో రౌండ్ విచారణ
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు(Shravan Rao)ను సిట్ మరోసారి ప్రశ్నించనుంది. మూడు రోజుల కిందట విచారణకు హాజరైన ఆయన.. సుదీర్ఘంగా సాగిన విచారణలోనూ అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రావాలని దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శ్రవణ్ రావు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో శ్రవణ్ రావు ఏ6గా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో ఓ మీడియా సంస్థ అధినేత అయిన ఈయన సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. అయితే కిందటి ఏడాది మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. శ్రవణ్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఇంతకాలం విచారణకు హాజరు కాకుండా వచ్చారు. తాజాగా.. అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టు(Supreme Court)లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట పొందిన ఆయన.. దర్యాప్తుకు తప్పనిసరిగా సహకరించాలన్న షరతు మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. అయితే విచారణ టైంలో ఆయనను మీడియా కంటపడనీయకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కీలకంగా శ్రవణ్ రావుతొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సిరిసిల్ల డీసీఆర్బీ అప్పటి డీఎస్పీ ప్రణీత్‌రావు పేరు మాత్రమే ఉంది. దర్యాప్తు ముందుకెళ్తున్నకొద్దీ నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలోనే శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఆయన సూచించారని అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు జరిగింది. తాజాగా స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న మరో 1500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికులను తొలగించడం గమనార్హం.వివరాల ప్రకారం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో 1500 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగించారు. గతంలో 1100 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే. కార్మికుల ఆందోళన కొనసాగుతున్నప్పటికీ తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేడో, రేపో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు కార్మికులు. అయితే, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దాదాపు 4500 మందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక, సీఎం చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికుల తొలగింపు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాలు నేతలు మండిపడుతున్నారు.

హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
అంతర్జాతీయ స్థాయి సక్సెస్‌లు అందుకుంటున్న టాలీవుడ్ (Tollywood)కు కేంద్ర బిందువు హైదరాబాద్. అలాంటి పరిశ్రమలో గ్లోబల్స్టార్స్గా పేరున్న అనేకమంది నటీనటులకు మన నగరం నిలయం. అయితే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న టాలీవుడ్ స్టార్స్ కూడా నగరంలోని కొన్ని రుచులకు దాసులే. వారు తమ అభి‘రుచుల్ని’ సంతృప్తి పరుచుకోడానికి నగరంలోని కొన్ని రెస్టారెంట్స్‌కి తరచూ రౌండ్స్ వేస్తుంటారు. అభిమానులకు చిక్కకుండా రహస్యంగా తమ టేస్ట్ బడ్స్‌ను శాంతింపజేస్తుంటారు. అదే విధంగా మన టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కి సైతం నగరంలో తనకు నచ్చిన, ఇష్టమైన వంటకాలు వడ్డించే రెస్టారెంట్స్ ఉన్నాయి.గత నెల్లో దేవర చిత్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లో ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం అక్కడి థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు తారక్ తిరిగి నగరానికి వచ్చేశారు. అయితే తారక్ జపాన్ టూరుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆ ఇంటర్వ్యూలో నగరంలో తాను ఇష్టపడే రెస్టారెంట్స్ రుచుల వివరాలు ఆయన వెల్లడించడమే ఇందుకు కారణం.ఫ్రెండ్.. జపనీస్ ట్రెండ్.. నగరంలోని నాగ చైతన్య అక్కినేనికి చెందిన షోయు రెస్టారెంట్ ఎన్టీఆర్ ఎంచుకున్న మొదటి ఎంపిక. ‘ఈ అద్భుతమైన కళాత్మక ప్లేస్ నా స్నేహితుడు నాగ చైతన్య సొంతం. ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతమైన జపనీస్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా జపనీస్ వంటకమైన సుషీ అక్కడ సూపర్బ్. హైదరాబాద్‌లో జపనీస్ వంటకాలకు నేను జై కొట్టే ప్లేస్ అది. ఇది నిజంగా అంతర్జాతీయ వంటకాలకు కేరాఫ్’ అంటూ ఎన్టీఆర్ కొనియాడారు. మరికొన్ని ప్రదేశాలు.. జపనీస్ వంటకాలకు సంబంధించి తన ఫేవరెట్‌ను తెలియజేయడంతో పాటు అచ్చమైన హైదరాబాదీ వంటకాలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ కొన్నింటిని పేర్కొన్నారు. తాను ఆస్వాదించే మరికొన్ని రుచుల కోసం.. పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్‌లోని స్పైస్ వెన్యూ, తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్‌పేట్‌లోని కాకతీయ డీలక్స్ మెస్ కూడా ఆయన ఎంచుకున్న నచ్చే రుచుల జాబితాలో ఉన్నాయి.చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం

భారత్ విదేశీ రుణాల లెక్కలివే..
భారత్ విదేశీ రుణాలు (అంతర్జాతీయ మార్కెట్ నుంచి రుణాలు, ఇతర రూపాల్లో సమీకరించినవి) 2024 డిసెంబర్ చివరికి 717.9 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.61.74 లక్షల కోట్లు) చేరాయి. 2023 డిసెంబర్ చివరికి ఇవి 648.7 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ‘క్వార్టర్లీ ఎక్స్టర్నల్ డెట్’ నివేదికలోని గణాంకాలు కింది విధంగా ఉన్నాయి.2024 సెప్టెంబర్ చివరికి ఇవి 712.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే అంతక్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే 0.7 శాతం.. ఏడాది క్రితం ఇదే కాలంతో పోల్చి చూస్తే 10 శాతం అధికమయ్యాయి. జీడీపీలో విదేశీ రుణాలు డిసెంబర్ చివరికి 19.1 శాతానికి చేరాయి. 2024 సెప్టెంబర్ చివరికి 19 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా రూపాయితోపాటు ఇతర ప్రధాన కరెన్సీలతో డాలర్ బలపడడం విదేశీ రుణ భారం విలువ పెరిగేందుకు దారితీసింది.ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..డాలర్ మారకంలో 54.8 శాతం..యూఎస్ డాలర్ మారకంలోని బకాయిలు మొత్తం విదేశీ రుణాల్లో 54.8 శాతంగా ఉన్నాయి. ఆ తర్వాత రూపాయి మారకంలో విదేశీ రుణాలు 30.6 శాతంగా ఉంటే, జపాన్ యెన్ మారకంలో 6.1 శాతం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) రూపంలో 4.7 శాతం, యూరో మారకంలో 3 శాతం చొప్పున ఉన్నాయి. మొత్తం విదేశీ రుణాల్లో నాన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్‌కు సంబంధించి 36.5 శాతం మేర ఉన్నాయి. ఆ తర్వాత డిపాజిట్ స్వీకరించే కార్పొరేషన్లకు సంబంధించి 27.8 శాతం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 22.1 శాతం, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి 8.7 శాతం చొప్పున ఉన్నాయి. విదేశీ మారకంలో చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో రుణాల రూపంలో 33.6 శాతం ఉంటే, కరెన్సీ, డిపాజిట్ల రూపంలో 23.1 శాతం, ట్రేడ్ క్రెడిట్, అడ్వాన్స్‌ల రూపంలో 18.8 శాతం, డెట్ సెక్యూరిటీల రూపంలో 16.8 శాతం చొప్పున ఉన్నాయి.

ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
లక్నో: నాడు తన భార్య ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన భర్త వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. ఈ క్రమంలో ఆమె అత్త.. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ప్రేమకథ అనూహ్య మలుపు తిరిగింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్ గ్రామంలో తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్‌తో ఇటీవలే భర్త బబ్లూ పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లూ తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు. అయితే రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది.ఈ సందర్భంగా రాధిక అత్త మాట్లాడుతూ..‘రాధిక భర్త, అతడి పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి, నేను చలించిపోయాను. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపొమ్మని రాధికకు తేల్చి చెప్పాను’ అని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్‌జాట్ గ్రామంలో మళ్లీ పంచాయతీ జరిగింది. బబ్లూ తన భార్య రాధికను చూసుకుంటాడని గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకు ఏదైనా ప్రమాదం జరిగితే, దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి అంతటా చర్చ జరుగుతోంది.
పార్టీ ఫిరాయింపులపై నేడు ‘సుప్రీం’లో విచారణ
భాషలోనూ వివక్ష ఎందుకు?
బూతులు తిడుతూ.. విద్యార్థినులను కొడుతూ..
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్
కాంతివంతమైన కళ్లకోసం...
గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం: మిథున్ రెడ్డి
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
సింధు తర్వాత ఎవరు?
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
‘ఒలింపిక్ పతకం గెలిచుంటే బాగుండేది’
జీఎస్టీ వసూళ్ల రికార్డు
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత
పోలీసుపై రెడ్ బుక్ జులుం
వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
పంజాబ్ ఫటాఫట్
కౌంట్‌డౌన్ స్టార్ట్
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్
భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
అసత్య ప్రచారం గట్టిగా తిప్పి కొట్టాలి
వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడమంటే మాకు ద్రోహం చేయడమే
క్రాష్ మార్కెట్
కలిసి నడుద్దాం...
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం: మిథున్ రెడ్డి
సాక్షి కార్టూన్ 30-03-2025
మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు
పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన నటుడు
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
మాకూ 'మంత్రి' ఇవ్వండి
గ్యాసు వేస్టు ఎందుకని!
యూపీఐ లావాదేవీలు @ రూ.24.77 లక్షల కోట్లు
ఫార్మాకు చేదు మందు?
అంతర్జాతీయ హాకీకి వందన గుడ్‌బై
అమ్మకాల్లో అదరగొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్
అడ్డుకోవాలంటే కూడా ఎంతో కొంత ఇచ్చుకోవాలటసార్!
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
అట్టుడికిన హెచ్‌సీయూ
తప్పులను సరిదిద్దుకోకపోతే సంకటమే!
చాక్లెట్ పంట.. ధరలేక తంటా
తక్కువ కాలుష్య నగరం కడప
లింగమయ్య హత్య కేసులో ‘పరిటాల’ ఒత్తిళ్లు
‘విముక్తి’ తీరుతెన్నులెలా?!
మాండలే.. మరుభూమి
హెచ్‌సీయూది కాదు.. ఆ 400 ఎకరాలు
పుత్తడి @ రూ. 94,000
మత్తు కోసం కొత్త పంథాను ఎంచుకున్న యువత
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్‌లు ఓపెన్
ఈ రాశి వారికి బాకీలు వసూలవుతాయి.. ఆస్తిలాభం
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
భారత్ విదేశీ రుణాల లెక్కలివే..
లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు.. నేడు రెండో రౌండ్ విచారణ
ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి
భోజనం లేదు.. పుస్తకాల్లేవు!
ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
ప్రపంచ దేశాలకు సురక్షిత మార్గం.. ఇండోపసిఫిక్
ఐస్లాండ్లో మళ్లీ బద్దలైన అగ్ని పర్వతం
ఆటిజం.. అర్థం చేసుకుందాం
మోదీ ఫొటో పెట్టాలనడం సరికాదు
కొలిక్కి చేరని ‘క్లింటన్’ కేసు!
ఎగుమతి కోసం ప్రత్యేక వరి సాగు
టారిఫ్‌లకు వేళాయె
బీజేపీ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత
హారర్ ఆహ్వానం
చెలరేగిన సిమ్రాన్, అయ్యర్.. లక్నోను చిత్తు చేసిన పంజాబ్
ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
'మ్యాడ్ స్క్వేర్'కి భారీ వసూళ్లు ఎందుకు వస్తున్నాయంటే..: నాగవంశీ
EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వర్షాలు
అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
పంపాలో మట్టి దొంగలు
పవన్‌ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!
DC Vs LSG: ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే డకౌట్
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
డియర్ పేరెంట్స్.. పిల్లలకు మార్కులే జీవితం కాదు..!
పార్టీ ఫిరాయింపులపై నేడు ‘సుప్రీం’లో విచారణ
భాషలోనూ వివక్ష ఎందుకు?
భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్
కాంతివంతమైన కళ్లకోసం...
గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
హైవేపై రెండు బస్సులు, కారు ప్రమాదం.. పలువురు మృతి
లిస్టింగ్‌కు కంపెనీల క్యూ
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
వక్ఫ్ బిల్లుపై వ్యతిరేకత ఎందుకంటే...
ఏనుగు–డ్రాగన్ ‘ట్యాంగో’ చేయాలి
అవివేక మార్గంలో అగ్రరాజ్యం
ఓరుగల్లు సిగలో లోహవిహంగ నగ
పాలిటిక్స్ ఫుల్‌టైమ్ కాదు
ట్రిపుల్ ఆర్ పరిహారం పంపిణీ షురూ
పార్టీ ఫిరాయింపులపై నేడు ‘సుప్రీం’లో విచారణ
భాషలోనూ వివక్ష ఎందుకు?
బూతులు తిడుతూ.. విద్యార్థినులను కొడుతూ..
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్
కాంతివంతమైన కళ్లకోసం...
గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం: మిథున్ రెడ్డి
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
సింధు తర్వాత ఎవరు?
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
‘ఒలింపిక్ పతకం గెలిచుంటే బాగుండేది’
జీఎస్టీ వసూళ్ల రికార్డు
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత
పోలీసుపై రెడ్ బుక్ జులుం
వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
పంజాబ్ ఫటాఫట్
కౌంట్‌డౌన్ స్టార్ట్
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్
భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
అసత్య ప్రచారం గట్టిగా తిప్పి కొట్టాలి
వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడమంటే మాకు ద్రోహం చేయడమే
క్రాష్ మార్కెట్
కలిసి నడుద్దాం...
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం: మిథున్ రెడ్డి
సాక్షి కార్టూన్ 30-03-2025
మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు
పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన నటుడు
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
మాకూ 'మంత్రి' ఇవ్వండి
గ్యాసు వేస్టు ఎందుకని!
యూపీఐ లావాదేవీలు @ రూ.24.77 లక్షల కోట్లు
ఫార్మాకు చేదు మందు?
అంతర్జాతీయ హాకీకి వందన గుడ్‌బై
అమ్మకాల్లో అదరగొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్
అడ్డుకోవాలంటే కూడా ఎంతో కొంత ఇచ్చుకోవాలటసార్!
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
అట్టుడికిన హెచ్‌సీయూ
తప్పులను సరిదిద్దుకోకపోతే సంకటమే!
చాక్లెట్ పంట.. ధరలేక తంటా
తక్కువ కాలుష్య నగరం కడప
లింగమయ్య హత్య కేసులో ‘పరిటాల’ ఒత్తిళ్లు
‘విముక్తి’ తీరుతెన్నులెలా?!
మాండలే.. మరుభూమి
హెచ్‌సీయూది కాదు.. ఆ 400 ఎకరాలు
పుత్తడి @ రూ. 94,000
మత్తు కోసం కొత్త పంథాను ఎంచుకున్న యువత
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్‌లు ఓపెన్
ఈ రాశి వారికి బాకీలు వసూలవుతాయి.. ఆస్తిలాభం
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
భారత్ విదేశీ రుణాల లెక్కలివే..
లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు.. నేడు రెండో రౌండ్ విచారణ
ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి
భోజనం లేదు.. పుస్తకాల్లేవు!
ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
ప్రపంచ దేశాలకు సురక్షిత మార్గం.. ఇండోపసిఫిక్
ఐస్లాండ్లో మళ్లీ బద్దలైన అగ్ని పర్వతం
ఆటిజం.. అర్థం చేసుకుందాం
మోదీ ఫొటో పెట్టాలనడం సరికాదు
కొలిక్కి చేరని ‘క్లింటన్’ కేసు!
ఎగుమతి కోసం ప్రత్యేక వరి సాగు
టారిఫ్‌లకు వేళాయె
బీజేపీ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత
హారర్ ఆహ్వానం
చెలరేగిన సిమ్రాన్, అయ్యర్.. లక్నోను చిత్తు చేసిన పంజాబ్
ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
'మ్యాడ్ స్క్వేర్'కి భారీ వసూళ్లు ఎందుకు వస్తున్నాయంటే..: నాగవంశీ
EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వర్షాలు
అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
పంపాలో మట్టి దొంగలు
పవన్‌ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!
DC Vs LSG: ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే డకౌట్
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
డియర్ పేరెంట్స్.. పిల్లలకు మార్కులే జీవితం కాదు..!
పార్టీ ఫిరాయింపులపై నేడు ‘సుప్రీం’లో విచారణ
భాషలోనూ వివక్ష ఎందుకు?
భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్
కాంతివంతమైన కళ్లకోసం...
గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
హైవేపై రెండు బస్సులు, కారు ప్రమాదం.. పలువురు మృతి
లిస్టింగ్‌కు కంపెనీల క్యూ
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
వక్ఫ్ బిల్లుపై వ్యతిరేకత ఎందుకంటే...
ఏనుగు–డ్రాగన్ ‘ట్యాంగో’ చేయాలి
అవివేక మార్గంలో అగ్రరాజ్యం
ఓరుగల్లు సిగలో లోహవిహంగ నగ
పాలిటిక్స్ ఫుల్‌టైమ్ కాదు
ట్రిపుల్ ఆర్ పరిహారం పంపిణీ షురూ
సినిమా

చిరు సినిమా: అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక పారితోషికం!
అనిల్ రావిపూడి(Anil Ravipudi ).. టాలీవుడ్లో హిట్ సినిమాకు ఈ పేరు కేరాఫ్‌గా మారింది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాడు. రీసెంట్గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో విక్టరీ వెంకటేశ్‌కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న MEGA157(వర్కింగ్ టైటిల్) మూవీ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ కంటే ముందే ప్రమోషనల్ వీడియోని వదిలాడు అనిల్. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీమ్‌ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని క్రియేట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ తన ఫోకస్ అంతా చిరు సినిమాపైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భారీగానే పారితోషికం పుచ్చకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు రూ.10-12 కోట్లు తీసుకున్న అనిల్.. ఈ చిత్రం భారీ హిట్ కావడంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. మెగాస్టార్ సినిమాకు అత్యధికంగా రూ.20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. కెరీర్ ప్రారంభంలో పటాస్ చిత్రానికి అనిల్ రూ.50 లక్షలు మాత్రమే తీసున్నాడు. ఇప్పుడు రూ. 20 కోట్లకు ఎగబాకాడు. సూపర్ హిట్ ఇచ్చి భారీగా వసూళ్లను రాబట్టే సత్తా ఉండడంతో రూ.20 కోట్లే కాదు అంతకంటే కాస్త ఎక్కువ అయినా ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు.

తండ్రి వయసు వ్యక్తితో అలా చూసి, నాన్న షాక్ చెందారన్న నటి
సాధారణంగా అందంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందేంత అభినయం కూడా ఉండడం అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సాధించగలిగిన విజయం. అలాంటి విజయవంతమైన కధానాయికల్లో అమలాపాల్ ఒకరు. తమిళం, మలయాళం తెలుగు సినిమాలలో నటిస్తూ బహుభాషా నటిగా తన అందానికి, అభినయానికి సమాన ప్రశంసల్ని పొందిన ఈ నటి నిర్మాత కూడా. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో సహా ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతగా అమల పాల్(Amala Paul) పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే ఏమీ తెలీకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాటి అమలాపాల్‌కి ప్రస్తుతం ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉందని ఆమె అంటోంది.అమలా పాల్,నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తాను విజయాలు మాత్రమే కాదు మరెన్నో సవాళ్లతో నిండిన ప్రయాణాన్ని సాగించానని వెల్లడించింది. . వ్యక్తిగత వృత్తి పరమైన ఎదుగుదలతో పాటు జీవితంలోని హెచ్చు తగ్గులు తన మార్గానికి ఒక రూపాన్ని ఇచ్చాయి అంటోంది. మళ్లీ ప్రేమ, మళ్లీ పెళ్లి, తల్లి కావడం...ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను తన అభిమానులతో పంచుకుంటూ.. ఈ 15 సంవత్సరాలలో, ఆమె తన అనుభవాల ద్వారా ఎదురుదెబ్బల నుంచి చాలా నేర్చుకున్నానంది. అమలాపాల్ 2010లో నటించిన తమిళ చిత్రం ‘‘ సింధు సమవేలి’’ ఆమె కెరీర్ ను వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రభావితం చేసింది. ఆమె సింధు సమవేలి(Sindhu Samaveli)లో ఓ బోల్డ్ పాత్రను పోషించింది ఎందరినో ఇబ్బంది పెట్టిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఆ సాహసం ఆమె వ్యక్తిగత జీవితం ప్రారంభ కెరీర్ రెండింటినీ ఎదురుదెబ్బలు ఎదుర్కునేలా చేసింది.తండ్రి వయసు ఉండే తన మామగారితో అక్రమ సంబంధానికి ఒడిగట్టే కోడలు సుందరి పాత్రలో ఆమె నటించిన ఆ చిత్రం విడుదలైన తర్వాత తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,.ఆ సినిమా విషయంలో వెల్లువెత్తిన ప్రతికూలత తనను బాగా భయపెట్టిందని, ముఖ్యంగా ఆ సినిమా చూసి తన తండ్రి తీవ్రంగా కలత చెందారని ఆమె వెల్లడించింది. తన పాత్ర చూపించే సామాజిక ప్రభావాన్ని తాను అంచనా వేయలేకపోయానని అంగీకరించింది. ‘మనం అలాంటి పాత్ర చేయకూడదని, అది చెడ్డదని లేదా అది మన సమాజం అంగీకరించే విషయం కాదని ఆ చిత్రం విడుదల తర్వాత మాత్రనే నేను అర్ధం చేసుకోగలిగాను’’ అంటూ ఆమె గుర్తు చేసుకుంది. అయితే అప్పుడు తాను కేవలం 17 లేదా 18 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్న నటిని.. కావడంతో దర్శకుడి సూచనలను గుడ్డిగా అనుసరించడం మాత్రమే చేయగలిగానంది. ఈ వివాదం ఆమెను మానసికంగా ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్ పరంగానూ వ్యతిరేక పరిణామాలకు దారి తీసింది. సింధు సమవేలి తరువాత, ఆమె తన తదుపరి చిత్రం మైనా ప్రారంభ ప్రమోషన్లలలో సైతం దేనికీ ఆమెను పిలవలేదు, ఆ తర్వాత ఆమెకు తరువాత కమల్ హాసన్ రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల నుంచి సైతం కాల్స్ వచ్చాయి, అయితే విపరీతమైన వ్యతిరేకత పట్ల భయం కారణంగా, ఆమె చెన్నైకి వెళ్లలేకపోయింది.అమలాపాల్ సక్సెస్ తర్వాత ఆ వివాదాస్పద చిత్రం మరోసారి రీ–రిలీజ్ అయింది. అప్పుడు కూడా ప్రమోషనల్ మెటీరియల్ తప్పుదారి పట్టిస్తోందంటూ వివాదాన్ని రేకెత్తించింది. వీటన్నింటి నేపధ్యం ‘‘ సినిమా కేవలం వ్యాపారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని నేను గ్రహించాను, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నటి ఎదురు దెబ్బలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి‘ అని ఆమె స్పష్టం చేసింది.

ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?
2025లో మూడు నెలలు పూర్తయిపోయాయి. గత నెల మార్చిలో బోలెడన్ని మూవీస్ వచ్చాయి. కాకపోతే కోర్ట్ (Court A State Vs Nobody) అనే ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని (Nani) నిర్మించిన ఈ మూవీ.. మంచి లాభాలని అందుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?)రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన 'కోర్ట్'లో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు జనాలు నుంచి మంచి ఆదరణ దక్కింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.ఇక విషయానికొస్తే మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ.. ఏప్రిల్ 11న ఓటీటీలోకి (Court OTT) వచ్చే అవకాశముందని టాక్. దీని డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో పలు కొత్త సినిమాలు ఈ ఓటీటీలో 28 రోజులకే వస్తున్నాయి. దీంతో కోర్ట్ కూడా అలానే రావొచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతనేది చూడాలి?(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?)

కౌంట్‌డౌన్ స్టార్ట్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ విడుదలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ప్రోడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. సరిగ్గా ఈ మూవీ విడుదలకు 30 రోజులు ఉండటంతో 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ చిత్రంలో నాని ఫెరోషియస్ క్యారెక్టర్లో కనిపిస్తారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ...’ పాటకు అద్భుతమైన స్పందన లభించింది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్.
న్యూస్ పాడ్‌కాస్ట్

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...
క్రీడలు

అంతర్జాతీయ హాకీకి వందన గుడ్‌బై
న్యూఢిల్లీ: భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 32 ఏళ్ల వందన భారత్ తరఫున 320 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్ సాధించింది. తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో వందన పలుమార్లు భారత విజయాల్లో ముఖ్యపాత్ర పోషించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో... 2016 రియో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ భారత జట్టులో వందన సభ్యురాలిగా ఉంది. ‘బరువెక్కిన హృదయంతో నేను అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటిస్తున్నా. నాలో ఇంకా ఆడే సత్తా లేదనిగానీ, నాలో ఆడాలనే కోరిక తగ్గిపోయిందనిగానీ వీడ్కోలు నిర్ణయం తీసుకోలేదు. కెరీర్‌పరంగా ఉన్నతస్థితిలో ఉన్నపుడే అంతర్జాతీయస్థాయిలో ఆటకు గుడ్‌బై పలకాలని భావించా. అయితే హాకీ ఇండియా లీగ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ క్లబ్ జట్టుకు ఆడతా. నేనీ స్థాయికి చేరుకోవడానికి వెన్నంటే నిలిచి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు’ అని వందన వ్యాఖ్యానించింది. 2009లో భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన వందన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ‘హ్యాట్రిక్’ సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారతీయ హాకీ క్రీడాకారిణిగా ఘనత వహించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2021లో ‘అర్జున అవార్డు’... 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న వందన వరుసగా మూడు (2014లో కాంస్యం, 2018లో రజతం, 2022లో కాంస్యం) ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది.

పంజాబ్ ఫటాఫట్
లక్నో: కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో ఐపీఎల్ 18వ సీజన్లో అడుగు పెట్టిన పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించి గెలిచింది. 171 వద్ద స్కోరు సమమైనపుడు లక్నో బౌలర్ అబ్దుల్ సమద్ వేసిన బంతిని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) సిక్స్‌గా మలిచి పంజాబ్ కింగ్స్‌ను విజయతీరానికి చేర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) లక్నో బౌలర్ల భరతం పట్టి మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. ప్రభ్‌సిమ్రన్ అవుటయ్యాక వచ్చిన నేహల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు సాధించింది. అర్ష్ దీప్ సింగ్ (3/43) మూడు కీలక వికెట్టు పడగొట్టగా... మ్యాక్స్‌వెల్, ఫెర్గూసన్, యాన్సెన్, చహల్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. లక్నో జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో టాప్–3 బ్యాటర్లను కోల్పోయింది. మిచెల్ మార్ష్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా... పంత్ 2 పరుగులతో నిరాశపరిచాడు. క్రీజులో నిలదొక్కుకున్న దశలో మార్క్రమ్ను ఫెర్గూసన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత పూరన్ (30 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్ బదోని (33 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆటతో లక్నో స్కోరు 100 దాటింది. చివర్లో సమద్ (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించడంతో లక్నో జట్టు ప్రత్యర్థి కి గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో ఆరంభంలోనే ఆర్య వికెట్ కోల్పోయినా పంజాబ్ వెనక్కి తగ్గలేదు. లక్నో బౌలర్లపై ప్రభ్‌సిమ్రన్, అయ్యర్ ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగెత్తించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. శార్దుల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 4,6 కొట్టిన ప్రభ్‌సిమ్రన్... రవి బిష్ణోయ్ వేసిన ఆరో ఓవర్లో 4,4,6తో మెరిశాడు. అదే జోరులో 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ తొలి బంతికి ప్రభ్‌సిమ్రన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దిగ్వేశ్ వేసిన బంతిని డీప్ మిడ్‌వికెట్ వైపు ప్రభ్‌సిమ్రన్ షాట్ ఆడగా... ఆయుశ్ బదోని క్యాచ్ తీసుకొని బౌండరీ లైను వద్ద బ్యాలెన్స్ కోల్పోయి బంతిని గాల్లోకి విసిరాడు. డీప్ స్క్వేర్ లెగ్ వద్ద నుంచి వచ్చిన రవి బిష్ణోయ్ గాల్లో ఉన్న బంతిని పట్టుకోవడంతో ప్రభ్‌సిమ్రన్ పెవిలియన్ చేరుకున్నాడు. ప్రభ్‌సిమ్రన్ వెనుదిరిగాక వచ్చిన నేహల్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ 17వ ఓవర్లోనే విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) ఫెర్గూసన్ 28; మిచెల్ మార్ష్ (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ సింగ్ 0; నికోలస్ పూరన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) చహల్ 44; రిషభ్ పంత్ (సి) చహల్ (బి) మ్యాక్స్‌వెల్ 2; ఆయుశ్ బదోని (సి) మ్యాక్స్‌వెల్ (బి) అర్ష్ దీప్ సింగ్ 41; డేవిడ్ మిల్లర్ (సి) ప్రభ్‌సిమ్రన్ సింగ్ (బి) యాన్సెన్ 19; అబ్దుల్ సమద్ (సి) ఆర్య (బి) అర్ష్ దీప్ సింగ్ 27; శార్దుల్ ఠాకూర్ (నాటౌట్) 3; అవేశ్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–1, 2–32, 3–35, 4–89, 5–119, 6–166, 7–167. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–43–3, ఫెర్గూసన్ 3–0–26–1, మ్యాక్స్‌వెల్ 3–0–22–1, మార్కో యాన్సెన్ 4–0–28–1, స్టొయినిస్ 2–0–15–0, యుజువేంద్ర చహల్ 4–0–36–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) శార్దుల్ ఠాకూర్ (బి) దిగ్వేశ్ రాఠి 8; ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి) రవి బిష్ణోయ్ (బి) దిగ్వేశ్ రాఠి 69; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 52; నేహల్ వధేరా (నాటౌట్) 43; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–26, 2–110. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 3–0–39–0, అవేశ్ ఖాన్ 3–0–30–0, దిగ్వేశ్ రాఠి 4–0–30–2, రవి బిష్ణోయ్ 3–0–43–0, మణిమారన్ సిద్ధార్థ్ 3–0–28–0, అబ్దుల్ సమద్ 0.2–0–6–0. ఐపీఎల్లో నేడుబెంగళూరు X గుజరాత్వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

చెలరేగిన సిమ్రాన్, అయ్యర్.. లక్నోను చిత్తు చేసిన పంజాబ్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తమ జోరును కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆయూష్ బదోని(41), అబ్దుల్ సమద్(27), మార్క్రామ్(28) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, మాక్స్వెల్, చాహల్ తలా వికెట్ సాధించారు.ఫ్రబ్‌సిమ్రాన్ విధ్వంసం..అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ వదేరా(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(52 నాటౌట్) దుమ్ములేపారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.రిషబ్ పంత్ ఫెయిల్..ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా పంత్ నిరాశపరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్‌గా వ్యూహత్మకంగా వ్యవహరించలేకపోయాడు.

ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
క్రిస్ గేల్.. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తన పేరును సువర్ణక్షారలతో లిఖించుకున్నాడు. ఈ వెస్టిండీస్ దిగ్గజం విధ్వంసానికి పెట్టింది పేరు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లు హడలెత్తించాల్సిందే. ఐపీఎల్-2013లో ఆర్సీబీ తరుపున ఒక ఇన్నింగ్స్‌లో 175 పరుగులు చేసి గేల్ చరిత్ర పుటలకెక్కాడు.టీ20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు ఇప్పటికీ గేల్(175) పేరిటే ఉంది. అతడు రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. గేల్ ఐపీఎల్లో కేకేఆర్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తరుపన ఆడాడు. అయితే తాజాగా ఇన్సైడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గేల్.. ఐపీఎల్లో ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. యూనివర్స్ బాస్ తన ఎంచుకున్న బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏడుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.అయితే ఈ జట్టులో ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్‌ను అందించిన రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం గమనార్హం. గేల్ ఎంచుకున్న జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్‌కు చోటు దక్కింది. అదేవిధంగా విదేశీ ప్లేయర్ల కోటాలో గేల్ తనతో పాటు ఏబీ డివిలియర్స్,సునీల్ నరైన్, బ్రావోలకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనికి గేల్ అవకాశమిచ్చాడు.గేల్ ఎంచుకున్న బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఏబీ డివిలియర్స్,సునీల్ నరైన్, బ్రావో
బిజినెస్

యూపీఐ లావాదేవీలు @ రూ.24.77 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలు ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలకు చేరుతున్నాయి. మార్చి నెలలో రూ.24.77 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. విలువ పరంగా ఇది సరికొత్త నెలవారీ గరిష్ట రికార్డు.ఫిబ్రవరిలో నమోదైన రూ.21.96 లక్షల కోట్లతో పోల్చితే విలువ పరంగా 12.7% వృద్ధి నమోదైంది. 2024 మార్చిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.19.78 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. మార్చి నెలలో రోజువారీ సగటు యూపీఐ లావాదేవీల విలువ రూ.79,903 కోట్లుగా నమోదైంది.

ఫార్మాకు చేదు మందు?
సాక్షి బిజినెస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై ఇతరత్రా రంగాల్లాగే భారత ఫార్మా కంపెనీలకూ టెన్షన్‌గానే ఉంది. ఎందుకంటే మన ఫార్మా కంపెనీల ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా అమెరికాదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరం ఆ దేశానికి భారత ఫార్మా ఎగుమతులు 16 శాతం పెరిగి దాదాపు 9 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతయ్యే ఔషధాలు సుమారు 800 మిలియన్ డాలర్లే. అమెరికాకు మన చౌక ఔషధాల అవసరం ఎంత ఉందో, మనకూ కీలకమైన అమెరికా మార్కెట్ అవసరం అంతగానూ ఉందని పరిశీలకులు చెబుతున్నారు.దీంతో సుంకాల వడ్డింపనేది ఎవరికి లాభదాయకం, ఎవరికి నష్టదాయకమనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలోలాగే ఫార్మా మీద టారిఫ్‌పై ఇరు దేశాలు మళ్లీ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు. అమెరికా హెల్త్‌కేర్ వ్యవస్థలో మన జనరిక్స్‌కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మినహాయింపుల కోసం భారత్ ప్రయత్నించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాయి. సవాళ్ల మధ్య అవకాశాలు.. వాస్తవానికి చైనాలాంటి దేశాలపై ప్రధాన దృష్టితో టారిఫ్‌లను ప్రతిపాదించినప్పటికీ అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న మన ఫార్మాపైనా ప్రభావం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా నుంచి ఔషధాల దిగుమతులపై భారత్ 10% సుంకాల వరకు విధిస్తుండగా, మన ఎగుమతులపై అక్కడ టారిఫ్‌లు లేవు. ఒకవేళ ప్రతీకారంగా మనలాగే టారిఫ్ విధించినా సుమారు 10% స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు.గ్లాండ్ ఫార్మా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, జైడస్, లుపిన్లాంటి ఫార్మా కంపెనీల ఆదాయాల్లో అమెరికా వాటా సుమారు 50–37% వరకు ఉండటంతో వాటిపై టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఒకవేళ భారాన్ని కస్టమర్లకు బదలాయించకపోతే వివిధ కంపెనీల స్థూల లాభంపై సుమారు 12% వరకు ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అదే 50% బదలాయిస్తే, ఇది 7% దాకా ఉండొచ్చు. మొత్తం మీద ఆదాయనష్టంతో పాటు మిగతా దేశాలతో పోటీపడి మార్కెట్‌ను నిలబెట్టుకోవడం కష్టంగా మారుతుంది. దేశీ ఫార్మాకు కాస్త కలిసి వచ్చే అంశాలూ ఉన్నాయి. అమెరికా మీదే ఆధారపడకుండా మన కంపెనీలు ఇతర మార్కెట్లకూ విస్తరించవచ్చు. అలాగే, అంతర్జాతీయంగా ఇతర దేశాల కంపెనీలతో దీటుగా పోటీపడేలా ఆర్అండ్డీ సామర్థ్యాలను పెంచుకోవచ్చు. అమెరికాపై ఎఫెక్ట్ .. ఫార్మా దిగుమతులపై టారిఫ్‌లతో అమెరికాకూ కొన్ని ప్రతికూలతలు తప్పవు. భారతీయ జనరిక్స్‌పై సుంకాల వడ్డింపు వల్ల, ఫార్మా కంపెనీలు ఔషధాల రేట్లను పెంచితే, అమెరికా వినియోగదారులకు మందుల ఖర్చులు పెరిగిపోతాయి. ఇక, మన ఫార్మాపై అమెరికా భారీగానే ఆధారపడుతోంది. టారిఫ్‌లతో సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడి, ఔషధాలకు కొరత నెలకొనవచ్చు. ఫలితంగా పేషెంట్లకు చికిత్స విషయంలో సమస్యలు ఏర్పడవచ్చు. అటు అమెరికాకూ కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. టారిఫ్‌తో ఇతర దేశాల ఫార్మా కంపెనీలు అమెరికాలోనూ తయారీ కార్యకలాపాలు చేపట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. దీంతో, దేశీయంగా తయారీకి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది. అలాగే దిగుమతి చేసుకునే ఔషధాల నాణ్యతపరమైన సవాళ్లకు చెక్ పెట్టేలా, దేశీయంగా తయారీ ప్రమాణాలపై అమెరికా మరింత నియంత్రణ సాధించవచ్చు.

క్రాష్ మార్కెట్
ముంబై: అమెరికా ‘లిబరేషన్ డే’ అనిశ్చితి తారస్థాయికి చేరుకోవడంతో మంగళవారం దలాల్ స్ట్రీట్ దాదాపు 2% క్షీణించింది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు అమలు రోజు ఏప్రిల్ 2ను డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా లిబరేషన్ డే’గా అభివర్ణించారు. క్రూడాయిల్ ధరలు అయిదు వారాల గరిష్టానికి చేరుకోవడం, భారత ఈక్విటీ మార్కెట్ మార్చిలో భారీ ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,390 పాయింట్లు క్షీణించి 76,025 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 354 పాయింట్లు పతనమై 23,166 వద్ద స్థిరపడింది. కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలిరోజున స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు... ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల ప్రభావంతో రోజంతా నష్టాలతో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,503 పాయింట్లు క్షీణించి 75,912 వద్ద, నిఫ్టీ 383 పాయింట్లు పతనమై 23,136 వద్ద కనిష్టాలు తాకాయి.⇒ టెలికమ్యూనికేషన్, ఆయిల్‌అండ్‌గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ప్రైవేటు రంగ బ్యాంకుల షేర్లలో భారీ విక్రయాలు జరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1% నష్టపోయింది. స్మాల్‌క్యాప్ సూచీ స్వల్పంగా 0.07 శాతం లాభపడింది. సూచీల వారీగా రియల్టీ 3%, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ 2.50%, ఫైనాన్షియల్ సర్విసెస్ 2%, బ్యాంకెక్స్ 1.50 శాతం నష్టపోయాయి. ⇒ సూచీల 2% మేర పతనంతో మంగళవారం రూ.3.5 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.409.43 లక్షల కోట్లు(4.78 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది. ⇒ వొడాఫోన్ ఐడియా షేరు 19% లాభపడి రూ.8.10 వద్ద స్థిరపడింది. స్పెక్ట్రమ్ వేలం బకాయిలు రూ.36,950 కోట్ల బదులుగా ఈక్విటీల రూపంలో వాటాను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందంటూ వీఐ ఆదివారం ఎక్స్చేంజ్ కు సమాచారం ఇచ్చింది. దీంతో వీఐలో కేంద్రం వాటా 48.99 శాతానికి చేరనుంది. ఇంట్రాడేలో 26% ఎగసి రూ.8.56 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.9,210 కోట్లు పెరిగి రూ. 57,828 కోట్లకు చేరింది. ⇒సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో ఇండస్ఇండ్ 5%, జొమాటో 0.27% మాత్రమే లాభపడ్డాయి. అత్యధికంగా హెచ్‌సీఎల్ టెక్ 4%, బజాజ్‌ఫిన్‌సర్వ్ 3.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.35%, బజాజ్ ఫైనాన్స్3%, ఇన్ఫోసిస్ 3% నష్టపోయాయి.

2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
భారతదేశం 2030 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారుగా అవతరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల భవిష్యత్తును ఆయన హైలైట్ చేశారు.మా ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు.. నేను ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడాను. ఆ సమయంలో ఎవరూ దానిని నమ్మలేదు, కానీ నేడు అది నిజమైందని గడ్కరీ అన్నారు. అప్పట్లో, భారత ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడు దీని విలువ 22 లక్షల కోట్లకు పెరిగింది.భారత్.. అమెరికా, చైనా తర్వాత జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించింది. ఇప్పుడు 2030 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుగా ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని నితిన్ గడ్కరీ అన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల ధర తగ్గుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ప్రజాదరణపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఫ్యామిలీ

April Fools Day 2025 : కాసిన్ని నవ్వులు, మరికొన్ని జోకులు..తేడా వచ్చిందంటే!
ప్రతీ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చిందంటే చాలు సరదాల సందడి మొదలవుతుంది. ఏదో ఒక అబద్దం చెప్పాలి, ఎవరో ఒకరిని ఏప్రిల్ ఫూల్ చేయాలి. అదే ఏప్రిల్ ఫూల్స్ డే (April Fools Day 2025) అది సమీప బంధువులు కావొచ్చు, స్నేహితులు, సన్నిహితులు సహోద్యోగులపై కావచ్చు ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ ఫన్నీగా ఆట పట్టిస్తారు. అలా రోజంతా జోకులు,చిలిపి పనులతో కొనసాగుతుంది. అసలు ఈ క్రేజీ ట్రెడిషన్ ఎప్పటినుంచి, ఎలా మొదలైందో తెలుసా? అసలు ఎందుకు వచ్చిందో తెలుసా? రండి తెలుసుకుందాం..ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా వచ్చింది?గత కొన్ని శతాబ్దాలుగా ఏప్రిల్ ఫూల్స్ డేను జరుపుకుంటున్నారు. అయితే ఖచ్చితమైన మూలం ఇప్పటికీ పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఒక సిద్ధాంతం ప్రకారం ఇది 1582 నాటిది, ఫ్రాన్స్ జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారినప్పుడు, కొత్త సంవత్సరం ప్రారంభాన్ని ఏప్రిల్ 1 నుండి జనవరి 1కి మార్చారు. ఫలితంగా, ఏప్రిల్ 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వారిని "ఏప్రిల్ ఫూల్స్" అని ఎగతాళి చేసేవారట.చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీమరొక సిద్ధాంతం ఏప్రిల్ ఫూల్స్ డేని మార్చి 25న సైబెలే దేవత గౌరవార్థం జరుపుకునే పురాతన రోమన్ పండుగ హిలేరియాతో అనుసంధానిస్తుంది. ఈ ఉత్సవంలో ప్రజలు మారువేషాలు ధరించి తోటి పౌరులను ఎగతాళి చేసేవారు. ఇది ఆధునిక కాలపు చిలిపి పనులకు ప్రేరణనిచ్చి ఉంటుందని అంచనా. అలాగే చాలా కాలం క్రితం జెఫ్రీ చౌసర్ అనే రచయిత తన పుస్తకం ‘ది కాంటర్బరీ టేల్స్’లో ఒక జోక్ వేశారట. ఆ జోక్ ను కొంతమంది ఏప్రిల్ ఫూల్స్ డేగా పాటించడం మొదలుపెట్టారని మరికొంతమందిచరిత్రకారులు చెబుతున్న మాట. ఇంగ్లాండ్‌లో ఏప్రిల్ ఫూల్స్ డే గురించిన మొదటి లిఖిత రికార్డులు 1686 నాటివిగా భావిస్తున్నారు. జాన్ ఆబ్రే అనే రచయిత ఏప్రిల్ 1ని "మూర్ఖుల పవిత్ర దినం"గా అభివర్ణించారట. 18వ శతాబ్దం నాటికి, ఈ సంప్రదాయం బ్రిటన్ అంతటా వ్యాపించి, 19వ శతాబ్దం నాటికి ఏప్రిల్ ఫూల్స్ డే మరింత ప్రజాదరణ పొందింది. ఇక స్కాట్లాండ్లో, ఏప్రిల్ ఫూల్స్ డే రెండు రోజులపాటు జరుపుకుంటారు.సరదాగానే... తేడావచ్చిందంటే..ఏప్రిల్ ఫూల్స్ డే అనేది జీవితంలో హాస్యానికున్న ప్రాధాన్యతను గుర్తుచేసే వేడుక. ఇది ఒకర్నొకరు సరదాగా ఆటపట్టించుకోవడానికి,నవ్వుకోడానికి మాత్రమే ఉపయోగపడాలి. దైనందిన కార్యక్రమాలనుంచి కాస్తంత పక్కకు వచ్చి, కాసేపు ఉల్లాసంగా గడపడానికి మాత్రమే ఈ వేడుక. ఈ రోజు అంతా తేలికైన జోకులు పంచుకోవడం, హానిచేయని చిలిపి పనులతో అంతా సరదాగా గడిపి కొన్ని మధుర క్షణాలను పదిలపర్చుకోవడానికి మాత్రమే ఏప్రిల్ ఫూల్స్ డేని జరుపుకోవాలి. అంతే తప్ప చిలిపి పనుల పేరుతో పక్కవారికి హానిచేయడమో, సరదాల ముసుగులో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి లాంటివి చేయకూడదని గుర్తుంచుకోవాలి. లేదంటే ‘సరదా’ తీరిపోద్ది. తేడాలొచ్చాయంటే.. మాతో పెట్టుకుంటే.. మడతడిపోద్ది.. అన్నట్టు మారిపోతుంది పరిస్థితి. సో తస్మాత్ జాగ్రత్త... హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే..

30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఆధ్యాత్మికకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా తన 30వ పుట్టినరోజు సందర్భంగా మరో ఆధ్మాత్మికకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయానికి కాలినడకన వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు 141 కిలోమీటర్లమేర కాలినడకన ద్వారకకు చేరుకుని అక్కడ శ్రీ కృష్ణుడి పాదాలకు నమస్కరించనున్నారు. రోజుకు 15-20 కిలోమీటర్ల చొప్పున ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగియనుంది.జామ్‌నగర్ నుండి ద్వారకకుఎపుడూ భక్తిని చాటుకునే అనంత్ అంబానీ, జామ్‌నగర్ నుండి శ్రీకృష్ణ నగరం ద్వారకకు ఆధ్యాత్మిక యాత్ర (పాదయాత్ర)గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారక వరకు మార్చి 27న ప్రారంభించారు. ద్వారకలో ద్వారకాధీశుని దర్శనంతో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించు కున్నారు. 140 కిలోమీటర్ల ప్రయాణం ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, అనంత్ అంబానీ ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ ద్వారకాధీశుని దర్శించుకుంటాననీ, దీంతో ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు.#WATCH | Devbhumi Dwarka, Gujarat: Anant Ambani, Director, Reliance Industries Limited, is on a 'Padyatra' from Jamnagar to Dwarkadhish TempleHe says, "The padyatra is from our house in Jamnagar to Dwarka... It has been going on for the last 5 days and we will reach in another… pic.twitter.com/aujJyKYJDN— ANI (@ANI) April 1, 2025 > "జామ్‌నగర్‌లోని మా ఇంటి నుండి ద్వారక వరకు పాదయాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతోంది, మరో రెండు నాలుగు రోజుల్లో ద్వారక చేరుకుంటాము.ద్వారకాధీశుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడుపై విశ్వాసం ఉంచి, ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని నేను యువతకు చెప్పాలనుకుంటున్నాను. ఆ పని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. దేవుడు ఉన్నప్పుడు, చింతించాల్సిన పని లేదు" అని ఆయన అన్నారు.Anant Ambani’s decision to walk on foot speaks volumes about his dedication to faith. pic.twitter.com/3XHK4BWMBa— Amrish Kumar (@theamrishkumar) March 31, 2025 ఏప్రిల్ 10న పుట్టినరోజుకృష్ణ భక్తుడైన అనంత్ అంబానీ జై ద్వారకాదీష్ అంటూ నినదిస్తూ ఎంతో ఉత్సాహంగా నడుస్తున్నారు. అనేక మంది భక్తులను ఆకట్టుకుంటున్నారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తి పాదయాత్ర చేయడం ఇదే తొలిసారి. దీంతో అనంత్ అంబానీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ పాదయాత్ర ద్వారా ద్వారక శ్రీ కృష్ణ మందిరానికిచేరుకుంటారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 8 నాటికి అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ ద్వారక చేరుకుంటే. తరువాత, ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో భార్య రాధికతోపాటు అనంత్ అంబానీ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసిన సంగతి తెలిసిందే.

14 ఏళ్లుగా.. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్ర
నగరంలోని సనత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస రామానుజ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు, బాటసారులకు సేవలందిస్తోంది. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్రలా మారుతోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం మితాహారాన్ని అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తోంది. యేటా రెండు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి కావడంతో మంగళవారం నుంచి మరోసారి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. – సనత్‌నగర్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తోంది శ్రీనివాస సమాజ సేవా సమితి. స్థానిక బీకేగూడ పార్కు వద్ద రోజుకు 250 నుంచి 300 మంది వరకూ మధ్యాహ్నం మిత భోజనాన్ని వడ్డించేందుకు సీనియర్ సిటిజన్స్ సిద్ధమయ్యారు. దాతల సహకారంతో.. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున దాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పోటీపడు తుంటారు. అయితే రోజుకో దాత అనే సంప్రదాయాన్ని ట్రస్ట్ కొనసాగిస్తూ వస్తోంది. దాతల కోరిక మేరకు పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి కొన్ని ప్రత్యేక తేదీల్లో వారి పేరున నలుగురికీ ఆహారాన్ని పంచుతోంది. ఈ యేడాదికి గానూ ఇప్పటికే జూన్ 2 వరకూ అన్ని రోజులకు సరిపడా దాతలు తమ తేదీలను బుక్ చేసుకున్నారు. రోజుకు రూ.5వేల చొప్పున.. ఒక్కో దాత నుంచి రోజుకు రూ.5వేల చొప్పున మాత్రమే స్వీకరిస్తారు. వీటితో రుచికరమైన వంటకాలను అందిస్తారు. బగారా రైస్, టమాటా రైస్, జీరా రైస్, కర్రీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, స్వీట్స్‌తో పాటు ప్లేట్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కలిపి రూ.5,000 గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్‌కు నగదు, చెక్కు రూపంలో స్వీకరిస్తారు. దాతల సహకారం అపూర్వం.. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ మితాహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి అపూర్వమైన కార్యక్రమంలో దాతల సహకారం అపూర్వం. దీనికి సీనియర్ సిటిజన్స్ తోడవ్వడం మా అదృష్టం. వారి సహకారం మరువలేనిది. ఏటా మాదిరిగానే చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్యాంసుందర్రాజ్కు కృతజ్ఞతలు. – పార్థసారథి, శ్రీనివాస రామానుజ ట్రస్టీ

ప్రపంచంలోనే అత్యంత శీతల మార్కెట్..! కొనాలంటే గజగజ వణకాల్సిందే..
గజగజలాడించే చలిప్రాంతాలు గురించి ఉన్నాం. అయితే మార్కెట్లు వ్యాపార ప్రాంతాలు కాస్త అనువైన ప్రదేశాల్లో, సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే చోటనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మార్కెట్ మాత్రం గడ్డకట్టుకుపోయే మార్కెట్. అక్కడ కొనుగోలు చేయడానికి వెళ్లాలంటే తగిన జాగ్రత్తలతో వెళ్లకపోతే అంతే సంగతులు. అంతలా వణుకుపుట్టిస్తుంది అక్కడ చలి. శీతాకాలంలో అయితే ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 60 డిగ్రీలకు పడిపోతుందట. అంతలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ జనాభా వృద్ధి చెందుతుండటం విశేసం. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందంటే..సైబీరియాలోని యాకుట్స్క్ అనే నగరం అత్యంత శీతల నగరంగా పేరుగాంచింది. అక్కడ నివాసితులు సాధారణ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నట్లుగా మనుగడ సాగించటం విశేషం. వాళ్లేమి ఆ చలిని పెద్దగా లెక్కచేయరు. అది వారికి అత్యంత సర్వసాధారణం. అక్కడ ఒక నాన్‌వెజ్ మార్కెట్ ఉంటుంది. సందర్శనకు వెళ్లితే గజగజ వణికిపోవాల్సిందే. దీనిపై ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్ డాక్యుమెంట్ చేసి మరీ ఈ నగరం విశేషాల గురించి వివరించింది. ఎముకలు కొరికే చలిలో మార్కెట్‌ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు. యాకుట్స్క్ నగరవాసులు మాంసం బాగా తింటారట. అక్కడ చేపల మార్కెట్లు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయట. ఎలాంటి వాసనరాదట. అక్కడ గుర్రం, రెయిన్ డీర్, కుందేలు, కొన్ని రకాల పచ్చి మాంసాలు, చేపలు తదితరాలను విక్రయిస్తుంటారట. అక్కడ స్థానిక ప్రజలకు బాగా ఇష్టమైనది గుర్రపు కాలేయం అట. ఈ మార్కెట్ సందర్శించాలనుకుంటే రెడీమేడ్‌గా తినగలిగే పదార్థాలను తీసుకువెళ్లితే మంచిదట. ఇంతలా వణికించే చలికి తగ్గట్టుగానే వేసవి ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో ఉంటాయట. జూలైలో యాకుట్స్క్ సగటు అధిక ఉష్ణోగ్రత 78 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుందట. ఇది లండన్‌తో పోలిస్తే మరింత ఎక్కువని చెబుతోంది ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరీ.. View this post on Instagram A post shared by Ankita Kumar 🇮🇳| TRAVEL (@monkey.inc) (చదవండి: పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!)
ఫొటోలు


#IPL2025 : ముంబై మ్యాచ్‌లో ఆమె ఎవరు.. పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్? (ఫోటోలు వైరల్)


ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


రామ్ గోపాల్ వర్మ 'శారీ'మూవీ ప్రీరిజ్ ఈవెంట్ (ఫొటోలు)


'కోర్ట్' బ్యూటీ జర్నీ.. కాకినాడ నుంచి మెగాస్టార్ ఇంటివరకు (ఫొటోలు)


గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు (ఫోటోలు)


పాలరాతి శిల్పంలా మిల మిల మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ (ఫోటోలు)


ఏపీలో ఈ కోదండరామాలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)


వైట్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ దివి వద్త్య (ఫోటోలు)


‘సారంగపాణి జాతకం’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)


టిక్ టాక్ వీడియోలతో ఫేమస్..హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దీపికా పిల్లి (ఫొటోలు)
International

మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు
నేపిడా: ప్రకృతి ప్రకోపానికి మయన్మార్.. మరుభూమిగా మారింది. గత శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేసింది. భూకంపం దరిమిలా ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. భూకంప మృతుల సంఖ్య 2,056 కు చేరింది. దాదాపు 3,900 మంది గాయపడ్డారు. 270 మంది గల్లంతయ్యారు.మరింత దిగజారిన పరిస్థితులు మయన్మార్(Myanmar)లోని ప్రధాన పట్టణాలైన మండలే, నేపిడాలలో భూకంప బాధితులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి. దీంతో అందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వారికి చికిత్స అందించేందుకు స్థలం, వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ రెండు నగరాల్లోని వైద్య సిబ్బంది బాధితులను ఆదుకునేందుకు నిరంతరం తమ సేవలు అందిస్తున్నారు.సైనిక పాలనలో..పలు నివేదికల ప్రకారం గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక పాలన(Military rule) మయన్మార్‌లో ఆరోగ్య సేవలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. భూకంపానికి ముందు నుంచి పలు ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మండలేలో పరిస్థితి దారుణంగా ఉంది. 80 శాతానికిపైగా వైద్య సిబ్బంది సైనిక పాలనకు వ్యతిరేకిస్తున్నారు. గడచిన నెలలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశారు. భూకంపానికి ముందే మండలేలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేశారు.ఆస్పత్రులు ధ్వంసంభూకంపం కారణంగా కొన్ని ఆస్పత్రులు ధ్వంసం కావడంతో బాధితులందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. అరకొరగా ఉన్న ఆస్పత్రులలో పడకల కొరత అధికంగా ఉంది. రోగులను నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. కాగా మయన్మార్ వాతావరణ, జలశాస్త్ర విభాగం తెలిపిన వివరాల ప్రకారం భారీ భూకంపం తరువాత 36 భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాటి తీవ్రత 2.8- 7.5 మధ్య ఉంది. శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించింది.ఇది కూడా చదవండి: చిరాగ్ పాశ్వాన్ తల్లి గదికి తాళం.. రోడ్డునపడ్డ కుటుంబ కలహాలు

అమెరికాలోనే చనిపోతా: ఎలాన్ మస్క్
విస్కాన్సిన్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమెరికా పట్ల తన తిరుగులేని నిబద్ధతను ప్రకటించారు. ‘నేను ఎక్కడికీ వెళ్లను. అమెరికాలోనే ఉంటా. ఇక్కడే చచ్చిపోతా. అంగారక గ్రహం మీదికి నేను వెళ్లినా అది కూడా అమెరికాలో భాగంగానే ఉండిపోతుంది’అంటూ ఆదివారం విస్కాన్సిన్ టౌన్హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మస్క్ ఇద్దరు విస్కాన్సిన్ ఓటర్లకు పది లక్షల విలువైన చెక్కులను అందజేశారు. తన రాజకీయ గ్రూపునకు వీరిద్దరినీ ప్రతినిధులుగా ప్రకటించారు. త్వరలో జరగనున్న విస్కాన్సిన్ సుప్రీంకోర్టు ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాకు, నాగరికత భవిష్యత్తుకు కీలకమైనవని పేర్కొన్నార

సుంకాల మోత వేళ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాల విధింపు వేళ(reciprocal tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీలక ప్రకటన చేసే సమయంలో వాణిజ్య భాగస్వాముల పట్ల తాను మరింత దయతో వ్యవహరిస్తానని ప్రకటించారాయన. అయితే కచ్చితంగా ఎలాంటి పరస్పర సుంకాలు విధించబడతాయనేది మాత్రం మంగళవారం రాత్రికల్లా లేదంటే బుధవారం పొద్దునే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.జనవరిలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ తన అధికారాన్ని ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు(Tariffs) తప్పదని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటించిన ఆ ప్రతీకార టారిఫ్‌ల డెడ్‌లైన్ ఏప్రిల్ 2 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొన్నాయి. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై చర్చ నడుస్తోంది. అయితే..తాజాగా.. ‘‘మీరు రెండు రోజుల్లో చూడబోతున్నారు.. మేం చాలా దయతో ఉంటాం’’ అని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. కొన్ని దేశాలకు ఊరట దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు టారిఫ్‌లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని భారత్ ఇంతకాలం భావిస్తూ వచ్చింది. కానీ, సుంకాల ప్రకటన అనుకున్న తేదీకే ఉంటుందని ట్రంప్ చెప్పడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. అయితే.. భారత్‌ను ఆయన ప్రత్యేక మిత్రపక్షంగా భావిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు ప్రత్యేక ఊరట ఏమైనా దక్కుతుందేమో చూడాలి. అయితే.. ఇదీ చదవండి: భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..పరస్పర సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని వైట్‌హౌజ్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ అంటున్నారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాలను ప్రస్తావిస్తూ.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు నిలిపివేయాల్సిన అవసరం ఉందని లీవిట్ అభిప్రాయపడ్డారు.సుంకాల మోత ఎందుకంటే.. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన. అందుకే ప్రతీకార సుంకాల విధింపు తప్పదని అంటున్నారు.ట్రంప్ ప్రకటన కంటే ముందే..మరోవైపు ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చైనా, కెనడా, యూరోపియన్ యూనియన్ నుంచి ప్రతిఘటన తప్పదని అంటున్నారు. మరోవైపు.. ట్రంప్ సుంకాల ప్రకటన చేయకముందే ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. టారిఫ్ వార్‌ను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఒక అడుగు ముందుకు వేశాయి. దక్షిణ కొరియా-జపాన్-చైనా దేశాలు ప్రాంతీయ వాణిజ్యం ప్రొత్సాహం దిశగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆదివారం చర్చలు జరిపాయి.

Sunita Williams: మళ్లీ స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్కు వెళ్తారా?
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఆరోగ్యంగానే ఉన్నారు. దాదాపు 9 నెలల అనంతరం మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమ్మీదకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇన్నాళ్లపాటు పరిశీలనలో ఉన్న వీళ్లు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఐఎస్ఎస్ అనుభవాలతో పాటు.. వాళ్లు అక్కడ ఉన్న సమయంలో భూమ్మీద జరిగిన చర్చలు, ఆందోళనలు, విమర్శలు తదితర అంశాలపైనా స్పందించారు. అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్( Boeing Starliner) స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్ఎస్కు వెళ్తారా? అని ఫాక్స్ న్యూస్ జరిపిన ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు. అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(Sunita Williams) అన్నారు. అయితే స్టార్ లైనర్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టార్‌లైనర్‌లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కస్తామని పేర్కొన్నారు.నిర్లక్ష్యం వల్లే ఇరుక్కుపోయారనే విమర్శలకూ ఇద్దరూ స్పందించారు. తామెప్పుడు అలా భావించలేదని అన్నారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టే ఉద్దేశమూ తమకు లేదని అన్నారు. అనుకున్న ప్రకారం తాము భూమ్మీదకు రాలేకపోయామని.. ఒకరకంగా ఇరుక్కుపోయామనే భావించాల్సి ఉంటుందని, మరోరకంగా అక్కడ ఉండాల్సి వచ్చిందని.. అయినప్పటికీ తాము తీసుకున్న కఠోర శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం ఇచ్చిందని ఇద్దరూ అన్నారు. తమ మిషన్ విజయవంతం కావడంలో నాసా కృషిని, తాను సాధారణ స్థితికి రావడానికి సాయం చేసిన శిక్షకులకు సునీత ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్(Elon Musk)లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ వల్లే.. ఐఎస్ఎస్కు తీసుకెళ్లడం, అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా గడపడం, తిరిగి భూమిపైకి రావడంలో, అలాగే పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. భూమిపైకి వచ్చాక ఇప్పటికే తాను మూడు మైళ్లు పరుగెత్తానని సునీత అన్నారు. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో తమ టాస్క్‌ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని విల్మోర్ పేర్కొన్నారు.ఇక ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసని సునీతా విలియమ్స్ అన్నారు. అయితే తాము ఒక పెద్ద టీమ్ ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు. విల్మోర్ మాట్లాడుతూ.. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని అన్నారు. ఇక స్టార్‌లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకముందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు.Astronauts Butch Wilmore & Sunita Williams express their views, carefully, with deliberate wording. Positive rather than negative or unhelpful.#ButchWilmore #SunitaWilliams #Trump https://t.co/qTYEdAbUMN— I can see Ireland from here. Gerry (@gtp_58) March 31, 2025సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు ఇదే ప్రెస్మీట్లో పాల్గొన్న మరో వ్యోమగామి, క్రూ-9 కమాండర్ నిక్ హేగ్ మాట్లాడుతూ.. మిషన్ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనను తోసిపుచ్చారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం.. వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్‌లైనర్ కొన్నిరోజులకు భూమిపైకి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం.. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్‌లో వారు ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు సైతం వాహకనౌకలో వచ్చారు. దీంతో హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు వీళ్లను తరలించి పరిశీలనలో ఉంచారు. అనంతరం.. 12 రోజుల అనంతరం తొలిసారి ఇప్పుడు బయటి ప్రపంచం ముందుకు వచ్చారు.
National

గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. బెయిల్ కోసం హైకోర్టుకు రన్యారావు
బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసు(Gold Smuggling Case)లో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రన్యారావు (Ranya Rao) బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో ఆమెకు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ వారం లేదా వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆమె డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) కస్టడీలో ఉన్నారు.కాగా, రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్‌గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది.2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్‌కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది.

రేపు లోక్‌సభకు వక్ఫ్ బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్
ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లును రేపు(బుధవారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన తరుణంలో బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది ఆ పార్టీ అధిష్టానం. రేపు తప్పనిసరిగి బీజేపీ ఎంపీలంతా లోక్ సభలో ఉండాలంటూ విప్ జారీ చేసింది. అయితే ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి కిరణ్ రిజిజువక్ఫ్ సవరణ బిల్లును మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం మధ్యాహ్నం గం. 12.15 ని.లకు వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. దీనిపై ఎనిమిది గంటలపాటు చర్చ జరపనున్నారు ఎంపీలు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్ సభకు హాజరుకావాలని విప్ జారీ చేశారు. బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి.

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 13 మంది మృతి
బనస్కాంత:గుజరాత్‌లోని బనస్కాంతలోని అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. దీసాలోని జీఐడీసీ ప్రాంతంలోని ఒక బాణసంచా కర్మాగారంలో మంగళవారం ఉదయం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. బాయిలర్‌లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ప్రాథమికంగా ముగ్గురు మృతిచెందారని భావించారు. అయితే ఆ తరువాత మరో పది మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య 13కి చేరింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్యాక్టరీలోని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.అగ్నిమాపక సిబ్బంది(Fire fighters) సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ మాలి సహా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణంగా భవనంలోని కొంత భాగం కూలిపోయిందని ప్రవీణ్ మాలి తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాఫిక్ సిగ్నల్‌లో భార్య రీల్స్ .. ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న భర్త
ఛండీఘడ్ : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ భార్య చేసిన అత్యుత్సాహం భర్త కొంప ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. దీంతో భర్త లబోదిబో మంటూ మళ్లీ తనని విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ హర్యానా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. అందుకే సమయం ఎప్పుడైనా, సందర్భం ఏదైనా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఆ సాంగ్ పాడటం లేదంటే, డ్యాన్స్‌లతో అదరగొట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.ఈ తరుణంలో మార్చి 20న సాయంత్రం 4:30 గంటల సమయంలో జ్యోతి అనే మహిళ తన వదిన పూజతో కలిసి స్థానికంగా ఉండే దేవాలయానికి వెళ్లింది. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఛండీఘడ్ సెక్టార్-20 గురుద్వారా చౌక్ సిగ్నల్‌లో జ్యోతి అత్యుత్సాహం ప్రదర్శించింది. తన వదిన పూజ సాయంతో హర్యాన్వీ ఫోక్‌సాంగ్‌కు డ్యాన్స్ వేసింది. తన వదిన వీడియో తీస్తే ఆమె డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగచక్కెర్లు కొట్టాయి.चंडीगढ़: पुलिसकर्मी की पत्नी ने ज़ेबरा क्रॉसिंग पर बनाई रील, ट्रैफिक नियमों की उड़ाई धज्जियां; रोड पर लगा जाम महिला के खिलाफ पुलिस ने FIR दर्ज की, हालांकि थाने में ही बेल दे दी गई. मामला सेक्टर-20 में गुरुद्वारा चौक के पास का है.#Chandigarh pic.twitter.com/l2j4fTYFGv— Ishani K (@IshaniKrishnaa) March 27, 2025 ఈ వీడియో వైరల్ కావడంతో, హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షించింది. సీసీటీవీ ఫుటేజీల్లో ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద డ్యాన్స్ చేసిన జ్యోతిపై, వీడియో తీసిన పూజపై బీఎన్ఎస్ సెక్షన్ 125, 292 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.సెక్టార్ 19 పోలీస్ స్టేషన్లో సీనియర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి భర్త అజయ్ కుందును పదవి నుండి సస్పెండ్ చేశారు. ఎందుకంటే భార్య డ్యాన్స్ వీడియోను అజయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంపై అతనిపై చర్యలు తీసుకున్నారు. కేసులు నమోదు కావడంతో జ్యోతి,పూజలు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
NRI

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది
క్రైమ్

ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
సాక్షి, అనకాపల్లి: పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బాలిక వేపాడ దివ్య (7) హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ అనకాపల్లి జిల్లా చోడవరం అదనపు జిల్లా న్యాయమూర్తి రత్నకుమారి మంగళవారం తీర్పుచెప్పారు. బాధితుల తరఫున పీపీ ఉగ్గిన వెంకట్రావ్ వాదించారు. వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలోని గొల్లపేట వీధిలో హోటల్ నిర్వహించేవారు. వారి ఒక్కగానొక్క కుమార్తె దివ్య (7) స్థానిక ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుకుంటోంది.హోటల్లో పనిచేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారిని పనికి కుదుర్చుకున్నారు. సుబ్బాచారి పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనను ధనలక్ష్మి, మురుగన్ దంపతులు పనిలో నుంచి తొలగించారు. దీంతో వారిపై సుబ్బాచారి కక్షగట్టాడు. 2015లో డిసెంబర్ 23న స్కూల్‌కు వెళ్లి వచ్చిన దివ్య సాయంత్రం నుంచి కనిపించడంలేదని తల్లిదండ్రులు దేవరాపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరి మీదన్నా అనుమానం ఉందా అని మురుగన్ దంపతులను అడగ్గా సుబ్బాచారిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. 2015 డిసెంబర్ 24న బిళ్లాల మెట్ట వద్ద ఓ బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు చెప్పారు. మృతదేహంపై కత్తితో కోసిన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికను దివ్యగా గుర్తించి, సుబ్బాచారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దివ్యను తానే హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకొన్నాడు. బీరు సీసాతో పీక కోసి హత్య.. 23న దివ్య చదువుకుంటున్న ఉషోదయ స్కూల్ దగ్గరికి వెళ్లి, ఆమెకు రూ.20 ఇచ్చి గారెలు కొనుక్కోమన్నానని, అక్కడ నుంచి దివ్యను రైవాడ జలాశయం సమీపంలోని బిళ్లలమెట్ట కొండ వద్దకు తీసుకువెళ్లి పగలకొట్టిన బీరు సీసాతో పీక కోసి హత్య చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. నిందితుడిపై గతంలో ఒంగోలులో వాహన దొంగతనం కేసు కూడా ఉంది. హత్య కేసును విచారణ జరిపిన చోడవరం 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి బాలిక హత్యకు కారణమైన నిందితుడిని సెక్షన్ 302 ఐపీసీ ప్రకారం దోషిగా నిర్థారిస్తూ పైవిధంగా శిక్ష విధించారు.

కొలిక్కి చేరని ‘క్లింటన్’ కేసు!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జర్మన్ యువతిపై జరిగిన అఘాయిత్యం రాజధానిలో తీవ్ర కలకలం సృష్టించింది. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బంజారాహిల్స్‌లో ఓ విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది. అమెరికా నుంచి వచ్చి, బేగంపేటలోని క్లింటన్ ఫౌండేషన్‌లో న్యూట్రీషన్‌గా పనిచేసిన బాధితురాలిపై 2010 జూలై 7న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనంగా మారడంతో ఏకంగా రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా నిందితుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. తుపాకీ చూపించి అత్యాచారం...అమెరికాకు చెందిన సదరు యువతి (అప్పట్లో 25 ఏళ్లు) ఉద్యోగ నిమిత్తం 2009లో నగరానికి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్డు నెం. 11లోని ఓ ఇంటి పెంట్‌హౌజ్‌లో ఏడాదిన్నర పాటు నివసించింది. ఎప్పటిలాగే తన విధులు ముగించుకుని 2010 జూలై 6 రాత్రి 8 గంటలకు తన ఇంటికి చేరుకుంది. తలుపులు లోపల నుంచి తాళం వేసుకుని నిద్రించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ల వయసున్న యువకుడు కిటికీ గ్రిల్ తొలగించి లోపలకు ప్రవేశించాడు. బెడ్రూమ్లోకి వెళ్లి రివాల్వర్ చూపిస్తూ అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఉదయం బాధితురాలు నేరుగా ఆస్పత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తెలిసిన వారిగా ఆధారాలు లభించినా...ఈ కేసు దర్యాప్తు కోసం నాటి పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఘాతుకం జరిగిన రోజు యువతి అల్మారాలో రూ.5 లక్షలు ఉన్నాయి. ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు తొలుత ఆ డబ్బు గురించే అడిగాడు. దీంతో ఆమెకు తెలిసిన వ్యక్తే ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఆ అమెరికన్ అప్పట్లో బేగంపేటలోని ఓ జిమ్‌కు వెళ్లేవారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా మెలిగే కొందరిని అనుమానించారు. క్లూస్ టీమ్ నిపుణులు ఘటనా స్థలి నుంచి 14 ఆధారాలు సేకరించారు. ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా... కేసు మాత్రం కొలిక్కిరాలేదు. ఆ యువతి తన స్వదేశానికి వెళ్లిపోతూ ‘ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ హావ్ స్వీట్ మెమరీస్ ఇన్ హైదరాబాద్. బట్.. దిస్ ఇన్సిడెంట్ ఈజ్ ఎ బ్యాడ్ మెమరీ ఫర్ మీ’ (హైదరాబాద్‌లో కొంతకాలంగా ఎన్నో తీపి జ్ఞాపకాలు భద్రపర్చుకున్నా. ఈ దురదృష్టకర ఘటన చేదు గుర్తుగా మిగిలిపోయింది) అని పోలీసులతో అన్న మాటలు ఇప్పటికీ అధికారులను వెక్కిరిస్తూనే ఉన్నాయి.‘విదేశీ’ కేసులపై ప్రత్యేక చట్టం తేవాలి..విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులు దేశంలో తక్కువగానే నమోదవుతున్నాయి. అత్యాచారం వంటి ఉదంతాలు అరుదు. అనేక కేసుల్లో నిందితులు చిక్కుతున్నా.. ఈ కేసుల్లో శిక్షలు పడే శాతం మాత్రం దారుణంగా ఉంటోంది. బాధితులు తమ దేశాలకు వెళ్లిపోయిన తర్వాత కేసు విచారణను పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రతి కేసుకూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పెట్టడం సాధ్యం కాకపోవడంతో విచారణకు చాలా సమయం పడుతోంది. ఇవన్నీ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించి ప్రత్యేక చట్టం, కోర్టులు అమలులోకి తీసుకువస్తే ఈ పరిస్థితులు మారే అవకాశం ఉంది. – పి.రామకృష్ణ, మాజీ డీఎస్పీ

గోడు చెప్పుకోలేక..వినేవారులేక!
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రాష్ట్రానికి చెందిన ఓ మూగ, బధిర విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఎం. రాహుల్ చైతన్య (18) అనే యువకుడు తనువు చాలించాడు. పుట్టినరోజున తల్లికి మెసేజ్ పంపి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృతుడి స్వస్థలం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామం. ఇదే కళాశాలకు చెందిన కాట్రవత్ అఖిల్ (20) అనే మరో తెలంగాణ విద్యార్థి కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం రాత్రే మరణించడం గమనార్హం. తీవ్రంగా గాయపడిన రాహుల్‌ను సమీపంలోని ఎస్ఆర్ఎన్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ధూమన్‌గంజ్ ఏసీపీ అజేంద్ర యాదవ్ తెలిపారు. తమ కళాశాలలోని మూగ, బధిర విభాగంలో రాహుల్ చైతన్య బీటెక్ ఫస్టియర్‌లో చేరాడని అలహాబాద్ ట్రిపుల్ ఐటీ పీఆర్వో పంకజ్ మిశ్రా చెప్పారు. గత మూడు నెలలుగా అతను తరగతులకు హాజరుకావడం లేదని.. చదువుల సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు. ఈ ఒత్తిడి గురించి అతను తల్లికి కూడా తెలియజేశాడని వివరించారు. ఇద్దరు విద్యార్థుల మరణంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు యాజమాన్యం త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.

గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని.. యువతి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (27) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శృతి ఎంకాం పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. ఇటీవలే గ్రూప్–1, 2 పరీక్ష రాసినా మంచి ర్యాంక్ రాలేదు. వీటికితోడు శృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. మరోవైపు శృతి ఏడాదికాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకుందామంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి తల్లి రోజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. పండుగ కోసం వచ్చి.. ప్రాణాలు వదిలి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి సుల్తానాబాద్‌రూరల్ (పెద్దపల్లి): ఐతరాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పంగ నిఖిల్(26) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. పంగ భాస్కర్–పద్మ దంపతుల కుమారుడు నిఖిల్ హైదారాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోసమని ఈనెల 29న స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఐతరాజుపల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈక్రమంలో ప్రమాదవాశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
వీడియోలు


వర్మ రివెంజ్ రాజకీయం


KSR Comment: తమిళనాడులో జనసేన.. ఊసరవెల్లి సిగ్గుపడేలా పవన్ తీరు


వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్


మయన్మార్ లో మళ్లీ భూకంపం


లక్నోపై పంజాబ్ గెలుపు


Big Question: సత్తా లేనప్పుడు పార్టీ పెట్టడం ఎందుకు పవన్


పోలీసులపై రెడ్ బుక్ జులుం


Big Question: పార్టీ పెట్టలేదు.. పవన్ తో పార్టీ పెట్టించారు


స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం


హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్న భూముల వ్యవహారం