25 నుంచి ‘ఓపెన్’ విద్యార్థులకు ప్రాక్టికల్స్
అనంతపురం రూరల్ : అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎస్సీ డిగ్రీ మూడవ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ఆర్ట్స్ కళాశాలలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 2 వరకు జూవాలజీ, మార్చి3 నుంచి 8 వరకు బోటనీ, మార్చి 9 నుంచి 14 వరకు కెమెస్ట్రీ, మార్చి15 నుంచి 20వరకు ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయన్నారు.