Top Stories
ప్రధాన వార్తలు

'పరీక్షల్లో' ప్రభుత్వం ఫెయిల్
సాక్షి, అమరావతి: ఇప్పటికే విద్యారంగ సంస్కరణలను నీరుగార్చి, చదువులను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు.. పరీక్షల వ్యవస్థను సైతం మూడు లీకులు.. ఆరు మాస్ కాపీయింగ్ల స్థాయికి దిగజార్చేసింది. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన నిర్వాకాలే దీనికి నిదర్శనం. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో కష్టపడి చదివిన విద్యార్థులు విద్యా వ్యవస్థపైనే నమ్మకం కోల్పోతున్నారని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. కనీసం ప్రశ్న పత్రాల ముద్రణ సరిగా ఉందో లేదో కూడా పరిశీలించకుండా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడుతున్నారు. కార్పొరేట్ కాలేజీల సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నా పత్రాన్ని మార్చేసిన ఘనత కూటమి సర్కారులోనే కనిపిస్తోందంటున్నారు. ఈ ఏడాది 10,58,893 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,49,884 మంది టెన్త్ విద్యార్థులు ప్రస్తుతం పరీక్షలు రాసున్నారు. ప్రభుత్వ నిర్వాకాలు వారి భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసేలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏ పరీక్ష అయినా పకడ్బందీగా నిర్వహించారని, ఏ ఒక్క చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 2022లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణ విద్యాసంస్థల నేతృత్వంలో పేపర్ లీక్‌కు జరిగిన యత్నాలను సమర్థంగా అడ్డుకుని కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా, రికార్డు వేగంతో నిర్వహించి భర్తీ చేసిందని ఉదహరిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మళ్లీ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.⇒ మార్చి 17 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసేలా మాస్ కాపీయింగ్ వ్యవహారాలు పలు చోట్ల వెలుగు చూశాయి. ఈనెల 21న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని ఏ, బీ కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్‌కు తెర తీశారు.లీకేజీలకు కేరాఫ్ బాబు పాలనటీడీపీ అధికారంలో ఉండగా 1995లో పదో తరగతి ప్రశ్నపత్రం, 1997లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీకై విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2017లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఉన్న నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. 2019లో కూడా చంద్రబాబు పాలనలో కర్నూలులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తాజాగా వైఎస్సార్ జిల్లాలో పదో తరగతి పేపర్ లీకైంది.పదవతరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల అరెస్ట్, వివరాలను తెలియజేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు టెన్త్ పేపర్ లీక్... 9 మంది అరెస్టుపదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు సంబంధించి వైఎస్సార్ జిల్లా పోలీసులు బుధవారం 9 మందిని ఖాజీపేట మండలం ఏటూరు గ్రామం అల్లాడుపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. వల్లూరు జడ్పీ హైసూ్కల్ కేంద్రంలో ప్రశ్నా పత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేసి చిట్టీలు తయారు చేశారు. వాటర్ బాయ్ సాయి మహేష్ షేర్ చేసేందుకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. కమలాపురం వివేకానంద ప్రైవేట్ స్కూల్ టీచర్ విఘ్నేష్‌రెడ్డి అలియాస్ విఘ్నేష్, కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డి, మాథమేటిక్స్ టీచర్ శ్రీకాంత్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ గెస్ట్ టీచర్ శ్రావణి, టీచర్ మధుయాదవ్, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెంటెండ్ ఎం.రామకృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాసరెడ్డి, ఇన్విజిలేటర్ ఎం.రమణ వీరిలో ఉన్నారు. ప్రశ్నాపత్రం లీక్‌పై డీఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇక్కడ విద్యార్థులకు స్లిప్పులు అందించడం.. పుస్తకాలు ముందుంచి జవాబులు రాస్తూ ఉపాధ్యాయులు పట్టుబడ్డ వ్యవహారం బట్టబయలైంది. దీంతో 11 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు హెచ్ఎంలు, రికార్డు అసిస్టెంట్ సహా మొత్తం 15 మందిని సస్పెండ్ చేశారు. ⇒ వైఎస్సార్ జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నపత్రం లీక్ చేసి వాట్సాప్‌లో తిప్పారు. ఈనెల 24న ఇక్కడ పదో తరగతి లెక్కల పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా కొద్దిసేపటికే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు. స్కూల్లో ఓ వాటర్ బాయ్ విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని వాట్సాప్ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పని చేస్తున్న వ్యక్తికి పంపినట్లు తేలింది. నిషిద్ధ ప్రాంతంలో వాటర్ బాయ్ వద్ద స్మార్ట్ ఫోన్ లభించడం విస్మయం కలిగిస్తోంది. ఉత్తీర్ణత పెరగాలంటూ ఒత్తిళ్లు..విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అస్తవ్యస్థ నిర్ణయాలతో చదువులను నీరుగార్చిన ప్రభుత్వం పరీక్షల్లో మాత్రం అత్యధికంగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ ఉపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలిచ్చింది. ఒకపక్క ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో జూన్‌లో ప్రక్రియ ప్రారంభించి అక్టోబర్ వరకు సాగదీసింది. అయినా నూరు శాతం పూర్తి చేయలేదు. మరోపక్క ‘అర్జెంట్ రిపోర్టు’ పేరుతో రోజూ మెస్సేజులు పంపుతూ బోధనను గాలికొదిలేసింది. తీరా పరీక్షల నాటికి ఫలితాల కోసం ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పెట్టారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటూ టీచర్ల మెడపై కత్తి వేలాడదీసింది! మీరు ఏం చేసినా సరే.. గతంలో కంటే ఎక్కువగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ హెచ్చరించింది. తన గొప్పల కోసం పాస్ శాతం పెరగాలని విద్యాశాఖ మంత్రి ఆదేశిస్తుండగా.. ఆయన వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారులు మరో ముందడుగు వేసి ఆయా సబ్జెక్టుల్లో పర్సంటేజ్ పెరగకుంటే నోటీసులు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని స్లిప్పులు రాసే స్థితికి దిగజార్చారు. ఇంటర్ పేపర్లో తప్పులు.. ⇒ మార్చి 5న జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పేపర్లో ముద్రణ తప్పులు రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం సృష్టించడంతో విద్యార్థులు 25 నిమిషాల సమయాన్ని కోల్పోయారు. 8వ ప్రశ్న కింద ‘అడ్వర్టైజ్మెంట్ చదివి సమాధానాలు రాయాలని ఒక్క మార్కు ప్రశ్నలు ఐదు ఇచ్చారు. అయితే ప్రశ్నలో ఏముందో గుర్తించలేని రీతిలో ముద్రించారు. ఈ విషయాన్ని నెల్లూరులో గుర్తించి ఉన్నతాధికారులకు చేరవేసి సరిదిద్దేసరికి గంట సమయం గడిచిపోయింది. దీంతో కొన్ని చోట్ల బోర్డుపై రాయగా మరికొన్ని చోట్ల ప్రశ్నపత్రంలోని అంశాలను ఇని్వజిలేటర్లు విద్యార్థులకు చదివి వినిపించారు. 13వ ప్రశ్న కూడా గందరగోళంగా ముద్రించడంతో విద్యార్థులు మొత్తం పది మార్కులు నష్టపోయిన పరిస్థితి నెలకొంది. ⇒ 15వ తేదీన సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్లో 14వ ప్రశ్న అకడమిక్ సిలబస్ నుంచి ఇవ్వగా విద్యార్థులు జవాబులు రాశారు. తీరా గంట గడిచిన తర్వాత ప్రశ్నలో తప్పుందంటూ మార్పు చేశారు. ఓ కార్పొరేట్ కాలేజీ ముద్రించుకున్న సిలబస్‌కు అనుగుణంగా దీన్ని మార్చినట్లు తెలిసింది. ⇒ మార్చి 11న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి పరిధిలోని పెనుమాక జూనియర్ కాలేజీలో ఓ ప్రైవేట్ కాలేజీకి మేలు చేసేలా మాస్ కాపీయింగ్ జరిగింది. 180 మంది విద్యార్థులకు ఇక్కడ సెంటర్ కేటాయించారు. ఇంటర్ రెండో ఏడాది గణితం, జువాలజీ, చరిత్ర పరీక్షలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఇక్కడ మాస్ కాపీయింగ్ ప్రారంభమైంది. ఈ ఘటన తాడేపల్లిలోని మంత్రి నివాసానికి కూతవేటు దూరంలో చోటు చేసుకోవడంతో రహస్యంగా ఉంచారు. సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, ఇని్వజిలేటర్లను మార్చి చేతులు దులుపుకొన్నారు. ⇒ ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు అరగంట ఆలస్యంగా పేపర్ ఇవ్వగా ఎలాంటి అదనపు సమయం ఇవ్వకుండా నిర్దిష్ట సమయానికే తిరిగి తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు దీన్ని ఇంటర్ అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. సెల్ఫ్ సెంటర్లు...నిబంధనల ప్రకారం విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్ష సెంటర్ కేటాయించకూడదు. కానీ ఈ దఫా ఇంటర్ పరీక్షల్లో 1,535 సెంటర్లలో దాదాపు 300 సెల్ఫ్ సెంటర్లే ఉన్నాయి. పదో తరగతి పరీక్షలకు సైతం 800కిపైగా సెల్ఫ్ సెంటర్లే ఉండటం, వీటిలో అత్యధికం కార్పొరేట్ స్కూళ్లే కావడం గమనార్హం.

ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్ పదవి, విప్ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్‌లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్‌బుక్ వాళ్లే రాశారు. రూల్‌బుక్ కూడా మారలేదు కదా. ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్‌రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.త్రయోదశి రా.9.08 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: శతభిషం రా.11.00 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: ఉ.6.51 నుండి 8.23 వరకు, తదుపరి తె.5.55 నుండి 6.33 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.10.06 నుండి 10.54 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: ప.3.56 నుండి 5.31 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.15, సూర్యాస్తమయం: 6.05. మేషం... ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.వృషభం.... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహన, వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహం.మిథునం.... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.కర్కాటకం... రాబడికి మించి ఖర్చులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.సింహం... చిన్ననాటి మిత్రులతో సఖ్యత. బంధువులను కలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.కన్య.... కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.తుల.... ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృశ్చికం... కుటుంబంలో చికాకులు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.ధనుస్సు.... నూతన వ్యక్తుల పరిచయాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త పనులకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.మకరం.... మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కుంభం... నూతన ఒప్పందాలు. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.మీనం... శ్రమ మరింత పెరుగుతుంది. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్లొన్నారు. ‘‘ఈద్ ముబారక్’’ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. విజయవాడలో బుధవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ మంత్రులు అంజాద్ బాషా, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, పార్టీ నేతలు పూనూరు గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపం వద్ద జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఉప్పొంగిన అభిమానంవిజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్‌కు ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఎన్ఏసీ కళ్యాణ మండపం ఉండే గురునానక్ కాలనీ రోడ్డు, వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. వైఎస్ జగన్ అభివాదం చేయగానే సీఎం, సీఎం నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై జగన్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

ఓటింగ్‌పై ట్రంప్‌కార్డు
న్యూయార్క్: అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాలో ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తెచ్చే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో సమూల సంస్కరణలు తెస్తూ బుధవారం మరో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇన్నాళ్లూ స్వీయప్రకటిత పత్రాన్ని సమర్పించి ఓటింగ్ కేంద్రంలో పౌరులు ఓటేస్తుండగా ఇకపై ఏదైనా అదీకృత గుర్తింపు పత్రం/కార్డును చూపించి అమెరికా పౌరుడిగా నిరూపించుకున్నాకే ఓటేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ తెగేసి చెప్పారు. దీంతో పెళ్లయ్యాక ఇంటి పేరు మారిన, సరైన డ్రైవింగ్ లైసెన్స్, కొత్త పాస్పోర్ట్లేని అమెరికా పౌరులకు ఓటింగ్ కష్టాలు మొదలుకానున్నాయి. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఇప్పటికే ‘ఓటింగ్ కేంద్రం వద్ద గుర్తింపు కార్డు’ విధానాన్ని అవలంబిస్తుండగా ట్రంప్ సైతం అమెరికాను ఇదే బాటలో పయనింపజేయాలని నిశ్చయించుకున్నారు. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలున్న నేపథ్యంలో ఆలోపే ఎన్నికల సంస్కరణలను అమల్లోకి తేవాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకంచేశారు. అయితే ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకే ఉండటంతో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏ మేరకు సమగ్రస్థాయిలో అమలవుతుందో తేలాల్సి ఉంది. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వును కొన్ని రాష్ట్రాలు కోర్టుల్లో సవాల్‌చేసే అవకాశం ఉంది. గుర్తింపు కార్డు తప్పనిసరి ఇన్నాళ్లూ ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు ఓటేసేటప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేసి తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి భారత్‌లో మాదిరి ఏదైనా గుర్తింపు కార్డును చూపిస్తేనే ఓటేసేందుకు అనుమతించాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. పాస్ట్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ వంటి అ«దీకృత గుర్తింపు పత్రం/కార్డును ఓటింగ్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వాళ్లను బహిష్కరిస్తూ, స్వదేశాలకు తరలిస్తూ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను అధికార రిపబ్లికన్ పార్టీ స్వాగతిస్తోంది. దీంతో నాన్–అమెరికన్లలో రిపబ్లికన్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది. వీరిలో ఓటేసే అవకాశమున్న వాళ్లు విపక్ష డెమొక్రటిక్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల గెలుపు అవకాశాలను దెబ్బతీసేందుకు, నాన్–అమెరికన్లు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. పౌరులుకాని వ్యక్తులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు, తొలుత వారిని గుర్తించేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, స్టేట్ డిపార్ట్మెంట్లు అన్ని రాష్ట్రాల అధికారులకు ఈ జాబితాను అందజేయనున్నాయి. వ్యతిరేకిస్తున్న హక్కుల సంఘాలు గుర్తింపు కార్డు ఉంటేనే ఓటేసేందుకు అనుమతిస్తామనడం ఓటింగ్ హక్కును కాలరాయడమేనని ఓటింగ్ హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ‘‘ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమలుచేస్తే ఓటర్ల జాబితాలోని నాన్–సిటిజన్లు కొద్దిమంది మాత్రమే ఓటింగ్‌ను కోల్పోరు. సరైన పత్రాలు లేని లక్షలాది మంది అమెరికా పౌరులు సైతం తమ ఓటు హక్కుకు దూరమవుతారు. ఇది ఓటింగ్ శాతంపై పెను ప్రభావం చూపుతుంది. గెలుపుపైనా ప్రభావం పడొచ్చు’’ అని లాస్ఏంజెలెస్లోని కాలిఫోరి్నయా యూనివర్సిటీలో ఎన్నికల చట్టాల నిపుణుడు రిచర్డ్ హేసన్ అభిప్రాయపడ్డారు. ‘‘మహిళల బర్త్ సర్టిఫికెట్లో అసలైన పేరు ఉంటుంది. పెళ్లయ్యాక లాస్ట్‌నేమ్ మారుతుంది. పెళ్లయ్యాక తీసుకున్న పత్రాలు, బర్త్ సర్టిఫికెట్ ఒకలా ఉండవు. ఇలాంటి వాళ్లు ఓటేయడ కష్టమే’’ అని ఆయన ఉదహరించారు. 14.6 కోట్ల మందికి పాస్‌పోర్ట్ లేదు పబ్లిక్ సిటిజన్ అనే సంస్థ గణాంకాల ప్రకారం అమెరికన్ పౌరుల్లో దాదాపు 14.6 కోట్ల మందికి పాస్‌పోర్ట్ లేదు. ఓటింగ్‌కు పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్‌నే అనుమతించే అవకాశముంది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఓటింగ్‌కు దూరమయ్యే అవకాశముంది. ‘‘ట్రంప్ అతి చర్యల కారణంగా ప్రభుత్వ రికార్డులన్నింటిలో పేరు సరిపోలిన వాళ్లు మాత్రమే ఓటేసేందుకు అర్హులవుతారు. ఇంటి పేరు మారిన మహిళలు, కార్చిచ్చులు, తుపాన్లు, వరదల్లో ఇళ్లు కాలిపోయి డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వాళ్లు ఇకపై ఓటు హక్కును వినియోగించుకోవడం అసాధ్యం’’ అని డెమొక్రటిక్ నేత, దిగువసభ సభ్యురాలు జాస్మిన్ ఫెలీసియా క్రోకెట్ ఆందోళన వ్యక్తంచేశారు. తర్వాత వచ్చే బ్యాలెట్ ఓట్లను పరిగణించరు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఎన్నికల తేదీ తర్వాత వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతించబోరు. ఓటింగ్ తేదీకి ముందే మార్కింగ్ చేసి పోస్ట్‌లో పంపినట్లు రుజువైతే మాత్రమే తర్వాతి తేదీన అందినా అనుమతిస్తారు. ప్రస్తుతం 18 రాష్ట్రాలు, ప్యూర్టోరీకో మాత్రమే తర్వాత తేదీ నుంచి వచి్చనా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతిస్తున్నాయి. అత్యధిక ఓటర్లు ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏకంగా ఏడు రోజుల తర్వాత కూడా అనుమతిస్తారు. ఎన్నికల విరాళాల మీదా ఆంక్షలు! రాజకీయ పార్టీలకు వ్యక్తులు నేరుగా విరాళాలు ఇచ్చే అవకాశం లేదు. పొలిటికల్ యాక్షన్ కమిటీలను ఏర్పాటుచేసి వాటికి విరాళాలు అందించి వాటి ద్వారానే ఎన్నికల ఖర్చులకు సాయపడొచ్చు. ఈ ఎన్నికల విరాళాలపైనా కఠిన నియమాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అమెరికా పౌరులుగాని వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ఉత్తర్వులో పేర్కొన్నారు.ఎన్నికల నిబంధనల్లో విఫలమయ్యాం: ట్రంప్ ‘‘సుపరిపాలనలో మనం ఎన్నో దేశాలకు ఆదర్శంగా ఉన్నాం. కానీ ఎన్నికల ప్రాథమిక నిబంధనల పటిష్ట అమలులో విఫలమయ్యాం. ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో ముందున్నాయి. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ల జాబితాను బయోమెట్రిక్ డేటాబేస్‌తో పోలి్చచూస్తూ ముందంజలో ఉంటే మనం ఇంకా సెల్ఫ్–అటెస్టేషన్ స్థాయిలోనే ఆగిపోయాం. జర్మనీ, కెనడా వంటి దేశాలు పేపర్ బ్యాలెట్లను అందరి సమక్షంలో లెక్కిస్తూ ఎలాంటి వివాదాలకు తావివ్వడం లేదు. మనం వేర్వేరు రకాల ఓటింగ్ విధానాలను అవలంభిస్తూ సుదీర్ఘ ఓటింగ్ ప్రక్రియలో మునిగిపోయాం. మెయిల్–ఇన్ ఓట్ల విషయంలో డెన్మార్క్, స్వీడన్ ముందున్నాయి’’.బ్రెనాన్ సెంటర్ ఫర్ జస్టిస్ గణాంకాల ప్రకారం ఓటింగ్ వయసున్న అమెరికా పౌరుల్లో 9 శాతం మందికి, అంటే 2.13 కోట్ల మందికి పౌరసత్వాన్ని నిరూపించుకునేఎలాంటి గుర్తింపు పత్రాలూ లేవు!

మాతృ వందన యోజనకు నిధులేవీ?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై)కు నిధులు ఇవ్వడం లేదని రాజ్యసభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. గర్భిణుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ప్రభుత్వానికి సూచించారు. ఆమె బుధవారం రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. గర్భిణులకు ప్రయోజన కరమైన పథకానికి నిధులు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లబ్ధిదారుల సంఖ్య నానాటికీ పడిపోతోందని గుర్తుచేశారు. 2022–23లో 68 శాతం మంది గర్భిణులు కనీసం ఒక దఫా ప్రయోజనాలు అందుకున్నారని, 2023–24లో ఇది 12 శాతానికి పడిపోయిందన్నారు. ఇలా ఎందుకు జరిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో పీఎంఎంవీవైని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే ప్రతిఏటా కనీసం రూ.12,000 కోట్లు అవసరమని సోనియా గాంధీ వివరించారు. 2025–26 బడ్జెట్లో మాత్రం అరకొర నిధులే కేటాయించారని విమర్శించారు. అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు: రాజ్యసభలో సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ బుధవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లు–2024పై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోకేవలం ఒక్క కుటుంబమే అధికారం చెలాయించిందని, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు(సోనియా గాంధీ) కూడా ఆ కుటుంబంలో ఉన్నారని చెప్పారు. దీనిపై జైరామ్ రమేశ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరుతూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు నోటీసు అందశేశారు.

లోకేశ్‌కో రూలు.. మిథున్‌కో రూలా!?
సాక్షి, అమరావతి: మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని ఏప్రిల్ 3 వరకు అరెస్టుచెయ్యొద్దని హైకోర్టు బుధవారం సీఐడీని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆ రోజున తీర్పు వెలువరిస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరిపారు. మిథున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా వాదనలు సాగాయి. అప్పుడు లోకేశ్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు..ముందుగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఓ కేసులో నిందితుడు కానప్పటికీ, ఆ కేసువల్ల ప్రభావితమయ్యే వ్యక్తి ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చునన్నారు. అరెస్టుచేస్తారన్న ఆందోళన ఉన్నప్పుడు కూడా వెయ్యొచ్చని తెలిపారు. గతంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ కూడా నిందితుడు కాకపోయినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోకేశ్‌ను నిందితుడిగా చేర్చలేదు కాబట్టి, ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పుడు మిథున్‌రెడ్డి విషయంలో అలాగే నడుచుకునేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. అప్పుడో రకంగా, ఇప్పుడు మరో రకంగా సీఐడీ వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంగా.. లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను నిరంజన్‌రెడ్డి న్యాయమూర్తి ముందుంచారు.గతంలో లోకేశ్ తరఫున సిద్దార్థ లూథ్రా, ప్రస్తుత ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారని ఆయన కోర్టుకు నివేదించారు. ఆ రోజున నిందితుడు కానప్పటికీ లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సమర్థించిన లూథ్రా.. ఇప్పుడు మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను మాత్రం వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇది వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.లోకేశ్‌కు ఇచ్చినట్లే ఉత్తర్వులివ్వాలని మిథున్ కోరలేరు..లూథ్రా వాదనలు వినిపిస్తూ, లోకేశ్ కేసులో వాస్తవాలకు, ఈ కేసులో వాస్తవాలకు ఏమాత్రం పొంతనలేదన్నారు. లోకేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని, అలాంటి ఉత్తర్వులే తమకూ ఇవ్వాలని పిటిషనర్ కోరడానికి వీల్లేదన్నారు. మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణార్హతే లేదని లూథ్రా తెలిపారు. పైగా.. విచారణకు హాజరుకావాలని ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. దర్యాప్తు అధికారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పీఎల్ఆర్ కంపెనీ వివరాలు అడిగామని, అందువల్ల తనను అరెస్టు చేస్తారని పిటిషనర్ చెబుతున్నారని, వాస్తవానికి ఆ కంపెనీలో మిథున్‌రెడ్డి డైరెక్టర్ కాదన్నారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారం రూ.వేల కోట్లకు సంబంధించిందన్నారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయ్యొద్దని లూథ్రా కోర్టును కోరారు.దర్యాప్తు అధికారి తీరును తీవ్రంగా పరిగణించండి..ఇక ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ వాంగ్మూలంలో మిథున్‌రెడ్డి ప్రస్తావన ఉందన్నారు. ఇదే సమయంలో.. ఓ అధికారి సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారని అది తమ వద్ద లేదని సీఐడీ దర్యాప్తు అధికారి చెప్పడం కోర్టును తప్పుదోవ పట్టించడమేనన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు అధికారిపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తుంటే రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్లు కనిపించడంలేదని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఒకవైపు నేరారోపణలకు ఆధారాలు లేవంటారని, మరోవైపు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ పరస్పర విరుద్ధంగా వాదనలు వినిపిస్తోందన్నారు. ఆధారాల్లేకుంటే ముందస్తు బెయిల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లని ఆయన ప్రశ్నించారు. మిథున్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నందునే తాము ముందస్తు బెయిల్ కోసం కోర్టుకొచ్చామన్నారు. మిథున్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డికి శస్త్రచికిత్స జరిగిందని, ఆయన్ను దగ్గరకు వస్తే అరెస్టుచేయాలన్న ఉద్దేశంతో సీఐడీ ఉందన్నారు.

ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోతాం..
ముంబై: దేశంలోని అత్యంత ధనవంతుల్లో 22 శాతం మంది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. విదేశాల్లో మెరుగైన జీవన పరిస్థితులు, వ్యాపార అనుకూల వాతావరణం వారిని ఆకర్షిస్తున్నాయి. 150 మంది అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (అల్ట్రా హెచ్ఎన్ఐలు) అభిప్రాయాలను కోటక్ ప్రైవేటు (వెల్త్ మేనేజర్), ఈవై ఇండియా సర్వే చేశాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ దేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది అల్ట్రా హెచ్ఎన్ఐ భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా దేశాలు ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసా పథకం అనుకూలంగా ఉన్నట్టు కోటక్–ఈవై నివేదిక తెలిపింది. ఏటా 25 లక్షల మంది విదేశాలకు వలసపోతున్న గణాంకాలను ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు అల్ట్రా హెచ్ఎన్ఐలలో ఒకరు విదేశాలకు వలసపోయే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. వీలైతే అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని, అదే సమయంలో భారతీయ పౌరసత్వాన్ని కొనసాగించుకునే ఆలోచనతో ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు, విద్య, జీవనశైలి ఇలా అన్నింటా విదేశాల్లో మెరుగైన ప్రమాణాలను వారు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశాల్లో వ్యా పార నిర్వహణలో ఉండే సౌలభ్యం తమను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యం, శ్రేయ స్సుకు వీరు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. పిల్లల విద్యకూడా కారణమే.. విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని భవిష్యత్ పెట్టుబడిగా ఈ సర్వే నివేదిక అభివర్ణించింది. వారి పిల్లలకు అత్యుత్తమ ఉన్నత విద్య సదుపాయం సైతం వారిని ఆ దిశగా నడిపించొచ్చని పేర్కొంది. ‘‘విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని పెట్టబడులు తరలిపోవడంగా చూడరాదు. ఈ తరహా కార్యకలాపాలపై పరిమితులు విధించడం ద్వారా పౌరసత్వ హోదా మారినప్పటికీ వారి పెట్టుబడులు తరలిపోకుండా చూడొచ్చు. భారత్‌లో నివసించే పౌరుడు ఏడాదికి ఇంటికి తీసుకెళుతున్నది సగటున 2,50,000 డాలర్లే. అదే విధంగా నాన్ రెసిడెంట్‌ను సైతం ఏటా మిలియన్ డాలర్లనే తీసుకెళ్లేందుకు అనుమతించడం వల్ల పెట్టుబడులు తరలిపోవు’’అని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ గౌతమి గవంకర్ అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తల కంటే వృత్తి నిపుణులే ఎక్కువగా విదేశాలకు వలసపోయే ఉద్దేశంతో ఉన్నారు. అది కూడా అల్ట్రా హెచ్ఎన్ఐలలో 36–40 ఏళ్ల వయసులోని వారు, 61 ఏళ్లపైన వయసువారు వలసవెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2.83 లక్షల అల్ట్రా హెచ్ఎన్ఐలు 2023 నాటికి మన దేశంలో 2.83 లక్షల మంది అల్ట్రా హెచ్ఎన్ఐలు ఉన్నారు. ఒక్కొక్కరి నెట్‌వర్త్ (నికర సంపద విలువ) రూ.25 కోట్లకు పైన ఉండడాన్ని ప్రామాణికంగా తీసుకుని, వీర జనాభా లెక్కగట్టారు. వీరందరి ఉమ్మడి సంపద విలువ రూ.2.83 లక్షల కోట్లుగా ఉంది. 2028 నాటికి అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 4.3 లక్షలకు పెరుగుతుందని, వీరి నిర్వహణలోని సంపద రూ.359 లక్షల కోట్లకు విస్తరిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. బలమైన ఆర్థిక వృద్ధి, అధిక వినియోగం, పనిచేయతగిన యువ జనాభా ఎక్కువగా ఉండడం అల్ట్రా హెచ్ఎన్ఐల విభాగం వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది.

‘కమీషన్ల’పై దద్దరిల్లిన సభ!
30% కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20% కమీషన్ అంటూ సచివాలయంలో ధర్నాలు జరుగుతున్నాయి- కేటీఆర్కేటీఆర్ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేదంటే ప్రజలకు, సభకు క్షమాపణ చెప్పండి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.-భట్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బుధవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పెద్దలు కమీషన్లు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుడు కె.తారకరామారావు పేర్కొనడం, ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రులు అడ్డుపడుతుండటంతో.. బడ్జెట్ పద్దులపై బుధవారం జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డుపడటంపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. ‘‘మంత్రులు పదే పదే అడ్డుపడుతున్నారు. సంయమనం ఉండాలి. మేం కూడా రెచ్చగొట్టగలం. 30శాతం కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20శాతం కమీషన్ అంటూ సచివాలయంలో (కాంట్రాక్టర్ల) ధర్నాలు అవుతున్నాయి’’అని వ్యాఖ్యానించారు. దీనిపై భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ‘‘కేటీఆర్‌ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేకుంటే సభకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి’’అని సవాల్ చేశారు. గత ప్రభుత్వం పాపం వల్లే రూ.లక్ష కోట్ల పనులు చేసిన వారు బిల్లులు రాక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ.. కేటీఆర్‌ను ఉద్దేశించి భట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బాధ్యతతో రాజకీయాల్లో వచ్చాం. అడ్డగోలుగా మీలా రాష్ట్రం మీద పడి బరితెగించి దోపిడీ చేయడానికి రాలేదు. నాలాగా అణగారిన వర్గాలు, బాధితులు, పీడితులు, పేద కుటుంబాల కోసం ఏదో చేయాలని ఉన్నతమైన ఆశయంతో వచ్చిన వాళ్లం. మీలా ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పాడు చేసిపోయేందుకు రాలేదు. మాట్లాడే ముందు బాధ్యత, నిబద్ధత ఉండాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదీ పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా?’’అని మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. ‘30శాతం కమీషన్..’అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో.. కేటీఆర్‌ను ఉద్దేశించి ‘ఒళ్లు బలిసి’అంటూ భట్టి తప్పుడు మాటలు మాట్లాడరంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కేటీఆర్ మాట్లాడేందుకు మళ్లీ మైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ దగ్గరికి దూసుకెళ్లారు. మొదట కేటీఆరే రెచ్చగొట్టారని, ఒకట్రెండు అన్‌పార్లమెంటరీ పదాలుంటే తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా నిరసన కొనసాగించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మాత్రమే తాను సూచించానని భట్టి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కమీషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలనే కేటీఆర్ ప్రస్తావించారని చెప్పారు. బట్టలు విప్పి కొడతామంటూ సభలో సీఎం రేవంత్ అన్నప్పుడు లేని అభ్యంతరం తమ మాటలకు ఎందుకని ప్రశ్నించారు. దీంతో ప్యానల్ స్పీకర్ ఆయన మైక్ కట్ చేసి బీజేపీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా ‘వద్దురా నాయనా.. ట్వంటీ పర్సెంట్ పాలన’అంటూ నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద కాసేపు బైఠాయించి నినాదాలు చేశారు. భట్టి దళితుడనే ఆరోపణలు: పొన్నం దళితుడైన భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత పదవి దక్కవద్దనే ఉద్దేశంతోనే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

అధికారపార్టీ అడ్డదారులు
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు కుట్రలకు పదును పెట్టారు. సంఖ్యాబలం లేకపోయినా పదవుల్ని తమ ఖాతాలో వేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాట వినకపోతే కిడ్నాప్‌లకూ వెనుకాడటం లేదు. ‘మీరు ఎన్నిచోట్ల గెలిస్తే మాకేంటి. మాకు ఒక్క సభ్యుడు లేకపోయినా.. మీకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బలం ఎంత ఉన్నా మమ్మల్నేం చేయలేరు. ఈ ప్రభుత్వం మాది. మేం చెప్పిందే వేదం. మేం చేసేదే శాసనం. మా మాట వినకుంటే మీరెవరూ బతికి బట్టకట్టలేరు’ అంటూ రెచ్చిపోతున్నారు. – సాక్షి, అమరావతిఅచ్చంపేటలో కిడ్నాప్పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ పదవికి గురువారం ఎన్నిక జరనుండగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థిని, ఆమె భర్తను బుధవారం మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు. నాలుగు కార్లలో వచ్చి టీడీపీ మూకలు వారిద్దరినీ ఎత్తుకెళ్లి అజ్ఞాతంలోకి తరలించారు. 2021 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికలలో అచ్చంపేట మండల పరిషత్ పరిధిలోని మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు గాను.. 16 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఆ పార్టీ తరఫున తాడువాయి, మాదిపాడు ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీ అభ్యర్థులు భూక్యా రజనీబాయి, భూక్యా స్వర్ణమ్మభాయి గెలుపొందారు. రిజర్వేషన్ ప్రకారం.. భూక్యా రజనీబాయిని ఎంపీపీగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యక్తిగత కారణాల వల్ల రజనీబాయి ఆ పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నూతన ఎంపీపీని ఈ నెల 27వ తేదీన ఎన్నుకోవాల్సి ఉంది.అయితే, టీడీపీకి ఎస్టీ అభ్యర్థే లేరు. దీంతో ఎంపీపీ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారు. బుధవారం అర్ధరాత్రి పోలీసుల సాయంతో ఎంపీటీసీల ఇళ్లపై పడ్డారు. 15మంది ఎంపీటీసీల్లో 8 మందిని గంజాయి, అక్రమ మద్యం కేసుల్లో ఇరికించి నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించి రహస్య స్థావరానికి తరలించారు. మరోవైపు మాదిపాడు ఎంపీటీసీ భూక్యా స్వర్ణమ్మబాయిని టీడీపీ కండువా కప్పుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. వినకపోవడంతో బుధవారం ఉదయం 12గంటల సమయంలో టీడీపీ నాయకులు నాలుగు కార్లలో వచ్చి స్వర్ణమ్మబాయిని, ఆమె భర్త రమేష్ నాయక్‌ను కిడ్నాప్ చేసి అజ్ఞాతంలోకి తరలించారు. టీడీపీ దాడులతో రచ్చరచ్చశ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి తమ అభ్యర్థికి సంబంధించి బీఫామ్ అందజేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై బుధవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ లీగల్ సెల్ నాయకులు బీఫామ్ అందజేసేందుకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన వాహనంలో రామగిరి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోగా టీడీపీ నాయకులు దాడి చేశారు.వైఎస్సార్సీపీ నేతలను నిర్బంధించారు. మరోవైపు రొద్దం, కదిరి నియోజకవర్గం గాండ్లపెంటలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఆ రెండుచోట్లా ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తగిన బలం లేకపోయినా ఎమ్మెల్యే పరిటాల సునీత అధికార బలాన్ని ఉపయోగించి ఎంపీపీ పదవిని అడ్డదారిలో టీడీపీ ఖాతాలో వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.వైఎస్సార్ జెడ్పీలో ఎన్నిక అడ్డుకునేందుకు..వైఎస్సార్ జిల్లా పరిషత్ పరిధిలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 2021 ఎన్నికల్లో 49 స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ప్రస్తుతం అక్కడ జెడ్పీ చైర్మన్‌కు ఎన్నిక జరుగుతోంది. కొందరు జెడ్పీటీసీలు పార్టీ ఫిరాయించగా.. ఇప్పటికీ 42 మంది జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారు. చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ తర్వాత టీడీపీకి సభ్యుల బలం లేని కారణంగా పోటీ చేయడం లేదని ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రకటించారు. అయితే, టీడీపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క జెడ్పీటీసీతో జెడ్పీ చైర్మన్ ఎన్నికను నిలుపుదలకు హైకోర్టును ఆశ్రయించారు.ఒక్క సభ్యుడు లేకపోయినా..నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ పెద్దఎత్తున ప్రలోభాలు మొదలుపెట్టింది. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీలకు గాను వైఎస్సార్సీపీ 12 మంది, సీపీఎంకు ఇద్దరు సభ్యుల చొప్పున బలం ఉంది. టీడీపీకి ఒక్క సభ్యుడు కూడా లేకపోయినా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు అరాచకాలకు తెరతీసింది. 8 మంది ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ నేతలు చివరి నిమిషం వరకూ ప్రలోభాలకు గురి చేస్తూనే ఉన్నారు. » పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపీకి ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎంపీటీసీ, ఆమె భర్త కిడ్నాప్ » సత్యసాయి జిల్లా రామగిరిలో బీఫామ్ ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మూకల దాడి » తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీటీసీలకు రూ.3 లక్షల చొప్పున ఎర » ముగ్గురు ఎంపీటీసీలున్న కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి కోసం జనసేన బరితెగింపు » తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో అక్రమాల నివారణకు న్యాయస్థానం తలుపుతట్టిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి » ఒకే సభ్యుడు ఉండటంతో వైఎస్సార్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ ‘తూర్పు’లో ప్రలోభాలుతూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీపీ స్థానంలో గెలిచేందుకు తగిన బలం లేని కూటమి పార్టీల నేతలు వైఎఎస్సార్సీపీ ఎంపీటీసీల్లో కొందరికి రూ.3 లక్షల చొప్పున ఆశచూపారు. నలుగురు వైఎస్సార్సీపీ సభ్యులను ఎన్నిక వేళ హాజరుకాకుండా ఉండాలని అధికార పార్టీ శ్రేణలు బెదింపులకు దిగుతున్నారు. కాకినాడ రూరల్ మండల పరిషత్‌లో జనసేన పార్టీ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేస్తోంది. మండలంలో 18 మంది ఎంపీటీసీలు ఉండగా.. వైఎస్సార్సీపీకి 15 మంది, జనసేనకు ముగ్గురు చొప్పున ఉన్నారు. ఎంపీపీ ఎన్నిక దృష్ట్యా ఏడుగురు ఎంపీటీసీకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చేలా ప్రలోభపెట్టి ఆ పార్టీలో చేర్చుకున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నేడు రెండు జెడ్పీ, 60 మండలపరిషత్లలోఎన్నికలుఖాళీగా ఉన్న వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి గురువారం ఎన్నిక జరగనుంది. కర్నూలు జెడ్పీ కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 60 మండలాల్లో 28 ఎంపీపీ పదవులు, 23 మండల ఉపాధ్యక్ష, 12 మండల కో–ఆప్టెడ్ సభ్యుల పదవులకు సైతం గురువారం ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకు సంబంధించి ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు 200 గ్రామ పంచాయతీల్లోనూ ఉప సర్పంచ్ స్థానాలకు గురువారమే ఎన్నికలు జరగనున్నాయి. – సాక్షి, అమరావతిఫిర్యాదు చేస్తే చించేశారుచిత్తూరు జిల్లాలో రామకుప్పం మండల పరిషత్ అధ్యక్షురాలు శాంతకుమారి మరణంతో ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అన్నిచోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలకు తెరలేపింది. ఉప ఎన్నిక సజావుగా నిర్వహించాలని, వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భరత్‌కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు కాపీని టీడీపీ నేతలు పోలీసుల నుంచి లాక్కుని చించివేశారు.శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 6 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీ జగన్మోహన్ ఆ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యౖమెంది. బలం లేకపోయినా ఎంపీపీ కుర్చీని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై ఒత్తిడి తెస్తున్నారు.ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎంపీపీ పోటీలో ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యునిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించారు. మరో ఎంపీటీసీ సభ్యునిపైనా కేసు నమోదు చేయించారు. పుల్లలచెరువు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి సైతం ఎన్నిక జరుగుతుండగా.. ఇక్కడ మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలుకు గాను 11 స్థానాలు వైఎస్సార్సీపీ, 4 స్థానాలు టీడీపీ పక్షాన ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు టీడీపీ ప్రలోభాలు పెట్టేందుకు చివరి నిమిషం వరకు తీవ్రంగా యత్నిస్తోంది.తిరుపతిలో వైఎస్సార్సీపీ ముందుజాగ్రత్తతిరుపతి ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి రాజీనామా చేయటంతో గురువారం ఉప ఎన్నిక జరుగుతోంది. మండలంలో 40 ఎంపీటీసీ స్థానాలుండగా.. 38చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఒకస్థానం టీడీపీ టీడీపీ దక్కించుకుంది. ప్రస్తుతం 32 మంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ వెంటే ఉండగా.. ప్రలోభాల లొంగిన ఐదుగురు ఎంపీటీసీలు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా కూటమి నేతల అరాచకాలను దృష్టిలో ఉంచుకుని ఎంపీపీ ఎన్నికను సజావుగా నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
విజ్ఞాన కాంతులు
ఓటింగ్‌పై ట్రంప్‌కార్డు
ఎవరిది డైరెక్షనో, ఎవరిది యాక్షనో అందరికీ తెలుసు
కన్నీటి దిగుబడి
ప్రభుత్వ ఇఫ్తార్‌ను బహిష్కరిస్తున్నాం
నేడు 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
నకిలీల కట్టడిపై అమెజాన్ నజర్..
ఆహా షిదాల్.. అంతా.. ఫిదా!
9 కోట్లకు ఎంఎస్ఎంఈలు
అధికారపార్టీ అడ్డదారులు
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
ఓట్లేయించుకున్నవారు జీతాలు పెంచుకున్నారు.. ఓటేసిన మనకు కనీస వేతనం లేదు!
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
అద్దెంటి కుర్రాడితో భార్య అలా.. కట్ చేస్తే ఏడడుగుల గోతిలో..
ఆ తీర్పు అమానుషం.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
విజ్ఞాన కాంతులు
ఓటింగ్‌పై ట్రంప్‌కార్డు
ఎవరిది డైరెక్షనో, ఎవరిది యాక్షనో అందరికీ తెలుసు
కన్నీటి దిగుబడి
ప్రభుత్వ ఇఫ్తార్‌ను బహిష్కరిస్తున్నాం
నేడు 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
నకిలీల కట్టడిపై అమెజాన్ నజర్..
ఆహా షిదాల్.. అంతా.. ఫిదా!
9 కోట్లకు ఎంఎస్ఎంఈలు
అధికారపార్టీ అడ్డదారులు
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
ఓట్లేయించుకున్నవారు జీతాలు పెంచుకున్నారు.. ఓటేసిన మనకు కనీస వేతనం లేదు!
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
అద్దెంటి కుర్రాడితో భార్య అలా.. కట్ చేస్తే ఏడడుగుల గోతిలో..
ఆ తీర్పు అమానుషం.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
సినిమా

ఆ సినిమా తొలి రోజే అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది: నిర్మాత రవిశంకర్
టాలీవుడ్ నిర్మాత వై.రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ గురించి వ్యాఖ్యానించారు. అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మొదటి రోజే రికార్డులు కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లోనే ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ సృష్టిస్తుందని మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చేనెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో అజిత్ కుమార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది.కాగా.. నితిన్ రాబిన్ హుడ్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. భీష్మ సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించడం మరో విశేషం. ఇటీవల ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. శ్రీలీల, కేతికా శర్మతో కలిసి అది దా సర్ప్రైజ్ అంటూ స్టెప్పులు కూడా వేశారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ ఇండస్ట్రీలో #GoodBadUgly DAY 1 రికార్డులు కొడుతుంది - #RaviShankar#AjithKumar #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/90DmdTZclA— Telugu FilmNagar (@telugufilmnagar) March 26, 2025

రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ..
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీతో రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie)కు కొత్త జోష్ వచ్చినట్లయింది. అతడి స్పెషల్ ఎంట్రీ సినిమాలోనే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ఉండటంతో అభిమానులు సంతోషపడ్డారు. కానీ ఇదే ఈవెంట్లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ వార్నర్‌పై నోరు జారాడు. రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే కుప్పిగంతులు వేస్తున్నావ్.. అంటూ అతడిని వెక్కిరిస్తూ ఓ బూతు మాట కూడా అన్నాడు.క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్అంత పెద్ద క్రికెటర్‌ను పట్టుకుని ఇలాంటి చవకబారు వ్యాఖ్యలేంటని జనం మండిపడ్డారు. దీంతో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) క్షమాపణలు తెలిపాడు. వార్నర్ అంటే తనకిష్టమని, ఉద్దేశపూర్వకంగా అలాంటి మాట అనలేదన్నాడు. పొరపాటున నోరు జారానని, మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. తన మాట తీరు వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి అని కోరాడు.వార్నర్ రియాక్షన్ ఇదీ!ఈ విషయంలో వార్నర్ (David Warner) రియాక్షన్ ఎలా ఉందో బయటపెట్టాడు దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula). వెంకీ మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మేమందరం కలిశాం. అప్పుడు రాజేంద్రప్రసాద్‌గారు, వార్నర్ బాగా క్లోజ్ అయ్యారు. రాజేంద్రప్రసాద్‌గారు చాలా పెద్దాయన, కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏదనిపిస్తే అది మాట్లాడతారు. నువ్వు యాక్టింగ్‌కు వచ్చావ్ కదా.. చూసుకుందాం అని రాజేంద్రప్రసాద్.. నువ్వు క్రికెట్‌కు రా.. చూసుకుందాం అని వార్నర్ ఒకరినొకరు టీజ్ చేసుకున్నారు.నోరు జారాడుదాన్ని స్టేజీపై ఫన్ చేసే క్రమంలో రాజేంద్రప్రసాద్ అనుకోకుండా ఓ మాట తూలారు. అందుకు ఆయన కూడా బాధపడ్డారు. ఈ విషయం గురించి వార్నర్‌తో మాట్లాడా.. కాస్త నోరు జారాడు, ఏమీ అనుకోకు అని చెప్పాను. అందుకు వార్నర్.. క్రికెట్లో పెద్ద పెద్ద స్లెడ్జింగ్‌లు (కావాలని తిట్టుకోవడం) చూశాను. మా స్లెడ్జింగ్‌లు చూస్తే మీరు చెవులు మూసుకుంటారు. ఇది యాక్టర్స్ మధ్య స్లెడ్జింగ్.. ఇట్స్ ఓకే.. అని పాజిటివ్‌గా మాట్లాడారు. ఆయన చాలా మంచి మనిషి అని వెంకీ చెప్పుకొచ్చాడు. నితిన్ హీరోగా శ్రీలీల కథానాయికగా నటించిన రాబిన్‌హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ఇందులో వార్నర్ ముఖ్య పాత్ర పోషించాడు.చదవండి: 15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అదంతా టైం వేస్ట్

మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్.. 'బజూక' ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం బజూక. డినో డెన్సిస్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో మమ్ముట్టి యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.ట్రైలర్లో ఫైట్స్ సీక్వెన్స్, మమ్ముట్టి యాక్షన్ చూస్తుంటే అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. అజిత్ మూవీతో మమ్ముట్టి బజూక సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బర్త్ డే స్పెషల్ అప్డేట్ వచ్చేసింది!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16 మూవీతో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆర్సీ16 సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. చెర్రీ బర్త్ డే స్పెషల్‌గా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గురువారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. Grit, power, and an untamed spirit from the rural lands ❤️🔥#RC16 TITLE & FIRST LOOK out tomorrow at 9.09 AM 💥💥#RamCharanRevoltsGlobal Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @IamJagguBhai @divyenndu… pic.twitter.com/ZvwUrN7fNl— Vriddhi Cinemas (@vriddhicinemas) March 26, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

డికాక్ ధమాకా
ఐపీఎల్లో పరుగుల వరద పారిన రెండు వరుస మ్యాచ్‌ల తర్వాత ఆ జోరుకు కాస్త విరామం. పొడిగా, బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై సాగిన మ్యాచ్‌లో సీజన్లో తక్కువ స్కోరు నమోదు కాగా, డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) పైచేయి సాధించి తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ కట్టుదిట్టమైన స్పిన్‌తో ముందుగా రాజస్తాన్‌ను నైట్‌రైడర్స్ తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత డికాక్ దూకుడైన బ్యాటింగ్‌తో లక్ష్యఛేదనను సునాయాసం చేసేశాడు. 15 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయాన్నందుకుంది. అన్ని రంగాల్లో విఫలమైన రాజస్తాన్ రాయల్స్ తమ ‘హోం గ్రౌండ్’లో పేలవ ప్రదర్శనతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గువహాటి: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ ఐపీఎల్ సీజన్లో గెలుపు బోణీ చేసింది. గత మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన నైట్‌రైడర్స్ బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (28 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, యశస్వి జైస్వాల్ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 25; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై వరుణ్, మొయిన్ అలీ 8 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు తీసి రాయల్స్‌ను దెబ్బ కొట్టారు. వైభవ్ అరోరా, హర్షిత్ కూడా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. సునీల్ నరైన్ అనారోగ్యం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో మొయిన్ అలీకి కోల్‌కతా చోటు కల్పించగా, ఫారుఖీ స్థానంలో రాజస్తాన్ జట్టులోకి హసరంగ వచ్చాడు.సమష్టి వైఫల్యం... రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆసాంతం ఒకే తరహాలో సాదాసీదాగా సాగింది. ఆశించిన స్థాయిలో దూకుడైన బ్యాటింగ్ లేకపోగా, ఒక్కటీ సరైన భాగస్వామ్యం రాలేదు. జైస్వాల్ ధాటిగానే మొదలు పెట్టినా... మరోవైపు సంజు సామ్సన్ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేదు. ‘లోకల్ బాయ్’ పరాగ్ తన తొలి 7 బంతుల్లో 2 సిక్సర్లు బాది అభిమానులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఓవర్లోనూ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదిన అతను...అదే ఓవర్లో మరో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగడంతో మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత హసరంగ (4)ను ముందుగా పంపిన ప్రయోగం ఫలితం ఇవ్వకపోగా, నితీశ్ రాణా (9 బంతుల్లో 8), శుభమ్ దూబే (12 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా విఫలమయ్యారు. 67/1తో మెరుగైన స్థితిలో కనిపించిన రాజస్తాన్ 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 82/5కి చేరింది. దాంతో ‘ఇంపాక్ట్ సబ్’గా అదనపు బ్యాటర్‌ను శుభమ్ దూబే రూపంలో ఏడో స్థానంలో బరిలోకి దింపింది. అయితే ఒత్తిడిలో అతనూ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జురేల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. హర్షిత్ రాణా వరుస ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే హర్షిత్ తన తర్వాతి ఓవర్లో జురేల్, ప్రమాదకర బ్యాటర్ హెట్‌మైర్ (8 బంతుల్లో 7; 1 ఫోర్)లను వెనక్కి పంపించాడు. చివర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16; 2 సిక్స్‌లు) కొట్టిన రెండు సిక్సర్లతో రాజస్తాన్ స్కోరు 150 పరుగులు దాటింది. డికాక్ మెరుపులు... ఛేదనలో డికాక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 40 పరుగులు కాగా, డికాక్ ఒక్కడే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు సాధించాడు. మరోవైపు కేకేఆర్ తరఫున ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన మొయిన్ అలీ (5) రనౌట్ కావడంతో జట్టు మొదటి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే (15 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయినా, డికాక్ జోరుతో స్కోరు వేగంగా సాగిపోయింది. 35 బంతుల్లోనే డికాక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అతనికి గెలుపు దిశగా అంగ్కృష్ రఘువంశీ (17 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) సహకరించాడు. దూకుడు తగ్గించని డికాక్ శతకం దిశగా దూసుకుపోయాడు. చివరి 3 ఓవర్లలో నైట్‌రైడర్స్ విజయానికి 17 పరుగులు, డికాక్ సెంచరీకి 19 పరుగులు అవసరం కాగా, ఆర్చర్ ఓవర్లో డికాక్ ఒక ఫోర్, 2 సిక్స్‌లు బాదినా... చివరకు 97 వద్దే అతను ఆగిపోవాల్సి వచ్చింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) హర్షిత్ రాణా (బి) అలీ 29; సామ్సన్ (బి) అరోరా 13; పరాగ్ (సి) డికాక్ (బి) వరుణ్ 25; నితీశ్ రాణా (బి) అలీ 8; హసరంగ (సి) రహానే (బి) వరుణ్ 4; జురేల్ (బి) హర్షిత్ రాణా 33; శుభమ్ (సి) రసెల్ (బి) అరోరా 9; హెట్‌మైర్ (సి) రఘువంశీ (బి) హర్షిత్ రాణా 7; ఆర్చర్ (బి) జాన్సన్ 16; తీక్షణ (నాటౌట్) 1; తుషార్ దేశ్‌పాండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–69, 4–76, 5–82, 6–110, 7–131, 8–138, 9–149. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 4–0–42–1, వైభవ్ అరోరా 4–0–33–2, హర్షిత్ రాణా 4–0–36–2, మొయిన్ అలీ 4–0–23–2, వరుణ్ 4–0–17–2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మొయిన్ అలీ (రనౌట్) 5; డికాక్ (నాటౌట్) 97; రహానే (సి) దేశ్‌పాండే (బి) హసరంగ 18; రఘువంశీ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.3 ఓవర్లలో 2 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–41, 2–70. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 2.3–0–33–0, మహీశ్ తీక్షణ 4–0–32–0, రియాన్ పరాగ్ 4–0–25–0, సందీప్ శర్మ 2–0–11–0, హసరంగ 3–0–34–1, నితీశ్ రాణా 1–0–9–0, తుషార్ 1–0–7–0.ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నోవేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

డికాక్ వన్ మ్యాన్ షో.. రాజస్తాన్‌ను చిత్తు చేసిన కేకేఆర్
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయం సాధించింది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కోల్‌కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. 60 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8ఫోర్లు, 5 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది.చెతులేత్తేసిన బ్యాటర్లు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్ స్పిన్నర్ల దాటికి రాజస్తాన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కాగా రాజస్తాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చదవండి: IPL 2025: డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్‌ను తీసి మరి! వీడియో వైరల్

డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్‌ను తీసి మరి! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో రాజస్తాన్ స్టాండ్ ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను డికాక్ పెవిలియన్‌కు పంపాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో మూడో బంతిని పరాగ్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతిని పరాగ్ డిఫెన్స్ ఆడాడు. ఈ క్రమంలో ఐదో బంతిని వరుణ్ చక్రవర్తి.. పరాగ్‌కు ఔట్‌సైడ్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని పరాగ్ మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని చాలా ఎత్తుగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ల వెనక ఉన్న డికాక్ తన కీపింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. బంతి గాల్లోకి లేచిన వెంటనే డికాక్ క్యాచ్ కాల్ ఇచ్చాడు. క్లియర్ వ్యూ కోసం హెల్మెట్‌ను తీసి మరి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు వచ్చి అభినంధించారు. దీంతో 25 పరుగులు చేసిన పరాగ్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. Spinners casting their magic 🪄First Varun Chakravarthy and then Moeen Ali 💜Updates ▶ https://t.co/lGpYvw7zTj#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/EfWc2iLVIx— IndianPremierLeague (@IPL) March 26, 2025

రీ ఎంట్రీ ఇవ్వనున్న అలిస్టర్ కుక్.. !
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ అలిస్టర్ కుక్.. ఏడేళ్ల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో ఇంగ్లండ్ తరపున కుక్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ఛాంపియన్స్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ధ్రువీకరించాడు."అలిస్టర్ తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము అతడితో మరిన్ని కొత్త జ్ఞాపకాలను సృష్టించబోతున్నాము" అని మోర్గాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా కుక్ మాట్లాడుతూ.. "నా దేశం తరపున తిరిగి ఆడే అవకాశం చాలా ఆనందంగా ఉంది. ఇయోన్ మెర్గాన్, ఇతర ఇంగ్లీష్ క్రికెటర్లతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.2018లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన కుక్.. తన పేరును ఇంగ్లండ్ క్రికెట్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తన ఆడిన చివరి ఇన్నింగ్స్‌లో కూడా కుక్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుక్ తన కెరీర్‌ను ముగించాడు. అలిస్టర్ కుక్ ఇంగ్లండ్ తరఫున 161 టెస్టులు ఆడాడు. అందులో 33 సెంచరీలతో సహా 12,472 పరుగులు చేశాడు. కుక్ తన అద్భుతమైన క్రికెట్ కెరీర్లో.. అతను 92 వన్డేలు 4 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా కుక్ 2023 వరకు ఎసెక్స్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు.వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత్ డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనుంది. అయితే ఇండియా ఛాంపియన్స్ మేనేజ్మెంట్ కెప్టెన్‌గా యువీని ఎంపిక చేసినప్పటికి.. జట్టును ఇంకా ఖారారు చేయలేదు.గత సీజన్లో పాల్గొన్న భారత ఛాంపియన్స్ జట్టు..అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, సౌరభ్ తివారి, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, రాబిన్ ఉతప్ప, నమన్ ఓఝా, అనురీత్ సింగ్, ధవల్ కులకర్ణి, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, రాహుల్ శర్మ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్చదవండి: IPL 2025: రాసిపెట్టుకోండి.. ఐపీఎల్లో 300 ప్లస్ రన్స్ కొట్టేది ఆజట్టే! ఎప్పుడంటే?
బిజినెస్

UPI Down: ఫోన్‌పే, గూగుల్ పే యూజర్లకు షాక్.. యూపీఐ సేవల్లో అంతరాయం
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. చాలామంది వినియోగదారులు లావాదేవీలను చేయలేకపోయినట్లు వెల్లడించారు. బుధవారం రాత్రి 7:50 గంటలకు 2,750 యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. గూగుల్‌పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు వచ్చాయి.యూపీఐ సేవలు డౌన్ అవ్వడంతో.. దేశ వ్యాప్తంగా వినియోగదారులు లావాదేవీలు చేయడంలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా.. వారు ఎదుర్కొన్న సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సమస్య కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.Is UPI down? Anyone facing the issue? #Upidown— Sumit Mishra (@SumitLinkedIn) March 26, 2025UPI Down ⚠️Nationwise issue or it's only me ?— Crypto with Khan ( SFZ ) (@Cryptowithkhan) March 26, 2025Anyone facing UPI app issues or just me facing?? #phonepe #gpay #paytm— Anoop CSKian 💛 (@Anoopraj_7) March 26, 2025

డెబిట్ కార్డుతో పనిలేకుండా యూపీఐ పిన్ చేసుకోండిలా..
ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బులు పెట్టుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో చాలామంది యూపీఐ వాడుతున్నారు. అయితే బ్యాంక్ ఖాతా ఉన్నవారు యూపీఐ ఐడీ సెట్ చేసుకోవచ్చు. అయితే వారికి డెబిట్ కార్డు ఉండాలి. కానీ బ్యాంకులు అందరికీ.. డెబిట్ కార్డులు ఇవ్వదు. అలాంటి వారు యూపీఐ ఐడీ ఎలా సెట్ చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం.డెబిట్ కార్డు లేకుండా.. యూపీఐ ఐడీ సెట్ సేసుకోవాలనుకుంటే, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అది బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. అంతే కాకుండా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఆలా ఉన్నప్పుడే.. యూపీఐ ఐడీ సెట్ చేసుకోవాలి.యూపీఐ పిన్ ఎలా సెట్ చేసుకోవాలంటే?➤స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ ఓపెన్ చేసి, బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి. ➤తరువాత యూపీఐ పిన్ సెట్ చేసుకోవడానికి కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి.➤పిన్ సెట్ చేసుకునే ఆప్షన్ ఎంచుకున్నప్పుడు.. అక్కడ మీకు డెబిట్ కార్డు, ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తాయి.➤అక్కడ ఆధార్ ఓటీపీ ఎంపిక చేసుకోవాలి.➤ధృవీకరణ కోసం ఆధార్ నెంబర్ మొదటి ఆరు అంకెలను ఎంటర్ చేయాలి.➤ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.➤ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత.. యూపీఐ పిన్ సెట్ చేసుకోమని చూపిస్తుంది. మీకు నచ్చిన ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వం: బ్యాంకులు మాత్రం..

భారత్ కోసం రెండు జపనీస్ బ్రాండ్ కార్లు
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటైన 'నిస్సాన్' (Nissan) మరో రెండు కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో ఒకటి 5 సీటర్, మరొకటి 7 సీటర్. వీటిని కంపెనీ 2026లో దేశీయ విఫణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.జపాన్‌లోని యోకోహామాలో ఇటీవల ముగిసిన గ్లోబల్ ప్రొడక్ట్ షోకేస్ ఈవెంట్లో నిస్సాన్ కంపెనీ భారతదేశం కోసం తీసుకురానున్న రెండు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. దీన్ని బట్టి చూస్తే.. ఇండియన్ మార్కెట్లో తన హవా కొనసాగించడానికి సంస్థ తయారవుతున్నట్లు తెలుస్తోంది.నిస్సాన్ కంపెనీ ఈ రెండు కార్లను భారతదేశంలో అధికారికంగా 2026లో ప్రారంభించనుంది. ఇవి రెండూ.. ఇప్పుడున్న బ్రాండ్ మోడల్స్ కంటే భిన్నంగా.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉంటాయని తెలుస్తోంది. కాగా ఈ కార్లకు సంబంధించిన చాలా వివరాలు వెల్లడికావాల్సి ఉంది. అయితే వీటిని కంపెనీ ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేస్తోంది, కాబట్టి ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది.ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ కేవలం ఒక కారును (మాగ్నైట్) మాత్రమే విక్రయిస్తోంది. ఇది ప్రారంభం నుంచి 1.70 లక్షల కంటే ఎక్కువ సేల్స్ పొందింది. దీని ధర రూ. 6.14 లక్షల నుంచి రూ. 11.92 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.

టారిఫ్‌లపై ఆందోళన వద్దు: కానీ..
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌లతో తలెత్తబోయే ప్రతికూల ప్రభావాల గురించి దేశీ కార్పొరేట్లు ఆందోళన చెందరాదని గోద్రెజ్ అండ్ బాయిస్ సీఎండీ జంషీద్ గోద్రెజ్ సూచించారు. దాని బదులు మరింతగా పోటీపడే సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.పోటీతత్వాన్ని పెంపొందించుకునేందుకు భారతీయ తయారీ సంస్థలు, చైనాలాగా భారీ స్థాయిలో తయారీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని గోద్రెజ్ వివరించారు. తమ ఎగుమతులపై భారత్ విధిస్తున్న స్థాయిలోనే ఏప్రిల్ 2 నుంచి భారత్ ఎగుమతులపై తాము కూడా సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై వ్యాపారవర్గాల్లో ఆందోళన నెలకొంది.పలు భారతీయ కంపెనీలు అంతర్జాతీయంగా విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ స్థానిక కంపెనీలు తయారీ విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నాయని గోద్రెజ్ చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తయారీ రంగ వాటా గణనీయంగా తగ్గిందని, దీన్ని స్థూల దేశీయోత్పత్తిలో నాలుగో వంతుకు పెంచుకోవాలన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదని తెలిపారు.
ఫ్యామిలీ

వియ్ హబ్ బ్రాండ్ అంబాసిడర్ వంట గెలిచింది
ఆమె... వంటతో జీవితాన్ని నిలబెట్టుకుంటానని, వంటలతో అవార్డులు అందుకుంటానని, వియ్ హబ్ (విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్)కి బ్రాండ్ అంబాసిడర్ అవుతానని కలలో కూడా కలగనలేదు. పాలతో కూరలు వండే గుజరాత్ వాళ్లు ఆమె చేసిన పుదీనా పచ్చడిని లొట్టలేసుకుంటూ తిన్నారు. కొబ్బరి, అరటితో మసాలాలు లేని తేలిక ఆహారం తీసుకునే కేరళ వాసులు కూడా ఆమె చేతి రుచికి ఫిదా అయ్యారు. గోవా వాళ్లకు చేపలతో కొత్త వంటలను పరిచయం చేశారామె. ఈ విజయాలన్నీ ఆమెను రాష్ట్ర సెక్రటేరియట్ వైపు నడిపించాయి. తెలంగాణ సెక్రటేరియట్లో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆమె పేరు ఆకుల కృష్ణకుమారి. ఊరు మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మూడు చింతలపల్లి గ్రామం. నెలకు లక్షకు పైగా ఆర్జిస్తున్న కృష్ణకుమారి జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం.కృష్ణకుమారి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రంట్ ఆఫీసర్. తనకు వంటలు చేయడం, వంటల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఆ ఇష్టంతో తాను చేసిన కొత్త వంటకాలను కొలీగ్స్‌కి ఇచ్చేవారామె. ‘‘మా నాన్న టైలర్. ఓ రోజు సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) డీపీఎమ్ సురేఖ గారు మా షాప్‌కి వచ్చారు. నన్ను చూసి నేను చేస్తున్న పని తెలిసిన తర్వాత ఆమె నాకో డైరెక్షన్ ఇచ్చారు. ఆ ధైర్యంతోనే నా కుటీర పరిశ్రమ మొదలైంది. తొలి ఆర్డర్ యూఎస్‌కి, డాక్టర్ గీతాంజలి మేడమ్ పది వేల రూపాయల ఆర్డర్ ఇచ్చారు. అలా మొదలైన నా జర్నీ ఇప్పుడు నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయంతో విజయవంతంగా సాగుతోంది. మిల్లెట్స్‌తో ప్రయోగాలు నన్ను నిలబెట్టాయి.’’ అన్నారు కృష్ణకుమారి.మహిళాశక్తి క్యాంటీన్డ్వాక్రా స్వయంసహాయక బృందంలో చేరిన తర్వాత తన కార్యకలాపాలను వేగవంతం చేశారు కృష్ణకుమారి. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎన్ఐఆర్డీలో శిక్షణ తీసుకోవడంతోపాటు, తన ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో స్టాల్ పెట్టడంతో మొదలైన ఆమె జర్నీ సరస్ మేళా ఎగ్జిబిషన్లతో అండమాన్, కశ్మీర్ మినహా దేశమంతటికీ విస్తరించింది.ఆమె విజయపథం... ఎగ్జిబిషన్లో స్టాల్ కోసం అధికారులను అడగాల్సిన దశ నుంచి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో స్టాల్ పెట్టవలసిందింగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చే దశకు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత ఏడాది జూన్ నెల రెండవ తేదీన జరిగిన వేడుకల్లో ఆమె స్టాల్ పెట్టారు. ఆ స్టాల్‌లోని ఉత్పత్తులను ఆసాంతం పరిశీలించిన మంత్రులు, ముఖ్యమంత్రి ఆమె అక్కడికక్కడే లైవ్ కౌంటర్లో వండిన తెలంగాణ రుచులకు కూడా సంతృప్తి చెందారు.డ్వాక్రా మహిళల కోసం శాశ్వతంగా ఒక వేదికను ఏర్పాటు చేయవలసిందిగా కోరడంతో ‘సెక్రటేరియట్ క్యాంటీన్ మహిళలకే ఇద్దాం’ అని నోటిమాటగా వచ్చిన ఉత్తర్వుతో అదే నెల 21న ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ మొదలైంది. అందులో కృష్ణకుమారితో పాటు పదిమంది మహిళలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ ఉపాధిపొందుతున్నారు. జయహో మహిళాశక్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిచిన్న రైతులేనా ఉత్పత్తులకు స్వాద్ అనే బ్రాండ్‌నేమ్ రిజిస్టర్ చేశాను. పరిశ్రమ దమ్మాయిగూడలో ఉంది. ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు. నేను ఉదయం తొమ్మిదిన్నరకు సెక్రటేరియట్‌కు చేరుకుంటాను. తిరిగి ఇంటికి చేరేటప్పటికి రాత్రి పదవుతుంది. యూనిట్లో నిన్న తయారైన మెటీరియల్‌ను ఈ రోజున కౌంటర్లో పెడతాను. ఏ రోజుకారోజు అమ్ముడైపోతాయి. సెక్రటేరియట్ క్యాంటీన్‌తోపాటు యూనిట్లోనే అవుట్లెట్ కూడా ఉంది. రాపిడో ద్వారా సప్లయ్ చేస్తున్నాం. వినియోగదారులు మా దగ్గరకు రావడం కంటే మేమే వినియోగదారుల దగ్గరకు వెళ్లాలనే ఉద్దేశంతో మొబైల్ యూనిట్ ప్రారంభించనున్నాను.నా సక్సెస్‌కి కారణం తోటలే. పచ్చళ్లు, పొడులు ఏవి చేయాలన్నా కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకోను. నేరుగా తోటలకే వెళ్లి తెచ్చుకుంటాను. భారీ స్థాయిలో పండించే వాళ్లు స్వయంగా మార్కెట్‌కు తరలించగలుగుతారు. చిన్న రైతులు తమకు తాముగా మార్కెట్‌కి తీసుకెళ్లాలంటే ఆ ఖర్చులు భరించలేరు. నేను వారి దగ్గర తీసుకుంటాను. నేను ఇష్టంతో ఎంచుకున్న ప్రొఫెషన్. నాకు ఉపాధినివ్వడంతోపాటు గుర్తింపును కూడా తెచ్చింది. ఇందులోనే భవిష్యత్తును నిర్మించుకుంటాను. మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మహిళలకు తెలియడం లేదు. ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం కోసం పని చేస్తాను.– ఆకుల కృష్ణకుమారి, స్వాద్ ఫుడ్స్

లేడీ బౌన్సర్స్‌కు అడ్డే లేదు
స్త్రీలను కొన్ని ఉపాధుల్లోకి రానీకుండా అడ్డుకుంటారు. అడ్డుకునేవారిని అడ్డుకుంటాం అంటున్నారు ఈ లేడీ బౌన్సర్లు. కొచ్చి, పూణె, ఢిల్లీ, ముంబైలలో లేడీ బౌన్సర్లకు గిరాకీ పెరిగింది. సెలబ్రిటీలను గుంపు నుంచి అడ్డుకుని వీరు కాపాడుతారు. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్ తెలిసిన స్త్రీలు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. రోజుకు రెండు వేల వరకూ ఫీజు. వివాహితలూ ఉన్నారు. వివరాలు...ఎనిమిది గంటలు డ్యూటీ. తీసుకెళ్లడం తీసుకురావడం ఏజెన్సీ పని. భోజనం ఉంటుంది. బయట ఊర్లయితే రూము కూడా ఇస్తారు. రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదన. చేయాల్సిన పని?⇒ క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం⇒ ఈవెంట్ సెక్యూరిటీ⇒ సెలబ్రిటీల రక్షణ⇒ సెలబ్రిటీలను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం⇒ సంపన్నుల వేడుకల్లో హంగామా కోసం ⇒ ప్రయివేటు సమస్యల్లో రక్షణఇటీవల ఒక సినీ నటుడి ఇంటి గొడవల్లో బౌన్సర్లనే మాట ఎక్కువగా వినిపించింది. పోలీసుల రక్షణ వీలుగాని చోట ప్రముఖులు బౌన్సర్ల సాయం తీసుకోవడం సాధారణం అయ్యింది. ఒకప్పుడు పబ్‌లలో తాగి గొడవ చేసే వారి కోసం మాత్రమే బౌన్సర్లు ఉండేవారు. ఇప్పుడు అన్ని సేవలకు వారిని ఉపయోగిస్తున్నారు. సెక్యూరిటీకి మాత్రమే కాదు దర్పం చూపించడానికి కూడా శ్రీమంతులు బౌన్సర్లను వాడుతున్నారు. ఉదాహరణకు కలవారి పెళ్లిళ్లలో వరుడు/వధువు కల్యాణ వేదికకు వచ్చేప్పుడు వరుసదీరిన బౌన్సర్లు చెరో పక్క నడుస్తూ బిల్డప్ ఇస్తున్నారు. చూసేవారికి ఇది గొప్పగా ఉంటుంది. వేడుకలకు, బిజినెస్ మీటింగ్స్‌కు వచ్చే అతిథుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు బౌన్సర్లను పంపుతున్నారు. కాలేజీ వేడుకలు, ప్రారంభోత్సవాలు, ఔట్‌డోర్ షూటింగ్‌లు... వీటన్నింటికీ బౌన్సర్లు కావాలి. ఎంతమంది బౌన్సర్లుంటే అంత గొప్ప అనే స్థితికి సెలబ్రిటీలు వెళ్లారు. దాంతో వీరి సేవలను సమకూర్చే ఏజెన్సీలు నగరాల్లో పెరిగాయి. మహిళా బౌన్సర్లు కూడా పెరిగారు.ఇబ్బందిగా మొదలయ్యి...‘మొదట ప్యాంటూ షర్టు వేసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. ఇంట్లో వాళ్లు కొత్తగా చూశారు. ఇరుగుపొరుగు వారు వింతగా చూశారు. కాని తరువాత అలవాటైపోయింది’ అంది పూణెకు చెందిన ఒక మహిళా బౌన్సర్. 2016లో దేశంలోనే మొదటిసారిగా మహిళా బౌన్సర్ల ఏజెన్సీ ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు కేరళలో ఈ రంగంలోకి వస్తున్నవారు పెరిగారు. ‘మేము ఎవరినో రక్షించడానికి వెళుతుంటే మా రక్షణ కోసం కొత్తల్లో కుటుంబ సభ్యులు ఆందోళన పడేవారు. కాని స్త్రీలు ఈ రంగంలో సురక్షితంగా పని చేయొచ్చని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు’ అని మరో బౌన్సర్ అంది.రెండు విధాలా ఆదాయంకొచ్చిలో ‘షీల్డ్ బౌన్సర్స్ ఏజెన్సీ’కి చెందిన మహిళా బౌన్సర్లు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా మారారు. ఈవెంట్స్‌లో మహిళా అతిథులకు, స్టేజ్ రక్షణకు, అతిథుల హోటల్ నుంచి ఈవెంట్ వద్దకు తీసుకు రావడానికి వీరి సేవలు ఉపయోగిస్తున్నారు. ‘సాధారణంగా ఈవెంట్స్ సాయంత్రాలు ఉంటాయి. బౌన్సర్ల పని అప్పటి నుంచి మొదలయ్యి అర్ధరాత్రి వరకూ సాగుతుంది. కాబట్టి పగటి పూట చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లేదా ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ మధ్యాహ్నం తర్వాత ఈ పని చేస్తున్నవారూ ఉన్నారు. దాంతో రెండు విధాల ఆదాయం ఉంటోంది’ అని ఆ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు.స్పోర్ట్స్ తెలిసినవారుస్కూల్, కాలేజీల్లో స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉన్న మహిళలు, వ్యాయామం ద్వారా జిమ్ ద్వారా దేహాన్ని ఫిట్‌గా ఉంచుకున్నవారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు మహిళా బౌన్సర్లుగా రాణిస్తారు. వెంటనే వారికి పని దొరికే పరిస్థితి ఉంది. దేశంలోని నగరాల్లో వివాహితలు, పిల్లలున్న తల్లులు కూడా వృత్తిలో రాణిస్తున్నారు. ‘జనాన్ని అదుపు చేయడం, వారిని ఒప్పించి ఇప్పుడే దూరంగా జరపడం, ఆకతాయిలను కనిపెట్టడం, సెలబ్రిటీలతో వ్యహరించే పద్ధతి తెలియడం, చట్టపరిధిలో గొడవలను అదుపు చేయడం తెలిస్తే ఈ వృత్తి లాభదాయకం’ అంటున్నారు ఈ మహిళా బౌన్సర్లు.

క్యాంటీన్లో గిన్నెలు కడిగాడు : ఇపుడు బిజినెస్ టైకూన్లా కోట్లు
జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి, సాధించాలేగానీ సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందలా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాల్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేగానీ నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్లో క్యాంటీన్లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పని చేయడం వరకు. సంజిత్ కష్ట సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాపవుట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఫిదా అవుతారు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా (Sanjith Konda) మెల్బోర్న్లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని బుండూరా క్యాంపస్‌లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌ను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు ఇదో అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కిక్ ఏముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లలో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ వారానికి రూ. 33 వేలు సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకు నాంది పలికింది.2019లొ సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి రూ. 1.1 లక్షల స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈవెంట్స్ ఉత్సవాలను నిర్వహించాడు. ఐదో సెమిస్టర్లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియన్లు టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటినుంచీ టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్‌నే బిజినెస్‌గా మల్చుకున్నాడు. దీనికి మెల్బోర్న్లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్‌తో చర్చించాడు. ఆరో సెమిస్టర్లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్‌లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. 'డ్రాపౌట్ చాయ్‌వాలా' గా సంజిత్ జర్నీ మొదలైంది. ప్రీతం అకు, అరుణ్ పి. సింగ్ అనే ఇద్దరు కళాశాల సీనియర్లను నియమించుకున్నాడు. అలా సంజిత్తో సహా కేవలం ఐదుగురు వ్యక్తులతో మరియు ఐదు రకాల చాయ్‌లతో ప్రారంభమైంది. మొదటి మూడు నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తరువాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక్క ఏడాదిలోనే సంవత్సరంలోనే, చాయ్ ట్రక్‌తో సహా మరో రెండు ప్రదేశాల్లో తన షాపును ఓపెన్ చేశాడు. రకరకాల ప్లేవర్లను పరిచయం చేస్తూ ‘డ్రాపవుట్ చాయ్‌వాలా’ బాగా పాపులర్ అయ్యాడు. 40 మంది కార్మికులతో రూ. 5.57 కోట్లు టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్పుచినో లాంటివాటితోపాటు, టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా , వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్‌ను కూడా అందిస్తుంది.సంజిత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్, అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజిత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయ పడటం, తల్లి పాస్‌బుక్‌ను అప్డేట్కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధన బిల్లు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్‌తో సంజిత్ తల్లి చాలా సంతోషంగా ఉంది. View this post on Instagram A post shared by Dropout Chaiwala (@dropout_chaiwala)మూడేళ్ల సంబరం : డ్రాపౌట్ చాయ్‌వాలా ఇటీవల ముచ్చటగా మూడేళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం ,సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజిత్.మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమే ఒక బ్రాండ్‌కు మించి ఎదిగిన కుటుంబం మనది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

పిల్లల పెంపకం తపస్సు లాంటిది : మంచి పాటలతో మానిసిక ఉత్తేజం
ముంబై సెంట్రల్: ‘పిల్లల పెంపకమనేది వినోదం కాదు..అదో తపస్సు.. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన నేటికాలంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరిగింది. పిల్లలు భవిష్యత్తులో ఆదర్శవంతంగా ఎదగాలంటే ముందు తల్లిదండ్రులు తమ ప్రవర్తన మార్చుకోవాలి. పిల్లలు కాపీ కొట్టేది ముందుగా తల్లిదండ్రుల్నే..’అన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా’’ఇండ్ల విశాల్‌రెడ్డి. ఆదివారం ఆంధ్ర మహాసభలో ‘విజ్ఞానం–వినోదం’పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పిల్లలు ఎల్రక్టానిక్ గాడ్జెట్స్‌కు అలవాటు పడకుండా చూడాలనీ, వారిలో సర్వాంగ వికాసానికి తల్లిదండ్రులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలనీ సూచించారు. పిల్లల్ని ఇతరులతో పోల్చడం, వారిపై కఠినమైన ఆంక్షలు విధించడం, తల్లిదండ్రుల అభిరుచుల్ని బలవంతంగా రుద్దడం వల్ల పిల్లల్లో మానసిక వికాసం ఆగిపోతుందని హెచ్చరించారు. మంచి పాటలతో మానిసిక ఉత్తేజం: డా. ఇండ్ల రామసుబ్బారెడ్డికార్యక్రమంలో భాగంగా ‘మనసు పాటలపై మానసిక విశ్లేషణ’అనే అంశంపై సుప్రసిద్ధ మానసిక నిపుణులు డా’’ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగించి, సభికుల్ని అలరించారు. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు మానసిక క్షోభకు గురవుతాడనీ, అలాంటి సమయంలో కుంగిపోకుండా, మోటివేషన్ కలిగించే మధురమైన పాటలు వింటే తాత్కాలికంగా మానసిక ఒత్తిడికి దూరమై నూతన ఉత్తేజాన్ని పొందుతాడని చెప్పారు. ఒక మానసిక వైద్యుడిగా ఇది తాను సాధికారికంగా చెప్పగలననీ అన్నారు.ఈ సందర్భంగా ఆయన ‘ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, మనసు పలికే మౌన గీతం, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో, మనసు గతి ఇంతే, పాడుతా తీయగా చల్లగా, ఆట గదరా శివా, కలకానిది విలువైనది.’లాంటి పలు పాటల్ని ప్రదర్శిస్తూ, ఆ పాటలు ప్రభావం మనిషి జీవితంపై చూపలగల ప్రభావాన్ని గురించి ఉదాహరణలతో సహా వివరించారు. తెలుగువారి ప్రయోజనాలే ముఖ్యం: అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆంధ్ర మహాసభలో వినోదాత్మక కార్యక్రమాలతో పాటు ఆధ్యాతి్మక, మానసిక వికాస, సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామనీ, తెలుగువారి ప్ర యోజనాలే తమకు ముఖ్యమని అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. వీరందరికీ ఆంధ్ర మహాసభ తరపున టీ, టిఫిన్లు ఏర్పాటుచేశారు. అనంతరం ఇరువురు వైద్యుల్ని మహాసభ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సభకు సాహి త్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్ స్వా గతం పలకగా, ధర్మకర్తల మండలి సభ్యుడు గాలి మురళీధర్ సమన్వయ కర్తగా వ్యవహరించారు. గాలి మురళీధర్ వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు సంగం ఏక్నాథ్, భోగ సహాదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, తాళ్ళ నరేశ్, సంయుక్త కార్యదర్శులు మచ్చ సుజాత, కటుకం గణేశ్, అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేష్, క్యాతం సువర్ణ, కూచన బాలకిషన్, చిలుక వినాయక్, అల్లం నాగేశ్వర్రావు, మహిళ శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్య దర్శి పిల్లమారపు పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఫొటోలు
International

ఏఐ ఉందా జాబ్ ఇంద..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేదా కారు ఉంటే సరిపోయేది. ఇప్పుడలా కాదు. అభ్యర్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం తప్పనిసరి..’ఇవి ఒక ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ హెడ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ప్రస్తుత జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సంప్రదాయ విద్యార్హతలకు మించి మార్కెట్‌కు తగ్గట్టుగా ఉద్యోగులూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే విజయం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏఐ రెడీ వర్క్‌ఫోర్స్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు ఉంది. సాంకేతిక పురోగతి వైపు ప్రపంచ జాబ్ మార్కెట్ పయనిస్తోంది. కంపెనీల లేఆఫ్‌లకు కారణాల్లో ఒకటైన ఏఐ.. కొత్త ఉద్యోగ అవకాశాలకూ వేదిక అవుతోంది. భారత్‌లో 2027 నాటికి ఏఐలో 23 లక్షల ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతాయని బెయిన్ అండ్ కంపెనీ ఇటీవలి నివేదికలో వెల్లడించింది. నిపుణుల సంఖ్య మూడేళ్లలో 12 లక్షలకు చేరుకుంటుందని, కొరత 10 లక్షలకు పైమాటే అని వివరించింది. బడా కంపెనీల్లో లేఆఫ్స్..ఏఐ సృష్టిస్తున్న ప్రభంజనం ప్రభావం లేఆఫ్స్ రూపంలో కనిపిస్తోంది. కంపెనీల ఆదాయాల్లో వృద్ధి లేకపోవడం, ఉత్పాదకత పడిపోవడం, వ్యయాలు అధికం కావడం, లాభాల కోసం ఇన్వెస్టర్ల ఒత్తిడి.. ఉద్యోగుల తీసివేతలకు కారణమవుతున్నాయి. టెక్నాలజీ కంపెనీలకు అగ్రరాజ్యంగా చెప్పుకునే యూఎస్‌లో ఉద్యోగుల తీసివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా సుమారు 23,400 మందిని ఇంటికి పంపించాయి. వీటిలో గూగుల్, మెటా, డిస్నీ, సిటీ గ్రూప్, హెచ్‌పీ, వాల్‌మార్ట్, ఫోర్డ్, స్టార్‌బక్స్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. అమెజాన్ 18 వేల మందికి, ఐబీఎం 9 వేల మందికి, బోయింగ్ 10% మందికి ఉద్వాసన పలుకుతున్నాయని సమాచారం. సేల్స్‌ఫోర్స్ 30% మందిని ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. 2024లో 549 కంపెనీలు 1.52 లక్షల మందికి గుడ్‌బై చెబితే.. 2023లో ఏకంగా దాదాపు 1,200 కంపెనీలు 2.64 లక్షల మంది టెకీలను సాగనంపాయి. యూఎస్‌లో టెక్, సంబంధిత రంగాల్లో నిరుద్యోగిత రేటు 2022తో పోలిస్తే 2024లో 2.9 నుంచి 4.4 శాతానికి చేరుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. భారత్‌లో అంత లేదు.. భారత్‌లో ఐటీ కంపెనీలు నిశ్శబ్దంగా లేఆఫ్‌లు చేపడుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే ఏడాదిలో 50,000 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని సమాచారం. అయితే తీసివేతలు ఆందోళన కలిగించే స్థాయిలో లేవన్నది నిపుణుల మాట. హైదరాబాద్‌లో మాత్రం కంపెనీలు గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా కాకుండా ఆచితూచి నియామకాలు చేపడుతున్నాయి. టీసీఎస్ 1,80,000 నియామ కాలకు శ్రీకారం చుట్టింది. ఇక మొత్తం లేఆఫ్‌లలో ఏఐ ప్రభావానికి గురైనవి 10% మాత్రమేనట. కరోనా కాలంలో కంన్జ్యూమర్ టెక్‌పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గట్టుగా కంపెనీలు నియామకాలు చేపట్టాయి. నాటి రిక్రూట్మెంట్లో పరిమిత నైపుణ్యం గల వారు సైతం ఉన్నారు. వీరి వల్ల ఉత్పాదకతలో అసమతుల్యత ఏర్పడి కంపెనీలు క్లయింట్ల ఆగ్రహానికి లోనయ్యాయి. ఇటువంటి వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. మరోవైపు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) భారత్‌కు వెల్లువెత్తుతున్నా యి. ఈ కేంద్రాల్లో రిక్రూట్మెంట్ కొనసాగుతోంది. ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాలి ప్రీమియం, క్వాలిటీ స్కిల్స్ ఉన్నవారికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఏఐ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ కొరత ఉంది. డిమాండ్‌కు తగ్గ నైపుణ్యం పెంచుకోవడమే ఇప్పుడున్న మార్గం. కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగానైనా నైపుణ్యం అందిపుచ్చుకోవాలి. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. – వెంకారెడ్డి, హెచ్ఆర్ రంగ నిపుణులు క్యాంపస్‌లోనే కొట్టాలి.. విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే జాబ్ కొట్టాలి. విఫలం అయితే కాస్త కష్టపడాల్సిందే. దొరికినా రూ.2.5 లక్షల లోపు వార్షిక ప్యాకేజీతోనే. నైపుణ్యం ఉన్నవారికి జీసీసీలు అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నా యి. నియామకాల్లో జీసీసీల హవా కొనసాగుతోంది. – నానబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్

బంగ్లాదేశ్‌లో త్వరలో సైనిక పాలన!
ఢాకా: బంగ్లాదేశ్‌లో త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించడం సంచలనాత్మకంగా మారింది. తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్లు మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగిన తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పనితీరు పట్ల ప్రజలతోపాటు సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యూనస్‌పై తిరుగుబాటు జరిగే అవకాశం కచ్చితంగా ఉన్నట్లు మీడియా స్పష్టంచేసింది.యూనస్‌ను పదవి నుంచి తొలగించి సైన్యమే అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు బంగ్లాదేశ్ ప్రసార మాధ్యమాల్లో వరుసగా కథనాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ నేతృత్వంలో సైన్యం సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్, ఇండిపెండెంట్ బ్రిగేడ్ కమాండింగ్ అధికారులు, పలువురు ఆర్మీ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో తొలుత అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించి, ఆ తర్వాత మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు బంగ్లాదేశ్ మీడియా అంచనా వేస్తోంది. సైన్యం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అత్యవసర భేటీ జరగలేదన్న సైన్యం సైనిక ఉన్నతాధికారుల అత్యవసర సమావేశమేదీ జరగలేదని బంగ్లాదేశ్ సైన్యం తేల్చిచెప్పింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఉద్దేశం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రసార మాధ్యమాలకు సూచించింది.

కెనడా ఎన్నికల్లో పాక్ జోక్యం?: కెనడా ఆరోపణ
న్యూఢిల్లీ: భారతదేశానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెరుగుతున్న మద్దతు దృష్టా, దానిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్(Pakistan) ఏప్రిల్ 28న కెనడాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశం ఆరోపించింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ వెనెస్సా లాయిడ్ ఈ ఆరోపణలు చేశారు.పాకిస్తాన్లో రాజకీయ భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు, భారతదేశానికి(India) పెరుగుతున్న మద్దతును ఎదుర్కొనేందుకు పాక్ తన వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా కెనడాతో విదేశీ దౌత్య కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా కెనడా.. పాక్, భారత్‌లపై ఇలాంటి ఆరోపణలను మోపింది. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.2021, 2019 కెనడా సార్వత్రిక ఎన్నికల(Canadian general election) సమయంలోనూ భారతదేశం, పాకిస్తాన్ రహస్యంగా జోక్యం చేసుకున్నాయని కెనడా ఆరోపించింది. ఎన్డీటీవీ ఒక కథనంలో.. రాబోయే కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని పరిశీలిస్తున్న సమాఖ్య 2024లో గూఢచారి సంస్థ అందించిన సమాచారాన్ని విడుదల చేసిందని పేర్కొంది. ఖలిస్తానీ ఉద్యమం లేదా పాకిస్తాన్ అనుకూల వైఖరికి సానుభూతిపరులైన భారతీయ సంతతికి చెందిన ఓటర్లు కెనాడాలో ఉన్నారని వెనెస్సా లాయిడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాక్సీ ఏజెంట్ అనుకూల అభ్యర్థులకు అక్రమ ఆర్థిక సహాయం అందించిన ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయిని లాయిడ్ ఆరోపించారు. కెనడా ఎన్నికల్లో భారత్, చైనాలు జోక్యం చేసుకునే అవకాశం ఉందని కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు

హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు వీసాదారులపై నిరంతర నిఘా
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా యూఎస్ఏలో ఉంటున్న విదేశీయులపై ట్రంప్ సర్కారు(Trump administration) ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసితులు కాలేరని అమెరికా దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో భారతీయ సంతతికి చెందిన లక్షలాది మంది వలసదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని వారాలుగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ నియమాలను మరింత కఠినతరం చేశారు.సహనానికి పరీక్షఈ నేపధ్యంలో అమెరికాలోకి ప్రవేశించే, నిష్క్రమించే హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు వీసాదారులను(H-1B, F-1, and Green Card visa holders) అమెరికా ఏజెన్సీలు గమనిస్తున్నాయి. ఆ వీసాలతో వారి చదువు, ఉద్యోగాల వివరాలను తనిఖీ చేస్తున్నాయి. ఇది వీసాదారుల సహనానికి పరీక్షగా మారుతున్నదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గ్రీన్ కార్డ్, హెచ్-1బీ హోల్డర్లకు ప్రయాణ సమయంలో వారి ఆధారాలను అందుబాటులో ఉంచుకోవాని సూచించారు. యుఎస్‌లో నివసిస్తున్నలక్షలాది మంది భారతీయులు గ్రీన్ కార్డ్ లేదా హెచ్-1బి లేదా ఎఫ్-1 వీసాలను కలిగి ఉన్నారు. వీరు అమెరికాకు తిరిగి వచ్చే సమయంలో ఎంట్రీ పోర్ట్‌లో వారి ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.తనిఖీలు ముమ్మరంశాశ్వత నివాసితులు, చట్టపరమైన వీసాదారులు వారి నివాస స్థితి లేదా పని చెల్లుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ, ఈ తనిఖీలు వారికి ఇబ్బందికరంగా మారాయి. ప్రపంచంలోని 43 దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ఉందేందుకు లేదా వారి రాకను పరిమితం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసిన తరువాత ఈ విధమైన తనిఖీలు ముమ్మరమయ్యాయి. అమెరికాలో చట్టాన్ని గౌరవిస్తూ, పన్ను చెల్లించే భారతీయులకు ఎటువంటి ప్రయాణ నిషేధం లేదా పరిమితులు లేనప్పటికీ వారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించారు.దరఖాస్తుల ప్రాసెస్‌లో జాప్యంగత కొన్ని వారాలుగా ఎంట్రీ పోర్ట్‌లో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు(American Embassies), కాన్సులేట్లలో ముమ్మర తనిఖీల కారణంగా ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎన్డీటీవీ ఒక కథనంలో పేర్కొంది. అమెరికాకు వెళ్లేవారి డాక్యుమెంటేషన్ పరిశీలన ఇప్పుడు పలు దశలుగా సాగుతోంది. దీంతో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి సమయాన్ని అధికారులు పొడిగిస్తున్నారు. గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసితులు), హెచ్-1B (అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు), ఎఫ్-1 (విద్యార్థులు) వీసా హోల్డర్లు ప్రయాణ సమయంలో తమ చెక్-లిస్ట్‌ను అందుబాటులో ఉంచుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: చట్టం అందరికీ సమానమేనా?: స్టూడియో విధ్వంసంపై కునాల్ కమ్రా
National

బెట్టింగ్ యాప్ వ్యవహారం.. మాజీ సీఎం ఇళ్లలో సీబీఐ సోదాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్ వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలు కేసుల్లో ఈడీ, సీబీఐ అధికారులు ఆయనను టార్గెట్ చేశారు. తాజాగా బెట్టింగ్ యాప్ వ్యవహారం విషయమై.. భూపేష్ బాఘేల్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక, ఇప్పటికే ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిపింది దీంతో, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.వివరాల ప్రకారం.. మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను పలు కేసులు టెన్షన్ పెడుతున్నాయి. ఆయనపై కేసుల ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించిన కేసులో భూపేష్ బాఘేల్ నివాసాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. రాయ్‌పుర్, భిలాయిలోని ఆయన నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు (CBI Raids) చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయను అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి.మరోవైపు.. సీబీఐ సోదాలపై మాజీ సీఎం భూపేష్ బాఘేల్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ట్విట్టర్ వేదికగా..‘ఇప్పుడు సీబీఐ వచ్చింది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ (గుజరాత్)లో జరగనున్న ఏఐసీసీ సమావేశం కోసం ఏర్పాటైన “డ్రాఫ్టింగ్ కమిటీ” సమావేశానికి భూపేష్ బాఘేల్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే నేడు ఉదయమే సీబీఐ రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలకు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం విశేషం.अब CBI आई है.आगामी 8 और 9 अप्रैल को अहमदाबाद (गुजरात) में होने वाली AICC की बैठक के लिए गठित “ड्राफ़्टिंग कमेटी” की मीटिंग के लिए आज पूर्व मुख्यमंत्री भूपेश बघेल का दिल्ली जाने का कार्यक्रम है.उससे पूर्व ही CBI रायपुर और भिलाई निवास पहुँच चुकी है.(कार्यालय-भूपेश बघेल)— Bhupesh Baghel (@bhupeshbaghel) March 26, 2025ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను పలు కేసులు వెంటాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి భూపేష్ బాఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సోదాల సందర్భంగా రూ.30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సోదాల అనంతరం తిరిగి వెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో, ఒక్కసారిగా అక్కడ ఆందోళన నెలకొంది. #WATCH | Raipur: CBI raids underway at the residence of former Chhattisgarh CM and Congress leader Bhupesh Baghel. pic.twitter.com/McOgzts1qk— ANI (@ANI) March 26, 2025

Kashmir: హురియత్ దుకాణం బంద్.. వేర్పాటువాదుల నోటికి తాళం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో హురియత్(Hurriyat) దుకాణం మూతపడనుంది. ఇక్కడి జనం వేర్పాటువాదానికి స్వస్తిపలికి, భారత రాజ్యాంగంపై తమ విధేయతను ప్రకటిస్తున్నారు. కశ్మీర్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు వేర్పాటువాదానికి ముగింపు పలికేలా కనిపిస్తున్నాయి. హురియత్ కాన్ఫరెన్స్‌లోని భాగస్వామ్య పార్టీలైన జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ (జేకేపీఎం), జే అండ్ కే డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్మెంట్ (జేకేకేపీఎం) ఇకపై వేర్పాటువాదంతో తమకున్న అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.ఇది భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. జేకేపీఎంకు షాహిద్ సలీం నాయకత్వం వహిస్తుండగా, జేకేడీపీఎంకు న్యాయవాది షఫీ రేషి సారధ్యం వహిస్తున్నారు. ఇటీవల షాహిద్ సలీం తాను, తన సంస్థ వేర్పాటువాద భావజాలానికి దూరం అయ్యామని, భారతదేశ రాజ్యాంగంపై విధేయతను కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు. Separatism has become history in Kashmir.The unifying policies of the Modi government have tossed separatism out of J&K. Two organizations associated with the Hurriyat have announced the severing of all ties with separatism.I welcome this step towards strengthening Bharat's…— Amit Shah (@AmitShah) March 25, 2025ఎన్డీటీవీ అందించిన కథనంలోని వివరాల ప్రకారం సలీం, రేషి నిర్ణయాలను స్వాగతించిన కేంద్ర హోం మంత్రి షా(Union Home Minister Shah) మాట్లాడుతూ వారు తీసుకున్ననిర్ణయం భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తుందని, ప్రధాని మోదీ ప్రభుత్వంలోని సమైక్యత విధానాలు జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని అంతం చేశాయని అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో రాశారు. శాంతియుతమైన సమగ్ర భారతదేశాన్ని నిర్మించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలకు అందిన అతి పెద్ద విజయం ఇది అని అమిత్ షా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్

మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్
నోయిడా: మద్యం ప్రియులకు శుభవార్త. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొక బాటిల్ ఉచితం(Buy one bottle, get another bottle free). పైగా ఫుల్ బాటిల్ కొంటే రూ. 200 డిస్కౌంట్. ఇది ఏ ఒక్క మద్యం దుకాణానికో పరిమితం కాదు. పలు జిల్లాల్లో ఈ ఆఫర్ కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులంతా ఆయా దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మద్యంపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నారు. తాజాగా మంగళవారం నోయిడాలోని ఒక దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో మద్యం ప్రియులు భారీ సంఖ్యలో క్యూకట్టారు. కాగా మద్యంపై తగ్గింపు ధరలు ఒక్క నోయిడాకు మాత్రమే పరిమితం కాలేదు. యూపీలోని పలు జిల్లాల్లో మద్యంపై అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక బాటిల్ కొనుగోలు చేస్తే మరొక బాటిల్, మరికొన్ని చోట్ల పూర్తి బాటిల్ కొనుగోలు చేస్తే రూ. 200 వరకు తగ్గింపు అందిస్తున్నారు.एक बोतल शराब लीजिए, उसके साथ एक फ्री..उत्तर प्रदेश के शराब ठेके वालों को 31 मार्च की रात 12 बजे तक सारा स्टॉक खत्म करना है. वरना बची हुई दारू सरकारी खाते में जमा हो जाएगी और उसकी बिक्री नहीं हो पाएगी. इसलिए ठेके वाले ग्राहकों को खूब ऑफर दे रहे हैं. Video नोएडा का है.#Noida pic.twitter.com/lXZqadqzCd— NDTV India (@ndtvindia) March 25, 2025ఎన్డీటీవీ పేర్కొన్న కథనం ప్రకారం నోయిడా సెక్టార్ 18లోని ఒక మద్యం దుకాణం ముందు ‘ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం’ అనే బోర్డు పెట్టగానే మద్యం ప్రియులు పరిగెత్తుకుంటూ ఆ దుకాణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏదో జాతర జరుగుతున్నలాంటి దృశ్యం కనిపించింది. కొందరు క్యూలో నిలుచుని మద్యం కోనుగోలుకు వేచిచూడగా, మరికొందరు ఇతరులతో గొడవపడుతూ, మద్యం కొనుగోలుకు ప్రయత్నించారు. అక్కడున్నవారికి మద్యం బాటిల్ దొరకగానే ఏదో జాక్‌పాట్ తగిలినట్లు ఆనందించారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాలలో భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆయా దుకాణాలకు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా నిల్వవున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేసేందుకే ఇక్కడి మద్యం దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ముజఫర్ నగర్‌లోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలుకు వేచిచూస్తున్న రాహుల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక బాటిల్ కొనుగోలుకు మరొక బాటిల్ ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పాడు.యూపీలోని మద్యం స్టాకును అమ్మేందుకు మార్చి 25 చివరి తేదీ. అయితే మద్యం కాంట్రాక్టర్లు(Liquor contractors) మరో ఐదు రోజుల గడువుకోరి, డిస్కౌంట్లు అందిస్తూ జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ-లాటరీ ద్వారా కొత్తగా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ నేపధ్యంలో కొందరు మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ-లాటరీలో దుకాణాలను దక్కించుకోలేకపోయారు. మరోవైపు మార్చి 31 నాటికి పాత దుకాణాల్లో స్టాక్‌ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మద్యం దుకాణాల్లో తగ్గింపు ధరలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు

ఉదయం గర్ల్‌ఫ్రెండ్.. సాయంత్రం మరొకరు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒకే రోజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రియురాలి మెడలో ఉదయం తాళికట్టిన అతడు.. పెద్దలు కుదిర్చిన యువతితో సాయంత్రం ఏడడుగులు నడిచాడు. మోసపోయినట్లు తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్ జిల్లా హర్పూర్ బుధాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు నాలుగేళ్లుగా ఓ యువతితో సంబంధం నెరుపుతున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా రెండుసార్లు అబార్షన్ చేయించాడు. ఒకసారి గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత గర్భం దాల్చడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జన్మించిన బిడ్డను నర్సుకు అప్పగించాడు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటే తన కుటుంబం కూడా ఒప్పుకుంటుందని నమ్మబలికాడు.ఈ క్రమంలో ఒక రోజు ఉదయం రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లి, తాళి కట్టాడు. అదే రోజు రాత్రి పెద్దలు కుదిర్చిన విధంగా సంప్రదాయబద్ధంగా మరో యువతిని పెళ్లి చేసుకుంది. అనంతరం, విషయం తెలిసి అక్కడికి వెళ్లిన బాధితురాలిని అతడి కుటుంబీకులు దూషించి, వెళ్లగొట్టారు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

నిందితుడిపై అస్పష్టత!
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార యత్నం కేసులో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసు బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మార్గంలోని 12 ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చెబుతున్న వివరాల్లో స్పష్టత లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యమవుతోంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలికి పలువురు పాతనేరస్తుల ఫొటోలు చూపించారు. ఇందులో ఒక పాత నేరస్తుడి ఫొటోతో నిందితుడికి పోలికలు ఉన్నట్టు చెప్పింది. అదుపులో అనుమానితుడు: బాధితురాలు చెప్పిన పోలికలు ఉన్న అనుమానితుడు మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేశ్‌గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతనేరస్తుడు అయిన ఏడాది క్రితమే మహేశ్‌ను భార్య వదిలేయడంతో, మాదక ద్రవ్యాల వినియోగానికి బానిసయ్యాడు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ముందుకు మహేశ్‌ను తీసుకెళ్లారు. నేరుగా అనుమానితుడిని చూశాక, నిందితుడు అతను కాదని ఆమె చెప్పినట్టు సమాచారం. అయినా, మహేశ్‌తోపాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అల్వాల్ స్టేషన్ నుంచి నిందితుడు: అన్ని స్టేషన్లలో పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు...నిందితుడు అల్వా ల్ రైల్వేస్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైలు ఎక్కినట్టు «నిర్ధారించుకున్నారు. కానీ ఎక్కడ దిగిపోయాడన్న విషయంలో స్ప ష్టత రావడం లేదు. ఆర్పీఎఫ్, జీఆర్పీతోపాటు పలు విభాగాలకు చెందిన సిటీ పోలీసులు నిందితుడిని గుర్తించడానికి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.మేడ్చల్–గుండ్లపోచంపల్లి వరకు ఉన్న అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన కొనసాగుతోంది. ఎంఎంటీఎస్లలో సీసీ కెమెరాలు లేకపోయినా, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

టెన్త్ తెలుగు పేపర్ లీకేజీలో 13 మంది పాత్ర
నకిరేకల్: పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 13 మంది పాత్ర ఉందని, అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్టు నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. మంగళవారం డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కేంద్రంలో ఈ నెల 21న పదోతరగతి తెలుగు పరీ క్ష ప్రారంభమైన అరగంట తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతూ డీఈఓకు చేరింది. వెంటనే ఆయన ఎంఈవో నాగయ్యకు ఫోన్ చేయగా, నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిలో 11 మందిని స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. ఆ రోజు(21న) ప్లాన్ ప్రకా రం ఏ–1 చిట్ల ఆకాశ్, ఏ–3 చిట్ల శివ, ఒక బాలుడు కలిసి గురుకుల పాఠశాల వద్దకు స్కూటీపై వెళ్లారు. గేట్ వద్ద అప్పటికే పోలీసులు ఉండటంతో లోప లకు వెళ్లడానికి వారికి వీలు కాలేదు. దీంతో ఆ ముగ్గురు వెనుక వైపునకు వెళ్లారు. అక్కడ ఏ–11 రాహుల్ ఉన్నాడు. బాలుడు పరీక్ష కేంద్రం ఒకటో అంతస్తులోని రూమ్ నంబరు 8 వద్దకు చేరుకున్నా డు. ఆ గదిలో పరీక్ష రాస్తున్న తనకు పరిచయ మున్న విద్యార్థిని ఉండటంతో ప్రశ్నపత్రం చూపించమని సైగ చేయగా, అతని వెనకాల మరో ఇద్దరు కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే రాహుల్‌తో ఉన్న పరిచయం మేరకు ఆ విద్యార్థిని వెంటనే ఆ బాలుడికి ప్రశ్నపత్రం చూపించింది. ఆ బాలుడు తన ఫోన్లో ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని కిందకు దిగాడు. ఆ బాలుడు తీసిన ఆ ఫొటో పేపర్‌ను మిగతా నిందితులు ఒకరి నుంచి ఒకరికి పంపుకున్నారు. ఆ పేపర్లో ఉన్న ప్రశ్నలకు.. ఏ–4 అయిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు గుడుగుంట్ల శంకర్ సమాధానాలు తయారు చేయగా, వాటిని రవిశంకర్ జెరాక్స్ షాప్‌లో జెరాక్స్ తీసుకున్నారు. నిందితులు సమాధాన పత్రాలను వారికి తెలిసిన వారికి ఇవ్వడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లగా, అక్కడ పోలీసులను చూసి దొరికి పోతామేమోనని వెళ్లిపోయారు. ఈ కేసుపై పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, పేపర్ లీకేజీ వ్యవహారాన్ని బయటపెట్టారని డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు. బంధువుల పిల్లల కోసం... నకిరేకల్‌కు చెందిన చిట్ల ఆకాశ్, చిట్ల శివ, గుడుగుంట్ల శంకర్, బి.రవిశంకర్, బండి శ్రీనుతో పాటు ఓ బాలుడిని ఈ నెల 23న రిమాండ్‌కు పంపామని డీఎస్పీ చెప్పారు. పోగుల శ్రీరాములు, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పల్ల మనోహర్‌ను విచారిస్తున్నామన్నారు. రాహుల్‌తోపాటు మరోబాలుడు పరారీలో ఉన్నారని చెప్పారు. తమ బంధువుల పిల్లలు పదోతరగతిలో ఎక్కువ మార్కులు సాధించాలని కొంతమంది ఆకతాయిలు ఇదంతా చేశారన్నారు.కూతురి పరీక్ష.. తల్లిదండ్రులే ఇన్విజిలేటర్లుకోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయ దంపతులు ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న కేంద్రంలోనే.. వారి కూతురు పరీక్ష రాయటం వివాదాస్పదంగా మారింది. తాము ఇన్విజిలేషన్ నిర్వహించే పరీక్ష కేంద్రాల్లో సంతానం పరీక్ష రాయటం లేదని.. ఉపాధ్యాయులు పరీక్షలకు ముందే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.అలాంటి డిక్లరేషన్ ఇచ్చి కూడా.. తమ కూతురు పరీక్ష రాసే కేంద్రంలోనే ఉపాధ్యాయ దంపతులు ఇన్విజిలేషన్ చేశారు. దీనిపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇది ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో.. ఉపాధ్యాయ దంపతులను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం.

మరదలి చేయి పట్టుకున్న బావపై కేసు..!
హైదరాబాద్: మహిళను వేధిస్తున్న ఆమె బావపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ హరీష్ తెలిపిన మేరకు.. బోరబండ ప్రాంతానికి చెందిన మహిళ (31) జీహెచ్ఎంసీలో ఉద్యోగం చేస్తోంది. 2020లో ఆమెకు వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భర్త, అత్తా మామలు, బావ సంజీవ్‌కుమార్ (39)కుటుంబంతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు. కొంతకాలంగా సదరు మహిళను బావ సంజీవ్‌కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 22వ తేదీన బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా వచ్చి చేయి పట్టుకున్నాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల సహకారంతో సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు సంజీవ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఖాకీచకుడు.. కాటేయజూస్తున్నాడు
ఒంగోలు టౌన్: భర్త మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతూ తనను పట్టించుకోవడం లేదని న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం ఓ మహిళ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. ఒంగోలు నగరం కమ్మపాలేనికి చెందిన జి.హర్ష వర్థిని జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన నవీన్‌తో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నవీన్ భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే అక్కడి కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట హర్షవర్థిని తన పిల్లలతో సహా బైఠాయించింది. టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుతోపాటు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా మొండికేయడంతో కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్‌ను కలిసి సమస్య తెలియజేయాలని సీఐ సూచించగా.. అక్కడకు వెళ్లినా పోలీసుల దగ్గరకే పంపిస్తారని, తనకు న్యాయం జరగదని పేర్కొనడం గమనార్హం. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ చాలా సేపు బతిమాలడంతో ఎట్టకేలకు ఆమె ఆందోళన విరమించింది.