26న కంటి వైద్యశిబిరం
గద్వాల న్యూటౌన్: పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆప్తాలమిక్ శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామిరెడ్డి కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న శిబిరాన్ని కంటి సమస్యలతో బాధపడే వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటిలో శుక్లాలు ఉన్న వారిని గుర్తించి, ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని, శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ జిరాక్స్ పత్రాలను తీసుకురావాలని ఆయన సూచించారు.