Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

ugadi 2025 Celebrations At tadepalli ysrcp party office1
‘శ్రీకృష్ణదేవరాయలు లాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్‌ జగన్’

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. పండుగ సందర్భంగా పార్టీ నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఉగాది వేడుకల సందర్భంగా ప్రముఖ అవధాని నారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మళ్ళీ విజయ దుందుభి మోగిస్తారు. ఓడితే చాలా మంది భయపడతారు. కానీ, వైఎస్‌ జగన్ అలా బయటపడలేదు. మిథున రాశి వారికి ఈ ఏడాది మంచి జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. ఆవేశంలో ప్రజలు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. శ్రీ కృష్ణదేవరాయలులాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్‌ జగన్. సాంఘికంగా ఔన్నత్యాన్ని పొందుతారు. ముఖ్యమంత్రి కుర్చీలో మళ్ళీ తిరిగి వైఎస్‌ జగన్ కూర్చుంటారు’ అని చెప్పుకొచ్చారు.ఇక, ఉగాది వేడుకల్లో పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Donald Trumps warning to Iran on nuclear deal2
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్‌

వాషింగ్టన్: ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ న్యూక్లియర్ డీల్(అణు ఒప్పందం) కు ఇరాన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందానికి దూరంగా ఉంటే మాత్రం అమెరికా బాంబు రుచి చూపిస్తామని ట్రంప్ ఘాటుగా స్పందిచారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల క్రితం మీకు చేతనైంది చేసుకోండి అంటూ ట్రంప్ కు వీడియో సందేశాన్ని పంపిన ఇరాన్ కు మరోసారి అల్టిమేటం జారీ చేశారు. తాను నాలుగేళ్ల క్రితం ఏదైతే చేశానో దాన్ని ఇరాన్ మళ్లీ రుచి చూడాల్సి వస్తుందన్నారు.మీ ఇష్టమొచ్చింది చేసుకోండి.. ఇరాన్‌ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని కొన్ని రోజుల క్రితం ఆహ్వానించారు ట్రంప్‌. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్‌ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్‌ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అయితే అణు ఒప్పందం అనేది కేవలం అమెరికాతో సరిపోదనేది ఇరాన్ వాదన.2018లో ఇరాన్ తో ఒప్పందం రద్దుట్రంప్ తన మొదటి 2017-21 పదవీకాలంలో అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా రద్దు చేశారు. 2018 ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ట్రంప్.కేవలం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు కాబట్టి దాన్ని ట్రంప్ రద్దు చేశారు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్‌)తో పాటు జర్మనీ, యూరప్‌ యూనియన్‌(ఈయూ)లు, ఇటు ఇరాన్‌ సంతకాలు చేయడంతో అమెరికా వైదొలిగింది.ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్‌లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్‌ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్‌ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. మరి ఇప్పుడు ట్రంప్‌ చేస్తున్న హెచ్చరికలకు ఏమాత్రం బెదరని ఇరాన్‌.. ఎలా స్పందిస్తుందో అనే దానిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇరాన్‌ దిగి వచ్చి.. అమెరికాతో అణుఒప్పందాన్ని చేసుకుటుందా.. లేక ‘సైనిక చర్యలకు సిద్ధంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.

IPL 2025: Chennai super kings vs Rajasthan royals live updates and highlights3
సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌.. ర‌వీంద్ర ఔట్‌

CSK vs RR live updates and highlights: ఐపీఎల్‌-2025లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి.దూకుడుగా ఆడుతున్న రుతురాజ్‌..6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే వికెట్ న‌ష్టానికి 40 ప‌రుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(20), రాహుల్ త్రిపాఠి(21) ఉన్నారు.సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌.. ర‌వీంద్ర ఔట్‌183 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ర‌చిన్ ర‌వీంద్ర‌.. ఆర్చ‌ర్ బౌలింగ్‌లో ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వ‌చ్చాడు.నితీష్ రాణా సూప‌ర్ హాఫ్ సెంచ‌రీ.. సీఎస్‌కే టార్గెట్ ఎంతంటే?గౌహ‌తి వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 81) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో పాటు కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌(37), శాంస‌న్‌(20) ప‌రుగుల‌తో రాణించారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఖాలీల్ అహ్మ‌ద్‌, ప‌తిరాన, నూర్ ఆహ్మ‌ద్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. జ‌డేజా, అశ్విన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.రాజ‌స్తాన్ ఆరో వికెట్ డౌన్‌..రియాన్ ప‌రాగ్ రూపంలో రాజ‌స్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 37 ప‌రుగులు చేసిన ప‌రాగ్‌.. ప‌తిరాన బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 18 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ 6 వికెట్లు కోల్పోయి 166 ప‌రుగులు చేసింది.రాజ‌స్తాన్ నాలుగో వికెట్ డౌన్‌.. జురెల్ ఔట్‌ధ్రువ్ జురెల్ రూపంలో రాజ‌స్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 ప‌రుగులు చేసిన జురెల్‌.. నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.రాజ‌స్తాన్ మూడో వికెట్ డౌన్‌..నితీష్ రాణా రూపంలో రాజ‌స్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడిన రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 81).. అశ్విన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 12 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ స్కోర్‌: 129/3రాజ‌స్తాన్ రెండో వికెట్ డౌన్‌.. శాంస‌న్ ఔట్‌సంజూ శాంస‌న్ రూపంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 ప‌రుగులు చేసిన శాంస‌న్‌.. నూర్ ఆహ్మ‌ద్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి కెప్టెన్ ప‌రాగ్ వ‌చ్చాడు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్‌.. రెండు వికెట్ల న‌ష్టానికి 87 ప‌రుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(61), రియాన్ ప‌రాగ్‌(1) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రాణా..5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వికెట్ న‌ష్టానికి 64 ప‌రుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(44), సంజూ శాంస‌న్‌(15) ఉన్నారు.రాయ‌ల్స్ తొలి వికెట్ డౌన్‌..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 ప‌రుగులు చేసిన య‌శ‌స్వి జైశ్వాల్‌.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. సామ్ కుర్రాన్‌, దీప‌క్ హుడా స్ధానాల్లో ఓవ‌ర్ట‌న్‌, విజ‌య్ శంక‌ర్ వ‌చ్చారు. రాయ‌ల్స్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పు చేయ‌లేదు.తుది జ‌ట్లుచెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), విజయ్ శంకర్, జామీ ఓవర్‌టన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణరాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ

CM Chandrababu Naidu P4 Meeting Turns into a Major Flop4
పీ-4 ప్రారంభోత్సవం అట్టర్‌ ప్లాప్‌.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం

సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు నిర్వహించిన పీ-4 లాంఛింగ్‌ సభ అట్టర్‌ ప్లాపయ్యింది. ప్రారంభ సభకు టీడీపీ నాయకులు బస్సుల్లో జనాల్ని రప్పించారు. అయినా సరే మీటింగ్‌ జరుగుతుండగా జనం మధ్యలోనే వెళ్లిపోయారు.సమావేశం మధ్యలోనే జనం వెళ్లిపోవడంతో చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడుగు బలహీన వర్గాలను అవమానిస్తూ మాట్లాడారు. ఇలాంటి బడుగుల,బలహీనుల ఆలోచనలు పూట వరకే. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు. సగం మంది వెళ్లిపోయారు. వాళ్ల ఆలోచన వచ్చాం. మీటింగ్‌ అయ్యింది. మా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మన ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నా. మార్గదర్శకులకు ఓపిక ఉంది ... కానీ బంగారు కుటుంబాలకు ఓపిక లేదు’అని వ్యాఖ్యానించారు. అయితే, సీఎం వ్యాఖ్యల పట్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CM Revanth Reddy On Fine Rice Distribution Scheme5
ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్‌

సూర్యాపేట జిల్లా: శ్రీమంతుడు తినే సన్నబియ్యం పేదవాడు తినాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ సభలో సన్నబియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం.. అనంతరం మాట్లాడారు. ఈ సన్న బియ్యం పథకం మామూలు పథకం కాదన్నారు. సాయుధ రైతాంగం, ఇందిరా గాంధీ రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత అంతటి గొప్ప పథకం సన్నబియ్యం పథకమన్నారు. ఉగాది నాడు పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..‘నల్లగొండ‌ ప్రాంతం చైతన్యానికి మారుపేరు. 25 లక్షల ఎకరాల భూములను ఇందిరా గాంధీ పేదలకు పంచిపెట్టింది ఇప్పటికీ ఇళ్లలో దేవుడు ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టుకుంటున్నారు. రూ. 1.90 కే బియ్యం పథకం తీసుకొచ్చారు. 1957 లోనే నెహ్రూ హయాంలో పీడీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం 21 వేల కోట్ల ధాన్యాన్ని మిల్లర్లకి కట్టబెట్టారు. మిల్లర్లు పీడీఎస్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్నారు. 10 వేల కోట్ల రూపాయల దొడ్డుబియ్యం మిల్లర్లు, దళారుల చేతుల్లోకి వెళ్తోంది. ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యంఅందుకే సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టి ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోలు ఇవ్వాలని ఆలోచన చేశాం. దేశంలోనే తొలిసారి సన్నబియ్యం ఇస్తున్నాం. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి పదేళ్లు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని బెదిరించిండు. ఆయన ఫాంహౌస్ లో వెయ్యి ఎకరాల్లో వరి వేశాడు. ఆ ధాన్యాన్ని 4500 రూపాయలకు క్వింటాల్ చొప్పున కావేరి సీడ్స్ కొనుగోలు చేసింది. సన్నధాన్యం పండిస్తే క్వింటాల్ కి ఐదు వందలు బోనస్ ఇస్తున్నాం. అత్యధికంగా సన్నధాన్యం పండించేది నల్లగొండ రైతులే. అత్యధికంగా రైతు రుణమాఫీ పొందింది నల్లగొండ రైతులేఈ పథకం రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయడుసన్నబియ్యం పథకం రద్దు చేసే ధైర్యం భవిష్యత్తులో ఏ సీఎం చేయడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పదేళ్లు కేసీఆర్ పట్టించుకోలేదు. సంవత్సరానికి కిలోమీటర్ చొప్పున తవ్వినా టన్నెల్ పూర్తయి 3.30 లక్షల ఎకరాలకు నీరు అందేది. నల్లగొండ జిల్లా ప్రజలపై కోపంతోనే టన్నెల్ ను పూర్తి చేయలేదు. ఉత్తమ్ నాయకత్వంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలో కుప్పకూలింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎనిమిదో వింత కాదు. ప్రపంచంలో ఏకైక వింత. మూడేళ్లలో లక్ష కోట్లు మింగినందుకు మిమ్మల్ని ఉరేసినా తప్పులేదు. కాళేశ్వరం కుప్పకూలిపోయినా 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించాం. మా ఆలోచనలో లోపం లేదు. ప్రజా సేవ చేయడానికే నేను వచ్చా . 2006 లో జెడ్పీటీసీ గా రాజకీయం మొదలుపెట్టి ఈనాడు సీఎంగా ఉన్నా. శకునం పలికే బల్లి కుడితిలో పడినట్లు అయింది బీఆర్ఎస్ పరిస్థితి. నాకు కేసీఆర్ కు నందికి పందికి ఉన్న పోలిక ఉందినాకు కేసీఆర్‌తో పోలిక ఏంటి?నాతో నీకు పోలిక ఏంటి కేసీఆర్. పదేళ్లలో కేసీఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 20 వేల కోట్ల రుణమాఫీ చేశాం . కేసీఆర్ ఎగ్గొట్టిన 7625 కోట్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వేశాం త్వరలోనే రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇస్తాం. రైతు భరోసా కింద ఏడాదికి‌ 20 వేల కోట్లి పంపిణీ చేస్తాం. ఇవ్వాల్టికి రుణమాఫీ, రైతు భరోసా మొత్తం 33 వేల కోట్లు రైతులకు చెల్లించాంపదేళ్లలో తెలంగాణను నంబర్‌ వన్‌ చేస్తారైతుల గుండెళ్లో ఇందిర, సోనియా పేరు శాశ్వతంగా ఉండేలా చేశాం. గతంలో క్వింటాల్ కు పది కిలోల ధాన్యం తరుగు తీసేవారు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. హుజూర్ నగర్ కు అగ్రికల్చర్ కాలేజ్ ఇస్తాం. మిర్యాలగూడ, దేవరకొండ కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తాం. కాళ్లల్లో కట్టెబెట్టి పడేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. వాళ్ల కళ్లలో కారం కొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లలో దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా ఉండేలా చూస్తా’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

Vinay Hiremath Sold His Startup And Now He Studying Physics6
రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడు

కేవలం 33 సంవత్సరాల వయసులోనే.. 'వినయ్ హిరేమత్' (Vinay Hiremath).. లూమ్ కంపెనీ స్థాపించి, దానిని అట్లాసియన్‌ (Atlassian)కు సుమారు 975 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8092.5 కోట్లు)కు విక్రయించారు. ఆ తరువాత ''నేను ధనవంతుడిని.. నా జీవితాన్ని ఏమి చేయాలో తెలియడం లేదు'' అనే శీర్షికతో తన భావాలను పంచుకున్నారు. ఇప్పుడు అతడే రోజుకు 5 నుంచి 8 గంటలు ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) చదువుతూ.. ఇంటర్న్‌షిప్‌ల కోసం చూస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.వినయ్ హిరేమత్ ఇప్పుడు మరొక స్టార్టప్‌ను ప్రారంభించడానికి బదులుగా, భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో తన సమయాన్ని పూర్తిగా గడుపుతున్నారు. పాడ్‌కాస్ట్ హోస్ట్ సామ్ పార్ ప్రకారం.. హిరేమత్ రోజుకు 5-8 గంటలు భౌతిక శాస్త్రాన్ని చదువుతున్నాడు, అంతే కాకుండా 18 ఏళ్ల వయస్సు గల డిస్కార్డ్ గ్రూపులలో తిరుగుతున్నాడు. మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ కావాలని చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లూమ్‌ను విక్రయించిన తర్వాత అక్కడే ఉండాలా?, వద్దా?.. అనే దానితో హిరేమత్ కొంత సతమతమయ్యాడు. ఆ సమయంలోనే నేను ఆ కంపెనీలో పనిచేయడం సరైంది కాదని అనుకున్నాను. అయితే 60 మిలియన్ డాలర్ల (రూ. 500 కోట్ల కంటే ఎక్కువ) ప్యాకేజీని వదులుకోవడం కష్టంగానే అనిపించిందని గత మార్చిలోనే పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?లూమ్‌ను విడిచిపెట్టిన కొన్ని రోజులకే.. హిరేమత్ పెట్టుబడిదారులను, రోబోటిక్స్ నిపుణులను కలిసి, రోబోటిక్స్ కంపెనీని ప్రారంభించాలని భావించాడు. కానీ అది సాధ్యం కాదని తొందరగానే గ్రహించాను. నేను నిజంగా కోరుకునేది ఎలాన్ మస్క్ మాదిరిగా కనిపించడమేనని నాకు అర్థమైంది. కానీ అది చాలా భయంకరంగా ఉంది. క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌పై మస్క్, వివేక్ రామస్వామితో కలిసి నాలుగు వారాలు పనిచేసాను. ఆ అనుభవాలు వ్యాపార ఆవశ్యకతపై అవగాహనను మరింత పటిష్టం చేశాయి.ప్రస్తుతం.. హిరేమత్ మరొక స్టార్టప్‌ను ప్రారంభించడం కంటే నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ చేయాలనుకుంటున్నాను. దీంతో నేను ఏమి చేయాలో నాకు నిజంగా తెలియదని అన్నాడు. ఇప్పుడు ఏదైనా స్టార్టప్‌ స్టార్ట్ చేయడానికంటే.. చదువుకోవాలి అని నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది.The co-founder of Loom sold his biz for ~$1B, made $50-70M personally, then walked away from an extra $60MHe has “no income right now” and is “looking for internships”...@vhmth has a wild post-exit story. we talked about it on Moneywise:-Turned down $60M in retention… pic.twitter.com/uTdS5blabz— Sam Parr (@thesamparr) March 25, 2025

Lamborghini Driver After Hitting 2 Workers On Noida Footpath7
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?

నోయిడా: కారును ర్యాష్ డ్రైవ్ చేయడమే కాదు.. ఫుట్ పాత్ పైకి ఎక్కించేశాడు లాంబోర్కిని కారును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్. అదే సమయంలో ఫుట్ పాత్ పై ఇద్దరు కార్మికులు పని చేస్తున్నారు. తలకు హెల్మెట్ పెట్టుకుని ఆరంజ్ జాకెట్లు తొడక్కుని పనిలో ఉన్నారు. ఇంతలో ఓ కారు అమాంతం ఫుట్ పాత్ పైకి వచ్చేసింది. దీంతో కొద్ది పాటి గాయాలతో తప్పించుకున్నారు ఇద్దరు కార్మికులు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పింది.అయితే కారు డ్రైవర్ ను పట్టుకుని నిలదీశాడు ఆ కార్మికుల్లో ఒకరు. రోడ్డుపై ఫుట్ పాత్ పై స్టంట్స్ ఏమైనా చేస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. అయితే దానికి ఆ డ్రైవర్ నుంచి ఎటకారంతో కూడిన సమాధానం వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారేంటి అంటూ బదులిచ్చాడు. దానికి ఆ కార్మికులకు కోపం చిర్రెత్తు కొచ్చింది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఆ డ్రైవర్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడేంటి.. నేను కారును ఫుట్ పాత్ పైకి ఎక్కించా.. ఎంతమంది చచ్చిపోయారంటూ హిందీలో మళ్లీ ప్రశ్నించాడు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు వచ్చిన వారు.. ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు కారును కూడా సీజ్ చేశారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 94లో నిర్మాణంలో ఉన్న ఒక కాంప్లెక్స్ పక్కన ఉన్న ఫుట్‌పాత్ వద్ద ఇది జరిగింది. అయితే ఈ ఇద్దరు కార్మికుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని, ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.A #Lamborghini, a fat bank account, and ZERO Humanity This #Noida brat mows down two labourers and casually asks—“Koi mar gaya idhar?” pic.twitter.com/TaUgdB769z— Smriti Sharma (@SmritiSharma_) March 30, 2025

Neha Kakkar Melbourne event organisers denies claim of mismanagement8
మెల్‌బోర్న్‌లో బాలీవుడ్‌ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?

బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ నేహా కక్కర్‌ ఇటీవల మెల్‌బోర్న్‌లో ఓ మ్యూజిక్‌ కన్సర్ట్‌కు హాజరైంది. అయితే తాను మూడు గంటలకు ఈవెంట్‌కు వెళ్లడంతో నిర్వాహకులు తమను పట్టించుకోలేదని విమర్శలు చేసింది. అంతేకాకుండా నా టీమ్‌తో పాటు తనకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని ఆరోపించింది. నా టీమ్‌కు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.అయితే తాజాగా సింగర్ నేహా కక్కర్‌ ఆరోపణలపై మ్యూజిక్ కన్సర్ట్‌ నిర్వాహకులు స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. నేహా కక్కర్ షోతో తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈవెంట్‌కు సంబంధించిన అన్ని రుజువులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె బృందానికి నిర్వాహకులు పెట్టిన ఖర్చులను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ఈవెంట్ వల్ల తామే అప్పుల్లో చిక్కుకున్నామని రాసుకొచ్చారు. ఆమెనే తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau)

HCU Students Protest Against Telangana Sarkar9
హెచ్‌సీయూ వద్ద మళ్లీ ఉద్రిక్తత

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్ సీయూ) భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థి లోకం ఆందోళన చేపట్టింది. భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ గత రాత్రి(శనివారం) నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో యూనివర్శిటీ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించి ఆందోళనను అణిచివేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు’(ఆదివారం) యూనివర్శిటీ పరిధిలోని పచ్చచెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పూనుకుంది. వర్శిటీ పక్కన ఉన్న భారీ స్థలంలో చెట్లను కొట్టివేస్తుండగా విద్యార్ధులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీ మెయిన్‌ గేటుకు తాళం వేశారు పోలీసులు. యూనివర్శిటీ ప్రాంగణంలో జేసీబీలతో చెట్లను కూల్చివేసి నేలను చదును చేసే యత్నం చేస్తున్నారు. విద్యార్థులు అరెస్టు..ఎస్‌ఎఫ్‌ఐ ఖండనఆందోళనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆందోళనను అణచివేసే క్రమంలో పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగుతున్నాయి. దీన్ని తెలంగాణ ఎస్ఎఫ్ఐ ఖండించింది. అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే అరెస్ట్‌ చేసిన విద్యార్థులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. HCU విద్యార్ధులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించండి. ఎక్కడ ఎడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం , నియంతృత్వం, అహంకారం తో వ్యవరిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి.@VP_Sanu @KTRBRS @TV9Telugu @NtvTeluguLive @ndtv @V6News @MayukhDuke pic.twitter.com/49WFvdScad— SFI Telangana (@TelanganaSfi) March 30, 2025 ఇదీ వివాదం.. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్‌సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్‌సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. చుట్టూ ఐటీ కారిడార్‌ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

UP Teen Barred From Taking Exam Over Rs 800 Dies10
రూ. 800 ఫీజు కట్టలేదని అవమానించారు.. బాలిక ఆత్మహత్య!

ఆ బాలిక చదివేది తొమ్మిదో తరగతి.. ఎగ్జామ్ టైమ్ వచ్చింది. కానీ ఆ బాలిక స్కూల్ ఫీజు రూ. 800 కట్టాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించక ఆ కొద్ది మొత్తాన్ని పరీక్షల నాటికి కట్టలేకపోయింది. ఇంకేముందే పరీక్షలు రాయడానికి స్కూల్ యాజమాన్యం అంగీకరించకపోగా, అవమానించింది. ఇది కూడా బహిరంగంగా ఆ అమ్మాయిని స్కూల్ యాజమాన్యం అవమానించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది.స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ దగ్గర్నుంచీ స్కూల్ మేనేజర్ సంతోష్ కుమార్, ఆఫీసర్ దీపక్ సరోజ్ లు ఆ బాలికను అవమానానికి గురి చేశారు. స్కూల్ పరీక్ష ఫీజు కట్టలేకపోయిందంటూ అవమానించారు. అంతేకాకుండా పరీక్షలకు అనుమతించేది లేదని చెప్పారు. ఇక చేసేది లేక అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది. లోపలకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆమె తల్లి పొలం పనికి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి విగత జీవిలా కనిపించింది.స్కూల్ ఫీజు కట్టలేదని ఆమెను పరీక్షకు అనుమతించడమే కాకుండా అవమానించడం దారణమని న్యాయవాది, స్థానిక పంచాయతీ సభ్యుడైన మొహ్మద్ అరిఫ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యాలు అవమానించాయంటే అది నేరం కిందకు వస్తుందన్నారు.తన కూతురు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. దీనిపై భారతీయ న్యాయ సన్నిహిత సెక్షన్ 107 కింద స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement