Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan extends Ramzan greetings1
ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అల్లా చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారురంజాన్‌ పండుగ సందర్బంగా వైఎస్‌ జగన్‌..‘ముస్లింలకు రంజాన్‌ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌’ అని అన్నారు.భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో క‌ఠిన‌మైన ఉప‌వాస దీక్ష‌లు ముగించుకుని ప్రేమ‌, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్ర‌తీక అయిన రంజాన్ పండుగ‌ను జ‌రుపుకుంటున్న ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అల్లా చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2025

Rasi Phalalu: Daily Horoscope On 31-03-2025 In Telugu2
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. నిరుద్యోగులకు శుభవార్తలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.విదియ ప.12.20 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: అశ్విని సా.5.04 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ప.10.21 నుండి 11.51 వరకు, తదుపరి రా.2.00 నుండి 3.29 వరకు,దుర్ముహూర్తం: ప.12.28 నుండి 1.17 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ఉ.10.20 నుండి 11.52 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.00, సూర్యాస్తమయం: 6.09. మేషం.... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు.వృషభం.... బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.మిథునం.... సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కర్కాటకం.... పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.సింహం..... అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య.... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.తుల.... పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు.. దైవచింతన. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కీలక నిర్ణయాలు.వృశ్చికం... వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. చర్చలు సఫలం.ధనుస్సు... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మకరం..... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.కుంభం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. గతం గుర్తుకు వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.మీనం..... మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు. కళాకారులకు కొంత ఆదరణ..

CM Chandrababu makes inappropriate comments on poor people once again3
బీసీల ఆలోచన ఆ పూటకే!

సాక్షి, అమరావతి: ‘‘ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు... ఇప్పుడొచ్చారు.. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్‌ అయింది.. మా పని అయిపోయింది..! అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుబడుతున్నా.. మిమ్మల్ని కాదు.. అదే ఇక్కడున్న వాళ్లంతా ఉన్నారు.. వీళ్లకి ఓపిక ఉంది. బంగారు కుటుంబాలకు ఓపిక లేదు.. మార్గదర్శకులకు ఓపిక ఉంది. అంటే వాళ్లు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జీవితాల్లో వెలుగులు తెస్తా..!’’ ఈ వ్యాఖ్యలు చూశారా..! 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి ఆదివారం నిర్వహించిన పీ 4 సభలో మాట్లాడిన దారుణమైన మాటలివీ!! దళితులు, బడుగు, బలహీనవర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో మళ్లీ నోరు పారేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు చెప్పినా కూడా ఆలోచించరని నిందించారు. వచ్చాం.. మీటింగ్‌ అయిపోయింది.. మా పని అయిపోయిందని అనుకుంటూ ఉంటారని.. వాళ్ల ఆలోచనా విధానమే తప్పని వ్యాఖ్యానించారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని ఆయన బయటపెట్టారు. గతంలోనూ చంద్రబాబు పలు సందర్భాల్లో ఎస్సీ, బీసీ వర్గాలను నేరుగా దూషించి వారి పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. దీనిపై ఎస్సీ, బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. చంద్రబాబుకు దళితులు, బీసీలంటే ఎప్పుడూ చులకన భావమేనని, తమను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేçస్తున్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అని గతంలో వారి పుట్టుకనే హేళన చేసిన హీనమైన భావజాలం చంద్రబాబుదని మండిపడుతున్నారు. నాడు తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణు­లను.. ‘మీ తోకలు కత్తిరిస్తా..! తమాషాలు చేస్తున్నారా? మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించిన నిర్వాకం ఆయనదే. నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు... నాకెందుకు ఓటు వేయరు... అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్‌మెయిల్‌ తరహాలో పేదలను చంద్రబాబు బెదిరించారు. అందుకు అనుగుణంగానే టీడీపీ నేతలు దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్య­లు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే. ‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది. వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆది­నారాయణ­రెడ్డి దారుణంగా మాట్లాడారు. తాజాగా చంద్రబాబు వారి పట్ల తనకున్న చులకన భావాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అసలు ఆలోచనలే ఉండవని, డబ్బులు ఇస్తే మీటింగ్‌కు వస్తారనే రీతిలో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ తన ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు.చరిత్రలో ఎవరూ చేయలేదు..పేదరికం లేని సమాజం కోసం పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇది వినూత్న కార్యక్రమమని, కొత్త ప్రయోగమని, ఇంతవరకూ చరిత్రలో ఎవరూ అమలు చేయలేదని తెలిపారు. వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించిన సభలో జీరో పావర్టీ పీ–4 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. పథకం లోగో, పోర్టల్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. శాయోజీరావు సహాయం వల్లే అంబేడ్కర్‌ ఎదిగారని, శివసుబ్రహ్మణ్యం అయ్యర్‌ వల్ల అబ్దుల్‌ కలాం ముందుకెళ్లారన్నారు. కలాంను రాష్ట్రపతిని చేయడంలో తన పాత్ర కూడా ఉందన్నారు. ఎన్టీఆర్‌ లేకపోతే తాను కూడా అందరిలా మామూలుగానే ఉండేవాడినన్నారు. హైదరాబాద్‌ దశ, దిశ మారడానికి తాను చేసిన ఆలోచనలే కారణమన్నారు. పీ–4 గేమ్‌ ఛేంజర్‌ అవుతుందన్నారు. ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20 శాతం ఉన్నాయని, మార్గదర్శులుగా ఉండేవారు బంగారు కుటుంబాలతో కలసి పని చేయాలన్నారు. తలసరి ఆదాయం 2028–29 నాటికి రూ.5.42 లక్షలు, 2047కి రూ.55 లక్షలు చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. టాప్‌ టెన్‌లో ఉన్న పది శాతం శ్రీమంతులు అట్టడుగున్న ఉన్న 20 శాతం మందిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పవన్‌ దొరకడం నా అదృష్టం..2047కి స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2.0 సాధించడమే తన లక్ష్యమని, పీ–4 అందుకు మార్గదర్శి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమాన్ని ఒక రూపం తీసుకొచ్చి మళ్లీ ఉగాది నాటికి ప్రగతిని ప్రజలకు వెల్లడిస్తామన్నారు. 2029కి రాష్ట్రం జీరో పావర్టీలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రపంచమే ఆచరించే పరిస్థితికి వస్తుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు రెండు మూడు తరాల కోసం ఆలోచిస్తు­న్నారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కాగా 20 లక్షల బంగారు కుటుంబాలను పైకి తెచ్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన విధాన పత్రంలో తెలిపింది. సంపన్న కుటుంబాలు పీ 4 ప్లాట్‌ఫామ్‌లోకి లాగిన్‌ అయి కనీసం ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని మార్గదర్శి కుటుంబంగా నిలవాలని కోరింది. ⇒ మంగళగిరికి చెందిన గొర్రెల పెంపకందారు కడియం నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయేల్‌ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా పీ 4 పథకం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. నరసింహ తన పిల్లల్ని చదివించాలని కోరగా గ్రీన్‌కో ఎనర్జీ అధినేత చలమలశెట్టి అనిల్‌­కుమార్‌ మార్గదర్శిగా ముందుకొచ్చారు. ఇమ్మా­న్యు­యేల్‌ తన కూతుర్ని ఎంబీబీఎస్‌ చదివించాలని కోరగా మెయిల్‌ సంస్థల అధినేత మేఘా కృష్ణారెడ్డి వారికి మార్గదర్శిగా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లాలోని తన సొంత మండలం గుడ్లవల్లేరు బాధ్యత మొత్తం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఇంత హీనంగా మాట్లాడతారా? పేదల విషయంలో మొదటి నుంచి చంద్రబాబుది ఫ్యూడలిస్టు భావజాలమే. ఎస్సీలు, బీసీల పట్ల ఆయన మాటలు, చేతలు ఎప్పుడూ లోకువగానే ఉంటాయి. బడుగు, బలహీనవర్గాల గురించి అంత హీనంగా మాట్లాడడం సరికాదు. వారికి ఆలోచనలు లేవని చెప్పడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడే కాదు.. అనేక సందర్భాల్లో ఎస్సీలు, బీసీల గురించి తక్కువగా మాట్లాడారు. ఆయనకిది తగదు. వెంటనే దళితులు, బడుగు వర్గాలకు క్షమాపణ చెప్పాలి. – చింతపల్లి గురుప్రసాద్, బహుజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడుబాబులో రెండో వ్యక్తి బయటకొచ్చాడు చంద్రబాబు చేతలకి, మాటలకి పొంతన ఉండదు. పేదలను ఎప్పుడూ అవమానిస్తారు. ఇప్పుడు మరోసారి అవమానించారు. ఎస్సీలు, దళితులంటేనే ఆయనకు పడదు. పేదల కోసమని నిర్వహించిన సభలో జనం వెళ్లిపోతున్నారని సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏమిటి? చంద్రబాబులో రెండో వ్యక్తి బయటపడ్డాడు. ఆయన్ను దళిత, బీసీలు నమ్మకూడదు. ఆయన తన మాటలను ఉపసంహరించుకోవాలి. – నత్తా యోనారాజు మాల మహానాడు నాయకుడుగుణపాఠం తప్పదు పేదలకు మేలు చేయకపోగా వారి గురించి తరచూ అవమానకరంగా మాట్లాడడం చంద్రబాబుకే చెల్లింది. పీ–4 మీటింగ్‌ అని పిలిచి ఒక్కరికి మేలు చేయకపోగా తిట్లు బహుమతిగా ఇస్తారా? బీసీ, ఎస్సీలను తిట్టడానికి బహిరంగ సభ పెడతారా? పేదల గురించి ఇంత అన్యాయంగా మాట్లాడిన రాజకీయ నాయకుడు దేశంలో మరొకరు లేరు. వారికి ఆలోచనలే లేవని అనడం అహంకారం. త్వరలోనే బీసీలు, ఎస్సీలు ఆయనకు గుణపాఠం చెబుతారు. – ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రిపేదలు తన బానిసలుగా ఉండాలనే ఆలోచన బాబుది పేదలు ఎప్పుడూ తమ బానిసలుగా ఉండాలనే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు. జీరో పావర్టీ పీ–4 సభలో దాన్ని బయటపెట్టారు. ఎస్సీ, బీసీల గురించి అంత నీచంగా మాట్లాడడం దారుణం. గతంలోనూ ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నీచంగా మాట్లాడారు. పేదలు ఎప్పుడూ తమ కాళ్ల దగ్గరే ఉండాలనే ఆలోచన చంద్రబాబుది. – కైలే అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేఅసలు మనిషి బయటపడ్డాడు.. చంద్రబాబులోని అసలు మనిషి పీ–4 మీటింగ్‌లో బయటపడ్డాడు. వారి కోసమని మీటింగ్‌ పెట్టి తిట్టడం ఏమిటి? సభకు వచ్చిన జనం వెళ్లిపోతుంటే ఇష్టం వచ్చినట్లు తిడతారా? పేదలు కూడా సంపన్నుల్లా అలోచించాలని చెప్పి వారిని తిట్టడం అన్యాయం. బీసీలు, ఎస్సీలను చంద్రబాబు ఎప్పుడూ గౌరవించలేదు. అనేకసార్లు అవమానించారు. ఇప్పుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. – జోగి రమేష్‌, మాజీ మంత్రి

Iran Counter To USA Donald Trump4
ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్‌

దుబాయ్‌: అణు కార్యక్రమంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఇరాన్‌ సుప్రీం నేత ఖొమైనీకి రాసిన లేఖపై ఈ మేరకు అధికారికంగా స్పందించింది. అమెరికాతో చర్చల నుంచి తప్పించుకోవడం లేదని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు. అలాగే, ట్రంప్‌ బాంబు దాడులు చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మసూద్‌..‘ఎన్నో వాగ్దానాలను అమెరికా కాలరాసింది. దీనిపైనే మాకు భేదాభిప్రాయాలున్నాయి. ముందుగా ఆ దేశం మాకు నమ్మకం కలిగించాలి’ అని పేర్కొన్నారు. దీనిద్వారా పరోక్ష చర్చలు మాత్రమే సాధ్యమని చెప్పారు. పెజెష్కియాన్‌ స్పందనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘అధ్యక్షుడు ట్రంప్‌ ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారు. ముందుగా ఆయన చర్చలకు దారి తెరిచారు. కాదన్న పక్షంలో ఇరాన్‌ అణు కార్యక్రమమే లక్ష్యంగా సైనిక చర్య చేపట్టే ప్రమాదం ఉంది’ అంటూ వ్యాఖ్యానించింది.మరోవైపు.. ఇరాన్‌ను అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో.. ఆ దేశంపై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్‌ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ స్పష్టం చేశారు.ఇక, ట్రంప్‌ మొదటి హయాంలో ఇరాన్‌తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి అనేక ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్‌ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. ‘ఇరాన్‌తో ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తా. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదు. చర్చలకు వస్తారని ఆశిస్తున్నా. అలా చేయడమే వారికి ప్రయోజనకరం’ అని తెలిపారు.

Team India To Play 3 ODIs, 5 T20s In Australia In October And November5
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్‌ విడుదల

ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు అక్టోబర్‌ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్‌ షెడ్యూల్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్‌లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్‌ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.భారత్‌తో సిరీస్‌లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్‌ 10న ఈ సిరీస్‌లు ప్రారంభం​ కానున్నాయి. ఈ సిరీస్‌లతో డార్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్‌ను హోస్ట్‌ చేసింది. డార్విన్‌లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్‌లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్‌కేలో జరుగుతాయి.సౌతాఫ్రికాతో సిరీస్‌ల తర్వాత ఆసీస్‌ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్‌ ఉంది. భారత్‌తో సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్‌ 21న తొలి యాషెస్‌ టెస్ట్‌ పెర్త్‌లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృ​ష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్‌లతో టీ20 సిరీస్‌లను ప్లాన్‌ చేసింది.ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్‌..ఆగస్ట్‌ 10- తొలి టీ20- డార్విన్‌ఆగస్ట్‌ 12- రెండో టీ20- డార్విన్‌ఆగస్ట్‌ 16- మూడో టీ20- కెయిన్స్‌ఆగస్ట్‌ 19- తొలి వన్డే (డే అండ్‌ నైట్‌)- కెయిన్స్‌ఆగస్ట్‌ 22- రెండో వన్డే (డే అండ్‌ నైట్‌)- మెక్‌కేఆగస్ట్‌ 24- మూడో వన్డే (డే అండ్‌ నైట్‌)- మెక్‌కేఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన షెడ్యూల్‌..అక్టోబర్‌ 19- తొలి వన్డే (డే అండ్‌ నైట్‌)- పెర్త్‌అక్టోబర్‌ 23- రెండో వన్డే (డే అండ్‌ నైట్‌)- అడిలైడ్‌అక్టోబర్‌ 25- మూడో వన్డే (డే అండ్‌ నైట్‌)- సిడ్నీఅక్టోబర్‌ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్‌ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్‌ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్‌ 6- నాలుగో టీ20- గోల్డ్‌ కోస్ట్‌నవంబర్‌ 8- ఐదో టీ20- బ్రిస్బేన్‌

Health problems To online food order6
మామా.. ఆర్డర్‌ చేస్తున్నా..!

ఏడాది కిందట పెళ్లైన ఓ జంట ఉద్యోగం చేసుకుంటోంది. భర్త చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తే... భార్య ప్రైవేటుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ వారి వృత్తిలో బిజీగా గడుపుతున్నారు. వంట చేయడం రాదు. దీంతో కొన్ని నెలలు వంట మనిషిని పెట్టుకున్నారు. రుచి లేదని ఆమెను చాలించారు. ఈ కారణంగా ఎక్కువగా ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆస్పత్రి ఆవరణం, పలమనేరు రోడ్డు, మురకంబట్టు రోడ్డు, లేకుంటే తమిళనాడులోని వేలూరుకు సైతం వెళుతున్నారు.కొత్త జంటలు వంటపై తంటాలు పడుతోంది. పెళ్లి కూతుర్లు వంటింట్లో అడుగు పెట్టాలంటే తెగ ఫీలైపోతున్నారు. వంట చేయడం రాక కొంత మంది వంట గదికి దూరంగా ఉండిపోతున్నారు. మరికొంత మంది పని ఒత్తిళ్లతో వంట దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. ఇంకొంత మంది యూట్యూబ్‌ పాఠాలతో వంట వండేందుకు అపసోపాలు పడుతున్నారు. వారు వండిందే వారికే నచ్చక సింపుల్‌గా ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. లేకుంటే పాస్ట్‌ ఫుడ్‌ను వెతుక్కుంటున్నారు. వీటి సంఖ్య జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇలా ఆరగించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాణిపాకం(చిత్తూరు): ఒకప్పుడు పెళ్లి చూపులంటే.. వరుడు వైపు వరకట్నంతో పాటు అమ్మాయికి వంటా వచ్చా అని అడిగేవాళ్లు. ఏ రకమైనవి ఎక్కువగా వండుతావ్‌ అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవారు. అప్పట్లో చదువు, ఉద్యోగం చూసేవారు కాదు. అమ్మాయి చక్కగా వండి పెడుతూ..ఇంట్లో ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి ఎంత వరకు చదువుకుంది..ఏం చేస్తోంది అని మాత్రమే చూస్తున్నారు. వధువు వైపు నుంచి...వరుడు చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ పరిస్థితి చూసి..పెళ్లి ఫిక్స్‌ చేసేస్తున్నారు. అమ్మాయికి వంట వచ్చా అని అడిగే వాళ్లు పూర్తిగా కరువయ్యారు. చదువులపైనే దృష్టి పెడుతున్నారు.. ఒకప్పుడు ఆడ పిల్లలు 10 ఏళ్ల వయస్సు వచ్చిందంటేనే తల్లులు వంటింటికి తీసుకెళ్లి రకరకాల వంటలు చేయడం నేర్పేవాళ్లు. అత్తారింటికి వెళితే మీ అమ్మ వంట చేయడం నేర్పలేదా అని మమ్మలను చులకనగా మాట్లాడతారని తల్లులు పట్టుబట్టి వాళ్ల పిల్లలకు వంట నేర్పేవాళ్లు. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పిల్లల చదువుపై దృష్టి పెడు­తు­న్నారు. బాగా చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, ప్రభు­త్వం ఉద్యోగం, డాక్టర్‌ అవ్వాలని, ఇతర ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో చాలా మంది ఉన్నత చదువుల కోసం బయట రాష్ట్రాలకు, విదేశాల­కు పంపుతున్నారు. ఒకప్పుడు మగ పిల్లలను చదివిస్తే ప్రయోజకుడై..పోషిస్తారని అనుకునేవాళ్లు. ఇప్పు­డు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు. చదువు తప్ప మరేది ముట్టుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో ఆడ పిల్లలు వంటింటికి దూరమవుతున్నారు. తల్లులు సైతం పెళ్లైతే వంట నేర్చుకుంటుంది లే అని తేలికగా వదిలేస్తున్నారు. వంట చేయడం రాదు పెళ్లైన కొత్త జంటలు లగ్జరీ లైఫ్‌ వెతుక్కుంటున్నారు. పెళ్లికి ముందు నుంచే ఏ పని ముట్టుకోకుండా జీవించేయాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు పుట్టింట్లో ఉన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. అత్తారింటికి వెళ్లినా.. కాఫీ అంటే బెడ్‌ రూమ్‌కే వచ్చేయాలనే అనుకుంటున్నారు. వంట వచ్చిన మొగుడైతే ఇంకా బెటర్‌ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇలా పుట్టింట్లో వంట నేర్చుకోక కొత్త పెళ్లి కూతుర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కాపురం పెట్టిన వారైతే వంట కోసం తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్‌ చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతులు కాల్చుకుంటూ వద్దురా..ఈ వంట తంటా అంటూ చాలించుకుంటున్నారు. ఆ వండిన వంట రుచికరంగా లేకపోవడంతో అబ్బాయిలు ఆమడదూరం వెళ్లిపోతున్నారు. ఇక ఉద్యోగ రీత్యా దంపతులు ఇద్దరూ వంటింటికి దూరంగా ఉంటున్నారు. 8 గంటల పని, తర్వాత ఇంటి పని, ఇతర పనులు వెరసి అలసిపోతున్నారు.బయట ఫుడ్‌ డేంజర్‌..? అధికంగా బయట ఫుడ్‌ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్, క్యాన్సర్, రక్తనాళాల్లో కొలె్రస్టాల్‌ తదితర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పెళ్లైన వారు లావు కావడానికి ఇది కూడా ఒక కారణమని వెల్లడిస్తున్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌కు జై కొడుతున్నారు దంపతులు ఇద్దరూ సంపాదన మీద పోటీ పడుతున్నారు. బిజీ లైఫ్‌లో పడిపోతున్నారు. నువ్వా నేనా అంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ తరుణంలో భార్య వంటింటికి దూరమై బయ­ట ఫుడ్‌ కోసం అన్వేస్తున్నారు. అలాగే చాలా మంది వంట రాక అల్లాడిపోతున్నారు. యూ­ట్యూ­బ్‌ చూసి వండిన ఆ టేస్ట్‌ రాకపోవడంతో ముద్ద మింగుడు పడడం లేదు. దీంతో ఫాస్ట్‌ ఫుడ్‌పై పడిపోతున్నా­రు. మూడు పూటల ఫాస్ట్‌ఫుడ్‌ను ఆరగిస్తున్నా­రు. లేకుంటే దర్జాగా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే వాళ్ల పరిస్థితి అయితే అర్ధరాత్రి కూడా ఆర్డర్లు పెట్టుకుని ఆవురావురమని తినేస్తున్నారు. ఫుడ్‌ దొరక్కపోయినా ఫిజ్జాలు, బర్గర్‌లు తెప్పించుకుని కడుపు నింపుకుంటున్నారు. దీని ఫలితంగా జిల్లా­లో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టుకొ­చ్చాయి. బిర్యానీ సెంటర్లు సందుకొక్కటి ఉన్నా­యి. వీరి రాకతో ఆ సెంటర్లు, హోటళ్లు నిండిపోతున్నాయి. కొత్త జంటలతో కళకళలాడుతున్నాయి. అనారోగ్యం పాలుకావద్దు ఫాస్ట్‌ ఫుడ్‌ ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారింది. పేద, మధ్య ధనిక తేడా లేకుండా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు చాలా మందికి వంట రాదు అని బయట ఫుడ్‌ తింటున్నారు. ఇది మంచిది కాదు. వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తాజాగా వండి తినడం ఉత్తమం. బయట తినడం వల్ల అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతాయి. – వెంకట ప్రసాద్, వైద్య నిపుణుడు, చిత్తూరు

Nandamuri Balakrishna Aditya 369 Re-Release Trailer Out Now7
'ఆదిత్య 369' రీరిలీజ్‌.. 4కే డిజిటలైజేషన్‌ వెర్షన్‌లో ట్రైలర్‌

టాలీవుడ్‌ హీరో బాలకృష్ణ సినీ కెరీర్‌లో 'ఆదిత్య 369' సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1991లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని దక్కించుకుంది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ క్లాసిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా 4కే డిజిటలైజేషన్‌ వెర్షన్‌లో ఏప్రిల్‌ 4న రీరిలీజ్‌ కానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ ఈ మూవీలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో మెప్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీరిలీజ్‌తో మరోసారి టైమ్‌మిషన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి. ఆదిత్య 369 సినిమా సీక్వెల్‌కి కథ సిద్ధమైందని ఇప్పటికే బాలకృష్ణ ప్రకటించారు.

Myanmar: Smell of death fills the air near epicentre of Myanmar earthquake8
Myanmar earthquake: కుళ్లుతున్న మృతదేహాలు 

మాండలే: భూకంపం తాలూకు విధ్వంసం నుంచి మయన్మార్‌ ఇంకా తేరుకోలేదు. మౌలిక వనరుల లేమికి భూ ప్రకంపనలు తోడై సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుబడ్డవారి సంఖ్య అపారంగా ఉన్నట్టు సైనిక ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నానాయి. ఇప్పటికే రెండు రోజులు దాటిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. దాంతో రాజధాని నేపిడా మొదలుకుని ఏ నగరంలో చూసినా మృత్యుఘోషే విన్పిస్తోంది. ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న మాండలేలో శిథిలాల కింద కుళ్లిపోతున్న మృతదేహాలతో వీధులన్నీ కంపు కొడుతున్న పరిస్థితి! అంతర్జాతీయంగా అందుతున్న సాయం ఏ మూలకూ చాలడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. చాలా నగరాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. భూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని నేపిడా సమీపంలో శనివారం రెండుసార్లు 4.7, 4.3 తీవ్రతతో భూమి కంపించడం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కూడా 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాంతో జనం భయాందోళనలతో ఇళ్లను వీడి వీధుల్లోకి పరుగులు తీశారు. స్వల్ప స్థాయి ప్రకంపనలు రోజంతా కొనసాగాయి. రోడ్డు, రైలు మార్గాలు, బ్రిడ్జిల వంటివన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థలన్నీ పడకేశాయి. దాంతో సహాయక బృందాలను బాధిత ప్రాంతాలకు తరలించడమే సవాలుగా మారింది. సమాచార వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. వీటికి తోడు 41 డిగ్రీల పై చిలుకు ఎండ ఠారెత్తిస్తోంది. చాలాచోట్ల శిథిలాలను పారలు, చేతులతోనే తొలగించేందుకు స్థానికులు ప్రయతి్నస్తున్నారు! ఇన్ని ప్రతికూలతల మధ్యే ఇప్పటిదాకా 1,700కు పైగా మృతదేహాలను వెలికితీశారు. అయితే సహాయక బృందాలు ఇంకా దేశంలో చాలా ప్రాంతాలకు చేరుకోనే లేదు. తిరుగుబాటుదారుల అ«దీనంలో ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యల ఊసే లేదు. దాంతో అక్కడి మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారమూ లేదు. ఈ నేపథ్యంలో మరణాలు 10 వేలు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు. భారత్‌ ఆపద్బాంధవ పాత్ర కల్లోల మయన్మార్‌ను ఆదుకోవడంతో భారత్‌ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తోంది. ఆపరేషన్‌ బ్రహ్మ పేరిట ఇప్పటికే ఐదు సైనిక విమానాల్లో 60 టన్నుల మేరకు సహాయక సామగ్రిని చేరవేసింది. మరో 40 టన్నుల సహాయక సామగ్రి సముద్ర మార్గాన చేరుకుంటోంది. 80 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ప్రత్యేక సైనిక పారా బ్రిగేడ్‌ బృందం కూడా తోడైంది. 120 మంది వైద్యులు, వైద్య సిబ్బందితో వాయు మార్గాన తరలించిన తాత్కాలిక ఆస్పత్రి రెండుగా విడిపోయి మాండలే, నేపిడాల్లో రోగులను పెద్ద ఎత్తున ఆదుకుంటోంది.మాండలేలో ఆకలి కేకలు 15 లక్షల జనాభా ఉన్న మాండలేలో విధ్వంసం మాటలకందని రీతిలో ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ నిర్మణాలన్నీ కుప్పకూలడమో, భారీగా పగుళ్లివ్వడమో జరిగింది. దాంతో నగరవాసులు వీధుల్లోనే గడుపుతున్నారు. శిథిలాల కింద చిక్కిన తమవారిని ఎలాగోలా కాపాడుకోవాలని తపిస్తున్నారు. పారలు, పలుగులతో వాటిని తవ్వి తీసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే తిండికి, తాగునీటికి కూడా వాళ్లు అల్లాడిపోతున్న పరిస్థితి! శిథిలాల తొలగింపుకే నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని కేథలిక్‌ రిలీఫ్‌ సరీ్వసెస్‌ మేనేజర్‌ కారా బ్రాగ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు చాలినన్ని సదుపాయాల్లేవు. ఔషధాలు తదితరాలకు తీవ్ర కొరత ఉంది. తిండికి, తాగునీటికి కొరత తీవ్రతరమవుతోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. నేపిడా, మాండలే విమానాశ్రయాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ నగరాలకు వాయుమార్గాన సహాయక సామగ్రి, సిబ్బంది తరలింపు అసాధ్యంగా మారింది. నేపిడాలో ప్రభుత్వ కార్యాలయాల పునరుద్ధరణకే సైనిక సర్కారు ప్రాధాన్యమిస్తోంది. దాంతో సాధారణ ప్రజల దైన్యాన్ని పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు.థాయ్‌లాండ్‌లో 18కి మృతులు శుక్రవారం నాటి భూకంపంతో తీవ్రంగా దెబ్బ తిన్న థాయ్‌లాండ్‌లో మృతుల సంఖ్య 18కి పెరిగింది. బ్యాంకాక్‌లో కుప్పకూలిన 33 అంతçస్తులు నిర్మాణంలోని భవనం శిథిలాల్లో నుంచి ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికితీశారు.

New dramas titled CM Chandrababu Naidu P4: Andhra pradesh9
‘పీ4’.. అడ్వాన్స్‌డ్‌ ఏప్రిల్‌ ఫూల్‌!

సాక్షి, అమరావతి: నాటి ఉగాది హామీ.. వలంటీర్లను కొనసాగించి వేతనం రూ.పది వేలు చేస్తాం! నేటి ఉగాది హామీ.. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా రూపుమాపుతా..!! సాధారణంగా అందరూ ఏప్రిల్‌ 1న ఫూల్స్‌ డే చేసుకుంటుంటారు..! సీఎం చంద్రబాబు మాత్రం అడ్వాన్స్‌గా తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ఫూల్స్‌ చేశారు! సరిగ్గా ఏడాది క్రితం 2.66 లక్షల మంది వలంటీర్లను వంచించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రజలందరినీ మభ్యపుచ్చేందుకు సిద్ధమయ్యారు! రాజకీయాల్లో తన డైవర్షన్‌ పాలిటిక్స్‌ను సంక్షేమ కార్యక్రమాలకూ వర్తింపజేస్తున్నారు.నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే తాను హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను చంద్రబాబు అమలు చేయాలి. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగించాలి. కానీ అవేమీ చేయకుండా బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారు. పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ గత ఐదేళ్లూ వైఎస్‌ జగన్‌ అమలు చేసిన పథకాలు, విప్లవాత్మక విధానాలను కక్షపూరితంగా నిలిపివేశారు. మరోపక్క విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి మౌలిక రంగాలను నిర్విర్యం చేశారు. పేదలకు కూడు, గూడు, దుస్తులు సమకూర్చడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత.దీన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు హామీల అమలు బాధ్యత నుంచి తప్పుకుని పీ 4 పథకం పేరుతో మరో కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ఎన్నడూ మాటపై నిలబడిన దాఖలాలు లేవని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం ఉన్న ఆయన్ను ఎలా నమ్మాలనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీనికి భిన్నంగా వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండగా ప్రతి మాట నెరవేర్చారని.. హామీల అమలుకు మొదటి రోజు నుంచే ఆరాట పడ్డారని.. డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. బాధ్యతల నుంచి పరార్‌... ఎన్నికల ముందు జనసేన–బీజేపీతో కూటమి కట్టిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేస్తామని నమ్మబలికారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, మూడు గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు అంటూ మహిళలను, అన్నదాతా సుఖీభవ పేరిట రైతులను, నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మోసపూరిత వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పీ–4 పేరుతో మరో నాటకానికి తెరతీశారు. అన్నీ తెలిసే మోసపూరిత వాగ్దానాలు గతంలో మూడుసార్లు సీఎంగా, ఉమ్మడి రాష్ట్రంలో ఆరి్థక మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు నోటికొచ్చిన వాగ్దా­నాలు ఇచ్చేశారు. తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక తానిచ్చిన హామీలను చూస్తుంటే భయం వేస్తోందని, సంపద సృష్టికి మార్గాలుంటే తన చెవిలో చెప్పాలంటూ నిజ స్వరూపాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం.. గెలిచాక తిలోదకాలు ఇవ్వడం చంద్రబాబుకు మొదటినుంచి వెన్నతో పెట్టిన విద్య. గతంలో రైతు రుణ మాఫీ వ్యవహారమే దీనికి మచ్చు తునక. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తెరపైకి కొత్త కార్యక్రమాలు తేవడం ఆయనకు ఆలవాటే. ఇచ్చిన ప్రతి మాటా నెరవేర్చిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వం పది నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ సర్కారుకు మరో నాలుగేళ్ల సమయమే మిగిలి ఉంది. అలాంటప్పుడు పీ–4తో 2029 నాటికి పేదరిక నిర్మూలన చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు చంద్రబాబు తాను ఇస్తానని చెప్పినవి ఇవ్వకపోగా.. గతంలో వైఎస్‌ జగన్‌ ఇచ్చినవీ ఎగ్గొడుతున్నారని మండిపడుతున్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండగా ప్రతి మాట నెరవేర్చారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశారని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ మాదిరిగా భావించి హామీల అమలుకు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నడుం బిగించారని పేర్కొంటున్నారు. రాష్ట్రానికి సొంత ఉపగ్రహం.. అమరావతిలో ఒలింపిక్స్‌.. రాజధానికి హైపర్‌ లూప్‌.. ఎండలు 2 డిగ్రీలు తగ్గింపు‘‘సాధ్యాసాధ్యాలతో పనిలేదు..! నమ్మశక్యం కాని విషయాలను నమ్మించేలా చెప్పడం..! వినేవాడుంటే చాలు.. చెప్పేవాడు చంద్రబాబు...!’’ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న పోస్ట్‌ ఇదీ!! పీ–4 అంటూ ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చిన కార్యక్రమం నేపథ్యంలో ఇలా ఎద్దేవా చేస్తున్నారు. ఏపీకి సొంతంగా ఉపగ్రహం..! అవసరమైతే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు ఉపగ్రహాలు..! అని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ప్రకటించడాన్ని గుర్తు చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరాన్ని నిమిషాల వ్యవధిలో ప్రయాణించే హైపర్‌ లూప్‌ను అమరావతికి తెస్తానంటూ గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దాదాపు 10,500 మందికిపైగా క్రీడాకారులు, రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యే ఒలింపిక్స్‌ను అమరావతిలో నిర్వహిస్తామని ప్రకటనలు చేయడం.. అమరావతిలో ఎండలు రెండు డిగ్రీలు తగ్గించాలి.. నోబెల్‌ బహుమతి సాధించేందుకు సులభమైన మార్గం చెప్పాలనడం.. ఎవరైనా దాన్ని సాధిస్తే రూ.వంద కోట్లు ఇస్తానని జపాన్‌కు చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత సమక్షంలోనే చంద్రబాబు వ్యాఖ్యలు చేయటంపై చర్చ జరుగుతోంది.హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దింది తానేనని, సత్య నాదెళ్ల తనవల్లే మైక్రోసాఫ్ట్‌ సీఈవో అయ్యారని చంద్రబాబు తరచూ గొప్పలకు పోవడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ట్రాఫిక్‌ నుంచి శాంతి భద్రతల పరిరక్షణ వరకు నిరంతరం ప్రజలతో గడిపే పోలీస్‌లు ఇంటి నుంచి విధులు నిర్వహించేలా (వర్క్‌ ఫ్రం హోం) చర్యలు తీసుకుంటానని చెప్పటాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.నిబద్ధతతో నవరత్నాలు.. సంక్షోభంలోనూ సజావుగా పథకాలు.. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నవరత్నాలను అమలు చేసింది. తొలి కేబినెట్‌ (10–6–2019) సమావేశంలోనే వైఎస్‌ జగన్‌ నవరత్నాలకు ఆమోదం తెలిపి నిబద్ధత చాటుకున్నారు. ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించడమే కాకుండా కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అని తేడా చూపకుండా ప్రతి ఇంటికీ వలంటీర్లను పంపి సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైఎస్‌ జగన్‌దే. క్యాలెండర్‌లో ప్రకటించిన తేదీల ప్రకారం నేరుగా నగదును బదిలీ చేశారు. ⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉన్నాయని, నవరత్నాలు ఎలా అమలు చేస్తారంటూ నాడు ఎల్లో మీడియా కథనాలను అచ్చు వేసింది. అయితే కోవిడ్‌ సంక్షోభంలో కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ఆపలేదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా కాలక్షేప సమీక్షలు నిర్వహిస్తున్నారు. పైగా చంద్ర­బాబు బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానాలో రూ.6 వేల కోట్లు ఉన్నాయి. అయినప్పటికీ హామీలను నెరవేర్చకుండా పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌ భాగస్వా­మ్యం కింద పీ–4 పేరుతో పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేస్తానంటూ సంక్షేమ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించుకుంటున్నారు.

Deductions in New Tax Regime under Union Budget 202510
రాబడిపై పన్ను సున్నా...

కొత్త బడ్జెట్‌లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్‌ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్‌ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్‌ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు. పలు సంస్థల నుంచి బాండ్లు.. గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో క్యాష్‌ విభాగంలో ట్రేడ్‌ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్‌ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌హెచ్‌ఏఐ, ఐఆర్‌ఎఫ్‌సీ, పీఎఫ్‌సీ తదితర) సెక్యూర్డ్‌ (రక్షణతో కూడిన) ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్‌ను క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్చాయి. గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్‌ ఫ్రీ బాండ్ల సిరీస్‌లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్‌ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ. తక్కువ ఆదాయం ఉన్న వారికి..? ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్‌ కార్పొరేట్‌ బాండ్లలో రిస్క్‌ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్‌ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్‌ ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్‌ బాండ్లు, బ్యాంక్‌ ఎఫ్‌డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్‌ బాండ్లు, బ్యాంక్‌ ఎఫ్‌డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఎంపిక ఎలా..? ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్‌ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్‌ వ్యాల్యూమ్‌ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్‌ ఈల్డ్స్‌ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్‌పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్‌ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్‌ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్‌ తగ్గిపోతుంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్‌ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్‌ఈసీ బాండ్‌ ‘871ఆర్‌ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్‌ వ్యాల్యూమ్‌ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్‌లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది. ఇది అనుకూల తరుణం.. ఆర్‌బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్‌ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్‌ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్‌ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్‌ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్‌ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులు ఆకర్షణీయం సెకండరీ మార్కెట్లో ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్‌ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్‌ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్‌ ఒక బాండ్‌ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్‌ ఫ్రీ బాండ్ల సిరీసీస్‌లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది. ఇవి గమనించాలి.. → 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. → 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. → 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే. → కార్పొరేట్‌ బాండ్లతో పోల్చితే ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్‌ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్‌ దాదాపుగా ఉండదు. → ఇన్వెస్టర్‌ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు. → స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. → వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. → కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్‌ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్‌ విభాగం కింద ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. → అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement