on 26th
-
ఓపెన్ డిగ్రీ ప్రవేశానికి 26న అర్హత పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) ద్వారా డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఈ నెల 26న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని వివరించారు. రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, అనంతపురం కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యయన కేంద్రాల విద్యార్థులకు ఆర్ట్స్ కళాశాలలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. -
26న ఇస్కాన్ రథయాత్ర
అనంతపురం కల్చరల్ : ఇస్కాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 26, 27 తేదీలలో రెండు రోజుల పాటు ధర్మవరం పట్టణంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ జిల్లా ప్రతినిధి దామోదర గౌరంగదాసు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఇస్కాన్ మందిరంలో రథయాత్ర పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ తొలిరోజు నగరవీధుల్లో శోభాయమానంగా అలంకరించిన జగన్నాథ రథయాత్ర, రెండవరోజు నాదోత్సవం ఉంటాయన్నారు. ఇస్కాన్ దక్షిణ భారత దేశ అధ్యక్షులు సత్యగోపీనాథ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి రథయాత్ర ప్రాధాన్యతను వివరిస్తారన్నారు. వందలాది మంది కళాకారుల సమక్షంలో సాగే రథయాత్రలో జిల్లా వాసులు విరివిగా పాల్గొనాలని కోరారు. -
26న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
గుంతకల్లు టౌన్ : హజరత్ సయ్యద్ మస్తాన్వలి ఉరుసు సందర్భంగా ఈ నెల 26 న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కర్ణ, జయరామ్, అలీ ఓ ప్రకటనలో తెలిపారు. పాతగుంతకల్లులోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హైస్కూల్ క్రీడామైదానంలో పోటీలు ఉంటాయి. పాల్గొనదలచిన వారు 81424 33521, 9666255079 ఫోన్ నెంబర్లలో సంప్రదించి 25 లోపు తమ జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని, విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.